ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
పెండ్లిమర్రి : మండలంలోని మాచునూరు గ్రామానికి చెందిన మాచునూరు శ్రీనివాసులు (37) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. శ్రీనివాసులు కొంత కాలం నుంచి అనా రోగ్యంతో బాధ పడుతుండే వాడు. మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతు ర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
పెండ్లిమర్రి : కడప–పులివెందుల ప్రధాన రహదారిలోని మిట్టమీదపల్లె గ్రామ సమీపంలో శనివారం ఆటోను ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మిట్టమీదపల్లె గ్రామానికి చెందిన బాదుల్లా(50) ఆటో నడుపుకొంటూ, గ్రామాల్లో పరుపులు కుట్టుకుంటూ ఉండేవాడు. జంగంరెడ్డిపల్లె, రంపతాడు గ్రామాలకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మిట్టమీదపల్లె సమీపంలో పులివెందుల నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటో రోడ్డు డివైడర్‌పై బోల్తా పడింది. ఆటో నడుపుతున్న బాదుల్లాకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నా పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు మృతుడి బంధువులు తెలిపారు. బాదుల్లాకు భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆటో డ్రైవర్ మృతి
Comments
Please login to add a commentAdd a comment