ఎస్సీ హాస్టల్‌లో కలెక్టర్ రాత్రి బస
సంస్థాన్ నారాయణపురం : మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో సోమవారం రాత్రి కలెక్టర్ హనుమంతరావు బస చేశారు. రాత్రి 9 గంటలకు హాస్టల్‌కు చేరుకున్న కలెక్టర్.. రాగానే వసతులు, వంటశాల, వంటసామగ్రి, హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. స్టడీ అవర్‌లో విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.అదే విధంగా హాస్టల్‌లో ఉంటున్న 15 మంది మోడల్ స్కూల్ విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు.సైకిల్‌పై కలెక్టర్ చక్కర్లు కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని వార్డెన్‌ను ఆదేశించారు. పదో తరగతిలో వంద శాతం ఫలితాల సాధనకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి బస చేశారు.
Comments
Please login to add a commentAdd a comment