కొమ్ముగూడెంలో ఎకై ్సజ్ తనిఖీలు
తాడేపల్లిగూడెం రూరల్: కొమ్ముగూడెంలో ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో బెల్ట్‌షాపు నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 8 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు దొరబాబు, మురళీమోహన్, సిబ్బంది పాల్గొన్నారు.
130 కేసుల నమోదు
భీమవరం: సంక్రాంతి సందర్భంగా మూడు రోజులుగా సాగుతున్న కోడిపందేలు, జూదాలు బుధ వారం రాత్రి ముగిశాయి. కోడి పందేలపై ఉక్కుపాదం మోపుతామని, ఎక్కడా పందాలు జరగనిచ్చేది లేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పోలీసు అధికారులు సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా విచ్చలవిడిగా కోడి పందేలు, జూదాలు, మద్యం విక్రయాలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించినా చేష్టలుడిగి చూస్తుండిపోయారు. అయితే బుధవారం సంక్రాంతి సంబరాలు పూర్తికావడంతో సాయంత్రం నుంచి కోడి పందేల బరుల వద్దకు పోలీసులు పరుగులు తీసి పందేలను నిలుపుదల చేయించారు. భీమవరం పోలీసు సబ్‌డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు 130 కేసులు నమోదుచేసినట్లు డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment