జాతీయస్థాయి కబడ్డీ పోటీలు
నరసాపురం: నరసాపురం రుస్తుంబాదలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏటా మాదిరిగా జాతీయస్థాయి పురుషులు, మహిళల కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారభమయ్యాయి. మాజీ మంత్రి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురం ఆర్డీఓ దాసి రాజు, డీఎస్పీ శ్రీవేదతో కలిసి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మాట్లాడుతూ 32 ఏళ్లుగా జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పోటీల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరామ్ మాట్లాడుతూ ఏటా పోటీల నిర్వహణకు సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్డీఓ రాజు, డీఎస్పీ శ్రీవేద మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీల నిర్వహణ అభినందనీయమన్నారు. ఐదు రోజులపాటు జరిగే టోర్నమెంట్‌లో పలు రాష్ట్రాల నుంచి 20 జట్లు పాల్గొంటున్నాయి. ఫ్లడ్‌లైట్ల వెలుగులో రాత్రిళ్లు కూడా మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment