Sri Sathya Sai
-
ప్రకృతి వ్యవసాయం భేష్
రొళ్ల: జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్ఎఫ్) ప్రాజెక్ట్ ద్వారా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని అమెరికా, ఇంగ్లాండ్ దేశాలకు చెందిన ప్రతినిఽధి బృందం సభ్యులు ప్రశంసించారు. రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ ద్వారా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా సామాజిక అభివృద్ధి, పర్యావరణంలో మార్పు తీసుకురావడం కోసం కృషి చేస్తున్న ఇంగ్లాండ్, అమెరికా (న్యూయార్క్) ఎన్జీఓలకు చెందిన మిచ్ రిజినిక్, గ్రెగ్ డ్యూల్సికితో పాటు ఢిల్లీకి చెందిన గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లాంట్ సెక్రటరీ జనరల్ సత్య త్రిపాటి, హైదరాబాద్ చెందిన సూరజ్ తేజ తదితరులు మంగళవారం రొళ్ల మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా హనుమంతనపల్లి, వన్నారనపల్లి, ఆవినకుంట గ్రామాల్లో రైతులు లక్ష్మమ్మ, నారాయణప్ప, గంగమ్మ, కృష్ణప్ప తదితరులు ప్రకృతి వ్యవసాయం పద్ధతుల్లో సాగు చేసిన బొప్పాయి, ఆకుకూరలు, కూరగాయలు, అలసంద, చింత, మామిడి, అరటి, అవిసె, అనుములు, మిరప, కంది, కొబ్బరి, ఆముదం, సజ్జ, ముల్లంగి, బీట్రూట్, క్యారెట్, గోరుచిక్కుడు, మొక్కజొన్న తదితర పంటలను పరిశీలించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయంలో కీలక పాత్ర పోషించే ఘన, ద్రవ జీవామృతం తయారీ విధానం, విత్తన గుళికలు, విత్తన శుద్ధి ఇతరాత్ర వాటి గురించి జిల్లా ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ మేనేజర్ లక్ష్మానాయక్ వివరించారు. అనంతరం రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ ప్రకృతి వ్యవసాయ విధానంలో అనుసరిస్తున్న తొమ్మిది సార్వత్రిక సూత్రాలను విదేశీ బృందానికి వివరించారు. అత్యంత తక్కువ వర్షపాతం కలిగిన జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు ఏడాది పొడవునా పంటలు పండించగలుగుతున్నారని తెలిపారు. అనంతరం ఏపీసీఎన్ఎఫ్ ప్రాజెక్ట్ అమలులో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న స్వయం సహాయక సంఘాలు, గ్రామైక్య సంఘాల ప్రతినిధులతో విదేశీ బృందం సభ్యులు చర్చించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం ఏపీఎం బీమరాజు, ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త డా. నవీన్, కోఆర్డినేటర్ భానుమతి, ఎంటీ రమేష్, ఇన్చార్జ్ హనుమంతరాయప్ప, లక్ష్మీకాంత్, సెర్ప్ సిబ్బంది, ఎంఎంఎస్, మహిళ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అమెరికా, ఇంగ్లాండ్ దేశాల ప్రతినిధుల ప్రశంస రొళ్ల మండలంలో ప్రకృతి వ్యవసాయ పంటలసాగు పరిశీలన -
పావగడ సోలార్ పార్క్‌లో పేలుళ్లు
పావగడ: తాలూకాలోని తిరుమణి సోలార్ పార్క్‌లో డిటోనేటర్ పేలి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. తిరుమణి సోలార్ పార్క్‌లో సూపర్వైజర్గా బళ్లారి జిల్లా సిరిగుప్పకు చెందిన బసవరాజు (50) పనిచేస్తున్నాడు. ఇటీవల పార్క్‌లో నూతనంగా సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో దాదాపు 10 ఎకరాల భూమిలో ఉండే గుట్టను పేల్చి చదును చేసే పనులు జరుగుతున్నాయి. గుట్టను పేల్చేందుకు డిటోనేటర్లను గుట్టలో ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు గుట్టపై ఉన్న ఎండు గడికి నిప్పు రాజేయడంతో మంటలు వ్యాపించాయి. గమనించిన కంపెనీ అధికారుల ఆదేశాలతో సూపర్వైజర్ బసవరాజు, కార్మికుడు శివయ్య మంటలు ఆర్పుతుండగా ఒక్కసారిగా ఓ డిటోనేటర్ పేలింది. సమీపంలోనే ఉన్న బసవరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన శివయ్యను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న సీఐ గిరీష్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అశోక్ ఆదేశాలతో మంగళవారం ఉదయం బాంబ్ స్క్వాడ్ బృందం అక్కడకు చేరుకుని పరిశీలించింది. ఓ ట్రాక్టర్ లో ఉన్న 40 డిటోనేటర్లను గుర్తించి నిర్వీర్యం చేశారు. ఎలాంటి సురక్షిత ప్రమాణాలు పాటించకుండా డిటోనేటర్లతో అక్రమంగా గుట్టను పేల్చడానికి పూనుకున్న జేఎస్‌డబ్ల్యూ కంపెనీ మేనేజర్ అమర్‌రాజ్, కాంట్రాక్టర్, డిటోనేటర్లు పేల్చే ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సూపర్ వైజర్ మృతి మరో కార్మికుడికి తీవ్ర గాయాలు -
బ్రహ్మోత్సవం చూతము రారండి
● 5 నుంచి కొండమీదరాయుడి బ్రహ్మోత్సవాలు ● 12న తిరునాల, రథోత్సవం బుక్కరాయసముద్రం: మండలంలో కొలువైన కొండమీదరాయ స్వామి ఉత్సవాలు ఫిబ్రవరి 5న ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 10 రోజులపాటు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 5 సాయంత్రం బుక్కరాయసుద్రంలోని లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవమూర్తులను కొండపైకి తీసుకెళ్తారు. 6న ఉదయం 8 గంటలకు దేవరకొండపై పుణ్యాహవాచనము, దేవతా హోమం, ధ్వజా రోహనము, గరుడ ఆహ్వాన పూజ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 8 గంటలకు స్వామి వారికి పుష్ప పల్లకీ సేవ ఉంటుంది. 7న స్వామి వారిని సింహ వాహనంపై మండల కేంద్రంలో ఊరేగిస్తారు. 8న శేష వాహన, 9న హనుమద్వాహన, 10న గరుడ, 11న శ్వేత గజ వాహన సేవలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన కల్యాణ, రథోత్సవాలు ఫిబ్రవరి 12వ తేదీన జరగనున్నాయి. రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. ఇక.. 13న రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ, 14న ఉదయం 7 గంటలకు తీర్థవాది వసంతోత్సవం, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవలు నిర్వహించనున్నారు. పట్టు రైతులకు సబ్సిడీపై యంత్రాలు హిందూపురం అర్బన్: జిల్లాలోని పట్టు రైతులకు సబ్సిడీపై యంత్రాలు అందించనున్నట్లు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 6వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు పరిశీలించిన అర్హులకు పవర్ స్ప్రేయర్లు, బ్రష్కట్టర్లు, పవర్ ఫీడర్, పవర్ టిల్లర్, షూట్ కటింగ్ మిషన్, బ్యాటరీతో పనిచేసే స్ప్రేయర్లను సబ్సిడీతో అందిస్తామన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ‘పది’లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలి ● ఉపాధ్యాయులకు డీసీఓ జయలక్ష్మీ ఆదేశం రొళ్ల: పదో తరగతిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని డీసీఓ జయలక్ష్మి పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం ఆమె మండల పరిధిలోని దొమ్మరహట్టి గ్రామం వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. తొలుత విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులతో చర్చించారు. పదో తరగతి మార్కులు జీవితంలో ఎంతో విలువైనవని, అందువల్ల విద్యార్థులంతా పబ్లిక్ పరీక్షలకు బాగా సిద్ధం కావాలన్నారు. ఉపాధ్యాయులు కూడా పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రోజూ మెనూ ప్రకారం భోజనం వడ్డించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ మైలారప్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రైతు కూలీల సంక్షేమంపై దృష్టి సారించని ప్రభుత్వాలు
అనంతపురం: స్వాతంత్య్రానంతరం దేశంలో రైతు కూలీల సంక్షేమంపై ఏ ప్రభుత్వమూ దృష్టి సారించలేదని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణా రావు అన్నారు. ‘భూమి లేని వ్యవసాయ కూలీల సమగ్ర అభివృద్ధికి మార్గదర్శకం’ అంశంపై గ్రామీణాభివృద్ధి, సామాజిక సమ్మిళిత అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వేదికగా మంగళవారం జాతీయ సదస్సు జరిగింది. కార్యక్రమానికి ఐవైఆర్ కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పనికి తగ్గ కూలి లభిస్తే కుటుంబపోషణకు దోహదపడుతుందన్నారు. కొన్ని సామాజిక వర్గాలు జ్ఞానంతో వృద్ధి చెందారన్నారు. ప్లాస్టిక్ కారణంగా కొన్ని కులవృత్తుల (కుమ్మరి) ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమయ్యాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నైపుణ్యం లేని వారే చివరకు రైతు కూలీలుగా మిగిలిపోతున్నారన్నారు. రెక్టార్ ప్రొఫెసర్ జి. వెంకటనాయుడు మాట్లాడుతూ.. దేశంలో 41.63 శాతం మంది ఎలాంటి జీవనాధారం లేని కూలీలు ఉన్నారని తెలిపారు. 60 ఏళ్లు దాటిన రైతు కూలీలకు శ్రమయోజన కార్డులు అందించాలన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ, విత్తనాల ధరలు పెరగడం, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు రైతు కూలీలకు మధ్య సత్సంబంధాలు అవసరమన్నారు. గ్రామీణాభివృద్ధి విభాగాధిపతి ప్రొఫెసర్ మునినారాయణప్ప అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో అసిస్టెంట్ డైరెక్టర్లు డాక్టర్ కె.వెంకటరెడ్డి, డాక్టర్ డి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు -
పరీక్ష పత్రాలకు రెక్కలు!
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరీక్షల విభాగం అధికారుల అంతులేని అలసత్వం మరోసారి బయట పడింది. ఈ సారి ఏకంగా విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు గల్లంతు కావడం దుమారం రేపింది. నెల రోజుల క్రితమే ఈ విషయం బయటపడినా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడటం గమనార్హం. తమ భవిష్యత్తును నిర్దేశించే జవాబు పత్రాలు కనిపించకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. జాడలేని జవాబు పత్రాలు.. జేఎన్టీయూ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాల అయిన వేము ఇంజినీరింగ్ కళాశాల (చిత్తూరు, తిరుపతి రోడ్డు)లో ఈసీఈ మూడో సంవత్సరం ఆర్–20 రెగ్యులర్ పరీక్ష అయిన కంట్రోల్ సిస్టమ్ ఇంజినీరింగ్ సబ్జెక్టు పరీక్షను డిసెంబర్ 10న నిర్వహించారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రం నిర్వాహకులు వెంటనే రిజస్టర్ పోస్టు ద్వారా జేఎన్టీయూ అనంతపురం పరీక్షల విభాగానికి పంపుతారు. ఈ మేరకు రిజిస్టర్ పోస్టులోనూ నమోదు చేశారు. జేఎన్టీయూ అనంతపురం పరీక్షల విభాగంలోనూ జవాబు పత్రాలు వచ్చినట్లు నమోదైంది. ఇంత వరకూ బాగానే ఉన్నా జేఎన్టీయూ పరీక్షల విభాగంలో జవాబు పత్రాలు కనిపించకుండా పోవడం ఆందోళన రేపింది. పరీక్షల విభాగాన్ని సిబ్బంది జల్లెడ పట్టినా వాటి జాడ కనిపించలేదు. ఈ నేపథ్యంలో పరీక్షల విభాగం అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం బట్టబయలైనట్లయింది. పరీక్ష ఫలితాల విడుదలలో జాప్యం తలెత్తింది. అయితే, నెల రోజుల క్రితమే విషయం బయటపడినా.. వర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా తొక్కిపెట్టాలని ప్రయత్నం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిశీలించాలని చెప్పాం జవాబు పత్రాల గల్లంతు వ్యవహారం రెండు రోజుల క్రితం నా దృష్టికి వచ్చింది. ఎక్కడ పొరపాటు జరిగిందో పరిశీలించాలని ఆదేశించాం. – హెచ్. సుదర్శనరావు, ఇన్చార్జ్ వీసీ 193 మంది విద్యార్థుల జవాబుపత్రాల గల్లంతు ఎంత గాలించినా దొరకని వైనం మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు ఇక్కట్లు -
క్వింటా కందికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర
మడకశిర: జిల్లాలో 32 మండలాలుండగా, ఖరీఫ్‌లో 30 మండలాల రైతులు కంది పంటను సాగు చేశారు. ప్రధానంగా 15 మండలాల్లో ఎక్కువ శాతం కందిని సాగు చేశారు. సరిగ్గా పంట చేతికందే సమయంలో వరుస తుపాన్లు చుట్టుముట్టాయి. ఫలితంగా దిగుబడి గణనీయంగా తగ్గింది. ఆ తర్వాత వరుణుడు కాస్త కనికరించినా...పంట కళ్లంలో చేరాక మళ్లీ విరుచుకుపడ్డాడు. ఫలితంగా కంది నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపింది. రంగుమారడం, గింజలు విరగడం, తేమశాతం పెరగింది. ఈ పరిస్థితుల్లో రైతుకు సాయంగా నిలవాల్సిన సర్కార్..మొండి చేయి చూపుతోంది. మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాల ద్వారా పంట కొనుగోలు చేస్తామని ప్రకటించినా...సవాలక్ష నిబంధనలు విధించింది. దీంతో రైతు పరిస్థితి అగమ్యగోచరమైంది. 3 మండలాల్లోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ కందులకు రూ. 7,550 మేర మద్దతు ధర నిర్ణయించింది. ఈ మేరకు కొనుగోలు చేయాని మార్క్‌ఫెడ్‌ను ఆదేశించింది. దీంతో జిల్లాలోని డీసీఎంఎస్‌లు, పీఏసీఎస్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జిల్లాలోని రైతులు కందులను విక్రయించడానికి ఆయా రైతు సేవా కేంద్రాల్లో పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు బత్తలపల్లి, తాడిమర్రి, ధర్మవరం మండలాల్లోనే కంది కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. అక్కడ కూడా నేటికీ 100 క్వింటాళ్ల కందిని కూడా కొనుగోలు చేయలేదు. మిగిలిన మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ప్రారంభిస్తుందో కూడా చెప్పకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలతో మెలిక కందుల కొనుగోలుపై నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి ప్రభుత్వం 8 నిబంధనలను విధించింది. తేమ శాతం 12 లోపు ఉండాలని, ఇతర వ్యర్థ పదార్థాలు 2 శాతం లోపు, దెబ్బతిన్న గింజలు 3 శాతం లోపు, పాక్షికంగా దెబ్బతిన్న, రంగు మారిన గింజలు 3 శాతం లోపు ఉండాలన్న నిబంధనలు విధించింది. ఈ మేరకే కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కందులు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. అయితే గత ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో వరుస తుపాన్లు, ఆ తర్వాత తుంపర వర్షాలు కురిశాయి. ఫలితంగా కందిపంట దెబ్బతింది. దీంతో కందుల్లో నాణ్యత తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నాణ్యమైన కందులనే కొనుగోలు చేస్తామని చెబుతోంది. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. రైతులు ప్రైవేటుకు పంట విక్రయించాక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఏమి లాభమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కందుల కొనుగోళ్లలో నిబంధనలు సడలించడంతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.అమ్మకానికి సిద్ధంగా ఉంచిన కందులురూ.7,550కంది రైతు కొనుగోల కందుల కొనుగోళ్లపై సవాలక్ష నిబంధనలు తీవ్ర అడ్డంకిగా మారిన తేమశాతం ప్రభుత్వ నిబంధనలపై రైతుల అసంతృప్తి 3 మండలాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం నాణ్యతగా ఉంటేనే కొంటాం ప్రభుత్వం క్వింటాల్ కందులకు రూ.7,550 మద్దతు ధర ప్రకటించింది. అయితే కొనుగోలుకు కొన్ని నిబంధనలు విధించింది. ఈ మేరకు నాణ్యతా ప్రమాణాలు చూసే కందులను కొనుగోలు చేస్తాం. ప్రస్తుతం జిల్లాలో మూడు చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. వారంలోపు జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. –గీతమ్మ, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్మద్దతు ధర పెంచాలి ఈసారి కంది పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయి. అందువల్ల కందికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మరింత పెంచాలి. అలాగే నిబంధనలు పక్కన పెట్టి రైతుల వద్ద కందులన్నీ కొనుగోలు చేయాలి. లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికీ జిల్లాలో మూడు కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేశారు. మిగతా ప్రాంతాల్లోనూ వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. –నాగరాజు, బీజీహళ్ళి, రొళ్ల మండలంనిబంధనలు సరికాదు కంది పంట చివరి దశలో ఉండగా... తుంపర వర్షాలు పడి నాణ్యత లోపించింది. అలాగే కందులు ఆరబోసినప్పుడు ఆకాల వర్షాలు కురిసి తేమ శాతం పెరిగింది. ప్రభుత్వం మాత్రం కంది కొనుగోళ్లకు పలు నిబంధనలు విధించింది. దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా పాలకులు స్పందించి నిబంధనలు పక్కన పెట్టి రైతులు పండించిన కందులన్నీ కొనుగోలు చేయాలి. –జనార్దన్‌రెడ్డి, జీగొల్లహట్టి, రొళ్ల మండలం -
మాతాశిశు మరణాలు అరికట్టాలి
ప్రశాంతి నిలయం: మాతాశిశు మరణాలను పూర్తిగా అరికట్టాలని, ఇందుకు వైద్య, ఆరోగ్య, ఐసీడీఎస్ శాఖలు సమష్టిగా పనిచేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో మాతాశిశు మరణాలపై ఆయన సమీక్షించారు. గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగిన మతాశిశు మరణాల గురించి చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకూ ప్రతి ఆశ, ఆరోగ్య కార్యకర్త, హెల్త్ సూపర్వైజర్ నిరంతరం వారికి అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ఆరోగ్య వివరాలు సేకరించాలన్నారు. అలాగే ఐసీడీఎస్ సిబ్బంది పౌష్టికాహారం అందిస్తూ రక్తహీనత లేకుండా చూసుకోవాలన్నారు. అలాగే ప్రతి ఆశ డే మీటింగ్‌లోనూ గర్భవతులకు ‘బర్త్‌ప్లాన్’ గురించి, ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ గురించి వివరించాలన్నారు. ఏ తల్లీ జన్మనిస్తూ మరణించకూడదు, ఏ బిడ్డా జన్మిస్తూ మరణించకూడదన్న లక్ష్యంతో పని చేయాలన్నారు. గడిచిన త్రైమాసికంలో మాతృమరణాలు 4, శిశు మరణాలు 17 సంభవించాయని, వీటిపై ప్రత్యేకంగా చర్చించి కారణాలు వెలికితీయాలని సూచించారు. తిరిగి ఇలాంటి మరణాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం, డీసీహెచ్ఎస్ డాక్టర్ తిప్పేంద్ర నాయక్, డీఐఓ డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మంజువాణి, డాక్టర్ సెల్వియా థామస్, ఐసీడీఎస్ పీడీ వరలక్ష్మితోపాటు పలువులు వైద్యులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్ చేతన్ -
No Headline
మడకశిర వద్ద సాగు చేసిన కంది పంట(ఫైల్)కంది రైతుపై సర్కార్ కనికరం చూపడం లేదు. ఆరుగాలం శ్రమించి.. ప్రకృతిని ఎదురించి కంది సాగుచేసినా... పంట కొనుగోలులో ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు విధించింది. పేరుకు మద్దతు ప్రకటించినా.. కొనేందుకు మాత్రం కొర్రీలు పెడుతోంది. వరుస తుపాన్లతో కంది తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిసీ.. తేమశాతం పేరుతో రైతును నిండా ముంచేందుకు సిద్ధమైంది. పేరుకు మూడు చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతుల నుంచి 100 క్వింటాళ్లు కూడా సేకరించలేదు. -
ఆయుధ వినియోగంపై నైపుణ్యాలు పెంపొందించుకోండి : ఎస్పీ
పుట్టపర్తి టౌన్: విధుల్లో భాగంగా వినియోగించే ప్రతి ఆయుధం పనితీరు, దాని నిర్వహణపై నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సిబ్బందికి ఎస్పీ రత్న సూచించారు. బుక్కపట్నం మండలం చండ్రాయునిపల్లి సమీపంలో మొబలైజేషన్ ఫైరింగ్ మైదానంలో ఏఆర్ పోలీసులకు నిర్వహిస్తున్న ఫైరింగ్ ప్రాక్టీసును మంగళవారం ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, ఏఆర్ డీఎస్పీ విజయకుమార్, ఆర్ఐలు వలి, మహేష్, ఎస్బీ ఎస్ఐ ప్రదీప్‌కుమార్, ఆర్ఎస్ఐలు ప్రదీప్‌సింగ్, వీరన్న, మహష్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. పట్టు పురుగులపై విషప్రయోగంమడకశిర రూరల్: మండలంలోని దొడ్డేపల్లి గ్రామంలో పట్టు పరుగుల చంద్రికలపై విష ప్రయోగం జరిగింది. సోమవారం సాయంత్రం చంద్రికలను శుభ్రం చేసి షెడ్ బయట ఉంచినప్పుడు గిట్టని వారు విష ప్రయోగం చేసి ఉంటారని బాధిత రైతు శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం చంద్రికల్లోకి వదిలిన పట్టు పురుగులు కాసేపటికే చనిపోయాయన్నారు. ఘటనతో రూ.1.30 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పట్టు పరిశ్రమ శాఖ ఏడీ రాజు... దొడ్డేపల్లిలోని బాధిత రైతు మల్బరీ షెడ్‌ను పరిశీలించారు. విష ప్రయోగం కారణంగానే పట్టుపురుగులు మృతి చెందాయని నిర్ధారించారు. కారు బోల్తా .. మహిళ మృతిగుత్తి రూరల్: కారు బోల్తాపడిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన శ్రీలత (38), తన కుటుంబంతో కలసి హైదరాబాదులో స్థిరపడ్డారు. బంధువుల ఇంట శుభకార్యం ఉండడంతో మంగళవారం ఉదయం కారులో హైదరాబాద్ నుంచి కదిరికి బయలుదేరారు. గుత్తి మండలం పోదొడ్డి వద్దకు చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఘటనలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న శ్రీలతను స్థానికులు వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. స్వల్ప గాయాలైన వారికి చికిత్స అందజేశారు. ఘటనపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
వివాహ వేడుకలో అపశ్రుతి
గుత్తి: వివాహ వేడకలో మర్యాదల విషయంగా ఘర్షణ చోటు చేసుకుని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు... గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లి గ్రామంలో సోమవారం రాత్రి వివాహ వేడుక మొదలైంది. ఈ క్రమంలో తాంబూలం అందిపుచ్చుకునే విషయంలో కిష్టిపాడుకు చెందిన కొందరు గుత్తికి చెందిన వారితో ఘర్షణ పడ్డారు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి పరస్పర దాడులు చేసుకున్నారు. ఘటనలో మాబు, ఆసీఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
కూలీలు, దళితుల సమస్యలు పరిష్కరించాలి
ప్రశాంతి నిలయం: ఉపాధి కూలీలు, దళితుల సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ ఎదుట మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు, దళితులు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న మాట్లాడారు. ఈ నెల 8 నుంచి 27వ తేదీ వరకు జిల్లాలోని పలు మండలాల్లో చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో దళితుల సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు. గోరంట్ల, ముదిగుబ్బ, పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం, చిలమత్తూరు, సోమందేపల్లి, రొద్దం మండలాల్లోని దళితులకు శ్మశాన వాటికలు లేవన్నారు. కొన్ని దళితుల వాడల్లో నేటికీ పూరి గుడిసెలే కనిపిస్తున్నాయన్నారు. వీరికి తక్షణమే నివేశన స్థలాలు మంజూరు చేసి, పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలన్నారు. ఉన్న ఊళ్లలో పనులు లేకపోవడంతో బతుకు తెరువు కోసం ఇతర రాష్ట్రాలకు ఉపాధి కూలీలు వలస పోతున్నారన్నారు. వలసల నివారణకు చర్యలు చేపట్టి ఉపాధి కూలీలకు పని ముట్లు అందజేయడంతో పాటు రోజు వారీ కూలి రూ.400 చెల్లించాలని, 150 రోజుల పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఈఎస్ వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, కోశాధికారి వెంకటేష్, ఉపాధ్యక్షుడు అంజనేయులు, కమిటీ సభ్యులు స్వర్ణలత, రమాదేవి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు హనుమయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట వ్యవసాయ కూలీల ధర్నా -
రైలు ఢీకొని మహిళ మృతి
గార్లదిన్నె: ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నెకు చెందిన గౌరి (40) మంగళవారం వ్యక్తిగత పనిపై కల్లూరు గ్రామానికి వెళ్లింది. ఈ క్రమంలో రైలు పట్టాల పక్కన నడుచుకుంటూ వెళుతున్న సమయంలో శరవేగంగా ఓ రైలు దూసుకెళ్లింది. ఆ సమయంలో రైలు వేగం ఆమెను లాగేయడంతో రైలు బోగీ తగిలి తీవ్ర గాయాలతో పట్టాల పక్కన పడింది. అటుగా వెళుతున్న వారు గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఘటనపై ఎస్ఐ గౌస్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ప్రమాదంలో యూపీ వాసి మృతి
గోరంట్ల: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో యూపీకి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు... ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కొందరు పాలసముద్రం వద్ద ఉన్న నాసిన్ అకాడమీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తన బంధువు రవి ఇంటికి ఇటీవల యూపీకి చెందిన జిందూయాదవ్ కుమారుడు ఆనంద్ యాదవ్ (18) వచ్చాడు. మంగళవారం ఉదయం అకాడమీ వద్దకు ద్విచక్ర వాహనంపై బయలుదేరిన ఆనంద్‌యాదవ్ మార్గమధ్యంలో నియంత్రణ కోల్పోవడంతో డివైడర్‌ను ఢీకొని కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను అటుగా వెళుతున్న వారు గుర్తించి వెంటనే హిందూపురంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక ఆనంద్‌యాదవ్ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
అట్టహాసంగా ‘పాలిటెక్నిక్’ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
విశాఖ స్పోర్ట్స్: కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహిస్తున్న 27వ ఇంటర్ పాలిటెక్నిక్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన 720 మంది బాలురు, 510 మంది బాలికలు అథ్లెటిక్స్‌తో పాటు ఆరు క్రీడాంశాల్లో పోటీపడనున్నారు. వాలీబాల్, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్, టీటీ, చదరంగంతో పాటు అఽథ్లెటిక్స్ ట్రాక్, ఫీల్డ్ అంశాల్లోనూ మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలో 138 ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్స్కు చెందిన విద్యార్థులు ప్రాంతీయ జట్లుగా తలపడనున్నారు. ఆయా జట్ల సభ్యుల నుంచి అతిథులు గౌరవవందనాన్ని స్వీకరించారు. డిఫెండింగ్ చాంప్ కృష్ణా జట్టు నుంచి ఆతిథ్య జట్టు విశాఖతో సహా 13 రీజియన్ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. కృష్ణా జట్టుకు జయకుమార్, అనంతపురానికి మహేష్, చిత్తూర్‌కు గిరిబాబు, తూర్పుగోదావరికి చిరంజీవి, గుంటూరుకు దేముడు, కడపకు హేమంత్‌రెడ్డి, కర్నూలుకు త్రిమూర్తి, నెల్లూరుకు తరుణి, ప్రకాశంకు నిఖిల్, శ్రీకాకుళానికి శివరామకృష్ణ, విజయనగరానికి లక్ష్మి, పశ్చిమగోదావరి జట్టుకు అవినాష్, విశాఖ జట్టుకు హేమంత్ కంటింజెంట్ లీడర్‌గా వ్యవహరించారు. క్రీడా జ్యోతి వెలిగించిన అనంతరం ఆయా జట్ల కెప్టెన్లు ప్రతిజ్ఞ చేశారు. అతిఽథులు శాంతికపోతాలను గాల్లోకి విడవగా ముఖ్యఅఽతిథి మీట్ ప్రారంభాన్ని ప్రకటించారు. గేమ్స్ బాలుర విభాగంలో అప్పర్పూల్లోని అనంతపురం రీజియన్‌తో కర్నూలు రీజియన్ జట్ల మధ్య వాలీబాల్పోటీని...అథ్లెటిక్స్ ట్రాక్ ఈవెంట్లో భాగంగా బాలబాలికలకు 800 మీటర్ల పరుగును ప్రారంభించారు. అథ్లెటిక్స్‌లో బాలబాలికలకు స్ప్రింట్ అంశాలతో పాటు 800 మీటర్ల పరుగు, జంప్స్, త్రోస్ నిర్వహించనుండగా బాలురకు 1,500 మీటర్ల పరుగు, వంద, 400 మీటర్ల రిలే పరుగును నిర్వహించనున్నారు. క్రీడలతో ఆరోగ్యం క్రీడాపోటీలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పి.రఘువర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. భారత్ శక్తి యువతేనని, సాంకేతికతను అందిపుచ్చుకుని మరింత ముందుకు సాగాలని సూచించారు. గౌరవ అతిథిగా హాజరైన సాంకేతిక విద్య సంయుక్త సంచాలకుడు వి.పద్మారావు మాట్లాడుతూ ఏటా ఒక్కో రీజియన్‌లో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గతేడాది అనంతపురంలో నిర్వహిస్తే ఈసారి విశాఖలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో విజేతలు దక్షిణ భారతంలోని అంతర రాష్ట్ర పాలిటెక్నిక్ ఆటల పోటీలకు అర్హత సాధిస్తారన్నారు. విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ నారాయణరావు, కాకినాడ, తిరుపతి ప్రాంతాయ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ, నిర్మల కుమార్ ప్రియ, సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి జీవీ రామచంద్రరావు, డిప్యూటీ డైరెక్టర్ విజయ భాస్కర్, సాంకేతిక విద్యాశాఖ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంటు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ, స్పోర్ట్స్ మీట్ సహ సమన్వయాధికారి డాక్టర్ బి.జానకీరామ్, వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. 13 జిల్లాల నుంచి హాజరైన పాలిటెక్నిక్ విద్యార్థులు అథ్లెటిక్స్‌తో పాటు ఆరు క్రీడాంశాల్లో పోటీ -
పట్టాలు తప్పిన ఎలక్ట్రిక్ రైలింజిన్
గుంతకల్లు: స్థానిక విద్యుత్ లోకో షెడ్ నుంచి రైల్వే స్టేషన్లోకి వస్తున్న ఎలక్ట్రిక్ రైలింజన్ పట్టాలు తప్పింది. వివరాలు... మంగళవారం సాయంత్రం యలహంక–కాచిగూడ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలుకు అనుసంధానం చేసేందుకు విద్యుత్ లోకోషెడ్ నుంచి రైలింజన్‌ను ప్టాల్ఫారం ఒకటిపైకి లోకో పైలెట్ తీసుకొస్తుండగా ఆర్సీడీ సమీపంలోని పాయింట్స్ వద్ద పట్టాలు తప్పింది. మూడు చక్రలు కిందికు దిగాయి. అప్రమత్తమైన లోకో పైలెట్ వెంటనే ఇంజన్‌ను ఆపేశాడు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్, ఇంజనీరింగ్. ఇతర్రత విభాగాల సిబ్బంది అక్కడకు చేరుకున్ని కొన్ని గంటలు పాటు శ్రమించి రైలింజన్‌ను యథాస్థానానికి చేర్చి ముందుకు కదిలించారు. లూప్లైన్లో ఈ ఘటన జరగడం వల్ల రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలుగలేదు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి : ఎస్టీయూ పుట్టపర్తి టౌన్: ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఎస్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం డీఈఓ కార్యాలయ ఏడీ రామకృష్ణకు వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. హిందూపురం పరిధిలోని రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలగా ఉన్నతీకరించాలని, ప్రసుత్తం బీఈడీ చేస్తున్న క్షాత్రోపాధ్యాఉలకు టీచింగ్ ప్రాక్టీస్‌కు అననుమతించాలన్నారు. అలాగే ఇండక్షన్ ట్రైనింగ్‌కు హాజరైన 2018 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న మోడల్ ప్రైమరీ పాఠశాలలకు హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలన్నారు. వాయిదా పడిన భాషాపోధ్యాయుల పద్యోన్నతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనంకి చంద్రశేఖర్, ఆర్థిక కార్యదర్శి గోపాల్‌నాయక్, నాయకులు షఫీవుల్లా, వంశీ, శ్రీనివాసులు, అనిల్‌కుమార్ పాల్గొన్నారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించాలిధర్మవరం రూరల్: ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు ఆర్ఐఓ సురేష్‌బాబు సూచించారు. మంగళవారం ఆయన ధర్మవరంలోని ప్రభుత్వ బాలికల కళాశాలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో విద్యా విషయాలపై ముచ్చటించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బండి వేణుగోపాల్, ప్రిన్సిపాల్ లక్ష్మీకాంతరెడ్డి, విద్యార్థినులు పాల్గొన్నారు. వ్యక్తిపై కేసు నమోదు కదిరి టౌన్: వివాహితను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. కదిరిలోని ఓ మైనారిటీ కాలనీలో నివాసముంటున్న వివాహిత టైలరింగ్‌తో కుటుంబాన్ని పోషించుకుంటోంది. పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్న ఆమె వ్యాపార నిమిత్తం సంఘంలో రూ.4 లక్షల వరకు రుణం తీసుకుంది. అయితే ఈ మొత్తానికి సంబంధించి కంతులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న చింతకుంట మాబు.. ఆమెను లోబర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. రుణం కంతులు తాను చెల్లిస్తానని, అయితే తన కోరిక తీర్చాలంటూ తరచూ వేధించసాగాడు. వేధింపులు తారాస్థాయికి తీసుకెళ్లి తన కోరిక తీర్చకపోతే ఆమె ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు చింతకుంట మాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
భర్త మందలింపు.. భార్య ఆత్మహత్య
అనంతపురం: భర్త మందలింపుతో మనస్తాపం చెంది భార్య ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు... ఎన్పీ కుంట మండలం వడ్డిపల్లి గ్రామానికి చెందిన రమణయ్య కుమార్తె అశ్విని (25)కి అదే గ్రామానికి చెందిన ఎం.వెంకటరమణ కుమారుడు గంగాధర్‌తో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూడేళ్ల క్రితం గంగాధర్ కువైట్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో కుటుంబపోషణకు భర్త సంపాదన సరిపోదని భావించిన అశ్విని... అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో కేవీఆర్ కన్స్ట్రక్షన్ ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ కూలి పనులతో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన ఆమె ఈ నెల 24న వడ్డిపల్లిలోని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఈ నెల 25న కువైట్ నుంచి గంగాధర్ ఫోన్ చేసి అశ్వినితో మాట్లాడాడు. ఆ సమయంలో ఆమె ఇంకా అనంతపురానికి వెళ్లకపోవడంతో తీవ్ర స్థాయిలో మందలించాడు. దీంతో ఆమె అనంతపురానికి చేరుకుంది. అప్పటి నుంచి తరచూ ఇద్దరూ ఫోన్లోనే గొడవ పడుతూ వచ్చారు. సోమవారం పలుమార్లు గంగాధర్ ఫోన్ చేసినా అశ్వని సమాధానం ఇవ్వలేదు. దీంతో తన బంధువు తిరుమలేష్‌కు ఫోన్ చేసి అశ్వినితో మాట్లాడాడు. ఫోన్ ఎత్తడం లేదంటూ దుర్భాషలాడాడు. దీంతో క్షణికావేశానికి లోనైన ఆమె మంగళవారం ఇంట్లోని ఎలుకల మందును నీటిలో కలుకుని తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించిక ఆమె మృతి చెందింది. ఘటనపై నాల్గో పట్టణ పోలీసులు కేసు నమోదుచేశారు. -
అప్పట్లో పింఛన్‌దారు చనిపోతేనే..
జిల్లాలో మొత్తం మండలాలు : 32 గ్రామ సచివాలయాలు : 420 వార్డు సచివాలయాలు : 124 రేషన్‌కార్డుల సంఖ్య : 5,62,784 పింఛన్‌దారుల సంఖ్య : 2,70,853కొత్త రేషన్‌కార్డుల కోసం పేదలు ఎదురు చూస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో వేలాది మందికి పెళ్లిళ్లు అయ్యాయి. ఉమ్మడి కుటుంబం నుంచి వేరుపడి బయటకు వచ్చిన వారూ ఉన్నారు. రేషన్‌కార్డులోని కుటుంబ సభ్యుల్లో ఎంతోమంది వివిధ కారణాలతో మరణించారు. ఈ క్రమంలో కార్డులో సభ్యుల తొలగింపు.. కొత్తగా రేషన్‌కార్డుల కోసం వేలాది మంది సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇక వితంతువులు, ఒంటరి మహిళలు పెరిగిపోయారు. వీరితో పాటు ప్రమాదాల్లో కాళ్లు, చేతులు, కన్ను కోల్పోయిన వారు ఉన్నారు. వీరంతా పింఛన్ల కోసం సచివాలయ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు అని అందరూ ప్రశ్నిస్తున్నారు.● కొత్త పింఛన్లు, రేషన్‌కార్డుల కోసం ఎదురుచూపు ● నేటికీ తెరుచుకోని పింఛన్ల వెబ్సైట్ ● అధికారులు, నాయకుల చుట్టూ అర్హుల ప్రదక్షిణలు ధర్మవరం రూరల్: ‘కొత్తగా పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. ఇప్పుడిప్పుడే పింఛన్లు ఇవ్వాలంటే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి. రోజూ కార్యాలయాల చుట్టు తిరిగినా ప్రయోజనం ఉండదు. ప్రభుత్వం కొత్త ఫించన్ల కోసం ఎప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేస్తుందో అప్పుడు రండి. అప్పటి వరకూ మీరు మా చుట్టూ తిరగొద్దు’ అంటూ అధికారులు, నాయకులు అంటుంటే అర్హులు తీవ్ర మానసిక వేదనకు లోనవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా... నేటికీ కొత్త పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ మొదలు కాలేదు. అలాగే కొత్తగా పెళ్లి చేసుకున్న వారు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అర్హత ఉన్నా ఎదురుచూపులే... అర్హులైన వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు కొత్త పింఛన్ల కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి పెద్దలు ఇచ్చిన హామీపై నేటికీ స్పష్టత లేకపోవడంతో పలువురు పెదవి విరుస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పింఛన్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరుగుతూ వచ్చింది. దరఖాస్తు చేసుకున్న వారికి వలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే అర్హత పత్రాలను అందజేశారు. ఈ ప్రక్రియను గత ప్రభుత్వం నిరంతరం కొనసాగించింది. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. పింఛన్, రేషన్ కార్డు పొందేందుకు అన్ని అర్హతలున్నా.. ఎదురుచూపులు తప్పడం లేదు.పింఛన్లు తొలగించే కుట్ర 2014–19 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో గ్రామాలలో ఎవరైనా పింఛన్‌దారు చనిపోతే ఆ స్థానంలో మరొకరికి పింఛన్ ఇచ్చే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు మళ్లీ వస్తున్నాయని పింఛన్‌దారులు అంటున్నారు. పరిశీలన పేరుతో గ్రామాలలో అర్హులైన కొత్త మంది పింఛన్లను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొత్త పింఛన్ల మాట దేవుడెరుగు. ప్రస్తుతమున్న పింఛన్లను రద్దు చేసే కుట్రకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో పరిశీలన పేరుతో ఏరివేత ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. అన్ని అర్హతలు ఉన్న దివ్యాంగ పింఛన్‌దారులకు నోటీసులు ఇస్తున్నారు. జిల్లా కేంద్రంలో మరోసారి పరిశీలన చేయించుకురావాలని అధికారులు సూచిస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా 2,70,853 మంది లబ్ధిదారుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
కరెంటు లేక కష్టాలు
మడకశిర నియోజకవర్గంలో కరెంటు కష్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయానికి ఆరుగంటలే విద్యుత్ ఇస్తున్నారు. అది కూడా వేళాపాళా లేకుండా సరఫరా చేస్తున్నారు. ఇక లో ఓల్టేజీ సమస్యతో మోటార్లు కాలిపోతున్నాయి. ప్రస్తుతం పైర్లకు నీటి తడులు ఎంతో అవసరం. ఈ దశలో నీరు పెట్టకపోతే పైరు ఎదుగుదల దెబ్బతిని, దిగుబడులు తగ్గిపోతాయి. ఇప్పటికై నా అధికారులు వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి. – వనేష్,పీ బ్యాడగేర గ్రామం,అగళి మండలం -
3న ‘పురం’ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
హిందూపురం: మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. చైర్మన్ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ఈనెల 30వ తేదీన నోటిఫికేషన్, ఫిబ్రవరి 3వ తేదీ (సోమవారం) ఎన్నిక ఉంటుంది. 3వ తేదీ ఏదైనా సెలవు ఉన్నట్లయితే 4వ తేదీ (మంగళవారం) ఎన్నిక జరుపుకోవచ్చని ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంద్రజ రాజీనామాతో ఎన్నిక.. గత మున్సిపల్ ఎన్నికల్లో 38 వార్డులున్న హిందూపురం మున్సిపాలిటీలో వైఎస్సార్ సీపీ 30 వార్డుల్లో విజయం సాధించింది. టీడీపీ ఆరు స్థానాలకే పరిమితమైంది. ఒక స్థానంలో బీజేపీ, మరో స్థానంలో ఎంఐఎం అభ్యర్థులు గెలిచారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఇంద్రజ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. దీంతో వైస్ చైర్మన్‌గా ఉన్న బలరామిరెడ్డిని తాత్కాలిక చైర్మన్‌గా నియమించారు. ప్రస్తుతం చైర్మన్ స్థానం ఖాళీగా ఉన్న మున్సిపాలిటీలన్నింటికీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో హిందూపురం మున్సిపల్ చైర్మన్ స్థానం కోసం ఫిబ్రవరి 3వ తేదీ ఎన్నిక జరగనుంది. -
అంతటా ఆధిపత్య పోరే!
సాక్షి, పుట్టపర్తి రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరాక ఆయా పార్టీల నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువైంది. కొన్నిచోట్ల బీజేపీ, టీడీపీ నేతలు బాహాబాహీకి దిగుతుండగా..మరికొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలే రెండు వర్గాలుగా విడిపోయి కత్తులు దూసుకుంటున్నారు. ఇక కూటమిలో భాగమైనా తమను పట్టించుకోవడం లేదని జనసేన నేతలు తెగబాధపడిపోతున్నారు. అందరినీ సమన్వయపరచాల్సిన అమాత్యులూ అగ్గి రాజేస్తుండటంతో జిల్లాలో పరిస్థితి చేయిదాటుతోంది. నేతలు రోడ్డెక్కి ఘర్షణ పడుతున్న తీరు చూసి... ‘అభివృద్ధి చేయమని అధికారం ఇస్తే మీరు చేసే పని ఇదా’’ అంటూ జనం పెదవి విరుస్తున్నారు. ఎప్పుడూ కలిసి లేరు.. కూటమిలోని బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ఏనాడూ కలిసి లేరు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతి విషయంలోనూ ఆయా పార్టీల నేతల మధ్య విభేదాలు బయట పడుతున్నాయి. మద్యం దుకాణాల టెండర్లు, సాగునీటి సంఘం ఎన్నికలు, ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం, ఉద్యోగుల పోస్టింగులు, ప్రారంభోత్సవాలు, పార్టీలో చేరికలు.. ఇలా ప్రతి విషయంలోనూ విభేదాలు బట్టబయలు అవుతున్నాయి. రెండు రోజుల క్రితం ధర్మవరంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆదరణ లేక అసహనం.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అయినప్పటికీ.. ఆయన చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వస్తారు. దీంతో అక్కడ ఉన్న బీజేపీ, జనసేన నాయకులను పలకరించే దిక్కు లేదు. పుట్టపర్తిలోనూ అదే పరిస్థితి. సింధూరరెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా, ఆమె మామ పల్లె రఘునాథరెడ్డి అంతా తానై వ్యవహరిస్తున్నారు. ప్రతి సమావేశానికి హాజరవుతూ హడావుడి చేస్తున్నారు. దీంతో బీజేపీ, జనసేన కార్యకర్తలకు కేరాఫ్ అడ్రస్ లేకుండా పోయింది. కదిరిలో బీజేపీ తరఫున బడా నాయకులు ఉన్నప్పటికీ... ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌దే రాజ్యం.. రాజకీయం. దీంతో కదిరిలో కమలనాథులు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ, జనసేన నేతలు తమ్ముళ్లపై తీవ్ర అసహనంతో ఉన్నారు. అవసరమైతే కయ్యానికి కాలు దువ్వేందుకు సిద్ధమయ్యారు. మంత్రుల ఇలాకాల్లో కూటమి నేతల మధ్య పొసగని పొత్తు ధర్మవరం, పెనుకొండలో విమర్శల పర్వం మిగతా నియోజకవర్గాల్లో కత్తులు దూసుకుంటున్న తమ్ముళ్లు అధిపత్యం కోసం భౌతిక దాడులకూ సిద్ధమైన వైనం నేతల తీరుపై పెదవి విరుస్తున్న జనం రెండు రోజుల క్రితం ధర్మవరంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన చిత్రమిది. బీజేపీలో చేరికలను జీర్ణించుకోలేని టీడీపీ నేతలు ఆధిపత్య పోరుకు తెగబడ్డారు. కూటమి పార్టీల్లో సమన్వయం లోపించిందని చెప్పడానికి ఇదో ఉదాహరణ. తామంతా కలిసే పనిచేస్తున్నామంటూ నాయకులు గొప్పలు చెబుతున్నా... క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని స్పష్టంగా తెలుస్తోంది. ధర్మవరంతో పాటు పెనుకొండ, మడకశిరలోనూ ‘కూటమి’ పార్టీల నేతల మధ్య సఖ్యత లేనట్లు తెలుస్తోంది. ఇక పలు నియోజకవర్గాల్లో తమ్ముళ్ల మధ్యే ఆధిపత్య పోరు నడుస్తుండగా.. అభివృద్ధి కుంటుపడుతోంది. -
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
● కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం ● ధర్మవరం ఆస్పత్రి తనిఖీ ధర్మవరం అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ వైద్యులను ఆదేశించారు. సోమవారం ఆయన ధర్మవరం పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. ఆకస్మిక తనిఖీలు చేసి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తొలుత పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఎంత మంది డయాలసిస్ చేయించుకుంటున్నారని సూపరింటెండెంట్ మాధవిని ప్రశ్నించారు. ఆస్పత్రిలో 21 మంది డయాలసిస్‌కు నమోదు చేయించుకున్నారని, ప్రస్తుతం 16 మందికి డయాలసిస్ చేశామని ఆమె కలెక్టర్‌కు విన్నవించారు. అనంతరం కలెక్టర్ చేతన్... ఆస్పత్రిలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడి నుంచి కలెక్టర్ నేరుగా మార్కెట్యార్డులోనున్న ఈవీఎం గోడౌన్‌కు వెళ్లారు. గోడౌన్‌కు వేసిన సీల్‌ను పరిశీలించి భద్రతపై ఆరా తీశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మహేష్, తహసీల్దార్ నటరాజ్ తదితర అధికారులు ఉన్నారు. గోరంట్ల ఎస్ఐ సస్పెన్షన్ ● నార్శింపల్లి ఘటనలో నిర్లక్ష్యానికి ఎస్పీ చర్యలు పుట్టపర్తి టౌన్: గోరంట్ల ఎస్ఐ బాబును సస్పెండ్ చేస్తూ ఎస్పీ రత్న సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గోరంట్ల మండలం నార్శింపల్లి గ్రామంలో ఓ ప్రేమ వ్యవహారం.. తదనంతరం పరిణామాలకు ఎస్ఐని బాధ్యున్ని చేస్తూ ఎస్పీ చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గోరంట్ల మండలం నార్శింపల్లి గ్రామానికి చెందిన ఓ బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించాడు. కులాలు వేరుకావడంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని భావించిన ప్రేమజంట మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే వారి ఆచూకీ కనిపెట్టిన బంధువులు, కొందరు గ్రామస్తులు ప్రేమజంటను గ్రామానికి తీసుకువచ్చారు. అనంతరం యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టారు. ముఖంపై పేడ నీళ్లు చల్లి దాడి చేశారు. ఈ ఘటనను ఎస్పీ రత్న తీవ్రంగా పరిగణించి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శేఖర్, సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించారు. బాలికను తీసుకెళ్లిన యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ బాబును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి పుట్టపర్తి టౌన్: జిల్లాలో ఈడిగ, గౌడ, ఇతర ఉపకులాలకు కేటాయించిన 9 మద్యం షాపులకు ఫిబ్రవరి 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ జిల్లా అధికారి గోవిందనాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కల్లుగీత కులాల వారికి మద్యం షాపులు రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా, లాటరీ ద్వారా మొత్తం 9 షాపులు ఆయా వర్గాలకు కేటాయించినట్లు వెల్లడించారు. అర్హులైన వారు రూ.2 లక్షలు నాన్ రిఫండబుల్ చలానా, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, కుల ధ్రువీకరణ పత్రంతో ఫిబ్రవరి 5వ తేదీలోపు ఆన్లైన్లో హైబ్రిడ్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 6వ తేదీ దరఖాస్తుల పరిశీలన, ఉంటుందని, 7వ తేదీ కలెక్టరేట్లో లాటరీ తీసి దుకాణాలు కేటాయిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు పుట్టపర్తి సమీపంలోని ఉజ్వల ఫౌండేషన్ ఆవరణలో ఉన్న జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
కోతలతో రైతులకు ఇబ్బందులు
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కరెంటు ఎప్పుడు ఉంటుందో..ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. పంటలకు సకాలంలో నీరివ్వకపోతే రైతుల రెక్కల కష్టం వృథా మారుతుంది. అందుకే రైతులంతా సబ్స్టేషన్ల వద్ద ధర్నాకు దిగుతున్నారు. అయినా ఈ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దుర్మార్గం. అమరాపురం మండలంలోని శివరం విద్యుత్ సబ్‌స్టేషన్ పూర్తయినా ప్రారంభించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. – ఆనందరంగారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి -
విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయి
హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయి. వ్యవసాయానికి కూడా సరిగా సరఫరా ఇవ్వకపోవడంతో బోరుబావుల కింద సాగులో ఉన్న పంటలు ఎండుముఖం పడుతున్నాయి. నేను కూడా బోరుకింద పంటసాగు చేస్తున్నా. విద్యుత్ సరఫరా సరిగా లేక బోర్లు ఆడక పంటకు సరిగా నీరు పెట్టలేకపోతున్నా. సోమవారం కూడా విద్యుత్ వేళల్లో మార్పు చేశారు. తెల్లవారుజామున సరఫరా ఇవ్వడం వల్ల రైతులకు ఇబ్బందులు కలిగాయి. – ప్రవీణ్ కుమార్, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు -
మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలి
ప్రశాంతి నిలయం: ఫీజుల కోసం వేధిస్తూ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న నారాయణ విద్యాసంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అలాగే విద్యాసంస్థల అధినేత నారాయణను మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. సోమవారం ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, తన విద్యాసంస్థల్లోని విద్యార్థులు తరచూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, మంత్రి నారాయణ కనీసం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. ఫీజుల కోసం వేధించడం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు తెగిస్తున్నారన్నారు. అన్నీ తెలిసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఆ విద్యాసంస్థల అధినేత నారాయణ... మంత్రిగా ఉండటం వల్లే అధికారులు చర్యలకు వెనుకంజ వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. కనీస సౌకర్యాలు, అనుమతుల లేకుండానే ప్రయివేట్ విద్యాసంస్థలు నిర్వహిస్తున్నా అధికారులు చోద్యం చేస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్, జిల్లా కార్యదర్శి నాగార్జున, ఉపాధ్యక్షుడు బాబావలి, పవన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహేంద్ర, కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సహాయ కార్యదర్శి సాయి గౌతం, ఉపాధ్యక్షుడు హరి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘాల నిరసన -
జవాబుదారీతనం పెరగాలి
ప్రశాంత నిలయం: ‘‘అధికారుల్లో జవాబుదారీ తనం పెరగాలి. ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత శ్రద్ధగా పనిచేయాలి. అప్పుడే ప్రజల్లో వ్యవస్థపై నమ్మకం ఏర్పడుతుంది. ఇందుకోసం ఆయా శాఖల అధిపతులు నిబద్ధతతో పనిచేయాలి. సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి. అప్పుడు ఆయా శాఖల్లోని కిందిస్థాయి ఉద్యోగులూ క్రమశిక్షణతో పనిచేస్తారు. సమష్టిగా పనిచేస్తే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు’’ అని కలెక్టర్ చేతన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 196 అర్జీలను అందగా, వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీలను క్షుణ్ణంగా చదివి అర్జీదారులు సంతృప్తి పడేలా సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. అర్జీల పురోగతిని ముఖ్యమంత్రి కార్యాలయం నిరంతరం ఆరా తీస్తుందని, ఈవిషయాన్ని గుర్తించి అధికారులు అర్జీల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం మండల ప్రత్యేక అధికారులు ఆధ్వర్యంలో చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్ఓ విజయ సారథి, డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, ఆర్డీఓ సువర్ణ, పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ పద్మావతి, ఆ శాఖ జీఎం నాగరాజు, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, ల్యాండ్ సర్వే ఏడీఈ విజయశాంతి బాయి, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ తిప్పేంద్ర నాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్ రావు, డీఎంహెచ్ఓ ఫిరోజ్ బేగం, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలి అధికారులకు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు 196 అర్జీలు