అభివృద్ధి పథంలో వీరబ్రహ్మ క్షేత్రం
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలోని శ్రీ వీరబ్రహ్మ క్షేత్రంలో గతం కంటే ఇప్పుడు అభివృద్ధి కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోకర్ణ శ్రీనివాస్ తెలిపారు. ఆయన బృందంతో కలిసి శనివారం మద్విరాట్ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మఠం ఫిట్‌పర్సన్ శంకర్‌బాలాజీ, మేనేజర్ ఈశ్వరాచారితో కలిసి మఠంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంత మంది అభివృద్ధి పనులు జరగలేదని, నిధులు దుర్వినియోగం అయ్యాయని సమాచారం ఇవ్వడంతో బీజేపీ తరఫున ఇక్కడికి రావడం జరిగిందన్నారు. ఇక్కడ పనులు చూసిన తరువాత అభివృద్ధి జరిగినట్లు కన్పిస్తోందన్నారు. భక్తుల కోసం ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. వ్యాపార సముదాయాల నిర్మాణాలు జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వపు మఠాధిపతి కుమారులు వీరభద్రయ్యస్వామి, వీరంబొట్లయ్య స్వామి, దత్తాత్రేయస్వామి, స్థానికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment