ఏలూరు(మెట్రో): ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ –2023 ఏలూరు జిల్లాకు లభించింది. కొత్తగా ఏర్పాటైన ఏలూరు జిల్లా కలెక్టర్‌గా రెండేళ్లు సేవలందించిన ప్రసన్న వెంకటేష్ కృషి ఫలితంగా అరుదైన అవార్డు లభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. వారి సమయంలో జిల్లాలో పౌర సేవలు, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకు వెళ్ళారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలులో భాగంగా రక్తహీనత నివారణకు ప్రాధాన్యత ఇచ్చారు. సామాజిక బాధ్యత కార్యక్రమం క్రింద ఏజెన్సీ మండలాల్లో శ్రీఅక్షజ్ఙ అనే కార్యక్రమాన్ని అమలు చేసి గర్భణీ, బాలింతల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. సుపరిపాలన అందించడం ద్వారా ఏలూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. దేశంలో 16 జిల్లాలను ఎంపిక చేయగా అందులో ఏలూరు జిల్లాకు స్థానం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment