భువనగిరి అసిస్టెంట్ ఎస్పీగా రాహుల్‌రెడ్డి
సాక్షి, యాదాద్రి : భువనగిరి అసిస్టెంట్ ఎస్పీగా కంకణాల రాహుల్‌రెడ్డి ఐపీఎస్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాహుల్‌రెడ్డి గ్రేహౌండ్స్ నుంచి బదిలీపై భువనగిరి వస్తున్నారు. కాగా భువనగిరి ఏసీపీగా పనిచేస్తున్న రవికిరణ్ ఇక్కడినుంచి బదిలీ అయ్యారు.
శివుడికి రుద్రాభిషేకం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి అనుబంధంగా యాదగిరికొండపై ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు నిర్వహించారు. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ మండపంలోని స్పటిక లింగానికి పూజలు చేశారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు.
జిల్లాకు చేరిన నామినేషన్ పత్రాలు
భువనగిరి టౌన్ : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఎన్నికల కరదీపికలు కూడా వచ్చాయి. తాజాగా నామినేషన్ పత్రాలు రాగా, వాటిని కలెక్టరేట్‌లో భద్రపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment