అక్రమ కలప పట్టివేత
బుట్టాయగూడెం: మండలంలోని రెడ్డినాగంపాలెం సమీపంలో అక్రమంగా మూలకాల కర్ర (వెదురు) కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని బుధవారం రాత్రి పట్టుకున్నట్లు ఎఫ్‌ఎస్‌ఓ బి. దినేష్ తెలిపారు. రాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బోలేరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అక్రమ కలప ఉన్నట్లు గుర్తించామని, వెంటనే వాహనాన్ని సీజ్ చేసినట్లు ఆయన చెప్పారు. ఈ తనిఖీల్లో కొవ్వాడ బీట్ ఎఫ్‌బీఓ ఎస్‌కే. పీముహుద్దీన్, తదితరులు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.
నలుగురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
దెందులూరు: పెదపాడు మండలంలోని సత్యవోలు సచివాలయాన్ని గురువారం జెడ్పీ చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ తనిఖీ చేశారు. ఉదయం 10.30 గంటలు దాటినా ఒక్క ఉద్యోగి కూడా హాజరు కాలేదు. ఈ విషయాన్ని పెదపాడు ఎంపీడీఓ, డీపీఓకు ఆమె తెలిపారు. ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వెంటనే డీపీఓ సత్యవోలు సచివాలయంలో నలుగురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment