AP Special
-
AP Navaratnalu Scheme: పాపను బతికిస్తున్న పింఛన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. పాపను బతికిస్తున్న పింఛన్ థలసేమియా వ్యాధితో బాధ పడుతున్న నా కుమార్తె రక్షితకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి నెలా రూ.10 వేలు పింఛన్ అందిస్తున్నారు. నా కుమార్తె రక్షిత ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఐదు నెలల వయస్సులో పాప అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రికి తీసుకెళితే ఎనిమిదో నెల వయసులో థలసేమియాగా వైద్యులు నిర్ధారించారు. నా భర్త రవికుమార్ వ్యవసాయ కూలీ. ఇంతకు ముందు ఆటో ఉండేది. పాప వైద్యం కోసం అమ్మేశాం. ప్రస్తుతం పాప వయస్సు 11 ఏళ్లు. నెలకు రెండుసార్లు బీ పాజిటివ్ రక్తం ఎక్కించాలి. మందులు, రక్తమార్పిడికి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతోంది. సీఎంగా జగనన్న అధికారంలోకి రాగానే పాపకు నెలకు రూ.10 వేలు పింఛన్ అందించారు. పాప బతికి ఉండడానికి కారణం సీఎం జగనన్నే. ఆయన రుణం తీర్చుకోలేం. నాకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రుణమాఫీ అయింది. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. పాపకు బోన్‌మ్యారో శస్త్ర చికిత్స చేయిస్తే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సీఎం జగన్నే నమ్ముకున్నాం. – కాంతామణి, వాలమర్రు (కె.శాంతారావు, విలేకరి, పాలకొల్లు అర్బన్) ఈ మేలును మరచిపోం మాది కాకినాడ జిల్లా ప్రత్తిపాడు గ్రామం. నా భర్త కడాలి వెంకట రమణ 20 ఏళ్ల కిందటే మృతి చెందారు. నాకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఐదుగురికి వాహాలయ్యాయి. కుమారులు ఇద్దరూ తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆడపిల్లలు ఇక్కడే ఉంటున్నారు. నా భర్త మరణానంతరం వైఎస్సార్ ప్రభుత్వంలో నాకు పింఛన్ మంజూరైంది. ప్రతి నెలా రూ.3 వేలు వస్తోంది. నా కుమార్తెలు ముగ్గురికీ అమ్మ ఒడి కింద ఏటా రూ.15,000 చొప్పున అందుతోంది. వీటితోపాటు వీరికి ఆసరా, చేయూత పథకాలు వర్తిస్తున్నాయి. ఈ ప్రభుత్వం నిర్ణయాల వల్ల మాలాంటి పేదలు హాయిగా జీవిస్తున్నారు. పిల్లల చదువులకు దిగుల్లేకుండా పోయింది. ఇంటిల్లిపాది ఆరోగ్యానికి ప్రభుత్వమే అండగా నిలిచింది. ఆసరా, చేయూత పథకాల ద్వారా వచ్చిన సొమ్ముతో ఎంతో మంది సొంత కాళ్లపై నిలబడటం ఊరూరా కనిపిస్తోంది. ఇంత మేలు చేసిన సీఎం జగన్‌ను ఎవరు మరచిపోతారు? – కడాలి రాములమ్మ, ప్రత్తిపాడు (ప్రగడ రామకృష్ణ, విలేకరి, ప్రత్తిపాడు రూరల్) అప్పులబారి నుంచి బయటపడ్డాం మాది డా.బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి గ్రామం. నిరుపేద రజకుల కుటుంబం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ పథకాలు మాకు అందడంతో జీవనం హాయిగా సాగుతోంది. నాకు, నా కూతురికి ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున నాలుగు విడతల్లో రూ.1.20 లక్షలు వైఎస్సార్ ఆసరా అందింది. చేయూత పథకం కింద రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75,000 అందాయి. జగనన్న చేదోడు కింద ఐదు విడతల్లో రూ.50 వేలు అందించారు. నా భర్తకు ప్రతి నెలా రూ.3 వేలు పింఛన్, మా అమ్మాయికి వికలాంగ పింఛన్ రూ.3 వేలు అందుతోంది. మా వలంటీర్ మాతో అన్నీ పూర్తి చేయించి ఈ సంక్షేమ పథకాలు అందేలా చేశారు. పథకాలతో వచ్చిన ఆర్థిక సాయంతో పాడి పశువులు పెంచుకుంటూ లబ్ధి పొందుతున్నాం. అప్పులు తీర్చుకున్నాం. సీఎం జగన్ చేసిన మేలు మరచిపోలేం. – నందంపూడి సత్యవతి, గొల్లవిల్లి(నల్లా విజయ్‌కుమార్, విలేకరి, ఉప్పలగుప్తం -
కరెంటు ఆపడం కొత్తేం కాదు
సాక్షి, అమరావతి: ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు, వేగంగా తుపాను గాలులు వీస్తున్నప్పుడు, అల్పపీడనం కారణంగా జోరుగా వాన కురుస్తున్నప్పుడు మాత్రమే కాదు రోడ్డు మీద భారీ లోడ్‌తో ఉన్న వాహనం వెళుతున్నప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటారు. లక్షలాది జనం ఒకే రహదారి వెంట బారులుతీరినప్పుడు, తమ నాయకుడిని చూడాలని వేలాది మంది భవనాలపై నిలబడినప్పుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు తీగలు తగిలే అవకాశాలు చాలా ఎక్కువ. ఇలాంటి సమయాల్లో అనుకోనిది ఏదైనా జరిగి తీగలు తెగి జనం మీద పడినా, ట్రాన్స్ఫార్మర్ తగిలి షాక్‌కు గురైనా అమాయకుల ప్రాణాలు క్షణాల్లో పోతాయి. అలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రముఖుల పర్యటనలు, బహిరంగ సభలు, రోడ్ షోలు జరుగుతున్న ప్రదేశాల్లో అధికారులు విద్యుత్ సరఫరాను కాసేపు నిలిపివేస్తుంటారు. ఇది అందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న చర్య మాత్రమే. దీనిని కూడా రాజకీయం చేయాలని చూశారు ఈనాడు రామోజీ. ‘జగన్ వస్తే కరెంట్ వైర్లకు కత్తిరింపే’ అంటూ ఈనాడులో వంకర రాతలు రాశారు. ప్రజల ప్రాణాలు పోతే మా కెందుకు మా అజెండా మాదే అన్నట్లు రాసిన ఆ తప్పుడు కథనాన్ని విద్యుత్ సంస్థలు తీవ్రంగా ఖండించాయి. ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న విశేష ఆదరణను చూసి మరోమారు అక్కసు వెళ్లగక్కారు. ఈ అసత్య రాతలపై ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీసీపీడీసీఎల్) సీఎండీ కె.సంతోషరావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రముఖుల రోడ్ షో సందర్భంగా భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం సహజంగా జరిగేదేనని ఆయన వివరించారు. అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో జన సందోహం ఎక్కువై విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, ఆ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ ప్రముఖుల పర్యటన జరిగినా ఇదే పద్ధతిని అవలంభిస్తున్నామని స్పష్టం చేశారు. నిజానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారి పర్యటనల సమయంలోనూ ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటారు. అప్పుడు మాత్రం ప్రభుత్వం కావాలనే, వారి పర్యటనకు ఆటంకం కలిగించడం కోసమే విద్యుత్ సరఫరా నిలిపివేసిందంటూ ఇదే ఈనాడు కథనాలు రాస్తోంది. ఇటీవల పవన్ పర్యటనలో ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. అలాంటి దుర్ఘటనలు జరగకూడదనే విద్యుత్ శాఖ అధికారులు కరెంటు నిలిపివేస్తుంటే దానిపైనా పడి ఏడ్వడం రామోజీకే చెల్లింది. -
డిజైన్ టెక్ ఆస్తులను ఈడీ జప్తు చేయడం సబబే
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కీలక పాత్రధారైన డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన రూ.31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను (పీఏవో) హైకోర్టు సమర్థించింది. అలాగే మనీలాండరింగ్ చట్టం కింద డిజైన్ టెక్కు అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులు సైతం సబబేనని పేర్కొంది. ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ డిజైన్ టెక్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందే తేల్చుకోవాలని డిజైన్ టెక్కు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఈడీ తరపు న్యాయవాది జోస్యుల భాస్కరరావు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ కుంభకోణం తీవ్రత, ఇందులో ప్రజాధనం ముడిపడి ఉన్న నేపథ్యంలో ఈడీ ఉత్తర్వులు, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ నోటీసుల విషయంలో డిజైన్ టెక్ వాదనను ఆమోదించలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఇటీవల కీలక తీర్పు వెలువరించారు. ఆధారాలను బట్టి జప్తు చేసే అధికారం ఈడీకి ఉంది ‘మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం ఈడీ అధికారులు ఏ వ్యక్తి ఆస్తినైనా జప్తు చేయొచ్చు. ఆ ఆస్తిని నేరం ద్వారా సంపాదించారనేందుకు తమ ముందున్న ఆధారాలను బట్టి జప్తు చేసే అధికారం అధికారులకు ఉంది. ఈ అధికారాన్ని ఉపయోగించే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో డిజైన్ టెక్ ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. నేరం ద్వారా సంపాదించిన డబ్బు లేదా ఆస్తి (ప్రొసీడ్స్ ఆఫ్ క్రైం)కి విస్తృత నిర్వచనం ఉంది. సీఐడీ జప్తు చేసే నాటికి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లను మాత్రమే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైంగా భావించవచ్చని, అంతకు మించిన మొత్తాలను జప్తు చేసే అధికారం ఈడీకి లేదన్న డిజైన్ టెక్ తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. వాస్తవానికి సీఆర్పీసీ సెక్షన్ 102 కింద సీఐడీ చేపట్టిన చర్యలు, మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ చేపట్టిన చర్యలు పరస్పరం భిన్నమైనవి. సీఐడీ జప్తుపై కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ముందు దాఖలైన వ్యాజ్యాల్లో ఈడీ ప్రతివాది కాదు. ఈ కోర్టులన్నీ కూడా కేవలం సీఐడీ జప్తు అంశానికే పరిమితమయ్యాయి. అందువల్ల ఈడీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులను ‘రెండో జప్తు’ అనడానికి ఏమాత్రం వీల్లేదు’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. డిజైన్ టెక్ వాదనలో ఏమాత్రం పస లేదు.. ‘అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు, ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులపై అభ్యంతరం తెలిపేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలను డిజైన్ టెక్ ఉపయోగించుకోవచ్చు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ నోటీసులకు వివరణ ఇచ్చినట్లు డిజైన్ టెక్ చెబుతోంది. అందువల్ల ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులను కూడా ఆ అథారిటీ ముందే తేల్చుకోవచ్చు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందుకు వెళితే తమకు ఇబ్బంది కలుగుతుందన్న డిజైన్ టెక్ వాదనలో ఏమాత్రం పస లేదు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా, ఇందులో ప్రజాధనం ముడిపడి ఉన్న కారణంతో ఆ వాదనను ఆమోదించలేకున్నాం. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని డిజైన్ టెక్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నాం. ఈ తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రభావానికి లోనవకుండా అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలి’ అని జస్టిస్ రవి తన తీర్పులో పేర్కొన్నారు. స్కిల్ కుంభకోణంపై రంగంలోకి దిగిన ఈడీ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు, అప్పటి మంత్రి అచ్చెన్నాయుడులతో పాటు పలువురు అధికారులను సీమెన్స్, డిజైన్ టెక్ తదితరులను నిందితులుగా చేర్చింది. వందల కోట్ల రూపాయల ప్రజాధనం దారి మళ్లడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా డిజైన్ టెక్ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు స్కిల్ కుంభకోణానికి సంబంధించినవేనని తేల్చింది. ఈ మొత్తాన్ని జప్తు చేస్తూ గతేడాది ఏప్రిల్ 21న ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు ఇచ్చింది. అనంతరం అడ్జ్యుడికేటింగ్ అథారిటీకి ఫిర్యాదు చేసింది. దీంతో అడ్జ్యుడికేటింగ్ అథారిటీ.. డిజైన్ టెక్కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గతేడాది జూలై 13లోపు ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని డిజైన్ టెక్‌ను ఆదేశించింది. ఈడీ ప్రాథమిక జప్తు ఉత్తర్వులను, అడ్జ్యుడికేటింగ్ అథారిటీ షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ డిజైన్ టెక్ చైర్మన్ కమ్ ఎండీ వికాస్ వినయ్ ఖాన్వీల్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీది రెండో జప్తు అవుతుంది.. డిజైన్ టెక్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, ఈడీ తరఫున సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ జోస్యుల భాస్కరరావు వాదనలు వినిపించారు. డిజైన్ టెక్ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును సీఐడీ జప్తు చేసిందని, దానిపై తాము కింది కోర్టును ఆశ్రయించామని ఆదినారాయణరావు చెప్పారు. బ్యాంకు ఖాతా నిర్వహణకు అనుమతినిచ్చిన కింది కోర్టు.. నగదును ఫిక్స్డ్ డిపాజిట్లుగా మార్చాలని ఆదేశించిందన్నారు. తరువాత ఈడీ ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వాస్తవానికి ఆ డబ్బును వినియోగించుకునేందుకు హైకోర్టు తమకు అనుమతినిచ్చిందని ఆదినారాయణరావు తెలిపారు. సీఐడీ జప్తు చేసిన మొత్తాలను తిరిగి ఈడీ జప్తు చేయడం రెండో జప్తు కిందకు వస్తుందని, ఒకే ఆస్తికి రెండు జప్తు ఉత్తర్వులు చెల్లవన్నారు. అందువల్ల ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నవించారు. బ్యాంకులో ఉన్న నగదు ఖాతాదారులకు చెల్లించాల్సిన మొత్తమన్నారు. తాము అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందుకు వెళితే నిర్దిష్ట గడువు లోపు చేయాల్సిన చెల్లింపులు చేయలేమని, దీంతో ఖాతాదారుల నుంచి సివిల్, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టుకు నివేదించారు. సీఐడీ, ఈడీ జప్తులు వేర్వేరు డిజైన్‌టెక్ వాదనలను ఈడీ తరఫు న్యాయవాది భాస్కరరావు తోసిపుచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై అడ్జ్యుడికేటింగ్ అథారిటీ విచారణ పూర్తి కాకుండా ఈ వ్యాజ్యం దాఖలు చేశారని, అందువల్ల ఇది అపరిపక్వ వ్యాజ్యమని.. దీన్ని కొట్టేయాలని కోరారు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులపై డిజైన్ టెక్కు అభ్యంతరం ఉంటే అప్పిలేట్ అథారిటీ వద్దకు వెళ్లాలని, ఆ తరువాతే హైకోర్టుకు రావాల్సి ఉంటుందన్నారు. ఈడీ జప్తు చేసిన మొత్తాలకు, నేరానికి సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత డిజైన్ టెక్పైనే ఉందన్నారు. షోకాజ్ నోటీసుకు ఆ సంస్థ ఇచ్చిన వివరణను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాల్సింది అడ్జ్యుడికేటింగ్ అథారిటీయేనన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 102 కింద సీఐడీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులకు, మనీలాండరింగ్ కింద ఈడీ జారీ చేసిన ఉత్తర్వులకు ఏ మాత్రం సంబంధం లేదని, అవి రెండూ వేర్వేరని నివేదించారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తాల విషయంలో కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సీఐడీ జప్తునకు సంబంధించినవే తప్ప, ఈడీ జప్తుకు సంబంధించినవి కావన్నారు.అందులో ఈడీ పార్టీ కూడా కాదన్నారు. అందువల్ల తమ జప్తు ఉత్తర్వులు రెండో జప్తు కిందకు రావని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు విని గతేడాది అక్టోబర్ 10న తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్ రవి ఇటీవల తన తీర్పును వెలువరించారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా, వడదెబ్బ బారిన పడకుండా పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం వేసవి తీవ్రతతో ఎండలు పెరుగుతుండటంతో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ‘వాటర్ బెల్’ విధానం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రోజూ ప్రత్యేకంగా మూడుసార్లు వాటర్ బెల్ మోగించి.. విద్యార్థులంతా తప్పనిసరిగా మంచినీరు తాగేలా చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఈనెల 23తో ముగియనుంది. అప్పటివరకు ‘వాటర్ బెల్’ కొనసాగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 12 నుంచి కూడా ఇదే విధానాన్ని విద్యాశాఖ కొనసాగించనుంది. డీహైడ్రేషన్‌పై విద్యార్థుల్లో అవగాహన పెంపునకు ప్రత్యేక పోస్టర్లను సైతం పాఠశాలల్లో ఏర్పాటు చేయనుంది. విద్యాశాఖ ఆదేశాలతో ఏప్రిల్ 1 నుంచే విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎదిగే పిల్లల్లో నీటిలోపం లేకుండా చేసేందుకే.. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఇదొక్కటే కాకుండా పలు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో నీటి లోపం లేకుండా చూసేందుకు వాటర్ బెల్ విధానం ఉపయోగపడుతుంది. ప్రధానంగా మూత్రం ఏ రంగూ లేకుండా పారదర్శకంగా ఉంటే శరీరంలో తగినంత నీరు ఉందని, సరిపడినంత నీరు తాగుతున్నారని అర్థం. మూత్రం లేత గోధుమ రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నారని భావించవచ్చు. లేత పసుపు రంగులో ఉంటే సాధారణ స్థితి అని, ఆరోగ్యంగా ఉన్నట్లు సంకేతం. ముదురు పసుపు రంగులో మూత్రం ఉంటే నీరు తక్కువగా తాగుతున్నారని, మరికొంత నీరు శరీరానికి అవసరమని అర్థం. తేనె రంగులో ఉంటే శరీరానికి తగినంత నీరు అందడం లేదని సంకేతం. ముదురు గోధుమ రంగులో మూత్రం ఉంటే వెంటనే ఎక్కువ నీరు తాగాలని అర్థం. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటిస్తారు. రోజూ మూడుసార్లు వాటర్ బెల్ రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ ఉదయం 9.45, 10.05, 11.50 గంటలకు మొత్తం మూడుసార్లు వాటర్ బెల్ మోగిస్తున్నారు. బెల్లు మోగిన వెంటనే ప్రతి విద్యార్థి మంచినీరు తాగాల్సిందే. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత కూడా వాటర్ బెల్ విధానాన్ని కొనసాగించాలని జిల్లా విద్యాధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. రోజూ వాటర్ బెల్ నిర్వహణను పర్యవేక్షించాలని డీఈవోలకు సూచించారు. అంతేకాకుండా మూత్రం రంగును బట్టి తమ శరీరంలో నీటి లోపాన్ని విద్యార్థులు తెలుసుకునేలా మూత్రశాలల వద్ద పోస్టర్లు అంటించాలని ఆదేశించారు. దీనిద్వారా నీరు తాగే అలవాటును విద్యార్థుల్లో పెంపొందించవచ్చన్నారు. -
బాబూ.. కాపులను మరోసారి మోసం చేయొద్దు
సాక్షి, అమరావతి: ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కాపులను మరోసారి మోసం చేయవద్దని చంద్రబాబుకు కాపు ఐక్యవేదిక హితవు పలికింది. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు పవన్‌తో కలిసి వస్తున్న చంద్రబాబు కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు చంద్రబాబుకు సోమవారం బహిరంగ లేఖ రాసింది. ఈ లేఖను మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇంటింటికి కరపత్రాల రూపంలో పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను కాపు ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోటిపల్లి అయ్యప్ప, కన్వీనర్ పెద్దిరెడ్డి మహేష్, కో–కన్వీనర్లు పంచాది రంగారావు, ఎన్.వి.రామారావు మీడియాకు విడుదల చేశారు. మూడు దశాబ్దాలుగా అమలుకు నోచుకోని కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు మోసం చేశారని గుర్తుచేశారు. కేంద్రం ఇచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు ఐదుశాతం అంటూ ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పారని పేర్కొన్నారు. -
సీఐడీ కేసుల్లో దోషులకు శిక్ష ఖాయం
సిట్ దర్యాప్తు చేస్తున్న కేసులకు సంబంధించిన పత్రాలన్నీ న్యాయస్థానాల్లో ఉన్నాయి. ఆ కేసుల్లో దోషులకు శిక్షలు పడటం ఖాయం. – సిట్‌కు నేతృత్వం వహిస్తున్న ఐజీ కొల్లి రఘురామరెడ్డి సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి, కుంభకోణాలపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నమోదు చేసిన కేసుల్లో దోషులకు శిక్ష ఖాయమని తేలడంతో ఎల్లో గ్యాంగ్ బెంబేలెత్తుతోంది. దాంతో సిట్‌పై దుష్ప్రచారం చేసేందుకు యత్నించి బోర్లా పడింది. చంద్రబాబు కేసుల పత్రాలను సిట్ కార్యాలయం ప్రాంగణంలో కాల్చివేస్తున్నారంటూ ఎల్లో చానళ్లు సోమవారం హడావుడి చేశాయి. ఈ ఎన్నికల తరువాత వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని భావించే సిట్ అధికారులు ఇలా పత్రాలను కాల్చివేస్తున్నారంటూ వక్రీకరించిన కథనాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించాయి. కానీ తాము దర్యాప్తు చేస్తున్న అయిదు కేసుల్లో పూర్తి ఆధారాలతో న్యాయస్థానాల్లో చార్జ్షీట్లు దాఖలు చేశామని, అంతకు ముందే కీలక కేస్ డైరీలు, ఆధారాలుగా ఉన్నఒరిజినల్ పత్రాలను కూడా న్యాయస్థానాలకు సమర్పించామని సిట్ స్పష్టం చేసింది. ఆ సందర్భంగా తీసిన లక్షలాది ఫొటోస్టాట్ కాపీల్లో సరిగా రాని వాటిని చిత్తుగా పరిగణించి కాల్చివేశామని వెల్లడించడంతో ఎల్లో మీడియా నోళ్లు మూతపడ్డాయి. అసలు కేసులకు సంబంధించిన పత్రాలను రహస్యంగా కాల్చివేసే ఉద్దేశమే ఉంటే ఎక్కడో రహస్యంగా చేస్తారు. అది పెద్ద కష్టమేమీ కాదు. కానీ, సిట్ కార్యాలయ ప్రాంగణంలో.. అదీ పట్టపగలు అందరూ చూస్తుండగా ఎందుకు చేస్తారు? ఈ చిన్న లాజిక్‌ను మర్చిపోయిన ఎల్లో మీడియా బోల్తా పడింది. అదిగో తోక.. ఇదిగో పులి తాడేపల్లిలోని సిట్ కార్యాలయం ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాంగణం సమీపంలో కొన్ని చిత్తుకాగితాలను సిబ్బంది సోమవారం ఉదయం కాల్చివేశారు. అది చూసి టీడీపీ నేతలు, ఆ పారీ్టకి కొమ్ముకాసే ఎల్లో మీడియా చానళ్లు హడావుడి మొదలుపెట్టాయి. చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల కీలక పత్రాలను సిట్ అధికారులు రహస్యంగా దహనం చేసేస్తున్నారని, వాటిలో హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించిన పత్రాలు ఉన్నాయంటూ ప్రచారం ప్రారంభించాయి. అనుమతి లేకుండా సిట్ అధికారులు తీసుకున్న హెరిటేజ్ ఫుడ్స్, నారా భువనేశ్వరిల ఆదాయ పన్ను రిటర్న్ కాపీలు వీటిలో ఉన్నాయని ఊదరగొట్టాయి. చంద్రబాబుపై అక్రమంగా కేసులు నమోదు చేశారని, లోకేశ్‌ను అక్రమంగా విచారించారని, అందుకే ఆ కేసుల కాపీలను దహనం చేసేస్తున్నారని కూడా చెప్పుకొచ్చాయి. అంతే కాదు.. ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బండారం బయటపడుతుందనే ఆందోళనతోనే సిట్ అధికారులు ఇలా పత్రాలను రహస్యంగా దహనం చేసేస్తున్నారని కూడా ఇష్టానుసారం వక్రీకరణలతో కూడిన కథనాలను ప్రసారం చేశాయి. ఎన్నికల వేళ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పడరాని పాట్లు పడ్డాయి. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టిన సిట్ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని సిట్ ఓ ప్రకటనలో సమర్థంగా తిప్పికొట్టింది. ‘సిట్ కార్యాలయం సమీపంలో దహనం చేసినవి చిత్తు ప్రతులే. మేము దర్యాప్తు చేస్తున్న 5 కేసుల్లో పూర్తి ఆధారాలతో ఇప్పటికే విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జిషిట్లు దాఖలు చేశాం. ఈ కేసుల కేస్ డైరీలు, ఇతర కీలక ఆధారాలను న్యాయస్థానానికి ఎప్పటికప్పుడు సమర్పించాం. ఆధారాల్లో వేటినీ ధ్వంసం చేయలేదు. ఆధారాలన్నీ భద్రంగా ఉన్నాయి. పూర్తి ఆధారాలతో నమోదు చేసిన ఈ కేసుల్లో దోషులకు శిక్షలు పడటం ఖాయం. ప్రతి కేసులో 40 మంది వరకు నిందితులు ఉన్నారు. ఒక్కో కేసులో ఒక్కో నిందితునికి సంబంధించి దాదాపు 10 వేల పేజీలను ఫొటోస్టాట్ కాపీలు తీయాల్సి వచ్చింది. లక్షలాది పేజీలు కాపీలు తీసే క్రమంలో మెషిన్లు వేడెక్కడం కాగితాలు వాటిలో ఇరుక్కుపోవడం, ఇంకు తగ్గిపోవడం వంటి కారణాలతో చాలా కాపీలు ఫేడ్ అవుట్ అయ్యాయి. వీటిని పక్కనపెట్టేసి కొత్తగా మళ్లీ కాపీలు తీయాల్సి వచ్చింది. ఫేడ్ అవుట్ అయిన వాటిని చిత్తుగా పరిగణించి కాల్చివేశాం. ఇది అన్ని దర్యాప్తు సంస్థల్లో, సాధారణ ఆఫీసుల్లో కూడా పాటించే ప్రక్రియే’ అని సిట్ అధికారులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే హెరిటేజ్ ఐటీ రిటర్న్‌లు తీసుకున్నాం హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ, చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల ఆదాయ పన్ను రిటర్న్ కాపీలను అక్రమంగా తీసుకున్నారని, అందుకే వాటిని దహనం చేశారన్న ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని కూడా సిట్ తిప్పికొట్టింది. తాము నిబంధనల ప్రకారమే హెరిటేజ్ ఫుడ్స్, ఇతర నిందితుల ఆదాయ పన్ను రిటర్న్ కాపీలను తీసుకున్నామని తెలిపింది. ఆదాయ పన్ను శాఖకు అధికారికంగా లిఖిత పూర్వకంగా కోరి వారి నుంచి ఆ కాపీలను తీసుకున్నామని చెప్పింది. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ నుంచి కూడా అధికారికంగానే లేఖ రాసి మరీ చాలా పత్రాలను తీసుకున్నామంది. ఆ ఐటీ రిటర్న్‌లు, హెరిటేజ్ ఫుడ్స్ నుంచి తీసుకున్న పత్రాల ఆధారంగానే ఈ కేసులో లోకేశ్, ఇతర నిందితులను విచారించామని సిట్ తెలిపింది. ఆ దర్యాప్తు నివేదికను కూడా న్యాయస్థానానికి సమర్పించామని చెప్పింది. ఓ వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడాన్ని సిట్ తీవ్రంగా ఖండించింది. ఆ మీడియా చానళ్లు దుష్ప్రచారాన్ని మాని వాస్తవాలను తెలుసుకోవాలని హితవు చెప్పింది. ‘హెరిటేజ్’కు దీటైన జవాబు ఇచ్చిన సిట్ చంద్రబాబుపై నమోదైన కేసులకు సంబంధించిన తమ కంపెనీ పత్రాల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ హెరిటేజ్ ఫుడ్స్ రాసిన లేఖకు సీఐడీ దీటైన సమాధానం ఇచ్చింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించిన పత్రాలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, అవన్నీ న్యాయస్థానానికి తాము ఎప్పుడో సమర్పించామని, అన్ని పత్రాలు భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈమేరకు సిట్ అధికారులు హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ సెక్రటరీ ఉమాకాంత బారిక్‌కు సోమవారం ఓ లేఖ రాళారు. తాము హెరిటేజ్ ఫుడ్స్‌కు అధికారికంగా లేఖ ద్వారా కోరి 2022 సెప్టెంబర్ 12 నుంచి 2023 అక్టోబరు 4 వరకు ఏడుసార్లు పొందిన ఆ కంపెనీ పత్రాల వివరాలను వెల్లడించారు. ఆ ఒరిజినల్ పత్రాలను న్యాయస్థానానికి సమర్పించిన వివరాలను సీఎఫ్ఆర్ నంబర్లతో సహా తెలిపారు. ఓ వర్గం మీడియా ఉద్దేశపూర్వకంగా చేసిన దుష్ప్రచారాన్ని ఖండిస్తూ తాము జారీ చేసిన ప్రెస్ నోట్‌ను కూడా ఈ లేఖకు జతపరిచారు. ఆ వర్గం మీడియా రాజకీయ దురుద్దేశాలతో సిట్‌పై చేస్తున్న దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్‌కు చేసిన ఫిర్యాదు కాపీని కూడా హెరిటేజ్ ఫుడ్స్‌కు అందించారు. -
ఎల్లో మీడియా దుష్ప్రచారంపై ఏపీ సీఐడీ సీరియస్
సాక్షి, తాడేపల్లి: ఎల్లో మీడియా చేసే దుష్ప్రచారంపై ఏపీ సీఐడీ సీరియస్ అయింది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్‌లో హెరిటేజ్ డాక్యుమెంట్లు తగలబెట్టారంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది. ఫైల్స్ తగలబెట్టారంటూ చేసిన ప్రచారాన్ని సీఐడీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సీఐడీ ఐజీ రఘురామిరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘డాక్యుమెంట్లు కాల్చారంటూ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. కొన్ని ఛానళ్లలో బాధ్యత రహితంగా ప్రచారం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు సహా 5 కేసుల్లో ఛార్జ్ షీట్లు దాఖలు చేశాం. ప్రతి ఛార్జ్ షీట్‌కు 8 వేల నుండి 10 వేల కాపీలతో రూపొందించాం. ప్రతి కేసు ఛార్జ్ షీట్ కాపీలను ప్రతి కేసులో ఉన్న నిందితులకు అందించాం. హెరిటేజ్‌కి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని కోర్టుకి అందజేశాం. హెరిటేజ్ కంపెనీకి చెందిన వ్యక్తుల ఐటీ రిటర్న్స్ వివరాలు కోర్టుకి అందజేశాం. హెరిటేజ్ కంపెనీకి చెందిన వారికి కూడా ఆ డాక్యుమెంట్లు అందించాం’ అని సీఐడీ ప్రకటనతో పేర్కొంది. -
సమస్యలు తీరి సంతోషంగా జీవనం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. సమస్యలు తీరి సంతోషంగా జీవనం నేను వ్యవసాయ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురంలో కాపురం ఉంటూ వచ్చిన అరకొర ఆదాయంతో పిల్లల చదువులు ఎలా అని నిత్యం తల్లడిల్లిపోయే వాళ్లం. గత ప్రభుత్వ హయాంలో మాకు ఎలాంటి సాయం అందలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత మాకు చాలా మేలు జరిగింది. బడికెళ్తున్న మా అమ్మాయికి ఐదేళ్లుగా జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 15 వేలు వంతున వచ్చింది. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 వంతున, వైఎస్సార్ ఉచిత పంట బీమా ద్వారా రూ.6,460, ఇన్పుట్ సబ్సిడీ పథకం ద్వారా రూ.31,950 వచ్చాయి. ముఖ్యంగా నిరుపేదలైన మాకు విలువైన ఇంటి స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయంగా రూ.1.80 లక్షలు మంజూరయ్యాయి. దాంతో ఇంటి నిర్మాణం చేపట్టాం. ఇప్పుడు మా కుటుంబం హాయిగా జీవిస్తోందంటే దానికి కారణమైన ముఖ్యమంత్రి జగనన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. – అంసూరి జయపాలకృష్ణ, కపిలేశ్వరపురం (పెద్దింశెట్టి లెనిన్ బాబు, విలేకరి, కపిలేశ్వరపురం) బిచ్చగాళ్లను కాస్తా లక్షాధికారులను చేశారు మా తల్లిదండ్రులు, తాతలు సంచార జీవనం గడుపుతూ... ఆకివీడులోని దుంపగడప రైల్వే గేటు వద్ద రైల్వే స్థలంలో 50 ఏళ్లుగా గుడారాల్లో జీవనం గడిపారు. నా తల్లిదండ్రులు రైల్వే స్థలంలో గుడిసె వేసుకుని జీవించారు. మాకు, మా తల్లిదండ్రులకు, తాత ముత్తాతలకు చదువులు లేవు. గుంతలు, కాల్వల్లో చేపలు పట్టుకుని భిక్షాటన చేసి జీవనం సాగించాం. రైల్వే స్థలం నుంచి మమ్మల్ని ఖాళీ చేయించినప్పుడు అప్పటి ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు పెద్ద మనస్సుతో మా తల్లిదండ్రులకు సమతానగర్ రోడ్డులోని చినకాపవరం డ్రెయిన్ వద్ద స్థలాలు ఇచ్చారు. పాకలు, రేకుల షెడ్లు వేసుకుని మా తల్లిదండ్రులతో కలిసి ఉన్నాం. నాకు పెళ్లయిన తరువాత ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో 11 మంది చెంచులకు కుప్పనపూడి శివారు తాళ్లకోడు వద్ద ఒక్కొక్కరికి సెంటు భూమి చొప్పున కేటాయించారు. ఇంటి నిర్మాణానికి రూ. 1.80లక్షలు ఆర్థిక సాయం చేశారు. డ్వాక్రా రుణం తీసుకుని, కొద్దిగా అప్పు చేసి ఆ మొత్తానికి జమచేసి మేము పక్కా భవనం నిర్మించుకుంటున్నాం. జగనన్న దయతో మా పిల్లల్ని చదివించుకుంటున్నాం. అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 15వేలు వంతున సాయం అందుతోంది. ప్రభుత్వ పాఠశాలలో మంచిగా చదువు చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. స్కూలుకు వెళ్లే పిల్లలకు దుస్తులు, బ్యాగ్‌లు, పుస్తకాలు, టై, బూట్లు ఇవ్వడం బాగుంది. ప్రస్తుతం మేము చేపలు పట్టుకోవడంతోపాటు చిన్నచిన్న పనులు చేసుకుని జీవిస్తున్నాం. బిక్షగాళ్లుగా ఉన్న మమ్మల్ని లక్షాధికారులను చేసిన ఘనత జగన్‌దే. ఆయనకు రుణపడి ఉంటాం. – నల్లబోతుల అప్పన్న తాళ్లకోడు (బీఆర్ కోటేశ్వరరావు, విలేకరి, ఆకివీడు) ఇంతటి సాయం ఎన్నడూ ఎరుగం మాది నిరుపేద కుటుంబం. ఈ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు మా కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలిచాయి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు గ్రామంలో చిన్న చికెన్ దుకాణాన్ని పెట్టుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. గత ప్రభుత్వంలో ఏ మేలూ జరగలేదు. ఈ ప్రభుత్వంలో సొంతింటి కల నెరవేరింది. స్థలం మంజూరు చేయడమే గాకుండా ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. నా భార్య వరలక్ష్మి ఇంటి దగ్గర టైలరింగ్ చేస్తూ నాకు అండగా నిలుస్తోంది. ఆమెకు చేదోడు కింద గత మూడేళ్లగా ఏటా రూ.10 వేలు, అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందింది. మాకు ఆర్థికంగా అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణ పడి ఉంటాం. – దొమ్మా వీరబాబు, ప్రత్తిపాడు (ప్రగడ రామకృష్ణ, విలేకరి, ప్రత్తిపాడు రూరల్) -
ఎవరి సిఫార్సు లేకుండా ఇల్లు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఎవరి సిఫార్సు లేకుండా ఇల్లు నేను తాపీ పని చేస్తుంటాను. పార్వతీపురం మన్యం జిల్లాలోని వీరఘట్టానికి చెందిన మేము పొట్టకూటికోసం విజయనగరం జిల్లా రాజాం పట్టణానికి కొన్నేళ్ల క్రితం వలస వచ్చాం. గాయత్రీకాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉండేవాళ్లం. నా కొచ్చే అరకొర ఆదాయం సరిపోకపోవడంతో నా భార్య సంధ్య.. ఇంట్లో టైలరింగ్ పని చేస్తోంది. మాకు ఇద్దరు పిల్లలు. గత ప్రభుత్వ హయాంలో మాకు పని సరిగ్గా ఉండేది కాదు. ఎలాంటి సాయమూ అందేది కాదు. కానీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మా పరిస్థితి మెరుగు పడింది. మాకు చేతి నిండా పని దొరుకుతోంది. ఈ ప్రభుత్వంలోనే మాకు రైస్ కార్డు ఇచ్చారు. బడికెళ్తున్న మా అబ్బాయికి అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వంతున వచ్చింది. మరీ ముఖ్యంగా ఎవరి సిఫారసు లేకుండానే ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి నిధులు ఇచ్చారు. అందరిలానే మేం కూడా కంచరాం సమీపంలో మాకు ఇచ్చిన స్థలంలో సొంత ఇంటిని నిరి్మంచుకున్నాం. నెల రోజుల క్రితం గృహ ప్రవేశం చేశాం. కేవలం అర్హతే ప్రామాణికంగా ఎలాంటి పైరవీలు లేకుండా ఇన్ని సౌకర్యాలు కల్పించిన ఈ ప్రభుత్వం రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. – గంధవరపు సురేష్, రాజాం. (వి.వి.దుర్గారావు, విలేకరి, రాజాం) పేపర్ ప్లేట్ల తయారీతో దర్జాగా జీవనం నేను సాధారణ గృహిణిని. విశాఖ జిల్లా చిట్టివలస గ్రామానికి చెందిన నేను గత ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుని స్వయం సమృద్ధి సాధించే దిశగా సాగుతున్నాను. నేను డ్వాక్రా గ్రూప్ సభ్యురాలిని కావడంతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా జీవీఎంసీ భీమిలి జోన్ ద్వారా పట్టణ ప్రగతి యూనిట్ పేరుతో రెండు నెలల క్రితం పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ పెట్టుకున్నా. ఈ యూనిట్ విలువ రూ.2,02,500. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.39,600. యూనిట్‌కు యంత్ర పరికరాలు, మెటీరియల్ ప్రభుత్వమే ఇచ్చింది. ప్రోత్సాహకంగా నాలుగు నెలల అద్దె కింద మరో రూ.20 వేలు ఇచ్చారు. పేపర్ ప్లేట్ల తయారీలో భాగంగా పాలిథిన్ రహిత పేట్ల తయారీలో శిక్షణ తీసుకున్నా. పేపర్ అట్టలపై విస్తర్లు ఉంచి సంప్రదాయ పద్ధతిలో భోజనాలకు అనువుగా వినియోగదారుల అభిరుచి మేరకు తయారు చేయగలుగుతున్నా. వ్యాపారం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఇల్లు లేని మాకు ఇంటి స్థలం ఇవ్వడమే గాకుండా ఇంటి నిర్మాణానికి రూ. 1.80 లక్షల ఆర్థికసాయం చేశారు. దాంతో ఇంటి నిర్మాణం పూర్తిచేసుకోగలిగాం. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిన ఈ ముఖ్యమంత్రికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – వెంపాడ అరుణ, చిట్టివలస (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి, తగరపువలస) -
61.37 లక్షల మందికి రూ.1,847.85 కోట్లు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు.. వలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయించి తీవ్ర అవాంతరాలు సృష్టించాలని చూసినా ప్రభుత్వం ఠంఛన్‌గా పింఛన్ పంపిణీ చేసింది. కేవలం రెండున్నర రోజుల వ్యవధిలోనే 61,37,464 మంది లబ్ధిదారులకు రూ.1,847.85 కోట్లను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాల వద్ద బుధవారం మధ్యాహ్నం నుంచి పంపిణీ ప్రారంభించి, శుక్రవారం సాయంత్రానికి 93.42 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తి చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దే సచివాలయాల ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేశారు. చిత్తూరు, ఏలూరు, విశాఖపట్నం జిల్లాల్లో 95 శాతం మందికి పైగా పంపిణీ పూర్తయినట్టు అధికారులు తెలిపారు. శనివారం కూడా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సచివాలయాల వద్ద పంపిణీ కొనసాగుతుంది. -
హలీమ్.. రుచికి సలామ్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): దీని రుచికి ఎవ్వరైనా సలామ్ కొట్టి గులామ్ కావాల్సిందే. ఒకసారి తింటే మళ్లీమళ్లీ తినాలపించే రుచి దీనిది. ముస్లింలతో పాటు అన్ని వర్గాల ప్రజలూ ఎంతో ఇష్టంగా తీసుకునే అత్యంత ఆరోగ్యకరమైన ఆహారం ఇది. దీని పేరే హలీమ్. సంవత్సరంలో ఒక్క రంజాన్ మాసంలోనే ఎక్కువగా లభిస్తుంది. హైదరాబాద్‌లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ వంటకం రాజమహేంద్రవరానికి మంచి పేరు తీసుకుని వచ్చింది. హైదరాబాద్ బిర్యానీ తరువాత అంత ఎక్కువగా జిల్లా వాసులు ఇష్టపడే వంటకం హలీమ్. రంజాన్ మాసంలో సాయంత్రం 4 గంటలు దాటిన తరువాత కులమతాలకు అతీతంగా భార్యాపిల్లలతో కలిసి షాపులకు వచ్చి హలీమ్ తినడం రాజమహేంద్రవరంలో నిత్యం కనబడే దృశ్యం. ఒక్క నగర వాసులే కాకుండా కోనసీమ, కాకినాడ, కొవ్వూరు తదితర ప్రాంతాల వారు కూడా ఇక్కడకు వచ్చి ఈ హలీమ్ రుచి చూస్తారు. హైదరాబాద్ హలీమ్ మన దేశంలో జియోగ్రాఫికల్ ఇండికేటర్ (భౌగోళిక చిహ్నం) గుర్తింపు పొందడం విశేషం. అంతర్జాతీయ ఫుడ్ బిజినెస్‌లో హలీమ్‌కు మంచి మార్కెట్ ఉంది. నవాబుల కాలంలో పరిచయం హైదరాబాద్ ఆరో నవాబు మహబూబ్ అలీఖాన్‌కు అరబ్ దియాస్సార తెగకు సంబంధించిన వ్యక్తి ఈ హలీమ్‌ను పరిచయం చేశాడు. అయితే అప్పుడు హలీమ్‌లో నాలుగు రకాల దినుసులు మాత్రమే వాడేవారు. ఏడో నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన వంటవారితో బిర్యానీలా మరింత రుచికరంగా ఉండేలా తయారు చేయాలని సూచించాడు. దీంతో నవాబు ఆస్థాన వంటవారు బిర్యానీకి వాడే దినుసులతో హలీమ్ తయారు చేశారు. ఇది పాత హలీమ్ కంటే రుచిలో మేటిగా, శక్తినివ్వడంలో మరింత మెరుగ్గా ఉండటంతో.. అప్పటి నుంచీ హైదరాబాద్ నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అరబ్బు దేశం నుంచి వచ్చిన ఈ వంటకం, కొత్త రుచులను అద్దుకుని, తిరిగి మళ్లీ అక్కడికే సరఫరా అవుతూండటం విశేషం. ఇప్పుడు అమెరికా, బ్రిటన్ వంటి 30 దేశాల్లోని ప్రజలు ఈ హలీమ్ రుచిని ఆస్వాదిస్తున్నారు. 30 రకాల దినుసులతో.. అత్యధిక పోషకాలున్న ఆహారం ఇది. ప్రొటీన్లు, , కాల్షియం ఇందులో పుష్కలంగా ఉన్నాయి. చికెన్, మటన్, వెజిటేరియన్ అనే మూడు రకాల హలీమ్‌లు తయారు చేస్తారు. దీని తయారీలో స్వచ్ఛమైన నెయ్యి, వెన్న, గోధుమలు, జీడిపప్పు, బాదం, పిస్తా, షాజీరా, యాలకులతో పాటు సన్నగా తరిగి, నేతిలో వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వంటి సుమారు 25 రకాల వివిధ రుచికరమైన వంట పదార్థాలు వాడతారు. శరీరంలో లోపించే విటమిన్లను సమృద్ధిగా అందించే ప్రత్యేక వంటకం హలీమ్. శారీరక శక్తి లోపించిన వారికి ఇది దివ్యౌషధం వంటిది. అందుకే కఠినమైన ఉపవాస దీక్ష చేసే ముస్లింలు తక్షణ శక్తి కోసం హలీమ్‌ను ఉపవాస దీక్ష విరమణ అనంతరం సాయంత్రం ఇఫ్తార్‌గా స్వీకరిస్తారు. దీంతో శరీరంలో శక్తి పునరుత్తేజితమవుతుంది. వారు మళ్లీ సెహర్ నుంచి ఇఫ్తార్ వరకూ ఉపవాస దీక్ష చేయడానికి శక్తినిస్తుంది. తయారీ ఇలా.. హలీమ్ తయారీ చాలా కష్టంతో కూడుకున్నది. దీని తయారీకి ఇద్దరు మాస్టర్లు ఇటుకలతో తయారు చేసిన బట్టీలో మంటల సెగ వద్ద 10 నుంచి 12 గంటల శ్రమ పడాల్సి ఉంటుంది. చిన్నపాటి మంటపై వంటకం అడుగంటకుండా ఇద్దరు వ్యక్తులు నిత్యం పొడవాటి చేతికర్రతో నిత్యం తిప్పుతూ ఉండాలి. ఏ మాత్రం అడుగంటినా దీని రుచి పాడవుతుంది. అందుకే జాగ్రత్తగా ఇన్ని గంటల పాటు చాలా ఓపికతో దీనిని తయారు చేస్తారు. రాజమహేంద్రవరంలోనూ తయారీ ఒకప్పుడు హలీమ్ పేరు చెప్తే హైదరాబాద్ గుర్తుకు వచ్చేది. కానీ నేడు హలీమ్‌కు రాజమహేంద్రవరం కూడా కేరాఫ్‌గా మారింది. అక్కడి నుంచి వంట మాస్టర్లను ఇక్కడకు తీసుకుని వచ్చి అదే విధమైన రుచి వచ్చేలా ఇక్కడ హలీమ్ తయారు చేస్తున్నారు. నగరంలోని జాంపేటలో సుమారు 20 వరకూ షాపులు ఏర్పాటు చేశారు. వీటిలో 60 నుంచి 70 మంది వరకూ హలీమ్ మాస్టర్లు పని చేస్తున్నారు. ఎక్కువగా చికెన్, మటన్ హలీమ్‌లు అమ్ముడవుతున్నాయి. చికెన్ హలీమ్ రూ.90, మటన్ హలీమ్ రూ.120కి, వెజిటబుల్ హలీమ్‌ను రూ.50కి విక్రయిస్తున్నారు. మరికొన్ని షాపుల్లో చికెన్ హలీమ్ రూ.60, మటన్ హలీమ్ రూ.90కే విక్రయిస్తున్నారు. హలీమ్ ఆరగించిన తరువాత స్పెషల్ రంజాన్ డ్రింక్‌లు తాగడానికి అత్యధికులు ప్రాధాన్యం ఇస్తారు. ప్రూట్ సలాడ్, ఫలూదా, డ్రైఫ్రూట్ ఐస్‌క్రీమ్, షర్బత్, జీరా సోడా వంటి వాటికి గిరాకీ ఎక్కువ. చాలా శ్రమ పడాలి మూడు తరాలుగా హలీమ్ తయారీలో మాకు ప్రావీణ్యం ఉంది. దీని తయారీకి 10 నుంచి 12 గంటల వరకూ పడుతుంది. తెల్లవారుజామున ప్రారంభిస్తే సాయంత్రం 4 గంటలకు అందించగలం. పెద్ద పొయ్యి పెట్టి, వాటి మీద పెద్ద బానలు పెట్టి వంట చేస్తాం. ఒక్కో బానలో 10 కేజీల వరకూ హలీమ్ తయారవుతుంది. 10 కేజీల చికెన్, 10 కేజీల మటన్, 10 కేజీల వెజిటబుల్ హలీమ్ తయారు చేస్తాం. – సయ్యద్ రబ్బానీ రంజాన్‌లో తప్పక తింటాను ఇక్కడ అమ్ముతున్న హలీమ్‌ను ఏటా క్రమం తప్పకుండా తింటున్నాను. దీని రుచికి మరేదీ సాటి రాదు. చికెన్ హలీమ్, మటన్ హలీమ్ చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి. పేస్టు చేసినట్టుగా ఉండటంతో నమిలి మింగాల్సిన అవసరం లేకుండా గొంతులోకి జర్రున జారిపోతుంది. అందుకే రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా తింటాను. – యర్రా భాస్కరరాజు, వస్త్ర వ్యాపారి -
సరికొత్త అధ్యాయంగా సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’
ప్రజల కోసం నిలబడ్డ నాయకుడు.. ప్రజాసైన్యంతో ఎన్నికల రణ రంగంలోకి దూకితే ఎలా ఉంటుందో చూడాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ సభలను చూడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జన సామాన్యంతో చేయి చేయి కలిపి సాగుతున్న ఈ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయంగా నిలిచిపోతుందని అంచనా. ఐదేళ్లూ తమను కాపుకాసిన నాయకుడి కోసం ప్రజలు దూరాభారాలు లెక్క చేయడం లేదు.. మలమల మాడ్చే ఎండలనూ పట్టించుకోవడం లేదు. ఒక్కసారి అంటే ఒక్కసారి అభిమాన నేతను కళ్ల నిండా చూసుకోవాలన్న ప్రజల తాపత్రయం అడుగడుగునా ప్రస్ఫుటంగా కనిపిస్తూంటుంది ఈ యాత్ర పొడవునా!. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపలపాయలో గత నెల 26న మొదలైన యాత్ర ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలను దాటుకుని నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. రాయలసీమ మొత్తం భానుడి భగభగలను సైతం తట్టుకుని అభిమాన జన సముద్రం సీఎం జగన్ వెంట ఒక ప్రవాహంలా కదిలింది. బస్సు యాత్ర రోజూ ఉదయమే ప్రారంభం కావాల్సి ఉండగా.. తెల్లవారుతూండగానే పరిసరాల్లోని అభిమాన గణం ముఖ్యమంత్రి జగన్ బస చేసిన టెంట్ దగ్గరకు చేరిపోతున్నారు. ఒక్కసారి కళ్లారా చూసేందుకు పోటీపడుతున్నారు. వారి అభిమానానికి ఆకలిదప్పులూ భయంతో దూరమైపోయాయి. గొంతు తడారిపోతున్నా.. శరీరం చెమటతో తడిసి ముద్దవుతున్నా.. సీఎం వైఎస్ జగన్‌పై వారి అభిమానం అణువంత కూడా తగ్గలేదు. చిక్కటి చిరునవ్వుతో టెంట్ నుంచి బయటకొచ్చే జగన్‌ను చూసుకున్న తరువాతే వారు ముందుకు కదులుతున్నారు. జై జగన్ అంటూ నినదిస్తూ బస్సుయాత్రతో మమేకమై పోతున్నారు. అందరిలో ఒకడిగా.. ‘మేమంతా సిద్ధం’ యాత్రలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలతో కలుస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బస దగ్గరికి వచ్చిన వారందరినీ పలుకరించి వారి కష్టసుఖాలు తెలుసుకున్న తరువాత మాత్రమే సీఎం జగన్ యాత్రను చేపడుతూండటం గమనార్హం. తమ కష్టాలు తీర్చిన నేతకు కృతజ్ఞత చెప్పాలని వచ్చిన వారు ఏ ఒక్కరినీ నిరాశ పరచరాదన్నదే జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ జన సందోహంలోనే ఎవరైనా తమ కష్టాలు చెప్పుకునేందుకు ముందుకొస్తే వారి బాధను ఆసాంతం వినడం మాత్రమే కాదు.. అక్కడికక్కడే ఆ సమస్య పరిష్కారానికి తగిన ఆదేశాలు, సూచనలు చేసేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ క్రమంలో చాలా సందర్భాల్లో సీఎం జగన్‌తో ఫొటో దిగేందుకు ప్రజలు, అభిమానులు పట్టుబట్టడం వారి అభిమానానికి, పట్టుదలకు ముఖ్యమంత్రి సైతం చాలాసార్లు ఓడిపోతున్నారు కూడా. అడిగిన వారందరితో సెల్ఫీలు దిగిన తరువాతే ముందుకు కదులుతున్నారు. గ్రామ గ్రామాన నీరాజనం.. రాజు వెడలె రవితేజములు అలరగ అన్న పద్యం గుర్తుకొస్తుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రను చూసిన వారికి. బస్సు ముందు వెనుకల జెండాలతో అభిమాన గణం.. గ్రామ గ్రామాన బస్సు యాత్రకు మిద్దెలెక్కి, చెట్లు ఎక్కి వేచి చూస్తున్న జనం.. ఇదీ జగన్ ‘మేమంత సిద్ధం’ యాతరంలో ప్రతి దినం ఆవిషృతమవుతున్న దృశ్యం. బస్సు దగ్గరకు రాగానే ఆడా మగా తేడా లేకుండా అందరూ చుట్టుముట్టడం. పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలకడమన్న అపురూపమైన దృశ్యాలు మన మనస్సుల్లో నిలిచిపోతాయి. గ్రామంలో రోడ్ల వెంబడి కదం తొక్కుతున్న వారిని ‘ఎందుకింత అభిమానం’ అని అడిగితే ఠక్కున వచ్చే సమాధానం.. ‘ఆయన మాకు చేసిన దాంతో పోలిస్తే ఇదెంత’ అని!. యాత్రలో మరో అధ్బుతమైన ఘట్టం.. ప్రజలతో ముఖ్యమంత్రి జగన్ మాటామంతి. గ్రామాల్లో ప్రజలతో కలిసి సంక్షేమ పథకాలపై చేస్తున్న సమీక్ష ఐదేళ్లలో గ్రామానికి జరిగిన మంచిని ముఖ్యమంత్రి అంకెలతో సహా వివరిస్తున్నప్పుడు గ్రామస్తులు తమ కృతజ్ఞతను వెలిబుచ్చే తీరు కూడా అద్భుతం. జనమే స్టార్ క్యాంపెయినర్లు.. బస్సు యాత్రలో చివరి అంకం బహిరంగ సభ. రోజూ జరిగే ఈ సమావేవం కోసం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇలా వచ్చిన జనాలకు నిర్వహకులు చేసిన ఏర్పాట్లు ఏమాత్రం చాలని పరిస్థితి. ఇక సీఎం బస్సు సభా ప్రాంగణానికి రాగానే రణ నినాదంలా జై జగన్ నినాదం వినిపిస్తుంది. ముఖ్యమంత్రి స్టేజీ మీద నుంచి ర్యాంప్‌పై నడుస్తుంటే జనాలు ఉర్రూతలూగిపోతున్నారు. అభిమానుల కేరింతలు.. ఈలలు, కరతాళ ధ్వనులు.. నినాదాలతో సభా ప్రాంగణం మొత్తం పండుగ వాతావరణం ఏర్పడిపోతోంది. జగన్ స్పీచ్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి ప్రతీ మాటకు జనం నుంచి అదే స్థాయిలో రియాక్షన్. అది రాజకీయ స్పీచ్ కాదు.. జుగల్బందీలా కొనసాగే డిస్కషన్. ఉదయం నుంచి ఎదురుచూసిన జనానికి సీఎం జగన్ మాట్లాడిన మాటలు టానిక్‌గా ఉంటాయి. సభ పూర్తయ్యాక రెట్టించిన ఉత్సాహంతో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలను తమ ఊరికి మోసుకెళ్తారు. అక్కడ సభ గురించి చర్చపెడతారు. సీఎం జగన్ చెప్పినట్లు వారే స్టార్ క్యాంపేనర్లుగా పథకాలను ప్రజలకు వివరిస్తారు. ఆయనపై జరిగే కుట్రలను ప్రజాకోర్టులో ఎండగడతారు. మేమంతా సిద్ధం బస్సుయాత్ర.. ఎన్నికల యాత్ర కాదు. రాజకీయ ప్రకటనల కోసం చేస్తున్న ప్రయాణం కాదు. ఇది ఓ ప్రజా నాయకుడు ప్రజలతో మమేకమవుతున్న అపురూప ఘట్టం. -
Fact Check: బూటకాల బాబుకు రామోజీ బాకా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మైనారిటీలకు మేజర్ మేలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రామోజీ మరోసారి విషం చిమ్మారు. వైఎస్సార్సీపీకి ముస్లిం మైనారీటీలు అండగా ఉన్నారని గుర్తించిన దినకంత్రీ పత్రిక ఈనాడులో తప్పుడు కథనం వండివార్చారు. వాస్తవాలను వక్రీకరించి చంద్రబాబుకు బాకా ఊదారు. మైనారిటీలను మోసం చేసిన జగన్ అంటూ గగ్గోలు పెట్టారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మైనారిటీలకు అందించిన సాయం, సీఎం వైఎస్ జగన్ సర్కార్ అందించిన ఆర్థిక లబ్ది అధికారిక లెక్కలను గమనిస్తే నిజానికి మైనారిటీలకు ధోకా ఇచ్చింది ఎవరో ఇట్టే అర్థమవుతోంది. బాబు చేసిన అరకొర సాయాన్ని భూతద్దంలో చూపే యత్నం చేస్తున్న రామోజీ పచ్చకళ్లకు సీఎం వైఎస్ జగన్ నవరత్నాలతో మైనారిటీలకు కల్పించిన ఆర్థిక భరోసా కన్పించలేదు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో మైనారిటీలకు సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ పద్ధతిలో రూ.13,239.49 కోట్లు నేరుగా వారి ఖాతాలకే జమ చేశారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, జగనన్న తోడు వంటి కార్యక్రమాల ద్వారా (నాన్ డీబీటీ) మరో రూ.11,064.88 కోట్లు ప్రయోజనం చేకూర్చారు. ఐదేళ్లలో మొత్తం రూ.24,304.37 కోట్ల మేర మైనారిటీలకు లబ్ధి చేకూర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతోంది. మైనారిటీలకు ధోకా ఇచ్చింది బాబే.. ముస్లిం మైనారిటీ ర్గాల సంక్షేమానికి 2014 మేనిఫెస్టోలో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయలేదు. హజ్ యాత్రికుల సౌకర్యం కోసం విశాఖపట్నం, విజయవాడ, రేణిగుంటలో హజ్ హౌస్‌ల నిర్మాణం హామీ కార్యరూపం దాల్చలేదు. ముస్లిం జనాభా ప్రాతిపదికగా దామాషా ప్రకారం బడ్జెట్లో నిధులూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లూ కేటాయిస్తానన్న హామీనీ బాబు అటకెక్కించారు. వక్ఫ్ ఆస్తుల రికార్డులను పక్కాగా తయారు చేసి వాటిని పరిరక్షిస్తామని చెప్పి మోసం చేశారు. నిరుద్యోగ ముస్లిం యువత స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షలు, వ్యాపారం కోసం రూ.లక్ష వడ్డీలేని రుణాలు ఇస్తామని అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వడ్డీలేని ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని ఇచ్చిన ప్రధాన హామీనీ అమలు చేయలేదు. అయినా అప్పుడు బాబు ఘనకార్యాలు రామోజీ పచ్చకళ్లకు కనిపించలేదు. ఆరోపణ: ఇదీ వైకాపా ఘనకార్యం వాస్తవం: స్వయం ఉపాధి రుణాల కోసం నిధులు కేటాయించి అమలు చేయలేదని ఈనాడు అడ్డగోలుగా రాసింది. వాస్తవానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక మైనారిటీలకు శాశ్వత జీవనోపాధి చూపించేలా వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా వంటి పథకాలను ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ ఐదేళ్ల కాలంలో చేయూత ద్వారా 2,24,334 మంది మైనారిటీలకు రూ.1,613.25 కోట్లు అందించింది. ఆసరా పథకం ద్వారా 1,69,412 మందికి రూ.583.01 కోట్లు అందించి వారికి అండగా నిలిచింది. ఆరోపణ: రాయితీ రుణాలకూ పాతర వాస్తవం: 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 36.18 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వారిలో అత్యధిక శాతం మంది చిరు వ్యాపారులు, చేతివృత్తుల వారు ఉండటంతో వారికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండదండలు అందిస్తోంది. గత ప్రభుత్వం మాదిరిగా అరకొర సాయం చేసి చేతులు దులుపుకోకుండా వారికి స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేలా, ఆర్థిక, సామాజిక, రాజకీయ చేయూతను అందించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. నవరత్నాలతోపాటు అనేక కార్యక్రమాల ద్వారా వారి జీవనోపాధికి ఊతమిచ్చేలా చేయడంలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, వైఎస్సార్ వాహన మిత్ర వంటి అనేక పథకాలతో మైనారిటీలకు పెద్ద మేలు చేశారు. ఆరోపణ: ఇమామ్‌లు.. మౌజమ్‌లకు వెన్నుపోటే వాస్తవం: రాష్ట్రంలో మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లు, మౌజమ్‌లకు ఆర్థిక సాయం అందించే విషయంలో ఈనాడు చంద్రబాబు గొప్పులు ఘనంగా చెప్పే యత్నం చేసింది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అరకొరగా ఆర్థిక సాయం అందిస్తే దాన్ని పెంచి మరీ అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కు దక్కుతోంది. గత ప్రభుత్వం మౌజమ్‌లకు రూ.3 వేలు, ఇమామ్‌లకు రూ.5 వేలు మాత్రమే అందించింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మౌజమ్‌లకు రూ.5 వేలు, ఇమామ్‌లకు రూ.10 వేలు ఆర్థిక సాయం పెంచి జగన్ అందిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనంగా రూ.300.68 కోట్లు అందించింది. దీనికితోడు వారికి భరోసా ఇచ్చేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వన్‌టైమ్ ఫైనాన్సియల్ అసిస్టెన్సీ ఇచ్చింది. తెల్లకార్డుదారులకు స్పెషల్ కోవిడ్ అసిస్టెన్సీగా మైనార్టీలకు సుమారు రూ.100 కోట్లు అందించింది. షాదీతోఫా ద్వారానూ ఆర్థిక సాయాన్ని పెంచి అందించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దక్కింది. ఆరోపణ: తేదేపా హయాంలో రూ.248 కోట్ల రుణాలు వాస్తవం: టీడీపీ ప్రభుత్వంలో గొప్పగా రుణాలు ఇచ్చినట్టు రామోజీరావు బాకాలు ఊదారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనారిటీల సామాజిక ఆర్థిక అభివృద్ధి, శిక్షణ, విద్యాభివృద్ధి కోసం బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చినట్టు గొప్పలు పోయారు. వాస్తవానికి 2014 నుంచి 2019 వరకు బ్యాంకుల ద్వారా ఇచ్చిన రుణాలకు టీడీపీ ప్రభుత్వం రూ.343.52 కోట్లు కేటాయించి రూ.248.51 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం శోచనీయం. ఐదేళ్లలో కేటాయించిన నిధులూ లబ్దిదారులకు ఖర్చు చేయలేని దారుణమైన పరిస్థితి గత ప్రభుత్వానిది. మరోవైపు మైనారిటీల శిక్షణ–ఉపాధి పథకంలో 2014 నుంచి 2019 వరకు కేవలం రూ.62 కేటాయించి అందులోనూ రూ.53.89 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం గమనార్హం. అదీ తొలి ఏడాది కేవలం రూ.4.30 కోట్లు కేటాయించి, ఎన్నికల ముందు మాత్రం గొప్పలు చెప్పుకొనేందుకు రూ.16.80 కోట్లు కేటాయించారు. బాబుకు రామోజీ చేస్తున్న భజనను జనం నమ్మరు చంద్రబాబు రాజకీయ ప్రయోజనం కోసం రామోజీ ఎంత బాజా వాయించినా జనం నమ్మే స్థితిలో లేరు. నవరత్నాల ద్వారా ఆర్థిక లబ్ధిని చేకూర్చే అనేక పథకాలను అందించడంతోపాటు మైనారిటీలకు శాశ్వత జీవనోపాధి కోసం సీఎం వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముస్లింలను సీఎం వైఎస్ జగన్ చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తున్నారు. వైఎస్సార్ నాలుగు శాతం రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టడంతో ముస్లిం యువత వేలాది మంది బాగా చదువుకుని నేడు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా పలు రంగాలలో స్థిరపడి సామాజికంగా అభివృద్ధి చెందారు. అందుకే ఆ మహానేత వైఎస్సార్‌ని ముస్లిం సమాజం గుండెల్లో పెట్టుకుంది. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి కంటే పది అడుగులు ముందుకు వేసి ముస్లింలకు మేలు చేస్తున్నారు. 2019 ఎన్నికలలో ముస్లింలకు ఐదు సీట్లు ఇచ్చారు. నాలుగు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి, శాసన మండలి డెప్యూటీ చైర్మన్‌గా అవకాశం కల్పించడమే కాకుండా నామినేటెడ్, స్థానిక సంస్థల పదవుల్లోనూ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ సీట్లు ముస్లింలకు ఇచ్చి మరింత ఆదరణ చూపిన సీఎం వైఎస్ జగన్‌కు ముస్లిం సమాజం అండగా ఉంటుంది. – డాక్టర్ మీర్చా షంషీర్ ఆలీబేగ్, చైర్మన్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ -
త్వరలో మా గృహ ప్రవేశం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. త్వరలో మా గృహ ప్రవేశం రెక్కాడితేగాని డొక్కాడని మాకు గూడు కల్పించిన దేవుడు సీఎం జగన్. మాది పేద కుటుంబం. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శ్రీనివాస కాలనీ తండాలో అద్దె ఇంట్లో ఉంటున్నాం. మేము కూలి పనులకు వెళ్తేనే పూట గడిచేది. కొన్నేళ్ల క్రితం నా భర్త స్వామినాయక్‌కు ప్రమాదం వల్ల రెండు కాళ్లు చచ్చుబడిపోవడంతో నడవలేని పరిస్థితి ఏర్పడి మంచానికే పరిమితమయ్యారు. ఈ స్థితిలో నా కూలి డబ్బులతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చా. ఒక రోజు పని ఉంటే రెండో రోజు దొరికేది కాదు. అటువంటప్పుడు ఒక పూట పస్తులతోనే పడుకునే వాళ్లం. గత ప్రభుత్వంలో నా భర్తకు దివ్యాంగ పింఛను కోసం దరఖాస్తు చేసినా మంజూరు చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దివ్యాంగ పింఛను మంజూరు చేశారు. మా పెద్దబ్బాయి దత్తసాయి నాయక్ పిడుగురాళ్లలోని ప్రభుత్వ జూనియర్ కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో అబ్బాయి పవన్‌నాయక్ మన్నెం పుల్లా రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో 7వ తరగతి చదువుతున్నారు. అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు వస్తుండడంతో వారి చదువులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. కూలి డబ్బుల్లో అధిక భాగం ఇంటి అద్దెకే సరిపోయేది. ఈ ప్రభుత్వం వచ్చాక నా పేరుతోనే ఆదర్శనగర్ జగనన్న కాలనీలో ఇంటి స్థలంతో పాలు ఇల్లు కూడా నిర్మించి మా సొంతింటి కల నెరవేర్చారు. త్వరలో గృహ ప్రవేశం చేయబోతున్నాం. నాకు ఆసరా, సున్నా వడ్డీ ద్వారా సాయం అందింది. మాలాంటి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం జగన్ కు మేమంతా రుణపడి ఉంటాం. – రామావత్ సరితాబాయి, పిడుగురాళ్ల (షేక్ మస్తాన్‌వలి, విలేకరి, పిడుగురాళ్ల) మా బతుకుల్లో ఎంతో మార్పు మాది పేద కుటుంబం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక మా బతుకులు మారాయి. మాది ఏలూరు జిల్లా మండవల్లి గ్రామం. నా వయసు 38 ఏళ్లు. నా కుమార్తె 9వ తరగతి చదువుతోంది. అమ్మఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు వస్తున్నాయి. దీంతో పాటు కావలసిన పుస్తకాలు, యూనిఫాం, స్కూలు బ్యాగు, షూస్ వంటివన్నీ ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుండడంతో చదువు భారం పూర్తిగా తప్పింది. ఆసరా ద్వారా రూ.15 వేలు లబ్ధి చేకూరింది. నా భర్త కాలికి గాయం కావడంతో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యానికి రూ.80 వేలు ప్రభుత్వం అందించింది. మా అత్తకు ప్రతి నెలా ఒకటో తారీఖునే రూ.3 వేల వృద్ధాప్య పింఛన్ అందుతోంది. జగనన్న పాలన స్వర్ణయుగం. మాకు ఏ చీకూ చింతా లేదు. గత ప్రభుత్వం మాలాంటి వారికి ఎలాంటి సాయం అందించలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్థికంగా నిలదొక్కుకున్నాం. మా కుటుంబాన్ని ఆదుకున్న జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. మళ్లీ ఆయనే సీఎం అయితేనే మాలాంటి పేదలు హాయిగా బతుకుతారు. – చిగురిపాటి ప్రశాంతి, మండవల్లి (భోగాది వీరాంజనేయులు, విలేకరి, మండవల్లి) పెద్దన్నలా ఆదుకున్నారు మాది పేద కుటుంబం. పశి్చమగోదావరి జిల్లాలోని పెనుగొండ మా ఊరు. చాలా ఏళ్ల కిందటే నా భర్త మృతి చెందాడు. తల్లిదండ్రులు, సోదరులపై ఆధారపడి జీవిస్తున్నా. ఇద్దరు కుమార్తెలతో జీవిస్తున్న నన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దన్నలా ఆదుకున్నారు. మాకు ఇంటి స్థలం మంజూరైంది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందించారు. మా సొంతింటి కల సాకారమైంది. వైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా రుణమాఫీ రూ.37,600 నా ఖాతాలో జమ చేశారు. నా కుమార్తెకు జగనన్న అమ్మఒడి ద్వారా ఏటా రూ.15 వేలు లబ్ధి చేకూరుతోంది. వితంతు పింఛను సొమ్ము రూ.3 వేల వంతున ప్రతి నెలా అందుతోంది. దీంతో కుటుంబ పోషణకు ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటాం. – కొమ్మోజు అనంతలక్ష్మి, పెనుగొండ, పశ్చిమగోదావరి జిల్లా గుర్రాల శ్రీనివాసరావు, విలేకరి, పెనుగొండ) -
బాధపడకమ్మా.. నేనున్నా: సీఎం జగన్
బత్తలపల్లి: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అదే గ్రామానికి చెందిన నాగలక్ష్మి, ఆమె కుమారుడు అనుదీప్‌కుమార్‌రెడ్డి కలిశారు. చదువులో రాణిస్తున్న తన కుమారుడు అనుదీప్‌కు ఉన్నట్టుండి కంటిచూపు పోయిందని ముఖ్యమంత్రికి నాగలక్ష్మి తెలియజేసింది. ప్రస్తుతం డిగ్రీ సెకండియర్ చదువుతున్న అనుదీప్ యూట్యూబ్‌లో పాఠాలు వింటూ.. తోటి విద్యార్థి సహకారంతో పరీక్షలు రాస్తున్నాడని తెలిపింది. తన కుమారుడికి కంటి చూపు వచ్చేందుకు తగిన సాయం చేసి ఆదుకోవాలని వేడుకుంది. అర్జీ స్వీకరించిన సీఎం జగన్ స్పందిస్తూ.. బాధపడకమ్మా.. ఆదుకుంటానంటూ భరోసా ఇచ్చారు. కాగా, అర్జీ ఇచ్చిన అరగంటలోనే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల నుంచి నాగలక్ష్మికి ఫోన్ వచ్చింది. అనుదీప్ ఆరోగ్య పరిస్థితి, కంటి ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు, ఆస్పత్రి తదితర వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. -
మా బతుకులు మార్చిన సర్కారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. మా బతుకులు మార్చిన సర్కారు మాది అరకొర ఆదాయంతో జీవించే కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. గత ప్రభుత్వాల నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో ఒడిదొడుకుల జీవనం గడపాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక మా ఆర్థిక పరిస్థితి ఎంతో మారిపోయింది. మేము విశాఖ జిల్లా భీమిలి మండలం మజ్జివలసలో ఉంటున్నాం. డ్వాక్రా గ్రూప్ సభ్యురాలినైన నాకు వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.40 వేలు వచ్చింది. నా కుమారుడు శ్యామ్ సందీప్‌కు స్కూల్లో ట్యాబ్ ఇచ్చారు. కుమార్తె జెస్సికాకు అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వంతున వచ్చింది. నా భర్త చంటికి సెర్ప్ ద్వారా ఆటో కొనుగోలుకు వడ్డీ లేని రుణం రూ.3.30 లక్షలు వచ్చింది. వాహనమిత్ర ద్వారా ఏటా రూ.10 వేలు వంతున లబ్ధి కలిగింది. మా అత్త సరస్వతికి పెన్షన్ కానుక అందుతోంది. పద్మనాభం మండలం కురపల్లిలో 78 గజాల ఇంటి స్థలం ప్రభుత్వం అందించింది. ప్రభుత్వం అందించిన ఆర్థి క సాయంతో దుస్తుల వ్యాపారం చేస్తున్నా. నెలకు రూ.10 వేల వరకు ఆదాయం లభిస్తోంది. ఇప్పుడు మేమంతా సంతోషంగా ఉన్నాం. ఇందుకు కారణమైన జగనన్న రుణం తీర్చుకుంటాం. – పందిరి లక్ష్మి, మజ్జివలస (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి, తగరపువలస) ఒంటరి బతుక్కు అండగా నిలిచారు నేను ఒంటరి మహిళను. రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. ఏలూరు జిల్లా పోలవరం పంచాయతీ పరిధిలోని కొత్తపేటలో నివాసం ఉంటున్నా. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు మావి. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక నా బతుకు చిత్రం మారింది. జగనన్న ప్రభుత్వంలో అందుతున్న సాయంతో ఇప్పుడు నేను సంతోషంగా జీవిస్తున్నా. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 ఆర్థి క సహాయం అందుతోంది. రజకులకు ప్రభుత్వం అందిస్తున్న చేదోడు పథకం ద్వారా రూ.10 వేలు అందుతోంది. ఒంటరి మహిళ పింఛన్ రూ.3 వేలు ప్రతి నెలా వలంటీర్ ఇంటికి తీసుకువచ్చి ఇస్తోంది. దీంతోపాటు ఇంటి బయట బడ్డీ పెట్టుకుని ఇస్త్రీ పెట్టె కొనుక్కొని.. బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ కొంత సంపాదిస్తున్నా. మాలాంటి పేదోళ్లకు, భర్త లేని వారికి, ఒంటరి మహిళలకు జగనన్న అందిస్తున్న సాయం మరువలేనిది. ఆయన రుణం తీర్చుకోలేనిది. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి పథకాలు ఏవీ అందలేదు. జగనన్న రుణం తీర్చుకోలేనిది. – ఉంగుటూరు లక్ష్మి, పోలవరం (వ్యాఘ్రేశ్వరరావు, విలేకరి, పోలవరం రూరల్) ఇప్పుడు హాయిగా జీవిస్తున్నాం మాది కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలోని సాధారణ మధ్య తరగతి కుటుంబం. ఈ ప్రభుతం వచ్చాక వైఎస్సార్ ఆసరా పథకం కింద రూ.10,950,డ్వాక్రా రుణం రూ.లక్ష, స్త్రీనిధి కింద రూ.50 వేలు వచ్చింది. దీంతో మా గ్రామంలో నేను, నా భర్త రామచంద్రరావు దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాం. మాకు శివ, పవన్ అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిద్దరికీ వివాహాలు కావడంతో వారు రోజువారీ పనులు చేసుకుంటూ వారి బతుకులు వారు బతుకుతున్నారు. మా మనవళ్లకు అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు వస్తోంది. డ్వాక్రా రుణంతో దుకాణం పక్కనే చిన్న ఇల్లు కట్టుకొని కాపురం ఉంటున్నాం. ఈ ప్రభుత్వంలో వచ్చిన పథకాలతో ఆర్థి క ఇబ్బందులు తీరి ఆనందంగా జీవిస్తున్నాం. – సాలారపు సత్యవతి, పెద్దిపాలెం (ప్రగడ రామకృష్ణ, విలేకరి, ప్రత్తిపాడు రూరల్) -
ఆపత్కాలంలోనూ ఆదుకున్న దేవుడు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఆపత్కాలంలోనూ ఆదుకున్న దేవుడు మాది మధ్యతరగతి కుటుంబం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన మాకు కొద్దిపాటి భూమి ఉన్నా... పంటలు పండిన దాఖలాల్లేవు. ప్రతి ఏటా పెట్టుబడి పెట్టడం... ఆనక పరిస్థితులు అనుకూలించక నష్టపోవడం మాకు అలవాటైపోయింది. ఈ పరిస్థితుల్లో అప్పులు తప్పేవి కాదు. గత ప్రభుత్వం మాకు ఏ విధంగానూ సాయమందించిన దాఖలాల్లేవు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తరువాత అందించిన నవరత్నాల ద్వారా మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. నా భార్యకు వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750లు, వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.600, వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.6,204 అందాయి. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏడాదికి రూ. 13,500 వంతున, వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ. 24వేలు అందింది. అంతేగాకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్ వచ్చింది. కోవిడ్ వంటి ఆపత్కాలంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన మహానుభావుడు జగనన్న. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. – భళ్ల సాయిమల్లికార్జున, అప్పనపల్లి (యేడిద బాలకృష్ణ, విలేకరి, మామిడికుదురు) పైసా ఖర్చు లేకుండా సచివాలయ ఉద్యోగాలు ఉన్న ఊళ్లో ఉపాధి లేక ప్రస్తుతం విజయనగరం జిల్లా రేగిడి మండలం మడ్డువలస రిజర్వాయర్ ముంపు గ్రామం కొట్టిశ నుంచి 2001లో పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట గ్రామానికి వలస వచ్చాం. నేను బీఏ, బీఈడీ చేసినా ప్రభుత్వ ఉద్యోగం దొరకక ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్ పనిచేస్తూ ఇద్దరు పిల్లల్ని చదివించుకున్నాను. నాకు రెండెకరాల భూమి, ఇల్లు ఉంది. పిల్లలు ఇద్దరూ పదో తరగతి పాసయిన తరువాత ఉన్నత చదువులు చదివించేందుకు శక్తి చాలక డిప్లమోలు చేయించాను. అబ్బాయి మణికృష్ణ అగ్రికల్చర్ డిప్లమో, అమ్మాయి కీర్తిప్రియ ఫిషరీస్ డిప్లమో చేశారు. అదృష్టవశాత్తూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సచివాలయాలు ఏర్పాటు చేయడంతో మా పిల్లలు ఇద్దరికీ సచివాలయ ఉద్యోగాలు వచ్చాయి. అబ్బాయి నూకలవాడ సచివాలయం, అమ్మాయి వెంగాపురం సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలకు ఎవరి చుట్టూ తిరగలేదు. ఎవరికీ ఒక్క పైసా అయినా ఇవ్వలేదు. పూర్తిగా మెరిట్‌తోనే తప్ప లంచాలకు, సిఫార్సులకు తావులేకుండా నియామకాలు జరిగాయి. ఇంతటి పారదర్శకంగా మా పిల్లలకు ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – ఎ.పోలినాయుడు, బలిజిపేట (పి.కోటేశ్వరరావు, విలేకరి, సీతానగరం) ప్రభుత్వ సాయంతో చేపల వ్యాపారం ఈ ప్రభుత్వం అందించిన సాయంతో చేపల వ్యాపారం ప్రారంభించాను. రోజూ వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాను. మాది విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం పెదనాగమయ్యపాలెం. నేను మణికంఠ డ్వాక్రా గ్రూప్‌లో సభ్యురాలిగా ఉన్నాను. వైఎస్సార్ ఆసరా ద్వారా ఇప్పటివరకు రూ.72 వేలు లబ్ధిపొందాను. చేయూత ద్వారా ఏటా 18,750 వంతున వచ్చింది. నా భర్త కొండకు వైఎస్సార్ పెన్షన్ కానుక అందుతోంది. మా అబ్బాయి మత్స్యకార భరోసా ద్వారా రూ.50 వేలు వచ్చాయి. మనుమడు అప్పలరాజుకు విద్యాదీవెన కింద రూ.24వేలు, మనుమరాలు పూర్ణకు అమ్మఒడి ద్వారా ఏడాదికి రూ. 15వేలు వంతున ప్రభుత్వం నుంచి పొందాము. ఈ ప్రభుత్వం అందించిన పథకాల వల్ల వచ్చిన డబ్బుతో చేపల వ్యాపారం చేస్తున్నాను. విశాఖ ఫిషింగ్ హార్బర్లో చేపలు కొని తగరపువలస ప్రైవేట్ మార్కెట్‌కు వెళ్లి విక్రయిస్తాను. రోజుకు రూ.400 నుంచి రూ.1000 ఆదాయం వస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాలనలో మా కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది. మళ్లీ ఈ ప్రభుత్వమే రావాలి. – గరికిన ధనలక్ష్మి, పెదనాగమయ్యపాలెం (గేదెల శ్రీనివాసరెడ్డి, విలేకరి, తగరపువలస) -
ఏపీకి వడగాడ్పుల వార్నింగ్ బెల్
సాక్షి, విశాఖపట్నం: మునుపెన్నడూ లేనివిధంగా నెలరోజుల ముందుగానే రాష్ట్రంలో వడగాడ్పులు వార్నింగ్ బెల్ మోగిస్తున్నాయి. తొలుత ఇవి రాయలసీమతోనే మొదలుకానున్నాయి. దీని ఫలితంగా ఏప్రిల్ ఆఖరి నాటి ఉష్ణోగ్రతలు ఆరంభంలోనే నమోదు కానున్నాయి. సాధారణంగా మార్చి ఆఖరు, ఏప్రిల్ మొదటి వారం వరకు రాష్ట్రంలో సాధారణంగా పగటి ఉష్ణోగ్రతలు 34–39 డిగ్రీలకు మించవు. కానీ, రాష్ట్రంలో పలుచోట్ల అప్పుడే 38–42 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. అంటే.. ఇవి సాధారణంకంటే 3–4 డిగ్రీలు అధికం. ఈ నేపథ్యంలో.. సోమవారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింతగా తీవ్రం కానున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో వీటి తీవ్రత అధికంగా ఉండనుంది. రానున్న నాలుగు రోజులు వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40–43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం నాటి బులెటిన్‌లో వెల్లడించింది. అలాగే, ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోనూ 40–44 డిగ్రీలకు చేరుకోవచ్చని తెలిపింది. వీటి ఫలితంగా ఆయా జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని, ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇంకా పల్నాడు జిల్లాలో 40–42, ప్రకాశం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో 40–41 డిగ్రీల చొప్పున రికార్డయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ, ఉత్తర కోస్తాంధ్రల్లో ఉష్ణతాపం, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఉత్తర, కోస్తాంధ్రలో.. మరోవైపు.. వడగాడ్పుల ప్రభావం ఆదివారం నుంచే మొదలైంది. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా కర్నూలు, కడప, తూర్పు గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో 41, నందిగామ, జంగమహేశ్వరపురం, విజయనగరం, ఏలూరు, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రానున్న రోజుల్లో ఇవి మరింతగా పెరుగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం తెలిపింది. -
కుటుంబానికి ఆసరా దొరికింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. కుటుంబానికి ఆసరా దొరికింది నేను, నా భర్త సుధాకర్‌తో కలిసి కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు సునీల్‌శర్మ పుట్టుకతోనే మానసిక దివ్యాంగుడు. మాది ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం చినమనగుండం. కూలినాలి చేసుకుని బతుకుతున్న తరుణంలో 2018లో నా భర్త ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆస్పత్రిలో చూపిస్తే కిడ్నీ పాడైందని డాక్టర్లు చెప్పారు. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలని దిగులుపడిన తరుణంలో 2019లో ముఖ్యమంత్రి జగనన్న కిడ్నీ బాధితులకు బాసటగా నిలిచారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కిడ్నీ ఆపరేషన్ చేయించారు. ప్రతి నెలా పింఛన్ రూ.5 వేలు మంజూరు చేశారు. పెద్ద కుమారుడికి దివ్యాంగ పింఛన్ రూ.3 వేలు ఇస్తున్నారు. నాకు వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 అందుతోంది. వైఎస్సార్ ఆసరా పథకం వర్తించింది. మా అమ్మాయికి వివాహం చేశాను. చిన్నబ్బాయి అనిల్వర్మకు ఏటా అమ్మ ఒడి పథకం ద్వారా రూ.15 వేలు అందింది. ఈ రోజు మా జీవితం బాగుండటానికి కారణమైన ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – కందుల ఎలీశమ్మ, చినమనగుండం (నాగం వెంకటేశ్వర్లు, విలేకరి, కొనకనమిట్ల) నా గుండె చప్పుడు సీఎం జగన్ నేను గుంటూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నా. మేము వెల్దుర్తి ఎస్సీకాలనీలో నివసిస్తున్నాం. ఆదాయం అంతంత మాత్రమే. వచ్చిన ఆదాయంతోనే ఎలాగోలా జీవిస్తున్న తరుణంలో అనుకోకుండా గుండెకు సంబంధించిన సమస్య తలెత్తింది. హైదరాబాద్‌లో వైద్యులను సంప్రదిస్తే గుండె మార్పిడి ఆపరేషన్ చేయాలన్నారు. సుమారు రూ.33 లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. అంతంత మాత్రం జీతంతో జీవిస్తున్న మాకు అంత డబ్బు ఎలా తేవాలో అర్థం కాలేదు. ఇక బతుకుపై ఆశ సన్నగిల్లింది. అప్పటికే వైద్య పరీక్షల నిమిత్తం సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చు చేశాం. ఏంచేయాలో పాలుపోలేదు. నా సమస్యను ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెప్పాను. ఆయన ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లడంతో నాకు ప్రత్యేకంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.33 లక్షలు మంజూరు చేశారు. ఐదు నెలల క్రితం తిరుపతి స్విమ్స్ వైద్యశాలలో డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నాకు ఆపరేషన్ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్ కావటంతో అతడి గుండెను నాకు అమర్చారు. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. సీఎం జగన్ నాకు పునర్జన్మ ప్రసాదించారు. నా కుమారుడికి అమ్మఒడి కింద ఏడాదికి రూ.15 వేలు వంతున వస్తోంది. ప్రభుత్వం మా గ్రామంలోని జగనన్న కాలనీలో మాకు ఇంటి స్థలం కూడా మంజూరు చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో సంతోషంగా జీవిస్తున్నాం. నా గుండె చప్పుడుగా మారిన జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. – చాగంటి సుమతి, వెల్దుర్తి(డి.వెంకటేశ్వర్లు, విలేకరి, వెల్దుర్తి) మమ్మల్ని దేవుడిలా ఆదుకున్నారు మాది నిరుపేద కుటుంబం. మా ఆయన గోవిందరావు రోజువారీ కూలీ. ఆయన అరకొర సంపాదనతోనే మా జీవితం సాగుతోంది. నేను దివ్యాంగురాలిని కావడంతో ఏ పనీ చేయలేను. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్లోని రామకృష్ణాపురంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాం. మాకు వైష్ణవి అనే కూతురు ఉంది. ప్రస్తుతం 4వ తరగతి చదువుతోంది. గత ప్రభుత్వం మాలాంటి వారికి ఎలాంటి సాయం చేయలేదు. ఇటీవల నాకు అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రిలో చూపించుకుంటే పరీక్షలు చేసిన డాక్టర్లు క్యాన్సర్‌గా నిర్ధారించారు. ఏం చేయాలో పాలుపోలేదు. అయితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పడంతో దాని ద్వారా శస్త్రచికిత్స చేయించుకున్నా. ఇప్పడు ఆరోగ్యంగా ఉన్నా. జగనన్న ప్రభుత్వం శస్త్రచికిత్స సమయంలో రూ.పది వేలు సాయం అందించింది. కీమో థెరపీ సమయంలోనూ రూ.ఐదు వేల చొప్పున అందిస్తున్నారు. దివ్యాంగురాలినైన నాకు పింఛను వస్తోంది. మా పాపకు మూడేళ్లుగా అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు వంతున వచ్చాయి. ఇంటి పట్టా కూడా మంజూరైంది. ఎటువంటి ఆసరా లేని మమ్మల్ని జగనన్న దేవుడిలా ఆదుకున్నారు. జగనన్నకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. – కుంటిమద్ది సుజాత, రామకృష్ణాపురం, విజయవాడ (సిద్దుబల్ల రాజేంద్రప్రసాద్, విలేకరి, పూర్ణానందంపేట) -
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: ఏపీలోని 164 ఆదర్శ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఆయా మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటలకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. విద్యార్థుల సౌకర్యార్థం దరఖాస్తు గడువును వచ్చే నెల 6 వరకు పొడిగించామని తెలిపారు. ప్రవేశ పరీక్షను 5వ తరగతి స్థాయిలో తెలుగు/ఇంగ్లిష్ మీడియంలో రాయొచ్చని.. విద్యాభ్యాçÜం అంతా ఆంగ్లంలోనే ఉంటుందన్నారు. WWW.cse.ap.gov.in/apms.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
Tirumala: సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 30 కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. ఇక.. నిన్న(గురువారం) స్వామివారిని 65,992 భక్తులు దర్శించుకున్నారు. అందులో 25,698 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.53 కోట్లుగా లెక్క తేలింది. నిఘా వేశాం.. ఆందోళన వద్దు తిరుమలలో మరోసారి వన్యప్రాణుల సంచారం కలకలం రేగుతున్న వేళ అటవీశాఖ అధికారులు స్పందించారు. వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ.. "మార్చి 4 నుండి ఇప్పటి వరకు 5 సార్లు చిరుత సంచారం గుర్తించాము. 250 అధునాతన కెమెరాలను ఏర్పాటు చేసాం. 4g నెట్ వర్క్ కెమెరాల ద్వారా జంతువుల సంచారం వెంటనే అలర్ట్ చేస్తుంది. క్రూర మృగాల సంచారం, చిరుతలు సంచారం గుర్తించిన వెంటనే సిబ్బంది అలెర్ట్ చేస్తాం. టీటీడీ విజిలెన్స్, అటవీశాఖ, వైల్డ్ లైఫ్ సిబ్బంది నడకదారిలో భద్రత చర్యలు చేపడుతాము.. ఏడవ మైలు నుండి నరసింహ స్వామి ఆలయం వరకు భక్తులను గుంపులుగా పంపుతాము భయపడాల్సిన అవసలేదు అన్నారు. అలాగే.. ప్రభుత్వం నియమించిన జాయింట్ కమిటీ ఇప్పటికి మూడు మార్లు తిరుమలలో పర్యటించారు. ఏప్రిల్ మొదటి వారంలో జాతీయస్థాయి వైల్డ్ లైఫ్ కమిటీ సమావేశం అవుతుంది. నడకదారిలో తీసుకోవల్సిన చర్యలపై నివేదిక ఇవ్వనున్నారు.. భక్తులు అటవీ ప్రాంతంలో వెళ్ల రాదు, శేషాచల కొండల్లో నీటికి కొరత లేదు, ఏనుగులు ప్రతి సంవత్సరం ఒకచోట నుంచి మరో ప్రదేశానికి వెళ్తుంటాయి. అధునాతన థర్మల్ డ్రోన్ కెమరా రాత్రి సమయంలో కూడా జంతువుల సంచారం పై నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు". -
ఇంటి స్థలం ఇచ్చి ఆదుకున్నారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. ఇంటి స్థలం ఇచ్చి ఆదుకున్నారు మాది నిరుపేద కుటుంబం. మాకు ఏ విధమైన ఆస్తులూ లేవు. ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి. అటువంటి మాకు ఒకటిన్నర సెంటులో ఇంటి స్థలం ఇచ్చి మా కుటుంబాన్ని జగన్ సర్కారు ఆదుకుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురుకు చెందిన మా కుటుంబానికి నవరత్నాల ద్వారా ఎంతో లబ్ధి చేకూరింది. నా భర్త వెంకటేశ్వరరావు కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.రెండు లక్షలు విలువైన ఇంటి స్థలం ఇచ్చారు. మా అబ్బాయి జగదీశ్‌కు జగనన్న విద్యా దీవెన ద్వారా రూ.23,850 అందించారు. వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటి వరకు రూ.68 వేలు అందింది. మా కుటుంబం ఈ రోజు ఆర్థి కంగా నిలదొక్కుకోవడానికి కారణమైన ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. – యడ్ల దుర్గ, మామిడికుదురు (యేడిద బాలకృష్ణ, విలేకరి, మామిడికుదురు) సంతోషంగా వ్యవసాయం మాది వ్యవసాయ కుటుంబం. సొంత భూమి లేకపోయినా పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కిమ్మి గ్రామంలో మూడెకరాలు కౌలుకు తీసుకుని మా ఆయన శంకరరావు సాగు చేస్తున్నారు. అందులో వరి, చెరకు పండిస్తున్నాం. ఏటా వ్యవసాయానికి పెట్టుబడి అవసరం ఉంటుంది. అప్పుడు తప్పనిసరిగా అప్పు చేయడం.. పంట చేతికొచ్చాక తీర్చేయడం అలవాటు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత అప్పు చేయాల్సిన అవసరం తప్పింది. ఇప్పుడు రైతు భరోసా వస్తోంది. మా మామగారికి వృద్ధాప్య పింఛన్ వస్తోంది. మా అత్తకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18,750 చొప్పు అందింది. మా అత్త చేయి ఆపరేషన్‌కు పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చేయించుకోగలిగాం. మాకు ఇద్దరు పిల్లలు. వారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. పాప పేరున మూడేళ్లుగా అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు వంతున వస్తోంది. మా కుటుంబానికి ఇంత మేలు జరిగిందంటే కారణం ఈ ప్రభుత్వమే. సీఎం జగనన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. – అలుజు రజిని, కిమ్మి (కొలిపాక సింహాచలం, విలేకరి, వీరఘట్టం) అమ్మాయి చదువు బెంగతీరింది మా ఆయన విజయనగరం జిల్లా బాడంగి మండలం గూడెపువలస గ్రామంలో చిల్లర వ్యాపారం చేసేవారు. ఆయన సంపాదనతోనే మా కుటుంబం గడిచేది. అనుకోకుండా గతేడాదే ఆయన కన్ను మూయడంతో అక్కడ వ్యాపారాన్ని మూసేసి బాడంగిలో టీ కొట్టు పెట్టుకుని ఒక్కగానొక్క కుమార్తెను చదివించుకుంటున్నా. వచ్చిన ఆదాయంతో మా పాపకు ఉన్నత చదువులు అందించగలనా.. అన్న భయం ఉండేది. రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం రావడంతో ఆ భయం తీరిపోయింది. మా అమ్మాయి సాహితి ప్రస్తుతం బాడంగిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఆమెకు అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు అందుతోంది. దీనివల్ల అమ్మాయి చదువు బెంగ తీరింది. నాకు వైఎస్సార్ పింఛన్ కానుక ప్రతి నెలా ఒకటో తేదీనే అందుతోంది. వైఎస్సార్ ఆసరా ద్వారా ఇప్పటి వరకూ రూ.30 వేలు, సున్నా వడ్డీ కింద రూ.12 వేలు అందింది. ప్రస్తుతానికి మేము ఆర్థి కంగా కుదుటపడగలిగాం. ఇందుకు కారణమైన జగనన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. – బండి సంతోష్, గూడెపువలస (గొట్టాపు కృష్ణమూర్తి, విలేకరి, బాడంగి) -
3 నుంచి పింఛన్ల పంపిణీ.. బ్యాంకులకు వరుస సెలవులే కారణం
సాక్షి, అమరావతి: ప్రతి నెలా ఒకటినే మొదలవుతున్న పింఛన్ల పంపిణీ ఈసారి ఏప్రిల్ 3 నుంచి కొనసాగనుంది. ఆర్థిక సంవత్సరం ముగింపుతోపాటు బ్యాంకులకు వరుస సెలవులు రావడమే ఇందుకు కారణం. ఈ మేరకు ఇప్పటికే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు అన్ని జిల్లాల డీఆర్డీఏ పీడీలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. మార్చి 31న ఆదివారం, ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దీంతో పింఛను నగదును ఏప్రిల్ 2న డ్రా చేసుకోవడానికి సచివాలయాల సిబ్బందికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మూడో తేదీ నుంచి పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే అధికారులకు సమాచారమిచ్చింది. గతేడాది కూడా ఏప్రిల్ 3 నుంచే పింఛన్ల పంపిణీ కొనసాగినట్టు అధికారులు గుర్తు చేశారు. కాగా, ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్నప్పటికీ యధావిధిగా వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ అందిస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్‌తో ప్రత్యేక మార్గదర్శకాలు.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పింఛన్ల పంపిణీకి సెర్ప్ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం అన్ని జిల్లాల పీడీలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల కోడ్‌తో నిర్దేశిత పరిమితికి మించి వ్యక్తులు నగదు తీసుకువెళ్లకూడదని ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పింఛన్ల పంపిణీలో పాల్గొనే సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు బ్యాంకుల నుంచి డ్రా చేసిన నగదుకు సంబంధించిన రశీదులను తప్పనిసరిగా తమ వద్దే ఉంచుకోవాలని సెర్ప్ అధికారులు సూచించారు. పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే వారి వివరాలను ఎంపీడీవోలు/మున్సిపల్ కమిషనర్లు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు (ఆర్వో)లకు ముందుగానే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. సచివాలయాల పేర్లు, నగదు వివరాలతో కూడిన ధ్రువీకరణ పత్రాలు కూడా సంబంధిత సిబ్బంది కలిగి ఉండాలన్నారు. ఈ మేరకు ఆయా ధ్రువీకరణ పత్రాలను నిర్దేశిత ఫార్మాట్లో ఎంపీడీవోలు/మున్సిపల్ కమిషనర్ల లాగిన్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు. పింఛన్లు పంపిణీ సమయంలో ప్రచారం చేయడానికి, ఫొటోలు, వీడియోలు తీయడానికి అనుమతి లేదన్నారు. -
అన్నదాతల్లో ఆనందం
సాక్షి, అమరావతి: ఎంతో శ్రమించి పండించిన పంటకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజులోనే చెల్లింపులు జరపడంతో అన్నదాతల ఇళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. మద్దతు ధరతో కొనుగోలు చేసిన ధాన్యానికి గానూ వైఎస్ జగన్ ప్రభుత్వం మంగళవారం రూ.815 కోట్లు చెల్లించింది. దీంతో ఖరీఫ్‌లో సేకరించిన రూ.6,541.23 కోట్ల విలువైన ధాన్యానికి రూ.6,514.59 కోట్లు చెల్లించినట్లయ్యింది. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన మిగిలిన స్వల్ప మొత్తాన్ని కూడా పౌరసరఫరాల సంస్థ డీఎం అనుమతి రాగానే రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు వీలుగా ప్రభుత్వం షెడ్యూల్ చేసింది. రైతు సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దళారులు, మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను రక్షిస్తూ ఆర్బీకే స్థాయిలోనే సంపూర్ణ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు సకాలంలో చెల్లింపులు చేస్తోంది. ఖరీఫ్ సీజన్లో 29.93 లక్షల టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసి.. 4.96 లక్షల మంది రైతులకు మద్దతు ధరను అందించింది. ఇలా ఈ ఐదేళ్లలో ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా రైతులకు సంపూర్ణ మద్దతు ధరను అందించిన ప్రభుత్వంగా రికార్డు సృష్టించింది. ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 21 రోజుల్లోనే నగదు చెల్లిస్తోంది. పెరిగిన ధాన్యం సేకరణ.. గత చంద్రబాబు ప్రభుత్వం ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి ఏడాదికి సగటున 56 లక్షల టన్నులు ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. అదే సగటు ప్రస్తుత ప్రభుత్వంలో 77 లక్షల టన్నులుగా ఉంది. దీనికి తోడు ఆర్బీకే పరిధిలోని రైతులు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వారి కల్లాల వద్దనే ధాన్యం సేకరణ చేపట్టింది. ఆర్బీకేల్లో.. ధాన్యం సేకరణకు అవసరమైన శాశ్వత ఏర్పాట్లు చేసింది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించగా.. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే సీఎం జగన్ ప్రభుత్వంలో అదనంగా దాదాపు 20 లక్షల మంది రైతులకు సంపూర్ణ మద్దతు ధర దక్కింది. తడిచిన ధాన్యమూ కొనుగోలు.. అలాగే వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా జయ రకం(బొండాలు/దుడ్డు బియ్యం) ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసింది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో జయ రకం పండించే రైతులు చాలా లాభపడ్డారు. ప్రకృతి విపత్తులు, అకాల వర్షాల వల్ల తడిచిన ధాన్యాన్ని తెచ్చిన రైతులకు సైతం అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను సైతం పక్కనపెట్టి తడిచిన ధాన్యాన్ని ఆఫ్‌లైన్‌లో సేకరించి మరీ రైతులకు మద్దతు ధర అందించడంలో రికార్డు నెలకొల్పింది. ఆఫ్‌లైన్‌లో సేకరించిన ధాన్యాన్ని దూరాభారాలు చూడకుండా డ్రయ్యర్ సౌకర్యం, డ్రయ్యర్ ప్లాట్‌ఫాం ఉన్న మిల్లులకు తరలించి ఆరబోసి మరీ కొనుగోలు చేసింది. జగన్ ప్రభుత్వం అదనపు భారాన్నైనా మోసింది గానీ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చర్యలు చేపట్టింది. బాబు హయాంలో బకాయిలు.. చంద్రబాబు హయాంలో రైతులు ధాన్యం డబ్బుల కోసం అహోరాత్రులు ఎదురు చూడాల్సి వచ్చేది. రైతులు తాము కష్టపడి పండించిన పంటను ప్రభుత్వంపై నమ్మకంతో విక్రయిస్తే.. వారికి చెల్లించాల్సిన డబ్బులను సైతం చంద్రబాబు పక్కదారి పట్టించారు. ఇలా 2019 ఎన్నికలకు ముందు పౌరసరఫరాల సంస్థకు చెందిన రూ.4,838.03 కోట్లను వేరే కార్యక్రమాలకు మళ్లించి రైతులను నట్టేట ముంచారు. చివరకు సీఎం పదవి నుంచి దిగిపోతూ రూ.960 కోట్లు చెల్లించకుండా రైతులను మోసం చేశారు. సీఎం జగన్ వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వంలోని బకాయిలను కూడా తీర్చి.. పారదర్శక ధాన్యం కొనుగోలు విధానాన్ని తీసుకొచ్చారు. అదనంగా టన్నుకు రూ.2,523 గత ప్రభుత్వం పేరుకే ధాన్యం సేకరణ చేసేది. కొనేదంతా మిల్లర్లు.. దళారులే. వారంతా రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6 వేలకు పైగా రైతులు నష్టపోయేవారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ–క్రాప్ డేటా ఆధారంగా నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరిస్తోంది. దీంతో మిల్లర్లు, దళారుల దందాకు చెక్‌పడింది. అలాగే రైతులపై ఆర్థిక భారం తగ్గించడంలో భాగంగా ప్రతి టన్ను ధాన్యం కొనుగోలులో రవాణా, హమాలీ, గోనె సంచుల వినియోగం నిమిత్తం రైతులకు రూ.2,523 అందిస్తోంది. గతంలో రైతులే సొంత ఖర్చులతో ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తే.. వాటిని ప్రభుత్వ వాహనాల్లో తరలించినట్టు రికార్డుల్లో నమోదు చేసి టీడీపీ నాయకులే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా మింగేశారు. -
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఐఐటీ శిక్షణ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే సైన్స్ విద్యార్థులకు ఐఐటీ, నీట్ వంటి శిక్షణను సర్కారు అందుబాటులోకి తెచ్చింది. వీరిని ఉత్తమంగా తీర్చిదిద్ది పోటీ పరీక్షలకు సిద్ధంచేస్తోంది. గత ఏడాది ఆగస్టులో పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు రెండు కళాశాలల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 51 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ శిక్షణను ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. తొలిదశలో 3 వేల మంది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఐఐటీ, నీట్, ఏపీఈఏపీ సెట్‌కు శిక్షణనిస్తున్నారు. బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లెక్చరర్లు 800 మందికి శిక్షణనిచ్చి, వారి సూచనల మేరకు విద్యార్థులకు శిక్షణ ప్రారంభించారు. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఎంబైబ్ సంస్థ ఉచితంగా అందిస్తోంది. సైన్స్, మ్యాథమెటిక్స్ తరగతులకు అవసరమైన మెటీరియల్, వీడియో పాఠాలను ఈ సంస్థ అందిస్తోంది. శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఈ ఏడాది జరిగే ఏపీఈఏపీ సెట్, నీట్, జేఈఈ పరీక్షల్లో సాధించిన ఫలితాల ఆధారంగా శిక్షణలో అవసరమైన మార్పులుచేసి రాష్ట్రంలోని 470 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోను ఈ శిక్షణను ప్రారంభించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. స్వచ్ఛంద బోధనకు లెక్చరర్ల అంగీకారం.. ప్రస్తుతం విద్యార్థులకు అందిస్తున్న ఐఐటీ, నీట్, ఏపీఈఏపీ సెట్ శిక్షణకు ఉచితంగా సాంకేతిక సహకారం అందించేందుకు వెంబైబ్ సంస్థ ముందుకొచ్చింది. దీంతో సాధాసాధ్యాలను అంచనా వేసేందుకు ఇంటర్ బోర్డు లెక్చరర్ల సహకారం తీసుకుంది. ఒక్కో సబ్జెక్టు నుంచి ఆసక్తిగల 10 మందిని ఎంపిక చేసి, వారికి ఎంబైబ్ సంస్థ పరిశీలన కోసం మెటీరియల్‌ను పంపించింది. వీడియో పాఠాలు, నమూనా పరీక్ష పత్రాలను పరిశీలించిన అనంతరం వారు సూచించిన మార్పులు చేసి శిక్షణను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఖరీదైన ఐఐటీ, నీట్ వంటి శిక్షణను అందించేందుకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా 800 మంది జూనియర్ లెక్చరర్లు ముందుకొచ్చారు. వారికి నిపుణులతో శిక్షణపై ఇంటర్ బోర్డు పూర్తి అవగాహన కల్పించింది. రెగ్యులర్ పాఠాలు పూర్తయిన తర్వాత ఎంపీసీ విద్యార్థులకు ఐఐటీ, ఏపీఈఏపీ సెట్.. బైసీసీ విద్యార్థులకు నీట్, ఈఏపీ సెట్ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఐఎఫ్‌పీలపై 3డీలో వీడియో పాఠాలు.. మెటీరియల్‌తో పాటు సబ్జెక్టు వారీగా వందలాది వీడియో పాఠాలను ఎంబైబ్ సంస్థ అందించింది. నాడు–నేడులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను అందించింది. మరికొన్ని కాలేజీల్లో ప్రొజెక్టర్లు ఉన్నాయి. వీటిద్వారా విద్యార్థులకు 3డీలో సైన్స్ వీడియో పాఠాలను బోధిస్తున్నారు. పాఠం పూర్తయ్యాక టాపిక్ వారీగా ఆన్లైన్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో స్వయంగా టాపిక్ల వారీగా టెస్టు పేపర్లు తయారుచేసుకునే విధానం అందుబాటులోకి తెచ్చారు. గతంలో వచ్చిన ప్రశ్నలను విశ్లేషించి, ఏ తరహా ప్రశ్నలు రావచ్చో ఈ టెక్నాలజీ వివరిస్తోంది. గతంలో హెచ్‌సీఎల్ నిర్వహించిన “టెక్ బీ’ ప్రోగ్రామ్‌కు 4,500 మంది విద్యార్థులు శిక్షణ పొందగా, 900 మంది ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇస్తున్న జేఈఈ, నీట్‌లోను విద్యార్థులు విజయం సాధిస్తారని ఇంటర్మీడియట్ కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఆశాభావం వ్యక్తంచేశారు.