CV Anand
-
ఫొటోతో పాటు లొకేషన్ వాట్సాప్ చేయండి
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని ప్రధాన రహదారులతో పాటు ఇతర మార్గాలు, కాలనీల్లోనూ అనేక ప్రాంతాల్లో గుర్తు తెలియని వాహనాలు (Abandoned Vehicles) కనిపిస్తుంటాయి. వీటిలో కొన్ని నెలలు, ఏళ్ల తరబడి అక్కడే ఉండిపోతాయి. వీటివల్ల స్థానికంగా ట్రాఫిక్ ఇబ్బందులు, క్యారేజ్ వేలు కుచించుకుపోవడం పరిపాటి. కొన్ని సందర్భాల్లో ఇలాంటివే అసాంఘిక శక్తులకు కలిసి వచ్చే అంశాలుగా మారతాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad) నగర వ్యాప్తంగా ఉన్న ఇలాంటి వాహనాలను తొలగించాలని ట్రాఫిక్ విభాగం సంయుక్త సీపీ డి.జోయల్ డెవిస్ నిర్ణయించారు.సాధారణంగా ఈ వాహనాల్లో అత్యధికం ఏదో ఒక ప్రాంతంలో చోరీ అయినవే అయి ఉంటాయి. జాయ్రైడర్స్గా పిలిచే చోరులు వాహనాలను చోరీ చేసి, వాటిలో ఇంధనం అయిపోయే వరకు తిరిగి వదిలేస్తుంటారు. వీళ్లు వాటిని విక్రయించి సొమ్ము చేసుకోవడం వంటివి చేయరు. కొందరు చోరులు కూడా మార్గమధ్యంలో చోరీ వాహనాలు ఆగిపోతే అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారు.ప్రాంతాల వారీగా రోడ్లపై కనిపించే వాహనాల సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. దీనికోసం ఇప్పటి ఉన్న ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 90102 03626తో పాటు ప్రత్యేకంగా 87126 60600ను కేటాయించారు. ఇలాంటి వాహనాలను చూసిన నగరవాసులు దాని ఫొటో లేదా వీడియోతో పాటు లొకేషన్ సైతం వాట్సాప్ (Whatsapp) ద్వారా షేర్ చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. #HYDTPinfoవదిలివేసిన వాహనం చూశారా? 🚗⚠️ ట్రాఫిక్ పోలీసులకు నివేదించండి మరియు రహదారులను సురక్షితంగా మరియు స్పష్టంగా ఉంచడానికి సహాయం చేయండి!#TrafficSafety #ReportAbandonedVehicles #RoadSafety #RoadRules pic.twitter.com/xi7CWkoour— Hyderabad Traffic Police (@HYDTP) March 12, 2025 హోలీ సందర్భంగా సిటీలో ఆంక్షలు హోలీ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 6 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయి. బహిరంగ ప్రదేశాలు, రోడ్డు మీద వెళ్లేవారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే రోడ్లపై గుంపులుగా తిరగ వద్దని స్పష్టంచేశారు. వీటిని అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.చదవండి: ప్యారడైజ్ నుంచి డైరీఫామ్ వరకు సొరంగ మార్గం -
అన్నీ తెలుసుకోవడమే సరైన ‘పని’..
సాక్షి, హైదరాబాద్: ఉరుకులు పరుగుల జీవితాలు..దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తే కానీ..ఆర్థిక అవసరాలు తీరని కాలమిది. తీరికగా ఇంటిపట్టు ఉండి పనులు చేసుకోలేని ఎన్నో జంటలు పనిమనుషుల మీద ఆధారపడుతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు పెరిగే కొద్దీ ఇళ్లలో పనిచేసే వారికి డిమాండ్ పెరిగింది. అదేవిధంగా రిటైర్ అయి..పిల్లలు విదేశాల్లో ఉండే వృద్ధ దంపతుల ఇళ్లలోనూ పనిమనుషులే కీలకంగా ఉంటున్నారు. ఇలా ఇళ్లలో పనిచేస్తున్న వారిలో ఎంతోమంది నిజాయితీగానే ఉంటున్నా..కొందరు చోరీలకు, తీవ్ర నేరాలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి.ఇటీవల హైదరాబాద్ పోలీసులు నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యాపారి ఇంట్లో పనిమనుషులు కొల్లగొట్టిన రూ.5 కోట్ల విలువైన సొత్తును రికవరీ చేశారు. యజమాని తన కుమార్తె పెళ్లి పనుల్లో ఉండగా చోరీ చేసి పరారయ్యారు. ఇలాంటి కేసులు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. పనిమనుషుల పూర్తి వివరాలు తెలుసుకోకుండా, వారి నేర చరిత్రను గుర్తించకుండా పనిలో పెట్టుకోవడం అనర్ధాలకు దారితీస్తోందని పోలీసులు చెబుతున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి నేరాలకు ఎప్పటికీ అవకాశం ఉంటుందని, పనిమనిషి, వాచ్‌మన్, తోటమాలి, డ్రైవర్ ఇలా ఎవరిని పనిలో పెట్టుకుంటున్నా..వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు సేవలందించేందుకు సిద్ధమని స్పష్టం చేస్తున్నారు.ఏం చేయాలి..» ఇంట్లో పనికి కుదుర్చుకునే వ్యక్తి ఆధార్‌కార్డు, ఓటర్ ఐడీ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్‌ల జిరాక్స్‌లు, ఫోన్ నంబర్, వీలుంటే వారి కలర్ ఫొటో తీసుకోవాలి. ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం వారనే పూర్తి వివరాలు తెలుసుకోవాలి.» వారి ప్రస్తుత చిరునామా..శాశ్వత చిరునామా తప్పకుండా తీసుకోవాలి. » ఈ వివరాలన్నీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఇస్తే..వారు ఆ వివరాలను తనిఖీ చేసి సదరు వ్యక్తికి నేర చరిత్ర ఉందా..? లేదా..? అన్నది నిర్ధారిస్తారు. » నిజాయితీపరులైన పనిమనుషులకు ఇది ఒకింత ఇబ్బందే. ఈ వివరాల సేకరణ సాధారణ ప్రక్రియలో భాగంగానే అన్నట్టుగా వారికి చెప్పాలి. » సదరు పనిమనిషి గురించి మనకు ఎవరు చెప్పారో.. వాళ్లకు సంబంధించిన యజమా నుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. » ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారి విషయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం.» వృద్ధులు మాత్రమే ఉండే పక్షంలో స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే..పెట్రోలింగ్ డ్యూటీలో భాగంగా వారు వచ్చి చూసే అవకాశం ఉంటుంది. ఏం చేయకూడదు..» ఇంట్లో పనిమనుషులు, ఇతర సహాయకులకు అవసరానికి మించి చనువు ఇవ్వొద్దు. అతి నమ్మకం పెట్టుకోవద్దు. » ఇంటి పనివాళ్ల ముందు ఆర్థిక విషయాలను ఎప్పుడూ చర్చించవద్దు.» మీ విలువైన వస్తువులను ఇళ్లల్లో ఉంచొద్దు. బ్యాంకులోని లాకర్లలో ఉంచడం ఉత్తమం. » పని మనుషుల బంధువులు లేదా స్నేహితులను మీ ఇంటిని సందర్శించడానికి అనుమతించొద్దు.» మీ ఇంట్లో పనివాళ్ల కోసం తెలిసిన వారు..వారి రాష్ట్రం, గ్రామం వారు అంటూ ఇతరులు ఎవరైనా ఎక్కువగా వస్తుంటే పూర్తి వివరాలు తెలుసుకోవాలి. మాకు శ్రమైనా..మీ భద్రత కోసం సిద్ధంఇళ్లలో పని మనుషులను, ఇతర ఉద్యోగస్తులను పెట్టుకునే ముందు వారి వివరాలను స్థానిక పోలీసు లకు అందజేస్తే..మేం ఆ వ్యక్తులకు ఏమైనా నేరాలతో సంబంధం ఉందా..? గతంలో నేర చరిత్ర ఉందా..? అన్న విషయాలను దేశ వ్యాప్తంగా ఉండే క్రిమినల్ డేటాబేస్‌లో తనిఖీ చేసి మీకు తెలియజేస్తాం. ఇది ఎంతో శ్రమతో కూడిన పని అయినా..ప్రజాభద్రత కోసం మేం ఇందుకు సిద్ధంగా ఉన్నాం. – సీవీ ఆనంద్, పోలీస్ కమిషనర్ హైదరాబాద్ -
కేడీల ఆట కట్టించిన హైదరాబాద్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నారాయణగూడ పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే కేడియా ఆయిల్స్ కంపెనీ యజమాని రోహిత్ కేడియా (Rohit Kedia) ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బిహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు నిందితులు దాదాపు రూ.40 కోట్ల విలువైన సొత్తు దోచుకుపోగా... అత్యంత వేగంగా స్పందించిన పోలీసులు 20 గంటల్లో వారిని పట్టుకున్నారు. ఈ నిందితుల్లో ఒకరు గతేడాది దోమలగూడ పోలీసుస్టేషన్ (Domalguda Police Station) పరిధిలో స్నేహలత దేవిని చంపి, రూ.కోటి విలువైన సొత్తు దోపిడీకి పాల్పడిన కేసులో వాంటెడ్‌గా ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ (CV Anand) పేర్కొన్నారు. తూర్పు మండల డీసీపీ బాలస్వామి, అదనపు డీసీపీలు అందె శ్రీనివాసరావు, జె.నర్సయ్యలతో కలిసి గురువారం ఐసీసీసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్వాల్ వివరాలు వెల్లడించారు. కుమార్తె పెళ్లి పనుల కోసం.. రాజేంద్రనగర్‌లో కేడియా ఆయిల్స్ కంపెనీ నిర్వహిస్తున్న రోహిత్ కేడియా హిమాయత్ నగర్లో నివసిస్తున్నారు. ఆయన కుటుంబం వద్ద దాదాపు 20 మంది పనివాళ్లు ఉన్నారు. దాదాపు ఎకరం విస్తీర్ణంలో ఉండే వీరి ఇంటి ప్రాంగణంలోనే పనివాళ్ల కోసం మూడంతస్తుల భవనం నిర్మించారు. రోహిత్ ఇంట్లో బిహార్‌లోని బిరోల్ గ్రామానికి చెందిన సుశీల్ ముఖియా రెండేళ్ల పాటు పని చేసి ఏడాది క్రితం మానేశాడు. ఇటీవల రోహిత్ కుమార్తె వివాహం నిశ్చయం కావడంతో పాటు దుబాయ్‌లో డెస్టిషన్ మ్యారేజ్ చేయాలని నిర్ణయించారు. పెళ్లి పనుల కోసం సహాయంగా ఉండటానికి సుశీల్‌ను సంప్రదించిన రోహిత్ 15 రోజుల క్రితం పిలిపించారు. ఇదే ఇంట్లో పని చేసే పశ్చిమ బెంగాల్ మహిళ బసంతి ఆర్హికి ఇతడితో గతంలోనే వివాహేతర సంబంధం ఉంది. నేరగాడితో గతంలో ఉన్న పరిచయంతో.. సుశీల్‌తో పాటు బసంతి సైతం మిగిలిన పని వాళ్లతో కలిసి రోహిత్ ఇంటి ప్రాంగణంలోని భవనంలోనే ఉంటున్నారు. కుమార్తె వివాహం కోసం రోహిత్ ఫ్యామిలీ మొత్తం గత వారం దుబాయ్ వెళ్లింది. ఇదే అదనుగా భావించిన సుశీల్.. ఆ ఇంటిని దోచేయడానికి ఢిల్లీలో ఉండే తన స్నేహితుడు మోల్హు ముఖియాను నగరానికి పిలిపించాడు. గత ఏడాది దోమలగూడ పరిధిలో స్నేహలత అనే వృద్ధురాలిని హత్య చేసిన బిహారీలు రూ.కోటి సొత్తు దోచుకుపోయారు. ఈ కేసులో ఆమె ఇంట్లో పని చేసే మహేష్ ముఖియాతో పాటు మోల్హు, రాహుల్ నిందితులుగా ఉన్నారు. దోపిడీ జరిగిన ఎనిమిది నెలలకు మహేష్ చిక్కినా.. మిగిలిన ఇద్దరూ పరారీలోనే ఉండిపోయారు. మోల్హు నేర చరిత్ర తెలిసిన సుశీల్ తాజా నేరం కోసం ఢిల్లీ తలదాచుకున్న అతడిని పిలిపించాడు. వీరిద్దరూ కలిసి మంగళవారం తెల్లవారుజామున సర్వెంట్స్ బిల్డింగ్ నుంచి రోహిత్ ఇంట్లోకి ప్రవేశించారు. అల్మారాలు, లాకర్లు పగులకొట్టి 710 గ్రాముల వజ్రాలతో కూడిన ఆభరణాలు, 1.4 కేజీల స్వర్ణాభరణాలు, రూ.19.63 లక్షలు, 24 దేశాల కరెన్సీ, 215 గ్రాముల వెండి అపహరించారు.మూడు నగరాలకు ప్రత్యేక బృందాలు... మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రోహిత్ ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని రోహిత్ మేనేజర్ అభయ్ కేడియా గుర్తించారు. వెంటనే నారాయణగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసును ఛేదించడానికి నారాయణగూడ పోలీసు, టాస్క్‌ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయి. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా నిందితులు ముగ్గురూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారని, అక్కడ నుంచి ఢిల్లీ వెళ్తే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కారని గుర్తించారు.చదవండి: సైబర్ నేరాలతో రూ.88.58 లక్షల కోట్లు దోపిడీ దీంతో మూడు ప్రత్యేక బృందాలు భోపాల్, నాగ్‌పూర్, పట్నాలకు వెళ్లి కాపుకాశాయి. డీసీపీ బాలస్వామి మహారాష్ట్ర పోలీసులతో తనకు ఉన్న పరిచయాలను వినియోగించి ఈ నిందితుల సమాచారం ఇచ్చారు. దీంతో మంగళవారం రాత్రి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ నాగ్‌పూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. నగర పోలీసులు, అక్కడి జీఆర్పీ అధికారులతో కలిసి సోదాలు చేశారు. ముగ్గురు నిందితులతో పాటు చోరీ సొత్తు మొత్తం స్వాదీనం చేసుకుని నగరానికి తీసుకువచ్చారు.ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇస్తాంరోహిత్ కేడియా ఇంటి నుంచి చోరీ అయిన సొత్తులో వజ్రాలే 3,300 క్యారెట్లు ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఒక్కో క్యారెట్ రూ.1.12 లక్షలు పలుకుతోంది. ఈ ప్రకారం చూస్తే వీటి విలువే రూ.37 కోట్ల వరకు ఉంది. వీటితో పాటు భారీగా విదేశీ కరెన్సీ, బంగారం, నగదు చోరీకి గురయ్యాయి. సొత్తు మొత్తం రికవరీ చేసి వీడియో కాల్ ద్వారా దుబాయ్‌లో ఉన్న యజమానికి చూపించి ఖరారు చేసుకున్నాం. భారీ సొత్తు చోరీ, రికవరీపై ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించాం. నగదు, సొత్తును యజమాని వారి వద్ద డిక్లేర్ చేశారా? లేదా? అనేది ఆ అధికారుల విచారణలో వెలుగులోకి వస్తుంది. – సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ -
Afzalgunj Incident: చెన్నైకి చెక్కేశారు!
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని బీదర్‌తో పాటు నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపిన బీహార్ నేరగాళ్లు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తు అధికారులకు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీళ్లు రోషన్ ట్రావెల్స్ వద్ద కాల్పుల తర్వాత తిరుమలగిరి నుంచి ఉత్తరాదికి పారిపోయి ఉంటారని అధికారులు భావించారు. అయితే పోలీసుల్ని తప్పుదోవపట్టిస్తూ చెన్నైకి పారిపోయినట్లు తాజాగా వెలుగులోకి వచ్చిందని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని పట్టుకుంటామని, ప్రత్యేక బృందాలు ఆ కోణంలోనే ముందుకు వెళ్తున్నాయని స్పష్టం చేశారు. బీహార్‌లోని హాజీపూర్ జిల్లాకు చెందిన ఇరువురు దుండగులు అక్కడ నుంచే ద్విచక్ర వాహనం తీసుకుని నగరానికి చేరుకున్నారు. ఇక్కడే ఓ లాడ్జిలో బస చేసి బీదర్‌లో రెక్కీ నిర్వహించి మరీ పంజా విసిరింది. ఆపై నగదుతో సహా నగరానికి చేరుకున్న ఇరువురూ బైక్‌ను ఎంజీబీఎస్ పార్కింగ్‌లో పెట్టారు. ఆటోలో బయలుదేరి అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ వద్దకు వచ్చారు. ప్రైవేట్ బస్సులో రాయ్‌పూర్‌కు టిక్కెట్ బుక్ చేసుకున్న తదనంతర పరిణామాలతో మేనేజర్ జహంగీర్‌ను కాల్చడం, పారిపోవడం జరిగాయి. దర్యాప్తు అధికారులు నిందితుల రాకపోకలు కనిపెట్టడానికి వందల సంఖ్యలో సీసీ కెమెరాలను జల్లెడపడుతున్నారు. అఫ్జల్‌గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్‌కు వెళ్లిన ద్వయం..అక్కడి నుంచి మరో ఆటోలో గజ్వేల్ వెళ్లే ప్రయత్నం చేసింది. అయితే ఆటోడ్రైవర్ వ్యవహార శైలితో అనుమానించి తిరుమలగిరిలో దిగిపోయారు. అక్కడే నగదును మరో బ్యాగ్‌లోకి మార్చడంతో పాటు తాము ధరించిన వ్రస్తాలను మార్చుకున్నారు. అక్కడ నుంచి బోయిన్పల్లి వరకు వచ్చిన ఇద్దరు దుండగులూ..మరో ఆటోలో కూకట్పల్లి మీదుగా మియాపూర్ చేరుకున్నారు. అర్ధరాత్రి మియాపూర్‌లో ఆంధ్రప్రదేశ్ ఆరీ్టసీకి చెందిన తిరుపతి వెళ్లే బస్సు ఎక్కారు. టిక్కెట్ సైతం తిరుపతి వరకు తీసుకున్న ఈ ద్వయం.. కడప బైపాస్ రోడ్డులో దిగిపోయారు. ఆ సమయంలో డ్రైవర్ ఇక్కడ ఎందుకు దిగుతున్నారని ప్రశి్నంచగా..పని ఉందంటూ సమాధానం ఇచ్చారు. కడప నుంచి మరో బస్సులో నెల్లూరు, అక్కడ నుంచి ప్రైవేట్ బస్సులో చెన్నై చేరుకున్నట్లు ఇప్పటి వరకు గుర్తించారు. చెన్నై చేరుకున్న నగర పోలీసు బృందాలు అక్కడ నుంచి ఈ ఇద్దరూ ఎక్కడకు వెళ్లారనే కోణంలో ఆరా తీస్తున్నాయి. ఈ ఇద్దరిలో కీలకమైన ప్రధాన నిందితుడు ఏడాదిన్నర క్రితం ఉత్తరప్రదేశ్‌లోనూ ఓ భారీ నేరం చేశాడు. అప్పటి నుంచి ఇతడి కోసం గాలిస్తున్న అక్కడి స్పెషల్ టాస్‌్కఫోర్స్ అధికారులు ఆచూకీ చెప్పిన వారికి రూ.4 లక్షల పారితోíÙకం కూడా ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఈ దుండగుల కోసం తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్ పోలీసులు సమన్వయంతో గాలిస్తున్నారు. -
సమాజమే నీ సేవకు సలాం
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన చిత్రం ‘కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. జాగృతి మూవీ మేకర్స్‌పై బలగం జగదీష్ నిర్మించారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కానిస్టేబుల్..’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేతులమీదుగా విడుదల చేశారు.‘కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న... కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా....’ అంటూ ఈ పాట సాగుతుంది. శ్రీనివాస్ తేజ సాహిత్యం అందించిన ఈ పాటని నల్గొండ గద్దర్ నర్సన్న ఆలపించారు.ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘మా కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల మీద వచ్చిన ఈ పాటని నేను ఆవిష్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి పోలీస్ ఈ సాంగ్ వింటారు’’ అన్నారు. ‘‘కానిస్టేబుల్..’ పాటని సీవీ ఆనంద్‌గారు విడుదల చేయడం మా సినిమాకు గర్వకారణం’’ అని వరుణ్ సందేశ్ చెప్పారు. ‘‘కానిస్టేబుల్ కావడం నా చిన్ననాటి కల. అది నెరవేరకపోవడంతో ఈ సినిమా నిర్మించాను’’ అని బలగం జగదీష్ తెలిపారు. ‘‘ఈ సినిమాలో సందర్భానుసారంగా వచ్చే టైటిల్ సాంగ్ అందర్నీ స్పందింపజేస్తుంది’’ అన్నారు ఆర్యన్ సుభాన్ ఎస్కే. -
నల్లగొండ గద్దర్ నోట ‘కానిస్టేబుల్’ పాట
వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కానిస్టేబుల్’. వరుణ్ సందేశ్ కి జోడీగా మధులిక వారణాసి నటిస్తోంది. ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది. "కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న...కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా ఎగిరే జెండా నిన్నే చూసి మురిసిపోతుందన్నా" అంటూ సాగే టైటిల్ సాంగ్ ను హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సి.వి.ఆనంద్ చేతుల మీదగా విడుదల చేశారు. ఈ పాటకు శ్రీనివాస్ తేజ సాహిత్యాన్ని అందించగా సుభాష్ ఆనంద్ సంగీతాన్ని సమకూర్చారు. నల్గగొండ గద్దర్ నర్సన్న ఆలపించారు.ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, నేను ఆవిష్కరించిన ఈ టైటిల్ సాంగ్ చాలా బావుంది. మా కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ మీద ఈ సాంగ్ రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రతీ పోలీస్ ఈ సాంగ్ వింటారు" అని అన్నారు.హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, "సి వి ఆనంద్ గారు ఈ పాట విడుదల చేయడం మా సినిమాకు గర్వకారణం. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నాకు మంచి కం బ్యాక్ సినిమా అవుతుంది. నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రను ఇందులో పోషించాను" అని అన్నారు.నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ, "కానిస్టేబుల్ కావడం నా చిన్ననాటి కల అది నెరవేరకపోవడంతో ఆ టైటిల్ తో ఈ సినిమాను నిర్మించడం జరిగింది. కానిస్టేబుల్ ల మీద నాకున్న గౌరవంతో ఒక అద్భుతమైన పాటను నేను దగ్గరుండి రాయించి, నల్గొండ గద్దర్ నరసన్న తో పాటించడం జరిగింది. ఈ పాటను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు విడుదల చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. .దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ, మంచి కథ, కథనాలు, పాత్రలో వరుణ్ ఒదిగిపోయిన విధానం, నిర్మాత అభిరుచి ఈ చిత్రం అద్భుతంగా రావడానికి దోహదం చేసిందని అన్నారు. సినిమాలో సందర్భానుసారంగా వచ్చే టైటిల్ సాంగ్ ఎంతగానో స్పందింప జేస్తుందని అన్నారు. -
పోలీస్ స్పోర్ట్స్ మీట్ సైనా నెహ్వాల్,సీపీ సీవీ ఆనంద్ సందడి (ఫొటోలు)
-
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
సంధ్య థియేటర్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. తొక్కిసలాట ఘటన గురించి తనకు పోలీసులు సమాచారం అందించలేదని అల్లు అర్జున్ చెప్తోంటే.. ఒక మహిళ చనిపోయిందన్న విషయం కూడా హీరోకు తెలియజేశామని పోలీసులు అంటున్నారు. అయినా సరే పట్టించుకోకుండా తన సినిమా పూర్తయ్యేవరకు అల్లు అర్జున్ అక్కడే ఉంటానన్నాడని తెలిపారు.బౌన్సర్లకు వార్నింగ్పదిహేను నిమిషాల తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడన్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పది నిమిషాల వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం సంధ్య థియేటర్ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువగా మాట్లాడలేనన్నారు. అలాగే బౌన్సర్లకు, బౌన్సర్ల ఏజెన్సీలకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులనే తోసుకుని వెళ్తున్న బౌన్సర్లకు అడ్డుకట్ట వేసే అవసరం ఉందన్నారు.(చదవండి: ఒకరు చనిపోయారని చెప్పినా అల్లు అర్జున్ సినిమా చూశాకే వెళ్తానన్నారు: ఏసీపీ)వారిదే పూర్తి బాధ్యతపోలీసులపై, పబ్లిక్పై చేయి వేసినా, ముట్టుకున్నా వారిని వదిలిపెట్టమన్నారు. జనాలను తోసేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. ఎక్కడైనా ఓవరాక్షన్ చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. బౌన్సర్లను పెట్టుకున్న వారిదే పూర్తి భాధ్యత అని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. చదవండి: ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ రిక్వెస్ట్.. అప్రమత్తంగా ఉండాలని ట్వీట్ -
15 రోజుల ముందే అనుమతి తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం సందర్భంగా ఈ నెల 31న రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ప్రత్యేక ఈవెంట్స్ నిర్వహించే 3 నక్షత్రాల హోటళ్లు, బార్లు, క్లబ్బులు, పబ్‌లు తప్పని సరిగా 15 రోజుల ముందే అనుమతులు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఈవెంట్ నిర్వహించే ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ(మెజర్స్) ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 కింద తప్పని సరిగా ఎంట్రీ, ఎగ్జిట్‌తో పాటు ప్రాంగణమంతా కవరయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని. తగిన సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బందిని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సరైన ఏర్పాట్లు చేసుకోవాలని, అశ్లీలతకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఔట్‌డోర్‌లో ఉండే సౌండ్ సిస్టమ్స్ రాత్రి 10 గంటలకల్లా బంద్ చేయాలని, ఇండోర్‌లో ఒంటి గంట వరకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. సామరŠాధ్యనికి మించి టిక్కెట్లు జారీ చేయడం వల్ల పలు రకాల ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్యలు కూడా తలెత్తుతాయన్నారు. ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ వాడకూడదని, ఈ విషయంలో నిర్వాహకులు పార్కింగ్, ఇతర ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎక్సైజ్ శాఖ నిబంధనల మేరకు నిరీ్ణత సమయం వరకే మద్యం ఉపయోగించాలని, ఈవెంట్‌కు వచ్చే కస్టమర్లు తిరిగి వెళ్లే సమయంలో డ్రైవర్లు, క్యాబ్స్ అందుబాటులో ఉంచాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు కస్టమర్లను దూరంగా ఉంచాలన్నారు. ఆ రోజు రాత్రి విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని సీపీ తెలిపారు. అగ్నమాపక శాఖ ఆదేశాల మేరకు ఫైర్ వర్క్స్‌ను ఉపయోగించరాదని సూచించారు. -
సీవీ ఆనంద్ డీపీతో ఫేక్ వాట్సాప్ కాల్స్.. సైబర్ నేరగాళ్ల బెదిరింపులు
సాక్షి,హైదరాబాద్:సైబర్ నేరగాళ్లు రోజుకో అవతారమెత్తుతున్నారు. నగర పోలీస్ కమిషనర్(సీపీ) సీవీఆనంద్ డీపీతో వాట్సాప్ కాల్ చేస్తూ ప్రజలను భయపెట్టేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. పాకిస్తాన్ దేశ కోడ్‌తో వాట్సాప్‌కాల్స్ చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమతంగా ఉండాలని ప్రజలకు సీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఇటీవల సైబర్ నేరగాళ్లు ఇటీవల అక్రమ కేసుల పేరిట ఫేక్ వాట్సాప్‌కాల్స్ చేస్తూ ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం పెరిగిపోయిన విషయం తెలిసిందే. డిజిటల్ అరెస్టులతో పాటు కేసులు రిజిస్టర్ అవడం, ఫోన్ కనెక్షన్‌ను ట్రాయ్ కట్ చేయడం తదితర కారణాలు చెప్పి ప్రజలను భయపెడుతున్నారు.ఇదీ చదవండి: ట్రావెల్ బస్సులో భారీ చోరీ -
హైదరాబాద్ లో నెల రోజుల పాటు ఆంక్షలు.. కారణం ఇదే
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు: సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్(సీపీ) సీవీ ఆనంద్ తొలిసారిగా స్పందించారు. ఈ కేసు దర్యాప్తుపై శుక్రవారం(అక్టోబర్ 25) మీడియాతో మాట్లాడుతూ సీపీ కీలక వ్యాఖ్యలు చేశారు.‘ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కేసులో కీలక నిందితుడు టాస్క్‌ఫోర్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చాడన్న ప్రచారంలో వాస్తవం లేదు.ఇప్పటికే ప్రభాకర్‌రావుపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశాం.ప్రభాకర్‌రావు దేశంలో ఎక్కడ ఏ ఎయిర్‌పోర్టులో దిగినా మాకు సమాచారం వస్తుంది. ఆయనను భారత్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం’ అని సీవీ ఆనంద్ చెప్పారు.కాగా, ఫోన్‌ట్యాపింగ్ కేసులో పలువురు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి విచారించగా ప్రభాకర్‌రావు మాత్రం విదేశాల్లో ఉండిపోయారు. ఆయన ఈ కేసులో ఇంకా విచారణకు హాజరు కాలేదు. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్‌రావు ఈ కేసులో ఏప్రిల్ నుంచి జైలులోనే ఉన్నారు. ఆయన ఇటీవలే బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇదీ చదవండి: మాజీ ఈఎన్సీకి కాళేశ్వరం కమిషన్ కీలక ఆదేశాలు -
హైదరాబాద్‌లో ‘హాక్ 2.0’కు కసరత్తు!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచడానికి, ప్రతి ఒక్కరినీ సైబర్ వారియర్స్‌గా తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమ్మిట్స్ను మరోసారి నిర్వహించాలని సిటీ కొత్వాల్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. గత ఏడాది ఆయన హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా ఉండగా తొలి హాక్–2023 సమ్మిట్ నిర్వహించారు. తాజాగా మరోసారి హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమ్మిట్–2024కు (హాక్ 2.0) సన్నాహాలు చేస్తున్నారు.నగర పోలీసు విభాగం, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) సంయుక్తంగా నిర్వహించే ఈ సమ్మిట్ వచ్చే నెల 6న నగరంలోని ది పార్క్ హోటల్లో జరుగనుంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రతి ఏడాదీ ఇలాంటి సమ్మిట్స్ నిర్వహించాలని, సైబర్‌తో పాటు ట్రాఫిక్, నార్కోటిక్స్, ఉమెన్ సేఫ్టీ విభాగాలకు వీటిని విస్తరించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గతంలోనే నిర్ణయించారు.యువత... ప్రధానంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న చేపట్టబోయే సైబర్ సమ్మిట్‌లో కొన్ని విద్యా సంస్థలకు చెందిన సైబర్ స్వ్కాడ్స్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. వీళ్లు వారి పాఠశాలల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తారు. ఎప్పటికప్పుడు కొత్త ముప్పులు పుట్టుకువస్తున్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరికీ సైబర్ సెక్యూరిటీ అన్నది అత్యంత కీలకాంశంగా మారింది. దీనికోసమే సిటీ పోలీసులు, హెచ్సీఎస్సీ కలిసి పనిచేస్తూ ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాయి.చదవండి: సైబర్ స్కామర్స్‌తో జాగ్రత్త.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి.. -
ఆనందమే జీవన మకరందం!
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ వేడుకలు, దాండియాలకు సంబం«ధించి ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర చర్చ జరిగింది. ఓ నెటిజనుడు అడిగిన ప్రశ్నకు కొత్వాల్ సీవీ ఆనంద్ తనదైన శైలిలో స్పందించారు. దీనికి తన వ్యాఖ్యను జోడించిన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంభాషణను మరింత రక్తికట్టించారు. వందలాది స్పందనలతో ఈ ట్వీట్ ఆదివారం వైరల్‌గా మారింది. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం పాతబస్తీలోని పేట్లబుర్జులో ఉన్న సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు వెళ్లారు. అక్కడ పోలీసు విభాగం ఏర్పాటు చేసిన బతుకమ్మ, దాండియా వేడుకల్లో సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ ఫొటోలు, వీడియోలను కొత్వాల్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. దీనిపై స్పందించిన ఓ నెటిజనుడు 1999 నాటి ‘ప్రేమికుల రోజు’ చిత్రంలోని ‘దాండియా ఆటలు ఆడ’ పాటలోని ఓ భాగాన్ని జోడించారు. దీంతో పాటు ‘నిజం చెప్పండి... మీ స్కూల్, కాలేజీ రోజుల్లో దాండియా, బతుకమ్మతో ముడిపడిన ప్రేమకథలు ఉన్నాయా? అప్పట్లో మీరు కవితలు కూడా రాసి ఉంటారని భావిస్తున్నా’ అంటూ వ్యాఖ్యానించారు. దీన్ని సానుకూలం దృక్పథంతో స్వీకరించిన ఆనంద్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘ఎన్నో ప్రేమ కథలు.. అయితే బతుకమ్మ, దాండియాలతో సంబంధం లేదు. మీరు కాసేపు మనసారా నవ్వుకునేలా నా పోస్టు ఉన్నందుకు సంతోషం’ అంటూ ఆంగ్లంలో వ్యాఖ్యానించారు. దీంతో పాటు ‘ఔర్ క్యా రహాహై జిందగీ మే! జరా హసీన్ మజాక్ హోజాయే హర్ దిన్’ (జీవితంలో ఇంకా ఏం మిగిలింది.. ప్రతిరోజూ అందంగా, ఆనందంగా నవ్వుకోవడం తప్ప) అనే వ్యాఖ్యను ఆయన జోడించారు. దీనిపై పలువురు నెటిజనులు పోస్టులు, ట్యాగ్లు చేస్తుండగా... హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రంగంలోకి వచ్చారు. సీవీ ఆనంద్‌ను ఉద్దేశిస్తూ ‘నిజాం కాలేజీ జిందాబాద్’ అంటూ పోస్టు చేశారు. కొత్వాల్ ఆనంద్, ఎంపీ అసదుద్దీన్ ఇద్దరూ క్లాస్మేట్స్ కావడమే కాదు.. నిజాం కాలేజీ పూర్వ విద్యార్థులు కావడం ఇక్కడ గమనార్హం. -
హైదరాబాద్‌లో నో డీజే.. నో క్రాకర్స్: సీపీ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నేటి నుంచి డీజే, క్రాకర్స్ ఉపయోగించడంపై నిషేధం విధిస్తున్నట్టు నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. శబ్ధ కాలుష్యాన్ని కారణంగానే డీజేలకు అనుమతులను సవరిస్తున్నట్టు సీపీ చెప్పారు.సీవీ ఆనంద్ మంగళవారం మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో డయల్ 100కు ఫిర్యాదులు రావటంతో నగరంలోని రాజకీయ పార్టీ ప్రతినిధులు , అన్ని మత పెద్దలతో చర్చలు జరిపాము. ఈ క్రమంలోనే డీజేలు, క్రాకర్స్‌పై నిషేధం విధించడం జరిగింది. నేటి నుండి హైదరాబాద్‌లో డీజేలు, క్రాకర్స్‌పై నిషేధం విధింపు ఉంటుంది. మతపరమైన ర్యాలీలలో ఎలాంటి డీజేలను ఉపయోగించకూడదు. మైకులు, సౌండ్ సిస్టంను మాత్రం పరిమిత స్థాయిలో అనుమతిస్తాము. సౌండ్ సిస్టం పెట్టడానికి కూడా పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరి తీసుకోవాల్సిందే. నాలుగు జోన్లలో సౌండ్ సిస్టం పెట్టడానికి డెసిబుల్స్‌ను నిర్దేశించాము.జనావాసాల ప్రాంతంలో ఉదయం 55 డెసిబుల్స్‌కి మించి సౌండ్ సిస్టంలో వాడరాదు. రాత్రి వేళలో 45 డెసిబుల్స్‌కు మించి సౌండ్ సిస్టమ్స్‌ను ఉపయోగించరాదు. మతపరమైన ర్యాలీలలో బాణాసంచా కాల్చడం పూర్తిగా నిషేధం ఉంటుంది. డీజే, సౌండ్ మిక్సర్, హై సౌండ్ పరికరాలపై నిషేధాజ్ఞలు కొనసాగుతాయి. రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున ఆరు గంటల వరకు నిషేధం ఉంటుంది. అనుమతి ఉన్న ప్రాంతాల్లో తక్కువ శబ్దంతో మాత్రమే ఉపయోగించుకోవాలి. ఆసుపత్రులు, స్కూల్స్, కాలేజీలు, కోర్టు ప్రాంగణాలకు 100 మీటర్ల దూరం వరకు నిషేధాజ్ఞలు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదు సంవత్సరాల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రతిరోజు 5000 రూపాయల జరిమానా విధింపు ఉంటుంది. అలాగే, బీఎన్ఎస్ చట్ట ప్రకారం ఐదేళ్ల వరకు జైలు శిక్ష తోపాటు జరిమానా పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఇది కూడా చదవండి: బుల్డోజర్ను బొంద పెట్టండి: మూసీ నిర్వాసితులతో కేటీఆర్ -
డీజే, బాణాసంచా సౌండ్స్ పై కీలక నిర్ణయం
-
డీజే శబ్దాలపై అనేక ఫిర్యాదులు, ప్రభుత్వానికి నివేదిక: సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనందర్ అధ్యక్షతనగురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగినఈ సమావేశానికి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రా పాలీ, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ప్రతినిధులు, మత సంఘాలు నేతలు హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. డీజే శబ్దాల మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇంట్లో ఉన్న వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని, గుండె అదురుతుందని ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. డీజే సౌండ్స్ పోనుపోనూ శ్రుతి మించుతున్నాయని, గణేష్ పండుగే కాకుండా మిలాద్ ఉన్ నబిలోనూ డీజే నృత్యాలు విపరీతం అయ్యాయని అన్నారు. పబ్‌లో డ్యాన్సులు చేసినట్లే ర్యాలీల్లో చేస్తున్నారని చెప్పారు.డీజే శబ్దాలపై కంట్రోల్ లేకపోతే ఆరోగ్యాలు దెబ్బ తింటాయన్నారు సీవీ ఆనంద్ డీజే శబ్దాలు కట్టడి చేయాలని కోరుతూ తమకు అనేక సంఘాల నుంచి వినతులువచ్చాయని అన్నారు. డీజేల వల్ల ఆరోగ్య సమస్యలే కాకుండా భద్రతకు ముప్పు ఉందన్నారు. అందుకే పలు వర్గాలను పిలిచామని, అందరి అభిప్రాయం తీసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. తమ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. -
HYD: డీజే, క్రాకర్స్ కాల్చడంపై వ్యతిరేకత.. సీపీ కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: నగరంలో డీజేల వాడకం, బాణాసంచా వినియోగంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. పండుగల ర్యాలీలో డీజేల వాడకంపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్న క్రమంలో వివిధ మతాల పెద్దలతో సీపీ సమావేశం ఏర్పాటు చేశారు.హైదరాబాద్‌లో డీజేలు, బాణాసంచా కాల్చడంపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో వీటి వాడకంపై సీపీ సీవీ ఆనంద్.. మత పెద్దలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వారి నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. మరోవైపు.. క్రాకర్, డీజే వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని అధికారులు అంటున్నారు. ఇది కూడా చదవండి: హామీలు అడిగితే మహిళలను అరెస్ట్ చేస్తారా?: కేటీఆర్ ఫైర్ -
అన్‘ఎక్స్’పెక్టెడ్‌గా!
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆయన ఎక్స్ ఖాతాకు 23 వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. విధి నిర్వహణతో పాటు సిటీకి సంబంధించిన అనేక కీలకాంశాలను ఆనంద్ తన ఎక్స్ ఖాతాలో పొందుపరుస్తూ ఉంటారు. కేవలం పోస్టు చేసి సరిపెట్టుకోకుండా... దానిపై వస్తున్న స్పందనలనూ నిశితంగా గమనిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్స్ ఖాతాకు నెటిజనుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఎవరూ ఊహించని విధంగా పలువురు కీలక సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వీటిలో కొన్ని ట్రాఫిక్, మరికొన్ని పోలీసింగ్‌కు సంబంధించినవి ఉంటున్నాయి.హై లెవల్ కమిటీ విషయం చెప్తే... రాజధానిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో (టీజీ సీసీసీ) కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన ఉన్నతాధికారులతో హై లెవల్ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కొత్వాల్ ఆనంద్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. దీనిపై శివకుమార్ అనే నెటిజనుడు స్పందిస్తూ... వాటర్ లాగింగ్ ఏరియాల్లో సమస్యల పరిష్కారం కోసం స్థానికుల సహాయం తీసుకోవడంతో పాటు వారినీ భాగస్వాముల్ని చేయాలని సూచించారు. దీనికి ఆనంద్ ‘గ్రేట్ ఐడియా’ అంటూ కితాబివ్వడం చూస్తే... త్వరలోనే అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.టర్న్‌లు లేకున్నా బోర్డులు ఉన్నాయంటూ... నగరంలోని రోడ్లపై ట్రాఫిక్ ఇక్కట్లు తప్పించడానికి అధికారులు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. వీటిలో భాగంగా పలు ప్రాంతాల్లో యూ టర్న్‌లు మూసేశారు. అయితే ఆయా చోట్లకు కాస్తా ముందు జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు మాత్రం అలానే ఉన్నాయి. వీటిని చూస్తున్న వాహనచోదకులు ఇంకా యూ టర్న్ ఉందని భావించి రోడ్డులో కుడి వైపునకు వస్తున్నారు. చివరకు అక్కడ టర్న్ లేదని గుర్తించి మళ్లీ ఎడమ వైపునకో, రోడ్డు మధ్యకో వెళ్తున్నారు. ఈ ‘రాకపోకలు’ వారికి అసౌకర్యం కావడంతో పాటు ఇతరులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ అంశాన్ని గుర్తించిన శశిధర్ అనే నెటిజన్ ‘ఎక్స్’ ద్వారా ఆనంద్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన ‘వెరీ గుడ్ అబ్జర్వేషన్–షల్ సీ’ అంటూ సమాధానం ఇచ్చారు. ఇలా త్వరలో అవసరం లేని చోట్ల సూచిక బోర్డులు తొలగిస్తామంటూ పరోక్షంగా హామీ ఇచ్చారు.మరోసారి ‘రోప్’ మొదలెడతామన్న సీపీ...కొత్వాల్ ఆనంద్ మంగళవారం ఉదయం ఓ కీలక పోస్టు చేశారు. గతంలో ఆయన పోలీసు కమిషనర్‌గా పని చేసినప్పుడు 2022లో ఆపరేషన్ రోప్‌ను చేపట్టారు. రోడ్లపై ట్రాఫిక్ సజావుగా సాగాలంటే ఫుట్‌పాత్‌కు–ప్రధాన రహదారికి మధ్య ఉండే క్యారేజ్ వే క్లియర్‌గా ఉండాలి. అయితే ప్రధాన రహదారులతో సహా అనేక చోట్ల అక్రమ పార్కింగ్, ఆక్రమణలతో ఈ వే కనిపించట్లేదు. ఈ పరిస్థితి మార్చడం కోసం ఆపరేషన్ రోప్ (రివూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్‌క్రోచ్‌మెంట్స్) చేపట్టారు. ఆ ఏడాది అక్టోబర్ 3 నుంచి మొదలైన ఈ ఆపరేషన్ ఆయన బదిలీ తర్వాత అటకెక్కింది. దీంతో రెండోసారి సీపీగా వచ్చిన ఆయన మళ్లీ ప్రారంభించనున్నట్లు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
HYD: రేపు ఉదయానికల్లా నిమజ్జనం పూర్తి: సీవీ ఆనంద్
సాక్షి,హైదరాబాద్: రేపు ఉదయంలోగా నగరంలో నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. నిమజ్జనంపై మంగళవారం(సెప్టెంబర్17) మధ్యాహ్నం సీవీ ఆనంద్ మీడియాకు అప్డేట్ ఇచ్చారు.‘హైదరాబాద్‌లో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరుగుతోంది.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సౌత్ ఈస్ట్,సౌత్ వెస్ట్‌లో ఉన్న విగ్రహాలు త్వరగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నాం. నిమజ్జనం ఆలస్యం కాకుండా చర్యలు తీసుకున్నాం.మండప నిర్వాహకులతో మాట్లాడి త్వరగా నిమజ్జనం జరిగేలా చర్యలు తీసుకున్నాం. బాలాపూర్ వినాయకుడు కూడా త్వరగా నిమజ్జనం అయ్యేలా ప్రయత్నిస్తున్నాం.ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశాం.షిఫ్ట్ వారిగా 25 వేల మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశాం.నిమజ్జనంలో పోలీసులు అలసిపోకుండా షిఫ్ట్‌ల ప్రకారం డ్యూటీలు చేస్తున్నారు.లక్ష విగ్రహాల్లో ఇంకా 20 వేల విగ్రహాలు పెండింగ్ ఉన్నాయి.నిమజ్జనం కోసం వచ్చే ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో రావాలని కోరుతున్నాం.మీడియాలో లైవ్ టెలికాస్ట్ చూడాలని కోరుతున్నాం. ఇదీ చదవండి.. గణేష్ నిమజ్జనానికి హాజరైన తొలి సీఎం రేవంత్ -
సిటీలో 17నే నిమజ్జనం.. ఆరోజే కాంగ్రెస్, బీజేపీ కార్యక్రమాలు: సీపీ
సాక్షి, హైదరాబాద్: ఈనెల 17వ తేదీన తెలంగాణలో గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రక్రియ జరుగనుంది. ఈనేపథ్యంలో నిమజ్జనాలకు సంబంధించి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటన్నరలోపే నిమజ్జనం జరుగుతుందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. ఇదే సమయంలో నిమజ్జనాల కోసం హైదరాబాద్‌లో రూట్స్ పరిశీలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.కాగా, సీపీ సీవీ ఆనంద్ శనివారం నిమజ్జన ఏర్పాట్ల సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ..విగ్రహాల కోసం అన్ని శాఖల అధికారులు, హై లెవెల్ కమిటీ అంత కలిసి నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. బాలాపూర్ గణేషుడి కోసం రూట్ పరిశీలిస్తున్నాం. చిన్న విగ్రహాలు కూడా నిమజ్జనానికి వెళ్లేలా జోనల్ కమిషనర్లు అన్నీ పరిశీలిస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లు, వైర్లను తొలగించారు.నిమజ్జనాల కోసం మండప నిర్వాహకుల కోరిక మేరకు అన్ని ఏర్పాటు చేస్తున్నాం. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతున్నాం. పెండింగ్ పనులు అన్ని ఈరోజు పూర్తవుతాయి. నిమజ్జనం రోజు 25వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారు. 15వేల సిటీ పోలీసులు, 10వేల మంది డీజీపీ, జిల్లాల నుండి పోలీసులు వస్తున్నారు. హుస్సేన్ సాగర్ వైపు వస్తున్న ట్రై కమిషనరేట్ పరిధిలోని విగ్రహాలు ప్రశాంతంగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నాం. హుస్సేన్ సాగర్ వద్ద ఘనంగా నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేశాం. రోజురోజుకు నిమజ్జనాల రద్దీ పెరుగుతోంది. రద్దీకి అనుగుణంగా క్రెయిన్, వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది.ఖైరతాబాద్ బడా గణేషుడి నిమజ్జనం మంగళవారం మధ్యాహ్నం 1.30లోపు అవుతుంది. మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకే పూజలు అన్నీ పూర్తి చేసుకుని విగ్రహాన్ని తరలిస్తాం. విగ్రహా నిమజ్జనం కోసం క్రెయిన్‌ను తరలించనున్నారు. పోలీసులు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం త్వరగా పూర్తి అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు.అలాగే, సెప్టెంబర్ 17వ తేదీన ప్రభుత్వపరంగా పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతుంది. బీజేపీ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో మరో కార్యక్రమం జరుగుతుంది. ఇక, ఎంఐఎం ఆధ్వర్యంలో సౌత్ జోన్లో ర్యాలీ కొనసాగనుంది. పలు కార్యక్రమాలు, ర్యాలీలు, నిమజ్జనాల కోసం బందోబస్తు ఏర్పాటు చేశాం. అన్ని కార్యక్రమాలు ప్రశాంతంగా ముగుస్తాయని భావిస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఉచిత ఆహారం: అమ్రపాలి -
ఆ రెండు రోజులు వైన్స్ బంద్ : పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
హైదరాబాద్,సాక్షి : నగరంలో గణనాథుల నిమజ్జనాల సందర్భంగా పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల పాటు వైన్,కల్లు,బార్ షాపులు మూసివేస్తున్నట్లు తెలిపారు.గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని అన్ని వైన్, కల్లు, బార్ షాపులను మూసివేయాలని సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 17 ఉదయం 6 గంటల నుండి సెప్టెంబర్ 18 సాయంత్రం 6 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది.తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 20 కింద నిమజ్జన ఉత్సవాల సందర్భంగా ప్రజల శాంతి, ప్రశాంతతను కాపాడటం లక్ష్యంగా పోలీసు విభాగం స్టార్ హోటళ్లు రిజిస్టర్డ్ క్లబ్‌లలో ఉన్న బార్లు మినహా రెస్టారెంట్లకు అనుబంధంగా బార్లు సైతం మూసివేయాలని సీవీ ఆనంద్ నిర్వాహకులకు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నగరంలోని అన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ల అదనపు ఇన్స్పెక్టర్లకు అధికారం ఇచ్చినట్లు సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.ఇదీ చదవండి : కేజ్రీవాల్‌కు బెయిల్ -
HYD: ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం లేదు: సీవీ ఆనంద్
సాక్షి,హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలతో ఈసారి ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనం లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ విషయమై శుక్రవారం(సెప్టెంబర్13) ఆయన మీడియాతో మాట్లాడారు. నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌లో గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. నిమజ్జన విధుల్లో మొత్తం 18వేల మంది పోలీసులు పాల్గొంటారని చెప్పారు. ఈ ఏడాది నుంచి హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీవోపీ) విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వీలులేదని హైకోర్టు గతేడాదే ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల అమలు కోసం ఎన్డీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్డులో విగ్రహాల నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో నిమజ్జనోత్సవం జరగనుంది. ఇదీ చదవండి.. కఠినంగా వ్యవహరించండి: డీజీపీకి సీఎం రేవంత్ ఆదేశాలు -
హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్..
-
21 ఏళ్ల తర్వాత సీవీ ఆనంద్‌కు అరుదైన అవకాశం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్ మరోసారి నియమితులయ్యారు. కొత్తకోట శ్రీనివాసరెడ్డిని హఠాత్తుగా బదిలీ చేసిన సర్కారు.. కొత్త కొత్వాల్‌గా సీవీ ఆనంద్‌ను తీసుకువచ్చింది. దీంతో ఏడాదిలో ఈయన నాలుగో కమిషనర్‌గా రికార్డులకు ఎక్కారు. మొదటి, నాలుగు స్థానాలు ఆనంద్‌వే కాగా.. మధ్యలో మాత్రం శాండిల్య, శ్రీనివాసరెడ్డి పని చేశారు. మరో విశేషం ఏమిటంటే.. 21 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌కు డీజీపీ స్థాయి అధికారిని సీపీగా నియమించడం. నగరానికి 61వ పోలీసు కమిషనర్‌గా ఆనంద్ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. 2021లో తొలిసారిగా నియామకం.. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్లకు డీసీపీ, ట్రాఫిక్ విభాగం అదనపు సీపీగా పని చేసిన ఆనంద్ 2021లో తొలిసారిగా సిటీ కొత్వాల్ అయ్యారు. ఆ ఏడాది డిసెంబర్ 25 నుంచి గత ఏడాది అక్టోబర్ 12 వరకు విధులు నిర్వర్తించిన సీవీ ఆనంద్... ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆ మరుసటి రోజు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి గత ఏడాది డిసెంబర్ 13 వరకు సందీప్ శాండిల్య పోలీసు కమిషనర్‌గా వ్యవహరించారు. ఆ మరుసటి రోజు బాధ్యతలు స్వీకరించిన కొత్తకోట శ్రీనివాస రెడ్డిని శనివారం బదిలీ చేసిన ప్రభుత్వం మళ్లీ సీవీ ఆనంద్‌నే కొత్వాల్‌గా నియమించింది. నగర కమిషనరేట్ చరిత్రలో తొలిసారి.. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు 177 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే సుదీర్ఘకాలం నిజాం ఏలుబడిలో ఉన్న హైదరాబాద్ 1948 సెప్టెంబర్‌లో జరిగిన ఆపరేషన్ పోలోతో దేశంలో విలీనమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 45 మంది పోలీసు కమిషనర్లుగా పని చేశారు. కేవలం రెండు సందర్భాల్లోనే ఏడాదిలో ముగ్గురు కమిషనర్లుగా పని చేశారు. ఈసారి ఆ కాలంలో ఏకంగా నలుగురు మారారు. ఆనంద్‌ది పునరాగమనం అయినప్పటికీ... ఈయన నాలుగో అధికారే. 1990లో మాత్రం మత కలహాలు సహా అప్పటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఏడాదిలో నలుగురు పోలీసులు కమిషనర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటి వరకు ఏడుగురికే... హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ తొలి కొత్వాల్ హసన్ అలీ ఖాన్ నుంచి గత ఏడాది పోలీసు కమిషనర్‌గా వచి్చన కొత్తకోట శ్రీనివాసరెడ్డి వరకు మొత్తం 60 మంది అధికారులు ఈ పోస్టులో పని చేశారు. సీవీ ఆనంద్ సంఖ్య 61 కాగా.. ఇప్పటి వరకు ఏడుగురికి మాత్రమే రెండోసారి నగర పోలీసు చీఫ్‌గా పని చేసే అవకాశం దక్కింది. గతంలో సి.రంగస్వామి అయ్యంగర్, బీఎన్ కాలియా రావు, ఎస్పీ సత్తారు, కె.విజయరామారావు, ఆర్.ప్రభాకర్‌రావు, వి.అప్పారావు, ఆర్పీ సింగ్‌లకు మాత్రమే ఇలా పని చేయగలిగారు. 2003లో ఆర్పీ సింగ్ తర్వాత 21 ఏళ్లకు సీవీ ఆనంద్‌కు ఈ అరుదైన రికార్డు సాధించారు. చట్టం లేకపోయినా మహారాష్ట్ర తరహాలో.. నగర కొత్వాల్‌గా పునరాగమనం చేసిన ఆనంద్ 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం డీజీపీ హోదాలో పోలీసు విభాగానికి నేతృత్వం వహిస్తున్న పోలీసు బాస్ డాక్టర్ జితేందర్‌ది 1992 బ్యాచ్. ఇలా డీజీపీ కంటే సీనియర్ అయిన అధికారి సిటీ కొత్వాల్‌గా నియమితులయ్యారు. ఈ విధానం ప్రత్యేక చట్టం ద్వారా మహారాష్ట్రలో ఉంది. అక్కడి ప్రత్యేక పరిస్థితులు, అనివార్య కారణాల నేపథ్యంలో డీజీపీ కంటే సీనియర్ అధికారినే ముంబై కమిషనర్‌గా నియమిస్తుంటారు. క్షేత్రస్థాయిలోనూ మహారాష్ట్ర డీజీపీ కన్నా ముంబై నగర కమిషనర్‌గా ఎక్కువ బాధ్యతలు, అధికారాలు ఉంటాయి.ఆదర్శ్‌నగర్ టు ‘బంజారాహిల్స్’..క్రికెట్, బ్యాడ్మింటన్, గోల్ఫ్ తదితర క్రీడల్లోనూ తనదైన మార్కు కలిగిన సీవీ ఆనంద్ పూరీ్వకులది రంగారెడ్డి జిల్లాలోని కుంట్లూరు. ఆనంద్ కుటుంబం మాత్రం ఆదర్శ్‌నగర్‌లో నివసించేది. ఆయన పాతబస్తీలోని ప్రభుత్వ మెటరి్నటీ ఆస్పత్రిలో జని్మంచారు. హెచ్‌పీఎస్ నుంచి మొదలైన ఆయన విద్యాభ్యాసం ఐపీఎస్ వరకు వెళ్లింది. బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీ సీసీసీ), అందులోని పోలీసు కమిషనర్ కార్యాలయం సైతం ఆయన హయాంలోనే ప్రారంభమైంది. ఆయన కొత్వాల్‌గా ఉండగా హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) సహా అనేక విభాగాలకు అంకురార్పణ జరిగింది. -
అవినీతి చేస్తే తప్పించుకోలేరు: సీవీ ఆనంద్ హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్: అవినీతికి పాల్పడే అధికారులపై తెలంగాణ ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఎక్స్(ట్విటర్)లో సంచలన ట్వీట్ చేశారు. లంచం తీసుకునే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.ఇందుకు తాజాగా రంగారెడ్డి జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్లను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకోవడమే నిదర్శనమన్నారు. ఈ ఇద్దరిని పట్టుకోవడానికి ఏసీబీ బృందం ఎంతో చాకచక్యంగా పని చేశారు. ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఇద్దరు లంచగొండి అధికారులను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నామని తెలిపారు. ACB traps and arrests MV Bhoopal Reddy, Joint Collector and Senior Assistant Y.Madan Mohan Reddy of Rangareddy district collectorate who colluded and abused their official positions. They were caught redhanded while accepting bribe of Rs 8,00,000 from the complainant for removal… pic.twitter.com/6cN2qastGH— CV Anand IPS (@CVAnandIPS) August 13, 2024 -
సీవీ ఆనంద్ పేరుతో మరో నాలుగు నకిలీ ఖాతాలు
హిమాయత్‌నగర్: ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల రెండు ఖాతాలకు సంబంధించి నగర సీసీఎస్ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీపీ చాంద్‌పాషా నేతత్వంలోని బృదం రెండు నకిలీ ఖాతాలను తొలగించింది. విచారణ క్రమంలో మరో నాలుగు నకిలీ ఖాతాలను గుర్తించారు. ఇందులో ఒక ఖాతాలో సైబర్‌నేరగాళ్లు డబ్బులు కావాలంటూ పెట్టిన మేసేజ్‌కు స్పందించి ఒకరు రూ.80 వేలు బదిలీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలలోని సైబర్ నేరగాళ్లు పోలీస్ అధికారులు, ఇతర ప్రముఖుల పేర్లతో ఫేస్బుక్లో నకిలీ ఖాతాలు సృష్టించి, డబ్బు అవసరముందంటూ మేసేజ్‌లు పెడుతుంటారు. అధికారుల పేర్లతో ఎవరైనా డబ్బులు అడిగితే నకిలీ అకౌంట్‌గా గుర్తించాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. -
సీవీ ఆనంద్ పేరిట నకిలీ ఫేస్బుక్, ఇన్‌స్టా ఖాతాలు
హిమాయత్‌నగర్: తెలంగాణ రాష్ట్ర ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ పేరిట సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ కావడంతో ఏసీబీ అధికారులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు సీవీ ఆనంద్ పేరుతో ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి..పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపించారు. ఈ విషయం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సీవీ ఆనంద్ దృష్టికి వచ్చింది. ఆయన సూచన మేరకు ఏసీబీ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మారుతి తెలిపారు. -
ఎలక్షన్ అలర్ట్ !
హైదరాబాద్: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూర్తి నిఘా ఉంచాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులు, సెక్టోరల్ నోడల్ ఆఫీసర్లు, డిప్యూటీ కలెక్టర్లు, పోలీసు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, జీఎస్టీ, ఎస్ఎల్బీసీ, ఆర్బీఐ, కస్టమ్స్, ఎన్సీబీ అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో కలిసి రోనాల్డ్‌రాస్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మద్యం, ధనప్రవాహం లేకుండా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమష్టిగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. మద్యం షాపుల వద్ద సీసీ కెమెరాల నిఘా ఉండాలని, వాటిని పోలీసు కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. ఎకై ్సజ్, పోలీస్, జీఎస్టీ విభాగాల అధికారులు జాయింట్‌గా ఆపరేషన్లు నిర్వహించాలని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా భారీగా జరిగే నగదు బదిలీలపై ఆర్బీఐ, ఎస్ఎల్బీసీలు తగిన చర్యలు తీసుకోవాలని, నిర్ణీత పరిమితికి మించి ఎక్కువ మొత్తంలో విత్‌డ్రా చేసే వారి వివరాలు సేకరించి విచారణ జరపాలన్నారు. నగదు తరలింపు, తదితరమైన వాటికి సంబంధించి వాహనాల కదలికలను జీపీఎస్ సిస్టమ్‌తో కమాండ్ కంట్రోల్‌రూమ్ నుంచి పరిశీలిస్తామని చెప్పారు. ఉచిత పంపిణీల సందర్భంగా కన్సూమర్స్ గూడ్స్‌పై కమర్షియల్ ట్యాక్స్ విభాగం నిఘా ఉండాలన్నారు. గంజాయి తరలింపు ప్రాంతాల గుర్తింపునకు ఎన్సీబీ (నార్కోటిక్ కంట్రోల్‌బ్యూరో) ద్వారా చర్యలు తీసుకోవాలని సూచించారు. సెక్టోరల్ అధికారులు విధులకు హాజరు కాని పక్షంలో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. వల్నరబుల్ (సమస్యాత్మక) పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ చేసి, వాటిని మూడుసార్లు సందర్శించాలన్నారు. ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల ఏర్పాటు: సీవీ ఆనంద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, గుర్గావ్, ఢిల్లీ ఎయిర్‌పోర్టుల నుంచి అక్రమంగా తరలించే నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ నియంత్రణకు అవసరమైన ప్రాంతాల్లో చెక్పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గంజాయి నియంత్రణకు విజయవాడ రోడ్‌లోని పెద్దఅంబర్ పేట్, ఘట్కేసర్ సరిహద్దులు తదితర ప్రాంతాల్లో ఎన్సీబీ ఆపరేషన్లు నిర్వహించాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో ఎకై ్సజ్, జీఎస్టీ, ఆర్టీఏ, పోలీసు విభాగాలతో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమన్నారు. వల్నరబుల్ ప్రాంతాల మ్యాపింగ్‌లో అలసత్వం వహించవద్దని, సెక్టోరల్ అధికారులు తమ పరిధిలో పూర్తి నివేదికను రెండు రోజుల్లో సమర్పించాలని సూచించారు. సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కమిషనర్(ఎన్నికలు)శంకరయ్య, కంటోన్మెంట్ సీఈఓ మధుకర్‌నాయక్ ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్
హైదారబాద్: గణేష్ నిమజ్జన సామూహిక ఊరేగింపుల పర్యవేక్షణకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ కేటాయించడంతో పాటు వాటికి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇలా దాదాపు 12 వేల విగ్రహాలను ట్యాగ్ చేశారు. పోలీసులు గణేష్ విగ్రహాల వివరాలతో పోలీసులు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించి అందిస్తున్నారు. ఇలా ఈ విగ్రహాలను జియో ట్యాగింగ్ చేయడంతో పాటు ఐసీసీసీలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించారు. ఈ క్యూఆర్ కోడ్స్, జియో ట్యాగింగ్ డేటాను పోలీసు అధికారిక యాప్ టీఎస్ కాప్‌లోకి లింకు ఇచ్చారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల వరకు ఎవరైనా సరే తమ ప్రాంతంలో ఎన్ని మండపాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు ఏర్పాటు అవుతాయి? నిమజ్జనం ఎప్పుడు? ఏ మార్గంలో వెళ్ళి, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర వివరాలను తమ ట్యాబ్స్, స్పార్ట్‌ఫోన్స్‌లో చూసుకునే అవకాశం ఏర్పడింది. ఊరేగింపు మార్గాలను పరిశీలించిన సీపీ సామూహిక నిమజ్జనం గురువారం జరగనుండటంతో నగర కొత్వాల్ సీవీ ఆనంద్ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. మంగళవారం ఆయన అదనపు సీపీలు విక్రమ్ సింగ్ మాన్, జి.సు«దీర్‌బాబు, సంయుక్త సీపీ ఎం.శ్రీనివాసులు తదితరులతో కలిసి చారి్మనార్, ఎంజే మార్కెట్ సహా వివిధ ప్రాంతాల్లోని ఊరేగింపు మార్గాన్ని పరిశీలించారు. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు మొత్తం 19 కిమీ మేర ప్రధాన ఊరేగింపు జరగనుంది. ఈ మార్గంలో అనేక ఇతర ఊరేగింపులు వచ్చి కలుస్తాయి. బందోబస్తు, భద్రతా విధుల్లో మొత్తం 25,694 మంది సిబ్బంది, అధికారులు పాల్గొంటారు. వీరికి అదనంగా 125 ప్లటూన్ల సాయుధ బలగాలు, మూడు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వినియోగిస్తున్నారు. ఈ బలగాలు హుస్సేన్‌సాగర్ చుట్టూతో పాటు 18 కీలక జంక్షన్లలో మోహరించి ఉంటాయి. ప్రతి ఊరేగింపు మార్గాన్ని ఆద్యంతం కవర్ చేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అవసరమైన సంఖ్యలో క్యూఆరీ్ట, యాంటీ చైన్ స్నాచింగ్, షీ–టీమ్స్ బృందాలతో పాటు డాగ్ స్వా్కడ్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. ఐసీసీసీలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని విభాగాలకు చెందిన అధికారులు ఈ ఊరేగింపును పర్యవేక్షిస్తారు. నగర ప్రజలు సైతం తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. రాచకొండ పరిధిలో.. వినాయక నిమజ్జనానికి రాచకొండ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కమిషనరేట్ పరిధిలోని 56 చెరువుల వద్ద 3,600 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై మంగళవారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వివరాలను వెల్లడించారు. అన్ని చెరువులను సందర్శించి ఇప్పటికే క్రేన్లను ఏర్పాటు చేశామన్నారు. 6 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉంటారని తెలిపారు. మరో 1000 మంది అదనపు సిబ్బందిని కూడా జిల్లాల నుంచి రప్పించామన్నారు. రూట్ టాప్, షీ టీమ్స్, మఫ్టీ పోలీస్‌లతో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. అదనంగా ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు ఈ నెల 28న జరగనున్న వినాయక నిమజ్జన వేడుకల కోసం ఆరీ్టసీ, ఎంఎంటీఎస్, మెట్రో సంస్థలు విస్తృత ఏర్పాట్లు చేపట్టాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 535 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు వివిధ మార్గాల్లో 8 ఎంఎంటీఎస్ సర్వీసులను అదనంగా నడపనున్నారు. భక్తుల రద్దీకనుగుణంగా మెట్రో రైళ్లను నడిపేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ చర్యలు చేపట్టింది. బస్సుల వివరాల కోసం ప్రయాణికులు 99592 26154, 99592 26160లను సంప్రదించవచ్చు. సమన్వయంతో.. సమష్టిగా – నిమజ్జనానికి ఏర్పాట్లు సామూహిక గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, భక్తులకు ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయనున్నాయి. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సమాచారం, పౌరసంబంధాలు, పోలీసు, రవాణా, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డు, మెడికల్అండ్ హెల్త్, ఫైర్‌సరీ్వసెస్, టీఎస్ ఆరీ్టసీ,టీఎస్ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, టూరిజం విభాగాలతో పాటు 108 ఈఎంఆర్ఐ విభాగాల ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేసేలా ప్రణాళిక రూపొందించారు. అన్ని విభాగాల అధికారుల ఫోన్‌నెంబర్లు అందరి వద్ద అందుబాటులో ఉంచారు. నిమజ్జనాల సందర్భంగా వెలువడే వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు దాదాపు 3 వేల మంది పారిశుద్ధ్య కారి్మకులు విధులు నిర్వర్తిస్తారు. విభాగాల వారీగా అన్ని ప్రభుత్వ శాఖలు పని చేయనున్నాయి. మహా నిమజ్జనానికి ట్రయల్ రన్ ఖైరతాబాద్: శ్రీ దశమహా విద్యాగణపతిగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన మహాగణపతి నిమజ్జనానికి పోలీసులు మంగళవారం ఉదయం 5.30 గంటలకు ఖైరతాబాద్ మండపం నుంచి ఎనీ్టఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం– 4 వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. నేటి ఉదయం 11 గంటల వరకే మహాగణపతి దర్శనాలు ఉంటాయని, తెల్లవారుజామున 5 గంటల నుంచి షెడ్డు తొలగించే పనులు ప్రారంభించి 7 గంటల కల్లా పూర్తి చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యుడు సందీర్ రాజ్ తెలిపారు. మినట్ టు మినట్.. మంగళవారం రాత్రి నుంచే ట్రాయిలర్ వాహనానికి వెల్డింగ్ పనులు మొదలు పెట్టారు. నేటి రాత్రి నుంచే నిమజ్జన ఏర్పాట్లు ప్రారంభిస్తారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు మహాగణపతి ఇరువైపులా ఉన్న విగ్రహాలను మరో వాహనంపైకి తెస్తారు. తెల్లవారుజామున 4 గంటల కల్లా రవి క్రేన్ సాయంతో మహాగణపతిని ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్ వాహనంపైకి తెస్తారు. ఉదయం 7 గంటలకు మహాగణపతికి వెల్డింగ్ పనులు పూర్తి చేసి 9.30 గంటలకు మహా శోభాయాత్ర ప్రారంభిస్తారు. ఎనీ్టఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం–4 వద్ద మధ్యాహ్నం 12 గంటల వరకు నిమజ్జనం పూర్తయ్యేలా పోలీసులు మినట్ టు మినట్ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ విధంగానే ఏర్పాట్లు చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. -
హీరో నవదీప్‌కు నోటీసులు.. డ్రగ్స్ కేసులో ఉన్న టాలీవుడ్ ప్రముఖులు
మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో దొరికిన తీగను లాగుతుంటే టాలీవుడ్ డ్రగ్ డొంక కదులుతోంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఫిల్మ్ ఫైనాన్షియర్ కె.వెంకటరమణారెడ్డితో పాటు ‘డియర్ మేఘ’ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. (ఇదీ చదవండి: లావణ్య త్రిపాఠి రూట్లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?) తాజాగా టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఇదే కేసులో నోటీసులు జారీ చేయనున్నారు. ఇప్పటికే ఆయన కుటుంబంతో సహా పరారీలో ఉన్నాడని నగర పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై హీరో నవదీప్ కూడా స్పందించాడు. ఆ డ్రగ్స్ కేసుతో తనకు సంబంధమే లేదని, ఆ పేరు తనది కాదని ఆయన టచ్‌లోకి వచ్చాడు. ఇప్పటికే డ్రగ్స్ వాడిన నిందితులను నార్కోటిక్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కానీ షాడో సినిమా నిర్మాత ఉప్పలపాటి రవితో పాటు మోడల్ శ్వేతా ఇంకా పరారీలోనే ఉన్నారని సమాచారం. (ఇదీ చదవండి: మార్క్ ఆంటోని ట్విటర్ రివ్యూ.. విశాల్ సినిమాకు అలాంటి టాక్!) హైదరాబాద్‌లో మళ్లీ ఒక్కసారిగా డ్రగ్స్ కలకలం రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో పలు పబ్‌ల పైనా నార్కోటిక్ పోలీసులు నిఘా పెట్టారు. గచ్చిబౌలి లోని స్నార్ట్ పబ్, జూబ్లీహిల్స్‌లోని టెర్రా కేఫ్ అండ్ బిస్ట్రోలో డ్రగ్స్ విక్రయాలు జరిగాయని తెలుస్తోంది. ఈ కేసులో డీలర్ బాలాజీ నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగిస్తున్న వారిలో ప్రముఖులు, సినీ రంగానికి చెందిన వారూ ఉన్నట్లు టీఎస్ నాబ్ గుర్తించింది. హీరో నవదీప్, షాడో, రైడ్ చిత్రాల నిర్మాత రవి ఉప్పలపాటి, మోడల్ శ్వేత, మాజీ ఎంపీ దేవరకొండ విఠల్‌రావ్ కుమారుడు సురేశ్ రావ్, ఇంద్రతేజ్, కార్తీక్‌లతోపాటు కలహర్‌రెడ్డి ఉన్నారు. -
సినిమాల్లోని సీన్ల పైనా నజర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులు మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో గత నెల 31న జరిగిన ఓ డ్రగ్ పార్టీపై దాడి చేశారు. ఆ ఫ్లాట్‌లో కనిపించిన సీన్... ఇటీవల విడుదలైన ‘బేబీ’ సినిమాలోని సీన్లకు మధ్య సారూప్యత ఉందని హైదరాబాద్ పోలీసు కమిషనర్, టీఎస్ నాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ అన్నారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న ఆ సన్నివేశాలకు సంబంధించి చిత్ర యూనిట్‌కు నోటీసులు ఇచ్చామని, వారు తమ ఎదుట హాజరై వివరణ ఇచ్చారని గురువారం చెప్పారు. అందులో ఉన్న సీన్లపై తాము చెప్పిన తర్వాతే సినిమాలో వార్నింగ్ నోట్ పెట్టారని, అప్పటివరకు అలాంటిది కూడా లేదని అన్నారు. ఇలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలను సినిమాల్లో పెట్టవద్దని ఆనంద్ హితవు పలికారు. వీటి ద్వారా స్ఫూర్తి పొంది అనేక మంది యువకులు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారే ప్రమాదం ఉందన్నారు. గతంలోనూ ఇలాంటి సీన్లతో కూడిన సినిమాలు వచ్చాయని, అయితే వాటిని ఎవరూ పట్టించుకోలేదని చెప్పిన ఆనంద్.. ఇకపై ఈ తరహాలో ఉన్న వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘టాలీవుడ్ లింకులు ఉన్న డ్రగ్స్ కేసు’లో పరారీలో ఉన్న సూర్య.. స్నాట్ అనే పేరుతో పబ్ నిర్వహిస్తున్నాడని, కొకైన్ వంటి మాదకద్రవ్యాలను స్నాటింగ్ ప్రక్రియ ద్వారా వినియోగిస్తారని చెప్పారు. దీన్ని బట్టి సూర్య తన వద్ద మాదకద్రవ్యాలు లభిస్తాయని అర్థం వచ్చేలా తన పబ్‌కు పేరు పెట్టాడని భావించాల్సి వస్తోందని ఆనంద్ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ చిత్రాల్లోనూ డ్రగ్స్‌ను ప్రేరేపించే సీన్లు లేకుండా చూడాలని, ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను (ఎన్సీబీ) కోరతామన్నారు. ఎన్సీబీ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నారని, దీన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. తాము ఇటీవల కాలంలో 33 మంది నైజీరియన్లను అరెస్టు చేయగా, వారిలో 18 మంది బెంగళూరులో స్థిరపడిన వారిగా తేలిందన్నారు. టీఎస్ నాబ్ సేవల విస్తరణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని హైకోర్టును కోరతామని చెప్పారు. -
ఎక్కడికి పారిపోలేదు.. సిటీలోనే ఉన్నా: నవదీప్
మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్‌కు చెందిన హీరో నవదీప్‌తో పాటు నిర్మాత సుశాంత్ రెడ్డి కూడా ఉన్నట్లు నగర పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్వెల్లడించాడు. నవదీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని చెప్పాడు. దీనిపై హీరో నవదీప్ కూడా స్పందించాడు. అసలు ఆ డ్రగ్స్ కేసుతో తనకు సంబంధమే లేదన్నాడు. తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానన్నారు. తన కొత్త సినిమాకి సంబంధించిన సాంగ్ లాంచింగ్ ఈవెంట్లో బీజీగా ఉన్నాయనని ఓ మీడియా ప్రతినిధికి ఆయన చెప్పారు. అలాగే ట్విటర్(ఎక్స్) ద్వారా కూడా ఆయన ఈ కేసుపై స్పందించాడు. అది నేను కాదు జెంటిల్మెన్, నేను ఇక్కడే ఉన్నాను ముందు క్లారిటీ తెచ్చుకోండి థాంక్స్ అని ట్వీట్ చేశాడు. నవదీప్ స్నేహితుడు అరెస్ట్ అయితే ఈ కేసులో నవదీప్ స్నేహితుడు రాంచందర్‌ని నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారమే నవదీప్‌ను డ్రగ్స్ కన్స్యూమర్ గా తేల్చారు. ఈ విషయాన్ని సీసీ ఆనంద్ మీడియా ముఖంగా తెలియజేశారు. గతంలోనూ టాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయంలో నవదీప్ పేరు మారుమోగింది.అప్పట్లో ఎక్సైజ్, ఈడీ విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. That's not me gentlemen I'm right here .. pls clarify thanks — Navdeep (@pnavdeep26) September 14, 2023 -
బేబీ సినిమాపై హైదరాబాద్ సీపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో సంచలనాలకు నెలవైన బేబీ సినిమాపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఫైర్ అయ్యారు. సినిమా డ్రగ్స్ కల్చర్‌ను ప్రొత్సహించేలా ఉందంటూ మండిపడ్డారాయన. సినిమాలో డ్రగ్స్‌ను ప్రొత్సహించేలా సన్నివేశాలు ఉన్నాయి. ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో రైడ్లు నిర్వహించినప్పుడు.. బేబీ సినిమాలోని సీన్లలాంటివి కనిపించాయి. ఆ సినిమాను చూసే నిందితులు అలా పార్టీ చేసుకున్నారు. సినిమాల్లో అలాంటి సన్నివేశాలు పెట్టినప్పుడు.. కనీస హెచ్చరిక(కింద మూలన వేసే ప్రకటన) కూడా వెయ్యికుండా డైరెక్ట్ ప్లే చేశారు. ( బేబీ చిత్రంలోని అభ్యంతరకర సీన్లుగా చెబుతున్నవాటిని మీడియాకు ప్లే చేసి చూపించారాయన). మళ్లీ మేం హెచ్చరిస్తేనే హెచ్చరిక వేశారు. ఇందుకుగానూ.. బేబీ సినిమా టీంకు నోటీసులు జారీ చేస్తాం అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇక నుంచి ప్రతీ సినిమాపై నిఘా వేస్తామని.. అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదని నగర సీపీ స్పష్టం చేశారు. -
2 నెలల్లో రూ.26 కోట్ల డ్రగ్స్ సీజ్
సాక్షి, హైదరాబాద్: నిషా ముక్త్ తెలంగాణ లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్) అద్భుత ఫలితాలు సాధిస్తోందని న్యాబ్ డైరెక్టర్, నగర కొత్వాల్ సీవీ ఆనంద్ వెల్లడించారు. జూన్–జూలై నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా చేసిన దాడుల్లో టీఎస్ న్యాబ్ అధికారులు 196 కేసులు నమోదు చేసినట్లు గురువా రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కాగా 196 కేసుల్లో 175 గంజాయి దందాకు సంబంధించినవే. ఈ కేసుల్లో అధికారులు 353 మందిని అరెస్టు చేశారు. మరోపక్క 21 డ్రగ్స్ సంబంధిత కేసుల్లో 46 మందిని కటకటాల్లోకి పంపారు. వీరి వద్ద నుంచి స్వాదీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ రూ.26,01,34,650గా నిర్థారించారు. మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు జూన్‌లో మూడు రోజుల పాటు మిషన్ పరివర్తన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. డ్రగ్ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ఇతర రాష్ట్రాల, కేంద్ర ఏజెన్సీల సహకారం తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన కీలక సమావేశం గత నెల 5న నిర్వహించారు. డ్రగ్స్ దందాకు చెక్ చెప్పడానికి డార్క్‌వెబ్ సహా ఆన్లైన్లో జరిగే అక్రమ లావాదేవీలు నిరోధించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని నిర్ణయించారు. -
హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో రోజు రోజుకూ డ్రగ్స్ దందా పెరుగుతోంది. నగరంలో రెండు వేరు వేరుప్రాంతాల్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు నార్కోటిక్ పోలీసులు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్రకు డ్రగ్స్ సప్లై చేస్తున్న అరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు భారీగా నగదు, మొబైల్ ఫోన్లు, వాహనాలు సీజ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మామూనూరు బెటాలియన్ కానిస్టేబుల్ ప్రశాంత్ నాయక్ ఉన్నారు. పోలీస్ సైరన్ వేసుకొని చెక్‌పోస్ట్‌ను దాటేస్తున్న ఈ ముఠా.. పుష్పసినిమా తరహాలో వాహనాల్లో ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు తేలింది. మరోవైపు ఫిలింనగర్లోనూ భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఫిలింనగర్లో డ్రగ్స్ పిల్స్ విక్రయిస్తున్న బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ పాస్టర్ డేవిసన్‌ను నార్కోటిక్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద రూ 11 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.డేవిసన్.. ఆల్ ఇండియా నైజీరియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మన్‌గా ఉన్నారు. బెంగళూరు కేంద్రంగా దక్షిణ భారత్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ వీసా, పాస్పోర్టుతో ఇండియాలో ఉంటున్నట్లు తేలింది. -
రూ.712 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మేడ్ ఇన్ చైనా!
సాక్షి, హైదరాబాద్: చైనాలో కూర్చున్న సూత్రధారులు కథ నడుపుతున్నారు... దుబాయ్‌లో ఉంటున్న పాత్రధారులు వీరి ఆదేశాలు పాటిస్తున్నారు. గుజరాత్లో నివసించే సహాయకులు ముందుండి పని చేస్తున్నారు. ఈ పంథాలో సాగిన రూ.712 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌లో బ్యాంకు ఖాతాలు, షెల్ కంపెనీలు అందించడం ద్వారా హైదరాబాదీయులు కీలకపాత్ర పోషించారు. ఈ వ్యవహారం గుట్టురట్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నగరంతోపాటు ముంబై, అహ్మదాబాద్‌లకు చెందిన 9 మందిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, డీసీపీ స్నేహా మెహ్రా, ఏసీపీ కేవీఎం ప్రసాద్‌లతో కలిసి ఆయన శనివారం మీడియాకు వివరాలను వెల్లడించారు. టాస్క్‌లకు రూపమిచ్చేది చైనాలో.. ఈ ఫ్రాడ్‌లో కథ టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా పార్ట్‌టైమ్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ వచ్చే ప్రకటనలతో మొదలవుతుంది. దీనికి ఆకర్షితులై స్పందించిన వారికి లింకులు పంపడం ద్వారా ఆ రెండు యాప్స్‌లోని గ్రూపుల్లో చేరుస్తారు. ముందు తమ వద్ద ఇన్వెస్ట్ చేసి, తాము పంపే టాస్క్‌లు పూర్తి చేసి లాభాలు పొందాలని. ఆ తర్వాత ఉద్యోగం ఇస్తామని నమ్మిస్తారు. వాళ్లు పంపే లింకులకు లైక్స్ కొట్టడం, నిర్ణీత విధానంలో షేర్ చేయడం వంటి తేలికపాటి టాస్క్‌లే ఉంటాయి. సూత్రధారులుగా ఉన్న చైనీయులు లీ లూ గువాంఘెజు, నాన్ ఏ, కివిన్ జున్ ఆ దేశంలోనే ఉండి ఆకర్షణీయమైన టాస్క్‌లు రూపొందిస్తున్నారు. చిన్న లాభాలు ఇస్తూ ఉచ్చులోకి... ఇందులో పెట్టుబడి రూ.5 వేల నుంచి మొదలవుతుంది. దీనికోసం ప్రత్యేక యాప్‌ను బాధితులు డౌన్లోడ్ చేసుకుంటారు. రూ.5 వేలకు రూ.వెయ్యి, రూ.10 వేలకు రూ.2 వేలు,రూ.15 వేలకు రూ.3వేల చొప్పున లాభం ఇస్తారు. అలా క్రమంగా పెద్ద మొత్తాల్లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహిస్తారు. ఆ డబ్బు డ్రా చేసుకోవడానికి ఆస్కారం లేకుండా మరికొంత పెడితేనే కుదురుతుందని చెబుతారు. ఇలా ఒక్కో బాధితుడితో రూ.లక్షల్లో పెట్టించిన తర్వాత ఆ యాప్ పని చేయడం మానేస్తుంది. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల నుంచి వీరిని తొలగించేసి బ్లాక్ చేసేస్తారు. ఇలా ఇప్పటివరకు దాదాపు 15 వేల మంది రూ.712 కోట్లు ఇన్వెస్ట్ చేసి నిండా మునిగిపోయారు. రెండు యాప్‌ల ద్వారా దుబాయ్ నుంచి.. చైనీయుల ఏజెంట్లు అనిస్, ఆరిఫ్, శైలేష్, పీయూష్, ఖాన్, శెల్లీ దుబాయ్‌లో ఉంటున్నారు. అహ్మదాబాద్‌లో ఉన్న ప్రకాష్ ప్రజాపతి, కుమార్ ప్రజాపతి వీరితోపాటు చైనీయులతో టచ్‌లో ఉంటున్నారు. వాళ్లకు కావాల్సిన షెల్ కంపెనీలు, బ్యాంకు ఖాతాలు సమకూర్చడం, నగదును క్రిప్టోకరెన్సీగా మార్చడం వీరి విధి. ఇలా చేసినందుకు ఈ ద్వయానికి 3 శాతం కమీషన్ వస్తోంది. లక్నోకు చెందిన వికాస్, మనీష్, రాకేష్ తదితరులు దేశవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని షెల్ కంపెనీలు, వాటి పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. ఖాతాల వివరాలను ప్రజాపతి ద్వయం దుబాయ్‌లోని వారికి పంపుతుంది. వీటికి లింకైన సిమ్‌కార్డులతో కూడిన ఫోన్లను తమ వద్దే ఉంచుకుంటున్నారు. వీరితోపాటు దుబాయ్‌లో ఉన్న వాళ్లు ఆ ఫోన్లలో కూల్‌టెక్, ఎయిర్డ్రాయిడ్ అనే యాప్స్ వేసుకుంటున్నారు. వీటి ద్వారా ఇక్కడి ఫోన్లకు వచ్చిన ఓటీపీలను దుబాయ్‌లోని వాళ్లు చూడగలుగుతున్నారు. క్రిప్టో కరెన్సీగా మార్చి చైనాకు... బాధితుల నుంచి కాజేసిన మొత్తాన్ని దుబాయ్‌లోని పాత్రధారులు అమెరికన్ డాలర్లతో సమానమైన క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నారు. వీరికి ఒక్కో డాలర్‌కు రూ.10 కమీషన్‌గా వస్తోంది. వీళ్లు చైనాలోని సూత్రధారులకు వాలెట్స్ ద్వారా డబ్బు పంపేస్తున్నారు. ప్రజాపతులు వాడిన మూడు వాలెట్స్‌లో హిబ్బుల్ వాలెట్ కూడా ఉంది. దీని ద్వారా ఉగ్రవాదులకు నిధుల లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రజాపతి ద్వయానికి రావాల్సిన కమీషన్‌ను దుబాయ్‌లోని కేటుగాళ్లు ముంబైకి చెందిన ఏజెంట్లు గగన్, గుడ్డు, నయీమ్ ద్వారా హవాలా రూపంలో పంపిస్తున్నారు. ఈ ఫ్రాడ్‌లో బ్యాంకు ఖాతాలు, షెల్ కంపెనీలు అందించిన వారిలో హైదరాబాద్‌కు చెందిన మునావర్ మహ్మద్, ఆరుల్ దేవ్, సమీర్ ఖాన్, ఎస్.సుమేథ్ కూడా ఉన్నారు. ఈ భారీ మోసాన్ని ఛేదించిన పోలీసులు ఈ నలుగురితోపాటు ప్రజాపతి ద్వయం, గన్, గుడ్డు, నయీమ్‌లను అరెస్టు చేశారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.10,53,89,943లను ఫ్రీజ్ చేశారు. -
T9 గోల్ఫ్ ఛాలెంజ్ సంయుక్త విజేతలుగా సిమెట్రిక్స్ , బౌల్డర్ హిల్స్ టైగర్స్
T9 గోల్ఫ్ ఛాలెంజ్ రెండో సీజన్లో సిమెట్రిక్స్ , బౌల్డర్ హిల్స్ టైగర్స్ సంయుక్త విజేతలుగా నిలిచాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ 4-4 స్కోర్‌తో టై అయ్యింది. డిఫెండింగ్ ఛాంపియన్ బౌల్డర్ హిల్స్ టైగర్స్ ఆరంభంలో ఆధిక్యంలో నిలిచినా...తర్వాత సిమెట్రిక్స్ టీమ్ అద్భుతంగా పుంజుకుంది. స్కోర్ సమం కావడంతో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇరు జట్ల కెప్టెన్లకు ట్రోఫీతో పాటు 5 లక్షల రూపాయల ప్రైజమనీ చెక్ ను అందజేశారు. అంతకు ముందు మూడో స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్ లో జాగృతి జాగ్వర్స్ 3-1 స్కోర్ తో ఎకోలాస్టిక్ ఈగల్స్ పై విజయం సాధించింది. కాగా గోల్ఫ్ ను మరింత ప్రమోట్ చేసే ఉద్దేశ్యంతో ఈ ఛాంపియన్ షిప్ నిర్వహిస్తున్నామని టీ గోల్ఫ్ ఫౌండర్ ఎన్ఆర్ ఎన్ రెడ్డి చెప్పారు. -
నైజీరియన్ల డ్రగ్స్ దందాకు చెక్
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు కేంద్రంగా వ్యవస్థీ కృతంగా డ్రగ్స్‌దందా చేస్తున్న ముగ్గురు నైజీరియన్ల ముఠాకు తెలంగాణ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (టీ–నాబ్) చెక్ చెప్పింది. గత నెలలో ఈ వింగ్ ఏర్పడిన తర్వాత పట్టుకున్న తొలి కేసు ఇదే. ముగ్గురు నిందితుల నుంచి రూ.కోటి విలువైన ఎండీఎంఏ, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు నగర కొత్వాల్, టీ–నాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ శుక్రవారం వెల్లడించారు. కొయంబత్తూరులోని బ్యాంకు ఖాతా లు నిర్వహిస్తూ, డెడ్ డ్రాప్, సడన్ డెలివరీ విధానా ల్లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న ఈ ముఠా ఏడాదిలో రూ.4 కోట్ల దందా చేసినట్లు అనుమా నిస్తున్నామని ఐసీసీసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ తెలిపారు. నైజీరియా నుంచి 2011లో మెడికల్ వీసాపై ముంబై వచ్చి, బెంగళూరులో స్థిరపడిన అగ్బోవో మాక్స్వెల్ నబూసి ఈ సిండికేట్‌కు సూత్రధారిగా ఉన్నాడు. 2012లో బిజినెస్ వీసాపై ముంబై వచ్చిన ఒకెకో చిగోజా బ్లెస్సింగ్ గతేడాది మాక్స్వెల్ వద్దకు చేరాడు. 2021లో స్టూడెంట్ వీసాపై బెంగళూరు వచ్చిన ఇకెమ్ ఆస్టిన్ ఒబాక కూడా వీరితో కలవడంతో డ్రగ్ సిండికేట్ ఏర్పాటైంది. డ్రగ్ దందా ప్రారంభించిన మాక్స్వెల్ ప్రస్తుతం ఘనాలో ఉంటున్న స్నేహితురాలు మజీ సహకారంతో కొయంబత్తూరు లోని కెనరా బ్యాంకులో మరో ఘనా జాతీయుడు ఎవ్వాన్ ఎరీన్ కావా పేరుతో ఖాతా తెరిచాడు. ఆన్ లైన్ ద్వారా డ్రగ్స్ మార్కెటింగ్ చేసే ‘మాక్స్వెల్ అండ్ కో’ కొనుగోలుకు ఆసక్తి చూపిన కస్టమర్లతో కేవ లం వీఓఐపీ కాల్స్, వర్చువల్ నంబర్లతోనే మాట్లా డతారు. రేటు ఖరారైన తర్వాత కొయంబత్తూరు లోని బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆపై సరుకును ఆయా ప్రాంతాల్లో ఉన్న స్థానిక పెడ్లర్స్ ద్వారా కస్టమర్లకు డెలివరీ చేయిస్తా రు. బెంగళూరుతో పాటు ముంబై, హైదరాబాద్‌లో వీరి కస్టమర్లు ఉన్నారు. డ్రగ్స్‌ను కస్టమర్లకు నేరుగా ఇవ్వరు. నగదు జమ అయినట్లు ఘనా నుంచి సమాచారం వచ్చాక .. ద్విచక్ర వాహనంపై వచ్చి అతడి చేతిలో డ్రగ్ ప్యాకెట్ పెట్టి సడన్‌గా డెలివరీ చేసి వెళ్లిపోతారు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా వెలుగులోకి. నైజీరియన్లకు పెడ్లర్స్‌గా పనిచేస్తున్న సంజయ్, భా ను తేజలను హెచ్–న్యూ అధికారులు గతంలో అరెస్టు చేశారు. వీరి విచారణలో మాక్స్వెల్, బ్లెస్సింగ్, ఇకెమ్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరికోసం టీ–నాబ్ ఎస్పీ సునీతరెడ్డి నేతృత్వంలో ఇన్స్పెక్టర్ పి.రాజేష్, ఎస్సై జీఎస్ డానియేల్ రంగంలోకి దిగారు. బెంగళూరులో నెల రోజులు మకాం వేసి కస్టమర్లుగా నటిస్తూ డెకాయ్ ఆపరేషన్ ద్వారా పట్టుకున్నారు. వీరి నుంచి రూ.కోటి విలువైన 100 గ్రాముల కొౖకైన్, 300 గ్రాముల ఎండీఎంఏ స్వాధీ నం చేసుకున్నారు. వీరి కస్టమర్లను గుర్తిస్తాం ఈ నిందితులు బెంగళూరు కేంద్రంగా అసోసియేషన్ ఆఫ్ నైజీరియన్స్ పేరుతో సంఘం ఏర్పాటు చేశారు. వివిధ నేరాలు చేస్తూ పట్టుబడిన నైజీరియన్లకు బెయిల్స్ వంటి న్యాయ సహాయం కోసం వీళ్లు నిధి కూడా ఏర్పాటు చేశారు. దీనిలోకి రెండు నెలల్లో రూ.8.75 లక్షలు జమయ్యాయి. ఇలా వ్యవస్థీకృతంగా వీరి వ్యవహారం సాగడం ఆందోళనకర అంశం. కొయంబత్తూరులోని బ్యాంకు ఖాతా విశ్లేషణ బాధ్యతల్ని ఓ కంపెనీకి చెందిన ఆడిటర్‌కు అప్పగించాం. అలా నగరంలో వీరికి ఉన్న కస్టమర్లను గుర్తిస్తాం. – సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ -
డైరెక్ట్ సెల్లింగ్ పేరిట రూ.1000 కోట్ల దందా!
సాక్షి, హైదరాబాద్: డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో ప్రారంభమైన ఈ–స్టోర్ ఇండియా సంస్థ దేశవ్యాప్తంగా రూ. 1,000 కోట్ల దందా సాగించినట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ప్రధానంగా రెండు రకాలైన స్కీములతో అమాయకులను ఆకర్షించి భారీ స్కామ్‌కు పాల్పడినట్లు తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు నగర కొత్వాల్ సీవీ ఆనంద్ తెలిపారు. డీసీపీ డాక్టర్ పి.శబరీష్, ఏసీపీ ఎన్.అశోక్ కుమార్‌లతో కలసి మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. యాక్సస్ ఈ–కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఆయుర్‌కేర్ హెల్త్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ–స్టోర్ ఇండియాను నిర్వహిస్తోంది. దీనికి హిమాయత్‌నగర్, మలక్‌పేట ప్రాంతాలకు చెందిన మనీష్ కత్తి, సయ్యద్ అజ్మల్ సజ్జద్ మార్కెటింగ్ ఇన్చార్జులుగా వ్యవహరిస్తున్నారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద నమోదు చేసుకున్న యాక్సస్ ఈ కార్ప్ సంస్థ తమ స్కీమ్‌లకు ప్రభుత్వ అనుమతి ఉందని నమ్మబలుకుతూ నిరుద్యోగులకు ఎర వేస్తోంది. ఈ రెండు స్కీముల పేరుతో... ఇండివిడ్యువల్ డి్రస్టిబ్యూషన్ స్కీమ్ కింద అనేక మందిని ఈ–స్టోర్ ఇండియా సభ్యులుగా చేర్చుకుంది. ఎవరైనా రూ. 8,991 చెల్లించి సభ్యుత్వం తీసుకుంటే వారికి సంస్థ రూ. 9 వేల విలువైన ఆయుర్వేద ఉత్పత్తులు, కంపెనీ పేరుతో ఉన్న బోర్డు అందిస్తుంది. బోర్డును తమ ఇల్లు, దుకాణం ముందు తగిలించి ఆ ఫొటోను సంస్థకు పంపాలి. అప్పటి నుంచి కంపెనీ 36 నెలలపాటు నెలకు రూ. 1,100 చొప్పున ఇస్తామని చెప్పి పన్ను మినహాయింపుల తర్వాత రూ. 825 కొంతకాలం చెల్లిస్తుంది. ఈ సభ్యుడికి ఓ గుర్తింపు నంబర్ ఇచ్చి మరో రూ.9 వేల విలువైన ఈ–స్టోర్ ఉత్పత్తులను కొనేలా చేస్తుంది. అందుకు ప్రతిగా కొంతకాలం సభ్యుడికి చెల్లింపులు చేసి ఆపై బోర్డు తిప్పేస్తుంది. ఇక సూపర్ మార్కెట్ స్కీమ్‌లో పెట్టుబడి భారీగా ఉంటుంది. ఒక్కో వ్యక్తి రూ. 25 లక్షల చొప్పున చెల్లించి సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలి. దీనికి అద్దె, మౌలికవసతులు, ఉద్యోగులను తామే ఏర్పాటు చేస్తామని కంపెనీ నమ్మబలుకుతుంది. వందల మంది నుంచి రూ. కోట్లు.. ఈ సంస్థ స్కీముల్లో చేరి దేశవ్యాప్తంగా అనేక మంది రూ. వందల కోట్లు నష్టపోయారు. ఇప్పటివరకు రూ. 1000 కోట్ల దందా చేసిన ఈ–స్టోర్ ఇండియా 300 మందిని ముంచింది. వారిలో రాష్ట్రానికి చెందిన 44 మంది కూడా ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు 9 మందిని నిందితులుగా గుర్తించి మనీష్, అజ్మల్ సజ్జద్‌లను అరెస్టు చేశారు. -
దేశంలో సెకనుకో సైబర్ దాడి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి సెకనుకో సైబర్ దాడి జరుగుతోందని సైబర్ క్రైమ్ నిపుణుడు పెండ్యాల కృష్ణశాస్త్రి ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ప్రతి 11 సెకన్లకు ఓ సంస్థ లేదా వ్యక్తిపై ర్యాన్సమ్వేర్ దాడి జరుగుతోందన్నారు. బుధవారం హైదరాబాద్ పోలీసులు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తగా నిర్వహించిన హైదరాబాద్ యాన్యువల్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమిట్ (హాక్)–2023లో ఆయన కీలకోపన్యాసం చేశారు. నగర కొత్వాల్ సీవీ ఆనంద్ నేతృత్వంలో జరిగిన ఈ సమిట్‌కు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో కృష్ణశాస్త్రి ప్రసంగిస్తూ... ‘అనునిత్యం ఇంటర్నెట్లోకి 9 లక్షల కొత్త మాల్వేర్ వచ్చిపడుతోంది. వీటిలో ఏ రెండింటికీ సారూప్యత ఉండట్లేదు. కోవిడ్‌కు ముందు చిన్న, మధ్య తరహా సంస్థల్లో 53 శాతం ఈ ఎటాక్స్ బారినపడితే.. కోవిడ్ తర్వాత ఇది 68 శాతానికి చేరింది. ఈ నేరాల్లో ఐడెంటిటీ థెఫ్ట్‌తోపాటు ఉద్యోగులు చేసే డేటా చోరీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇటీవల రాజకీయ కారణాలతోనూ సైబర్ దాడులు జరుగుతున్నాయి. చిన్న, మధ్య తరహా సంస్థల్లో 65 నుంచి 70 శాతం కంప్యూటర్లను వాళ్లకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లు తమ అ«దీనంలోకి తీసుకుంటున్నారు. వీటిని క్రిప్టోకరెన్సీ మైనింగ్ కోసం వాడుతున్నారు. ఈ తరహా సంస్థలు నిర్వహించే వారికి సైబర్ సెక్యూరిటీ ఏర్పాటు చాలా ఖరీదైన అంశంగా మారింది. ఈ ధోరణి మా రడంతోపాటు డేటా లీక్ ప్రివెన్షన్ పాలసీలు అమల్లోకి రావాలి. సాధారణ హైజీన్తో (శుభ్రత) పాటు సైబర్ హైజీన్ అన్నది కీలకంగా మారాలి. బ్యాంకులను పర్యవేక్షించడానికి ఆర్బీఐ ఉన్నట్లు చిన్న, మధ్య తరహా సంస్థల పర్యవేక్షణకు ఏ వ్యవస్థా లేకపోవడమూ ఓ లోపమే. వీటికి పోలీసులే రెగ్యులేటింగ్ అథారిటీ కావాలి. ఏదేనీ సంస్థ లేదా వ్యక్తికి చెందిన కంప్యూటర్లోకి చొరబడి, డేటాను తమ అధీనంలోకి తీసుకుని ఎన్‌క్రిప్ట్ చేయడం, డీ–క్రిప్షన్‌కు డబ్బు డిమాండ్ చేయడం... ర్యాన్సమ్వేర్ దాడుల్లో పైకి కనిపించే సైబర్‌నేరాలు. అయితే సైబర్ నేరగాళ్లు తమ అ«దీనంలోకి తీసుకున్న డేటా ను తస్కరిస్తుంటారు. యూరోపియన్ హ్యాకర్లు ఆయా సంస్థలకు చెందిన కస్టమర్ డేటా తీసుకుంటారు. ఈ డేటా సేకరించడం అక్కడి చట్టాల ప్రకా రం తీవ్రమైన నేరం కావడంతో ఇలా చేస్తారు. భార త్‌కు చెందిన హ్యాకర్లను ఈ డేటా డార్క్ నెట్ సహా ఎక్కడైనా పట్టేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడి ర్యాన్సమ్వేర్ ఎటాకర్స్ ఆయా కంపెనీల సోర్స్ కోడ్‌ను తస్కరిస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. కొత్త కాల్స్‌కు స్పందించవద్దు ఈ సమిట్ ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హెచ్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి భరణి మధ్య ప్యానల్ డిస్కషన్ జరిగింది. తన యూనిట్లో పని చేసే కొండలు సైబర్ నేరంలో ఎలా మోసపోయాడు, తన స్క్రిప్‌్టలు భద్రంగా ఉంచుకోవడానికి తాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను తదితర అంశాలను జక్కన్న వివరించారు. వివిధ సైబర్ నేరాలు జరిగే విధానం, వాటి బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల్నీ వీరు చర్చించారు. ‘80 శాతం సైబర్ నేరాలు బాధితుల అవగాహనరాహిత్యం వల్ల, 20 శాతం దురాశ వల్ల జరుగుతుంటాయి. ఫోన్ కాల్, ఎస్సెమ్మెస్, వాట్సాప్ సందేశం... వీటిలో దేనికైనా స్పందించే ముందు ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం ఆలోచించాలి. కొత్త వారి ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దు’ అని సూచించారు. -
మినరల్ వాటర్.. మిల్లెట్ భోజనం!
సాక్షి, హైదరాబాద్ : సభలు, సమావేశాలు, నిరసన ర్యాలీలు, ప్రముఖుల పర్యటనలు... భాగ్యనగరంలో దాదాపు నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్లపై కనిపించే దృశ్యాలివి. దీనికితోడు నగరానికి ప్రముఖల రాకపోకల హడావుడి ఓవైపు.. ఏటా అట్టహాసంగా జరిగే గణేశ్ నిమజ్జనాలు, బోనాల వంటి పండగ సంబరాలు మరోవైపు... ఇలాంటి కార్యక్రమాలకు భారీ బందోబస్తు చేపట్టడం నగర పోలీసులకు కత్తిమీద సామే.. మరి అలాంటి సిబ్బంది ఆహార అవసరాలు తీర్చేందుకు ఇప్పటివరకు హెవీ, జంక్ ఫుడ్ అందిస్తున్న హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ తాజాగా తృణధాన్యాలతో చేసిన పౌష్టికాహారం అందిస్తోంది. దే శంలో మరే ఇతర పోలీసు విభాగం ఇప్పటివరకు ఇలాంటి చర్యలు తీసుకోలేదు. నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ దీన్ని అమలు చేస్తున్నారు. బందోబస్తు విధుల్లో ఉన్న అధికారులకు మిల్లెట్స్ ఫుడ్‌తోపాటు మినరల్ వాటర్ కూడా అందిస్తున్నారు. నగరం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థకు ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఈ మిల్లెట్ ఫుడ్ ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. ప్రస్తుతం ‘ప్లాన్డ్ బందోబస్తు’ల వరకు మాత్రమే అమలవుతున్న ఈ విధానాన్ని ‘సడన్ బందోబస్తు’లకూ వర్తింపజేయాలని ఆనంద్ యోచిస్తున్నారు. అనారోగ్య సమస్యలకు అనేక కారణాలు రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, కమిషనరేట్లతో పోలిస్తే హైదరాబాద్ సిటీ పోలీసుల పనితీరు పూర్తి భిన్నంగా ఉంటుంది. వాళ్లు ఏటా కనిష్టంగా 100 నుంచి 150 రోజులు బందోబస్తు విధుల్లో ఉండాల్సి వస్తుంది. వేళాపాళా లేని ఈ విధులతో సమయానికి ఆహారం, నిద్ర ఉండకపోవడంతోపాటు ఇంకా అనేక కారణాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా మంది బీపీ, షుగర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలతోపాటు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఫిట్ కాప్‌తో 12 వేల మంది స్క్రీనింగ్... ఈ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని, సిబ్బందిలో అకాల మరణాలు సైతం సంభవిస్తున్నాయని గుర్తించిన నగర కొత్వాల్ సీవీ ఆనంద్... ఈ పరిణామం వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతుండటంపై ఆందోళన చెందారు. ఈ పరిస్థితులను మార్చేందుకు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సహకారంతో ఫిట్‌కాప్ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. మహారాష్ట్రలోని పుణే పోలీసు విభాగం కోసం అందుబాటులో ఉన్న హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రొవైడర్ యాప్ స్ఫూర్తితోనే ఫిట్కాప్కు రూపమిచ్చారు. ఈ యాప్ ‘3 డీస్’గా పిలిచే డయాగ్నైస్, డెవలప్, డూ విధానంలో పనిచేస్తోంది. ఇప్పటికే 12 వేల మందికి స్క్రీనింగ్ చేసిన పోలీసు విభాగం అందులో అనేక మంది జీవనశైలికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించింది. వారంతా వెంటనే ఆహార అలవాట్లు మార్చుకోవాలని వైద్యులు సూచించడంతో ఈ మార్పును బందోబస్తు డ్యూటీల నుంచే అమలులోకి తీసుకురావాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ విధుల్లో ఉన్న వారికి ఏళ్లుగా బిర్యానీ ప్యాకెట్లు సరఫరా చేయడం ఆనవాయితీగా కొనసాగుతుండగా దీన్ని మారుస్తూ మిల్లెట్ భోజనం అందించడానికి శ్రీకారం చుట్టారు. మిల్లెట్ బిర్యానీ, మిల్లెట్ కిచిడీ, మిల్లెట్లతోపాటు బెల్లంతో రూపొందించిన స్వీట్లు, మిల్లెట్ కర్డ్ రైస్, మినరల్ వాటర్‌ను అందిస్తున్నారు. హఠాత్తుగా తలెత్తే వాటికి ఎలా..? సిటీ పోలీసులకు ప్రధానంగా రెండు రకాలైన బందోబస్తు డ్యూటీలు ఉంటాయి. ఏళ్లుగా నిర్వహిస్తూ వస్తున్న గణేష్ ఉత్సవాలు, బోనాలు, ఎన్నికలు తదితరాలు ప్లాన్, స్కీమ్ ఉంటాయి. దీంతో ఏ రోజు? ఎక్కడ? ఎంత మంది విధుల్లో ఉంటారనేది స్పష్టంగా తెలుస్తుంది. దీని ఆధారంగా ఆ స్వచ్ఛంద సంస్థకు ఆర్డర్ ఇచ్చి మిల్లెట్ ఫుడ్ తయారు చేయిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో హఠాత్తుగా బందోబస్తు విధులు వచ్చిపడతాయి. ఈ అన్ప్లాన్డ్ విధుల్లో ఉన్న వారికి ప్రస్తుతం మిల్లెట్ ఫుడ్ అందించలేకపోతున్నారు. అయితే వారికీ కచ్చితంగా ఇచ్చేందుకు మార్గాలను ఉన్నతాధికారులు అన్వేషిస్తున్నారు. పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు.. అధికారులు, సిబ్బంది ఎంత ఆరోగ్యంగా ఉంటే ప్రజలకు అంత మెరుగైన సేవలు అందించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఫిట్కాప్కు రూపమిచ్చాం. దీనికి కొనసాగింపుగానే మిల్లెట్ ఫుడ్‌ను పరిచయం చేశాం. సాధారణ భోజనాలకు అయ్యే ఖర్చుకు అదనంగా 30 నుంచి 40 శాతం దీనికి ఖర్చవుతుంది. దీనిపై సిబ్బంది నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. ఆహారం తీసుకోవడం ఆలస్యమైనా ఏ ఇబ్బందీ లేదని చెబుతున్నారు. అలాగే భోజనం చేసేప్పుడే కాకుండా ఎప్పుడైనా అధికారులు, సిబ్బందికి మినరల్ వాటర్ అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. – ‘సాక్షి’తో సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ -
హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను రూపుమాపడమే లక్ష్యం: సీపీ సీవీ ఆనంద్
-
పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా శారదా విద్యాలయ క్రీడా మైదానం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: కేజీ నుంచి పీజీ వరకూ వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్న శారదా విద్యాలయలో ఇటీవలే శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న వేడుకల్లో విశిష్ట వ్యక్తులు పాల్గొంటూ.. విద్యాలయంతో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం (జనవరి 31) జరిగిన వేడుకల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ముఖ్య అతిథిగా.. తెలంగాణ రాష్ట్ర యువజన వ్యవహారాలు, పర్యాటక, సాంస్కృతిక శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా గౌరవ అతిథిగా పాల్గొని, క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. గ్రౌండ్లో క్రికెట్ ప్రాక్టీస్ కోసం ఐదు నెట్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు బాస్కెట్‌బాల్, వాలీబాల్ క్రీడల కోసం ప్రత్యేక కోర్టులు, అథ్లెటిక్స్ కొరకు ట్రాక్‌లను అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు, ఏంజెల్ ఇన్వెస్టర్ మరియు నోహ్ సాఫ్ట్ వ్యవస్థాపకులు శ్రీ మైనేని పాల్గొన్నారు. వీరితో పాటు శారదా విద్యాలయ ట్రస్టీ, సింథోకెమ్ ల్యాబ్స్ ఛైర్మన్ శ్రీ జయంత్ ఠాగోర్, శారదా విద్యాలయ సెక్రటరీ రామ్ మాదిరెడ్డి, కరస్పాండెంట్ జ్యోత్స్న అంగారా పాల్గొన్నారు. కాగా, నిరుపేద విద్యార్థులకు మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే మహోన్నత సంకల్పంతో వై సత్యనారాయణ గారు 1922లో శారదా విద్యాలయ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఈ విద్యాలయను నాటి హైదరాబాద్ నిజాం ప్రధానమంత్రితో పాటు భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ఇక్కడ దాదాపు 1450 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. శారదా విద్యాలయకు 2018లో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డు లభించింది. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
29 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చాలాకాలం తర్వాత భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఒకేసారి 29 మంది సీనియర్ అధికారులను వివిధ స్థానాలకు బదిలీ చేయడంతో పాటు మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యురిటీ బ్యూరోలకు అధికారులను నియమించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్‌కు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అడిషనల్ డీజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. బదిలీలు ఇలా.. ► అదనపు డీజీ ఆర్గనైజేషన్స్‌గా ఉన్న అదనపు డీజీ రాజీవ్రతన్ను తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేశారు. ► అడిషనల్ డీజీ రైల్వేస్ రోడ్ సేఫ్టీగా ఉన్న సందీప్ శాండిల్యను తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ► గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని అదనపు డీజీ ఆర్గనైజేషన్స్, లీగల్‌గా బదిలీ చేశారు. ► అదనపు డీజీ పర్సానెల్గా ఉన్న బి.శివధర్‌రెడ్డి రైల్వేస్, రోడ్ సేఫ్టీ అదనపు డీజీగా బదిలీ అయ్యారు. ► టీఎస్ఎస్పీ అదనపు డీజీగా ఉన్న అభిలాష బిస్త్‌ను అదనపు డీజీ వెల్ఫేర్, స్పోర్ట్స్‌గా బదిలీ చేశారు. అదేవిధంగా హోంగార్డ్స్ అదనపు డీజీగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ► ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న షికా గోయల్‌ను అదనపు డీజీ ఉమెన్ సేఫ్టీ, షీటీమ్స్, భరోసా సెంటర్స్‌గా బదిలీ చేశారు. ►టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీరిశెట్టి వెంకట శ్రీనివాసరావుకు అదనపు డీజీ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ► ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్చార్జి స్వాతిలక్రాను టీఎస్ఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీగా బదిలీ చేశారు. ► పోస్టింగ్ కోసం వెయింటింగ్‌లో ఉన్న విజయ్‌కుమార్‌ను గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీగా బదిలీ చేశారు. ► నార్త్‌జోన్ అదనపు డీజీగా ఉన్న వై.నాగిరెడ్డిని తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేశారు. ►పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న విక్రమ్ మాన్సింగ్ను హైదరాబాద్ సిటీ శాంతిభద్రతల అదనపు కమిషనర్‌గా నియమించారు. ► రాచకొండ అదనపు కమిషనర్‌గా ఉన్న జి.సుదీర్‌బాబును హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అదనపు సీపీగా బదిలీ చేశారు. ► మైనార్టీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఉన్న షాహ్నవాజ్ ఖాసీంకు మల్టీజోన్ –2 ఐజీగా బాధ్యతలు అప్పగించారు. ► వెయిటింగ్లో ఉన్న తరుణ్ జోషిని ఐజీ ట్రైనింగ్స్గా నియమించారు. ► వెయిటింగ్లో ఉన్న వీబీ కమలాసన్‌రెడ్డికి ఐజీ పర్సానెల్గా బాధ్యతలు అప్పగించారు. ► రామగుండం పోలీస్ కమిషనర్‌గా ఉన్న ఎస్.చంద్రశేఖర్‌రెడ్డిని మల్టీజోన్–1 ఐజీగా బదిలీ చేశారు. ► హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీగా ఉన్న ఎం.రమేశ్‌ను డీఐజీ ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్‌గా బదిలీ చేశారు. ► హైదరాబాద్ జాయింట్ సీపీగా ఉన్న కార్తికేయను డీఐజీ ఇంటిలిజెన్స్‌గా నియమించారు. ► తెలంగాణ పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ కె.రమేశ్‌నాయుడును రాజన్న జోన్ డీఐజీగా బదిలీ చేశారు. ► సీఐడీ డీఐజీగా ఉన్న ఎం.శ్రీనివాసులును హైదరాబాద్ సిటీ సీఏఆర్ జాయింట్ సీపీగా బదిలీ చేశారు. ► వెయిటింగ్లో ఉన్న తఫ్సీర్ ఇక్బాల్‌ను డీఐజీ ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌కు బదిలీ చేశారు. ► హైదరాబాద్ జాయింట్ కమిషనర్‌గా ఉన్న డా.గజరావు భూపాల్‌ను రాచకొండ జాయింట్ సీపీగా నియమించారు. ► నల్లగొండ ఎస్పీగా ఉన్న రెమా రాజేశ్వరిని యాదాద్రి జోన్ డీఐజీగా బదిలీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నల్లగొండ ఎస్పీగా కూడా కొనసాగుతారు. ► వెయిటింగ్లో ఉన్న ఎల్ఎస్ చౌహాన్‌ను జోగుళాంబ జోన్ డీఐజీగా ఎస్పీ ర్యాంకులో నియమించారు. ► వెయిటింగ్లో ఉన్న కె.నారాయణ్ నాయక్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా నియమించారు. ► సీఐడీలో ఎస్పీగా ఉన్న జె.పరిమళ హన నూతన్‌ను హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ అడ్మిన్‌గా బదిలీ చేశారు. ► వెయిటింగ్లో ఉన్న ఆర్.భాస్కరన్‌ను కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ ఎస్పీగా నియమించారు. -
CV Anand: ఆపాత మధురం.. ‘ఆనంద’ జ్ఞాపకం!
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని చార్మినార్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్గా ఉన్న కేఎస్ రవికి అరుదైన అనుభవం దక్కింది. 1997లో విద్యార్థిగా, 2022లో పోలీసు అధికారిగా సీనియర్ పోలీసు అధికారి సీవీ ఆనంద్ నుంచి ‘బహుమతులు’ అందుకున్నారు. ఈ రెండు ఫొటోలను రవి సోమవారం ట్విట్టర్లో పొందుపరిచారు. నిజామాబాద్‌కు చెందిన రవి తండ్రి పరమేశ్వర్ ఆ జిల్లా పోలీసు విభాగంలో ఆడ్మ్ రిజర్వ్ హెడ్–కానిస్టేబుల్‌గా పని చేశారు. 1996లో పదో తరగతి ఉత్తీర్ణుడైన రవి మంచి మార్కులు సాధించారు. 1998 జనవరి 1న ఆ జిల్లా ఎస్పీగా ఉన్న సీవీ ఆనంద్ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఇలా అప్పట్లో ఆనంద్ నుంచి రవికి బహుమతి దక్కింది. పోలీసు విభాగంపై మక్కువ పెంచుకున్న రవి 2009లో నగర పోలీసు విభాగంలో సబ్–ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఇన్స్పెక్టర్ హోదాలో చార్మినార్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పుడు అదనపు డీజీ హోదాలో సిటీ కొత్వాల్‌గా ఉన్న ఆనంద్ న్యూ ఇయర్ డే నేపథ్యంలో ఆదివారం చార్మినార్ వద్దకు వెళ్లారు. అక్కడ కేక్ కట్ చేసిన కొత్వాల్ స్వయంగా రవికి తినిపించారు. ఇది కూడా తనకు బహుమతే అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసిన ఇన్స్పెక్టర్ రవి రెండు ఫొటోలను ట్వీట్ చేశారు. ఇది పోలీసు విభాగంలో వైరల్‌గా మారింది. (క్లిక్ చేయండి: ఆ రెండు లైన్లలో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు) -
శేషన్నపై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ భువనగిరి నయీంకు సుదీర్ఘకాలం కుడిభుజంగా మెలిగిన ముద్దునూరి శేషయ్య అలియాస్ శేషన్నపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ మేరకు సిటీ కొత్వాల్ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. శేషన్నపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఠాణాల్లో 11 కేసులు ఉన్నాయి. 2004లో అచ్చంపేటలో వి.రాములు, 2005లో మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ టీచర్ కనకాచారి, అదే ఏడాది అక్కడే చెంచు గోవిందు, 2011లో పహాడీషరీఫ్‌లో శ్రీధర్‌రెడ్డి, బొగ్గులకుంటలో పటోళ్ల గోవర్థన్‌రెడ్డి, 2013లో అచ్చంపేటలో మాజీ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, 2014లో నల్లగొండలో మాజీ నక్సలైట్ కొనాపురి రాములు హత్య కేసులతోపాటు పలు బెదిరింపుల కేసులు శేషన్నపై ఉన్నాయి. 2016లో నయీం ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇటీవల నగరంలో బెదిరింపుల దందా చేయడానికి వచ్చిన శేషన్నను గోల్కొండ పోలీసులు సెప్టెంబర్ 27న అరెస్టు చేశారు. అప్పట్లో ఇతడి వద్ద నాటుతుపాకీ, తూటాలు లభించాయి. హుమాయున్‌నగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్లాకు ఇతడు గతంలో తుపాకీ సరఫరా చేసినట్లు వెలుగులోకి వచ్చింది. శేషన్నపై ఆంధ్రప్రదేశ్‌లోనూ అనేక కేసులు ఉన్నాయి. ఇతడి నేరచరిత్రను పరిగణనలోకి తీసుకున్న కొత్వాల్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. -
Hyderabad: ఐదు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లోనే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికి నగరానికి రానున్న నేపథ్యంలో సోమవారం నుంచి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. రోజువారీగా ట్రాఫిక్ ఆంక్షలిలా.. సోమవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు హకీంపేట నుంచి సోమాజిగూడ మార్గంలోని తిరుమలగిరి, కార్ఖానా, సికింద్రాబాద్ క్లబ్, టివోలీ, ప్లాజా, బేగంపేట, రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. మంగళవారం ఉదంయం 9 నుంచి 12 గంటల వరకు హకీంపేట, తిరుమలగిరి, కార్ఖానా, సికింద్రాబాద్ క్లబ్, టివోలీ ప్లాజా, సీఈఓ, ప్యారడైజ్, రాణీగంజ్, కర్బలా, ట్యాంక్‌బండ్, లిబర్టీ, హిమాయత్‌నగర్ వై జంక్షన్, నారాయణగూడ ఎక్స్ రోడ్డు, వైఎంసీఏ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు హకీంపేట– తిరుమలగిరి– కార్ఖానా– సికింద్రాబాద్ క్లబ్– టివోలీ ప్లాజా, సీటీఓ– బేగంపేట–ఎన్ఎఫ్సీఎల్– బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 1/10 జంక్షన్, మాసాబ్‌ట్యాంక్, సరోజినీదేవి ఐ హాస్పిటల్, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే ఆరాంఘర్, కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి – బండ్లగూడ, చాంద్రాయణ గుట్ట, పిసల్‌బండ/చారి్మనార్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఈ మార్గంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారు బాలాపూర్ లేదా ఐఎస్ సదన్, నల్గొండ ఎక్స్ రోడ్డు మార్గాల్లో వెళ్లాలి. ►బుధవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు హకీంపేట– అల్వాల్, లోతుకుంట మార్గంలో మాత్రమే ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. తిరుమలగిరి నుంచి శామీర్‌పేట వెళ్లే ట్రాఫిక్‌ను బోయిన్పల్లి సుచిత్ర మీదుగా బాలాజీనగర్– అమ్ముగూడ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను లాల్‌బజార్, కేవీ జంక్షన్ వైపునకు మళ్లిస్తారు. ►గురువారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు బొల్లారం – షేక్‌పేట మార్గంలోని లోతుకుంట వై జంక్షన్, లాల్‌బజార్, తిరుమలగిరి, కార్ఖానా, సికింద్రాబాద్ క్లబ్, టివోలీ, ప్లాజా, బగేంపేట, పంజగుట్ట, ఎస్ఎన్టీ జంక్షన్, ఫిల్మ్‌నగర్ (బీవీబీ), షేక్‌పేట, ఓయాసిస్ స్కూల్ టోలీ చౌకీ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ►తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శంషాబాద్– బొల్లారం మార్గంలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వే– ఎన్ఎండీసీ– మాసాబ్‌ట్యాంక్– బంజారాహిల్స్ 1/12 జంక్షన్ – రోడ్ నెంబర్ 1/10, తాజ్‌కృష్ణ– జీవీకే– ఎన్ఎఫ్సీఎల్, పంజాగుట్ట ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట ఫ్లైఓవర్, రసూల్‌పురా, సీటీఓ ఫ్లైఓవర్, ప్లాజా, టివోలీ, సికింద్రాబాద్ క్లబ్, కార్ఖానా– తిరుమలగిరి– లోతుకుంట మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ►శుక్రవారం ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు సోమాజిగూడ– బొల్లారం మార్గంలోని సోమాజిగూడ, రాజ్‌భవన్ రోడ్డు, బేగంపేట– ప్లాజా– టివోలీ– సికింద్రాబాద్ క్లబ్– కార్ఖానా– తిరుమలగిరి– లోతుకుంట మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. భద్రత కట్టుదిట్టం హిమాయత్‌నగర్: నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల (కేఎంఐ)కు మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం ఆమెకు ఘనంగా స్వాగతం పలకనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉదయం 10.20 గంటలకు కాలేజీకి వచ్చి ఇక్కడ జరిగే సదస్సులో గంటకు పైగా ఉండనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ‘నైజాం నుంచి హైదరాబాద్ విముక్తి’ అనే అంశంపై జరిగే సదస్సులో రాష్ట్రపతి పాల్గొననున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ నుంచి నారాయణగూడలోని విద్యాసంస్థలకు సరిగ్గా మంగళవారం ఉదయం 10.20 గంటలకు ఆమె ఇక్కడికి వస్తారు. తిరిగి ఉదయం 11.30 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు వెళతారు. సదస్సులో ఇక్కడి విద్యాసంస్థల విద్యార్థులతో పాటు నగరంలోని మరో పది కాలేజీల నుంచి విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రతి కాలేజీ నుంచి 10 మంది విద్యార్థులు, ఒక ఇన్చార్జి లేదా ప్రిన్సిపాల్ ఉంటారు. ఇలా 700 మంది విద్యార్థులు 200 మంది ఇన్చార్జిలు వస్తున్నారు. తొలుత ఆజాదీ కా అమృత్ మహోత్సవ ప్రసంగం ముగిసిన తర్వాత 700 మంది విద్యార్థులతో రాష్ట్రపతి ముఖాముఖి కానున్నారు. తెలంగాణకు చెందిన మహనీయుల ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆమె తిలకించనున్నారు. కాగా.. కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలకు 2014లో దేశ ప్రధాని అభ్యరి్థగా.. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ వచ్చారు. విద్యార్థులతో మమేకమై.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. -
Telangana: డీజీపీ రేసులో పోటాపోటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త పోలీస్ బాస్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పోలీస్ విభాగాధిపతిగా ఎవరు వస్తారన్న చర్చ పోలీస్ వర్గాల్లో జోరందుకుంది. ప్రస్తుత డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఈనెల 31న పదవీ విరమణ పొందనున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని కొత్త డీజీపీగా నియమించనుందనే విషయానికి మరో వారంలో తెరపడనుంది. హెచ్ఓపీఎఫ్ (హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్) డీజీపీ రేసులో ఏసీబీ డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రేసులో మాత్రం వీరి ముగ్గురితోపాటు మరో సీనియర్ ఐపీఎస్ రాజీవ్‌రతన్ సైతం ఉన్నట్టు సమాచారం. డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డితోపాటు ప్రస్తుతం సీనియార్టీ ప్రకారం డీజీపీ ర్యాంకులో 1989 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఉమేశ్ షరాఫ్, 1990 బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్, రవిగుప్తా ఉన్నారు. సీఐడీ డీజీగా పనిచేసిన మరో సీనియర్ ఐపీఎస్ గోవింద్‌సింగ్ గత నెలలో పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌రతన్‌కు డీజీ ర్యాంకు దక్కనుంది. అయితే, అందరిలోకి సీనియర్ అయిన ఉమేశ్ షరాఫ్ పదవీ కాలం 2023 జూన్‌తో ముగియనుంది. కేవలం ఆరు నెలల కాలమే ఉన్నందున ఆయనకు అవకాశాలు తక్కువే అన్న అభిప్రాయాలు పోలీస్ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇదిలాఉండగా, గతంలో హైదరాబాద్ సీపీగా పనిచేసిన వారికి డీజీపీగా పదోన్నతి లభించింది. తెలంగాణ తొలి డీజీపీ అనురాగ్‌శర్మ, ప్రస్తుత డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి విషయంలోనూ ఇదే మాదిరి జరిగింది. వారిద్దరు సైతం హైదరాబాద్ సీపీగా పనిచేస్తూ డీజీపీగా పదోన్నతి పొందారు. ఆ లెక్కన డీజీపీ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో అంజనీకుమార్ గతంలో హైదరాబాద్ సీపీగా పనిచేయగా, సీవీ ఆనంద్ ప్రస్తుతం ఆ పదవిలో ఉన్నారు. ఎక్స్‌కేడర్ కోటాలో సీవీ ఆనంద్‌కు పదోన్నతి? సీఐడీ డీజీగా పనిచేసి ఇటీవల రిటైరైన గోవింద్ సింగ్ స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రతన్‌కు డీజీ ర్యాంకులో పదోన్నతి దక్కింది. అయితే ప్రభుత్వం ఎక్స్‌కేడర్ కోటా కింద ఒకే బ్యాచ్‌కు చెందిన అధికారులకు ఒకే హోదా ఉండేందుకు వీలుగా డీజీ పోస్టు సృష్టించి పదోన్నతి కల్పించవచ్చు. అలా సీవీ ఆనంద్ అడిషనల్ డీజీ ర్యాంకు నుంచి డీజీ ర్యాంకుకు పదోన్నతి పొందుతారు. లేదంటే ఈనెల 31న పదవీ విరమణ పొందనున్న మహేందర్‌రెడ్డి స్థానంలో సీవీ ఆనంద్‌కు డీజీ హోదా దక్కే అవకాశముంది. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న రవిగుప్తా పేరు సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని అదనపు డీజీపీ ర్యాంకులో ఉన్న వారిని సైతం డీజీపీ పోస్టులో నియమించే వెసులుబాటు ఉంది. దీని ప్రకారం 1992 బ్యాచ్‌కు చెందిన జితేందర్ (ప్రస్తుతం శాంతి భద్రతల అడిషనల్ డీజీ) సైతం డీజీపీ రేసులో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమేశ్ షరాఫ్ (1989), అంజనీకుమార్ (1990), రవిగుప్తా (1990), రాజీవ్ రతన్ (1991), సీవీ ఆనంద్ (1991) పేర్లు యూపీఎస్సీ సెలెక్షన్ కమిటీకి పంపినట్టు సమాచారం. ఇందులోంచి కేంద్రం ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేస్తే వారిలో ఒకరిని డీజీపీగా ఎంపిక చేయనున్నారు. లేదంటే ముందుగా ఒకరిని ఇంచార్జి డీజీపీగా నియమించి, తర్వాత పూర్తిస్థాయి డీజీపీని నియమించే అవకాశం ఉన్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. (క్లిక్ చేయండి: అదే జరిగితే బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లను కోల్పోక తప్పదా?!) -
న్యూ ఇయర్ ఈవెంట్లపై సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని న్యూ ఇయర్ ఈవెంట్ల నిర్వాహకులు కచ్చితంగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన ఆదివారం పేర్కొన్నారు. ఈ నెల 21 (బుధవారం) లోపు దరఖాస్తు చేసుకుని పొందాలని పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 31 రాత్రి హోటల్స్, పబ్స్, క్లబ్స్ తదితరాలు అర్ధరాత్రి ఒంటి గంట (తెల్లవారితే జనవరి 1) వరకే పని చేయాలని ఆయన తెలిపారు. సీసీ కెమెరాలు, అవసరమైన స్థాయిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, తగినంత పార్కింగ్ స్థలం కచి్చతమని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో జరిగే ఈవెంట్లలో డీజే తదితరాలకు అనుమతి లేదు. కార్యక్రమం జరిగే ప్రాంతం బయటకు శబ్దం వినిపించకూడదు. దీన్ని అతిక్రమించి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే తీవ్రంగా పరిగణిస్తారు. అసభ్య వస్త్రధారణ, అభ్యంతరకరమైన నృత్యాలకు తావుండకూడదు. మాదకద్రవ్యాల వినియోగానికి నిర్వాహకులూ బాధ్యులవుతారని ఆనంద్ స్పష్టం చేశారు. నిర్వాహకులు కార్యక్రమం జరిగే ప్రాంతంలోనే పార్కింగ్ సౌకర్యం కలి్పంచాలి. మద్యం మత్తులో ఉన్న వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చే లా డ్రైవర్లు/క్యాబ్‌లను నిర్వాహకులు ఏర్పాటు చేయాలి. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కితే రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్సులు రద్దు అవుతాయి. కార్యక్రమం జరిగే చోటకు ఎలాంటి ఆయుధాలు అనుమతించ వద్దని ఆనంద్ పేర్కొన్నారు. -
ఎమ్మెల్యేల కొనుగోళ్లపై విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో జరుగుతున్న సిట్ విచారణ పరిధిని మరింత పెంచాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. 2014లో కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు పార్టీలు మారడానికి గల కారణాలు ప్రజలకు తెలియాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2014, 2019 లలో కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు పార్టీ మారేందుకు ఎంత ఎర వేశారో తేల్చాలన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ సభ్యుడిగా గెలిచి 2014లో మంత్రి అయితే, సబితా ఇంద్రారెడ్డి 2019లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మంత్రి అయ్యార ని, వీళ్లకు ఏం ఎరవేశారని ప్రశ్నించారు. కార్మిక మంత్రి మల్లారెడ్డి కూడా 2016లో టీడీపీ ఎంపీగా గెలిచి, టీఆర్ఎస్లో చేరారని గుర్తు చేశారు. ప్రలోభాలలో భాగంగానే మర్రి రాజశేఖర్‌రెడ్డికి మల్కాజిగిరి, తలసాని సాయికిరణ్‌కు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ ఇచ్చారని విమర్శించారు. ఈ విషయమై తలసాని, మల్లారెడ్డికి నార్కోటిక్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
హైదరాబాద్‌లో వెలుగులోకి ‘దొంగ–పోలీసు–దోస్తీ’ వ్యవహారాలు
సాక్షి, హైదరాబాద్: తమ ముఠా కోల్పోయిన సొమ్ము, సొత్తు కోసం పరిధులు సృష్టించి మరీ కేసు నమోదు చేసిన అధికారి ఒకరైతే... కానిస్టేబుల్ పైరవీ చేయడంతో ఓ పిక్ పాకెటర్‌ను విడిచిపెట్టిన అధికారి మరొకరు... నల్లగొండలో జైలుకు వెళ్లిన కానిస్టేబుల్ ఈశ్వర్ వ్యవహారంతో నగర పోలీసు విభాగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో దొంగలతో మిలాఖత్ అయిన, వారికి సహకరిస్తున్న పోలీసుల వ్యవహారాలను వెలికితీస్తోంది. ఇప్పటికే కొందరు అధికారులు, సిబ్బంది చేసిన దందాలను గుర్తించారు. వీటిని తీవ్రంగా పరిగణిస్తున్న కొత్వాల్ సీవీ ఆనంద్ కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. తక్షణం మారిపోయిన సీన్.. చట్ట ప్రకారం నేరం ఎక్కడ జరిగితే కేసు ఆ పరిధిలోకి వచ్చే ఠాణాలోనే నమోదు చేయడమో, జీరో ఎఫ్ఐఆర్ కట్టి అక్కడికి బదిలీ చేయడమో జరగాలి. సామాన్యులు తీవ్రంగా నష్టపోయిన అంశాల్లోనూ పోలీసులు ఇదే చేస్తుంటారు. ఈ ‘బాధిత ముఠా’ కోసం సదరు అధికారి ఆ నిబంధనను తుంగలో తొక్కారు. ఈ గ్యాంగ్‌కు చెందిన ఓ వ్యక్తి వెస్ట్ జోన్ పరిధిలో ఉండగా గుట్ట వరకు ఎత్తుకుపోయారు అనే మెలిక పెట్టారు. దీంతో కేసు పరిధి పశ్చిమ మండలంలోని ఠాణాకు మారిపోయింది. ఈ కేసు ‘దర్యాప్తు’ చేసిన సదరు అధికారి అవతలి ముఠాను పట్టుకుని రూ.20 లక్షల వరకు ‘రికవరీ’ చేసి ‘బాధితులకు’ అందించాడు. తన వాటాగానూ పెద్ద మొత్తమే తీసుకున్నాడు. ఇది ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. గుట్ట వ్యవహారం వెస్ట్‌కు వచ్చింది.. 2019లో యాదగిరిగుట్టలో జరిగిన ఓ వివాదానికి సంబం«ధించిన కేసు నగరంలోని వెస్ట్‌జోన్ పరిధిలో ఉన్న ఓ ఠాణాలో నమోదైంది. ఈ కేసును ‘పరిష్కరించిన’ సదరు అధికారి రూ.10 లక్షలకు పైగా ‘రికవరీ’ చేసి తమ ముఠాకు అప్పగించాడు. 2018–19ల్లో రెండు పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్ యాదగిరిగుట్ట పరిధిలో విరుచుకుపడ్డాయి. డబ్బు పంపకాలకు సంబంధించి వీటి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఓ గ్యాంగ్‌పై దాడి చేసిన మరో గ్యాంగ్ మొత్తం సొమ్ము కాజేసింది. ఈ ‘బాధిత గ్యాంగ్’తో అప్పట్లో పశి్చమ మండల పరిధిలోని ఓ ఠాణాలో పని చేసిన ఇన్స్పెక్టర్కు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. వాళ్లు వచ్చి జరిగిన విషయం ఈయనకు చెప్పడంతో వీళ్లకు రావాల్సిన డబ్బు రికవరీ కోసం భారీ స్కెచ్ వేశాడు. పిక్ పాకెటర్ నుంచి రూ.3 లక్షలు వసూలు.. ఈ అధికారి వ్యవహారం ఇలా ఉండగా.. మరో అధికారి ఏకంగా తన కార్యాలయంలోనే సెటిల్మెంట్ చేశారు. పక్షం రోజుల క్రితం ఈ ఉదంతం చోటుచేసుకుంది. నందనవనం ప్రాంతానికి చెందిన ఓ పిక్ పాకెటర్‌ను నగర పోలీసు కమిషనరేట్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ నాగోల్ వద్ద పట్టుకున్నారు. ఇతగాడిని తమ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారించడానికి సిద్ధమయ్యారు. ఈలోపు విషయం తెలుసుకున్న ఓ ‘పోలీసు దొంగ’ రంగంలోకి దిగాడు. ఆ పిక్ పాకెటర్‌ను విడిచిపెట్టడానికి రూ.2 లక్షలు అధికారికి ఇచ్చేలా, వేరే ఇద్దరు నేరగాళ్లకు పట్టిచ్చేలా సెటిల్మెంట్ చేశాడు. ఇది తెలుసుకున్న కానిస్టేబుల్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సెటిల్మెంట్లో ఇవ్వాల్సిన మొత్తం రూ.3 లక్షలకు పెరిగి ముగ్గురికీ గిట్టుబాటైంది. కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్న కొత్వాల్.. నగరంలో ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ప్రస్తుతం లేవు. నగర పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇవి పూర్తిగా మారిపోయాయి. సంస్కరణలకు పెద్దపీట వేస్తున్న ఆయన వీలున్నంత వరకు సిబ్బందికి ఏ లోటు లేకుండా చేస్తున్నారు. అదే సమయంలో క్రమశిక్షణారాహిత్యం, పోలీసు విభాగానికి మచ్చ తెచ్చే పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించట్లేదు. ఈ నేపథ్యంలోనే గడచిన ఏడాది కాలంలో పదులు సంఖ్యలో అధికారులు, సిబ్బందిపై వేటు పడింది. ఈ పోలీసు దొంగల దోస్తీ వ్యవహారాన్నీ ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. లోతైన విచారణ చేయిస్తుండటంతో ఈశ్వర్‌తో పాటు ముగ్గురు ఇన్స్పెక్టర్లు, అయిదుగురు కానిస్టేబుళ్ల వ్యవహారాలు బయటపడినట్లు తెలిసింది. వీరిలో కొందరు కీలక విభాగంలోనూ పని చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వారిపై నివేదికల ఆధారంగా ఉద్వాసన చెప్పాలని కూడా కొత్వాల్ ఆనంద్ నిర్ణయించినట్లు సమాచారం. -
డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి ఎడ్విన్ అరెస్ట్
-
రెండు కంపెనీలు.. దేశం దాటిన రూ.903 కోట్లు
సాక్షి, హైదరాబాద్: భారత్ సహా వివిధ దేశాల వారి నుంచి లక్షలు, కోట్లు కాజేయడం.. ఆ సొమ్మును నకిలీ కంపెనీల్లోకి మళ్లించడం.. తర్వాత ప్రత్యేకంగా పెట్టిన ‘మనీ చేంజర్’సంస్థలకు చేర్చడం.. అక్కడి నుంచి హవాలా మార్గంలో దుబాయ్ మీదుగా చైనాకు చేర్చడం.. కాంబోడియా కేంద్రంగా జరుగుతున్న చైనీయులు నడుపుతున్న ‘ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్’ఇది. ఇందులో కేవలం రెండు కంపెనీల పేరిట ఏకంగా రూ.903 కోట్లను దేశం దాటించినట్టు రాష్ట్ర పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ అక్రమ వ్యవహారంలో మన దేశానికి చెందినవారి బ్యాంకు ఖాతాలను వినియోగించుకున్నట్టు తేల్చారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌లో రూ.1.6 లక్షలు కోల్పోయిన హైదరాబాద్ తార్నాకకు చెందిన బాధితుడి ఫిర్యాదుపై దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ దందా గుట్టు రట్టు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. చైనీయులు సూత్రధారులుగా.. చైనాకు చెందిన వాన్ జువాన్, పే (మహిళ) ఆ దేశంలో జిన్‌పింగ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఓ సంస్థను నిర్వహిస్తున్నారు. భారత్‌లో ఇన్వెస్ట్మెంట్ పేరిట జనాన్ని ఆకర్షించి, డబ్బు కాజేయాలని పథకం పన్నారు. మూడేళ్లుగా చైనా నుంచి వచ్చి వెళ్తూ ఢిల్లీలో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఏడాది నుంచి అసలు పని మొదలుపెట్టారు. నెట్వర్క్ బాధ్యతను చైనాకు చెందిన లీ, తైవాన్‌కు చెందిన చూ చున్ యోలకు అప్పగించారు. ఢిల్లీ కరోల్‌బాగ్‌లో ఎలక్ట్రానిక్స్ దుకాణం నిర్వహించే లీ, ముంబైలో అడ్డావేసిన చున్ కలిసి.. దుబాయ్‌లో ఉండే వరుణ్ అరోరా, భూపేష్ ఆరోరా, ఢిల్లీకి చెందిన సాహిల్, సన్నీ, నవనీత్ కౌశిక్‌లను తమతో చేర్చుకున్నారు. నవనీత్ కౌశిక్ ద్వారా రెండు ఆథరైజ్డ్ మనీ చేంజర్ (ఏఎంసీ)లు ‘రంజన్ మనీకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్, కేడీఎస్ ఫోరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్’లను ఏర్పాటు చేయించారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా వివిధ మెట్రో నగరాలకు చెందిన దళారుల ద్వారా తప్పుడు చిరునామాలు, వివరాలతో వర్చువల్ ఖాతాలు తెరిపించింది. సాధారణ ఖాతాలు అందించిన వారికి ఒక్కో ఖాతాకు రూ.1.2 లక్షల చొప్పున, వర్చువల్ ఖాతాలు ఇచ్చిన వారికి 0.2 శాతం కమీషన్ చొప్పున ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. దుబాయ్‌లో ఉండే నవీద్ అనే వ్యక్తి ద్వారా.. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సుల్తాన్, మీర్జా నదీమ్ బేగ్, మహ్మద్ పర్వేజ్ ఈ ముఠాకు పరిచయమయ్యారు. తమ పేరిట రెండేసి వర్చువల్ ఖాతాలు తెరిచి అందించారు. కొన్నాళ్లు చైనాలో ఉండి వచ్చిన ఢిల్లీ వాసులు సంజయ్ యాదవ్, వీరేంద్ర రాథోడ్ కూడా పలు ఖాతాలను సమకూర్చారు. ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటు చేసి.. చైనీయుడైన జాక్ సూచనల మేరకు పుణెకు చెందిన వీరేంద్రసింగ్ ఈ ముఠాలో చేరి.. జిందాల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థ ఏర్పాటు చేశాడు. తమ యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభం వస్తుందని సాధారణ ప్రజలకు గాలం వేసి.. వారి నుంచి తస్కరించిన సొమ్మును తొలుత జిందాల్ టెక్నాలజీస్ ఖాతాలోకి తరలించారు. అక్కడి నుంచి వర్చువల్ ఖాతాల్లోకి మార్చి.. సాధారణ బ్యాంకు ఖాతాల్లోకి చేర్చుతున్నారు. ఈ ఖాతాల నుంచి రంజన్ మనీకార్ప్, కేడీఎస్ ఫోరెన్స్ సంస్థల్లోకి తరలించి డాలర్లుగా మార్చుతున్నారు. తర్వాత ఆ మొత్తాన్ని సాహిల్ హవాలా రూపంలో దుబాయ్‌కు పంపిస్తున్నాడు. అక్కడి చైనాకు తరలిస్తున్నారు. రంజన్, కేడీఎస్ సంస్థలకు ఉన్నది ఇద్దరే క్లయింట్లు అయినా.. రంజన్ సంస్థ ఏడు నెలల్లో రూ.441 కోట్ల లావాదేవీలు, కేడీఆర్ సంస్థ 32 రోజుల్లోనే రూ.462 కోట్ల లావాదేవీలు జరపడం గమనార్హం. ఈ మొత్తం రూ.903 కోట్లు హవాలా రూపంలో దేశం దాటేశాయి. ఆర్థిక లావాదేవీలు భారత్ కేంద్రంగా జరిగినా.. ‘ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్’కాంబోడియా కేంద్రంగా జరుగుతున్నట్టు అంచనా వేశారు. లీ అనేకసార్లు కాంబోడియాకు వెళ్లి రావడం, ముంబై నుంచి సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలను కొరియర్ ద్వారా అక్కడికి పంపడం జరిగినట్టు గుర్తించారు. ఒకరొకరిగా పట్టుకుని.. తార్నాక బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు పుణెకు చెందిన వీరేంద్ర సింగ్‌ను పట్టుకున్నారు. తీగ లాగుతూ సాహిల్, సన్ని, సంజయ్, నవ్‌నీత్, పర్వేజ్, సుల్తాన్, మీర్జాల, చుగ్‌లను పట్టుకున్నారు. చైనాకు చెందిన లీ ఢిల్లీలో అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారికోసం గాలిస్తున్నారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1.91 కోట్లను ఫ్రీజ్ చేశారు. రూ.50వేల కోట్లపైనే స్కామ్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేసినది కేవలం ఒక గ్యాంగ్‌ను మాత్రమే. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉండవచ్చనే సమాచారం ఉంది. అవన్నీ కలిసి దేశవ్యాప్తంగా దాదాపు రూ.50వేల కోట్ల వరకు స్కామ్ చేసి దేశం దాటించి ఉండొచ్చని అంచనా. ఈ స్కామ్ వివరాలను ఈడీ, డీఆర్ఐ తదితర సంస్థలకు అందించి అప్రమత్తం చేస్తాం. సంస్థాగత లోపాలపై ఆర్బీఐకి లేఖ రాస్తాం. ఇలాంటి కుంభకోణాన్ని ఛేదించడం, విదేశీయులను అరెస్టు చేయడం దేశంలో ఇదే తొలిసారి. వర్చువల్ ఖాతాలు పెను ముప్పుగా మారుతున్నాయి. – సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ -
మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: రేప్ అండ్ కిడ్నాప్ అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ సీఐ నాగేశ్వరరావు వ్యవహారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలైంది. మొత్తం ఆరు వందల పేజీలతో కూడిన ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు రాచకొండ పోలీసులు. ఛార్జ్‌షీట్‌లో అన్ని అంశాలను పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఈ కేసులో రెండు నెలలపాటు జైల్లోనే ఉన్న నాగేశ్వరరావు బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇక పోలీస్ విభాగం ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారని పేర్కొంటూ.. నాగేశ్వరరావును హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ సస్పెండ్ చేశారు. సర్వీసు నుంచి తొలగించారు. ఛార్జ్‌షీట్‌లో సీసీ ఫుటేజ్, డీఎన్ఏ రిపోర్ట్, యాక్సిడెంట్ వివరాలు, వెపన్ దుర్వినియోగం, బాధితురాలి స్టేట్మెంట్.. ఇలా మొత్తం వివరాలను నమోదు చేశారు. నాగేశ్వరరావుకు శిక్ష పడేలా కోర్టుకు ఆధారాలు సమర్పించింది పోలీస్ శాఖ. -
ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావుపై వేటు
సాక్షి, హైదరాబాద్: సిటీ పోలీసు విభాగంలో పనిచేస్తూ క్రమశిక్షణను అతిక్రమించిన వారిపై నగర కొత్వాల్ సీవీ ఆనంద్ వేటువేశారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న 55 మందిపై శాఖపరమైన అంతర్గత విచారణ చేపట్టి వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. వీరంతా గతేడాది డిసెంబర్ 25 నుంచి గత శుక్రవారం మధ్య వరకు చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నవారే. వీరిలో ఇటీవల అత్యాచారం, కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదైన మారేడ్‌పల్లి మాజీ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు కూడా ఉన్నారు. వేటుపడిన వారిలో ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లతోపాటు మినిస్టీరియల్ సిబ్బంది కూడా ఉన్నారు. బాధితులు, సాక్షులపై ప్రభావం లేకుండా... సాధారణంగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు అధికారులపై శాఖపరమైన విచారణ జరిపిన తర్వాత ఈ తరహా చర్యలు తీసుకుంటారు. వనస్థలిపురంలో కేసు నమోదైన ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు వ్యవహారశైలి దృష్ట్యా విచారణ సమయంలో సాక్షులు, బాధితురాలిని ప్రభావితం చేసే అవకాశం ఉందని అధికారులు భావించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న సీపీ అతడిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో లాలాగూడ ఇన్స్పెక్టర్గా పనిచేసిన కె.శ్రీనివాసరెడ్డి ఓ మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎడ్ల శ్రీనివాస్ అదనపుకట్నం కోసం భార్యను వేధించడంతోపాటు ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం నెరిపారు. దీంతో వీరిద్దరినీ కూడా డిస్మిస్ చేస్తూ కొత్వాల్ ఉత్తర్వులు జారీచేశారు. మరికొందరు పోలీసులపైనా చర్యలు ఈ ముగ్గురితోపాటు పోలీసు విభాగం ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన మరికొందరిపైనా కఠినచర్యలు తీసుకున్నారు. ఓయూ ఠాణాలో ప్రొబెషనరీ ఎస్సైగా పనిచేసిన బి.నర్సింహ ఓ మహిళా ఎస్సై పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆర్ఎస్సై గొల్ల నిరంజన్పైనా తీవ్రమైన నేరారోపణలు వచ్చాయి. దీంతో వీరిద్దరినీ విధుల నుంచి తొలగించారు. ఇలా మొత్తమ్మీద ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఒక సబ్–ఇన్స్పెక్టర్, 11 మంది కానిస్టేబుళ్లు, ఒక ఆఫీస్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ సహా మరొకరు సర్వీస్ నుంచి డిస్మిస్ అయ్యారు. రిజర్వ్డ్ కేటగిరీలో ఇన్స్పెక్టర్, హెడ్–కానిస్టేబుల్, 19 మంది కానిస్టేబుళ్లుసహా మరొకరిపై వేటు పడింది. వీరిలో 13 మంది ప్రొబెషన్‌లో ఉండగానే తొలగించబడ్డారు. వీరిలో కొందరు అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడం, హత్య తదితర కేసుల్లో నిందితులుగా ఉండటం, అవినీతి చర్యలకు పాల్పడటం సహా ఇతర అనైతిక చర్యలకు పాల్పడ్డారు. ఖాకీ దుస్తులు వేసుకుని సమాజానికి సేవ చేయాల్సిన పోలీసులు అనైతిక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. (చదవండి: లిక్కర్ స్కామ్‌లో అభిషేక్‌రావు అరెస్టు) -
విధుల నుంచి మాజీ సీఐ నాగేశ్వరరావు తొలగింపు
సాక్షి, హైదరాబాద్: మారేడుపల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుపై పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. మహిళను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను విధుల నుంచి తొలగిస్తూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సోమవారం ఉత్వర్వులు జారీ చేశారు. వనస్థలిపురంలో వివాహితను తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన సీఐ కోరట్ల నాగేశ్వరరావును గతంలోనే పోలీస్ శాఖ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నాగేశ్వరరావుపై ఇప్పటికే వనస్థలిపురం పోలీసులు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. కొద్దీ రోజుల క్రితమే కండిషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో మొత్తం 39 మందిని పోలీస్ శాఖ సర్వీస్ నుంచి తొలగించింది. గత పది నెలల్లో 55 మందిపై చర్యలు తీసుకుంది. తీవ్రమైన నేరారోపణలపై ఆర్టికల్ 311(2) బి కింద విధుల నుంచి తొలగించింది. సర్వీస్ రిమూవల్ కోరుతూ హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ రిక్రూట్మెంట్ అథారిటీకి లేఖ రాశారు. ఈ మేరకు సీపీ లేఖను పరిగణలోకి తీసుకున్న పోలీస్ రిక్రూట్మెంట్ అథారిటీ సర్వీస్ నుంచి తొలగించింది. -
హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. స్టాప్ లైన్ దాటితే ఇక అంతే!
సాక్షి, హైదరాబాద్: సోమవారం నుంచి హైదరాబాద్‌లో ఆపరేషన్ రోప్ అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దీంతో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. మరో ముడు, నాలుగు రోజుల పాటు వాహనదారుల్లో అవగాహన కల్పిస్తామన్నారు. చలాన్లు వెంటనే విధించడం లేదని, మూడు రోజుల తర్వాత విధిస్తామని చెప్పారు. వాహనదారుల్లో పరివర్తన రావాలని, అన్ని సమస్యలు పరిష్కారిస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. కొత్త రూల్స్ ఇవే.. ► స్టాప్ లైన్ దాటితే రూ.100 జరిమానా ► ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేస్తే 1,000 జరిమానా ► ఫుట్‌పాత్‌లను ఆక్రమించినా, వాహనాలను అడ్డంగా పార్క్ చేసినా జరిమానా ప్రస్తుతానికైతే వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామని, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఆపరేషన్ రోప్ అమలుపై తనిఖీ చేసినట్లు ఆనంద్ తెలిపారు. వీటిపై నాలుగు రోజుల తర్వాత పూర్తి అవగాహన వస్తుందని చెప్పారు. చదవండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో వెళ్లొద్దు -
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక ప్రకటన.. ఏడాదికి యాక్షన్ ప్లాన్
సాక్షి, హైదరాబాద్: ‘నగరంలోని ప్రతీ ఒక్కరి జీవితంపై నేరుగా ప్రభావితం చూపే అంశం ట్రాఫిక్. ఇది సజావుగా సాగేలా చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల సహకారం, సమన్వయం ఉంటే పూర్తి సాయి ఫలితాలు ఉంటాయి’ అని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. రానున్న ఏడాది కాలానికి సిద్ధం చేసుకున్న ట్రాఫిక్ పోలీసుల యాక్షన్ ప్లాన్‌పై గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని కొత్త కమిషనరేట్‌లో ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ సహా ఇతర అధికారులతో కలిని ట్రాఫిక్ పోలీసుల కొత్త లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొత్వాల్ ఏం చెప్పారంటే.. క్యారేజ్ వే క్లియరెన్స్ కోసం ‘రోప్’... రోడ్లపై ట్రాఫిక్ సజావుగా సాగాలంటే ఫుట్‌పాత్‌కు– ప్రధాన రహదారికి మధ్య ఉండే క్యారేజ్ వే క్లియర్‌గా ఉండాలి. ప్రస్తుతం ప్రధాన రహదారులు సహా అనేక చోట్ల అక్రమ పార్కింగ్, ఆక్రమణలతో క్యారేజ్ వే కనిపించట్లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆపరేషన్ రోప్ (రివూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్‌కరోజ్‌మెంట్స్) చేపడుతున్నాం. ఇందులో భాగంగా అదనపు క్రేన్లు సమకూర్చుకుని టోవింగ్ చేయడంతో పాటు అక్రమ పార్కింగ్ చేసిన వాహనాలకు క్లాంప్స్ వేస్తాం. వాహన చోదకుడికి ఇబ్బంది లేకుండా వాటిపై స్థానిక అధికారుల ఫోన్ నంబర్లు ఉంచుతాం. తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల ఆక్రమణలనూ పరిగణనలోకి తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అపార్ట్మెంట్స్ సహా ప్రతి భవనానికీ పార్కింగ్ ఉండేలా చూస్తాం. ఆర్టీసీ సహకారంతో బస్ బేల పునరుద్ధరణ, ఆటో స్టాండ్లు పూర్తి స్థాయి వినియోగంలోకి తేస్తాం. చదవండి: ప్రజలను దోచుకుంటున్న వ్యాపారస్తులు.. ఇలా మోసం చేస్తున్నారు! పీక్ అవర్స్‌లో మార్పులు.. ఒకప్పుడు నగర వ్యాప్తంగా ఒకే సమయాలు రద్దీ వేళలుగా ఉండేవి. ప్రస్తుతం ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయం పీక్ అవర్‌గా మారుతోంది. ఆయా వేళల్లో అన్ని స్థాయిల అధికారులూ రోడ్లపైనే ఉంటారు. ట్రాఫిక్ పర్యవేక్షణే మా తొలి ప్రాధాన్యం. జరిమానా విధింపులో ఎన్ని జారీ చేశారనేది కాకుండా ఎలాంటి ఉల్లంఘనలపై చేశారన్నది చూస్తాం. ట్రాఫిక్ ఠాణా వారీగా వీటిని విశ్లేషిస్తాం. ఉల్లంఘనల వారీగా ప్రతి వారం ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్స్ ఉంటాయి. ఎన్ఫోర్స్మెంట్లో టెక్నాలజీ వినియోగిస్తాం. స్టాప్ లైన్ వద్ద డిసిప్లిన్ కనిపిస్తే ఇతర ఉల్లంఘనలు తగ్గుతాయని గుర్తించడంతో దీనిపై ప్రత్యేక దృష్టి పెడతాం. ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు వీలున్న ప్రతి జంక్షన్లో ఫ్రీ లెఫ్ట్ విధానం అమలు చేస్తాం. రద్దీ వేళల్లో అవసరమైన మార్గాలను రివర్సబుల్ లైన్లుగా మారుస్తాం. జంక్షన్లు, యూటర్నులను అభివృద్ధి చేయిస్తాం. తీవ్రమైన ఉల్లంఘలపై ప్రత్యేక దృష్టి పెడతాం. ఎడ్యుకేషన్ కోసం ప్రత్యేక చర్యలు.. వాహన చోదకుల్లో అవగాహన పెంచడానికి సోషల్ మీడియా, షార్ట్ఫిలింస్ తదితరాలను వినియోగిస్తాం. ట్రాఫిక్ పోలీసులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంతో అవసరమైన స్థాయిలో అదనపు సిబ్బందిని కేటాయిస్తాం. బాటిల్‌నెక్స్‌ను అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటాం. పబ్స్ అంశంలో జీహెచ్ఎంసీ, ఎక్సైజ్ అధికారులతో సమావేశమవుతాం. ప్రస్తుతం సిబ్బంది కొరత కారణంగా 150 జంక్షన్లలో మోహరించలేకపోతున్నాం. ఆయా వర్గాలతో సంప్రదింపులు, సమావేశాలు, అవగాహన కార్యక్రమాల తర్వాతే చర్యలు ఉంటాయి. వ్యక్తిగత వాహనాల్లో గణనీయమైన పెరుగుదల ‘కొవిడ్ తర్వాత గ్రేటర్ పరిధిలో వ్యక్తిగత వాహనాలు గణనీయంగా పెరిగాయి. 2020 జనవరిలో 64 లక్షలున్న వీటి సంఖ్య ఈ ఏడాది ఆగస్టు నాటికి 18 శాతం పెరిగి 77.65 లక్షలకు చేరింది. కార్లు 11 లక్షల నుంచి 21 శాతం పెరిగి 14 లక్షలకు, ద్విచక్ర వాహనాలు 46.46 లక్షల నుంచి 17 శాతం పెరిగి 56 లక్షలకు చేరాయి. ప్రతి రోజూ డయల్–100కు వస్తున్న కాల్స్‌లో 70 నుంచి 80 శాతం ట్రాఫిక్ సమస్యల పైనే. భవిష్యత్తులో తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే అంతా కలిసి సమష్టిగా, సమన్వయంతో ముందుకు వెళ్లాలి’ -
నిమజ్జనంలో నికృష్ట పనులు.. 240 మంది పోకిరీల పట్టివేత
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు జరిగిన నవరాత్రి ఉత్సవాలపై నగర షీ– టీమ్స్‌కు చెందిన ప్రత్యేక బృందాల డేగకన్ను ఫలితంగా 240 మంది పోకిరీలు చిక్కినట్లు అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం ప్రకటించారు. నిమజ్జనం రోజుతో పాటు విగ్రహాలను ఏర్పాటు చేసిన మండపాల దగ్గరా షీ–టీమ్స్ నిఘా వేశాయి. మఫ్టీల్లో, రహస్య కెమెరాలతో ఉన్న ఈ బృందాలకు మహిళలు, యువతులను వేధిస్తున్న 240 మంది పోకిరీలు చిక్కారు. వీరిని పక్కా సాక్ష్యాలతో సంబంధిత కోర్టుల్లో హాజరుపరిచినట్లు ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. పోకిరీలకు కనిష్టంగా రెండు నుంచి గరిష్టంగా పది రోజుల వరకు జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. షీ–టీమ్స్ కృషిని కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థినులపై హెచ్ఎం అసభ్యకర ప్రవర్తన మహబూబాబాద్ రూరల్: విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ హెచ్ఎంను పాఠశాలకు రావద్దని.. విద్యార్థుల తల్లిదండ్రులు, తండావాసులు వెళ్లగొట్టారు. మహబూబాబాద్ దూదియ తండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం షేక్ సర్వర్ పాషా కొన్నిరోజులుగా తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఐదుగురు విద్యార్థినులు శుక్రవారం వారి తల్లిదండ్రులకు చెప్పారు. సోమవారం వారందరూ పాఠశాలకు చేరుకుని హెచ్ఎంను నిలదీశారు. పిల్లలకు విద్యాభోధన చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. అయితే, తనను క్షమించమని, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా పనిచేస్తానని ఉపాధ్యాయుడు చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే.. కొన్ని రోజులుగా మద్యం తాగి పాఠశాలకు వచ్చి హెచ్ఎం తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. గతంలోనూ ఇలాగే ప్రవర్తించాడని, ఇంట్లో చెబుతామంటే వద్దన్నాడని తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పర్వతగిరి జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం రాందాస్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించిన డీఈఓ.. ఉపాధ్యాయుడు సర్వర్ పాషాను సస్పెండ్ చేశారు. (చదవండి: హాస్టల్లో కామాంధుడు.. విద్యార్థులకు వీడియోలు చూపించి..) -
సొనాలీ ఫోగట్ హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడించిన సీపీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: గోవాలోని అంజునా పోలీసుల నిర్లక్ష్యమే బీజేపీ నేత, టిక్ టాక్ స్టార్, టీవీ నటి సొనాలీ ఫోగట్ హత్యకు పరోక్ష కారణమైంది. ఆ కేసులో నిందితులుగా ఉన్న వారిలో ఇద్దరు ఉస్మానియా యూనివర్సిటీ ఠాణాలో గత నెలలో నమోదైన డ్రగ్స్ కేసులోనూ నిందితులుగా ఉన్నారు. దీనిపై అధికారిక సమాచారం ఇచ్చినా అంజునా పోలీసులు స్పందించలేదు. హైదరాబాద్ పోలీసులు ఆగస్టు 17న డ్రగ్స్ మాఫియాపై సమాచారం ఇవ్వగా.. 22 తెల్లవారుజామున ఫోగట్ హత్యకు గురి కావడం గమనార్హం. ఈ దారుణం జరిగిన పబ్ యజమాని సహా మరొకరు ఇక్కడి పోలీసులకు వాంటెడ్‌గా ఉన్నాడు. వీరిద్దరినీ గత నెల 28న గోవా పోలీసులు అరెస్టు చేశారు. పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకువస్తామని గురువారం కొత్వాల్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ప్రీతీష్ విచారణతో వెలుగులోకి.. గోవాలోని అంజునా బీచ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఏళ్లుగా డ్రగ్స్ దందా చేస్తున్న ఘరానా డ్రగ్ పెడ్లర్ ప్రీతీష్ నారాయణ్ బోర్కర్‌ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్– న్యూ) గత నెల 17న పట్టుకుంది. ఇతడి విచారణలో అంజునా ప్రాంతానికే చెందిన స్టీవెన్, ఎడ్విన్ నూనిస్ సహా ఆరుగురి నుంచి డ్రగ్స్ దేశవ్యాప్తంగా చలామణి అవుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రీతీష్‌ను అరెస్టు చేసిన ఉస్మానియా వర్సిటీ పోలీసులు ఆ కేసులో ఆరుగురినీ నిందితులుగా పేర్కొన్నారు. ఈ ఎఫ్ఐఆర్ కాపీ సహా ఇతర వివరాలను అంజునా పోలీసులకు పంపిన హైదరాబాద్ అధికారులు వారిని అరెస్టు చేయాల్సిందిగా కోరారు. నిందితులకే వత్తాసు.. దేశవ్యాప్తంగా జరుగుతున్న డ్రగ్స్ దందాకు గోవా కీలకమన్నది జగమెరిగిన సత్యం. అక్కడి పోలీసుల సహకారంతోనే ఈ వ్యాపారం సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో నగరంలో దొరికిన ఓ వ్యక్తిని ప్రశ్నించగా.. గోవా నుంచి డ్రగ్ సరఫరా అయినట్లు తేలింది. దీంతో హెచ్– న్యూ టీమ్ అక్కడకు వెళ్లి ఆ సరఫరాదారు ఉన్న హోటల్‌పై దాడి చేసింది. ఫలితంగా అతడు చిక్కడంతో పాటు దాదాపు 100 గ్రాముల ఎండీఎంఏ రికవరీ అయింది. దీనిపై హెచ్–న్యూ టీమ్ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితుడిని తీసుకురావడానికి సన్నాహాలు చేసింది. అక్కడకు వచ్చిన అంజునా పోలీసులు నిందితుడిని తీసుకువెళ్లడానికి వీల్లేదని, తామే అరెస్టు చూపిస్తామని పట్టుబట్టారు. ఆపై పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లాలని చెప్పి పంపారు. సీన్ కట్ చేస్తే ఆ నిందితుడు, దొరికిన సరుకు ఏమైందో ఇప్పటికీ హెచ్– న్యూకి సమాచారం ఇవ్వలేదు. చదవండి: బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతిపై సీబీఐ దర్యాప్తు? కిడ్నాప్ కేసులు పెడతామంటూ బెదిరింపు.. తమకు వాంటెడ్‌గా ఉన్న వారిని అరెస్టు చేయడానికి వెళ్తున్న సందర్భంలో హెచ్–న్యూ అధికారులు కొన్నిసార్లు గోవా పోలీసుల సహాయం కోరారు. అలా జరిగిన ప్రతిసారీ నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. దీంతో వారికి సమాచారం ఇవ్వకుండానే హెచ్–న్యూ ఆపరేషన్లు చేపట్టడం మొదలెట్టింది. ఓ సందర్భంలో అలా వచ్చి నిందితులను అరెస్టు చేసి తీసుకువెళితే కిడ్నాప్ కేసులు పెడతామంటూ హెచ్–న్యూ అధికారులనే గోవా పోలీసులు బెదిరించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే స్టీవెన్, ఎడ్విన్ నూనిస్ల సమాచారాన్ని హెచ్–న్యూ గోవా పోలీసులకు అందించి అరెస్టు చేయమని కోరింది. ఎడ్విన్ అంజునా ప్రాంతంలో గ్రాండ్ లియోనీ రెసార్ట్, స్టీవెన్ హిల్ టాప్ పబ్ నిర్వహిస్తున్నారని, వీటిలో పని చేసే వారితోనే డ్రగ్స్ అమ్మిస్తున్నారని తెలిపింది. అయినప్పటికీ గోవా పోలీసులు పట్టించుకోలేదు. సొనాలీ హత్యలో ఆ ఇద్దరి పాత్ర.. సొనాలీ ఫోగట్ హత్య కేసులో ఎడ్విన్, స్టీవెన్ నిందితులుగా మారారు. ఈ హత్య గ్రాండ్ లియానీ రిసార్ట్‌లోని పబ్‌లోనే జరిగింది. ఆమెకు అధిక మోతాదులో డ్రగ్స్ ఇచ్చి చంపేశారు. ఆ మాదక ద్రవ్యాలను సరఫరా చేసింది ఎడ్విన్, స్టీవెన్గా తేలడంతో వారినీ నిందితులుగా చేర్చారు. ఎడ్విన్‌ను అరెస్టు చేసిన అంజునా పోలీసులు స్టీవెన్ కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు సమాచారం ఇచ్చినప్పుడే స్పందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ‘ఫోగట్ హత్య కేసులో అరెస్టు అయిన ఎడ్విన్ ఓయూ పరిధిలో నమోదైన ప్రీతీష్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతడిని పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువస్తాం. డ్రగ్స్ కేసులో నిందితులను అరెస్టు చేయడానికి గోవా వెళ్లిన ప్రతిసారీ అక్కడి పోలీసుల నుంచి సహకారం లభించట్లేదు. అనేక సందర్భాల్లో నెగెటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. గోవా డ్రగ్ నెట్‌వర్క్‌పై హెచ్–న్యూకు ఉన్న సమాచారం గోవా పోలీసులకు ఎందుకు లేదంటూ అక్కడి పత్రికలూ రాస్తున్నాయి’ అని సీవీ ఆనంద్ అన్నారు. -
కొరియర్స్ విషయంలో అప్రమత్తంగా ఉండండి: సీపీ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: మతపరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు కేసుల్లో భాగంగా రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేసిన చర్లపల్లి జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా.. వివాదాస్పద వ్యాఖ్యలు, డ్రగ్స్‌పై కమిషనర్ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీ సీవీ ఆనంద్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మతపరమైన వ్యాఖ్యలను సహించేది లేదు. ఇప్పటికే ఇద్దరిపై పీడీయాక్ట్ పెట్టామన్నారు. ఈ క్రమంలోనే స్మాష్ అనే సోషల్ మీడియా యాక్షన్ స్వ్కాడ్‌ను ఏర్పాటు చేశాము. సోషల్ మీడియాలోని ప్రతీ పోస్టుపై నిఘా ఉంటుంది. డ్రగ్స్ కేసులో పెద్ద నెట్‌వర్క్‌ను అరెస్ట్ చేశాము. డార్క్‌నెట్ వెబ్సైట్ ద్వారా ముఠా పనిచేస్తోంది. ఈ ముఠా క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరుపుతున్నది. ఇంటికి వచ్చే కొరియర్స్‌ను పేరెంట్స్ పరిశీలించాలి. డ్రగ్స్ వినియోగంలో విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. 600 మందిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చాము. డ్రగ్స్ విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటాము అని వార్నింగ్ ఇచ్చారు. ఇది కూడా చదవండి: ఎన్నికల్లో బీజేపీ పోటీపై ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు -
డ్రగ్స్ కేసులో కీలక నెట్వర్క్ చేధించాం..!
-
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్
-
హైదరాబాద్ సీపీ సంచలన ప్రకటన.. రాజా సింగ్‌పై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు అయినట్టు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. చాలాసార్లు ఒక మతాన్ని, వర్గాన్ని కించపరిచేలా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ఆయన గురువారం మీడియాకు తెలిపారు. మంగళహాట్ పోలీస్ స్టేషన్లో గతంలో రాజాసింగ్‌పై రౌడీషీట్ ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ కేసులు ఆధారంగా చేసుకొని బీజేపీ ఎమ్మెల్యేపై పీడి యాక్ట్ నమోదు చేసినట్టు చెప్పారు. అరెస్టుకు ముందు ఆయనకు 32 పేజీల పీడీ యాక్ట్ డాక్యుమెంట్‌ను అందించినట్టు కమిషనర్ వెల్లడించారు. కాగా, ఈనెల 22న ఓ యూట్యూబ్ చానల్లో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా అభ్యంతరకరంగా రాజాసింగ్ మాట్లాడారని అన్నారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదవ్వడం ఇదే తొలిసారి. ఇక 2004 నుంచి రాజాసింగ్‌పై 101 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 మతపరమైన కేసులు ఉన్నాయి. వీటిలో కొన్ని సరైన సాక్ష్యాధారాలు లేక వీగిపోయాయి. మరికొన్నికోర్టు విచారణలో ఉన్నాయి. చదవండి: ఒక్క ఉప ఎన్నిక కోసం బీజేపీ ఇంత బరితెగించాలా: ఎంపీ అసదుద్దీన్ -
గణేష్ ఉత్సవాలు: సీపీ ఆనంద్ కీలక సూచనలు
సాక్షి, హైదరాబాద్: బందోబస్తు, భద్రత కోణంలో నగర పోలీసు విభాగానికి అత్యంత కీలకమైన గణేష్ ఉత్సవాలు సమీపిస్తుండటంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఏమరుపాటుకు తావు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై కొత్వాల్ సీవీ ఆనంద్ దృష్టి పెట్టారు. బంజారాహిల్స్‌లో ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని ఆడిటోరియంలో బుధవారం తొలి సన్నాహాక, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 31న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 9న నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మండపాలు/విగ్రహాలు నిమజ్జనానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం సిటీలో పని చేస్తున్న ఇన్స్పెక్టర్లు, ఏసీపీలు, డీసీపీల్లో అనేక మంది కొత్తవారు ఉన్నారు. వీరి గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం బందోబస్తు నిర్వహించడం తొలిసారి. ఈ నేపథ్యంలో ఆనంద్ ఈ సమావేశంలో వారిని ఉద్దేశించి పలు కీలక సూచనలు చేశారు. ‘కోవిడ్ తర్వాత ఈ ఏడాది అనేక పండుగలు, ఇతర ఘట్టాలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సెమీ ఫైనల్స్ లాంటి వాటిని సమర్థంగా నిర్వహించాం. ఫైనల్ లాంటి గణేష్ బందోబస్త్‌లోనూ కచ్చితంగా రాణిస్తామనే నమ్మకం ఉంది’ అని ఆనంద్ అన్నారు. మండపాల ఏర్పాటు చేయడానికి నిర్వాహకులు స్థానిక పోలీసుల నుంచి కచ్చితంగా అనుమతి తీసుకోవాలని కొత్వాల్ స్పష్టం చేశారు. ఇతర విభాగాలతో కలిసి సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని ఆనంద్ ఆదేశించారు. సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచి అభ్యంతరకర పోస్టులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు సీపీలు డీఎస్ చౌహాన్, ఏఆర్ శ్రీనివాస్, సంయుక్త సీపీలు పి.విశ్వప్రసాద్, ఎం.రమేష్, ఏవీ రంగనాథ్, గజరావ్ భూపాల్, ఠాణాల ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. చదవండి: గ్రేట్ లవర్స్.. ఫేస్బుక్ లవ్ మ్యారేజ్ చివరకు ఇలా.. నిమజ్జనానికి 3 రకాల కొలనులు సాక్షి, సిటీబ్యూరో: గణేష్ ఉత్సవాల నిర్వహణతో పాటు మరోవైపు విగ్రహాల నిమజ్జనాల ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఎక్కడి విగ్రహాలను అక్కడే దగ్గరి ప్రాంతాల్లో నిమజ్జనాలు చేసేందుకు వీలుగా 75 కొలనుల్ని అధికారులు సిద్ధం చేయనున్నారు. కేవలం గణేశ్ విగ్రహాల నిమజ్జనాల కోసమే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇప్పటికే నిర్మించిన 25 కొలనులున్నాయి. వీటిని బేబీ పాండ్స్‌గా వ్యవహరిస్తున్నారు. వీటికి తోడు అదనంగా మరో 24 ప్రీఫ్యాబ్రికేటెడ్ ఎఫ్ఆర్పీ (ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్) పాండ్స్‌కు ఇప్పటికే టెండర్లు పిలిచారు. వీటికి ఒక్కో దానికి రూ. 10 లక్షలు వెచ్చించనున్నారు. వీటినే కృత్రిమ తటాకాలుగా కూడా వ్యవహరిస్తున్నారు. 20మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 1.35 మీటర్ల లోతులో ఉండే వీటిలో నాలుగడుగుల ఎత్తు వరకు విగ్రహాలను నిమజ్జనం చేయొచ్చు. వీటితోపాటు ఆయా ప్రాంతాల్లోని అవసరాలకనుగుణంగా గణేశ్ విగ్రహాల నిమజ్జనాల కోసం మరో 26 ప్రాంతాల్లో చెరువులు తవ్వి, నిమజ్జనాల కోసం వినియోగించనున్నారు. వీటిని తాత్కాలిక నిమజ్జన కొలనులుగా వ్యవహరిస్తున్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనాల కోసం ఇలా మూడు రకాల కొలనుల్ని వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. నిర్వహణ లేక చెత్తా చెదారాలు పేరుకుపోయిన బేబీ పాండ్స్‌ను శుభ్రం చేయడంతోపాటు, తాత్కాలిక చెరువుల కోసం తవ్వకాల పనులు త్వరలో పూర్తి చేయనున్నట్లు సంబంధిత ఇంజినీర్లు తెలిపారు. ఈ కొలనుల్లో వేసిన విగ్రహాలను ఎప్పటికప్పుడు బయటకు తీసి, తాజా నీరు నింపుతారని పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఆరు లక్షల మట్టివిగ్రహాలు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది.ప్లాస్టర్‌ఆఫ్‌ప్యారిస్(పీఓపీ)తో తయారు చేసిన విగ్రహాలు కూడా వినియోగించనుండటంతో చెరువుల్లో నీరు కలుషితం కాకుండా ఉండేందుకు, నిమజ్జనాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. -
డీజే టిల్లు సాంగ్ కు డాన్స్ అదరగొట్టిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, తెలంగాణ మంత్రులు
-
ముందు తరాలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన వజ్రం
-
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
Telangana Police Integrated Command and Control Centre: హైదరాబాద్ నగర సిగలో మరో కలికితురాయి వచ్చి చేరింది. ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇప్పటికే తన ఛాంబర్లో సీపీ సీవీ ఆనంద్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను(సీసీసీ) సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరోవైపు సీసీసీ వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. 18వ ఫ్లోర్లో సీపీ ఆఫీస్ అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ, ఒకేచోటా నుంచి నగరమంతా వీక్షించేలా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మించారు. దేశంలోని అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ.. రూ. 600 కోట్లతో 18 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. 7 ఎకరాలు, 6.42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. భవనం ఎత్తు 83.5 మీటర్లు. టవర్ ఏ లోని 18వ ఫ్లోర్లో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంది. 14, 15వ ఫ్లోర్లో మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఏడో అంతస్తులో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా కీలక విభాగాల అధిపతులకు ఛాంబర్లు ఉంటాయి. టవర్ బి మొత్తాన్ని టెక్నాలజీ వింగ్‌కు కేటాయించారు. సంబంధిత వార్త:ఒకే చోట నుంచి రాష్ట్రమంతా వీక్షణ.. పోలీస్ ట్విన్ టవర్స్ ప్రత్యేకలివే.. ఒకే గొడుకు కిందికి అన్ని విభాగాలు సాంకేతిక పరిజ్ఞానం వాడుకునే దిశగా 5 టవర్లు(ఏబీసీడీఈ) ఏర్పాటు చేశారు. బిల్డింగ్ చుట్టూ 35 శాతం గ్రీనరీ, 600 వాహనాలు పార్కింగ్ చేసుకునేలా ఏర్పాటు చేశారు. ఫ్లోర్ ఫ్లోర్‌కు సోలార్ ప్లాంటు ఉంది. రాష్ట్రంలోని సీసీ కెమెరాలు సీసీసీకి అనుసంధానం చేశారు. నగర వ్యాప్తంగా సీ కెమెరాల్లో రికార్డు అవుతున్న దృశ్యాలను భారీ వీడియో వాల్ సహాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. నగర కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలు, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్.. ఇలా అన్ని విభాగాలనూ ఒకే గొడుకు కిందికి తీసుకువస్తున్నారు. వీటిలో ఏ విభాగానికి సంబంధించిన పని కోసమైనా ప్రజలు వివిధ చోట్లకు తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో విధానం అమలుకానుంది. -
వరుస ఘటనలు.. హైదరాబాద్‌లో ఒకేసారి 69 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ కాలం తర్వాత నగరంలో ఒకేసారి భారీ స్థాయిలో ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న 69 మందికి స్థాన చలనం కల్పిస్తూ కొత్వాల్ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గడిచిన కొన్నేళ్లుగా నగరంలో బదిలీలు జరుగుతున్నప్పటికీ గరిష్టంగా ఐదు స్థానాలకే పరిమితం అవుతున్నాయి. ఆనంద్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అధికారులు, సిబ్బంది పనితీరు, ఇతర అంశాలపై దృష్టి పెట్టారు. వివిధ మార్గాల్లో, అనేక కోణాల్లో సమాచారం సేకరించి సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో పనితీరు, సీనియారిటీ తదితర అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో పంజగుట్ట ఇన్స్పెక్టర్గా ఉన్న ఎం.నిరంజన్‌రెడ్డిని సీసీఎస్‌కు బదిలీ చేసిన ఆనంద్ ఆ స్థానంలో సీసీఎస్ నుంచి సి.హరి చంద్రారెడ్డిని నియమించారు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో ఈ ఇద్దరి అధికారులు కొత్త స్థానాల్లో బాధ్యతలు తీసుకున్న తర్వాత తిరిగి పాత స్థానాల్లోకి మారాల్చి వచ్చింది. తాజా బదిలీల్లో మళ్లీ యథాతధంగా పోస్టింగ్స్ వచ్చాయి. చదవండి: ఖైదీ నెంబర్ 2001.. నాగేశ్వర్రావు రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు కాగా ఇటీవల నగర పోలీసు అధికారుల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మారేడుపల్లి సీ నాగేశ్వరరావు అత్యాచారం కేసులో ఇరుక్కోగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లపాటు సహజీవనం చేసి ఓ యువతిని మోసం చేసిన ఘటనలో మల్కాజ్‌గిరిలో సీసీఎస్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న విజయ్‌పై కేసు నమోదైంది. ఇలా పోలీసు అధికారులకు సంబంధించి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న క్రమంలో హైదరాబాద్ సీపీ ఆనంద్ ఈ బదిలీల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. చదవండి: హిమాయత్ సాగర్: ప్రమాదకర విన్యాసాలతో యువకులు -
నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం
గోల్కొండ: నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఆదివారం ఆయన గోల్కొండ కోటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ అధికారులతో కలిసి బోనాల బందోబస్తును పర్యవేక్షించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్వాన్ నియోజకవర్గ ఇంచార్జ్ టి.జీవన్ సింగ్ ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... వివిధ వర్గాల పండుగలు ఒకే రోజు రావడంతో నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం పరిఢవిల్లిందని ఆయన అన్నారు. వివిధ వర్గాల ప్రజలు ఒకరినొకరు అభినందించుకుంటూ స్నేహపూరితమైన వాతావరణంలో పండుగలు నిర్వహించుకుంటున్నారు. కోట బోనాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్, నగర అదనపు కమిషనర్ ఎ.ఆర్. శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు గోవింద్ రాజ్, మైత్రి కమిటీ సభ్యులు ఆబెద్, ఇలియాస్ అక్బర్, జంగయ్య తదితరులున్నారు. -
HYD: వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల 3న బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. పరేడ్ గ్రౌండ్ వద్ద శుక్రవారం భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో జరగబోయే సభకు నాలుగు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటష్ట చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. వాహనదారులు పోలీసులు సూచించిన మార్గాల్లోనే వెళ్లాలని తెలిపారు. ఇక, హెచ్ఐసీసీ పరిధిలో కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నీరూస్ నుంచి కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్ వెళ్లేవారు.. సీఓడీ నుంచి దుర్గం చెరువు, బయోడైవర్సిటీ మీదుగా రాకపోకలు. ఆర్సీపురం, చందానగర్, మాదాపూర్, గచ్చిచౌలి నుంచి వచ్చే వాహనాలు బీహెచ్ఈఎల్, హెచ్‌సీయూ, ట్రిపుల్ ఐటీ మీదుగా వెళ్లాలి. మియాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట నుంచి వచ్చేవారు ఏఐజీ ఆసుపత్రి, దుర్గం చెరువు మీదుగా రాకపోకలు సాగించాలి. -
జూబ్లీహిల్స్ పబ్ కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలి: రేవంత్‌రెడ్డి
-
అమ్నేషియా పబ్ కేసు: కార్లు ఎవరివి.. ప్రశ్నల వర్షం కురిపించిన రేవంత్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసు తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను పెంచింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసుపై వివిధ పార్టీల నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జూబ్లీహిల్స్ లైంగిక దాడి కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలి. ఆరోపణలు ఎదర్కొంటున్న వారిని విచారించాలి. సీవీ ఆనంద్ కొన్ని విషయాలు బయటకు చెప్పకుండా దాచిపెట్టారు. బెంజ్ కారు యజమాని ఎవరో చెప్పలేదు. ఇన్నోవా కారు ఎవరిదో కూడా సీవీ ఆనంద్ చెప్పలేదు. ప్రభుత్వ వాహనం అని స్టిక్కర్లు తొలగించింది ఎవరు?. ఇప్పటి వరకు వాహనాల యజమానులకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు. నిందితులు ఆధారాలు లేకుండా చేసిన ప్రయత్నాలను ఎందుకు చెప్పలేదు. పాత్రదారులు, సూత్రదారులు ఎవరన్నది సీవీ ఆనంద్ చెప్పడం లేదు. మైనర్‌ను లైంగిక దాడి చేసిన వాహనాల ఓనర్లను పిలిచి ఎందుకు విచారించలేదు. ఇన్నోవా కారులో బాలికను తీసుకెళ్లారు. ఆమెపై లైంగిక దాడి జరిగిందని చెబుతున్నారు. మైనర్లు వాహనం నడిపితే యజమానిదే బాధ్యత. కార్ల యజమానులపై ఎందుకు కేసు పెట్టలేదు. వాహన యజమానులను ఎందుకు దాస్తున్నారు’’ అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: పబ్ కేసులో నా మనవడిపై తప్పుడు ప్రచారం చేశారు: హోం మంత్రి మహమూద్ అలీ -
జూబ్లీహిల్స్ పబ్ కేసు: ఆరుగురిలో ఐదుగురు మైనర్లే!
-
జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటన.. కీలక వివరాలు వెల్లడించిన సీపీ
సాక్షి, హైదరాబాద్: సంచలన సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించిన నగర కమిషనర్.. ఈ కేసులో నిందితులు మైనర్లు కాబట్టి పేర్లు, ఇతర వివరాలు వెల్లడించడం కుదరని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ కేసును లోతుగా దర్యాప్తు చేశాం. ఆరుగురిలో ఒకరు మేజర్, ఐదుగురు మైనర్లు. కేసులో మైనర్లు ఉన్నందున పేర్లు చెప్పడం లేదు. మార్చి 28న ఈ వ్యవహారం మొదలైంది. బెంగళూరులో ఉండే ఒక స్టూడెంట్.. స్కూల్ మొదలుకాక ముందు పార్టీ చేసుకోవాలని హైదరాబాద్‌లో స్నేహితులతో ప్లాన్ చేశాడు. అందుకోసం అమ్నీషియా పబ్‌ను ఎంచుకుని.. ఏప్రిల్‌లో పార్టీ గురించి పోస్ట్ చేశాడు. నాన్ ఆల్కాహాలిక్, స్మోకింగ్ పార్టీ కోసం అప్లై చేసుకున్నారు. ఉస్మాన్ అలీఖాన్ అనే వ్యక్తి ద్వారా పబ్‌ను బుక్ చేయించారు. మే 28వ తేదీన పార్టీ గురించి సదరు స్టూడెంట్ మళ్లీ పోస్ట్ చేశాడు. మే 28వ తేదీన మధ్యాహ్నాం బాధితురాలు పబ్‌కు వెళ్లింది. నిందితులు.. పబ్‌లో ముందుగానే పథకం వేసుకున్నారు. ఆమె ఫాలో చేసి ట్రాప్ చేశారు. అదే రోజు సాయంత్రం రోడ్డు నెంబర్ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో సామూహిక అత్యాచారం జరిగింది. ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. సాయంత్రం మళ్లీ పబ్ దగ్గర బాధితురాలిని వదిలిపెట్టారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. మే 31న పోక్సో యాక్ట్ ప్రకారం.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. భరోసా సెంటర్లో కౌన్సెలింగ్ తర్వాత బాధితురాలు వివరాలు చెప్పింది. ఆ తర్వాత మరికొన్ని సెక్షన్లు నమోదు చేశాం. పబ్, బేకరి వద్ద అన్ని సీసీ ఫుటేజీలను పరిశీలించాం. ఏ1 సాదుద్దీన్‌తో పాటు మైనర్ నిందితులు, బాధితురాలు వాహనంలో వెళ్లారు. మైనర్‌తో పాటు సాదుద్దీన్ బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. నిందితులను బాధితురాలు గుర్తించలేకపోయింది. ఆధారాలతో సహా జూన్ 2వ తేదీన నిందితులను గుర్తించాం. జూన్ 3న సాదుద్దీన్‌ను అరెస్ట్ చేశాం. ఏ1 సాదుద్దీన్‌తో పాటు మిగతా వాళ్లపై కేసు నమోదు అయ్యింది. సాదుద్దీన్‌తో పాటు నలుగురిని అరెస్ట్‌చేశాం. మరొకరి కోసం స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశాం. దర్యాప్తు చాలా పారదర్శకంగానే జరిగిందని.. పలు కోణాల్లో దర్యాప్తు చేయడం వల్లే ఆలస్యమైందని చెప్పారు. ఇలాంటి కేసుల్లో శిక్షలూ కఠినంగానే ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. పబ్‌ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. -
హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్.. ‘త్రి’ పాత్రాభినయం!
సాక్షి, హైదరాబాద్(సిటీబ్యూరో): హైదరాబాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రస్తుతం రాజధానిలోని మూడు కమిషనరేట్లకు కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు స్టీఫెన్ రవీంద్ర, మహేష్ మురళీధర్ భగవత్ సెలవులో ఉండటమే ఇందుకు కారణం. దీంతో రెండు కమిషనరేట్లకూ ఆయనే ఇన్చార్జి కమిషనర్‌గా ఉన్నారు. ఇలాంటి ఘట్టం ఆవిష్కృతం కావడం ఇదే తొలిసారి. ఈ నెల రెండో వారంలో రాచకొండ కమిషనర్ సెలవుపై విదేశాలకు వెళ్లడంతో ఆ కమిషనరేట్‌కు సైబరాబాద్ సీపీని ఇన్చార్జ్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. చదవండి: ర్యాపిడో డ్రైవర్ అరాచకాలు.. కాలేజీ అమ్మాయిలకు గత వారం సైబరాబాద్ కమిషనర్ సైతం సెలవుపై విదేశాలకు వెళ్లడంతో ఈ పోస్టుకు ఆనంద్‌కు ఇన్చార్జ్ కమిషనర్‌ను చేశారు. దీంతో సాంకేతికంగా ఆయనే రెండు కమిషనరేట్లను ఇన్చార్జ్ సీపీగా మారారు. ఈ మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో పరిపాలన వ్యవహారాలను ఆనంద్ అదనపు పోలీసు కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. సాధారణంగా ప్రతి రోజు ఉదయం ఆయా కమిషనరేట్ల కమిషనర్లు తమ పరిధిలోని ఉన్నతాధికారులతో తాజా పరిస్థితులు, పరిణామాలు, కార్యక్రమాలు, నిరసనలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంటారు. వీటికి సంబంధించి స్పెషల్ బ్రాంచ్ అధికారులు రూపొందించే పెరిస్కోప్ (నివేదిక) పరిశీలించి సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ప్రస్తుతం మూడు కమిషనరేట్లకు కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఆనంద్ ప్రతిరోజు మూడు టెలీకాన్ఫరెన్స్‌లను నిర్వహించడంతో పాటు మూడు పెరిస్కోప్‌లను పరిశీలిస్తున్నారు. గురువారం సైబరాబాద్ పరిధిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో (ఐఎస్బీ) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆనంద్ దృష్టి ఆ కమిషనరేట్‌పై ప్రత్యేకంగా ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన బందోబస్తు, భద్రత చర్యలపై సైబరాబాద్ ఉన్నతాధికారులతో గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో సమావేశం కావడంతో పాటు ఐఎస్బీని సందర్శించారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), స్టేట్ ఇంటెలిజెన్స్ అధికారులతో సైబరాబాద్ పోలీసులు సమన్వయం ఏర్పాటు చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. -
పోలీసు వెబ్సైట్ ద్వారానే లైసెన్సుల రెన్యువల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలులోకి తీసుకువస్తూ వ్యాపార సంస్థల లైసెన్సుల రెన్యువల్‌కు పోలీసు అధికారిక వెబ్సైట్ ద్వారానే అవకాశం కల్పించనున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో బార్లు, రెస్టారెంట్లు, పబ్బులతో పాటు డ్రైవ్–ఇన్ రెస్టారెంట్ల యాజమాన్యాలతో సుదీర్ఘ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలోనే త్వరలో ఆన్లైన్ రెన్యువల్ విధానం అమలులోకి రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో కొకైన్ దొరకడం, కొన్ని పబ్బు ద్వారా తీవ్ర ధ్వనికాలుష్యం వెలువడుతోందని, వీటి పార్కింగ్ వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయని, మందుబాబుల ఆగడాలు పెరిగాయని వరుసగా వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో కొత్వాల్ ఈ సమావేశం నిర్వహించారు. తమ లాభాల కోసం కొన్నింటి యాజమాన్యాలు నిబంధనలను ఉల్లంఘిస్తూ సిటీకి అపఖ్యాతి తీసుకువస్తున్నారని ఆనంద్ అన్నారు. ఈ సమావేశానికి హాజరైన దాదాపు 100 మందికి సిటీ పోలీస్ యాక్ట్, అందులోని నిబంధనలు ఇతర అంశాలను వివరించారు. వీటిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే తక్కువ వయస్సు ఉన్న వారిని పబ్బుల్లోకి, బార్లలోకి అనుమతించవద్దని, ధ్వని స్థాయిలను పరిమితం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ కనీసం 30 రోజుల బ్యాకప్‌తో ఉండే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రాంగణంలో సౌండ్ ప్రూఫింగ్, వ్యాలెట్ డ్రైవర్లు, సిబ్బంది, కస్టమర్లను గమనిస్తూ ఉండటానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరారు. మద్యం సరఫరాకు సంబంధించి రాత్రి 11 గంటల తరువాత వచ్చిన ఆర్డర్లను అంగీకరించరాదని కచ్చితంగా 12 గంటల లోపు మూసివేయాలని ఆదేశించారు. (క్లిక్: దినేష్ దశ తిరిగెన్.. మోసపోయిన కంపెనీ నుంచే బంపర్ ఆఫర్) శుక్ర, శనివారాల్లో లావాదేవీలను దృష్టిలో పెట్టుకుని అర గంట అదనపు సమయంతో సహా గంట మినహాయింపు ఇస్తున్నామన్నారు. పాశ్చాత్య దేశాలలో పబ్బు ముగింపు సమయానికి పది నిమిషాల ముందు నిర్వాహకులు తమ లైట్లను డిమ్ చేస్తూ కస్టమర్లు అది మూసే సమయమైందని తెలిసేలా చేస్తారని, ఇక్కడా ఈ విధానం అమలు చేయాలని సూచించారు. అంతర్జాతీయ ప్రయాణికులు లేదా ప్రతినిధులను దృష్టిలో పెట్టుకొని స్టార్ రేటింగ్ ఉన్న హోటళ్లలో 24 గంటలూ మద్యం విక్రయించేందుకు అనుమతి ఉంటుందని, ఇది సాధారణ ప్రజల కోసం కాదని ఆనంద్ స్పష్టం చేశారు. ఇలాంటి బార్లు, రెస్టారెంట్లు, పబ్బులకు ఇకపై అనుమతులు ఉండవని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, సంయుక్త సీపీలు ఎం.రమేష్, పి.విశ్వప్రసాద్‌లతో పాటు జోనల్ డీసీపీలు పాల్గొన్నారు. (క్లిక్: రోజూ నలుగురు మగాళ్లు మిస్!.. ఎన్నెన్నో కారణాలు) -
భవిష్యత్‌లో పెను సవాల్.. ఠాణాకో సైబర్ క్రైమ్ టీమ్
సాక్షి, హైదరాబాద్: సిటీలో సగటున రోజుకు 100 ఎఫ్ఐఆర్లు నమోదవుతుంటే వాటిలో 20 శాతం సైబర్ నేరాలకు సంబంధించినవే అని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. రానున్న రోజుల్లో ఈ నేరాలను పెను సవాల్‌గా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి పోలీసుస్టేషన్‌లోనూ సైబర్ క్రైమ్ టీమ్స్ ఏర్పాటు చేయడానికి యోచిస్తున్నామని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘చోరీలు, స్నాచింగ్స్, దోపిడీలు వంటి నేరాలు తగ్గుతుండగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దాదాపు ప్రతి వ్యాపార, ఇతర లావాదేవీలు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఫలితంగా భవిష్యత్తులో ఈ నేరాలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే సైబర్ క్రైమ్ నిరోధానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు బాధ్యతలు స్వీకరించిన రోజే స్పష్టం చేశాం. ఇందులో భాగంగా ప్రతి ఠాణాలోనూ ఎస్సై, నలుగురు హెడ్–కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లకు సైబర్ క్రైమ్ టీమ్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. వీరికి అవసరమైన ఉపకరణాలు, శిక్షణ సైతం ఇవ్వాల్సి ఉంటుంది. పేజీ పేమెంట్ గేట్‌వే సంస్థలో జరిగిన సైబర్ నేరం దర్యాప్తు హ్యాకింగ్ కేసులకు పాఠంగా పనికి వస్తుంది. మహేష్ బ్యాంక్ కేసు కూడా కొంత అనుభవాన్ని ఇచ్చింది’ అని అన్నారు. ఆ మూడు సంస్థల విషయం ఆర్బీఐ దృష్టికి... ‘పేమెంట్ గేట్‌వేలనే హ్యాక్ చేసిన నిందితుడు దినేష్ మూడేళ్లలో దాదాపు రూ.3 కోట్లు స్వాహా చేశాడు. ఇతడి వల్ల సైబర్ నేరాల బారినపడిన పేజీ, బెస్ట్ పే, మహాగ్రామ్‌ల సర్వర్లలో అనేక లోపాలున్నాయి. పేజీ సంస్థ అడ్మిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్స్ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉంది. వీటి విషయాన్ని ఆర్బీఐకి లేఖ ద్వారా తెలియజేస్తాం. -
మత్తుకు మందేసే ‘డాక్టర్ పోలీస్’
సాక్షి, హైదరాబాద్: ఏదో సరదాగానో, స్నేహితులతో కలిసో డ్రగ్స్‌కు అలవాటవుతున్నారు. పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్తున్నారు. బయటికొచ్చాక అలవాటు మానుకోలేక మళ్లీ డ్రగ్స్ వైపు చూస్తున్నారు. ఈ సమస్యకు చెక్‌పెట్టే దిశగా పోలీసులు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. తామే బాధితులకు తగిన చికిత్స ఇప్పించడం, కౌన్సెలింగ్ చేయడం ద్వారా డ్రగ్స్ నుంచి దూరం చేసేలా ‘రీ–హ్యాబ్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలతో పాటు నాలుగు ప్రైవేట్ సంస్థలతో శుక్రవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రీ–హ్యాబ్ విధివిధానాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాకు వివరించారు. ఆ వివరాలివీ.. – ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు నగర పోలీసులు డ్రగ్స్ కేసుల్లో మొత్తం 372 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు విదేశీయులు, 40 మంది బయటి ప్రాంతాల వారితో సహా 193 మంది పెడ్లర్స్ ఉన్నారు. డ్రగ్స్ వినియోగిస్తూ విక్రయిస్తున్న 85 మంది, వినియోగదారులు 94 మందినీ కటకటాల్లోకి పంపారు. – వీళ్లు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ ఐదు సంస్థల సహకారంతో వారిపై నిఘా ఉంచనున్నారు. తల్లిదండ్రుల సమ్మతితో వారిని స్క్రీనింగ్ చేస్తారు. అవసరమైన వారికి ఇన్‌షేషెంట్స్‌గా.. మిగిలిన వారికి ఔట్ పేషెంట్స్‌గా చికిత్స అందించనున్నారు. రెండు నెలల పాటు ప్రత్యేక కౌన్సెలింగ్ ఉంటుంది. – మొదటి నెల వారానికి రెండు సార్లు, రెండో నెల వారానికి ఒకసారి చొప్పున కౌన్సెలింగ్ ఉంటుంది. ఈ కాలంలో వారి సమ్మతితోనే ప్రతి వారం మూత్రం, రక్త పరీక్షలు చేసి ఇంకా డ్రగ్స్ వాడుతున్నారా? లేదా? అనేది గుర్తిస్తారు. ఇన్‌పేషెంట్స్‌కు కనిష్టంగా 28 రోజుల చికిత్స ఉంటుంది. – ప్రైవేట్ సంస్థల్లో ఒక్కో సెషన్‌కు రూ.2 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. స్తోమత లేని వారికి ఎర్రగడ్డ వైద్యశాలలో రీ–హ్యాబ్ ప్రక్రియ పూర్తి చేయిస్తారు. ఆయా సంస్థల్లోని నిపుణులు వివిధ దశల్లో కౌన్సెలింగ్, వైద్యం చేసి వారు డ్రగ్స్‌కు దూరమయ్యేలా చేస్తారు. ఇది శుక్రవారం నుంచే అమలులోకి వచ్చింది. – మాజీ డ్రగ్స్ వినియోగదారులపై ఆయా సంస్థల సహకారంతో పోలీసులు నిఘా కొనసాగిస్తారు. మద్యం అలవాటు నుంచి బయటపడిన వారి (ఆల్కహాల్ అనానిమస్) గ్రూపుల మాదిరిగానే భవిష్యత్తులో నార్కోటిక్ అనానిమస్ గ్రూపులు ఏర్పాటు చేసి, వారంతట వారే తమపై నిఘా ఉంచుకునేలా, ఒకరికొకరు సహకరించుకునేలా నగర పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
నిర్లక్ష్యం చూపారు.. నిలువెల్లా దోచారు
సాక్షి, హైదరాబాద్: ఏపీ మహేష్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చెస్ట్ ఖాతా నుంచి డబ్బు కొట్టేయడానికి సైబర్ నేరగాళ్లు ర్యాట్, కీలాగర్స్ వంటి మాల్వేర్స్ వాడారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. వీటి ద్వారానే హ్యాకర్లు బ్యాంక్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించి రూ.12.48 కోట్లు కొట్టేశారన్నారు. బుధవారం నైజీరియన్ ఇక్పా స్టీఫెన్ ఓర్జీని అరెస్టు చేశామని, దీంతో ఇప్పటివరకు అరెస్టు అయిన వారి సంఖ్య 23కు చేరిందని చెప్పారు. బ్యాంక్‌ను కొల్లగొట్టిన హ్యాకర్లు నైజీరియా లేదా లండన్‌లో ఉన్నట్లు సాంకేతిక ఆధారాలను బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. గత నవంబర్ నుంచి సన్నాహాలు ప్రారంభించిన వీళ్లు మూడు మెయిల్ ఐడీల నుంచి బ్యాంక్ అధికారిక ఈ–మెయిల్ ఐడీకి ఆ నెల 4,10,16 తేదీల్లో 200 ఫిషింగ్ మెయిల్స్ పంపారు. ఆర్టీజీఎస్ అప్‌గ్రేడ్ తదితరాలకు సంబంధించిన మెయిల్స్‌గా ఉద్యోగులు భ్రమించేలా వీటిని రూపొందించారు. నవంబర్ 6న ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు వీటిని క్లిక్ చేశారు. ఫలితంగా దీనికి అటాచ్ చేసిన ఉన్న రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (ర్యాట్) ఆ రెండు కంప్యూటర్లలోకి చొరబడింది. దీని ద్వారా బ్యాంక్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించి వాటిలోకి కీలాగర్స్ మాల్వేర్ను ప్రవేశపెట్టారు. దీంతో ఈ రెండు కంప్యూటర్లను వాడిన ఉద్యోగులకు సంబంధించిన యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్స్‌తోపాటు అన్ని కార్యకలాపాలు హ్యాకర్‌కు చేరిపోయాయి. అత్యంత బలహీనంగా సైబర్ సెక్యూరిటీ రూ.వందలు, వేల కోట్ల ప్రజాధనంతో లావాదేవీలు జరిగే బ్యాంకులు తమ సైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తాయి. దీని కోసం భారీగా ఖర్చు చేస్తుంటాయి. ఈ విషయంలో మహేష్ బ్యాంక్ కక్కుర్తి, నిర్లక్ష్యంతో వ్యవహరించి సరైన ఫైర్ వాల్స్‌ను ఏర్పాటు చేసుకోలేదు. దీనివల్లనే హ్యాకర్లు బ్యాంకు నెట్‌వర్క్‌ను తమ అ«ధీనంలో పెట్టుకుని ఎంపికచేసిన నాలుగు ఖాతాల నుంచి రూ.12.48 కోట్లను వివిధ ఖాతాల్లోకి మళ్లించారు. దీనికి సహకరించిన వారికి 5–10 శాతం కమీషన్లు ఇచ్చారు. విదేశాల్లో ఉన్నట్లు అనుమానిస్తున్న çప్రధాన హ్యాకర్లను కనిపెట్టడానికి ఇంటర్‌పోల్ సాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సీవీ ఆనంద్ తెలిపారు. నాణ్యతలేని సాఫ్ట్వేర్ అందించిన ఇంట్రాసాఫ్ట్ సంస్థతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్యాంక్ నిర్వాహకులను ఈ కేసులో సహ నిందితులుగా చేర్చామన్నారు. -
బోయిగూడ అగ్ని ప్రమాదం: గురువారం ఉదయం మృతదేహాల తరలింపు
Latest Updates ► బోయిగూడ అగ్ని ప్రమాదంలో మరణించిన మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తైంది. ► బోయిగూడ అగ్ని ప్రమాదంలో మరణించిన మృతదేహాలను గురువారం స్వస్థలాలకు తరలించనున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి కావడానికి ఈ రోజు సాయంత్రం అవుతుందని పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం గుండా 3 పాట్నాకు చెందిన విమానాలలో మృతదేహాలను తరలించనున్నట్లు వెల్లడించారు. ►బోయిగూడ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాల గుర్తింపు జరుగుతోందని హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ తెలిపారు. గాంధీ మార్చురీలో ఇప్పటికే ఆరుగురి మృతదేహాలను గుర్తించినట్లు, మరో అయిదుగురి మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. పోస్టుమార్టం ప్రక్రియలో మొత్తం నాలుగుటీమ్లు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని హైదరాబాద్ కలెక్టర్, సీపీ సీవీ ఆనంద్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్ అంబులెన్స్ ద్వారా మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించనున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని, అనధికరికంగా నిర్వహిస్తున్న స్క్రాప్ గోడౌన్లపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ►బోయిగూడ అగ్ని ప్రమాద స్థలానికి హోంమంత్రి మహమూద్ అలీ చేరుకున్నారు. బోయిగూడ ఘటనపై అధికారులతో విశ్లేషిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జీహెచ్ఎంసీ, పోలీస్, అగ్నిమాపకశాఖ విజిలెన్స్ అధికారులతో సమావేశం కానున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో స్క్రాప్ గోడౌన్లు ఎన్ని ఉన్నాయో.. ఎలాంటి చర్యలు చేపట్టాలో చర్చిస్తామని పేర్కొన్నారు. జనావాసాల మధ్య గోడౌన్లు చాలా ఉన్నాయని, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: బోయిగూడ అగ్ని ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి.. రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా బోయిగూడలో 20కి పైగా స్క్రాప్ గోడౌన్లు కాగా బోయిగూడ ఘటనతో అధికారులు అలెర్ట్ అయ్యారు. అనుమతులు లేని టింబర్లపై అధికారులు దాడులు చేస్తున్నారు. కార్మికుల రక్షణ, సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు. ఇక బోయిగూడలో 20కి పైగా స్క్రాప్ గోడౌన్లు ఉన్నట్లు అధికారుల గుర్తించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సమగ్ర విచారణ జరపాలి: రేవంత్ రెడ్డి సికింద్రాబాద్‌లోని బోయిగూడ అగ్ని ప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతిచెందడం అత్యంత బాధాకరమని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: Hyderabad: భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేవు: సీవీ ఆనంద్ సికింద్రాబాద్ బోయిగూడలోని టింబర్, స్క్రాప్ గోడౌన్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. స్క్రాప్ గోడౌన్లో షార్ట్ సర్క్యూట్లో మంటలు వ్యాపించాయని. ఆ తర్వాత సిలిండర్ పేలుడు జరగడంతో దట్టమైన పొగ కమ్ముకుందని సీపీ ఆనంద్ తెలిపారు. ప్రమాద సమయంలో కార్మికులంతా నిద్రలో ఉన్నందున ప్రమాద తీవ్రత భారీగా పెరిగిందని పేర్కొన్నారు. గోడౌన్ విషయంలో నిబంధనలు పాటించలేదని, అందులో ప్రమాద నివారణ చర్యలు ఏమీలేవని చెప్పారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ పేలినట్లు 100కు ఫోన్‌కాల్ వచ్చిందని చెప్పారు. సిలిండర్ పేలడంతోనే మంటలు ఎక్కువగా వ్యాపించాయన్నారు. ఇద్దరు యువకులు పైనుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారని చెప్పారు. గాయాలైన వ్యక్తితో మాట్లాడితే పూర్తి సమాచారం వస్తుందని తెలిపారు. మృతులు బీహార్‌లోని చప్రా జిల్లాకు చెందినవారని వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. గోదాం యజమానికి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ప్రమాదం జరిగిన గోడౌన్‌కు ఎంట్రీ, ఎగ్జిట్ ఒక్కటే ఉందన్నారు. అలాగే గోడౌన్లో ఎలాంటి సేఫ్టీ పరికరాలు కూడా లేవని సీవీ ఆనంద్ వివరించారు. మృతులంతా బిహార్‌లోని చప్రా జిల్లాకు చెందినవారని, ఇక్కడ పనిచేసే కార్మికులకు నెలకు రూ. 12 వేలను జీతంగా ఇస్తారని తెలిపారు. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాం: మంత్రి తలసాని బోయిగూడలో అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించామని తెలిపారు. పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా అదుకుంటామన్నారు. సాక్షి, హైదరాబాద్: బుధవారం తెల్లవారుజామన సికింద్రాబాద్ బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది సజీవ దహనమయ్యారు. మరొకరు ప్రాణాలతో బయట పడ్డారు. సుమారు మూడు గంటలకు పైగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశాయి. ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ సంతాపం తెలిపారు. మృతుల కుంటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రధాని నరేంద్రమోదీ రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు. మృతులంతా బీహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. మృతులను సికిందర్(40), బిట్టు(23), సత్యేందర్(35), గోలు(28), దామోదర్(27), రాజేశ్(25), దినేశ్(35), రాజు(25), చింటు(27), దీపక్(26), పంకజ్(26)గా గుర్తించారు. -
ఇది చాలా విషాదకరమైన సంఘటన: సీవీ ఆనంద్
-
హైదరాబాద్ పోలిస్ కమిషనర్ కీలక ఆదేశాలు.. ‘ఇకపై వేసేయడమే’
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు కమిషనరేట్‌కు సంబంధించి ఎలాంటి నేరంలో ఎవరికి పాత్ర ఉన్నా ఉపేక్షించేది లేదని కొత్వాల్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ఇప్పటి వరకు కౌన్సెలింగ్‌లు చేశాం. వాటితో ఫలితం ఉండట్లేదు. అందుకే ఇకపై వేసేయడమే (జైల్లో)’ అని వ్యాఖ్యానించారు. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్న రెండు నకిలీసర్టిఫికెట్ల ముఠాల నుంచి వందల మంది ధ్రువపత్రాలు ఖరీదు చేశారు. ఈ వ్యవహారం వారి తల్లిదండ్రులకు తెలిసి జరగడంతో పాటు వారికీ పాత్ర ఉంది. ఇప్పటికే ఏడుగురి విద్యార్థులను అరెస్టు చేశామని, త్వరలో మిగిలిన వారినీ పట్టుకుంటామని ఆనంద్ అన్నారు. వీరికి సర్టిఫికెట్లు కొని పెట్టిన, ప్రోత్సహించిన తల్లిదండ్రులను సైతం అరెస్టు చేస్తామని ఆయన పేర్కొన్నారు. నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన యూనివర్సిటీల గుర్తింపు రద్దు చేయాలని సిఫారసు చేస్తూ యూజీసీకి ఆధారాలతో సహా లేఖ రాస్తాం. ఇటీవల డ్రగ్స్ కేసుల విషయంలోనూ తమ పంథా మార్చామని ఆయన అన్నారు. గతంలో మాదకద్రవ్యాల విక్రేతలను మాత్రమే అరెస్టు చేసే వాళ్లు. వీరి నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి, వినియోగించిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చేవాళ్లు. పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ విధానం మారింది. చదవండి: నిజామాబాద్‌లో రెచ్చిపోయిన రౌడీమూకలు.. టీస్టాల్‌పై వీరంగం టోనీ కేసులో ఏడుగురు బడా వ్యాపారులను కటకటాల్లోకి పంపారు. ఇకపైనా ఇదే విధానం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మరోపక్క రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రిపై వచ్చిన ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకున్నామని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే మహారాష్ట్రలో కేసు నమోదైనట్లు తెలిసిందని, ఒకే నేరంగా రెండు కేసులు సాధ్యం కావని అన్నారు. ఎక్కడ నమోదైందో తెలుసుకుని ఇక్కడి ఫిర్యాదులనూ అక్కడికే పంపుతామన్నారు. ఇప్పటి వరకు ఎక్కడా రిజిస్టర్ కాకపోతే మాత్రం జూబ్లీహిల్స్‌లో కేసు నమోదు చేస్తామని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వచ్చే ఫిర్యాదులు ఆ ఠాణాకే వస్తాయని పేర్కొన్నారు. చదవండి: బాలిక అనుమానాస్పద మృతి.. రాత్రి సమయంలో ఎందుకు వెళ్లింది? -
ఐపీఎల్-2022 వేలంలో హైదరాబాద్ సీపీ కూమారుడు.. ఏ జట్టు దక్కించుకుందంటే
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 2022 ఐపీఎల్ సీజన్ కోసం మిలింద్‌ను రూ. 25 లక్షలకు కొనుగోలు చేసింది. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (2015), ఢిల్లీ డేర్‌డెవిల్స్ (2016) జట్లకు హైదరాబాద్ క్రికెటర్ సీవీ మిలింద్ ఎంపికయ్యాడు. ఎడంచేతివాటం పేస్ బౌలర్ మిలింద్ 2013 నుంచి హైదరాబాద్ జట్టు తరఫున రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలలో ఆడుతూ నిలకడగా రాణిస్తున్నాడు. మిళింద్ లిస్ట్-ఏలో 45 మ్యాచ్‌లు ఆడి 82 వికెట్లను పడగొట్టాడు. 20 ఏళ్ల చామ మిళింద్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్లో ఆడాడు. ఇక హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కుమారుడే ఈ చామ మిళింద్ ఆనంద్. -
జాతీయ లోక్ అదాలత్ మార్చి 12న
సాక్షి, హైదరాబాద్: కేసుల రాజీకి సంబంధించిన జాతీయ లోక్ అదాలత్ మార్చి 12న జరగనుంది. దీనికి సంబంధించి న్యాయ విభాగం నుంచి నగర పోలీసులకు సమాచారం అందింది. ప్రజలకు ఉపయుక్తమైన లోక్ అదాలత్‌పై అందరికీ అవగాహన కల్పించాలని కొత్వాల్ సీవీ ఆనంద్ ఆదేశించారు. వీలున్నంత వరకు అత్యధికులు దీన్ని వినియోగించుకుని, ఫలితాలు పొందేలా కృషి చేయాలని స్పష్టం చేశారు. ఈ బాధ్యతలను జోనల్ డీసీపీలకు అప్పగించారు. దీంతో ఈస్ట్ జోన్ డీసీపీగా ఉన్న సంయుక్త పోలీసు కమిషనర్ ఎం.రమేష్ రెడ్డి బుధవారం తన పరిధిలోని అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ భారీ లోక్ అదాలత్‌కు సంబంధించిన సమాచారం సంబంధిత వ్యక్తులకు అందించే బాధ్యతలను ఇన్స్పెక్టర్లు, సబ్– ఇన్స్పెక్టర్లకు అప్పగించారు. ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడం ద్వారా లోక్ అదాలత్‌తో పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా, ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలని రమేష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీ చేశారు. (క్లిక్: హైదరాబాద్‌లో వర్క్ ఫ్రమ్ హోంకు ఎండ్‌కార్డ్.. ఐటీ కంపెనీల కీలక నిర్ణయం) -
కమిషనర్ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు.. ఎక్కడికక్కడ ఎత్తేస్తారిక!
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు కమిషనరేట్‌లోని అబిడ్స్, పంజగుట్ట సహా మరికొన్ని పోలీసుస్టేషన్ల అధికారులకు అనునిత్యం టెన్షనే. తమ పరిధిలో ఉన్న ప్రాంతాలు నిరసనలు, ఆందోళనలు, ముట్టడిలతో అట్టుడికిపోతుంటాయి. ఆయా సమయాల్లో ఆందోళనకారులను అదుపు చేయడానికి, నిర్దేశిత ప్రాంతాల్లో కాపుకాయడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నిరసనకారుల నేపథ్యంలో నగరం మొత్తం ఒకే యూనిట్‌గా పని చేయాలని, ఎక్కడిక్కడ వీరిని కట్టడి చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు సమాచారంతో సరి... ► రాజధాని నగరంలో అనునిత్యం ఏదో ఒక నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వీటిలో కొన్ని పోలీసుల అనుమతులతో జరుగుతుంటే... మరికొన్ని ఎలాంటి సమాచారం లేకుండా హఠాత్తుగా సాగుతుంటాయి. ఈ రెండో తరహాకు చెందిన వాటిపై ఆయా సంస్థలు ముందుగానే ప్రకటనలు చేస్తుంటాయి. అలా కానప్పుడూ నగర పోలీసు నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ సమాచారం సేకరిస్తుంటుంది. ఈ వివరాలను నగరంలోని అన్ని ఠాణాలతో పాటు ప్రత్యేక విభాగాలకు అందిస్తుంటారు. దీని ఆధారంగా దాదాపు ప్రతి పోలీసుస్టేషన్ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేస్తుంటారు. అయితే తమ పరిధి నుంచి వెళ్తున్న నిరసనకారులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేయడానికి మాత్రమే స్థానిక పోలీసులు పరిమితం అవుతున్నారు. ఈ రెండేళ్లూ పెరిగే అవకాశం... ► దీంతో నిరసనకారులంతా తాము నిరసన తెలిపే ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆ స్థానిక పోలీసులే అదుపు చేయడం, అదుపులోకి తీసుకోవడం చేయాల్సి వస్తోంది. ఇది ఒక్కోసారి తలకుమించిన భారంగా మారి అపశృతులకు కారణమవుతోంది. సాధారణంగా ఎన్నికలకు రెండేళ్లు ముందు నుంచి ఈ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న కొత్వాల్ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై నిరసనకారుల విషయంలో ప్రతి ఠాణా అధికారులు స్పందించాలని స్పష్టం చేశారు. వీరిని ఎవరికి వారు, ఎక్కడిక్కడ అదుపులోకి తీసుకుని పరిస్థితులను చక్కదిద్దాలని సూచించారు. మరోపక్క ఏదైనా సంచలనాత్మక నేరం జరిగినప్పుడూ స్థానిక పోలీసులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దాన్ని కొలిక్కితెచ్చే పని ప్రత్యేక విభాగాలదన్నట్లు పట్టించుకోవట్లేదు. ఇకపై ఇలాంటివి కుదరదని, కచ్చితంగా స్థానిక పోసులూ తమ వంతు కృషి చేయాలంటూ కొత్వాల్ ఆనంద్ స్పష్టం చేశారు. వాటి విషయంలో మరింత అప్రమత్తత... ► ప్రభుత్వ నిర్ణయాలతో పాటు అనేక అంశాలపై నిరసన తెలపడానికి సమాయత్తమవుతున్న కొందరు ఆందోళనకారులు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో సామాన్యులకు, ట్రాఫిక్‌కు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని నిర్వాహకులు హామీ ఇస్తున్నారు. వీటికి సంబంధించి పోలీసు అధికారులు సైతం కొన్ని షరతులు విధిస్తున్నారు. అనుమతి వచ్చిన తరవాత చేపట్టే ఈ నిరసనలు ఒక్కోసారి నిర్వాహకులు చేతులు దాటిపోతున్నాయి. నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు చేయడం, రహదారులపైకి వచ్చి వాహనాలు, సామాన్యులకు ఇబ్బంది కలిగించడం, కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విధ్వంసాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా కలెక్టరేట్లతో పాటు మరికొన్ని సున్నిత, కీలక ప్రాంతాల్లో ఈ అపశృతులు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వీటి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు విభాగం నిర్ణయించింది. -
మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ ఫెడ్లర్ టోనీ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: దేశంలో అక్రమంగా నివసిస్తూ ఏడేళ్లుగా డ్రగ్స్ దందా సాగిస్తున్న నైజీరియా డ్రగ్ పెడ్లర్ చుకో ఒబెన్నా డేవిడ్ అలియాస్ టోనీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వివిధ రాష్ట్రాల్లో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న అతన్ని పట్టుకున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. టోనీ నుంచి ఓ కారు, సెల్‌ఫోన్‌తోపాటు 10 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. గురువారం ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలసి ఆయన డ్రగ్ పెడ్లర్ అరెస్ట్ వివరాలను విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నైజీరియాకు చెందిన టోనీ 2013లో తాత్కాలిక వీసాపై ముంబై వచ్చాడు. వీసాతోపాటు పాస్‌పోర్ట్ కాలపరిమితి ముగిసినా అంథేరీ ఈస్ట్‌లో అక్రమంగా నివసిస్తున్నాడు. తొలినాళ్లలో వస్త్ర వ్యాపారం చేయగా సులువుగా అధిక డబ్బు సంపాదనకు డ్రగ్స్ దందా మొదలెట్టాడు. సోషల్ మీడియా, నైజీరియా ఫోన్ నంబర్ ద్వారా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) కాల్స్‌తో అనుచరులను సంప్రదిస్తూ దందా సాగించేవాడు. అతనికి తెలంగాణ, ఏపీతోపాటు గోవా, ఢిల్లీల్లోనూ అనుచరులు ఉన్నారు. వారి సహకారంతో ఆయా ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. లావాదేవీలన్నీ బిట్ కాయిన్స్ రూపంలో జరుగుతుంటాయి. అనుచరులు చిక్కడంతో... హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరాకు ఇమ్రాన్ బాబూఖాన్ కీలకంగా వ్యవహరించాడు. అతనితోపాటు మరికొందరినీ ఈ నెల మొదటి వారంలో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విచారణలో వారు టోనీ పేరు చెప్పడంతో ముంబైలో ఉన్న అతన్ని పట్టుకొనేందుకు సుమారు 10 రోజులు అక్కడే మకాం వేసింది. గత వారం టోనీ నాలుగైదుసార్లు ముంబై, పుణే మధ్య రాకపోకలు సాగించినట్లు సాంకేతిక ఆధారాలు, స్థానిక పోలీసుల సాయంతో టోనీని పట్టుకున్నారు. 9 మంది వినియోగదారులకు చెక్... టోనీని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతని సెల్‌ఫోన్‌ను విశ్లేషించి 13 మంది డ్రగ్స్ వినియోగదారుల వివరాలను సేకరించారు. వారిలో నిరంజన్ కుమార్ జైన్, శాశ్వత్ జైన్, యోగానంద్ అగర్వాల్, బండి భార్గవ్, వెంకట్ చలసాని, తమ్మినేడి సాగర్లను పట్టుకున్నారు. వారంతా సంపన్నుల బిడ్డలే కావడం గమనార్హం. ఒక్కొక్కరి ఆస్తి రూ. 100 కోట్ల నుంచి రూ. 1,000 కోట్ల వరకు ఉంటుందని సీవీ ఆనంద్ వెల్లడించారు. టోనీకి నైజీరియాలో ఉంటున్న స్టార్ బోయ్ అనే వ్యక్తి ఓడల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని పూర్తి వివరాలు టోనీకి కూడా తెలియవని చెప్పారు. సహకరించిన ఆఫీస్ బాయ్స్ అరెస్టు... డ్రగ్స్ కొనుగోలు కోసం వెంకట్ చలసాని, నిరంజన్ జైన్ తమ కార్యాలయాల్లో ఆఫీస్ బాయ్స్‌గా పనిచేస్తున్న అల్గాని శ్రీకాంత్, గోడి సుబ్బారావుల ఫోన్లు వాడారు. అయితే ఈ విషయం తెలిసినా తమ ఫోన్లు ఇచ్చి సహకరించినందుకు ఆ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. కాగా, డ్రగ్స్ వినియోగదారుల్లో సినీ ప్రముఖులు ఉన్నట్లు తేలినా ఈసారి వదిలేది లేదని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. చదవండి: తెలంగాణలో మరో భారీ నిధుల గోల్మాల్ -
టోనీ మొదట గార్మెంట్ బిజినెస్ చేశాడు: సీవీ ఆనంద్
-
పేరు పెట్టమన్న హైదరాబాద్ సీపీ.. ఆ పోస్టుకు అనూహ్య స్పందన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికే తలమానికంగా బంజారాహిల్స్‌లో రూపుదిద్దుకుంటున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు (సీసీసీ) పేరు సూచించాలంటూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నెటిజనులను కోరారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీసు అధికారిక ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశారు. రోడ్ నం.12లో 20 అంతస్తుల ఎత్తుతో నిర్మితమవుతున్న ఈ భవనాన్ని ప్రస్తుతం ట్విన్ టవర్స్‌గా పిలుస్తున్నాయి. అయితే వాస్తవంగా ఇందులో మొత్తం నాలుగు టవర్స్ ఉంటాయని పోలీసులు తెలిపారు. కేవలం హైదరాబాద్ పోలీసుకే కాకుండా తెలంగాణ పోలీసు విభాగానికే ఇది కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌గా పనిచేస్తుందని స్పష్టం చేసిన ఆనంద్... ఆ మేరకు సరైన పేరు సూచించాలని కోరారు. చదవండి: మళ్లీ లాక్‌డౌనా అనేలా హైదరాబాద్ పరిస్థితి ఈ పోస్టుకు నెటిజనుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. పోస్ట్ చేసిన ఐదు గంటల్లోనే 1500 మంది లైక్ చేయగా...1100 మంది వివిధ పేర్లను సూచించారు. కమాండో హిల్స్, 4 లయన్స్, సీ4, ఫెడ రల్ టవర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ (ఎఫ్‌టీటీ ఎస్), చార్మినార్ ప్రొటెక్షన్ సెంటర్ (సీపీసీ) తదితర పేర్లను నెటిజనులు సూచించారు. మా ర్చి 31లోగా నిర్మాణం పూర్తి చేసి, సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆనంద్ ఇటీవలే కాంట్రాక్టర్‌కు సూచించిన విషయం విదితమే. -
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ముంబైకి చెందిన ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు రూ. 16లక్షల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ..హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నామని, ముంబై గ్యాంగ్‌లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఒక విదేశీయుడు సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నూతన సంవత్సర వేడుకల కోసం హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకువచ్చారని, అయితే స్పెషల్ ఆపరేషన్‌లో డ్రగ్స్ ముఠాలు పట్టుబడ్డాయని పేర్కొన్నారు. రూ. 16లక్షల కొకైన్, ఎండీఎం,ఎల్ఎస్డీ బోల్ట్స్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కీలకమైన నిందితుడు నైజీరియన్ టోనీ పరారీలో ఉన్నాడని తెలిపారు. ముంబై అడ్డాగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, పలు రాష్ట్రాల్లో ఏజంట్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్ సప్లై చేస్తున్నారని తెలిపారు. ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నారో గుర్తించామని, వారిలో మార్పు రావటం లేదని తెలిపారు. కొనుగొలు చేసిన ఆరుగురిని గుర్తించామని పేర్కొన్నారు. సెక్షన్ 27 ప్రకారం చర్యలు చేపడతామని చెప్పారు. తల్లిదండ్రులతో సంప్రదించి కౌన్సిలింగ్ ఇస్తామని పేర్కొన్నారు. చాలా మంది డ్రగ్స్ కన్జూమర్స్ ఉన్నారుని గుర్తిస్తున్నామని తెలిపారు. -
నగరానికి నయా పోలీస్ బాస్.. సీవీ ఆనంద్ గురించి ఆసక్తికర విశేషాలు..
నగర నయా పోలీస్ బాస్ సీవీ ఆనంద్.. ఇక్కడే పుట్టారు. ఇక్కడే పెరిగారు. ఆదర్శ్‌నగర్‌లో వారి ఇల్లు ఉండేది. అక్కడ నుంచి తరచూ ట్యాంక్‌బండ్ మీదకు వెళ్లేవారు. ఆ సందర్భాల్లోనే హుస్సేన్‌సాగర్‌లో అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. సెంట్రల్ జోన్ డీసీపీగా పని చేస్తున్నప్పుడు 2002లో లేక్ పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. సాగర్ చుట్టూ నిఘా, గస్తీతో పాటు అవగాహన బోర్డులు, తొలిసారిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆత్మహత్యల నివారణలో తనదైన శైలితో ముందుకెళ్లారు. ప్రస్తుతం సిటీ సీపీగా కొత్త బాధ్యతలతో శాంతిభద్రతల పరిరక్షణకు గట్టిగా కృషిచేస్తానంటున్నారాయన. ప్రజల శ్రేయోభిలాషిగా నిలుస్తానంటున్నారు ఆనంద్. సిటీ కమిషనర్‌గా రావడం ఆనందంగా ఉందన్నారు. శనివారం బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఏసీబీ డీజీగా వెళ్తున్న అంజనీకుమార్ ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా ఆనంద్ ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. – సాక్షి, హైదరాబాద్ సిటీపై పట్టుంది.. నేను సిటీలోనే పుట్టి పెరిగాను. ఇక్కడే చదువుకున్నా. నగరంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈస్ట్‌జోన్ డీసీపీ, సెంట్రల్ జోన్ తొలి డీసీపీగా, ఆపై ట్రాఫిక్ విభాగం అదనపు సీపీగా పని చేశా. ఇలా వివిధ హోదాల్లో, వివిధ విభాగాల్లో పని చేసిన నేపథ్యంలో సిటీపై పట్టు ఉంది. ఇటీవల కాలంలో నాలుగైదేళ్లు కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై విధులు నిర్విర్తించి తిరిగి వచ్చా. చదవండి: కొడుకుల ప్రోత్సాహంతో.. పెళ్లైన 25 ఏళ్లకు మళ్లీ పెళ్లి..! ట్రాఫిక్ నిర్వహణకు ప్రధానం.. ► పోలీసు విభాగానికి సంబంధించి ప్రతి రోజూ నేరుగా ఎక్కువ మంది ప్రజలతో సంబంధాలు కలిగి ఉండేది ట్రాఫిక్ వింగ్. వీళ్లు తీసుకునే ప్రతీ చర్యతో వేలాది మంది వాహనచోదకులు, లక్షలాది నగర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ నిర్వహణకు కీలక ప్రాధాన్యమిస్తాం. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల భద్రతకూ పెద్ద పీట వేస్తాం. ఇప్పటికే అమలులో ఉన్న విధానాలను కొనసాగిస్తూ భవిష్యత్తు ప్రణాళికలు ఉంటాయి. నేరాల నిరోధానికి యాక్షన్ ప్లాన్.. ►ప్రస్తుతం సైబర్ నేరాలను నానాటికీ పెరిగిపోతున్నాయి. వీటిని నిరోధించడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడంతో పాటు కేసుల్ని కొలిక్కి తీసుకురావడానికి సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తాం. పెట్రోలింగ్ వ్యవస్థ, సీసీటీవీ కెమెరాలు, కొత్త టెక్నాలజీతో కేసులను ఛేదిస్తాం. సొత్తు సంబంధిత నేరాలు, చైన్ స్నాచింగ్స్ నిరోధించేందుకు చర్యలు తీసుకుంటాం. మహిళా భద్రత కోసం ఉన్న షీ–టీమ్స్ మరింత బలోపేతం చేస్తాం. చదవండి: చలనాల నుంచి తప్పించుకోవాంటే.. మాస్క్ ఫర్ నంబర్ ప్లేట్! ►మూడేళ్ల మూడు నెలల పాటు నగర ట్రాఫిక్ అదనపు సీపీ పని చేశా. ఆ సందర్భంలో అనేక తీవ్రమైన ప్రమాదాలకు డ్రంక్ డ్రైవింగే కారణంగా గుర్తించా. దీని వల్ల వాహనచోదకులతో పాటు ఎదుటి వారికీ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ట్రాఫిక్ విభాగంలో అనునిత్యం అవసరమైన చర్యలు తీసుకుంటాం. హైకోర్టు ఆదేశాలకనుగుణంగానే న్యూ ఇయర్ వేడుకలు.. ► ఒమిక్రాన్ వేరియంట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ అంత తీవ్రత లేకున్నా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర పరిస్థితులు ఉన్నాయి. నూతన సంవత్సర వేడుకలపై హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ఈ అంశంలో ప్రభుత్వం సూచించిన విధంగా ముందుకు వెళ్తాం. న్యూ ఇయర్ వేడుకలు ప్రతిసారీ వస్తాయి, పోతాయి. కానీ ప్రాణాలు అత్యంత విలువైనవి. ఈ నేపథ్యంలోనే అందరూ కరోనా నిబంధనలు తప్పక పాటించాలి. -
అంజనీకుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
-
హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ నియామకం
-
హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌ను అవి నీతి నిరోధక విభాగం (ఏసీబీ) డీజీగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో నగర పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ను నియమించింది. అలాగే రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 11 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. ఐపీఎస్‌ల బదిలీల వివరాలివీ.. -
హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్.. 30 మంది ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసినట్లు పేర్కొంది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్, ఏసీబీ డీజీగా అంజనీకుమార్, ఏసీబీ డైరెక్టర్‌గా శిఖా గోయల్, హైదరాబాద్ జాయింట్ సీపీ (క్రైమ్స్)గా ఏఅర్ శ్రీనివాస్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా రంగనాథ్, నల్గొండ ఎస్పీగా రామ రాజేశ్వరి, సిద్దిపేట్ సీపీగా శ్వేత, హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా జోయల్ డేవిస్, మెదక్ ఎస్పీగా రోహిణి ప్రియదర్శిని, సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్)గా కల్మేశ్వర్, సైబరాబాద్ జాయింట్ సీపీగా అవినాష్ మహంతి, హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా చందనా దీప్తి, హైదరాబాద్ సీసీఎస్ డీసీపీగా గజరావు భూపాల్, హైదరాబాద్ ఎస్బీఐ జాయింట్ సీపీగా విశ్వప్రసాద్, వికారాబాద్ ఎస్పీగా కోటిరెడ్డి, నిజామాబాద్ సీపీగా నాగరాజు, అదిలాబాద్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, మాదాపూర్ జోన్ డీసీపీగా శిల్పవల్లి, బాలానగర్ డీసీపీగా సందీప్ గొనె, శంషాబాద్ డీసీపీగా జగదీష్ రెడ్డి, హైదరాబాద్ కార్ హెడ్ క్వాటర్ జాయింట్ సీపీగా కార్తికేయ, మహబూబాబాద్ ఎస్పీగా శరత్ చంద్ర పవార్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ 1గా ప్రకాష్ రెడ్డి, ఆసిఫాబాద్ ఎస్పీగా సురేష్ కుమార్, నిర్మల్ ఎస్పీగా ప్రవీణ్ కుమార్, నాగర్ కర్నూల్ ఎస్పీగా మనోహర్, కామారెడ్డి ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా సురేందర్ రెడ్డి, జనగాం డీసీపీగా సీతారామ్, నారాయణ్‌పేట్ ఎస్పీగా ఎన్ వెంకటేశ్వర్లును నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. -
సీవీ ఆనంద్ పేరుతో డబ్బు వసూళ్లు!
సాక్షి, మహబూబ్‌నగర్: గతంలో హైదరాబాద్ పోలీస్ మాజీ కమిషనర్‌గా పనిచేసిన సీవీ ఆనంద్ పేరుతో నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా కొందరు పోలీసులకు ఫోన్ చేసి డబ్బు వసూళ్లకు పాల్పడ్డాడు. అలాగే కొందరు రాజకీయ నాయకులకు సదరు వ్యక్తి నేరుగా ఫోన్ చేసి డబ్బులు పంపించాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొందరు పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులతోనూ డబ్బులు కావాలని అడిగినట్టు తెలిసింది. ఇటీవల ఓ వ్యక్తితో రూ.ఐదు లక్షలు వసూలు చేసినట్టు మహబూబ్‌నగర్ పోలీసులు గుర్తించారు. దీనిపై వారు లోతైన విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఒక్కడి హస్తమే ఉందా.. ఇంకా ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్నారు. దీనిపై మహబూబ్‌నగర్ డీఎస్పీ శ్రీధర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా సీవీ ఆనంద్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న విషయం వాస్తవమేనని, దీనిపై రెండు, మూడు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
ఎన్టీపీసీ బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్ : ఎన్టీపీసీ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (దక్షిణ)గా సీవీ ఆనంద్ హైదరాబాద్‌లో శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన ఎన్టీపీసీ పశ్చిమ ప్రాంత రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ముంబైలో పనిచేశారు. అదే సమయంలో దక్షిణ ప్రాంత ఆర్ఈడీగానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందిన సీవీ ఆనంద్ 1983లో ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనీగా చేరారు. సుదీర్ఘ కెరీర్లో ఆయన ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ల నిర్వహణ, ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించారు. చదవండి : సర్వే ఆధారంగానే లాక్‌డౌన్‌పై నిర్ణయం -
విజేత సీవీ ఆనంద్
సాక్షి, విశాఖ స్పోర్ట్స్: రెండు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆలిండియా పోలీసు టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ప్లేయర్‌కు పురుషుల సింగిల్స్ టైటిల్ లభించింది. వైజాగ్‌లో ఆదివారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి, సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) సీవీ ఆనంద్ చాంపియన్‌గా అవతరించారు. సీఐఎస్ఎఫ్ తరఫున బరిలోకి దిగిన ఆనంద్ ఫైనల్లో 8–4తో సత్యనారాయణ (ఆంధ్రప్రదేశ్)పై విజయం సాధించారు. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆనంద్ సెమీఫైనల్లో శైలేశ్ కుమార్ (బీఎస్ఎఫ్)ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించారు. గత 20 ఏళ్లలో ఆలిండియా పోలీసు టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో సీఐఎస్ఎఫ్కు ఓ విభాగంలో టైటిల్ లభించడం ఇదే ప్రథమం. టీమ్ చాంపియన్íÙప్ విభాగంలో సీఆర్పీఎఫ్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఐటీబీపీపై సీఆర్పీఎఫ్ గెలిచింది. నాలుగు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో 19 జట్ల నుంచి 103 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సావంగ్, ఐబీ స్పెషల్ డైరెక్టర్ అలోక్ ప్రభాకర్, విశాఖపట్నం పోలీసు కమిషనర్ ఆర్కే మీనా తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో సూపర్
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి హత్యాచారాలు వెలుగులోకి రావడంలో రాచకొండ పోలీసు కమిషనరేట్ చేపట్టిన ప్రజాదర్బార్ పాత్ర కీలకం. శ్రావణి అదృశ్యంపై ఇచ్చిన ఫిర్యాదును బొమ్మల రామారం పోలీసులు తేలిగ్గా తీసుకోవడంతో మొదలైన హాజీపూ ర్ గ్రామస్తుల ఆందోళన ‘ప్రజాదర్బార్’కు ఫిర్యాదుగా చేరింది. దీంతో వెంటనే అక్కడి ఎస్సై వెంకటేశ్‌ను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. అదనపు బృందాలతో కేసు విచారణ జరిపి నిందితుడు శ్రీనివాసరెడ్డిని స్వల్ప వ్యవధిలోనే అరెస్టు చేశారు. రిటైర్డ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావుకు కుంట్లూరు గ్రామంలో ఉన్న భూమిని కొంతమంది కబ్జా చేయడంతో ప్రజా దర్బార్‌లో సీపీ మహేష్ భగవత్‌ను కలిసి వివరించారు. వెంటనే సీపీ మహేష్ భగవత్ సంబంధిత పోలీసు అధికారులను కేసు విచారణకు ఆదేశించారు. ఆ ప్లాట్ నాగేశ్వరరావు భార్య జ్యోతి పేరుపై ఉండటంతో ఆమె మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి ఎస్ఆర్వో కార్యాలయం నుంచి సేల్‌డీడ్ సర్టిఫైడ్ కాపీలు పొందారు. దీని ద్వారా ఆ ప్లాట్‌ను ఇతరులకు విక్రయించారని విచారణలో తేలడంతో నిందితులను అరెస్టు చేశారు. సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనర్ నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్’బాధితులకు న్యాయం చేయడంతో పాటు సంచలన కేసుల పరిష్కారానికి వేదికగా మారింది. భూకబ్జాలు, హత్యలతో పాటు వివిధ కేసుల్లో ఠాణాలో న్యాయం జరగని పక్షంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ తలుపు తడితే విచారణలో వేగం పెరిగి బాధితులకు న్యాయం జరుగుతోంది. ఇలా రాచకొండ కమిషనరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ బాధితులకు ఆపన్నహస్తం అందిస్తోంది. సైబరాబాద్ విభజన అనంతరం ఏర్పాటైన ఈ కమిషనరేట్‌లో ఈ ప్రయోగం సత్ఫలితాలిస్తోంది. విభజన అనంతరం విస్తీర్ణపరంగా దేశంలోనే అతిపెద్ద కమిషనరేట్‌గా అవతరించిన నేపథ్యంలో కమిషనర్ మహేష్ భగవత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కమిషనరేట్‌లో 3జోన్ల ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వారంలో ఒకరోజు ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా డీసీపీ కార్యాలయాల్లోనే అందుబాటులో ఉంటూ ఫిర్యాదులను స్వీకరించారు. ఆ ఫిర్యాదులను చట్టపరంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయం కొన్ని నెలల క్రితం నేరేడ్మెట్కు మారినా సీపీ మహేష్ భగవత్ మాత్రం ప్రతి మంగళవారం ఎల్బీనగర్లో ప్రజాదర్బార్‌ను కొనసాగిస్తున్నారు. మూడేళ్లలో ‘4సీ’కి వచ్చిన ఫిర్యాదులు 591 పోలీసు స్టేషన్లలో బాధితులకు న్యాయం జరగని పక్షంలో కమిషనర్‌ను కలిసేందుకు ఉమ్మడి సైబరాబాద్ కమిషనరేట్‌లో అప్పటి సీపీ సీవీ ఆనంద్ ‘4సీ’సెల్‌ను ఏర్పాటుచేశారు. అప్పట్లో కమిషనర్‌ను నేరుగా కలిసేందుకు అవకాశం ఉండేది కాదు. ఠాణాలో ఎస్‌హెచ్‌వో స్పందించుకుంటే ఆ తర్వాత ఏసీపీ, డీసీపీని కలవాల్సి వచ్చేది. అక్కడా చర్యలు లేకుంటేనే కమిషనరేట్‌లోని ‘4సీ’విభాగంలో ఫిర్యాదు స్వీకరించేవారు. అప్పుడే కమిషనర్‌ను కలిసి పరిస్థితి వివరించే అవకాశం ఉండేది. అయితే ఏసీపీ, డీసీపీలను కలవకున్నా నేరుగా ప్రజాదర్బార్‌లో పోలీసు కమిషనర్‌ను కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దీంతో కమిషనరేట్‌లోని ‘4సీ’విభాగానికి కొంతమేర ఫిర్యాదులు తగ్గుతున్నాయి. మూడేళ్లలో ‘4సీ’కి 591 ఫిర్యాదులు వస్తే 415 పరిష్కారమయ్యాయి. మిగతావి వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. దర్యాప్తు వేగిరంగా.. నిష్పక్షపాతంగా తన దృష్టికి వచ్చే ఫిర్యాదులపై కమిషనర్ తక్షణమే స్పందిస్తున్నారు. చట్టపరిధిలో అందుకు తగిన చర్యలు తీసుకునేలా సంబంధిత ఠాణాల ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అనంతరం దర్యాప్తు పురోగతి క్రమాన్ని సంబంధిత పోలీసు ఇన్స్పెక్టర్కు కమిషనర్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. ఠాణాల్లో ఫిర్యాదు చేసినా స్పందన లేని కేసుల్లో తీవ్రతను బట్టి అవసరమైతే దర్యాప్తు బాధ్యతను ఆ ఠాణాకు సంబంధం లేని అధికారులకు అప్పగిస్తున్నారు. ఈ కేసుల్నీ కమిషనర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న దృష్ట్యా దర్యాప్తు వేగిరంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు అస్కారం ఏర్పడుతోంది. ఈ విధంగా ప్రజాదర్బార్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా భూకబ్జా కేసులే ఎక్కువగా ఉండటంతో ఎస్వోపీ నిబంధనల ప్రకారం బాధితులకు న్యాయం చేసేందుకు కమిషనర్ చొరవ చూపుతున్నారు. -
ఏపీ పోలీసులు, సీఐఎస్ఎఫ్ వాదులాట
-
మీదే బాధ్యత.. కాదు మీదే బాధ్యత!
సాక్షి, విశాఖపట్నం: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలో అందరూ చూస్తుండగా సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. కోడి పందేలకు వాడే పదునైన కత్తితో జననేతపై దాడి చేయడం తీవ్ర ఆందోళన కలిగించింది. భద్రతా వైఫల్యంతో విపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగితే పోలీసులు, కేంద్ర పరిశ్రమల రక్షణ దళం (సీఐఎస్ఎఫ్) ఉన్నతాధికారులు మాత్రం బాధ్యతారహితంగా సమాధానమిచ్చారు. రక్షణ బాధ్యత తమది కాదంటే తమది కాదని దోబూచులాడుతున్నాయి. భద్రతా వైఫ్యలమే లేదన్నట్టుగా బీరాలు పలికారు. మాకు సంబంధం లేదు: డీజీపీ విమానాశ్రయంలో భద్రత పర్యవేక్షణ అంతా సీఐఎస్ఎఫ్ పరిధిలో ఉంటుందని, తమకు సంబంధం లేదని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్వయంగా విలేకరుల సమావేశంలో చెప్పారు. ఎయిర్‌పోర్టు లోపల తమకు పని లేదని, అక్కడ ఏం జరిగినా సీఐఎస్ఎఫ్ చూసుకుంటుందని అన్నారు. విమానాశ్రయంలోని కత్తిని ఎలా తీసుకెళ్లారనేది దర్యాప్తులో తేలుస్తామన్నారు. సీఐఎస్ఎఫ్ రిపోర్ట్ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. మాకేం పట్టింది: సీఐఎస్ఎఫ్ డీజీ సీఐఎస్ఎఫ్ డీజీ సీవీ ఆనంద్ మాత్రం ఈ ఘటనతో తమకు సంబంధం లేదని, తమ వైఫల్యం ఏమాత్రం లేదని చెప్పుకొచ్చారు. ఎంట్రన్స్ దగ్గర ఎవరైనా లోపలికి వెళ్లొచ్చని పేర్కొన్నారు. తమ సిబ్బంది ప్రయాణికుల గుర్తింపు కార్డులు, టిక్కెట్లు మాత్రమే పరిశీలిస్తారని చెప్పారు. లగేజీ చెక్ చేయరని అన్నారు. ప్రయాణికుల వ్యక్తిగత భద్రత తమ పరిధిలోకి రాదని, చెక్ ఇన్ ఏరియాకు ఎవరైనా వెళ్లొచ్చని వివరించారు. ప్రపంచంలోని అన్ని విమానాశ్రయాల్లో ఇదే పద్ధతి కొనసాగుతోందన్నారు. ఎయిర్పోర్ట్ సిబ్బందికి ఏఈపీ పాస్ ఉంటుందని, వీరిని చెక్ చేయమని వెల్లడించారు. ఎంట్రన్స్ దగ్గర ఎవరైనా లోపలికి వెళ్లొచ్చని, దీనిపై ఏవివేయన్ సెక్యురిటీ సెమినార్‌లోనూ ఆందోళన వ్యక్తం చేసినట్టు ఆనంద్ తెలిపారు. పోలీసుల ద్వంద్వ వైఖరి పోలీసులు, సీఐఎస్ఎఫ్ కప్పదాటు వైఖరిపై వైఎస్సార్ సీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తీరు సరిగా లేదని మండిపడుతున్నారు. వైఎస్ జగన్‌పై ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం తమ పరిధిలోనికి రాదని చెబుతున్న డీజీపీ.. గతంలో ప్రత్యేక హోదా ర్యాలీ కోసం విశాఖపట్నం వెళ్తున్నప్పుడు వైఎస్ జగన్‌ను ఎయిర్‌పోర్టు రన్‌వే పోలీసులు అడ్డుకున్న విషయం గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడొక న్యాయం, ఇప్పుడొక న్యాయమా అని నిలదీస్తున్నారు. దర్యాప్తును పక్కదారి పట్టించేలా డీజీపీ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి సూత్రధారులను కోర్టు బోనెక్కించాలని డిమాండ్ చేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. సంబంధిత కథనాలు: వైఎస్ జగన్‌పై హత్యాయత్నం! సెల్ఫీ తీసుకుంటానని నవ్వూతూ వచ్చాడు.. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం; లోతైన దర్యాప్తు పథకం ప్రకారమే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం! ‘ఎయిర్‌పోర్టులోకి కత్తులు అనుమతిస్తారా?’ ఇది పిరికిపందల చర్య: ఓవైసీ నిందితుడి జేబులో లెటర్ : పథకం ప్రకారమే దాడి -
సీవీ ఆనంద్‌కు ఎయిర్‌పోర్టుల రక్షణ
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధి కారి సీవీ ఆనంద్‌ను దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల విమానాశ్రయాల భద్రతా విభాగం ఐజీగా సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూ రిటీ ఫోర్స్) నియమించింది. ఇటీవలే డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిన ఆయనకు.. హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టుల భద్రత బాధ్యతను అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువరించింది. దేశంలో 80కి పైగా విమానాశ్రయాలకు సీఐఎస్ఎఫ్ భద్రత అందిస్తోంది. గుజరాత్, రాజస్తాన్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని 12 అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు లు, మరో 18 జాతీయ విమానాశ్రయాల భద్రతను ఆనంద్ పర్యవేక్షించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా.. ఇదివరకు ఎయిర్‌పోర్టుల భద్రతను పర్య వేక్షించేందుకు కేవలం అదనపు డీజీపీ, ఒక ఐజీ పోస్టు మాత్రమే సీఐఎస్ఎఫ్లో ఉండేది. నెల క్రితం మరో ఐజీ పోస్టును సృష్టించిన సీఐఎస్ఎఫ్.. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల విమానాశ్రయాల భద్రతను ఆనంద్‌కు అప్పగించింది. ఆయన హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు కేంద్రంగా దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టుల భద్రతను పర్యవేక్షించనున్నారు. -
‘ఎక్కడి నుంచైనా రేషన్’కు అనూహ్య స్పందన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునే రేషన్ పోర్టబిలిటీ విధానానికి లబ్ధిదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తొలిరోజు వెయ్యిమంది పోర్టబిలిటీ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. రాష్ట్రంలో ఒక జిల్లాలో రేషన్ కార్డుంటే, మరో జిల్లాలో ఎక్కడి నుంచైనా రేషన్ బియ్యం తీసుకునే విధానానికి పౌర సరఫరాల శాఖ ఆదివారం నుంచి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వలసలు వెళ్లిన వారు, ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉన్నప్పుడు ఈ పోర్టబిలిటీ పద్ధతి ఉపయోగపడనుంది. రాష్ట్రంలో 17,027 రేషన్ షాపులకుగాను ఆదివారం 5 వేల షాపుల్లో 1.33 లక్షల లావాదేవీలు జరిగాయి. ఇందులో జిల్లా పరిధిలో 13,623 పోర్టబిలిటీ లావాదేవీలు జరగ్గా, రాష్ట్రంలో వివిధ జిల్లాల మధ్య వెయ్యి మంది పోర్టబిలిటీ ద్వారా సరుకులు తీసుకున్నారని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్‌లో 157, మేడ్చల్‌లో 253, రంగారెడ్డిలో 173 మంది అత్యధికంగా రేషన్ పోర్టబిలిటీ విధానాన్ని వినియోగించుకున్నారు. రేషన్ పోర్టబిలిటీపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. -
తెలంగాణలో ఎక్కడ నుంచైనా రేషన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్‌ను తీసుకునే వీలుగా పలు మార్పులు తీసుకువచ్చింది. ఇక నుంచి నిత్యావసర వస్తువులను ఎక్కడి నుంచైనా ( పోర్టబిలిటీ) తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.వి ఆనంద్ తెలిపారు. రేషన్ తీసుకోకపోయినా కార్డును రద్దుచేసే విధానానికి తెలంగాణ ప్రభుత్వం స్వస్తి చెప్పింది. దీని ద్వారా రాష్ట్రంలోని 2.75 కోట్ల మంది పేదలకు ప్రయోజనం కలుగనుంది. ఈ విధానం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్నట్లు కమిషనర్ తెలిపారు. -
19 నెలల్లో 1,900 కోట్లు ఆదా
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాలశాఖలో సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. 19 నెలల క్రితం ఆ శాఖ కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించాక సంస్కరణలు మొదలయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన చేపట్టిన సంస్కరణలు పలువురి ప్రశంసలు పొందాయి. ఆన్లైన్ ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు, చెల్లింపులు, కమాండ్ కంట్రోల్ సెంటర్, గోదాముల్లో సీసీ కెమెరాలు, టీ–రేషన్ యాప్, రేషన్ షాపుల్లో ఈ–పాస్ యంత్రాలు, జిల్లాల్లో మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రేషన్ పోర్టబిలిటీ వంటి చర్యలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచాయి. ఈ సంస్కరణలతో 19 నెలల్లో ఏకంగా రూ. 1,900 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదా జరిగింది. నిఘా బృందాలతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు. కాకినాడ పోర్టు ద్వారా బియ్యం అక్రమ రవాణాకు ముగింపు పలికారు. అక్రమంగా రేషన్ బియ్యం అమ్ముకుంటున్న ఆరుగురు వ్యాపారులపై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపించారు. రేషన్ సరుకులు తరలించే వాహనాలకు జీపీఎస్ యంత్రాలను అమర్చారు. 171 గోదాముల్లో 17,200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిని జిల్లా కేంద్రాల్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు, హైదరాబాద్‌లోని కేంద్ర కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించి బియ్యం అక్రమ రవాణా, గోదాముల్లో అక్రమాలకు చెక్ పెట్టారు. రేషన్ లబ్ధిదారులు తమ జిల్లాలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకునేలా పోర్టబిలిటీ విధానాన్ని తీసుకొచ్చారు. త్వరలో రాష్ట్రంలో ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకునేలా పోర్టబిలిటీ విధానాన్ని విస్తరించనున్నారు. రాష్ట్రంలో 17,200 రేషన్ షాపుల్లో ఈ–పాస్ యంత్రాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ. 800 కోట్ల వరకు ఆదా అవుతోంది. కార్డుదారులకు త్వరితగతిన సరుకులు అందించడానికి వీలుగా ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు సరుకులు పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టారు. ఆన్లైన్లో కనీస మద్దతు ద్వారా రైతుల నుంచి నేరుగా కొనుగోలు, చెల్లింపుల విధానం ప్రాచుర్యం పొందింది. 2016–17 ఖరీఫ్, రబీ, ఈ ఏడాది ఖరీఫ్‌లో 15 లక్షల మంది రైతుల నుంచి రూ. 11 వేల కోట్ల విలువ చేసే 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సాంకేతికతతో అక్రమాలకు అడ్డుకట్ట వేశాం రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. నిత్యావసర సరుకుల పంపిణీలో అక్రమాలు అరికట్టేందుకు బయోమెట్రిక్, సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సత్ఫలితాలను సాధించాం. సరుకుల సరఫరా నుంచి పంపిణీ వరకు మొత్తం ఆన్లైన్ ద్వారా లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకున్నాం. అర్హులైన పేదలందరికీ సక్రమంగా సరుకులు అందివ్వగలుగుతున్నాం. సాంకేతికతతో అక్రమాలను అరికడుతూనే నిఘా వ్యవస్థను పటిష్టం చేశాం. – సీవీ ఆనంద్, పౌర సరఫరాలశాఖ కమిషనర్ -
వినియోగదారులకు ప్రత్యేక విభాగం ఉండాలి
సాక్షి, హైదరాబాద్: కేంద్రం మాదిరిగానే రాష్ట్రాల్లోనూ వినియోగదారులకు ప్రత్యేక విభాగం ఉంటే బాగుంటుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ అభిప్రాయపడ్డారు. వినియోగదారులు తమ హక్కులు, బాధ్యతల పట్ల చైతన్యం కలిగి ఉన్నప్పుడే నేరాలకు త్వరితగతిన అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వానికి మార్గం సులువవుతుందని అన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంపై వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. గురువారం పౌరసరఫరాల భవన్లో ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘వినియోగ తరంగిణి’ప్రత్యేక సంచికను ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. 30 ఏళ్ల క్రితం జాతీయ వినియోగదారుల చట్టం ఏర్పడిందని, అప్పటి నుంచి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలతోపాటు, ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఆన్లైన్ షాపింగ్ లావాదేవీలలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వినియోగదారుల రక్షణకు చట్టంలో మార్పులు తీసుకురావాల్సి ఉందన్నారు. జీఎస్టీ పేరుతో వినియోగదారుల నుంచి ఎంఆర్పీకి అదనంగా వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న హోటల్స్, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి దాదాపు 1,400 వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేసి రూ.50 లక్షల పెనాల్టీ వసూలు చేశామన్నారు. వినియోగదారుల రక్షణకు చట్టాలున్నాయని, నష్టం జరిగితే, మోసపోతే పరిహారం పొందడానికి అవకాశాలు ఉన్నాయని, ఇందుకు చట్టపరంగా యంత్రాంగం ఉందని తెలిపారు. -
పేదలకు కడుపు నిండా అన్నం
సాక్షి, సిద్దిపేట: పేదలకు కడుపు నిండా అన్నం పెట్టి దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయడమే ప్రభుత్వ లక్ష్యమని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లాలో పాస్‌పోర్టు సెం టర్ను ఆయన ప్రారంభించారు. అనంతరం పౌర సరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్‌తో కలిసి సివిల్ సప్లై కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గతంలో పౌర సరఫరాల శాఖ నుంచి రైళ్లల్లో, ట్రక్కుల్లో బియ్యం అక్రమంగా తరలివెళ్లేవని, దీనిని అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, కమిషనర్ సీవీ ఆనంద్ విప్లవాత్మక మార్పులు తెచ్చారని అభినందించారు. ఈ–పాస్ విధానం ద్వారా బినామీలు రేషన్ పొందకుండా చెక్ పెట్టామన్నారు. దీంతో ఏటా రూ.500 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదా అవుతోందని చెప్పారు. ఈ నిధులు పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టల్స్‌కు సన్న బియ్యం సరఫరాకు ఉపయోగపడుతున్నాయన్నారు. బియ్యం అక్రమ రవాణా అరికట్టడం కోసం కమాండ్ అండ్ కంట్రోల్ రూం ప్రారంభించామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఈ విధానం మంచి ఫలితాలను ఇచ్చిందని, ఇప్పుడు సిద్దిపేటలో ప్రారంభించామని, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తృతం చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 171 ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద 17 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, వాహనాలకు జీపీఎస్ అమర్చడంతో అక్రమాలను అడ్డుకట్ట వేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. డీలర్ల సమస్య సీఎం దృష్టికి.. రాష్ట్రంలో రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు డీలర్ల సంఘం నాయకులు దృష్టికి తెచ్చారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు. డీలర్ల సమస్యను పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎం సమక్షంలో చర్చించి పరిష్కరిస్తామన్నారు. అక్రమ రవాణాకు చెక్: ఆనంద్ రాష్ట్రం నుంచి రేషన్ బియ్యం కాకినాడ మీదుగా ఇతర దేశాలకు అక్రమ రవాణా అవుతోందంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో బియ్యం పక్కదారి పట్టకుండా కమాండ్ అండ్ కంట్రోల్ విధానం ప్రారంభించామని రాష్ట్ర సివిల్ సప్లయ్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. జిల్లాలోని అన్ని మెయిన్ గోదాంలు, ఎంఎల్ఎస్ పాయింట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిజమైన లబ్ధిదారులకే బియ్యం సరఫరా చేయాలనే ఆలోచనతో రాష్ట్రవ్యాప్తంగా 17 వేల రేషన్ షాపుల్లో ఈ పాస్ విధానం అమలు చేస్తున్నామన్నారు. వేలిముద్రలు పడనివారి కోసం త్వరలో ఐరిస్ విధానం తీసుకొస్తామన్నారు. -
సాంకేతికతతో అక్రమాలకు అడ్డుకట్ట
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంత వరకు ఉపయోగించుకుని పారదర్శకత, జవాబుదారీతనం, సత్వర ఫలితాలే లక్ష్యంగా పౌరసరఫరాల శాఖలో చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సాంకేతికత ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా, రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసిందన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న 21వ జాతీయ ఈ–గవర్నెన్స్ సదస్సులో మంగళవారం, సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను, సంస్కరణలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కమిషనర్ వివరించారు. జాతీయ ఆహార భద్రత కార్డుదారులకు కేంద్రం ఒక్కో వ్యక్తికి నెలకు కిలో మూడు రూపాయలకు ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని సరఫరా చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కుటుంబంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున కిలో ఒక్క రూపాయికే సరఫరా చేస్తుందన్నారు. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2.75 కోట్ల మంది లబ్ధిపొందుతున్నారన్నారు. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే నిత్యావసర సరుకులు పక్క దారి పట్టకుండా అర్హులకు అందేలా సరఫరా నుండి పంపిణీ వరకు కంప్యూటరీకరణ, రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ మెషీన్లు, ఎలక్ట్రానిక్ తూకాలు, సరుకుల రవాణా వాహనాలకు జీపీఎస్, గోదాముల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. -
ప్రతి జిల్లాలోనూ కమాండ్ కంట్రోల్
సాక్షి, హైదరాబాద్: రేషన్ సరుకులను తరలించే లారీలకు జీపీఎస్, వాటి కదలికలను ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పరిశీలించడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్, ఈ–పాస్ విధానం ద్వారా సరుకుల పంపిణీ... ఇలా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు కళ్లెంవేస్తున్న పౌరసరఫరాల శాఖ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. గత ఏడాది హైదరాబాద్ పౌరసరఫరాల భవన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అత్యుత్తమ ఫలితాలనిస్తుండటంతో క్షేత్రస్థాయిలోనూ నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాలోనూ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ఆ శాఖ శ్రీకారం చుట్టింది. 31 జిల్లాల్లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయాల్లో ఈ కేంద్రాల ఏర్పాటు దిశగా కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈనెల 28న సిద్దిపేటలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తారు. అలాగే వచ్చే నెలలో నిజామాబాద్, వనపర్తి, గద్వాల్, కరీంనగర్, మరికొన్ని జిల్లాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. పౌరసరఫరాల వ్యవస్థకు కీలకమైన మండల స్థాయి నిల్వ కేంద్రాలపై నిఘా పెట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంస్థకు చెందిన 171 గోదాముల్లో 1700 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తుంది. లోడింగ్, అన్లోడింగ్, గోదాం ప్రధాన ద్వారం, వేబ్రిడ్జి, ప్లాట్‌ఫాం, గోదాములో ప్రతి వ్యక్తి కదలికలను గుర్తించేలా ఒక్కో గోదాం వద్ద 5 నుండి 10 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, పౌరసరఫరాల శాఖ అధికారులు గోదాముల పరిధిలో ఏం జరుగుతున్నదీ, రేషన్ సరుకులు తరలించే వాహనాల కదలికలను ప్రత్యక్షంగా వీడియో వాల్‌పై వీక్షించడానికి వీలుగా ఈ కెమెరాలను ఆయా జిల్లాల్లోని పౌరసరఫరాల కార్యాలయాలకు అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. 31 జిలాల్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రాలను హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలోని సెంటర్‌కు అనుసంధానం చేస్తున్నామన్నారు. దీనివల్ల రేషన్ సరుకులు తరలించే వాహనాల కదలికలతో పాటు గోదాముల్లో బియ్యం తరలింపును పర్యవేక్షించడానికి మంచి అవకాశం ఉంటుందన్నారు. -
ఎక్కడి నుంచైనా రేషన్
సాక్షి, హైదరాబాద్ : రేషన్ సరుకులను కేటాయించిన షాపులో కాకుండా మరే రేషన్ దుకాణంలోనైనా తీసుకునే వెసులుబాటును (పోర్టబిలిటీని) వచ్చే నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి తెస్తున్నామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గురువారం ఆయన ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ–పాస్) ప్రాజెక్టుపై హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. మే ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునేలా పోర్టబులిటీని అమలు చేస్తామని చెప్పారు. ఉదాహరణకు ఆదిలాబాద్‌కు చెందిన వ్యక్తి హైదరాబాద్‌లోని ఏదైనా రేషన్ దుకాణంలో బియ్యం, ఇతర నిత్యావసరాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుందని వెల్లడించారు. వలస వచ్చే కూలీలు ఎక్కడికి వెళితే అక్కడ రేషన్ సరుకులు తీసుకోవడానికి వీలవుతుందన్నారు. ఇక రాష్ట్రంలో రేషన్‌కార్డుల కోసం రెండు లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని సీవీ ఆనంద్ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఐదుగురు బియ్యం స్మగ్లర్లపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశామని.. త్వరలో మరో 15–20 మందిపైనా నమోదు చేయనున్నామని తెలిపారు. రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు వ్యవహారం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,200 రేషన్ షాపులు ఖాళీగా ఉన్నాయని, వాటికి డీలర్ల ఎంపికపై ప్రభుత్వానికి ఫైలు పంపామని, అర్హతలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఈ–పాస్‌తో రూ.578 కోట్లు ఆదా రాష్ట్రంలోని 17 వేల రేషన్ షాపుల్లో ఈ–పాస్ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని సీవీ ఆనంద్ వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందజేయడంలో, మిగులు సరుకులను ప్రభుత్వానికి తిరిగి అప్పగించడంలో ఈ–పాస్ విధానం ఎంతో సహాయపడిందన్నారు. రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా డీలర్ల అక్రమాలకు చెక్ పెట్టడంలో ఈ–పాస్ విజయవంతమైందని చెప్పారు. ఈ–పాస్‌కు అనుసంధానం చేసేలా 4 అంగుళాల స్క్రీన్ ఉన్న ఆండ్రాయిడ్ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చామని.. అందులో ఐరిస్ స్కానర్, బరువు తూచే ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషీన్‌తో బ్లూటూత్ అనుసంధానం, కార్డు స్వైపింగ్ సదుపాయం, ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ, వాయిస్ ఓవర్ వంటి సౌకర్యాలు ఉన్నాయని వెల్లడించారు. ఆన్లైన్లో లావాదేవీలను ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చని తెలిపారు. ఈ–పాస్ విధానం ప్రారంభించాక ఇప్పటివరకు 2.15 లక్షల టన్నుల బియ్యం మిగిలాయని, రూ.578.90 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. ఈ నెల నుంచి ఏడాదికి రూ.800 కోట్ల నుండి రూ.850 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కచ్చితంగా రేషన్ సరుకులను పంపిణీ చేస్తామని, ఆ 15 రోజులు రేషన్ షాపులకు సెలవు ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులకు రేషన్ సమాచారాన్ని ఎస్సెమ్మెస్ ద్వారా పంపిస్తామన్నారు. -
రైస్‌మిల్లు యజమానిపై పీడీ కేసు
సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న కీలక సూత్రధారి జగిత్యాల జిల్లాకు చెందిన రైస్ మిల్లు యజమాని కొండా లక్ష్మణ్‌పై పీడీ కేసు నమోదైంది. పౌరసరఫరాల శాఖ నిఘా బృందం నివేదికల ఆధారంగా గత ఏడాది కాలంలో నలుగురు బియ్యం వ్యాపారులపై పీడీ కేసులు నమోదు కాగా, తొలిసారిగా రైస్ మిల్లు యజమానిపై పీడీ కేసు నమోదు చేసినట్లు ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జగిత్యాల జిల్లా గొల్లపెల్లి రోడ్డులోని హనుమాన్ సాయి ట్రేడర్స్ యజమాని కొండా లక్ష్మణ్.. కరీంనగర్ జిల్లా కేంద్రంగా 15 ఏళ్లుగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాడని వివరించారు. లక్ష్మణ్‌పై ఇప్పటి వరకు 8 క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్నారు. నిఘా బృందం అతనిపై ఉన్న కేసుల జాబితాను కలెక్టర్ శరత్‌కు సమర్పించగా, ఆదివారం లక్ష్మణ్‌పై కలెక్టర్ పీడీ కేసు నమోదు చేశారన్నారు. రాయకల్లు, కోరుట్ల, లాటిపెల్లిలో రైస్ మిల్లులను లక్ష్మణ్ బినామీ పేర్లతో నిర్వహిస్తూ రేషన్ బియ్యం అక్రమ దందా చేస్తున్నాడన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, జగిత్యాల జిల్లాల నుంచి పెద్దఎత్తున రూ.8 నుంచి రూ.12 వరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి అదే బియ్యాన్ని ప్రభుత్వానికి రూ. 25 చొప్పున అప్పగిస్తున్నాడన్నారు. నెలకు దాదాపు 800 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నాడన్నారు. ఈ అక్రమ వ్యాపారం ద్వారా నెలకు రూ. 50 లక్షల నుండి రూ. 70 లక్షల వరకు అక్రమార్జన చేస్తున్నాడన్నారు. మిగిలిన బియ్యాన్ని మహారాష్ట్ర, కర్నాటక, ఛత్తీస్గడ్ రాష్ట్రాలకు తరలిస్తున్నాడని ఆనంద్ వివరించారు. జిల్లాల వారీగా జాబితా... రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతూ రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తున్న రైస్ మిల్లర్ల, వ్యాపారుల జాబితాను జిల్లాల వారీగా రూపొందించామని ఆనంద్ తెలిపారు. ఇందులో కీలక సూత్రధారులను గుర్తించామని, వారి కదలికలపై నిఘా ఉంచామన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల పూర్తి సహకారంతో త్వరలోనే మరికొంతమంది రైస్ మిల్లు యజమానులపై కేసులు నమోదుకు రంగం సిద్ధం చేస్తున్నామన్నారు. నాగర్‌కర్నూల్, వరంగల్, గద్వాల్, భూపాలపల్లి, నల్లగొండలో మరి కొంతమందిపై పీడీ కేసులు నమోదు చేయబోతున్నామన్నారు. -
కేంద్ర సర్వీసుల్లోకి ఇద్దరు ఐపీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులు డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లనున్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ ప్రస్తుతం సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు అనుమతివ్వాలని రెండేళ్లుగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు ఆనంద్ పేరును సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో డిప్యుటేషన్ అండ్ అలాట్మెంట్స్ కమిటీ ఆనంద్ నియామకంపై ఆమోదముద్ర వేసింది. కేంద్ర పోలీస్ విభాగాల్లో ఒకటైన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)లో ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ)గా ఐదేళ్లు పనిచేసేందుకు శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. అదే విధంగా 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి చారుసిన్హా సైతం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)లో ఐజీగా ఐదేళ్లు పనిచేసేందుకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు వెలువరించింది. వీరిద్దరిని త్వరితగతిన రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. -
కేంద్ర సర్వీసులకు సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా పని చేస్తున్న 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ కేంద్ర సర్వీసులోకి వెళ్లారు. ఆయన సీఐఎస్ఎఫ్ ఐజీగా అయిదేళ్లపాటు పని చేయనున్నారు. ప్రస్తుతం సీవీ ఆనంద్ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర సర్వీసులో ఐదేళ్ల పాటు పనిచేయాలన్న నిబంధన కారణంగా సీవీ ఆనంద్ డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లనున్నారు. -
రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట
సాక్షి, హైదరాబాద్: నిత్యావసర సరుకులు ముఖ్యంగా రేషన్ బియ్యంలో అక్రమాలను అడ్డుకునేందుకు పౌరసరఫరాలశాఖ చేసిన ప్రయోగం విజయవంతమైందని పౌరసరఫరాలశాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తెలి పారు. ఏడాది క్రితం ఎస్పీ ర్యాంకు రిటైర్డ్ పోలీసుల నేతృత్వంలో ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థతో పౌరసరఫరాల శాఖలో అక్రమాలకు, ముఖ్యంగా రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట పడిందన్నారు. నిత్యావసర సరుకుల ప్రజాపంపిణీ వ్యవస్థలో అవినీతిని నిరోధించడానికి, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి రిటైర్డ్ పోలీసుల అధికారులతో పాటు రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్ తదితర విభాగాలకు సంబంధించిన 20 మందితో 5 బృందాలను ఏర్పాటు చేశామన్నా రు. ఈ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా 843 ప్రాంతా ల్లో ఆకస్మిక దాడులు, తనిఖీలు నిర్వహించి, రూ.3.60 కోట్ల విలువ చేసే 12,915 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 2,619 క్వింటాళ్ల సీఎంఆర్ ధాన్యాన్ని, అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 3.90 లక్షల చక్కెర, ఎల్పీజీ సిలిండర్లు, కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. 165 మందిపై 6ఏ కేసులు, 71 మందిపై క్రిమినల్ కేసులను నమోదు చేశామన్నారు. -
హస్తినకు పంపించరూ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఐపీఎస్ అయిన అధికారులు కచ్చితంగా రెండేళ్లపాటు కేంద్ర సర్వీసుల్లో పనిచేయాల్సి ఉంటుంది. లేనిపక్షంలో రాష్ట్రంలోనూ, కేంద్ర సర్వీసుల్లోనూ కొన్ని కీలకమైన పోస్టులకు ప్యానల్ జాబితాలో చోటు దొరకకుండాపోయే ప్రమాదం ఏర్పడుతుంది. దీనితో తమని కేంద్ర సర్వీసుల్లోకి పంపాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వరుసలో ఐదుగురు సివిల్ సప్లయిస్ కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని రెండేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించడంతో ఆగిపోయారు. డిప్యుటేషన్లోకి రావాలని ఇటీవలే కేంద్ర హోంశాఖ మరోసారి ఆయనకు ఆఫర్ ఇచ్చింది. అదే విధంగా ఐజీ చారుసిన్హా సైతం కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చారుసిన్హా శిక్షణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. రెండురోజుల క్రితమే ఐజీ హోదా నుంచి అదనపు డీజీపీగా పదోన్నతి పొందిన సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య సైతం కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. డీఐజీగా పదోన్నతి పొందిన రాచకొండ జాయింట్ కమిషనర్ తరుణ్‌జోషి సైతం కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇంటర్ కేడర్ డిప్యుటేషన్ లేదా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా సైతం ప్రభుత్వానికి విజ్ఞప్తి పెట్టుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆనంద్‌కే అవకాశం... అదనపు డీజీపీ సీవీ ఆనంద్‌కే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మిగతా అధికారుల విషయంలో ప్రభుత్వం ఒప్పుకోకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలే రాష్ట్రంలో అధికారుల కొరత ఉండటం, పైగా ఎన్నికల ఏడాది సమీపిస్తుండటంతో ఐపీఎస్ అధికారులను కేంద్ర సర్వీసుల్లోకి పంపితే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నట్టు భావిస్తోంది. పైగా రాష్ట్ర కేడర్‌కు చెందిన 9మంది సీనియర్ ఐపీఎస్‌లు కేంద్ర సర్వీసుల్లోనే ఉన్నారు. వారంతా ఇప్పట్లో తిరిగి వచ్చేలా కనిపించడం లేదని, అందువల్లే ఆనంద్ మినహా మిగతావారికి అవకాశం ఉండకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘బియ్యం’ అక్రమ రవాణాకు చెక్
సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యం అక్రమార్కులపై పౌరసరఫరాల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ఆ శాఖకు సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ బృందాలు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెంచాయి. దీంతో వ్యాపారుల అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ బృందాల దాడులతో ముగ్గురిపై పీడీ కేసులు నమోదు కాగా, పలువురు వ్యాపారులపై 6ఏ, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ శాంతినగర్‌కు చెందిన రావిరాల రామలింగంపై ఆదివారం ఆ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పీడీ కేసు నమోదు చేశారు. మిర్యాలగూడ కేంద్రంగా కొన్నేళ్లుగా పీడీఎస్ బియ్యాన్ని సేకరించి రామలింగం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. దీంతో ఆయనపై 2016, ఫిబ్రవరి 10న మొదటిసారి కేసు నమోదైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి తొమ్మిది 6ఏ కేసులు ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయినా రామలింగం రేషన్ బియ్యం అక్రమ రవాణాను కొనసాగిస్తూనే ఉన్నాడు. దీంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ బృందాలు రామలింగం కదలికలపై నిఘా పెట్టాయి. మరికొందరిపై పీడీ కేసులు: సీవీ ఆనంద్ రేషన్ కార్డుదారులు, డీలర్లు, ఇతర వ్యాపారస్తుల నుంచి కొందరు రేషన్ బియ్యాన్ని సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ బృందాలను అప్రమత్తం చేశాం. గత ఏడాదిలో ముగ్గురిపై పీడీ కేసులు నమోదు చేసి జైలుకు తరలించాం. తాజాగా ఆదివారం మిర్యాలగూడకు చెందిన రామలింగంపై ఆ జిల్లా కలెక్టర్ పీడీ కేసు నమోదు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంపై నిఘా పెట్టాం. మరికొంత మందిపై పీడీ కేసులు నమోదు చేస్తాం. సూత్రధారులను త్వరలోనే అరెస్టు చేస్తాం. -
ఇక 1వ తేదీ నుంచే రేషన్ సరుకులు
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి ప్రతి నెలా 1వ తేదీ నుంచే రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సరుకుల రవాణా తేదీలు, క్లోజింగ్ బ్యాలెన్స్ (సీబీ), రిలీజ్ ఆర్డర్ (ఆర్ఓ)లో మార్పులు చేసింది. ఈ–పాస్ అమలవుతున్న 25 జిల్లాల్లో ఈ విధానం తక్షణం ప్రారంభం అవుతుంది. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తారు. 16వ తేదీన పౌరసరఫరాల శాఖ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లాలకు సరుకుల కేటాయింపులు చేపడతారు. అలాగే 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రేషన్ డీలర్లు మీసేవ కేంద్రాల్లో డీడీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ తేదీల్లో డీడీలు కట్టిన డీలర్ల రిలీజ్ ఆర్డర్లను స్థానిక ఏసీఎస్ఓలు సంబంధిత మండల స్థాయి నిల్వ కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. రిలీజ్ ఆర్డర్లు అందుకున్న వెంటనే గోదాం ఇన్చార్జులు సరుకుల పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తారు. కొత్త విధానంపై శ్రద్ధ తీసుకోవాలి: కమిషనర్ సీవీ ఆనంద్ నూతన విధానంపై జిల్లా జాయింట్ కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. డీసీఎస్ఓ, ఏసీఎస్ఓ, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, డిప్యూటీ తహసీల్దార్, పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు, స్టేజ్–1, స్టేజ్–2 కాంట్రాక్టర్లు, ఆయా గోదాముల ఇన్చార్జులతో ప్రతీ నెల జాయింట్ కలెక్టర్లు çసమావేశాలు నిర్వహించాలి. -
రూ.1,618 కోట్లు ఆదా!
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖలో చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలిచ్చాయి. కఠిన నిర్ణయాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో 14 నెలల్లో రూ.1,618 కోట్లు ఆదా అయ్యాయి. ఎన్ఫోర్స్మెంట్ విభాగం వల్ల అక్రమాలు తగ్గాయి. రైస్ మిల్లర్లు, ఎఫ్‌సీఐ, కిరోసిన్ డీలర్ల వద్ద ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలు వసూలయ్యాయి. మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్‌కు సంబంధించి రూ.575 కోట్ల బకాయిలు రాబట్టగా.. ఈ–పాస్ విధానంతో రూ.479 కోట్లు ఆదా అయ్యాయి. ఆర్థిక విభాగం ఏర్పాటైన తర్వాత ఖాతాలను పునరు ద్ధరించుకోవడంతో రూ.75 కోట్ల వడ్డీ భారం తగ్గించగలిగారు. ఎన్ఫోర్స్మెంట్ బృందాలు, టెక్నికల్ విభాగం ఏర్పాటు చేసి నిరంతర నిఘా పెంచడంతో మరో రూ.30 కోట్లు ఆదా చేయగలిగారు. ప్రభుత్వ వసతి గృహాలు, మధ్యాహ్న భోజన పథకానికి 1.20 లక్షల టన్నుల సన్న బియ్యం కొనుగోలు కోసం రైస్ మిల్లర్లతో కమిషనర్ చర్చలు జరపడం వల్ల రూ.30.18 కోట్లు, పీడీఎస్ బియ్యం ద్వారా రూ.80 కోట్లు ఆదా అయింది. 2008–09 నుంచి 2014–15 వరకు మిల్లర్ల వద్ద ఉన్న గోనె సంచుల రికవరీతో రూ.84.58 కోట్లు వసూలయ్యాయి. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు జరపడంతో రూ.10 కోట్లు.. కమాండ్ కంట్రోల్ సెంటర్, జీపీఎస్, సాంకేతిక విభాగాల ఏర్పాటు, పౌర సరఫరాలపై నిరంతర పర్యవేక్షణతో రూ.25 కోట్లు ఆదా చేయగలిగారు. అలాగే కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రూ.249.72 కోట్ల బకాయిలూ రాబట్టగలిగారు. పారదర్శకత, జవాబుదారీతనం.. ఆర్థిక నిర్వహణలో లోపాలు, 2011 నుంచి ఖాతాల ఆడిటింగ్ జరగకపోవడం, సిబ్బంది కొరత, జవాబుదారీతనం లేకపోవడం, ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించే సాఫ్ట్వేర్ లేకపోవడం సంస్థకు అవరోధంగా నిలిచాయి. ఆర్థిక వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ నిఘా లేకపోవడంతో అధికారులు, సిబ్బందిలో భయం లేకుండాపోయింది. అయితే సాంకేతిక పరిజ్ఞానం ద్వారా శాఖలోని అన్ని విభాగాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించాం. సంస్థకు బకాయిపడిన వారి నుంచి సొమ్ము రాబట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న అకౌంట్లను ఆడిట్ చేయించాం. రోజువారీ లావాదేవీలపై నిఘాకు అకౌంటింగ్ ఏజెన్సీ నియమించాం. ప్రతి లావాదేవీని సంబంధిత సిబ్బంది చూసేందుకు వీలుగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టంను రూపొందించాం. – సీవీ ఆనంద్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ -
రికార్డు స్థాయిలో బియ్యం సేకరణ
సాక్షి, హైదరాబాద్: మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పౌర సరఫరాలశాఖ చేపట్టిన సంస్కరణలు ఫలితాలనిస్తున్నాయి. మిల్లర్ల నుంచి 2016–17 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) ను పూర్తిస్థాయిలో సేకరించింది. ఖరీఫ్ సీజన్లో 99.99%, రబీసీజన్‌లో 99.98% బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించారు. ఇంత భారీ మొత్తంలో సీఎమ్మార్‌ను సేకరించడం పౌరసరఫరాల శాఖ చరిత్రలోనే తొలిసారి. ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. రికార్డు స్థాయి సేకరణ: ఈసారి రబీలో 37.20లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సీఎమ్మాఆర్ కోసం రైస్ మిల్లులకు అప్పగించింది. ఇందుకుగాను 25.28 లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వా నికి అప్పగించాల్సి ఉండగా, రికార్డు స్థాయిలో 25.26 లక్షల టన్నుల (99.98%) బియ్యాన్ని అప్పగించారు. ఖరీఫ్‌లో 16.48 లక్షల టన్నుల ధాన్యానికిగాను 11.04 లక్షల టన్నుల బియ్యాన్ని అప్పగించాల్సి ఉండగా 11.03 (99.98%) లక్షల టన్నులు అప్పగించారు. ఫలించిన ప్రణాళిక మిల్లర్లకు ధాన్యాన్ని అప్పగించడంలో పౌరసరఫరాల శాఖ పక్కా ప్రణాళికతో వ్యవహ రించింది. మిల్లుల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ధాన్యం కేటాయింపులో అధికారులు ఒక క్రమపద్ధతిని పాటించారు. ఈ ఏడాది రబీ లో గడువులోగా బియ్యం అప్పగించని మిల్లర్ల మిల్లింగ్ చార్జీలో కోత విధిస్తామన్న నిబంధన మంచి ఫలితాన్నిచ్చింది. అందరి సహకారంతోనే: సీవీ ఆనంద్ వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేయడం ద్వారా మిల్లర్ల నుంచి 99 శాతానికి పైగా బియ్యాన్ని సేకరించామని పౌరసరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దీని వెనుక మిల్లర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారుల కృషి ఎంతగానో ఉందన్నారు. ఎన్ఫోర్స్మెంట్, ఆదాయపన్ను, వాణిజ్య విభాగాలను ఏర్పాటు చేయడం, శాఖలోని అన్ని వ్యవహారాలను ఆన్లైన్ చేసి నిరంతరం పర్యవేక్షించడం వంటి చర్యలతో సత్ఫలితాలు వచ్చాయని ఆయన వివరించారు. -
దిగొచ్చిన రేషన్ డీలర్లు
సాక్షి, హైదరాబాద్: డిమాండ్లు పరిష్కరించా లంటూ సమ్మె బాట పట్టిన పౌరసరఫరాల రేషన్ డీలర్లలో చాలామంది ప్రభుత్వ హెచ్చ రికతో వెనక్కి తగ్గారు. సరుకులు తీసుకోని డీలర్లను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని సీఎం ఆదేశించడం, డిసెంబర్ నెల సరుకుల కోసం శనివారం లోగా డీడీలు కట్టాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ సీవీ ఆనంద్ గడువు విధించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా డీలర్లు డీడీలు కట్టడంలో మునిగిపోయారు. శనివారం సాయంత్రం వరకు 13 వేల 200 మంది డీలర్లు డీడీలు కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల 200 రేషన్ దుకాణాలుండగా వాటిలో వెయ్యి షాపులకు రెగ్యులర్ డీలర్లు లేరు. మరో 3 వేల మంది డీలర్లు మాత్రమే డీడీలు చెల్లించాల్సి ఉంది. మంచిర్యాల, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మాత్రమే ఎక్కువ మంది డీలర్లు డీడీలు కట్టలేదని చెబుతున్నారు. అయితే మీ–సేవా కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల కొందరు డీడీలు కట్టేలక పోయారని తెలుస్తోంది. డీలర్లు సమ్మెకు పిలుపు ఇవ్వడంతో ఈ నెల సరుకుల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా చాలామంది డీలర్లు డీడీలు కట్టిన నేపథ్యంలో సరుకుల పంపిణీకి ఇబ్బందులు తొలగిన ట్లేనని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ నెల డీడీలు కట్టేందుకు డీలర్లకు 4వ తేదీ వరకు గడువు పెంచాలని, డీలర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, సభ్యుడు ఆనంద్ శని వారం పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్‌సీవీ ఆనంద్‌లను కలిసి విజ్ఞప్తి చేశారు. డీలర్లందరూ డీడీలు కట్టాలని సంఘం తరఫున కోరుతున్నామన్నారు. -
దారికి రాని డీలర్లపై వేటు!
సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్ల సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. రేషన్ సరుకులు తీసుకోవడానికి డీడీలు చెల్లించని, సరుకులు పంపిణీ చేయని డీలర్లను తొలగించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు జిల్లాల వారీగా డీలర్ల జాబితాను రూపొందించే పనిలో పౌరసరఫరాల శాఖ నిమగ్నమైంది. క్షేత్రస్థాయిలో అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటివరకు రేషన్ సరుకుల కోసం డీడీలు కట్టని డీలర్లకు శనివారం వరకు వెసులుబాటు కల్పించింది. అప్పటికీ దారికిరాని డీలర్లను తొలగించాలని ఆదేశాలు జారీచేసింది. 3వ తేదీ నుంచి వారి స్థానంలో కొత్తవాళ్ల నియామక ప్రక్రియను చేపట్టాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు సూచించారు. డీడీలు కట్టకుండా సమ్మెలో పాల్గొంటున్న వారి వివరాలను, డీడీలు కట్టి సరుకులు పంపిణీ చేయని డీలర్ల జాబితాను రూపొందిస్తున్నారు. ఏయే ప్రాంతంలో డీలర్లు సమ్మెకు వెళ్తున్నారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేస్తున్నారు. కఠినంగా వ్యవహరిస్తాం: సీవీ ఆనంద్ రేషన్ డీలర్ల సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్ పరిస్థితిని సమీక్షించారని పౌరసరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ‘డీలర్లకు విధించిన తుది గడువులోగా డీడీలు చెల్లించాలి. లేదంటే కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా వారు ఇలా చేయడం పద్ధతి కాదు. మరోసారి చర్చలకు సిద్ధంగా ఉన్నాం’ అని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఊ రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి సీఎంకు రేషన్ డీలర్ల సంఘం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేషన్ డీలర్లు చాలీచాలని కమీషన్‌తో బతుకుతున్నారని, సరిపడ ఆదాయం లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రేషన్‌డీలర్ల సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం ఈ మేరకు డీలర్ల సమస్యలను పరిష్కరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి, సభ్యుడు ఆనంద్ సీఎం కేసీఆర్‌కు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. నవంబర్‌లో డీడీలు కట్టామని, మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్‌తో జరిపిన చర్చల తర్వాత సమ్మెను విరమించామని తెలిపారు. దేశంలోనే తక్కువ కమీషన్‌తో రేషన్ డీలర్లు ఇక్కడ పని చేస్తున్నారని చెప్పారు. -
జీఎస్టీ అమలుపై నిరంతర నిఘా
సాక్షి, హైదరాబాద్: తగ్గించిన వస్తు, సేవల పన్ను(జీఎస్జీ) ప్రయోజనాలు కచ్చితంగా ప్రజలకు అందేలా తూనికలు–కొలతల శాఖ నిఘా ముమ్మరం చేసింది. ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి రెస్టారెంట్లు, హోటళ్లపై దాడులకు సిద్ధమయ్యింది. ఇప్పటికే వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వర్తక, వ్యాపార సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లపై 15 వేలకుపైగా తనిఖీలు చేసి 1,335 కేసులు నమోదు చేసి.. రూ.44.35 లక్షలను జరిమానా రూపంలో వసూలు చేసింది. ప్రజలకు చేరని ప్రయోజనం.. కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించినా ఆ ప్రయోజనాలు ప్రజలకు చేరడం లేదు. కొంతమంది జీఎస్టీ ముసుగులో పాత ధరలకే అమ్మకాలు జరుపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిపై తూనికలు–కొలతల శాఖకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో జీఎస్టీని 18 శాతం నుండి 5 శాతానికి తగ్గించారు. అయితే తగ్గిన 13 శాతం పన్నును వివిధ రూపాల్లో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లలో జీఎస్టీ అమలుపై నిఘా ఉంచాలని తూనికలు–కొలతల శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 9 ప్రకారం వినియోగదారుల రక్షణ చట్టం కింద ఇలా అక్రమ వ్యాపార లావాదేవీలు చేస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లపై కేసులు నమోదు చేసి వినియోగదారుల ఫోరంకు అప్పగించే అధికారం తూనికలు–కొలతల శాఖకు ఉంది. అవగాహన తీసుకురావడంలో సఫలం.. జీఎస్టీ మోసాలు, సర్వీస్ చార్జీల విషయంలో ప్రజల్లో అవగాహన తీసుకురావడంలో సఫలమయ్యాం. సర్వీస్ చార్జీ చట్ట వ్యతిరేకమని, అది వినియోగదారుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందనే విషయాన్ని వర్తకులకు తెలియజెప్పాం. ఏ వస్తువుపై ఎంత పన్ను ఉన్నా అది ఎంఆర్పీకి లోబడే ఉండాలి. ఎంఆర్పీకి అదనంగా వసూలు చేయకూడదని వ్యాపార సంస్థలకు, అదనంగా చెల్లించకూడదని వినియోగదారులకు అవగాహన కల్పించాం. – సీవీ ఆనంద్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ -
బియ్యం మాఫియాపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ కార్యక్రమాన్ని గాడిలో పెట్టేందుకు, ప్రధానంగా రేషన్ బియ్యం సరఫరాలో అక్రమాలను అడ్డుకునేందుకు పౌరస రఫరాల శాఖ చేసిన ప్రయోగం సత్ఫలితాలను ఇస్తోంది. ఎస్పీ ర్యాంకు రిటైర్డ్ పోలీసు అధికారి నేతృత్వంలో ఏర్పాటుచేసిన నిఘా వ్యవస్థతో రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపినట్లయ్యింది. ఈ శాఖలో ఎన్ఫోర్స్మెంట్ టాస్క్‌ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేయకముందు ఇక్కడి వ్యాపారులు రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకునేవారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ శాఖ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకు న్నాక.. ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్సుకు శ్రీకారం చుట్టారు. నిత్యావసర సరుకుల పంపిణీలో అవినీ తిని నిరోధించడం, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, రైస్‌మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్ల ఆగడాలను అదుపు చేసేందుకు రిటైర్డ్ పోలీసు అధికారులతోపాటు, రెవిన్యూ, కమర్షియల్ ట్యాక్స్, తదితర శాఖలకు చెందిన 20 మందితో అయిదు బృందాలుగా ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని తొమ్మిది నెలల కిందట ఏర్పాటు చేశారు. మండల స్థాయి గోదాములు, రేషన్ దుకాణాలు, సీఎంఆర్ మిల్లులు, మధ్యాహ్న భోజనంకోసం సన్నబియ్యం అందుకునే సంస్థలు, హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, ఎల్పీజీ గోదాములు, రైళ్లు తదితర ప్రదేశాల్లో మొత్తంగా 639 చోట్ల దాడులు చేశారు. వీరి తనిఖీల్లో రూ.3.10 కోట్ల విలువైన 11వేల 537 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. రైస్ మిల్లులపై 139 6ఎ కేసులు, 46 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ శాఖ చరిత్రలో తొలిసారి పీడీ యాక్టును కూడా అమలు చేశారు. ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పీడీ కేసులు నమోదయ్యాయి. ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో రూ.3.44 లక్షల విలువైన చక్కెర, ఎల్పీజీ సిలిండర్లు, కిరోసిన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ బృందాల దాడుల వల్ల ధాన్యంలో తరుగు, సన్నబియ్యం, రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా రూ.4.43కోట్ల విలువైన సరుకు అర్హులకు చేరేలా, అక్రమాలను నివారించగలిగారు. నిఘాతో మంచి ఫలితాలు పౌరసరఫరాల శాఖలో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడంవల్ల బియ్యం అక్రమ రవా ణాను నియంత్రించగలి గామని శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. ఏటా రూ.10వేల కోట్ల లావాదేవీలు జరిగే సంస్థలో సాంకేతిక పరిజ్ఞా నాన్ని వినియోగిం చుకుని పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయగలుగు తున్నాం. కాంట్రాక్టు పద్ధతిలో రిటైర్డ్ ఉద్యోగులను తీసుకుని బృం దాలు తయారు చేశాం. క్షేత్రస్థాయి పనుల్లో వాటిని తనిఖీ చేసే బాధ్యతలను ఈ బృందా లకు అప్పగించామని ఆయన వివరించారు. -
జీఎస్టీ మోసాలపై కొరడా
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ మోసాలపై తూనికలు, కొలతల శాఖ దాడులను ముమ్మరం చేసింది. ప్రజల నుంచి గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ) కంటే అధికమొత్తంలో వసూలు చేస్తుండటంతో ఆ శాఖ తనిఖీలు విస్తృతం చేసింది. ఇందులోభాగంగా గత వారంలో 5 వేల వ్యాపార సంస్థలపై దాడులు చేశామని, 1,062 కేసులు నమోదు చేసినట్లు ఆ శాఖ కంట్రోలర్ సీవీ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈక్రమంలో చిన్నపాటి వర్తక సంస్థలే కాక పెద్ద వ్యాపార సంస్థలు, మాల్స్, మల్టీప్లెక్స్‌లో జరుగుతున్న మోసాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ సెంట్రల్, పీవీఆర్ సినిమా, కేఎఫ్‌సీ, మెక్‌డోనాల్డ్, ప్రసాద్ ఐమ్యాక్స్, సబ్వే ఫుడ్కోర్ట్, సుజనామాల్, బ్లూఫాక్స్ రెస్టారెంట్, శాన్‌భాగ్, గోల్కొండ, పార్క్ హోటళ్లు తదితర వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. వీటిల్లో ఎంఆర్పీ కంటే అధికంగా జీఎస్టీని కలిపి విక్రయాలు చేస్తున్నట్లు తాము గుర్తించామన్నారు. జీఎస్టీ మోసాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేశామని వివరించారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే మొదటిసారి రూ.25 వేల జరిమానా, రెండోసారి కూడా మోసాలకు పాల్పడితే జరిమానాను రెండింతలు పెంచుతామని స్పష్టం చేశారు. -
కిరోసిన్ డీలర్లపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: ప్రభు త్వానికి చెల్లించాల్సిన బకాయిలను కట్టకుండా తప్పించుకు తిరుగుతున్న హోల్‌సేల్ కిరోసిన్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. అధికారులను తప్పుదోవపట్టించి.. వారిపై దురుసుగా ప్రవర్తించిన అఫ్సాన్, లిమ్రా ఏజెన్సీలు, హైదరాబాద్ సర్వీసు స్టేషన్, విశాల్ ఎంటర్ప్రైజెస్, భద్రయ్య సన్స్, శ్రీ అనంతుల ట్రేడర్స్, రాజయ్య అండ్ సన్స్, లక్ష్మయ్య అండ్ సన్స్, బీనా ట్రేడర్స్, తార్నాక ఏజెన్సీ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. తప్పుడు సమాచారంతో కొంతమంది డీలర్లు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో 66 మంది హోల్‌సేల్ కిరోసిన్ డీలర్ల నుంచి పౌరసరఫరాల శాఖకు రూ.10.12 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన కమిషనర్ శనివారం పౌరసరఫరాల భవన్లో బకాయిదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. -
శ్రీధర్ మృతి క్రీడాలోకానికి తీరని లోటు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, భారత జట్టు మాజీ అసిస్టెంట్ మేనేజర్ ఎం.వి. శ్రీధర్ ఆకస్మిక మృతి పట్ల పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘శ్రీధర్ మరణం క్రీడా లోకానికి, ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్‌కు తీరని లోటు. శ్రీధర్ వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడు. ఎప్పుడూ క్రికెట్ అభివృద్ధి గురించే ఆలోచించేవాడు. వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. అతనితో కలసి ఎన్నో మ్యాచులు ఆడాను. అవి నాకు మరిచిపోలేని అనుభూతులు. అతి క్లిష్టమైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) రాజకీయాలను ఎదుర్కొని మంచి పరిపాలకుడిగా పేరుగాంచారు. శ్రీధర్ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ 2013లో జనరల్ మేనేజర్‌గా నియమించింది. ఆయన ఆట ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చింది. మాజీ క్రికెటర్‌గానే కాకుండా హైదరాబాద్ క్రికెట్ సంఘానికి అతను చేసిన సేవలు నిరుపమానమైనవి. దేశవాళీ మ్యాచుల్లో శ్రీధర్ విశేష ప్రతిభ కనబరచినా జాతీయ జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని సీవీ ఆనంద్ అన్నారు. శ్రీధర్ పార్థీవ దేహాన్ని సందర్శించి వస్తున్న మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు -
అదనంగా జీఎస్టీ వసూలు చేస్తే చర్యలు
సాక్షి, హైదరాబాద్: ప్యాక్ చేసిన సరుకుల మీద వినియోగదారుల నుంచి ఎంఆర్పీ కన్నా అదనంగా జీఎస్టీ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. చట్ట విరుద్ధంగా పన్నుల పేరుతో వాస్తవ ధర కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తే వ్యాపారులపై కేసులు నమోదు చేయాలని తూనికలు, కొలతల శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం తూనికలు, కొలతల శాఖ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. గురువారం హైదరాబాద్‌లోని వర్తక, వ్యాపారు లతో సమావేశం నిర్వహించాలని అధికా రులను ఆదేశించారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నామని, వీరు గురువారం నుంచి ప్రత్యేక తనిఖీలు చేస్తారని తెలిపారు. పౌరసరఫరాల శాఖ వాట్సాప్ నంబర్ 7330774444తో పాటు తూనికల కొలతల శాఖకు చెందిన 7386136907, 27612170 నంబర్లలో, ఛి ఝ్టటఃnజీఛి.జీn వెబ్సైట్లో కూడా ఫిర్యాదు చేయొచ్చన్నారు. -
కస్టమర్ల హక్కులపై పట్టింపు లేదు
- అందుకే వేలాదిగా కేసులు పెండింగ్: జస్టిస్ అరిజిత్ పసాయత్ - జాతీయ వినియోగదారుల చట్టంలో మార్పులు తేవాలి: సీవీ ఆనంద్ సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వినియోగదారుల ఫోరాల్లో వేలాదిగా కేసులు పెండింగులో ఉంటున్నాయని జస్టిస్ అరిజిత్ పసాయత్ పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఈ ఫోరంలను పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్‌లో శని వారం ‘వినియోగదారుల ఫోరాలు ఎదుర్కొం టున్న సవాళ్లు’ అన్న అంశంపై ప్రాంతీయ సమావేశం జరిగింది. వినియోగదారుల ఫోరాల పని తీరు, సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న జస్టిస్ అరిజిత్ పసాయత్ ఈ సమావేశంలో ప్రసంగిస్తూ గడచిన 19 నెలలుగా కమిటీ పర్యటనలు చేస్తోందని చెప్పారు. సుమారు 10 వేల కేసులు 20 ఏళ్లకు పైగా పెండింగులో ఉండగా, 40 వేల కేసులు పదేళ్లకు పైగా పెండింగులో ఉన్నాయని వివరించారు. వినియోగదారుల ఫోరాలకు సంబంధించి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని, కేంద్రమే ఓ రాజకీయ నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక సివిల్ సప్లయిస్ శాఖ మంత్రి యు.టి.ఖాదర్ కోరారు. హక్కులపై అవగాహన కల్పించాలి... జాతీయ వినియోగదారుల చట్టం వచ్చి 30 ఏళ్లు (1986) అవుతోందని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ముఖ్యంగా వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన కల్పించాలని, కోర్టుల్లో కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. -
రేషన్ లెక్క.. యాప్‌తో పక్కా
► రేషన్ షాపు లొకేషన్.. అందులోని సరుకుల వివరాలు లైవ్‌లో.. ► రేషన్ సరుకు తరలించే వాహనాల కదలికలు కూడా.. ► టీ–రేషన్ మొబైల్ యాప్ రూపొందించిన పౌరసరఫరాల శాఖ ► నేటి నుంచి అందుబాటులోకి.. ఆవిష్కరించనున్న మంత్రి ఈటల సాక్షి, హైదరాబాద్: రేషన్ సరుకుల తరలింపు నుంచి పంపిణీ వరకు ఆన్లైన్ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. రేషన్ పంపిణీలో మరింత పారదర్శకత తీసుకొచ్చేలా.. లావాదేవీలు సామాన్య ప్రజలూ ప్రత్యక్షంగా తెలుసుకునేలా ‘టీ–రేషన్’మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ చొరవతో నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో రూపొందించిన ఈ యాప్ సేవలు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. మంత్రి ఈటల రాజేందర్ యాప్‌ను ఆవిష్కరించనున్నారు. పౌరసరఫరాలకు సంబంధించిన అన్ని లావాదేవీలు యాప్ ద్వారా తెలుసుకోవచ్చని, శాఖ అధికారులూ తమ రోజువారీ కార్యక్రమాలను నిర్వహించుకునేలా రూపొందించామని కమిషనర్ చెప్పారు. పౌర సేవలకు సంబంధించి 7, ప్రభుత్వ సేవలకు 13 అప్లికేషన్లు కలిపి మొత్తం 20 అప్లికేషన్లతో యాప్‌ను రూపొందించారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ రోజు ఎంత తీసుకున్నారో.. ఈ యాప్ ద్వారా దగ్గరలోని రేషన్ షాప్ లొకేషన్ గుర్తించవచ్చు. అలాగే షాపులో జరిగే లావాదేవీలూ ప్రత్యక్షం (లైవ్)గా తెలుసుకోవచ్చు. రేషన్ కార్డు దరఖాస్తు స్టేటస్, కార్డు వివరాలు, కార్డుపై ఆ నెల సరుకుల కేటాయింపు వివరాలు, రేషన్ షాపుల్లో సరుకు నిల్వలు, ఏ రేషన్ దుకాణానికి ఎన్ని సరుకులు, ఎంత మొత్తంలో కేటాయించారు, ఎంత మొత్తం తీసుకున్నారు, వాటిలో కార్డుదారులకు ఏ రోజు ఎంత ఇచ్చారు వంటి వివరాలను యాప్‌లో రేషన్ కార్డు నంబర్ నమోదు చేసి తెలుసుకోవచ్చు. గోదాముల్లో కార్యకలాపాలూ లైవ్‌గా.. యాప్‌ను త్వరలో మరింత అభివృద్ధి చేయబోతున్నామని, రేషన్ సరుకులు తరలించే వాహనాల కదలికలను కూడా ప్రత్యక్షంగా చూసేలా అభివృద్ధి్ద చేయబోతున్నామని కమిషనర్ సీవీ ఆనంద్ వివరించారు. పౌర సరఫరాల భవన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వాహనాల కదలికలను ప్రత్యక్షంగా ఎలా పరిశీలిస్తున్నారో అదేవిధంగా యాప్ ద్వారా ప్రజలు కూడా తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు. గోదాముల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయబోతున్నామని.. గోదాముల్లో సరుకుల నిల్వలు, లోడింగ్, అన్లోడింగ్, రవాణా మొదలు పంపిణీ వరకు జరిగే ప్రతి లావాదేవీని ప్రజలు తెలుసుకోవచ్చని ఆయన వివరించారు. -
చక్కెర ధరలు పెంచితే కఠిన చర్యలు
పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా చక్కెర నిల్వ చేసి, కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ చక్కెర వ్యాపారులను హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చక్కెర ధరల నియంత్ర ణకుగాను ఆయన రాష్ట్రంలోని హోల్‌సేల్ చక్కెర వ్యాపా రుల సంఘం ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. చక్కెర నిల్వలు, లావాదేవీలపై పరిమితులు విధిస్తూ కేంద్రం గతంలో విడుదల చేసిన ఉత్తర్వులను మరో 6 నెలల (ఈ ఏడాది అక్టోబర్ 28) వరకు పొడిగించింది. లైసెన్స్ పొందిన వ్యాపారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ధర కన్నా ఎక్కువకు చక్కెర అమ్మకూడదని కమిషనర్ అన్నారు. 5 క్వింటాళ్ల కంటే ఎక్కువ చక్కెర నిల్వ చేసే వ్యాపారినే డీలర్‌గా పరిగణిస్తామని, వారు సంబంధిత జిల్లా పౌరసరఫరాల అధికారి, తహసీల్దార్ దగ్గర హోల్‌సేల్, రిటైల్ లైసెన్స్ తీసుకోవా లని, లేనిపక్షంలో వారిపై నిత్యావసరాల చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చక్కెర నిల్వలపైనా కమిషనర్ పరిమితి విధించారు. -
ఏసీఎస్‌వోలను డీసీఎస్‌వోలుగా అప్‌గ్రేడ్ చేయాలి
సీవీ ఆనంద్‌కు టీజీవోల సంఘం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల శాఖలో ఏసీఎస్‌వోలుగా పనిచేస్తున్న అధికారులను డీసీఎస్‌వోలుగా అప్‌గ్రేడ్ చేయాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్‌కు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం వద్ద సుదీర్ఘ కాలంగా పెండిం గ్లో ఉన్న డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్న తులు కల్పించాలని సంఘం కోరింది. కమిషనర్ సీవీ ఆనంద్‌కు కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాల నుంచి పురస్కారాలు లభించిన నేపథ్యంలో శనివారం ఆయన్ను కలసిన టీజీవోల సంఘం నేతలు అభినం దనలు తెలిపారు. అప్‌గ్రేడ్ అంశం పరిశీలనలో ఉందని కమిషనర్ వారికి వివ రించారు. టీజీవో నగర అధ్యక్షుడు ఎంబీ కృష్ణయాదవ్, ఉపాధ్యక్షుడు ఎండీ అబ్దుల్ ఖదీర్, మరో ఆరుగురు ప్రతినిధులు ఆయన్ను కలసిన వారిలో ఉన్నారు. -
నిజాయితీతో పనిచేస్తే ఏదైనా సాధ్యమే
పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ సాక్షి, హైదరాబాద్: నిజాయితీతో, నిబద్ధతతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ప్రభుత్వం నిర్దేశిం చిన లక్ష్యం మేరకు పనిచేస్తే కచ్చితంగా గుర్తింపు లభిస్తుందన్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఉత్తమ సేవలు అందించినందుకు గాను సీఎం కె.చంద్రశేఖరరావు చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వ ‘ఎక్సలెన్స్’ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ, సంస్థ, లీగల్ మెట్రాలజీ ఉద్యోగులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం కమిషనర్‌ను కలసి అభినందించారు. ఈ అవార్డుతో బాధ్యత మరింత పెరిగిందని, ఈ అవార్డు ఒక్కరి విజయం కాదు, సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని ఆనంద్ అన్నారు. -
సీవీ ఆనంద్‌కు రాష్ట్రపతి పోలీస్ పతకం
మరో 11 మందికి ఇండియన్ పోలీసు మెడల్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటన ఆనంద్‌కు రాష్ట్ర ప్రభుత్వ ఎక్సలెన్స్ అవార్డు కూడా.. ప్రమీలాబాయికి రాష్ట్రపతి కరెక్షనల్ సర్వీస్ మెడల్ సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏటా కేంద్రం ప్రకటించే అత్యుత్తమ సేవా పతకాలకు ఈసారి రాష్ట్రం నుంచి 13 మంది పోలీసు అధికారులు ఎంపికయ్యారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్, మెట్రో రైల్ విభాగంలో పని చేస్తున్న అదనపు డీసీపీ ఎ.బాలకృష్ణలకు రాష్ట్రపతి పోలీసు పతకాలు (పీపీఎం) దక్కాయి. కేంద్ర హోం శాఖ సోమవారం ఈ మేరకు ప్రకటించింది. మరో 11 మంది పోలీసు అధికారులకు ఇండియన్ పోలీస్ మెడల్స్ దక్కాయి. పౌర సరఫరాల శాఖను గాడిలో పెట్టేందుకు సీవీ ఆనంద్ చేసిన కృషిని గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఎక్సలెన్స్ అవార్డు ప్రకటించింది. శాఖలో ఈ ఏడాదిలో ఆయన చేపట్టిన వినూత్న చర్యలతో ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల దాకా ఆదా అయింది. ప్రత్యేక మహిళా కారాగారం చీఫ్ హెడ్‌వార్డర్ ఎ.ప్రమీలా బాయికి రాష్ట్రపతి కరెక్షనల్ సర్వీస్ మెడల్ దక్కింది. ఐపీఎం పొందింది..: చిక్కడపల్లి ఏసీపీ జే నర్సయ్య, ఏసీబీ డీఎస్పీ మిర్యాల ప్రభాకర్, ఇంటెలిజెన్స్ డీఎస్పీ ఆర్ జగదీశ్వర్ రెడ్డి, డీజీపీ సెంట్రల్ స్టోర్ డీఎస్పీ పాక గిరిరాజు, సీఐ సెల్ ఇన్స్పెక్టర్ టీఆర్ రాజేశ్వర్ లక్ష్మీ, గ్రేహౌండ్స్ ఆర్ఐ పాకంటి భూపాల్‌రెడ్డి, వరంగల్ సిటీ ఏఎస్ఐ బూర్గుల మహేందర్, కరీంనగర్ బెటాలియన్ ఏఆర్ఎస్ఐ తూడి ప్రభాకర్, ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ ఎం రఘుపతిరావు, అంబర్పేట్ సీపీఎల్ హెడ్‌కానిస్టేబుల్ ఎండీ ఖైరుద్దీన్, సీఐ సెల్ హెడ్ కానిస్టేబుల్ పి.జీవానందం. -
సీవీ ఆనంద్‌కు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్
సాక్షి, హైదరాబాద్ : విధి నిర్వహణలో అంకితభావం, కఠోర శ్రమతో పనిచేస్తున్న పలువురు పోలీస్ అధికారులకు, సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం సోమవారం సేవా పతకాలు ప్రకటించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, సివిల్ సప్లయి కమిషనర్ సీవీ ఆనంద్‌తో పాటు మెట్రో రైల్ విభాగంలో పనిచేస్తున్న అదనపు డీసీపీ ఏ బాలకృష్ణకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ (పీపీఎం) దక్కిందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. అదే విధంగా మరో 11మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి ఇండియన్ పోలీస్ మెడల్ ప్రకటించింది. ఈ పతకాలు సాధించిన అధికారులకు వచ్చే ఏడాది ఆగస్టు 15న సీఎం చేతులు మీదుగా అవార్డులు స్వీకరించనున్నారు. పీపీఎం పొందిన వారు: చిక్కడ్పల్లి ఏసీపీ జే నర్సయ్య, ఏసీబీ డీఎస్పీ మిర్యాల ప్రభాకర్, ఇంటలిజెన్స్ డీఎస్పీ ఆర్ జగదీశ్వర్ రెడ్డి, డీజీపీ సెంట్రల్ స్టోర్ డీఎస్పీ పాక గిరిరాజు, సీఐసెల్ ఇన్స్పెక్టర్ టీఆర్ రాజేశ్వర్లక్ష్మీ, గ్రేహౌండ్స్ ఆర్ఐ పాకంటి భూపాల్‌రెడ్డి, వరంగల్ సిటీ ఏఎస్ఐ బూర్గుల మహేందర్, కరీంనగర్ బెటాయలిన్ ఏఆర్ఎస్ఐ తూడి ప్రభాకర్, ఇంటలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ ఎం రఘుపతిరావు, అంబర్పేట్ సీపీఎల్హెడ్కానిస్టేబుల్ ఎండీ ఖైరుద్దీన్, సీఐ సెల్ హెడ్‌కానిస్టేబుల్ పీ జీవానందం. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు 67 సేవా పతకాలు లభించాయి. ఏపీ సేవా పతకాల్లో 52 పోలీసు శౌర్య పతకాలు, 3 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 12 అత్యుత్తమ సేవా పతకాలు ఉన్నాయి. ఏపీ నుంచి ఏసీబీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నాయక్, కర్నూలు ఏఎస్పీ దొడ్లా నరహర, విజయనగరం ఏఎస్ఐ కొటూరి ప్రసాద్రావులకు రాష్ట్కపతి విశిష్ట సేవా పతకాలను కేంద్రం ప్రకటించింది. -
పేదల ‘బువ్వ’కు ఎసరు
పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం - 3.02 కోట్ల నుంచి 2.75 కోట్లకు రేషన్ లబ్ధిదారుల తగ్గింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత జనాభా సరాసరి 4 కోట్ల మంది. రాష్ట్రం ఏర్పడ్డాక రేషన్ లబ్ధిదారులు ఏకంగా 3.02 కోట్లు. ఇంత మొత్తంలో కార్డులు ఉన్నాయంటే వీరంతా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారన్న మాట. కొందరు రేషన్ డీలర్లు, మిల్లర్లు, అధికారులు, కొందరు నేతల వల్లే ఇంత పెద్ద సంఖ్యలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య ఉందన్న విమర్శలున్నాయి. తద్వారా బియ్యం సరఫరా పేరుతో అక్రమ ఆదాయా న్ని పొందుతున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారుల చర్యలతో వీటిని 2.75 కోట్లకు తగ్గించారు. అయితే ఇందులో కూడా ఇంకా దాదాపు 75 లక్షల మంది బోగస్ లబ్ధిదారులే ఉంటారని చెబుతున్నారు. వీరిని తొలగించడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతుందన్న ఉద్దేశంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయమూ ఉంది. ప్రభుత్వ ఖర్చు ఇదీ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17,200 రేషన్ దుకాణాల ద్వా రా ప్రతి నెలా 1.75 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రజా పంపిణీ విధానం ద్వారా పేదలకు ప్రభుత్వం అందిస్తోంది. 85 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటికి ప్రభుత్వం ఏటా ఏకంగా 2,200 కోట్ల సబ్సిడీ భారాన్ని భరిస్తోంది. అనర్హులైన లబ్ధిదారుల పేరు ప్రతినెలా రూ.4.5 కోట్ల విలువైన బియ్యం ప్రభుత్వ గోదాముల నుంచి బహిరంగ మార్కెట్‌కు వెళుతున్నాయి. ఏటా ఈ మొత్తం ఏకంగా 50 కోట్ల దాకా ఉంది. ప్రతినెలా కనీసం 45 వేల టన్నుల బియ్యం రేషన్ మాఫియా చేతుల్లో పడుతోందని అంచనా. పక్కదారి పట్టేదిలా! రేషన్ బియ్యం లబ్ధిదారులే కిలో బియ్యాన్ని రూ.10 నుంచి రూ.12కు విక్రయిస్తున్నారు. ఈ బియ్యాన్ని వ్యాన్లు, లారీల్లో సరిహద్దులు దాటిస్తున్నారు. ఇటీవల రైల్వే ద్వారా మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు తరలి స్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు. పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం వారి నోటికి అందకుండానే సరిహద్దులు దాటుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు ► రేషన్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్న వ్యాపారులపై తొలిసారిగా పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. ► ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని పటిష్టం చేశారు. రిటైర్డ్ ఎస్పీల నేతృత్వంలో 24 మంది సిబ్బందితో 5 బృందాల ఏర్పాటు ► బియ్యం రవాణా చేసే 1,300 వాహనాలకు జీపీఎస్ పరికరాలు అమర్చడం ► జీహెచ్ఎంసీ పరిధిలోని 1,525 ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు ► అక్రమ కార్డుల వినియోగాన్ని తగ్గించడం కోసం ఇప్పటి దాకా 6వేల రేషన్ దుకాణాల్లో ఈృపాస్ యంత్రాలను అమర్చారు. ► మొత్తం లావాదేవీలన్నీ కంప్యూటరీకరించడం, ఈ అంశాలన్నింటినీ పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతికతతోనే అక్రమాలకు చెక్ ‘పౌర సరఫరాల శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా అక్రమాలకు చెక్ పెడుతున్నాం. ఎన్ఫోర్స్మెంట్ దాడులు, పీడీ యాక్టు కింద కేసులు తదితర చర్యల వల్ల కాకినాడ పోర్టుకు సరుకు వెళ్లడం ఆగిపోయింది. ఈృపాస్ యంత్రాలను ఇప్పటికే 6 వేల రేషన్ దుకాణాల్లో అమర్చాం. వచ్చే నెలాఖరుకు 10 వేల దుకాణాల్లో ఇవి అందుబాటులోకి వస్తాయి. అక్రమాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టడం ద్వారా ఇప్పటికే శాఖకు రూ.1,100 కోట్లు ఆదా చేయగలిగాం’ - సీవీ ఆనంద్, పౌర సరఫరాల కమిషనర్ -
సమస్యల పరిష్కారానికి సానుకూలం
డీలర్లతో పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించేందుకు సర్కార్ సానుకూలంగా ఉందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు 1 నుంచి రేషన్ డీలర్లు సమ్మెకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో 2 రోజులుగా ఆయన వారితో చర్చలు జరిపారు. డీలర్ల కమీషన్ పెంపుతో పాటు వారి ఆదాయ మార్గాలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ పరిస్థితిలో మంచి వాతావరణాన్ని చెడగొట్టు కోవద్దని డీలర్లకు విజ్ఞప్తి చేశారు. సమ్మెకు వెళితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా తాము ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాల్సి ఉంటుందన్నారు. ‘రేషన్ డీలర్ల ఆదాయం పెరిగేలా రేషన్ వ్యవస్థ ప్రక్షాళనకు చర్యలు ప్రారంభించాం. భవిష్యత్తులో రేషన్ షాపులు మినీ బ్యాంకులుగా మారనున్నాయి. రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా మార్చాలన్న ప్రతిపాదన కూడా ఉంది. డీలర్ల కమీషన్ పెంపు, గౌరవ వేతనం తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు’ అని తెలిపారు. రేషన్ డీలర్లకు కనీస గౌరవ వేతనం రూ.30 వేలు చెల్లించాలని, డీడీ కట్టడానికి వడ్డీలేని రుణాలివ్వాలని, హెల్త్ కార్డులు సౌకర్యం కల్పించాలని, పోర్టబిలిటీ విషయాన్ని పునఃపరిశీలించాలని డీలర్లు.. కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. బత్తుల రమేశ్, మల్లేశం, వెంకటరమణ, నాయికోటి రాజు ఆధ్వర్యంలోని సంఘాలతో సీవీ ఆనంద్ చర్చలు జరిపారు. -
ధాన్యం సేకరణలో రాష్ట్రానికి నాలుగో స్థానం
►11 లక్షల మంది రైతుల నుంచి 53.66 లక్షల టన్నుల సేకరణ ► రూ.8 వేల కోట్ల చెల్లింపులు సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణలో తెలంగాణ చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది (2016–17) ఖరీఫ్, రబీ సీజన్లలో పౌరస రఫ రాల సంస్థ రైతుల నుంచి అంచనాలకు మించి 53.66 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఖరీఫ్‌లోనే 37.14 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లలో పంజాబ్, ఛత్తీస్‌గఢ్, ఏపీ తొలి మూడు స్థానాల్లో ఉండగా, తెలంగాణకు నాలుగో స్థానం దక్కింది. ఏపీ 55.32 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, తెలంగాణ ఇంచుమిం చుగా 11 లక్షల మంది రైతుల నుంచి 53.66 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు 2013–14లో అత్యధికంగా 24.82 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా తాజాగా ఆ రికార్డును తిరగరాసింది. దళా రుల ప్రమేయాన్ని నివారించేందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈసారి ఆన్లైన్ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది రూ.8,105.34 వేల కోట్లను తొలిసారి ఆన్లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేసింది. లక్ష్యాన్ని మించి కొనుగోళ్లు: సీవీ ఆనంద్ ఈ ఏడాది లక్ష్యానికి మించి రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని, అన్ని స్థాయిల్లో అధికారుల సహకారంతో లక్ష్యం చేరుకున్నా మని సివిల్ సప్లైస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అవసరమైన నిధులను సమకూర్చడం వల్ల ఎలాంటి జ్యాపం లేకుండా రైతులకు చెల్లింపులు పూర్తి చేశామన్నారు. దేశంలో తొలిసారిగా ఆన్లైన్ ద్వారా రూ. 8,105.34 కోట్లు చెల్లించి రికార్డు సృష్టించామన్నారు. -
కొత్త జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు
- వచ్చే ఏడాది నుంచి చేస్తామన్న - రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి కొత్త జిల్లాల వారీగా ధాన్యం కొనుగోలు చేస్తామని, 31 జిల్లాలను ఆన్లైన్ పరిధిలోకి తీసుకువస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు నిరీక్షించే పరిస్థితులు లేకుండా వేగంగా కొనుగోళ్లు చేస్తున్నామని చెప్పారు. రబీ సీజన్‌కు సంబంధించి కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ఆగస్ట్ 31వ తేదీలోగా అప్పగించాలని రైస్ మిల్లర్లను కోరారు. యాదాద్రి, జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో గురువారం ఆయన పర్యటించి కొనుగోలు కేంద్రాల్లోని ఏర్పాట్లను పరిశీలించారు. ఆయా జిల్లా డీసీఎస్ఓలు, సంస్థ మేనేజర్లు, అధికారులతో సమీక్షలు జరిపారు. ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో ఈ నెల 24వ తేదీ వరకు పౌర సరఫరాల సంస్థ 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. రబీలో ఏకంగా 28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మరో ఇరవై రోజుల్లో 10 నుంచి 15 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. అంచనాలకు మించి ధాన్యం దిగుబడి వచ్చినా క్షేత్ర స్థాయిలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల అధికా రులు, సిబ్బంది సమస్యలను అధిగమించారని అభినందించారు. రేషన్ షాపుల్లో సంస్కరణలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా ఖాళీల భర్తీ, కార్డుల క్రమబద్ధీకరణ, బినామీ డీలర్ల తొలగింపు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ–పాస్ విధానం అమలు వచ్చే రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. -
ఉద్యోగుల సహకారంతోనే సంస్కరణలు
పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ సాక్షి, హైదరాబాద్: అవినీతి నిర్మూలన, పారదర్శకత, వినియోగదారులకు మెరుగైన సేవలు, ఉద్యోగుల్లో నిబద్ధత, సమయపాలన పాటించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం వల్లే పౌరసరఫరాల శాఖలో సంస్కరణలు సాధ్యమయ్యాయని ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఉద్యోగుల సహకారంతో ఇవన్ని సాకారమయ్యాయని, సీఎం కేసీఆర్ ప్రశంసలూ దక్కాయని చెప్పారు. పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు, రైస్ మిల్లర్లు, రేషన్ డీలర్లు శనివారం కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇది ఒక్కరి విజయం కాదు. నన్ను అభినందిస్తే మీ అందరినీ అభినందించినట్లే. పౌర సరఫరాల శాఖలోని ప్రతి ఉద్యోగి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైంది’అని పేర్కొన్నారు. పౌరసరఫరాల శాఖకు మంచి పేరు రావడానికి సంబంధిత శాఖ మంత్రి ఈటల రాజేందర్ సహకారం కూడా ఎంతో ఉందన్నారు. ఇక రేషన్ షాపుల్లో సంస్కరణలు చేపట్టి మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సి ఉందని వివరించారు. -
ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో సత్ఫలితాలు
పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలు అడ్డుకోడానికి ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ విభాగాలతో సత్ఫలితాలు వస్తున్నాయని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. మండల స్థాయి గిడ్డంగులు, రేషన్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి బియ్యం అక్రమ రవాణాకు బృందాలు చెక్ పెడుతున్నాయని పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ బృంద ప్రతినిధులతో ఆదివారం సమావేశం నిర్వహించిన సీవీ ఆనంద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు రాష్ట్రవ్యాప్తంగా 179 ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించి రూ.కోటికి పైగా విలువ గల 3,507 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 937 క్వింటాళ్ల సీఎంఆర్ ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అక్రమంగా నిల్వ ఉంచిన రూ.2.15 లక్షల విలువ గల చక్కెర, ఎల్పీజీ సిలిండర్లు, కిరోసిన్‌నూ స్వాధీనం చేసుకున్నామని.. రూ.3.16 కోట్ల విలువైన సన్నబియ్యం అక్రమ రవాణా నివారించామని చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ నిఘాతో మిల్లర్లకు రావాల్సిన సీఎంఆర్ కూడా పూర్తిస్థాయిలో వచ్చిందని.. ఈ బృందాల వల్లరేషన్ దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్లలో పనితీరు మెరుగుపడిందని కమిషనర్ వివరించారు. -
సీవీ ఆనంద్‌కు ఇన్నోవేటివ్ లీడర్షిప్ అవార్డు
కేంద్ర మంత్రి చేతుల మీదుగా అందజేసిన రాజస్థాన్ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్‌కు రాజస్థాన్ ప్రభుత్వం ‘ఇన్నోవేటివ్ లీడర్షిప్ అవార్డును ప్రకటించింది. జైపూర్‌లో రాజస్థాన్ ప్రభుత్వం మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ‘ఈ – ఇండియా ఇన్నోవేటివ్ సమ్మిట్’లో శుక్రవారం కేంద్ర మంత్రి పీపీ చౌదరి చేతుల మీదుగా సీవీ ఆనంద్ ఈ అవార్డు అందుకున్నారు. గతంలో సైబరాబాద్ సీపీగా మూడు రోజుల్లో పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసేలా, మద్యం తాగి వాహనాలు నడపటం, ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి కేసుల్లో ఈ – చలాన్లను ఆనంద్ ప్రవేశపెట్టారు. పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీలు, వీడియో కాన్ఫరెన్స్ విధానం, 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో వాహనాలకు జీపీఎస్ ఉపయోగించి ఎన్నికల అక్రమాలను అరికట్టారు. దీనికి గాను రాష్ట్రపతి నుంచి అవార్డు కూడా అందుకున్నారు. దేశంలోనే ఎక్కువ మొత్తంలో రూ.23 కోట్ల నగదును సీజ్ చేశారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల ఏర్పాటు, గోదాముల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసి సత్ఫలితాలు రాబట్టారు. ఈ వినూత్న పద్ధతులు జాతీయ స్థాయిలో పలువురి దృష్టిని ఆకర్శించాయి. దీంతో రాజస్థాన్ ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానంతో ఇన్నోవేటివ్ సమ్మిట్‌కు హాజరైన సీవీ ఆనంద్ అక్కడ కీలకోపన్యాసం చేశారు. తాను చేపట్టిన వినూత్న కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. -
సంస్కరణలతో రూ.855 కోట్లు ఆదా
పౌర సరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖ, సంస్థల్లో చేపట్టిన సంస్కరణల వల్ల రూ.855 కోట్లు ఆదా చేయగలిగామని పౌర సరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అమలు చేస్తున్న ఈ–పాస్ విధానాన్ని మరిన్ని జిల్లాలకు విస్తరించనున్నామని.. దానివల్ల ఏడాది కాలంలో మరో రూ.800 కోట్లు ఆదా అవుతాయని తెలిపారు. పౌర సరఫరాల శాఖతో పాటు పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, ఎండీగా, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీవీ ఆనంద్ తాను బాధ్యతలు చేపట్టి ఐదు నెలలైన సందర్భంగా... మంగళవారం హైదరాబాద్‌లోని పౌర సరఫరాల భవన్లో విలేకరులతో మాట్లాడారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో ధాన్యం సేకరణ కేంద్రాలు, మిల్లులు, గోదాంలు, పాఠశాలలు, వసతి గృహాలు, రవాణా వంటి వాటి పర్యవేక్షణ స్థాయి మెరుగుపడిందన్నారు. రేషన్ బియ్యం దారి మళ్లింపు, రీసైక్లింగ్ చేస్తున్న వారిని గుర్తించడం, క్రిమినల్ కేసుల నమోదు, బ్లాక్ లిస్టులో పెట్టడం, 6ఎ కేసులకు సంబంధం ఉన్న వారికి ధాన్యం ఇవ్వకుండా నిలిపివేయడం వంటి చర్యలు తీసుకున్నామన్నారు. పీడీఎస్ బియ్యాన్ని రవాణా చేసే 1,150 వాహనాలకు జీపీఎస్ అమర్చినట్లు చెప్పారు. 2017లో పౌర సరఫరాల సంస్థ సామరŠాథ్యన్ని పెంచేందుకు మరో 5 విభాగాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించామని ఆనంద్ తెలిపారు. ఐటీ విభాగం, ఎన్ఫోర్స్మెంట్–టాస్క్‌ఫోర్స్, ఆర్థిక నిర్వహణ–పర్యవేక్షణ విభాగం, సాంకేతిక విభాగం, ఇంజనీరింగ్ విభాగాలను సమకూర్చుకుంటామని.. వాటిని ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ మినహా ఇతర అన్ని నియామకాలు, పరీక్షలు, ఇంటర్వూ్యలను సీజీజీ చూసుకుంటుందన్నారు. -
ఎన్నికల ఖర్చుపై పక్కా నిఘా ఉంచాలి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఖర్చుపై పక్కా నిఘా ఉంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు ఢిల్లీలోని నిర్వచన్ సదన్‌లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల విధులు నిర్వహించే నిఘా బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ల వాహనాల న్నింటికీ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) పరికరాలు అమర్చాలని అన్నారు. ఈ పరికరా లన్నింటినీ పరిశీలించడానికి ఉమ్మడి కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని, అనుమానిత బ్యాంకు ఖాతాలు, ఏటీఎంల ద్వారా జరిగే లావాదేవీలు, నగదు బదిలీలపై నిఘాను మరింత కట్టు దిట్టం చేయాలని పేర్కొన్నారు. బంగారు తనఖా రుణాల వేలం, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సేవా సంస్థల ఖాతాలపైనా నిఘా పెట్టాలని చెప్పారు. రహస్య సమాచార సేకరణ వ్యూహాలు, మత్తుపానీయాల తయారీ, అమ్మ కాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఇలా ఎన్నికల్లో వీటన్నింటిపై పక్కా నిఘా ఉంటే ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరగకుండా పూర్తి స్థాయిలో కళ్లెం వేసే వీలుం టుందని ఆయన అన్నారు. -
అనాథలకు అండ
- ‘నోటు’కాడి కూడూ రద్దు కథనంపై స్పందించిన సర్వ్ నీడీ స్వచ్ఛంద సంస్థ - రోజూ 200 మందికి మేం భోజనం పెడతాం - చౌటుప్పల్ అమ్మానాన్న అనాథాశ్రమానికి దాతల చేయూత - అన్నపూర్ణ పథకం పునరుద్ధరించేందుకు సన్నద్ధం చౌటుప్పల్: ‘నోటు’కాడి కూడూ రద్దు’అనే శీర్షికతో బుధవారం ‘సాక్షి’దినపత్రిక ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి అనూహ్య స్పందన లభించింది. అర్ధాకలితో అలమటిస్తున్న అనాథల కడుపు నింపేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. సగం కడుపుతో కాలం వెళ్లదీస్తున్న విధివంచితులకు అండగా నిలిచేందుకు సికింద్రాబాద్‌లోని కార్ఖానా ప్రాంతానికి చెందిన సర్వ్ నీడీ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ముందుకొచ్చారు. నోట్ల రద్దు ప్రభావంతో తలెత్తిన ఇబ్బందులను తొలగించి ఆశ్రమంలో ఉన్న ప్రతిఒక్కరికీ కడుపునిండా భోజనం పెట్టేందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తామన్నారు. సాక్షి ప్రచురించిన కథనానికి చలించిపోయిన వారు వెంటనే స్పందించి ఆశ్రమ వివరాలను తెలుసుకున్నారు. ఆశ్రమంలో ఉన్న అనాథలందరికీ అవసరమైన పండ్లు, స్వీట్లు, దుస్తులు, భోజనం తీసుకువచ్చారు. స్వయంగా అనాథలకు అందజేశారు. ఇక నుండి ఇక్కడి అనాథలు అర్ధాకలితో అలమటించే పరిస్థితులు రాకుండా ఉండేందుకు చేయూత అందిస్తామని సర్వ్ నీడీ సంస్థ నిర్వాహకులైన సి.వెంకటరమణా రెడ్డి కుటుంబం హామీ ఇచ్చింది. 200 మందికి తగ్గకుండా ప్రతిరోజూ ఒకపూట భోజన వసతి కల్పిస్తామని వారు పేర్కొన్నారు. అవసరమైతే ఇక్కడ ఉన్న అనాథలందరికీ భోజనాన్ని సమకూర్చేందుకు కృషి చేస్తామన్నారు. ఒకటి, రెండు రోజుల్లో పూర్తి స్పష్టత ఇస్తామని చెప్పారు. సూర్యాపేట దాత బియ్యం అందజేత సాక్షి కథనానికి సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఒక దాత చలించిపోయాడు. తన వంతుగా చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చాడు. 100 కిలోల బియ్యాన్ని వాహనంలో ఆశ్రమానికి పంపించి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఆయన తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. పునరుద్ధరణ దిశగా అన్నపూర్ణ సాక్షి కథనంతో అధికారులు స్పందించారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్, జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు సాక్షి క«థనాన్ని చదివి వెంటనే సివిల్ సప్లయ్ రాష్ట్ర కమిషనర్ సీవీ ఆనంద్ దృష్టికి తీసుకువెళ్లారు. అనాథ ఆశ్రమంలోని 237 మంది అనాథలకు గతంలో అన్నపూర్ణ పథకం ద్వారా బియ్యం అందిన విషయాన్ని తెలిపారు. జిల్లాల విభజన తర్వాత బియ్యం సరఫరా నిలిచిపోయిన పరిస్థితిని కమిషనర్ వివరించారు. దీంతో స్పందించిన కమిషనర్ సీవీ ఆనంద్ అమ్మానాన్న అనాథ ఆశ్రమ నిర్వాహకుడు గట్టు శంకర్ వచ్చి తన కార్యాలయంలో కలవాలని చెప్పారు. బియ్యం పథకం పునరుద్ధరించేందుకు నిర్ణయించారు. -
అడ్డంగా కోసేస్తున్నారు
కొనసాగుతున్న ఆహార భద్రత కార్డుల తొలగింపు ఎనిమిది నెలల్లో 2.43 లక్షల కార్డులు రద్దు పేదల పరేషాన్ సర్కిల్ ఆఫీసుల చుట్టూ చక్కర్లు సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో ఆహార భద్రత కార్డు కోత కొనసాగుతునే ఉంది, కార్డుల ఏరివేత నిలిపివేయాలని సాక్షాత్తు పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ అనంద్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా వడబోత ప్రక్రియ మాత్రం ఆగడం లేదు. మరోవైపు రద్దరుునా అర్హుల కార్డుల పునరుద్దరణ మాత్రం నత్తలకు నడక నేర్పిస్తోంది. ఎనిమిదినెలల వ్యవధిలో సుమారు 2.43 లక్షల కార్డులు రద్దయ్యారుు. అనర్హులతో పాటు అర్హుల కార్డులు, యూనిట్లు సైతం రద్దుకావడంతో పేదల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదీ లెక్క.. గ్రేటర్ పరిధిలో సుమారు 12 పౌరసరఫరాల సర్కిళ్లు ఉన్నారుు. ఈ ఏడాది ఏప్రిల్‌లో 13.57 లక్షల కార్డులు, అందులో 44.74 లక్షల యూనిట్లు ఉండగా, తాజాగా కార్డుల సంఖ్య 11.14 లక్షలు, యూనిట్ల సంఖ్య 39.07 లక్షలకు చేరింది. అంటే 2.43 లక్షల కార్డులు, 5.67 లక్షల యూనిట్లు కోతకు గురయ్యారుు. జిల్లాల పునర్విజన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం మూడుముక్కలు కాగా, హైదరాబాద్‌లో పాత తరహాలోనే తొమ్మిది సర్కిల్స్ యథావిధిగా ఉండగా, మేడ్చల్‌లో రెండు, రంగారెడ్డిలో ఒక సర్కిల్స్ గ్రేటర్ పరిధిలో చేరారుు. ప్రస్తుతం మేడ్చల్‌లో బాలనగర్ సర్కిల్-1 లో 1, 90, 322 కార్డులు, 6,36,303 యూనిట్లు, ఉప్పల్ సర్కిల్-2 లో 1,62,218 కార్డులు, 5, 30, 174 యూనిట్లు ఉన్నారుు. రంగారెడ్డి అర్బన్‌లోని సరూర్‌నగర్ సర్కిల్లో 1,84, 389 కార్డులు, 6,12,475 యూనిట్లు ఉన్నారుు. అందరూ ఒకే గాటికి... పౌరసరఫరాల శాఖ అనర్హులు, అర్హులను ఒకే గాటికి కట్టి వేటు వేస్తోంది. నిబంధనల ప్రకారం కార్డు పొందేందుకు అనర్హులైనా, ఆరోగ్య శ్రీ, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ వంటి ప్రభుత్వ పథకాల కింద అర్హత పొందవచ్చునన్న ఆశతో కొందరు ఆహార భద్రతా కార్డులు తీసుకున్నారు.మరోవైపు డీలర్లు సైతం చేతివాటాన్ని ప్రదర్శించారు. అధికారులు సైతం క్షేత్రస్థారుులో పరిశీలించకుండానే అనర్హులకు కార్డులు మంజూరు చేశారు. వీటిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అధికారులు దిద్దుబాటు పనిలో పడ్డారు. తాజాగా ఆధార్ అనుసంధానంతో స్వంత ఆస్తులు, వాహనాలు, వ్యాపారాలు కలిగి ఉన్నారన్న సాకుతో ఆహార భద్రత కార్డులపై వేటు వేస్తున్నారు. అందులో సగానికి పైగా అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలు కావడం విస్మయానికి గురిచేస్తోంది. బహుళ ప్రయోజన కారి ఆధార్ పేదల పాలిట శాపమైంది. కుటుంబంలో ఏ ఒక్కరిపై వాహనం ,వ్యాపారం ఉన్నట్లు గుర్తించినా కార్డు రద్దవుతోంది. ఉపాధి కోసం ఫైనాన్‌సపై నాలుగు చక్రాల పెద్ద వాహనాలు కొనుగోలు చేసిన కుటుంబాలు సైతం సంపన్నుల జాబితాలో చేరిపోయారు. వాస్తవంగా పౌరసరఫరాల శాఖ బోగస్ కార్డుల ఏరివేతలో భాగంగా గత రెండునెలలుగా అనర్హుల పై దృష్టి సారించింది. స్వంత ఇళ్లు, వ్యాపారాలు, వాహనాలు కలిగి ఉన్న వారిని గర్తించేందుకు జీహెచ్ఎంసీ,ఆర్టీఏ, వాణిజ్య పన్నుల తదితర శాఖల నుంచి వివరాలను సేకరించింది. వాటిని ఈ-పీడీఎస్ తో అనుసంధానం చేసి వారి కార్డులను తొలగింస్తోంది. సంపన్నులతో పాటు పేదలు సైతం అడ్డంగా వేటుకు గురయ్యారు. -
అత్యున్నత కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతా
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థను రాష్ట్రంలోనే అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దుతానని చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. అందరూ గర్వపడేలా అవినీతిరహిత కార్పొరేషన్‌గా పేరొచ్చే లా పనిచేయాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం తొలిసారి ఆయన సంస్థ కార్యాలయానికి వచ్చారు. ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్‌తో కలసి ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఉమ్మడి పాలన వారసత్వాలను విడిచి రాష్ట్ర ప్రభుత్వ అంచనా లకు తగినట్లుగా పనిచేయాలని ఈ సందర్భంగా ఉద్యోగులకు సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం, ప్రజలు ప్రశంసించేలా కార్పొరేషన్ పనితీరు ఉండాలని, ఇందుకోసం ఉద్యోగులంతా ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలన్నారు. కమిషనర్ ఆనంద్ మాట్లాడుతూ.. రూ.వేల కోట్ల టర్నోవర్ ఉన్న కార్పొరేషన్లో సరైన సిబ్బంది, విభాగాలు లేవని, ఫైనాన్స, ఐటీ, టెక్నికల్ ఇంజనీరింగ్ వంటి విభాగాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
సీఎంఆర్ బకాయిలపై సర్కార్ దృష్టి
వంద శాతం బకాయిలు చెల్లిస్తే కేసులు ఎత్తేస్తాం: సీవీ ఆనంద్ సాక్షి, హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) బకాయిల వసూలుపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలవారీగా ఎగవేతదారుల జాబితాను తయారు చేశారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 2010-11 నుంచి 2014-15 వరకు 115 మంది మిల్లర్ల నుంచి రూ.134 కోట్ల విలువ చేసే 57,781 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉందన్నారు. బుధవారం ఇక్కడ పౌరసరఫరాల శాఖ భవన్లో సీఎంఆర్ ఎగవేసిన మిల్లర్లతో కమిషనర్ సమావేశమయ్యారు. రెండు, మూడు దఫాలుగా చర్చలు జరిపారు. ఎగవేతదారుల వివరాలను వారికి అందించి, పలు ప్రతిపాదనలను మిల్లర్ల ముందుంచారు. దీనిపై సంబంధిత శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. నవంబర్ 30వ తేదీలోగా సీఎంఆర్ బకాయిలు మొత్తం చెల్లిస్తే కేసులు ఎత్తివేసి, సీజ్ అయిన వాటిని తెరిపించి, మిల్లింగ్ సామర్థ్యాన్ని బట్టి సీఎంఆర్ ధాన్యం కేటాయిస్తామని ఆనంద్ చెప్పారు. 75% బకాయిలు చెల్లిస్తే మాత్రం సామర్థ్యాన్ని బట్టి ధాన్యం కేటాయిస్తామని, మిగిలిన 25% జన వరి 31లోగా చెల్లించాలని సూచించారు. 50% అప్పగించినవారు మిగి లిన 50% మార్చి 31లోగా అప్పగించాలన్నారు. వంద టన్నుల కంటే తక్కువగా సీఎం ఆర్ అప్పగించే మిల్లులకు ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. సీఎంఆర్ అప్పగించలేనివారు మార్కెట్ ధర ప్రకారం నగదు రూపంలో కూడా చెల్లించవచ్చన్నారు. పాత బకాయిలపై ప్రభుత్వం ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
నేటి నుంచి ధాన్యం కొనుగోలు
మంత్రి ఈటల వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంగళవారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం లెవీని రద్దు చేసినా రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రాలు నెలకొల్పుతోందని చెప్పారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.1,510, గ్రేడ్-2ధాన్యానికి రూ.1,470 కనీస మద్దతు ధర చెల్లిస్తామని తెలిపారు. సోమవారం సచివాలయంలో మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, సివిల్ సప్లయిస్ కమిషనర్ సీవీ ఆనంద్ రాష్ట్రంలోని రైస్ మిల్లర్లతో సమావేశమయ్యారు. అనంతరం మం త్రి ఈటల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధాన్యం తీసుకున్న మిల్లర్లు 45 రోజుల్లోనే బియ్యాన్ని ఇచ్చేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దాదాపు రూ.400 కోట్ల విలువైన బియ్యం రికవరీకి నోటీసులు జారీ చేశామన్నారు. మిల్లర్లు అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని ఈటల హెచ్చరించారు. బియ్యాన్ని అక్రమంగా కాకినాడ పోర్టుకు తరలించే బ్రోకర్లున్నారని, మిల్లర్ల పేరుతో బ్రోకర్లుగా వ్యవహరించే వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టంచేశారు. రేషన్ కార్డులు బియ్యానికి మాత్రమే.. రేషన్ కార్డులు కేవలం బియ్యం కోసమేనని, స్కాలర్షిప్పులు, ఆరోగ్యశ్రీ పథకాలకు ఉద్దేశించినవి కావని ఈటల స్పష్టం చేశారు. బియ్యం అక్కర్లేనివారు కార్డులను సరెండర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రేషన్ కార్డుల క్రమబద్ధీకరణ, డీలర్లకు కమీషన్ పెంపు, ఈ పాస్ మిషన్ల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించినట్లు వివరించారు.