తాడేపల్లిగూడెం రూరల్: వ్యాన్ ఢీకొనడంతో ఓ మోటార్‌సైక్లిస్ట్‌కు గాయాలయ్యాయి. కొండ్రుప్రోలు గ్రామానికి చెందిన సూరపురెడ్డి కోదండరామ సుబ్రహ్మణ్యేశ్వరరావు ఉంగుటూరు మండలం నారాయణపురం ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 11న రాత్రి 6.45 గంటల ప్రాంతంలో ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా పెదతాడేపల్లి మేకల సంత వద్ద బొలెరో వ్యాన్ మోటార్‌సైకిల్‌ను ఢీకొంది. దీంతో మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న కోదండరామ ఎడమ కాలికి గాయమైంది. దీనిపై గురువారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఏఎస్సై దుర్గారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment