ట్రాక్టర్ల దొంగతనం కేసు నమోదు
సింహాద్రిపురం : సింహాద్రిపురంలో ట్రాక్టర్ల ట్రాలీల దొంగతనం కేసు నమోదైనట్లు ఎస్‌ఐ తులసీ నాగప్రసాద్ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం అంకాలమ్మ గూడూరు చెందిన కె.శ్రీనివాసరెడ్డి తన ట్రాక్టర్ ట్రాలీ దొంగలు తీసుకెళ్లినట్టు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగం ప్రవేశం చేసి వివిధ మండలాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. తొండూరు మండలం మల్లేల గ్రామంలో ట్రాక్టర్, రెండు ట్రాలీలను గుర్తించి పట్టుకున్నారు. వీటిని సింహాద్రిపురానికి చెందిన బాబా ఫకృద్దీన్ అలియాస్ చో టు దొంగలించినట్లు నిర్ధారించి కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేశారు.
రేషన్ బియ్యం బస్తాలు స్వాధీనం
ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని లింగాపురం గ్రామ సమీపంలో ఉన్న ఆటో నగర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 184 బస్తాల చౌక బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమకు వచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్ గంగయ్య, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున శుక్రవారం దాడులు నిర్వహించారు. 184 బస్తాల చౌక బియ్యాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక పౌరసరఫరాల శాఖ గోడౌన్‌కు తరలించారు. అనంతరం అనాలసిస్ రిపోర్ట్‌కు బియ్యం శాంపిళ్లను పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌కు పంపి పంచనామా చేశారు. ఈ బియ్యం బస్తాలను విజిలెన్స్ అధికారులు జవహర్‌రెడ్డి, ఏఓ బాలగంగాధర్‌రెడ్డిలు పరిశీలించారు. ఈ దాడులలో ఆర్‌ఐ మహేంద్రారెడ్డి, వీఆర్‌ఓ రామయ్య, రూరల్ పోలీసులు పాల్గొన్నారు.
గంజాయి కేసులో నిందితుడి అరెస్ట్
కడప అర్బన్ : కడప నగరంలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాలకొండలు జంక్షన్ దగ్గర పోలీసుల తనిఖీలో సుమారు ముప్పై వేల విలువ గల 6 కిలోల గంజాయిని రామకృష్ణనగర్‌కు చెందిన కాకి శివ అలియాస్ శివమణి దగ్గర నుంచి రిమ్స్ సీఐ తన సిబ్బందితో పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన రిమ్స్ ఎస్‌ఐ జయరాముడు, సిబ్బందిని కడప రిమ్స్ సీఐ సీతారామిరెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment