No Headline
డెంగీ నిర్ధారణకు టీ హబ్‌కు పంపాలని వైద్య ఆరోగ్య శాఖ సూచన
వీటిని బేఖాతరు చేస్తూ సొంత ల్యాబ్‌లో పరీక్షలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు
ప్లేట్‌లెట్స్ తగ్గాయని చికిత్స పేరుతో రూ.వేలల్లో వసూలు
జిల్లాలో ఇప్పటివరకు అధికారికంగా 122 డెంగీ కేసులు నమోదు
భువనగిరి: జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ చికిత్స పేరుతో దోపిడీ కొనసాగుతోంది. ప్రస్తుతం డెంగీ విజృంభిస్తుండడం, ఇప్పటికే జిల్లాలో ఒకరు డెంగీతో మృతి చెందడంతో సాధారణ వైరల్ ఫీవర్లు వచ్చిన జనం హడలిపోతున్నారు. అయితే వారి భయాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు చికిత్స పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేని ల్యాబ్‌లలో సైతం పరీక్షలు చేసి డెంగీగా నిర్ధారణ చేస్తున్నారు. ఇలాంటి తరహా దండా జిల్లా కేంద్రంతో పాటు చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో అధికంగా కొనసాగుతోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో అధికారికంగా 122 డెంగీ కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారికి వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు చెప్పకుండా చికిత్స అందిస్తున్నారు.
ప్రభుత్వ సూచనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులు
సాధారణంగా ప్రైవేట్ ఆస్పత్రులకు గాని ల్యాబ్‌లకు గాని డెంగీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే అధికారం లేదు. ఈ విషయంపై ఇటీవల ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచనలు చేశారు. డెంగీ లక్షణాలు కనిపిస్తే టీ హబ్‌కు రక్త నమూనాలు పంపి అక్కడ నిర్ధారణ చేయాలనే నిబంధనలు ఎక్కడా పాటించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment