నిరుద్యోగ సమస్య పరిష్కారంలో విఫలం
ఏలూరు (టూటౌన్): నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని అఖిల భారత యువజన సమైక్య (ఏఐవైఎఫ్) ఏలూరు జిల్లా కో కన్వీనర్ తొర్లపాటి రాజు విమర్శించారు. గురువారం ఏలూరు స్ఫూర్తి భవనంలో ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభల గోడపత్రికను నాయకులు ఆవిష్కరించారు. ఏఐవైఎఫ్ ఏలూరు జిల్లా కో కన్వీనర్ తొర్లపాటి రాజు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కోశాధికారి ఎం.క్రాంతికుమార్ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని 2014లో హామీ ఇచ్చిందని.. ఇంతవరకూ కనీసం రెండు లక్షల మందికి కూడా ఉపాధి కల్పించలేదని వారు విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చి ఏడు నెలలు కావస్తున్నా ఎలాంటి కార్యచరణకు ప్రయత్నించడం లేదని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు తాళ్లూరి నాగరాజు, జయరాజు, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment