రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో రిమ్స్ వైద్యుల ఘన విజయం
కడప అర్బన్ : రాష్ట్ర స్థాయి డాక్టర్ల షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో కడప రిమ్స్‌కు చెందిన ఇరువురు డాక్టర్లు ఘన విజయం సాధించారు. కేఎస్‌ఆర్‌ఎం కాలేజీలోని కేఎన్‌ఆర్ స్పోర్ట్స్ ఎరీనాలో ఆదివారం టోర్నమెంట్ జరిగింది. ప్రొద్దుటూరు, కడప డాక్టర్‌ల మధ్య పోటాపోటీగా సాగిన ఈ టోర్నమెంట్‌లో ప్రథమ బహుమతిని డాక్టర్ వెంకటమనోజ్ (సివిల్ అసిస్టెంట్ సర్జన్ పెథాలజీ విభాగం), డాక్టర్ శ్యాంసుందర్‌రావు (రేడియాలజిస్ట్) సాధించారు. మూడవ బహుమతిని డాక్టర్ ప్రతాప్‌రెడ్డి (ఈఎన్‌టీ అసిస్టెంట్ ప్రొఫెసర్), డాక్టర్ జావేద్ (ఎమర్జెన్సీ మెడిసిన్) సాధించారు. వైద్య రంగంలో ఎంత బిజీగా ఉన్నా ఆటల్లో మేటిగా రాణిస్తున్న వైద్యులను అడిషనల్ డీఎంఈ, ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. సురేఖ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. విజయభాస్కర్‌రెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment