నేడు వృద్ధుడి మృతదేహానికి పోస్టుమార్టం
మైదుకూరు : మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లెలో హత్యకు గురైన అల్లాడుపల్లె వీరారెడ్డి అనే వృద్ధుడి మృతదేహానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. గత డిసెంబర్ 6వ తేదీన వృద్ధుడు వీరారెడ్డి మృతి చెందగా సహజ మరణంగా భావించి అంత్యక్రియలు చేశారు. అయితే ఆయన మృతిపై రెండో భార్య కుమారుడు రమేష్ అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. వీరారెడ్డి పెద్ద భార్య మనవడు హరినాథ్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణలో భాగంగా శనివారం వీరారెడ్డి మృతదేహాన్ని వెలికి తీయించి పోస్ట్‌మార్టం చేయించనున్నట్టు అర్బన్ సీఐ సయ్యద్ హాసం తెలిపారు.
సవరణ : సాక్షిలో శుక్రవారం ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ కథనంలో చిత్రాలు తప్పుగా ప్రచురితమైన విషయాన్ని గమనించగలరు.
దాడి కేసులో వ్యక్తి అరెస్ట్
చాపాడు : మండల పరిధిలోని టీఓపల్లె లైన్‌మెన్‌గా పని చేస్తున్న సుబ్బరాయుడు అనే వ్యక్తిపై దాడి చేసిన ఇదే గ్రామానికి చెందిన కె.సుబ్బరాయుడును శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. పది రోజుల క్రితం టీఓపల్లె గ్రామంలో విద్యుత్ సమస్యపై చిన్న పిల్లలను లైన్‌మెన్ మందలిస్తుండగా అక్కడే ఉన్న దళితవాడకు చెందిన కె.సుబ్బరాయుడు తననే లైన్‌మెన్ తిడుతున్నాడని భావించి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో గాయపడిన లైన్‌మెన్ తనపై దాడి చేసిన సుబ్బరాయుడుపై పోలీసుకు ఫిర్యాదు చేశారు. కేసు నమెదు చేసుకున్న పోలీసులు నిందితుడిని శుక్రవారం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment