AP Special
-
శివయ్య ప్రీతికి ‘శంఖు’ నాదం : దంపతులకు అవార్డు
రాజమహేంద్రవరం రూరల్: శివయ్యను ప్రసన్నంచేసుకునేందుకు భక్తులు అనేకమార్గాలను అనుసరిస్తారు. శంఖాన్ని ఏకబిగిన పూరిస్తూ మహాదేవుడిని ఆనందింపచేస్తారు మరికొందరు. శ్వాసను బిగించి ఏకధాటిగా దాదాపు ఇరవై నిముషాల పాటు శంఖాన్ని పూస్తూ తమ భక్తిని ప్రదర్శిస్తున్న ఎస్పీఎఫ్ కమాండెంట్ నర్సింహరావు, అలివేలు మంగాదేవి దంపతులకు ఆధ్మాత్మిక సంపూర్ణత్వంతో పాటు, భౌతికంగా కూడా అవార్డులు వరిస్తున్నాయి. వీరు చేసే ఆధ్యాత్మిక సేవ అవార్డుల కోసం కాకపోయినప్పటికీ శంఖనాదంలో వీరి నిపుణతకు హైదరాబాదుకు చెందిన విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ కామధేను –2024 అవార్డ్స్‌లో భాగంగా జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. ఆదివారం (డిసెంబరు 14) హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో నరసింహారావు దంపతులు ఈపురస్కారాన్ని అందుకోనున్నారు.ఈ సందర్భంగా తమ ఆధ్యాత్మిక మార్గం, శంఖునాదం సాధన గురించి నర్సింహరావు మాటల్లో.. డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా పి.గన్నవరం తమ స్వగ్రామం. ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఏపి ప్రత్యేక రక్షణ దళం(ఏపీఎస్పీఎఫ్) కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నా. తన భార్య అలివేలు మంగాదేవి గృహిణి. తమకు శివుడు అంటే ఎనలేని భక్తి. తాను 1989లో పశ్చిమబెంగాల్ సిలిగురి ప్రాంతంలో సరిహద్దు భద్రత దళంలో పనిచేసే సమయంలో బెంగాలీ పూజారి చక్రవర్తి వద్ద శంఖం పూరించడంలో మెలుకువలు నేర్చుకున్నాను. అదే స్పూర్తితో తన భార్య మంగాదేవికి కూడా ఈ విద్యలో పట్టుసాధించారు. దీంతో తమకు ‘అఖండ శంఖారావ యుగళం’గా పేరొచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు, కేరళ,తమిళనాడు ,కర్ణాటక, డిల్లీ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో 35 ఏళ్లుగా సొంత ఖర్చులతో ఇంతవరకు నాలుగువేలకు పైగా కార్యక్రమాలు తమ శంఖారావంతో ఆరంభమయ్యాయంటారు ఈ దంపతులు ఇంకా గోదావరి,కృష్ణాపుష్కరాలు, ఇబ్రహీంపట్నం పవిత్ర నదీసంగమ అనుసంధానం వంటి పెద్దపెద్ద కార్యక్రమాల్లో శుభసూచికంగా అఖండ శంఖారావం పూరించాం. ఈసందర్బంగా పలు సంస్థల నుంచి గౌరవ డాక్టరేట్లు, అవార్డులు, సత్కారాలు, సువర్ణ ఘంటాకంకణాలు లభించాయన్నారు. ఇదంతా కేవలం సాధనతోనే సాధ్యమైందని, పదేళ్లపాటు దీన్ని సాధన చేశామని నరసింహారావు దంపతులు పేర్కొన్నారు. -
test Article
test Articletest Articletest Article -
16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
తెనాలి: తెనాలికి చెందిన 16 ఏళ్ల పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్ చిరు ప్రాయంలోనే ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ ఇంజనీర్‌గా అరుదైన ప్రతిభ సాధించాడు. అయితే గతంలోనే ఇతడు ఆసియాలోనే అతి పిన్నవయసు డేటా సైంటిస్ట్‌గా గుర్తింపు పొందాడు. హైదరాబాద్ ఐఐటీలో కొత్తగా ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బాధ్యతలు స్వీకరించాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రియమానస, రాజ్‌కుమార్ దంపతుల ఏకైక కుమారుడు సిద్ధార్థ. చిన్నతనం నుంచి కంప్యూటర్‌పై మక్కువ చూపడంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. నాలుగో తరగతి నుంచే కంప్యూటర్ బేసిక్స్, టెక్నాలజీ, లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. నాలుగైదేళ్లు గడిచేసరికి అడ్వాన్స్ లెవెల్‌కు చేరుకోగలిగాడు. సొంతంగా ఆన్లైన్లో కొన్ని నమూనా ప్రాజెక్టులు చేస్తూ, ఆన్లైన్ కోర్సులతో సిద్ధార్థ వాటిపై పట్టు సాధించాడు. మోంటెగ్న్ కంపెనీ సీఈవో సిద్ధార్థకు ఉద్యోగానికి ఆఫర్ చేశారు. ఆవిధంగా ఏడో తరగతిలో ఐటీ ఉద్యోగిగా నెలకు రూ.25 వేల వేతనంతో చేరాడు. తర్వాత ఇనిఫినిటీ లెర్న్ అనే సంస్థలో డేటా సైంటిస్ట్‌గా నెలకు రూ.45 వేల వేతనం అందుకుంటూ, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్లో వినూత్న గేమ్ డిజైనింగ్‌లో కృషిచేస్తున్నాడు. వారంలో మూడురోజులు పాఠశాలకు, మూడురోజులు ‘ఇన్ఫినిటీ లెర్న్’ ఐటీ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా చేస్తూనే, అమెరికన్ కంపెనీ ‘రైట్ ఛాయిస్’ తరపున అక్కడి విద్యార్థులకు కోడింగ్ క్లాసులు నిర్వహించాడీ బాలమేధావి.మార్చిలో జూనియర్ ఇంటర్ పూర్తిచేసిన సిద్ధార్థను బైజూస్ కంపెనీ ‘యంగ్ జీనియస్’ అవార్డుతో సత్కరించింది. ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి భూకంపాలను ముందుగానే గుర్తించడమనే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుకూ పనిచేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఐఐటీ కొత్తగా ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఆరంభించింది. గత వారం నిర్వహించిన ఇంటర్వ్యూలో మెషీన్ లెరి్నంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరుగా సిద్ధార్థకు అవకాశం కల్పించింది. -
సర్కారు ఊతంతో పూల బాట
నవరత్నాల పేరుతో రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేదల జీవితాల్లో వెలుగు రేఖలు నింపుతు న్నాయి. లక్షలాది మంది జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. తిరుపతి జీవకోనలోని రాఘవేంద్ర నగర్‌కు చెందిన వెంకటేష్, మునీశ్వరి కుటుంబమే ఇందుకు నిదర్శనం వెంకటేష్ 2019కి ముందు భవన నిర్మాణ సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తూ చాలీ చాలని ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తుండేవారు. పని దొరికిన రోజు వచ్చే కూలి రూ.400తో ఆ కుటుంబంలోని ఆరుగురు జీవించాల్సి వచ్చేది. ఆయన భార్య మునీశ్వరి గృహిణి. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ముగ్గురు పిల్లలను చదివించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు తప్ప ఎలాంటి పథకాలు అందలేదు. మునీశ్వరి అత్తమ్మకు పింఛన్ కూడా వచ్చేది కాదు. జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్లరిగే లా తిరిగినా ఫలితం లేకపోయింది. పిల్లలను చది వించగలమా అనే బెంగతో ఉండేవారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త ప్రవేశపెట్టిన నవరత్నాలతో ఆ కుటుంబానికి భరోసా లభించింది. వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, ముగ్గురు పిల్లలకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి, కుటుంబంలోని మునీశ్వరి అత్తమ్మకు వృద్ధాప్య పింఛన్ లభిస్తోంది. ప్రస్తుతం ఒక కుమార్తె ఇంజినీరింగ్ పూర్తి చేసింది, మరో కుమార్తె డిగ్రీ పూర్తి చేసింది. వీరిద్ధరూ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కూలిపని మానేసి చెన్నై నుంచి ముడిసరుకు తెప్పించుకుని గృహాలకు ప్లాస్టిక్ పూల తోరణాలు, దేవుని చిత్రపటాలకు అవసరమైన పలు రకాల రంగులతో మాలలు, ప్లాస్టిక్ పూలతో షోకేజ్ డెకరేషన్ బొకేలు తయారు చేస్తూ మరో ఆరు మంది మహిళలకు ఉపాధి కబ్ధి స్తున్నారు. –తిరుపతి సిటీ\తలసరి ఆదాయం పెరిగింది గతంలో నిరుపేద మహిళలు కూలి పనులు చేసుకుంటూ లేదా ఇళ్లల్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. పిల్లలను చదివించలేక పోవడంతో వారు షాపుల్లో పనులు చేసుకుంటూ మంచి భవిష్యత్తు కోల్పోయి జీవితాలను సర్వనాశనం చేసుకునేవారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నవరత్నాలు పేదల పాలిట వరాలుగా మారాయి. వారి జీవన ప్రమాణాలు పెరిగాయి. తలసరి ఆదాయం పెరిగింది. ఇది కాదనలేని నిజం. అమ్మ ఒడి, ఫీజురియింబర్స్‌మెంట్, విద్యాదీవెన, వసతి దీవెనతో పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు. –జి సవరయ్య, రిటైర్డ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతివైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మునీశ్వరి కుటుంబానికి కలిగిన లబ్ధి వైఎస్సార్ ఆసరా రూ.68,000 వైఎస్సార్ చేయూత రూ.75,000 జగనన్న విద్యాదీవెన రూ.28,000 వసతి దీవెన రూ.20,000 అమ్మ ఒడి రూ.30,000 సున్న వడ్డీ రూ.2,250 పింఛన్ కానుక రూ.96,000 మొత్తం రూ.3,19,250 -
సంక్షేమ సిరిమల్లిక
మదనపల్లె పట్టణం సుభాష్‌రోడ్డు వీధికి చెందిన రాజేంద్రప్రసాద్, నాగమల్లిక భార్యభర్తలు. చిన్నపాటి వ్యాపారం ద్వారా వచ్చే చాలీచాలనీ ఆదాయంతో కుటుంబాన్ని గడపాల్సి వచ్చేంది. వీరికి అమృత, వర్షిత ఇద్దరు కుమార్తెలు. పిల్లలను చదివించేందుకు ఆరి్థకంగా ఇబ్బందులు పడేవారు. రేషన్‌కార్డు తప్ప ఎటువంటి పథకాలు అందేవి కావు. నాగమల్లిక తెలిసిన వారి దగ్గర అప్పు చేసి సుభాష్రోడ్డులోనే చిరుతిళ్ల దుకాణం ప్రారంభించారు. వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబ పోషణ కష్టంగానే ఉండేది. దీనికి తోడు పిల్లల్ని గొప్పగా చదివించాలన్న కోరిక తీరేనా? అన్న బెంగ వెంటాడేది. ఇదంతా 2019కి ముందు పరిస్థితి. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేసిన సంక్షేమ పథకాలలతో ఆ కుటుంబానికి భరోసా కలిగింది. వైఎస్సార్ ఆసరా, ఇద్దరు పిల్లలకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి వస్తోంది. రూ.6 లక్షలు విలువ చేసే ఇంటి స్థలం ఇచ్చారు. ప్రస్తుతం పెద్ద కుమార్తె అమృత బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. చిన్న కుమార్తె హర్షిత డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.గతంలో కష్టాలు పడిన నాగమల్లిక కుటుంబం ప్రభుత్వ పథకాల ద్వారా సుభాష్రోడ్డులోనే ఓ షాపు పెట్టి అందులో చిరుతిళ్లు తయారు చేస్తున్నారు. నిప్పట్లు, చెక్కిలాలు, అత్తిరాసలు, మిక్చర్ వంటివి తయారు చేస్తూ హోల్‌సేల్‌గా అమ్ముతున్నారు. చిరుతిళ్ల తయారీలో 10 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. వీటిని తయారు చేసి షాపులో రిటైల్ అమ్మకాలతో పాటు పరిసర ప్రాంతాలకు హోల్‌సేల్ ధరకు సరఫరా చేస్తున్నారు. దీంతో వారి కుటుంబం ఆరి్థకంగా నిలదొక్కుకుంది. –మదనపల్లె జీవన ప్రమాణాలు పెరిగాయి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో చాలా మందిలో జీవన ప్రమాణాలు పెరిగాయి. తలసరి ఆదాయం పెరిగింది. ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా బలహీన వర్గాలకు అందిస్తున్న నిధులతో వారు సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు వీలవుతుంది. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెనతో పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుకుని స్థిరపడ్డారు. ఇది చాలా శుభపరిణామం. – జీఆర్ రుక్మిణి, పూర్వ ప్రిన్సిపాల్, మహిళా డీగ్రీ కళాశాల, మదనపల్లెవైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కలిగిన లబ్ధివైఎస్సార్ ఆసరా రూ.32,328 జగనన్న వసతి దీవెన రూ.23,350 జగనన్న విద్యాదీవెన రూ.41,201 సున్నా వడ్డీ రూ.2,850 అమ్మ ఒడి రూ.45,000 ఇంటి స్థలం రూ.6,00,000 -
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
మంచి ప్రభుత్వం అధికారం చేపడితే... మనసున్న నేత ముఖ్యమంత్రి పదవిలో ఉంటే కుటుంబాలు దశ ఏ విధంగా తిరగనుందోననడానికి ఉదాహరణ కొవ్వూరు మండలం వేములూరుకి చెందిన మారిశెట్టి సత్యనారాయణ బతుకు చిత్రం. పూరిపాకలోనే తుదివరకూ జీవితం కొడిగట్టిపోవల్సిందేమోననే వేదనతో ఆ కుటుంబం విచారవదనంతో ఉండేది. కానీ ఆ పాకలో క్రమేపీ వెలుతుర్లు విరజిమ్మాయి. ఆ మోములో చిరునవ్వులు చిందాయి. దీనికంతటికీ కారణం జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నవ వసంతాలు పూయించాయి. అదెలానో చూద్దాం. – కొవ్వూరు, తూర్పుగోదావరి జిల్లామూడు దశాబ్ధాలకు పైగా రోడ్డు మార్జిన్లో పూరిపాకలోనే సత్యనారాయణ కుటుంబ నివాసం. సొంత ఇల్లంటూ వీరికి లేదు. ఓ గూడు కల్పించాలంటూ ఎంతో మంది నాయకుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సొంతింటి కల సాకారమైంది. ఎవరి సిఫార్సులు లేకుండానే వలంటీర్ ఇంటికి వచ్చి వివరాలు తీసుకుని వెళ్లారు. ఆ వెంటే ఇంటి స్ధలం మంజూరైంది.ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల సాయం అందించారు. జీవితంలో సొంతంటి కల నెరవేరుతుందా అనుకున్న వారి బతుకుల్లోకి ముప్పై ఏళ్ల తర్వాత ఓ పొదిరిల్లు పలకరించింది. గీత కార్మిక వృత్తి చేసుకున్న ఆ ఇంటి యజమానికి రూ.3 వేలు గీత కార్మిక పింఛన్ మంజూరైంది. వయస్సు మీద పడిన సమయంలో ఆ సొమ్ము వారి కుటుంబానికి ఎంతో ఊరటనిస్తోంది. ఇప్పటి వరకూ రూ.1,40,750 అందుకున్నారు.సత్యనారాయణ భార్య గన్నెమ్మకి చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,500 చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.56.250 అందాయి. ఇంటి స్ధలం, ఇంటి రుణం అన్నీ కలిపి రూ.5.77 లక్షల లబ్ధి చేకూరింది. వారి మనవరాలికి అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు అందుతోంది. జగన్మోహన్రెడ్డి మేలు ఎప్పటికీ మరిచిపోలేమని వారు సంతోషంగా చెబుతున్నారు.చేయూత అందించారు ప్రభుత్వం 45 ఏళ్లు పైబడిన మహిళలకు అందించే చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,500 అందిస్తున్నారు. ఈ సొమ్ము నా కుటుంబానికి ఎంతో ఉపకరిస్తుంది. నా భర్త గీత కార్మికుడు. వయస్సు మీదపడడంతో పనులకు వెళ్లలేకపోతున్నాం. ఈ సొమ్ముతో ఏటా అందించడంతో మా కుటుంబానికి ఆసరాగా నిలుస్తోంది. సంక్షేమ పథకాల ద్వారా పేదల బతుకుల్లో భరోసా కల్పించారు. – మారిశెట్టి గన్నెమ్మ, వేములూరు, జగనన్న కాలనీ, కొవ్వూరు మండలంవైఎస్సార్సీపీ సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్ధి వైఎస్సార్ పింఛన్ కానుక రూ.1,40,750. వైఎస్సార్ చేయూత రూ.56,250 ఇంటి స్థలం విలువ రూ.2,00,000 ఇంటినిర్మాణానికి ఆర్థిక సాయం రూ.1,80,000 మొత్తం లబ్ధి రూ.5,77,000 -
ఆ బుర్రలో ‘సైతాన్’ తిష్ట ఫ్యాక్ట్ చెక్
రామోజీ మెదడును సైతాన్ శోధించింది. అందుకే దయ్యం పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం అబద్దాలు అచ్చు వేస్తూ చంద్రబాబు పాలన మొత్తం నీతివంతంగా జరిగినట్లు వక్రీకరిసు్తన్నారు. ‘పాపపు’ రాతలు రాస్తూ ప్రజల్ని ఏమార్చాలని చూస్తున్నారు. దీన్నే నిత్యం పనిగా పెట్టుకుని కల్లిబొల్లి మాటలతో అబద్ద ప్రచారం చేస్తున్నారు. ‘జీసస్’ కాలంలో ‘అబద్ద ప్రవక్తలు’ ఉండేవారు. ఇప్పుడు అచ్చు గుద్దినట్లు వారికి పదిరెట్లు ఎక్కువగా ‘ఈనాడు’ అబద్దాలను ప్రచారం చేస్తోంది. నిస్సిగ్గుగా నిజాలను తప్పులుగా రాస్తున్న రామోజీకి ప్రజాకోర్టులో ఆ ‘కరుణామయుడు’ శిక్ష వేయడం మాత్రం ఖాయం.(సాక్షి, అమరావతి) సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను ప్రకటించిన మేనిఫెస్టోను బైబిల్ అంత పవిత్రంగా భావించారు. అందుకే మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటీ చిత్తశుద్దితో అమలు చేసి చూపించారు. అంతకు ముందు మేనిఫెస్టోను చిత్తు కాగితంలా చూసిన చంద్రబాబు 600పైగా హామీలిచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదని రామోజీకి తెలియదా?. మేనిఫెస్టోను అమలు చేయని చంద్రబాబు దాన్ని టీడీపీ అధికారిక వెబ్సైట్ నుంచి కూడా తొలగించిన మాయల మరాఠీ. ఇప్పుడు జర్నలిజం విలువలకు శిలువేస్తూ రామోజీ నీతులు వల్లిస్తున్నారు.ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందిన సీఎం వైఎస్ జగన్‌పై రోజు ఏదో ఒకటి పచ్చి అబద్దాలతో అచ్చేస్తూ రామోజీ పైశాచికానందాన్ని పొందుతున్నారు. తాజాగా క్రైస్తవులకు టీడీపీ హయాంలో బాగా చేశారు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమి చేయలేదంటూ.. ‘హామీలకు శిలువ’ అంటూ అడ్డగోలు అబద్దాలతో రామోజీ వార్త అచ్చేయడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.ఆరోపణ: పాస్టర్లను బెంబేలెత్తించారువాస్తవం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పాస్టర్లకు గౌరవ వేతనం అందించి అండగా నిలిచింది. కోవిడ్ కష్టంలోను పాస్లర్లకు నెలకు రూ.5వేలు చొప్పున అందించి సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. ఈ ప్రభుత్వం నెలకు రూ.5వేలు చొప్పున 8,427 మందికి ఇప్పటి వరకు గౌరవ వేతనంగా రూ.71.10కోట్లు అందించింది. కోవిడ్ లాక్డౌన్ సమయంలో క్రిస్టియన్లతోపాటు పాస్టర్లకు కలిపి 29,841 మందికి కోవిడ్ అసిస్టెన్సీ వన్ టైమ్ గ్రాంట్‌గా రూ. రూ.14.90కోట్లు అందించింది. చంద్రబాబు తన హయాంలో ఏనాడు పాస్టర్లను పట్టించుకోలేదు. అయినా చంద్రబాబు కోసం రామోజీ దాసోహం అయిపోతున్నారు.ఆరోపణ: ఆర్థిక సాయం రెట్టింపు చేస్తామనివాస్తవం: పవిత్ర జెరుసలేం యాత్రకు గత టీడీపీ ప్రభుత్వం సాయం చేసినట్టు రామోజీ మసి పూస్తున్నారు. ఆయన హయాంలో నిధులు కేటాయించినట్టు చూపించినా సాయం అందించింది నామమాత్రమే. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకం కింద వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువ ఉన్న ప్రతి క్రైస్తవునికి రూ.60వేలు, రూ.3లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.30వేలు సాయాన్ని అందించింది. ఇప్పటివరకు 1,060 మంది లబ్ధిదారులకు రూ.591.60 లక్షలు నిధులు అందించారు.ఆరోపణ: సాయాన్ని కాదు..జాప్యాన్ని పెంచారు..వాస్తవం: గత ప్రభుత్వం సాయం చేసింది గోరంత అయినా రామోజీకి ఆనందంగా ఉంటుంది. నిరుపేద ఆడ పిల్లల పెళ్లికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ మింగుడు పడటంలేదు. వాస్తవానికి గత ప్రభుత్వం తోచినప్పుడు సాయం అందించేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా క్యాలెండర్( నిర్థిష్ట గడువు) ప్రకటించి ప్రతి మూడు నెలలకు (త్రైమాసికం) ఒకసారి పెళ్లి సాయాన్ని విడుదల చేస్తోంది. గతంలో దరఖాస్తు చేసుకోవాలంటే ఆపసోపాలు పడేవారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాయాల ద్వారా స్థానికంగా దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కలిగింది.దీంతో ఉన్న చోట నుంచే ధరఖాస్తు చేసుకోవడంతోపాటు ఆర్థిక సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలకు పొందుతున్నారు. గత ప్రభుత్వంలో బకాయిలు కాలానుగుణంగా విడుదల చేయలేదు. ఇప్పుడు వివాహం జరిగిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకుంటే మూడు నెలలకు ఒకసారి అప్పటి వరకు వచ్చిన దరఖాస్తులకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఆడ పిల్లల చదువులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో వివాహాలు చేసుకునే వారు కనీసం పదవ తరగతి విద్యార్హత ఉండాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. వారిని ఉన్నత చదువులు చదివించాలనే సీఎం వైఎస్ జగన్ ఉన్నతాశయం ఆచరణలో మంచి ఫలితాలు ఇస్తోంది.ఆరోపణ: పెళ్లి కానుక హుళక్కే..వాస్తవం: పేదల పెళ్లికి టీడీపీ ప్రభుత్వం అండగా నిలిచినట్టు రామోజీ అడ్డగోలుగా రాసేశారు. వాస్తవానికి పేద బిడ్డల పెళ్లికి సాయం అందించేలా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ‘మాస్ మ్యారేజ్’ పేరుతో ఆర్థిక సాయాన్ని అందించారు. క్రైస్తవ ఆడ బిడ్డల పెళ్లికి రూ.25వేల ఆర్థిక సాయం, కొత్త బట్టలతోపాటు పెళ్లి వస్తువులు అందించేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ పెట్టిన పథకాన్ని 2015లో ‘దుల్హాన్’ పథకంగా పేరు మార్చారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు హడావుడిగా 2018లో రూ.25వేల ఆర్థిక సాయాన్ని రూ.50వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.పెంచిన మొత్తాన్ని అందించకపోగా బకాయిలు పెట్టారు. చంద్రబాబు హయాంలో 2018 నుంచి జరిగిన 43,490 జంటల(పెళ్లిళ్లు)కు రూ.177.96 కోట్ల బకాయిలను చెల్లించలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ బకాయిలను విడుదల చేసి పేద బిడ్డలకు భరోసా ఇచ్చింది. అంతేకాకుండా ఆయా వర్గాలకు గతం కంటే రెట్టింపు చేసి మరీ సీఎం వైఎస్ జగన్ పెళ్లి సాయాన్ని అందిస్తుండటం విశేషం.ఆరోపణ: బీమా అమలులోను కుయుక్తులే..వాస్తవం: బీమా అమలు లేదంటూ రామోజీ కుయుక్తులతో కూడిన ఆరోపణలు చేశారు. వాస్తవానికి వైఎస్సార్ బీమా పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ సీఎం వైఎస్ జగన్ పేద వర్గాలకు అండగా నిలిచారు. కుటంబంలో ప్రధాన ఆధారమైన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా, వైకల్యానికి గురైనా ఆ కుటుంబం రోజువారీ గడవడం కష్టమని భావించి బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తోంది. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల లోపు వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు, శాశ్వత వైకల్యానికి గురైతే రూ.5లక్షలు, సహజ మరణమైతే రూ.లక్ష బీమా మొత్తాన్ని చెల్లిస్తోంది.ఆరోపణ: గ్రాంట్ ఇన్ ఎయిడ్‌నూ ఎగ్గొట్టారువాస్తవం: చర్చిల నిర్మాణం, ప్రహారీల ఏర్పాటుకు గత ప్రభుత్వం గొప్పగా చేసింది.. ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని రామోజీ బురదచల్లేశారు. వాస్తవానికి కొత్త చర్చిల నిర్మాణం, పాత చర్చిల మరమ్మత్తులు, పునరుద్ధరణ, అభివృద్ధి, ప్రహారీ, మరుగుదొడ్లు, మౌళిక వసతుల కోసం రూ.5 లక్షల సాయంతో పాటు శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.3 లక్షల నుంచి 5 లక్షలు చొప్పున నిధులు కేటాయించింది. ఇప్పటి వరకు 98 చర్చిలకు రూ.5.67కోట్లు నిధులు కేటాయించింది.ఐదేళ్లలో 24,304.37కోట్ల లబ్ది వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక క్రిస్టియన్ మైనార్టీలకు ఐదేళ్లలో నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందాయి. క్రిస్టియన్ మైనారిటీలకు డీబీటీ ద్వారా రూ.13,239.49కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో 11,064.88కోట్లు లబ్ధిని అందించింది. ఐదేళ్లలో మొత్తం రూ.24,304.37కోట్లు లబ్దిని చేకూర్చింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 1,82,270 మందికి రూ.416.56కోట్లు లబ్ది అందించింది. చంద్రబాబు ఓట్ల కోసం మాయ మాటలతో మభ్య పెడితే.. సీఎం జగన్ ప్రజల నమ్మకాన్ని పొందారు. -
FACT CHECK: బడుగులను ఏవగించుకునే బాబు రామోజీకి గొప్పోడు!
ఇంట్రో... మంచి మనిషికో మాట...మంచి గొడ్డుకో దెబ్బ ...అంటారు...రామోజీ దుర్మార్గపు రాతలపై ఎన్నిసార్లు వాస్తవాల హంటర్ ఝళిపించినా బజారుస్థాయి రాతలతో పత్రికను ఆసాంతం దిగజార్చుకుంటూనే పోతున్నారు...జగన్ ప్రభుత్వ వ్యతిరేకత అనే పూనకంలో కన్నూమిన్నూగాననంతగా తప్పుడు కథనాలను అచ్చేస్తున్నారు...విచక్షణాయుత పాత్రికేయానికి మంగళం పాడేసి దుష్ట పాత్రికేయం అంటే ఎలా ఉంటుందో పాఠకలోకానికి తన రాతల్లో చూపిస్తున్నారు...అన్నీ ఏకపక్ష కథనాలు... పవిత్ర పాత్రికేయ వస్త్రాన్ని తొలగించుకుని అక్షర దిగంబర నృత్యం చేస్తున్నట్లుగా ఉంది రామోజీ తీరు...ఈ కథనాలు ఎవరు చదివినా చదవకపోయినా బాబొక్కడు చదివితే చాలు తన జన్మ ధన్యమైపోతుందన్న మూర్ఖత్వంలో బొంకుల దిబ్బపై కూర్చుని బొంకుడు కథనాలను రాస్తున్నట్లుగా ఉంది...బడుగులను ఏవగించుకున్న బాబు రామోజీ దృష్టిలో గొప్పోడు..అయిదేళ్ల పాలనలో ఎస్సీ ఎస్టీ లకు అన్ని రంగాల్లోనూ అగ్రాసనం వేసిన జగన్ అంటే మంట...మంచి చేసిన జగన్ కన్నా జనాన్ని ముంచే బాబే రామోజీకి ఆదర్శం..ఈ వికృతధోరణిని నిలువెల్లా ఒంటబట్టించుకుని మంగళవారం ’నా..నా...నా..అని బాకా...చేసిందంతా ధోకా’ శీర్షికన జగన్ ప్రభుత్వంపై రాళ్లేస్తూ...ఓ తప్పుడు కథనాన్ని జనంపైకి వదిలారు...రామోజీ బుర్ర తక్కువ రాతలకు వాస్తవాల షాక్ ఇచ్చే సమాధానాలివి...సాక్షి, అమరావతిః చంద్రబాబుకు పదవీ ప్రయోజనం కోసం రామోజీ అబద్ధాల డోలు వాయించడం మానడం లేదు. వాస్తవానికి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ధోకా ఇచ్చింది చంద్రబాబేనని తెలిసినా రామోజీ దుర్మార్గ రాతల ధోరణి మాత్రం మారడంలేదు. రాష్ట్రంలో దళిత, గిరిజనులకు విద్యా, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవరత్నాలతో వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యమివ్వడంలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపింది. ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధితో పాటు అనేక విధాలుగా ఆదుకోవడంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్ద మనస్సును చాటుకుంది. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి దళిత, గిరిజనులకు సంక్షేమ పథకాలను రద్దు చేశారని, ఉపాధి అవకాశాలను దెబ్బతీశారనే తప్పుడు ప్రచారానికి ఈనాడు బరితెగించింది.పేదల అసైన్డ్ భూములను రాబందులా ఆక్రమించి ఫిలిం సిటీ కోట కట్టుకున్న రామోజీ నీతులు వల్లిస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు సర్కారు దళితులను భయపెట్టి భూములను కాజేసినా రామోజీ కళ్లప్పగించి చూశారు. వ్యవసాయ భూమి ఉన్న దళితులకు కనీసం మోటారు కనెక్షను అయినా ఇవ్వకపోయినా అది తప్పని ఏ రోజూ బాబుకు బుద్ధి చెప్పలేదు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల పేరుతో బాబు అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టబెట్టినా, ఎస్సీలకు దక్కాల్సిన కార్లు బినామీల పేరుతో టీడీపీ నేతలు దక్కించుకున్నా, ఈ ఎల్లో మీడియా పెద్దకు అక్షరం రాసేందుకు మనసొప్పలేదు.రామోజీ చేసిన ఆరోపణలు ఎంత నీచమైనవో చెప్పే వాస్తవాలివి... ఆరోపణః కొత్త వైద్య కళాశాలల్లో రిజర్వేషన్ల కోత వాస్తవంః కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కొత్తగా ఎంబీబీఎస్ సీట్లను సీఎం వైఎస్ జగన్ సాధించారు. 2023–24 విద్యా సంవత్సరంలో 5 వైద్య కళాశాలలు ప్రారంభించడం ద్వారా రాష్ట్రంలో ఒక్కసారిగా 319 కన్వీనర్ కోటా సీట్లు పెరిగాయి. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే సీట్లు దక్కించుకుని లబ్ధిపొందారు. మీ బాబు అధికారంలో ఉండగా ఏనాడైనా ఈ విధంగా అట్టడుగు వర్గాల పిల్లలకు మెడికల్ సీట్లను తెచ్చిపెట్టి మేలు చేశాడా రామోజీ? ఆరోపణః అవన్నీ సంక్షోభ వసతి గృహాలు వాస్తవంః సంక్షోభంలో వసతి గృహాలు అంటూ ఈనాడు మరో వక్రీకరణకు దిగింది.వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే సోషల్ వెల్ఫేర్ స్కూళ్ల మరమ్మతుల కోసం ఇప్పటికే రూ. 64.33 కోట్లు ఖర్చు చేసింది. 39 సివిల్ వర్కుల కోసం మరో రూ.133.90 కోట్ల మొత్తాన్నీ వెచ్చించింది. ఈ భవనాలన్నీ నిర్వహణలోకి వచ్చాయి. దాదాపు రూ.318 కోట్లతో 177 స్కూళ్లలో నాడు–నేడు పనులకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది, వసతి గృహాలను ఆధునికీకరించి మౌలిక వసతులు కల్పించింది. ఆరోపణః సివిల్స్‌లో శిక్షణకు విముఖత, పోటీలో నిలవకుండా కుట్ర వాస్తవంః నాడు–నేడు ద్వారా స్కూళ్లన్నీ సర్వాంగ సుందరంగా మారుతున్నాయి.పోటీ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ కోచింగ్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతుల్లో స్టడీ సర్కిళ్లున్నాయి. ఒక్కో స్డడీ సర్కిల్లో ఒక్కో మాదిరిగా సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్ టెస్ట్‌లకు శిక్షణ ఇస్తున్నారు. గత ప్రభుత్వం విద్యోన్నతి పథకం కింద 9,775 మంది అభ్యర్థులను శిక్షణ కోసం ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు పంపగా , ఒక అభ్యర్థి మాత్రమే ఎంపికైనా రామోజీ ఏరోజూ రాయలేదు. ఆ పథకాన్ని సవరించి సివిల్స్ సర్వీస్ పరీక్షకు ఏపీ స్టడీ సర్కిళ్లలోనే ఇప్పుడు కోచింగ్ ఇస్తున్నారు. ఇటీవలే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. మెయిన్స్‌కు అర్హత సాధిస్తే రూ.లక్ష , ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయినవారికి అదనంగా రూ.50 వేల చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించి అందిస్తోంది.పేద పిల్లలు ఉన్నత స్థానాలకు పోటీ పడి ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు అమెరికా వంటి సంపన్నదేశాలకు వెళ్లేందుకు ఊతమిస్తున్న సీఎం వైఎస్ జగన్‌పై రామోజీ విషం కక్కుతున్నారు. ఆరోపణః విదేశీ విద్యకు కొర్రీలు వాస్తవంః గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విదేశీ విద్యా పథకంలో జరిగిన లోపాలు, అవినీతి, అక్రమాలు విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి లోపాలు, అక్రమాలకు తావులేని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని తెచ్చింది. ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా, ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీటు సాధించిన వారికి పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించేలా పథకాన్ని సమున్నతంగా తీర్చిదిద్ది అమలు చేస్తోంది.అభ్యర్ధులు ఎంచుకోదగ్గ 21 కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్ఠంగా రూ.1.25 కోట్లు, ట్యూషన్ ఫీజు 100 శాతం చెల్లించేలా పథకాన్ని సమర్థంగా మార్చి ప్రభుత్వం అమలు చేస్తోంది. మిగిలిన వర్గాలకు రూ.కోటి లేదా అసలు ట్యూషన్ ఫీజు (ఏది తక్కువ అయితే అది) చెల్లిస్తోంది. ఈ స్థాయిలో విదేశీ విద్య కోసం గత ప్రభుత్వం భరోసా ఇవ్వగలిగిందా? మరి ఈనాడు ఈ పథకంపై పదేపదే ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తోందో రామోజీ పక్షపాత బుద్ధిని బట్టి ఇట్టే అర్థమవుతోంది.. ఆరోపణః స్వయం ఉపాధికి చెల్లు వాస్తవంః ఇస్త్రీ పెట్టె.. కత్తెర ఇచ్చి.. అదే స్వయం ఉపాధి పథకం అని గత టీడీపీ ప్రభుత్వం అర్భాటపు ప్రచారం చేసుకునేది. వాస్తవానికి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలను అన్ని విధాలుగా ఆదుకుని వారి జీవన ప్రమాణాలను పెంచేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశేష కృషి చేసింది.టీడీపీ హయాంలో స్వయం ఉపాధి పథకం కింద 2,02,414 మందికి రూ.2,726 కోట్లు, ఎస్టీలు 39,906 మందికి రూ.284.8 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా ద్వారా 23,27,682 మంది ఎస్సీలకు రూ.9,697.99 కోట్లు. 4,78,716 మంది ఎస్టీలకు రూ.1,895.37 కోట్ల లబ్ధి చేకూరింది. చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటుకు 6,256 మంది ఎస్సీలకు రూ.346.79 కోట్లు, 1,228 మంది ఎస్టీలకు రూ.65.90 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది.స్థిరమైన జీవనోపాధి, ఆర్థిక అభ్యున్నతి కోసం పౌర సరఫరాల సంస్థ ద్వారా 2020–21లో రాష్ట్ర ప్రభుత్వం రూ.133.67 కోట్లతో ఎస్సీ లబ్ధిదారులకు 2,300, ఎస్టీలకు 701 ఫోర్ వీలర్ మినీ ట్రక్ మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ వాహనాలను పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డోర్ డెలివరీ కోసం అందించింది.ఎన్ఎస్ఎఫ్డీసీ ద్వారా స్వయం ఉపాధి పథకంలో రూ.63.20 కోట్లతో 1,038 యూనిట్లను అమలు చేసింది. ఆరోపణః సాగుకు సెంటు భూమి ఇవ్వలేదు వాస్తవంః సాగుకు సెంటు భూమి ఇవ్వలేదని తప్పుడు రాతలు రాసిన ఈనాడు గత ప్రభుత్వం భూమి కొనుగోలు పథకానికి ఎంతమేర భూమి సేకరించిందనే విషయాన్ని రాయలేకపోయింది. దీన్నిబట్టే ఈ పథకాన్ని టీడీపీ ఎత్తేసిందనే సంగతి ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.దశాబ్దాల క్రితం భూమి కొనుగోలు కోసం ఎస్సీ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణాలన్నింటినీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మాఫీ చేసింది. ఆ భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించింది. ఎస్సీల జీవితాల్లో ఇది మైలు రాయిగా నిలిచిపోయింది. 22ఏ జాబితా నుంచి మినహాయింపుతో 14.223 దళిత మహిళలకు 16,213.51 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభించాయి. అసైన్ భూముల క్రమబద్ధీకరణతో 3,57,805 మందికి 5,37,719 ఎకరాలపై హక్కులు దక్కాయి. అవసరమైనప్పుడు భూములను విక్రయించడానికి ఎస్సీ మహిళా లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం పూర్తి హక్కులను కల్పించింది. ఎస్సీ మహిళా లబ్ధిదారులు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, వైఎస్ఆర్ జలకళ, పంటలబీమా సాయాన్నీ పొందే సౌలభ్యాన్నీ ఏర్పరిచింది.అసైన్డ్ భూముల డీనోటిఫికేషన్ తర్వాత, భూమి యజమానులు తమ భూములపై ఫ్రీహోల్డ్ హక్కులు పొందుతారు. పట్టా భూములతో సమానంగా తమ భూములను విక్రయించుకునే అవకాశాన్ని ప్రస్తుత ప్రభుత్వం కల్పించింది. గత ప్రభుత్వాల కంటే అత్యధికంగా ఎస్టీలకు ఏకంగా 2.47 లక్షల ఎకరాలకు పైగా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్ దేశంలోనే ఆదర్శంగా నిలిచారు. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంటి నిర్మాణాలకు గత ప్రభుత్వం ఒక్క సెంటు భూమినీ కొనుగోలు చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘పేదలందరికీ ఇళ్లు ’ కార్యక్రమంలో దళితులకు, ఎస్టీలకు బాసటగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 31.19 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు ఇస్తే , అందులో 6,36,732 మంది లబ్ధిదారులు దళిత వర్గాలకు చెందిన అక్క చెల్లెమ్మలే (మొత్తం లబ్ధిదారుల్లో 20.7 శాతం).ఆయా కుటుంబాలకు రూ.10,949 కోట్ల లబ్ధి చేకూర్చింది. వారి కోసం చేస్తున్న 4,18,646 ఇళ్ల నిర్మాణ రూపంలో మరో రూ.10,949 కోట్ల లబ్ధి చేకూరుతోంది. 1,41,496 మంది ఎస్టీ అక్కచెల్లెమ్మలు (మొత్తం లబ్ధిదారుల్లో 6 శాతం) ఉన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇంతటి లబ్ధి ఈ వర్గాలకు దక్కడం ఇదే ప్రథమం. ఇంత భారీస్థాయిలో దళితులకు ఏ ప్రభుత్వం అండగా నిలబడలేదు. ఆరోపణః బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్‌కు గండి వాస్తవంః ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రోత్సహించే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని నిర్వీర్యం చేసినట్టు ఈనాడు మరో వక్రీకరణకూ దిగింది. వాస్తవానికి కనీస ప్రమాణాలు పాటించని స్కూళ్లకూ బెస్ట్ అవైలబుల్ స్కీమును గత బాబు ప్రభుత్వం అమలు చేసింది.ఇప్పుడు ఆ స్కూళ్ల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువులు అందుతున్నాయి. అత్యుత్తమంగా తరగతి గదులను డిజిటలైజ్ చేస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందిస్తున్నారు. బైలింగ్యువల్ టెక్ట్స్బెక్స్, డిక్షనరీ, యూనిఫారం, షూలతో విద్యాకానుక అందిస్తున్నారు. నాడు–నేడు ద్వారా స్కూళ్లన్నీ ఆధునాతనంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే 15 వేల స్కూళ్లలో పనులు జరిగాయి. టోఫెల్ లాంటి కోర్సులనూ ప్రభుత్వం ఈ పిల్లలకు అందుబాటులోకి తెచ్చింది. పిల్లలంతా బడిలో ఉండాలనే ఏకైక ధ్యేయంతో ఎస్సీ చెందిన 8,84,131 మంది తల్లులకు రూ.15వేల చొప్పున రూ.5,335.70 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం అందించింది.2,86,379 ఎస్టీ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి ద్వారా రూ.1,714.76 కోట్లు సమకూర్చింది. జగనన్న వసతి దీవెన ద్వారా 5,06,390 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.834.96 కోట్లు జమ చేసింది. 83,04 మంది ఎస్టీలకు రూ.135.౬౬ కోట్లను జమచేసింది. జగనన్న విద్యాదీవెన ద్వారా రూ.5,93,926 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.2,409.76 కోట్లను అందించింది. 1,22,495 ఎస్టీ విద్యార్థులకు రూ.383.43 కోట్లను సమకూర్చింది. ఈ పథకాల నిధులన్నీ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవినీతికీ చోటు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ అయ్యాయి. ఆరోపణః కేంద్ర సాయానికి మోకాలడ్డు వాస్తవంః ఎస్సీ, ఎస్టీలను ఉద్ధరించడంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసింది.ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, సాయాన్ని రాబట్టడంలో గత టీడీపీ ప్రభుత్వానికంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం గణనీయమైన కృషి చేసింది. ఎస్సీ కాంపొనెంట్ అమలులో అత్యధిక మందికి లబ్ధి చేకూర్చిన జాబితాలో దేశంలోని 20 రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదికలోను స్పష్టం చేసింది. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎస్సీ కాంపొనెంట్ ద్వారా మొత్తం 37.64 లక్షల మందికి మేలు జరిగితే అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 35.92 లక్షల మందికి లబ్ధి చేకూరడం గొప్ప రికార్డు.ఈ కోవలోనే గిరి బిడ్డలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారినీ సమాదరిస్తోంది. జిల్లాల విభజనతో గిరిజనులకు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం రెండు జిల్లాలను ఏర్పాటు చేయడం విశేషం. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు సమస్యలు ఉంటాయి కాబట్టి ఒకే కమిషన్‌గా ఉన్న దాన్ని వేర్వేరుగా ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారికి దన్నుగా నిలవడం గొప్ప విషయం. ----- సంక్షేమానికి ఇలా... -టీడీపీ హయాంలో ఎస్సీలు 21,43,853 మందికి రూ..8844 కోట్లు, ఎస్టీలు 9,17,488 మందికి రూ.2,611.3 కోట్లను వెచ్చించింది.-వైఎస్సార్సీపీ ప్రభుత్వం డీబీటీ ద్వారా ఎస్సీలు 1,37,72.539 మందికి రూ.45,412.12 కోట్లు, ఎస్టీలు 37,90,517 మందికి రూ.13,389.21 కోట్ల మొత్తాన్ని నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాలకే జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా 69,91,349 మంది ఎస్సీలకు రూ.23,468.91 కోట్లు, ఎస్టీలు 22,71,105 మందికి రూ.5,963.43 కోట్ల లబ్ధిని ఈ ప్రభుత్వం చేకూర్చింది. ఈ ప్రభుత్వంలోనే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మొత్తంగా ఎస్సీలు 2,07,63,888 మందికి రూ.68,881.04 కోట్లు, ఎస్టీలు 60,61,622 మందికి రూ.19,352.64 కోట్ల లబ్ధిని అందించింది. -
FactCheck: ‘అంధుడి’ సర్టిఫికెట్ అందుకోవాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై రాజ గురువు రామోజీ పదే పదే విషం కక్కుతూ చివరికి కోర్టుల్ని సైతం పక్కదారి పట్టించేలా తప్పుడు రాతలు రాస్తున్నారు. అధికారులు ఇసుకపై కోర్టులకు ఇవ్వాల్సిన నివేదికలు తనకే ఇచ్చినట్లు ఊహించుకుని ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. ‘ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే.. కృష్ణా జిల్లా గనుల శాఖాధికారి సంచలన నివేదిక’ పేరుతో రామోజీ రోత పత్రిక వాస్తవాలకు మసి పూసి పూర్తిగా వక్రీకరించి అడ్డగోలు కథనాన్ని ప్రచురించింది.నివేదికలో అంతా అక్రమాలే జరిగాయని ఒక అధికారి నివేదిక ఇచ్చారంట.. అది ఈయనగారికి చెప్పారంట? దాన్నే ఏ ఆధారం లేకుండా అబద్దాలతో అచ్చేశారు. కోర్టులకు వెళ్లాల్సిన నివేదికలు అంతకంటె ముందు రామోజీ, ఈనాడు కార్యాలయాలకు వెళుతున్నాయంటే అది నమ్మాలా? ఒకవేళ నిజంగా అలా జరిగితే రామోజీరావు కోర్టుల్ని కూడా డిక్టేట్ చేస్తున్నారా?. ఇసుక తవ్వకాలపై హైకోర్టులో దాఖలైన పిటీషన్ విచారణ జరుగుతుంటే దానిపై కోర్టును ధిక్కరించేలా అడ్డగోలు కథనాలు రాసి మరీ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.జిల్లా కలెక్టర్లు ఇసుక రీచ్‌లను మరోసారి పరిశీలించి సమగ్ర నివేదికను సమర్పించాలని న్యాయస్థానం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో జిల్లా గనుల శాఖ అధికారితో సహా సంబంధిత అధికారుల బృందం ఇసుక రీచ్‌లను సందర్శించి నివేదికలను రూపొందిస్తున్నాయి. రూపొందించాక కోర్టుకు సమర్పించనున్నారు. ఈలోపే అక్రమ తవ్వకాలు జరిగాయని ఈనాడుకు తెలిసిపోతుందా? నివేదిక తయారు కాకుండానే అందులో ఏం రాస్తారో ఊహించుకుని తన ఇష్టానుసారం వార్తలు రాస్తారా?ఈ కథనాల ద్వారా కోర్టుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడమేగా? జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో వివిధ విభాగాలకు చెందిన అధికారుల బృందం సంయుక్తంగా తనిఖీలు చేసి, సమర్పించిన నివేదికలు మార్చేందుకు వీలుంటుందా? అలా మార్చేందుకు ఎవరైనా ప్రయత్నిస్తారా? ఈనాడు మాత్రం కనీస అవగాహన లేకుండా అక్రమాలు జరిగిపోతున్నాయని ఊహించుకుని, నివేదికలో అవి జరిగాయని ఊహించుకుని కథనాలు రాసేసింది. అక్రమ తవ్వకాలపై నిరంతర పర్యవేక్షణ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరగకుండా గనులశాఖ, ఎస్ఇబి నిరంతరం పర్యవేక్షణ జరుపుతోంది.ఎక్కడ అక్రమాలు జరిగినా ఉక్కుపాదం మోపుతోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంటే ఆ విషయాన్ని కూడా పట్టించుకోకుండా అబద్ధాలు రాసింది. కేవలం రాజకీయ దురుద్ధేశంతో ప్రభుత్వంపై బుదరచల్లే పనిలో భాగంగా తరచూ ఇలాంటి కథనాలు రాస్తోంది. అందుబాటు ధరలోనే ఎక్కడా ఇసుక కొరత లేకుండా ప్రజలకు అందించడాన్ని తట్టుకోలేక అడ్డగోలుగా బురదజల్లుతున్నారు. పర్యావరణ అనుమతులతో ఇసుక ఆపరేషన్స్ రాష్ట్రంలో పారదర్శకంగా జరుగుతున్నాయి. ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఎస్ఇబిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.రాష్ట్ర సరిహద్దులు దాటి ఇసుక రవాణా జరగకుండా అన్ని చోట్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ఇంత పకడ్భందీగా ఇసుక ఆపరేషన్స్ జరుగుతుంటే దానిపై అదే పనిగా అబద్ధపు ప్రచారం చేస్తోంది. 4 వేల కోట్ల విలువ లేని ఇసుక కాంట్రాక్టులో రూ.40 వేల కోట్ల దోపిడీయా? రాష్ట్రంలో ఇసుక దోపిడీకి ఏపీఎండీసీ సహకారం అందిస్తోందంటూ టీడీపీ అధికార ప్రతినిధి ఒకరు సోమవారం కామెడీ షో నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ కోసం టెండర్లు పిలిచిన మొత్తం కాంట్రాక్ట్ విలువే రూ.4 వేల కోట్ల లోపు ఉంటే, ఏకంగా రూ.40వేల కోట్ల ఇసుక దోపిడీ ఎలా జరుగుతుందో ఆ మహా మేధావికే తెలియాలి.ఏపీఎండీసీ శరవేగంగా అమలులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రాజెక్టులు చేపట్టేందుకు అవసరమైన నిధులను బాండ్లను జారీ చేయడం ద్వారా మార్కెట్ నుంచి సేకరించేందుకు ఏపీఎండీసీ నిర్ణయించింది. బాండ్ల కోసం సేకరించే మొత్తం, దానికి చెల్లించే వడ్డీ కన్నా అధికంగా రెవెన్యూ ఆర్జించే అవకాశం ఉన్న ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టనుంది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపి వాణిజ్య ప్రయోజనం అందించే ప్రాజెక్టులనే బాండ్ల ద్వారా సేకరించిన సొమ్మును పెట్టుబడి వ్యయంగా పెట్టాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది.ఈ బాండ్ల సేకరణ ప్రక్రియ ఇంకా నడుస్తుండగానే ఏపీఎండీసీ రూ.7 వేల కోట్లకు బాండ్లు జారీ చేసిందని ఆరోపణలు చేయడం విడ్డూరమే. బాండ్ల కోసం ఆసక్తి వ్యక్తం చేసిన వారి వివరాలే తెలియకుండా, బాండ్ల జారీనే జరగకుండా, రూ.7 వేల కోట్లు ఎలా సేకరిస్తారో ఆ ప్రతినిధికే తెలియాలి? అసలు సేకరణే జరగని సొమ్మును ప్రభుత్వానికి ఎలా బదిలీ చేస్తారనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా చంద్రబాబు మెప్పు కోసం ఆరోపణలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
AP Navaratnalu Scheme: ‘బండ’బారిన బతుకుల్లో మెరుపులు
కఠెవరపు వెంకటేశ్వర్లుది గుంటూరు జిల్లా తెనాలి స్వస్థలం. బుర్రిపాలెంరోడ్డులో ఓ పక్కగా ఇస్త్రీ బండినే అతడి జీవనాధారం. ఆ పక్క వీధిలోని పూరిల్లే వారి పొదరిల్లు. అత్త, భార్య, ఇద్దరు కుమార్తెలు. ఏనాడో భర్త వదిలేసిన మరదలు, ఆమె కుమార్తె.. అంతా కలిసి ఆ ఇంట్లోనే ఉంటారు. వేంకటేశ్వర్లు పగలంతా ఇస్త్రీ చేసి నాలుగు డబ్బులు సంపాదిస్తే, నాలుగిళ్లలో బట్టలుతికి మరదలు ఆర్జించే మరికొన్ని డబ్బులే ఆ కుటుంబానికి ఆధారం.ఇద్దరి రెక్కల కష్టంతో ఏడుగురి కడుపు నింపాలి. ఎదుగుతున్న పిల్లల చదువులకు, ఏదైనా అనారోగ్యం చేస్తే వైద్యానికి ఎవరో ఒకరిని ప్రాధేయపడటం, రెండేసి, మూడేసి రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చుకోవడం పరిపాటిగా మారింది. ఏళ్లు గడుస్తున్నా ఎదుగూ బొదుగూ లేని జీవితం... గత ప్రభుత్వం ఎలాంటి సాయం చేసిన పాపాన పోలేదు. దీంతో వారి జీవనం దుర్భరంగా మారింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ కుటుంబానికి దశ తిరిగింది. 2019 నుంచి సంతోషాల వెంబడి..నవరత్నాలతో జీవన విధానమే మారిపోయింది. 2024 వచ్చేసరికి పూరిల్లు కాస్తా రేకుల షెడ్డైంది. 67 ఏళ్ల వెంకటేశ్వర్లుకు ఈ ప్రభుత్వం వచ్చాక వృద్ధాప్య పింఛను వస్తోంది. భార్య నాంచారమ్మకు వైఎస్సార్ ఆసరా కింద ఏడాదికి రూ.14 వేల చొప్పున నాలుగు విడతలుగా రూ.56 వేలు ప్రభుత్వం జమచేసింది. డ్వాక్రా సభ్యురాలిగా రూ.2 లక్షల రుణం మంజూరు చేసింది. వసతిదీవెన పథకంతో పెద్దకుమార్తె సాయిగాయత్రి నర్సింగ్ కోర్సు చదువుతోంది. రెండో కుమార్తె దాక్షాయణి ఇంటర్లో ఉన్నపుడు అమ్మ ఒడి డబ్బులు వచ్చాయి.ఇప్పుడు విద్యాదీవెనతో బీసీఏ చదువుతూనే కంపెనీ ఉద్యోగాలకు ఎంపికైంది. భర్త వదిలేసిన నాంచారమ్మ చెల్లెలు నాగలక్ష్మి ఆంటికే చేరింది. ఆమెకు ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. వైఎస్సార్ ఆసరా కింద ఏటా రూ.14 వేల వంతున నాలుగు విడతలుగా రూ.56 వేలు మంజూరు చేసింది. ప్రభుత్వం ఇంటిస్థలం ఇచ్చింది. –తెనాలికొనుగోలు శక్తి పెరుగుతోంది పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రభుత్వం నేరుగా డబ్బులు ఇవ్వడం వల్ల వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. మార్కెట్ ఎకానమీ బాగుంటుంది. సంక్షేమ పథకాల కింద వెంకటేశ్వర్లు కుటుంబానికి దాదాపు రూ.5 లక్షల వరకు సమకూరాయి. సమాజంలో నిజమైన మార్పు అంటే ఇదే. ఇలాంటి కొన్ని వేల కుటుంబాలు బాగుపడితే సమాజం ఆర్థికంగా పురోగమించినట్టే. – అయోధ్య శ్రీనివాసరావు, ఎకనామిక్స్ లెక్చరర్, ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజి, తెనాలి వేంకటేశ్వర్లు కుటుంబానికి కలిగిన లబ్ధి రూపాయల్లోజగనన్న చేదోడు – 2 50,000 అమ్మ ఒడి- 2 – 80,000 విద్యాదీవెన 37,000 వసతి దీవెన 20,000 వైఎస్సార్ ఆసరా – 2 1,12,000 రైతు భరోసా 6,000 వైఎస్సార్ పింఛను కానుక–2 1,43,000 మొత్తం 4,48,000 -
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
ఆ ఇంటి యజమాని ఓ ప్రైవేట్ డ్రైవర్. తన సంపాదనతోనే సంసారాన్ని నెట్టుకొచ్చేవాడు. ఆ కుటుంబంలో తల్లి, భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అరకొర సంపాదన తిండికే సరిపోయేది కాదు. తల్లికి రూ.200 మాత్రమే వితంతు పింఛన్ వచ్చేది. భార్య ఎంఏ, బీఈడీ చదివింది. నాలుగురాళ్లు వెనకేసుకుని పిల్లలను బాగా చదివించుకోవాలనే ఆశ ఉన్నా... సర్కారు సహకారం కొరవడింది. ఇదీ గతంలో అనంతపురం జిల్లాలోని అనంతపురం రూరల్ మండలం పాపంపేటకు చెందిన వెన్నపూస ఓబిరెడ్డి కుటుంబ పరిస్థితి. ఎన్నో ఒడుదుడుకులను తట్టుకుంటూ నెట్టుకు వచ్చిన ఈ కుటుంబం నేడు వైఎస్సాసీపీ ప్రభుత్వ సహకారంతో సుఖసంతోషాలతో జీవిస్తోంది. – అనంతపురం 2014 ఎన్నికల సమయంలో టీడీపీకి ఓట్లు వేస్తే డ్వాక్రా రుణాలు, బంగారు రుణాలు మాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం లేదా ప్రతినెలా రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మాటలతో ఓబిరెడ్డి కుటుంబం గంపెడు ఆశలు పెట్టుకుంది. తీరా ఆయన డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు. వారి హామీతో మూడు నెలలు అప్పు కట్టలేదు. నెలనెలా వడ్డీ పెరుగుతోందని బ్యాంకు సిబ్బంది హెచ్చరిస్తూ వచ్చేవారు. ఒకవేళ మాఫీ చేసినా..మీరు చెల్లించిన సొమ్ము వెనక్కు ఇస్తామని, మాఫీ చేయకపోతే వడ్డీ మీ నెత్తిన పడుతుందని చెప్పారు. దీంతో సభ్యులంతా మాట్లాడుకుని అప్పు కడుతూ వచ్చారు. అలాగే ఇంట్లో ఉన్న బంగారమంతా బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.70 వేలు రుణం తీసుకున్నారు. అదికూడా మాఫీ కాలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన ఈ నాలున్నరేళ్లలో మొత్తం రూ.7,36,000 మేరకు ఆర్థిక సహాయాన్ని పొందారు. వైఎస్సార్ ఆసరా కింద భార్యకు రూ.44 వేలు వచ్చింది. వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చారు. ఇంటి పెద్ద కన్నుమూయగా వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష వచ్చింది. యానిమేటర్‌గా ఉద్యోగం ఇచ్చారు. ఇంట్లో ఇద్దరికి పింఛన్ వస్తోంది. ఇప్పుడు తమ కుటుంబం ఆనందంగా గడుపుతోందని ఓబిరెడ్డి ప్రమీల చెప్పారు. ‘సంక్షేమం’ లేకుండా సుస్థిరాభివృద్ధి అసాధ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. దేశంలో ఎక్కడైనా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయకుండా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడం అసాధ్యం. ఏపీ ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని విధంగా అమలు చేస్తున్న నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. వీటిద్వారా సగటు మానవుని జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయి. – గుర్రం జయపాల్‌రెడ్డి, జెడ్పీ రిటైర్డ్ సీఈఓ ఓబిరెడ్డి కుటుంబానికి కలిగిన లబ్ధి ఇలా... పథకం టీడీపీలో వైఎస్సార్సీపీలో డ్వాక్రా రుణమాఫీ 00 రూ.44 వేలు పింఛన్ రూ.62,000 రూ.1.89 లక్షలు ఆరోగ్యశ్రీ 00 రూ.60 వేలు వైఎస్సార్బీమా 00 రూ.1 లక్ష సున్నా వడ్డీ 00 రూ.8 వేలు విద్యా దీవెన 00 రూ.25 వేలు వసతి దీవెన 00 రూ.15 వేలు అమ్మ ఒడి 00 రూ.55 వేలు నిరుద్యోగ భృతి రూ.4 వేలు 00 యానిమేటర్ 00 రూ.2.40 లక్షలు -
ఏటీఎల్ వినియోగంలో ఏపీ ముందంజ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ఏటీఎల్)’ సద్వినియోగం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని యునిసెఫ్, టీసీఎస్ ప్రతినిధులు ప్రశంసించారు. శుక్రవారం న్యూఢిల్లీ, హైదరాబాద్ నుంచి వచ్చిన యునిసెఫ్, టీసీఎస్ ప్రతినిధులు ఎన్టీఆర్ జిల్లాలో మొవ్వ, పెనమలూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. దీన్లోభాగంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్, హబ్, స్పోక్స్ మోడల్‌తో పాటు ప్రభుత్వం అమలు చేసిన స్టెమ్ ఆధారిత కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విజయవాడలో పాఠశాల విద్య కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 713 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను హబ్, స్పోక్ మోడల్‌గా రూపొందించామన్నారు. విద్యార్థులను సాంకేతికత విజ్ఞానం వైపు ప్రోత్సహించడానికి ‘సంకల్పం’ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నామన్నారు. అటల్ టింకరింగ్ మారథాన్, సీడ్ ది ఫ్యూచర్, సైన్స్ ఫెయిర్, ఇన్స్పైర్ తదితర పోటీల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపుతున్నారన్నారు. ఇలాంటి సమయంలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పనితీరుపై యునిసెఫ్ డాక్యుమెంటరీ రూపొందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీ నుంచి వచ్చిన యునిసెఫ్ ప్రతినిధులు అరేలియా ఆర్డిటో (చీఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్), ప్రమీల (విద్యా నిపుణురాలు), హైదరాబాదు నుంచి శేషగిరి మధుసూదన్ (విద్యా నిపుణులు), శిఖా రాణా (విద్యాధికారి), టీసీఎస్ నుంచి విమల్, విపుల్, శ్రీనివాస్ విశ్వనాథ, ఏపీ యునిసెఫ్ కన్సల్టెంట్ టి.సుదర్శన్, రాష్ట్ర నోడల్ అధికారి డా.జిఆర్ భాగ్యశ్రీ, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్ రెడ్డి తదితరులున్నారు. -
అప్పులు లేకుండా ఆనందంగా..
ఉన్నది 20 సెంట్ల భూమి. కౌలుకు మరో ఎకరం దేవదాయ శాఖ భూమి. అదే ఆ కుటుంబానికి ఆధారం. సమయానికి విత్తుకుంటే సరేసరి... లేదంటే అంతేమరి. ప్రకృతి సహకరిస్తే నాలుగు వేళ్లు నోట్లోకెళ్లేది. లేదంటే అప్పులకోసం తప్పని తిప్పలు. తరువాత వాటిని తీర్చడానికి నానా అగచాట్లు. చినుకు రాలకుంటే ఆవేదన... అతిగా వానపడితే ఆందోళన. అదనుకు విత్తనం దొరక్కున్నా... అవసరం మేరకు ఎరువులు లభించకపోయినా... ఆ ఏడాదంతా బతుకు దినదిన గండమే. ఇదీ శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం గోకర్ణపురానికి చెందిన కర్తల చిరంజీవులు కుటుంబ పరిస్థితి. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు. తోడబుట్టిన చెల్లెలు వారితోనే. కుటుంబమంతా కష్టపడితేనే కడుపునిండేది. లేకుంటే పస్తులే గతి. అలాంటి కుటుంబానికి ప్రభుత్వాల సాయం ఎంతో అవసరం. –కంచిలి 2019లో రాష్ట్రంలో వెఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. కుటుంబం ఆర్థి కంగా నిలదొక్కుకుంది. అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి సాయం అందింది. వ్యవసాయం పండగైంది. అవసరమైన పెట్టుబడి అదనుకు ముందే అందుతోంది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు. సొసైటీ గోదాముల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇంటి ముంగిటకే రైతు భరోసా కేంద్రాల ద్వారా అవి వచ్చిచేరుతున్నాయి. పండించిన పంటకు ఈ క్రాప్‌లో నమోదు కావడంతో మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ప్రకృతి పగబట్టి పంటను తినేస్తే నష్టపరిహారం సొమ్ము ఆ సీజన్ ముగియక ముందే అందుతోంది. ఇంటి ఇల్లాలు రత్నానికి వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత కింద ఏటా నగదు ఖాతాలో పడుతోంది. సోదరి రుక్మిణమ్మకు ఒంటరి మహిళ పింఛన్ వస్తోంది. గడచిన నెలలో వివాహమైన పెద్దకొడుకు మాధవరావుకు కల్యాణ మస్తు పథకం కింద రూ. 50వేలు అందింది. చిన్నకొడుకు జోగారావు కిడ్నీలో రాళ్లు చేరితే డాక్టర్లు రూ. 50వేలు ఖర్చవుతుందన్నారు. పైసా ఖర్చులేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా దానిని ప్రభుత్వ సాయంతో ఎదుర్కోగలమన్న నమ్మకం ఏర్పడింది. బతుకుపై భరోసా దక్కింది. ఆర్థిక సమస్యలు తీరాయి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే మా ఆర్ధిక సమస్యలు తీరాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క నయాపైసా సాయం అందలేదు. వ్యవసాయ ఖర్చులు మొదలుకొని, కుటుంబ అవసరాలకు సైతం ఇబ్బంది పడేవాళ్లం. చిన్నపాటి అవసరానికీ అప్పులు చేయాల్సి వచ్చేది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతీ నెల ఇంచుమించు ఏదో ఒక పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతోంది. తద్వారా మేము నిశ్చింతంగా జీవిస్తున్నాం. మా కుటుంబానికి ఈ ఐదేళ్ల కాలంలో నాలుగు లక్షలకు పైబడి లబ్ధి చేకూరింది. – కర్తల చిరంజీవులు -
Fact check: ఓటమి భయం ప్రస్ఫుటం
సాక్షి, అమరావతి: రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం, టీడీపీ ఓటమి ఖాయమని జాతీయ చానళ్ల సర్వే ఫలితాలు విడుదలవుతున్న కొద్దీ ...ఈనాడు రామోజీరావులో పాత్రికేయ పైశాచికత్వం పెట్రేగి పోతోంది. ‘మేమంతా సిద్ధం’ యాత్రలో సీఎం వైఎస్ జగన్ పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాదరణతో రామోజీరావుకు తత్వం మెల్లగా బోధపడుతోంది. జగన్‌కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం తన తరం కాదన్న అక్కసుతో ఏకంగా పోలీసు వ్యవస్థనే బ్లాక్మెయిల్ చేసేందుకు బరితెగించారు. ఆ కసిలో ఈనాడు పత్రికలో ‘అదే అరాచకత్వం...అదే దౌర్జన్యం’ శీర్షికన గురువారం తాజాగా విష పూరిత కథనాన్ని ప్రచురించారు. రామోజీ రాతలకు అతీతంగా అటు ఈసీ, ఇటు పోలీసు వ్యవస్థ నిబద్ధతతో తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడం సానుకూల పరిణామం. కుట్ర బెడిసికొట్టినా ఖాకీలపై ఈనాడు కారుకూతలు... చంద్రబాబు, పురందేశ్వరిల భాగస్వామ్యంతో పోలీసు వ్యవస్థను తమకు గులాంగా చేసుకునే కుట్రలో భాగంగా ...రాష్ట్రంలో 20 మందికి పైగా ఐపీఎస్ అధికారులను మార్చేయాలని ఈనాడు లో కథనాలు రాశారు. రామోజీ పాచిక పారలేదు. డీఐజీ, ఐదుగురు ఎస్పీలను మాత్రమే ఎన్నికల కమిషన్ మార్చింది. వారి స్థానాల్లో తాము చెప్పిన వారినే నియమించాలన్నట్టుగా పచ్చ ముఠా పరోక్షంగా ఆదేశాలు జారీ చేసింది. తద్భిన్నంగా నియమావళి ప్రకారం ఎన్నికల కమిషన్ ఒక డీఐజీ, ఐదుగురు ఎస్పీలను నియమించడంతో రామోజీలో అహం దెబ్బతింది. దీంతో ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు లక్ష్యంగా దు్రష్పచార కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ఈ కథనంతో చిర్రెత్తిన పోలీసు యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. ఏకంగా 19 మంది ఐపీఎస్ అధికారులు టీడీపీ, జనసేన, బీజేపీ, ఈనాడులకు వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఈనాడు తీరుపై మండిపడింది. అంతటితో బుద్ధి రాని రామోజీ కుక్కతోక వంకరన్నట్లు మరోసారి పోలీసు వ్యవస్థపై విధ్వేషం వెళ్లగక్కారు. ఈనాడులో వచి్చన ఆదేశాలనే ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పోలీసులు పాటించాలన్నట్టుగా బ్లాక్‌మెయిలింగ్‌కు దిగజారారు. టీడీపీ దౌర్జన్యాలు, దాడులను మసిపూసి మారేడు కాయ చేస్తూ వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు యతి్నంచారు. వైఎస్సార్సీపీలో ఫలానా నేతలపై ఫలానా సెక్షన్ల కింద కేసులు పెట్టండంటూ పోలీసులకు రామోజీ తన రాతల హుకుం జారీ చేశారు. పోలీసు అధికారుల బెదిరింపునకూ పన్నాగం తాజాగా ఎన్నికల విధుల్లో క్రియాశీలంగా ఉండే డీఎస్పీ, సీఐ, ఎస్సైలను బ్లాక్మెయిల్ చేయడం ద్వారా టీడీపీ అక్రమాలకు అడ్డులేకుండా చేయాలన్న పచ్చ కుట్రలో రామోజీ భాగస్వామిగా మారారు. ఇటీవల పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు దౌ ర్జన్యాలకు పాల్పడ్డ ఉదంతాలను ఈనాడు వక్రీకరిస్తూ తప్పుడు కథనం ప్రచురించింది. మాచర్ల, గన్నవరం, అద్దంకి, ఉరవకొండ, గుడివాడ తదితర నియోజకవర్గాల్లో గత వారం పదిరోజుల్లో టీడీపీ కార్యకర్తలు దౌర్జ న్యాలకు పాల్పడ్డారు. తాజాగా బుధవారం రాత్రి ఒంగోలులో ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్సార్సీపీ అ భ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఆయన కుటుంబ స భ్యులనే అడ్డుకున్నారు. అసలు ఎన్నికల ప్రచారం చే యడానికి వీల్లేదని గలాభా సృష్టించారు. ఈ ఘటనల పై స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందడంతో వారు కఠిన చర్యలు తీసుకున్నారు. టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడినా.. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రచా రా న్ని అడ్డుకున్నా పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి చూ స్తుండాలన్నట్టుగా ఈనాడు వితండవాదం చేస్తోంది. ఈసీనే శాసిస్తున్న రామోజీ రాతలు... ఏకంగా రాజ్యంగబద్ధ సంస్థ ఈసీకే పరోక్షంగా తన రాతలతో ఆదేశాలు జారీ చేస్తుండటం రామోజీరావు బరితెగింపునకు నిదర్శనం. ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఏకంగా ఎస్పీలను మారిస్తే సరిపోతుందా... మొత్తం డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను మార్చేయాలని ఈసీకే రాతల హుకుం జారీ చేశారు. అందర్నీ మారుస్తామన్నారు..ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈసీనే ఈనాడు నిలదీయడాన్ని ప్రజాస్వామ్యవాదులే ఛీత్కరించుకుంటున్నారు. ఈసీ కొత్తగా నియమించిన పల్నాడు ఎస్పీపైనా ఈనాడు విషం కక్కింది. అయినా రామోజీ రాతలకు అతీతంగా ఈసీ తన పని తాను పక్షపాత రహితంగా చేసుకుపోతోంది. -
నిస్సహాయ స్థితిలో పెద్దదిక్కులా
సిఫార్సు లేకుండానే పింఛన్ మంజూరు ఆరు నెలల క్రితమే నా భర్త మృతి చెందారు. వలంటీర్ వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. ఎలాంటి సిఫార్సులు లేకుండానే పింఛన్ మంజూరైంది. ఎవరికీ రూపాయి లంచం ఇవ్వలేదు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్, పింఛన్ సొమ్ములతో బతుకుతున్నాను. మా లాంటి పేదోళ్లను ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోంది. – తిగిరిపల్లి దమయంతి, వీర్రాజు తల్లి, పెద్దేవం తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన తిగిరిపల్లి వీర్రాజు కుటుంబానిది అత్యంత దయనీయ గాథ.. వీర్రాజు, అతని భార్య ఇద్దరూ దివ్యాంగులే. ఇంతలో అతనికి పక్షవాతం రావడంతో కుటుంబం ఒక్కసారిగా ఉపాధి మార్గం కోల్పోయింది. ఆ తరుణంలో వారికి ఈ ప్రభుత్వం అందించిన నవరత్నాలు ఆదుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మోపెడ్‌పై ఆకుకూరలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడిని. దివ్యాంగుడినైన నాకు నాలుగేళ్ల క్రితం పక్షవాతం వచి్చంది. కుటుంబ పోషణ భారమైంది. నా భార్య బధిరురాలు. ఇప్పుడు జగనన్న దయతో ఇద్దరికీ దివ్యాంగ పింఛన్ అందుతోంది. ఇంటి స్థలం కూడా మంజూరైంది’ అని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన తల్లికి రూ.3 వేలు వితంతు పింఛన్ ఇస్తున్నారు. ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించారు. కుమార్తె చదువుకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వచ్చాయి. అంతేగాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో వారి పెద్దమ్మాయి దివ్యకు ఉద్యోగం లభించింది. దివ్య డిగ్రీ వరకు చదువుకుంది. ఆమెకు జీఎస్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇచ్చారు. నెలకు రూ.18 వేలు జీతం ఇస్తున్నారు. త్వరలో ఇంటి నిర్మాణం కూడా ప్రారంభిస్తాం అని వీర్రాజు ఆనందం చేస్తున్నారు. –కొవ్వూరు -
Fact check: అబద్ధాలు రచించెన్
సాక్షి, అమరావతి: అబద్ధం.. కుళ్లు.. భయం.. వీటికి ప్యాంటూ చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం రామోజీ మాదిరే ఉంటాయేమో! జగన్ పరిపాలనలో అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు ప్రతి నెలా పింఛన్లు అందుకుంటూ ఆనందంగా ఉంటే రామోజీకి కంపరంగా ఉంది. ఈ వర్గాల్లో జగన్‌కు పెరుగుతున్న పరపతిని చూసి తన భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తోంది. అందుకే వాస్తవాలకు మసిపూసి ‘నవరత్నాలు – నయవంచన’ అంటూ మరో అబద్ధపు కథనాన్ని అచ్చేసేశారు. ఈ నిస్సిగ్గు పాత్రికేయాన్ని చూసి అక్షరాలు సిగ్గుతో తలదించుకోవాల్సిందేనేమో...!! పింఛనుదారుల సంఖ్య పెరిగింది జగన్ హయాంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. ఇందులో 29.51 లక్షల మంది జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొత్తగా పింఛన్లు అందుకున్నవారే. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో పింఛన్ల సంఖ్య ఏ మాత్రం పెరగలేదు. అప్పట్లో 43.11 లక్షల మంది పింఛనుదారులున్నారని లెక్కలు చెబుతున్నా 39 లక్షల మందికే చెల్లింపులు జరిపేది. నాలుగు నుంచి 5 లక్షల మందికి ఎగ్గొట్టేది. రామోజీ దగ్గర ఈ లెక్కలు లేవో.. లేక కావాలనే విస్మరించారో. ఇంటికో పింఛను విధానం బాబుదే కుటుంబానికి ఒక్కటే పింఛను విధానం జగన్ ప్రభుత్వం అమలు చేసినట్టు ఈనాడు ఓ అబద్ధాన్ని రాసింది. ఈ విధానం ప్రవేశపెట్టిందే చంద్రబాబు ప్రభుత్వం. 2014 సెప్టెంబర్ 18న ఆర్సీ నంబరు 1053 పేరిట జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఐదేళ్ల పాటు దీన్ని అమలు చేసింది. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒకే ఇంటిలో ఇద్దరు దివ్యాంగులున్నా రెండో పింఛను ఇచ్చే విధానాన్ని అమలు చేశారు. మరో వైపు.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల చొప్పున నెలనెలా పింఛన్ అందిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే కొత్తగా తీసుకొచి్చన ఈ మేలును బహుశా రామోజీ మరిచిపోయి ఉంటారు. కోతల్లేవు పింఛనుదారులలో మరణాల సంఖ్యను ఎక్కువగా చూపి పింఛన్లను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తగ్గించినట్టు ఈనాడు ఇంకో అబద్ధం ప్రచురించింది. సాధారణంగా పింఛనుదారుల్లో 0.5 శాతం మరణాలు నమోదవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇది 0.8 శాతం ఉండొచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2015 మేలో 0.8 శాతం మేర అంటే 36,406 మరణాలు నమోదు కావడంతో ఆ నెలలో పింఛన్లకు కోత పెట్టింది. అదే ఏడాది ఏప్రిల్‌లో 0.6 శాతం మేర అంటే 22,334 మంది పింఛనుదారులు మరణించినట్లు లెక్కలు వేసి వాటిని తొలగించింది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో వాస్తవ మరణాలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆ మేరకే తొలగింపులు ఉంటున్నాయి. గత ఆరు నెలల గణాంకాలు తీసుకుంటే ఏ నెలలోనూ ఈ సంఖ్య 20 వేలకు మించలేదు. పింఛను విధానంలో మరెన్నో మార్పులు ► గత పాలనలో పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు చాంతాడంత క్యూలో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6 లక్షల గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీ పొ ద్దున్నే లబ్ధిదారుల గడప వద్దనే అందిస్తోంది. ► పింఛన్ల మంజూరులో లంచాలు, వివక్ష, జన్మభూమి కమిటీల పెత్తనాన్ని జగన్ కూకటివేళ్లతో పెకలించారు. కుల, మత వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలు, వివక్ష, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తున్నారు. అర్హులై ఉండి ఒకవేళ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం ఇస్తూ ప్రతి ఏటా జూన్, డిసెంబర్లలో అందజేస్తున్నారు. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో లబి్ధదారుల జాబితాలు ప్రదర్శించి, సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకంగా లబి్ధదారులను ఎంపిక చేస్తున్నారు. ► గత ప్రభుత్వంలో దివ్యాంగులకు 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం రూ.58,500. ఈ ప్రభుత్వంలో లబ్ధి రూ.1,91,000. అంటే రూ.1,32,500 అదనం. ► పెన్షన్లపై నెలవారీ సగటు వ్యయం రూ.400 కోట్ల నుంచి రూ.1968 కోట్లకు పెంపు. ► 2014–19 మధ్య గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం రూ.400కోట్లు. -
Fact Check: రుచీపచీ లేని రాతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారాయి. అత్యాధునిక వైద్యం అందుతోంది. గ్రామాలు, వార్డుల చెంతకు వైద్యం చేరింది. డాక్టర్లే ప్రజల గుమ్మం వద్దకు వచ్చి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. మందులకు కొదవ లేదు. విలేజ్, వార్డు క్లినిక్‌లు ఏర్పడ్డాయి. ఇక ప్రధానాసుపత్రుల్లో సేవలు కార్పొరేట్ స్థాయిని తలపిస్తున్నాయి. గడచిన ఐదేళ్ల సీఎం జగన్ పాలనలో నాడు–నేడు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ బలోపేతం, డైట్ చార్జీల పెంపు ఇలా అనేక సంస్కరణలతో ప్రభుత్వాస్పత్రులు అభివృద్ధి చెందాయి. ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచి్చన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో అభిమానం వెల్లువెత్తుతోంది. ఇది రుచించని ఈనాడు రామోజికి ఆసుపత్రుల్లో అందిస్తున్న రుచికరమైన భోజనం నచ్చలేదు. తన బాబు పాలనలో రుచీపచీలేకుండా వండినా, ఆ ఐదేళ్లలో రోగుల మెనూ ఛార్జీ రూ.40 మించకపోయినా, మూడుపూటలా భోజనం అందించకపోయినా ఈ ‘పచ్చ’రోగికి వెచ్చగా ఉంది. జగన్ పాలనలో మెనూ చార్జి రూ.80కి పెంచి రుచితో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నా రామోజీకి చప్పగానే ఉంది. అందుకే ‘బటన్ల బడాయి.. రోగుల బువ్వకూ బకాయి’ అంటూ రుచీపచీలేని ఓ కథనాన్ని వండేశారు. బాబు పాలనలో ఇదీ గతీ 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఒక్కో రోగికి రూ.40తో భోజనం పెట్టేది. ఇది కూడా 2011లో నిర్దేశించిన ఖర్చు. ఇంత తక్కువ ధరతో ఎలా వీలవుతుందన్న ఆలోచన కూడా అప్పట్లో బాబుకు రాలేదు. ఆ ఐదేళ్లలో ఒక్కసారి కూడా డైట్ చార్జీల పెంపుపై బాబు దృష్టి పెట్టిన పాపాన పోలేదు. రోజులో ఒక పూట మాత్రమే కోడిగుడ్డు అందించేవారు. ఇక అప్పట్లో వైద్య సేవల గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. గుంటూరు జీజీహెచ్‌లో చిన్నారిని ఎలుకలు కొరికి చంపిన దుర్ఘటనే బాబు పాలనలో కునారిల్లిన వైద్య రంగానికి పెద్ద నిదర్శనం. జగన్ పాలనలో ఇదీ పురోగతి 2019లో సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో చేరిన రోగులు త్వరగా కోలుకోవాలంటే నాణ్యమైన వైద్య సేవలతో పాటు, పౌష్టికాహారం అవసరమని గుర్తించారు. ఇందులో భాగంగా రూ.80కు డైట్ చార్జీలను పెంచారు. రోగులకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అందించేందుకు ప్రత్యేకంగా ఒక మెనూ రూపొందించారు. రూ.100 తో గర్భిణులకు నిర్దేశించిన మెనూతో పాటు, అదనంగా చిక్కీలు, రాగి జావ, టీబీ, ఎయిడ్స్, మానసిక రోగులకు హై ప్రొటీన్ డైట్‌ను అందిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా రోగులందరికీ కోడిగుడ్డు ఇస్తున్నారు. మెనూలో మార్పులు ఇలా టీడీపీ ప్రభుత్వంలో రోగికి రోజుకు మూడు పూటలా ఆహారం కోసం రూ.40 బ్రేక్ ఫాస్ట్: బ్రెడ్, పాలు మధ్యాహ్న భోజనం: అన్నం, సాంబారు, వెజ్ కర్రీ, గుడ్డు, అరటిపండు, మజ్జిగ రాత్రి భోజనం: అన్నం, సాంబారు, వెజ్ కర్రీ, మజ్జిగ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రోగికి రోజుకు మూడు పూటలా ఆహారం కోసం రూ.80 ఖర్చు బ్రేక్ ఫాస్ట్: ఉప్మా, కిచిడీ, ఇడ్లీ, పొంగలి, కోడిగుడ్డు, పాలు మధ్యాహ్న భోజనం: అన్నం, సాంబారు, ఆకుకూర పప్పు, అరటిపండు, మజ్జిగ, వెజ్ కర్రీ, గుడ్డు రాత్రి భోజనం: అన్నం, సాంబారు, పప్పు, అరటిపండు, మజ్జిగ, వెజ్ కర్రీ, సంగటి, చపాతీ(డయాబెటీస్ రోగులకు), గుడ్డు -
Fact check: చదువులపై విషం కక్కిన నారా వారి కూలీ..
సాక్షి, అమరావతి: తల్లిదండ్రుల తరువాత గురువుకు ప్రత్యేక స్థానం ఇచ్చిన సంస్కృతి మనది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆ సంస్కృతిని కొనసాగిస్తూ వారికి అత్యున్నత గౌరవం ఇస్తోంది. ప్రతి అంశంలోనూ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న గురివింద రామోజీకి ఇది మింగుడు పడలేదు. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టింది.. వారిచేత మరుగుదొడ్లు ఊడ్పించిందని టీచర్లను అవమానించేలా కట్టుకథ అల్లేసింది. ఈ పనులు ఎక్కడ చేయించిందో మాత్రం ఆ పత్రిక రాయదు. గత ప్రభుత్వంలో పిల్లలకే కాదు.. టీచర్లకూ మరుగుదొడ్లు లేవన్న సత్యాన్ని మరుగున పరిచింది. ఈ ప్రభుత్వ హయాంలో ప్రతి స్కూల్లో స్టాఫ్‌కు ప్రత్యేక, ఆధునిక సదుపాయాల కల్పన ఆ పత్రికకు కనబడవు. ఒకేసారి 25 వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించింది ఈ ప్రభుత్వమే. నాడు–నేడుతో 45 వేల ప్రభుత్వ బడులు అద్భుతంగా రూపురేఖలు మార్చుకున్నాయి. ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు, బోధనకు ఐఎఫ్‌పీ స్క్రీన్ల ఏర్పాటు జరిగాయి. వీటిని కావాలనే విస్మరించి ఆధారాలు లేని రాతలతో ఎల్లో మీడియా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. పాఠశాల అభివృద్ధిలో టీచర్లను భాగస్వామ్యం చేయడం తప్పేనా? ఒకప్పటి బ్లాక్ బోర్డుల స్థానంలో ఇప్పుడు డిజిటల్ బోధన సాగుతోంది. విద్యార్థులు నేర్చుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు 2019–20 విద్యా సంవత్సరంలో ‘మనబడి నాడు–నేడు’ పథకానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్, ఫిషరీస్, రెసిడెన్షియల్ పాఠశాలల ఆధ్వర్యంలో ఉన్న మొత్తం 44,512 స్కూళ్లను ఈ పథకం కిందకు తీసుకొచ్చింది. నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, శుద్ధి చేసిన తాగునీరు, ఫ్యాన్లు, లైట్లు, విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదుల నిర్మాణం జరిగాయి. నాడు–నేడు మొదటి విడతలో రూ.3,669 కోట్లతో 15,715 పాఠశాలలు, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలు బాగుపడ్డాయి. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లోను ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో 3డీ డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. ప్రాధమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా అందిస్తున్నారు. 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఓ రికార్డు. ఇవన్నీ పూర్తి పారదర్శకత కొనసాగేందుకు తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలకు ఏం అవసరమో వారే నిర్ణయించుకునే స్వేచ్ఛను ప్రభుత్వం ఉపాధ్యాయులకు అప్పగించింది. వీటిని తప్పంటోంది ఈనాడు పత్రిక. మీ రమాదేవి స్కూల్లో.. మీ నారాయణ స్కూళ్లల్లో ఇలాగే చేయిస్తున్నారా రామోజీ. జగన్ పాలనలో ► విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కొత్త భవనాల నుంచి మరుగుదొడ్ల వరకు సమకూరాయి. ►గత నాలుగేళ్లలో అర్హత కలిగిన 25 వేల మంది టీచర్లు ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. ఇందులో నాలుగేళ్ల సర్వీసు ఉన్నవారికీ అవకాశం లభించింది. ►నాడు–నేడుతో ప్రతి బడిలోనూ 12 రకాల సదుపాయాలు. ►బోధనకు డిజిటల్ స్క్రీన్లు, స్మార్ట్ టీవీలు. ►బడుల్లోకి కొత్త ఫర్నిచర్. ►మన బడికి అంతర్జాతీయ కీర్తి. ►కోవిడ్ కష్ట కాలంలో నెలల తరబడి పాఠశాలలు మూతబడినా ప్రతి టీచర్‌కు ఠంచన్‌గా వేతనాలు. ►బడిలో పాఠాలు చెప్పడం, అభివృద్ధి పనులు పర్యవేక్షించడం తప్ప ఏ ఉపాధ్యాయుడికీ అదనపు పనులు అప్పగించలేదు. ►మరుగుదొడ్లను ప్రతిరోజు శుభ్రంగా ఉంచేందుకు సిబ్బంది ఉన్నారు. వారికి ప్రతినెలా వేతనాలు చెల్లించేందుకు ‘టాయిలెట్ మెయింటనెన్స్ ఫండ్’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ టాయిలెట్లు పరిశుభ్రంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించే బాధ్యత స్థానిక ఉపాధ్యాయులు తీసుకున్నారు. చంద్రబాబు పాలనలో ► 2000 సంవత్సరంలో అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడులో చంద్రబాబు జన్మభూమి సమావేశం ఏర్పాటు చేసి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని స్టేజీ మీదకు పిలిచారు. నూరు శాతం ఫలితాలు తేవాలని ఆదేశించారు. సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో సాధ్యం కాదని ఆ ప్రధానోపాధ్యుడు ఉన్నది ఉన్నట్టు చెప్పారు. అంతే అదే వేదికపై ఆ హెచ్ఎంను సస్పెండ్ చేశారు. ► 2003లో మంత్రిగా చేసిన నిమ్మల కిష్టప్ప గోరంట్లలో నిర్వహించిన జన్మభూమి కమిటీ సమావేశంలో టీచర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టమని అనుచరులను రెచ్చగొట్టారు. ►మరుగుదొడ్లు లేక మహిళా టీచర్ల ఇబ్బందులు వర్ణనాతీతం. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆ అవసరం తీర్చుకునేవారు. ►జన్మభూమి సభ్యులే పేరెంట్స్ కమిటీల్లో చేరిపోయి పప్పు, బియ్యం ఎత్తుకెళితే అడిగినందుకు ఉపాధ్యాయులపై దౌర్జన్యాలు చేశారు. ►ఉపాధ్యాయులను నియమించకుండా నూరు శాతం ఫలితాలు తేవాలని ఒత్తిడి చేశారు. సాధ్యం కాదని చెబితే వెంటనే సస్పెండ్ చేసేవారు. ఈ రాతలు టీచర్లను అవమానించడమే గతంలో పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక ఉపాధ్యాయినులు పట్టణాలకే గాని మండల స్థాయి పాఠశాలలకు వచ్చేందుకు ఇష్టపడేవారు కాదు. బ్లాక్ బోర్డులౖపె రాసేందుకు సుద్దముక్క కూడా ఉండేది కాదు. ఈ ప్రభుత్వంలో పిల్లలకు, స్టాఫ్‌కు అన్ని సదుపాయాలు కల్పించింది కళ్లకు కనిపిస్తున్నాయి. తప్పుడు రాతలు రాసి టీచర్ల మనోభావాలను కించపరచడం దుర్మార్గం. ఉపాధ్యాయుల విధులు, సిబ్బంది విధులు ప్రత్యేకంగా ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడా ఏ టీచర్ కూడా మరుగుదొడ్లు కడిగింది లేదు. గతంలో ఎన్నికల విధులకు వెళ్లే ఉపాధ్యాయులు స్థానిక బడుల్లో ఉండలేక కష్టాలు పడేవారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ పాఠశాలకైనా నిర్భయంగా వెళ్లే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది. – గోపీకృష్ణ, ఉపాధ్యాయుడు (వైఎస్సార్‌టీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్) -
AP Navaratnalu Scheme: నాడు బతుకు భయం.. నేడు కొండంత ధైర్యం..
అర్చకత్వం వారి వృత్తి. గ్రామంలో ఉన్న శివాలయాన్నే నమ్ముకుని ఓ కుటుంబం జీవిస్తోంది. సొంత భూమి లేదు. కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే శక్తి లేదు. ఆలయానికి చెందిన రెండెకరాల భూమి వేరేవారి ఆదీనంలో ఉంది. దానిపై వచ్చే ఆదాయం అంతంతమాత్రమే. దేవాలయానికి వచ్చే భక్తులు ఇచ్చిన దక్షిణలతోనే వారి కుటుంబపోషణ సాగుతోంది. దీనికి తోడు పుట్టిన కొడుకు, కూతురు ఇద్దరూ బధిరులే. ఇద్దరిలో కొడుక్కు అతికష్టమ్మీద పెళ్లి చేసినా... కూతురుకు పెళ్లికాక జీవితాంతం తమతోనే గడపాల్సి వస్తోంది. ఆదుకోవాల్సిన గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులనుంచి గట్టెక్కించింది. ఇదీ శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామానికి చెందిన వారణాసి కుమార స్వామి, శ్యామలాంబ కుటుంబ గాథ. అడగకుండానే.. అన్నీ ఇచ్చిన జగనన్న ప్రభుత్వం 2019లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఏదో రకంగా ఏడాది పొడవునా ప్రభుత్వం నుంచి సహాయం అందుతోంది. ఇంటి ఇల్లాలు శ్యామలాంబకు వైఎస్సార్ ఆసరా(రుణమాఫీ), వైఎస్సార్ సున్నా వడ్డీ, కుమార స్వామికి పింఛన్, కొడుకు, కూతురుకు దివ్యాంగ పింఛన్లు, కొడుకు చంద్రశేఖర్ కుట్టు పని నేర్చుకోవడంతో మెషీన్ ఉన్నందున జగనన్న చేదోడు అందుతున్నాయి. అతని భార్య పేరున కాలనీలో ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం అందింది. ఇప్పుడు పనులు పురోగతిలో ఉన్నాయి. వారి పిల్లలు బడికి వెళ్తున్నందున అమ్మ ఒడి నిధులు జమవుతున్నాయి. తమకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం ఆదుకోగలదన్న నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఆ కుటుంబం ఎంతో దర్జాగా బతికేస్తోంది. –బూర్జ సుస్థిర ఆర్థిక వ్యవస్థకు దోహదం వైఎస్సార్సీపీ ప్రభు త్వం వచ్చాక అమలు చేస్తు న్న వివిధ రకాల సంక్షేమ పథకాల వల్ల ప్రతీ కుటుంబంలోనూ ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యాయి. రైతులకు వైఎస్సార్ రైతుభరోసా వల్ల వ్యవసాయం కోసం అప్పు చేయాల్సిన బాధ తప్పింది. వైఎస్సార్ ఆరో గ్యశ్రీ వల్ల నిరుపేదలకు వైద్యం ఉచితంగా అందుతోంది. పిల్లల చదువు తల్లి దండ్రులకు భారం కాకుండా అమ్మ ఒడి, బతుకుపై భరోసా కల్పించేందుకు పింఛన్లు అందుతున్నాయి. ఈ ఆర్థిక సహాయం వల్ల రాష్ట్రంలో సుస్థిర ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతోంది. – కె.కె.కామేశ్వరరావునాయుడు, ఎకనమిక్స్ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, బూర్జ -
గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. మెయిన్స్‌కు 4,496 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరికి మెయిన్స్ పరీక్షలను సెప్టెంబర్ 2–9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ శనివారం తెలిపారు. మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో 4,496 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. కేవలం 26 రోజుల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు వెల్లడించడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన 81 గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గతేడాది డిసెంబర్ 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులకు 3 నెలలు సమయమిచ్చి ప్రిలిమ్స్‌ను మార్చి 17న రాష్ట్రంలోని 18 జిల్లాల్లో నిర్వహించగా, 91,463 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరికి మరో ఐదున్నర నెలల సమయం ఇచ్చి సెప్టెంబర్‌లో మెయిన్స్ నిర్వహిస్తారు. నోటిఫికేషన్లో పేర్కొన్న 81 పోస్టులకు అనంతరం మరో 8 పోస్టులను చేర్చడంతో గ్రూప్–1 పోస్టుల సంఖ్య 89కి పెరిగింది. ఇటీవల గ్రూప్–2 ఫలితాలను వెల్లడించిన ఏపీపీఎస్సీ 1:100 నిష్పత్తిలో 905 పోస్టులకు 92,250 మంది అభ్యర్థులను మెయిన్స్ కోసం ఎంపిక చేసింది. చరిత్రలో ఇంత మంది అభ్యర్థులకు అవకాశం కల్పించడం ఇదే తొలిసారి. ఫలించని ఎల్లో బ్యాచ్ వ్యూహం మార్చి 17న నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను అడ్డుకునేందుకు చంద్రబాబు బృందం చేయని ప్రయత్నం లేదు. దీనికోసం రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయించారు. ఈ ప్రయత్నం కూడా ఫలించకపోయేసరికి బాబుకు దిక్కుతోచలేదు. చివరికి 2018 గ్రూప్–1 పోస్టుల భర్తీపై ఎన్నోసార్లు ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేసి, ఓడిపోయిన అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఏపీపీఎస్సీ నిర్వహించిన 2018 గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని పరీక్షను రద్దు చేయమని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో చంద్రబాబు చెలరేగిపోయారు. పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ మీడియాకు స్క్రీన్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. గత మూడేళ్లల్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన అన్ని పరీక్షలను సకాలంలో నిర్వహించి, ముందే ప్రకటించిన షెడ్యూల్ మేరకు పోస్టులను భర్తీ చేసింది. అయినప్పటికీ ఏపీపీఎస్సీ ఇచ్చిన పలు నోటిఫికేషన్లు, పోస్టుల భర్తీని అడ్డుకునేందుకు చంద్రబాబు బృందం చేయని ప్రయత్నమంటూ లేదు. గత ఫిబ్రవరిలో గ్రూప్–2 ప్రిలిమ్స్‌ను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేశారు. అప్పటికే తన బృందంతో కేసులు వేయించి పరీక్షను రద్దు చేయించాలని యత్నించారు. ఆ చిక్కులను అధిగమించి ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్‌ను నిర్వహించింది. తాజాగా గ్రూప్–1 విషయంలోనూ తన కుట్రలు ఫలించకపోవడంతో బాబు కంగుతిన్నారు. -
విజయవాడ వ్యక్తి సరికొత్త రికార్డు.. అంతరిక్షంలోకి గోపీచంద్
సాక్షి, ఢిల్లీ: విజయవాడకు చెందిన తోటకూర గోపీచంద్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు. అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కబోతున్నాడు. ఎన్ఎస్-25 మిషన్ పేరుతో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు ఆరుగురిని ఎంపిక చేసినట్టు బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రకటించింది. ఇందులో గోపీచంద్ తోటకూర ఒకరు. ఈ సంస్థ చేపట్టిన ‘న్యూ షెపర్డ్’ ప్రాజెక్టులో టూరిస్ట్‌గా గోపీచంద్ వెళ్లనున్నారు. విజయవాడలో జన్మించిన గోపీచంద్ తోటకూర అమెరికాలో ఆరోనాటికల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఆయన కమర్షియల్ జెట్ పైలట్‌గా పని చేశారు. బుష్ ప్లేన్లు, ఏరోబాటిక్ ప్లేన్లు, సీప్లేన్లు, గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లకు కూడా పైలట్‌గా వ్యవహరించారు. అట్లాంటాలో ప్రిజెర్వ్ లైఫ్ కార్ప్ అనే ఒక వెల్నెస్ సెంటర్‌కు గోపీచంద్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. కాగా, ఇంతకుముందు పలువురు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు అంతరిక్షయానం చేసినప్పటికీ వారంతా అమెరికా పౌరులు. గోపీచంద్ మాత్రం ఇప్పటికీ భారతీయ పౌరుడే. ఆయన వద్ద భారత పాస్‌పోర్టే ఉంది. ఆరుగురు వ్యక్తులు వీరే.. అమెజాన్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ జెఫ్ బెజోస్‌కు చెందిన అంతరిక్ష సంస్థే బ్లూ ఆరిజిన్. ఈ కంపెనీ ఇప్పటికే న్యూ షెపర్డ్ మిషన్ పేరిట అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుట్టింది. 2021లో బెజోస్ సహా ముగ్గురు పర్యటకులు రోదసీయాత్ర చేశారు. తర్వాత చేపట్టబోయే ఎన్ఎస్-25 మిషన్‌కు గోపీచంద్ సహా మొత్తం ఆరుగురిని ఎంపిక చేశారు. వెంచర్ క్యాపిలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ ఎన్ఎస్-25లో ప్రయాణించనున్నారు. ఇస్రో సైతం.. మరోవైపు.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సైతం అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ యాత్రకు ఎంపికైన వ్యోమగాముల పేర్లను ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఈ జాబితాలో ఉన్నారు. మన దేశం నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి భారతీయ బృందంగా వీరు ఘనత దక్కించుకోనున్నారు. -
AP Navaratnalu Scheme: ఆపద వేళ ఆదుకున్న సర్కారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఆపద వేళ ఆదుకున్న సర్కారు నా పిల్లలు చిన్నగున్నప్పుడే మా ఆయన కన్నుమూశారు. అప్పటి నుంచి కుటుంబ పోషణ బాధ్యత నాపై పడింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఉంటున్నాం. ఏదో ఒక పనికి వెళితేగాని పూట గడిచేది కాదు. కొన్నిసార్లు పస్తులు కూడా ఉండాల్సి వచ్చేది. గత ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగానూ ఆదుకోలేదు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక నా పరిస్థితి బాగుపడింది. ఏ దిక్కూ లేని మా కుటుంబానికి సంక్షేమ పథకాలు అండగా నిలిచాయి. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.28 వేలు వచ్చిది. పెన్షన్ కానుక ప్రతి నెలా వస్తోంది. ఆ డబ్బులతో కిరాణా, కూరగాయల వ్యాపారం ప్రారంభించాను. దాంతోపాటు కుట్టు మెషిన్ కొనుగోలు చేసి ఖాళీ సమయాల్లో బట్టలు కుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. జగనన్న చేదోడు ద్వారా లబ్ధి పొందాను. అమ్మఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం అందించింది. దాంతో పిల్లల చదువుల భారం తప్పింది. మా కష్టాలన్నీ తీరాయి. దానికి కారణమైన ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. – జుత్తిక వెంకటలక్ష్మి, చేబ్రోలు (సూర్యనారాయణమూర్తి, విలేకరి, గొల్లప్రోలు) భర్త చనిపోతే అండగా నిలిచారు నేను ఓ ఇంట్లో పని చేసుకుంటున్నా. కూలి పనులు చేసుకుంటూ నన్ను, పిల్లల్ని పోషించిన మా ఆయన సీతా రామ్‌కుమార్ రెండేళ్ల క్రితం ఆకస్మికంగా చనిపోయారు. అప్పుడు ఈ ప్రభుత్వమే ఆదుకుని మా కుటుంబాన్ని నిలబెట్టింది. విశాఖ జిల్లా భీమిలి జోన్ పరిధిలోని సంతపేటలో నివసిస్తున్న మాకు నా భర్త చనిపోయిన తర్వాత ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకం కింద రూ.లక్ష అందించింది. దరఖాస్తు చేసిన వెంటనే వితంతు పింఛన్ మంజూరైంది. నా పెద్ద కుమారుడు కేశవ సాయి శ్రీ ఆంజనేయ సంతపేటలోని అంబేడ్కర్ జీవీఎంసీ హైసూ్కల్లో 6వ తరగతి, రెండో అబ్బాయి దిల్వర్ధన్ జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో 3 తరగతి చదువుతున్నారు. ఏటా రూ.15 వేల వంతున అమ్మఒడి వస్తోంది. కావలసిన పుస్తకాలు, యూనిఫాం వంటివన్నీ ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుండడంతో పిల్లల చదువు భారం తప్పింది. ప్రతి నెలా ఉచితంగా 15 కిలోల రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఇల్లు లేని నాకు ఆనందపురం మండలం జగన్నాథపురంలో రూ.3 లక్షల విలువైన స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణం చేపట్టవలసి ఉంది. మా కుటుంబాన్ని ఎంతగానో ఆదుకున్న జగనన్నే మళ్లీ సీఎం కావాలని ఆశిస్తున్నా. – బోర గౌరి, సంతపేట (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి, తగరపువలస) చేనేత వృత్తికి పునరుజ్జీవం మా తాతల కాలం నుంచి చేనేత వృత్తినే జీవనాధారంగా చేసుకుని కాలం గడుపుతున్నాం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కొనుసుల కొత్తూరులో బట్టలు నేసుకుని వాటిని అమ్ముకుని జీవించేవాళ్లం. కానీ పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఈ వృత్తిలో కొనసాగడం కష్టమైంది. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో వ్రస్తాల తయారీకి అవసరమైన ముడి సరుకు ధరలపై ట్యాక్స్ ఎత్తివేయడంతో కొంత వరకు మాకు సాయ పడింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు. బతుకు తెరువుకోసం వలస పోవాలని అనుకున్నాం. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి వచ్చాక మా పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ఏటా రూ.24 వేలు వంతున నేతన్న నేస్తం పథకం కింద అందించారు. దాంతో మా వృత్తికి కొంత భరోసా లభించింది. ముడి సరుకు తెచ్చుకునేందుకు అప్పు చేయాల్సిన బాధ తప్పింది. ఇప్పటి వరకు ఐదు దఫాలుగా మొత్తం రూ.1.20 లక్షలు వచ్చిది. మా నాన్నకు వృద్దాప్య పింఛన్, అమ్మకు వైఎస్సార్ చేయూత ద్వారా రూ.18,750 వచ్చిది. మగ్గం ఉన్న చేనేత కుటుంబానికి విద్యుత్ సబ్సిడీ వస్తోంది. ఇంత కంటే మాకింకేం కావాలి? మా సంక్షేమానికి కృషి చేసిన జగనన్న రుణం తీర్చుకుంటాం. – యర్ర సూర్యనారాయణ, కొనుసులకొత్తూరు (లింగూడు వెంకటరమణ, విలేకరి, టెక్కలి) -
మార్గదర్శి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ, సాక్షి: సుప్రీం కోర్టులో మార్గదర్శికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మార్గదర్శిపై విచారణను కొట్టివేస్తూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని.. ఇందుకుగానూ నిజాలు నిగ్గు తేల్చాలంటూ తెలంగాణ హైకోర్టుకు మార్గదర్శి డిపాజిట్ల కేసు రిఫర్ చేస్తూ తీర్పు ఇచ్చింది. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా గత వాదనల ఆధారంగా ద్విసభ్య బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. ‘‘డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరగాలి. పబ్లిక్ నోటీసు ఇచ్చి.. ఇంకా ఎవరైనా డిపాజిటర్లకి మనీ ఇంకా తిరిగి ఇవ్వలేదా? అనేది తెలుసుకోవాలి. ఇందుగానూ హైకోర్టు మాజీ జడ్జి ఒకరిని నియమించాలి. .. ఏపీలో కూడా డిపాజిటర్లు ఉన్నారు కాబట్టే అనుమతి ఇచ్చాం. మేము మెరిట్స్‌లోకి వెళ్ళడం లేదు. మేము తెలంగాణ హై కోర్టుకు రిఫర్ చేస్తున్నాం. రెండు మూడు నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరపాలి. ఆర్ బీఐ కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలి. ఉండవల్లి అరుణ్‌కుమార్ కూడా హైకోర్టుకు సహకరించాలి.తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఆర్బీఐ, అలాగే.. ఉండవల్లి ఈ కేసులో వాదనలు వినిపించాలి.ఆరు నెలల్లో ఈ కేసు విచారణ తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి. ఈ కేసుపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం. తెలంగాణ హైకోర్టు లో వాదనలు వినిపించండి’’ అని ద్విసభ్య ధర్మాసనం తీర్పు ద్వారా స్పష్టం చేసింది. ఏపీ వాదనలు: కేసు నడుస్తుండగా రూ,2,300 కోట్లు అదనపు డిపాజిట్లు సేకరించారు ఏపీ తరఫున వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలి మార్గదర్శి వాదనలు: 2.7 లక్షల డిపాజిటర్లు ఉన్నారు అందరికీ డబ్బు తిరిగి చెల్లించాము సుప్రీం కోర్టులో ఉండవల్లి.. ‘‘రామోజీ రావు అంటే అందరికీ భయం.. రామోజీ రావుకు నేనంటే భయం’’. ‘ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉంది’ : రామోజీ తరఫు న్యాయవాదులు ‘‘అయితే ఎంటీ... ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము ఆదేశించలేం’’: సుప్రీం కోర్టు తీర్పు తర్వాత సాక్షి టీవీతో ఉండవల్లి మాట్లాడుతూ.. తన 17 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘సుప్రీం కోర్టు తీర్పుతో మా వాదన నిజమే అని రుజువైంది. దేశంలో న్యాయం బతికే ఉందని తేటతెల్లమైంది. మార్గదర్శి డిపాజిట్లు సేకరించడమే నేరం. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశామంటే చెల్లదు. 45Sకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించడమే చట్టవిరుద్ధం. చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణకు రెండేళ్ల జైలు శిక్ష ఉంటుంది. మా తరఫున సుప్రీంకోర్టు మార్గదర్శిని అనేక ప్రశ్నలు అడిగింది. ఈ కేసు గురించి నేను మాట్లాడకుండా చేయాలన్న రామోజీరావు ప్రయత్నం విఫలమయ్యింది. ఆఖరికి.. నాపై గ్యాగ్ ఆర్డర్ తేవాలని ప్రయత్నం చేశారు. కానీ, నా పోరాటం వృథా కాలేదు’’ అని ఉండవల్లి పేర్కొన్నారు. నేపథ్యం ఇదే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం–1934లోని సెక్షన్ 45(ఎస్) నిబంధనను ఉల్లంఘించి, దాదాపు రూ.2300 కోట్ల మేర డిపాజిట్లను సేకరించిందన్నది రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై ఉన్న ప్రధాన అభియోగం. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ 2006లో మార్గదర్శి రూ.2,300 కోట్ల డిపాజిట్లను సేకరించిదని ఉండవల్లి అప్పట్లో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చర్యలకు సిద్ధమైన అప్పటి ఏపీ ప్రభుత్వం ఓ ప్రత్యేక అధికారిని నియమించింది. ఈ క్రమంలో 2008లో ప్రభుత్వం తరఫున కంప్లైంట్ దాఖలు అవ్వగా.. దాన్ని కొట్టివేయాలంటూ పదేళ్ల తరువాత మార్గదర్శి సంస్థ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో 2018 డిసెంబర్ 31 మార్గదర్శిపై క్రిమినల్ కేసును కొట్టి వేస్తూ.. హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో చట్టాన్ని తప్పుదోవ పట్టించి మార్గదర్శిపై క్రిమినల్ కేసు కొట్టివేశారని, ఆ తీర్పును సమీక్షించాలని 2019లో ఉండవల్లి సుప్రీం కోర్టులో ఆశ్రయించారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసులో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను భాగస్వామ్యం చేయాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు కూడా. అప్పటి నుంచి ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. గత విచారణే కీలకం మార్గదర్శి సంస్థ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని గత విచారణలో(ఫిబ్రవరి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వోన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. సెక్షన్ 45-Sకి వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమని, మార్గదర్శి కూడా ఇలాగే డిపాజిట్లు సేకరించిందని ఆర్బీఐ తెలిపింది. మరోవైపు.. కోర్టులో కేసు నడుస్తుండగానే ఉండగానే అదనంగా మరో రూ. 2 వేల కోట్లు వసూలు చేశారని, మొత్తం 4,600 కోట్లు డిపాజిట్లు సేకరించారని ఏపీ ప్రభుత్వం సైతం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇంకోవైపు.. ఆర్బీఐ వాదన నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక నేరాలకు పాల్పడిందని రుజువైందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా.. లేదా? అన్నది ముఖ్యం కాదని, చట్ట విరుద్ధంగా సేకరించారా.. లేదా? అన్నదే ముఖ్యమని అరుణ్ కుమార్ వాదించారు. -
అందరికీ మంచి జరగాలి.. సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు, విజయాలు సిద్ధించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని అన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, విద్యార్థులు అందరికీ మంచి జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) April 9, 2024 -
నేనున్నాను.. నేను విన్నాను
ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో సోమవారం జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా పలువురు అనారోగ్య బాధితులు, ప్రజలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసేందుకు వచ్చారు. వీరిని చూసి స్వయంగా బస్సు దిగి వచ్చిన సీఎం వారి సమస్యలను సావధానంగా విన్నారు. నేనున్నానని భరోసా ఇచ్చారు. అర్జీలు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలు, లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించారు. దీంతో వారంతా ముగ్ధులైపోయారు. ఆనందం వ్యక్తం చేశారు. జై జగన్ అంటూ నినదించారు. – కురిచేడు/మాచవరం / పిడుగురాళ్ల రూరల్/ వినుకొండ(నూజెండ్ల)/నరసరావుపేట రూరల్ దివ్యాంగురాలికి సీఎం ఆరోగ్యరక్ష మా పాప పుట్టిన కొంతకాలానికి మూర్చ వ్యాధి వచ్చింది. సకాలంలో చికిత్స చేయించకపోవడంతో మతిస్థిమితం కోల్పోయింది. ఆ తర్వాత శారీరక వైకల్యమూ శాపంగా మారింది. పాపకు చికిత్స చేయించే స్థోమత లేక ఇబ్బంది పడుతున్నాం. బస్సు యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మా సమస్యను విన్నవించాం. ఆయన పెద్ద మనసు చూపారు. చికిత్స చేయించేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. మాపాలిట ఆపద్బాంధవుడు సీఎం జగన్. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. – నాగిశెట్టి రమాదేవి, సత్యనారాయణ, ఎన్ఎస్పీ కాలనీ, కురిచేడు, ప్రకాశం జిల్లా అంధురాలి చదువుకు సీఎం అభయం మా పాప చందన పుట్టుకతోనే అంధురాలు. బిడ్డకు ఇక కళ్లు రావని వైద్యులు చెప్పారు. కనీసం పాపను చదివించేందుకు ప్రభుత్వం తరఫున సాయం అందించాలని బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరాం. వెంటనే స్పందించిన సీఎం పాప చదువుకు అభయమిచ్చారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. – చిప్పగిరి పాపయ్య, రమణమ్మ, కురిచేడు, ప్రకాశం జిల్లా జగనన్న ధైర్యమిచ్చారు మా పాప నర్రా వర్షిణి ఆరో తరగతి చదువుతోంది. పుట్టిన 9వ నెల నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. ఇప్పటికే లక్షలాది రూపాయలు చికిత్స కోసం ఖర్చు చేశాం. ఫలితం లేకపోయింది. ప్రతినెలా రక్త మార్పిడికి రూ.10 వేలు, వైద్య పరీక్షలు, మందులకు రూ.10 వేలు మొత్తం రూ.20 వేలు ఖర్చు అవుతోంది. నా భర్త ఆటో డ్రైవర్. నేను చిన్న పాటి హోటల్ నిర్వహిస్తున్నా. మా బాధలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లేందుకు వెళ్లగా, ఆయన బస్సు వద్దకు పిలిపించుకుని మా సమస్యను విని నేనున్నానని భరోసా ఇచ్చారు. మీకు ఇబ్బందులు లేకుండా చూస్తానని ధైర్యం చెప్పారు. ఆపరేషన్ చేయించి మీ కుటుంబం సంతోషంగా ఉండేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. – నర్రా శివ లావణ్య, కళ్యాణిపురం, వినుకొండ పట్టణం, పల్నాడు జిల్లా వెన్నెముక దెబ్బతిన్న యువతికి అభయం నేను ఎం ఫార్మసీ చదివాను. మా గ్రామంలో ప్రభ విరిగి పడడంతో నా వెన్నెముక దెబ్బతింది. కాళ్లు చచ్చుపడ్డాయి. వీల్‌చైర్‌కే పరిమితమయ్యాను. సీఎం బస్సు యాత్రగా వస్తున్నారని తెలిసి బంధువుల సాయంతో వచ్చాను. రోడ్డుపక్కన వేచి ఉన్న నన్ను చూడగానే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు దిగి వచ్చి సమస్య తెలుసుకున్నారు. అండగా ఉంటానని అభయం ఇచ్చారు. తన ముఖ్యకార్యదర్శి హరికృష్ణను కలవాలని సూచించారు. చాలా ఆనందంగా ఉంది. సీఎం స్పందించిన తీరు అద్భుతం. – కొత్త తేజస్వీ, విఠంరాజుపల్లి, వినుకొండ రూరల్, పల్నాడు జిల్లా చిన్నారి వైద్యసాయానికి భరోసా మా బిడ్డ రోహిణికి 12 ఏళ్లు. ఐదేళ్ల నుంచి వెన్నెముక సమస్యతో బాధపడుతోంది. ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో చికిత్స చేయించలేకపోయాం. రూ.ఐదు లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. బస్సు యాత్ర సందర్భంగా శావల్యాపురంలో సీఎం జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించాం. మమ్మలను చూడగానే సీఎం బస్సు దిగి వచ్చి మా సమస్య అడిగి తెలుసుకున్నారు. వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆపరేషన్ చేయిస్తానని భరోసా ఇచ్చారు. – పున్నారావు, ఝాన్సీ దంపతులు, శావల్యాపురం, పల్నాడు జిల్లా నా భూమిని మాజీ ఎమ్మెల్యే జీవీ అనుచరులు ఆక్రమించారు నాకు సీతారామపురం గ్రామంలో 2.46 ఎకరాల భూమి ఉంది. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అనుచరులు ఆ భూమిని ఆక్రమించుకున్నారు. కేవలం 80 సెంట్లు మాత్రమే ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో చూపారు. నేను డాక్టర్‌ను. నడవలేని స్థితిలో ఉన్నా. నా సమస్యను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెబుదామని వచ్చాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు ఆపి నా దగ్గరకు వచ్చి సమస్య తెలుసుకున్నారు. పరిష్కరించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. – డాక్టర్ మోదుగుల వెంకటేశ్వరమ్మ, సీతారామపురం, వినుకొండ, పల్నాడు జిల్లా సాగర్ జలాలకు హామీ తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. మా గ్రామ చెరువుకు సాగర్ జలాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని బస్సుయాత్రగా గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరాం. గ్రామ సర్పంచ్ వేమా శివ, మాజీ సర్పంచ్ బత్తుల చిన సుబ్బయ్య, నాయకుడు వేమా చిన్న ఆంజనేయులుతో కలిసి వెళ్లి సీఎంకు వినతిపత్రం ఇచ్చాం. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. – బోధనంపాడు గ్రామస్తులు, కురిచేడు మండలం, ప్రకాశం జిల్లా