BCs
-
BC Declaration బీసీలకు అభయ‘హస్తం’
బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణలో కాంగ్రెస్ (congress) ప్రభుత్వం చరి త్రాత్మకమైన కులగణన పూర్తి చేసింది. దీంతో ప్రతిపక్ష పార్టీల్లో వణుకు మొదలైంది. కులగణనను శాస్త్రీయంగా పూర్తిచేసి దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రభు త్వాన్ని అభినందించాల్సింది పోయి... ప్రతిపక్షాలు దిగజారుడుతనంతో విమర్శలు కొనసాగించడం బాధాకరం. జనాభాలో సగంపైగా ఉన్న బీసీలకు సమ న్యాయం జరగాలనే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ... తొలుత తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దీనిపై ముందడుగు వేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందే 2023 నవంబర్‌లో కామారెడ్డి బహిరంగ సభలోకాంగ్రెస్ ‘బీసీ డిక్లరేషన్’ (BC Declaration) ప్రకటించింది. ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్రంలో కులగణన చేపడుతామని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన అంశాన్ని చేపట్టి పూర్తి చేసింది. రాష్ట్రంలో 56 శాతానికి పైగా బీసీ జనాభా ఉందని నిర్ధారణ కావడంతో బీసీలకు న్యాయం చేసే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపుల్ల లేస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ చేపట్టిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ వివరాలను కేసీఆర్ సర్కార్ ఎందుకు బయట పెట్టలేదు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో బీసీ జనాభా 56 శాతానికి పైగా ఉందంటే, తక్కువ చేసి చూపిస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు గగ్గోలు పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా శాసనం చేసేందుకు అనేక చట్టపరమైన ప్రక్రియలుంటాయి. దీనికి సమయం పట్టే అవకాశం ఉండడంతో కాలయాపన జరగకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రక టించినట్టు బీఆర్ఎస్, బీజేపీలు కూడా 42 శాతం బీసీలకు టికెట్లిస్తాయా అని ప్రశ్నిస్తే ఆ పార్టీలు సరైన రీతిలో స్పందించకుండా అసలు విషయాన్ని దారి మళ్లిస్తున్నాయి. గతంలో స్థానిక ఎన్నికల్లో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించింది బీఆర్ఎస్. ఇప్పుడు అది నిరాధార ఆరోపణలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తోంది.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJ)P)దేశంలో జనగణన చేపట్టకుండా తాత్సారం చేస్తోంది. తక్షణమే జనగణన నిర్వహించి, అందులో భాగంగా కులగణన కూడా చేపట్టి జనాభా ప్రాతిపదికన సంబంధిత సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలికంగా డిమాండ్ చేస్తున్నా ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మనుశాస్త్ర ధర్మాన్ని అనుసరిస్తూ, రాజ్యంగ నిర్మాత అంబేడ్కర్‌నే అవమా నిస్తున్న బీజేపీ నుండి సామాజిక న్యాయం ఆశించడం అత్యాశే అవుతుంది. బీజేపీవారు దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబంపై అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నారు.దేశంలో జనగణన, కులగణన చేపట్టాలని సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ కోరుతుంటే వారి కులాలను ప్రస్తావించి అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తు న్నారు. ముస్లింలను బీసీ సామాజికవర్గంలో ఎలా చేరుస్తారనీ, వారికి రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారనీ బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో మత ఉద్రిక్తతలు సృష్టించాలని చూస్తున్నారు. ముస్లింలలో వెనుకబడిన వారు లేరా? బీజేపీ వారి మోడల్‌గా చెప్పుకునే గుజరాత్లో ఓబీసీ ముస్లింలుండగా, తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదా? తెలంగాణ ప్రభుత్వం కులగణన నివేదిక అనంతరం బీజేపీ రాజ్యసభ సభ్యులు, బీసీ నేత ఆర్.కృష్ణయ్య ఈ అంశాన్ని స్వాగతిస్తుంటే, ఆ పార్టీలో మరికొందరు కులగణన తప్పుడు లెక్కలంటూ వ్యాఖ్యానించడడం ఆ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనం. బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలను విఫలం చేయడానికి ప్రతి పక్షాలు పన్నుతున్న కుట్రలను వెనుకబడిన తరగతుల ప్రజలు గమనించాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి బిల్లు ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం కోసం ప్రధాని మోదీని ఒప్పించ గలరా? ఇందుకోసం బీఆర్ఎస్ కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. 2023 ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన బీజేపీ... ఎన్నికల సమయానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బీసీ వర్గానికి చెందిన బండి సంజ య్‌ను తొలగించి, ఆయన స్థానంలో ఓసీ వర్గీయుడైన కిషన్‌రెడ్డిని నియమించింది. తెలంగాణకు ముఖ్య మంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పిన కేసీఆర్ తానే అందలమెక్కారు. ఈ రెండు పార్టీలకు భిన్నంగా సామాజిక న్యాయం పాటిస్తూ కాంగ్రెస్... బీసీ సామాజిక వర్గానికి చెందిన నన్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. కాంగ్రెస్‌తోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని, బీసీ లకు కాంగ్రెస్సే అభయహస్తం ఇవ్వగలదని కుల గణనతో మరోసారి నిరూపితమైంది. ప్రతిపక్షాలు కీలకమైన విషయాలను పక్కదారి పట్టిస్తే రాష్ట్రంలోని బీసీ సామాజికవర్గం సరైన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయం. -బి. మహేశ్ కుమార్ గౌడ్ వ్యాసకర్త ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు -
ఎంఎస్ఎంఈ పాలసీలో బీసీలకు సబ్సిడీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ– 2024 పాల సీలో ఇతర వర్గాలకు ఇ చ్చిన మాదిరిగా బీసీల కూ ప్రయోజనాలు కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డికి బీసీ సంక్షేమ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో మంగళవారం సెక్రటేరియట్ కాన్ఫ రెన్స్ హాల్లో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరా వుతో కలిసి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మేధావులు, రిటైర్డ్ ఐఎఎస్‌లు, బీసీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పారిశ్రామిక వేత్తలతో మేథోమధన సదస్సు నిర్వహించారు. సమావేశంలో ఎంఎస్ఎంఈ రిటైర్డు జాతీయ డైరెక్టర్ ఆఫ్ జనరల్ చుక్కా కొండయ్యతో పా టు రిటైర్డు ఐఎఎస్‌లు, మేధావులు, పారిశ్రామి కవేత్తలతో కలిపి కమిటీ వేయాలని నిర్ణయించారు.ఎంఎస్ఎంఈలో బీసీలకు సంబంధించిన అంశాలను చేర్చేందుకు వారి సలహా సూచనలు తీసుకొని అందులో చేర్చాల్సిన అంశాలపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. కేశవ రావు మాట్లాడుతూ బీసీలకు సబ్సిడీలు కల్పిస్తే వారితో పారిశ్రామికాభివృద్ధి సాధించవచ్చని సూచించారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఎంఎస్ఎంఈ పాలసీలో బీసీలకు సబ్సిడీలు ఇతర అంశాలు చేరిస్తే లక్షలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు దొరకడంతో పాటు స్వత హాగా కులవృత్తులు ఆధునిక సాంకేతికతతో ఆర్థికవృద్ధి సాధించేందుకు ఉపయోగపడుతుందన్నారు.రాష్ట్రంలో ప్రతి బీసీ కుటుంబం ఒక సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ అని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అన్నారు. ఎంపీ అనిల్‌కుమార్ యాద వ్, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, వీర్లపల్లి శంకర్, కమిషనర్ బాల మాయాదేవి, రిటైర్డు ఐఎఎస్ లు చిరంజీవులు, చోలేటి ప్రభాకర్, దినకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.విద్యావ్యవస్థలో సమూల మార్పులుసీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో విద్యారంగ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నామని, బీసీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలను ప్రతి ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేలు సందర్శించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభా కర్ కోరారు. మంగళవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వ హించి బీసీ సంక్షేమ శాఖలో ఉన్నా సమస్యలపై చర్చించారు. బీసీ సంక్షేమ శాఖలో ఉన్న సమ స్యలపై చర్చించారు. అధికారులు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. నవంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురు కులాలు సందర్శిస్తానని తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కమిషనర్ బాల మాయా దేవి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సగం కూడా దక్కలేదు
సాక్షి, అమరావతి: జనాభాపరంగా అత్యధికంగా ఉన్న బీసీలకు 24 మందితో కొలువుదీరిన సీఎం చంద్రబాబు మంత్రివర్గంలో కనీసం సగం కూడా స్థానం దక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీసీలకు కేవలం 8 మంత్రి పదవులు ఇవ్వగా అతి తక్కువ జనాభా ఉన్న సీఎం చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి మాత్రం ఐదు పదవులు (బాబుతో కలిపి) దక్కడం గమనార్హం. ఎక్కువ స్థానాల్లో విజయం సాధించిన రెడ్డి సామాజిక వర్గానికి సైతం చంద్రబాబు నిరాశే మిగిల్చారు.వైఎస్సార్ సీపీ పాలనలో ఒక్క బీసీలకే పది మంత్రి పదవులు ఇవ్వగా, ఎస్సీలకు ఐదు, ఎస్టీలకు ఒకటి, మైనారిటీలకు ఒక మంత్రి పదవి చొప్పున దక్కాయి. మొత్తం మంత్రివర్గంలో వైఎస్ జగన్ ఆయా వర్గాలకు ఇచ్చిన పదవుల శాతం 68 కాగా ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో వారికిచ్చిన పదవులు 45 శాతం మాత్రమే కావడం గమనార్హం. » సీఎం చంద్రబాబు మంత్రి పదవుల్లో బీసీలకు 8, కాపులకు 4, రెడ్డి వర్గానికి కేవలం మూడు మాత్రమే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వైశ్య సామాజిక వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున మంత్రి పదవులు దక్కాయి. వైఎస్ జగన్ తన మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేశారు. ఆయా వర్గాలకు ఆయన ఏకంగా 17 మంత్రి పదవులు ఇవ్వడం గమనార్హం. ఇప్పుడు చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 12 పదవులు మాత్రమే ఇచ్చారు. » వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాలకు ఒక్కో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో కాపు వర్గానికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. రెడ్డి సామాజిక వర్గానికి వైఎస్ జగన్ హయాంలో ఆయనతో కలిపి ఐదు పదవులు దక్కగా చంద్రబాబు ప్రభుత్వంలో ముగ్గురికే అవకాశం లభించింది. » వైఎస్ జగన్ ప్రతి అడుగులో సామాజిక న్యాయాన్ని పాటించారు. మంత్రివర్గం నుంచి స్థానిక సంస్థలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు లాంటి అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతానికిపైగా ఇచ్చి రాజకీయ సాధికారతకు బాటలు వేశారు. చంద్రబాబు తొలి అడుగులోనే సొంత సామాజికవర్గంపై మక్కువ ప్రదర్శించి దళిత, మైనారిటీ, బీసీ వర్గాలను చిన్నచూపు చూశారు. -
చౌదరికి 3డీ సినిమా ఖాయం!
అవును, సుజనా కోసం బీసీలు బలయ్యారు. ముస్లిం మైనార్టీలు మోసపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకే చెందిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులను పక్కా ప్రణాళికతో బలి పశువుల్ని చేశారు. పార్ట్నర్ పవన్‌తో పోతిన వెంకట మహేష్ ను పొడిపించేశారు. పెత్తందారీ పోకడలకు ప్రతీకగా ప్రత్యేక గుర్తింపు పొందిన చౌదరి (సుజనాను బాబుతో సహా టీడీపీలోని ముఖ్యులు సైతం చౌదరి అనే సంభోదిస్తుంటారు) కోసం బాబు తమను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఫణంగా పెట్టేశారని ప శ్చిమలోని బీసీ, మైనార్టీ నాయకులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారని నిప్పులు చెరుగుతున్నారు. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని ఆక్రమించేసుకున్నాక చంద్రబాబు విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక ఆప్షన్‌గా ఎంచుకున్నారు. అక్కడి నేతలు సొంతంగా బలపడకుండా చూసుకోవడంలో జాగ్రత్త పడుతున్నట్లు ప్రతి ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలు నిర్ధారిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం అనంతరం ఒంటరిగా పోటీ చేసింది తక్కువే. 1998 లోక్‌సభ ఉప ఎన్నిక మొదలు 1999, 2004, 2009, 2014 జనరల్ ఎలక్షన్లలో వామపక్షాలు, బీజేపీ, మహాకూటమి, జనసేనలతో టీడీపీ కూటమి కట్టి తలపడింది. 2019లో నేరుగా పోటీ అన్నట్లు కలరింగ్ ఇచ్చినా, జనసేనతో లోపాయికారీ ఒప్పందం లేకపోలేదు. 2004, 2009, 2019 ఎన్నికల్లో తలపడిన టీడీపీ ఓటమి చెందింది. 1983లో మాత్రమే టీడీపీ నుంచి బి.ఎస్.జయరాజ్ పోటీచేసి సీపీఐ అభ్యర్థిపై గెలుపొందారు. కాగా సైద్ధాంతికంగా భిన్న ధృవాలైన సీపీఐ, బీజేపీలకు ప శ్చిమ సీటును కేటాయించడం బాబుకే సాధ్యమైంది. తరచూ ఇంఛార్జిల మార్పుతో ఏమార్పు పశ్చిమలో సంస్థాగతంగా పార్టీ బలపడక పోవడానికి, నిలకడగా ఏ ఒక్కరికీ నాయకత్వాన్ని అప్పగించక పోవడానికి.. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం బాబుకు లేకపోవడమే. కూటమి కట్టినప్పుడల్లా ప శ్చిమ సీటును ఇతరులకు కేటాయించడం బాబుకు పరిపాటి. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలతో పాటు పోటీ చేసి ఓడిన బీసీలు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా (దూదేకుల), మైనార్టీ వర్గానికి చెందిన జలీల్‌ఖాన్, ఆయన కూతురు షబనా ఖాతూన్, మొహమ్మద్ ఫతావుల్లా, ఎంఎస్ బేగ్ తదితర నాయకులు టీడీపీ నుంచి ఉన్నారు. వీరిలో ఎవరికి వారికి నియోజకవర్గ ఇంఛార్జి స్థాయి నీదే అనడం, ఆ తర్వాత కొంత కాలానికి పక్కన పెట్టేయడం చంద్రబాబుకు ఇక్కడ చెల్లుబాటయ్యింది. ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ను అడ్డుగా పెట్టి.. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)ను దాదాపు రెండన్నరేళ్లకు పైగా ప శ్చిమ నియోజకవర్గ ఇంఛార్జిగా కొనసాగిస్తూ అదే ప్రాంతానికి చెందిన బుద్ధా వెంకన్న, జలీల్‌ఖాన్, నాగుల్‌మీరా, ఫతావుల్లా తదితరులను పక్కన పెట్టుకుని వారి చేతనే కేశినేనికి వ్యతిరేకంగా వ్యవహరింపజేయడం బాబుకే చెల్లిందని నగర నేతల ఏకాభిప్రాయం. ముఖ్యంగా కార్పొరేషన్ ఎన్నికల ప్రచారమప్పుడు నగరమంతా నవ్వుకునేలా ముఖ్య నాయకులను వీధుల్లోకి చేర్చి తిట్ల దండకాలను కొనసాగించడం కొసమెరుపు. ఒకే ఎత్తుగడతో అందర్నీ చిత్తు చేయడమనేది బాబు నైజమని ఆ పార్టీలోని సీనియర్లు వల్లెవేసే మాట. పవన్ చేత పోతినను... జనసేన కోసం ఏళ్ల తరబడి పనిచేసిన, గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి 22,367 ఓట్లు పొందిన బీసీ వర్గానికి చెందిన పోతిన వెంకట మహే‹Ùను సుజనా చౌదరి సీటు కోసం తన రాజకీయ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ చేత చంద్రబాబు పొడిపించేశాడని స్థానికంగా వాడ వాడ కోడైకూస్తోంది. చివరి నిమిషం వరకు సీటు ఆశించి మోసపోయిన పోతిన, జనసేనను వీడి వైఎస్సాఆర్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. సుజనా చౌదరి కోటీశ్వరుడైనంత మాత్రాన బీసీలు డబ్బులకు అమ్ముడుపోతారని అనుకోవడం పొరపాటని పోతిన బాహాటంగానే ధ్వజమెత్తారు. ‘ధనికుడైనందున చౌదరిని బీజేపీ అభ్యర్థిగా తాము అంగీకరిస్తామని మా అధినేత అనుకుని ఉండొచ్చు. నోట్లతో ఓటర్లను, భారీ బేరసారాలతో మమ్మల్ని లొంగదీసుకోవచ్చనే అంచనాకు వచ్చి ఉండొచ్చు. సమకాలీన రాజకీయాల్లోని లోతుపాతులు మాకూ తెలిసొచ్చా యి. పెత్తందారు పచ్చనోట్లకు పేదలు, మాబోటి నాయకులందరూ లొంగి పోతారనుకోవడం పొరపాటని ‘పెద్దలు’ గ్రహించేలా గుణపాఠం నేర్పుతాం’ అని టీడీపీ, జనసేనల్లోని బీసీ, మైనార్టీల నేతలు చెబుతున్నారు. ‘వాళ్లు చేయాల్సింది చేశారు.. మేం చేయగలిగింది చేసి చూపిస్తాం’ అని వేర్వేరుగా ‘సాక్షి’తో వారు మనసులో మాట వెలిబుచ్చారు. సుజనా మాటకు నాని అడ్డుచెప్పరనే.. బీజేపీలోకి సుజనాను పంపింది, ఇప్పుడు ఆ పార్టీ తరఫున ప శ్చిమ సీటును కేటాయించిందీ బాబు అనేది జనమెరిగిన సత్యం. పొత్తు కుదరక ముందు వరకు.. సుజనా చౌదరి విజయవాడ లోక్‌సభ అభ్యర్థి అని పచ్చమీడియా, సోషల్ మీడియా ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. సుజనా, కేశినేనిల మధ్య సాన్నిహిత్యం మెండుగా ఉన్నందున, చౌదరి మాటను నాని జవదాటరనేది బాబు నమ్మకం. బహుశా ఆ దృష్ట్యానే కేశినేనిని పశ్చిమ ఇంఛార్జిగా కొనసాగిస్తూ బీసీలు, మైనార్టీలను దూరంచేసే ప్రణాళికను బాబు అమలు పరిచారు. కాకపోతే ఊహించని రీతిలో బాబు ఎత్తులను చిత్తు చేస్తూ నాని టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఆ మాటలు గుర్తున్నాయా చంద్రబాబూ.. మంత్రి వేణు ఫైర్
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు బీసీల ద్రోహి అంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. ‘‘నాయి బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానన్నాడు. సమస్యలు వినమని మత్స్యకారులు చెబితే తోలు తీస్తానన్నాడు. తన అన్న మాటలను మరిచిపోయి ప్రజలు దగ్గరికి వచ్చి సూక్తులు చెబుతున్నాడంటూ మంత్రి వేణు ధ్వజమెత్తారు. ‘‘తన కొడుకుని ఎలా ముఖ్యమంత్రి చేయాలి. ఇతర పార్టీలతో ఎలా బేరసారాలు ఎలా చేయాలనే ఆలోచన తప్ప వేరొకటి లేదు. చంద్రబాబు మాట్లాడేవన్నీ అబద్ధాలే.. స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గడానికి చంద్రబాబు కారణం కాదా?. తగ్గిన రిజర్వేషన్ల నెపాన్ని అధికార పార్టీపై నెట్టి లాభం పొందాలని అనుకోలేదా.? 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని కోర్టుకు వెళ్లి అడ్డుకున్నది ఎవరు..?’’ అంటూ మంత్రి ప్రశ్నించారు. ‘‘బీసీలకు పెన్షన్ పెంపు అని చెబుతున్నావు.. ఇదో పెద్ద అబద్ధం.. జన్మభూమి కమిటీలతో నువ్వు చేసిన వికృత క్రీడలు జనం మర్చిపోలేదు. ఐదేళ్ల నీ పరిపాలన కాలంలో పెన్షన్ పెంపు గురించి ఆలోచించావా.. సీఎం జగన్ పింఛన్లు పెంచితే దానిపై అక్కసు చూపిస్తావా.. మీ పార్టీ ఏనాడైన బీసీలకు రాజ్యసభ స్థానాలు కేటాయించావా?. ఇవాళ సీఎం జగన్ నలుగురు బీసీలకు రాజ్యసభ స్థానాలు ఇచ్చారు. సోషల్ ఇంజనీరింగ్ చేస్తానన్న పవన్ కళ్యాణ్ కూడా ఒక సీటు శెట్టిబలిజలకు కేటాయించలేకపోయాడు. రెండు సామాజిక వర్గాలను విడదీసి నీ పబ్బం గడుపుకుంటున్నావ్. కులాల మధ్య గొడవలు సృష్టించడం ద్వారా అధికారంలోకి రావాలనుకోవడం నీ ఆలోచన. ఫీజు రీయింబర్స్మెంట్ సగానికి సగం తగ్గించి బీసీలను ఉన్నత విద్యకు దూరం చేయాలనుకున్నావు’’ అంటూ మంత్రి వేణు దుయ్యబట్టారు. -
బీసీలకు కూటమి వెన్నుపోటు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘బీసీలు మా పార్టీకి బ్యాక్ బోన్’ అంటూ వెనుకబడిన తరగతుల వారికి దశాబ్దాలుగా చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తూనే ఉన్నారు. బీసీలకు వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇందుకు విజయనగరం లోక్‌సభ నియోజకవర్గమే ప్రత్యక్ష నిదర్శనం. తమకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో కొప్పుల వెలమలు కూటమిపై కత్తులు నూరుతున్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని ప్రెస్మీట్లు పెట్టిమరీ హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో బీసీ సామాజిక వర్గాలదే అగ్రభాగం. వాటిలో తూర్పుకాపు, కొప్పుల వెలమ సామాజికవర్గాలు అత్యంత ప్రధానమైనవి. కానీ చంద్రబాబు అత్యంత స్పల్ప సంఖ్యలో ఉన్న పెత్తందారులకే పెత్తనం ఇస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలు నాలుగూ రిజర్వ్డ్ నియోజకవర్గాలే అయినప్పటికీ అక్కడ బీసీ సామాజిక వర్గాలు నిర్ణాయక శక్తిగా ఉన్నాయి. విజయనగరం జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ రాజాం అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగతా ఆరు ఎచ్చెర్ల, చీపురుపల్లి, బొబ్బిలి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీ సామాజిక వర్గాలే అధిక శాతం ఉన్నారు. తూర్పుకాపులు రాజాం, ఎచ్చెర్ల, చీపురుపల్లి, నెల్లిమర్లలో, కొప్పుల వెలమలు బొబ్బిలి, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికంగా ఉన్నారు. తమ పార్టీకి బీసీలే వెన్నెముక అంటూ వారిని అవసరానికి ఉపయోగించుకోవడం.. ఎన్నికలు వచ్చేసరికి పెత్తందారులకే పెద్దపీట వేయడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య. ‘కాపు’లకు ‘కమ్మ’ని దెబ్బ... టీడీపీ సీనియర్ నాయకుడు కిమిడి కళావెంకటరావు ఈ సారి కూడా ఎచ్చెర్ల నుంచే సీటు ఆశించారు. స్థానిక టీడీపీ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు కూడా టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. వారిద్దరూ తూర్పు కాపు సామాజికవర్గానికి చెందినవారే. కానీ చాపకింద నీరులా కమ్మ సామాజికవర్గానికి చెందిన నడికుదుటి ఈశ్వరరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చలువతో ఎచ్చెర్ల సీటు ఎగురేసుకుపోయారు. ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం వారు పట్టుమని వెయ్యి మంది లేకపోవడం విశేషం. కిమిడి కళావెంకటరావును చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి పంపించారు. అక్కడ పదేళ్లుగా టీడీపీ కోసం పనిచేస్తున్న ఆయన సొంత సోదరుడి కుమారుడు కిమిడి నాగార్జున రాజకీయ భవిష్యత్తును నాశనం చేయించారు. సామాజిక న్యాయం హుష్‌కాకి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీచేస్తున్న విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం కనిపించలేదు. కొప్పుల వెలమ సామాజికవర్గం అత్యధికంగా ఉన్న బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ టికెట్‌ను పట్టుమని వెయ్యి మంది జనాభా కూడా లేని వెలమ (ఓసీ) సామాజికవర్గానికి చెందిన బేబీనాయనకు చంద్రబాబు ఇచ్చారు. గజపతినగరం టికెట్ కొప్పుల వెలమకు చెందిన మాజీ ఎమ్మెల్యే తెంటు లకు‡్ష్మనాయుడుకి ఇస్తామని అక్కడా మొండిచేయిచూపారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో తూర్పుకాపు నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీతను అక్కడి నుంచి తప్పించేందుకు చీపురుపల్లి టికెట్ ఇస్తామని ఒకసారి, గజపతినగరం సీటు కేటాయిస్తామని మరోసారి చెబుతూ ఆశలపల్లకిలో ఊరేగించారు. తీరా టికెట్ల కేటాయింపు వచ్చేసరికి ఆమెకు ఝలక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీచేయబోనని అశోక్ గజపతిరాజు చేతులెత్తేసిన నేపథ్యంతో తనకు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో టికెట్ వస్తుందని మీసాల గీత ఆశించారు. అయితే గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన అశోక్ కుమార్తె ఆదితికే చంద్రబాబు మళ్లీ టికెట్ ఇచ్చారు. నెల్లిమర్లలో జనసేనతో పొత్తు ధర్మం పేరుతో బ్రాహ్మణ (ఓసీ) సామాజిక వర్గానికి చెందిన లోకం మాధవికి టికెట్ ఇచ్చి అక్కడ తూర్పుకాపులను దెబ్బకొట్టారు. -
కూటమికి 'గోదారి'లో ఎదురీతే!
అధికారమే లక్ష్యంగా జెండాలు జతకట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల కేటాయింపుతో బొక్కబోర్లా పడ్డాయి. రాష్ట్రంలో ప్రధానంగా గోదావరి జిల్లాలపై గంపెడాశలు పెట్టుకున్న ఆ కూటమికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. పొత్తులు, సీట్ల సిగపట్లతో బలహీనపడి అసలు ఉనికికే ముప్పు తెచ్చుకున్నాయి. ఈ జిల్లాల్లో కాపు, శెట్టిబలిజ సామాజిక వర్గాలే రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ సామాజిక వర్గాలు కూటమి వెంట ఉంటాయని లెక్కలేసుకుని జనసేన, టీడీపీలు తమదే గెలుపంటూ బీరాలు పలికాయి. అదే సమయంలో సీట్ల పంపకాల్లో ఆ పార్టీలు తమకు ప్రాధాన్యమిస్తాయని ఆయా సామాజిక వర్గాలు కూడా ఆశలు పెట్టుకున్నాయి. తీరా టికెట్ల కేటాయింపులో అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీలు సరైన ప్రాధాన్యం కల్పించకపోవడంతో వాటి నుంచి కూటమికి ఎదురు దెబ్బ తప్పదన్న సంకేతాలు అందుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, కాకినాడ శెట్టిబలిజలను విస్మరించిన జనసేన జనసేన బలం, బలహీనత గోదావరి జిల్లాలే అన్న ధీమా అన్నివర్గాల్లో ఉండేది. తీరా సీట్ల కేటాయింపులో ప్రధానమైన శెట్టిబలిజ సామాజికవర్గాన్ని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పూర్తిగా పక్కన పెట్టేసింది. ఉమ్మడి తూర్పులో ఒక్కటంటే ఒక్కటికూడా వారికి కేటాయించలేదు. ఈ జిల్లాలో జనసేన ఆరు అసెంబ్లీ, కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తుండగా పి.గన్నవరం, రాజోలు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు పోను నిడదవోలు, రాజానగరం, కాకినాడ రూరల్, పిఠాపురం టికెట్లను సొంత సామాజిక వర్గానికే పవన్‌కళ్యాణ్ ఇచ్చుకున్నారు. శెట్టిబలిజలను విస్మరించారు. పార్టీ ఆవిర్భావం నుంచీ ముమ్మిడివరంలో సొంత సొమ్ము తగలేసుకుని అహోరాత్రులు శ్రమిస్తున్న ఆ సామాజికవర్గానికి చెందిన పితాని బాలకృష్ణకు సీటు ఇస్తామని నమ్మించి మోసం చేశారు. బీసీల తోక కత్తిరిస్తానంటూ చిన్నచూపు చూసే చంద్రబాబుతో జతకట్టి శెట్టిబలిజలకు సీటు లేకుండా మోసం చేశారని ఆ సామాజికవర్గం పవన్‌పై నిప్పులు చెరుగుతోంది. ఈ అవమానాన్ని భరించలేకే బాలకృష్ణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌పై నమ్మకంతో శనివారం ఆ పార్టీలో చేరారు. సీట్ల కేటాయింపులో వివక్షను తట్టుకోలేక కాకినాడ మాజీ మేయర్ సరోజ సైతం జనసేనను వీడారు. టీడీపీకి తప్పని తిప్పలు కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న చంద్రబాబు మూడు పార్టీల కూటమితో బాగా బలపడ్డామని సంబరపడ్డారు. కానీ ఆయన అంచనాలు తూర్పులో తలకిందులయ్యాయి. ఓటమి సంకేతాలు అందిస్తున్నాయి. పొత్తులో సీట్లు కోల్పోయిన నిడదవోలు, రాజోలు, పి.గన్నవరం, పిఠాపురం, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య అంతర్గత పోరు, అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. వీటితో పాటు తుని, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, అమలాపురం, కొవ్వూరు, గోపాలపురం స్థానాల్లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. పనిలో పనిగా పలువురు నేతలు టీడీపీకి దూరమవుతున్నారు. ఈ పరిణామాలను చక్కదిద్దలేక చంద్రబాబు తలపట్టుకుంటున్నారు. ఆ రెండు వర్గాలకు బీజేపీ మొండిచేయి ఈ జిల్లాలో సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్న కాపు, శెట్టిబలిజలను బీజేపీ పూర్తిగా విస్మరించిందని ఆ సామాజికవర్గాలు నిప్పులు చెరుగుతున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకి దక్కిన రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గం, అనపర్తి అసెంబ్లీ స్థానాలను సామాజికంగా బలం లేని వర్గాలకు కేటాయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన సీనియర్ నాయకుడు, కాపు సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజు రాజమహేంద్రవరం పార్లమెంటరీ స్థానం గానీ రాజమహేంద్రవరం సిటీ, రూరల్ అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటైనా ఇవ్వాలని కోరారు. కానీ ఆయనకు కాదని స్థానికేతరురాలైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం కేటాయించారు. అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని కూడా సామాజికంగా బలం లేని శివరామకృష్ణంరాజుకు కేటాయించడాన్ని వారు తప్పుపడుతున్నారు. దాంతో వారు కూటమికి దూరమవుతున్నారు. వైఎస్సార్సీపీలో బీసీలకే పెద్దపీట వైఎస్సార్సీపీ మొదటినుంచీ బీసీలపై ఆదరణ చూపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానాన్ని శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి డాక్టర్ గూడూరి శ్రీనివాస్‌కు, రాజమహేంద్రవరం రూరల్‌ను రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు, రామచంద్రపురాన్ని పిల్లి సూర్యప్రకాశ్‌కు కేటాయించింది. వీటితో పాటు బీసీల్లో గౌడ సామాజికవర్గం నుంచి ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ను రాజమహేంద్రవరం సిటీ నుంచి బరిలోకి దింపింది. జనసేనలో తమకు జరిగిన అవమానాన్ని భరించలేక ఈ జిల్లాల్లోని శెట్టిబలిజలతో పాటు చేనేత, మత్స్యకార వర్గాలు రాజకీయంగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి కూడా వైఎస్సార్సీపీ సముచిత ప్రాధాన్యమే కల్పించింది. ఉమ్మడి జిల్లాలోని 21 అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిదింటితో పాటు సంప్రదాయంగా ఇస్తున్న కాకినాడ లోక్‌సభ స్థానాన్ని కూడా ఆ వర్గానికే కేటాయించింది. దీంతో ఆ సామాజికవర్గం వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తోంది. -
బీసీలకు బాబు పోటు
సాక్షి, అమరావతి: బలహీన వర్గాలపై మొసలి కన్నీళ్లు కురిపించే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి బీసీలకు వెన్నుపోటు పొడిచారు. పొత్తులో టీడీపీ పోటీ చేసే 144 అసెంబ్లీ స్థానాలకుగానూ కేవలం 34 సీట్లను మాత్రమే బీసీలకు కేటాయించారు. తన సొంత సామాజిక వర్గానికి మాత్రం ఏకంగా 32 సీట్లు ఇచ్చారు. బీసీలతో సమానంగా కమ్మ సామాజిక వర్గం నేతలు దాదాపు అన్ని జిల్లాల్లో సీట్లు దక్కించుకోవడం గమనార్హం. ఇక మైనారిటీలకు నామమాత్రంగా మూడు సీట్లతో సరిపెట్టారు. న్యాయంగా వారికి దక్కాల్సిన సీట్లను కూడా పొత్తులో వదిలేయడంతో టీడీపీలోని ముస్లిం నేతలు ఆందోళన చెందుతున్నారు. కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేసిన చంద్రబాబు కేవలం 9 సీట్లు మాత్రమే వారికి కేటాయించారు. ఆ సామాజిక వర్గం ఓట్ల కోసం పవన్ కళ్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నా సీట్లు మాత్రం ఇవ్వలేదు. ఎంపీ సీట్లలోనూ అదే తీరు.. ఎంపీ సీట్లలోనూ చంద్రబాబు సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు. బీసీలకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆరు ఎంపీ సీట్లు ఇవ్వగా తన సొంత సామాజిక వర్గానికీ ఆరు సీట్లు ఇచ్చారు. పొత్తులతో దక్కిన 17 ఎంపీ స్థానాల్లో కాపులకు చంద్రబాబు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. దీన్నిబట్టి చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని స్పష్టమవుతోంది. తన ప్రసంగాల్లో పేదల గురించి, సామాజిక న్యాయం గురించి డప్పు కొట్టే చంద్రబాబు రాజకీయంగా మాత్రం వారిని అణగదొక్కుతూనే ఉన్నట్లు మరోసారి తేలిపోయింది. -
బీసీలకు చంద్రబాబు ఊచకోత
సాక్షి, విజయవాడ: సామాజిక న్యాయాన్ని కేవలం మాటల్లోనే కాక చేతల్లోనూ సీఎం జగన్ చేసి చూపించగా, చంద్రబాబు మాత్రం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తూ వారికి వెన్నుపోటు పొడించారు. లోక్‌సభ సీట్లలో బీసీలకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. టీడీపీ కూటమిలో 25లో కేవలం 6 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారు. వైఎస్సార్సీపీ 20 ఆన్ రిజర్వ్ సీట్లలో 11 బీసీలకు కేటాయించగా, టీడీపీ 20 ఆన్ రిజర్వ్ సీట్లలో కేవలం 6 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించింది. బీసీ జనాభా అధికంగా ఉన్న సీట్లలో చంద్రబాబు సొంత వర్గానికి సీట్ల కేటాయించారు. తాజాగా 4 లోక్‌సభ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించగా, టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం జాబితాలో బీసీలకు తీరని ద్రోహం చేసిన చంద్రబాబు.. కాపులకు 17 లోక్ సభ సీట్లలో ఒక్క సీటు కూడా కేటాయించలేదు. కాగా, సీఎం జగన్ 50 శాతం సీట్లు బడుగు బలహీన వర్గాలకు కేటాయించారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు కలిపి 200 మొత్తం సీట్లకు 100 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చి తాను విశ్వసనీయతకు మారుపేరని మరోమారు చాటుకున్నారు. జనబలమే గీటురాయిగా అభ్యర్థులను ఎంపిక చేశారు. సామాజిక సమతూకం పాటించారు. బీసీలకు, మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెనుకబడిన వర్గాల వారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే తాను మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన మాటను సీఎం జగన్ నిబబెట్టుకున్నారు. మొత్తం 175 శాసనసభా స్థానాల్లో 48 మంది బీసీలకు అవకాశం కల్పించారు. మొత్తం 25 లోక్‌సభ సీట్లలో బీసీలకు 11 సీట్లు ఇచ్చారు. భవిష్యత్తులోనూ తాను బడుగు, బలహీనవర్గాల వెన్నంటే ఉంటానని, వారే నా బలం.. నా బలగం అని చాటిచెప్పారు. -
సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్.. బాబుపై రగిలిపోతున్న బీసీ నేతలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఒకప్పుడు.. సామాజిక న్యాయం అంటే చంద్రబాబు దృష్టిలో ఎన్నికలప్పుడు వాడుకోవడం.. అధికారంలోకి వచ్చాక వదిలేయడంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఎన్నికల సమయంలోనూ ఆ అంశాన్ని ప్రతిపక్ష నేత పూర్తిగా విస్మరించినట్లున్నారు!. తాజాగా.. టీడీపీ ప్రకటించిన మూడు జాబితాలను చూసి బీసీ సంఘాలు చంద్రబాబుపై రగిలిపోతున్నాయి. ఈ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేవలం 4 ఎంపీ, 31 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. అదే అధికార వైఎస్సార్సీపీ గత ఎన్నికలకు మించి బీసీలకు ప్రాధాన్యమిచ్చింది. అసెంబ్లీ, లోక్‌సభ కలిపి 59 స్థానాలను ఆ వర్గాలకు(ఏకంగా 11 లోక్ సభ.. 48 అసెంబ్లీ) కేటాయించారు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్మోహన్రెడ్డి. దీంతో.. ప్రతిపక్ష నేత తీరుపై బీసీ నేతలు రగిలిపోతున్నారు. బీసీ డిక్లరేషన్ అంటూ బిల్డప్‌లు ఇచ్చి.. తక్కువ సీట్లు ఇచ్చి బీసీల గొంతు కోశారని మండిపడుతున్నారు. జనరంజకమైన జాబితా అంటూ చంద్రబాబు గప్పాలు కొట్టుకుంటున్నప్పటికీ.. సీట్ల కేటాయింపులో డబ్బుకి ప్రాధాన్యం, కుల పక్షపాతం లాంటివి కనిపిస్తున్నాయని అంటున్నారు వాళ్లు. ఆఖరికి బీసీలు అధికంగా విశాఖ, నరసరావుపేట, గుంటూరు సీట్లను కూడా తన సామాజిక వర్గానికి ఇచ్చుకొవడాన్ని బీసీ నేతలు సహించలేకపోతున్నారు. ఇప్పటికే మంగళగిరి విషయంలో బీసీలకు కాకుండా.. మళ్లీ తన తనయుడు నారా లోకేష్‌కే టికెట్ ఇవ్వడంపై బీసీలు అసంతృప్తితో రగిలిపోతున్న సంగత తెలిసిందే. చంద్రబాబుకి నిరసనగా.. బీసీ సంఘాల నేతలు పలువురు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయిప్పుడు. ఎన్నికల్లో అతి తక్కువ సీట్లు ఇచ్చిన చంద్రబాబును తిడుతూనే.. సామాజిక న్యాయం పేరిట బీసీలకు పెద్ద పీట వేసిన సీఎం జగన్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇదీ చదవండి: YSRCP.. జయహో బీసీ ‘‘మీ ధైర్యాన్ని ఎప్పుడూ కూడా నేను మెచ్చుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ గురించి మేము ఎప్పుడైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. పార్టీ గురించి తప్ప మీ మీద ఎప్పుడూ నాకు వ్యక్తిగతంగా ద్వేషాలు లేవు’’.. చంద్రబాబు చేతిలో మోసపోయిన ఏలూరు టీడీపీ పార్లమెంటరీ ఇంఛార్జి గోపాల్ యాదవ్ సీఎం జగన్‌ను మెచ్చుకుంటూ విడుదల చేసిన వీడియో సారాంశం ఇది. ఏలూరులో పార్టీ కోసం పని చేసిన వాళ్ళను పక్కన పెట్టి చంద్రబాబు పుట్ట మహేష్ యాదవ్ కి ఇవ్వడంపై గోపాల్ యాదవ్ ఈ సందర్భంగా మండిపడ్డారు. -
టక్కుటమారి.. టముకుతో సరి
నరసరావుపేట ఎంపీ, కనిగిరి, కందుకూరు అసెంబ్లీ స్థానాల కేటాయింపుసాక్షిప్రతినిధి, ఒంగోలు: జయహో బీసీ... అంటూ వారిని ఉద్దరిస్తామని టీడీపీ–జనసేన సంయుక్తంగా ప్రకటించి నేడు విస్మరించాయి. బీసీలను అందులో ప్రధానంగా యాదవ సామాజికవర్గానికి ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్క సీటు కూడా కేటాయించకుండా చంద్రబాబు వారి వెన్ను విరిచారు. కానీ బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి భరోసా కల్పించారు. ఈ మూడు జిల్లాల్లో 50 శాతానికి పైగా బీసీ ఓట్లు ఉన్నాయి. ఒక్కో జిల్లాలో 2.50 లక్షల నుంచి 3.50 లక్షల వరకు యాదవ ఓటర్లు ఉన్నారు. అయితే ఆ జిల్లాల్లో పార్లమెంట్ కానీ, అసెంబ్లీకి కానీ టికెట్లు కేటాయించకపోవటంతో టీడీపీపై యాదవులు రగిలిపోతున్నారు. కానీ యాదవులకు వైఎస్సార్సీపీ సముచిత స్థానం కల్పించింది. ఆ జిల్లాల్లో వారికి పెద్దపీట వేసింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన యాదవ నేత బీదా మస్తాన్‌రావును రాజ్యసభకు పంపింది. నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనీల్‌కుమార్ యాదవ్‌ను ఎంపిక చేసింది. ప్రకాశం జిల్లా కనిగిరి అసెంబ్లీకి సాధారణ జెడ్పీటీసీ సభ్యుడిని ప్రకటించి సంచలనం సృష్టించింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌ను కందుకూరు అసెంబ్లీకి పోటీలో నిలబెట్టింది. మరోవైపు గురజాల నియోజకవర్గానికి చెందిన యాదవ నేత జంగా కృష్ణమూర్తికి టీడీపీలో చాన్సే లేకుండా పోయింది. ఆయన గురజాల టికెట్ కావాలని వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారు. వైఎస్సార్సీపీలో ఆయనకు సీఎం జగన్ ఎంతో ప్రాధాన్యత కల్పించారు. పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆ తరువాత ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయితే గురజాల అసెంబ్లీ సీటు ఇస్తానని జంగాకు టీడీపీ నమ్మబలికి మొండిచేయి చూపింది. చీరాలలో టీడీపీ నేత, నియోజకవర్గ ఇన్చార్జ్ మద్దులూరి మాలకొండయ్యను దాదాపు ఆ పార్టీ పక్కన పెట్టేసింది. టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీకి బాబు మొండిచేయి చూపారు. యాదవుల్లో సమర్థులు లేరా? ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలో టీడీపీలో యాదవ సామాజికవర్గానికి చెందిన సమర్థులు లేరా? ఒకప్పటిలా టీడీపీ పరిస్థితి లేదు. వైఎస్సార్సీపీలో ఒక పార్లమెంట్, రెండు అసెంబ్లీ సీట్లిచ్చి సీఎం జగన్ యాదవులను ఎంతగానో గౌరవించారు. మాకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలనే ఆదరిస్తాం. – మిరియం శ్రీనివాసులు, 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు -
బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు.. భారీగా సీట్ల తగ్గింపు
సాక్షి, గుంటూరు: టీడీపీకి బీసీలే వెన్నెముక అంటూ తరచూ వల్లె వేసే చంద్రబాబు.. సీట్ల కేటాయింపులో మాత్రం బీసీలకు వెన్నుపోటు పొడిశారు. బీసీలకు భారీగా సీట్ల తగ్గించారు. రెండు లిస్టులలో కలిపి ఇప్పటికి బీసీలకు కేటాయించింది కేవలం 24 సీట్లే.. గత ఎన్నికల్లో 43 ఇచ్చి ఇప్పుడు సగానికి సగం తగ్గించేశారు. తన సొంత సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కమ్మలకు ఏకంగా 28 సీట్లను కేటాయించుకున్న చంద్రబాబు.. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్న చంద్రబాబు.. కాపులకు 8, మైనారిటీలు 3 సీట్లకే పరిమితం చేశారు. చంద్రబాబు వ్యవహారశైలిపై కమ్మేతర వర్గాలు ఫైర్ అవుతున్నారు. అవసరానికి వాడుకోవడం.. అవసరం తీరాక వదలించుకోవడం టీడీపీ అధినేత చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య. ‘బీసీలు టీడీపీకి బ్యాక్ బోన్’ అంటూ ఉత్తుత్తి మాటలతో దశాబ్దాలుగా అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా ఒక్కరంటే ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకుండా బలహీన వర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. అగ్రవర్ణాలు.. అందులోనూ తన సామాజిక వర్గం వారినే అధికంగా రాజ్యసభకు పంపారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిని దారుణంగా కించపరిచి తన పెత్తందారీ పోకడలను చాటుకున్నారు. న్యాయం చేయాలని విన్నవించుకున్న నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ హూంకరించారు. హామీని నెరవేర్చాలని కోరిన పాపానికి తాట తీస్తానంటూ మత్స్యకారులను బెదిరించారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని వ్యాఖ్యానించి దళితులను దారుణంగా అవమానించారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ బాబు అవహేళన చేసిన వైనాన్ని ఆయా వర్గాలకు చెందిన వారు గుర్తు చేసుకుంటున్నారు. -
బాబు జిమ్మిక్కులు నమ్మం
సాక్షి, అమరావతి: ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటక బోడి మల్లన్న అన్నట్లుగా.. ఎన్నికల్లో అవకాశవాదంతో వ్యవహరించే చంద్రబాబును నమ్మేదిలేదని బీసీలు కుండబద్దలు కొడుతున్నారు. ఎన్నికలు వచ్చి న ప్రతిసారి బీసీలే టీడీపీకి వెన్నెముక అని వారిని మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తమను కరివేపాకులా తీసిపారేస్తున్నాడని మండిపడుతున్నారు. 2014 ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే తమను మోసగించిన తీరును బీసీ నేతలు గుర్తుచేస్తున్నారు. అలాగే, 2019 ఎన్నికల ముందు కూడా బీసీలకు 119 హామీలను ఇచ్చి న చంద్రబాబు ఐదేళ్లలో ఒక్క హామీనీ సరిగ్గా అమలుచేయలేదన్నారు. ఇక 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరిన బీసీలను ‘ఏం తమాషాలు చేస్తున్నారా.. పిచ్చాటలు ఆడారంటే మీ తోకలు కత్తిరిస్తా.. మీ తాట తీస్తా’.. అంటూ వేలు చూపించి బెదిరించడంతోపాటు మత్స్యకారులపై కేసులు పెట్టిన చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోయేదిలేదని బీసీ నేతలు స్పష్టంచేస్తున్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు ఇస్తానని ప్రకటించిన చంద్రబాబు కనీసం సగం సీట్లు కూడా ఇవ్వకుండా దగా చేసిన తీరును వారు మరిచిపోలేదు. ఏడాదికి రూ.10వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.50వేల కోట్లు బీసీ సబ్‌ప్లాన్‌కు కేటాయిస్తానని అప్పట్లో హామీ ఇచ్చి న చంద్రబాబు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. నిధుల కేటాయింపులో దగా చేయడమే కాకుండా పదవుల కేటాయింపులోను చంద్రబాబు బీసీలను తీవ్రమోసం చేశాడని వాపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వెనుకబడిన తరగతులను మరోమారు బురిడీ కొట్టించేందుకు ఆయన చేస్తున్న జిమ్మిక్కులను నమ్మేదిలేదని తెగేసి చెబుతున్నారు. జగన్‌ను చూసి బాబు నేర్చుకోవాలి రాజకీయాల్లో 42 ఏళ్ల అనుభవం, 14 ఏళ్లపాటు సీఎంగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబు యువకుడైన సీఎం జగన్‌ను చూసి చాలా నేర్చుకోవాలి. అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడికి ప్రజలను ఆదుకుని అండగా నిలవాలనే మనస్సు ఉండాలి. అటువంటి మంచి మనస్సు జగన్‌కు ఉంది. చంద్రబాబుకు పేదల గురించి ఆలోచించే మనస్సు ఏ కోశానా లేదు. చంద్రబాబు సంక్షేమ పథకాలకు తన సొంత సొమ్ము ఇచ్చి నట్లు ఫీలవుతాడు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలకు మేలు చేస్తానని చెప్పడం హాస్యాస్పదం. 2014లో చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఎంతమేరకు అమలు చేశారో? గమనిస్తే చాలు ఆయన చిత్తశుద్ధి తెలిసిపోతుంది. తాజాగా టీడీపీ ప్రకటించిన డిక్లరేషన్‌లో ఎట్రాసిటీ యాక్ట్ తప్ప మిగతావన్నీ ప్రస్తుతం సీఎం జగన్ అమలుచేస్తున్నవే. సామాజిక న్యాయం అమలులో సీఎం జగన్‌కు ఎవరూ సాటిరారు. – డాక్టర్ ఎన్వీ రావు, జాతీయ అధ్యక్షుడు, బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ నయవంచకులు బాబు.. పవన్‌లను నమ్మం చంద్రబాబు, పవన్‌లు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ నేతి బీర చందంగా ఉంది. గత డిక్లరేషన్‌నే అటకెక్కించిన నయవంచక బాబు, పవన్ఇప్పుడు మళ్లీ డిక్లరేషన్ అంటే బీసీలు నమ్మరు. వారి పట్ల బాబు, పవన్‌లకు చిత్తశుద్ధిలేదని తాజాగా ప్రకటించిన ఎమ్మెల్యే టికెట్లు తేటతెల్లం చేస్తున్నాయి. అంబేడ్కర్, జ్యోతిరావు ఫూలే ఆశయాలు, ఆలోచనలను అమలుచేస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్. గతంలో బీసీ డిక్లరేషన్‌లో చెప్పింది చెప్పినట్లుగా అమలుచేసి చూపించిన సీఎం జగన్ రాష్ట్రంలోని బీసీలను వెన్నెముక వర్గాలుగా తీర్చిదిద్దారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 33% రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు వేయించి బాబు ద్రోహం చేస్తే.. అంతకంటే ఎక్కువ పదవులు దక్కేలా చేసిన సీఎం జగన్ బీసీల పక్షపాతిగా మన్ననలు అందుకున్నారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుచేశారు. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేసి వారి ఉన్నతికి సీఎం జగన్ చర్యలు చేపట్టారు. – చింతపల్లి గురుప్రసాద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీసీ కులాల జేఏసీ -
చంద్రబాబు బీసీ వ్యతిరేకి: మంత్రి ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: బీసీల వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తి చంద్రబాబు అంటూ ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వకుండా.. జయహో బీసీ ఎలా అవుతుంది బాబూ? అంటూ ప్రశ్నించిన ధర్మాన.. బాబు మాటలతో సామాజిక న్యాయం జరగదు.. సీఎం జగన్‌లా చేతల్లో చూపిస్తేనే సాధ్యమవుతుందన్నారు. శ్రీకాకుళం టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. ఏమన్నారంటే.. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది సామాజిక న్యాయం కాదు. ఆయన ఎన్నికల కోసం మాయ మాటలు చెప్పే వారే తప్ప, ఎన్నికల కోసం మభ్యపెట్టేటువంటి హామీలు ఓటర్లకు ఇస్తారే తప్ప స్వతహాగా బ్యాక్ వర్డ్ క్లాస్ వాళ్లు సామాజికంగా ఎదగాలన్న ఆలోచన అన్నది ఆయనకు లేదు. వారికి అవసరం అయిన రాజ్యాధికారం ఇవ్వాలన్న ఆలోచన ఏనాడూ ఆయన చేయలేదు. చేయరు కూడా, అటువంటి దాఖలాలు కూడా లేవు. ఆయనేమీ ఇప్పుడొచ్చినటువంటి నాయకుడేమీ కాదు కదా ఆయన ఆల్మోస్ట్ పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగానే ఉన్నారు. నలభై సంవత్సరాలు రాజకీయాలలో అనుభవం ఉన్నవారు. ఆయన భావజాలం మీరు చూస్తే ఏనాడూ అతడు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదు. దానికి ఒక్కటే ఒక్క ఉదాహరణ చెబుతాను. ఈ దేశంలో రాజ్యసభకు ఇప్పటిదాకా ఒక్కరిని కూడా బ్యాక్ వర్డ్ క్లాసెస్‌కు చెందిన వారిని చంద్రబాబు పంపించలేదంటేనే.. ఆయన రాజకీయ అధికారం బీసీలకు ఇస్తారంటే ఎవ్వరయినా నమ్ముతారా? అని ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ప్రజలెవ్వరయినా, బ్యాక్ వర్డ్ క్లాసెస్‌కు చెందిన వారెవ్వరయినా నమ్ముతారా?. ఆయన తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఆయన రాజ్యసభకు నలుగురు బ్యాక్ వర్డ్ క్లాసెస్‌కు చెందిన వారిని పంపించారు. ఐదు సంవత్సరాలలోనే ఐదుగురు బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు చెందిన వారిని పెద్దల సభకు పంపించారు. మీరు ఇన్ని సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నారు. ఏనాడయినా మీరు ఈ విధంగా రాజకీయ అధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదే ? అంటే ఏంటి ?. చంద్రబాబు భావజాలంలోనే బ్యాక్ వర్డ్ క్లాసెస్‌కు చెందిన వారికి రాజకీయ అధికారం ఇవ్వాలన్న కోణం లేదు మొదట్నుంచి. వీళ్లకు అధికారం ఇచ్చి వాళ్లను బలోపేతం చేసే పనులు మీరు ఏనాడూ చేయలేదు. నేను ఎనలైజ్ చేసిన విషయాలైతే ఇవి. అధికారాన్ని అలాంటి వారికి ఇవ్వకూడదన్న భావనలో ఉన్నారు మీరు. అందుకే ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఎవ్వరైనా అత్యున్నత న్యాయస్థానానికి బ్యాక్ వర్డ్ క్లాస్ వారు జడ్జీలుగా పనికి రారు అని ఉత్తరం రాస్తారా? అంటే కరడుగట్టినటువంటి బ్యాక్ వర్డ్ క్లాస్ వ్యతిరేక భావాలు మీలో నాటుకుని ఉన్నాయి కనుక, అలాంటి పొజిషన్లలోకి బ్యాక్ వర్డ్ క్లాసెస్ వారు రాకూడదు అనే భావజాలం కలిగి ఉన్నారు మీరు. మీ పార్టీ పక్కన బెట్టండి. అసలు మీరు వ్యక్తిగతంగా బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు వ్యతిరేకి మీరు(చంద్రబాబు). అది మేం చెప్పింది కాదు. మీరు రాసిన ఉత్తరం కాని, గడిచిన ఐదేళ్లలో మీరు రాజ్యసభకు సీట్లు ఇచ్చినటువంటి సందర్భం కానీ క్లియర్‌గా చెబుతోంది కదా. నిన్న జయహో బీసీ అని అన్నారు. రాజ్యాధికారం ఇవ్వకుండా జయహో బీసీ ఎలా అవుతుంది? సామాజిక న్యాయం రావాలంటే ఆర్థికమైనటువంటి వెసులుబాటు కల్పించే కార్యక్రమాలు చేయాలి. దానికంటే ముందు రాజ్యాధికారం ఇవ్వాలి. ఇస్తే ఆటోమెటిక్ గా సామాజిక న్యాయం సాధ్యం అవుతుంది. బ్యాక్ వర్డ్ క్లాసెస్‌కు సామాజిక న్యాయం కదా ఇవ్వాల్సింది. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ, తెలుగు దేశం పార్టీకీ ఒక డిబెట్ కనుక మీరు పెడితే,డిబెట్‌కు మీరు వస్తామన్నా, మీ తాలుకా వ్యక్తులు ఎవ్వరు వస్తామన్నా నాకేం అభ్యంతరం లేదు. నేను మాట్లాడేందుకు సిద్ధం. ఈ ఐదు సంవత్సరాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ బద్దంగా బీసీల ఎదుగుదలకు అటు రాజ్యాధికారం ఇచ్చి, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కలిగించి, సామాజిక న్యాయం అందించినటువంటి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని నేను రుజువు చేస్తాను. మీరు చేయలేదని కూడా రుజువు చేస్తాను. మీరెవ్వరయినా చర్చకు వస్తే, మాట్లాడేందుకు నేను సిద్ధం. మీరెవ్వరని అయినా చర్చకు పంపించినా,లేదా మీరొచ్చినా మాట్లాడేందుకు నేను సిద్ధం అని మనవి చేస్తున్నాను. ఇలాంటి విషయాలు మాట్లాడేందుకు ఒక వేదిక మీదకు రావాలని చెబుతున్నాను. ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో మాటలు చెప్పడం కాదు. చిత్తశుద్ధితో పనిచేయాలి. ఎన్నికలు వచ్చినప్పుడు జయహో బీసీ, ఎన్నికలు అయిపోయాక అసలు ఆ ఊసే ఉండదు మీ దగ్గర. ఇలాంటి జయహో బీసీ సభలు ఇంతకుముందు చాలా సార్లు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. ఎన్నిక అయిపోగానే సంబంధిత కాగితాలు చింపి అవతల పారేశారు. డిక్లరేషన్ల ఊసే లేదు. ఇవాళ మిమ్మల్ని నమ్మమంటే ఏ బీసీ నమ్ముతాడు. మా పార్టీలో లోక్‌సభలో ఆరుగురు పార్లమెంట్ సభ్యులు బీసీలు ఉన్నారు, నలుగురు రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. బీసీలకు చెందిన వారే వారంతా. చూస్కోండి. ఎప్పుడయినా మీరు ఆ విధంగా పార్లమెంట్‌కు సంబంధించి ఎగువ సభకు కానీ దిగువ సభకు కానీ ఆ విధంగా పంపగలిగారా ? అని ప్రశ్నిస్తున్నాను. చేయగలిగారా ?.11 మంది మంత్రులు రాష్ట్ర క్యాబినెట్ లో ఉన్నారు. సరే ఇతర కార్పొరేషన్లు అంటే యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, సంబంధిత వర్గాలకు లీడర్ షిప్ ఇచ్చారు. మీరు దానిని విమర్శిస్తారు. విమర్శించడం కాదు లీడర్ షిప్‌ను డెవలప్ చేయాలి. ప్రజా స్వామ్యంలో ప్రభుత్వాలు, బడ్జెటింగ్ వీటికి సంబంధించిన సమాచారం తదితర వివరాలు తెలుసుకునేటటువంటి లీడర్ షిప్‌ను డెవలప్ చేయాలి. మీరెప్పుడూ అది చేయలేదే ? ఎన్నికలు వస్తున్నాయి కనుక జయహో బీసీ అంటే అవుతుందా ? నిజంగా మీరెప్పుడయినా బీసీ సంక్షేమం కోసం పాటుపడ్డారా? పాల వ్యాపారం చేసుకునే వారుంటే వారికొక డొక్కు సైకిల్ ఇవ్వడం, ఇస్త్రీ పెట్టె ఇవ్వడం.. వాటిపై మీ బొమ్మలు వేసుకోవడం..ఇవా బీసీల సామాజిక స్థితిగతులు మారడానికి సహకరిస్తాయా ? ఇవి కాదు కదా ఇవి చేస్తూనే రాజ్యాధికారం ఇవ్వాలి. ఆర్థికంగా వారిందరికీ చేయూత ఇవ్వగలగాలి. కానీ ఆ రోజు ప్రొగ్రాంలు పెట్టడం వాటిలో కొన్నింటిని మాత్రం పంచి మిగిలినవి సొంత మనుషుల ఖాతాల్లోకి చేర్చేయడం వంటి పనులెన్నింటినో గత ప్రభుత్వ హయాంలో మీరు చేశారు.అలాంటివి మీరు ఈ ఐదేళ్లలో చూశారా ? డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు ఇచ్చిన డబ్బెంతో తెలుసా ? లక్షా 22 వేల కోట్ల రూపాయలు అందించాం. ఇంత మొత్తాన్ని బ్యాక్ వర్డ్ క్లాసెస్ అకౌంట్లలోకి చేరవేశాం. ఇందుకుగాను మీలా ఏ ఒక్కరు కూడా ఒక్క నయాపైసా లంచం అని,కమీషన్ అని,మధ్యవర్తి అని లేకుండా చేశాం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నాన్ డీబీటీ ఇంకా వేరుగా ఉంది. మీరు సబ్ ప్లాన్ అంటున్నారు. సబ్ ప్లాన్ అంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చి చూపించిన ప్రభుత్వం ఇది. బ్యాక్ వర్డ్ క్లాసెస్ గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదు. ఆ అర్హత మీకు లేదు. వెనుకబడిన వర్గాలను మోసగించినటువంటి ప్రభుత్వం మీది. ఇప్పటికీ మీరు అదే చెబుతారు సైకిళ్లు ఇస్తాం..డొక్కులు ఇస్తాం.. కత్తులు ఇస్తాం అని చెబుతారు. ఇవి కాదండి వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి. రాజకీయ స్వాతంత్ర్యం కావాలి. సమాజంలో వారి స్థితి పెరిగేందుకు ఏమయినా అవకాశం ఉంటే అందుకు తగ్గ పనులు చేయగలగాలి. నాయీ బ్రాహ్మణులను తీసుకోండి. వారి ఆర్థిక స్థోమత పెరిగేందుకు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా వారికి సహకారం అందించాం. వారికి ఒక క్షౌరశాల ఉంటే డైరెక్టుగా డబ్బులు పడే విధంగా ఏర్పాటు చేశాం. ఏడాదికి పదివేలు రూపాయలు అందించాం. వారి విద్యుత్ బిల్లులను కొంత తగ్గించి,ఊరట ఇచ్చాం. చేస్తున్న వృత్తికి సంబంధించి ఛార్జీలు పెంపు చేసేందుకు అనుమతి ఇచ్చాం. వృత్తిని ఎవ్వరైనా అగౌరవ పరిస్తే అట్రాసిటీ కేసులు నమోదు చేసేందుకు వీలుగా చట్టాన్ని సవరించాం. ఇవాళ ప్రతి దేవాలయంలో చివరికి తిరుపతిలో కూడా ఓ నాయీ బ్రాహ్మణుడు ట్రస్ట్ బోర్డులో మెంబర్ గా ఉండే అవకాశం ఇచ్చాం. ఇది కదా సామాజిక న్యాయం అందించడం అంటే.. అని మీకు విన్నవిస్తూ ఉన్నాను. మీరు మామాలుగా మాటలు చెబితే సామాజిక న్యాయం దక్కదు. అలానే తీసుకోండి ఏ కమ్యూనిటీ అయినా తీసుకోండి. శెట్టి బలిజలలో రాజ్యసభ మెంబర్ ఉన్నారు. యాదవులకు పెద్ద ఎత్తున పార్లమెంట్ సీట్లు. అసెంబ్లీలో ఎన్నడూ లేనివిధంగా బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు సీట్లు ఇచ్చింది. ఏనాడూ చంద్రబాబును ఈ పద్ధతుల్లో చూడలేదే ? ధనవంతులను ఎంపిక చేసే పనిలోనే చంద్రబాబు ఉన్నారే తప్ప నిజమయిన సంప్రదాయ రీతులలో ప్రజల తరఫున పోరాడుతున్న బ్యాక్ వర్డ్ క్లాసెస్ లీడర్లను ఎప్పుడూ ఆయన గుర్తించ లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు జయహో బీసీ అంటారు. ఎందుకు అంటారో తెలియదు. ? ఏ వర్గం ప్రయోజనం ఆశించి అంటారో కూడా తెలియదు ? ఏమిటి బీసీ ? ఏమిటి జయహో బీసీ ? మీరు చెప్పండి. రాజ్యాధికారం దక్కించడంలో విశాల భావం ఉండాలి. మీకు ఆ దృక్పథం లేదు. మీ మాటలను ఎవ్వరూ నమ్మే విధంగా ప్రజలు లేరు అని మనవి చేస్తున్నాను. ఎంత కాంట్రడక్షన్ ఉంది మీ మాటలలో.. జగన్ పాలకు సంబంధించి మొదటి ఏడాది మీరు ఏం చెప్పారు ? ఆ రోజు ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అమలు సాధ్యం కాదని చెప్పారు. అనుభవం ఉన్నవాడిగా చెబుతున్నాను ఇవన్నీ అసాధ్యం అని చెప్పారు. అమలు చేస్తున్న సందర్భంలో మళ్లీ మాట మార్చారు. ఇంకెన్నాళ్లు చేస్తారు మరో ఆరు మాసాలలో సంక్షేమ పథకాల అమలు ముగిసిపోతుంది మరి చేయలేడు అని చెప్పారు. అయినా మీరు చెప్పిన విధంగా ఆగిపోలేదు. జగన్ పాలనలో రెండున్నర, మూడు సంవత్సరాల తరువాత మళ్లీ మీరు చెప్పారు. ఇలా చేసుకుంటూ పోతున్నారు ఈ రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని.. వెనుజులా అవుతుందని... దివాలా తీసేస్తుంది రాష్ట్రం అని చెప్పారు. కానీ భారత ప్రభుత్వం ప్రకటించిన సూచీలు (ఇండికేటర్స్) మీరు చూస్తే జీడీపీ బ్రహ్మాండంగా మీ టీడీపీ ప్రభుత్వం కన్నా ఎక్కువ వృద్ధి మా ప్రభుత్వంలో నమోదు చేసింది అని కేంద్ర ప్రభుత్వ సూచీలు చెబుతున్నవి. అన్ని రంగాలలో మీ కంటే అనేక స్థాయిలలో వృద్ధి పెరిగి అనేక రాష్ట్రాలను నెట్టుకుని ముందుకు వచ్చింది. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. మరి మీరేమో ఈ రాష్ట్రం వెనుజులా అయిపోందని అన్నారు. శ్రీలంక అయిపోతుందని అన్నారు. నాలుగేళ్లు అయిపోయింది. అప్పుడు మళ్లీ మీరు మాట మార్చారు. రాజమండ్రిలో సభ పెట్టి నేను కూడా ఇంత కన్నా ఎక్కువ ఇస్తానని మాట మార్చారు. ఆ నాలుగు సంవత్సరాలలో నాలుగు దఫాలుగా మాట మార్చారు. ఇప్పుడు ఐదో సంవత్సరం చెప్పినటువంటి మాట మార్చరని ఏంటి గ్యారంటీ ? ఇప్పుడు జయహో బీసీ అంటూ చెబుతున్న మాటలు మార్చరని ఏంటి గ్యారంటీ ? మీరు సిగ్గుపడడం లేదా దీనికి. అనుభవం లేని వారా మీరు ? ఇప్పుడే మీరు పార్టీ పెట్టారా ? మీదేమయినా కొత్త పార్టీనా ? ఈ రాష్ట్రానికి ఏమి వనరులు సమకూరుతాయి అన్నది మీకు బాగా తెలుసు కదా..ప్రభుత్వంలో బడ్జెటింగ్ ఎలా ఉండాలి ? దానికి లిమిటేషన్లు ఏంటన్నవి ? మీకు బాగా తెలుసు కదా..ఎందుకు మీరు చేయలేకపోయారు. చేయలేకపోయారు అంటే మీ భావజాలంలోనే ఆ విధం అయిన ఆలోచన లేదు అని అంటాను నేను. ఆ విధం అయిన దృక్పథం మీలో లేదు అని అంటాను నేను. ఎప్పుడూ మీరు చెప్పుకునే మాటలకూ చేతలకూ సంబంధమే ఉండదు. అభివృద్ధి అంటే ఓ కుటుంబం అన్ని రంగాలలో సాధించినటువంటి అభివృద్ధిని మీరు చూడడమే లేదు. ప్రపంచంలో ఉన్న సంస్థలన్నీ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అభివృద్ధికి..? వారు ఆరోగ్యంగా జీవించే స్థితి ఉండాలి. చక్కగా చదువుకుని పోటీ ప్రపంచంలో ఉన్నటువంటి అవకాశాలను అందుకునేటటువంటి విద్యా విధానం ఉండాలి. మంచి పోషకాహారం లభించాలి. నివాస యోగ్యం అయిన ఇల్లు ఉండాలి. పరిసరాలు బాగుండాలి. మంచి నీరు ఉండాలి. ఇవన్నీ లేకుండా అభివృద్ధి అనేదానికి అర్థం ఏముందని ? ఇవేవీ కాకుండా ఎవరి కోసం అభివృద్ధి. అభివృద్ధి ఆ రాష్ట్ర ప్రజల కోసం కాకుండా ఏ కొద్దిమంది ధనవంతుల కోసమో..పెద్ద పెద్ద భవంతులు చూపించి,రోడ్లు చూపించి ఇదే అభివృద్ధి అనేటటువంటి మీ తత్వానికి మీ సిద్ధాంతానికి మా పార్టీ సిద్ధాంతానికి జగన్ మోహన్ రెడ్డి సిద్ధాంతానికి ఎక్కడా పొంతనా లేదు. జగన్ గారి పాలన రాజ్యాంగం చెప్పినటువంటి నిబద్ధత కలిగిన పాలన.ప్రపచంలో ఇతర దేశాలు అనుసరిస్తున్నటువంటి ప్రజల తాలుకా జీవన ప్రమాణాలు పెంచే పాలన. మీకూ మాకూ ఎక్కడా పొంతన లేదు. ఈ విషయమై మీరు వైఎస్సార్సీపీ తో పోల్చి చూసుకోకూడదు. మీకు సాధ్యం కాదు. ఎందుకంటే మీ భావజాలం వేరు. మీ భావజాలంలో ప్రజలకు మేలు చేద్దాం జీవన ప్రమాణాలు పెంచుదాం అన్నవి లేవు. ఇటువంటి ఉన్నత స్థాయి ఆలోచనలు లేనే లేవు. మీరు ఇవ్వలేరు. ఇదే మాట నేను పదే పదే చెబుతున్నాను. ఈ విధంగా మీరు ఎప్పుడూ చేయలేదు. మీ చుట్టూ ఉన్నది ధనవంతుల కూటమి. ధనవంతుల ప్రయోజనాలను మీరు కాపాడగలరు కానీ పేద ప్రజల జీవన ప్రమాణాలను మీరు పెంచలేరు. మీ చుట్టూ ఉన్న కోటరీని మీరు కాపాడగలరు కానీ పేద ప్రజల విషయమై ఆలోచన చేయలేరు. ఇదే విషయం అన్నింటా కనిపిస్తూనే ఉంది గత పాలనలో మీరు అందించిన పాలనలో. అందుకే అప్పుడూ ఇప్పుడూ అవే మాటలు చెబుతున్నారు. అత్యంత వెనుకబడిన నార్త్ కోస్టల్ ఏరియాలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతాం అంటే మీరు అంగీకరించడం లేదు. మీకు ఎక్కడుంది కాన్ఫిడెన్స్ ? విశాలం అయిన భావం ఎక్కడుంది మీకు. అందుచేత జయహో బీసీ లేదు.మీ కపట మాటలూ ఎవ్వరూ నమ్మరు. మీరు చెప్పే మాటలు అన్నీ ఎన్నికల్లో ఓటు పొంది తద్వారా అధికారం దక్కించుకునేందుకు కాక మరొకదానికి కాదని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఎన్నికల ముందు గొప్ప ప్రసంగాలు ఇచ్చినంత మాత్రాన మోసపోయేందుకు ఇప్పుడు ప్రజలు సిద్ధంగా లేరు. మీరు కనుక చర్చకు వస్తే,ఏ వేదిక ఏర్పాటు చేస్తే ఆ వేదికలో మీతో వాదించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు చేసిన పొరపాట్లు అన్నీ చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు జగన్ మోహన్ రెడ్డి చేసిన మేలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి సూచీలు నేను చూపించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ జయహో బీసీని ప్రజలెవ్వరూ నమ్మవద్దు అని సూచన చేస్తూ బ్యాక్ వర్డ్ క్లాస్ కు చెందిన నేతగా, చాలా కాలం ప్రభుత్వాలలో పనిచేసిన వ్యక్తిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అభ్యర్థిస్తూ ఉన్నాను. టీడీపీ జయహో బీసీలో కపటం ఉంది. అందులో మాయ ఉంది. అందులో మోసం ఉంది. అధికారం కోసం చెప్పే మాటలు ఉన్నాయి తప్ప నిజమైనటువంటి సామాజిక న్యాయం,రాజకీయ అధికారం, ఆర్థిక స్వాతంత్ర్యం కలిగించే ఆలోచనలు అందులో లేవు. బీసీలకు మేలు చేయాలన్న ఆలోచన చంద్రబాబు నాయకత్వానికి లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. -
‘బీసీ డిక్లరేషన్.. చంద్రబాబు మరో కొత్త డ్రామా’
సాక్షి, తూర్పుగోదావరి: చంద్రబాబు బీసీలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. బుధవారం ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని ధ్వజమెత్తారు. బీసీలకు వైఎస్సార్సీపీ చేసిన న్యాయం మీరు ఎప్పటికీ ఇవ్వలేరు. బీసీ పదం ఎత్తడానికి చంద్రబాబు అనర్హుడు. బీసీలను ఓటు బ్యాంకుగానే చూసే వ్యక్తి చంద్రబాబు. ఇదే చంద్రబాబు.. ఒకటి కాదు రెండు కాదు 14 ఏళ్లు రాష్ట్రాలు పాలించాడు అప్పుడు బీసీ డిక్లరేషన్ గుర్తు రాలేదా? ఇవాళ కొత్తగా డ్రామాకి తెరలేపాడు. బీసీల కోసం 50,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. చంద్రబాబుతో బీసీలకు సంబంధించి పలు డిబేట్లకు రెడీగా ఉన్నానంటూ మార్గని భరత్ సవాల్ విసిరారు. ‘‘బీసీలకు సీఎం జగన్ 75 వేల కోట్లు ఇచ్చారు. నేరుగా లక్షా 70 వేల కోట్లు బీసీల ఖాతాల్లో పడింది. అధికారంలోకి వస్తే లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామని చంద్రబాబు అబద్ధాలాడుతున్నారు. బీసీల డీఎన్ఏ టీడీపీ అని చెప్పే చంద్రబాబు బీసీలకు ఇచ్చింది 21 సీట్లు మాత్రమే. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజమండ్రి సీటు జగనన్న బీసీలకు ఇచ్చాడు కనీసం నువ్వు ఆ సాహసం చేసావా? చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఛాలెంజ్ చేస్తున్నా.. మేము ఇచ్చిన స్థాయిలో బీసీలకు మీరు సీట్లు ఇవ్వగలరా.. మీ చిత్తశుద్ధి ఏమిటో ప్రజలకు తెలిసిపోతుంది. ఈ 42 ఏళ్లలో రాజ్యసభ సీట్లు ఎంతమంది బీసీలకు ఇవ్వగలిగారు’’ అంటూ మార్గాని భరత్ ప్రశ్నించారు. ఇదీ చదవండి: వాళ్లని అవినీతికి వాడుకుని వదిలేసిన బాబు -
‘టీడీపీ బీసీ డిక్లరేషన్ కాపీ పేస్ట్.. మళ్లీ మోసం చేయడానికే’
సాక్షి, తూర్పుగోదావరి: సీఎం జగన్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన నాయకుడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. బుధవారం ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఏరోజైనా మేనిఫెస్టోను అమలు చేశారా? అంటూ దుయ్యబట్టారు. బీసీలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.బీసీలకు అన్ని చోట్లా ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు సీఎం జగన్ బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్న వ్యక్తి చంద్రబాబు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను చంద్రబాబు పట్టించుకోలేదు’’ అంటూ మంత్రి వేణు ధ్వజమెత్తారు. మంత్రి శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో ఏం మాట్లాడారంటే: చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఒక కాపీ, పేస్ట్. ప్రతి ఐదేళ్లకు ఒకసారి బీసీలను మోసం చేయటం చాలా సులభం అని నమ్మిన వ్యక్తి చంద్రబాబు. అందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కలసి బీసీ డిక్లరేషన్ అని మరోసారి మోసపూరిత వాగ్దానాలు ప్రకటించారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఆశయాలు, లక్ష్యాలు అన్నీ ఆయనతోనే వెళ్లిపోయాయి. 1995 తరువాత ఎన్టీఆర్ ఆశయాలను ఒక అత్యాశపరుడు తుంగలోకి తొక్కాడు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన ఆశయాలను విస్మరించి.. నిన్న బీసీ డిక్లరేషన్ అని ఒక కాపీ, పేస్ట్ ప్రోగ్రాంను చంద్రబాబు ప్రదర్శించాడు. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు, టీడీపీకి లేదు. బీసీలను అతిఘోరంగా టీడీపీ మోసగించింది. 1995 నుంచి 2004లో వరకు బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులపై చంద్రబాబు ఏమైనా చేశారా అంటే ఏమీ లేదు. బీసీలు పేదరికం నుంచి ఎదగాలంటే.. విద్యమాత్రమే మార్గమని రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పారు. కానీ బీసీలను దగా చేసిన వారిలో ప్రప్రథముడు చంద్రబాబే. 2014లో బీసీల కోసం 142 హామీలు చంద్రబాబు ఇచ్చారు. జనం మర్చిపోయారని అనుకుంటున్నారేమో. ఒకవేళ చంద్రబాబు మర్చిపోయారేమో ఆ మేనిఫెస్టో తెప్పించుకుని చూడండి. 2014లో 142 హామీలు ఇస్తే.. ఒక్కటీ అమలు చేయలేదు. ప్రతి ఐదేళ్లకో ఒక వేషం వేసి బీసీలను చంద్రబాబు మోసం చేస్తాడు ప్రతి ఐదేళ్లకు ప్రజలను మోసం చేయటానికి చంద్రబాబు ఒక వేషం వేస్తుంటాడు. రాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉన్నాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి గుర్తించారు. ఉచిత విద్యుత్ అంటే కాల్పులు జరిపించి.. మళ్లీ ఉచిత విద్యుత్ ఇస్తానని చంద్రబాబు నోట వైఎస్ఆర్ అనిపించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తెచ్చినప్పుడు చంద్రబాబు ఏమి విమర్శలు చేశారో గుర్తు చేసుకో. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి.. బీసీల వెనుకబాటుతనానికి కారకుడు, బీసీల ద్రోహి చంద్రబాబే. 1992లో ఆర్థిక సంస్కరణలు వస్తే.. 1997లో ఐటీ బూం వస్తే.. బీసీ విద్యార్థి, యువకుడు ఐటీలోకి రాలేకపోయారు. 2007లో వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టిన తరువాతే బీసీ బిడ్డ ఇంజనీరింగ్, డాక్టర్ వంటి ఉన్నత విద్యలు చదివారు. చంద్రబాబుది మనువాదం అయితే జగన్‌ది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ దారి బీసీలను బానిసలుగా చూడటానికి కులవృత్తులను చంద్రబాబు ప్రోత్సహించాడు. రాజ్యాంగాన్ని అందించిన బాబా సాహెబ్ అంబేద్కర్‌ను జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్నారు. చంద్రబాబు మాత్రం మను సిద్దాంతాన్ని అనుసరిస్తున్నారు. కల్లుగీత గీసుకునేవారు.. అదే వృత్తి చేయాలి. నేత నేసుకునేవారు దానికే పరిమితం కావాలి. అలా బీసీలు కులవృత్తులకే పరిమితం అవ్వాలి తప్ప సమాజంలో ఎదగకూడదనేది చంద్రబాబు నిజస్వరూపం. బీసీల తోకలు కత్తిరిస్తా... జడ్జిలుగా బీసీలు పనికిరారు అన్నావ్ బీసీ కులాల్లో ఉపకులాలు చంద్రబాబు నోట వచ్చింది. మరి, గతంలో నాయి బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానని, మత్స్యకారుల తోలు తీస్తాను, జడ్జీలుగా బీసీలు పనికిరారని చంద్రబాబు అన్నారు. ఇవేమీ ప్రజలు మరిచిపోలేదు. సీఎం జగన్ హయాంలో బీసీలు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నారు బీసీలు సమాజానికి వెన్నెముక అని వారి వెన్ను వంగకుండా నేను చూస్తానని చెప్పిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. బీసీ డిక్లరేషన్ ఇచ్చి ప్రతి హామీ నెరవేర్చిన నాయకుడు జగన్. బీసీల ఆత్మగౌరవం ఎక్కడా తాకట్టు పెట్టకుండా.. కుదవ పెట్టకుండా.. రక్షించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. సీఎం జగన్ హయాంలో లక్షా 73 వేల కోట్ల రూపాయలు బీసీల ఖాతాల్లో నేరుగా.. డీబీటీ ద్వారా రూ.4.38లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. బీసీల కోసమే రూ.1.73 లక్షల కోట్లు లబ్ది బీసీల ఖాతాల్లో నేరుగా చేర్చింది సీఎం జగన్ మోహన్ రెడ్డి. అది బీసీలకు తెలియదని చంద్రబాబు అనుకుంటున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు సబ్ ప్లాన్ పేరిన ఒక డ్రామా ఆడాలని అనుకుంటున్నారు. గత ఎన్నికల ముందు కూడా ఆదరణ పేరుతో నాసిరకం వస్తువులు ఇచ్చి అంటగట్టాలని అనుకున్నావు. రోజూ లోకేశ్, చంద్రబాబు 34% రిజర్వేషన్లు ఉన్నాయి అని చెబుతారు. 1992లో 73వ రాజ్యాంగ సవరణను పి.వి.నరసింహారావు 33.3% అమలు చేశారు. దానికి మరో 0.7% కలిపి 34% అని చంద్రబాబు చెబుతారు. 2014-19 మధ్యన స్థానిక సంస్థలకు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికల నిర్వహించని కారణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దేశంలో 50% మించి రిజర్వేషన్లు ఉండకూదని తీర్పు ఇచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పాలకుడు అఫిడవిట్ ఇచ్చారు. అతనికి చంద్రబాబు మద్దతు ఇచ్చారు. 34% రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం జగన్ ప్రయత్నించారు. ఆ సమయంలో ప్రతాపరెడ్డి అనే అతన్ని సుప్రీంకోర్టుకు పంపి రిజర్వేషన్లు అడ్డుకుంది బాబు కాదా? స్థానిక సంస్థల్లో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి కాబట్టి.. 50% రిజర్వేషన్లు.. నామినేటెడ్ పోస్టులు, దేవాలయ ఛైర్మన్లలోనూ సీఎం జగన్ ప్రకటించి అమలు చేశారు. సీఎం జగన్ కులగణన చేయించారు.. త్వరలోనే ప్రకటన చేస్తారు ఒక అబద్ధం చెప్పేసి వెళ్లిపోతే ప్రజలు మర్చిపోతారు అని చంద్రబాబు అనుకుంటారు. చంద్రబాబుకు అధికారం మాత్రమే కావాలి అనుకుంటారు. ప్రజలు మర్చిపోరు. చంద్రబాబును మర్చిపోయేలా బీసీలే చేస్తారు. కులగణన ఎందుకు చేస్తున్నారని పవన్ కల్యాణ్ చేత చంద్రబాబు ప్రకటన చేయించిన సంగతి ప్రజలు మర్చిపోలేదు. త్వరలో కులగణన మీద సీఎం జగన్ ప్రకటన చేస్తారు. బీసీ బిడ్డలు ఇంగ్లీష్ చదవకూడదా... ఎందుకు అడ్డుపడ్డావ్ బీసీలు అంటే చంద్రబాబు దృష్టిలో బానిసలు. చంద్రబాబు చేసిన ప్రతి పనిలో బలైంది బీసీలే. ఈ విషయంలో అచ్చెన్నాయుడు వాపోతున్నారు. తప్పులు చేయించింది చంద్రబాబు న్యాయస్థానం ముందు దోషిగా అచ్చెన్నాయుడును నిలబెట్టాడు. ఈరోజు తప్పులు చేసిన చంద్రబాబును కూడా సీఎం జగన్ దోషిగా నిలబెట్టారు. అడ్డదారిలో వచ్చిన లోకేశ్ కూడా వేల సంఖ్యలో బీసీలకు అన్యాయం జరిగిందని హాస్యాస్పదం. అసలు బీసీల జీవితాలు మారింది.. ఆనాడు వైఎస్ఆర్ నేడు వైఎస్ జగన్ వచ్చిన తరువాతే. బీసీల జీవితాలు మారాలంటే విద్య అందాలి. ఇంగ్లీషు మీడియం అందాలి. ఇంగ్లీషు మీడియం పెడితే గగ్గోలు ఎందుకు పెట్టారు. నీ మనవడు ఇంగ్లీషులో చదవాలి. బీసీ బిడ్డ ఇంగ్లీషులో చదివితే ఎదిగిపోతాడని నీ భయమమా? ఒక్కసారి ఈ విషయం బీసీలు ఆలోచించాలి. సీఎం జగన్ కేబినెట్లో పదిమంది బిసీ మంత్రులున్నారు ఇవాళ కేబినెట్లో 10 మంది బీసీ మంత్రులు ఉన్నారు. రాజ్యసభలో నలుగురు బీసీలు ఉన్నారు. యాదవ, కురుబ సామాజిక వర్గాలు లోక్‌సభ, పార్లమెంట్లో ఉన్నారు. ఆ సీట్లను చంద్రబాబు తన సామాజిక వర్గానికి అమ్ముకున్నారు. బీసీ అయిన తమ్మినేని సీతారామ్‌ను స్పీకర్ చేశారు. డిప్యూటీ సీఎంగా ముత్యాల నాయుడును చేశారు. చంద్రబాబు ఎప్పుడైనా చేశారా? రాష్ట్రంలో 58 మంది ఎమ్మెల్సీల్లో 29 మందికి ఎమ్మెల్సీలుగా 69% బీసీలకు ఇచ్చాం. చంద్రబాబు హయాంలో 37% మాత్రమే ఇచ్చాడు. ఎమ్మెల్సీలకు బీసీలకు 69% శాతం ఇచ్చిన వైఎస్ఆర్సీపీని చంద్రబాబు విమర్శించటం ఏమిటి? అంతెందుకు 6 జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్లుగా బీసీ సామాజిక వర్గానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారు. మున్సిపాల్టీలలో 44 మంది బీసీలకు (53%) ఛైర్పర్సన్ పదవులు, 9 మంది బీసీలకు (64%) కార్పొరేషన్లు మేయర్లుగా బీసీలకు అవకాశం వైఎస్ఆర్సీపీ ఇచ్చింది. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌దే రాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉన్నాయి. ఆ బీసీ కులాల ఆత్మగౌరవాన్ని రక్షించటం కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుంది. అలాంటి జగన్ గారిపై చంద్రబాబుకు విమర్శలు చేయటం ఏమిటి? చంద్రబాబుకు సిగ్గులేదు. కుల కార్పొరేషన్లు గురించి చంద్రబాబు మాట్లాడటం ఏమిటి? ఎప్పుడూ ఒక్కటే అబద్ధాన్ని చంద్రబాబు వల్లె వేస్తున్నారు. 56 కార్పొరేషన్లకు కుర్చీలు లేవంట. సీట్లు లేవంట. మీడియా మిత్రులు లారా రండి. వారు ఎంతో హుందాగా ఉన్నారో.. బీసీ భవన్ ఎలా ఉందో చూపిస్తాం. చులకన చేసిన వాడు గొప్పవాడు.. గొప్పగా చూసేవాడు.. చులకన చేసినట్లు అని.. కొత్త భాష్యం.. కొత్త భాషతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. పార్లమెంట్, అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన సోషల్ ఇంజనీరింగ్ నభూతో నభవిష్యత్ అని దేశమంతా చెప్పుకుంటోంది. కులగణన, సోషల్ ఇంజనీరింగ్‌లో జగన్ గారికి ఎవ్వరూ సాటి లేరు. 4% సామాజిక వర్గానికి 21 సీట్లు 45% బీసీలకు 18 సీట్లా బాబూ! అంతెందుకు టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితానే చూస్తే.. 4% ఉన్న చంద్రబాబు సామాజిక వర్గానికి 21 సీట్లు.. 45% ఉన్న బీసీలకు 18 సీట్లు కేటాయించారు. చంద్రబాబు దృష్టిలో కులం అంటే తన సామాజిక వర్గమే. తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్‌ను కలిపేసుకుని బీసీలను అణగదొక్కేయవచ్చనేది చంద్రబాబు ఆలోచన. కానీ, కాపులు విజ్ఞులు. ఈ జిల్లాలో 2008, 2024లోనూ బీసీలు, శెట్టి బలిజలు, గౌడలు, యాదవులు, దేవాంగులు, కుమ్మరి, కమ్మరి, ఎంబీసీలుగా ఉన్న అనేక కులాలు చంద్రబాబుకు కళ్లు తెరిపించటానికి సిద్ధంగా ఉన్నారు. రాజమండ్రి పార్లమెంట్, రాజమండ్రి రూరల్, రామచంద్రపురం, పాలకొల్లు, నర్సాపురం పార్లమెంట్ బీసీలకు జగన్ కేటాయించారు. కాపులను బీసీల్లో చేరుస్తానని వికృత క్రీడతో చంద్రబాబు మోసగించారు. అంతేకాదు.. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చంద్రబాబు హింసించాడు. డబ్బుందని, ప్యాకేజీలతో జనాన్ని కొనొచ్చని బాబు చేసిన ప్రయత్నాలన్నీ అందరికీ తెలిసిపోయాయి. చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ఒక కాపీ, పేస్ట్. మళ్లీ బీసీలను దగా చేయటానికి వంచించటానికి బాబు ప్రకటించిన డిక్లరేషన్. అసలు ఏ హామీ అమలు చేయని పార్టీకి డిక్లరేషన్ ప్రకటించే నైతిక అర్హత టీడీపీకి లేదు. దానికి వత్తాసు పలికే జనసేనకు అసలు లేదు. టీడీపీ వల్ల బాధించబడింది బీసీలే. రాజకీయ నాయకుడు అంటే అబద్ధం అని ఏమీ నెరవేర్చరని నాడు అనుకున్నారు. కానీ, నేడు చెప్పినవన్నీ జగన్ నిజం చేస్తు్న్నారని ప్రజలు అనుకుంటున్నారు. బీసీలకు విద్యను అందకుండా చేసిన బీసీ ద్రోహి చంద్రబాబు విద్యా విధానం విషయంలో బీసీలకు అన్యాయం చేసింది చంద్రబాబే. నేడు నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చటం నుంచి గోరుముద్ద, విద్యాకానుక, విద్యా దీవెన, విదేశీ విద్య ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే.. ఆకాశాన ఉమ్మేసినట్లే. చంద్రబాబు చేస్తున్న మోసపూరిత వాగ్దానాలను బీసీలే తిప్పికొడతారు. గతంలో మేనిఫెస్టోను దాచేసిన చంద్రబాబు మళ్లీ బీసీలను మోసం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. బీసీల ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమాన్ని రక్షించింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. ఈ విషయాన్ని బీసీలు గుర్తించాలి. ఇచ్చినమాట నెరవేర్చని వ్యక్తి.. ఎన్నికకో అబద్ధం చెప్పేవాడి పట్ల తస్మాత్ జాగ్రత్త. బీసీ బిడ్డగా బీసీలు మరోసారి మోసపోవద్దని కోరుతున్నా. మీడియా ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఈరోజు రాష్ట్రంలో బీసీలు తలెత్తుకుని తిరుగుతున్నారు. బీసీలు మోసపోవటానికి సిద్ధంగా లేరు. అందువల్లే బీసీల వాణిని వినిపించటానికి నాలాంటి వారు ముందుకు వచ్చారు. చంద్రబాబు వేల మంది చనిపోయారని,బీసీలను అణగదొక్కారని అంటున్నారు. అచ్చెన్నాయుడు చేత తప్పులు చేయించింది చంద్రబాబు. ప్రజాధనం దుర్వినియోగం చేసి చంద్రబాబుకు అచ్చెన్నాయుడు అందజేస్తే ఆయనకు శిక్షపడింది. ఇదీ చదవండి: మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్తరఫ్ -
బీసీలు, మైనారిటీలకు చంద్రబాబు వెన్నుపోటు
సాక్షి, తాడేపల్లి: టీడీపీకి బీసీలే వెన్నెముక అంటూ తరచూ వల్లె వేసే చంద్రబాబు.. సీట్ల కేటాయింపులో మాత్రం బీసీలతో పాటు మైనారిటీలకు వెన్నుపోటు పొడిశారు. తన సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యతనిస్తూ 94 సీట్లలో ఏకంగా 21 సీట్లు కమ్మలకే కేటాయించారు. మైనారిటీలకు కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే ఇచ్చారు. బీసీలకు 18, ఎస్సీలు 20, కాపులకు కేవలం 7 సీట్లే కేటాయించడం పట్ల చంద్రబాబు వ్యవహారశైలిపై ఇతర వర్గాలు మండిపడుతున్నారు. 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా ఒక్కరంటే ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకుండా బలహీన వర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. అగ్రవర్ణాలు.. అందులోనూ తన సామాజిక వర్గం వారినే అధికంగా రాజ్యసభకు పంపారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిని దారుణంగా కించపరిచి తన పెత్తందారీ పోకడలను చాటుకున్నారు. న్యాయం చేయాలని విన్నవించుకున్న నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ హూంకరించారు. హామీని నెరవేర్చాలని కోరిన పాపానికి తాట తీస్తానంటూ మత్స్యకారులను బెదిరించారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని వ్యాఖ్యానించి దళితులను దారుణంగా అవమానించారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ బాబు అవహేళన చేసిన వైనాన్ని ఆయా వర్గాలకు చెందిన వారు గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు, చంద్రబాబు తీరుపై టీడీపీ యువ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తామని, యువ రక్తంతో పార్టీని నింపేస్తామంటూ చంద్రబాబు, లోకేష్ ప్రకటనలు గుప్పించారు. యువతకు 40 శాతం సీట్లు ఎక్కడంటూ ఆ పార్టీ యువ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదీ చదవండి: ‘జనసేనకు 24 సీట్లే ఎక్కువా?’.. ఎంత మాట! -
బీసీలను అణచివేసింది చంద్రబాబే: మంత్రి వేణు
సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగిందని.. బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కీలకమైన శాఖలన్నీ బీసీల వద్దే ఉన్నాయన్నారు. సీఎం జగన్ పాలనలో బీసీలు ఆత్మగౌరవంతో ఉన్నారన్న మంత్రి వేణు బీసీలను అణచివేసింది చంద్రబాబేనని మండిపడ్డారు. విజయవాడ: ప్రతిపక్షాలు కూటములుగా ఏర్పడి నీచ రాజకీయాలు చేస్తున్నాయని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ వారాల అబ్బాయిలాగా అప్పుడప్పుడు సినిమా సెలవుల్లో విజయవాడ వస్తాడంటూ ఎద్దేవా చేశారు. ‘‘175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని పార్టీ జనసేన. పవన్ పదేళ్ల రాజకీయ జీవితంలో అనుసరించిన ఎజెండా ఏంటో ఎవరికీ తెలియదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు కేఏ పాల్‌తో తప్ప అందరితో పొత్తు పెట్టుకున్నారు. ప్రజల ఎజెండా లేని వ్యక్తులు పవన్ కళ్యాణ్.. చంద్రబాబులు. సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు. రాజకీయాల్లో మాత్రం పూర్తిగా జీరో అయ్యాడు. పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్. నాయకత్వ లక్షణాలు లేని వ్యక్తికి రాజకీయ పార్టీ నడిపే అర్హత లేదు’’ వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. -
దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు బీసీ కుల గణన చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లలో అంతర్భాగంగా ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా కల్పించాలని, కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ దతియా జిల్లా కేంద్రం నుంచి ఓబీసీ హక్కుల ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ సింగ్ యాదవ్ తలపెట్టిన ‘పీడిత్ అధికార్ యాత్ర’ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓబీసీల అనైక్యతను ఆసరాగా చేసుకుని ప్రభుత్వాలు వారికి దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఓబీసీలకు న్యాయం చేయలేదు అధికారంలో ఉన్నప్పుడు ఓబీసీలకు న్యాయం చేయని కాంగ్రెస్ ఇప్పుడు ఓబీసీ న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉండటాన్ని ప్రశ్నిస్తోందని కవిత ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో ఓబీసీల సంఖ్య తక్కువగా ఉండటాన్ని ప్రశ్నించారు. దామోదర్ సింగ్ యాదవ్ ప్రారంభించిన పీడిత్ అధికార్ యాత్ర దేశవ్యాప్తంగా విస్తరిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలు అందరికీ స్పూర్తిదాయకమని, కేసీఆర్ స్పూర్తితో ఓబీసీ హక్కుల సాధన ఉద్యమం ముందుకుసాగాలని కవిత పిలుపునిచ్చారు. కేసీఆర్ స్పూర్తితోనే ఉద్యమాన్ని మొదలు పెట్టినట్లు ఓబీసీ ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ యాదవ్ తెలిపారు. -
బీసీలకు అగ్రతాంబూలం ఇస్తున్న సీఎం జగన్
-
బీసీల బతుకులు మారాయి
సాక్షి, అమరావతి: సమాజంలో అన్ని విధాలుగా వెనుకబడిన తరగతుల వారికి ఈ ప్రభుత్వంలోనే సరైన న్యాయం జరిగిందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. డబ్బు, నోరు, శక్తి, గుర్తింపు లేనివాళ్లకు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అగ్రపీఠం వేసిన ఏకైక వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. జగన్ పాలనలో బడుగుల బతుకులు మారాయని, ఆయన గెలుపుతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని ఓ హోటల్లో 139 బీసీ కులాల ప్రతినిధులతో గురువారం బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.మారేష్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ తన 45 ఏళ్ల బీసీ ఉద్యమ ప్రస్థానంలో ఎంతో మంది నాయకులను చూశాననీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల మేలు కోరే జగన్ వంటి నాయకుడిని చూడలేదనీ పేర్కొన్నారు. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సంఘ సంస్కర్తగా అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, సామాజిక న్యాయం అందించడంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. నాలుగున్నరేళ్ల ఆయన పాలనలోనే వాస్తవ రాజ్యాధికార బదిలీ జరిగిందని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలోనూ జరగనంత సామాజిక న్యాయం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందని చెప్పారు. సామాజిక న్యాయం కోసం, సమ సమాజం నెలకొల్పే దిశగా జగన్ పాలన కొనసాగుతున్నందున బీసీలంతా ఆయనకు మద్దతుగా నిలవాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీలు బాగుంటే చంద్రబాబుకు కడుపుమంట సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలోని పేదవర్గాల కడుపునిండుతుంటే చంద్రబాబు వంటి పెత్తందార్ల కడుపు మండుతోందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ’ఖబడ్దార్ ప్రతిపక్షాలు.. మీ మోసాలు మాకు తెలిశాయి’ అంటూ కృష్ణయ్య హెచ్చరించారు. అమ్మఒడి, విద్యాదీవెన వంటి అనేక పథకాలు పెట్టి బీసీల బిడ్డలను సీఎం జగన్ చదివిస్తున్నారనీ, విదేశీ విద్య వంటి ప్రోత్సాహంతో బీసీల పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారనీ, వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి బీసీలు ఇప్పుడు కార్లు, విమానాల్లో తిరుగుతున్నారని చెప్పారు. పొరుగున ఉన్న ఒడిశా, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలకు వెళ్లి బీసీ బతుకులు ఎలా ఉన్నాయో చూస్తే ఏపీలో బీసీల అభివృద్ధి ఎంత గొప్పగా ఉందో తెలుస్తుందని చెప్పారు. ఇటీవల కర్ణాటకలోని బళ్లారి, తమిళనాడులోని తెలుగు వారుండే ప్రాంతంలో ఓ సమావేశానికి తాను వెళ్లినపుడు అమ్మ ఒడి, పింఛన్, విద్యా కానుక, ఆరోగ్యశ్రీ వంటి పథకాల కోసం తమను కూడా ఏపీలో కలిపితే బాగున్ను అని అక్కడివారు తనతో అన్నట్టు ఉదహరించారు. రాష్ట్రాన్ని 14 ఏళ్ళు పాలించిన చంద్రబాబు బీసీలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ప్రతిపక్షాల మోసపు మాటలు ఎవరూ నమ్మొద్దని పిలుపునిచ్చారు. -
సామాజిక న్యాయానికి ప్రభుత్వం పెద్దపీట
సాక్షి, అమరావతి: సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీల పక్షపాతి అని వారికి చేసిన మేలుతో రుజువైందని తెలిపారు. విజయవాడ శ్రీరామ ఫంక్షన్ హాలులో బీసీ వెల్ఫేర్ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల ఐక్యత–సమగ్రాభివృద్ధి అనే అంశంపై బుధవారం ఏర్పాటు చేసిన సదస్సులో సజ్జల ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేలు జరిగితేనే ఓటువేయండని అడిగే దమ్ము కేవలం ఒక్క జగన్‌కే ఉందన్నారు. సంక్షేమ పథకాల్లో అవినీతి కనుమరుగైందని, దాదాపు రూ. 2.40 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబ్దిదారులకు చేరిందని చెప్పారు. సామాజిక సాధికార యాత్రకు విశేష ఆదరణ వస్తోందని సజ్జల తెలిపారు. సామాజిక న్యాయానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవుల్లో పెద్దపీట వేశామన్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్ అని అన్నారు. మహిళలకు 50 శాతంపైగా రిజర్వేషన్లను అమలు చేస్తూ రాజకీయ పదవుల్లో కూర్చోబెట్టామన్నారు. బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు మంత్రి మేరుగు నాగార్జున, ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి అన్నారు. జనాభా ఆధారంగా చట్టసభల్లో రిజర్వేషన్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నా కూడా బీసీలకు ఇప్పుడు జరుగుతున్నంత మేలు చేయరేమోనని జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు అంగిరేకుల ఆదిశేషు అన్నారు. చట్టసభల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బీసీలకు పటిష్టంగా రిజర్వేషన్లు అమలు చేయాలని, రాష్ట్ర రాజధానిలో బీసీ భవన ప్రధాన కార్యాలయ నిర్మాణానికి 2 వేల గజాలు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సదస్సుకు ముందు మహాత్మా జ్యోతిరావు సావిత్రి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీసీ వెల్ఫేర్ జేఏసీ గౌరవ అధ్యక్షుడు పి.వెంకట్రావు, పద్మశ్రీ కూటికుప్పల సూర్యారావు, డాక్టర్ లక్ష్మణ్, ప్రొఫెసర్ ఆర్.నాగేశ్వరి, బీసీ నేతలు ధనలక్ష్మి, బొడ్డు కృష్ణ భగవాన్ పాల్గొన్నారు. -
సామాజిక న్యాయంలో సీఎం జగన్ దేశానికే ఆదర్శం: ఆర్.కృష్ణయ్య
సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్.. కుల గణన నిర్ణయం హర్షణీయం అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, దేశమంతా సీఎం జగన్ నిర్ణయాలను మెచ్చుకుంటున్నారని, రానున్న రోజుల్లో ఇంకా మరింత సంక్షేమం బీసీలకు అందుతుందన్నారు. చరిత్రలో సీఎం జగన్ పేరు చిరస్థాయిగా ఉంటుంది. గుడిసెలో ఉండేవారు సైతం డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారు. పిల్లల చదువులతో కుటుంబాల జీవితాలు మారిపోతున్నాయి. విదేశాలలో మన వాళ్లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. జగన్ చేపట్టినన్ని సంస్కరణలు మరెవరూ చేయలేదు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. సరైన పదవులు కూడా ఇవకుండా మమ్మల్ని అవమానపరిచారు. ఏ రాష్ట్రం వెళ్లినా ఏపీ గురించి, సీఎం జగన్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు’’ అని కృష్ణయ్య పేర్కొన్నారు. ‘‘లోటు బడ్జెట్ ఉన్నా మెరుగైన సంక్షేమం అందిస్తున్నది జగన్ మాత్రమే. ఇతర నాయకులు జనాన్ని ఓటర్లుగా మాత్రమే చూస్తారు. జగన్ మాత్రమే తమ కుటుంబ సభ్యులుగా చూస్తారు. అందుకే వారందరికీ మేలు చేస్తున్నారు. కులాల లెక్కలు తీయటం వలన రిజర్వేషన్లు పెరుగుతాయి. పదవులు ఇంకా పెరుగుతాయి. బీసీల నాయకత్వం జగన్ హయాంలో బాగా పెరిగింది. కులాల లెక్కలు తీయటానికి పాలకులు భయపడతారు. కానీ సీఎం జగన్ ఎంతో ధైర్యంగా ఆ పని చేస్తున్నారు. 18 మందికి ఎమ్మెల్సీలు ఇస్తే అందులో 11మంది బీసీలకే ఇచ్చారు. బస్సుయాత్రలకు జనం నుండి విశేష స్పందన లభిస్తోంది. బీసీల అభ్యున్నతికి జగన్ చేస్తున్న సహాయం మరువలేనిది’’ అంటూ కృష్ణయ్య కొనియాడారు. చదవండి: ‘ఈసారి కూడా నా మనవడే సీఎం’ -
బీసీలంటే రాహుల్‌కు ఎందుకంత చులకనా?: లక్ష్మణ్
సాక్షి, ఢిల్లీ: బీసీ సీఎం చేస్తామన్న బీజేపీ ప్రకటనను రాహుల్ గాంధీ చులకన చేస్తున్నారని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బీసీ వర్గాలను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పెత్తందార్ల మనస్తత్వంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలున్నారు.. ఆ పార్టీలను తెలంగాణ బీసీలు ఓటుతో తిప్పికొట్టాలన్నారు. బీసీ సీఎం అయ్యేందుకు బీసీలంతా ఏకం కావాలి, తమ సత్తా చాటాలి. పార్లమెంట్ ఎన్నికల్లో మేము 4 సీట్లు సాధిస్తే, కాంగ్రెస్ 3కే పరిమితమైంది. తరతరాలుగా బీసీలను అణగదొక్కిన పార్టీ కాంగ్రెస్’’ అంటూ లక్ష్మణ్ ధ్వజమెత్తారు. బీజేపీ బీసీల అభిమానాన్ని చూరగొంది. అధికార పార్టీ బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తోంది. బీసీల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న ఎన్నికలు ఇవి. కొండంత ఆశతో బీసీలు మోదీ వైపు చూస్తున్నారు. డిపాజిట్లు గల్లంతైన పార్టీ కాంగ్రెస్. నిన్నటి సభలో రాహుల్ బీసీలను అవమానిస్తారా?. బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్. తక్షణమే రాహుల్ బీసీలకు క్షమాపణ చెప్పాలి. బీసీలంటే రాహుల్‌కు ఎందుకంత చులకనా?. బీసీల పట్ల కాంగ్రెస్ విపరీత ధోరణి మారాలి. ఎక్కడ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయి. దేశ ప్రజలంతా ప్రధాని మోదీ వైపు చూస్తున్నారు’’ అని లక్ష్మణ్ పేర్కొన్నారు. చదవండి: కేసీఆర్ డిజైన్ చేస్తే ఇలాగే ఉంటుంది: రాహుల్ గాంధీ -
ఇక అమీతుమీయే!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో టికెట్ల వ్యవహారం చిచ్చురేపుతోంది. బీసీలకు 34 సీట్లు ఇస్తామని రాజకీయ వ్యవహారాల కమిటీలో ఇచ్చిన హామీ మేరకు టికెట్లు కేటాయించకపోతే ప్రత్యక్ష కార్యా చరణకు సిద్ధం కావాలని ఆ వర్గం నేతలు నిర్ణయించారు. గురువారం రాత్రి నగర శివారు శంషాబాద్‌కు సమీపాన రాళ్లగూడలోని ఓ కళాశాలలో సమావేశమైన బీసీ నేతలు.. పార్టీలోని కొందరు బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరుపై కూలంకషంగా చర్చించినట్లు సమాచారం. బీసీలకు టికెట్ల వ్యవహారంపై అంతర్గతంగా పార్టీలోనే చర్చించాలని, బహిరంగంగా పత్రికలకు ఎక్కరా దంటూ పార్టీలోని కొందరు నేతలు హెచ్చరికలు చేయడాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టినట్లు తెలిసింది. ఇది బీసీలను అణగదొక్కే చర్యగా వారు అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, కాసుల బాలరాజ్, శ్రీహరి ముదిరాజ్ దండ శ్రీనివాస్, ఐనీల దామోదర్, ప్రదీప్‌కుమార్ వంటి నేతలు దాదాపు 40 మంది పాల్గొన్నారు. టికెట్ల వ్యవహారంలో సామాజిక సమతుల్యత పాటించకపోతే ఎలా అని, రాజకీయ వ్యవహారాల కమిటీ లో చేసిన నిర్ణయాన్ని కూడా గౌరవించకపోవడం ఏమి పద్ధతి అని కొందరు ప్రశ్నించారు. సర్వేలు, ఆర్థిక పరిస్థితులనే సాకులు చూపి బీసీలకు టికెట్లలో కోత విధించడం సమంజసం కాదని వారు పేర్కొన్నట్లు తెలిసింది. టికెట్ల ఖరారుకు ముందే బీసీలకు 34 స్థానాలు (ప్రతి పార్లమెంట్లో రెండు అసెంబ్లీ స్థానాలు) కేటాయింపు విషయం మరోసారి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని, ఢిల్లీ కూడా వెళ్లి పార్టీ పెద్దలను కలిసి పరిస్థితిని వివరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఈ సమావేశంలో పాల్గొన్న ఓ నాయకుడు వెల్లడించారు. సీనియర్లు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, మహేశ్‌కుమార్‌గౌడ్ వంటి నేతలు హాజరుకాకపో యినా.. సమావేశంలో చర్చించిన అంశాలను వారికి వివరించినట్లు తెలిసింది. గత నెలలోనే బీసీ నేతలంతా ఢిల్లీ వెళ్లి పార్టీ సంస్థాగత వ్వవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై బీసీలకు 34 సీట్లు ఇవ్వాలని కోరిన విషయం విదితమే. -
రాజ్యాధికారమే బీసీల లక్ష్యం కావాలి
కేయూ క్యాంపస్: ’’అర శాతం, ఐదు శాతం ఉన్నవాళ్లు బహుజనులపై పెత్తనం చెలాయిస్తున్నారనీ, బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా.. సర్దార్ సర్వాయి పాపన్న పోరా ట స్ఫూర్తితో బీసీలు, గౌడన్నలు చైతన్యవంతం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం గౌడ సంఘాల ఉ మ్మడి వరంగల్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం గ్రౌండ్ లో నిర్వహించిన గౌడ గర్జన సభలో ఆయన మాట్లాడారు. ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు కూడా బహుజన కులాలకు జనాభా ప్రతిపాదికన సీట్లు కేటాయించడంలేదని, బీసీలను ఓటర్లుగానే వాడుకుంటున్నారని ఆరోపించారు. మన హక్కులను సాధించుకోవాలంటే ఎక్కువ శాతం వాటా ఉన్న బీసీలే అధికారంలోకి రావాలన్నారు. ఇందుకు రాబోయే రోజుల్లో ఓబీసీ పార్టీ కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. ఏ పార్టీ కూడా బీసీని సీఎం చేస్తామనడం లేదు ఏ పార్టీ కూడా బీసీని ముఖ్యమంత్రి చేస్తా మని చెప్పటం లేదని శ్రీనివాస్‌గౌడ్ గుర్తు చేశారు. ’’బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115 సీట్లు కేటాయించగా అందులో ఐదుశాతం ఉన్న రెడ్లకు 40 టికెట్లు ఇచ్చారు.. అర శా తం ఉన్న వెలమలకు 12 సీట్లు ఇచ్చారు.. ఈ లెక్కన బీసీలకు ఇచ్చింది తక్కువే. ఉ మ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క గౌడ్‌కు కూడా టికెట్ ఇవ్వదు.. ఇంకా బీఆర్ఎస్ బీఫామ్‌లు ఇవ్వలేదు కాబట్టి జనాభా ప్రాతిపదికన బీసీలకు, గౌడలకు సీట్లు కేటాయించాలి.. లేని పక్షంలో లక్షమందితో హైదరాబాద్‌కు వచ్చి ఆ పార్టీ కార్యాలయానికి తాళం వేస్తాం’అని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కూడా రెడ్లకే ఎక్కువ సీట్లు ఇచ్చి బీసీలను విస్మరిస్తే గాంధీ భవన్‌కు తరలివస్తామన్నారు. గాంధీ భవన్‌ను రెడ్డిభవన్‌గా మార్చుకోవాలని ఎద్దేవాచేశారు. బీజేపీ సైతం అదేబాటలో ఉండబోతోందని, ప్రధాని నరేంద్ర మోదీ తాను ఓబీసీ అని చెప్పుకుంటున్నారే తప్ప ఓబీసీలకు ఒరగబెట్టిందేమి లేదని ఆయన విమర్శించారు. గౌడ సంఘాల జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ బైరి రవికృష్ణగౌడ్ అధ్యక్షతన ఈ సభలో తెలంగాణ గౌడసంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరిగౌడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్, జిల్లా అ«ధ్యక్షుడు చిర్ర రాజు గౌడ్, బాధ్యులు కత్తి వెంకటస్వామి గౌడ్ పాల్గొన్నారు. తొలుత ఏకశిల పార్కు నుంచి గౌడలు ర్యాలీగా ఆడిటోరియం గ్రౌండ్‌కు చేరుకున్నారు. -
బీసీలకు సీట్లపై ఆందోళన వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నేతలకు సీట్ల కేటాయింపు విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. తెలంగాణలో బీసీలకు కనీసం 34 సీట్లు కేటాయించాలన్న డిమాండ్‌తో గత రెండు రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతలు పలువురు శనివారం సాయంత్రం ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఖర్గే ఆరా తీశారు. బీసీ నేతలు చేస్తున్న కనీసం 34 స్థానాల డిమాండ్‌పై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ నేతృత్వంలోని బృందంతో చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్లో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కత్తి వెంకటస్వామి సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలతో కలసి మధుయాష్కీ గౌడ్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక సమతౌల్యం పాటించడంతోపాటు బీసీలకు సీట్ల కేటాయింపుపై ఖర్గేతో చర్చించామని... తెలంగాణ అంటే తనకు ప్రత్యే క శ్రద్ధ అని ఖర్గే అన్నారని మధుయాష్కీ చెప్పారు. సర్వేలు సహా ఇతర అన్ని విష యాలు తమ దృష్టిలో ఉన్నాయని తెలిపా రన్నారు. ఈ విషయంలో పాత, కొత్త నేతలెవరూ ఆందోళన చెందొద్దని ఖర్గే హామీ ఇచ్చారని.. ఈ అంశంపై ఖర్గేతో చేపట్టిన చర్చలతో అధిష్టానంపై తమకు పూర్తి విశ్వాసం ఏర్పడిందని తెలిపారు. సీట్ల కేటాయింపు విషయంలో తెలంగాణలో అన్ని వర్గాలకు సమతుల్యం పాటించేలా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని వర్గాలు కలసికట్టుగా కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని ఖర్గే సూచించారని మధు యాష్కీ తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న పూర్తి రాజకీయ పరిణామాలపై ఖర్గేకు పూర్తి అవగాహన ఉందని... రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీసీలకు ఎలాంటి అన్యాయం జరగదని మధుయాష్కీ భరోసా ఇచ్చారు. -
బీసీల హక్కుల కోసం ఎందాకైనా..
సాక్షి, హైదరాబాద్: చట్ట సభల్లో బీసీలు, బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు బీసీ కుల గణన చేపట్టాలనే డిమాండ్‌తో ఈ నెల 26న బీసీ సంఘాలు నిర్వహించే సమా వేశానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చట్ట సభల్లో బీసీల వాటా, హక్కుల కోసం జరిగే ఉద్యమానికి తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య శనివారం హైదరాబాద్‌లో కవితతో భేటీ అయ్యారు. బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఎంపీలు మాలోత్ కవిత, బోర్లకుంట వెంకటేశ్ నేత, ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లె రవికుమార్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోనే 2014 జూన్‌లో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే బిల్లుపై తమ పార్టీ తీర్మానం చేసిందని కవిత గుర్తు చేశారు. నామినేటెడ్ పదవులు, మార్కెట్ కమిటీలు, పార్టీ పదవుల్లో బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పించిందన్నారు. తెలంగాణ నుంచే బీసీ ఉద్యమం: కృష్ణయ్య కవితతో భేటీ అనంతరం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం వద్ద ఎంపీ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నుంచే బీసీ ఉద్యమానికి శంఖారావం పూరిస్తామని ప్రకటించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించటం, కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు, బీసీ కులగణన అనే మూడు డిమాండ్లతో తమ జాతీయ ఉద్యమం కొనసాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మహిళా బిల్లును సవరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 26న జలవిహార్‌లో సదస్సు నిర్వహించిన తరువాత బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. -
బీసీల సాధికారతకు సీఎం జగన్ ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ వర్గాల సాధికారతకు అన్ని విధాలుగా ప్రాధా న్యత ఇస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పిస్తేనే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందని అభిప్రాయపడ్డారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నా కార్యక్రమం పోస్టర్లను మంగళగిరిలోని తన కార్యాలయంలో మంగళవారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు పాలించిన కేంద్ర ప్రభుత్వాలన్నీ బీసీలకు ఏ రంగంలో కూడా జనాభా ప్రకారం వాటా ఇచ్చే దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారేశ్, నాయకులు మహిధర్, మణికంఠ పాల్గొన్నారు. -
బీసీలకు 60 సీట్లు ఇవ్వాల్సిందే.. అన్నీ పార్టీలకు బీసీ సింహగర్జన సభ డిమాండ్
సాక్షి, రంగారెడ్డిజిల్లా/ హుడా కాంప్లెక్స్: అరవై శాతం జనాభా ఉన్న బీసీలకు 60 అసెంబ్లీ సీట్లతో పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం కేటాయించాలని రాజకీయ పార్టీలను బీసీ సింహగర్జన సభ డిమాండ్ చేసింది. బీసీలకు సముచిత స్థానం కల్పించని పార్టీలకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని హెచ్చరించింది. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలన్నా.. బీసీలకు 60 సీట్లు ఇవ్వాలిందేనని, కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నా అంతే సంఖ్య లో సీట్లు కేటాయించాలని స్పష్టం చేసింది. ఈట లను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే బీజేపీకి రాష్ట్రంలో రాజకీయ మనుగడ ఉంటుందని సభలో నేతలు పేర్కొన్నారు. ఆదివారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ అధ్యక్షతన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో బీసీ సింహగర్జన సభ జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు దుర్గయ్యగౌడ్, అమృతరావు, చిన్న శ్రీశైలం యాదవ్, గొడుగు మహేశ్, నవీన్ యాదవ్, కుందారం గణేశ్‌చారి తదితరులు ఇందులో పాల్గొ న్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సభకు హాజరయ్యారు. కులానికో సీటు.. బీసీలకే ఓటు నినాదంతో.. తెలంగాణ వస్తే సామాజిక న్యాయం జరుగుతుందని ఆశించామని, కానీ అలా జరగలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో.. రెడ్లకు 40 టికెట్లు ఇచ్చిందని, జనాభాలో 60శాతం ఉన్న బీïసీలకు మాత్రం 23 టికెట్లే ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. మంత్రివర్గంలోనూ బీసీలకు సముచిత స్థానం కల్పించలేదని విమర్శించారు. వచ్చే స్థానిక ఎన్నికల నాటికి బీసీల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీని ప్రకటిస్తామని.. ‘కులానికో సీటు.. బీసీలకే ఓటు’నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేస్తామని ప్రకటించారు. బీసీలకు తగిన గుర్తింపు ఇవ్వని పార్టీలకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా జనగణనలో బీసీ కుల గణన చేపట్టాలని.. చట్టసభల్లో బీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ మహిళలకు ఉప కోటా ప్రకటించాకే మహిళా బిల్లును ఆమోదింపజేయాలన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం 50 శాతానికి పెంచాలని కోరారు. అగ్రకుల అభ్యర్థులపై స్వతంత్ర అభ్యర్థులుగా బీసీలను నిలుపుతామని ప్రకటించారు. -
బీసీల రాజ్యాధికారమే ప్రధాన ఎజెండా!
సాక్షి, హైదరాబాద్: ‘‘జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు అటు చట్టసభల్లో... ఇటు మంత్రి పదవుల్లో ఏమాత్రం ప్రాధాన్యత లేదు. 5 నుంచి 10 శాతం ఉన్న అగ్రకులాలకు చెందిన వారు 50 శాతం పైబడి పదవులు దక్కించుకుంటున్నారు. రా జ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన కేటాయిం పులు జరగాలి. కానీ ప్రతి పార్టీ బీసీలకు అత్తెసరు స్థానాలిచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. ఓట్లు రాబట్టేందుకు సంక్షేమ ఫలాలంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ బీసీలు బాగు పడాలంటే సంక్షేమ పథకాలతో సాధ్యం కాదు. కేవలం రాజకీ య పదవులు, పాలనలో కీలక బాధ్యతలు దక్కితే నే చట్టాలు చేసే అధికారం వస్తుంది. ఆ ఆలోచన తోనే ఈసారి ఎన్నికల్లో బీసీలకు అత్యధిక టికెట్లు రాబట్టేందుకు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీల సింహగర్జన సభను నిర్వహిస్తున్నాం’’ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన సరూర్‌నగర్ స్టేడియంలో లక్షలాది మందితో నిర్వహిస్తున్న బీసీల సింహగర్జన బహిరంగ సభ నేపథ్యంలో ‘సాక్షి’తో తన ఆలోచనలను పంచు కున్నారు. అవి ఆయన మాటల్లోనే... ప్రతి పార్టీ 60 సీట్లు ఇవ్వాలి.. కానీ రాష్ట్ర జనాభాలో 60 శాతానికిపైగా ఉన్న బీసీలకు ప్రతి రాజకీయ పార్టీ కనీసం 60 సీట్లు కేటాయించాలి. అన్ని ప్రధాన కులాలను కలుపుకుంటూ టికెట్లు ఇవ్వాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థి తులతో పోలిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత బీసీ లకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. 2018 ఎన్ని కల్లో బీఆర్ఎస్ బీసీలకు 26 సీట్లు కేటాయించ గా... తాజాగా ప్రకటించిన జాబితాలో కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చింది. అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్‌లకు ఈ దఫా సీటు కేటాయించకపోవ డం గమనార్హం. ఇక కాంగ్రెస్, బీజేపీలు బీసీలకు ఏమేరకు సీట్లు కేటాయిస్తాయో వేచిచూడాలి. మా నినాదం మాత్రం ఒక్కటే. ‘కులానికో సీటు, అలాంటి పార్టీలకే బీసీల ఓటు’. సంక్షేమ పథకాల అమలంటూ బీసీలకు భిక్ష వేసినట్లు చేస్తూ ఓట్లు రాబట్టుకుంటున్నాయి. నిధుల కేటాయింపు అనేది బీసీల హక్కు. ప్రతి పార్టీ బీసీ రాజకీయ పాలసీ ప్రకటించాలి త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నా యి. వెనువెంటనే పార్లమెంటు ఎన్నికలు సైతం జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రతి రాజకీయ పార్టీ బీసీ రాజకీయ పాలసీని ప్రకటించాలి. ఈమేరకు బీసీల సింహగర్జన సభలో తీర్మానాలు చేస్తాం. ప్రతి ఇంటి నుంచి ఓ మనిషి... ప్రతి ఊరి నుంచి ఓ బండి... నినాదంతో సింహగర్జన నిర్వ హిస్తున్నాం. రాజకీయ పార్టీలకతీతంగా ఈ సభకు హాజరు కావాలని కోరుతున్నా. దళిత, గిరిజన సంఘాల ప్రతినిధులు సైతం ఈ సభకు రాను న్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పలు సంఘాల ప్రతినిధులు రానున్నారు. ఈ బహిరంగ సభకు దివంగత గద్దర్ పేరు పెడుతున్నాం. -
మీరు దయతలిస్తే మళ్లీ గెలుస్తా!
సిరిసిల్ల టౌన్/ సిరిసిల్ల: ‘ఓట్ల సమయంలో మందు, డబ్బులు పంచడం నాకు రాదు. అలాంటి అలవాటు నాకు లేదు. రాబోయే ఎన్నికల్లో సిరిసిల్ల ప్రజలు దయతలిస్తే మళ్లీ గెలుస్తా. అప్పుడు కూడా ఓ తమ్ముడిగా.. అన్నగా.. బిడ్డగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తా. బీద, బిక్కిలను కడుపులో దాచుకుని పనిచేస్తా..’అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పేదల గోసలు ఎరిగిన కేసీఆర్ లాంటి నాయకుడిని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ బంధు పథకాన్ని మంత్రి ప్రారంభించారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని 600 మందికి ఈ పథకం కింద చెక్కులు పంపిణీ చేశారు. వేములవాడలో ఆలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రమేశ్‌బాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీసీ బంధు నిరంతర ప్రక్రియ ‘రాష్ట్రంలోని అర్హులైన పేదవారు అడగకపోయినా సీఎం కేసీఆర్ వారికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుంచారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ అయిన పసిబిడ్డ నుంచి పండు ముసలి వరకు అందర్నీ ఆదుకుంటున్నారు. కేసీఆర్ కిట్టు నుంచి ఆసరా పెన్షన్ల వరకు అన్ని విధాలా ఆదుకునే మనసున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్. గడిచిన 9 ఏళ్లు సంక్షేమానికి స్వర్ణయుగంలా మారింది. బీసీ బంధు పథకాన్ని ప్రతి నియోజకవర్గంలో 300 మందికి అందిస్తున్నాం. ఈ పథకంలో రూ.లక్ష లబ్ధి పొందిన 14 బీసీ కులాల పేదలు మళ్లీ ఆ డబ్బులను చెల్లించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది రుణం కాదు. కేవలం కులవృత్తులను ప్రోత్సహించేందుకు ఇస్తున్న గ్రాంట్ మాత్రమే. అర్హులందరికీ అందించే వరకు ఈ పథకం కొనసాగుతుంది. శతాబ్దాల పేదరికాన్ని పోగొట్టేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి అందించి వారి పెళ్లిళ్లకు సాయం చేశాం. రైతుబంధు, రైతు బీమా, నేతన్నలకు బీమా పథకాలను అమలు చేస్తున్నాం. చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఒడవదు. మళ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల వాళ్లు ఓట్లు అడగడానికి వస్తే.. మాకు ఎంతో చేసిన బీఆర్ఎస్ను కాదని మీకు ఓట్లు ఎందుకు వేయాలని నిలదీయండి. రాష్ట్రంలోని ఏ ఒక్క పేదవర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రభుత్వం సాయం చేస్తూ వారి బతుకులను బాగు చేస్తుంది. గృహలక్ష్మి పథకంలో అర్హులకు ఇళ్లను మంజూరు చేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది..’అని కేటీఆర్ హామీ ఇచ్చారు. వచ్చే నెలలో మెడికల్ కాలేజీ ప్రారంభం ‘వచ్చే నెలలో సిరిసిల్లలో మెడికల్ కాలేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో 150 మంది డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటారు. అన్ని రోగాలకు ప్రత్యేక వైద్యులతో మెరుగైన వైద్యం అందుతుంది. చిన్నరోగం నుంచి క్యాన్సర్ వరకు ఉచితంగా వైద్యసేవలు జిల్లాలో పేద ప్రజలకు అందుతాయి..’అని మంత్రి చెప్పారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళాచక్రపాణి, రామతీర్థం మాధవి పాల్గొన్నారు. -
ప్రధానితో ఆర్.కృష్ణయ్య, బీసీ నేతల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల లో సమాన వాటా ఇవ్వకుండా అన్యాయం జరు గుతోందని వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య నేతృత్వంలోని బీసీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. బీసీలకు న్యాయం చేసేందుకు ప్రధానమంత్రి హోదాలో జోక్యం చేసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ , లాల్ కృష్ణ, డా.మారేష్, డా.పద్మలత, రమేశ్ ప్రధానమంత్రితో కలిసి చర్చలు జరిపారు. సుమారు 15 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో బీసీలకు సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రధానికి వివరించి ఒక వినతిపత్రాన్ని అందించారు. జాతీయ బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ కులవృత్తులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరారు. బీసీలకు ఏ రంగంలో కూడా ఇంతవరకు జనాభా ప్రకారం వాటా ఇవ్వలేదని, విద్యా,ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో కనీస ప్రాతినిధ్యం లభించలేదని ప్రధానికి వివరించారు. అందుకోసం బీసీలకు రావాల్సిన వాటా కోసం మరోసారి అధ్యయనం జరగాలని ఆర్.కృష్ణయ్య కోరారు. అదేవిధంగా జనాభా గణనలో కులాల వారీగా బీసీ జనాభా గణన చేయాలని బీసీ నేతల బృందం ప్రధానిని కోరింది. బీసీలకు అన్ని రంగాల్లో సమాన వాటా ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందని ప్రధానమంత్రి చెప్పారని సమావేశం అనంతరం ఆర్.కృష్ణయ్య తెలిపారు. -
జాతీయ విద్యా సంస్థల్లో చదివే బీసీలకూ ఫీజు రీయింబర్స్మెంట్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో చదివే బీసీలకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ (ఆర్టీఎఫ్) పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్ యూనివర్సిటీలు వంటి 200కు పైగా ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందిన రాష్ట్ర బీసీ విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు చెల్లించనుంది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అమలు చేస్తున్న ఈ పథకాన్ని.. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే బీసీలకు కూడా వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. ఏటా సుమారు 10 వేల మందికి.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లను అందజేస్తోందని.. రాష్ట్రంలో చదువుతున్న వారికి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నామని మంత్రి గంగుల గుర్తు చేశారు. ఇకపై దేశంలోని ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీట్లు పొందిన బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి ఫీజు అందించనుందని తెలిపారు. మొత్తంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణేనని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఏటా రాష్ట్రానికి చెందిన దాదాపు 10వేల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని, ఇందుకోసం ప్రభుత్వంపై ఏటా అదనంగా రూ.150 కోట్ల భారం పడుతుందని గంగుల వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు, రైతు బంధు, ఉచిత కరెంటు తదితర పథకాల్లో బీసీలదే మెజార్టీ వాటా అని పేర్కొన్నారు. బీసీలకు ఆత్మగౌరవ భవనాలు, గ్రామాలు, పట్టణాల్లో కమ్యూనిటీ హాళ్లు, కుల వృత్తిదారుల ఆర్థిక స్వావలంబనకు రూ.లక్ష ఆర్థిక సాయం, ప్రపంచస్థాయి విద్యను అందించేలా 327 గురుకుల విద్యాలయాల ఏర్పాటు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ఈ నిర్ణయం విప్లవాత్మకం: జూలూరు గౌరీశంకర్ ఎక్కడా లేని విధంగా దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుకునేందుకు బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ హర్షం వ్యక్తం చేశారు. -
బీసీ బంధు: సాయం సరే..దరఖాస్తెలా?
సాక్షి, హైదరాబాద్/కుత్బుల్లాపూర్: వెనుకబడిన వర్గాల్లోని కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం..బీసీ కులాల వారు కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద రోజంతా పడిగాపులు కాశారు. దరఖాస్తుకు గడువు మంగళవారం ముగియనుండటంతో అధిక సంఖ్యలో బీసీలు అక్కడికి వచ్చారు. సాయంత్రం 6 గంటల సమయంలో కార్యాలయం గేటుకు తాళం వేయడంతో సర్టిఫికెట్లు అందనివారు సిబ్బంది కాళ్లావేళ్లా పడ్డారు. విధులు ముగించుకుని వెళ్తున్న తహసీల్దార్ సంజీవరావుకు తమ గోడు చెప్పుకున్నారు. సర్టిఫికెట్లు లేకపోతే లక్ష సాయం అందకుండా పోతుందని వాపోయారు. చింతల్‌కు చెందిన మంగలి సంగమేశ్వర్ చొక్కా విప్పి గేటు ముందు బైఠాయించారు. ఈ నెల 8న ఆదాయ పత్రం కోసం మీ సేవలో దరఖాస్తు చేశానని, మూడు రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయం చుట్టూ తిరిగినా పని అవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్టిఫికెట్ల కోసం ఇక్కడ 12,240 దరఖాస్తులు అందగా కేవలం 4 వేలు మాత్రమే పరిష్కారమయ్యాయి. కాగా సర్వర్ డౌన్ కారణంగా ఈ పరిస్థితి నెలకొందని తహసీల్దార్ చెప్పారు. సిబ్బంది పగలు, రాత్రి పనిచేస్తున్నారని వివరించారు. ఒక్క కుత్బుల్లాపూర్ మండలంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. చాలామంది ఎప్పుడో దరఖాస్తు చేసుకున్నా మంగళవారం కూడా సర్టిఫికెట్లు అందలేదు. మరోవైపు సర్టిఫికెట్లు అందినవారు దరఖాస్తు చేసుకునేందుకు కూడా ఇబ్బందులెదురయ్యాయి. 5 లక్షలకు పైగానే దరఖాస్తులు లక్ష రూపాయల సాయానికి దరఖాస్తు చేసుకునే గడువు మంగళవారం అర్ధరాత్రి 12 గంటలతో ముగుస్తుండడం, గడువు పెంచేది లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేయడంతో ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మీసేవా సెంటర్లు, ఇతర కంప్యూటర్ సెంటర్లు దరఖాస్తుదారులతో కిటకిటలాడాయి. మరోవైపు కుల, ఆదాయం సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయాల వద్ద భారీగా క్యూలు కనిపించాయి. సర్టిఫికెట్లు పొందలేని వారు నిరాశతో వెనుదిరిగారు. ఇక దరఖాస్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో చాలా ప్రాంతాల్లో సర్వర్ మొరాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల దరఖాస్తులు మాత్రమే వస్తాయని ప్రభుత్వం భావించినప్పటికీ, భారీ స్పందన నేపథ్యంలో మంగళవారం రాత్రి 8 గంటల వరకే 5 లక్షల దరఖాస్తులు వ చ్చి నట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. అయితే రాత్రి పొద్దుపోయే వరకు అందిన సమాచారం మేరకు 5 లక్షల మందికి పైగానే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హులను ఎంపిక చేసి జూలై 15 నుంచి దశల వారీగా ఆర్థిక సాయం చెక్కుల రూపంలో అందజేస్తారు. దరఖాస్తు గడువు తేదీ పొడిగించాలి రూ.లక్ష సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు గౌడ కులస్తులకు మొన్ననే అవకాశం ఇచ్చారు. దరఖాస్తు చేసుకుందామని మీ సేవా కేంద్రానికి వెళితే సర్వర్ డౌన్ అయిందని చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక ఇంటికొచ్చా. ప్రభుత్వం దరఖాస్తు గడువు పొడిగించాలి. లేకపోతే మాలాంటి నిరుపేద చేతి వృత్తుల వారికి ఆర్థిక సాయం అందకుండా పోతుంది. –ముత్తంగి ఇందిర, కొత్లాపూర్, సంగారెడ్డి జిల్లా వారం క్రితం దరఖాస్తు చేసినా సర్టిఫికెట్లు రాలేదు లక్ష సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కుల, ఆదాయ సర్టిఫికెట్లు అవసరం. వాటికోసం ఈనెల 14వ తేదీన దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ ఇవ్వలేదు. తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయా. మంగళవారం చివరి రోజు కావడంతో నల్లగొండ ఆర్డీవో కార్యాలయంలో సర్టిఫికెట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చా. సర్టిఫికెట్లు ఎప్పుడు వస్తాయో, దరఖాస్తు చేస్తానో లేదో తెలియడం లేదు. – బొడ్డుపల్లి నరసింహ, నల్లగొండ టౌన్ -
బీసీ కులాల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా జగన్ సర్కార్ కృషిచేస్తోంది: సజ్జల
-
కేసీఆర్ సర్కార్ రూ.లక్ష ఆర్థిక సాయం.. వెబ్సైట్ ఇదే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని బీసీ కులవృత్తులు, చేతివృత్తిదారులకు ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఫొటో, ఆధార్, కులధ్రువీకరణ పత్రాలతో ఈ దరఖాస్తు చేసుకోవచ్చు. కులవృత్తులు, చేతివృత్తిదారులకు పనిముట్లు, ముడిసరకు కొనుగోలు కోసం ప్రభుత్వం ఈ సాయం అందించనుంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాల జిల్లాలో ఈనెల 9న రూ. లక్ష ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించనున్నారు. రాబోయే రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రానుంది. దరఖాస్తు కోసం https://tsobmmsbc.cgg.gov.in క్లిక్ చేయండి -
ఇచ్చిన మాటే లక్ష్యంగా సుపరిపాలన
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకిచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన కొనసాగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 98.5 శాతం నెరవేర్చడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గంతో పాటు చివరికి ఎవరికి ఓటు వేశారన్నది కూడా చూడకుండా సుపరిపాలన అందించారు. చెప్పిన మాట మేరకు సంక్షేమాభివృద్ధి పథకాల అమలు కొనసాగిస్తున్నారు. పేదరికం నుంచి కుటుంబాలను పైకి తీసుకురావడమే లక్ష్యంగా మేనిఫెస్టోలో చెప్పని పథకాలను సైతం అమలు చేశారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు.. రేపటి కంటే భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంగా నాలుగేళ్ల పాలన కొనసాగించారు. కోవిడ్ సంక్షోభం, ఆర్థిక కష్టాలను అధిగమించి మరీ పథకాలు అమలు చేసి విశ్వసనీయతకు మారు పేరుగా పాలన సాగుతోంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా, మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా అమలు చేసి చూపించారు. అందుకే ధైర్యంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ద్వారా ఎన్నికలు రాకముందే ఎమ్మెల్యేలను ప్రతి ఇంటికి పంపించే కార్యక్రమం చేపట్టారు. నాలుగేళ్ల పాలనతో ఇంటింటికి, మనిషి మనిషికి ఏం మేలు జరిగిందనే విషయాన్ని ఎమ్మెల్యేలు స్వయంగా వివరించడమే కాకుండా.. ప్రింట్ చేసిన పుస్తకాలను వారికి ఇచ్చి, ఆ మేలు జరిగిందా లేదా అని ధైర్యంగా అడిగి ప్రజల మద్దతు పొందుతున్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చినందునే ఎమ్మెల్యేలు ధైర్యంగా ప్రజల దగ్గరకు వెళ్లగలుగుతున్నారు. మరో పక్క వ్యవసాయ, విద్య, వైద్య రంగాల్లో పరిపాలనలో సంస్కరణల ద్వారా విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గ్రామ, వార్డు స్థాయికి పరిపాలనను, పథకాలను, పౌర సేవలను పారదర్శకంగా తీసుకెళ్లారు. తద్వారా గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రూ.3.02 లక్షల కోట్లు సాయం గత నాలుగేళ్లలో అన్ని వర్గాలకు నవరత్నాల కింద డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా 10.46 కోట్ల ప్రయోజనాల కోసం ఏకంగా రూ.3.02 లక్షల కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా 7.90 కోట్ల ప్రయోజనాలకు రూ.2.11 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా 2.57 కోట్ల ప్రయోజనాల కింద రూ.91 వేల కోట్లు వ్యయం చేశారు. సంక్షేమంలో బీసీలకు సామాజిక న్యాయం జరిగింది. వెనుకబడిన వర్గాల వారు ఇన్నాళ్లు వెనుకబడిపోయే ఉన్నారు. జనాభాలో అత్యధికులుగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వాల్లో వారికి ఏ రంగంలో కూడా తగిన వాటా లభించలేదు. ఆఖరుకు దారిద్య్ర రేఖకు దిగువనున్న బీసీలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు కూడా గత ప్రభుత్వంలో నోచుకోలేదు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు.. దేశానికే బ్యాక్ బోన్ అంటూ పాదయాత్రతో పాటు ఎన్నికల ముందు నిర్వహించిన బీసీ సదస్సులో కొత్త నిర్వచనం చెప్పిన అప్పటి ప్రతిపక్ష నేత.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన నాలుగేళ్ల పాలనలో అన్ని రంగాల్లో వారికి తగిన వాటా ఇచ్చారు. ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో అత్యధికంగా 16.70 లక్షల మంది బీసీలే కావడం గమనార్హం. ఆయా వర్గాలకు లబ్ధి ఇలా ♦ నాలుగేళ్లలో నవరత్నాలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా బీసీలకు రూ.1,48,597 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.99,681 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.48,916 కోట్లు వ్యయం చేశారు. ♦ నవరత్నాలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఎస్సీలకు రూ.53,929 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.34,963 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.18,966 కోట్లు వ్యయం చేశారు. ♦ నవరత్నాలు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఎస్టీలకు రూ.15,114 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.10,395 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.4,719 కోట్లు ఖర్చు చేశారు. ♦ నవరత్నాలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మైనారిటీలకు రూ.18,960 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.11,948 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.7,012 కోట్లు వ్యయం చేశారు. ♦ నవరత్నాలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా కాపులకు రూ.26,634 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.20,550 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.6,084 కోట్లు ఖర్చు చేశారు. ♦ నవరత్నాలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఇతరులకు రూ.38,871 కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా రూ.33,531 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.5340 కోట్లు వ్యయం చేశారు. -
‘బీసీ కులాలన్నింటికీ రుణాలివ్వాలి’
ముషీరాబాద్: సీఎం కేసీఆర్ ప్రకటించిన లక్ష రూపాయల రుణం 4 కులాలకే కాకుండా బీసీ జాబితాలో ఉన్న 129 కులాలకు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని బీసీ భవన్లో శనివారం జరిగిన 16 బీసీ సంఘాల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. 2017లో ఎన్నికల ముందు రుణాలు ఇస్తామని 6 లక్షల మంది వద్ద దరఖాస్తులు తీసుకొని, వారికి రుణాలు ఇవ్వలేదని తెలిపారు. వారికి వెంటనే లక్షరూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడీ పోస్టులు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. వెంటనే ఈడీ పోస్టులను, బీసీ కార్పొరేషన్ల ఎండీ పోస్టులనూ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కమిషనర్, ఎంబీసీ కార్పొరేషన్ ఎండీ, బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను ఎందుకు నియమించడంలేదని ప్రశ్నించారు. ఇన్నేళ్లు బీసీలను నిర్లక్ష్యం చేసి, ఎన్నికల ముందు రుణాలు అంటూ ప్రకటించడాన్ని బీసీలు గమనించాలని కోరారు. బీసీ బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 10లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, నాయకులు జి.అనంతయ్య, మధుసూదన్, జిల్లపల్లి అంజి, వేముల రామకృష్ణ, పగడాల సుధాకర్, గొరిగ మల్లేష్ యాదవ్, సి.రాజేందర్, డీఆర్ చందర్, నీలం వెంకటేష్, జి.కృష్ణయాదవ్, రామాంజనేయులు, నర్సింహగౌడ్, బర్క కృష్ణ, ముత్యం వెంకన్నగౌడ్ పాల్గొన్నారు. -
అధికారంలోకొస్తే బీసీ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్/నాగోల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడి బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు చేస్తామని వెల్లడించింది. అలాగే బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా, విదేశాల్లో చదివే బీసీ విద్యార్థులకు శాచురేషన్ ప్రాతిపదికన ఆర్థిక సాయం, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్దపీట, ఎన్నికల్లో పోటీ చేయలేని బీసీల్లోని చిన్న కులాలకు ప్రాధాన్యత వంటి కీలకాంశాలను ఇందులో పొందుపరిచింది. రాష్ట్రంలో 130 కులాలను ఏకం చేసి అధికార సాధనకు ముందుకెళ్లనున్నట్టు తెలిపింది. వచ్చే నెలలో లక్షలాది మందితో హైదరాబాద్‌లో బీసీ గర్జన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించింది. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ రాష్ట్రవ్యాప్త ఓబీసీ మోర్చా కాన్ఫరెన్స్–బీసీ సమ్మేళనంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్రాజ్, బీజేపీ నేతలు యెండల లక్ష్మీనారాయణ, డా. బూర నర్సయ్యగౌడ్, వన్నాల శ్రీరాములు, కూన శ్రీశైలంగౌడ్, నందీశ్వర్‌గౌడ్, తుల ఉమ, ఆకుల విజయ, గడీ శ్రీకాంత్, ఎస్. హరిశంకర్‌గౌడ్, ఇతర నాయకుల హర్షధ్వానాల మధ్య లక్ష్మణ్ ఈ ప్రకటన చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను దోషిగా నిలబెడతాం: లక్ష్మణ్ ఈ సందర్భంగా కె. లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీల సంక్షేమం విషయంలో కేసీఆర్‌కు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మనసు రావడం లేదని ప్రశ్నించేందుకే ఓబీసీ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి.... బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది కాంగ్రెస్సే. ఆ పార్టీతోపాటు బీఆర్ఎస్ కూడా బీసీ రిజర్వేషస్లను వ్యతిరేకించింది’ అని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ‘తెలంగాణలో బీసీలను కేసీఆర్ అణగదొక్కుతున్నారు. పల్లెపల్లెకూ బీసీ–ఇంటింటికీ బీజేపీ పేరిట వీటన్నింటిపై ప్రచారం చేస్తాం. అతిత్వరలో లక్షలాది మందితో బీసీ గర్జన నిర్వహించి కాంగ్రెస్, బీఆర్ఎస్లను బీసీ దోషిగా నిలబెడతాం’ అని లక్ష్మణ్ ప్రకటించారు. ‘ఉత్తరాంధ్రకు చెందిన 26 బీసీ కులాల ప్రజలు తెలంగాణలో స్థిరపడితే ఒక్క కలంపోటుతో జీవో జారీ చేసి బీసీ జాబితా నుంచి తొలగించిన ద్రోహి కేసీఆర్. రాష్ట్రంలో 54 శాతం బీసీలంటే కేవలం ముగ్గురికే కేసీఆర్ మంత్రి పదవులిచ్చారు. కానీ కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ పదవులొచ్చాయి’ అని లక్ష్మణ్ మండిపడ్డారు. గొర్లు, బర్లు ఇచ్చి బీసీలను అణగదొక్కుతారా?: బండి ‘బీసీలను కేసీఆర్ అవమానిస్తున్నారు. 50 శాతం జనాభా ఉన్న బీసీలకు 3 మంత్రి పదవులా? గొర్లు, బర్లు, చేపలు ఇచ్చి రాజకీయంగా అణగదొక్కుతున్నారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులిస్తారా? జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీలను అవమానించిన మూర్ఖుడు కేసీఆర్. బీసీబంధు ఇవ్వడానికున్న అభ్యంతరం ఏమిటి?’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. అవసరం లేకపోయినా రూ. 1,600 కోట్లు ఖర్చు పెట్టి సచివాలయం, ప్రగతి భవన్ కట్టుకున్న సీఎం... బీసీ ఆత్మగౌరవ భవనాలను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారో బీసీ సమాజం గుర్తించాలి. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వడం లేదు. బీసీలకు రావాల్సిన వాటా నిధులను ఎందుకు ఖర్చు చేయడం లేదు? తెలంగాణలో పేదల రాజ్యం రావాల్సిందే. అందుకోసం 5 నెలలు పూర్తి సమయం మాకివ్వండి. కేసీఆర్ రాక్షస, కుటుంబ పాలనను అంతం చేస్తాం. పేదల రాజ్యాన్ని తీసుకొస్తాం’ అని సంజయ్ పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ మాట్లాడుతూ అణగారిన వర్గాలకు రాజ్యాధికారం వస్తేనే బడుగులకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీ డిక్లరేషన్‌పై బీజేపీ నేతల హర్షం సాక్షి, హైదరాబాద్: ఓబీసీ సమ్మేళనంలో చేసిన బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను బీజేపీ నేతలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వా మి, ఏపీ జితేందర్ రెడ్డి, విజయశాంతి వేర్వేరు ప్రకటనల్లో అభినందించారు. ఇన్నాళ్లూ బీసీలకు కేసీఆర్ చేస్తున్న అన్యాయాన్ని ఈ డిక్లరేషన్ సరిచేస్తుందని డీకే అరుణ పేర్కొన్నారు. వెనకబడిన వర్గాలపై బీజేపీ నిబద్ధతకు ఇది నిదర్శనమని వివేక్ వెంకటస్వామి తెలిపారు. బీసీ వర్గాలకు మేలు చేసేలా రాష్ట్రపార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించడం సంతోషమని ఏపీ జితేందర్ రెడ్డి తెలిపారు. వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిన కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో ఓబీసీలు చెంపపెట్టు లాంటి తీర్పునివ్వాలని విజయశాంతి కోరారు. సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు... ♦ 52 శాతం జనాభా ఉన్న బీసీలను అన్ని రంగాల్లో అణచివేస్తున్న కేసీఆర్ ప్రభుత్వ తీరుకు ఖండన ♦ స్ధానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 33 శాతం నుంచి 23 శాతానికి తగ్గించి బీసీలపట్ల వివక్షపై ఖండన ♦ 12 శాతమున్న ముస్లింలకు 201 గురుకులాలు, 52 శాతమున్న బీసీలకు 260 గురుకులాలే కేటాయించడంపై ఖండన ♦ అన్ని వర్గాలకు 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి బీసీలకు కేవలం 11 శాతం ఇవ్వడాన్ని తప్పుబడుతూ తీర్మానం. ♦ కేసీఆర్ సర్కార్ బీసీల వ్యతిరేక వైఖరి, మోదీ సర్కార్ సాగిస్తున్న సంక్షేమం గురించి ప్రతి బీసీ కుటుంబంలో చర్చించాలి. ♦ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బూత్, మండల, రాష్ట్ర స్థాయిల్లో ‘బీసీల గోస–బీజేపీ భరోసా’ చర్చ నిర్వహణ. ♦ బీసీ ఓటర్లలో చైతన్యం కల్పిం చి ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రలోభాలు, ధన రాజకీయాలను తిప్పికొట్టాలి. ♦ అన్ని రంగాల్లో బీసీల పురోగతి సాధన డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే సాధ్యమని బీసీ వర్గాలు గుర్తించాలి. ♦ జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పనపై మోదీ సర్కార్‌కు ధన్యవాదాలు. -
బీసీలంటే వెనక్కు నెట్టివేయబడిన వాళ్లు
సాక్షి, హైదరాబాద్/నాంపల్లి: బీసీలంటే వెనుకబడిన వాళ్లు కాదని, వెనక్కు నెట్టివేయబడిన వారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలోని బీసీల బతుకులన్నీ వెనక్కు నెట్టివేయబడ్డాయని, కేసీఆర్ సారథ్యంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీసీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. సీనియర్ జర్నలిస్టు పల్లె రవికుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర కల్లు గీత పారిశ్రామిక సహకార సంస్థ తొలి చైర్మన్‌గా బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, రైతుబంధులాంటి పథకాలతో అత్యధికంగా లబ్ధి పొందుతున్నది బీసీలేనన్నారు. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ స్పూర్తితో మేధావులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నారు. సీఎం అప్పగించిన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తా తనకు ఈ అవకాశం క ల్పించిన సీఎం కేసీఆర్‌కు, సహకరించిన మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్ గౌడ్‌కు పల్లె రవికుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం తనకు అప్పగించిన బాధ్యతను కర్తవ్యాన్ని చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధతతో నిర్వహిస్తానని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మల్లేశం పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ హయాంలో బీసీలకు పెద్దపీట
పాత గుంటూరు/నరసరావుపేట: రాష్ట్రంలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వారి సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. మాటలు చెప్పే నాయకుడిలా కాకుండా ఎన్నికలకు ముందుఅన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేస్తూ సీఎం జగన్ ప్రజల గుండెల్లో చొచ్చుకుపోయారన్నారు. రాష్ట్రంలో 18 మంది ఎమ్మెల్సీలు ఉంటే.. 11 ఎమ్మెల్సీలు బీసీలకు ఇచ్చారన్నారు. పార్లమెంట్లో మొదటిసారి బీసీ బిల్లు పెట్టిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. చంద్రబాబు, లోకేశ్ ఉనికి కోసమే సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఎవరు మంచి చేస్తారో వారిని అక్కున చేర్చుకుంటారని, ఆ స్థానం సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. మన రాష్ట్రంలో ఉన్న పథకాలను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలుచేస్తే బీసీల అభివృద్ధి బాగుంటుందని అన్నారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ.. బీసీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఆ పథకాలను సద్వినియోగపరుచుకుని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు నాని అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.వెంగళరావు, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, సంఘం జాతీయ కన్వీనర్ సి.రాజేందర్ పాల్గొన్నారు. -
బీసీల చేయందుకునేలా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే లక్ష్యంగా శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్.. ఈసారి సామాజిక ఎజెండాతో ఎన్నికల కదన రంగంలోకి దిగాలని నిర్ణయించింది. ప్రధానంగా బలహీనవర్గాల (బీసీల)ను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలకు పదును పెడుతోంది. బీసీలను అకట్టుకునే పలు అంశాలతో పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఓబీసీల జనగణన, రిజర్వేషన్ల పెంపు, బీసీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ ఎత్తివేత వంటి అంశాలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని.. ఆయా అంశాల్లో కాంగ్రెస్ తరఫున సానుకూలతను, భరోసాను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ వర్గాలకు చేసిన అన్యాయాలను ఎత్తిచూపాలని నిర్ణయించింది. ఈ కార్యాచరణకు సంబంధించి ఈ నెల 25న రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతలతో గాందీభవన్‌లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. బడుగుల ఎజెండా.. కాంగ్రెస్ జెండా.. రాష్ట్ర కాంగ్రెస్ ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. దీనికితోడు మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో.. బీసీలను కూడా తమవైపు మలుచుకునేందుకు వ్యూహాలను పన్నుతోంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఓబీసీలను అవమానించారన్న బీజేపీ ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టడంతోపాటు.. బీసీల అభ్యున్నతిపై రాహుల్ గాం«దీకి ఉన్న సానుకూల దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ‘‘దేశంలో బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ ఆయా వరా>్గలకు రిజర్వేషన్లు పెరగలేదని.. ఓబీసీ జనగణన చేపట్టడం లేదన్న అంశాలను ప్రజలకు వివరిస్తాం. ఇదే సమయంలో ఓబీసీ గణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని రాహుల్‌గాంధీ చెప్పిన విషయాన్ని.. రిజర్వేషన్లపై సీలింగ్ ఎత్తివేస్తామని కర్ణాటక ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేసిన విషయాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళతాం..’’ అని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇక బీసీలకు క్రీమీలేయర్ ఎత్తివేత, ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ వంటి దీర్ఘకాలిక డిమాండ్ల విషయంలోనూ కాంగ్రెస్ సానుకూల దృక్పథాన్ని వివరిస్తామని అంటున్నాయి. పలు బీసీ కులాలకు లబ్ధి కలిగిస్తామంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు విఫలమయ్యాయని.. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ ఉంటుందని పేర్కొంటున్నాయి. ఈనెల 25న జరిగే సమావేశం అనంతరం ప్రత్యక్ష కార్యాచరణను, క్షేత్రస్థాయికి చేరే ప్రణాళికను ప్రకటిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ‘బీసీ’ సమావేశ ఎజెండా ఇదే! ఈ నెల 25న జరిగే కాంగ్రెస్ బీసీ నేతల ప్రత్యేక సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, కార్యాచరణను సిద్ధం చేయనున్నట్టు సమాచారం. దీనికి హాజరు కావాలంటూ ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతలకు సమాచారం ఇచ్చారు. ♦ దేశవ్యాప్తంగా బీసీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ చేసిన కృషి, ఓబీసీల జనగణనకు కట్టుబడి ఉంటామని రాహుల్‌గాంధీ చేసిన ప్రకటన, రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేసి బీసీలకు లబ్ధి చేకూరుస్తామన్న అంశాలతోపాటు.. పార్టీ పదవుల్లో బీసీలకు ప్రత్యేక కోటా, ఈసారి ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలిసింది. ♦ గత ఎన్నికల్లో బీసీలకు ఎన్ని సీట్లు కేటాయించారు? ఈసారి ఎన్ని సీట్లు అడగాలి? పార్టీ పదవుల్లో ఉదయ్‌పూర్ తీర్మానం మేరకు తగిన కోటా ఎలా ఇవ్వాలి? అనే అంశాలపై స్పష్టతకు రానున్నట్టు సమాచారం. ♦2004 ఎన్నికలకు ముందు మాజీ ఎంపీ వి.హనుమంతరావు నేతృత్వంలో వరంగల్‌లో జరిగిన బీసీ గర్జన తరహాలో.. రాష్ట్రంలోని బీసీ వర్గాలను సమీకరించి మరో భారీ సభను నిర్వహించే అంశంపై 25న సమావేశంలో చర్చించనున్నట్టు తెలిసింది. ♦ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఏఐసీసీ పెద్దల దృష్టికి తీసుకెళతామని.. ఎన్నికల నాటికి బీసీ ఓటర్లు తమవైపు మొగ్గుచూపేలా కార్యాచరణ రూపొందిస్తామని కాంగ్రెస్ బీసీ నేతలు చెప్తున్నారు. -
బీసీల సంక్షేమానికి పెద్దపీట: హరీశ్
మణికొండ: దేశంలోని ఏరాష్ట్రంలోనూ లేనివిధంగా తెలం గాణలో బీసీల సంక్షేమానికి ఇప్పటివరకు రూ.48 వేల కోట్లు ఖర్చుచేశామని, ఈ సంవత్సరం 6,229 కోట్లను బడ్జెట్లో కేటాయించామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి గండిపేట మండలం కోకాపేటలోని ఆరెకటిక, గాండ్ల, రంగ్రేజ్, భట్రాజ్ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాలను పరిశీలించారు. ఆయా భవనాలకు అవసరమైన విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాల కల్పనపై అధికారులతో సమావేశం నిర్వహించారు. కోకాపేటలో బీసీల ఆత్మగౌరవ సముదాయాల నిర్మాణపనులను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. తుది దశకు చేరుకున్న యాదవ, కురుమ సంఘాల భవనాలను మార్చి 10న ప్రారంభిస్తామన్నారు. బీసీలకు ప్రభుత్వం అండ: రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు అండగా నిలుస్తున్నారని మంత్రి కమలాకర్ అన్నారు. ఇప్పటివర కు 29 బీసీ సంఘాల ఆత్మగౌరవ భవనాలకు భూమిపూజ చేశామన్నారు. దేశవ్యాప్తంగా ఆయా ప్రభుత్వాలు బీసీల గురించి కేవలం మాటలే చెబుతాయని, తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ సర్కారు చేతల్లో చూపిస్తోందని మంత్రి తలసాని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి జరుగుతున్న కృషిని ఆయా కులసంఘాల నేతలు, ప్రజలు దేశవ్యాప్తంగా చాటిచెప్పాలని సూచించారు. గతంలో ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశాయని, కేంద్ర ప్రభుత్వం బీసీలకు 2 వేల కోట్లు కేటాయించగా, తెలంగాణలో 6,229 కోట్లు సీఎం కేసీఆర్ కేటాయించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మల్లేశం, బండ ప్రకాశ్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కమీషన్ సభ్యుడు ఉపేంద్ర, జిల్లా కలెక్టర్ హరీశ్, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, ఆయా కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
బీసీల చరిత్రలో ఇది సువర్ణాధ్యాయం
ఉప్పల్: దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి తోడ్పాటునందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మంత్రులు గంగుల కమాలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, చామకూర మల్లా రెడ్డిలు అన్నారు. వెనుకబడిన వర్గాల చరిత్రలో ఈ రోజు సువర్ణాధ్యాయమని పేర్కొన్నారు. ఆదివారం ఉప్పల్ భగాయత్‌లో 38 ఎకరాలలో 13 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలకు మంత్రులు భూమి పూజ చేశారు. స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారితో పాటు వివిధ కులసంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ గత 75 ఏళ్లలో ఇంతవరకు ఏ ప్రధాని, ముఖ్యమంత్రి చేయని విధంగా వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మేలు చేస్తున్నారని అన్నారు. ఈ ఆత్మగౌరవ భవనాలను తమ కులం ప్రతిష్టను ఇనుమడించేలా, సంస్కృతి వెళ్లి విరిసేలా డిజైన్లు చేసి నిర్మించుకునే ఆవకాశం వారికే ఇచ్చారన్నారు. ఆత్మగౌరవ భవనాల్లో దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి వసతి, తమ సంస్కృతిని చాటేలా కమ్యూనిటీ హాళ్లు, పిల్లల చదువు కోసం లైబ్రరీలు, రిక్రియేషన్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆత్మగౌరవ భవనాలకు రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు. తెలంగాణ రావడంతోనే వెనుకబడిన కులాల్లో పెద్ద మార్పు వచ్చిందన్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ..వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. కుల వృత్తులకు చేయూత ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ దోపిడీ చేస్తుందని, బీజేపీ మతం మత్తులో ముంచుతుందని విమర్శిస్తూ కేవలం బీఆర్ఎస్ మాత్రమే అభివృద్ధి చేస్తుందని అన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కుల వ్యవస్థపై జోతిబాపూలే అద్భుత పరిశోధన చేసి మనమంతా ఒక్కటే అని, కేవలం వృత్తిపరంగా కులాలకింద విభజితులైనట్లు చెప్పారని పేర్కొన్నారు. అయితే అందరినీ కలపడానికి పూలే పడ్డ ఆవేదన నేడు కేసీఆర్‌లో కనబడుతోందన్నారు. సమూహంగా ఎదగడానికి ఈ భవనాలు దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, ఎమ్మెల్యే ముఠాగోపాల్, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరి శంకర్, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఉప్పల్ తహసీల్దార్ గౌతం కుమార్, బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
బీసీ సంక్షేమానికి రూ. 2 వేల కోట్లేనా?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర వార్షిక బడ్జెట్.. బీసీలను తీవ్రంగా అవమానపరిచిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ భవన్లో ఆదివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాభాలో 56% ఉన్న బీసీల సంక్షేమానికి కేవలం రూ.2వేల కోట్లు కేటాయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బీసీల సంక్షేమానికి కేంద్రం ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని, రూ.45వేల కోట్లతో రూపొందించిన బడ్జెట్లో బీసీలకు కనీసం 0.1 శాతం కూడా కేటాయించలేదన్నారు. బడ్జెట్ సవరణ చేపట్టి బీసీలకు కనీసం రూ.2లక్షల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్నట్లు బీసీలకు కూడా ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు అమలు చేయాలని కోరారు. 80శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇచ్చి బీసీ వసతిగృహాలను కేంద్రమే నిర్మించాలని, రూ.50 వేల కోట్లతో జాతీయ బీసీ కార్పొరేషన్ ద్వారా 80శాతం బీసీ విద్యార్థులకు విద్యారుణాలు ఇవ్వాలని కోరారు. -
కేంద్ర బడ్జెట్లో బీసీలకు రూ. లక్ష కోట్లు కేటాయించాలి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: కేంద్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ. లక్ష కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని కోరుతూ ప్రధాన మంత్రికి మెయిల్ ద్వారా లేఖను పంపినట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కులో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... బీసీలకు ప్రత్యేక మంతృత్వ శాఖ లేకపోవడం బాధాకరమన్నారు. 2021–22 బడ్జెట్ మొత్తం రూ. 39 లక్షల కోట్లు ఉండగా బీసీలకు కేవలం రూ. 2015 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల వ్యతిరేక వైఖరిని మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా బీసీ గురుకుల పాఠశాలలతో పాటు ఐఐటీ, ఎన్ఐటీ తదితర కేంద్ర విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్‌చారి, బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు విక్రమ్‌గౌడ్, యువజన సంఘం అధ్యక్షుడు కనకాల శ్యామ్‌కురుమ, వర్కింగ్ ప్రెసిడెంట్ బైరి రవికృష్ణ, రాష్ట్ర నాయకుడు రాపర్తి సంతోష్‌గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రాజేష్ పాల్గొన్నారు. -
పేదరికం బీసీలకు పెద్ద శాపం
అమీర్‌పేట: పేదరికం బీసీలకు పెద్ద శాపమని, బీసీల్లో చాలా మంది చదువుకోలేక పోతున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరెపల్లి నంద ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సమాజ్ ఆధ్వర్యంలో అమీర్‌పేటలో మంగళవారం నిర్వహించిన ‘బీసీ ఉమెన్ సింపోజియం’లో జస్టిస్ నంద మాట్లాడారు. పనిలో ఇచ్చే వేతనం మహిళలకు తక్కువగా ఉంటుందని, ఉద్యోగాలు, ప్రమోషన్లలో సైతం వివక్ష చూపిస్తున్నారని అన్నారు. మహిళలకు చదువు చెప్పిస్తే సమాజం అభివృద్ధి చెందుతుందని.. ఇంట్లో అమ్మ చదువుకుంటే అందరూ చదువుకున్నట్లేనని పేర్కొన్నారు. విద్య అన్నిటికంటే ముఖ్యం కాగా రెండో ముఖ్యమైన రంగం రాజకీయమన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాజకీయ సాధికారతకు నిదర్శనమన్నారు. కూతురే కావాలంటున్నారు: ఈటల కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ .. ఇప్పుడు ట్రెండ్ మారింది. అబ్బాయి వద్దు.. అమ్మాయి కావాలని చాలా మంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారని చెప్పారు. ఏ తల్లి కుటుంబాన్ని పట్టించుకుంటుందో ఆ కుటుంబమే బాగుపడుతుందన్నారు. దేశంలో వ్యవసాయం ఇంకా ఉందంటే అది మహిళల శ్రమవల్లేనని అన్నారు. జ్ఞానం, సంస్కారం కులాన్ని బట్టి రావనీ, చైతన్యానికి, ఐక్యతకు, పోరాటానికి కులం లేదని చెప్పారు. కార్యక్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. -
జనాభా ప్రాతిపాదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి: విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో శుక్రవారం ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. దశాబ్దాలుగా తీవ్ర అన్యాయానికి గురైన వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపదికపై విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, చట్ట సభలు, న్యాయ వ్యవస్థల్లో రిజర్వేషన్ కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేయడమే వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దినట్లు అవుతుందని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 75వ సంవత్సరం ఇది. ఈ 75 ఏళ్ళలో దేశం పలు రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. కానీ వెనుకబడిన తరగతుల అభ్యున్నతి విషయంలో మాత్రం స్వతంత్ర భారతావని విఫలమైందన్న విషయం కఠోర వాస్తవం అని విజయసాయి రెడ్డి అన్నారు. అన్ని రంగాలలో తమకు సమాన అవకాశాలు ఉండాలన్న వెనుకబడిన తరగతుల ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష మాత్రం ఈనాటికీ నెరవేరలేదని అన్నారు. దేశంలో షెడ్యూల్డు కులాలు, తెగల జనాభాను లెక్కించి జనాభా ప్రాతిపదికపై వారికి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. కానీ వెనుకబడిన కులాలను అన్యాయంగా కుల గణన నుంచి విస్మరించి జనాభా ప్రాతిపదికపై వారికి రిజర్వేషన్ కల్పించలేకపోయాం. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలో వారికి న్యాయంగా దక్కవలసిన రిజర్వేషన్ దక్కలేదని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. దేశ జనాభాలో వెనుకబడిన తరగతులు ప్రజలు 50 శాతానికి పైగా ఉన్నప్పటికీ వారికి రిజర్వేషన్ 27 శాతానికే పరిమితమైంది. రిజర్వేషన్ సీలింగ్ 50 శాతం మించి ఉండొచ్చు. ఈ సీలింగ్‌ను సవరించడం రాజ్యాంగ మౌలిక సూత్రాల ఉల్లంఘన ఏమాత్రం కాబోదు అంటూ ఇటీవల దేశ అత్యున్నత న్యాయ స్థానం కూడా అభిప్రాయపడిందని విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ నేపధ్యంలో వెనుకబడిన తరగతులకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించడంలో ప్రభుత్వానికి న్యాయపరమైన అవరోధాలు కూడా ఏమీ ఉండబోవు. కాబట్టి బీసీలకు విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగం, చట్ట సభలు, న్యాయ వ్యవస్థలో వారి జనాభాకు తగినట్లుగా రిజర్వేషన్ కల్పించేందుకు అవసరమైన అని చర్యలు చేపట్టవలసిందిగా విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
కుప్పం టీడీపీ కోట కూలడానికి కారణం ఇదేనా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు?
సాక్షి, అమరావతి: వెనుకబడిన వర్గాల(బీసీల)ను సమాజానికి వెన్నెముకలా తీర్చిదిద్దడమే వైఎస్సార్సీపీ లక్ష్యం’ అని 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో చెప్పిన మాటలను ఈ మూడున్నరేళ్లలో సీఎం వైఎస్ జగన్ ఆచరించి చూపారు. ఈ వర్గాల పిల్లల ఉన్నత చదువులకు అండగా నిలిచారు. వారి కుటుంబాలు పేదరికం నుంచి బయట పడేందుకు వినూత్న మార్గాల్లో కృషి చేశారు. ఫలితంగా బీసీలు అన్ని రంగాల్లో ప్రగతిపథం దిశగా వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు. చదవండి: 'నేనున్నాను'.. మీకేం కాదు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూత, రాజ్యాధికారంలో సింహ భాగం వాటా.. విద్యా దీవెన, వసతి దీవెనలతో ఉన్నత విద్యా వంతులుగా తీర్చిదిద్దడం ద్వారా వెనుకబడిన వర్గాల ప్రజల(బీసీ)ను సమాజానికి వెన్నెముకగా మార్చే దిశగా మూడున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారని సామాజిక వేత్తలు ప్రశంసిస్తున్నారు. దేశంలో సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు సైతం ఇవ్వని రీతిలో సీఎం వైఎస్ జగన్ రాజ్యాధికారంలో బీసీ వర్గాలకు సింహభాగం వాటా ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో మూడున్నరేళ్లలో రూ.1,77,585.51 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేస్తే.. ఇందులో బీసీ వర్గాలకు చెందిన ప్రజలకు మాత్రమే రూ.85,915.06 కోట్లు ఇచ్చారని ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టి అమ్మ ఒడి, విద్యా కానుక ఇచ్చి పిల్లలను బడులకు పంపేలా చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఈ చర్యలన్నీ బీసీలను సమాజానికి వెన్నెముకగా మార్చడానికి బాటలు వేస్తాయని స్పష్టం చేస్తున్నారు. చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు ♦దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్ చేసేలా సీఎం వైఎస్ జగన్ ఏకంగా చట్టం తెచ్చారు. ♦రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. ♦వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 బీసీలకు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 పదవులు బీసీలకు (42 శాతం) ఇచ్చారు. పరిపాలనలో భాగస్వామ్యం సింహభాగం 1. ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో వైఎస్సార్సీపీ బీసీ గర్జన నిర్వహించింది. ఈ సమావేశంలో తాము అధికారంలోకి వస్తే బీసీ వర్గాలకు చేసే మేలుపై బీసీ డిక్లరేషన్ రూపంలో వైఎస్ జగన్ విడుదల చేశారు. అధికారంలోకి వచ్చాక బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా ఆ వర్గాలకు ప్రయోజనం చేకూర్చారు. 2. 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు.. 22 లోక్‌సభ స్థానాలతో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాన్ని సాధించింది. 2019 మే 30న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 11న పునర్ వ్యవస్థీకరించారు. 25 మంది సభ్యులు ఉన్న మంత్రివర్గంలో ఏకంగా పది మంది బీసీలకు స్థానం కల్పించారు. ఆ వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడును డిప్యూటీ సీఎంగా నియమించారు. విద్య, రెవెన్యూ, పౌర సరఫరాలు, వైద్యారోగ్యం వంటి కీలక శాఖలను ఆ వర్గాల వారికే అప్పగించారు. 3. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంను నియమించారు. శాసనమండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది సభ్యులు ఉంటే అందులో సింహభాగం బీసీలే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనిమిది రాజ్యసభ స్థానాలకు గాను, నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారు. 4. స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడంపై చంద్రబాబు టీడీపీ నేతలను హైకోర్టును ఆశ్రయించేలా పురిగొల్పారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీసీలకు రిజర్వేషన్ 24 శాతానికి తగ్గిపోయింది. రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన సీఎం.. దాన్ని ఆచరించి చూపి, పదవులు ఇచ్చారు. 5. పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే, అందులో తొమ్మిది జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. ఇందులో సింహభాగం బీసీలకే అవకాశం కల్పించారు. 6. మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకు గాను వైఎస్సార్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకుంది. ఇందులో 67 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చారు. ఇందులో కూడా గరిష్టంగా బీసీలకే పదవులు దక్కాయి. 7. 13 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తే.. ఏడు చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. ఇందులో బీసీలకు సింహభాగం ఇచ్చారు. 8. 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకుంటే.. వాటి చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73 శాతం ఇచ్చారు. ఇందులో బీసీలకు అధిక భాగం పదవులు ఇచ్చారు. వైఎస్సార్సీపీ వెంటే బీసీలు టీడీపీకి బీసీలే వెన్నెముక.. బీసీలు లేనిదే టీడీపీ లేదంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఆ వర్గాల వారి ఓట్లతో అధికారంలోకి వచ్చాక బీసీలకే వెన్నుపోటు పొడిచారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రివర్గంలో కేవలం బీసీ వర్గాల నుంచి ఆరుగురికే అవకాశం కల్పించారు. అదే సమయంలో 11 మంది ఓసీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. 2014–19 మధ్య రాజ్యసభకు ఒక్క బీసీని కూడా చంద్రబాబు పంపలేదు. తమ హక్కులను పరిరక్షించాలని అడిగిన నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తరిస్తానని.. తమ సమస్యలు పరిష్కరించాలని అర్థించిన మత్స్యకారులను తాట తీస్తానంటూ బెదిరించారు. తమ ఓట్లతో అధికారంలోకి వచ్చి.. అడుగడుగునా తమ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసిన చంద్రబాబుపై బీసీలు ఆగ్రహంతో ఉన్నారని ఆ వర్గాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభలో ప్రైవేటు బిల్లును వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టడం.. అధికారంలోకి వచ్చాక బీసీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తుండటంతో ఆ వర్గాల ప్రజలు వైఎస్సార్సీపీ వెంటే నడుస్తున్నారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. దీనికి నిదర్శనమే పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్.. తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాలు సాధించడమని చెబుతున్నారు. బీసీల జనాభా అధికంగా ఉన్న కుప్పం కోట కూలడానికి సైతం ఇదే కారణమని విశ్లేషిస్తున్నారు. -
బీసీలు పోరుబాట పట్టాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య
కీసర: రాజ్యాధికారం కోసం బీసీలు పోరుబాట పట్టాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. కీసర మండలంలోని రాంపల్లి పూలపల్లి బాలయ్య ఫంక్షన్హాల్లో మంగళవారం జరిగిన కురుమల రాష్ట్ర స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ ఉమతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడే రాజకీయాల్లో బీసీలకు ప్రాముఖ్యత పెరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యం నేడు ధనస్వామ్యంగా మారిందని, ఎన్నికల్లో ధనమే కీలకమైందని తెలిపారు. బీసీలు విద్యావంతులు కావాలంటే.. బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. కార్యక్రమంలో కురుమ యువజన నాయకుడు శ్రీకాంత్, ఆలేరు కాంగ్రెస్ ఇన్చార్జ్ బీర్ల అయిలయ్య, కార్పొరేటర్ కృష్ణ పాల్గొన్నారు. -
బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ పెద్దపీట: మంత్రి చెల్లుబోయిన
-
బీసీలకు పదవులు రాకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు: మంత్రి కారుమూరి
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు జీవితంలో ఏనాడైన బీసీలకు న్యాయం చేశారా?. బీసీల తోకలు కట్ చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు. బీసీ న్యాయమూర్తులకు పదవులు రాకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు ఎవరినైనా బీసీని రాజ్యసభకు పంపించావా అని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. విశాఖలో మంత్రి కారుమూరి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీఠ వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఎంతమంది బీసీలు రాజ్యసభకు వెళ్లారో ప్రజలకు తెలుసు. మంత్రి వర్గంలోని 25 మందిలో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు మంత్రులుగా ఉన్నారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా బీసీలకు ప్రాధాన్యత ఉందా అని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ అంటే వైఎస్ గుర్తుకు వస్తారు. అందుకే హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ పేరు పెట్టాము. తణుకులో బీసీ కమ్యూనిటీ హాలుకు జ్యోతి రావు పూలే పేరు పెడితే టీడీపీ హయాంలో ఆ పేరు మార్చి ఎన్టీఆర్ పేరు పెట్టారు. వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు వైఎస్ కృషి చేశారు. అందుకే ఆయన పేరు పెట్టాలని ఎక్కువ మంది కోరారు’ అని స్పష్టం చేశారు. -
బీసీల ఆత్మగౌరవాన్ని పెంచిన సీఎం: మంత్రి గంగుల
ఉప్పల్ (హైదరాబాద్): తెలంగాణలో బీసీల ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉప్పల్ బగాయత్‌లో శనివారం సోమవంశ సహస్రార్జున క్షత్రియ కులసంఘం ఆత్మ గౌరవ భవనం భూమి పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ 41 కుల సంఘాలకు రూ.95.25 కోట్ల విలువ గల 82.3 ఎకరాల స్థలాన్ని కేటాయించిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. దీంతో పాటు 25 కుల సంఘాలకు ఆత్మగౌరవ భవన నిర్మాణాలు చేస్తున్నట్లు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిపోయిన బలహీన వర్గాలను అక్కున చేర్చుకున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని ప్రశంసించారు. 19 నుంచి 281 అత్యున్నత స్థాయి బీసీ గురుకులాలు, 791 బీసీ హస్టళ్లు, కల్యాణలక్ష్మి అందజేసి అందరికీ మేనమామగా గుర్తింపు పొందారన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతోందని తెలిపారు. క్షత్రియ సమాజ ప్రతినిధులు మంత్రిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్షత్రియ సమాజ అధ్యక్షుడు విశ్వనాథ్, రవీందర్, శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, సుధాకర్, సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉద్రిక్తంగా మారిన బీసీల మహాధర్నా
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ బీసీల మహాధర్నాతో రెండోరోజు ఉద్రిక్తంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణల నేతృత్వంలో చేపట్టిన చలో పార్లమెంట్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో బీసీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. మహాధర్నాలో వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రసంగించారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర స్థాయిలో 54 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే, అందులో బీసీ ఉద్యోగులు 4.62 లక్షలు మాత్రమే ఉన్నారని తెలిపారు. దేశంలో బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలుగా వాడుకుంటున్నాయని ఆర్.కృష్ణయ్య విమర్శించారు. ప్రదర్శనలో కోల జనార్ధన్, కర్రి వేణు మాధవ్, కృష్ణ యాదవ్ పాల్గొన్నారు. -
75కోట్ల మంది బీసీలకు కేంద్రంలో మంత్రిత్వశాఖ లేకపోవడం అన్యాయం: ఎంపీ ఆర్. కృష్ణయ్య
-
AP: ఎస్ఎల్బీసీ నివేదిక.. వారికి భారీగా రుణాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివిధ పథకాల ద్వారా బడుగు, బలహీన వర్గాలకు విరివిగా రుణాలు అందుతున్నట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) తాజా నివేదిక వెల్లడించింది. గత మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకు రుణాల్లో 80.97 శాతం వృద్ధి నమోదు కాగా బీసీలకు ఇచ్చిన రుణాల్లో 39.61 శాతం వృద్ధి నమోదైంది. చదవండి: ‘ఈనాడు’కు ఇదెక్కడి పైత్యం? 2019–20లో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన రుణాల మొత్తం రూ.15,791 కోట్లు ఉండగా 2021–22 నాటికి రూ.28,577 కోట్లకు పెరిగింది. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన రుణాల్లో 2019–20లో ఏడు శాతం వృద్ధి నమోదైతే తర్వాత రెండేళ్లు వరుసగా 18 శాతం, 53 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. అంతేకాకుండా గత మూడేళ్లల్లో బీసీ వర్గాలకు రుణాలు రూ.90,624 కోట్ల నుంచి రూ.1,26,528 కోట్లకు చేరాయి. కోవిడ్ సమయంలో బడుగు, బలహీన వర్గాలను ఆదుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా పెద్దఎత్తున రుణాలను మంజూరు చేయడంతో భారీ వృద్ధి నమోదైనట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సంక్షేమ పథకాలతో చేయూత వైఎస్సార్ బడుగు వికాసం, స్వయం సహాయక సంఘాలు, జగనన్న తోడు, పీఎం ముద్ర, పీఎం స్వనిధి, స్టాండప్ ఇండియా తదితర పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు భారీగా రుణాలు మంజూరయ్యాయి. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారాలు చేసుకునే వారికి రెండు దశల్లో 9.05 లక్షల మందికి రుణాలను మంజూరు చేయగా ఈ ఏడాది మూడో దశలో 9 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అందులో ఇప్పటికే 5.10 లక్షల మందికి మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాలకు వడ్డీ చెల్లింపుల కింద ఇప్పటికే రూ.32.51 కోట్లు బ్యాంకులకు చెల్లించడంతో 7.06 లక్షల మంది లబ్థిదారులకు ప్రయోజనం చేకూరింది. -
ఏక సంఘం ఏర్పాటుకు వారమే
సాక్షి, హైదరాబాద్: ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి ఏక సంఘంగా ఏర్పడిన బీసీ కులాలకు నిర్మాణ అనుమతులు జారీచేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. శుక్రవారం మంత్రి కమలాకర్ తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 18 కులాలు ఏ కులానికి ఆ కులం ఏక సంఘంగా ఏర్పడి బీసీ సంక్షేమ శాఖను సంప్రదించాయని, వాటికి ఆయా కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పనుల నిమిత్తం అనుమతి ప్రతాలు జారీ చేశామని, అతి త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. మిగతా కులాలు కూడా ఏక సంఘంగా ఏర్పడాలని, ఇందుకు ఈ నెల 14వ తేదీ వరకు గడువు విధిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. గడువులోగా ఏకసంఘంగా ఏర్పడకుంటే ఆయా కులాల ఆత్మగౌరవ భవనాలను ప్రభుత్వమే పూర్తి చేస్తుందన్నారు. బీసీ కులాల కోసం రాష్ట్ర రాజధాని నడిబొడ్డున రూ.వేల కోట్ల విలువైన స్థలాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించారని, బీసీల ఆత్మగౌరవం ఇనుమడించేలా వీటి నిర్మాణాలు చేపట్టడం కోసం 82 ఎకరాలు, రూ.96 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అనంతరం బీసీ స్టడీ సర్కిల్ నిర్వహణపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించబోయే 80,039 ఉద్యోగాల భర్తీలో బీసీ స్టడీ సర్కిళ్లు నిరుద్యోగులకు అత్యుత్తమ శిక్షణ ఇస్తాయని, ఇప్పటికే గ్రూప్–1 కోచింగ్ ప్రారంభమైందన్నారు. ఎస్సై, కానిస్టేబుల్ కోచింగ్ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. -
70 మంది బీసీలను అసెంబ్లీకి పంపడమే లక్ష్యం: ఆర్ఎస్పీ
వేంసూరు: వచ్చే ఎన్నికల్లో 70 మంది బీసీలను ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి పంపడమే బీఎస్పీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర గురువారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఖమ్మం జిల్లా వేంసూరు, సత్తుపల్లి మండలాల్లో కొనసాగిన యాత్రలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ... వడ్డించేవాడు బహుజనుడైతేనే అందరి ఆకలి తీరు తుందన్నారు. అందుకు వచ్చే ఎన్నికల్లో 70 మంది బీసీ ప్రతినిధులను అసెంబ్లీకి పంపించేందుకు ప్రతి బహుజన బిడ్డ పనిచేయా లని కోరారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నేడు నాలుగు లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు. పనికి రాని పథకాలతో ప్రజలను మోసం చేస్తున్నారని, పేదలకు ఉచిత విద్య, వైద్యం అంది స్తే ఉచిత పథకాలతో పనేమిటని ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించా రు. దళితబంధు పథకంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులకే లబ్ధి జరిగేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల హక్కుల కోసం కాపలాగా ఉంటానని ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. -
బీసీల ప్రాతినిధ్యానికి రాజ్యాంగ సవరణ చేయాలి
హస్తినాపురం: చట్ట సభల్లో వెనుకబడిన తరగతులకు 52 శాతం ప్రాతినిధ్యం కోసం రాజ్యాంగ సవరణ చేసి ప్రజాస్వామ్యానికి, సోషలిజానికి పునాదులు వేయాల్సిన అవసరం ఉందని ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. అంతర్జాతీయ ఆలోచన దినోత్సవం సందర్భంగా బీసీ కులాల వారీగా చట్ట సభలలో ప్రాతినిథ్యం కోసం మంగళవారం హస్తినాపురం చౌరస్తానిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఒకరోజు నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం అమలు కావాలంటే శ్రమజీవులు పాలకులు కావాల్సిన అవసరం ఉందని, ఢిల్లీ, తమిళనాడు తరహా ప్రత్యామ్నాయం చూపే నాయకత్వం అవసరం అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు వేల్పూరి కామేశ్వరరావు మాట్లాడుతూ.. 70 సంవత్సరాలు దేశాన్ని పాలించిన అగ్రవర్ణాలు బీసీలకు ఏమాత్రం ప్రాతినిథ్యం కలి్పంచలేదన్నారు. ఈ కార్యక్రమంలో రుక్మోద్దీన్, చెన్నోజు శ్రీనివాసులు, బర్మాల సత్యనారాయణ, పాండురంగం, జి.రాజు, వలిజాల యాదయ్య పాల్గొన్నారు. -
బీసీలు,మైనార్టీల అభివృద్ధిపై మాట్లాడే అర్హత బాబుకు లేదు
-
హుజూరాబాద్ బీసీలకే!.. అధిష్టానం సంకేతాలు
►హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2.26 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ►ఇందులో బీసీలు 1.03 లక్షలు, ఓసీ ఓటర్లు 43 వేలు, ఎస్సీ ఓటర్లు 51 వేలు, ఇతర కులాలవారు మరో 33,500, ఎస్టీ ఓటర్లు 4 వేలకుపైగా, మైనార్టీ ఓటర్లు 9 వేల మంది ఉన్నారు. సాక్షి, ప్రతినిధి, వరంగల్: ఉప ఎన్నిక జరగనున్న హుజూరాబాద్ అభ్యర్థి ఎంపికపై అధికార టీఆర్ఎస్ పార్టీ భారీ కసరత్తు చేస్తోంది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అత్యధిక ఓటుబ్యాంకు కలిగిన సామాజికవర్గాలను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా, తాజాగా దళితబంధును తెరపైకి తెచ్చింది. తన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ నేత, మాజీమంత్రి ఈటల రాజేందర్ ప్రజాదీవెన పాదయాత్రలో బీసీ నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ సైతం బీసీ అభ్యర్థినే బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇంటెలిజెన్స్ నివేదికలు, సర్వేల ద్వారా ప్రజలనాడిని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, కేడర్‌కు సంకేతాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలే ప్రామాణికం ఈటల రాజీనామా తర్వాత ఉప ఎన్నికలు ఖాయమని తేలడంతో పలువురు టీఆర్ఎస్ నేతలు ఆ పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు సాగించారు. నిన్న మొన్నటిదాకా పాడి కౌశిక్‌రెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది. ఆ తర్వాత ముద్దసాని పురుషోత్తంరెడ్డి, పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీ కాంతరావు భార్య సరోజనమ్మ పేర్లు తెరపైకి వచ్చాయి. వరుసగా రెండు పర్యాయాలు హుజూరాబాద్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం గులాబీ కండువా కప్పుకోవడంతో ఆయన పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా బీసీ సామాజికవర్గాలకు హుజూరాబాద్ టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని పెద్దిరెడ్డి, కౌశిక్‌రెడ్డిలకు కూడా అధినేత స్పష్టం చేసినట్లు తెలిసింది. బీసీల ఓట్లపై ఫోకస్? హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో దాదాపు సగం మంది ఉన్న బీసీలపైనే టీఆర్ఎస్ ప్రధానంగా దృష్టి పెట్టింది. అత్యధిక జనాభా ఉన్న పద్మశాలి, ముదిరాజ్, మున్నూరుకాపు, గౌడ, యాదవ, ఇతర బీసీ కులాల ఓట్లు టీఆర్ఎస్కు పడేలా అధిష్టానం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ, తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ రావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బీసీ ఉద్యమాల నేపథ్యం ఉన్న కృష్ణమోహన్‌రావు గతంలో రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఈ ముగ్గురిలో ఒకరికి ఇస్తారా? లేక కొత్త బీసీ నేత పేరును తెరమీదకు తెస్తారా? అన్న చర్చ కూడా జరుగుతోంది. -
దేశ చరిత్రలోనే ఇది సువర్ణ అధ్యాయం..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక సమతుల్యతను పాటిస్తున్నారని, దేశ చరిత్రలోనే ఇది సువర్ణ అధ్యాయం అని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 50 శాతానికిపైగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామని తెలిపారు. సీఎం జగన్ పాలనను అన్నివర్గాలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. తమది బీసీల పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు వారిని మోసం చేశారన్నారు. చంద్రబాబు హయాంలో రాజ్యసభ స్థానాలన్నీ అగ్రవర్ణాలకే ఇచ్చారని.. ఐదేళ్లలో ఒక్క రాజ్యసభ స్థానం కూడా బీసీలకు ఇవ్వలేదని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు బీసీలు గుర్తుకురారని మండిపడ్డారు. ‘‘మైలవరంలో అలజడి సృష్టించేందుకు దేవినేని ఉమ ప్రయత్నించారు. కుట్రలో భాగంగానే వివిధ వర్గాలను రెచ్చగొట్టారు. ఉమ అనుచరుల చేతిలో గాయపడ్డవాళ్లే కేసులు పెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకే పోలీసులు కేసులు నమోదు చేశారని’’ పేర్నినాని అన్నారు. -
ప్రజల హక్కుగా సంక్షేమ పథకాలు: సజ్జల
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సంక్షేమ పథకాల్లో కనీసం 20 శాతం కూడా చంద్రబాబు అమలు చేయలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో దేవాంగ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబొయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అరాచక పాలనను ప్రజలు భరించలేక పోయారని, కులాలు, మతాలు, పార్టీలకతీతంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల హక్కుగా సీఎం జగన్ అందిస్తున్నారని తెలిపారు. ఇచ్చిన మాటకు మించి సీఎం జగన్ పని చేస్తున్నారన్నారు.. బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, వెనకబడిన వర్గాలను రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ కృష్టి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటకు మించి సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. బీసీలు బలహీన వర్గాలు కాదు.. సమాజానికి వెన్నెముకలు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, బీసీలు బలహీన వర్గాలు కాదని.. సమాజానికి వెన్నెముకగా పేర్కొన్నారు. బీసీలందరూ రాజకీయంగా, సామాజికంగా ఎదగాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష అని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఆ ఘనత సీఎం జగన్‌దే.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ, బలహీన వర్గాలను పార్లమెంట్‌కు పంపిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాష్ట్రంలో గొప్ప అవకాశాలను సీఎం జగన్ కల్పిస్తున్నారని జోగి రమేష్ అన్నారు. -
బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారు: సజ్జల
సాక్షి, అమరావతి: బీసీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన భట్ట రాజులు కులస్తుల రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్తగా నామినేటెడ్ పదవులకు ఎన్నికైన వారు సంక్షేమ పథకాలను కింద స్థాయి వరకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూశారని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్ బీసీలకు నిజమైన సాధికారత కల్పించారన్నారు. ప్రజాసంక్షేమం కోసం సీఎం జగన్ నిరంతరం శ్రమిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మధ్య విమోచన కమిటీ చైర్మన్ లక్ష్మణ రెడ్డి పాల్గొన్నారు. -
రెండో విడత గొర్రెల పంపిణీకి రూ.6 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ అవిరామ కృషితో రాష్ట్రంలో సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు వస్తున్నాయని.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇప్పటికే గొర్రెల పంపిణీ, చేపల పెంపకం వంటి పథకాలు అద్భుతాలను నమోదు చేశాయని చెప్పారు. మంగళవారం ప్రగతిభవన్‌లో ‘వృత్తి కులాలైన బీసీ వర్గాల అభ్యున్నతి– ప్రభుత్వ కార్యాచరణ– రెండో విడత గొర్రెల పంపిణీ’అంశాలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బీసీలను అన్నిరంగాల్లో ఆదుకోవడానికి ప్రణాళికలు రచించి, అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీసీల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. ‘‘ప్ర భుత్వ చర్యలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతోంది. కులవృ త్తులను మరింతగా ప్రోత్సహిస్తాం. ఒకనాడు బ్రా హ్మణులతో సమానంగా గౌరవం పొందిన పద్మ శాలి వర్గం సమైక్య పాలనలో ఆకలిచావులకు, ఆత్మహత్యలకు బలైపోయింది. ప్రభుత్వ చిత్తశుద్ధి, మంత్రి కేటీఆర్ కార్యదక్షతతో చేనేత వృత్తి సాధారణ స్థితికి చేరుకుంది. ప్రభుత్వం వారితోపాటు గౌడలు, నాయీ బ్రాహ్మ ణులు, రజక, ఇతర వృత్తికులాల అభ్యున్నతికి వినూత్న పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి పథాన నడిపిస్తున్నది’’అని పేర్కొన్నారు. గొర్రెల సంపత్తిలో నంబర్‌వన్ గొర్రెల సంపత్తిలో తెలంగాణ రాజస్థాన్‌ను అధిగమించి దేశంలో నంబర్ వన్ స్థానానికి చేరుకుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీకి నిధులు సమకూర్చాలని ఆర్థిక శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ‘‘రూ.5 వేలకోట్లతో చేపట్టిన మొదటి విడత గొర్రెల పంపిణీ అద్భుత ఫలితాలిచ్చింది. రెండో విడత పంపిణీ కోసం మరో రూ.6 వేల కోట్లను కేటాయిస్తున్నాం. ఇప్పుడు ఇస్తున్నట్టుగానే (ఒక యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు) పంపిణీ కొనసాగించాలి. యూనిట్ ధరను రూ.1.75 లక్షలకు పెంచుతున్నాం. ఇప్పటికే డీడీలు కట్టిన 14 వేల మందికీ ఈ పెంపును వర్తింపజేస్తాం’’అని తెలిపారు. మత్స్యశాఖ ద్వారానే చేపల పెంపకం సముద్రతీరానికి దూరంగా ఉన్న పట్టణాలు, నగరాలకు చేపలు ఎగుమతి చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ చెరువుల్లో చేపల ఉత్పత్తి మత్స్యశాఖ పర్యవేక్షణలోనే ఉంటుందని స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండి, అర్హులైన యువకులకు చేపల పెంపకాల సొసైటీల్లో అవకాశం కల్పించాలని ఆదేశించారు. రెండో విడతలో 3.81 లక్షల యూనిట్లు: మంత్రి తలసాని రెండో విడతలో భాగంగా 3.81 లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేస్తామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు రూ.6 వేల కోట్లు మంజూరు చేయడంపై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. లక్షలాది మంది గొల్లకుర్మలు కేసీఆర్‌కు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. త్వరలోనే గొర్రెల పంపిణీని పెద్ద ఎత్తున ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8,109 గొర్రెల పెంపకందారుల సొసైటీల్లోని 7,61,898 మందికి సబ్సిడీ గొర్రెలు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తలసాని తెలిపారు. మొదటివిడతలో రూ.4,702.78 కోట్లతో 3,76,223 యూనిట్లను పంపిణీ చేశామని.. వాటితో 1.37 కోట్ల గొర్రెపిల్లలు జన్మించాయని, గొల్లకుర్మలకు రూ.6,850 కోట్ల మేర ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ గొర్రెల యూనిట్ మొత్తాన్ని రూ.1.75 లక్షలకు పెంచారని.. ఈ మేరకు లబ్ధిదారులు తమ వాటాగా రూ.43,750 చొప్పున డీడీలు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. -
పంచాయతీ ఎన్నికల్లో.. బీసీలకు 34% రిజర్వేషన్లు
సాక్షి, అమరావతి: రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీచేశారు. 2011 జనగణన వివరాల ప్రకారం ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం రిజర్వేషన్లు కల్పించి, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రెండ్రోజుల క్రితం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్ణయించిందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలు, మండలాలు, గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్ ఖరారుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రిజర్వు స్థానాలు గుర్తించేది ఇలాగే.. ►రిజర్వేషన్ల ఖరారులో ఎస్సీ, ఎస్టీలకు 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం నిర్ణయిస్తారు. బీసీ రిజర్వేషన్లను ప్రస్తుతం ఆ కేటగిరికి చెందిన ఓటర్ల వివరాల ప్రకారం కేటాయింపులు జరుగుతాయని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు అంటున్నారు. ►జడ్పీ చైర్మన్, ఎంపీపీ, గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు రాష్ట్రం యూనిట్‌గా.. జడ్పీటీసీ రిజర్వేషన్లు జిల్లా యూనిట్‌గాను.. ఎంపీటీసీ రిజర్వేషన్లు మండల యూనిట్‌గానూ.. వార్డు సభ్యుల రిజర్వేషన్లు గ్రామ పంచాయతీ యూనిట్‌గా తీసుకుంటారు. యూనిట్‌గా అంటే ఆ ప్రాంత పరిధిలో 2011 నాటి జనాభా లెక్కలు లేదా ఓటర్ల వివరాల మేరకు జరుగుతుంది. ►మండల పరిషత్ అధ్యక్ష పదవులకు అయితే.. రాష్ట్రంలో 660 మండల పరిషత్‌లు ఉండగా, ఏ జిల్లాకు ఎన్ని మండలాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీల కింద కేటాయించాలన్నది పంచాయతీరాజ్ కమిషనర్ నిర్ణయించి, ఆయా జిల్లా కలెక్టర్లకు తెలియజేస్తారు. కలెక్టరు ఆ జిల్లాలో ఏ మండలం ఏ కేటగిరికి రిజర్వు చేసేది నిర్ణయిస్తారు. ►జడ్పీటీసీ పదవులకు అయితే.. ఆ జిల్లాలో ఉండే మొత్తం పదవులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన (ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6,77 శాతం, బీసీలకు 34 శాతం, మిగిలినవి జనరల్ కేటగిరి) మేరకు జిల్లా కలెక్టరే రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ►ఎంపీటీసీ పదవులకు అయితే.. జిల్లాలో ఉండే మొత్తం పదవులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు జిల్లా కలెక్టరు ఆ జిల్లాలో ఏ కేటగిరికి ఎన్ని పదువుల కేటాయించాలన్నది నిర్ణయిస్తే.. ఆర్డీవో స్థాయి అధికారి తమ పరిధిలో ఉన్న స్థానాలను ఏ కేటగిరికి ఎన్ని కేటాయించాలన్నది నిర్ణయిస్తారు. ►ఇక సర్పంచి పదవులను జిల్లాల వారీగా ఎన్ని కేటాయించాలన్నది పంచాయతీరాజ్ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయిస్తారు. ఆర్డీవో స్థాయి అధికారి తమ పరిధిలో ఏఏ పంచాయతీలను ఏఏ కేటగిరికి కేటాయించేది నిర్ణయిస్తారు. ►చివరిగా.. వార్డు సభ్యుల రిజర్వేషన్లను గ్రామాల వారీగా ఏ కేటగిరికి ఎన్ని కేటాయించేది ఆర్డీవో అధికారి నిర్ణయిస్తే.. వార్డుల వారీగా ఏ వార్డును ఏ కేటగిరికి కేటాయించేది ఎంపీడీవో నిర్ణయిస్తారు. -
‘విద్య పరమైన రిజర్వేషన్లకు జాతి గణన’
సాక్షి, అమరావతి: సమాజంలో నేటికీ జాతి వివక్ష కు గురవుతూ ఎంతో మంది అవమానాలు ఎదుర్కొంటున్నారని ఆల్ ఇండియా బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. దేశంలో పౌరులందరికీ సమానత్వం అందించాలని రాజ్యాంగంలో పేర్కొన్నారని, కానీ ఇప్పటికీ చాలా కులాలు వెనుకబడి ఉన్నాయని ఆయన ఆవేదన చెందారు. ఆల్ ఇండియా బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా హాజరైన జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. దేశంలో కుల వైషమ్యాలు పోవాలంటే మంచి విద్య విధానం అవసరమన్నారు. అందరూ మనుషులే.. కాని జాతి పేరుతో మనుషుల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య పరమైన రిజర్వేషన్ అమలు చేయాలంటే జాతి గణన చేయాల్సిందేని ఆయన స్పష్టం చేశారు. ‘దేశంలో జాతి గణన జరగాలి. కులాల పరంగా ఎంత మంది వెనుకబడ్డారు. ఎస్సీ వర్గీకరణ జరగాలని గతంలో నేను నివేదిక ఇచ్చాను. జాతి గణన జరగనందు వల్లే నేటికీ వర్గీకరణ జరగలేదు. ఆల్మన్ రాజు ను, వెంకటేశ్వరరావు లను బీసీ ఫెడరేషన్ ఎపి శాఖ బాధ్యతలు అప్పగించాను. బీసీలు ఉన్న హక్కులు, అధికారాలను సాధించుకోవాలి. భావి తరాలను దృష్టిలో ఉంచుకుని అందరూ పోరాడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తోంది. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం రెండు కమిషన్లు వేయడం శుభపరిణామం. బీసీ సంఘాలన్నీ అలాగే ఉంటూ.. మరోవైపు ఫెడరేషన్ తరపున పోరాటాలు చేసి లక్ష్యాన్ని సాధించుకోవాలి. కులవృత్తుల వారు ఎదగకుండా కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. అటువంటి వాటిని ఎదుర్కొని మన హక్కులు ఐక్యంగా సాధించుకోవాలి. నేడు ఎవరి కులాలను వారే చూసుకుంటున్నారు. అందుకే మాయావతికి చెందిన బీస్పీ దేశ వ్యాప్తంగా ఓటమి చెందుతోంది’ అని పేర్కొన్నారు. -
తుళ్లూరులో బరితెగించిన టీడీపీ నేతలు
-
కాంగ్రెస్‌తోనే బీసీలకు సామాజిక న్యాయం: కుంతియా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతోనే దేశంలో బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా వ్యాఖ్యానించారు. గురువారం గాంధీభవన్‌లో ఓబీసీ విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కుంతియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నిరంతరం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆలోచిస్తుందని చెప్పారు. బీసీ వర్గాలకు పార్టీ పదవుల్లో, ప్రభుత్వంలోనూ సమతూకం పాటిస్తూ సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ విజయం సాధించిన మూడు రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఓబీసీలకు పెద్ద పీట వేసిందని గుర్తుచేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే ఓబీసీలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా బలహీన వర్గాలు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం టీపీసీసీ ఓబీసీ చైర్మన్‌గా డా.కత్తి వెంకటస్వామి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో అన్ని జిల్లాల చైర్మన్లు ఓబీసీ విభాగం పక్షాన ప్రచారంలో ముందుండి కాంగ్రెస్‌ను గెలిపిస్తామని ప్రతినబూనారు. అనంతరం 17 పార్లమెంట్ స్థానాల్లో ఓబీసీ కో ఆర్డినేటర్లను నియమిస్తూ కత్తి వెంకటస్వామి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ సమన్వయ కర్త ప్రొఫెసర్ ప్రకాష్ సొనవానే, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ మేనిఫెస్టోలో బీసీల ఊసేది?
హైదరాబాద్: ‘కాంగ్రెస్ పార్టీ తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోలో బీసీల ప్రస్తావన ఏది? బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వాగ్దానం మేనిఫెస్టోలో ఎందుకు లేదు?’ అని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ధ్వజమెత్తారు. మంగళవారం ఇక్కడ బీసీ భవన్లో సంఘం ముఖ్యనాయకుల సమావేశం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి అన్నిపార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిస్తున్నాయి కానీ బీసీల రాజకీయ రిజర్వేషన్ల గురించి ఏ ఒక్క పార్టీ మాట్లాడటం లేదని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా ఇంకా ఈ దేశంలో బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంద న్నారు. ఇటీవల సీపీఐ. సీపీఎం, డీఎంకే, సమాజ్‌వాది, ఆర్జేడీ పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోల్లో నూ బీసీల ప్రస్తావన లేదన్నారు. బీసీ ప్రధాని ఉన్నా న్యాయం సున్నా? ప్రధాని నరేంద్ర మోదీ బీసీ అయినా, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎక్కడా స్పష్టమైన హామీ ఇవ్వలేదని విమర్శించారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రూ.2 లక్షల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు, పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ప్రధాన డిమాండ్లను నెరవేర్చలేదని ఆరోపించారు. త్వరలో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పర్యటించి బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు నీల వెంకటేశ్, సి.రాజేందర్ తదితరులు పాల్గోన్నారు. -
మోసగించిన పార్టీలకు గుణపాఠం
హైదరాబాద్: ఎన్నికల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించకుండా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ఆలిండియా బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య మండిపడ్డారు. మోసం చేస్తున్న పార్టీలకు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికలతో సంబంధం లేకుండా బీసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి బీసీ ఉద్యమించాలని కోరారు. దోమలగూడలోని బీసీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయపార్టీలు ప్రజాసంక్షేమం కోసం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా బీసీలకు రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సిందేనన్నారు. ఏపీలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బీసీలకు చాలా వరకు న్యాయం చేశారని, 41 ఎమ్మెల్యే, 7 ఎంపీ సీట్లు కేటాయించారని గుర్తుచేశారు. పార్లమెంటు స్థానాల్లో బీసీ అభ్యర్థి ఉన్నచోట ఆయనకే మద్దతు ఇచ్చి గెలిపించా లని, బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించిన పార్టీలకు ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, మంత్రివర్గంలో బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదని విమర్శించా రు. బీసీల ఆశీర్వాదం పేరిట రెండోసారి అధికారం లోకి వచ్చిన కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు శఠగోపం పెట్టారని బీసీ సం క్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ గురించి కేసీఆర్ కల్లబొల్లి మాటలు చెప్పారని, 1956 నుంచి రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రిత్వ శాఖను కనుమరుగు చేశారని అన్నారు. బీసీలకు 8 ఎంపీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు జనాబా దామా షా ప్రకారం రాజాకీయ ప్రాతినిధ్యం కల్పించక పోవ డం శోచనీయమని ఆలిండియా బీసీ ఫెడరేషన్ కో ఆర్డినేటర్ సాంబశివరావు అన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు విజయ్‌భాస్కర్, కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పేదలకు రుణాల్లోనూ మోసమే
సాక్షి, అమరావతి: పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులకు సబ్సిడీ రుణాలు ఇస్తామని భారీయెత్తున ప్రచారం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆయా వర్గాల వారిని నిలువునా మోసం చేసింది. సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదంటూ నెపాన్ని బ్యాంకులపైకి నెట్టి చేతులు దులుపుకుంది. దీంతో 14 లక్షల మందికి పైగా దరఖాస్తుదారులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మెగా రుణ మేళాలు నిర్వహించి సబ్సిడీతో రుణాలు ఇస్తామని ప్రచారం చేయడంతో సుమారు 15 లక్షల మంది ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 2015–16లో అరకొరగా రుణాలిచ్చిన ప్రభుత్వం అప్పటికి ఆ కార్యక్రమాన్ని ముగించేసింది. ఆ తర్వాత 2016–17, 2017–18, 2018–19 మూడు సంవత్సరాల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా రుణాలివ్వకుండా ఎగనామం పెట్టింది. దరఖాస్తుదారులైన పేదలు, నిరుద్యోగులు తమకు సబ్సిడీ రుణాలు ఎప్పుడిస్తారంటూ ఎక్కడికక్కడ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను, నేతలను నిలదీస్తుండటం, ఈలోగా ఎన్నికలు సమీపించడంతో గత జనవరిలో రుణ మేళాల నిర్వహణకు ప్రభుత్వం పూనుకుంది. ప్రచారార్భాటానికి రూ.4 కోట్ల వ్యయం రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో సభలు ఏర్పాటు చేసి స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి ఆర్భాటంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఇక ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమానికైతే మహిళలు, దళితులు, మైనార్టీలను భారీ స్థాయిలో బస్సులు, ఇతర వాహనాలు పెట్టి మరీ తరలించారు. ఇందుకోసం కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. నాలుగు మెగా రుణమేళాలకు నాలుగు కోట్లు ఖర్చయ్యాయి. ఎంతో ఆశతో ఆయా సభలకు వెళ్లిన దరఖాస్తుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నామమాత్రంగా కొంతమందికి మాత్రమే రుణాలు పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. మొదటి రుణ మేళాలో 26,598 మందికి రుణాలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక రెండో మేళాలో 3,419 మందికి, మూడో మేళాలో 2,965 మందికి, నాలుగో మేళాలో 2,896 మందికి మాత్రమే రుణాలు ఇచ్చారు. అంటే 15 లక్షల మంది దరఖాస్తుదారులకు గాను నాలుగు మేళాల్లో కలిపి 35,878 మందికి మాత్రమే రుణాలు పంపిణీ చేశారన్నమాట. నాలుగు రుణమేళాల్లో కలిపి నాలుగు లక్షల మందికి సుమారు రూ.2,000 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం పంపిణీ చేసింది కేవలం రూ.253.49 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక ఇచ్చిన వారికన్నా ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేసిందా అంటే అదీ లేదు. బ్యాంకులకు సబ్సిడీని విడుదల చేయడంలో కార్పొరేషన్లు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయనే విమర్శలున్నాయి. బీసీ, ఎస్సీ కార్పొరేషన్లు సగం మందికి కూడా సబ్సిడీలు విడుదల చేయలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. యూనిట్లు అందని వారు, సబ్సిడీ అందని వారు 30 శాతం వరకు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. -
బీసీల రాజకీయ సమాధికి కుట్ర
యాదగిరిగుట్ట (ఆలేరు) : తెలంగాణలో బీసీలను రాజకీయ సమాధి చేసేందుకు కుట్ర జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. యాదగిరిగుట్టలో మంగళవారం సా యంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 56శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను తగ్గించడమే ఇందుకు నిద్శనమన్నారు. బీసీ కులాల ఆశీర్వాద సభలు పెట్టి బీసీల ఓట్లతో కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. బీసీ ఓట్లతో గెలిచిన సీఎం కేసీఆర్.. ఆ బీసీ కులాలకే అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మురళీధర్‌రావు, అనంతరామన్ కమిషన్ సిఫారసుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను 34శాతం పెట్టారన్నారు. సీఎం కేసీఆర్ మాత్రం 56శాతం సిలింగ్ అని చెప్పి 34శాతాన్ని 22శాతానికి తగ్గించడంతో సుమారు 2వేల మంది బీసీలు సర్పంచ్ల పదవులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 5శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి 6 మంత్రి పదవులు కేటాయించి.. 56శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. బీసీ రిజర్వేషన్ తగ్గించడాన్ని నిరసిస్తూ త్వరలోనే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు బీసీల ఆత్మగౌరవ పోరు గర్జన పేరుతో పాదయాత్ర చేస్తామన్నారు. ఈనెల 10వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాధూరి అచ్చయ్య, మైలార్‌గూడెం సర్పంచ్ కాధూరి రజిత శ్రీశైలం, నాయకులు మంత్రి రాజు, పేరపు రాములు, అక్కినపల్లి వెంకటరత్నం, యువజన సంఘం అధ్యక్షుడు మధు, మాటూరి అశోక్, చిరిగె శ్రీనివాస్, రేగు నర్సింహ, నల్లమాస శేఖర్, కాధూరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఆర్ కృష్ణయ్య
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భం గా సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బీసీలకు చట్టసభల్లో 14%, ఉద్యోగాల్లో 9%, వాణిజ్య రంగాల్లో ఒక్క శాతం మాత్రమే ప్రాతినిధ్యం ఉందని వివరించారు. అగ్రకులాల్లో 10% ఉన్న పేదలకు 10 % రిజర్వేషన్లు కల్పించినట్టే బీసీలకు అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. -
‘అందువల్లే చంద్రబాబు బీసీలపై ప్రేమ చూపిస్తున్నారు’
సాక్షి, నెల్లూరు : ఎన్నికలు దగ్గరకు వస్తున్నందునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీలపై ప్రేమ చూపిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. సోమవారం బీసీల పట్ల టీడీపీ ప్రభుత్వ అణిచివేత వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బీసీల ర్యాలీ, కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, భాస్కర్ గౌడ్, రూప్‌కుమార్ యాదవ్, కాకాణి గోవర్థన్ రెడ్డి, నల్లపు రెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. బీసీలకు సబ్‌ప్లాన్ అని చెప్పి బాబు మోసం చేశారని ఆరోపించారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని చెప్పిన చంద్రబాబు లాంటి నేత ఎవరూ లేరన్నారు. నాయీ బ్రాహ్మణులను బాబు కించపరిచారు: కాకాణి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయీ బ్రాహ్మణులను కించపరిచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాలుగున్నరేళ్లుగా బీసీలను మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ఇచ్చిన హమీ మేరకు జీతాలు ఇవ్వాలని కోరారు. -
బీసీలకు 34 సీట్లు ఇవ్వాలి: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు అన్యాయం జరగకుండా వారికి సముచిత స్థానం కల్పించేలా ఈ ఎన్నికల్లో 34 స్థానాలు కేటాయిం చాలని పార్టీ అధిష్టానా న్ని కోరినట్లు ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు తెలిపారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 54 శాతం ఉన్న బీసీలకు కాంగ్రెస్ పార్టీ సహా, ప్రజాకూటమిలోని పార్టీలు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముందన్నారు. -
సగం సీట్లు ఇవ్వకుంటే ఓటమే: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీసీలకు సగం సీట్లు కేటాయించకుంటే ఆయా రాజకీయ పార్టీలను కచ్చితంగా ఓడించి తీరుతామని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. శుక్రవారం బీసీ భవన్లో జరిగిన వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో బీసీలకు తప్పనిసరిగా 60 సీట్లు కేటాయించాలని పార్టీలను డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కనీసం 20 సీట్లు కేటాయించకుండా తమను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థుల జాబితాలోనూ బీసీలకు ప్రాధాన్యత లభించలేదని మండిపడ్డారు. ఒకవేళ మహా కూటమిలోనూ బీసీలకు అన్యాయం జరిగితే ఓటమి తప్పదని పేర్కొన్నారు. బీసీల కోసం పార్టీ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నామని, ఇందుకు సంబంధించి త్వరలో వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. సమావేశంలో ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్ పాల్గొన్నారు. -
బీసీలకు అన్యాయం చేస్తున్నాయి: ఆర్. కృష్ణయ్య
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు 65 టికెట్లను కేటాయించాల ని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు టికెట్లు ఇవ్వకుండా అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. బీసీ సంఘం, 36 సంచార జాతుల సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం విద్యానగర్‌లోని బీసీ భవ న్లో జరిగిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడు తూ.. బీసీలను నిర్లక్ష్యం చేసినా, తక్కువ టికెట్లు కేటాయించినా ఆ పార్టీలను ఈ ఎన్నికల్లో ఓడిస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీ 105 టికెట్లు ప్రకటిస్తే, బీసీలకు 20 టికెట్లు ఇచ్చి చేతులు దులుపుకుం దని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ ప్రకటించబో యే టికెట్లలో బీసీ నాయకుల పేర్లు లేవనే వార్త లు వినిపిస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, 36 కులాల సంచార జాతుల సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు. -
బీసీలకు మూడో వంతు నామినేటెడ్ పోస్టులేవీ?
సాక్షి, అమరావతి: బీసీలకు 1/3 వంతు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించారని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. శుక్రవారం విజయవాడలోని ఐవీ ప్యాలెస్‌లో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ బీసీ కులాల అధ్యయన కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం జంగా విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ బాధలు పడుతున్నారన్నారు. ముఖ్యంగా బీసీలను టీడీపీ వాడుకుని వదిలేసిందని విమర్శించారు. చంద్రబాబు సర్కారు విద్యా విధానాన్ని సర్వనాశనం చేసిందన్నారు. సంక్షేమ హాస్టళ్లను మూసివేసిందని ధ్వజమెత్తారు. వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత చదువులు అభ్యసించే అవకాశం కల్పించారని, చంద్రబాబు సర్కారు ఈ పథకానికి తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, ఇప్పుడు నాలుగున్నరేళ్ల తర్వాత కేవలం లక్షన్నర మందికి రూ.వెయ్యి ఇస్తున్నారన్నారు. బీసీల్లో సంచార జాతులు దీనావస్థలో ఉన్నాయని, వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అధ్యయన కమిటీ దృష్టికి వచ్చిన సమస్యలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తరువాత తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి నివేదిక అందజేస్తామని తెలిపారు. మాజీ మంత్రి, అధ్యయన కమిటీ సభ్యులు నర్సేగౌడ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హామీ ప్రకారం ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేదవారికి సాయం చేస్తామని చెప్పారు. రిటైర్డ్ జడ్జి కృష్ణప్ప మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో బీసీలను మోసం చేసేందుకు చంద్రబాబు బీసీ అధ్యయన కమిటీ వేసినట్లు ఆరోపించారు. వైఎస్పార్ సీపీ బీసీ అధ్యయన కమిటీ సభ్యులు అవ్వారు ముసలయ్య మాట్లాడుతూ.. పార్టీలతో సంబంధం లేకుండా బీసీ కులాల వారు అధ్యయన కమిటీ వద్దకు వచ్చి సమస్యలు చెబుతున్నారన్నారు. వాటిపై అధ్యయనం చేసి నివేదిక ఇస్తామన్నారు. సమావేశంలో పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, వసంత కృష్ణప్రసాద్, సామినేని ఉదయభాను, జోగి రమేష్, రక్షణ నిధి, మహమ్మద్ ఇక్బాల్, చిమటా సాంబు, బొమ్మన శ్రీనివాస్, కర్నాటి ప్రభాకర్, దుర్గారావుగౌడ్, విజిత, మహబూబ్, మీసాల రంగన్న పాల్గొన్నారు. -
బీసీలకు రాజకీయ వాటా దక్కాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ‘వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం ఇప్పటివరకు ఎన్నో ఉద్యమాలు చేశాం. అందులో బీసీల వాటా కొంతమేర దక్కించుకున్నాం. అది పూర్తిస్థాయిలో పొందాలంటే రాజ్యాధికారం అవసరం. ఆ దిశగా సరికొత్త ఉద్యమాన్ని చేపడుతున్నాం. అదే బీసీ రాజకీయ సమితి (బీఆర్ఎస్)కి పునాది.’ అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్య క్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. జనాభా లో 56శాతం ఉన్న బీసీలకు కులానికి ఒకటి చొప్పున సీట్లు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ డిమాండ్ సాధనకు ప్రత్యేక రాజకీయ పార్టీ ఏర్పాటే లక్ష్యమని, కానీ ఎన్నికలు సమీపించిన తరుణంలో పార్టీ ఏర్పాటు సాధ్యం కానందున వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్ లో బీసీ రాజకీయ యుద్ధభేరి మోగిస్తామన్నారు. దీనికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జాజుల ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంలో మరింత నష్టం... తెలంగాణ ఏర్పాటైతే బీసీల అభివృద్ధి వేగవంతమవుతుందని భావించామనీ, ఉమ్మడి రాష్ట్రంలోనే బీసీల ప్రాతి నిధ్యం ఎక్కువ ఉం డగా... కొత్త రాష్ట్రంలో సగా నికి పడిపోయిందన్నారు. అప్పట్లో 24 మంది ఎమ్మెల్యేలుంటే ఇప్పుడు 19కి తగ్గిందన్నారు. ఎంపీలు ఐదుగురు ఉంటే 2కు పడిపోయిందన్నారు. ఇటీవల టీఆర్ఎస్ ప్రకటించిన జాబితాలో బీసీలకు 21 టికెట్లే ఇచ్చారన్నారు. 5శాతం జనాభా ఉన్న అగ్రకులాలకు మూడోవంతు సీట్లు కేటాయించడమంటే బీసీలను చిన్నచూపు చూసినట్లే అన్నారు. బీసీల రాజ్యాధికార సాధనకు బీఆర్ఎస్ను ఏర్పాటు చేస్తున్నామనీ త్వరలో ఇది రాజకీయ పార్టీగా మారుతుందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. చట్ట సభల్లో రిజర్వేషన్లు బీసీల హక్కు... బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలనేది తమ ప్రధాన డిమాండనీ, తద్వారా ప్రాతినిధ్యం పెరిగి బీసీలవాణి వినిపిస్తుందని జాజుల అన్నారు. ఉత్తర భారతదేశంలో బీసీల పార్టీల వల్ల అక్కడ ప్రాతినిధ్యం పెరిగిందన్నారు. కానీ దక్షిణ భారత దేశంలో సంఘాలకే పరిమితమైందన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు బీసీ రాజకీయ సమితిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్టీలు సీట్లివ్వని చోట బీఆర్ఎస్ తరపున పోటీ చేయిస్తామన్నారు. -
ప్రతి పార్లమెంటు పరిధిలో బీసీలకు 2 సీట్లు
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీ వర్గాలకు సముచిత రీతిలో టికెట్లు కేటా యించాలని టీపీసీసీ ఎన్నికల వ్యూహ, ప్రణాళిక కమి టీ సూచించింది. శుక్రవారం కమిటీ చైర్మన్ వి.హను మంతరావు అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగిన సమా వేశంలో ఇతర పార్టీలతో పొత్తుల పర్యవసానాలు, పార్టీకి నష్టం కలగకుండా తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలు, అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలపై చర్చ జరిగింది. సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, కమిటీ కన్వీనర్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సభ్యులు నగేశ్ ముదిరాజ్, ఎంఏ ఖాన్ తదితరులు హాజర య్యారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీసీలకు 2 సీట్లను కేటాయించేలా చర్యలు తీసుకోవా లని వీహెచ్ సూచించారు. అనంతరం కొత్తగా చేరేవారి కన్నా పార్టీలో ఉన్న వారికే ప్రాధాన్యమివ్వా లని, చేరికల సమయంలో టికెట్ల గురించి హామీ ఇచ్చి చేర్చుకోవద్దని పలువురు సభ్యులు కోరారు. పొత్తుల్లో భాగంగా వదులుకోవాల్సిన స్థానాల్లో ఉన్న పార్టీ నేతలను పిలిచి మాట్లాడాలని, అసంబద్ధ పొత్తు లను నివారించేందుకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకో వాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ ఇవ్వాలని సూచించింది. -
బీసీలు ఐక్యమైతేనే రాజ్యాధికారం
హైదరాబాద్: రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీ లు ఐక్యమైతేనే రాజ్యాధికారం సాధించవచ్చని పలువురు వక్తలు ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాధికార సాధనకు బీసీలందరినీ ఐక్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలకు టికెట్ల కేటాయింపులో అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని, అందుకోసం బీసీ అభ్యర్థులు లేకుండా గెలిచే అవకాశాలున్న చోట స్వతంత్రంగా పోటీచేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం, పలు బీసీ కులాలతో కలిసి మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రజా పార్టీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్, బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, ఉద్యమకారుడు సాంబశివరావు, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ఏఎల్ మల్లయ్య, బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణలు పాల్గొన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. దేశంలో 70 ఏళ్ల నుంచి అసమానతలు తొలగిపోవాలని ఎన్నో పోరాటాలు జరుగుతు న్నా అవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీల్లో ఐకమత్యం లేకపోవడం, సరైన నాయకుడు లేకపోవడంవల్లే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నామని అభిప్రాయపడ్డారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల్లో ఇప్పటివరకు అసెంబ్లీ మెట్లు ఎక్కని కులాలను గుర్తించి అన్ని పార్టీలు వారికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం గూర్చి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లానని, ప్రస్తుతం ఉన్న జనాభాకు అనుగుణంగా మరో 240 సీట్లు పెంచి బీసీలకు అవకాశం కలిగేలా చూడాలని కోరినట్లు తెలిపారు. అన్నిపార్టీలు బీసీల వర్గీకరణ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశా రు. ఎంబీసీ కులాలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, సామాజిక వేత్తలు, దుగ్యాల అశోక్, టీవీ రామనర్సయ్య, రిటైర్డ్ డీఐజీ నాగన్న, కోల శ్రీనివాస్, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు 65 స్థానాలు కేటాయిస్తాం: శివసేన
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 65 స్థానాలు కేటాయిస్తామని తెలం గాణ శివసేన పార్టీ ప్రకటించింది. ఈ మేరకు శివసేన రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి సుదర్శన్, కార్యదర్శి దొరిషి వీరేంద్ర శేఖర్, గౌటే గణేశ్ శనివారం బీసీ భవన్లో ఆర్.కృష్ణయ్యను కలిసి చర్చలు జరిపారు. అనంతరం సుదర్శన్ మాట్లాడుతూ.. చట్ట సభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కృష్ణయ్య పోరాటానికి శివసేన మద్దతు ఉంటుందని తెలిపారు. తమ పార్టీ జరిపిన సర్వేలో బీసీలకు రాజ్యాధికారం కావాలని ప్రజలు కోరుతున్నట్లు తేలిందని, అందుకే కృష్ణయ్య సీఎం అభ్యర్థిత్వానికి మద్ద తు ప్రకటిస్తున్నామన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటా అందడం లేదని, బీసీలకు రాజ్యాధికారం దక్కకుండా రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయన్నారు. స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లు అయినా బీసీలకు సీఎం పదవి దక్కక పోవడం, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు టికెట్లు కేటాయిస్తు న్న తీరే ఇందుకు నిదర్శనమన్నారు. త్వరలో ఉద్ధవ్ థాక్రేతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
బీసీలను అణగదొక్కాలని చూస్తున్నాయి: జాజుల
సాక్షి, హైదరాబాద్: జనాభాలో సగ భాగంఉన్న బీసీలకు రాయితీలతో సరిపెట్టి..తమను వారి చెప్పుచేతల్లో పెట్టుకోవాలని రాజకీయ పార్టీలు చూస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీని వాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. పార్టీలతో నిమిత్తం లేకుం డా బీసీలను రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్నాయన్నారు. గురువారం ఇక్కడ బీసీల సంక్షేమ సంఘం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. బీసీల రాజకీయ సాధికారత కోసం త్వరలో బీసీ రాజకీయ సమితిని ఏర్పాటు చేయనున్నట్లు జాజుల ప్రకటించారు. పది రోజుల్లో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ, ప్రతి నియోజకవర్గంలో ఆత్మగౌరవ సభలు, ‘ఓటు మనదే సీటు మనదే’ నినాదంతో ఎన్నికల బరిలో ఉండటంతో సహా పలు తీర్మానాలను సమావేశం ఆమోదించింది. -
బీసీలను అణగదొక్కుతున్నారు
హైదరాబాద్: జనాభాలో 56 శాతం ఉన్న బీసీలను అణగదొక్కు తూ రాజకీయ పార్టీలు లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. బీసీల రాజకీయ చైతన్య బస్సు యాత్ర ముగింపు సందర్భంగా ఉప్పల్‌లో మంగళవారం నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను వర్షం పడటంతో వాయిదా వేశారు. అనంతరం చిలుకానగర్‌లో జస్టిస్ ఈశ్వరయ్య, తూళ్ల వీరేందర్‌గౌడ్‌లతో కలసి జాజుల విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 80 నియోజకవర్గాలు, 31 జిల్లాల్లో నిర్వహించిన బస్సుయాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజ నం పలికారని తెలిపారు. బీసీలకు చట్టసభల్లో సీట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. త్వరలో రాజకీయ ప్రణాళికలు సిద్ధం చేసి జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే విధంగా కొట్లాడతామన్నారు. రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉం డాలన్నా, పీఠం ఎక్కాలన్నా బీసీలే శాసించే స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేత సచిన్ రాజిల్కర్, తమిళనాడు బీసీ సంక్షేమ సంఘం నేత కార్గెల్, బీసీ సంఘం నేత నెర్ధం భాస్కర్‌గౌడ్, సంఘం ప్రధాన కార్యదర్శి దుర్గయ్యగౌడ్, బీసీ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు భైరి శేఖర్, సుర్వి జంగయ్యగౌడ్ పాల్గొన్నారు. -
బీసీలకు పంద్రాగస్టు కానుక: ఈటల
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన కులాలకు పంద్రాగస్టునాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కానుక ఇవ్వనుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ నెల 15న బీసీల కోసం పెద్దఎత్తున రాయితీ రుణ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఆదివారం తన నివాసంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈటల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచన మేరకు పంద్రాగస్టునాడు అన్ని జిల్లాల్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. బీసీల కోసం దాదాపు రూ.2 వేల కోట్లతో రాయితీ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. బ్యాంకులతో లింకు లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, దీంతో లబ్ధిదారులు స్వయం ఉపాధి యూనిట్‌ను స్థాపించడం సులభతరమవుతుందన్నారు. బీసీ రుణ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, పైరవీలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. కొన్నిచోట్ల దళారులు చొరబడుతున్నారనే విమర్శలు వస్తున్నాయని, అలాంటి వాటిని ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో మాజీమంత్రి సారయ్య, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్‌కుమార్, రజక, నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
7 నుంచి బీసీల రాజకీయ చైతన్య యాత్ర
హైదరాబాద్: పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీల వాటా బీసీలకే దక్కాలనే నినాదంతో రాష్ట్ర బీసీ విద్యార్థి, యువజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, మేధావుల సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి వచ్చే నెల 11 వరకు ‘బీసీల రాజకీయ చైతన్య యాత్ర’ నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. 1990 ఆగస్టు 7న మండల్ కమిషన్ సిఫార్సును అమలు పరిచిన రోజును పురస్కరించుకుని ఆ రోజు నుంచే యాత్ర ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో యాత్ర పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ నెల 7న నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో యాత్ర ప్రారంభ మవుతుందన్నారు. 8న వనపర్తి జిల్లా, 9న మహబూబ్‌నగర్, 10న కల్వకుర్తి, 11న నల్ల గొండ, 13న మిర్యాలగూడ, 14న సూర్యాపేట, 16న భువనగిరి యాదాద్రి, 17న జనగాం, 18న వరంగల్ అర్బన్, 19న వరంగల్ రూర ల్, 20న మహబూబాబాద్, 21న ఖమ్మం, 22న కొత్తగూడెం, 23న జయశంకర్ భూపాల్పల్లి, 24న పెద్దపల్లి, 25న మంచిర్యాల, 27న ఆసిఫాబాద్, 28న ఆదిలాబాద్, 29న నిర్మల్, 30న నిజామాబాద్, సెప్టెంబర్ 1న కామారెడ్డి, 2న రాజన్న సిరిసిల్ల, 3న జగిత్యాల, 4న కరీంనగర్, 5న సిద్దిపేట, 6న మెదక్, 7న సంగారెడ్డి, 8న వికారాబాద్, 9న రంగారెడ్డి, 10న మేడ్చల్, 11న హైదరాబాద్‌లో సభతో ముగు స్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంబీసీ సంఘం నేత నర్సింహా సగర, సంఘం యూత్ అధ్యక్షుడు శ్యామ్‌కురుమ పాల్గొన్నారు. -
మోసగించడానికే బీసీ జనగణన: కృష్ణయ్య
హైదరాబాద్: బీసీలను మరోసారి మోసగించడానికే కేసీఆర్ ప్రభుత్వం బీసీల జనగణన చేపడుతోందని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వేలో కులాల వారీగా పూర్తిస్థాయి లెక్కలున్నాయని, మరోసారి బీసీ గణన చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సమగ్ర కుటుంబ సర్వేతోపాటు, గ్రామజ్యోతి సర్వేలో బీసీ గణన లెక్కలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, కేవలం బీసీలను తప్పుదారి పట్టిస్తూ, పార్టీ ప్రచారం కోసమే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. 34 నుంచి 56 శాతానికి పంచాయతీ రిజర్వేషన్లు అడుగుతుంటే ప్రభుత్వం 23 శాతానికి తగ్గించే విధంగా కుట్ర చేస్తోందన్నారు. బీసీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 2వ వారంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించి పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. -
బీసీలకు సబ్సిడీ 100%
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఉపాధి పథకాలను అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సాయం అందించాలని చెప్పారు. చిన్న వ్యాపారాలు చేసే వారికి, కుల వృత్తులు నిర్వహించుకునే వారికి బ్యాంకులతో సంబంధం లేకుండానే వంద శాతం సబ్సిడీతో ఆర్థిక సాయం నేరుగా అందించాలని చెప్పారు. బీసీ వర్గాల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, గణేష్ గుప్తా, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల వారీగా లబ్ధిదారులు ‘‘బీసీల్లో కుల వృత్తులు చేసుకుని జీవించే వారికి అవసరమైన పనిముట్లు కొనుక్కోవడానికి, చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి అవసరమైన పెట్టుబడి కోసం ఆర్థిక సాయం అందించాలి. ఇందుకు గ్రామాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ప్రతీ జిల్లాలో కలెక్టర్ చైర్మన్‌గా, బీసీ సంక్షేమ అధికారి కన్వీనర్‌గా, జాయింట్ కలెక్టర్, డీఆర్డీఏ పీడీ సభ్యులుగా కమిటీని నియమించాలి. లబ్ధిదారుల జాబితా సిద్ధం కాగానే బ్యాంకులతో సంబంధం లేకుండా వారికే నేరుగా ఆర్థిక సాయం అందించాలి’’అని సీఎం చెప్పారు. ‘‘బీసీ సంక్షేమ శాఖకు, ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులను ఇందుకు వినియోగించాలి. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల కులాల వారి అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. పెద్దఎత్తున బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది నుంచి మరో 119 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తాం. మైనారిటీ రెసిడెన్షియల్స్‌లో ఎక్కడైనా సీట్లు మిగిలితే వాటిని కూడా బీసీలకే కేటాయిస్తాం. బీసీ కులాల్లోని పిల్లలకు మంచి విద్య అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కల్లు దుకాణాల పునరుద్ధరణ, చెట్ల పన్ను రద్దు చేయడం వల్ల గీత కార్మికులకు మేలు కలుగుతోంది. గీత కార్మికులకు మరింత లబ్ధి చేకూర్చే విషయాలపై మరోసారి అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం’’అని సీఎం వివరించారు. పండ్లు, కూరగాయాలు అమ్ముకునేవారికీ చేయూత యాదవులకు ఇప్పటికే 65 లక్షల గొర్రెలు పంపిణీ చేశామని, వారు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. పెద్ద ఎత్తున చేపల పెంపకం వల్ల ముదిరాజ్, గంగపుత్రులు తదితరులు లాభం పొందుతున్నారన్నారు. చేనేతను ఆదుకోవడానికి తీసుకున్న చర్యల వల్ల పద్మశాలి కులస్తులకు మేలు కలిగిందని పేర్కొన్నారు. ఇంకా చాలా కులాలవారు వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారని, వారందరికీ చేయూత అందిస్తామని చెప్పారు. ‘‘విశ్వ కర్మలు, రజకులు, నాయీ బ్రాహ్మణులతోపాటు ఎంబీసీ కులాల వారికి ఆర్థిక చేయూత అందివ్వాలి. కుల వృత్తులు చేసుకునే వారికే కాకుండా చిన్న వ్యాపారులు చేసే వారికి, పండ్లు, కూరగాయలు, పూలు అమ్ముకునే వారికి, మెకానిక్ పనులు చేసుకునే వారికి, ఇంకా ఇతరత్రా పనులు చేసుకునే బీసీలను గుర్తించి ఆర్థిక చేయూత అందివ్వాలి’’అని అధికారులను ఆదేశించారు. -
బీసీ, ఎంబీసీలకు స్వయం ఉపాధి
సాక్షి, హైదరాబాద్: బీసీలు, ఎంబీసీల స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. బీసీలు, ఎంబీసీల స్వయం ఉపాధి కోసం రూపొందించే పథకాలకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. బ్యాంకులతో సంబంధం లేకుండానే లక్ష, రూ.2 లక్షల విలువ చేసే యూనిట్లను మంజూరు చేయాలని, దీనికి వంద శాతం ప్రభుత్వ గ్రాంటు ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. బీసీలు, ఎంబీసీలకు సంబంధించి పథకాల అమలుకు అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేయడానికి శనివారం ఉదయం స్పీకర్ మధుసూదనాచారి సమక్షంలో సమావేశం కావాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఈ మేరకు ప్రగతిభవన్‌లో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, సి.లక్ష్మారెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, శాంతాకుమారి, బుర్రా వెంకటేశం, కార్యదర్శులు భూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి మండలంలో రెసిడెన్షియల్ స్కూల్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రారంభించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రతి మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూలు పెట్టే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. దశలవారీగా రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్య పెంచుతామని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు అదనంగా ప్రారంభించాలని చెప్పారు. ఏటా వంద కోట్ల మొక్కలు ప్రతి గ్రామంలో నర్సరీ పెంచి వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వంద కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని, ఆ మేరకు నర్సరీల సంఖ్యను పెంచాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది నిర్వహించే హరితహారంతోపాటు వచ్చే ఏడాది నుంచి అవలంబించాల్సిన వ్యూహం ఖరారు చేయడానికి శనివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొనాలని సూచించారు. 19.83 శాతం ఆదాయాభివృద్ధి 2018–19 మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ఆదాయాభివద్ధి రేటు 19.83 శాతం నమోదు కావడంపై సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. 2018–19 తొలి 3 నెలల్లో తెలంగాణలో స్వీయ ఆదాయం 19.83 శాతం వృద్ధి రేటు సాధించినట్లు అధికారులు కేసీఆర్‌కు వివరించారు. గడిచిన నాలుగేళ్లలో తెలంగాణ దేశంలోనే అత్యధిక ఆదాయ వృద్ధిరేటు నమోదు చేసిందని, 2018–19లోనూ అదే దిశగా పయనించడం శుభసూచకమని సీఎం అన్నారు. 2017–18 మొదటి త్రైమాసికంలో తెలంగాణలో రూ.13,374.25 కోట్ల ఆదాయం వచ్చిందని, 2018–19 మొదటి త్రైమాసికంలో రూ.16,026.63 కోట్లకు పెరిగిందని తెలిపారు. 9న కేబినెట్ భేటీ జూలై 9న సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపింది. -
కాంగ్రెస్‌ను ఒక వర్గమే ఏలుతోంది...
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌ను ఒక వర్గానికి చెందిన వారే ఏలుతున్నారని ఆ పార్టీ మాజీ నేత దానం నాగేందర్ పేర్కొన్నారు. ఆత్మగౌరవం లేని చోట కొనసాగడం వృథా అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను వీడేందుకు దారితీసిన పరిస్థితులను శనివారం ఆయన మీడియాకు వివరించారు. ‘‘30 ఏళ్లుగా పార్టీకి సేవ చేశా. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశా. సైనికుడిగా పనిచేసినప్పటికీ చాకిరీగా వాడుకున్నారు. కాంగ్రెస్‌లో ఉన్న బీసీ నేతలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏ సమావేశం జరిగినా ఒక వర్గానికి చెందిన వారే వేదికపై ఉంటున్నారు. వారే మాట్లాడుతున్నారు. పార్టీలో బీసీ నేతలు, నాయకులకు అవకాశం లభించడం లేదు. సీనియర్లు డి.శ్రీనివాస్, కె.కేశవరావు పార్టీని వీడడానికి కారణాలేంటో తెలుస్తోంది. సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్యకు పార్టీలో ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదో చెప్పాలి. వీహెచ్‌ను కూడా పట్టించుకోవడం లేదు. ఆయన పార్టీలో మింగలేక.. కక్కలేక అన్నట్లు ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి చెప్పాను. ఆరు నెలల క్రితం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీ బీసీ నాయకులతో రాహుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి నేను కూడా హాజరయ్యా. అందులో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాను’’అని దానం చెప్పారు. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం రావాలంటే బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్‌కు సూచించినట్లు తెలిపారు. ఉత్తమ్ పని బాగున్నా.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి పనితీరు బాగుందని, ఆయన పార్టీ కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని దానం పేర్కొన్నారు. కానీ కొందరు నేతలు ఉత్తమ్‌ను కిందకు లాగే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పోలీసు శాఖలో ఒక సామాజిక వర్గానికే పదోన్నతులు ఇచ్చారని, ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా అప్పటి హోంమంత్రి జానారెడ్డిని వైఎస్ వారించారన్నారు. కాంగ్రెస్‌లో ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొందని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తనకు తెలియకుండానే టికెట్లు ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గ్రేటర్లో ఏ కార్యక్రమం జరిగినా.. బాధ్యతనంతా నా భుజాలపైనే వేసుకుని పని చేశా. కానీ నన్ను విస్మరించారు. పార్టీలో అన్ని వర్గాలకు సమానత్వం లేదు. బడుగు, బలహీన వర్గాలను పట్టించుకోవడం లేదు’’అని అన్నారు. కేసీఆర్‌ను చూసి గర్వపడుతున్నా.. సీఎం కేసీఆర్‌ను చూసి గర్వపడుతున్నానని దానం పేర్కొన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ గతంలో ఏ పార్టీ చేయని విధంగా బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను చూసి పలువురు ఆకర్షితులవుతున్నారన్నారు. గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపలు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. రైతుబంధు, రైతుబీమాపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ పథకాలు బడుగుల కులాల్లో వెలుగులు నింపుతున్నాయని తెలిపారు. టీఆర్ఎస్లో చేరే విషయంపై త్వరలో సమాచారం ఇస్తానని చెప్పారు. టీఆర్ఎస్లో చేరిన తర్వాత తాను పదవులు ఆశించబోనన్నారు. ఎలాంటి కార్యాన్ని అప్పగించినా బీసీల సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పారు. -
బీసీలకు అన్యాయం చేస్తున్నారు: దాసోజు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు న్యాయ బద్ధమైన వాటా రావాలంటే బీసీ జనాభా గణన శాస్త్రీయంగా చేపట్టాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బీసీ సాధికారిక కమిటీ సభ్యుడు దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ చట్టాన్ని లోపభూయిష్టంగా తయారు చేశారని, పరస్పర విరుద్ధ అంశాలను చట్టంలో పొందుపరిచారని ఆయన విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. 15 రోజుల్లో జనాభా లెక్కలు చేపట్టి రిజర్వేషన్లు అమలు చేయాలని పంచాయతీరాజ్ చట్టంలో పేర్కొన్నారని, 12 వేల పంచాయతీల్లో జనాభా గణనకు 15 రోజులు సమయం ఎలా సరిపోతుందని ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా అధికారికంగా తేలిన 52 శాతం ప్రకారం బీసీలకు పంచాయతీరాజ్ ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తామంటే ఎస్మా ప్రయోగిస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించడం రాజ్యాంగ విరుద్ధమని శ్రవణ్ అన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. -
తెరపైకి బీసీల పార్టీ!
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బీసీ సామాజిక వర్గాలను ఒకే వేదికపైకి తెచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు బీసీ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పావులు కదుపుతున్నారు. ఎస్పీ, బీఎస్పీ పార్టీల సిద్ధాంతాలు, జ్యోతిరావు ఫూలే అభివృద్ధి పథకాల కలబోతగా ఆగస్టు రెండో వారంలో బీసీ జన సమితి పేరుతో పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిజాం కాలేజీ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, వేదికపై పార్టీని ప్రకటించాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి తదితర నేతలను ఆహ్వానించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గద్దర్, కృష్ణమాదిగ మద్దతు ఇటీవల కేంద్ర నిఘా విభాగం చేసిన ఓ సర్వేలో తెలుగు రాష్ట్రాల్లో ఆర్.కృష్ణయ్యకు వ్యక్తిగతంగా 35 శాతం ప్రజా మద్దతు వచ్చినట్లు తెలిసింది. బీసీ యువత, ఉద్యోగులు, విద్యార్థులు 75 శాతం మంది విశ్వాసం ప్రకటించినట్లు సర్వే తేల్చడంతో ఆయన కొత్త పార్టీ ఏర్పాటుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతోపాటు, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని బీసీ నేతలతో ప్రాథమికంగా చర్చించిన ఆర్.కృష్ణయ్య వారి మద్దతు కూడగట్టినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాన్షీరాం ఎజెండాతోపాటు బీసీల అభివృద్ధి కోసం జ్యోతిరావు ఫూలే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అధ్యయనం చేసే బాధ్యత ఉస్మానియా, కాకతీయ, పాలమూరు యూనివర్సిటీల్లోని బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్లకు అప్పగించినట్టు తెలిసింది. దీనిపై అధ్యయనం చేసిన అనంతరం వారిచ్చే సలహాలు, సూచనలతో బీసీ జన సమితి ఎజెండాను రూపొందించాలని నిర్ణయించారు. పంచకులాలే కీలకం.. తెలంగాణతోపాటు ఏపీలో కూడా ముదిరాజులు, మున్నూరుకాపు, గొల్లకుర్మ, గౌడ, పద్మశాలి సామాజిక వర్గాలు బలంగా ఉండటంతో ఈ పంచకులాలపైనే కృష్ణయ్య ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల విజయవాడలో 80 కుల సంఘాలతో నిర్వహించిన బీసీ సదస్సులో.. ఎవరు ఎంత మంది ఉన్నారో వారికి అన్ని సీట్లు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. బీసీ జేఏసీని ఏర్పాటు చేసి రమణబాబు అనే పారిశ్రామిక వేత్తను దానికి చైర్మన్‌గా ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు బీసీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని, బీసీలకు స్కాలర్షిప్పులు, మెస్ చార్జీలు పెంచలేదని, రెండు పర్యాయాలు రాజ్యసభ ఎన్నికలు వచ్చినా బీసీలకు అవకాశం ఇవ్వలేదని, అందువల్ల ఆయన్ను బీసీ వ్యతిరేకిగానే పరిగణించాలని సదస్సు అభిప్రాయపడింది. తెలంగాణలోనూ బీసీ వ్యతిరేక పాలన నడుస్తోందని, త్వరలోనే ఇక్కడా బీసీ జేఏసీ ఏర్పాటు చేస్తామని కృష్ణయ్య సన్నిహితులంటున్నారు. -
దరఖాస్తు చేసుకున్న బీసీలందరికీ రుణాలివ్వాలి
సాక్షి, హైదరాబాద్ : బీసీ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న 5.77 లక్షల మందికీ రుణాలు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య సీఎం కె.చంద్రశేఖర్ రావుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామ సభల ద్వారా కొంతమందిని మాత్రమే ఎంపిక చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ప్రకటించిన నేపథ్యంలో బీసీలంతా ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. పైరవీల కోసం అధికార పార్టీ నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ, ఎవరికి వారే తమకు రుణాలు కావాలని పోటీపడుతున్నారన్నారు. దీంతో ఈ పథకంలో అవినీతి అక్రమాలు జరిగే ప్రమాదముందని కృష్ణయ్య సీఎంకు విన్నవించారు. రాష్ట్రంలో 60 లక్షల బీసీ కుటుంబాలుంటే కేవలం 5.77 లక్షల దరఖాస్తులే వచ్చాయని, అందుకే దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. -
బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా కొత్త పార్టీ
సాక్షి, విజయవాడ: బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా కొత్త పార్టీని ప్రకటిస్తామని ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీ సంఘాలతో చర్చించి త్వరలోనే పార్టీ, విధివిధానాలను ప్రకటిస్తామన్నారు. దేశంలో బీసీలను హీనంగా చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నో పార్టీలు ఉన్నా కేవలం ఓట్ల కోసం బీసీలను వాడుకుంటున్నారన్నారు. అగ్రవర్ణాలకు ఓట్లు వేసి వారిని బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏపీలో బీసీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు న్యాయం చేయలేదని విమర్శించారు. రాజ్యాధికారమే లక్ష్యంగా ఆత్మగౌరవ పోరాటం చేస్తామని కృష్ణయ్య పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలసికట్టుగా పోరాడాలన్నారు. జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం ఇవ్వాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య వ్యవహారంపై ఇంకా సమాచారం తెలుసుకోవాల్సి ఉందని, బీసీలకు అన్యాయం చేస్తే ఒప్పుకోమన్నారు. -
చంద్రబాబు ఇదేనా మీ ప్రేమ : వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలను అణగదొక్కుతున్నారన్న విషయం జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య వెలుగులోకి తెచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు బీసీలంటే ఎంత ప్రేమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు గురువారం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం ఇద్దరు బీసీలు(అమర్నాథ్ గౌడ్, అభినవ కుమార్ చావల్లి)తో పాటు ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ కులానికి చెందిన డీవీ సోమయాజులు, కమ్మ కులానికి చెందిన విజయలక్ష్మి, వెలమ కులానికి చెందిన కేశవరావులను సిఫార్సు చేస్తే.. అమర్నాథ్ గౌడ్, అభినవ కుమార్, గంగారావు, డీవీ సోమయాజులపై లేనిపోని ఆరోపణలు చేస్తూ 2017 మార్చి 21న చంద్రబాబు తప్పుడు నివేదిక పంపించారని ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన లేఖలను కూడా ఆయన బయటపెట్టారు. ‘నోరు తెరిస్తే బీసీల సంక్షేమం అనే చంద్రబాబు ఎందుకు బీసీ న్యాయవాదులను జడ్జిలు కాకుండా అడ్డుకుంటున్నారు? వారి నియామకాలను అడ్డుకునేలా తప్పుడు ఫీడ్‌బ్యాక్ ఎందుకు ఇస్తున్నారు?’ అని ట్విటర్లో వైఎస్ జగన్ ప్రశ్నించారు. కాగా, చంద్రబాబు తీరుపై ఆంధ్రప్రదేశ్ బీసీ న్యాయవాద సంఘాలు భగ్గుమన్నాయి. ఢిల్లీకి వెళ్లిన ఏపీ బీసీ న్యాయవాదుల బృందం రాష్ట్రపతికి చంద్రబాబు తీరుపై ఫిర్యాదు కూడా చేసింది. Recent disclosures by Justice Eswaraiah have exposed Naidu's so-called 'sincerity' towards BCs. @ncbn, you claim to accord priority to BC welfare, then why did you oppose the appointment of BC advocates as Judges? Why did you provide false feedback to prevent their appointment? — YS Jagan Mohan Reddy (@ysjagan) April 26, 2018 -
బీసీలకు 2 రాజ్యసభ సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ పదవుల్లో బీసీలకు రెండు సీట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. రాజ్యసభకు ఇద్దరు బీసీలు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆ స్థానాల్లో మళ్లీ బీసీలకే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. యాదవ సామాజిక వర్గానికి ఒక రాజ్యసభ స్థానం కేటాయిస్తామన్న సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నామని, ఇంకో స్థానాన్ని అత్యంత వెనకబడిన కులాలకు లేదా సం చార జాతుల్లో ఒకరికి కేటాయించాలని కోరారు. రైతు సమన్వయ సమితిల్లో గ్రామ, మండల, జిల్లా కమిటీల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అగ్రకులాలకు చెందిన ఎమ్మెల్యేలు తమ వర్గానికి చెందిన వారినే సమన్వయకర్తలుగా నియమించారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బీసీలకు రైతు సమన్వయ సమితిలో, రాజ్యసభల్లో అవకాశం కల్పించాలని శ్రీనివాస్‌గౌడ్ కోరారు. -
‘చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు’
సాక్షి, పెద్దపల్లి : చట్టసభల్లో బీసీలకు తగిన స్థానాలు లేవని, రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు బీసీలకు సముచిత స్థానం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీ సంఘాల ఫెడరేషన్లకు బడ్జెట్లో రూ.500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు కేటాయించాలని కోరారు. బీసీ కార్పొరేషన్‌కు రూ. 2 వేల కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ. 2 వేల కోట్ల నిధులు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మీ పథకం కింద బీసీలకు రూ. 2 లక్షలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
బీసీలు, కాపులను టీడీపీ మోసం చేస్తోంది
ఒంగోలు వన్‌టౌన్: ‘యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. మరోవైపు ప్రధాని కూడా ఇదే విషయాన్ని నొక్కివక్కాణిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారు?’ అని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రాజకీయ అవసరాల కోసం బీసీలు, కాపులను టీడీపీ మోసం చేస్తోందని మండిపడ్డారు. సోమవారం ప్రకాశం జిల్లా పార్టీ కార్యాలయంలో బీసీ సెల్ కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. జస్టిస్ మంజునాథ్ కమిషన్ నివేదికను అధ్యయనం చేయకుండా.. కాపులకు రిజర్వేషన్లంటూ తీర్మానం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే చంద్రబాబు ఈ విధంగా కులాల మధ్య కుంపటి పెడుతున్నారని మండిపడ్డారు. గతంలో ఎమ్మార్పీఎస్‌ను దగ్గరకు తీసిన చంద్రబాబు.. అవసరం తీరిపోయాక వారిని కరివేపాకులా పక్కన పడేసిన విషయం అందరికీ తెలిసిందేన్నారు. 2012 బీసీ డిక్లరేషన్‌లో దాదాపు 120 హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక అందులో ఒక్కటీ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల సమగ్రాభివృద్ధికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉంటుందని చెప్పారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కుమ్మరి, నాయీబ్రాహ్మణ, రజకులకు ఎమ్మెల్సీ ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామస్థాయి నుంచి వివిధ కులాల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు కమిటీ వేసినట్లు తెలిపారు. సమావేశంలో బీసీ సెల్ రాష్ట్ర నాయకులు అవ్వారు ముసలయ్య, గోలి తిరుపతిరావు, జిల్లా అధ్యక్షులు కఠారి శంకర్, మద్దిబోయిన సురేష్, కటారి ప్రసాద్, జువ్వి రాము, బత్తుల ప్రమీల పాల్గొన్నారు. -
బీసీలంతా మనవైపే చూస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బీసీల అభ్యున్నతి, సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై బీసీ ప్రజా ప్రతినిధులు రెండో రోజూ మేధోమథనం చేశారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అసెంబ్లీ కమిటీ హాలులో ఈ సమావేశం జరిగింది. అనంతరం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, మంత్రి జోగు రామన్న రెండో రోజు సమావేశ వివరాలను మీడియాకు వివరించారు. రాష్ట్ర జనాభాలో 52 శాతం మేరకు ఉన్న బీసీలంతా ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఆశగా ఎదురు చూస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. బీసీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా చాలా మంది బతుకులు సమస్యల్లో కునారిల్లుతున్నాయన్నారు. ఎవరి కాళ్ళ మీద వారు బతకడానికి విద్య ముఖ్యమని, అందుకే ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు పెడుతూ 119 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించామని ఈటల చెప్పారు. అలాగే సివిల్స్, గ్రూప్ 1 పరీక్షలు రాసే బీసీ అభ్యర్థులకోసం ప్రైవేట్ శిక్షణ సంస్థలకు దీటుగా శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని, బీసీ హాస్టళ్లను అన్ని వసతులతో తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇక ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూళ్లు అన్నింటిలో ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీసీలకు ప్రత్యేకంగా పారిశ్రామిక విధానం కూడా తీసుకురావాలని ప్రతిపాదిస్తున్నామన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వెనుకబడిన వర్గాలకు చేయూతనివ్వాలని, దళితులకు ఉన్న డిక్కీ మాదిరిగా బీసీలకు బిక్కీ పేరుతో పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించామని అన్నారు. నాయీ బ్రాహ్మణ, రజక కులాల మాదిరిగా, ఎంబీసీ లకు ఆర్థిక పథకాలు రూపొందిస్తామని వెల్ల డించారు. తమ ప్రతిపాదనలపై మంగళ వారం ఉదయం 11 నుంచి 2 గంటల వరకు చర్చించి సీఎంకు నివేదిస్తామని ఈటల చెప్పారు. పార్టీలకు అతీతంగా బీసీల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తున్నామని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఒక రోజంతా బీసీలపై చర్చ జరుపుతామని ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ గొప్ప మనసున్న వ్యక్తి అని, ఆయన బీసీ వర్గాలకు దేవుడని మంత్రి జోగు రామన్న అన్నారు. పూర్తి స్వేచ్ఛనిచ్చి చర్చ చేయమని చెప్పారని అన్నారు. చట్ట సభల్లో రిజర్వేషన్ కోసం కూడా ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జాతీయ స్థాయిలో వీపీ సింగ్ ఎలా ఆదర్శంగా నిలిచారో, సీఎం కేసీఆర్ కూడా అలా నిలిచిపోతారని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. అర్థవంతమైన చర్చ లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే బీసీ ప్రజాప్రతినిధుల సమావేశం పలు అంశాలపై అర్థవంతమైన చర్చ జరి పిందని, విద్య, ఉద్యోగాలతో పాటు రాజ కీయాల్లోనూ బీసీలకు తగిన అవకాశాలు దక్కాలన్న అభిప్రాయం వ్యక్తమైందని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ చెప్పారు. ర్యాంకు లతో సంబంధం లేకుండా ఫీజు రీయిం బర్స్మెంట్ ఇవ్వాలని, జనాభాకు అను గుణంగా రిజర్వేషన్లు పెరగాలన్నారు. వివిధ పాలక మండళ్లలో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని సూచించారు. ఫెడరేషన్లపై చర్చించాం ఆర్.కృష్ణయ్య, టీడీపీ ఎమ్మెల్యే ఈ సమావేశంలో విద్యారంగం, వివిధ ఫెడరేషన్లపై చర్చించామని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బీసీలందరికీ వర్తింపజేయాలని కోరామన్నారు. రాష్ట్రం లో ఉన్న 12 ఫెడరేషన్లకు నిధుల కేటా యించాలని కోరామని చెప్పారు. కొత్తగా ఆరెకటిక, మున్నూరు కాపు సామాజిక వర్గాలకు ఫెడరేషన్ లేదా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. -
బీసీలు రాజ్యాధికారానికి పనికిరారా: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: గొర్రెలు, బర్రెలు చూసుకుని బతకడానికి తప్ప బీసీలు రాజ్యాధికారానికి పనికిరారా అని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశ్నించారు. గురువారం ఆయన మాట్లాడుతూ గొర్రెల పంపిణీ పెద్ద మోసమన్నారు. బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇచ్చి వారిని అధికారం నుంచి దూరం చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు.బీసీలకు ఇంకా గాడిదల పంపిణీ మాత్రమే మిగిలి ఉందని ఎద్దేవా చేశారు. దళితులకు భూములివ్వకుండా మొండిచెయ్యి చూపిం చడానికే కేసీఆర్ భూసర్వే అంటూ కొత్త నాటకానికి తెరలేపారన్నారు. బతుకమ్మ చీరల పేరిట నాసిరకపు చీరలను పంచి మహిళలను అవమానించారన్నారు. -
రాజధానిలో బీసీ భవన్ ఏర్పాటు
జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ హైదరాబాద్: రాష్ట్రంలో 50 శాతానికిపైగా ఉన్న బీసీల సంక్షేమం, అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించడానికిగాను హైదరా బాద్‌లో 10 ఎకరాల స్థలంలో బీసీ భవన్ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో బీసీలకు నిలువ నీడ కూడా లేదన్నారు. ఒక శాతం కూడా లేని బ్రాహ్మణులకు సీఎం కేసీఆర్ బ్రాహ్మణ సదన్ ప్రకటిం చారని, 3% ఉన్న రెడ్డి సామాజిక వర్గం కోసం 17 ఎకరాల్లో రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భవన్‌కు ఈ నెల 22న సీఎం శంకుస్థాపన చేయనున్నారన్నారు. బీసీ భవన్ ఏర్పాటు చేయాలని మూడేళ్లుగా బీసీలు కోరుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంద న్నారు. వెంటనే బీసీ భవన్‌కు భూమి కేటాయించి రూ. వంద కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెలలోగా బీసీ భవన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి బీసీల సత్తా చాటుతామన్నారు. సమావేశంలో బీïసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జాజుల లింగం తదితరులు పాల్గొన్నారు. -
సాయం పొందిన బీసీలు అండగా ఉండాలి..
అమరావతి : రాష్ట్రంలో బలహీనవర్గాల వారికి ప్రభుత్వం తరపున సాయం చేస్తానని, వారంతా పార్టీకి బలంగా ఉండాలని హక్కుతో అడుగుతానని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడిని మంగళవారం కలిసి సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తే స్వాగతించాలని మంత్రి వెల్లడించారు. గతేడాది బ్యాంకులు సహకరించకపోవడం వల్లే బీసీలకు తగినంతగా సబ్సీడీ రుణాలు అందించలేకపోయామన్నారు. ఈ ఏడాది ఆదరణ పథకం అమలులోకి తెచ్చి బీసీలకు అవసరమైన పరికరాలు అందిస్తామని చెప్పారు. కులవృత్తులు, చేతి వృత్తులకు ఉపకరించే అదునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యంత్రాలు బీసీలకు ఇస్తామన్నారు. బీసీలకు 12 ఫెడరేషన్లు ఏర్పాటు చేశామని, వాటి ద్వారా ఆయా కులాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వేసవి సెలవుల్లో బీసీ హాస్టళ్లు రిపేర్లు పూర్తి చేయిస్తామని, మెనూ చార్జీలు పెంచేందుకు సీఎం అంగీకరించారని మంత్రి చెప్పారు. -
ఎస్సీ, బీసీలను విస్మరిస్తున్న సర్కార్
► రజక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు రమణ మెదక్‌జోన్: రాష్ట్రంలో ఒకే వర్గానికి చెందిన ప్రజలు సీఎం కేసీఆర్‌కు కనబడుతున్నారని, జనాభాలో అధికశాతం ఉన్న, ఎస్సీ, బీసీలను పూర్తిగా విస్మరిస్తున్నారని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేంత వరకు పోరాటం కొనసాగించాలని రజక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు పోతరాజు రమణ పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ రెండు రోజులుగా జిల్లా కేంద్రంలోని స్థానిక రాందాస్ చౌరస్తాలో చేపట్టిన ఆందోళనకు రజక సంఘం నాయకులు సోమవారం సంఘీభావం పలికారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని జనాభాలో 12 శాతం ఉన్న ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించిన సీఎం కేసీఆర్‌కు జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలు, ఎస్సీలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న ఈ ప్రభుత్వంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. మనమంతా ఏకమై రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. లేకుంటే భవిషత్యత్తులో మన పిల్లలకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఇంత జరుగుతున్నా బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు నోరుమెదపక పోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీసీ కులానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన వారిని భారీ మెజార్టీతో పార్టీలకతీతంగా గెలిపించుకుంటామని ఆయన చెప్పారు. ముస్లింలకు పెద్దఎత్తున రిజర్వేషన్లు కల్పించడంతో బీసీ ఈలో ఉన్న మిగతా బీసీ కులాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. అనంతరం ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మాసాయిపేట యాదగిరి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చాట్ల తవుడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టే విధంగా ఇష్టాను రీతిగా రిజర్వేషన్లు కల్పిస్తూ మన మధ్యలో గొడవలు పెడుతున్నారన్నారు. బీసీలకు 52 శా>తం, ఎస్సీలకు 18శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు రాందాస్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు సిద్దిరాయులు, చంద్రం, రామాయంపేట వెంకటి, ఎమ్మార్పీఎస్ నాయకులు బాల్‌రాజు, మురళి, దశరథం, బీసీ సంఘ నాయకులు మల్కాజి సత్యనారాయణ, వడ్డె మహేష్, రఘు, గంగారాం తదితరులు ఉన్నారు. -
బీసీ సంక్షేమంపై సమీక్ష
శాసన సభా కమిటీ పర్యటన బాపట్ల : బాపట్ల వ్యవసాయ కళాశాలలో మౌలిక సదుపాయాలపై బీసీ సంక్షేమ శాసనసభ కమిటీ మంగళవారం రాత్రి పరిశీలించింది. విశ్వవిద్యాలయం డీన్ డాక్టరు టి.రమేష్‌బాబు, పీజీ స్టడీస్ డీన్ వీరరాఘవయ్య, రిజిస్ట్రార్ టి.వి.సత్యనారాయణ విశ్వవిద్యాలయం నిర్వహణపై పలువిషయాలను కమిటీ దృష్టికి తీసుకువెళ్ళారు. బీసీ రిజర్వేషన్లు అమలుపై కమిటీ చైర్మన్ తిప్పేస్వామి అడిగితెలుసుకున్నారు. బీసీ విద్యార్థులకు అందాల్సిన స్కాలర్‌షిపులు, హాస్టల్ నిర్వహణపై ఆరా తీశారు. రామచంద్రపురంలో పర్యటించిన కమిటీ మండలంలోని రామచంద్రపురంలోని మత్స్యకారుల కాలనీలో కమిటీ పర్యటించింది. ఈసందర్భంగా మత్స్యకారులను ఎస్టీల జాబితాలో చేర్చాలని ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్ వినతి పత్రం అందించారు. మత్స్యకారులకు అందాల్సిన సబ్సిడీలు కూడా సక్రమంగా అందేలా చూడాలని కోరారు. పర్యటనలో కమిటీ సభ్యులు అశోక్‌బాబు,రమణమూర్తి, జాయింట్‌కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. -
కాపులను బీసీల్లో చేరిస్తే సహించం
– మంజునాథ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తే ఉద్యమాలు – ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ కర్నూలు(అర్బన్): అన్ని రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న కాపులను బీసీ జాబితాలో చేరిస్తే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ అన్నారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డేరంగుల మాట్లాడుతూ కాపులు బలహీన వర్గాలు కాదని, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పలు ఉన్నతాధికారులుగా వారు ఉన్నారన్నారు. ఏపీలో రాజకీయ పరంగా కూడా వారు అభివృద్ధిచెందారన్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి, నలుగురు మంత్రులతో పాటు 22 మంది శాసనసభ్యులు ఉన్నారని చెప్పారు. సినిమా రంగాన్ని సైతం నడిపిస్తున్నది కాపు సామాజిక వర్గానికి చెందిన వారే నని చెపా్పరు. వ్యవసాయరంగంలో, పరిశ్రమల ఏర్పాటులో కూడా కాపులే ముందున్నారని చెప్పారు. ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులను బలహీన వర్గాలుగా చూపించేందుకు మంజునాథ కమిషన్ ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని డేరంగుల హెచ్చరించారు. ఏపీబీసీ సంఘం ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. బీసీ కులాలను వెలుగులోకి తెస్తాం ... దేశానికి స్వాతంత్య్రం వచ్చి అరు దశాబ్దాలు గడుస్తున్నా అనేక బీసీ కులాలు చట్టసభల మెట్లు కూడా ఎక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కులాలకు కూడా రాజకీయ ప్రాధాన్యత లభించేందుకు సంఘం తీవ్రంగా కృషి చేయనుందని చెప్పారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఈ సురేష్‌గౌడ్, కార్యదర్శి వలీబాషా,, జిల్లా అధ్యక్షుడు నవీన్‌కుమార్, వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య తదితరులు పాల్గొన్నారు. -
మంజునాథ్ గోబ్యాక్
–కాపులను బీసీలో చేర్చొద్దంటూ ప్రజా సంఘాల ఆందోళన - బీసీ కమిషన్ బహిరంగ విచారణ రసాభాసా – సంఘాలు సహకరించకపోవడంతో విచారణ వాయిదా కర్నూలు(హాస్పిటల్): కాపు, బలిజలను బీసీ కేటగిరిలో చేర్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్చే నిర్వహించిన బహిరంగ విచారణ రసాభాసాగా మారింది. సోమవారం బీసీ కమీషన్ చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బహిరంగ విచారణ నిర్వహించారు. విచారణ సమయంలో కార్యక్రమం ప్రారంభం కాకుండా సంఘాల నాయకులు అడ్డుతగిలారు. బీసీ కమిషన్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అరుపులు, కేకల మధ్య విచారణ కొనసాగించలేనని కమిషన్ చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ్ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అన్యాయం చేసే బహిరంగ విచారణ తమకు వద్దంటూ బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముందుగా యాదవ కులంలో గ్రూపులను మార్చాలంటూ వచ్చిన అభ్యంతరాలపై విచారణ ప్రారంభిస్తానని కమిషన్ చైర్మన్ చెప్పగానే చిన్నహాలులో 150 బీసీ కులాలకు సంబంధించి విచారణ చేపట్టి ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. హాలు బయట ఇంకా 2వేల మంది దాకా ఉన్నారని, వారందరి సమక్షంలో విచారణ జరిపితే న్యాయం జరుగుతుందన్నారు. ఇందుకోసం హాలు బయట కూడా మైకులు ఏర్పాటు చేశామని కమిషన్ చెప్పినా సంఘాల నాయకులు శాంతించలేదు. కమిషన్ ఎప్పటికీ బీసీలకు వ్యతిరేకం కాదని చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ్ చెప్పారు. ప్రశాంత వాతావరణం లేకపోతే బహిరంగ విచారణ చేయడం కుదరదని, సంఘాల నాయకులు సహకరించాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతిలో బీసీల రిజర్వేషన్‌పై విచారణ చేస్తామన్నారు. ఇదే సందర్భంగా సంచార జాతులకు చెందిన సుంకులమ్మ కులం వారు వచ్చి డోలు వాయిస్తూ, కొరడాలతో నాట్యం చేస్తూ నిరసన తెలిపారు. గంగిరెద్దు ఆడించేవారు సైతం హాలులోకి వచ్చి తమకు న్యాయం చేయాలని కోరారు. సంఘాల నాయకులు, సభ్యుల నినాదాల మధ్య కమిషన్ చైర్మన్ బహిరంగ విచారణను వాయిదా వేశారు. వినూత్న నిరసన కాపులను, బలిజలను బీసీ జాబితాలో చేర్చితే సహించేది లేదని పేర్కొంటూ బీసీ సంఘాల జేఏసీ నాయకులు మెడకు ఉరితాళ్లు కట్టుకుని అంబేడ్కర్ భవన్ నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. గేట్లను తోసుకుని బహిరంగ విచారణ జరిగే హాలులోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ, బీసీ జేఏసీ కన్వీనర్ అన్నా రామచంద్రయ్య, బీసీ సంక్షేమ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, కులాల ఐక్య వేదిక మహిళా నాయకురాలు పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ కాపులను బీసీలో చేర్చితే ఇప్పుడున్న బీసీలకు ఉరితాళ్లే గతవుతాయన్నారు. అన్ని రంగాల్లో కాపులు అభివృద్ధి చెందారని, కాపులు బీసీలే కాదని గతంలో ఏర్పాటు చేసిన అన్ని కమిషన్లు, హైకోర్టు తేల్చి చెప్పినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కులాల మధ్య చిచ్చుపెట్టి ఓట్ల రాజకీయం చేసేందుకు మంజునాథ్ కమిషన్ వేశారన్నారు. ఈ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు ఇప్పుడు అగ్రకులాలను బీసీ జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బహిరంగ విచారణ వాయిదా వేసి, కాపు కులాల అభ్యర్థనలను ఎలా స్వీకరిస్తారని ప్రశ్నించారు. ఇదే సమయంలో కాపు, బలిజ కులాలకు చెందిన నాయకులు, సభ్యులు ప్రతినినాదాలు చేశారు. కమిషన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో కమిషన్ విచారణ వాయిదా వేసింది. కార్యక్రమంలో సమాఖ్య జిల్లా అధ్యక్షులు భరత్‌కుమార్, బీసీ జనసభ నాయకులు టి.శేషఫణి, మాకం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆరే కటిక కులాన్ని బీసీ–డీ నుంచి ఎస్సీలో చేర్చాలని కోరుతూ జిల్లా ఆరే కటిక సమాజ్ నాయకులు కృష్ణాజిరావు, నాగేశ్వరరావు, చలపతిరావు తదితరులు డిమాండ్ చేశారు. సంచార జాతులైన బుడగ జంగాలకు ఎస్సీ కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంచార జాతుల వేదిక కమిటీ అధ్యక్షుడు తూర్పాటి మనోహర్ కోరారు. భావసార క్షత్రియులకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని భావసార క్షత్రియ మండలి జిల్లా నాయకులు ధర్నా చేశారు. సంఘాలు సహకరించకపోవడంతోనే విచారణ వాయిదా బీసీ సంఘాలు సహకరించకపోవడం వల్లే బహిరంగ విచారణ వాయిదా వేశామని బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ్ చెప్పారు. విచారణ వాయిదా అనంతరం ఆయన ప్రభుత్వ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు సంబంధించి ఏ కులం వారైనా అభ్యర్థనలను విజయవాడలోని బీసీ కమిషన్ కార్యాలయానికి వచ్చి అందజేయవచ్చన్నారు. రాజ్యాంగానికి మించి రిజర్వేషన్లు చేయడం వీలుకాదన్నారు. 64 కులాలకు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పరిష్కరించేందుకు కమిషన్ జిల్లాల్లో పర్యటిస్తోందన్నారు. కొన్ని కులాలు బీసీలో నుంచి ఎస్టీల్లో చేర్చాలని అడుగుతూ అర్జీలు ఇస్తున్నారని, వారి సామాజిక, ఆర్థిక జీవనవిదానాలను పరిగణలోకి తీసుకుని నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, మల్లెల పూర్ణచంద్రరావు, శ్రీమంతుల సూర్యనారాయణ, కార్యదర్శి ఎ.కృష్ణమోహన్ పాల్గొన్నారు. -
‘ఈసార్’ అయినా ఇస్తారా?
సబ్సిడీ రుణాలకోసం బీసీ, ఎస్సీల నిరీక్షణ అటు జన్మభూమి కమిటీలు – ఇటు బ్యాంకర్ల కరుణ కరువు అందని రుణాలతో దరఖాస్తుదారుల ఆవేదన కొత్త రుణాలపై నిరుద్యోగులు, చిరువ్యాపారుల కోటి ఆశలు విజయనగరం కంటోన్మెంట్: ప్రభుత్వం బీసీ, ఎస్సీలకు రుణాలిస్తాం... అనగానే నిరుద్యోగుల్లో ఎక్కడ లేని ఆశలు మొదలవుతాయి. తీరా అవి పొందాలనుకునేసరికి అసలైన అవరోధాలు ఎదురవుతాయి. బ్యాంకర్లు సహకరించక... జన్మభూమి కమిటీలు కనికరించక... అర్హత ఉన్నా.... ఏ రుణం పొందలేకపోతున్నారు. గత ఏడాది లక్ష్యాలు ఇదే విధంగా నీరుగారిపోగా... ఈ ఏడాది కొత్త ప్రకటన వచ్చినా... అభ్యర్థుల్లో నిరాశా మేఘాలు కమ్ముకుంటున్నాయి. జిల్లాలో బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా ఏటా కోట్లాది రూపాయల రుణాలు సబ్సిడీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించడమే తప్ప ఎటువంటి రుణాలూ ఇవ్వడం లేదని జిల్లాలోని దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారు. రుణాల మంజూరుకు అర్హత ఉండాలి కానీ... జన్మభూమి కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్ల పెత్తనమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. రుణాలన్నీ పార్టీ కార్యకర్తలకే అందుతున్నాయి తప్ప మిగిలినవారికి రావట్లేదని వాపోతున్నారు. మళ్లీ ఆశలు రేపుతున్న ప్రకటనలు ఈ ఏడాది అన్ని కార్పొరేషన్లు, పది ఫెడరేషన్లకు రూ.84.18 కోట్లతో 4,685 మంది లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలు ఇస్తామని ప్రకటించడంతో కొత్త ఆశలు పెంచుకుంటున్నారు. ఇందుకోసం సోమవారం నుంచి వెబ్సైట్ ప్రారంభం కానుందనీ, కేవలం 15 రోజులే గడువుందనీ చెప్పడంతో నిరుద్యోగులు, ఆయా సంఘాలు, చిరు వ్యాపారుల్లో మళ్లీ హడావుడి మొదలైంది. కొత్తగా బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అయినా స్పందించి రుణాలు ఇస్తారేమోనని ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏటా పది వేల నుంచి 20వేల మంది దాకా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నా రుణం మాత్రం వందల్లో కూడా అందడం లేదని ఇందుకు జన్మభూమి కమిటీలు, బ్యాంకర్లే కారణమని వాపోతున్నారు. చాలా రోజులుగా నాన్ ఆపరేటివ్ అకౌంట్ సిస్టం పెట్టి సంబంధిత అకౌంట్ ఓపెన్ చేయడానికి బ్యాంకర్లు తిప్పుతుండటంతో వేలాది మందికి రుణాలు అందడం లేదు. పైపెచ్చు ఏటా పథకంలోని నిబంధనలు మార్చడంతో బ్యాంకుల ద్వారా డాక్యుమెంటేషన్లు మార్చేందుకు తడిసిమోపెడవుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్లలో ఏటా పద్ధతి అవలంబించడంతో పరిస్థితి ఇలా తయారయింది. గతేడాది లక్ష్యం రూ. 10.08 కోట్లు చేరింది రూ. 7 లక్షలు బీసీ కార్పొరేషన్ గతేడాది రూ. 10.08 కోట్ల బడ్జెట్‌తో 3,144 యూనిట్లను స్థాపించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో 1669 యూనిట్లకు రూ.5.37 కోట్లు మంజూరయ్యాయి. వీటికి సబ్సిడీ ఇవ్వాలంటే ఇక్కడి నుంచి నాన్ ఆపరేటివ్ అకౌంట్లను పంపించాల్సి ఉంది. ఇందుకోసం 1402 యూనిట్ల అకౌంట్లను పంపించారు. ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్నా నేటికి కేవలం రూ. 7.25లక్షలతో 21 యూనిట్లు మాత్రమే గ్రౌండయ్యాయి. మిగతావి ఇప్పటికీ పత్తా లేదు. దీనికి కారణం కేవలం బ్యాంకర్లేనని అటు అధికారులు, ఇటు దరఖాస్తుదారులు, లబ్ధిదారులు కూడా ఆరోపిస్తున్నారు. నిధులు కేటాయిస్తున్నప్పటికీ జిల్లాలో నిరుద్యోగ నిర్మూలన, స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారని ఆయా వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా నిబంధనలు సడలించి ఫలితం ఏముంటుందని పెదవి విరుస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్లో మరీ ఘోరం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరానికి రూ.12 కోట్లతో 1020 యూనిట్లు కేటాయించారు. మరింత మందికి లబ్ధి చేకూర్చే విధంగా 1190 యూనిట్లను మంజూరు చేశారు. వీటిని ఉన్నతాధికారులు పరిశీలించి 984 యూనిట్ల వరకూ సబ్సిడీ విడుదల చేశారు. అయితే ఇందులో కేవలం వంద మాత్రమే గ్రౌండయ్యాయి. మిగతావి ఇప్పటికీ గ్రౌండ్ కాలేదు. దీనికి బ్యాక్ టు సబ్సిడీ విధానమే కారణమని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాదయినా సక్రమంగా రుణాలు అందించి వెంటనే గ్రౌండయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. -
మంజునాథ కమిషన్ పర్యటనలో ఉద్రిక్తత
-
మంజునాథ కమిషన్ పర్యటనలో ఉద్రిక్తత
-బీసీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం వైఎస్సార్‌జిల్లా: వైఎస్ఆర్ జిల్లా కడపలో మంజునాథ కమిషన్ పర్యటనలో ఉద్రిక్తత పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాపులను బీసీల్లొ చేర్చొద్దని కోరుతూ.. బీసీ కులాల రాష్ట్ర జేఏసీ మహిళ అధ్యక్షురాలు విజయలక్ష్మీ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని జడ్పీ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం మంజునాథ కమిషన్ ఈ రోజు కడపకు చేరుకుంది. ఈ అంశం పై తమ వాదనలు స్వీకరించాలని.. ఎట్టి పరస్థితుల్లోను కాపులను బీసీల్లో చేర్చొద్దని డిమాండ్ చేస్తూ ఆమె వంటిపై కిరోసిన్ పోసుకుంది. -
అగ్రకులాలను బీసీలో కలిపితే సహించం
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు అరండల్‌పేట: అగ్రకులాలను బీసీల్లో చేర్చే హక్కు ఏ కమీషన్‌కు లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు అన్నారు. శనివారం స్థానిక గుజ్జనగుండ్లలోని ప్రగడ కోటయ్య చేనేత భవన్లో జిల్లాలోని బీసీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. కాపులను బిసీల్లో చేర్చే అంశంలో మంజునాథ కమీషన్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. త్వరలో పదివేల మందితో బీసీల గుండెచప్పుడు కమీషన్‌కు వినిపించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. సంఘ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అంగిరేకుల ఆదిశేషు మాట్లాడుతూ చేనేత భవన్ వద్ద వసతిగృహం ఆనుకొని రైతుబజార్ నిర్మాణాన్ని అన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు కుమ్మరి క్రాంతికుమార్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి బీసీ సంఘాన్ని పటిష్టం చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే యువత, విద్యార్ధులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశానికి సంఘం నగర అధ్యక్షుడు కన్నా మాస్టారు అధ్యక్షత వహించారు. -
బీసీలకు పల్స్ సర్వే వేరుగా నిర్వహించాలి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు అరండల్‌పేట: మంజూనాథ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణను కలిపి నిర్వహించడంతో బీసీలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలపలేకపోతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం గుంటూరు బ్రాడీపేటలోని రాష్ట్ర సంఘ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి వంటి పట్టణంలో పోలీసు బందోబస్తు మధ్యలో మంజునాథ కమిషన్ సమక్షంలో బీసీలపై దాడులు జరిగాయని తెలిపారు. ఇలాంటి దౌర్జన్య వాతావరణంతో గ్రామీణ ప్రాంతాల్లోని బీసీలు కమిషన్ వద్దకు వచ్చి తమ బాధలన చెప్పుకోవడానికి భయపడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చురేపుతుందని మండిపడ్డారు. విలేకర్ల సమావేశంలో బీసీ జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఈడే మురళీకృష్ణ, నాయకులు అంగిరేకుల ఆదిశేషు, టీ శ్రీనివాస్‌యాదవ్, ఓలేటి శివాజీ, ఆలా అనంతరామయ్య, కుందుల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
బీసీలంటే చిన్నచూపా..
* జంగాపై చేయి చేసుకున్న డీఎస్పీని సస్పెండ్ చేయాలి * ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాల ఎదుట అఖిత భారత యాదవ మహసభ నేతల ఆందోళన పట్నంబజారు: వయసుకు గౌరవం ఇవ్వకుండా.. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. యాదవ కులానికే పెద్దగా వ్యవహరిస్తున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తిపై చేయి చేసుకున్న గురజాల డీఎస్పీ కె.నాగేశ్వరరావును తక్షణమే సస్పెండ్ చేయాలని అఖిల భారత యాదవ మహాసభ నేతలు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, పోలీసు కార్యాలయాల ఎదుట శనివారం డీఎస్పీని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. తొలుత హిందూ కళాశాల కూడలి నుంచి భారీ ప్రదర్శన నిర్వహిస్తూ ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎస్పీ కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లే ప్రయత్నం చేయటంతో పోలీసులు అడ్డుకున్నారు. అధికారులు చర్యలు తీసుకునే వరకు కదలబోమని మహాసభ నేతలు తేల్చిచెప్పారు. వెస్ట్ డీఎస్పీ కేజీవీ సరిత సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా నేతలు ససేమిరా అంటూ అక్కడ నుంచి కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారికి అక్కడ అడ్డుకోవటంతో ఆగ్రహించిన నేతలు బీసీలంటే చిన్న చూపా.. అధికారులతో కూడా మాట్లాడనివ్వరా.. అంటూ రాస్తారోకోకు దిగేందుకు సిద్ధమయ్యారు. మరోసారి డీఎస్పీ సరిత కల్పించుకుని ముఖ్యనాయకులను మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పటంతో వివాదం సర్ధుమణిగింది. అనంతరం అడిషనల్ ఎస్పీ వైటీ నాయుడు, కలెక్టర్ కార్యాలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు. మహాసభ రాష్ట్ర కార్యదర్శి ఏలికా శ్రీకాంత్‌యాదవ్ మాట్లాడుతూ దేవుడిచ్చిన అన్న కోసం డీఎస్పీ నాగేశ్వరరావు పచ్చచొక్కా వేసుకున్న కార్యకర్తలా పనిచేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే క్షమాపణ చెప్పించడంతో పాటు, డీఎస్పీ సస్పెండ్ చేయాలని లేని పక్షంలో జిల్లాను స్తంభింప చేస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు మద్దుల కోటయ్యయాదవ్ మాట్లాడుతూ డీఎస్పీపై చర్యలు తీసుకోవటంలో కనీసం అధికారుల్లో చలనం లేకుండా పోయిందన్నారు. నగరాధ్యక్షుడు ఉప్పుటూరి పేరయ్య యాదవ్ మాట్లాడుతూ పోలీసులు అధికార పక్షానికి తొత్తుల్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. మరో రెండు రోజుల్లో డీఎస్పీని సస్పెండ్ చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని మహాసభ నేతలు స్పష్టం చేశారు. -
బీసీలు రాజ్యాధికారాన్ని సాధించాలి: అరుణ్రిషి
నల్లగొండ టౌన్: బీసీలు రాజ్యాధికారాన్ని సాధించే దిశగా ఉద్యమాలను నిర్వహించాలని బీసీ యువజన, విధ్యార్థి జాతీయ సంఘం సమన్వయకర్త డాక్టర్ అరుణ్రిషి పిలుపునిచ్చారు. మంగళవారం బీసీ చైతన్యయాత్ర మేల్కోలుపులో భాగంగా జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కేవలం రెండు , మూడు కులాలు మాత్రమే రాజ్యాధికారం సా«గించాయన్నారు. బీసీలు అన్ని రంగాలలో నేటికి వెనుకబడి ఉన్నారని, రాజ్యాధికార సాధనతోనే అన్ని రంగాలలో అబివృద్ధి సాద్యమవుతుందన్నారు. బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలా వెంకటేశ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రా సాధనలో బీసీల పాత్ర కీలకమైందన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దుడుకు లక్ష్మినారాయణ, రమేష్, అరవింద్, అంజయ్య, వెంకన్నగౌడ్, మల్లేష్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబుకు గోరీ కడతాం'
హైదరాబాద్: కాపులను బీసీల్లో కలిపితే చూస్తూ ఊరుకోమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అన్నారు. ఆయనిక్కడ బుధవారం మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో బీసీల కోసం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందన్నారు. పాలకులు బీసీల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు అన్యాయం చేస్తే చంద్రబాబుకు గోరీ కడతామన్నారు. -
రాజ్యాంగబద్ధం కాని హామీలేల?
కొత్త కోణం ఏపీలో టీడీపీ రజకులను ఎస్సీలలో చేరుస్తామని వాగ్దానం చేసింది. రాజ్యాంగపరంగా అది నేడు సాధ్యమేనా? అంటే, ఇప్పట్లో అది నెరవేరే పరిస్థితి లేదు. రజకులు తమ కుల వృత్తి మీద ఆధారపడి బతికే పరిస్థితి లేదు. వారికి విద్య, ఉపాధి అవకాశాలను, తగు శిక్షణను ఇచ్చి నూతన జీవన విధానంలోకి నడిపించే ప్రయత్నం అత్యావశ్యకం. వారిపై దాడులను, అత్యాచారాలను అరికట్టి, రక్షణ కల్పించాలి. అంతేగానీ రాజ్యాంగపరంగా సమంజసం కాని వాగ్దానంతో వారిని ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూడటం రాజకీయ వంచన. ‘‘షెడ్యూల్డ్ కులాలుగా నిర్ధారించడానికి అంటరానితనంతో కూడిన సామా జిక, ఆర్థిక, విద్యాపరమైన వెనుకబాటుతనమే ప్రాతిపదిక అవుతున్నది. వీరందరూ తరతరాలుగా అంటరానివారుగా జీవించడం వల్లనే వీరిని షెడ్యూల్డ్ కులాలుగా నిర్ణయించి, ఒక కేటగిరి కింద పేర్కొనడం జరిగింది’’ అని సుప్రీం కోర్టు 2004లో ఒక కేసు సందర్భంగా ఇచ్చిన తీర్పు పేర్కొంది. ఇదే అంశాన్ని 2002, ఆగస్టు 19న కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నెపోలియన్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొన్ని కులాలను ఎస్సీలలో, కొన్ని తెగలను ఎస్టీలలో చేర్చాలని ప్రతిపాదనలు వచ్చాయని, ప్రభుత్వం వాటిని పరిశీలి స్తున్నదని ఆ సందర్భంగా మంత్రి తెలిపారు. అయితే, ఏ కులాలనైనా ఎస్సీలలో చేర్చాలంటే సాంప్రదాయకంగా, తరతరాలుగా అనుభవిస్తున్న అంటరానితనం వల్ల సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో అత్యంత వెనుక బాటుతనాన్ని ఎదుర్కొనడమే ప్రాతిపదిక కాగలదని నెపోలియన్ ప్రకటిం చారు. ఆదిమ సామాజిక, ఆర్థిక, జీవన విధానం, తమదైన ప్రత్యేక సంస్కృతి, భౌగోళికంగా ఆ ప్రాంతాలు గ్రామాలకు దూరంగా ఉండడం, ఇతర సామాజిక వర్గాలతో కలిసి ఉండే స్వభావం లేకపోవడం లాంటి విషయాల వల్ల వెనుకబాటుతనానికి గురై ఉండటమే ఎవరినైనా ఎస్టీలలో చేర్చడానికి ప్రాతిపదిక కాగలదని ఆయన స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ రెండూ కొన్ని కులాలను ఎస్సీలలో, మరికొన్ని తెగలను ఎస్టీలలో చేరుస్తామని ప్రకటించాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కూడా రెండు తెగలను ఎస్టీలలో చేరుస్తామని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. ఆ విషయాన్ని పరిశీలించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కమిషన్ కూడా వేసింది. ప్రస్తుత అసెంబ్లీ సమా వేశాల మొదటి రోజున ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగాల్లో గవర్నర్ రజకులను ఎస్సీలలో చేర్చే విషయాన్ని ప్రస్తావించి, ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. అయితే ఏపీలోని టీడీపీ ప్రభుత్వం అంటున్నట్టు రజకులను ఎస్సీలలో చేర్చడం సాధ్యమేనా? అందుకు అసెంబ్లీ తీర్మానం చెల్లుతుందా? లేకుంటే, రజకులను మభ్యపెడుతున్నారా? అనే వాటిని పరిశీలించాలి. రజకులనే కాదు మరే కులాన్నయినా కొత్తగా ఎస్సీల్లోకి చేర్చడానికి ప్రాతిపదిక ఏమిటో మొదటే చెప్పుకున్నాం. దానికి అనుగుణం గానే మార్పులు, చేర్పులు సాధ్యం. షెడ్యూల్డ్ కులాల గుర్తింపునకు ప్రాతిపదిక 1935 నాటి భారత ప్రభుత్వ చట్టంలో మొట్టమొదటిసారిగా షెడ్యూల్డ్ కులాలనే ప్రస్తావన వచ్చింది. 1936లో దీనికి సంబంధించిన ప్రత్యేక ఉత్తర్వు లను ప్రకటించారు. 1935 భారతప్రభుత్వ చట్టంలోని 1, 5, 6 షెడ్యూళ్లలోని అంశాల ఆధారంగా షెడ్యూల్డ్ కులాల జాబితా రూపొందినట్టు ఆ ఉత్తర్వు లలో పేర్కొన్నారు. క్రైస్తవ మతంలోగానీ, బౌద్ధ మతంలోగానీ, మరేవిధమైన ఆదిమ జాతి మతంలోగానీ ఉన్నవారిని షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించడానికి వీల్లేదని అందులో స్పష్టంగా చెప్పారు. 1936లో షెడ్యూల్డ్ కులాలుగా ప్రకటించిన కులాలన్నిటినీ అప్పటికే అణగారిన వర్గాలు(డిప్రెస్డ్ క్లాసెస్)గా గుర్తిస్తున్నారు. మింటో-మార్లె నివేదిక, మాంటెగ్-చెమ్స్‌ఫర్డ్ నివేదిక, సైమన్ కమిషన్ సిఫార్సులలో అంటరాని కులాల హక్కులకు సంబంధించిన డిమాండ్లను పొందుపరచారు. అదేసమయంలో 1930-31 మధ్య లండన్‌లో మొదటి, రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. వాటిలో అంబేడ్కర్ లేవనెత్తిన అంశాలపై ఆధారపడి అంటరాని కులాలు ఎదుర్కొంటున్న వివక్షను నిర్మూలించడానికి 1935 భారత ప్రభుత్వ చట్టంలో కొన్ని రక్షణలను పొందుపర్చారు. గాంధీ-అంబేడ్కర్ల మధ్య కుదిరిన పూనా ఒడంబడికపై ఆధారపడి రాజకీయ, విద్య, ఉద్యోగపరమైన రిజర్వేషన్లను కల్పించారు. వాటిని అమలు చేయడానికి అంటరాని కులాలను గుర్తించి, షెడ్యూల్డ్ కులాల జాబితాను రూపొందించారు. ఆ తర్వాత 1950లో, 1975లో ఈ జాబితా లను ప్రకటించారు. 1911లోనే ఈ ప్రక్రియ మొదలైనప్పటికీ, 1931 జనాభా లెక్కల్లో దీనికి ఒక నిర్దిష్టమైన విధానాన్ని ప్రతిపాదించారు. అందుకు తొమ్మిది అంశాలను పరిగణనలోనికి తీసుకున్నారు. ఏది అంటరాని కులమని నిర్ణ యించేందుకు వాటినే ప్రాథమిక ఆధారాలుగా నిర్ధారించారు. అవి: 1. ఈ కులానికి బ్రాహ్మణ పురోహితులు విధులు (పూజాది కార్య క్రమాలు) నిర్వహిస్తున్నారా? లేదా? 2. హిందువులకు సేవలందించే మంగలి, దర్జీ, నీళ్ళు మోసే వాళ్ళు ఈ కులానికి కూడా పనులు చేస్తారా? లేదా? 3. ఈ కులం వలన మైల పడిపోతామనే భావన ఇతర హిందూ కులాల్లో ఉందా? లేదా? 4. ఈ కులం ప్రజల నుంచి ఇతర హిందూ కులాలు నీటిని స్వీకరిస్తాయా? లేదా? 5. ఒకే రకమైన విద్యార్హతలు ఉన్నప్పటికీ హిందువుతో సమానంగా ఈ కులానికి చెందిన వ్యక్తిని గౌరవిస్తారా? లేదా? 6. హిందువులు పూజలు నిర్వహించే దేవాలయాల్లోకి ఈ కులాలకు ప్రవేశం ఉందా? లేదా? 7. ఇతర కులస్తులు ఉపయోగించే బాటలు, బావులు, కాలు వలు, పాఠశాలల్లోకి వీళ్ళను అనుమతిస్తారా? లేదా? 8. వెనుకబాటు తనానికి, పేదరికానికి, నిరక్షరాస్యతకు కులం కారణమౌతుందా? లేదా? 9. ఆ కులం నిర్వహిస్తున్న వృత్తి కూడా వారి జీవన గమనానికి ప్రతిబంధకంగా ఉందా? లేదా? పై తొమ్మది అంశాలలోనూ ప్రతికూలతలను ఎదుర్కొంటున్న వారిని అంటరానితనం అనుభవిస్తున్న కులంగా భావించి షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని నిర్ణయించారు. వాటి ఆధారంగానే ఇంత వరకు షెడ్యూల్డ్ కులాలను గుర్తిస్తున్నారు. ఓటు బ్యాంకు క్రీడలో గుజ్జర్ పావులు అయితే ఇటీవల ఓట్ల కోసం వివిధ పార్టీలు చరిత్రను, చట్టాలను, రాజ్యాంగాన్ని మరిచి పలువురిని ఎస్సీ లేదా ఎస్టీలలో చేరుస్తామని వాగ్దానాలు చేస్తూ పోతున్నాయి. అంటరాని కులాలతోపాటూ, కొన్ని ఇతర వెనుకబడిన కులాలు కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బాగా వెనుకబడిపోయాయనేది కాదనలేని వాస్తవం. కొన్ని ఆధిపత్య కులాలు మాత్రమే ఆర్థిక, సామాజిక రంగాలపై తరతరాలుగా గుత్తాధిపత్యం సాధించి, రాజకీయాధికారాన్ని హస్తగతం చేసుకోవడం వల్ల చాలా కులాలు అన్ని రంగాల్లో వివక్షకు గురవుతున్నాయి. అందువల్లనే ఆయా కులాలు తమ సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం అనివార్యంగా సంఘటితం అవుతు న్నాయి. ఎన్నో డిమాండ్లను ప్రభుత్వాల ముందు పెడుతున్నాయి. ఆ డిమాండ్లలో తమను ఎస్సీ, ఎస్టీ జాబితాల్లో చేర్చాలనేది కూడా ఉంటోంది. ఏ కులమైనా తమ ప్రగతి కోసం ఎలాంటి డిమాండ్లనైనా రూపొందించు కోవచ్చు. కానీ రాజకీయ పార్టీలు రాజ్యాంగపరమైన మౌలికాంశాలను విస్మరించి ఎన్నికల ప్రణాళికలలో చేస్తున్న వాగ్దానాలతోనే సమస్యలు తలెత్తుతున్నాయి. అలాంటి వాగ్దానాలు కొన్ని సార్లు హింసాత్మక ఘటనలకు సైతం దారితీస్తున్నాయి. ఉదాహరణకు, రాజస్థాన్‌ను కుదిపేసిన గుజ్జర్ల రిజర్వేషన్ల ఆందోళనలో దాదాపు 26 మంది మరణించారు. లెక్కకు మించిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమయ్యాయి. తమను ఎస్టీలలో చేర్చాలని డిమాండ్ చేస్తున్న గుజ్జర్లను ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఏళ్ళ తరబడి ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందుకు మినహాయింపు కావు. ప్రభుత్వాలు నియమించిన కమిటీలు ఈ డిమాండు సరైనది కాదని తేల్చి చెప్పాయి. గుజ్జర్ల ఎస్టీ హోదా డిమాండ్ పరిశీలనకు నియమించిన జస్టిస్ జస్రాజ్ చోప్రా కమిటీ నివేదిక(2007) ఆ డిమాండ్‌ను స్పష్టంగా తిరస్కరించింది. గుజ్జర్ల సామాజిక, ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించింది. నాటి ముఖ్యమంత్రి వసుంధరారాజే సింథియా ఈ నివేదికను కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు. 2013 ఎన్నికల ప్రణాళికలో ఆ రాష్ట్ర బీజేపీ గుజ్జర్లకు ఎస్టీ హోదా కల్పిస్తామనే వాగ్దానాన్ని వీడి, 5 శాతం రిజర్వేషన్లకు హామీ ఇచ్చింది. 2007నాటి జస్టిస్ జస్రాజ్ చోప్రా కమిటీ నివేదికను అమలు చేయడానికి మాత్రం ఏ ప్రభుత్వమూ ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఇదీ ప్రభుత్వాలు ఆడే రాజకీయ క్రీడ. రజకులతోనూ అదే ఆట! ఏపీలోని అధికార పార్టీ టీడీపీ రజకులను ఎస్సీలలో చేరుస్తామని తమ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. చరిత్ర క్రమాన్ని, వర్తమాన పరిస్థితులను పరిశీలించి ఆ వాగ్దానాన్ని అమలు చేయడం రాజ్యాంగపరంగా చెల్లుతుందా? లేదా? అనే దృష్టి నుంచి చూస్తే.... అది ఇప్పట్లో నెరవేరే పరిస్థితి కనిపించదు. అయినా ఈ డిమాండ్‌పై పదే పదే రాజకీయ పార్టీలు మాట్లాడుతుండడం వల్ల అటువంటివే మరికొన్ని డిమాండ్లు ముందుకు వస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి ఆచరణ సాధ్యంకాని డిమాండ్లను పరిష్కరిస్తామనే తప్పుడు హామీలతో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడటాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలకు నిజంగానే వెనుకబడిన ప్రజల మీద ప్రేమ ఉన్నట్లయితే, తమ బడ్జెట్లలో సంపన్న వర్గాలకు, కాంట్రాక్టర్లకు, పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్న రాయితీలలో ఐదు శాతం ఖర్చు పెట్టినా రజకులు దారిద్య్రం నుంచి బయటపడతారు. కానీ రజకులకు మేలు జరిగే ప్రయత్నాలు కానీ, వారిని పేదరికంలోంచి బయటపడేసే కృషి కానీ చేయకుండా ప్రభుత్వాలు వారిని మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నాయి. గ్రామాల్లో వచ్చిన మార్పులు, జీవితాల్లోకి వచ్చి చేరిన ఆధునికత కారణంగా రజకులు నేడు కుల వృత్తి మీద ఆధారపడి బతికే పరిస్థితి లేదు. వారికి విద్య, ఉపాధి అవకాశాలను, తగు శిక్షణను ఇచ్చి నూతన జీవన విధానంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి. వారిపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను అరికట్టడానికి తగు రక్షణలు కల్పించాలి. అంతే గానీ రాజ్యాంగపరంగా, చట్టపరంగా సమంజసం కాని వాగ్దానంతో వారిని ఓటు బ్యాంకుగా వాడుకోవాలని చూడడం రాజకీయ వంచన తప్ప మరొకటి కాదు. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213 -
బీసీ రిజర్వేషన్లకు ఇబ్బంది ఉండదు
బీసీ రుణమేళా సభలో మంత్రి కొల్లు రవీంద్ర బాబు భరోసా ఇచ్చారని వెల్లడి సీఎం జ్యోతి ప్రజ్వలనతో రుణమేళా ప్రారంభం సాక్షి, విజయవాడ బ్యూరో : ఎవరెన్ని చేసినా బీసీ రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా కాపాడతానని సీఎం భరోసా ఇచ్చినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలనతో సీఎం చంద్రబాబు రుణ మేళా ప్రారంభించారు. రుణ మేళాలో ఆటోలు, వీడియో కెమెరాలు, సెంట్రింగ్ యూనిట్, ఎయిర్ కంప్రెషర్, ఆయిల్ ఇంజిన్, కలంకారీ కిట్లు, పడ వలలు, చేపల వలలు, ఇస్త్రీ పెట్టెలు, బార్బర్ కుర్చీలు, మినీ ట్రాక్టర్లు, వడ్రంగి పనిముట్లు, కుండలు చేసే వస్తువులు, వెదురు కళాత్మక వస్తువుల తయారీ యూనిట్లు, జనరిక్ ఔషధాల పంపిణీకి సహాయం వంటి వాటికి రుణాలు అందించారు. సభకు మందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ బీసీలు చంద్రబాబు నాయకత్వాన్ని వదలరన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ బీసీలకు టీడీపీ తగిన ప్రాధాన్యత ఇస్తుం దని అన్నారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పి.రంగనాయకులు మాట్లాడుతూ బీసీ కులాలను ఆదుకునేలా మరిన్ని కార్యక్రమాలు అమలు చేయాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొచ్చులు అర్జునుడు, టీడీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, నాగుల్‌మీరా మాట్లాడారు. సభలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, నగర మేయర్ కొనేరు శ్రీధర్, ఎమ్మెల్యే శ్రీరాం తాతాయ్య, ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, ఎ రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య, మహిళా కార్పొరేషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య, బీసీ కార్పొరేషన్ డెరైక్టర్లు ఎల్ఎల్ నాయుడు పాల్గొన్నారు. -
కట్టుబడతారా? చిచ్చుపెడతారా?
కాపుల కోరికలను తీర్చడం సాధ్యం కాదన్నట్టు మాట్లాడిన చంద్రబాబు వారం తిరిగే సరికి అన్నిటికి సరే అంటున్నారు. ఇవి, కాపుల ఉద్యమం సద్దుమణిగేలా చేసేందుకు చెబుతున్న మాటలేనా లేక నిజాయితీగా పరిష్కారానికి ప్రయత్నిస్తారా? కాపు సామాజిక వర్గం భావోద్వేగాలతో ఆటలాడుకోవడం ప్రభువులకు మంచిది కాదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి రాజ్యాంగ సవరణ ద్వారా కాపులను బీసీలలో చేర్పించడమా? లేదా 2019 ఎన్నికల్లో ఆ వర్గం ఆగ్రహాన్ని చవి చూడ టమా? చంద్రబాబు తేల్చుకోవాలి. ఎన్నికల సందర్భంగా ఒక రాజకీయ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ మీద మరో మారు హామీని పొందడానికి ఒక రైలు తగలబడాల్సి వచ్చింది. లెక్క లేనంత మంది మీద దొమ్మీ, దహనం వగైరా కేసులు పెట్టాల్సి వచ్చింది. ఒక పెద్దాయన నాలుగు రోజులపాటు భార్యా సమేతుడై నిరవధిక నిరాహార దీక్ష చేయాల్సివచ్చింది. అంతేకాదు భార్యాభర్తలిద్దరూ స్వచ్ఛంద గృహ నిర్బం ధంలో గడపాల్సి వచ్చింది. మరో ఇద్దరు ఆత్మహత్యలు చేసుకోవడమూ తప్ప లేదు. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా, ఇప్పుడు కాకపోతే మరెన్నటికీ కాదు అనే దిక్కు తోచని స్థితిలో, పదేళ్లు అధికారానికి దూరమై పరితపిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలవికాని హామీలను తమ ఎన్నికల ప్రణాళికలో గుప్పించేశారు. అవన్నీ అమలు చేయడం తన వల్ల కాదని ఆయనకు బాగా తెలుసు. అయినా గెలవడం ముఖ్యం కానీ విశ్వస నీయతేమిటి ‘‘మై ఫుట్’’ అనేది మొదటి నుంచి చంద్రబాబు సిద్ధాంతం. కాబట్టి ఆయన అలవోకగా హామీలు ఇచ్చేశారు. అటువంటి హామీలను గురించి ఈ 19 మాసాల్లో చాలాసార్లు మీడియాలో రాసుకున్నాం, మాట్లాడు కున్నాం. అందుకే ఆయన మీడియా మైండ్‌సెట్ మారాలని చెప్తూ ఉంటారు. ‘మైండ్‌సెట్’ బాబు రుబాబు దాదాపు రెండేళ్లు గడుస్తున్నా రైతు రుణమాఫీ జరగలేదేమని అడిగితే ఆయ నకు కోపం వస్తుంది. ఇంటికో ఉద్యోగం ఏది? అంటే చికాకు ఎత్తుతుంది. డ్వాక్రా రుణ మాఫీ ఊసే ఎత్తొద్దు. ఎవరూ ఏమీ అడగకుండా, ఆయన చూపే అమరావతి చిత్రాలను తిలకించి పరవశిస్తుంటే చాలు.... ఆయనే ఆంధ్రప్ర దేశ్‌ను అభివృద్ధి చేసిపారేస్తారు. ఆయన చేయబోయే ఆ అభివృద్ధికి ప్రతి పక్షాలు, ప్రజలు అడ్డంకి కాబట్టి వారెవరూ అవసరం లేదు. రైతు రుణ మాఫీ గురించి మొన్న ఒక విలేకరి ప్రశ్నిస్తే... అత్యాశ ఉండటం మంచిది కాద న్నారు. మొత్తం రుణాలు మాఫీ చేస్తానన్నానా? నీ కలలోకి వచ్చి చెప్పానా? అని ఆ విలేకరిని దబాయించి పారేశారు. విశాఖపట్నంలో అత్యద్భుతమైన అంతర్జాతీయ వైమానిక దళ విన్యాసాలు జరుగుతుండగా... పనికిమాలిన కాపు ఉద్యమాన్ని పదే పదే చూపిస్తారా? అని టీవీ వాళ్ల మీద ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఇదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుత మైండ్‌సెట్. ఆయన మైండ్‌సెట్ ఎలాంటిదో చెప్పడానికి... ముద్రగడ పద్మనాభం నిరా హార దీక్ష విరమణతో తాత్కాలికంగా విశ్రాంతి కార్డు పడ్డ కాపు ఉద్యమం పట్ల ఆయన వ్యవహరించిన తీరే చాలు. కాపులను బీసీలలో చేర్చడం, కాపుల సంక్షేమానికి కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి దానికి ఏడాదికి వెయ్యి కోట్లు కేటా యించడం ఎన్నికల సమయంలో టీడీపీ ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒకటి. ‘ఆ హామీని అమలు చెయ్యకుండా రెండేళ్లు గాడిదలు కాస్తున్నావా బాబూ?’ అని కమ్యూనిస్ట్ నాయకుడు నారాయణ వ్యాఖ్యానించడంలో తప్పేముంది? ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన వాడిన భాష సముచితమైనది కాకపో వచ్చు. కానీ అంతిమ అర్థంలో జరిగింది అదే కదా! ముద్రగడ తునిలో కాపు గర్జన నిర్వహించిన నాడు విధ్వంసం జరుగుతుండగానే మీడియాను పిలిచి మాట్లాడిన బాబు... ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బు లేదు, కేంద్రం నుంచి సరైన సహకారం అందడం లేదన్నారు. మరి ముద్రగడ దీక్షను విరమింపజేయడానికి ఏటా వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తాం అని మళ్లీ ఎలా చెప్పారు? తొమ్మిది నెలల్లో మంజునాథ కమిషన్ నివేదికను ఇప్పిస్తాం, కేంద్రం ముందుపెట్టి రాజ్యాంగ సవరణ చేయించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పిస్తాం అన్న మాటలు ముద్రగడ దీక్షకు ముందు ఏమయ్యాయి? కేంద్రం వద్ద అంత పలుకుబడుందా? ఇలా బీసీ కులాలకు నష్టం జరగకుండా కాపులకు కూడా రిజర్వేషన్లను కల్పిం చాలంటే రాజ్యాంగ సవరణ జరగడం తప్పనిసరి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అందుకు ఒప్పించగలరా? రాజకీయంగా తనకు ఎలాంటి చిక్కులు రాని పరిస్థితుల్లో మాత్రమే బీజేపీ అందుకు ఇష్టపడుతుందని అందరికీ తెలుసు. కేవలం టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ వ్యాప్తంగా అది మరిన్ని తలనొప్పులను ఎందుకు తెచ్చిపెట్టుకుంటుంది? కాబట్టి ఆ హామీని చంద్రబాబు కచ్చితంగా నెరవేర్చగలరన్న నమ్మకం ఎవరికీ లేదు. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి లొంగి వచ్చేట్టు చెయ్యగల బలం టీడీపీకి లేదు. ఆ మాటకొస్తే కేంద్రంలో ఇవాళ బీజేపీకి ఏ మిత్ర పక్షం అవసరమూ లేదు. మరి కాపు సామాజిక వర్గం చంద్రబాబు మాటలను ఎలా నమ్మాలి? పోనీ బీసీలను సముదాయించి సమస్య పరిష్కారానికి కృషి చేయగలరా? అంటే అదీ సాధ్యం కాదని తేలిపోయింది. టీడీపీ శాసనసభ్యుడు ఆర్ కృష్ణయ్య స్వయంగా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటున్నారు. బీసీ జాబితా ఏమన్నా ధర్మసత్రం అనుకు న్నారా? అని కృష్ణయ్య కన్నెర్ర చేశారు కూడా. తన సొంత పార్టీ శాసన సభ్యుడి మైండ్‌సెట్‌నే చంద్రబాబు ఎందుకు మార్చలేక పోతున్నట్టు? బహి రంగంగా సవాలు చేస్తున్న కృష్ణయ్య మీద ఎటువంటి చర్యా తీసుకోకపోవ డమే కాదు, కనీసం మందలించకుండా మౌనం వహిస్తున్న ముఖ్యమంత్రి వైఖరిని చూసి చాలా మంది ఆయనే కృష్ణయ్య చేత అలా మాట్లాడిస్తున్నా రేమో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కరవమంటే కాపులకు కోపం, విడవమంటే బీసీలకు కోపం అన్న చందంగా తయారైంది. ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా వెనకా ముందు ఆలోచించకుండా చేసే వాగ్దానాలు చాలా వరకు ఇటువంటి తల నొప్పులే తెచ్చి పెడతాయి. నిజానికి ఈ పాపం కాంగ్రెస్ పార్టీదే. కాపులను గతంలో రెండుసార్లు బీసీల జాబితాలో నుంచి తొలగించి పుణ్యం కట్టుకున్నది కాంగ్రెస్ ముఖ్యమంత్రులే. కాపుల భావోద్వేగాలతో ఆడుకోవడం చేటు ఇక మొదటి రోజున ఇది సాధ్యం కాదు అన్న ధోరణిని వ్యక్తం చేసిన చంద్ర బాబు వారం తిరిగే సరికి ముద్రగడ దీక్ష తదనంతర పరిణామాల కారణంగా అన్నిటికి సరే అంటున్నారు. ఇవి, కాపుల ఉద్యమం సద్దుమణిగేందుకు చెబుతున్న మాటలేనా లేక నిజాయితీగా పరిష్కారానికి ప్రయత్నిస్తారా? అన్న సందేహం చాలా మందిలో కలుగుతున్నది. ఇప్పటికి నలుగురు ఆత్మ బలి దానాలకు పాల్పడ్డారు. ఆ సామాజిక వర్గం భావోద్వేగాలతో ఆటలాడుకో వడం ప్రభువులకు మంచిది కాదు. మొదట్లోనే చెప్పినట్టు ముద్రగడ దంపతుల చేత దీక్షను విరమింపజేయడం కోసం పాత హామీలపై ఇచ్చిన సరికొత్త హామీల వల్ల ప్రస్తుతానికి కాపు సామాజిక వర్గం కొద్ది మాసాల పాటూ శాంతించవచ్చు. కానీ వాటిని నెరవేర్చకపోతే మాత్రం కథ మళ్లీ మొదటికే వస్తుంది. అదలా ఉంటే, రేపటి నుంచి రోడ్డెక్కనున్న బీసీలను చంద్రబాబు ఎలా సముదాయిస్తారో చూడాలి. ఇంతకూ ముద్రగడ దీక్ష ఎందుకు విరమించినట్టు? తన మీద ప్రభుత్వం పెట్టిన కేసులు ఎత్తి వేయించుకోడం తప్పించి మరేమీ లేదు అని మరో కాపు నాయకుడు మాజీ మంత్రి హరిరామ జోగయ్య వ్యాఖ్యానించారు. నిజానికి అది సాధ్యం కాని పని. తుని కాపు గర్జన సందర్భంగా జరిగిన విధ్వంసంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు తగలబడిన ఘటన, పోలీస్ స్టేషన్లపై దాడులు, పోలీసులను గాయపర్చటం వంటి ఘటనల మీద కేసులు ఉండవు అని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి లేదా ఆయన తరఫున రాయబారం నెరపిన మంత్రులు, నాయకులు ఎవరయినా ఇచ్చారా? అట్లా ఇచ్చి ఉంటే మళ్లీ ఒక మోసానికి తెర లేచినట్టే లెక్క. అదలా ఉంటే, తుని ఘటనలపై దర్యాప్తు చేయించి బాధ్యులపై కేసులు పెడతామని చంద్రబాబు అన్నారు. ఆ దర్యాప్తు ఏ కోణ ంలోంచి జరగబోతోందో. అందులో ఎవర్ని బాధ్యులను చేసి ఎవరిని అక్రమంగా కేసులలో ఇరికించబోతున్నారో ముఖ్యమంత్రి మాటల్లోనే స్పష్టం అవుతున్నది. అసలు దోషులను వదిలేసి, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలను తప్పుడు కేసుల్లో ఇరికించడం టీడీపీ అధినేతకు కొత్తేమీ కాదు. అందుకే ఆయన తొలిరోజు నుంచీ పదేపదే పులివెందుల, వైఎస్సార్ కాంగ్రెస్ రెండు పేర్లే పలవరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఇప్పుడు రెండు మార్గాలు న్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి రాజ్యాంగ సవరణ ద్వారా కాపులను బీసీలలో చేర్చి ఆ వర్గాన్ని శాంతింపజేయడం లేదా 2019 ఎన్నికల్లో ఆ వర్గం ఆగ్రహాన్ని చవి చూడ టం. ఇప్పటికే చంద్రబాబు వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న బీజేపీ ఈ సమస్య నుంచి ఆయనను గట్టెక్కిస్తుందా? - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
బీసీలను రెచ్చగొడుతున్నారు: చంద్రబాబుపై రఘువీరా ఫైర్
- కాపుల విషయంలో సీఎం చంద్రబాబుది రెండు కళ్ల వైఖరి - చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ తీర్మానం చేయాలి - కాపు కులాల సదస్సులో పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఉద్ఘాటన - ముద్రగడ పద్మనాభం చేపట్టిన సభను విజయవంతం చేయాలని పిలుపు సాక్షి, విజయవాడ బ్యూరో: కాపులను బీసీల్లో చేర్చే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంభిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ఒకవైపు కాపులను బీసీల్లో చేరుస్తానని మాయమాటలు చెబుతూ మరోవైపు చందాలు ఇచ్చి మీటింగ్‌లు పెట్టించి బీసీలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. విజయవాడలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల సదస్సులో రఘువీరారెడ్డి మాట్లాడారు. ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చాయని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ, బీజేపీలు ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఏకగ్రీవ ఆమోదం ఉన్నందున చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో తీర్మానం చేసి ఫిబ్రవరి నెలాఖరులోగా పార్లమెంట్‌కు పంపితే కాంగ్రెస్‌తోపాటు యూపీఏ భాగస్వామ్య పక్షాలు మద్దతు ఇస్తాయని చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చే దిశగా కృషి చేసేందుకు కాంగ్రెస్‌లో కాపు విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రఘువీరారెడ్డి ప్రకటించారు. ముద్రగడ పద్మనాభం నిర్వహించే సభకు వెళ్లొద్దంటూ టీడీపీలోని కాపు ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రకటనలు చేస్తూ కాపు జాతికి ద్రోహం చేస్తున్నారని రఘువీరా మండిపడ్డారు. ముద్రగడ ఈ నెల 31న తలపెట్టిన సభకు పార్టీలకు అతీతంగా తరలివెళ్లి విజయవంతం చేయాలని, ప్రభుత్వంపై వత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. ఒక సామాజికవర్గం కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చే విషయంలో చంద్రబాబును శంకించాల్సి వస్తోందని శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత సి.రామచంద్రయ్య అన్నారు. గతంలో ఇచ్చిన పుట్టుస్వామి కమిషన్ రిపోర్డును ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా కాపులను బీసీల్లో చేర్చే విషయంలో కాలపరిమితిని ప్రకటించకపోవడం అనుమానానికి తావిస్తోందన్నారు. రాష్ర్టంలో ఒక సామాజికవర్గం కోసమే టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని, పదవులు, భూములు, కాంట్రాక్టులు అన్నీ ఆ సామాజికవర్గం చేతిలోనే ఉన్నాయని సి.రామచంద్రయ్య ఆరోపించారు. ఇదిలా ఉండగా, దివంగత కాపు నేత వంగవీటి మోహనరంగా ఫొటో వేదిక వెనుక ఫ్లెక్సీలో లేకపోవడంపై ఆగ్రహించిన ఆయన అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. వేదికపై ఉన్న నేతలు స్పందిస్తూ పొరపాటు జరిగిందని అంగీకరించి ఫ్లెక్సీలో రంగా ఫొటోను ఏర్పాటు చేయడంతో వివాదం సద్దుమణిగింది. సదస్సులో రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, పీసీసీ ప్రధాన కార్యదర్శి నరహరశెట్టి నర్సింహారావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు తదితరులు మాట్లాడారు. -
కొడుకు, కూతురు పెత్తనం చెలాయిస్తారా?
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలో బీసీ, మైనార్టీ నేతలను ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను హైదరాబాద్ బీసీ, మైనార్టీ మంత్రులకు కాకుండా.. తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎంపీ కవితకు అప్పగించడమే ఇందుకు నిదర్శనమని వీహెచ్ విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ పల్లకీ మోస్తే.. సీఎం కొడుకు, కూతురు పెత్తనం చెలాయిస్తారా? అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌లో మేయర్ అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం లేదని వీహెచ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తాలు అంతా బయటకు పోయిందని, ఇక గట్టి నేతలే పార్టీలో ఉన్నారని అన్నారు. -
సమసమాజ దార్శనికుడు ఆర్.కృష్ణయ్య
అణగారిన కులాలు స్వాతంత్య్ర ఫలాలు పొందలేక పోవడానికి కారణం వీరికి ఆధునిక విద్య లేకపోవడ మేనని గ్రహించి దాని కోసం పెద్ద ఉద్యమమే చేయాలని గుర్తించిన తొలి వ్యక్తి ఆర్.కృష్ణయ్య. బీసీలు చదువుకోవడానికి కావలసింది ఉచిత వసతి గృహాలని వాటి కోసం తొలిసారిగా ఉద్యమాన్ని ప్రారం భించాడు. ఈ ఉద్యమంతోటే ప్రభుత్వం హాస్టళ్లు మంజూరు చేసింది. దీంతోనే ఈ రోజున లక్షలాది బీసీ విద్యార్థులు ఉచిత భోజన వసతి సౌకర్యంతో చదువుకోవడానికి అవకాశం లభించింది. పలువురు బీసీ విద్యార్థులు మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. 1975కు ముందు బీసీ విద్యార్థులకు ఉపకార వేతనం అనేది లేదు. బీసీ, ఈబీసీ విద్యార్థులకు కూ డా స్కాలర్షిప్పులు, ఫీజులు మంజూరు చేయాలని ఉద్యమం చేసిందీ కృష్ణయ్యే. దీని ఫలితంగానే నాటి సీఎం జలగం వెంగళరావు బీసీ స్కాలర్షిప్లు, మెస్‌చార్జీల స్కీములను పెట్టారు. స్కాలర్ షిప్‌లు సాధించడమే కాదు ఏటికి ఏడు పెరుగుతున్న ధర లకనుగుణంగా స్కాలర్షిప్లను పెంచేలా చేయడా నికి కూడా తిరిగి కృష్ణయ్య నేతృత్వంలో ఉద్యమాలు నడిచాయి. వేలాది హాస్టళ్లలో, రెసిడెన్షియల్ పాఠ శాలల్లో లక్షలాది విద్యార్థులు ఈనాడు కడుపునిండా భోజనం చేస్తున్నారంటే కృష్ణయ్య చేసిన ఈ ఉద్యమ ఫలితమే. బి.సి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి రెసిడెన్షియ ల్ పాఠశాలలు ఎంతో అవసరమని గుర్తించి 1982లోనే ఇందు కోసం ఉద్యమించారు ఆర్.కృష్ణయ్య. ఈ ఉద్యమ ఫలితంగానే అదే ఏడాది 44 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠ శాలలు మంజూరయ్యాయి. ఇప్పటి వరకూ 617 పాఠశాలలు మంజూరయ్యాయి. వీటి ల్లో దాదాపు మూడు లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇలాంటి స్కీము దేశంలోని మరే రాష్ట్రాలలోనూ లేదు. అన్ని వృత్తి విద్యాకోర్సులలో చదివే బీసీ విద్యా ర్థులకు మొత్తం ఫీజులను ప్రభుత్వమే భరించాలని 1994 నుండి 2008 వరకు సుదీర్ఘ పోరాటాలు నడి పాడు ఉద్యమాలు చేశారు కృష్ణయ్య. ప్రభుత్వాలు దిగిరాకపోతే 2008 జనవరిలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. దీనితో ప్రభు త్వం దిగివచ్చింది. కృష్ణయ్యతో ప లు దఫాలుగా చర్చలు జరిపి, జి. ఓ.నెం. 18, 50లు జారీ చేశారు. ఈ ఉద్యమక్రమంలో 650 సార్లు ధర్నా లు, ర్యాలీలు, ప్రదర్శనలు జరిగాయి. ఈ ఉద్యమ ఫలితంగానే ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకం అ మలైంది. ఈ స్కీము ద్వారా 26 లక్షల మంది అణగారిన కులాల నిరుపేద విద్యా ర్థులు ఉన్నత విద్యను వృత్తి విద్యను పొంది జీవితంలో ఉన్నత స్థానాల్నీ పొందగలుగుతు న్నారు. ఇలాంటి ఉద్యమక్రమాలలో వచ్చిన చాలా జి.ఒ.లలో ఆర్.కృష్ణయ్య పేరు కూడా ఉండడం ఆయన చేసిన ఉద్యమాలకు ఒక నిదర్శనం. బీసీ లకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడానికి, లక్షలాది ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడానికి 1976 నుండి ఇప్పటి దాకా నిర్విరామం గా ఉద్యమాలు నడుపుతూనే ఉన్నారు కృష్ణయ్య. ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం లో ఉన్నత విద్యను అభ్యసించిన కృష్ణయ్య విద్యార్థి నాయకుడి స్థాయి నుండి సామాజిక ఉద్యమాలు చేశాడు. తండ్రి 140 ఎకరాల భూస్వామి అయినా కూడా కుటుంబానికి దూరం అయిన కొద్ది కాలంలో పేదరికం అంటే ఎలా ఉంటుందో కూడా చవిచూ శారు కృష్ణయ్య. ఆధిపత్య కులాల వారితో సమంగా వెనుకబ డిన కులాల వారు ఉన్నత విద్యను, ఉన్నత పద వులను పొందినప్పుడే దేశంలో సమసమాజం సిద్ధిస్తుందన్నది కృష్ణయ్య సామాజిక సిద్ధాంతం. ఇదే ఆయన దార్శనికత. నేడు 60వ పుట్టిన రోజు జరు పుకునే ఆర్.కృష్ణయ్య ఇంకొక 60 జన్మదినోత్సవాలు జరుపుకోవాలని, తమకు సమసమాజ ఫలాలు అం దించాలని కోరుకుంటున్నారు అణగారిన కులాల ప్రజలందరూ. (నేటికి ఆర్.కృష్ణయ్యకు 60 వసంతాలు) డా॥వకుళాభరణం కృష్ణమోహన్‌రావు పూర్వ సభ్యులు, రాష్ట్ర బీసీ కమిషన్ సెల్: 9849912948 -
'బీసీల కోసం కొత్త రాజకీయ పార్టీ'
హైదరాబాద్: వెనుకబడిన తరగతి (బీసీ)కి చెందిన కులాలను రాజకీయ పార్టీలన్నీ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, అవసరాల కోసం ఉపయోగించుకుని, ఆ తరువాత మొండి చేయి చూపిస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్ బీ నగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అన్నారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీల కోసం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందన్నారు. పాలకులు బీసీల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పదవులే సామాజిక న్యాయమా?
పౌరుల సమస్యలను ఓట్లతో కొలుస్తుండటం వల్లనే సామాజిక న్యాయంలోని ఆర్థిక, సామాజిక అంశాలు తరచుగా మరుగున పడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలను, మైనారిటీలను ఉద్ధరిస్తామంటున్న నాయకులంతా మాట్లాడేది పదవుల పంపకం గురించే. ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సమస్యలు వారికి పట్టడం లేదు. అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామని చెప్పుకుంటున్న నేతలు ఆ వర్గాల ప్రజలను దుర్భర పరిస్థితుల నుంచి బయటపడేసే చర్యల పట్ల ఉపేక్ష చూపుతున్నారు. అణగారిన వర్గాల నుంచి ఎదిగి వచ్చిన నాయకులు పదవులను, హోదాలను తమ సామాజిక వర్గాలను దుర్భర దారిద్య్రం నుంచి, సామాజిక అణచివేత నుంచి విముక్తి చేసే సాధనాలుగా ఉపయోగించాలి. అది వారి కనీస బాధ్యత. సామాజిక న్యాయం పేరిట తమ కులానికి, మతానికి, తెగకు, ప్రాంతానికి, జిల్లాకు పదవులు దక్కాలనే నినాదాలు, వివాదాలు పదేపదే వినపడుతుంటాయి. ప్రభుత్వాలు, పార్టీలు కూడా పదవులను ఆ ప్రాతిపదికపైనే పంపిణీ చేశామని, అదే సామాజిక న్యాయమని చెబుతుంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత సామాజిక తెలంగాణ, సామాజిక ఆంధ్ర ఏర్పడాలనే చర్చ కూడా ఇటీవల సాగుతోంది. సామాజిక న్యాయం గురించి ఇప్పుడు ఎక్కువగానే మాట్లాడుతున్నాం. కానీ, సామాజిక న్యాయం విస్తృతిని గురించి మాత్రం తక్కువగా ఆలోచిస్తున్నాం. ఇంగ్లిష్ సోషల్ జస్టిస్‌కు సమానార్థకంగా సామాజిక న్యాయం వాడుతున్నాం. రోమన్ న్యాయదేవత పేరు ‘జస్టిటియా’ నుంచే జస్టిస్ పదం వాడుకలోకి వచ్చింది. క్యాథలిక్ ఆలోచనాపరులతో 1840 నుంచి సోషల్ జస్టిస్ అనే భావన వాడుకలోకి వచ్చినట్టు చరిత్ర చెబుతున్నది. ప్రముఖ రాజనీతి శాస్త్రవేత్త జాన్ స్టువర్ట్ మిల్ దీనిని విస్తృతంగా ఉపయోగించారు. ఆయన తన ‘యుటిలిటేరియనిజం’లో ‘‘సమా జంలోని ప్రతి వారిని సమానత్వ దృక్పథంతో చూడాలి. వనరులతో సహా సమా జంలోని అవకాశాలన్నీ సమాన ప్రాతిపదిక పైనే పంపిణీ జరగాలి’’ అని ప్రతిపాదించారు. ఆ విధంగా చూస్తే అరిస్టాటిల్ నుంచి అంబేద్కర్ వరకు సామాజిక, రాజనీతి శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు చాలా మందే సామాజిక న్యాయం గురించి లోతైన వ్యాఖలు చేశారు. ‘‘సమాజంలో మానవుడు సంపూర్ణ వ్యక్తిగా రూపొందాలి. న్యాయం, చట్టం లేకుండా మనిషి బతికితే ఆ పరిస్థితులు భయానకంగా ఉంటాయి’’ అని అరిస్టాటిల్ అన్నాడు. 19, 20 శతాబ్దాలలో సోషల్ జస్టిస్‌పై విస్తృతంగా చర్చ సాగింది. బాబా సాహెబ్ అంబేద్కర్‌కు ఆచార్యులైన జాన్ డ్యూయి లాంటి వారు దీనిని బాగా ప్రచారంలోకి తీసుకొని వచ్చారు. అమెరికా మానవ హక్కుల ఉద్యమ నేత, నల్ల జాతి రత్నం మార్టిన్ లూథర్‌కింగ్ ‘‘అన్యాయం తాండవిస్తున్న ప్రతి చోటా న్యాయం లేచి నిలబడు తుంది’’ అని పలికి ఎందరికో ఉత్తేజాన్ని కలిగించారు. అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే ‘‘సామాజిక న్యాయానికి సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం పునాదిగా ఉండాలి’’. అంటే సామాజిక న్యాయం... కులం, వర్ణం, అధికారం, హోదా, లింగ విభేదాలు సమసిపోయేట్టు చేసే ఆయుధం కావాలని ఆయన ఆకాంక్ష. సమాజంలోని ఆర్థిక వనరులు, సామాజిక రాజకీయ అవకాశాలు సమంగా పంపిణీ జరగాలనేదే ఆయన దృక్పథం. ఆ వెలుగులోనే సామాజిక న్యాయం అనే అంశాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది. ఓట్ల కొలబద్ధపై సామాజిక న్యాయం నేటి సామాజిక న్యాయం చర్చంతా రాజకీయరంగంపైనే కేంద్రీకరించి ఉంది. కులాలు, మతాలు, తెగలు, ప్రాంతాలు తమ రాజకీయ వాటాల గురించే ఎక్కు వగా మాట్లాడుతున్నాయి. ఆయా సమూహాల్లోని అభివృద్ధి చెందిన లేదా ఎదిగి వచ్చిన శక్తులే ఈ చర్చ ఎక్కువగా చేస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు, ప్రభుత్వాలు సామాజిక న్యాయంపై చర్చను పూర్తిగా పదవులు పంపకం వ్యవహారంగా మార్చేస్తున్నాయి. రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలు నడిపే వారికి అంతిమంగా కావాల్సింది ఓట్లే. అందువల్ల సమాజంలోని మెజార్టీ జనాభాగా లేదా నిర్ణయాత్మక జనాభాగా ఉన్న కులాలకు ఎక్కువ ప్రాధాన్య తనిస్తూ, తక్కువ జనాభా కలిగిన, సంఖ్యాపరంగా ప్రాధాన్యంలేని వారిని లెక్కలోకి తీసుకోవడమే లేదు. దీంతో వారికి రాజకీయ రంగంలో కూడా సరైన ప్రాతినిధ్యం లభించడం లేదు. అందుకే రాజకీయపరమైన సామాజిక న్యాయం చాలా సమూహాలకు అందడం లేదన్నది నిర్వివాదాంశం. పౌరుల సమస్యలను ఓట్లతో కొలుస్తుండటం వల్లనే సామాజిక న్యాయం లోని విడదీయరాని అంశాలైన ఆర్థిక, సామాజిక అంశాలు తరచుగా మరుగున పడుతున్నాయి. మనదేశంలో కులాలు, తెగలు, మతాలు ఎన్నో ఏళ్లుగా ఉనికిలో ఉన్నాయి. వాటిలో కొన్ని తరతరాలుగా సర్వసౌకర్యాలూ అనుభ విస్తూ, ఆధిపత్యంలో కొనసాగుతుంటే, మరికొన్ని అభివృద్ధి ఫలాలను అందు కోలేకపోతున్నాయి. నిజానికి సామాజిక న్యాయం అవసరమయ్యేది ఇక్కడే. పార్టీలు, ప్రభుత్వాలు కొన్ని కులాలకు, తెగలకు, మతాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ఆచరణలో ఆయా వర్గాలలో ఎదిగి వచ్చిన నాయకులకు మాత్రమే ప్రయోజనం చేకూరడం సర్వసాధారణంగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వగైరాలను ఉద్ధరిస్తామంటున్న నాయకులంతా మాట్లాడేది పదవుల పంపకం గురించే. ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సమస్యలు వారికి పట్టడం లేదు. ముస్లింలకు, క్రైస్తవులకు ప్రాతినిధ్యం కల్పించామని గొప్ప లు చెప్పుకుంటున్న నేతలు ఆ వర్గాలలోని ప్రజానీకాన్ని వారు అనుభవిస్తున్న దుర్భర పరిస్థితుల నుంచి బయటపడేసే చర్యల పట్ల ఉపేక్ష చూపుతున్నారు. పదవులు సామాజిక న్యాయ సాధనాలు కావాలి ఒకవైపు అధికార వర్గాలు తమ రాజకీయ ప్రయోజనం కోసం సామాజిక న్యాయాన్ని వాడుకుంటుంటే, రెండో వైపు ‘సామాజిక న్యాయం’ పేరిట పదవులు పొందిన నాయకులు, పొందాలనుకుంటున్న నాయకులు అదే తమ ఎజెండాగా చెప్పుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సామాజిక న్యాయం అనే పదం నేడు అపభ్రంశానికి గురైంది. నిజమైన అర్థంలో దాన్ని ఆచరింపబ డటం లేదు. అలా అని రాజకీయ రంగంలో సామాజిక న్యాయం అమలు కానవసరం లేదని కాదు. ఆయా వర్గాలకు ఆ భాగస్వామ్యం, ప్రాతినిధ్యం దక్కాల్సిందే. కానీ అది అంత వరకే పరిమితం కారాదు. అదే పరమావధి కాకూ డదు. అది ఒక ఆరంభంగా భావించి అణగారిన వర్గాల నుంచి ఎదిగి వచ్చిన నాయకులు పదవులను, హోదాలను తమ సామాజిక వర్గాలను దుర్భర దారి ద్య్రం నుంచి, సామాజిక అణచివేత నుంచి విముక్తి చేసే సాధనాలుగా ఉపయో గించాలి. సామాజిక న్యాయ సూత్రాన్ని ఆసరాగా చేసుకొని పదవులు పొందిన వారు నిర్వర్తించాల్సిన కనీస బాధ్యత ఇది. దేశంలోని కుల వ్యవస్థ సామాజిక న్యాయ సూత్రానికి విరుద్ధమైన భావ జాలాన్ని మన మెదళ్లలో నింపింది. మనిషి కులాన్ని బట్టి ఆర్థిక, సామాజిక స్థితిగతులు నిర్ణయమవుతున్నాయి. నేటి ఆధునిక ప్రజాస్వామ్య యుగంలో సైతం కుల వ్యవస్థ నిచ్చెన ఎగువ మెట్ల పైన ఉన్న శక్తులు కింద ఉన్న వారిని పైకి రానీయకుండా అడ్డుకోవడం ఆనవాయితీగానే ఉంది. దీంతో ఆ వర్గాలు సామాజిక, ఆర్థిక ఫలితాలను అందుకోలేకపోతున్నాయి. తరతరాలుగా జరుగు తున్న ఈ దుర్మార్గమైన వివక్షను పాలక వర్గాలు మరింత పెంచి పోషిస్తున్నాయి. ఆ వివక్షను రూపుమాపడానికి కృషి చేయాల్సిన అణగారిన వర్గాల రాజకీయ నాయకత్వం తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ఆధిపత్య వర్గాలతో మిలా ఖత్ అవుతున్నది. ఫలితంగా అణగారిన వర్గాలు ఇంకా అణచివేతకు గురవు తున్నాయి. ఇది తీవ్ర సంక్షోభానికి దారి తీస్తున్నది. దీనిపై విస్తృతంగా చర్చ జరగాలి. అంతరాలు కూలితేనే... భూమి, ఉపాధి, విద్య, వైద్యం, ఉద్యోగాలు తదితర అంశాల్లో అణగారిన వర్గాలకు దక్కాల్సిన సమభాగం ఇంకా అందడంలేదు. భూమిలేని పేదలు రోజు రోజుకీ పెరుగుతున్నారు. ఆర్థిక రంగంలో వచ్చిన పెనుమార్పులు కాస్తో, కూస్తో భూములున్న పేదలను భూమిలేని వ్యవసాయ కూలీలుగా మార్చి, బజారున పడేశాయి. ప్రైవేటు విద్యా సంస్థల ప్రయోజనం కోసం ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వాలే ధ్వంసం చేశాయి. కార్పొరేట్ వైద్య రంగం కోసం ప్రభుత్వ వైద్య వ్యవస్థకు కూడా అదే గతి పట్టించాయి. ఫలితంగా నిరుపేదలు జీవించే హక్కునే కోల్పోతున్నారు. ఆదివాసులు, దళితులు సాధారణ జ్వరాల కు సైతం చనిపోవాల్సి వస్తోంది. సంప్రదాయక వృత్తులు దెబ్బతినడం వల్ల వెనుకబడిన కులాల వారు ఉపాధిని కోల్పోయి, ఆకలిచావులకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలు కూడా రోజురోజుకీ పెరుగు తున్నాయి. నిత్యం దేశంలో ఏదో ఒక మూల దళిత మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆత్మగౌరవంతో తలెత్తి నిలిచిన యువ కుల తలలు తెగి పడుతూనే ఉన్నాయి. ఇలాంటి దురన్యాయాలు అంతం అయినప్పుడే న్యాయం జరుగుతుంది. సామాజిక న్యాయం మూల సిద్ధాంతానికి సరైన అర్థం దొరుకుతుంది. ఇటీవలే తుదిశ్వాస విడిచిన ప్రముఖ మానవ హక్కుల నేత జస్టిస్ కృష్ణయ్యర్ ‘‘సమాజంలో ఎవరైనా అవస్థల పాలవు తున్నారంటే మనం సిగ్గుతో తల వంచుకోవాలి’’ అని అన్నారు. అందుకే ఇటువంటి అన్ని రుగ్మతల కు విరుగుడుగా అంబేద్కర్ నాయకత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం, 38వ అధికరణం ద్వారా సామాజిక న్యాయానికి చట్టబద్ధ పరిష్కారాన్ని చూపిం ది. ‘‘జాతీయ జీవన రంగాలన్నిటిలో, సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం పెంపొందించు సామాజిక వ్యవస్థను వీలైనంత సమర్థవంతంగా సమకూర్చి దానిని కాపాడటం ద్వారా దేశ ప్రజల క్షేమాన్ని పెంపొందించడానికి ప్రభు త్వాలు కృషి చేయాలి’’ అని నిర్దేశించింది. దానిని తు.చ. తప్పక అమలు చేయగలిగితేనే సామాజిక న్యాయం సమకూరుతుంది. - మల్లేపల్లి లక్ష్మయ్య (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ నం: 9705566213) -
ఇదేనా బీసీలపై ప్రేమ!
అన్ని రాజకీయ పార్టీలూ వెనుకబడిన కులాలను ప్రత్యే కించి బీసీలను కరివేపాకులాగా వాడుకుంటున్నాయి. ఎన్నికలముందు అన్ని పార్టీలూ దళితులకు, బీసీలకు పెద్ద పీటవేస్తున్నాం అంటూ ఊరించి గద్దెనెక్కిన తర్వాత అలా గే వదిలేస్తున్నాయి. తెలుగుదేశంపార్టీ ఏర్పడినప్పటి నుం చి బీసీలు ఆ పార్టీకి అండగా నిలిచారు. కానీ పార్లమెంటులో సుదీర్ఘ అనుభవమున్న బీసీ నేతలను కాదని, ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు కేటాయించారు. పొలిట్ బ్యూరోలోనూ వారికే స్థానాలు కల్పించడం, అదే సామాజిక వర్గానికి తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ పదవిని కట్టబెట్టడం వంటి నిర్ణయాలతో పలురకాలుగా బీసీలను టీడీపీలో వెనుక బెంచీలకే పరిమి తం చేసింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీలలో ఒకరిని కేంద్రమంత్రిగా నియమించేందుకోసం ప్రయత్నించాలి. రాబోయే శాసనమండలిలో బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించి బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులకు రుణ సదుపాయం కల్పించి ఆదుకోవాలి. యర్రమోతు ధర్మరాజు ధవళేశ్వరం, తూ.గో. జిల్లా -
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
కడ్తాల: బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మె ల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తిం పజేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ యాక్ట్లాగే బీసీలకు యాక్ట్ ను అమలుచేయాలన్నారు. నిరుపేద బీసీలకు మూడెకరాల భూమిని కేటాయిం చాలన్నారు. మంగళవారం ఆమనగల్లు మండలం కడ్తాల గ్రామంలోని ఏంబీఏ గార్డెన్లో నిర్వహించిన బీసీల సింహగర్జన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. దేశంలో బీసీలుగా పుట్టడమే పాపమైం దని, వారిని ఏ రాజకీయపార్టీలు, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో 115 మంది బీసీ సభ్యులున్నా మాట్లాడలేని పరిస్థితి నెలకొం దన్నారు. రాజ్యాధికా రం లేని కులాలు బానిసలతో సమానమని, స్వయంపాలన కోసం బీసీలు ఉద్యమించాలని, అవసరమైతే బోడోలు, గుజ్జర్ల తరహా లో ఆందోళనలు కొనసాగించాలని పిలుపుని చ్చారు. పార్లమెంట్, అసెంబ్లీ లు పారి శ్రామికవేత్త లు, కాంట్రాక్టర్లు, రియల్టర్లతో నిండిపోయాయని, దీం తో ఎంపీ, ఎమ్మెల్యే లు ప్రజాసమస్యలను పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మం త్రిత్వశాఖను ఏర్పాటుచేసి బడ్జెట్లో రూ.50వేల కోట్లతో సబ్‌ప్లాన్‌ను ఏ ర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు. ఫీజు రీయింబ ర్స్మెంట్ పథకాన్ని అమలుచేయాలన్నారు. ఈ సందర్భం గా మంగల్‌పల్లి గ్రామంలో లైంగికదాడికి గురైన బాలికను, వారి తల్లిదండ్రులను పరామర్శించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. బీసీలంతా సంఘటితంగా ఉద్యమించాలి అంతకుముందు మాజీమంత్రి జే.చిత్తరంజన్‌దాస్, మాజీ ఎమ్మెల్యే జి.జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. బీసీలంతా హక్కులసాధన కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం నియోజకవర్గంలో ఎన్నికైన బీసీ ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీసీ సంక్షే మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దుర్గయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు అశోక్, బీసీ ప్రంట్ అధ్యక్షుడు మల్లేశ్‌యాదవ్, గౌడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, ఆమనగల్లు ఎంపీపీ లలితమ్మ, బీసీ మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శారద, నా యకులు రామకృష్ణ, ఆంజనేయులు, నర్సింహా, చందోజీ పాల్గొన్నారు. -
బాబు దృష్టిలో బీసీ అంటే బిజినెస్ క్లాసే: ధర్మాన కృష్ణదాస్
హైదరాబాద్ : కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు అన్యాయం జరిగిందని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైఎస్ఆర్ సీపీ నేత ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. మొదట అశోక్ గజపతిరాజుకు కేంద్రమంత్రి పదవి ఇచ్చి టీడీపీ బీసీలకు అన్యాయం చేసిందని ఆయన సోమవారమిక్కడ అన్నారు. చంద్రబాబు నాయుడు దృష్టిలో బీసీ అంటే బిజినెస్ క్లాసే అని ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. విస్తరణలో అవకాశం వస్తుందని ఎదురు చూసినవారికి నిరాశే మిగిల్చారన్నారు. సుజనా చౌదరిలాంటి వ్యాపారవేత్తను కేంద్రమంత్రిని చేసిన వైనానికి విస్తుపోతున్నామని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అధికారంలోకి రాకముందు బీసీ జపం చేసిన చంద్ర బాబు కేంద్ర మంత్రి వర్గంలో బీసీలకు స్థానం ఎందుకు కల్పించలేదని ఆయన ప్రశ్నించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పదవులు కట్టబెట్టడం చూస్తే బాబు వైఖరి అర్ధం అవుతోందని ఆయన అన్నారు. దీనికి చంద్రబాబు పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. 21మందిని రాజ్యసభ సభ్యులుగా టీడీపీ చేస్తే అందులో నలుగురైదుగురు మాత్రమే బీసీలు ఉన్నారన్నారు. సుజనా అక్రమాలపై ఆంధ్రజ్యోతి దినపత్రికలో అనేక కథనాలు వచ్చాయని ధర్మాన కృష్ణదాస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సృజనాత్మక మాయ అంటూ అనేక కథనాలు వచ్చాయని, అలాంటి వ్యక్తిని చంద్రబాబు కేంద్రమంత్రిని చేశారన్నారు. అధికారం, పార్టీ ప్రయోజనాల కోసమే చంద్రబాబు తాపత్రయమని ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందని ఆయన అన్నారు. -
చంద్రబాబుది కపట ప్రేమ
కె.కోటపాడు : ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తుంటారని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. మండలంలోని చౌడువాడలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రం నుంచి పార్లమెంట్‌కు ఎంపికైన బీసీలకు పదవి దక్కకపోవడం విచారకరమన్నారు. మొదటిసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అశోక్ గజపతిరాజుకు, రెండోసారి సుజనా చౌదరికి మంత్రి పదవులు దక్కాయన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీసీకి చెందిన ఒక్క ఎంపీకీ మంత్రి పదవి లభించలేదన్నారు. ఈమాత్రం దానికి బీసీలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్టు చంద్రబాబు ప్రచారార్భాటం చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే బాబు బీసీలపై ప్రేమ ఒలకబోస్తారని ఆరోపించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల నాయకులు దాట్ల తాతరాజు, రెడ్డి జగన్మోహన్, దాట్ల శివాజీబాబు, బోయిదాపు జగదీశ్వరరావు, ఎటుకూరి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
బీసీ బిల్లు కోసం దేశవ్యాప్త ఉద్యమం
హైదరాబాద్: చట్టసభల్లో బీసీలకు 50 శాతం ప్రాతినిధ్యం కల్పించే బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమించాలని బీసీ సంఘాలు నిర్ణయించాయి. అందులో భాగంగా అక్టోబర్ 5వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లో పర్యటించి బీసీ బిల్లుకు మద్దతు కూడగట్టాలని తీర్మానించాయి. హైదరాబాద్‌లోని బీసీ భవన్లో ఆదివారం జరిగిన సమావేశంలో 26 బీసీ సంఘాలు, 12 రాష్ట్రాల బీసీ ప్రతినిధులు, 18 బీసీ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ బిల్లు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమ పోరాట ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీలో బీసీలకు 33 శాతం రాజకీయ రిజరేషన్లు కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాయని గుర్తు చేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై దేశ వ్యాప్తంగా ఉద్యమించి చట్టసభల్లో రిజర్వేషన్లు సాధిస్తామని కృష్ణయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, ర్యాగ రమేష్, రాజు, వెంకన్న గౌడ్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలు ఏకం కావాలి
వినాయక్‌నగర్: రాజ్యాధికారం కోసం బీసీలంతా ఏకం కావాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. బీసీలంతా ఒక్కటై ముందుకెళితే మనకు రాజకీయాల్లో ఎవరు టికెట్టు ఇవ్వనవసరం లేదని, మనమే టికెట్లు ఇద్దామన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘మన రాష్ట్రంలో- మన రాజ్యం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అధ్యక్షత జరిగిన ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో 54 శాతం ఉన్న బీసీలకు ఇతరులు టికెట్లు ఇవ్వడమేంటి అని, మనమే ఇతరులకు టి కెట్లు ఇస్తామన్నారు. బీసీలు ఇంటికొకరు రాజ్యాధికారం కోసం ఏకమైతే, 2019లో తెలంగాణలో బీసీలదే పాలన అన్నారు. సంక్షేమశాఖలన్నీ ముఖ్య మంత్రి కేసీఆర్ తన వద్ద పెట్టుకుని ఎస్సీ,బీసీ,ఎస్ట్టీలకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఆంగ్లేయులను పారద్రోలి దేశానికి స్వాతంత్య్రం సాధించుకున్న చరిత్రతో పాటు , సీమాంధ్ర పెత్తనాన్ని అణగదొక్కి తెలంగాణ సాధించుకున్న ఘనచరిత్ర మనకు ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు తన దొరతనాన్ని చూపిస్తున్నారని విమర్శిం చారు. ఇప్పటి వరకు సంక్షేమ శాఖలకు మంత్రులకు కేటాయించకపోగా ఏ ఒక్కశాఖకు ఐఏఎస్ అధికారులను నియమించకపోవడం శోచనీయమన్నారు. అధికారికంగా ఢిల్లీటూర్ వెళ్లిన సీఎం ప్రధాని మోడీతో గానీ, కేంద్ర మంత్రులతో గానీ తెలంగాణరాష్ట్ర అభివృద్ధి పట్ల, నిధుల సేకరణపై ఒక్కమాట మాట్లాడకుండానే బంగారు తెలంగాణ నిర్మించుకుంటామని అనడం ఒంటెద్దు పోకడలకు నిదర్శనమని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల పై నిర్లక్ష్యం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంలో కుంటిసాకులు చెబుతూ, ఫాస్ట్ పథకం ద్వారా వెనుకబడిన వారి పిల్లలు చదువుకు దూరమవాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. శిల్పి శిల్పాన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడతాడో, బీసీలు కూడా 2019లో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంతే కష్టపడాలని కోరారు. సదస్సులో మేదరులు తయారు చేసిన వస్తువుల ప్రదర్శనను ఆయన తిలకించి ప్రశంసించారు. రోజు రోజుకు మేదరులు తయారు చేసిన వస్తువులకు ఆదరణ కరువవడం బాధాకరమన్నారు. మేదరుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగంగా ‘వెనకబడిన తరగతుల వెనక ఉన్న కథ ఇది..’ అంటూ ఇందూర్ సిస్టర్స ప్రేరణి, ప్రణతి ఇంటర్ విద్యార్థులు పాడిన పాట సభికులను కట్టి పడేసింది. వెనకబడిన తరగతుల వారి స్థితిని తెలిపింది. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శారదగౌడ్, బీసీ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, రజక సంఘం ప్రతినిధి జెండా బాలాజీ చైర్మన్ నారాయణరావు(నాని), నాయీ బ్రాహ్మణ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు రాచమల్లు మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కాపులను బీసీల్లో చేరుస్తాం: బాబు
హైదరాబాద్ : చట్టసభల్లో బిసిలకు 33 శాతం రిజర్వేషన్లతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రమోషన్లలో బిసిలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టింది. తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి అండగా ఉన్న బిసిలను అన్ని విధాల ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తీర్మానాన్ని ప్రవేశపెడుతూ మాట్లాడిన ఆయన.. కులాల వారీగా వారి కోసం చేయబోయే పనులను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్లలో బిసిలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. 25 శాతం బడ్జెట్‌తో బిసి సబ్ ప్లాన్ అమలు చేస్తామని సిఎం వివరించారు. కాపులను బీసీల్లోకి చేర్చే విషయంలో తాము కట్టుబడి ఉన్నామని చంద్రబాబు తెలిపారు. -
బీసీలకు బాబు టోపీ...!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి వెనుకబడిన తరగతుల వారికి టోపీ పెట్టేశారు. బీసీ వర్గాల వారికి వంద సీట్లు కేటాయిస్తానని గత ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు టిక్కెట్ల కేటాయింపులో మొండిచెయ్యి చూపారు. ఇప్పుడు బిసిలు బాబు పేరు చెబితే చాలు భగ్గుమంటున్నారు. కృష్ణయ్యను పోటీలో దింపి చెయ్యిచ్చిన బాబు తెలంగాణలో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సీఎం అభ్యర్థిగా దశాబ్దాలుగా బీసీల హక్కులకోసం పోరాడుతున్న ఆర్.కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. బీసీ ఓట్ల కోసం టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పార్టీ విడుదల చేసిన ఎన్నికల పత్రికా ప్రకటనల్లో సైతం ఆయన ఫొటో కూడా ప్రచురించారు. కానీ కృష్ణయ్య ఓడిపోయేందుకు చేయాల్సిందంతా చేశారని ఆరోపణలు వస్తున్నాయి. కృష్ణయ్య గెలుపుకోసం కాకుండా పలువురు నేతలు ఆయన ఓటమి కోసం పనిచేయడంపై బుధవారం జరిగిన ఎన్నికల పోలింగ్ సరళిని విశ్లేషించుకున్న బీసీ వర్గాల్లో ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. అసమ్మతులకు పరోక్ష ప్రోత్సాహం చంద్రబాబు కూడా కృష్ణయ్యను బరిలోకి దింపి, ఆ తర్వాత ఆయన గురించి పట్టించుకోవటం మానేశారు. ఆయన గెలుపు కోసం ముఖ్య నేతలెవ్వరికీ ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఎల్బీనగర్ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ ఎస్వీ కృష్ణప్రసాద్ అనుచరులు కృష్ణయ్య నామినేషన్ దాఖలు సమయంలోనే ఆయన వాహనశ్రేణితో పాటు అనుచరులపై దాడి చేశారు. అయినప్పటికీ కృష్ణప్రసాద్‌పై చంద్రబాబు చర్య తీసుకోలేదు. పలుచోట్ల టిక్కెట్టు ఆశించి భంగపడ్డవారిని పిలిపించి బుజ్జగించిన చంద్రబాబు కృష్ణ ప్రసాద్‌తో కనీసం మాట్లాడలేదు. కృష్ణయ్య సన్నిహితులు, బీసీ సంఘాల నేతలు కూడా చంద్రబాబు వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. బిసి సంక్షేమం పెదాల వరకే పరిమితం ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి రాష్ట్రవ్యాప్తగా బీసీలకు వంద సీట్లు ఇస్తానని పదేపదే చెబుతూ వచ్చిన బాబు తీరా ఎన్నికల సమయానికి అందులో సగం కూడా ఇవ్వకపోవడంతో బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లలో బీజేపీకి 45 సీట్లు కేటాయించారు. మిగిలిన 74 సీట్లలో 18 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారు. బీజేపీకి కేటాయించగా మిగిలిన తొమ్మిది లోక్‌సభ సీట్లల్లో ఒక్కటి మాత్రమే బీసీకి కేటాయించారు. సీమాంధ్ర లోనూ ఇదే కథ పునరావృతం అయింది. సీమాంధ్రలో 175 అసెంబ్లీ సీట్లకు గాను బీజేపీకి 13 సీట్లు కేటాయించారు. మిగిలిన 162 సీట్లలో 40 సీట్లు చంద్రబాబు బీసీ సామాజికవర్గాలకు కేటాయించారు. టీడీపీ 21ఎంపీ సీట్లలో పోటీచేస్తుండగా మూడు సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారు. -
బీసీలకు బాబు బురిడీ
-
బీసీలకు బాబు బురిడీ
* తెలంగాణలో బీసీని సీఎం చేస్తానంటూ హైడ్రామా * ఆర్.కృష్ణయ్యను బరిలోకి దించి.. పట్టించుకోని వైనం * ఆయన ఓటమికి పరోక్షంగా ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు హామీలివ్వడం, ఎన్నికలయ్యాక వాటిని తుంగలో తొక్కడం అలవాటుగా మార్చుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి వెనుకబడిన తరగతుల వారికి టోపీ పెట్టేశారు. బీసీ వర్గాల వారికి వంద సీట్లు కేటాయిస్తానని గత ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు టిక్కెట్ల కేటాయింపులో మొండిచెయ్యి చూపారు. ఈసారి బీజేపీతో పొత్తు కట్టడంతో మైనార్టీఓట్లు దూరమవుతాయని భావించి మరోసారి బీసీ ఓట్లపై కన్నేశారు. తెలంగాణలో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తానంటూ ఆర్భాటంగా ప్రకటించారు. సీఎం అభ్యర్థిగా దశాబ్దాలుగా బీసీల హక్కులకోసం పోరాడుతున్న ఆర్.కృష్ణయ్య పేరును వెల్లడించారు. టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పార్టీ పరంగా విడుదల చేసిన ఎన్నికల పత్రికా ప్రకటనల్లో ఆయన ఫొటో కూడా ప్రచురించారు. కానీ ఆయన విజయం సాధించకుండా ఉండటానికి చేయాల్సిన పనులన్నీ తెరవెనుక చేశారని బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. కృష్ణయ్య గెలుపుకోసం కాకుండా పలువురు నేతలు ఆయన ఓటమి కోసం పనిచేయడంపై బుధవారం జరిగిన ఎన్నికల పోలింగ్ సరళిని విశ్లేషించుకున్న బీసీ వర్గాల్లో అనుమానాలు తలెత్తాయి. ఒక పథకం ప్రకారం పార్టీ నాయకత్వమే ఇదంతా చేయించిందని గ్రహించిన బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఆగ్రహంతో ఉన్నారు. పోలింగ్ సరళిని విశ్లేషించుకున్న కృష్ణయ్య సన్నిహితులు, బీసీ సంఘాల నేతలు కూడా చంద్రబాబు వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. చంద్రబాబును నమ్ముకుని నిండా మునిగామని బీసీ సంఘాలకు చెందిన ఒక నాయకుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. * తెలంగాణలో టీడీపీ విజయం సాధిస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించే సమయంలో సీఎం అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్య పేరును వెల్లడించారు. దీంతో తెలంగాణతోపాటు సీమాంధ్ర ప్రాంతంలో బీసీ సామాజికవర్గాలన్నీ ఏకపక్షంగా తమకే ఓటేస్తాయని చంద్రబాబు భావించారు. * తెలుగుదేశం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్టీ పరంగా విడుదల చేసిన ఎన్నికల పత్రికా ప్రకటనల్లో ఎన్టీ రామారావు, చంద్రబాబు, కృష్ణయ్య ఫొటోలను ముద్రించారు. సొంత సామాజికవర్గంతోపాటు సెటిలర్ల ఓట్లు అధికంగా ఉంటే ఎల్బీనగర్ నియోజకవర్గంలో కృష్ణయ్యను పోటీకి పెట్టారు. తెలంగాణకు బీసీని సీఎం చేస్తానని పలు సభల్లో బల్లగుద్ది చెప్పి కృష్ణయ్యను బరిలోకి దింపిన చంద్రబాబు.. ఆ తర్వాత ఆయన గురించి పట్టించుకోవటం మానేశారు. ఆయన గెలుపుకోసం ముఖ్య నేతలెవ్వరికీ ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. * ఎల్బీనగర్ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ ఎస్వీ కృష్ణప్రసాద్ అనుచరులు కృష్ణయ్య నామినేషన్ దాఖలు సమయంలోనే ఆయన వాహనశ్రేణితో పాటు అనుచరులపై దాడి చేశారు. అయినప్పటికీ కృష్ణప్రసాద్‌పై చంద్రబాబు చర్య తీసుకోలేదు. పలు చోట్ల టిక్కెట్టు ఆశించి భంగపడ్డవారిని పిలిపించి బుజ్జగించిన చంద్రబాబు కృష్ణ ప్రసాద్ తో కనీసం మాట్లాడలేదు. దీంతో కృష్ణప్రసాద్‌తో పాటు ఆయన అనుచరులందరూ కాంగ్రెస్‌లో చేరారు. * సినీ నటుడు, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణకు కృష్ణ ప్రసాద్ అత్యంత సన్నిహితుడు. బాలకృష్ణ లేదా చంద్రబాబు ఒకసారి పిలిచి మాట్లాడితే కృష్ణప్రసాద్ ఎన్నికల విజయానికి సహకరించేవారని, అలా పిలిచి మాట్లాడకపోవడంలోనే మతలబు ఉన్నట్టు బలంగా వినిపిస్తోంది. కాాంగ్రెస్‌లో చేరడానికి ముందు ఆయన చంద్రబాబు, బాలకృష్ణలకు సమాచారం కూడా ఇచ్చారని కూడా సమాచారం. * కృష్ణయ్య 40 ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. ఆయనను బీసీ సీఎంగా తెరమీదకు తేవటం ద్వారా రెండు ప్రాంతాల్లో లబ్ధిపొందేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని పార్టీలోని బీసీ నేతలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయటంలో అందె వేసిన చెయ్యి చంద్రబాబుదని, తమ నేతను కూడా ఆ కోవలోనే ఉపయోగించుకున్నారనే వాదన బీసీ వర్గాల నుంచి వస్తోంది. వందసీట్ల వాగ్దానమూ డొల్లే * ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి రాష్ట్ర వ్యాప్తగా బీసీలకు వంద సీట్లు ఇస్తానని పదేపదే చెబుతూ వచ్చిన బాబు తీరా ఎన్నికల సమయానికి అందులో సగం కూడా ఇవ్వకపోవడంతో బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. * తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లలో బీజేపీకి 45 సీట్లు కేటాయించారు. మిగిలిన 74 సీట్లలో 18 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారు. బీజేపీకి కేటాయించగా మిగిలిన తొమ్మిది లోక్‌సభ సీట్లల్లో ఒక్కటి మాత్రమే బీసీకి కేటాయించారు. * సీమాంధ్ర లో 175 అసెంబ్లీ సీట్లకు గాను బీజేపీకి 13 సీట్లు కేటాయించారు. మిగిలిన 162 సీట్లలో 40 సీట్లు చంద్రబాబు బీసీ సామాజికవర్గాలకు కేటాయించారు. టీడీపీ 21 ఎంపీ సీట్లలో పోటీచేస్తుండగా మూడు సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారు. ఇలా బీసీలకు అతి తక్కువ సీట్లు కేటాయించటం ద్వారా తన వంద సీట్ల హామీకి బాబు తిలోదకాలిచ్చారు. కేవలం బీసీ ఓటర్లను ఆక ర్షించేందుకే వంద సీట్లు ఇస్తామని తొలి నుంచి చెప్తున్న చంద్రబాబు అభ్యర్థుల ఎంపిక సమయం నుంచే ఆ వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు బీసీ సీఎం మంత్రం జపించారనే వాదన ఆ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. -
పరిషత్ ఎన్నికల్లో బీసీలకు పెద్దపీఠ వేస్తున్న వైసీపీ
-
రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్ నవాబుపేట, న్యూస్‌లైన్: రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బార్క కృష్ణయాదవ్ అన్నారు. పలువురు బీసీ సంఘం నాయకులతో కలిసి గురువారం ఆయన మండలకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో అధిక శాతం బీసీలున్నా రాజ్యాధికారానికి మాత్రం నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంటున్నాయన్నారు. బీసీలంతా ఈవిషయాన్ని గమనించి రాజ్యాధికారం కోసం పోరాడాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో తిరిగి బీసీలనంతా ఏకం చేయనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రఘు మాట్లాడుతూ.. శుక్రవారం నవాబుపేట మండల శాఖను ఎన్నుకోవడం జరుగుతుందని, మండలంలోని అన్ని గ్రామాల బీసీలు అధిక సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షుడు రమేష్‌యాదవ్, షాబాద్ మండల అధ్యక్షుడు రాచ రాములు, ఎం.వెంకటస్వామి, ఖలీల్, మాజీ సర్పంచ్ కోదండం, కిష్టయ్య, ప్రభు, గోవర్దన్, రవి తదితరులు పాల్గొన్నారు. -
కాపులను బీసీలో చేర్చేలా సర్కారుపై ఒత్తిడి తెండి
విజయమ్మకు కాపు జేఏసీ నేతల వినతి సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల జాబితాలో చేరుస్తూ 1994లో జారీ అయిన జీవో (నంబర్ 30) నేటికీ అమలు కావట్లేదని..ఈ జీవోను ప్రభుత్వం అమలు చేసేలా ఒత్తిడి తేవాలని తెలగ, బలిజ, కాపు జేఏసీ నేతలు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు విజ్ఞప్తి చేశారు. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దాసరి రాము నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం విజయమ్మను ఆమె నివాసంలో కలుసుకుని వినతిపత్రం సమర్పించింది. ఈ డిమాండ్‌పై గత ఏడాది ఏప్రిల్ నుంచి తమ సంఘాలన్నీ 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దశల వారీగా ఆందోళనలు చేపడుతున్నాయని ప్రతినిధి బృందం తెలిపింది. ఈ విషయంలో తప్పకుండా కృషి చేస్తామని ఆమె వారికి హామీ ఇచ్చారు. విజయమ్మను కలిసిన వారిలో కాపు సద్భావనా సంఘం(తూ.గో) నాయకుడు వాసిరెడ్డి ఏసుదాస్, బలిజ సేవా సంఘం ఉపాధ్యక్షుడు (కర్నూలు) సింగంశెట్టి సోమశేఖర్, శ్రీనివాస్, స్వరూప్ తదితరులు ఉన్నారు. వైఎస్సార్‌టీఎఫ్ డైరీ ఆవిష్కరణ ఏపీ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ డైరీ (2014)ని పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ మంగళవారం ఆవిష్కరించారు. ఆమె నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ కె.ఓబుళపతి, కమిటీ సభ్యులు కె.జాలిరెడ్డి, పి.రామసుబ్బారావు, అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సంబంధించిన 11 సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ ఆమెకు వినతిపత్రం అందజేశారు. -
అప్పుతిప్పలు
-
అప్పుతిప్పలు
బడుగులపై బ్యాంకుల శీతకన్ను.. రుణాల జారీలో తీవ్ర అలక్ష్యం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మొండిచేయి పంట రుణాలూ లక్ష్యానికి ఆమడదూరమే రైతులకిచ్చిన రుణాలు కేవలం 57 శాతమే కౌలు రైతులకు 15 శాతమైనా ఇవ్వని దైన్యం పాడికి, మత్స్యకారులకు ఒక్క శాతమైనా ఇవ్వలేదు బీసీ సొసైటీలకూ పైసా కూడా విదల్చని వైనం సాక్షి, హైదరాబాద్: బడా బాబులకు అడిగీ అడక్కముందే వేలాది కోట్ల రూపాయలను అప్పుల రూపంలో గుమ్మరించే బ్యాంకులు బడుగు, బలహీన, రైతు వర్గాలను మాత్రం చిన్నచూపు చూస్తున్నాయి. వారికి రుణాలివ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. కొన్ని వర్గాలకు అరకొర రుణాలతో సరిపెడుతుండగా, మరికొన్నింటికైతే అక్షరాలా మొండిచేయి చూపుతున్నాయి. అన్ని వర్గాలనూ కలిపి చూసినా లక్ష్యంలో సగం మందికి మాత్రమే రుణాలిచ్చి అక్కడితో చేతులు దులుపుకున్నాయనేందుకు ఈ ఏడాది రుణ ప్రణాళిక అమలు తీరే నిదర్శనం. వర్గాలవారీగా చూస్తే పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి ఉద్దేశించిన పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయి. పేదల కోసం ఎంతో పాటుపడుతున్నామని ఊరూవాడా ఊదరగొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. సర్కారు ప్రచారంలో డొల్లతనాన్ని రుణ ప్రణాళిక అమలు తీరే ఎత్తిచూపుతోంది. ఈ ఏడాది రూ.1.33 లక్షల కోట్ల రుణాలివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికి ఇచ్చిన రుణాలు రూ.91 వేల కోట్లు మాత్రమే. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పట్ల బ్యాంకర్లు మరీ చిన్నచూపు చూశారు. రైతుల పట్ల కూడా నిర్లక్ష్యమే ప్రదర్శించారు. లక్ష్యంలో 57 శాతం రుణాలు మాత్రమే ఇవ్వగలిగారు. పాడి పరిశ్రమాభివృద్ధికి ఉద్దేశించిన నాబార్డ్ పథకాన్నయితే పూర్తిగా ఎత్తేశారు! ఇవన్నీ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) గణాంకాలు చెబుతున్న చేదు నిజాలే. చెప్పింది కొండంత...: రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఈ ఏడాది భారీ ఎత్తున రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకు రూ.లక్ష లోపు వడ్డీ లేని రుణంతో పాటు మహిళలకు వడ్డీ రాయితీ రుణాలను ఘనంగా ప్రకటించారు. అంతేగాక స్వయం ఉపాధి కింద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల యువకులను ప్రోత్సహించడానికి వీలుగా ప్రత్యేక పథకాన్ని ప్రారంభించారు. దీనికి వడ్డీ రాయితీ రుణాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ పథకాల్లో వేటికీ బ్యాంకర్ల నుంచి సరైన ప్రొత్సహాం అందలేదు. ముఖ్యంగా గిరిగిజన ప్రాంతాల్లోనైతే రుణ మంజూరీ మరీ దారుణంగా ఉంది. రుణాలివ్వాలంటే మైదాన ప్రాంతాలకు సంబంధించిన షూరిటీ సమర్పించాలన్న నిబంధన వల్ల గిరిగిజనులు అసలు రుణాలే పొందలేకపోతున్నారు. బడుగులకు బహు స్వల్పం! బడుగు, బలహీన వర్గాలకు అవసరమైన మేర రుణాలందడం లేదని మరోసారి తేలింది. ఆయా వర్గాలకు రుణాలిచ్చి, వారి స్వయం ఉపాధికి ప్రోత్సాహమివ్వడంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటిదో ఎస్ఎల్బీసీ నివేదికే చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా కార్పొరేషన్ల ద్వారా 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఆశించిన మేర రుణాలివ్వలేదని అది స్పష్టం చేసింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న దాంట్లో కేవలం 47 శాతమే ఇవ్వగలిగినట్టు నివేదిక పేర్కొంది. కానీ వాస్తవాలు మాత్రం ఇంకా నిరాశాజనకంగా ఉన్నాయి. ఎస్టీ కార్పొరేషన్ పరిస్థితైతే మరీ దారుణం. లక్ష్యంలో కేవలం 13 శాతం మందికే రుణాలిచ్చారు. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 52 శాతం మందికి, బీసీ కార్పొరేషన్ ద్వారా 67 శాతం మందికి రుణాలిచ్చినట్టు మాత్రం నివేదికలో పేర్కొన్నారు. బీసీ సమాఖ్యలకు సంబంధించి 37 వేల సోసైటీలకు రుణాలను అందివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికీ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఎస్సీలకు కార్పొరేషన్ ద్వారా 1,27,792 మందికి రూ.535.39 కోట్ల రుణాలివ్వాల్సి ఉండగా ఇప్పటికి 154 మందికి మాత్రమే అందించారు. గిరిజన కార్పొరేషన్ ద్వారా 60 వేల మంది లబ్ధిదారులకు రూ.235 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్కరికి కూడా ఇవ్వలేదు. రాజీవ్ యువశక్తి పథకం కింద 11,250 మందికి లబ్ధి చేకూర్చాలని ఘనంగా లక్ష్యం విధించుకున్నా కేవలం 212 మందికి మాత్రమే రుణాలిచ్చారు. ఈ వెనుకంజకు కారణాలనేకం. ప్రభుత్వం సకాలంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించకపోవడం, నిధులివ్వకపోవడం, బ్యాంకర్లతో సమన్వయం చేసుకోకలేకపోవడం, అన్నీ జరిగినా లబ్ధిదారుల ఎంపికను ఆలస్యం చేయడం వంటివి కారణాలు బడుగుల రుణ ఆశలపై నీల్లుజల్లాయి. పంట రుణాల పరిస్థితీ అంతే పంట రుణాల జారీ కూడా ఈ ఏడాది ఆశించిన స్థాయిలో లేదు. ఖరీఫ్ సీజన్లో రూ.31,996 కోట్లు, రబీలో రూ.17,993 కోట్ల చొప్పున మొత్తం రూ.49,989 కోట్ల రుణాలివ్వాల్సి ఉంది. కానీ రూ.28,820 కోట్లు మాత్రమే అందించారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వీరికి ఈ ఏడాది రూ. 2వేల కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇచ్చింది మాత్రం రూ.315 కోట్లే. డెయిరీ, గొర్రెల పెంపకానికి, మత్స్యకారులకు రూ.5,670 కోట్లను రుణాలుగా ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నారు. కానీ ఇప్పటిదాకా ఇచ్చిన రుణాలు రూ.13 కోట్లే. రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధి పరిచేందుకు ఉద్దేశించిన డీఈడీఎస్ పథకానికి మంగళం పాడారు. నాబార్డ్ సబ్సిడీ అందించే ఈ పథకానికి రుణాలివ్వడం లేదు. ఈ పథకం కింద గేదెల కొనుగోలుతో పాటు, మిల్కింగ్ మిషన్, పాలను నిల్వ చేసే కూలింగ్ సెంటర్ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రుణాలిచ్చేవారు. దాంతోపాటు నాబార్డ్ సబ్సిడీ కూడా అందించేది. కానీ మార్పుల మాటున పలు ఆంక్షలతో పథకాన్ని కుదించడంతో ఈ ఏడాది డెయిరీలకు రుణాల మంజూరీ గణనీయంగా పడిపోయింది. -
భంగపాటు!
సాక్షి, నిజామాబాద్: వలసలతో ఖాళీ అవుతున్న పార్టీని, ఎమ్మెల్యేల ను కాపాడుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేపడుతున్న చర్యలు.. పార్టీని నమ్ముకున్న వారికి తీ వ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ పార్టీ మారతారన్న ప్రచారం నేపథ్యంలో బుజ్జగింపు చర్యల్లో భాగంగా ఆమె తనయుడు మల్లికార్జునరెడ్డిని బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారని తెలుస్తోంది. దీంతో ఈ స్థానాన్ని ఆశించి పార్టీలో చేరిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత రాజారాం యాదవ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒత్తిడికి తలొగ్గి.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు వంద టికెట్లు కేటాయిస్తానని చంద్రబాబు గతంలో ప్రకటించారు. బాల్కొండ టికెట్టు ఇస్తానని రాజారాం యాదవ్‌కు చెప్పి, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. అయితే బాల్కొండ టికెట్టు తన తనయుడు మల్లికార్జున్‌రెడ్డికి ఇవ్వాలని అన్నపూర్ణమ్మ పట్టుబట్టి, పార్టీ అధినేతపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు నాయుడు.. బాల్కొండ తెరపైకి మల్లికార్జునరెడ్డిని తీసుకువచ్చారు. కాగా మల్లికార్జున్‌రెడ్డి రాజకీయాలకు కొత్త. ఆర్మూర్ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, మాజీ మంత్రి, దివంగత మహీపాల్రెడ్డిల తనయుడిగా మాత్రమే ఆయన పరిచయం. అసంతృప్తి బాల్కొండ ఇన్చార్జిగా మల్లికార్జునరెడ్డి నియామకంతో పార్టీలోని బీసీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాజారాం యాదవ్‌తోపాటు తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌యాదవ్‌కు కూడా ఈ స్థానాన్ని ఆశించారు. పార్టీ బలోపేతానికి కృషి చేశారు. తీరా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీరిని కాదని మల్లికార్జునరెడ్డిని తెరపైకి తేవడంపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క బాల్కొండకే.. జిల్లాలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. పలు నియోజకవర్గాలకు నాయకత్వం వహించేవారు లేరు. జుక్కల్ ఎమ్మెల్యే ఇటీవలే టీఆర్ఎస్లో చేరారు. కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బాల్కొండతోపాటు ఎల్లారెడ్డి, బోధన్, నిజామాబాద్ అర్బన్‌లకు చాలా కాలం గా ఇన్చార్జిలు లేరు. వీటన్నింటిని పక్కనబెట్టి ఒక్క బాల్కొండకే ఇన్చార్జిని నియమించడం పార్టీలో చర్చనీయాంశమైంది. బాబు చర్యలతో పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. -
రాజ్యాధికారంలో బీసీలకు భాగం కావాలి
హైదరాబాద్, న్యూస్‌లైన్: అన్ని రంగాల్లో వెనుకబడిన మేరు కులస్తులను ఆదుకునేందుకు పార్టీలకు అతీతంగా నేతలందరూ ముందుకు రావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన 12వ మేరు మహా సభకు జానారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజ్యాధికారంలో బీసీల భాగస్వామ్యం ఉండాలని అన్నారు. మేరు సంఘం ప్రతిపాదించిన డిమాండ్లను ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి బసవరాజు సారయ్య మాట్లాడుతూ... వెనుకబడిన తరగతులకు రావాల్సిన హక్కులు అడుక్కుంటే రావని, పోరాడి సాధించుకోవాలని సూచించారు... మేరు కులస్తుల ఫెడరేషన్‌కు రూ.200 కోట్లు కేటాయించాలని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, శంకర్రావు, కేవీ కేశవులు, మేరు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కీర్తి ప్రభాకర్, దక్షిణ భారత బీసీ కమీషన్ చైర్మన్ కేసీ కాలప్ప తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు 50శాతం సీట్లు కేటాయించాలి: ఆర్. కృష్ణయ్య
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50శాతం సీట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బీసీ బిళ్లును ప్రవేశపెట్టాలని, రాజకీయ పార్టీలన్నీ బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని కోరారు. సోమవారం సచివాలయంలో కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని పార్టీలన్నీ బీసీలకు 150 శాసనసభ, 22 పార్లమెంటు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పార్టీలన్నీ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించాలన్నారు. యూపీఏ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, పదేళ్ల పాలనలో జాతీయ బీసీ కమిషన్‌కు ఒక్క రాజ్యాంగ హక్కు కూడా కల్పించలేకపోయిందని విమర్శించారు. దేశ జనాభాలో 54శాతం ఉన్న బీసీలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం 7శాతం మాత్రమే ఉన్నారని, 60 ఏళ్ల స్వాతంత్య్రంలో బీసీలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిళ్లును ప్రవేశపెట్టకుంటే కాంగ్రెస్ పార్టీ తీవ్రపరిణామాలు ఎదుర్కోక తప్పదని కృష్ణయ్య హెచ్చరించారు. కాంట్రాక్టర్లు, రియల్టర్లు, పారిశ్రామిక వేత్తలకు టికెట్లు ఆమ్ముకునే పార్టీలకు తగిన బుద్ధిచెప్తామన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంపై ఈనెల 31 సమావేశం ఏర్పాటు చేయనున్నామని, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశం పాల్గొనాలని కృష్ణయ్య ఆహ్వానించారు.