సాక్షి, కడప డెస్క్: ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు అసోసియేషన్ (ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్) ప్రవాసాంధ్రులకు ప్రియమైన నేస్తంగా మారింది. 2018లో ఏర్పడిన ఈ సంస్థ ఈ ఆరేళ్ల కాలంలో గల్ఫ్ దేశాలైన కువైట్, ఖత్తర్, సౌదీ అరేబియా, దుబాయ్‌లలో ఇబ్బందులు పడుతున్న ప్రవాసాంధ్రులకు అండగా నిలించింది. వారి అవసరాలు తీర్చింది. గతంలో ఈ సంస్థకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నింగ్ బాడీ చైర్మన్‌గా, అధ్యక్షులుగా ఎస్.వెంకట్ మేడపాటి ఉండేవారు. ప్రస్తుతం గవర్నింగ్ బాడీ చైర్మన్‌గా ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషాను నియమించారు. గల్ఫ్‌దేశాల్లో ప్రమాదవశాత్తు ఎవరైనా గాయపడినా, మరణించినా, వైకల్యం పొందినా అక్కున చేర్చుకుని వారికి ఆపన్నహస్తం అందిస్తోంది.
పాస్‌పోర్టు పోగొట్టుకుని వీసా గడువు తీరిపోయి కేసులతో సతమతమవుతున్న వారిని గుర్తించి సాయం చేసి స్వదేశానికి రావడానికి ఎయిర్ టిక్కెట్లతోపాటు ఇమిగ్రేషన్ జరిమాన, దారి ఖర్చులను కూడా ఇప్పిస్తున్నారు. టెంపుల్ దర్శన్ పేరుతో రాష్ట్రంలో ప్రసిద్ధ దర్శనీయ దేవాలయాలకు బ్రేక్ దర్శనం చేయిస్తున్నారు. ప్రవాసాంధ్రుల సమస్యలను గుర్తించడానికి 24 గంటలు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి గ్రీవెన్సెస్ స్వీకరిస్తున్నారు. ఏపీఎన్‌ఆర్‌ఐ సెల్ ద్వారా వివాహ సమస్యలు, ఏజెంట్లు మోసం చేయడం, కోర్టు కేసులు వంటి వాటిని పరిష్కరిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కింద నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడంతోపాటు యూఎస్‌ఏ, యూకేలకు వెళ్లే వారికి ఆన్‌లైన్ ఐటీ ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు.
విదేశాల్లో ఉంటూ సొంత ఊరిని అభివృద్ధి చేయాలనుకునే వారి కోసం మై గ్రాంట్ రీసోర్స్ సెంటర్స్ ఏర్పాటు చేసి వారి గ్రామాలను అభివృద్ధి చేసేందుకు సహకరిస్తున్నారు. గల్ఫ్ దేశాలకు లీగల్‌గా, భద్రతగా వెళ్లడం ఎలా? ఏయే దశల్లో మోసాలు జరుగుతున్నాయనేదానిపై విదేశాలకు ఎక్కువగా వెళుతున్న ప్రాంతాల్లో సేఫ్ మైగ్రేషన్ క్యాంపులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. విదేశాల్లో చదవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం స్టూడెంట్ కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి వారు ఏ కోర్సుల్లో చేరదలుచుకున్నారు? డాక్యుమెంటేషన్, వీసీ గైడ్ లైన్స్ వంటి వాటిపై శిక్షణ ఇస్తున్నారు. విద్యావంతులైన ఎన్‌ఆర్‌ఐలను బృందాలుగా ఏర్పాటు చేసి ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం సంపాదించేందుకు దోహదపడుతున్నారు.
ప్రభుత్వ స్కూళ్లలో చదివే 10వ తరగతి, ఇంటర్ విద్యార్థుల కోసం స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోర్సులు చేయిస్తున్నారు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కల్పనతోపాటు ఇండస్ట్రియల్ ఎలక్ట్రిషియన్ ట్రైనింగ్ ఇస్తున్నారు. యూఎస్‌ఏలోని డ్రిిస్టిక్ స్కూళ్లకు ఇక్కడి నుంచి 52 మంది టీచర్లను పంపించారు. గల్ఫ్‌లో మృతి చెందిన వారి మృతదేహాలను భారతదేశానికి తీసుకు రావడానికి థర్డ్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రవాసాంధ్ర భరోసా బీమా ద్వారా వలస కార్మికులకు తక్కువ ప్రీమియానికే రూ. 10 లక్షల బీమా, రూ. లక్ష వరకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ కల్పిస్తున్నారు. మహిళలు గర్భధారణ చేస్తే సాధారణ డెలివరీకి రూ. 35 వేలు, సిజేరియన్‌కు రూ. 50 వేలు అందేలా చర్యలు చేపడుతున్నారు. ఏవైనా లీగల్ సమస్యలు ఉంటే వాటి పరిష్కారం కోసం రూ. 45 వేలు ఇప్పిస్తున్నారు.
సీఎం సహకారం మరువలేనిది
ఏపీఎన్‌ఆర్‌టీఎస్ స్థాంపించిన తర్వాత ఏడా దికి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గల్ఫ్‌దేశాల్లో తెలుగువారు పడుతున్న ఇబ్బందులను గుర్తించి తమ సంస్థకు ప్రోత్సా హం అందించారు. అనేక సమస్యలతో సతమతమవుతూ సరియైన వేతనాలు లేక మగ్గిపో తున్న వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసు కురావడంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంతో కృషి చేశారు.
– ఎస్.వెంకట్ మేడపాటి, చైర్మన్, ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్
గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు
ప్రవాసాంధ్రుల సమస్యలను గతంలో ఏప్రభుత్వాలు పట్టించుకోలేదు. వారు పడుతున్న అవస్థలను తీర్చే ఆలోచన కూడా చేయలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రవాసాంధ్రుల సమస్యలపై ప్రత్యేక చొరవ ప్రదర్శించారు. కోవిడ్ సమయంలో ఎంతో మందిని ప్రత్యేక విమా నాల ద్వారా ఇండియాకు రప్పించేందుకు కృషి చేశారు. పాస్‌పోర్టులు, వీసా లేకుండా ఉంటున్న వారిని, ఎవరూ లేక అనాథలుగా చనిపోయిన వారిని ఇండియాకు తీసుకురావడంలో ప్రభుత్వ సహకారం మరువలేనిది.
–బీహెచ్ ఇలియాస్,డైరెక్టర్, ఏపీఎన్‌ఆర్‌టీఎస్
పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్‌కు తొలగిన అడ్డంకులు
గల్ఫ్‌లో ఎన్‌ఆర్‌ఐలు గతంలో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్(పీసీపీ) పొందాలంటే చాలా కష్టతరంగా ఉండేది. అందుకోసం పాస్‌పోర్టుతోపాటు వీసా, అగ్రిమెంట్ సమర్పిస్తే 45 రోజుల తర్వాతగానీ పీసీసీ వచ్చేది కాదు. ఆ లోపు వీసా టైం అయిపోవడమో, పాస్‌పోర్టు గడువు మీరిపోవడమో జరిగేది. ఏపీఎన్‌ఆర్‌టీఎస్ కేంద్ర ప్రభుత్వ పాస్‌పోర్టు అధికారులకు ఈ సమస్యలన్నీ వివరించి కేవలం పాస్‌పోర్టుతో దరఖాస్తు చేస్తే మరుసటి రోజే అపాయింట్‌మెంట్ లభించేలా కృషి చేశారు. వారంలోనే ఇప్పుడు పీసీసీ వచ్చేస్తోంది. ప్రతి శనివారం వాక్ ఇన్ డ్రైవ్ నిర్వహిస్తూ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారంటే అది ఏపీఎన్‌ఆర్‌టీఎస్ ఘనతగానే చెప్పవచ్చు.
కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో కూడా ఏపీఎన్‌ఆర్‌టీఎస్ సభ్యులు ప్రభుత్వ అధికారులతో కలిసి సేవలందించారు. వివిధ దేశాల నుంచి స్వదేశానికి వచ్చిన వారికి విమానాశ్రయాల్లో త్రాగునీరు, భోజనం, స్నాక్స్, జ్యూసులు ర్పాటు చేశారు. మరే రాష్ట్రంలోనూ ఈ తరహా సేవలు అందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment