‘రామదండు’లా తరలి రండి!
కడప కల్చరల్ : అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనెల 22న కడపలో నిర్వహించనున్న శ్రీరామ మహా శోభాయాత్రకు భక్తులంతా రామదండులా నిండైన భక్తితో తరలి రావాలని సంస్థ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం సంస్థ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ మైదానం వద్ద శ్రీరామ కల్యాణ వేదిక నుంచి భారీ మోటారు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్టించి ఏడాది గడిచిన సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీ రామ మహా శోభాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమ ప్రతినిధులతోపాటు ఆధ్యాత్మిక సంస్థలు, దేవాలయాల కమిటీల సభ్యులు, యువజన సంఘాలు ఎంతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.
ఎవరీ వృద్ధురాలు.!
కడప అర్బన్ : కడప నగరంలోని మాసాపేటలో ఓబుళమ్మ అనే వృద్ధురాలిని స్థానికులు గుర్తించారు. ఆమెను ఏ ఊరని అడిగితే తనది మాధవరం చిన్నపురెడ్డిపల్లె అని చెబుతోంది. తనను ఆటోలో తీసుకువచ్చి ఇక్కడ వదిలేసి వెళ్లారంటోంది. ఆమెకు సంబంధించిన వారు ఎవరూ రాకపోవడంతో స్థానికులు ఆమెను రిమ్స్ సమీపంలోని పద్మావతి వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఆమె బంధువులు ఎవరైనా ఉంటే 95508 74906 నంబరులో సంప్రదించాలని సూచించారు.
రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
కడప అర్బన్ : కడప రిమ్స్‌లో ఈనెల 18న గుర్తు తెలియని వ్యక్తి (55)ని వైద్యం కోసం చేర్పించారు. అతను చికిత్స పొందుతూ కొంతసేపటికే మృతి చెందాడు. అతని వివరాలు తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment