Personal Finance
-
ఎయిర్టెల్ కూడా పెంచేసింది! జియోను మించి..
టెలికం యూజర్లకు ఛార్జీల మోత మోగనుంది. ప్రత్యర్థి రిలయన్స్ జియో రేట్లను 12-15 శాతం పెంచిన మరుసటి రోజే భారతీ ఎయిర్టెల్ కూడా తన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్లకు టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించింది. వివిధ ప్లాన్లపై టారిఫ్‌లను 10-21 శాతం పెంచింది.దేశంలో టెల్కోలు ఆర్థికంగా ఆరోగ్యకరమైన వ్యాపార నమూనాను అవలంభించడానికి మొబైల్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏఆర్పీయూ) రూ .300 కంటే ఎక్కువగా ఉండాలని భారతీ ఎయిర్టెల్ పేర్కొంది. "ఈ స్థాయి ఏఆర్పీయూ నెట్వర్క్ టెక్నాలజీ, స్పెక్ట్రంలో అవసరమైన గణనీయమైన పెట్టుబడులకు వీలు కల్పిస్తుందని, మూలధనంపై స్వల్ప రాబడిని అందిస్తుందని మేము నమ్ముతున్నాం" అని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.పెంచిన మొబైల్ టారిఫ్‌లు జూలై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. బడ్జెట్ సవాళ్లతో కూడిన వినియోగదారులపై ఎటువంటి భారం పడకుండా ఉండటానికి ఎంట్రీ లెవల్ ప్లాన్లపై చాలా తక్కువ ధరల పెరుగుదల (రోజుకు 70 పైసల కంటే తక్కువ) ఉండేలా చూశామని టెల్కో తెలిపింది. వొడాఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది.ఏ ప్లాన్ ఎంత పెరిగిందంటే..» గతంలో రూ.179గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.199» గతంలో రూ.455గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.509» గతంలో రూ.1799గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.1999» గతంలో రూ.265గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.299» గతంలో రూ.299గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.349» గతంలో రూ.359గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.409» గతంలో రూ.399గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.449» గతంలో రూ.479గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.579» గతంలో రూ.549గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.649» గతంలో రూ.719గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.859» గతంలో రూ.839గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.979» గతంలో రూ.2999గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.3599 -
జూలై నెలలో జరిగే మార్పులు ఇవే..
వచ్చే జూలై నెలలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇతర రంగాలకు సంబంధించిన పలు నిబంధనలు మారబోతున్నాయి. కొన్ని డెడ్ లైన్లు కూడా జూలైలో ముగియనున్నాయి. ఈ కొత్త నిబంధనలు సామాన్యుడి దైనందిన జీవితాలను ప్రభావితం చేయనున్నాయి కాబట్టి ఈ మార్పుల గురించి వివరంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.ఐటీఆర్ డెడ్‌లైన్2023-2024 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31.పేటీఎం వాలెట్జూలై 20 నుంచి కొన్ని రకాల వాలెట్లను మూసివేస్తున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. సంవత్సరం, అంతకంటే ఎక్కువ కాలంగా ఎటువంటి లావాదేవీలు లేని, బ్యాలెన్స్ లేని ఇన్‌యాక్టివ్‌గా ఉన్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్లను మూసివేస్తున్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన వెబ్ సైట్లో ప్రకటించింది.ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుజూలై 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు రీప్లేస్మెంట్ ఫీజు పెరగనుంది. ఇప్పుడు రూ.100 ఉండగా జులై 1 నుంచి రూ .200 వసూలు చేస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. చెక్ / క్యాష్ పికప్ ఫీజు కింద వసూలు చేసే రూ .100ను నిలిపివేయబోతోంది. దీంతో పాటు స్లిప్ రిక్వెస్ట్ ఛార్జ్, అవుట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజు, డూప్లికేట్ స్టేట్ మెంట్ రిక్వెస్ట్ చార్జీలను బ్యాంక్ నిలిపివేయనుంది.ఎస్బీఐ క్రెడిట్ కార్డులుకొన్ని ఎస్బీఐ క్రెడిట్ కార్డులకు, రివార్డ్ పాయింట్లు జూలై 15 నుంచి ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై వర్తించవని ఎస్బీఐ కార్డ్స్ ప్రకటించింది.పీఎన్బీ రూపే ప్లాటినం డెబిట్ కార్డుజూలై 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూపే ప్లాటినం డెబిట్ కార్డు లాంజ్ యాక్సెస్ ప్రోగ్రామ్‌లో మార్పులు రాబోతున్నాయి. ఇకపై డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్/ రైల్వే లాంజ్ యాక్సెస్ ప్రతి త్రైమాసికానికి ఒకటి, ఏడాదికి రెండు అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ లభించనున్నాయి.సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల మైగ్రేషన్జులై 15 నాటికి కార్డుల మైగ్రేషన్ పూర్తవుతుందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. దీని తర్వాత ప్రస్తుత సిటీ-బ్రాండెడ్ కార్డులకు కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డుల ప్రయోజనాలు లభిస్తాయి. మైగ్రేషన్ తర్వాత కొన్ని నెలల్లో కస్టమర్లు తమ కొత్త యాక్సిస్ బ్యాంక్ కార్డులు పొందే వరకు సిటీ-బ్రాండెడ్ కార్డులు పనిచేస్తాయని బ్యాంక్ తెలిపింది. -
బంగారమే.. ఆనందమే!! వరుస తగ్గింపులతో ఉత్సాహం
దేశవ్యాప్తంగా వారం రోజులుగా బంగారం కొనుగోలుదారులకు ఆనందాన్ని కలిగిస్తోంది. వరుస తగ్గింపులతో ఉత్సాహాన్ని నింపుతోంది. నిన్నటి రోజున మోస్తరుగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు (జూన్ 27) కూడా దిగివచ్చాయి. ఈ వారం రోజుల్లో బంగారం సుమారు రూ.1500 మేర తగ్గింది.తెలుగు రాష్ట్రాల్లో ధరలుహైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలు సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) ధర రూ.250 తగ్గి రూ.65,750 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి కూడా రూ.270 క్షీణించింది. దీంతో తులం మేలిమి బంగారం రూ. 71,730 లకు తగ్గింది.ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.65,900 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.270 క్షీణించి రూ.71,880 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.250 తగ్గి రూ.65,750 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.270 క్షీణించి రూ. 71,730 లకు దిగొచ్చింది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ.350 తగ్గి రూ.66,250 లకు వచ్చింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.380 దిగొచ్చి రూ.72,280 లకు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.65,750 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.270 క్షీణించి రూ. 71,730 లకు తగ్గింది.వెండి కూడా..దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా వారం రోజులుగా తగ్గుముఖం పట్టాయి. వారం రోజుల్లో సుమారు రూ.4000 దాకా తగ్గింది. కాగా ఈరోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.94,500 లుగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
చిన్న పేమెంట్ ఆలస్యం.. ఎంత పెద్ద నష్టం..!!
ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డు అన్నది ప్రతిఒక్కరికీ అనివార్యంగా మారింది. చిన్నా, పెద్ద అన్ని పేమెంట్లకు క్రెడిట్ కార్డునే వాడుతున్నారు. అయితే క్రెడిట్ కార్డులను సక్రమంగా వినియోగించపోతే పెద్ద నష్టమే ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘ది బీ, ది బీటిల్ అండ్ ది మనీ బగ్’ అనే పుస్తకంలో 844 క్రెడిట్ స్కోర్ ఉన్న సయ్యద్ అనే వ్యక్తి గురించి ఒక కేస్ స్టడీ ఉంది.ఒకసారి విదేశాలకు వెళ్తుండగా సయ్యద్ తన క్రెడిట్ కార్డుతో ఎయిర్‌పోర్టులోని స్టోర్ నుంచి ఓ పుస్తకం కొన్నాడు. అతను విదేశాల్లో ఉన్నప్పుడు, క్రెడిట్ కార్డ్ బిల్లు జనరేట్ అయింది. అంతలోనే చెల్లింపు గడువు వచ్చింది. విదేశాల్లో ఉన్న సయ్యద్ సాంకేతిక కారణాల వల్ల నిర్ణీత తేదీకి పేమెంట్ గేట్ వేను యాక్సెస్ చేయలేకపోయాడు. దీంతో అతడు పేమెంట్ మిస్ అయ్యాడు. దీని తీవ్ర పరిణామాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి..పేమెంట్ చేయాల్సిన మొత్తం రూ.250లే అయినప్పటికీ, క్రెడిట్ స్కోర్ నష్టం ఎక్కువగా ఉంది. మొదటి నెలలో అతని స్కోరు 776 కు పడిపోయింది. సయ్యద్ భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత, అతను తన బకాయిలను ఆలస్య చెల్లింపు రుసుముతో పాటు రూ.300 + వడ్డీ, జీఎస్టీ చెల్లించాడు. పూర్తి మొత్తం చెల్లించినప్పటికీ, అతని స్కోరు రెండవ నెలలో మరో 49 పాయింట్లు పడిపోయి 727 కు పడిపోయింది.దీంతోనే అయిపోలేదు. ఇంకా ఉంది.. సరిగ్గా ఇదే సమయంలో సయ్యద్ హోమ్ లోన్ ప్రయత్నాల్లో ఉన్నాడు. అతని క్రెడిట్ స్కోర్ గణనీయంగా క్షీణించినందున, ఇకపై మార్కెట్లో తక్కువ వడ్డీ రేట్లకు అర్హుడు కాదు. గతంలో ఉన్న 844 క్రెడిట్ స్కోరు ఉంటే 8.60 శాతం వడ్డీతో ఆఫర్ వచ్చేది. కానీ 727 స్కోర్‌కు 9.30 శాతం కంటే తక్కువ వడ్డీ రేటు పొందలేడు.ఆయన మొత్తం రూ .50 లక్షలు అప్పు తీసుకుంటున్నందున, అధిక రేటుకు రుణంపై వడ్డీ వ్యత్యాసం 20 సంవత్సరాలలో రూ .5.40 లక్షలు. కేవలం రూ.250 ఒక్క క్రెడిట్ కార్డు పేమెంట్ మిస్ కావడం వల్ల జరిగిన నష్టమిది. వడ్డీ రేట్లు, రుణ ఆఫర్లు మీ క్రెడిట్ స్కోర్‌తో ముడిపడి ఉన్నందున, మీ స్కోరును తెలుసుకోవడం, దానిని ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచడం చాలా ముఖ్యం. -
దిగొచ్చిన బంగారం, వెండి!! ఎంత తగ్గాయంటే..
దేశవ్యాప్తంగా గత ఐదు రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి రోజున స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు బుధవారం (జూన్ 26) కాస్త దిగివచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు ఉపశమనం లభించినట్లయింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలు సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర రూ.250 తగ్గి రూ.66,000 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి కూడా రూ.230 క్షీణించింది. దీంతో తులం మేలిమి బంగారం రూ. 72,000 లకు తగ్గింది.దేశంలోని ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.66,150 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.230 క్షీణించి రూ.72,150 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.250 తగ్గి రూ.66,000 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.230 క్షీణించి రూ. 72,000 లకు దిగొచ్చింది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ.200 తగ్గి రూ.66,600 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.220 దిగొచ్చి రూ.72,660 లకు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.66,000 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.230 క్షీణించి రూ. 72,000 లకు తగ్గింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా బుధవారం తగ్గాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.1000 చొప్పున తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.94,500లకు క్షీణించింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
రేపటి నుంచి ఈ బ్యాంక్ అలర్ట్స్ బంద్.. కానీ ఇలా చేస్తే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యధిక శాతం డిజిటల్ చెల్లింపులు యూపీఐ పేమెంట్స్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ జూన్ 25 నుంచి రూ .100 లోపు విలువైన యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ఎస్ఎంఎస్ అలర్ట్స్ పంపడం నిలిపివేయనుంది.జూన్ 25 నుంచి రూ.100 లకు పైబడిన చెల్లింపులు, రూ.500 లకు మించి అందుకున్న లావాదేవీలకు మాత్రమే ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు ఉంటాయని బ్యాంక్ గతంలోనే ఖాతాదారులకు పంపిన ఈమెయిల్లో పేర్కొంది. అయితే, మొత్తంతో సంబంధం లేకుండా అన్ని యూపీఐ లావాదేవీలకు ఈమెయిల్ అలర్ట్స్ అందుకునే అవకాశం ఉంది.ఈమెయిల్ ఇన్‌స్టా అలర్ట్స్ కోసం రిజిస్టర్ చేసుకోండిలా..నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే టాప్ బ్యానర్ పై ఉన్న ఇన్ స్టాఅలర్ట్స్ పై క్లిక్ చేసి సూచనలను పాటించండి.మొబైల్ యాప్ ద్వారా అయితే మెనూకు వెళ్లి మీ ప్రొఫైల్ ఎంచుకోండి. మేనేజ్ అలర్ట్స్ పై క్లిక్ చేయండిఇన్స్టా అలర్ట్స్ డీయాక్టివేట్ చేయాలంటే..» మీ కస్టమర్ ఐడెంటిఫికేషన్ నంబర్, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌తో నెట్ బ్యాంకింగ్‌కి లాగిన్ అవ్వండి» పేజీలో కుడివైపు పైభాగంలో ఉన్న ఇన్‌స్టా అలర్ట్స్‌పై క్లిక్ చేయాలి.» అలర్ట్స్ డీ రిజిస్టర్ చేయాలనుకుంటున్న అకౌంట్ నెంబర్ ఎంచుకోండి.» అలర్ట్స్ రకాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ పై క్లిక్ చేయాలి.» అలర్ట్స్ సెలెక్ట్ అయ్యాక కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. -
ఐటీఆర్ ఫైలింగ్.. ఇవి గమనిస్తే మేలు
పన్ను రిటర్నులు దాఖలు (ఐటీఆర్)కు జులై 31 చివరి తేదీగా నిర్ణయించారు. సరైన అవగాహన లేకుండా, నిపుణుల సలహాలు తీసుకోకుండా ఐటీఆర్ ఫైల్ చేయడం కొంచెం కష్టమని పన్ను చెల్లింపుదారులు భావిస్తుంటారు. ఐటీఆర్ గడువు ముగుస్తుంటే కంగారుపడి ఆన్లైన్లో నమోదుచేసేపుడు ఒక్కోసారి పొరపాట్లు చేస్తారు. అలాచేసే తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉందని గుర్తించాలి. రివైజ్డ్ రిటర్నులు దాఖలు చేయడం ద్వారా వాటిని సవరించుకోవచ్చు. కానీ, అందుకు అదనంగా సమయం కేటాయించాలి. అది కొంత చికాకు పెట్టే అంశం. అందుకే తొలిసారి ఐటీఆర్ ఫైల్ చేసినపుడే జాగ్రత్త వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ తరుణంలో రిటర్నులు దాఖలు చేసేటప్పుడు బ్యాంకు ఖాతా ధ్రువీకరణ, ఈ-వెరిఫై, మినహాయింపులు..వంటి కొన్ని అంశాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.బ్యాంకు అకౌంట్ ధ్రువీకరణపన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలుకు ముందే ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో తమ బ్యాంకు ఖాతాలను ధ్రువీకరించుకోవాలి. ట్యాక్స్ పేయర్ల ఖాతా యాక్టివ్గానే ఉందని ఇది నిర్ధరిస్తుంది. అప్పుడే రిఫండ్లు జమ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది.ఈ-వెరిఫైఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత దాన్ని పన్ను చెల్లింపుదారులు కచ్చితంగా ధ్రువీకరించాలి. అప్పుడే దాఖలు ప్రక్రియ పూర్తయినట్లు. లేదంటే రిటర్నులను పరిగణనలోకి తీసుకోరు. ఐటీఆర్ అప్లోడ్ చేసిన 30 రోజుల్లోగా దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేసి తప్పకుండా వెరిఫై చేయాలి.మినహాయింపులు ఇలా..ఆదాయపు పన్ను మినహాయింపుల్లో భాగంగా సెక్షన్ 80సీ నిబంధనల ప్రకారం వివిధ పెట్టుబడి పథకాల్లో మదుపు చేసి, రూ.1,50,000 వరకూ వెసులుబాటు పొందవచ్చు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, హోమ్‌లోన్ అసలు, పిల్లల ట్యూషన్ ఫీజులు, జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియం తదితరాలన్నీ ఈ సెక్షన్ పరిధిలోకే వస్తాయి. సెక్షన్ 80డీలో ఆరోగ్య బీమా ప్రీమియం వివరాలు నమోదు చేయాలి. సేవింగ్స్ ఖాతా ద్వారా వచ్చిన వడ్డీ ఆదాయంపై రూ.10,000 వరకు 80టీటీఏ కింద మినహాయింపు కోరవచ్చు. అలాగే వేతనంలో హెచ్ఆర్ఏ లేనట్లయితే అద్దె చెల్లింపులకు 80జీజీ కింద మినహాయింపు ఉంటుంది.ఆదాయాలన్నీ చెప్పాల్సిందే..చాలామంది పన్ను చెల్లింపుదారులు అదనపు మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఐటీఆర్‌లో చూపించరు. వడ్డీ, కమిషన్ వంటి వాటినుంచి వచ్చే ఇన్‌కమ్‌ను వదిలేస్తుంటారు. వీటన్నింటిపై టీడీఎస్ కట్ చేసి ఉంటారనే ఉద్దేశంతో అవసరం లేదనుకుంటారు. కానీ, ఐటీఆర్‌లో ప్రతీ ఆదాయ మార్గాన్ని పేర్కొనాల్సిందే.గడువు పూర్తయితే..ఐటీఆర్ ఫైలింగ్‌ను గడువులోగా పూర్తి చేయాలి. లేదంటే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ రిటర్నులు దాఖలు చేయాలి.ఇదీ చదవండి: ఉద్యోగులకు ఈ ఫారం తప్పనిసరి!అన్ని పత్రాల పరిశీలనకొన్నిసార్లు ఇన్‌కమ్‌ట్యాక్స్ వివరాలు, ఫారం-16లోని వివరాలు ఒకేలా ఉండకపోవచ్చు. మీ వద్ద వసూలు చేసిన పన్నును ఆదాయపు పన్ను విభాగానికి జమ చేయకపోవడం వల్ల ఈ వ్యత్యాసం కనిపిస్తుంది. రిటర్నులు దాఖలు చేసేముందు మీ ఫారం-16, ఫారం 16ఏ, 26ఏఎస్, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లను పూర్తిగా పరిశీలించాలి. ఏదైనా తేడా ఉంటే మీరు పనిచేసే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, సరిచేసుకోవాలి. -
పసిడి కొనుగోలుదారులకు ఊరట..
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. రెండు రోజుల క్రితం భారీగా తగ్గిన బంగారం ధరలు నిన్నటి రోజున స్థిరంగా కొనసాగాయి. ఈరోజు (జూన్ 24) పసిడి ధరలు స్వల్పంగా తగ్గడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర ఈరోజు రూ.100 తగ్గి రూ.66,250 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.150 క్షీణించి రూ. 72,230 లకు తగ్గింది.దేశంలోని ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,400 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.150 క్షీణించి రూ.73,380 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.100 తగ్గి రూ.66,250 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.150 క్షీణించి రూ. 72,230 లకు దిగొచ్చింది.బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,250 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.150 క్షీణించి రూ. 72,230 లకు తగ్గింది.చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ.50 పెరిగి రూ.67,000 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.60 పెరిగి రూ.73,100 లకు చేరింది.వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.300 చొప్పున తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,200లకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
గ్రాట్యుటీ.. ఎవరికొస్తుంది.. ఎంతొస్తుంది?
ప్రైవేటు రంగంలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగ భద్రత ఉంటుందని చెప్పలేం. అదే సమయంలో ఉద్యోగి తన వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాల దృష్ట్యా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారిపోవడం సహజంగా చూస్తుంటాం. కారణాలు ఏవైనా కానీ ఉద్యోగం వీడితే వచ్చే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. ఉద్యోగం నుంచి వైదొలగినప్పుడు వచ్చే ప్రయోజనాల్లో గ్రాట్యుటీ కీలకమైనది. ఉద్యోగి పనిచేసిన కాలంపై ఇది ఆధారపడి ఉంటుంది. గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం 1972 ఇందుకు ప్రామాణికం. చట్టంలోని నిబంధనలపై అవగాహన కల్పించే కథనమే ఇది.గ్రాట్యుటీ అంటే..? ఉద్యోగి సేవలను గుర్తిస్తూ సంస్థ అందించే ఆర్థిక ప్రయోజనమే గ్యాట్యుటీ. ఎన్నో ఏళ్లుగా సంస్థ అభ్యున్నతి కోసం సేవలు అందించే ఉద్యోగుల పట్ల చూపించే కృతజ్ఞత. ఇది వేతనంలో భాగం కాదు. ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే. కానీ, ఇందుకు అర్హత సాధించాలంటే గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం, 1972లో నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగి సేవలు ఉండాలి. కనీసం ఐదేళ్ల సర్వీస్ (పని చేసిన కాలం) పూర్తి చేసుకున్న వారికే దీన్ని పొందే అర్హత లభిస్తుంది. ఎన్నో రంగాలకు ఈ చట్టం అమలవుతోంది. ప్రభుత్వ విభాగాలు, డిఫెన్స్, స్థానిక సంస్థల ఉద్యోగులు, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు దీని పరిధిలోకి వస్తారు. ఎన్నేళ్లు పనిచేయాలి?గడిచిన ఏడాది కాలం పాటు కనీసం 10 మంది ఉద్యోగులు కలిగిన సంస్థలకు గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం వర్తిస్తుంది. ఆయా సంస్థలు తమ ఉద్యోగులకు నిబంధనలకు అనుగుణంగా గ్రాట్యుటీని అందించాల్సి ఉంటుంది. మైనింగ్ విధుల్లో ఉన్న ఉద్యోగులకు కనీసం 190 పని దినాలు, నాన్ మైనింగ్ విధుల్లోని వారికి 240 పనిదినాలు ఏడాది కింద పరిగణిస్తారు. కనీసం ఐదేళ్ల పాటు అంతరాయం లేకుండా సేవలు అందించిన ఉద్యోగులు అందరూ గ్రాట్యుటీకి అర్హులు. సమ్మెలు, లాకౌట్లు, ప్రమాదాలు, సెలవులు, తాత్కాలిక తొలగింపు వల్ల గైర్హాజరుకు మినహాయింపులు ఉంటాయి. ఐదేళ్ల సర్వీస్ పూర్తి కాకముందే సంస్థ తొలగించిన సందర్భంలోనూ ఉద్యోగికి గ్రాట్యుటీ చెల్లించాల్సిందే. వారంలో ఆరు పనిదినాలు అమలు చేసే కంపెనీల్లో 4 ఏళ్ల 240 రోజులు పనిచేసినా గ్రాట్యుటీకి అర్హత లభిస్తుంది. వారంలో ఐదు రోజుల పనిదినాలున్న కంపెనీల్లోని వారు 4 ఏళ్ల 190 రోజులు పనిచేస్తే అర్హులు. కొన్ని రంగాల్లోని వారికి ఈ కనీస పదవీ కాలం భిన్నంగా ఉంటుంది. న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ కింద పనిచేసే వర్కింగ్ జరల్నిస్టులకు పదేళ్ల సర్వీస్ ఉంటేనే గ్రాట్యుటీకి అర్హత లభిస్తుంది. ఉద్యోగి మరణించినా లేదా వైకల్యం కారణంగా విధుల నుంచి తొలగించినప్పుడు పనిచేసిన కాలంతో సంబంధం లేకుండా గ్రాట్యుటీ చెల్లించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. గ్రాట్యుటీ అనేది కేవలం పదవీ విరమణ వయసుకు వచ్చినప్పుడే కాకుండా.. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నప్పుడు, ఉద్యోగి తప్పిదం లేకుండా తొలగించినప్పుడు, రాజీనామా చేసినప్పుడు ఇవ్వాల్సి ఉంటుందని లెక్స్లెవర్ సర్వీసెస్ డైరెక్టర్ హర్షిత అగర్వాల్ శర్మ తెలిపారు.పరిమితి గ్రాట్యుటీ గరిష్ట పరిమితి రూ.20 లక్షలు. నిబంధనల ప్రకారం సంస్థలు గరిష్టంగా ఇంతకు మించి ఇవ్వక్కర్లేదు. రూ.20లక్షలు మించితే అది ఎక్స్‌గ్రేషియా కిందకు వస్తుంది. ఎక్స్‌గ్రేషియా ఎంత ఇవ్వాలన్నది సంస్థల అభీష్టమే. ఇంత మేర ఇవ్వాలని నిబంధనలు చెప్పడం లేదు. గ్రాట్యుటీ లెక్కింపు చివరి నెల వేతనంలో మూల వేతనం, డీఏ ఎంతో తెలుసుకోవాలి. ఇలా ఒక ఏడాదికి 15 రోజుల వేతనం గ్రాట్యుటీ కింద వస్తుంది. మొత్తం పనిచేసిన సంవత్సరాలు ఇంటూ 15 రోజులు ఇంటూ చివరిగా అందుకున్న మూల వేతనం, డీఏ డివైడ్ 26(నెలలో పనిచేసిన రోజులు) సూత్రం అమలవుతుంది. ఆరు నెలలు దాటిన కాలాన్ని పూర్తి ఏడాదిగా పరిగణిస్తారు. ఉదాహరణకు ఎక్స్ అనే వ్యక్తి 12 సంవత్సరాల పాటు ఒక కంపెనీలో పనిచేసినట్టు అనుకుందాం. చివరిగా అందుకున్న మూల వేతనం, డీఏ కలిపి రూ.75,000. దీంతో ఎక్స్‌కు వచ్చే మొత్తం గ్రాట్యుటీ రూ.5,19,230. గ్రాట్యుటీ చట్టం పరిధిలోకి రాని వారికి ఇచ్చే గ్రాట్యుటీ ఫార్ములా కొంత భిన్నం. ఏడాదిలో 15 రోజులు ఇంటూ చివరి నెలలో మూల వేతనం, డీఏ ఇంటూ పనిచేసిన సంవత్సరాలు డివైడ్ 30(నెలలో పనిచేసిన రోజులు). పూర్తి ఏడాది పాటు పనిచేసిన కాలాన్నే వీరికి ఏడాది కింద పరిగణిస్తారు. దీని ప్రకారం ఎక్స్ అనే వ్యక్తి ఒక సంస్థలో 12 ఏళ్లు పనిచేసి, చివరి నెలలో మూలవేతనం, డీఏ కింద రూ.75,000 తీసుకున్నారని అనుకుంటే.. వచ్చే గ్రాట్యుటీ రూ.4,50,000. ఆలస్యం అయితే విధుల నుంచి వైదొలగిన 30 రోజుల్లోపు గ్రాట్యుటీ చెల్లించాలి. ఇంతకుమించి జాప్యం చేస్తే ఆ మొత్తంపై వడ్డీ కూడా చెల్లించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఉద్యోగికి గ్రాట్యుటీ ప్రయోజనం అన్నది పనిచేసిన కాలం ఆధారంగానే అర్హత ఉండాలి కానీ, రిటైర్మెంట్ వయసు ఆధారం కాకూడదని ఇటీవలే అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ‘‘60 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుంటేనే గ్రాట్యుటీ, లేకపోతే అర్హత లేదన్నది సరైనది కాదు. ఒక ఉద్యోగి ఎన్ని సంవత్సరాల పాటు పనిచేశాడన్న దాని ఆధారంగా గ్రాట్యుటీ హక్కు లభిస్తుంది’’అని అలహాబాద్ సింగిల్ జడ్జి ధర్మాసనం ఓ కేసులో భాగంగా తీర్పు జారీ చేసింది.పన్ను బాధ్యత గ్రాట్యుటీపై పన్ను విషయంలో ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగ ఉద్యోగులకు నిబంధనల్లో వ్యత్యాసం ఉంది. ప్రభుత్వ ఉద్యోగి ఎవరికైనా (కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల) సరే గ్రాట్యుటీ ఎంత అందుకున్నా పన్ను లేదు. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారికి రూ.20 లక్షలు లేదా, చివరి 15 రోజుల వేతనాన్ని పనిచేసిన సంతవ్సరాలతో హెచ్చించినప్పుడు వచ్చే మొత్తం, వాస్తవంగా అందుకున్న గ్రాట్యుటీ.. వీటిల్లో ఏది తక్కువ అయితే ఆ మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 10(10) కిందకు గ్రాట్యుటీ వస్తుంది. గతంలో రూ.10 లక్షల వరకు గ్రాట్యుటీపై పన్ను ఉండేది కాదు. ఈ పరిమితిని మోదీ సర్కారు రూ.20 లక్షలకు పెంచింది.ఇవి తెలుసుకోవాలి.. » పనిచేసిన కాలం ఆరు నెలలు దాటి ఒక్క రోజు ఉన్నా దాన్ని పూర్తి సంవత్సరం కింద గ్రాట్యుటీ చెల్లింపులకు పరిగణనలోకి తీసుకుంటారు. » ఉద్యోగి దుష్ప్రవర్తన కారణంగా సంస్థ తొలగించినప్పుడు గ్రాట్యుటీ ఇవ్వక్కర్లేదు. » ఉద్యోగి మరణించిన సందర్భాల్లో నామినీ లేదా వారసులకు గ్రాట్యుటీ చెల్లిస్తారు. » సంస్థలు దివాలా తీసినప్పటికీ గ్రాట్యుటీ చెల్లించాల్సిన బాధ్యత వాటిపై ఉంటుంది. » నోటీస్ పీరియడ్ కూడా గ్రాట్యుటీ లెక్కింపు పరిధిలోకి వస్తుంది. » మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే గ్రాట్యుటీకి అర్హత కల్పించాలన్న డిమాండ్ కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది. -
దేశవ్యాప్తంగా మరో 400 శాఖలు: ఎస్బీఐ
నెట్వర్క్ విస్తరణ ప్రణాళికలో భాగంగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 400 శాఖలను ప్రారంభించాలని యోచిస్తోంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన ఎస్బీఐ గత ఆర్థిక సంవత్సరంలో 137 శాఖలను ప్రారంభించింది. ఇందులో 59 శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి.ఎస్బీఐ బ్రాంచ్‌లో 89 శాతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నప్పటికీ కొత్త శాఖల అవసరమా అని కొందరు ప్రశ్నించినప్పుడు.. బ్యాంకింగ్ సర్వీసులో కొత్త విభాగాలు పుట్టుకొస్తున్న సమయంలో కొత్త శాఖల అవసరం చాలా ఉందని ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా స్పష్టం చేశారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవసరమున్న ప్రదేశాలను గుర్తిస్తామని, అక్కడ కొత్త శాఖలు ప్రారంభించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని దినేష్ కుమార్ ఖరా అన్నారు. ఇందులో భాగంగానే 400 శాఖలు ప్రారభించనున్నట్లు పేర్కొన్నారు. 2024 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 22,542 శాఖల నెట్‌వర్క్‌ను కలిగి ఉందని స్పష్టం చేశారు. -
బంగారం, వెండి తగ్గిందా.. పెరిగిందా? నేటి ధరలు ఇలా..
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖంలో ఉన్నాయి. క్రితం రోజున రూ.800 మేర తగ్గిన పసిడి ధరలు ఈరోజు (జూన్ 23) స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో మళ్లీ పెరగక ముందే బంగారం కొనాలని కొనుగోలుదారులు భావిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో ధరలుహైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర రూ.66,350 లగా ఉంది. అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం రూ. 72,380 లుగా ఉంది.ఇతర నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.66,500, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.73,400 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.66,350, అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం రూ. 72,380 లుగా కొనసాగుతోంది.బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,350 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ. 72,380 వద్ద కొనుసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ.66,950 లుగా, 24 క్యారెట్ల బంగారం రూ.73,970 లుగా ఉంది.వెండి రేటు ఇలా..దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరల్లో కూడా ఈరోజు ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.96,500 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఈ నెలలో బ్యాంకులు ఏయే రోజుల్లో పనిచేయవో తెలుసా?
Bank Holidays in July 2024: జూలై నెలలో జాతీయ, ప్రాంతీయ సెలవుల కారణంగా మొత్తం 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ జాబితాను సెంట్రల్ బ్యాంక్ జారీ చేస్తుంది. పండుగలు, ప్రాంతీయ వేడుకలు, సాధారణ వారాంతపు సెలవుల ఆధారంగా బ్యాంకులు ఈ సెలవులను నిర్ణయిస్తాయి.దేశంలోని అన్ని బ్యాంకులు, శాఖల్లో సాధారణ వారాంతపు సెలవులు వర్తిస్తాయి. అన్ని ఆదివారాలతో పాటు పండుగలు, జాతీయ సెలవు దినాలు, రెండు, నాలుగో శనివారాలు వంటి వారాంతపు సెలవులు ఈ జాబితాలో ఉన్నాయి.జులై సెలవుల జాబితా ఇదే..» జూలై 3 బెహ్ డైంఖ్లామ్ సందర్భంగా షిల్లాంగ్‌లో సెలవు» జులై 6 ఎం.హెచ్.ఐ.పి డే సందర్భంగా ఐజ్వాల్‌లో సెలవు» జులై 7 ఆదివారం దేశం అంతటా సెలవు» జులై 8 కాంగ్ (రథజాత్ర) సందర్భంగా ఇంఫాల్‌లో సెలవు» జులై 9 ద్రుప్కా షిజి సందర్భంగా గ్యాంగ్ టక్లో సెలవు » జులై 13 రెండో శనివారం దేశం అంతటా సెలవు» జులై 14 ఆదివారం దేశం అంతటా సెలవు» జులై 16 హరేలా సందర్భంగా డెహ్రాడూన్‌లో సెలవు» జులై 17 మొహర్రం/అషూరా/యు తిరోత్ సింగ్ డే సందర్భంగా అగర్తలా, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, హైదరాబాద్ - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయపూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్‌లలో సెలవు» జులై 21 ఆదివారం దేశం అంతటా సెలవు» జులై 27 నాల్గవ శనివారం దేశం అంతటా సెలవు» జులై 28 ఆదివారం దేశం అంతటా సెలవుఈ సెలవులను బ్యాంకుల భౌతిక శాఖలలో పాటిస్తారు. అయితే ఈ సెలవు రోజుల్లో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు నిరాటంకంగా పనిచేస్తాయి. మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సేవల ద్వారా కస్టమర్లు తమ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించుకోవచ్చు. -
వాహనదారులకు షాక్.. సీఎన్జీ ధరలు పెంపు
కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలను ప్రభుత్వం పెంచింది. పెరిగిన రేట్లు జూన్ 22 ఉదయం 6 గంటలకు అమల్లోకి వచ్చాయి. సీఎన్జీ ధర కేజీకి ఒక్క రూపాయి పెరిగింది. ఈ పెరుగుదల తరువాత, ఇప్పుడు దేశ రాజధాని న్యూఢిల్లీలో సీఎన్జీ కేజీ ధర రూ .75.09 కు చేరింది.ఈ పెరుగుదల ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంతో సహా ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌లోని అనేక నగరాల్లో సీఎన్జీ రిటైల్ ధరలను ప్రభావితం చేయనుంది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో సీఎన్జీ ధరలు ఒక్క రూపాయి పెరిగాయి. ఈ నగరాల్లో ఇప్పటి వరకు రూ.78.70 ఉన్న కేజీ సీఎన్జీ ధర ఇప్పుడు రూ.79.70కి చేరింది. ఇక ఎన్సీఆర్ పరిధిలోని గురుగ్రామ్‌లో సీఎన్జీ రేటులో ఎలాంటి మార్పు లేదు. దీంతోపాటు కర్నాల్, కైతాల్లలో కూడా సీఎన్జీ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ఇతర నగరాల్లో ధరలుహర్యానాలోని రేవారీ, మీరట్, ముజఫర్ నగర్, ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ, రాజస్థాన్ లోని అజ్మీర్, పాలి, రాజ్ సమంద్ లలో కూడా నేటి నుంచి సీఎన్ జీ ధరలు పెరిగాయి. రేవారీలో సీఎన్జీ ధరలు కేజీకి రూ .78.70 నుంచి రూ .79.70 కు పెరిగాయి. ఉత్తరప్రదేశ్ లోని మీరట్, ముజఫర్ నగర్, షామ్లీలో రూ.79.08 నుంచి రూ.80.08కి పెరిగింది. రాజస్థాన్ లోని అజ్మీర్, పాలి, రాజ్ సమంద్ లలో ఇప్పుడు సీఎన్జీ ధర ఒక రూపాయి పెరిగింది. ఇక్కడ రూ.81.94 ఉన్న కేజీ సీఎన్జీ ధర రూ.82.94కు పెరిగింది. -
హమ్మయ్య.. బంగారం, వెండిపై భారీ శుభవార్త!
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు నేడు హమ్మయ్య అనిపించాయి. రెండు రోజులుగా పెరుగుదల బాట పట్టిన బంగారం ధరలు శాంతించాయి. క్రితం రోజున రూ.800 మేర పెరిగిన పసిడి ధరలు ఈరోజు (జూన్ 22) అదే స్థాయిలో దిగివచ్చాయి.తెలుగు రాష్ట్రాల్లో..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర రూ.800 తగ్గి రూ.66,350 లకు వచ్చేసింది. అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం కూడా రూ.870 క్షీణించి రూ. 72,380 లకు తగ్గింది.ఇతర నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.800 తగ్గి రూ.66,500 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.870 క్షీణించి రూ.73,400 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.800 తగ్గి రూ.66,350 లకు వచ్చేసింది. అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం కూడా రూ.870 క్షీణించి రూ. 72,380 లకు దిగొచ్చింది.బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.800 తగ్గి రూ.66,350 లకు వచ్చేసింది. అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం కూడా రూ.870 క్షీణించి రూ. 72,380 లకు తగ్గింది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ.850 తగ్గి రూ.66,950 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం అయితే ఏకంగా రూ.930 తగ్గి రూ.73,970 లకు క్షీణించింది.భారీగా దిగొచ్చిన వెండిదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి గణనీయంగా రూ.2000 చొప్పున పతనమైంది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,500లకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
IT Returns Filing: ఉద్యోగులకు ఈ ఫారం తప్పనిసరి!
వేతన జీవులకు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఫారం-16 అవసరం. ఇందులో ఉద్యోగుల స్థూల ఆదాయం, నికర ఆదాయం, టీడీఎస్ కు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగులకు ఫారం-16 అందింది.కంపెనీలు తమ ఉద్యోగులకు ఫారం-16 జారీ చేయడానికి చివరి తేదీ జూన్ 15. మరోవైపు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఆ తర్వాత ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తే పెనాల్టీ, పన్నుపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వేతన జీవులు ఇప్పటి నుంచే రిటర్నులు దాఖలు చేసే ప్రక్రియను ప్రారంభించాలి.రిటర్న్ ఫైలింగ్‌కు ఈ డాక్యుమెంట్లు అవసరంఐటీఆర్ దాఖలుకు ఫారం-16తో పాటు వార్షిక సమాచార ప్రకటన(AIS), ఫారం 26ఏఎస్ అవసరం. ఈ మూడు డాక్యుమెంట్లను ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ నుంచి ఏఐఎస్, ఫారం 26 డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.ఫారం-16 పొందడం ఎలా?మీ కంపెనీ యాజమాన్యం మీకు ఈమెయిల్ ద్వారా ఫారం-16 పంపి ఉండవచ్చు లేదా ఆఫీస్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఉండవచ్చు. ట్రేసెస్ (TRACES)పోర్టల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ పాన్‌ను యూజర్ ఐడీగా ఉపయోగించి సైస్‌లో రిజిస్టర్ చేసుకుని ఆ తర్వాత ఆధార్-ఓటీపీ ఆధారిత ఆథెంటికేషన్ ఎంచుకోవచ్చు.ఆదాయపు పన్ను శాఖ మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి వ్యక్తిగత వివరాలను సరిపోల్చుతుంది. ఇవన్నీ మీ ఆధార్, పాన్ సమాచారంతో సరిపోలాలి. ఈ వివరాలు సరిపోలకపోతే ధ్రువీకరణ ప్రక్రియ ముందుకు సాగదు. వివరాలను సరిపోల్చిన తర్వాత ధ్రువీకరణ విజయవంతమైతే, మీ మొబైల్ నంబర్, ఈమెయిల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత సంబంధిత ఆర్థిక సంవత్సరాన్ని ఎంచుకోవడం ద్వారా ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఫారం-16లో ఏముంటుంది?ఫారం-16లో ఎ, బి అనే రెండు భాగాలుంటాయి. పార్ట్-ఎ లో మీ పేరు, చిరునామా, పాన్, కంపెనీ వివరాలు, టీడీఎస్ వంటి వివరాలు ఉంటాయి. ఇందులో ప్రభుత్వానికి జమ చేసిన పన్నుకు సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది. పార్ట్-బి లో మీ జీతం బ్రేకప్ ఉంటుంది. సెక్షన్ 10 కింద మినహాయింపులు ఉంటాయి. వీటిలో లీవ్ ట్రావెల్ అలవెన్స్, ఇంటి అద్దె అలవెన్స్ ఉన్నాయి. చాప్టర్ 6-ఏ కింద కూడా మినహాయింపులు ఉంటాయి.ఫారం-16లో ఇచ్చిన సమాచారాన్ని ఫారం-26ఏఎస్‌తో సరిపోల్చాలి. దీన్ని ఏఐఎస్ తో కూడా సరిపోల్చుకోవచ్చు. డేటాలో ఏదైనా వ్యత్యాసం కనిపిస్తే సరిదిద్దుకోవాలి. దీని కోసం, మీరు మీ కంపెనీ, ఇతర పన్ను మినహాయింపు సంస్థను సంప్రదించవచ్చు. ఫారం-16లో ఇచ్చిన సమాచారానికి, ఐటీఆర్‌లో ఇచ్చిన సమాచారానికి మధ్య ఏదైనా వ్యత్యాసం ఉంటే ఆదాయపు పన్ను శాఖ నుంచి మీకు నోటీసు రావచ్చు. -
వామ్మో బంగారం, వెండి.. ఏకంగా నాలుగు రెట్లు!
బంగారం, వెండి ధరలు మళ్లీ మోత మోగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా క్రితం రోజున రూ.200 మేర పెరిగిన పసిడి ధరలు ఈరోజు (జూన్ 21) ఏకంగా దానికి నాలుగు రెట్లు పెరిగి కొనుగోలుదారులను భయపెడుతున్నాయి.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర రూ.750 పెరిగింది. దీంతో రూ.67,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి కూడా రూ.810 ఎగిసి రూ. 73,250 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.750 పెరిగి రూ.67,300 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.810 ఎగిసి రూ.73,400 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.750 పెరగడంతో రూ.67,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి కూడా రూ.810 ఎగిసి రూ. 73,250 లకు పెరిగింది.ఇక బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.750 పెరగడంతో రూ.67,150 లకు చేరింది. 24 క్యారెట్ల పసిడి రూ.810 ఎగిసి రూ. 73,250 లను తాకింది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.67,800 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం అయితే ఏకంగా రూ.960 పెరిగి రూ.73,970 లకు ఎగిసింది.భారీగా ఎగిసిన వెండిదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా ఎగిశాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.1400 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.98,500లను చేరుకుంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా.. మారిన రూల్స్ తెలుసా?
ఐటీఆర్ రిటర్న్స్ ఫైలింగ్‌కు ఇంక కొన్ని రోజులే ఉంది. 2024 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఏటా ఐటీఆర్ దాఖలు చేస్తున్నవారైనా, ఈసారి కొత్తగా ఫైలింగ్ చేస్తున్నవారైనా పన్నుకు సంబంధించిన మార్పుల గురించి తప్పక తెలుసుకోవాలి.గత కొన్నేళ్లలో సీబీడీటీ అనేక పన్ను సంబంధిత నిబంధనలను మార్చింది. ఐటీఆర్ ఫైలింగ్‌కు సంబంధించి మారిన నిబంధనల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. ఈ విషయాల పట్ల జాగ్రత్త వహించకపోతే ట్యాక్స్ రీఫండ్ ఆగిపోయే అవకాశం ఉంది.కొత్త పన్ను విధానం2024 సంవత్సరంలో కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. దీని కింద రూ .7 లక్షల వరకు ఆదాయంపై ఎటువంటి పన్నూ ఉండదు. అయితే మీరు కొత్త, పాత పన్ను విధానం ఏదోఒక దాని కింద ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. కొత్త పన్ను విధానం డిఫాల్ట్ గా ఉంటుంది. పాత పన్ను విధానం ఐచ్ఛికం. ఎలాంటి మినహాయింపు, డిడక్షన్ లేకుండా క్లెయిమ్ సమర్పిస్తే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలి. ఒక వేళ పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే దాని కింద వివిధ పన్ను మినహాయింపులు, డిడక్షన్లను క్లెయిమ్ చేయవచ్చు.స్టాండర్డ్ డిడక్షన్వేతన జీవులకు రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను ఇటీవల ప్రవేశపెట్టారు. ఈ స్టాండర్డ్ డిడక్షన్ పెన్షనర్లకు మాత్రమే. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకునేందకు స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.50,000 తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. దీంతో పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.సెక్షన్ 80సీసెక్షన్ 80సీ పరిమితిని రూ.1.5 లక్షలకు పెంచారు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, ఎల్ఐసీ, ఎన్ఎస్సీ, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఇన్వెస్ట్ చేస్తే 80సీ కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. ఇది కాకుండా, 80డీ కింద మీరు మీ కుటుంబం, సీనియర్ సిటిజన్లైన తల్లిదండ్రుల కోసం తీసుకున్న ఆరోగ్య బీమాపై పన్ను మినహాయింపు పొందవచ్చు. రెండింటి గరిష్ట ప్రీమియం రూ.75,000. 80సీలో హోమ్ లోన్, పిల్లల ఎడ్యుకేషన్ ఫీజుల అసలు మొత్తాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.హోమ్ లోన్మీరు ఇల్లు కొనుగోలు చేసి, దాని కోసం హోమ్ లోన్ తీసుకున్నట్లయితే 80ఈఈఏ కింద దాని వడ్డీపై మినహాయింపు పొందుతారు. గృహ రుణ వడ్డీపై రూ .2 లక్షల వరకు అదనపు తగ్గింపును ప్రోత్సహించడమే దీని లక్ష్యం. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం, అఫోర్డబుల్ హౌసింగ్‌ను ప్రోత్సహించడం ఈ మినహాయింపు ఉద్దేశం.అదనపు వివరాలుఐటీఆర్ ఫారాన్ని సవరించి అదనపు వివరాలను పొందుపరిచారు. ముఖ్యంగా విదేశీ ఆస్తులు, ఆదాయం, భారీ లావాదేవీలు వెల్లడించేలా నిబంధనలు మార్చారు. విదేశీ పెట్టుబడులు లేదా గణనీయమైన ఆర్థిక కార్యకలాపాలు ఉన్న పన్ను చెల్లింపుదారులు జరిమానాను నివారించడానికి వివరణాత్మక సమాచారాన్ని అందించాలి. 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు పెన్షన్, వడ్డీ ద్వారా మాత్రమే ఆదాయం ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేయాల్సిన బాధ్యత నుంచి వారికి మినహాయింపు ఉంది. అయితే దీని కోసం పెన్షన్, వడ్డీ డబ్బుల నుంచి బ్యాంకులు టీడీఎస్‌ను మినహాయించడం మాత్రం తప్పనిసరి. -
ఈఎస్ఐసీ కిందకు 16.47 లక్షల మంది
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) కింద ఏప్రిల్ నెలలో 16.47 లక్షల మంది కొత్తగా వచ్చి చేరారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను కేంద్ర కార్మిక శాఖ తాజాగా విడుదల చేసింది.ఇందులో 47.60 శాతం అంటే 7.84 లక్షల మంది వయసు 25 ఏళ్లలోపే ఉందని, కొత్త ఉద్యోగాల కల్పనను ఈ గణాంకాలు ప్రతిఫలిస్తున్నాయని కార్మిక శాఖ పేర్కొంది. మొత్తం కొత్త సభ్యుల్లో 3.38 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈఎస్ఐసీ కింద 53 మంది ట్రాన్స్జెండర్లు కూడా నమోదు చేసుకున్నారు.సమాజంలో అన్ని వర్గాలకు ప్రయోజనాలు అందించడమే ఈ పథకం లక్ష్యంగా కార్మిక శాఖ తెలిపింది. ఇక ఏప్రిల్‌లో 18,490 కొత్త సంస్థలు ఈఎస్ఐసీ కింద రిజిస్టర్ చేసుకున్నాయి. దీంతో ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈఎస్ఐ కవరేజీ వచ్చినట్టయింది. -
కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల ఉపయోగాలివే..
నెలవారీ వేతనం ఈఎంఐలు, ఇంటిఖర్చులు, ఇతర పెట్టుబడులు, పొదుపు..ఇలా బ్యాంకులో జమైన కొద్దిరోజులకే ఇట్టే ఖర్చయిపోతోంది. నెలాఖరు వరకు చాలామంది చేతిలో డబ్బులేని పరిస్థితి ఏర్పడుతోంది. దాంతో క్రెడిట్ కార్టులకు ఆదరణ పెరుగుతోంది. ఒకప్పటిలా కాకుండా బ్యాంకులు కూడా వీటిని సులువుగా జారీ చేస్తున్నాయి. క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్లు వంటి ప్రయోజనాలు ఉండటంతో వీటిని వినియోగించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ క్రమంలో ఆర్థిక సంస్థలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, టాటా..వంటి కొన్ని కార్పొరేట్ సంస్థలతో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. అసలు ఏమిటీ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్టులు? వీటి ఉపయోగం ఏమిటనే అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.కో బ్రాండెండ్ క్రెడిట్ కార్డువినియోగదారుల అవసరాలు మారుతున్నాయి. అందుకు అనుగుణంగా కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంచుకునేలా ఆర్థిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ప్రత్యేకంగా కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. నిర్దిష్ట బ్రాండ్లు, వ్యాపారాలు, రిటైలర్లు, సర్వీస్ ప్రొవైడర్లు..వంటి వాటితో అనుబంధంగా వీటిని ఇస్తున్నారు. అయితే, ఈ కార్డుల ద్వారా సాధారణ క్రెడిట్ కార్డుల కంటే అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి. ఇవి తమ అనుబంధ బ్రాండ్లతో చేసిన లావాదేవీల ఈఎంఐలపై తక్కువ వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు రాయితీ వంటి ప్రయోజనాలు కల్పిస్తాయి. ఉదాహరణకు..ఐసీఐసీఐ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్‌కార్డు అందిస్తోంది. వినియోగదారులు దీనితో ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేస్తే నిబంధనల ప్రకారం అదనంగా రాయితీలుంటాయి. దానివల్ల అటు వినియోగదారులకు, ఇటు క్రెడిట్‌కార్డు సంస్థలకు లాభం చేకూరుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.ప్రయోజనాలు..కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఉపయోగించి లావాదేవీలు చేసే వారు నిబంధనల ప్రకారం టార్గెట్ చేరుకుంటే వార్షిక రుసుము మినహాయింపు పొందొచ్చు.ప్రతి లావాదేవీలో రివార్డు పాయింట్లు అందుతాయి.కార్డు ఇస్తున్న సంస్థలు సూచించిన మర్చంట్స్ నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేస్తే తక్కువ వడ్డీకి రుణాల్ని పొందవచ్చు.కొత్తగా ఈ కార్డులను తీసుకున్న వారికి వెల్కమ్ ఆఫర్ కింద షాపింగ్ కూపన్లు, డిస్కౌంట్లు ఉంటాయి.ఇదీ చదవండి: ఈపీఎస్‌లో మార్పులు.. పదేళ్ల సర్వీసు లేని వారికి నష్టంకార్డు ఎంపిక ఇలా..కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఎంచుకునే ముందు దేనిపై ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతున్నారో తెలుసుకోవాలి. ఒకవేళ నిత్యం ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువగా షాపింగ్ చేస్తే దానికి అనుబంధంగా ఉన్న సంస్థ కార్డును ఎంచుకోవాలి. లేదంటే అమెజాన్‌లో షాపింగ్ చేస్తే ఆ సంస్థతో భాగస్వామ్యంగా ఉన్న కార్డును సెలక్ట్ చేసుకోవాలి. కార్డు ఎంచుకునేముందు ఫీచర్లు, రుసుములు, వడ్డీ రేట్లు, ఆఫర్లు, రివార్డ్ పాయింట్లు వంటి ప్రయోజనాలు ఏ మేరకు ఉన్నాయో ముందే తెలుసుకోవాలి. -
కొనుగోలుదారులకు నిరాశ.. బంగారం, వెండి మళ్లీ..
దేశవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరుగుదల వైపు పయనించాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (జూన్ 20) స్పల్పంగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 పెరిగింది. ఇది ప్రస్తుతం రూ.66,400 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి కూడా రూ.220 పెరిగి రూ. 72,440 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లో ధరలుదేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.66,550 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.220 ఎగిసి రూ.72,590 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.200 పెరిగి రూ.66,400లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.220 పెరిగి రూ.72,440 లకు చేరుకుంది.ఇక బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.66,400 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగి రూ.72,440 లకు ఎగిసింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.40 పెరిగి రూ.67,000లకు చేరింది. 24 క్యారెట్ల పసిడి మాత్రం రూ.40 తగ్గి రూ.73,010 లకు దిగొచ్చింది.భారీగా పెరిగిన వెండిదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.1500 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.97,100లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
పంజాబ్ నేషనల్ బ్యాంక్: జులై 1 నుంచి ఆ ఖాతాలు క్లోజ్!
PNB Alert: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తమ కోట్లాది మంది ఖాతాదారులకు అప్రమత్తం చేసింది. ఈ బ్యాంకులో పొదుపు ఖాతా ఉండి గత కొన్నేళ్లుగా ఉపయోగించకపోతే జూలై 1 తర్వాత అలాంటి ఖాతాలు రద్దు కానున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ విషయాన్ని చెబుతోంది. సేవింగ్స్ అకౌంట్ భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.మీకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉంటే ముందుగా దాని స్టేటస్ చెక్ చేసుకోండి. ఈ నెలాఖరు కల్లా వాడుకలో లేని ఖాతాలను బ్యాంక్ మూసివేయనుంది. గత మూడేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాలను, అలాగే గత మూడేళ్లుగా అకౌంట్ బ్యాలెన్స్ సున్నా ఉన్న అకౌంట్లను క్లోజ్ చేయబోతున్నట్లు బ్యాంకు తన నోటిఫికేషన్లో పేర్కొంది. అలాంటి కస్టమర్లకు ఇప్పటికే నోటీసులు సైతం పంపించింది.వాడుకలో లేని ఖాతాలకు కేవైసీ చేయించుకోవాలని పీఎన్బీ కొన్ని రోజుల క్రితమే ఖాతాదారులకు తెలియజేసింది. అయితే ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించింది. ఆ తర్వాత జూలై 1 నుంచి ఈ ఖాతాలు క్లోజ్ అవుతాయి. చాలా కాలంగా కస్టమర్లు ఉపయోగించని ఇలాంటి ఖాతాలను చాలా మంది మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి కేసులను ఎదుర్కోవడానికి బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఖాతా లెక్కింపు 2024 ఏప్రిల్ 30 ఆధారంగా జరుగుతుంది.తిరిగి యాక్టివేట్ చేసుకోండిలా..బ్యాంకు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. అకౌంట్ ఇన్‌యాక్టివ్ అయి, ఖాతాదారు అకౌంట్‌ను తిరిగి యాక్టివేట్ చేయాలనుకుంటే బ్రాంచ్ కు వెళ్లి కేవైసీ ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. కేవైసీ ఫారంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను కూడా జత చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. కస్టమర్లు మరింత సమాచారం కోసం బ్యాంకును సంప్రదించవచ్చు. -
వెండి గుడ్‌న్యూస్.. మరి బంగారం?
దేశవ్యాప్తంగా రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈరోజు (జూన్ 19) స్థిరంగా కొనసాగాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలపై బంగారం రేట్లు ఆధారపడి ఉంటాయి.తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.66,200 లుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 72,220 వద్ద కొనసాగుతోంది.ఇతర నగరాల్లో..» ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,350 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.72,370 వద్ద ఉన్నాయి.» ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.66,200 లుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 72,220 వద్ద కొనసాగుతోంది.» చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.66,960 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.10 ఎగిసి రూ.73,050 వద్దకు చేరింది. » బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.66,200 లుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 72,220 వద్ద కొనసాగుతోంది.వెండి తగ్గుముఖందేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు క్షీణించాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఈరోజు మోస్తరుగా రూ.400 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రేటు రూ.95,600 వద్దకు దిగొచ్చింది. క్రితం రోజున ఇది రూ.96,000 లుగా ఉండేది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఈపీఎస్‌లో మార్పులు.. పదేళ్ల సర్వీసు లేని వారికి నష్టం
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)లో చేరి పదేళ్లు పూర్తి కాలేదా..? ఉద్యోగుల పింఛను స్కీం (ఈపీఎస్)లో జమైన డబ్బు తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకు వచ్చే నగదు కొంతమేర తగ్గనుంది. ఈపీఎస్ ముందస్తు ఉపసంహరణ చెల్లింపుల్లో ఈపీఎఫ్‌వో మార్పులు తీసుకొచ్చింది. ఈపీఎఫ్ పరిధిలోని సంస్థలో పని చేసిన సర్వీసును ఇప్పటివరకు ఏడాది పరంగా లెక్కగట్టేవారు. తాజాగా మార్చిన నిబంధనల ప్రకారం సంస్థలో ఎన్ని నెలలు పనిచేస్తే అన్ని నెలలకే లెక్కించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఈపీఎస్ చట్టం, 1995 టేబుల్-డీలో కార్మికశాఖ సవరణలు చేసింది.ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం..ఉద్యోగి ఏదేని సంస్థలో పనిచేస్తూ కనీసం పదేళ్ల ఈపీఎస్ సర్వీసు పూర్తి చేస్తేనే వారికి 58 ఏళ్లు వచ్చాక నెలవారీ పింఛను వస్తుంది. తొమ్మిదేళ్ల ఆరు నెలల సర్వీసు పూర్తి చేసినా పదేళ్లుగానే పరిగణిస్తారు. అంతకు తక్కువుంటే పింఛను రాదు. పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఈపీఎస్ నిల్వలను చెల్లించదు. కనీస సర్వీసు లేనివారు మాత్రమే ఈ నగదు తీసుకునేందుకు అర్హులు.ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు పదేళ్ల సర్వీసుకంటే ముందే ఈపీఎస్ మొత్తాన్ని ఉపసంహరిస్తున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన కొంతమంది రెండు, మూడేళ్లకో సంస్థ మారుతూ అప్పటికే ఈపీఎస్‌లో జమైన మొత్తాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. అయితే బదిలీ, ఉద్యోగం మానేసిన కారణాలతో డబ్బులను వెనక్కి తీసుకోవద్దని, మరో సంస్థకు ఆ సర్వీసును పూర్తిగా బదిలీ చేసుకుంటే పింఛను అర్హత పొందడంతోపాటు ఎక్కువ పింఛను వస్తుందని ఈపీఎఫ్‌వో అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: నెలలో రెట్టింపైన ఉల్లి ధర.. ఎగుమతి సుంకంపై మంత్రి ఏమన్నారంటే..ఎలా లెక్కిస్తారంటే..ఉద్యోగి మూలవేతనం నుంచి 12 శాతం ఈపీఎఫ్ ఖాతాకు డబ్బు జమవుతుంది. పనిచేస్తున్న సంస్థ అంతేమొత్తంలో 12 శాతం వాటాను ఈపీఎఫ్‌కు చెల్లిస్తుంది. అయితే సంస్థ చెల్లించే 12 శాతంలో 8.33 శాతం ఈపీఎస్‌లోకి, 3.67 శాతం ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. 2014 నుంచి ఈపీఎఫ్‌వో గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచారు. దాని ప్రకారం సంస్థ చెల్లించే 12 శాతం వాటా (రూ.1,800)లో 8.33 శాతం అంటే రూ.1,250 ఈపీఎస్‌కు వెళ్తుంది. ఉద్యోగి పదేళ్ల సర్వీసుకు ముందే రాజీనామా చేసినా, రిటైర్డ్ అయినా ఈపీఎస్‌ను వెనక్కి తీసుకోవాలని అనుకుంటే అతని సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఎంత చెల్లించాలో లెక్కించేవారు. ఒకవేళ మూలవేతనం, డీఏ కలిపి రూ.15000 ఉందనుకుందాం. ఉద్యోగి ఏడేళ్ల ఏడు నెలలు పని చేశాడనుకుంటే గతంలోని నిబంధన ప్రకారం ఏడేళ్ల ఏడు నెలలను ఎనిమిదేళ్లుగా పరిణించేవారు. రాజీనామా లేదా ఉద్యోగ విరమణ చేసినప్పుడు మూలవేతనం రూ.15000 ఉన్నందున ఈపీఎస్ టేబుల్-డీ ప్రకారం ఎనిమిదేళ్ల కాలానికి 8.22 నిష్పత్తి చొప్పున చెల్లించేవారు. అంటే రూ.15,000 X 8.22 చొప్పున రూ.1,23,300 వచ్చేవి. తాజా నిబంధనల ప్రకారం ఏడేళ్ల ఏడు నెలలు అంటే 91 నెలలు అవుతుంది. 91 నెలల కాలానికి నిష్పత్తి 7.61 అవుతుంది. అంటే రూ.15000 X 7.61 లెక్కన రూ.1,14,150 చెల్లిస్తారు. -
Budget 2024: పన్నుల తగ్గింపు యోచనలో ప్రభుత్వం!
పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొన్ని వర్గాల ప్రజలకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని యోచిస్తోందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక నివేదికలో తెలిపింది.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 ఆర్థిక సంవత్సరానికి పూర్తి కేంద్ర బడ్జెట్‌ను వచ్చే జులై నెలలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా కొత్త ఆదాయపు పన్ను రేట్లను ప్రకటించే అవకాశం ఉంది. వ్యక్తిగత పన్ను తగ్గింపు వల్ల ఆర్థిక వ్యవస్థలో వినియోగం పెరుగుతుందని, మధ్యతరగతికి పొదుపు పెరుగుతుందని నివేదిక పేర్కొంది.వార్షికాదాయం రూ.15 లక్షలు కంటే ఎక్కువ పొందేవారు పన్ను ఉపశమనం పొందే కేటగిరీలో ఉన్నారని, అత్యధిక పన్ను పరిమితి ఆదాయం ఎంత ఉండాలన్నది ఇంకా నిర్ణయించలేదని నివేదిక తెలిపింది. రూ.10 లక్షల వార్షికాదాయానికి ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని, పాత పన్ను విధానంలో అత్యధికంగా 30 శాతం పన్ను విధించే ఆదాయానికి కొత్త పరిమితిపై చర్చిస్తున్నట్లు నివేదిక తెలిపింది.2020లో ప్రారంభించిన పన్ను విధానంలో ప్రభుత్వం మార్పులు చేయవచ్చు. దీని ప్రకారం.. రూ .15 లక్షల వరకు వార్షిక ఆదాయంపై 5 శాతం నుంచి 20 శాతం పన్ను, రూ .15 లక్షలకు పైగా ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తున్నారు. ఒక వ్యక్తి ఆదాయం రూ .3 లక్షల నుంచి రూ .15 లక్షలకు ఐదు రెట్లు పెరిగినప్పుడు ఆదాయపు పన్ను రేటు మాత్రం ఆరు రెట్లు పెరుగుతుంది. ఇది చాలా తీవ్రమైనదంటూ నివేదిక పేర్కొంది. -
ఇకపై మరింత రాబడి.. ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్!
SBI FD Interest Rates Hike: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తన కోట్లాది మంది ఖాతాదారులకు శుభవార్త అందించింది. 180 రోజుల నుంచి 210 రోజులు, 211 రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ కాలపరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని పెంచింది. ఎస్బీఐ ఈ ఎఫ్డీలపై వడ్డీని 0.25 శాతం పెంచింది.ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు బ్యాంకులు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పరిమితిని పెంచుకోవచ్చు. ఎస్బీఐ ప్రకటించిన ఈ కొత్త రేట్లు రూ .3 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లకు ఉన్నాయి. ఈ కొత్త రేట్లు జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి.ఎస్బీఐ ఎఫ్డీ వడ్డీ రేట్లు ఇవే.. » 7 రోజుల నుంచి 45 రోజులు: సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 శాతం.» 46 రోజుల నుంచి 179 రోజులు: సాధారణ ప్రజలకు 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6 శాతం» 180 రోజుల నుంచి 210 రోజులు: సాధారణ ప్రజలకు 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం» 211 రోజుల నుంచి ఏడాది లోపు: సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7 శాతం» ఏడాది నుంచి 2 సంవత్సరాల లోపు: సాధారణ ప్రజలకు 6.80 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం» 2 సంవత్సరాల నుంచి మూడేళ్ల లోపు: సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం» మూడేళ్ల నుంచి 5 సంవత్సరాల లోపు: సాధారణ ప్రజలకు 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం» ఐదేళ్ల నుంచి 10 సంవత్సరాలు: సాధారణ ప్రజలకు 6.50, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం.