పందేలు మామూళ్లుగా లేవు
యువకుడు మృతి
సంక్రాంతి పండుగ రోజు ఆంథోనీ నగర్ సమీపంలో ఆగి ఉన్న కోళ్ల వ్యాన్‌ను ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. 8లో u
గురువారం శ్రీ 16 శ్రీ జనవరి శ్రీ 2025
సాక్షి, భీమవరం: కోడి పందేలు నిర్వహించరాదన్న కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పండుగ రోజుల్లో జిల్లావ్యాప్తంగా పందేలు, పేకాట, గుండాటలు జోరుగా సాగాయి. సంప్రదాయం మాటున సాగిన ఈ జూద కార్యకలాపాలు పలువురు ఎమ్మెల్యేలు, పోలీసులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పందెం బరిని బట్టి స్టేషన్ మామూళ్లుగా రూ.30 వేల నుంచి రూ.5 లక్షల వరకు నిర్వాహకులు ముట్టజెబుతున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం మొత్తం తెరవెనుక గుట్టుచప్పుడుగా సాగుతోంది.
కూటమి నేతల కనుసన్నల్లో..
కూటమి నేతలు ఎక్కడికక్కడ బరులు ఏర్పాటుచేసి పందేలను నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా దాదా పు 135 బరులు ఏర్పాటుచేయగా వీటిలో పెద్దవి 40 వరకు ఉండగా, మిగిలినవి చిన్నబరులు. గతంతో పోలిస్తే ఈ ఏడాది తాడేపల్లిగూడెం, ఆకివీడు, ఉండి, పాలకొల్లు, పెనుమంట్ర, అత్తిలి మండలా ల్లో బరుల సంఖ్య పెరిగింది. కోడి పందేలు జరుగకుండా అడ్డుకోవాలని కోర్టు ఆదేశాలున్నా ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో పోలీసులు వాటి జోలికి పోకుండా సైలెంట్ అయిపోయారు.
యథేచ్ఛగా జూద క్రీడలు
ఏటా పోలీసుల నుంచి లైన్‌క్లియర్ అయినట్టు సమాచారం వచ్చాక భోగి రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం నుంచి పందేలను మొదలుపెట్టేవారు. కాగా కూటమి పాలనలో ఈ ఏడాది పండగకు రెండు నెలల ముందు నుంచే జిల్లాలో పందేల జాతర మొదలైంది. కొందరు ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో వారంలో రెండు మూడుచోట్ల రాత్రివేళల్లో కోడిపందేలు యథేచ్ఛగా సాగిపోయాయి. భోగి రోజున ఉదయం నుంచే బరుల వద్ద కోడి పందేలు, పేకాట, గుండాటలను మొదలు పెట్టేశారు.
మామూళ్లు షురూ : పందేల నిర్వహణకు సహకరించినందుకు పలువురు ఎమ్మెల్యేలు, పోలీసులకు బరుల నిర్వాహకులు ముడుపులు ముట్టచెప్పే పనిలో ఉన్నారు. కోడి పందేల కోసం పోలీసులకు, నిర్వాహకులకు మధ్యవర్తిత్వం నెరిపిన కూటమి నేతలే ఈ మామూళ్ల సంగతి చూసుకుంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలకు పెద్ద బరుల నుంచి రూ.10 లక్షల వరకు అందజేయాలని నిర్ణయించినట్టు తెలు స్తోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అన్ని బరుల నుంచి స్టేషన్ మామూళ్లు రాబట్టే పనిలో ఉన్నారు. పందేలు, పేకాట, గుండాట తదితర జూద కార్యకలాపాల ద్వారా ఈ మూడు రోజులు జిల్లాలోని ఏఏ బరుల వద్ద ఎంత మొత్తంలో నగదు చేతులు మారింది ఇప్పటికే పోలీసుల వద్ద పక్కా సమా చారం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసుల సంక్షేమ నిధి పేరిట చిన్నా పెద్ద బరుల వద్ద రూ.30 వేల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. భీమవరం పరిసరాల్లో ఏర్పాటుచేసిన నాలుగు పెద్ద బరుల వద్ద ఈ మామూళ్ల మొత్తం మరింత అధికంగా ఉంటుందంటున్నారు. జిల్లాలో జోరుగా కోడిపందేలు జరిగినట్టు మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో వాటిని అడ్డుకున్నట్టుగా కోర్టుకు చూపించే నిమిత్తం కొందరు వ్య క్తులు, పుంజులను అప్పగించాలని ఇప్పటికే పోలీసుల నుంచి నిర్వాహకులకు కబురు పంపినట్టు తెలుస్తోంది.
గూడెంలో రూ.1.25 కోట్ల పందెం
భీమవరం పరిసరాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన నాలుగు పెద్ద బరుల వద్ద ఒక్కో పందె రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు జరిగితే, ఓ మాదిరి బరుల వద్ద రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు, చిన్న బరుల వద్ద రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు పందేలు జరిగాయి. తాడేపల్లిగూడెంలోని ఓ బరి వద్ద బుధవారం రూ.1.25 కోట్ల పందెం జరిగింది. ఇవి కాకుండా పైపందేలు రూ.కోట్లల్లో జరిగాయి. జిల్లావ్యాప్తంగా మూడు రోజుల్లో బరుల వద్ద రూ.200 కోట్ల మేర నగదు చేతులు మారినట్టు అంచనా.
10 శాతం వరకూ కమీషన్‌గా..
ఒక్కో బరిలో రోజుకు 30 నుంచి 40 వరకు పందేలు జరిగాయి. పందెంపై 2 నుంచి 10 శాతం వరకు నిర్వాహకులు కమీషన్‌గా తీసుకున్నారు. బరుల వద్ద గుండాట, పేకాట, కేసినో, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను బరుల నిర్వహణలో ఆరితేరిన వారికి కాంట్రాక్టుకు ఇచ్చేశారు. మద్యం స్టాళ్లను ఏర్పాటుచేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేయించారు. వీటన్నంటిపై రూ.10 లక్షల నుంచి రూ.కోటికి పైగా నిర్వాహకులు వసూలు చేసినట్టు తెలుస్తోంది.
న్యూస్‌రీల్
బరి తెగింపు
జోరుగా కోడి పందేలు, గుండాట, పేకాటలు
జిల్లాలో రూ.200 కోట్లకు పైగా నగదు చేతులు మారినట్టు అంచనా
నిర్వాహకుల నుంచి ఎమ్మెల్యేలు, పోలీసులకు మామూళ్లు!
బరికి రూ.30 వేల నుంచి రూ.5 లక్షల వరకు స్టేషన్ ముడుపులు
బైండోవర్, పుంజుల స్వాధీనంతో తంతు పూర్తిచేయనున్న పోలీస్ యంత్రాంగం
Comments
Please login to add a commentAdd a comment