గంగులమ్మ (ఫైల్)
కడప అర్బన్: కడప హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో సోమవారం గ్యాస్ లీకై అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గంగులమ్మ (48) మంటల్లో ఆహుతైంది. వివరాలు. గంగులమ్మ, ఆమె కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో రెండో అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఉదయం 9 గంటల సమయంలో గంగులమ్మ ఇంటిలో ఉండగా గ్యాస్ లీకై మంటలు చేలరేగాయి.ఆమె తీవ్రంగా గాయపడింది.స్థానికుల సమాచారంతో కడప అగ్నిమాపక కేంద్ర అధికారి, జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి బసివిరెడ్డి ఆదేశాల మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు.గంగులమ్మను అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించారు.అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఆ సమయంలో పవన్‌కుమార్ రెడ్డి బయటకు వెళ్లారు. సంఘటన గురించి తెలియగానే రిమ్స్‌కు వెళ్లారు. గంగులమ్మ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప వన్‌టౌన్ ఎస్‌ఐ రంగస్వామి తెలియజేశారు. ఈ సంఘటనపై సమగ్రంగా విచారిస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment