employment opportunities
-
టెలీ కాలింగ్ ఉద్యోగాల బూమింగ్
ముంబై: టెలీ కాలింగ్, బిజినెస్ డెవలప్మెంట్ తదితర ఆధునిక విక్రయ విభాగాల్లో గతేడాది 34 శాతం అధిక ఉపాధి అవకాశాలు లభించినట్టు జాబ్‌పోర్టల్ ‘వర్క్ ఇండియా’ నివేదిక వెల్లడించింది. సేల్స్ ఉద్యోగ మార్కెట్ భారత్‌లో మార్పును చూస్తున్నట్టు తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. 2023తో పోల్చితే ఈ విభాగంలో 2024లో జాబ్ పోస్టింగ్‌లు 17 శాతం పెరిగాయి. సంప్రదాయ మార్గాల కంటే కొత్త తరహా డిజిటల్ ఛానళ్లపైనే కంపెనీలు ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. ఇలా ఆధునిక విక్రయ ఛానళ్లలో టెలీకాలింగ్, బిజినెస్ డెవలప్మెంట్లో గతేడాది ఉపాధి అవకాశాలు అంతకుముందు ఏడాదితో పోల్చితే గణనీయంగా (34 శాతం) పెరిగాయి. సంప్రదాయ సేల్స్ ఉద్యోగాలైన రిటైల్, ఫీల్డ్ సేల్స్ ఉద్యోగాలు మాత్రం అంతకుముందు ఏడాదితో పోల్చితే 2 శాతం తగ్గాయి. 2023, 2024 సంవత్సరాల్లో తన ప్లాట్‌ఫామ్‌పై నమోదైన 12.8 లక్షల జాబ్ పోస్టింగ్‌ల డేటా ఆధారంగా ఈ వివరాలను వర్క్‌ఇండియా విడుదల చేసింది. అన్నింటిలోకి టెలీకాలర్ ఉద్యోగాలకు బూమింగ్ వాతావరణం ఉన్నట్టు ఈ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. ఎందుకంటే 2023లో టెలీకాలర్ ఉద్యోగాలకు ఎక్కువ పోస్టింగ్‌లు నమోదు కాగా, 2024లోనూ అదే వాతావరణం కొనసాగింది. 22 శాతం అధికంగా టెలీకాలర్ జాబ్ పోస్టింగ్‌లు వర్క్ఇండియాపై లిస్ట్ అయ్యాయి. బిజినెస్ డెవలప్మెంట్ జాబ్లకు ఏకంగా 80 శాతం అధిక పోస్టింగ్‌లు వచ్చాయి. మహిళలకు ప్రాధాన్యం.. టెలీకాలర్ ఉద్యోగాల్లో మహిళల నియామకాలు గణనీయంగా పెరిగాయి. 2024లో టెలీకాలింగ్, బిజినెస్ డెవలప్మెంట్లో మహిళల నియామకం 2023తో పోల్చితే 80 శాతం పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. సేల్స్‌లో మహిళలకు పెరుగుతున్న ప్రాతినిధ్యాన్ని సూచిస్తున్నట్టు తెలిపింది. సేల్స్‌లో మార్పులు.. అమ్మకాల విషయంలో కంపెనీల్లో వస్తున్న మార్పును ఈ గణాంకాలు ప్రతిఫలిస్తున్నట్టు వర్క్‌ఇండియా నివేదిక తెలిపింది. అదే సమయంలో సంప్రదాయ సేల్స్ ఉద్యోగాలకు తగ్గడాన్ని ప్రస్తావించింది. టైర్, 3, 4 పట్టణాల మినహా మిగిలిన చోట సంప్రదాయ సేల్స్ ఉద్యోగాల పోస్టింగ్‌లు తగ్గినట్టు తెలిపింది. కొత్త తరహా సేల్స్ ఉద్యోగాల నియామకాల్లో బెంగళూరు, ముంబై ముందున్నాయి. 2023తో పోల్చితే 2024లో బెంగళూరులో 33 శాతం, ముంబైలో 26 శాతం చొప్పున జాబ్ పోస్టింగ్‌లు ఎక్కువగా వచ్చాయి. పట్టణాల్లో విక్రయ నైపుణ్యాలున్న వారికి పెరుగుతున్న డిమాండ్‌కు ఇది అద్దం పడుతున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. -
పాలనపై పట్టుకు మరికొంత సమయం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘అందరినీ సమన్వయం చేసుకుంటూ.. సుపరిపాలన అందిస్తే పాలనపై పట్టు సాధించినట్లు.. నేను ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నా. దీనికి మరికొంత సమయం పడుతుంది. పాలనపై నాకు ఇంకా పట్టురా లేదని కొందరు అంటున్నారు. పాలనపై పట్టు అంటే ఏంటి? ఒకరిద్దరు మంత్రులను తొలగించడం, ఓ ఇద్దరు అధికారులపై కేసులు పెట్టి జైలుకు పంపించడమా?’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో ఉందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 57 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టలేదన్నారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు.యువతకు భవిష్యత్తు ఇవ్వడానికే..రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథ కాన్ని తీసుకువచ్చినట్టు సీఎం రేవంత్ చెప్పారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున పోరాడిన యువత.. ఇప్పుడు మత్తు పదార్థాలకు బానిస లుగా మారుతున్నారు. ఇదో పంజాబ్, కేరళ మాదిరిగా మారుతోంది. అలాకాకుండా యువతకు భవిష్యత్తు ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. రూ.6 వేల కోట్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని 5 లక్షల మంది నిరుద్యోగులకు రాయితీ పద్ధతిలో ఆర్థిక సహకారం అందిస్తాం. ఇది పార్టీ పథకం కాదు.. పూర్తిగా ప్రజలు, అర్హులైన నిరుద్యోగులకు అమలు చేసే పథకం. పూర్తిగా ప్రజల పథకం’’ అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎన్నో హామీలు అమలు చేశామని, పథకాలు, సంస్కరణలు తీసుకువచ్చాని రేవంత్ చెప్పారు.అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడపం..రాష్ట్రంలో బీసీ జనాభా 56.36శాతం ఉందని కుల సర్వే ద్వారా తేల్చామని, వారికి 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో బిల్లు పెట్టామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై దేశంలోనే మొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టిందన్నారు. ‘‘ప్రభుత్వ ఆదాయం తగ్గినా, అప్పులు పెరిగినా ధైర్యాన్ని కోల్పోలేదు. అబద్ధాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడిపించం. దుబారా తగ్గించి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నాం. ఇసుక విక్రయంతో రోజువారీ ఆదాయం రూ.3 కోట్లకు పెరిగింది. పన్నుల వసూలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. నిరుద్యోగ సమస్య 8.8 నుంచి 6.6శాతానికి తగ్గిందని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయి..’’ అని చెప్పారు. రాజీవ్ యువ వికాసం ద్వారా రూ.50 వేల నుంచి రూ. 4లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామని.. జూన్ 2న లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తామని సీఎం తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 5 వేల మంది వరకు లబ్ధి కలిగిస్తామని, నిజమైన నిరుద్యోగులకే పథకం అందిస్తామని వివరించారు.నిరుద్యోగ యువత కాళ్లపై నిలబడేలా..: భట్టిగత ప్రభుత్వం దశాబ్దకాలంలో ఒక్కసారి కూడా గ్రూప్–1 నియామకాలు చేపట్టలేదని.. తాము కేవలం ఏడాదిలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో జాబ్ కేలండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువత వారి కాళ్లపై నిలబడేలా, సమాజంలో తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికేలా స్వయం ఉపాధి పథకాలు అందించేందుకు సీఎం రేవంత్ రాజీవ్ యువ వికాసాన్ని తీసుకువచ్చారని భట్టి పేర్కొన్నారు. లబ్ధిదారులను మూడు కేటగిరీలుగా విభజించి, సాయం అందించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, కూనంనేని సాంబశివరావు తదితరులు మాట్లాడారు. -
గంగా మాత ఆశీస్సులతో దేశ సేవ: ప్రధాని మోదీ
హర్సిల్/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇక్కడ ఏదో ఒక సీజన్‌కు పరిమితం కాకుండా ఏడాది పొడవునా పర్యాటకులను ఆకర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచు కొండలు, ప్రకృతి రమణీయతతో కూడిన సుందరమైన రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో ఆఫ్–సీజన్ అనేదే ఉండకూడదని పేర్కొన్నారు. పర్యాటర రంగాన్ని అభివృద్ధి చేసుకుంటే స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ గురువారం ఉత్తరాఖండ్‌లో పర్యటించారు. ఉత్తరకాశీ జిల్లాలోని ముఖ్వా గ్రామంలో గంగా మాత ఆలయాన్ని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. తనను గంగా మాత దత్తత తీసుకున్నట్లు భావిస్తున్నానని, ఆ తల్లి ఆశీస్సులే తనను కాశీ(వారణాసి)కి తీసుకెళ్లాయని, దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాయని వ్యాఖ్యానించారు. అనంతరం హర్సిల్ గ్రామంలో బహిరంగ సభలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఉత్తరాఖండ్‌లో శీతాకాలంలో పర్యటిస్తే చక్కటి అనుభూతి లభిస్తుందని అన్నారు. దేశమంతా పొగమంచుతో కప్పబడి ఉన్న సమయంలో ఉత్తరాఖండ్ మాత్రం సూర్యకాంతిలో స్నానమాడుతూ కనిపిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 12 నెలల టూ రిజం విజన్‌ను ప్రధానమంత్రి ప్రశంసించారు. పర్యాటకులను ఆకర్శించడానికి బహుముఖ చర్యలు అవసరమని పేర్కొన్నారు. వేసవి కాలంలో పర్యాటకులతో కళకళలాడే ఉత్తరాఖండ్ చలికాలంలో మాత్రం ఖాళీగా దర్శనిస్తోందని, ఈ పరిస్థితి మారాలని స్పష్టంచేశారు. అన్ని సీజన్లలో పర్యాటకులు భారీగా తరలివచ్చేలా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని కోరారు. వింటర్ టూరిజం మనం లక్ష్యం కావాలని అన్నారు. చలికాలంలోనే అసలైన ఉత్తరాఖండ్‌ను అనుభూతి చెందవచ్చని పర్యాటకులకు సూచించారు. గిరిజన గ్రామమైన జడూంగ్ నుంచి హర్సిల్ విలేజ్ వరకూ ట్రెక్, బైక్ జర్నీని ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో రెండు కీలకమైన రోప్‌వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు గుర్తుచేశారు. రోప్‌వే ప్రాజెక్టుతో కేదార్నాథ్ ప్రయాణం 9 గంటల నుంచి 30 నిమిషాలకు తగ్గిపోతుందని వెల్లడించారు. వివాహాలు చేసుకొనేందుకు, సినిమాలు, షార్ట్‌ఫిలింల షూటింగ్‌లకు ఉత్తరాఖండ్‌లో చక్కటి వేదికలు ఉన్నాయని, వీటిని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సరిహద్దు గ్రామమైన హర్సిల్‌లో అడుగుపెట్టిన మొట్టమొదటి ప్రధానమంత్రి మోదీయేనని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ పేర్కొన్నారు. రేపు గుజరాత్లో మోదీ పర్యటన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన గుజరాత్లో పర్యటించనున్నారు. నవసారి జిల్లాలో లఖ్పతి దీదీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మహిళా పోలీసులు, మహిళా సిబ్బంది ఆధ్వర్యంలోనే నిర్వహించబోతున్నారు. -
ఉపాధిలో వ్యవసాయమే మేటి
సాక్షి, అమరావతి: దేశంలో ఉపాధి అవకాశాల కల్పనలో ఇప్పటికీ వ్యవసాయ రంగమే అగ్రగామిగా ఉన్నట్లు రిజర్వు బ్యాంకు రూపొందించిన నివేదిక వెల్లడించింది. 1991లో సరళీకృత ఆర్థిక విధానాలు అమలు చేసిన తరువాత దేశంలో ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. దీంతో వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడే వారి శాతం తగ్గినప్పటికీ నేటికీ అత్యధిక శాతం మందికి ఇవే ఉపాధి కల్పిస్తుండటం గమనార్హం. దేశంలో వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలను ఆర్బీఐ ‘పీరియడిక్ లేబర్ ఫోర్స్ (పీఎల్ఎఫ్)’ సర్వే నివేదిక వెల్లడించింది. రైల్వే, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గగా ఐటీ కంపెనీలు, ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది.పీఎల్ఎఫ్ నివేదికలోని ప్రధానాంశాలు..1993–94లో దేశంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై 64 శాతం మంది ఆధారపడగా 2018–19 నాటికి అది 42.5 శాతానికి తగ్గింది. 2023–24 నాటికి మాత్రం వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందుతున్న వారి సంఖ్య కొంత పెరిగి 46.2 శాతంగా నమోదైంది.అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థగా భారతీయ రైల్వే తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. అయినప్పటికీ రైల్వేలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 1991–92లో రైల్వే శాఖలో 16.52 లక్షల మంది ఉద్యోగులు ఉండగా 2023–24లో 11.90 లక్షలకు తగ్గింది.బ్యాంకింగ్ రంగంలోనూ ఉపాధి అవకాశాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. 1991–92లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 8.47 లక్షల మంది ఉద్యోగులు ఉండగా ప్రైవేట్ బ్యాంకుల్లో 63 వేల మంది మాత్రమే ఉన్నారు. కానీ 2023–24 నాటికిప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కంటే ప్రైవేట్ బ్యాంకుల్లోనే ఉద్యోగులు ఎక్కువ మంది ఉండటం గమనార్హం. 2023–24లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 7.46 లక్షల మంది ఉద్యోగులు ఉండగా ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో 8.74 లక్షల మంది పని చేస్తున్నారు.ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రాలో 2020 నాటికి 11.49 లక్షల మంది ఉద్యోగులు ఉండగా 2024 డిసెంబర్లో వీరి సంఖ్య 15.34 లక్షలకు చేరుకుంది. -
ఫ్రెషర్లకు ఈ ఏడాది అధిక అవకాశాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫ్రెషర్లకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఫ్రెషర్ల నియామక ఉద్దేశ్యం కంపెనీల్లో 74 శాతానికి చేరినట్టు టీమ్‌లీజ్ ఎడ్యుటెక్‌కు చెందిన కెరీర్ అవుట్‌లుక్ సర్వే నివేదిక వెల్లడించింది. రాబోయే నెలలకు సంబంధించి వ్యాపార విశ్వాసాన్ని ఇది తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ముఖ్యంగా ఐటీ రంగం కోలుకోవడం ఫ్రెషర్లకు మరిన్ని అవకాశాలను తెచి్చపెట్టనున్నట్టు తెలిపింది. ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలల కాలానికి నివేదికను విడుదల చేసింది. డీప్‌టెక్ ఉద్యోగాలైన రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సర్టిఫైడ్ రోబోటిక్ ఇంజనీర్ కోర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, హెల్త్‌కేర్ మేనేజ్మెంట్, ఏఐ అప్లికేషన్లలో ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లకు డిమాండ్ ఉన్నట్టు వెల్లడించింది. ఈ సర్వేలో 649 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. కొన్ని రంగాలు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో నియామకాలకు సంబంధించి బలమైన ధోరణిని వ్యక్తం చేశాయి. ఈ–కామర్స్ అండ్ టెక్నాలజీ స్టార్టప్‌ల్లో ఫ్రెషర్ల నియామక ధోరణి 61 శాతం నుంచి 70 శాతానికి పెరిగింది. తయారీలో 52 శాతం నుంచి 66 శాతానికి, ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాలో 59 శాతం నుంచి 69 శాతానికి పెరిగింది. ఐటీ రంగంలో జోష్ ‘‘ఐటీ రంగం చెప్పుకోతగ్గ మేర కోలుకుంది. ఆరంభ స్థాయి ఉద్యోగుల నియామకాల ఉద్దేశ్యం 2024 ద్వితీయ 6 నెలల కాలంలో ఉన్న 45% నుంచి, 2025 మొదటి 6 నెలల కాలానికి 59 శాతానికి పెరిగింది. హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్ రంగంలోనూ ఇది 47% నుంచి 52 శాతానికి పెరిగింది’’అని ఈ నివేదిక వెల్లడించింది. విద్యుత్, ఇంధన రంగం, మార్కెటింగ్ అండ్ అడ్వరై్టజింగ్ సైతం బలమైన వృద్ధిని చూపించినట్టు తెలిపింది. భౌగోళికంగా చూస్తే బెంగళూరు 78%, ముంబై 65%, ఢిల్లీ ఎన్సీఆర్ 61%, చెన్నై 57% చొప్పున తాజా గ్రాడ్యుయేట్లకు అవకాశాలు కల్పించనున్నట్టు పేర్కొంది. క్లినికల్ బయోఇన్ఫర్మాటిక్స్ అసోసియేట్, రోబోటిక్స్ సిస్టమ్ ఇంజనీర్, సస్టెయి నబులిటీ అలనిస్ట్, ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ వర్ధ మాన కెరీర్ మార్గాలుగా అవతరిస్తున్నట్టు తెలిపింది. సమకాలీన వ్యాపార అవకాశాల దృష్ట్యా కంపెనీలు ముఖ్యంగా రోబో టిక్ ప్రాసెస్ ఆటోమేషన్, పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ రిస్క్ అనలైసిస్ నైపుణ్యాలున్న వారి కోసం చూస్తున్నాయని ఈ నివేదిక వెల్లడించింది. -
ఏఐదే హవా!
సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణలకున్న ప్రాధాన్యత దృష్ట్యా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఐటీ నిపుణుల అవసరం పెరుగుతోంది. దీంతో పలు సంస్థలు నైపుణ్యం గల యువత కోసం అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా క్యాంపస్ నియామకాల కోసం కాలేజీల బాట పడుతున్నాయి. మారిన సాంకేతికత అవసరాలకు సరిపోయే నైపుణ్యం ఉన్నవారికే కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్ వంటి నేపథ్యం ఉన్న వారిని అత్యధిక వార్షిక వేతనంతో ఎంపిక చేసుకుంటున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో క్యాంపస్ నియామకాలు 20% పెరిగే వీలుందని ఇటీవల నౌకరీ డాట్ కామ్ సర్వే వెల్లడించడం గమనార్హం. పలు దేశాలు భారత్‌లో గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాల(జీసీసీ) ఏర్పాటుపై దృష్టి పెడుతున్నాయి. దీంతో నైపుణ్యం యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. వేగంగా విస్తరిస్తున్న జీసీసీలకు అత్యుత్తమ మానవ వనరులు అవసరమని నిపుణులు చెబుతున్నారు. తాజా పరిస్థితులు బీటెక్ విద్యార్థుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. దేశంలో ఏఐ నిపుణులు అంతంతే.. ఇండక్షన్ అనే సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాలు 2025 చివరి నాటికి దేశవ్యాప్తంగా 3.64 లక్షల ఉద్యోగాలు సృష్టించే వీలుంది. ప్రస్తుతం జీసీసీల్లో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 19 లక్షలు కాగా 2030 నాటికి ఇది 28 లక్షలకు చేరుతుందని అంచనా. స్కిల్ ఇండియా రిపోర్టు ప్రకారం 2026 నాటికి దేశంలో 10 లక్షల మందికి పైగా ఏఐ నిపుణుల అవసరం ఏర్పడుతుంది. 2023 ఆగస్టు లెక్కల ప్రకారం దేశంలో 4.16 లక్షల మంది ఏఐ నిపుణులు మాత్రమే ఉన్నారు. అంటే 2026 నాటికి సుమారుగా మరో 6 లక్షల మంది అవసరం కానున్నారు. ఈ నేపథ్యంలోనే అనవసర ఆందోళనలు పక్కనపెట్టి ఏఐని ఆహ్వానించాలని, ఐటీ దిగ్గజ సంస్థకు చెందిన జాకర్ తెలిపారు. ఇవన్నీ గమనంలో ఉంచుకునే విద్యా సంస్థలు ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి కోర్సుల్లో ప్రవేశాలు పెంచుకుంటున్నాయి. కంపెనీలు సైతం ఏఐపై పట్టున్న వారికే ప్రాంగణ నియామకాల్లోనూ మంచి అవకాశాలు ఇస్తున్నాయి. ప్రత్యేక నైపుణ్యమే ప్రధానం దేశంలో ప్రతి ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో కేవలం 9 శాతం మాత్రమే ఐటీ రంగంలో మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్‌పై పట్టు వారినే కంపెనీలు ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సివిల్, మెకానికల్‌లో బీటెక్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా ఏఐ, తదితర టెక్నాలజీల్లో సర్టిఫికెట్ కోర్సులు చేస్తేనే క్యాంపస్ నియామకాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. ఏఐ, డేటా సైన్స్ రంగాల్లోని పట్టభద్రులకు క్యాంపస్ నియామకాల్లో సంప్రదాయ ఐటీ రంగాల నిపుణుల కన్నా 30 శాతం ఎక్కువ వేతనాలు లభిస్తున్నాయి. జీసీసీల్లో అత్యధిక డిమాండ్ కలిగిన టెక్నాలజీల్లో నైపుణ్యం ఉన్నవారికి మంచి ప్యాకేజీలు ఇస్తున్నారు. క్యాంపస్ నియామకాల్లో ఏఐ ఇంజనీరింగ్, జనరేటివ్ ఏఐ, డేటా ఫ్యాబ్రిక్స్, డి్రస్టిబ్యూషన్ ఎంటర్ప్రైజెస్, క్లౌడ్ నేటివ్ ప్లాట్‌ఫామ్స్, అటానమస్ సిస్టమ్స్, డెసిషన్ ఇంటెలిజెన్స్, హైపర్ ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ మెష్ నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సైబర్ సెక్యూరిటీలో ప్రారంభ వేతనం సగటున ఏడాదికి 9.57 లక్షలుగా ఉంది. ఏఐ నైపుణ్యానికి కంపెనీల ప్రాధాన్యం రెండేళ్ళుగా జేఎన్టీయూహెచ్లో ప్రాంగణ నియామకాలు పెరుగుతున్నాయి. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఎఐఎంల్‌తో పాటు ఏఐ అనుసంధానం ఉన్న కోర్సుల విద్యార్థులకు కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. అయితే సివిల్, మెకానికల్ విద్యార్థులు కూడా ఈ ట్రెండ్‌ను అర్థం చేసుకుని, ఏఐఎంల్ మైనర్ డిగ్రీ కోర్సులు చేస్తున్నారు. వీరికి కూడా ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నాయి. – ప్రొఫెసర్ పద్మావతి విశ్వనాథ్ (వైస్ ప్రిన్సిపల్, జేఎన్టీయూహెచ్) స్థానిక వనరులపై ఐటీ సంస్థల దృష్టి ఏఐ విస్తరణకు అనుగుణంగా డేటా కేంద్రాలు, మాడ్యూల్స్ అభివృద్ధి చేయాల్సి వస్తోంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో స్థానికంగా మానవ వనరులు అభివృద్ధి పరుచుకోవడంపై సంస్థలు దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగానే నైపుణ్యం వారి కోసం క్యాంపస్ నియామకాలు పెంచాయి. – నవీన్ ప్రమోద్ (ఎంఎన్సీ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్) -
ఉపాధికి ‘కిక్’ కామర్స్!
న్యూఢిల్లీ: క్విక్ కామర్స్ జోరుతో బ్లూకాలర్ ఉద్యోగాలకు (కార్మికులకు) పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. 2027 నాటికి వివిధ రంగాల్లో 24 లక్షల మంది కార్మికులకు డిమాండ్ ఉంటుందని హైరింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఇండీడ్’ వెల్లడించింది. ఇందులో ఒక్క క్విక్ కామర్స్ రంగమే 5 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్టు పేర్కొంది. డిసెంబర్ త్రైమాసికంలో క్విక్‌కామర్స్ కంపెనీలు 40,000 మందిని నియమించుకున్నట్టు ఇండీడ్ ఇండియా సేల్స్ హెడ్ సతీష్ కుమార్ తెలిపారు. ‘‘ఈ రంగం విస్తరించే కొద్దీ, నైపుణ్య, పాక్షిక నైపుణ్య కార్మికులకు డిమాండ్ వృద్ధి చెందుతూనే ఉంటుంది. వేగవంతమైన, టెక్నాలజీ ఆధారిత ప్రపంచానికి అనుగుణంగా నడుచుకునే నైపుణ్యాల కోసం యాజమాన్యాల అన్వేషణ పెరిగింది’’ అని వివరించారు. బ్లూ కాలర్ ఉద్యోగులు అంటే విద్యతో పెద్దగా అవసరం లేకుండా శారీరక శ్రమతో, నైపుణ్యాలతో పనులు నిర్వహించే వారు. డెలివరీ డ్రైవర్లు, రిటైల్ సిబ్బంది ఈ విభాగం కిందకే వస్తా రు. ఇండీడ్ నిర్వహించిన సర్వేలో వీరికి బేసిక్ వేతనం రూ. 22,600గా ఉన్నట్టు తెలిసింది. పండుగల సీజన్లో క్విక్‌కామర్స్ కంపెనీలు డెలివరీ డ్రైవర్లు, వేర్‌హౌస్ అసోసియేట్ లు, మార్కెటింగ్, ప్రమోషనల్, ప్యాకేజింగ్ సిబ్బంది, లాజిస్టిక్స్ కోఆర్డినేటర్లను నియమించుకోనున్నట్టు ఇండీడ్ నివేదిక తెలిపింది. దీంతో ఇలాంటి డిమాండ్ సీజన్లలో కార్మికులకు బోనస్‌లు, నగదేతర ప్రయోజనాలు అధికంగా అధించనున్నట్టు వివరించింది. వీరికి డిమాండ్.. : నేవిగేషన్ అండ్ డ్రైవింగ్, డిజిటల్ లిటరసీ, డేటా అనలిటిక్స్, మేనేజ్మెంట్, టెక్ సపోర్ట్ నైపుణ్యాలున్న వారికి ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు ఇండీస్ నివేదిక వెల్లడించింది. ఆటోమేషన్, డిజిటల్ టూల్స్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నట్టు తెలిపింది. కస్టమర్లు నిమిషాల వ్యవధిలో గ్రోసరీ, నిత్యావసరాలను కోరుకుంటున్నారని.. దీంతో వేగవంతమైన డెలివరీలకు డిమాండ్ పెరుగుతున్నట్టు పేర్కొంది. క్విక్‌కామర్స్ సంస్థల మధ్య పోటీ పెరిగిపోవడంతో అవి మరింత వేగంగా డెలివరీకి, మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయని, ఇది ఈ రంగంలో ఉపాధి అవకాశాల విస్తరణకు దారితీస్తోందని వివరించింది. చెన్నై, పుణె, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో బ్లూకాలర్ ఉద్యోగ నియామకాలు చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగినట్టు తెలిపింది. టైర్–2 నగరాలైన చండీగఢ్, అహ్మదాబాద్‌లోనూ ఇదే ధోరణి నెలకొన్నట్టు వివరించింది. -
‘పోలీసు స్కూల్’కు శంకుస్థాపన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో మంత్రి శ్రీధర్‌బాబుతో కలసి ఈ ‘పోలీస్ స్కూల్’కు శంకుస్థాపన చేశారు. పోలీసు వ్యవస్థలో కొత్త అధ్యాయానికి దీనితో తెరతీసినట్టు సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ‘‘యూనిఫాం సర్వీసులవారి కుటుంబ సభ్యుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. అందులో భాగంగానే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు శంకుస్థాపన చేశాం.ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో గత ప్రభుత్వం పోలీసులను వారి పార్టీ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తే.. మా ప్రభుత్వం మాత్రం పోలీసు కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం పనిచేస్తోంది..’’ అని ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశామని.. కులమతాలకు అతీతంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లలో పోలీసులకు ఏమీ చేయలేదని విమర్శించారు. కాగా.. పోలీసు కుటుంబ సభ్యులకు స్కూల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని.. ఇవి కేంద్రీయ విద్యాలయాలకు దీటుగా విద్యను అందిస్తాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. కేంద్రీయ విద్యాలయాల్లో మాదిరిగా.. పోలీస్ స్కూళ్లలోనూ ఇతర విద్యార్థులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.యూనిఫాం సర్వీసుల సిబ్బంది అందరికీ..పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందితోపాటు ఇతర యూనిఫాం సర్వీసులైన అగ్నిమాపక, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, జైళ్లశాఖ సిబ్బంది పిల్లలకు విద్య అందించేందుకు ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ను ఏర్పాటు చేస్తూ.. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పునరుత్పాదక రంగంలో ఉపాధి పరుగులు
ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో ఈ రంగంలో 2023 సంవత్సరంలో దాదాపు 10,18,800 (1.02 మిలియన్ల) ఉద్యోగాల కల్పన జరిగింది. ఈ విషయాన్ని ఇటీవల అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ (ఆర్‌ఈఎన్‌ఏ), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన రంగంలో 2022లో 4.9 మిలియన్ల మందికి ఉద్యోగాలు లభించాయి. ఆ సంఖ్య అనూహ్యంగా 2023లో 16.2 మిలియన్లకు పెరిగింది. మన దేశంలో 2022లో 2,82,200 మందికి కొలువులు వచ్చాయి. 2023లో ఈ సంఖ్య భారీగా పెరిగి దాదాపు 10,18,800కు చేరింది. ఒక్క చైనా మినహా ప్రపంచ దేశాలన్నింటి కంటే మన దేశమే ఈ విషయంలో పురోగమనంలో ఉంది. మొత్తం ఉద్యోగాల్లో దాదాపు 40శాతం మంది మహిళలు ఉండటం విశేషం. – సాక్షి, అమరావతి -
యువత కోసం కొత్తగా ఇంటర్న్‌షిప్ పథకం
న్యూఢిల్లీ: యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇంటర్న్‌షిప్ పథకాన్ని తీసుకొచ్చి0ది. ఏటా రూ.66,000 మేర ఆర్థికసాయం అందించనుంది. ఐదేళ్లకాలంలో మొత్తంగా కోటి మంది 21–24 ఏళ్ల యువత ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారని కేంద్రప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2024–25 ఆర్థికసంవత్సరంలో తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.800 కోట్లు ఖర్చుచేయనుంది. ఈ ఆర్థికసంవత్సరంలో డిసెంబర్ రెండో తేదీన ప్రారంభమయ్యే ఈ పథకం ద్వారా 1,25,000 మంది లబి్ధపొందే వీలుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. టాప్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే యువతకు బీమా సౌకర్యం సైతం కల్పించనున్నారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేసే pminternship.mca.gov.inలో యువత ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూ.6,000 అదనం నెలకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.60,000 ఆర్థికసాయం అందనుంది. దీనికి అదనంగా ఏడాదిలో ఒకసారి రూ.6,000 గ్రాంట్ ఇవ్వనున్నారు. దీంతో ఏడాదికి ప్రతి లబ్ధి దారుడు రూ. 66,000 లబ్ధి పొందనున్నారు. ఈ వెబ్‌పోర్టల్‌లో అక్టోబర్ 12వ తేదీ నుంచి 25వ తేదీలోపు అందుబాటులో ఉన్న సమాచారంతో దరఖాస్తులను నింపొచ్చు. వీటిని అక్టోబర్ 26వ తేదీన షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత అభ్యర్థులను అక్టోబర్ 27వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీలోపు కంపెనీలు ఎంపిక చేస్తాయి. ఎంపికైన అభ్యర్థు లు తమ నిర్ణయాన్ని నవంబర్ 8–15ల మధ్య తెలపాల్సి ఉంటుంది. ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా మూడు ఆఫర్స్ ఇస్తారు. టాప్ 500 కంపెనీల ఎంపిక గత మూడేళ్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) నిధి పథకంలో భాగంగా తమ నికరలాభాల్లో కొంతమేర సమాజసేవ కోసం సవ్యంగా ఖర్చుచేసిన టాప్ 500 కంపెనీలను ఈ పథకం కోసం కేంద్రం ఎంపికచేస్తుంది. రిజర్వేషన్లూ వర్తిస్తాయి! అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లనూ వర్తింపజేస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అలెంబిక్, మహీంద్రా అండ్ మహీంద్రా, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లు 1,077 ఆఫర్లను ఇప్పటికే ప్రకటించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
కొత్త బయోటెక్ సీసాలో పాత సారా
వాతావరణ మార్పులు; ఘన, ద్రవ వ్యర్థాల సమర్థ నిర్వహణ; వ్యవసాయ ఉత్పాదకతల పెంపు, మెరుగైన ఇంధన వ్యవస్థ, ఆరోగ్య సౌకర్యాలు... బయోటెక్నాలజీ సమర్థ వినియోగంతో భారత్ అధిగమించగల సవాళ్లల్లో ఇవి కొన్ని మాత్రమే. బోలెడన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకూ బయో టెక్నాలజీ ఎంతో సాయం చేయగలదు. ఇదే విషయాన్ని గత నెల 31న విడుదల చేసిన ‘బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్ మెంట్, ఎంప్లాయ్మెంట్ (బయో ఈ3)’ విధానం ద్వారా కేంద్రం కూడా లక్షించింది. ఈ విధానంలోని అతిపెద్ద లోపం ఏమిటంటే... ఇవన్నీ ఎప్పటిలోగా సాధిస్తామన్నది స్పష్టం చేయకపోవడం. ఎందుకంటే ఇవన్నీ 2021లో ‘నేషనల్ బయోటెక్నాలజీ అభివృద్ధి వ్యూహం’ పేరుతో విడుదల చేసిన పత్రంలో ఉన్నవే!‘బయో ఈ3’ విధానం ప్రధాన లక్ష్యం– వైవిధ్యభరితమైన కార్యకలాపాల ద్వారా పర్యావరణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిరక్షిస్తూనే, సుస్థిరా భివృద్ధి వంటి అంతర్జాతీయ సమస్యలను దీటుగా ఎదుర్కొనేందుకు బయో మాన్యుఫాక్చరింగ్ పరిష్కారాలు వెతకడం! సృజనాత్మక ఆలోచనలను టెక్నాలజీలుగా వేగంగా పరివర్తించాలని కూడా సంకల్పం చెప్పుకొన్నారు. ఇప్పటివరకూ వేర్వేరుగా జరుగుతున్న కార్యకలాపాలన్నింటినీ బయోమాన్యుఫాక్చరింగ్ అనే ఒక ఛత్రం కిందకు తీసుకు రావాలనీ, సుస్థిరమైన అభివృద్ధి పథాన్ని నిర్మించాలనీ కూడా విధాన పత్రంలో పేర్కొన్నారు. ఈ విధానాన్ని ప్రతిపాదించే క్రమంలో కేంద్ర ‘బయోటెక్నాలజీ విభాగం’ (డీబీటీ) కార్యదర్శి రాజేశ్ గోఖలే జీవశాస్త్ర పారిశ్రామికీ కరణకు నాంది పలుకుతున్నట్లు ప్రకటించారు. ఈ రంగంలో భారత్‌ను అగ్రగామిగా నిలుపుతామన్నారు. ఈ విధానంలోని వాపును కాస్తా పక్కకు పెడితే – బయోటెక్నాలజీ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం, డిజిటలైజేషన్ , కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఇందుకు వాడటం కీలకాంశా లుగా తోస్తాయి. ఇదే వాస్తవమని అనుకుంటే ఇందులో కొత్తదనమేమీ లేదు. ఎందుకంటే 2021లో ఇదే డీబీటీ ‘నేషనల్ బయోటెక్నాలజీ అభివృద్ధి వ్యూహం (2021–25)’ పేరుతో ఒక పత్రాన్ని విడుదల చేసింది. అందులోనూ కచ్చితంగా ఇవే విషయాలను ప్రస్తావించారు. కాకపోతే అప్పుడు ఆర్థికాంశాలు, కాలక్రమం, లక్ష్య సాధనకు మార్గాల వంటివి స్పష్టంగా నిర్వచించారు. బయోటెక్నాలజీ ఆధారంగా విజ్ఞాన, సృజనాత్మకతలతో నడిచే ఓ జీవార్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నది 2021లో డీబీటీ పెట్టుకున్న లక్ష్యం. 2025 నాటికల్లా భారత్‌ను అంతర్జాతీయ బయో మాన్యు ఫాక్చరింగ్ హబ్‌గా రూపుదిద్దాలని అనుకున్నారు. బయో ఫౌండ్రీల వంటి వాటికి తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం, నైపుణ్యం కలిగిన సిబ్బంది, కార్మికులను తయారు చేయడం, అందరికీ అందు బాటులో ఉండే వస్తువులను తయారు చేయగల పరిశ్రమలకు ప్రోత్సా హకాలు అందించడం ద్వారా లక్ష్యాన్ని సాధించాలని అప్పట్లో తీర్మానించారు. వాతావరణ మార్పులు, ఆహార భద్రత, పర్యావరణ అను కూల ఇంధనాలు, వ్యర్థాల సమర్థ నిర్వహణ వంటివి 2021లో గుర్తించిన ప్రాధాన్యతాంశాలు. తాజా జాబితాలోనూ ఇవే అంశాలను పునరుద్ఘాటించారు. కానీ డీబీటీ తెలివిగా పాత విధానం, వ్యూహాలను అస్సలు ప్రస్తావించకపోవడం గమనార్హం. అప్పడు నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎందుకు సాధించలేకపోయారన్న ప్రశ్న నుంచి తప్పించు కునేందుకు అన్నమాట! 2021 విధానానికి అనుగుణంగా తీసుకున్న చర్య ఏదైనా ఉందీ అంటే... అది తాజా బడ్జెట్లో బయో ఫౌండ్రీల ప్రోత్సాహానికి ఒక పథకాన్ని ప్రకటించడం మాత్రమే. బయోటెక్నాలజీ ఏయే రంగాల్లో ఉపయోగపడగలదో చెప్పాల్సిన పని లేదు. టీకాల తయారీ మొదలుకొని కొత్త రకాల వంగడాల సృష్టి వరకూ చాలా విధాలుగా సహాయకారి కాగలదని గత నాలుగు దశా బ్దాల్లో నిరూపణ అయ్యింది. దేశ విధాన రూపకర్తలు దీని సామర్థ్యాన్ని ముందుగానే గుర్తించారు. 1986 లోనే బయోటెక్నాలజీ రంగానికి ఊతమిచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. తొలినాళ్లలో ఇది దేశవ్యాప్తంగా పరిశోధన, విద్య అవకాశాలను పెంచడం వల్ల ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో కీలక స్థానానికి చేరుకోగలిగింది. అయితే బయోటెక్నాలజీ ఆధారిత పరిశ్రమ వృద్ధి కొంచెం నెమ్మదిగానే జరిగిందని చెప్పాలి. వెంచర్ క్యాపిటలిస్టుల లేమి, తగిన వాతావరణం లేకపోవడం ఇందుకు కారణాలు. అయినప్పటికీ పరి శ్రమ అందుబాటులోకి తెచ్చిన ఉత్పత్తులేవీ డీబీటీ కార్యక్రమాల కారణంగా వచ్చినవి కాకపోవడం గమనార్హం. భారతీయ బయోటెక్ పరిశ్రమకు ఇష్టమైన ప్రతినిధిగా చూపే ‘బయోకాన్’... డీబీటీ ఏర్పాటు కంటే మునుపటిది. శాంత బయోటెక్, భారత్ బయోటెక్ వంటి కంపెనీలు కూడా టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు వంటి ఇంకో ప్రభుత్వ విభాగపు రిస్క్ ఫైనాన్సింగ్ ద్వారా ఏర్పాటు చేసినవే. 2000లలో కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బయో టెక్నాలజీ రంగం కోసం ప్రత్యేక విధానాలను ప్రకటించడమే కాకుండా పరిశ్రమలకు ప్రోత్సాహకాలూ అందించాయి. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, ఐకేపీ నాలెడ్జ్ పార్క్‌ల విజయం ఈ విధానాల ఫలమే. 2012లో మాత్రమే డీబీటీ పారిశ్రామిక ప్రోత్సాహం కోసం ప్రత్యేక వాణిజ్య విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీన్నే ‘ద బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్’... క్లుప్తంగా బైరాక్ అని పిలుస్తారు. ప్రభుత్వం గతానుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు, మన సామర్థ్యాల ఆధారంగా బయోటెక్నాలజీ రంగంలో పరిశ్రమలను ప్రోత్సహించాల్సి ఉంటుంది. కానీ తాజా విధానంలో జీనోమ్ వ్యాలీ, ఐకేపీ నాలెడ్జ్ పార్క్ వంటి విజయవంతమైన నమూనాల ప్రస్తావనే లేదు. కాకపోతే ఇదే భావనను ‘మూలాంకుర్ బయో ఎనేబ్లర్ హబ్’ అన్న కొత్త పేరుతో అందించింది. విధాన పత్రం ప్రకారం ఈ హబ్స్ ఆవిష్కరణలు, ట్రాన్స్లేషనల్ రీసెర్చ్‌లను సమన్వయ పరుస్తాయి. పైలట్ స్కేల్, వాణిజ్య పూర్వ పరిశోధనలకు సహకారం అందిస్తాయి. ఇప్పటికే దేశంలో ఉన్న టెక్నాలజీ క్లస్టర్లు చేస్తున్నది కూడా ఇదే. కేంద్రం సర్వరోగ నివారిణిగా ప్రచారం చేస్తున్న ఈ కొత్త విధానం నియంత్రణ వంటి అంశాలను పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. మౌలిక పరిశోధనలకు తగినన్ని ప్రభుత్వ నిధులను అందుబాటులో ఉంచడం, సాంకేతిక పరిజ్ఞానం, మానవ వనరుల అభివృద్ధి విషయాల్లోనూ ప్రభుత్వం నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నదీ విస్మరించింది. బయో మాన్యుఫాక్చరింగ్‌కు నియంత్రణ వ్యవస్థ కీలకం. ఎందుకంటే జన్యు మార్పిడి చేసిన సూక్ష్మజీవులు, ఇతర జీవజాలాన్ని వాడతారు కాబట్టి. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన నిబంధనలు చెల్లాచెదురుగా ఉండటమే కాదు, పారదర్శకంగానూ లేవు. ఓ భారీ బయోటెక్ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు అంతకంటే ముందే స్వతంత్ర, చురుకైన చట్టపరమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఐటీ విప్లవం మాదిరిగానే బయోటెక్నాలజీ ఆధారంగా సరికొత్త పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొస్తామని డీబీటీ కార్యదర్శి వ్యాఖ్యానించారు. సమాచార రంగంలో వచ్చిన మార్పులే ఐటీ విప్లవానికి నాంది అనీ, ఏదో విధానాన్ని రూపొందించి విడుదల చేయడం వల్ల మాత్రమే ఇది రాలేదనీ ఆయన గుర్తించాలి. డిజిటల్ టెలిఫోన్ ఎక్స్చేజ్ను సొంతంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం గట్టిగా సంకల్పించడం, పెట్టుబడులు పెట్టడం, డెడ్లైన్లను విధించడం వల్లనే దేశంలో ఈ రోజు ఐటీ రంగం ఈ స్థాయిలో ఉంది. అలాగే ప్రభుత్వం స్వయంగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఈ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వం కేవలం ప్రకటనలు చేయడం కాకుండా నిర్ణయాత్మకంగా వ్యవహరించడం కీలకం.విధానాలు అనేవి బాధ్యతాయుతమైన పాలనకు మార్గదర్శక పత్రాల్లా ఉండాలి. ఉన్నతాశయాలు, దార్శనికతతో ఉండటం తప్పు కాదు. కానీ, లక్ష్యాలేమిటి? వాటి సాధనకు ఉన్న కాలపరిమితి, సవా ళ్లపై అవగాహన అవసరం. కాలపరీక్షకు తట్టుకున్న పాత విధానాన్ని కాకుండా కొత్త మార్గాన్ని అనుసరించాలని డీబీటీ ప్రయత్నించింది. శాస్త్రీయ విభాగం అయినందుకైనా తార్కికమైన, ఆధారాల కేంద్రిత విధానాన్ని రూపొందించి ఉంటే బాగుండేది. ‘ఆర్థిక వ్యవస్థ’, ‘ఉపాధి కల్పన’ రెండూ శీర్షికలోనే ఉన్నా ఈ విధానం ప్రాథమ్యాలు అస్పష్టం, సందేహాస్పదం. వాక్చాతుర్యం తప్ప ఏమీలేదు.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి
న్యూఢిల్లీ: మహిళలకు మరింత ఉపాధి అవకాశాలను అందించడానికి ఫైనాన్షియల్ రంగం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. మహిళలను ప్రోత్సహించే వ్యాపారాలకు అనుకూలమైన పథకాలను రూపొందించడం ద్వారా లింగ అంతరాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చని ఆయన సూచించారు. సమగ్ర వృద్ధి ప్రాముఖ్యతను ఉద్ఘాటిస్తూ వాస్తవ అభివృద్ధి చెందిన భారతదేశం అంటే.. దేశంలోని ప్రతి పౌరుడు సామాజిక–ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఆర్థిక సేవలను పొందాల్సి ఉంటుందని అన్నారు. అవసరమైన ఆర్థిక అక్షరాస్యతను కలిగి ఉండేలా చూడాలని గవర్నర్ సూచించారు. ఫిక్కీ, ఐబీఏ సంయుక్తంగా నిర్వహించిన వార్షిక ఎఫ్‌ఐబీఏసీ– 2024 ప్రారంభ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, భారత్ శ్రామిక శక్తి భాగస్వామ్యం (మహిళల భాగస్వామ్యం) ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉందన్నారు. బాలికల విద్యను మెరుగుపరచడం, నైపుణ్యాభివృద్ధి, పని ప్రదేశంలో భద్రత, సామాజిక అడ్డంకులను పరిష్కరించడం వంటి కార్యక్రమాల ద్వారా ఈ అంతరాన్ని తగ్గించాల్సిన తక్షణ అవసరం ఉందని అన్నారు. వినియోగం, డిమాండ్ సమిష్టిగా పెరగడంతో భారతదేశ వృద్ధి చెక్కుచెదరకుండా ఉందన్నారు. భూమి, కారి్మక, వ్యవసాయ మార్కెట్లలో సంస్కరణల ద్వారా మరిన్ని మెరుగైన ఫలితాలు పొందవచ్చని సూచించారు. -
విద్యుత్, ఇంధన రంగాల్లో ఉపాధి అవకాశాలు
ముంబై: విద్యుత్, ఇంధన రంగాల్లో ఈ ఏడాది నియామకాలు సానుకూలంగా ఉండనున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య) ఈ రంగాల్లో నియామకాలు, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు 9 శాతం పెరుగుతాయని టీమ్‌లీజ్ సరీ్వసెస్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్’ నివేదిక తెలిపింది. 2070 నాటికి సున్నా కర్బన ఉద్గారాల (నెట్ జీరో) లక్ష్యం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉపాధి అవకాశాలకు మద్దతుగా నిలుస్తాయని ఈ నివేదిక పేర్కొంది. దేశ లక్ష్యాలకు అనుగుణంగా ఇంధన రంగం గణనీయమైన మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపింది. 23 రంగాలకు చెందిన 1,417 కంపెనీల ప్రతినిధులను అడిగి టీమ్‌లీజ్ ఈ నివేదికను రూపొందించింది. ఢిల్లీలో అధికం ఇంధన, విద్యుత్ రంగాల్లో ప్రస్తుత ఉపాధి అవకాశాల పరంగా ఢిల్లీ 56 శాతంతో అగ్రస్థానంలో ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. బెంగళూరు 53 శాతం, ముంబై 52 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ రంగంలో కొత్త ఉపాధి అవకాశాల పరంగా జైపూర్ 14 శాతంతో ముందుంది. బెంగళూరు, చెన్నై, వదోదర 13 శాతంతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మెట్రోల్లో వృద్ధి అవకాశాలను గుర్తు చేస్తూనే, ద్వితీయ శ్రేణి పట్టణాలు కొత్త అవకాశాలు వేదికగా నిలుస్తున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక పేర్కొంది. మౌలిక వసతుల అభివృద్ధి, విధానపరమైన ప్రోత్సాహకాలు, పునరుత్పాదక ఇంధన వనరుల విస్తరణ ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది. ఆర్థిక వృద్ధికి మద్దతు.. ‘‘విద్యుత్, ఇంధన రంగాల్లో 9 శాతం మేర ఉపాధి అవకాశాల విస్తరణ అన్నది పర్యావరణ అనుకూల భవిష్యత్ దిశగా స్పష్టమైన మార్గాన్ని సూచిస్తోంది. 62 శాతం పరిశ్రమ ప్రతినిధులు తమ సిబ్బందిని పెంచుకుంటున్నట్టు చెప్పారు. ఇండస్ట్రీ 4.0, క్రమానుగతంగా కర్బన రహితంగా మారాలన్న లక్ష్యాలు విద్యుత్, ఇంధన రంగాల్లో ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయి. తద్వారా ఆర్థిక వృద్ధికి మద్దుతుగా నిలుస్తున్నాయి’’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పి.సుబ్బురాతినమ్ తెలిపారు. విద్యుత్, ఇంధన రంగాల్లో ఇంజనీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. టీమ్‌లీజ్ సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం వృద్ధి అవకాశాల గుర్తించి ప్రస్తావించారు. ఆ తర్వాత సేల్స్ (అమ్మకాలు) విభాగంలో ఎక్కువ డిమాండ్ ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహన మౌలిక వసతులు, ప్రీమియమైజేషన్ (ఖరీదైన ఉత్పత్తుల వినియోగం) ధోరణితో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయని ఈ నివేదిక తెలిపింది. -
‘ఇన్ఫ్రా’లో కోటి కొలువులు!
మౌలిక రంగం భారీ ఉపాధి అవకాశాలకు వేదిక కానుంది. మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు కేంద్ర సర్కారు ప్రాధాన్యం ఇస్తుండడంతో ఈ రంగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కోటి ఉద్యోగాలు కొత్తగా ఏర్పడతాయని ఉద్యోగ నియామక సేవలు అందించే ‘టీమ్‌లీజ్ సర్వీసెస్’ అంచనా వేసింది. కేంద్రంలో మూడోసారి కొలువు దీరిన మోదీ సర్కారు రహదారులు, రైళ్లు, విమానాశ్రయాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ రంగంలో అసలు నైపుణ్యాలు లేని వారితోపాటు, స్వల్ప నైపుణ్యాలు, పూర్తి నైపుణ్యాలు కలిగిన వారికి పెద్ద ఎత్తున ఉపాధి లభించనున్నట్టు టీమ్‌లీజ్ సరీ్వసెస్ అంచనా. ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో 98 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కొత్తగా వస్తాయని తన తాజా నివేదికలో తెలిపింది. ‘కొత్త ప్రభుత్వం ఈ రంగానికి ప్రాధాన్యతను కొనసాగిస్తుందని భావిస్తున్నాం. దేశ అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి ఇది తప్పనిసరి. వ్యూహాత్మక పెట్టుబడులు ఉపాధి అవకాశాలతోపాటు, అన్ని ప్రాంతాలు సమానాభివృద్ధికి వీలు కలి్పస్తాయి’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పి. సుబ్రమణియమ్ తెలిపారు. రవాణా రంగంపైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికలతో ఉన్నట్టు చెప్పారు. విమానాశ్రయాల సంఖ్యను 220కి పెంచడం, 2025 చివరికి జాతీయ రహదారుల నిడివిని 2 లక్షల కిలోమీటర్లకు చేర్చే దిశగా పనిచేస్తున్నట్టు గుర్తు చేశారు. అలాగే, 2030 నాటికి 23 జల రవాణా మార్గాల అభివృద్ధితోపాటు, 35 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్‌ల అభివృద్ధిని సైతం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. భారీగా వ్యయాలు.. ‘మౌలిక రంగంలోని పలు ఉప విభాగాల మధ్య ప్రాధాన్యతల్లో మార్పు ఉండొచ్చు. మౌలిక రంగానికి సంబంధించిన ప్రభుత్వ మూలధన వ్యయాలు ఆరోగ్యకరమైన వృద్ధితో కొనసాగుతాయి. ఈ రంగంలో రైల్వే, రహదారులు, నీటి ప్రాజెక్టులకు ప్రభుత్వ కేటాయింపులు పెరుగుతాయి. ఇది ఉపాధి అవకాశాల కల్పనకు మద్దతునిస్తుంది’ అని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా జూన్‌లో విడుదల చేసిన నివేదిక సైతం ఈ రంగంలో వృద్ధి అవకాశాలను తెలియజేస్తోంది. మౌలిక రంగం, సామాజికాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం.. పట్టణీకరణ పెరగడం, రహదారుల అనుసంధానత ఇవన్నీ ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల అభివృద్ధికి దోహదం చేస్తాయని జీఐ గ్రూప్ హోల్డింగ్ కంపెనీస్ కంట్రీ మేనేజర్ సోనాల్ అరోరా తెలిపారు. పెద్ద, భారీ కాంట్రాక్టులు వస్తుండడంతో తాము నియామకాలను పెంచినట్టు ఎల్అండ్టీ గ్రూప్ హెచ్ఆర్ చీఫ్ ఆఫీసర్ సి.జయకుమార్ తెలిపారు.కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలు.. విమానాశ్రయాల విస్తరణ.. 2202025 నాటికి జాతీయ రహదారుల నిర్మాణం 2,00,000 కిలోమీటర్లు2030 నాటికి జలరవాణా మార్గాల ఏర్పాటు 23 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ 35 పార్క్‌ల నిర్మాణం -
Sahithi chiluveru: టెకీ ఉద్యోగం నుంచి టేస్టీ ఫుడ్ బిజినెస్ వరకు
ఒక అందమైన ఆలోచనను సక్రమంగా అమలులో పెడితే పల్లెటూరు నుంచి కూడా విదేశాలకు విస్తరించవచ్చు అని నిరూపిస్తుంది చిలువేరు సాహితి. చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి పాకశాస్త్ర ప్రావీణ్యంతో ఉపాధిని సృష్టిస్తోంది. 26 ఏళ్ల వయసులో తనతోపాటు మరో ఇరవై మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో వ్యవసాయాధారిత జీవనాల మధ్య వెలుగుతున్న సాహితిని పలకరిస్తే విజయావకాశాన్ని వంటలతో అందిపుచ్చుకుంటున్నానని వివరిస్తుంది.‘‘నాకు రుచికరమైన ఆహారం అంటే చాలా ఇష్టం. అయితే ఆ ఇష్టం నాకో ఉపాధిని కల్పిస్తుంది అని మాత్రం ఊహించలేదు. బీటెక్ కంప్లీట్ అయ్యాక హైదరాబాద్ టీసీఎస్ కంపెనీలో నాలుగేళ్లు ఉద్యోగం చేశాను. కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ రావడంతో ఊరు వచ్చేశాను. ఆ టైమ్‌లో మా అమ్మ కన్యాకుమారి చేసే వంటలను ఆస్వాదిస్తూ ఉండేదాన్ని. ఖాళీ సమయంలో సరదాగా తీసుకున్న వంటల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు’ పేజీ క్రియేట్ చేసి పోస్ట్ చేసేదాన్ని. ఆ పోస్టులకు లైకులు వెల్లువెత్తుతుండేవి. ఒకటి నుంచి మొదలు.. ఓరోజున ఉన్నట్టుండి ఒక ఫాలోవర్ నుంచి ‘మాకు స్వీట్స్ చేసి పంపుతారా’ అంటూ ఒక పోస్ట్ వచ్చింది. కాదనటమెందుకులే, ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం అని... ఆ ఆర్డర్ పూర్తిచేసి, కొరియర్ ద్వారా పంపించాం. ఆ తర్వాత మరో రెండు ఆర్డర్లు వచ్చాయి. అలా నెలకు ఒకటి రెండు ఆర్డర్లు రావడం మొదలయింది. క్రమంగా ఆర్డర్లు పెరిగాయి. నా వంటలకు మంచి డిమాండ్ ఉందని అర్థమైంది. దానినే ఉపాధిగా ఎందుకు చేసుకోకూడదూ అని... చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి, ఫుడ్ తయారీనే వ్యాపారంగా ఎంచుకున్నాను. ముందు మా ఇంటివరకే పనులు ఉండేవి. తర్వాత పనులు పెరగడంతో ఊళ్లోనే ఉన్న మా చుట్టుపక్కల మహిళలను ఫుడ్ తయారీకి నియమించుకున్నాం. స్నాక్స్, ఊరగాయలు, స్వీట్లు, మసాలా పొడులతో పాటు మిల్లెట్ ఉత్పత్తులు, ఇన్స్టంట్ మిక్స్‌లు తయారు చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు నెలకు 30 నుంచి 40 ఆర్డర్లు వస్తున్నాయి.మరో 20 మందికి...పదిహేనేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఒక ఉద్యోగికి వచ్చే ప్యాకేజీని ఇప్పుడు నా వ్యాపారం ద్వారా పొందుతున్నాను. నాతోపాటు మరో 20 మంది మహిళలకు ఉపాధి కల్పించే స్థితికి చేరుకున్నాను. వీరిలో పదిమంది తమ ఇళ్ల నుంచే పచ్చళ్లు, పొడులు, ఇతర పిండి వంటలు తయారు చేసి వాటిని అందంగా ΄్యాక్ చేసి ఇస్తారు. మా ఇంటి మొదటి అంతస్తులోని రెండు గదులను నా కంపెనీ ‘ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు’కి కేటాయించుకున్నాను. పదిహేను రకాల పచ్చళ్లు, 40 రకాల పిండి వంటలు, ఇన్స్టంట్ ఫుడ్ మిక్సర్లు, మసాల పొడులు.. దాదాపు 70 ర కాల వంటకాలు తయారు చేస్తుంటాం. మన దేశంలోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ.. దేశాలలో ఉండే మన తెలుగువారికి కొరియర్ ద్వారా పచ్చళ్లు, పొడులు పంపిస్తున్నాను.ఎక్కడా ప్లాన్ లేదు.. ఏ మాత్రం ప్లాన్ లేకుండా నా వ్యాపారం వృద్ధి చెందుతూ వస్తోంది. ఇంట్లో పెట్టిన ఆవకాయతో ఆరంభమైన ఈ బిజినెస్‌లో వచ్చిన ఆర్డర్ల ప్రకారం పెట్టుబడి పెడుతూ, ఆదాయాన్ని పొందుతున్నాను. ఫుడ్ బిజినెస్ కాబట్టి ఏడాది క్రితం లైసెన్స్ కూడా తీసుకున్నాను. మా ఊరికి మరింత పేరుతెచ్చేలా ‘ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు’ బ్రాండ్ ఉత్పత్తులను విస్తరించాలనుకుంటున్నాను. కానీ, తయారీ మాత్రం మా ఊరి నుంచి, మా ఇంటి నుంచే చేస్తుంటాను.సవాళ్లను అధిగమిస్తూ.. రుచికరమైన వంటకాల తయారీలో పదార్థాలు కూడా అంతే నాణ్యమైనవి ఉండాలి. సరైన శుభ్రత పాటించాలి. ముఖ్యంగా ఆర్గానిక్ ఉత్పత్తులను సేకరించడం, వాటిని సమయానుకూలంగా తయారీలో వాడటం పెద్ద సవాల్‌గానే ఉంటోంది. అలాగే, సీజనల్‌గా ఉండే సమస్యల్లో ముఖ్యంగా వర్షాకాలం ΄్యాకింగ్లు తడవడం వంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు తిరిగి రీప్లేస్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటాను. చాలా మందితో డీల్ చేయాలి, కస్టమర్స్ అందరూ ఒకేలా ఉండరు కాబట్టి సహనంతో ఉండాలి. ఈ ప్రయాణం నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది. ‘చిన్న అమ్మాయివే కానీ, మా ఇంట్లో బామ్మలు చేసిన వంటకాల రుచి చవి చూస్తున్నాం’ అంటూ మా వంటకాలను రుచి చూసినవారు నాకు ఫోన్ల ద్వారా, మెసేజ్‌ల ద్వారా ప్రశంసలు తెలియచేస్తుంటారు. నాణ్యత ద్వారా వారి ఆశీస్సులను, అభిమానాన్ని, మద్దతును ఎప్పటికీ అలాగే నిలబెట్టుకుంటాను అంటూ ఆనందంగా వివరిస్తుంది సాహితి.– నిర్మలారెడ్డి -
ఆతిథ్య రంగంలో కొలువుల మేళా!
ముంబై: ఆతిథ్య రంగం నిపుణుల కొరతను ఎదుర్కొంటోందని, దీంతో వచ్చే కొన్నేళ్లలో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా అనంతరం ఆతిథ్య పరిశ్రమలో డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సామర్థ్యాలు పెద్ద ఎత్తున ఏర్పాటు కావడం నిపుణుల కొరతకు కారణంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం పరిశ్రమవ్యాప్తంగా డిమాండ్–సరఫరా మధ్య అంతరాయం 55–60 శాతంగా ఉంటుందని ర్యాండ్‌స్టాడ్ ఇండియా డైరెక్టర్ సంజయ్ శెట్టి తెలిపారు. కరోనా విపత్తు తర్వాత పరిశ్రమలో బూమ్ (అధిక డిమాండ్) నెలకొందని, వచ్చే కొన్నేళ్ల పాటు ఇదే ధోరణి కొనసాగుతుందన్నారు. కరోనా తర్వాత ఆతిథ్య పరిశ్రమలో నియామకాలు 4 రెట్లు పెరిగిన ట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఆరంభ స్థాయి ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. నిపుణుల అంతరాన్ని అధిగమించేందుకు ఆతిథ్య కంపెనీలు తమ సిబ్బందికి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నట్టు నిపుణులు వెల్లడించారు. పోటీతో కూడిన వేతనాలు ఆఫర్ చేస్తూ ఉన్న సిబ్బందిని కాపాడుకోవడంతోపాటు కొత్త వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ‘‘2023లో పర్యాటకం, ఆతిథ్య రంగం 11.1 మిలియన్ల మందికి ఉపాధి కల్పించింది. 2024 చివరికి 11.8 మిలియన్ల ఉద్యోగుల అవసరం ఏర్పడుతుంది. ఈ డిమాండ్ 2028 నాటికి 14.8 మిలియన్లకు పెరగొచ్చు. ఏటా 16.5 శాతం వృద్ధికి ఇది సమానం’’అని టీమ్‌లీజ్ బిజినెస్ హెడ్ ధృతి ప్రసన్న మహంత వివరించారు. ప్రస్తుత సిబ్బంది, భవిష్యత్ మానవ వనరుల అవసరాల మధ్య ఎంతో అంతరం కనిపిస్తున్నట్టు టీమ్‌లీజ్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్, స్టాఫింగ్ బిజినెస్ హెడ్ ఎ.బాలసుబ్రమణియన్ సైతం తెలిపారు. నిపుణుల కొరతను అధిగమించేందుకు హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేక టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అప్రెంటిస్షిప్ల ద్వారా నిపుణుల కొరతను తీర్చుకునేందుకు ఈ టాస్‌్కఫోర్స్ కృషి చేస్తోంది. -
త్వరలో నైపుణ్య విశ్వవిద్యాలయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని (స్కిల్ యూనివర్సిటీ) ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సహచరులు, అధికారులు చిత్తశుద్ధితో ఉన్నట్లు ఆయన వివరించారు. విద్యా శాఖ, ఉన్నత విద్యామండలి, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ‘‘తెలంగాణలో ఉద్యోగ–ఉపాధి అవకాశాలు, ఇంటర్న్‌షిప్, ఉద్యోగాల కల్పన, విద్యార్థుల అభివృద్ధి’’అనే అంశంపై గురువారం అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రం విద్య, ఐటీ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉందని అన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే ఏ విద్యార్థి కూడా నైపుణ్య లేమితో ఉపాధి అవకాశాలు కోల్పోరాదని, ఆ దిశగా ఉన్నత విద్యా మండలి, విద్యా శాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు. డిగ్రీ స్థాయిలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే విద్యార్థులు రాష్ట్రంలోని ప్రఖ్యాత పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఆయా కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధికోసం ప్రత్యేక శిక్షణను ఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్నత విద్య స్థూల నమోదు జాతీయ స్థాయి సగటు కంటే ఎక్కువగా ఉందని, రాష్ట్ర విద్యారంగంలో అమలు అవుతున్న కార్యక్రమాలు ఉన్నతమైన గుర్తింపు పొందాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొ. వెంకట రమణ, ప్రొ. ఎస్.కె. మహమూద్ తదితరులు ప్రసంగించారు. -
CM Jagan: ఎల్లుండి విశాఖకు సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి/విశాఖపట్నం: ఎల్లుండి(మంగళవారం) విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సీఎం సమావేశం కానున్నారు. సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పరిశీలించారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, పోలీస్ జాయింట్ కమిషనర్ ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, ఇతర అధికారులతో కలిసి రాడిసన్ బ్లూ హోటల్, వి–కన్వెన్షన్ హాళ్లను పరిశీలించారు. విజన్ వైజాగ్ పేరుతో రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు హాజరుకానున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం పీఎంపాలెంలోని వి–కన్వెన్షన్ హాలుకు చేరుకుని అక్కడ ఏర్పాట్లను గమనించారు. స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో ఇక్కడ సీఎం జగన్ సమావేశమవుతారు. తర్వాత రుషికొండ హరిత రిసార్ట్స్ సమీపంలోని హెలిప్యాడ్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు. హెలిప్యాడ్ నుంచి రాడిసన్ బ్లూ హోటల్, వి– కన్వెన్షన్ హాలుకు ముఖ్యమంత్రి చేరుకునే రూట్ మ్యాప్ గురించి చర్చించారు. ఇదీ చదవండి: వల్లనోరిమామా నేనెళ్లను.. చీపురుపల్లి పోనంటున్న తమ్ముళ్లు -
ఏపీలో 40 శాతం పెరిగినఉపాధి అవకాశాలు
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఏపీలో 2019లో 4.05 లక్షల చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉంటే 2023 నాటికి 5.61 లక్షలకు చేరాయని తద్వారా 40శాతం ఉపాధి అవకాశాలు పెరిగాయని టాలీ సొల్యూషన్ సౌత్ ఇండియన్ హెడ్ భువన్ రంజన్ చెప్పారు. గురువారం టాలీ ప్రైమ్ 4.0 సాఫ్ట్‌వేర్‌ను విశాఖలోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లలో ఏపీలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. దక్షిణ భారత్‌లో వ్యాపార విస్తరణకు ఏపీ అనుకూలంగా ఉందని, అందుకే విశాఖలో తమ సాఫ్ట్‌వేర్‌ను ఆవిష్కరించామని తెలిపారు. వచ్చే రెండేళ్లలో వంద ఎంఎస్ఎంఈ వ్యాపార క్లస్టర్లను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుందని, ఇది తమ వ్యాపార విస్తరణకు ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో టాలీ సాఫ్ట్‌వేర్‌ను 50 వేల మందికి పైగా ఉపయోగిస్తున్నారని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా రాబోయే రెండేళ్లలో ఈ సంఖ్య 4 లక్షలకు చేరుకునే అవకాశం తమ సంస్థకు లభిస్తుందన్నారు. ఈ టాలీ ప్రైమ్ 4.0లో ఆకర్షణీయమైన డ్యాష్‌బోర్డు, వాట్సప్‌ను అనుసంధానం, ఎంఎస్ ఎక్స్ఎల్ ఫైల్‌ను నేరుగా సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేసే ఫీచర్ ఉంచినట్లు వివరించారు. టాలీపై యువతకు శిక్షణ ఇచ్చేందుకు టాలీ ఎడ్యుకేషన్ సెంటర్లను ప్రతీ నగరంలో ఏర్పాటు చేస్తామన్నారు. -
గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ నైపుణ్యాలపై శిక్షణ
హైదరాబాద్: ఏఐసీటీసీ, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్డీసీ) బజాజ్ ఫిన్సర్వ్ చేతులు కలిపాయి. బుధవారం ఇవి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆర్థిక సేవల రంగంలో ఉపాధి అవకాశాలు కోరుకునే అభ్యర్థులకు కావాల్సిన నైపుణ్యాలను అందచనున్నాయి. ఈ భాగస్వామ్యం కింద 20వేల మంది అభ్యర్థులకు సరి్టఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ (సీపీబీఎఫ్ఐ) కోర్సులో బజాజ్ ఫిన్సర్వ్ శిక్షణ ఇవ్వనుంది. పరిశ్రమకు చెందిన నిపుణులు, శిక్షణ భాగస్వాములు, విద్యా సంస్థల సహకారంతో ఈ ప్రోగ్రామ్‌ను బజాజ్ ఫిన్సర్వ్ రూపొందించింది. టైర్–2, 3 పట్టణాల్లోని గ్రాడ్యుయేట్లు, ఎంబీఏ చేసిన వారు ఉద్యోగాన్వేషణ దిశగా కావాల్సిన నైపుణ్యాలను అందించనుంది. భావవ్యక్తీకరణ, పని నైపుణ్యాలను కూడా అందించనుంది. ప్రయోగాత్మకంగా ఒడిశాలోని పది జిల్లాల్లో మొదటి దశ కింద ఉద్యోగార్థులకు ఈ నైపుణ్యాలను ఆఫర్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పాల్గొన్నారు. -
ఐదేళ్లలో 3,000 ఉద్యోగాలు
ముంబై: టాటా గ్రూప్ దిగ్గజం టైటన్ కంపెనీ రానున్న ఐదేళ్ల కాలంలో 3,000కుపైగా ఉద్యోగాలను కల్పించనుంది. వీటిలో ఇంజినీరింగ్, డిజైన్, లగ్జరీ, డిజిటల్, డేటా అనలిటిక్స్, మార్కెటింగ్ తదితర విభాగాలలో సిబ్బందిని నియమించుకోనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ తదితర ఆధునిక విభాగాలలో ప్రత్యేకతలున్న నిపుణులను ఎంపిక చేసుకోనున్నట్లు వివరించింది. ఐదేళ్ల కాలంలో రూ. 1,00,000 కోట్ల బిజినెస్‌ను అందుకునే బాటలో ప్రయాణిస్తున్నట్లు టైటన్ తెలియజేసింది. ఇందుకు అనుగుణంగా విభిన్న విభాగాలలో ప్రత్యేకత కలిగిన నిపుణులను ఉద్యోగాలలోకి తీసుకునే వ్యూహాలు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. కంపెనీ సొంత సిబ్బందిసహా.. వివిధ విభాగాలలో యువ వృత్తి నిపుణులను జత కలుపుకోనున్నట్లు తెలియజేసింది. వెరసి వృద్ధి, ఆవిష్కరణలతోపాటు పరిశ్రమలో కంపెనీ స్థానాన్ని పటిష్టపరచుకోనున్నట్లు టైటన్ హెచ్ఆర్(కార్పొరేట్, రిటైల్) హెడ్ ప్రియా ఎం.పిళ్లై పేర్కొన్నారు. 60:40 ప్రస్తుతం కంపెనీ సిబ్బందిలో 60 శాతం మెట్రో నగరాలలో సేవలందిస్తుండగా.. మరో 40 శాతం మంది ద్వితీయస్థాయి నగరాల(టైర్–2, 3)లో పనిచేస్తున్నట్లు టైటన్ వెల్లడించింది. వర్ధమాన మార్కెట్లలో కార్యకలాపాల పటిష్టతను కొనసాగిస్తూనే స్థానిక నిపుణులను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. టాటా గ్రూప్, తమిళనాడు పారిశ్రామికాభివృద్ధి సంస్థ(టిడ్కో) మధ్య భాగస్వామ్య కంపెనీగా టైటన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. -
ఈసారి పర్యాటక మంత్రిగా ఉంటా
సాక్షి, హైదరాబాద్: ఈసారి ప్రభుత్వం ఏర్పాట య్యాక తెలంగాణలో సామాజిక మౌలిక సదుపా యాలపై దృష్టి పెడతామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ముఖ్యంగా పర్యాటక శాఖకు పెద్దపీట వేయాలనుకుంటున్నామన్నా రు. సీఎం కేసీఆర్ అవకాశం ఇస్తే, లేనిపక్షంలో ఆ యన్ని బతిమాలుకునైనా.. వచ్చే ఐదేళ్లు తా ను పర్యాటక మంత్రిగా ఉంటానని అన్నా రు. తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా కొత్త రిజర్వాయర్లు కనిస్తుండటం, వాటి పరిసరాల్లో చాలా ఉపాధి అవకాశాలుండటమే ఇందుకు కారణమని తెలిపారు. శుక్రవారం ఐటీసీ కాకతీయలో బిజినెస్ నెట్వర్క్ఇంటర్నేషనల్ (బీఎన్ఐ) సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇప్పటివరకు అభివృద్ధి ట్రైలరే.. ‘తెలంగాణలో మెడికల్, ఆధ్యాత్మిక టూరిజం, అడ్వెంచర్ టూరిజం, స్పోర్ట్స్ టూరిజం వంటి వాటి ల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ నిధులు అవసరం లేకుండానే పీపీపీ పద్ధతిలో మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. 24 గంటల విద్యుత్ అందుబాటులో ఉన్న దృష్ట్యా తెలంగాణకు చెందిన ఔత్సాహి క పారిశ్రామిక వేత్తలు ఈ రంగంలో ఉన్న అవకాశా లపై దృష్టి పెట్టాలి. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇప్ప టివరకు మేము చూపించింది కేవలం ట్రైలర్ మాత్రమే. మున్ముందు అభివృద్ధి రుచి అందరికీ చూపిస్తాం. హైదరాబాద్‌ను థియేటర్ డిస్ట్రిక్ట్‌గా చే స్తాం. సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చెందుతున్నట్టే, మా అభివృద్ధి వెర్షన్ కూడా అప్డేట్తో సిద్ధంగా ఉంది. తెలంగాణ ‘3.ఓ వర్షన్’డెవలప్మెంట్కు ఐకాన్‌గా నిలుస్తుంది..’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఆరున్నరేళ్లలో ఐదు విప్లవాలు ‘రాబోయే ఐదేళ్లలో ప్రధానంగా ఐదు రంగాల్లో అనూహ్యమైన ప్రగతిని సాధించేందుకు ప్రణాళిక లు సిద్ధం చేశాం. పర్యాటక, క్రీడా, విద్య–నైపుణ్యం, వైద్యారోగ్యం, ఐటీ వంటి విభాగాలు ప్రాధాన్యతలో ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి దేశ, విదేశాల్లో ఉన్న వారికి, సెలబ్రెటీలకు అర్థమవుతుంటే.. స్థానిక ప్రతిపక్ష నేతలకు అర్థం కావడం లేదు. తెలంగాణ సాధించిన తర్వాత కరోనా మినహా మాకు దొరికిన ఆరున్నరేళ్లలో 5 విప్లవాలను సాధించాం. మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యంతో గ్రీన్ రెవె ల్యూషన్ సాధ్యమైంది. ఫిషరీస్‌కు తెలంగాణ అడ్డాగా మారింది. 46 వేల చెరువులు, నీటి వసతుల ద్వారా టన్నుల కొద్దీ చేపలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగింది. తద్వారా నీలి విప్లవం సాధించాం. ఒక్క సిరిసిల్లలోనే ఆక్వా హబ్‌లో సుమారు 5 వేల ఉద్యోగాలు సృష్టించబోతున్నాం. మాంసం ఉత్పత్తిలో దేశంలోనే ఉత్తమ స్థానంలో ఉన్నాం. తద్వారా పింక్ రివెల్యూషన్ సాధ్యమైంది. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల ద్వారా వైట్ రెవెల్యూషన్ సాధ్యమైంది. తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో పా మాయిల్ పండిస్తున్నాం. తద్వారా ఎల్లో రెవెల్యూషన్ కూడా సాధ్యమైంది..’అని వివరించారు. కేటగిరీల వారీగా అందరికీ ప్రోత్సాహం ‘పారిశ్రామిక రంగంలో దూసుకెళ్లేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది. కొత్తగా వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ అడ్డాగా మారనుంది. మన దగ్గర విశేష సేవలందిస్తున్న టీహబ్, వీహబ్, టీవర్క్స్, టాస్్క, టీఎస్ఐసీ, రీచ్ వంటి వ్యవస్థల ద్వారా ఎంతోమందిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాం. దళితులు, మహిళలు, దివ్యాంగులు, పేదవారు ఇలా కేటగిరీల వారీగా అందరినీ ప్రోత్సహిస్తున్నాం. రుణాల గురించి ఆలోచించకుండా ధైర్యంగా దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపుతూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి..’అని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహావీర్ సౌండ్ రూమ్ ఫౌండర్ జలీల్ సబీర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజనా షా, బీఎన్ఐ సభ్యులు పాల్గొన్నారు. -
2023–2027 మధ్య భారత్ వృద్ధి జూమ్
న్యూఢిల్లీ: భారత్ మధ్య కాలిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను రేటింగ్ దిగ్గజం– ఫిచ్ 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీనితో ఈ రేటు 5.5 శాతం నుంచి 6.2 శాతానికి చేరింది. 2023 నుండి 2027 వరకు మధ్యకాలంగా ఫిచ్ నిర్వచించింది. ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డం, పని చేసే వయస్సులో ఉన్న జనాభా అంచనాలో స్వల్ప పెరుగుదల తమ తాజా అప్‌గ్రేడ్‌కు కారణమని పేర్కొంది. ఫిచ్ తాజా అంచనాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► కరోనా కాలంలో భారత్‌లో భారీగా పడిపోయిన ఉపాధి అవకాశాలు దేశంలో వేగంగా రికవరీ అవుతున్నట్లు తెలిపింది. మహమ్మారి నాటి కాలంలో పోల్చితే కారి్మక సరఫరా వృద్ధి రేటు పెరిగినప్పటికీ, 2019 స్థాయి నాటికన్నా తక్కువగానే ఉంది. 2000 సంవత్సరం ప్రారంభంలో నమోదయిన స్థాయిలకంటే కూడా తక్కువే. ముఖ్యంగా మహిళల్లో ఉపాధి అవకాశాల రేటురేటు చాలా తక్కువగా ఉంది. ► భారత్‌లో పాటు బ్రెజిల్, మెక్సికో, ఇండోనేíÙయా, పోలాండ్, టర్కీ వృద్ధి రేట్ల అంచనా పెరిగింది.అయితే భారత్ కన్నా తక్కువగా 0.2 శాతం మాత్రమే బ్రెజిల్ టర్కీ, ఇండోనేషియా వృద్ధి రేటు అంచనాలకు ఎగశాయి. ► 10 వర్థమాన ఆర్థిక వ్యవస్థల మధ్యకాలిక వృద్ధిని 4 శాతంగా అంచనా వేసింది. ఇది మునుపటి అంచనా కంటే 30 బేసిస్ పాయింట్లు (ఇంతక్రితం అంచనా 4.3 శాతం) తక్కువ. చైనా వృద్ధి అంచనాలో 0.7 శాతం పాయింట్ల కోత వల్ల ప్రధానంగా ఈ పరిస్థితి నెలకొంది. దీనితో చైనా ఎకానమీ సగటు వృద్ధి రేటు 5.3 శాతం నుంచి 4.6 శాతానికి తగ్గింది. ఇటీవలి సంవత్సరాలలో చైనా వృద్ధి బాగా మందగించింది. రియల్టీ రంగంలో క్షీణత మొత్తం పెట్టుబడుల అవుట్‌లుక్‌కు దెబ్బతీసింది. ► రష్యా వృద్ధి రేటును ఈ కాలంలో చైనా 80 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఆ దేశం వృద్ధి రేటు మధ్య కాలికంగా 80 బేసిస్ పాయింట్లుగానే (ఒక శాతం కన్నా తక్కువ) ఉంటుంది. 2023–24లో 6.3 శాతం కాగా, భారత్ స్థూల దేశీయోత్పత్తి 2023–24 ఆర్థిక సంవత్సరంలో 6.3 శాతమన్న తన అంచనాలను రేటింగ్ దిగ్గజం– ఫిచ్ పునరుద్ఘాటించింది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు వృద్ధి స్పీడ్‌కు బ్రేకులు వేస్తాయని ఫిచ్ అభిప్రాయపడింది. 2024–25లో వృద్ధి రేటు 6.5 శాతమని అంచనావేస్తున్నట్లు తెలిపింది. ఎల్‌నినో ప్రభావంతో ద్రవ్యోల్బణం 6 శాతం పైనే కొనసాగే అవకాశం ఉందని ఫిచ్ అభిప్రాయపడింది. -
గణాంకాలు చెప్పే నిజాలు!
సరైన ప్రాతిపదికలు ఎంచుకుని, శాస్త్రీయ విధానంలో నమూనాలు రూపొందించుకుని వాటి ఆధారంగా సర్వే చేయాలేగానీ గణాంకాలెప్పుడూ అబద్ధం చెప్పవు. అలాగే అవి అన్నిసార్లూ పాలకులను రంజింపజేయలేవు. అప్పుడప్పుడు మిశ్రమ ఫలితాలు కూడా తప్పకపోవచ్చు. వెల్లడైన అంశాల్లోని వాస్తవాలను గుర్తించి వాటిని సరిచేసేందుకు అవసరమైన విధానాలను రూపొందించగలిగితే స్థితి గతులు మెరుగుపడతాయి. మనను చిన్నబుచ్చటానికే, ప్రతిష్ఠ దెబ్బతీసేందుకే ఇలాంటి గణాంకాలు అందిస్తున్నారని కొట్టిపారేస్తే అందువల్ల ప్రయోజనం ఉండదు. తాజాగా 2023కి సంబంధించిన అంచనాలతో ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) విడుదల చేసిన నివేదిక వెలువరించిన గణాంకాలు మనకు ఏక కాలంలో అటు సంతోషాన్నీ, ఇటు నిరాశనూ కూడా కలిగిస్తుండగా... ప్రపంచ బ్యాంకు నివేదిక ఓ విధంగా భయపెడుతోంది. ఓఈసీడీ నివేదిక ప్రకారం సంపన్న రాజ్యాలకు అంతక్రితం కన్నా 2021, 2022 సంవత్సరాల్లో వలసలు బాగా పెరిగాయి. ఇందుకు ఉక్రెయిన్ యుద్ధం చాలావరకూ దోహదపడి వుండొచ్చు. ఆ దేశం నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు యూరోప్ దేశాలకు వలసపోయారు. అలాగే 2020లో ప్రతి దేశమూ సరిహద్దులు మూసి వేయటంతో వలసలు దాదాపుగా నిలిచిపోయాయి గనుక దాంతో పోలిస్తే వలసలు పెరిగి వుండొచ్చు. అయితే స్థూలంగా చూస్తే వలసలు పెరిగాయి. అదే సమయంలో ఆ వలసల్లో మహిళల శాతం కూడా పెరిగింది. నిరుడు మన దేశంనుంచే వలసలు అధికంగా వున్నాయని నివేదిక సారాంశం. ఉన్నత విద్యకోసం వెళ్లేవారిని మినహాయించి కేవలం ఉపాధి కోసం వెళ్తున్నవారినే లెక్కేస్తే భారత్ నుంచి ఈసారి ఎక్కువమంది ఉద్యోగార్థులు వెళ్లారని ఆ నివేదిక వివరిస్తోంది. ఓఈసీడీలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలు సహా 38 సంపన్న దేశాలకు సభ్యత్వం వుంది. ఈ దేశాలకు 2021–22 మధ్య పదిలక్షల మంది వివిధ దేశాల నుంచి వలస రాగా అందులో 4.07 లక్షల మంది మన పౌరులు. ఉన్నత విద్య కోసం వెళ్లేవారిలో భారత్ రెండో స్థానంలో వుంది. మన దేశం నుంచి ఈ కేటగిరీలో 4.24 లక్షలమంది వుండగా, చైనా 8.85 లక్షలతో అగ్రభాగాన వుంది. అటు ఉపాధి కోసమైనా, ఇటు విద్యార్జన కోసమైనా అత్యధికులు ఎంచుకుంటున్నది అమెరికా, ఆస్ట్రే లియా, కెనడా దేశాలేనని నివేదిక వెల్లడిస్తోంది. ఈ వలసల గణాంకాలు గమనిస్తే అంతర్జాతీయంగా వుండే తీవ్ర పోటీని తట్టుకుని మన దేశం నుంచి ఎక్కువమంది ఉపాధి అవకాశాలను గెల్చు కుంటున్నారని తెలుస్తుంది. విదేశాలకు వెళ్లినవారు తమ కుటుంబాలకు పంపే నగదు నిరుడు బాగా పెరిగింది. ఆ ఏడాది 11,100 కోట్ల డాలర్లు భారత్‌కు విదేశాల నుంచి వచ్చిందని అంచనా. ఇది దేశ జీడీపీలో 3.3 శాతం. అంతేకాదు... ప్రపంచ దేశాలన్నిటిలో చాలా అధికం. ఈ నగదులో 36 శాతం అమెరికా, బ్రిటన్, సింగపూర్ల నుంచి వచ్చిందేనని గణాంకాలు చెబుతున్నాయి. దీన్నిబట్టే భారత్‌కూ, అభివృద్ధి చెందిన దేశాలకూ సంబంధ బాంధవ్యాలు ఎంత పెరిగాయో తెలుస్తున్నది. అటు విద్యారంగాన్ని గమనిస్తే ఉన్నత చదువుల కోసం పిల్లలను విదేశాలకు పంపే తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతున్నదని అర్థమవుతుంది. ఈ విషయంలో లింగ వివక్ష కూడా తగ్గిందని ఓఈసీడీ నివేదిక వివరిస్తోంది. విదేశాల్లో చదువుకొనేందుకు వెళ్లేవారు అంతక్రితంతో పోలిస్తే రెట్టింపు పెరిగారని గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా ఉపాధి కోసమైనా, విద్య కోసమైనా వెళ్లేవారు పెర గటం మనవాళ్ల సత్తాను చాటుతోంది. ఎందుకంటే ప్రత్యేక నైపుణ్యాలుంటే తప్ప ఇదంతా సాధ్యం కాదు. అయితే ఇదే సమయంలో మన దేశంలో అటువంటి నిపుణులకు తగిన అవకాశాలు లేవన్న చేదు వాస్తవం వెల్లడవుతోంది. తగిన ఉపాధి, మంచి వేతనాలు లభించినప్పుడు వాటిని వదులు కుని ఎవరూ అయినవారికి దూరంగా పరాయి దేశాలకు వలస వెళ్లాలనుకోరు. వెళ్తున్నారంటే అలాంటివారికి తగిన ఉపాధి అవకాశాలు చూపలేకపోతున్నామని, మెరుగైన వేతనాలు ఇవ్వలేకపోతున్నా మని అర్థం. ఆ నైపుణ్యాలను మన దేశాభివృద్ధికి వినియోగించలేకపోతున్నామని, తగిన శ్రద్ధ పెట్ట డంలేదని గుర్తించాలి. ఈ సందర్భంలో ఈమధ్యే అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ఇచ్చిన గణాంకాల ఆధారంగా రూపొందిన ప్రపంచ బ్యాంకు నివేదికను కూడా ప్రస్తావించుకోవాలి. నిరుడు మన ఇరుగుపొరుగు దేశాలతో పోలిస్తే భారత్‌లో నిరుద్యోగిత అధికంగా వున్నదని ఆ నివేదిక తెలిపింది. మన దేశ యువతలో నిరుద్యోగిత 23.22 శాతం వుంటే, పాకిస్తాన్ (11.3 శాతం),బంగ్లాదేశ్ (12.9 శాతం), ఆఖరికి భూటాన్ (14.4 శాతం)లతో మనకంటే దూరంగా వున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. విదేశాలకెళ్లేవారు పెరగటం గర్వపడాల్సిన విషయమేననటంలో సందేహం లేదు. ఉన్నత విద్యా రంగంలో చూస్తే మన దేశంలో చాలా స్వల్ప సంఖ్యలో ఉన్నత శ్రేణి విద్యాసంస్థలున్నాయి. అవి కూడా వివిధ అంశాల్లో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు దీటుగా నిలబడలేకపోతున్నాయి. బోధనారంగ నిపుణులు కూడా అంతే. వారికి ఉన్నత విద్యాసంస్థల్లో అవకాశాలు లభించి తగిన వేతనాలు లభిస్తే ఇక్కడే ఉంటారు. అందువల్ల మన పిల్లల స్థితిగతులు మరింత మెరుగుపడతాయి. విదేశాల్లో విశ్వవిద్యాలయాలు ఇక్కడివారిని ఆకర్షించి భారీ మొత్తంలో వేతనాలిస్తుంటే మన సంస్థలు ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాయి. ఉపాధి విషయంలోనూ అంతే. తయారీ రంగ పరిశ్రమలను పెంచగలిగితే, చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు మరింత మెరుగ్గా చేయూతనందించగలిగితే వలస పోయేవారి మేధస్సు పూర్తిగా ఇక్కడే వినియోగపడుతుంది. ఇక్కడ ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమై జీవనప్రమాణాలు పెరగటానికి దోహదపడుతుంది. -
ఉపాధికి ఊతం.. పునరుత్పాదక రంగం
సాక్షి, అమరావతి: ప్రపంచ పునరుత్పాదక ఇంధన రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయని అంతర్జాతీయ అధ్యయనాలు మరోసారి రుజువు చేశాయి. ముఖ్యంగా మన దేశ సోలార్ ఫోటోవోల్టాయిక్ (పీవీ)లో ఉద్యోగాలు, ఉపాధి సంఖ్య అనేక అభివృద్ధి చెందిన దేశాలను అధిగవిుంచిందని అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ (ఆర్‌ఈఎన్‌ఏ), అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) సంయుక్త నివేదిక తాజాగా వెల్లడించింది. గ్లోబల్‌గా 2022లో 4.9 మిలియన్ల మందికి ఉద్యోగాలు లభించాయి. దీంతో మొత్తం ఉద్యోగాలు 13.7 మిలియన్లకు చేరుకున్నాయి. మన దేశంలో గతేడాది ఆన్–గ్రిడ్ సోలార్‌లో 2,01,400 ఉద్యోగాలు, ఆఫ్–గ్రిడ్‌లో 80,000 ఉద్యోగాలు వచ్చాయి. మొత్తం కొలువుల్లో దాదాపు 40 శాతం మంది మహిళలున్నారు. ఒక్క చైనా మినహా మిగతా ప్రపంచ దేశాలన్నిటి కంటే మన దేశమే ఈ విషయంలో పురోగమనంలో ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఏ) గతేడాది 2,64,000 మందికి ఉద్యోగాలిచ్చి మనదేశంతో పోల్చితే కాస్త వెనుకబడే ఉంది. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు 5,17,000 ఉద్యోగాలిచ్చాయి. బ్రెజిల్లో ఉద్యోగాల సంఖ్య 2,41,000కి చేరుకుంది. జపాన్ మాత్రం ఈ రంగంలో కేవలం 1,27,000 ఉద్యోగాలతో వెనుకబడి ఉంది. పెరగనున్న ఉపాధి.. 8025 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు ఇప్పటికే,ప్రైవేట్ పెట్టుబడిదారులకు కేటాయించడం జరిగింది. గ్రీన్కో గ్రూప్ ద్వారా నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2,300 మెగావాట్ల సోలార్ విద్యుత్‌కు సంబంధించి సైట్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఏఎం గ్రీన్ ఎనర్జీ (ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్) 700 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి పునాది పనులు పురోగతిలో ఉన్నాయి. నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేశారు. వీటి ద్వారా 5,300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. మరో రెండు వేల మందికి ఎన్‌హెచ్‌పీసీతో కలిసి ఏపీ జెన్కో నెలకొల్పనున్న పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల వల్ల లభించనున్నాయి. తద్వారా దేశంలోనే పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఇతర రాష్ట్రాలకంటే ముందుంటూ ఏపీ వాటికి ఆదర్శంగా నిలుస్తోంది. ముందే మేల్కొన్న ఏపీ.. దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న విద్యుత్ వినియోగం 2032 నాటికి 70 శాతం పెరుగుతుందని జాతీయస్థాయిలో అంచనా. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి వనరులను సమకూర్చుకోవాలి్సన ఆవశ్యకతను ముందుగానే గ్రహించింది ఏపీ ప్రభుత్వం. ఆ క్రమంలోనే విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టుల స్థాపనకు భారీగా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ పరిశ్రమల రాకతో రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు బాటలు వేసింది. ఏపీ విధానాలు నచ్చి ఏపీ ఇంధన రంగంలో రూ.9,57,1839 కోట్ల పెట్టుబడులతో 42 ప్రాజెక్టులు నెలకొల్పి 1,80,918 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక దిగ్గజాలు జతకలిశాయి. రాష్ట్రంలో 4,552.12 మెగావాట్ల సంచిత సౌర విద్యుత్ సామర్థ్యంతో, 2022–23లో 8,140.72 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచిందని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ తాజాగా ప్రకటించింది. భారీ ఒప్పందాల కారణంగా రానున్న రోజుల్లో ఏపీలో ఇది మరింతగా వృద్ధి చెందనుంది. -
ధైర్యం పలికిన పేరు... దేవాన్షి! ఆమె ఒక సైన్యంలా..!
పద్నాలుగు సంవత్సరాల వయసులో యాసిడ్ దాడికి గురైంది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దేవాన్షీ యాదవ్. తాను బాధితురాలిగా ఉన్నప్పుడు ఒంటరి. ఇప్పుడు మాత్రం తానే ఒక సైన్యం. ‘షాహీద్ రామాశ్రయ్ వెల్ఫేర్ సోసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థను మొదలుపెట్టి న్యాయసహాయం అందించడం నుంచి ఉపాధి అవకాశాలు కల్పించడం వరకు బాధితుల కోసం ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపడుతున్న దేవాన్షి గురించి... కష్టాలన్నీ కలిసికట్టుగా వచ్చాయా! అన్నట్లుగా దేవాన్షీ యాదవ్ నెలల వయసులో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. పద్నాలుగు సంవత్సరాల వయసులో కుటుంబ స్నేహితుడిగా భావించే ఒకడు లైంగిక వేధింపులకు, యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు మాత్రం దేవాన్షినే బోనులో నిలబెట్టారు. ‘మన జాగ్రత్తలో మనం ఉంటే ఇలాంటివి జరగవు కదా’ లాంటి మాటలు తనను ఎంతో బాధ పెట్టాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ పట్టణానికి చెందిన 31 సంవత్సరాల దేవాన్షి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలాంటి కష్టాలెన్నో కనిపిస్తాయి. అయితే వాటిని గుర్తు చేసుకుంటూ బాధను గుండెలో పెట్టుకోలేదు. తనలాంటి కష్టాలు వచ్చిన వారికి అండగా నిలబడాలనుకుంది. అలా మొదలైందే ‘షాహీద్ రామాశ్రయ్ వెల్ఫేర్ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థ. లైంగిక వేధింపులకు గురవుతున్న వారి నుంచి గృహహింస బాధితుల వరకు ఎంతోమందికి ఈ సంస్థ తరపున అండగా నిలబడింది దేవాన్షి. ‘ధైర్యసాహసాలలో మా అమ్మే నాకు స్ఫూర్తి. నాకు తొమ్మిది నెలలు ఉన్నప్పుడు నాన్న చనిపోయాడు. ఒకవైపు భర్త చనిపోయిన బాధ, మరోవైపు బిడ్డను ఎలా పోషించాలనే బాధ, అయోమయం ఆమెను చుట్టుముట్టాయి. ఆరోజు ఆమె ధైర్యం కోల్పోయి ఉంటే ఈ రోజు నేను ఉండేదాన్ని కాదు. జీవితంలో ప్రతి సందర్భంలో ధైర్యంతో ముందుకు వెళ్లింది. తల్లిగా ప్రేమానురాగాలను పంచడమే కాదు ధైర్యం అనే విలువైన బహుమతిని ఇచ్చింది’ అంటుంది దేవాన్షి. భారమైన జ్ఞాపకాల నుంచి బయటికి రావడానికి, శక్తిమంతం కావడానికి సామాజిక సేవా కార్యక్రమాలు దేవాన్షికి ఎంతో ఉపయోగపడ్డాయి. దేవాన్షి దగ్గరకు సహాయం కోసం వచ్చే బాధితుల్లో ఏ కోశానా ధైర్యం కనిపించదు. అలాంటి వారిలో ధైర్యం నింపడం అనేది తాను చేసే మొదటి పని. తనని కుటుంబ సభ్యురాలిగా భావించుకునేలా ఆత్మీయంగా ఉండడం రెండో పని. కౌన్సెలింగ్ ద్వారా వారికి భవిష్యత్ పట్ల ఆశ రేకెత్తించడం మూడోపని. ‘ఈ సమాజం నన్ను చిన్నచూపు చూస్తుంది. నాకు ఎవరూ అండగా లేరు’ అనుకున్న ఎంతోమందికి ‘నాకు ఎవరి అండా అక్కర్లేదు. ఒంటరిగా పోరాడగలను. నా కోసం నేను పోరాడలేనా!’ అనే ధైర్యాన్ని ఇచ్చింది. ‘ఇంకేముంది నా భవిష్యత్ బుగ్గిపాలు అయింది’ అని జీవనాసక్తి కోల్పోయిన వారిలో ‘కష్టాలు నీ ఒక్కరికే కాదు. అందరికీ వస్తాయి. అదిగో నీ భవిష్యత్’ అంటూ ఆశావాహ దృక్పథాన్ని కలిగించింది. ‘పదా... పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేద్దాం’ అని దేవాన్షి అన్నప్పుడు... ‘అమ్మో! నాకు పోలీస్ స్టేషన్ అంటే భయం’ అన్నది ఒక బాధితురాలు. ‘తప్పు చేసిన వాడు హాయిగా తిరుగుతున్నాడు. ఏ తప్పూ చేయని నువ్వెందుకు భయపడడం’ అని దేవాన్షి అనగానే ఆ బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు బయలు దేరింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో! సంస్థ అడుగులు మొదలుపెట్టిన కొత్తలో... ‘మీవల్ల ఏమవుతుంది’ అన్నట్లుగా ఎంతోమంది వ్యంగ్యంగా మాట్లాడేవారు. వారికి తన పనితీరుతోనే సమాధానం ఇచ్చింది దేవాన్షి. ‘దేవాన్షీ చాలా పట్టుదల గల వ్యక్తి. ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యదు. భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక నేను దేవాన్షి దగ్గరకు వచ్చాను. ఆమె నాకు ఆశ్రయం ఇచ్చింది. విషయం తెలుసుకున్న అత్తింటి వారు దేవాన్షిని బెదిరించడానికి వీధిరౌడీలను పంపించారు. ఆమె ధైర్యాన్ని చూసి వారు తోక ముడవడానికి ఎంతో సమయం పట్టలేదు’ అంటుంది బరేలీకి చెందిన రత్న. బరేలీ పట్టణానికి చెందిన వారే కాదు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ఎంతోమంది మహిళలు దేవాన్షి సహాయం కోసం రావడం ప్రారంభించారు. ‘మా దగ్గరకు వచ్చేవాళ్లలో 60 నుంచి 70 శాతం గృహహింస బాధితులే. వారికి అండగా నిలిచినప్పుడు సహజంగానే బెదిరింపులు ఎదురయ్యాయి. అయితే నేను వాటిని ఎప్పుడూ ఖాతరు చేయలేదు. మీకు ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? అనే ప్రశ్న అడుగుతుంటారు. ఒకప్పుడు నేను మీలాగే భయపడేదాన్ని... అంటూ నాకు ఎదురైన చేదు అనుభవాలను వారితో పంచుకుంటాను. అమ్మ నుంచి ధైర్యం ఎలా పొందానో చెబుతాను. ధైర్యం అనేది ఒకరు దయతో ఇచ్చేది కాదు. అది అందరిలోనూ ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుంటున్నామా? లేదా? అనేదే ముఖ్యం అని చెబుతుంటాను’ అంటుంది దేవాన్షీ యాదవ్. ‘అత్తింటి బాధలు తట్టుకోలేక బయటికి వచ్చాను. ఇప్పుడు నేను ఒంటరిగా ఎలా బతకగలను’ అని దిక్కులు చూస్తున్న ఎంతోమందికి సంస్థ ద్వారా దిక్కు చూపించి సొంత కాళ్ల మీద నిలబడేలా చేసింది. బాల్యవివాహాలు జరగకుండా అడ్డుపడింది. ‘మంచిపని చేస్తే ఆ ఫలితం తాలూకు ఆనందమే కాదు అపారమైన శక్తి కూడా లభిస్తుంది. ఆ శక్తి మరిన్ని మంచిపనులు చేయడానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది’ అంటుంది దేవాన్షీ యాదవ్. (చదవండి: "బతకడు" అన్న మాటే ఊపిరి పోసింది! వైద్యులనే విస్తుపోయేలా చేసింది!) -
కార్మికులకు 7% అధికంగా ఉపాధి
ముంబై: కార్మికులకు (బ్లూ కాలర్) ఉపాధి అవకాశాలు ఈ ఏడాది మార్చి నెలలో 7 శాతం అధికంగా నమోదయ్యాయి. 57,11,154 మంది కార్మికులకు ఉపాధి లభించింది. గతేడాది మార్చి నెలతో పోల్చినప్పుడు ఈ వృద్ది నమోదైంది. ప్రధానంగా సెక్యూరిటీ సేవల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఏర్పడ్డాయి. 2022 మార్చిలో బ్లూకాలర్ కార్మికులకు కొత్తగా 53,38,456 ఉపాధి అవకాశాలు లభించాయి. ఈ వివరాలను క్వెస్‌కార్ప్ సబ్సిడరీ అయిన బిలియన్ కెరీర్స్ అనే డిజిటల్ జాబ్ ప్లాట్‌ఫామ్ విడుదల చేసింది. గడిచిన ఏడాది కాలంలో సెక్యూరిటీ ఉద్యోగాలకు డిమాండ్ 219 శాతం పెరిగింది. ఇది సురక్షితమైన, భద్రతా పని వాతావరణం అవసరాన్ని తెలియజేస్తోందని ఈ నివేదిక పేర్కొంది. సంఘర్షణల పరిష్కారంలో నైపుణ్యాలు, స్నేహపూర్వకంగా మసలుకునే సెక్యూరిటీ గార్డులకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అడ్మిన్, హ్యుమన్ రీసోర్స్ విభాగాల్లో వార్షికంగా 61.75% వృద్ధి నమోదైంది. హెచ్ఆర్ విభాగలో కార్మికులకు బలమైన డిమాండ్ ఉన్నట్టు నివేదిక తెలిపింది. ఈవెంట్ సూపర్వైజర్లు సహా, శ్రమతో చేసే పనివారు అందరూ బ్లూకాలర్ కార్మికుల కిందకే వస్తారు. తన ప్లాట్ఫామ్లో మార్చి నెలలో నమో దైన వివరాల ఆధారంగా బిలియన్ కెరీర్స్ ఈ వివరాలను అందించింది. -
పెట్టుబడులకు లాజిస్టిక్స్ అద్భుత అవకాశం
భువనేశ్వర్: పెట్టుబడులు, పరిశ్రమగా రూపుదిద్దుకోవడం, భారీ ఉపాధి అవకాశాలతో రాబోయే సంవత్సరాల్లో యువతకు లాజిస్టిక్స్ పూర్తి అవకాశాలను కల్పించనుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 27 నుండి 29 వరకు ఇక్కడ జరగనున్న మూడవ జీ– 20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ భేటీ నేపథ్యంలో ‘‘ట్రాన్స్ఫార్మింగ్ లాజిస్టిక్స్ ఫర్ కోస్టల్ ఎకానమీస్‘ అనే అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే సంవత్సరాల్లో లాజిస్టిక్స్ భారీగా పురోగమించే అవకాశం ఉందని అన్నారు. ఈ రంగానికి సంబంధించి సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి విభాగాల్లో భారీ పెట్టుబడులకు, వ్యవస్థాపకతకు, ఉపాధి అవకాశాలకు భారీ అవకాశాలు కనిపిస్తున్నాయని అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘ఇది ప్రపంచానికి సవాళ్లతో కూడిన ఆసక్తికరమైన సమయం. అవకాశాలతో పాటు సవాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సందర్భంలో, భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతరించింది. భారత్‌ను ప్రపంచం చాలా గౌరవ ప్రదమైన దేశంగా చూస్తోంది‘ అని చంద్రశేఖర్ అన్నారు. సవాళ్లను తట్టుకునే ఎకానమీల దిశగా ప్రపంచం సవాళ్లను తట్టుకుని పురోగమించే లాజిస్టిక్స్, విశ్వసనీయ సప్లైచైన్ వైపు ప్రపంచం చూస్తోందని, రిస్క్ నుండి దూరంగా ఉంటూ సవాళ్లను ఎదుర్కొనే ఆర్థిక వ్యవస్థల వైపు పెట్టుబడులకు మొగ్గుచూపుతోందని మంత్రి పేర్కొన్నారు. ఒడిశా వంటి తీరప్రాంత రాష్ట్రాలలో లాజిస్టిక్స్‌పై దృష్టి, దీనిపై తగిన విధానాలు కీలకమైనవని పేర్కొన్నారు. లాజిస్టిక్స్ అనేది సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఒక భాగం. ఇది కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వస్తువులు, సేవలు సరఫరాలు, నిల్వల నిర్వహణకు సంబంధించిన కీలక విభాగం. భారత్‌కు విషయంలో ప్రపంచ బ్యాంకు 2023 లాజిస్టిక్ ఇండెక్స్ (ఎల్పీఐ) ర్యాంక్ 2022కన్నా 2023లో ఆరు స్థానాలు మెరుగుపడింది. ప్రపంచంలోని 139 దేశాలను పరిగణనలోకి తీసుకున్న ఈ సూచీ– భారత్ ర్యాంక్ 38కి పెరిగింది. 2022లో ఈ సూచీ ర్యాంక్ 44. ఈ నేపథ్యంలో భారత్ పురోగతిపై ఇంకా కేంద్ర మంత్రి ఏమన్నారంటే.. మొబైల్ ఫోన్ల హబ్‌గా.. 2014లో భారతదేశంలో వినియోగించే మొబైల్ ఫోన్లలో 82 శాతం దిగుమతి అయ్యాయి. 2022లో భారతదేశంలో వినియోగించే దాదాపు 100 శాతం మొబైల్ ఫోన్లు భారతదేశంలోనే తయారయ్యాయి. 2014లో భారత్ నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతి దాదాపు లేనేలేదు. అయితే ఒక్క ఈ ఏడాదే భారత్ దాదాపు 11 బిలియన్ డాలర్ల విలువ చేసే యాపిల్, సామ్సంగ్ ఫోన్లను ఎగుమతి చేసింది. మారిన పరిస్థితులు భారతదేశంలో వ్యాపారం చేయడానికి తగిన మార్కెట్ లేదని, ఇది ఆచరణీయ మార్కెట్ కాదని, లాజిస్టిక్స్ వ్యయాలు భారీగా ఉన్నందున భారత్‌కు ప్రపంచ తయారీ కేంద్రంగా మారగల సామర్థ్యం అసలు లేదని చాలా దశాబ్దాలుగా ఒక వాదన ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రస్తుతం ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్‌లో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, మొబైల్‌లు తదితర అనేక ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఎ గుమతులు, దేశంలోనే విక్రయాలు, దేశీయంగా పటి ష్టమైన లాజిస్టిక్స్ వ్యవస్థ వంటి ఎన్నో అంశాల్లో భా రత్ ఇప్పుడు మరింత సమర్థవంతంగా మారింది. నైపుణ్యాలు కీలకం యువత తమ ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలి. అంటే డిగ్రీలు అందుకున్నంత మాత్రాన నైపుణ్యాలను పొందలేము. ప్రత్యేకించి నైపుణ్యాల మెరుగుదలపై దృష్టి పెట్టాలి. మూడవ జీ–20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అక్షరాస్యత, స్టాటిస్టిక్స్, టెక్–ఎనేబుల్డ్ లెర్నింగ్, ఫ్యూచర్ ఆఫ్ వర్క్, పరిశోధన, సహకారం వంటి పలు అంశాలపై దృష్టి సారిస్తుంది. తీరప్రాంత ఆర్థిక వ్యవస్థల పురోగతికి టెక్నాలజీ, ట్రాన్స్ఫార్మింగ్ లాజిస్టిక్స్, స్కిల్ ఆర్కిటెక్చర్, జీవితకాల అభ్యాసానికి సామర్థ్యాలను పెంపొందించడం వంటి అంశాలూ ఈ సమావేశంలో చర్చనీయాంశాలు కానున్నాయి. జీ20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలో జరిగింది. ఆ తర్వాత గత నెలలో అమృత్‌సర్‌లో రెండవ సమావేశం జరిగింది. మూడవ సమావేశాలు ఈ నెల్లో భువనేశ్వర్‌లో జరుగుతున్నాయి. తదనంతరం ఆయా అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయ ప్రాతిపదికన విధాన నిర్ణయాలు రూపొందుతాయి. -
10 వేల మంది మహిళలకు గోల్డ్‌మ్యాన్ చేయూత
ముంబై: గోల్డ్‌మ్యాన్ శాక్స్ భారత్‌లో 10,000 మంది మహిళలకు వ్యాపారం, మేనేజ్మెంట్ విద్యకు కావాల్సిన నిధుల సహకారం అందించినట్టు ప్రకటించింది. వీరి ద్వారా 12,000 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించాయని, గడిచిన 18 నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.2,800 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలిపింది. గోల్డ్‌మ్యాన్ శాక్స్ 2008లో మొదటిసారి భారత్‌లో గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ఆరంభించింది. 18 నెలల క్రితం తిరిగి దీన్ని ప్రారంభించింది. ‘వుమెన్ఇనీషియేటివ్’ కింద 10,000 మంది మహిళలకు వ్యాపారం, యాజమాన్య విద్యకు కావాల్సిన నిధుల సహకారం అందించనున్నట్టు నాడు ప్రకటించింది. గోల్డ్ మ్యాన్ శాక్స్ కార్యక్రమంలో పాల్గొన్న 10వేల మంది మహిళలల్లో 2,400 మందిపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అధ్యయనం నిర్వహించగా, ఆ వివరాలను గోల్డ్‌మ్యాన్ శాక్స్ విడుదల చేసింది. గోల్డ్ మ్యాన్ శాక్స్ నిధుల మద్దతు పొందిన 10వేల మంది మహిళలు గత 18 నెలల్లో తమ సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేసుకున్నాయి. అలాగే, ఆదాయాన్ని నాలుగు రెట్లు పెంచుకున్నాయి. తమ ఉత్పాదకతను సగటున ఐదు రెట్లు వృద్ధి చేసుకున్నాయి. వీరిలో అధిక శాతం మహిళా వ్యాపారవేత్తలు నియామకాలు పెంచుకుంటామని, ఆదాయం పెరుగుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. భారత్‌లో మహిళా వ్యాపారవేత్తల ప్రాతినిధ్యం ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నట్టు గోల్డ్‌మ్యాన్ శాక్స్ ఇండియా చైర్మన్, సీఈవో సంజయ్ ఛటర్జీ పేర్కొన్నారు. నిధుల సాయం పొందేందుకు కూడా వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెబుతూ.. వారి అసలు సామర్థ్యాలు వెలుగులోకి తెచ్చేందుకు ఇంకా ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో కేవలం 20 శాతం వ్యాపారాలే మహిళల నిర్వహణలో ఉన్నాయని, మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో వారి వాటా కేవలం 3 శాతంగానే ఉన్నట్టు చెప్పారు. -
122 ప్రాజెక్టులు.. రూ.21,050.86 కోట్లు
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి ప్రసాదించిన సిరిసంపదలు.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక కేంద్రాలు.. అబ్బురపరిచే పర్యాటక సోయగాలు.. దట్టమైన అడవులు.. కొండ కోనలు.. మన్యాలు.. సుందరమైన నదీతీరాలు.. అత్యంత సువిశాల సాగరతీరం.. ఇదీ ఆంధ్రప్రదేశ్ పర్యాటక వైభవం! సహజ సిద్ధమైన అందాలతో స్వర్గధామంగా భాసిల్లుతున్న రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ సంస్థలు సిద్ధమయ్యాయి. విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023లో పర్యాటక రంగంలో రూ.21,050 కోట్ల పెట్టుబడులతో ఏకంగా 122 ప్రాజెక్టులకు సంబంధించి ఎంవోయూలు కుదుర్చుకునేందుకు ముందుకొచ్చాయి. సీఎం వైఎస్ జగన్‌సమక్షంలో ఒప్పందాలు చేసుకుని ఏకంగా 39 వేల మందికిపైగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. ♦ ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ స్థానంలో నిలబెట్టాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు రూపకల్పన జరుగుతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లానూ పర్యాటక ఖిల్లాగా మార్చేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదికగా మారుతోంది. ప్రతి జిల్లాలో ఒక ప్రాజెక్టు వచ్చేలా ఎంవోయూలు సిద్ధమయ్యాయి. ♦ పర్యాటకాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ అందిపుచ్చుకొని అభివృద్ధి చేసే విధంగా ప్రాజెక్టులని సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రోడ్‌షోలో మంచి స్పందన లభించింది. ఏపీలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉండటంతో పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. రూ.కోటి నుంచి రూ.1,350 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టేందుకు వివిధ ప్రాజెక్టులతో ముందుకొచ్చాయి. తాజ్‌గ్రూప్, ఒబెరాయ్, గ్యారీసన్ గ్రూప్స్, తులి హోటల్స్, మంజీరా గ్రూప్, డీఎక్స్ఎన్, టర్బో ఏవియేషన్, ఇండియన్ ఏసియన్, రివర్‌బే, పోలో టవర్స్, లాలూజీ అండ్ సన్స్, డ్రీమ్‌వ్యాలీ, సన్ గ్రూప్, విండ్ హెవెన్, ఆదిత్యా గేట్‌వే, సన్‌రే లాంటి ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ♦ కన్వెన్షన్ సెంటర్లు, స్టార్ హోటళ్లు, వాటర్ స్పోర్ట్స్, రిసార్టులు, సీ ప్లేన్ సర్విసులు, వెల్నెస్ సెంటర్లు, మెగావీల్, అడ్వెంచర్, బీచ్ ఫ్రంట్ రిసార్టులు, వాటర్ థీమ్ పార్కులు, డిన్నర్ క్రూయిజ్, స్విమ్మింగ్ పూల్స్, కల్చరల్ విలేజ్‌లు, యాటింగ్, రెస్టోబార్, స్కైలాంజ్, రేసింగ్ ట్రాక్‌లు, కేబుల్‌కార్, గోల్ఫ్‌కోర్స్, సఫారీ టూరిజం.. ఇలా రూ.21050.86 కోట్లతో 39,022 మందికి ఉపాధి కల్పించేలా 122 ప్రాజెక్టులకు ఎంవోయూలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో 4వతేదీన భాగస్వామ్య ఒప్పందాలకు శ్రీకారం చుట్టేలా పర్యాటక శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. పర్యాటకాభివృద్ధికి అపార అవకాశాలున్నా టీడీపీ హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ అమలు చేయలేదు. సమీక్షలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు మినహా కార్యాచరణ శూన్యం. -
‘సీలేరు’కు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుచూపుతో చేపట్టిన పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు (పీఎస్పీ)ల ఏర్పాటుకు అడ్డంకులు తొలగుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని ఎగువ సీలేరు పార్వతీనగర్ వద్ద 1,350 మెగావాట్ల సామర్థ్యం గల భూగర్భ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఆర్థిక, పర్యావరణ అనుమతులు వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టుకు టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నట్లు ఏపీ జెన్కో వెల్లడించింది. ఇందులో భాగంగా పర్యావరణ అనుమతులకు అవసరమైన నివేదికను సిద్ధం చేసింది. అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది నివాసానికి అవసరమైన నివాసాలు, కార్యాలయాలు, షెడ్లను సిద్ధం చేస్తోంది. ఎగువ సీలేరు వద్ద ఉన్న గుంటవాడ రిజ ర్వాయర్ (ఎగువ) నుంచి 1.70 టీఎంసీల నీటిని వినియోగించడం ద్వారా పీక్ అవర్స్‌లో 1,350 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. అలాగే డొంకరాయి రిజర్వాయర్ (దిగువ) నుంచి 1.70 టీఎంసీల నీటిని గుంటవాడ రిజర్వాయర్‌కు ఆఫ్ పీక్ వేళల్లో పంపు చేయడం కూడా ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతల్లో ఒకటి. ఆకస్మిక హెచ్చుతగ్గుల కారణంగా గ్రిడ్‌పై భారం పడి.. సమస్యలు తలెత్తకుండా స్థిరంగా ఉంచేందు కు ప్రాజెక్ట్ సహాయపడుతుంది. ఇందుకు గ్రిడ్‌లో ఉన్న మిగులు విద్యుత్‌ను ఉపయోగిస్తారు. 29 ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం.. రాష్ట్రంలో 29 ప్రాంతాల్లో 33,240 మెగావాట్ల సామర్థ్యంతో పీఎస్పీలను నెలకొల్పడానికి ప్రణాళిక సిద్ధమైంది. మరో 10 వేల మినీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఇటీవల గుర్తించింది. మొత్తంగా 43,240 మెగావాట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. వీటి కోసం వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 1.45 లక్షల ఎకరాల భూమికి టెక్నో కమర్షియల్ ఫీజిబిలిటీ స్టడీస్ నిర్వహించింది. పెట్టుబడులు పెట్టేవారికి, పరికరాల తయారీ సౌకర్యాల ప్రాజెక్ట్ డెవలపర్లకు సుమారు 5 లక్షల ఎకరాలను లీజుకు ఇవ్వడానికి భూమిని సమకూరుస్తోంది. తొలి దశలో వైఎస్సార్ జిల్లా గండికోట, అనంతపురం జిల్లా చిత్రావతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సోమశిల, కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్, విజయనగరం జిల్లా కురుకూటి, కర్రివలస, విశాఖపట్నం జిల్లా ఎర్రవరంలలో 6,600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఏడు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. పీఎస్పీల వల్ల రాష్ట్రానికి గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ ఛార్జీల కింద రూ.8,058 కోట్లు అందుతాయి. పన్ను రాబడి కింద రూ.1,956 కోట్ల మొత్తం సమకూరుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 58,600 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. త్వరలోనే టెండర్లు.. సీలేరులో 1,350 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి దాదాపు 410 హెక్టార్ల భూమి అవసరమవుతోంది. టోపోగ్రాఫికల్, హైడ్రోగ్రాఫిక్ సర్వేలు, జియోటెక్నికల్ పరిశోధనలు ఇప్పటికే పూర్తయ్యాయి. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కూడా సిద్ధంగా ఉంది. ఆర్థిక, పర్యావరణ అనుమతులు రాగానే టెండర్ డాక్యుమెంట్లను న్యాయ సమీక్షకు పంపిస్తాం. అక్కడి నుంచి క్లియరెన్స్ తీసుకుని టెండర్లు పిలిచి.. త్వరలోనే పనులు మొదలుపెడతాం. –బి.శ్రీధర్, ఎండీ, ఏపీ జెన్కో -
Alina Alam: అద్భుతదీపం
దొరికితే అద్భుతాలు సృష్టించవచ్చు. అది కథల్లో తప్ప బయట దొరకదని మనకు తెలుసు! అయితే అలీన అలమ్‌కు ‘పవర్ ఆఫ్ పాజిటివ్ యాక్షన్’ రూపంలో అద్భుతదీపం దొరికింది. ఆ అద్భుతదీపంతో వ్యాపారంలో ఓనమాలు తెలియని అలీన సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తోంది. నిస్సహాయత తప్ప ఏమీ లేని వారికి అండగా ఉండి ముందుకు నడిపిస్తోంది... అలీన అద్భుతదీపం కోల్‌కత్తాకు చెందిన అలీన అలమ్‌కు హైస్కూల్ రోజుల్లో బాగా నచ్చిన మాట... పవర్ ఆఫ్ పాజిటివ్ యాక్షన్. రోడ్డు దాటుతున్న వృద్ధురాలికి సహాయపడినప్పుడు, ఆకలి తో అలమటిస్తూ దీనస్థితిలో పడి ఉన్న వ్యక్తికి తన పాకెట్‌మనీతో కడుపు నిండా భోజనం పెట్టించినప్పుడు, పిల్లాడికి స్కూల్ ఫీజు కట్టలేక సతమతమవుతున్న ఆటోడ్రైవరుకు తన వంతుగా సహాయం చేసినప్పుడు.. ‘పవర్ ఆఫ్ పాజిటివ్ యాక్షన్’ అనేది తన అనుభవంలోకి వచ్చింది. ‘ఒక మంచి పని చేస్తే అది ఊరకే పోదు. సానుకూల శక్తిగా మారి మనల్ని ముందుకు నడిపిస్తుంది’ అనే మాట ఎంత నిజమో తెలిసి వచ్చింది. అలీన తల్లి గృహిణి. తండ్రి ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగి. ‘డబ్బే ప్రధానం’ అనే ధోరణిలో వారు పిల్లల్ని పెంచలేదు. బెంగళూరులోని అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీలో మాస్టర్స్ చేసింది అలమ్. అక్కడ చదుకునే రోజుల్లో ఎన్నో డాక్యుమెంటరీలను చూసింది. తన ఆలోచనలు విశాలం కావడానికి, కొత్తగా ఆలోచించడానికి, కొత్తమార్గాన్ని అన్వేషించడానికి అవి కారణం అయ్యాయి. ‘రోమన్ చక్రవర్తి నీరోపై తీసిన ఒక డాక్యుమెంటరీ చూసి చలించిపోయాను. యుద్ధఖైదీల పట్ల అతడు క్రూరంగా వ్యవహరిస్తాడు. అయితే ఆ క్రూరత్వం అనేది ఆ చక్రవర్తికి మాత్రమే పరిమితమై లేదు. అతడితో అంతం కాలేదు. రకరకాల రూపాల్లో అది కొనసాగుతూనే ఉంది. క్రూరత్వంపై మానవత్వం విజయం సాధించాలి’ అంటుంది అలీన. 23 సంవత్సరాల వయసులో ‘మిట్టీ’ పేరుతో కేఫ్ ప్రారంభించింది అలీన.‘ఏదైనా మంచి ఉద్యోగం చేయకుండా ఇదెందుకమ్మా’ అని తల్లిదండ్రులు నిట్టూర్చలేదు. ఆశీర్వదించారు తప్ప అభ్యంతర పెట్టలేదు. ఇది లాభాల కోసం ఏర్పాటు చేసిన కేఫ్ కాదు. మానసిక వికలాంగులు, దివ్యాంగులకు ధైర్యం ఇచ్చే కేఫ్. ‘మిట్టీ’ అనే పేరును ఎంచుకోవడానికి కారణం అలమ్ మాటల్లో... ‘మనం ఈ నేల మీదే పుట్టాం. చనిపోయిన తరువాత ఈ నేలలోనే కలుస్తాం. నేలకు ప్రతి ఒక్కరూ సమానమే’ నిజానికి ‘మిట్టీ’ మొదలు పెట్టడానికి ముందు తన దగ్గర పెద్దగా డబ్బులు లేవు. దీంతో ఒక ఆలోచన చేసింది. ‘దివ్యాంగులకు మిట్టీ కేఫ్ ద్వారా సహాయ పడాలనుకుంటున్నాను. నాకు అండగా నిలవండి’ అంటూ కరపత్రాలు అచ్చువేసి కర్నాటకలోని కొన్ని పట్టణాల్లో పంచింది. అయితే పెద్దగా స్పందన లభించలేదు. ఒక అమ్మాయి మాత్రం అలీనకు సహాయం గా నిలవడానికి ముందుకు వచ్చింది. ‘ఒక్కరేనా! అనుకోలేదు. ఈ ఒక్కరు చాలు అనుకొని ప్రయాణం మొదలుపెట్టాను’ అని గతాన్ని గుర్తుకు తెచ్చుకుంది అలీన. కొందరు ఆత్మీయుల ఆర్థిక సహకారంతో హుబ్లీ(కర్నాటక)లోని బీవిబీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాం్యపస్లో ‘మిట్టీ’ తొలి బ్రాంచ్ ప్రారంభించింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. నాలుగు సంవత్సరాలలో బెంగళూరు, కర్నాటకాలలో 17 బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. దివ్యాంగులు, మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారికి ధైర్యం ఇచ్చి, తగిన శిక్షణ ఇచ్చి ఈ కేఫ్‌లలో ఉపాధి కల్పించడం ప్రారంభించింది అలీన. ‘మిట్టీ’ సక్సెస్ఫుల్ కేఫ్గానే కాదు దివ్యాంగుల హక్కులకు సంబంధించి అవగాహన కేంద్రంగా కూడా ఎదిగింది. ‘మిట్టీ కేఫ్‌లోకి అడుగుపెడితే చాలు చెప్పలేనంత ధైర్యం వస్తుంది’ అంటుంది కోల్‌కతాకు చెందిన 22 సంవత్సరాల కీర్తి. దివ్యాంగురాలిగా కీర్తి అడుగడుగునా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంది. అయితే మిట్టీ కేఫ్ తనలో ఎంతో ధైర్యాన్ని నింపింది. ఇలాంటి ‘కీర్తి’లు ఎంతో మందికి అండగా నిలుస్తోంది మిట్టీ కేఫ్. -
హింటాస్టికా ప్లాంటు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హింద్‌వేర్, గ్రూప్ ఆట్లాంటిక్ల సంయుక్త భాగస్వామ్య కంపెనీ హింటాస్టికా ప్లాంటు ప్రారంభం అయింది. హైదరాబాద్ సమీపంలోని జడ్చర్ల వద్ద రూ.210 కోట్లతో దీనిని నెలకొల్పారు. హింద్‌వేర్ అట్లాంటిక్ బ్రాండ్‌లో వాటర్ హీటర్లను ఇక్కడ తయారు చేస్తారు. ఏటా 6 లక్షల యూనిట్ల వాటర్ హీటర్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో స్థాపించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని కంపెనీ తెలిపింది. భారత్‌తోపాటు విదేశాలకూ ఎగుమతి చేస్తామని హింద్‌వేర్ హోమ్ ఇన్నోవేషన్ చైర్మన్ సందీప్ సొమానీ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. రెండున్నరేళ్లలో పూర్తి సామర్థ్యానికి చేరుకుంటామన్నారు. ఆ సమయానికి రూ.150 కోట్లతో 50 శాతం సామర్థ్యం అదనంగా జోడిస్తామని వెల్లడించారు. -
ఫ్రెషర్ల నియమాకాలపై కంపెనీల్లో సానుకూలత
ముంబై: ఫ్రెషర్లకు ఉపాధి కల్పించే విషయంలో కంపెనీల్లో సానుకూల ధోరణి 61 శాతానికి పెరిగింది. టెక్నాలజీ, డిజిటల్ సేవలకు డిమాండ్‌తో సంస్థలు మరింత మంది ఫ్రెషర్లను తీసుకోవాలని అనుకుంటున్నట్టు టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ కెరీర్ అవుట్‌లుక్ నివేదిక తెలిపింది. దీంతో ఫ్రెషర్లకు ఉపాధి అవకాశాలు గతేడాది జూన్–డిసెంబర్ కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఇదే కాలానికి మూడు రెట్లు అధికంగా ఉంటాయని పేర్కొంది. ఈ ఏడాది ద్వితీయ భాగం ఆరంభంలో నిపుణులను ఆకర్షించడం ప్రముఖ కంపెనీలు, వ్యాపారవేత్తలకు ప్రాధాన్య అంశంగా మారినట్టు తెలిపింది. 865 చిన్న, మధ్య, పెద్ద స్థాయి కంపెనీలపై టీమ్‌లీజ్ ఈ సర్వే నిర్వహించింది. ఐటీ 34 శాతం, ఈ కామర్స్ అండ్ టెక్నాలజీ స్టార్టప్‌లు 23 శాతం, టెలీ కమ్యూనికేషన్స్ 22 శాతం, ఇంజనీరింగ్ రంగం 20 శాతం మేర గతేడాది ఇదే కాలంతో పోలిస్తే మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ ఏడాది ద్వీతీయ ఆరు నెలల కాలంలో ఫ్రెషర్లకు ఉపాధి అవకాశాల పరంగా.. బెంగళూరు 25 శాతం, ముంబై 19 శాతం, ఢిల్లీ 18 శాతం వృద్ధిని చూపించనునన్నట్టు అంచనా వేసింది. -
Bharat Jodo Yatra: విద్వేష రాజకీయాల నుంచి యువతను రక్షించాలి
తుమకూరు: విద్వేష రాజకీయాల నుంచి దేశ యువతను రక్షించాలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి అవకాశాలను వారికి కల్పించి మంచి భవిష్యత్తును చూపాలన్నారు. యువతను విద్వేషాల మంటల్లోకి నెట్టేవేయడం దేశ భవితను నాశనం చేస్తుందన్నారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర ఆదివారం తుమకూరు జిల్లాలో రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా కొందరు యువతీయువకులు పెరుగుతున్న నిరుద్యోగం, మత విద్వేషాలకు వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శిస్తూ యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ వారితో మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు. శాంతి, సోదరభావ సందేశాన్ని వ్యాపింపజేసి, దేశాన్ని ఐక్యంగా ఉంచే యాత్రలో పాల్గొనాలని ఆయన వారిని కోరారు. ‘కొన్ని రాజకీయ పార్టీలు తమ విద్వేష రాజకీయాల కోసం వారిని నిరుద్యోగులుగానే ఉంచుతూ తప్పుదోవపట్టిస్తున్నాయి. యువత మన దేశ భవిష్యత్తు. ఉపాధి చూపితే వారు తమ, కుటుంబ, దేశ భవిష్యత్తును నిర్మిస్తారు. మనదేశాన్ని మునుపటి మాదిరిగా అందమైన దేశంగా తయారు చేసుకుందాం’అని రాహుల్ పేర్కొన్నారు. చిక్కనాయకనహళ్లిలో చిన్నారులతో కలిసి కారులో కాసేపు ముచ్చటించారు. చిన్నారులతో కలిసి కారులో రాహుల్ సరదా -
వ్యవసాయేతర రంగాల్లో 10 లక్షల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: వ్యవసాయం కాకుండా, 9 రంగాల్లో ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో కొత్తగా 10 లక్షల మందికి ఉపాధి లభించింది. దీంతో ఈ రంగాల్లో మొత్తం ఉపాధి అవకాశాలు 3.18 కోట్లకు పెరిగినట్టు కేంద్ర కార్మిక శాఖ త్రైమాసికం వారీ ఉపాధి సర్వే నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను మంత్రి భూపేందర్ యాదవ్ మంగళవారం విడుదల చేశారు. తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, విద్య, ఆరోగ్యం, ఆతిథ్యం/రెస్టారెంట్, ఐటీ/బీపీవో, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఈ ఉద్యోగాలు వచ్చినట్టు తెలిపింది. ఇదీ చదవండి : Tiago EV: టాటా టియాగో ఈవీ వచ్చేసింది, వావ్...తక్కువ ధరలో! 2021 జనవరి 1 నాటికి ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు 3.08 కోట్లుగా ఉంటే, మార్చి చివరికి 3.18 కోట్లకు పెరిగినట్టు పేర్కొంది. కరోనా ఆంక్షల తొలగింపుతో ఆర్థికరంగ కార్యకలాపాలు ఊపందుకున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. సంఘటిత రంగంలో ఉపాధికి సంబంధించి కీలక సమాచారం కోసం త్రైమాసికం వారీగా ఉపాధి సర్వేను కేంద్ర కార్మిక శాఖ నిర్వహిస్తుంటుంది. దేశవ్యాప్తంగా 12,000 సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ 9 రంగాల్లో కలిపి ఉపాధి అవాకాశాలు 2013–14 నాటి సర్వే నాటికి 2.37 కోట్లుగా ఉండడం గమనార్హం. తయారీలో ఎక్కువ.. ఈ గణాంకాల్లో అత్యధికంగా తయారీ రంగంలో 38.5 శాతం మందికి ఉపాధి లభిస్తోంది. ఆ తర్వాత విద్యా రంగంలో 21.7 శాతం, ఐటీ/బీపీవో రంగంలో 12 శాతం, ఆరోగ్య రంగంలో 10.6 శాతం మందికి ఉపాధి కల్పన జరిగింది. ఈ నాలుగు రంగాల్లోనే 83 శాతం మంది పనిచేస్తుండడం గమనార్హం. -
లక్ష కోట్ల దిశగా పతంజలి గ్రూప్..
న్యూఢిల్లీ: వచ్చే 5–7 ఏళ్లలో సంస్థ ఆదాయం రెండున్నర రెట్లు ఎగసి రూ.1 లక్ష కోట్లకు చేరుతుందని పతంజలి గ్రూప్ వెల్లడించింది. ప్రస్తుతం ఆదాయం రూ.40,000 కోట్లు ఉందని గ్రూప్ ఫౌండర్, యోగా గురు బాబా రామ్‌దేవ్ తెలిపారు. అయిదేళ్లలో తమ సంస్థ ప్రత్యక్షంగా అయిదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. ‘గ్రూప్ అనుబంధ కంపెనీ అయిన పతంజలి ఫుడ్స్ (గతంలో రుచి సోయా) ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.50,000 కోట్లను తాకింది. మరో నాలుగు కంపెనీలను 2027 నాటికి లిస్ట్ చేయనున్నాం. ఐపీవోకు రానున్న కంపెనీల్లో పతంజలి ఆయుర్వేద్, పతంజలి మెడిసిన్, పతంజలి లైఫ్‌స్టైల్, పతంజలి వెల్నెస్ ఉన్నాయి. ఈ నాలుగింటిలో పతంజలి ఆయుర్వేద్ తొలుత ఐపీవోకు రానుంది. ఈ కంపెనీకి మార్కెట్లో సుస్థిర స్థానం ఉంది’ అని వివరించారు. నెయ్యిలో కల్తీ అబద్ధం పతంజలి నెయ్యిలో కల్తీ జరుగుతోందడం సరికాదన్నారు. ల్యాబ్‌లో కనుగొన్న విషయాలు సరైనవి కావని, ఇందులో కొంతమంది అధికారుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ప్రభుత్వాల ల్యాబొరేటరీ ప్రమాణాలు పెరగాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ల్యాబొరేటరీలలో పరీక్షా సౌకర్యాలను మెరుగుపరచాలని, బాధ్యతా రహిత అధికారులను శిక్షించాలని సూచించారు. ‘అన్ని ఉత్పత్తులు బయటకు వచ్చే ముందు అనేకసార్లు పరీక్షిస్తాం. పరిశోధన, అభివృద్ధికి రూ.1,000 కోట్ల దాకా ఖర్చు చేశాం’ అని వెల్లడించారు. ఇమేజ్ కాపాడుకుంటాం.. ‘కుట్ర పన్నిన వ్యక్తులను ఈసారి వదిలిపెట్టబోము. బ్రాండ్ ప్రతిష్టను కాపాడేందుకు చట్ట ప్రకారం కఠిన చర్యలను గ్రూప్ తీసుకుంటుంది. 100 మందికిపైగా లీగల్ నోటీసులు పంపించాం. ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి’ అని స్పష్టం చేశారు. యోగా పరువు తీయడంలో మతపరమైన తీవ్రవాదం, ఆయుర్వేదం విషయంలో మెడికల్ టెర్రరిజం హస్తం ఉందని గ్రూప్ ప్రకటన ఒకటి తెలిపింది. లంపీకి పరిష్కారం దిశగా.. పశువులకు సోకుతున్న లంపీ చర్మ వ్యాధికి పరిష్కారం కనుగునే దిశగా పతంజలి గ్రూప్ కసరత్తు చేస్తోందని రామ్‌దేవ్ వెల్లడించారు. ఈ వ్యాధి బారినపడి ఇప్పటికే దేశంలో ఒక లక్ష ఆవులు మృత్యువాత పడ్డాయని పేర్కొన్నారు. హరిద్వార్‌లోని తన ఇంట్లో చాలా ఆవులకు కూడా ఈ వ్యాధి సోకిందని, అయితే ఒక్కటి కూడా చనిపోలేదని చెప్పారు. త్వరలో నాలుగు ఐపీవోలు ఐపీవో కోణం నుండి చూస్తే పతంజలి ఆయుర్వేద్ ఉత్తమమైనదని రామ్‌దేవ్ తెలిపారు. ‘ఉత్పత్తి శ్రేణి, విస్తృతి, కస్టమర్ల సంఖ్య, లాభదాయకత, భవిష్యత్తు అంచనా పరంగా ఇది అత్యంత అనుకూలమైనది. దివ్య ఫార్మసీని ప్రమోట్ చేస్తున్న పతంజలి మెడిసిన్ రెండవ ఐపీవోగా అడుగుపెట్టనుంది. ఆ తర్వాత ఔట్ పేషెంట్స్ డిపార్ట్మెంట్స్, హాస్పిటల్స్‌ను నిర్వహిస్తున్న పతంజలి వెల్నెస్ ఐపీవోకు రానుంది. పతంజలి వెల్నెస్ కింద 25,000 పడకల సామర్థ్యానికి చేరుకోవాలన్నది లక్ష్యం. ప్రస్తుతం 50 కేంద్రాలున్నాయి. వీటిని రెండింతలు చేస్తాం. ఫ్రాంచైజీ విధానంలోనూ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. దుస్తులు, రవాణా, పశువుల దాణా, ఇతర అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో పతంజలి లైఫ్‌స్టైల్ కార్యకలాపాలు సాగిస్తోంది’ అని చెప్పారు. -
మీ కెరీర్ మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్.. నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే..
రాజానగరం(తూర్పుగోదావరి): చదివిన చదువు విద్యార్థికి ఉపయోగపడాలి. ఉపాధికి మార్గం చూపాలి. విజ్ఞానం పంచాలి. ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటంతో విద్యార్థులు చదువు పూర్తయ్యాక పట్టా చేత పట్టుకుని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అటు ఉద్యోగం పొందలేక ఇటు బయట ప్రపంచంలో మనలేక అవస్థలు పడుతున్నారు. చదవండి: మగవాళ్లకు మాత్రమే.. ఆడవారికి నో ఎంట్రీ.. ఎందుకంటే? కొద్దిరోజులుగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. విద్యార్థికి ఎదురవుతున్న ఇటువంటి క్లిష్ట పరిస్థితిని చక్కదిద్దేందుకు విద్యా సంస్థలు మార్గాన్వేషణ చేస్తున్నాయి. స్కిల్ బోధన చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఇస్తూ ఉపాధి బాట చూపుతున్నాయి. నన్నయ విశ్వ విద్యాలయం ఈ విషయంలో చురుకైన పాత్ర పోషిస్తోంది. ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసి, బయటకొస్తున్నారు. వారిలో చాలామందిలో పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాలు కొరవడుతున్నాయి. ఫలితంగా సరైన ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారు. ఈ కొరతను నివారించి, తరగతి గదిలో నేర్చుకున్న పరిజ్ఞానం ఉపయోగపడేలా విద్యాసంస్థలు ఇప్పుడు బాట వేస్తున్నాయి. పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యంతో కూడా అవగాహన కలిగించేందుకుగాను ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ ఇంటర్న్‌షిప్ ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాదు పరిశోధనలు చేసే విద్యార్థులకు కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు అధ్యాపకులు. ఈ కారణంగానే ప్రతి విద్యార్థి తన కోర్సులో ఏదోఒక పరిశ్రమలో ఇంటర్న్‌షిప్ చేయాలని రాష్ట్ర ఉన్న విద్యామండలి నిబంధన కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో ఇంటర్న్‌షిప్ అనేది ఇంజినీరింగ్ విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు మార్గాన్ని చూపటంతోపాటు ఉపాధి అవకాశాలకు తొలి మెట్టుగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. అందుకే కాలేజీల నుంచి ఇంటర్న్‌షిప్‌నకు మరో పరిశ్రమ లేదా సంస్థకు వెళ్లే విద్యార్థులు దీనిని సదవకాశంగా భావించాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. దీనిని క్యాజువల్‌గా పరిగణిస్తే భవిష్యత్‌కు ఇబ్బందికరమంటున్నారు. ఉపాధి పొందే అవకాశం ♦ తరగతి గదిలో నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానానికి మరింత పదును పెట్టి, వర్కుపై అవగాహన పెంచడం ఇంటర్న్‌షిప్ ప్రధాన ఉద్దేశం. ♦ పరిశ్రమలు, కొన్నిరకాల సంస్థలు ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ అవకాశాన్ని అందిస్తున్నాయి. ♦ తొలినాళ్లలోనే పని నేర్చుకునే వీలు కల్పిస్తున్నాయి. ♦ ప్రాజెక్టులు రూపొందించడం, ఫీల్డ్ గురించి తెలుసుకోవడం, హార్డ్, సాప్ట్ స్కిల్స్‌ని అభివృద్ధి చేయడం వంటి వాటి కోసం ఇంటర్న్‌షిప్‌లో సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయంలో వారు చూపించే ప్రతిభాపాటవాలతో కొన్ని సంస్థలు వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఆఫర్ చేస్తుంటాయి. ♦ వేసవిలో 10 నుండి 12 వారాలపాటు ఇంటర్న్ షిప్ చేయవలసి వస్తే ఇతర కాలాలలో ఆరు మాసాలకు లోబడి సమయాన్ని ఆయా సంస్థలు, పరిశ్రమలు నిర్ణయిస్తాయి. ♦ ఈ సమయంలో గౌరవ వేతనాలను కూడా పొందే అవకాశాలుంటాయి. ♦ అనుభవజ్ఞులతో పరిచయాలు ఏర్పడం, వారి అనుభవాలను షేర్ చేసుకోవడం జరుగుతుంటుంది. ♦ విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు ఇంటర్న్‌షిప్ ఎంతగానో దోహదపడుతుంది. ♦ ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు, ఉన్నత అవకాశాలను పొందేందుకు కూడా తోడ్పడుతుంది. ♦ ఏ ఉద్యోగానికైనా అనుభవం కొలమానికంగా ఉన్న నేపథ్యంలో ఇంటర్న్‌షిప్ అనుభవంగా సహకరిస్తుంది. పీహెచ్డీ చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది కంపెనీలు ఇచ్చే జాబ్ సెలక్షన్స్‌లో ఇంటర్న్‌షిప్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎంటెక్ చేసి, పీహెచ్డీ చేయాలనుకునే వారికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఆదికవి నన్నయ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌ల విద్యార్థులు చదువు పూర్తి చేసి బయటకు వెళ్లారు. ప్రస్తుతం 800 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీ, ఎన్టీఆర్ఐ, సీఐటీడీ వంటి సంస్థలలో ఇంటర్న్‌ఫిప్ చేసే అవకాశాలు వచ్చాయి. – ఆచార్య ఎం.జగన్నాథరావు, వైస్‌చాన్సలర్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ మార్గదర్శకాలను అనుసరించే.. ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలను అనుసరించి ఇంజినీరింగ్ విద్యార్థులంతా ఇంటర్న్‌షిప్ చేయవలసి ఉంటుంది. దీనిని ఆన్‌లైన్‌లోగాని, ఆఫ్‌లైన్‌లోగాని తప్పనిసరిగా చేయవలసిందే. ఇందుకోసం కంపెనీలు ఒక్కోసారి నోటిఫికేషన్స్ ఇస్తుంటాయి, వాటిని విద్యార్థులు చూసి, దరఖాస్తు చేసుకుంటారు. ఇంటర్న్షిప్స్ ఎక్కువగా సమ్మర్ హాలిడేస్‌లో చేస్తుంటారు. – డాక్టర్ వి.పెర్సిస్, ప్రిన్సిపాల్, ‘నన్నయ’ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అనుభవాన్ని అందించింది ఎలక్రిక్టకల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో మూడో సంవత్సరం చదువుతున్న నాకు ప్రాసెస్ కంట్రోల్ రంగంలో ప్రతిష్టాత్మక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( తిరుచిరాపల్లి)లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. నిజంగా ఇది మాకు వర్కుపై కొత్త అనుభవాన్ని అందించింది. తద్వారా లక్ష్యాన్ని సాధించాగలమనే ధీమాను ఇచ్చింది. – కార్తీక్‌కుమార్‌రెడ్డి, వసంతకుమార్, మౌనిక -
AP: రాష్ట్రంలో గ్రానైట్ 'మెరుపులు'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయి. తన పాదయాత్రలో పలు ప్రాంతాల్లో గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకుల కష్టాలను విన్న వైఎస్ జగన్ ఆనాడు ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు. ఆర్థిక మాంద్యం, ప్రోత్సాహం లేకపోవడం వంటి కారణాలతో మూతపడిన గ్రానైట్ పరిశ్రమలు మళ్ళీ పుంజుకొనేలా శ్లాబ్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రాష్ట్ర గనుల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు శ్లాబ్ విధానాన్ని ప్రతిపాదించారు. చిన్న గ్రానైట్ పరిశ్రమలకు మేలు చేసేలా శ్లాబ్‌లను నిర్ణయించాలని కోరారు. దానిపై స్పందించిన వైఎస్ఆర్ 2009లో ఈ విధానాన్ని తీసుకువచ్చారు. ప్రతి కట్టర్‌కు రూ.14 వేల శ్లాబ్‌ను ఖరారు చేశారు. దీనిపై కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో ఈ విధానం అమలు కాలేదు. 2016లో అప్పటి ప్రభుత్వం జీవో 97 ద్వారా శ్లాబ్ విధానాన్ని ఉపసంహరించుకుంది. ఫలితంగా అప్పటికే ఆర్థిక మాంద్యంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న గ్రానైట్ కర్మాగారాలు మరింత ఇబ్బందుల్లో పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 వేల గ్రానైట్ కర్మాగారాల్లో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు మూతపడ్డాయి. వీటిపై ఆధారపడిన వేలాది కార్మికులు, రవాణా, మార్కెటింగ్ రంగాల వారు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ఇదే సమయంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను పలువురు గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు, దాని అనుబంధ రంగాలపై ఆధారపడిన వారు కలిశారు. వారి కష్టాలను వివరించారు. గ్రానైట్ రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రానైట్ పరిశ్రమలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ ఆమోదయోగ్యమైన శ్లాబ్ విధానానికి చర్యలు ప్రారంభించారు. గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులతో గనుల శాఖ అధికారులు పలుసార్లు సమావేశమయ్యారు. స్లాబ్ విధానం, ప్రయోజనాలు, ఆచరణ యోగ్యమైన విధానాలపై చర్చించారు. ఎవరైతే ఈ విధానం పట్ల ఆసక్తి చూపుతారో, వారు స్వచ్ఛందంగా దీని పరిధిలోకి వచ్చేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, కోర్టు తుది తీర్పుకు లోబడి ఈ విధానం అమలవుతుందని జీవోలో పేర్కొన్నారు. సీనరేజికీ శ్లాబు విధానం స్టోన్ కటింగ్, క్వాలిటీ పరిశ్రమల్లో గ్రానైట్ బ్లాకులపై వసూలు చేసే సీనరేజి ఫీజుకు కూడా ప్రభుత్వం శ్లాబ్ విధానాన్ని మళ్లీ అమల్లోకి తెచ్చింది. ప్రకాశం జిల్లాలో సింగిల్ బ్లేడ్‌కి రూ.27 వేలు, మల్టీ బ్లేడ్‌కి రూ.54 వేలు రేటుగా నిర్ణయించింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సింగిల్ బ్లేడ్‌కు రూ.22 వేలు, మల్టీ బ్లేడ్‌కు రూ.44 వేలు రేటుగా నిర్ణయించింది. తిరిగి తెరుచుకోనున్న పరిశ్రమలు ఇప్పటికే మూతపడిన పరిశ్రమలు శ్లాబ్ విధానంతో తిరిగి తెరుచుకుంటాయి. అంతే కాదు.. ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాకుండా రెండో రకంతో ఉన్న చిన్న సైజ్ గ్రానైట్ బ్లాక్‌లను కూడా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటివరకు వృధాగా వదిలేస్తున్న ఈ ఖనిజాన్ని కూడా దేశీయ అవసరాలకు అనుగుణంగా చిన్న సైజుల్లో తయారుచేసి, మార్కెట్ చేసుకోవచ్చు. దీనివల్ల దేశీయ మార్కెట్లో అన్ని వర్గాల వారికి వారి అవసరాలకు అనుగుణమైన గ్రానైట్ పలకలను అందించే వెసులుబాటు కలుగుతుంది. మరోవైపు గ్రానైట్ పరిశ్రమలు ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో గ్రానైట్, కట్టింగ్, పాలిషింగ్, రవాణా, మార్కెటింగ్ రంగాల్లో పెద్ద ఎత్తున స్థానికులకు ఉపాధి లభిస్తుంది. -
Canada Labour Shortage: కెనడాలో 10 లక్షల ఉద్యోగ ఖాళీలు
అట్టావా: కెనడాలో ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతున్నాయని ఆ దేశ లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించింది. 2022 మేతో పోలిస్తే మరో 3 లక్షల ఖాళీలు పెరిగి మొత్తం 10 లక్షలను దాటేశాయి. చాలా పరిశ్రమల్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉన్నట్లు సర్వే తెలిపింది. కెనడాలో ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారిలో చాలా మంది రిటైర్మెంట్ వయస్సుకు దగ్గర పడటంతో విదేశీ కార్మికులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది కెనడాలో అత్యధికంగా 4.3 లక్షల మందికి పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంది. ఈ లక్ష్యం 2024 నాటికి 4.5 లక్షలకు చేరవచ్చని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉండటం వలసదారులకు సానుకూలంగా మారింది. వృత్తి నిపుణులు, సైంటిఫిక్– టెక్నికల్ సేవలు అందించేవారు, రవాణా, వేర్ హౌసింగ్, ఫైనాన్స్, బీమా, వినోదం, రియల్ ఎస్టేట్ రంగాల్లో అత్యధిక ఖాళీలు ఉన్నాయి. వీటితోపాటు నిర్మాణ రంగంలో సుమారు 90 వేల ఉద్యోగావకాశాలున్నాయి. విద్యారంగంలో 9,700 ఖాళీలు ఏర్పడ్డాయి. ఆహార సేవల రంగంలో ఖాళీలు ఫిబ్రవరి నుంచి 10% మేర పెరిగాయి. రానున్న పదేళ్లలో సుమారు 90 లక్షల మంది రిటైర్మెంట్కు దగ్గర కానున్నారు. వాస్తవానికి కెనడాలో చాలా చిన్న వయస్సులోనే రిటైర్మెంట్లు తీసుకుంటారు. ప్రతి 10 రిటైర్మెంట్లలో మూడు ముందుగానే తీసుకునేవే ఉంటాయి. -
పారిశ్రామిక విప్లవంలో మరో ముందడుగు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23న తిరుపతి వేదికగా రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం దిశగా మరో అడుగు ముందుకు వేయనున్నారు. ఒకేసారి రూ.3,644.32 కోట్ల విలువైన ఎనిమిది భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. తిరుపతి సమీపంలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ 1, 2)లో ఏర్పాటు చేసిన 5 ఎలక్ట్రానిక్ కంపెనీల ఉత్పత్తిని ప్రారంభించడంతో పాటు మరో రెండు ఎలక్ట్రానిక్ కంపెనీలు, ఒక పాదరక్షల తయారీ కంపెనీ నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు. ఉత్పత్తి ప్రారంభిస్తున్న ఎలక్ట్రానిక్ కంపెనీల ద్వారా రూ.2,944.32 కోట్ల పెట్టుబడులు రానుండగా, ఇందులో ఇప్పటి వరకు రూ. 1,771.63 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయి. వీటి ద్వారా 10,139 మందికి ఉపాధి లభించనుండగా, ఇప్పటికే 3,093 మందికి ఉపాధి లభించింది. మొత్తంగా ఈ ఎనిమిది కంపెనీల ద్వారా 20,139 మందికి ఉపాధి లభించనుంది. ఉత్పత్తి ప్రారంభించే సంస్థలు టీసీఎల్–పీవోటీపీఎల్: టీసీఎల్‌కు చెందిన ప్యానెల్ ఆప్టోడిస్ప్లే టెక్నాలజీ లిమిటెడ్ రూ.1,230 కోట్లతో డిస్ప్లే ప్యానెల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ ద్వారా 3,174 మందికి ఉపాధి లభించనుంది. ప్రస్తుతం ఈ యూనిట్ పెట్టుబడి ప్రతిపాదనల్లో రూ.1,040 కోట్లు వాస్తవ రూపం దాల్చడం ద్వారా 1,089 మందికి ఉపాధి కల్పించింది. ఈ మధ్య ట్రైల్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని వాణిజ్య పరంగా ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధమైంది. డిక్సన్ టెక్నాలజీస్ : రూ.145 కోట్లతో వాషింగ్ మెషీన్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్ ద్వారా 1,131 మందికి ఉపాధి లభించనుంది. పెట్టుబడి ప్రతిపాదనలో ఇప్పటి వరకు రూ.100.80 కోట్లు వాస్తవ రూపంలోకి రావడం ద్వారా 254 మందికి ఉపాధి కల్పించింది. ఫాక్స్ లింక్స్ ఇండియా : రూ.1,050 కోట్లతో మొబైల్ ఫోన్లకు సంబంధించిన విడిభాగాలు, పీసీబీలను తయారు చేసే యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటి వరకు రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా 800 మందికి ఉపాధి కల్పించింది. సన్నీ ఒప్పొటెక్ విస్తరణ: రూ.280 కోట్లతో కెమెరా విడి భాగాల తయారీ యూనిట్ విస్తరణ చేపట్టింది. ఇందులో ఇప్పటి వరకు రూ.100 కోట్లు వ్యయం చేయడం ద్వారా 1,200 మంది ఉపాధికి గాను 50 మందికి కల్పించింది. యూటీఎన్పీఎల్–కార్బన్ : రూ.130 కోట్లతో మొబైల్ ఫోన్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఇప్పటికే రూ.80 కోట్ల విలువైన పెట్టబడులు వాస్తవరూపం దాల్చాయి. 1,800 మందికి ఉపాధి కల్పించాల్సి ఉండగా ఇప్పటి వరకు 900 మందికి ఉపాధి లభించింది. భూమి పూజకు సిద్ధమైన కంపెనీలు డిక్సన్ టెక్నాలజీస్ : రూ.108.92 కోట్లతో టెలివిజన్ సెట్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. సెవెన్ హిల్స్ డిజిటల్ పార్క్ : ఫాక్స్ లింక్ తన వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా దీన్ని అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించిన పెట్టుబడి వివరాలు తెలియాల్సి ఉంది. హిల్‌టాప్ సెజ్ ఫుట్‌వేర్ ఇండియా లిమిటెడ్ (అపాచీ) : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో 298 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.700 కోట్ల పెట్టుబడితో పాదరక్షల తయారీ యూనిట్ నిర్మాణ పనులకు సీఎం భూమి పూజ చేయనున్నారు. ఈ యూనిట్ ద్వారా 10,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ మూడు కంపెనీలకు సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. ఇకపై ప్రతి నెలా ప్రారంభోత్సవాలు కోవిడ్‌తో గత రెండేళ్లుగా స్థబ్దుగా ఉన్న పారిశ్రామిక రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ నెల 23న తిరుపతిలో ఎలక్ట్రానిక్, ఫుట్‌వేర్ యూనిట్ల ప్రారంభోత్సవం ద్వారా రాష్ట్రంలో భారీ పారిశ్రామికీకరణ విప్లవంలో మరో ముందడుగు వేయనున్నాం. ఇక నుంచి ప్రతి నెలా పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు పెట్టుబడులను ఆకర్షించే విధంగా పలు రోడ్ షోలు నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాం. – గుడివాడ అమరనాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి. -
ఏపీ.. ఎంతో హ్యాపీ 'సొంతూళ్లలో సాఫ్ట్వేర్ కంపెనీలు'
సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటే అమెరికానో, ఆస్ట్రేలియానో వెళ్లాలి.. అక్కడి సంస్థల్లో ఉద్యోగాలు పొందితే రూ.లక్షల్లో జీతాలు సంపాదించొచ్చు.. అలా కాకుండా మన దేశంలోనే ఉద్యోగం చేయాలంటే ఏ బెంగళూరో, చెన్నై, హైదరాబాద్‌లోనో అయితే చెప్పుకోదగ్గ జీతాలు వస్తాయి.. లేదంటే విశాఖపట్నం లేదా విజయవాడల్లోని కంపెనీల్లో ఉద్యోగం చూసుకోవాలి. కానీ పట్టణాలు, నగరాలే ఎందుకు? సొంతూరిలోనే సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే పోలా.. పుట్టిన ఊళ్లో ఉండొచ్చు. మరికొంత మందికి ఉపాధి కల్పించ వచ్చు. ఈ ఆలోచనతో కొందరు కుర్రాళ్లు ముందడుగేశారు. ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఆ విజయగాథలు మీరే చూడండి. – సాక్షి నెట్వర్క్ సంకల్పం సిద్ధించింది ఏలూరుకు చెందిన రియాజ్ ఆలీఖాన్ హైదరాబాద్ జేఎన్టీయూలో ఎంసీఏ పూర్తి చేశాక అక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం పొందారు. అక్కడ ఉద్యోగం చేస్తున్నా ఏదో తెలియని అసంతృప్తి వెన్నాడుతూ ఉండేది. తన ప్రాంతానికి ఏమైనా చేయాలనే ఆలోచన మదిని తొలిచేది. దీంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఏలూరు చేరుకున్నారు. ముందుగా తాను ఒక్కడే కొంత మంది క్లయింట్లకు సాఫ్ట్వేర్ సేవలు అందిస్తూ వారిని ఆకట్టుకున్నారు. ఆయన పనితీరు నచ్చి అక్కడి నుంచి ఇతర క్లయింట్లు ఆయనకు అవకాశాలు ఇవ్వడం ప్రారంభించారు. దీంతో 2012లో 20 మంది ఉద్యోగులతో ‘స్పార్క్ ఐటీ సాఫ్ట్వెబ్ సొల్యూషన్స్’ను ప్రారంభించారు. తొలుత అనుభవ రాహిత్యం వల్ల కొంత నష్టాలను చవి చూసిందా సంస్థ. పట్టుదలతో ముందుకు సాగుతూ 2016లో ‘బిజ్‌రాక్ వెబ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి తన ఐటీ సేవలను కొనసాగించారు. గత అనుభవ పాఠాలతో తప్పటడుగులూ వేయకుండా సంస్థ నేడు 50 మందికి ఉపాధి కల్పిస్తోంది. విదేశీ క్లయింట్లకు ఐటీ సేవలు ప్రస్తుతం బిజ్‌రాక్ వెబ్ సొల్యూషన్స్ సంస్థ అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్ దేశాలకు చెందిన క్లయింట్లకు తన సేవలను అందిస్తోంది. ఈ సంస్థ అందించే సేవల్లో వెబ్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రధానమైనవి. సంస్థలో పని చేసే ఉద్యోగులకు వారి అర్హత, నైపుణ్యం బట్టి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకూ జీతాలు చెల్లిస్తున్నారు. ఉన్న ఊరిలో అర్హతకు తగ్గ ఉద్యోగం లభించడం, ప్రతిఫలం దక్కుతుండడంతో సంస్థను వీడి వెళ్లే ఆలోచనే రావడం లేదని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. పేదవారిలో కష్టపడే తత్వం పేదవారిలో కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది. అది పేద కుటుంబాల నుంచి వచ్చే మహిళలకు మరికాస్త ఎక్కువగా ఉంటుంది. వారి సాధికారికత కోసం మా సంస్థలో 90 శాతం ఉద్యోగాలు అటువంటి వారికే ఇస్తున్నాం. స్థానికులకే ప్రాధాన్యత. – రియాజ్ ఆలీ ఖాన్, సీఈఓ, బిజ్ రాక్ వెబ్ సొల్యూషన్స్ ఆఫీసే ఒక కుటుంబంలా.. మా నాన్న సుధాకర్ క్యాటరింగ్ చేస్తారు. నేను బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేశాను. నేను పదవ తరగతి చదువుతున్నప్పుడే ఈ సంస్థ గురించి విన్నాను. ఇటువంటి సంస్థలో పని చేయడం నా కల. ఈ ఆఫీసులో అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి పని చేస్తారు. – తాళ్లూరి సుమాంజలి, ఉద్యోగి, బిజ్ రాక్ వెబ్ సొల్యూషన్స్ స్థానికంగానే సాఫ్ట్వేర్ ఉద్యోగం మా నాన్న పౌల్ట్రీ ఫాంలో పని చేస్తారు. బీటెక్ పూర్తయ్యాక ఈ సంస్థలో ఉద్యోగం వచ్చింది. 2016 నుంచి ఇక్కడే పని చేస్తున్నాను. నా భర్త ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సూపర్వైజర్గా పని చేస్తున్నారు. ఏలూరులోనే ఉద్యోగం చేయటానికి దీన్ని అవకాశంగా భావిస్తున్నా. – ఎన్.తేజస్వి, బిజ్ రాక్ వెబ్ ఉద్యోగి ఉద్యోగుల వద్దకే కంపెనీ కాకినాడ ప్రాంతానికి చెందిన కిరణ్‌కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవంతో 2015లో హైదరాబాద్ హైటెక్ సిటీలో క్లౌడ్ సీడ్ టెక్నాలజీస్ సంస్థను ప్రారంభించారు. కోవిడ్ కారణంగా 2019లో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం కల్పించాల్సి వచ్చింది. ఆ క్రమంలో కంపెనీనే ఉద్యోగుల చెంతకు తీసుకెళితే.. అన్న ఆలోచన వచ్చింది. దాన్ని ఆచరణలో పెడుతూ కాకినాడ కార్పొరేషన్‌లోని సిద్ధార్ధనగర్కు ఆ సంస్థ 2019 నవంబర్‌లో తరలి వచ్చింది. ఒక ఉద్యోగితో ప్రారంభమైన సంస్థలో నేడు 50 మంది యువతీ యువకులు పని చేస్తున్నారు. స్థానికులకే ఉద్యోగాలు మా సంస్థలో కాకినాడ, పరిసర ప్రాంత గ్రామాలకు చెందిన వారు ఎక్కువగా పని చేస్తున్నారు. ఇద్దరు మాత్రం స్థానికేతరులు ఉన్నారు. బీటెక్, బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వారితో పాటు ఇతర డిగ్రీలు చదివిన వారు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారికి జాబ్ ఇస్తున్నాం. విధుల్లోకి ఫ్రెషర్స్‌గా చేరుతున్నందున అనుభవం వచ్చేలా తర్ఫీదు ఇస్తున్నాం. వేతనం రూ.15 వేల నుంచి అనుభవాన్ని బట్టి రూ.1.70 లక్షల వరకు ఉంది. ఎక్కువగా బ్యాంకింగ్ రంగానికి సేవలు అందిస్తున్నాం. 400 మందికి జాబ్ అవకాశం ఉంది. – వి.వి.వి.కిరణ్‌కుమార్, క్లౌడ్ సీడ్ టెక్నాలజీస్ సంస్థ సీటీవో, కాకినాడ ఏడాదిలో రూ.7 వేలు ఇంక్రిమెంటు మాది కాకినాడలోని జగన్నాధపురం. నేను ఎంసీఏ చేశాను. 2021లో కాకినాడలో ఐటీ కంపెనీలో పని చేసేందుకు ఎంపికయ్యాను. ఈ సంస్థలో రూ.15 వేల జీతానికి చేరి, ఏడాదిలో రూ.22 వేల వేతనానికి చేరుకున్నాను. స్థానికంగానే ఐటీ కొలువు రావడంతో మా కుటుంబం సంతోషంగా ఉంది. – కుంచె సాయి సంతోషి, ఐటీ ఉద్యోగి, క్లౌడ్ సీడ్ టెక్నాలజీస్ ఇక్కడా ‘స్మార్ట్’గా ఎదగడమే లక్ష్యం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్మార్ట్ డీవీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్.. చిత్తూరు జిల్లాలో ఐటీ కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఏప్రిల్ 14న ఎస్ఆర్ పురం మండలం కొట్టార్లపల్లె సమీపంలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఏడాదిలో నిర్మాణం పూర్తి చేసి 3000 మందికి ఉద్యోగాలు కల్పించాలన్నది లక్ష్యం. గ్రూప్ ఛైర్మన్ దీపక్ కుమార్ తల్లిదండ్రులు ఈ ప్రాంతానికి చెందిన వారే. తండ్రి డీఎస్పీగా రిటైర్ అయ్యారు. తిరుచ్చి ఎన్ఐటీలో గోల్డ్ మెడలిస్ట్ అయిన దీపక్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కొంతకాలం పనిచేసి, 2007లో బెంగళూరులో డివీ గ్రూప్ ఐటీ కంపెనీని ప్రారంభించారు. 2010లో ప్రైవేట్ లిమిటెడ్‌గా, 2015లో మల్టీ నేషనల్ కంపెనీగా ఎదిగింది. ఇప్పుడు ప్రపంచంలోని 40కి పైగా దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో తయారయ్యే సెమీ కండక్టర్లను ప్రముఖ కంపెనీల ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడతారు. యాపిల్ ఫోన్లు, తోషిబా, శామ్సంగ్ కంపెనీల టీవీలు, సీసీ కెమెరాల్లో ఉపయోగిస్తారు. కొన్ని దేశాల రక్షణ రంగ సంస్థలకు హార్డ్‌వేర్ సరఫరా చేస్తున్నారు. ఇదీ లక్ష్యం.. ఏడాది లోపు నిర్మాణాలు పూర్తి చేస్తాం. తొమ్మిది అంతస్తుల్లో 1.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ కంపెనీని ఏర్పాటు చేస్తాం. 3 వేల మందికి ఉపాధి కల్పించాలనేదే మా లక్ష్యం. దశల వారీగా ఉపాధి కల్పిస్తూ మూడేళ్లలో వంద శాతం లక్ష్యానికి చేరుకుంటాం. బీటెక్, ఎంసీఏ చేసిన వాళ్లకే కాకుండా డిగ్రీ చదువుకున్న వాళ్లకు కూడా ఉచితంగా శిక్షణ ఇస్తాం. 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తాం... – దీపక్‌కుమార్ తల, ఛైర్మన్, స్మార్ట్ డీవీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దూసుకెళ్లడానికి ‘టెక్ బుల్’ సిద్ధం 30 ఏళ్లపాటు దేశ విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించిన ఇద్దరు సోదరులు సొంత జిల్లాపై మమకారంతో కంపెనీకి శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవది గ్రామానికి చెందిన నలమలపు బలరామిరెడ్డి, సుశీల దంపతుల కుమారులు అంజిరెడ్డి, విజయ భాస్కరరెడ్డి 1992లో ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగం కోసం దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ ఐటీ కంపెనీ నెలకొల్పి స్థిరపడ్డారు. ఐటీతో పాటు ఫార్మా, ప్రాపర్టీస్ (రియల్ ఎస్టేట్), ఎనర్జీ రంగాల్లో వందల కోట్ల టర్నోవర్‌తో వ్యాపార పరంగా, పారిశ్రామికంగా ముందుకు సాగుతున్నారు. 15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోనూ ఐటీ కంపెనీని స్థాపించి ఉపాధి అవకాశాలను కల్పించారు. ఇప్పటికి 7 దేశాల్లో తన వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలను విస్తరించుకుంటూ వస్తున్నారు. 1,200 మంది ఐటీ నిపుణులతో ఇతర దేశాలకు చెందిన పెద్ద పెద్ద ప్రాజెక్టులను తమ వశం చేసుకున్నారు. తమ ప్రాంతంపై మమకారంతో గుళ్లాపల్లి గ్రోత్ సెంటర్‌ను ఎంచుకున్నారు. రూ.90 కోట్లతో ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నదే తడవుగా కార్యరూపంలో పెట్టారు. మొదటి ఏడాది వెయ్యి మందికి, ఆ తర్వాత మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో 3,000 పైచిలుకు ఉద్యోగాల మార్కు దాటాలని లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు. ఒంగోలు జాతి గిత్తల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయటానికి ఐటీ కంపెనీకి ‘టెక్ బుల్’ అని నామకరణం చేశారు. 100 కంపెనీల స్థాపనే లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించటంతో పాటు యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటమే ధ్యేయంగా టెక్ బుల్ కంపెనీని స్థాపించారు. నిరుద్యోగులకు సాంకేతిక, వ్యాపార, ఆర్థిక లావాదేవీలపై శిక్షణ ఇవ్వటంతో పాటు ఆర్థిక వనరులు అందించేందుకు సీడ్ క్యాపిటల్ కింద రూ.100 కోట్ల ఫండ్ కేటాయించారు. వారితో కంపెనీలు ఏర్పాటు చేయించి ఈక్విటీల రూపంలో ఒప్పందం కుదుర్చుకొని ప్రోత్సహించనున్నారు. తద్వారా 100 కంపెనీలను రూపొందించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఒక్కో కంపెనీ 50 మంది చొప్పున కనీసం 5 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందించారు. సంస్థ త్వరలో ప్రారంభం కానుంది. రైతు కుటుంబాలపై ప్రేమతో... మా తల్లిదండ్రులు రైతులు. మమ్మల్ని కష్టపడి చదివించారు. వ్యవసాయంలో ఉన్న కష్టాలు మరే రంగంలో ఉండవు. అలాంటి రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారికి నైపుణ్యం జోడించి మంచి భవిష్యత్తును ఇవ్వటమే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందించాం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఆర్థికంగా ప్రోత్సాహాన్ని ఇవ్వటమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నాం. – నలమలపు విజయ భాస్కరరెడ్డి, టెక్ బుల్ ఐటీ కంపెనీ స్థాపకులు -
సంఘటిత రంగంలో పెరుగుతున్న ఉపాధి
న్యూఢిల్లీ: సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు దేశంలో బలపడుతున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. 2021 డిసెంబర్ త్రైమాసికంలో తొమ్మిది పరిశ్రమలలో దాదాపు 3.14 కోట్ల మంది కార్మికులు ఉపాధి పొందారని, ఇది సంఘటిత రంగంలో ఉపాధిలో పెరుగుతున్న ధోరణిని సూచిస్తోందని ఆయన ఒక ట్వీట్ చేశారు. 2021 సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ సంఖ్య 3.10 కోట్లని తెలిపారు. ఈ మేరకు కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ త్రైమాసిక (అక్టోబర్–డిసెంబర్) సర్వే నివేదికలోని గణాంకాలను ఆయన ఉటంకించారు. గురువారం విడుదలైన నివేదికకు సంబంధించి ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► తొమ్మిది రంగాలు– తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, విద్య, ఆరోగ్యం, వసతి/రెస్టారెంట్లు, ఐటీ/బీపీఓ, ఆర్థిక సేవల విభాగాల్లో 10 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్న సంస్థలకు సంబంధించి ఉపాధి డేటా ప్రాతిపదికన ఈ గణాంకాలు వెలువడ్డాయి. మొత్తం ఉపాధి రంగంలో ఈ తొమ్మిది రంగాల వాటా దాదాపు 85 శాతం. ► నివేదిక ప్రకారం అంచనా వేసిన మొత్తం కార్మికుల సంఖ్యలో దాదాపు 39 శాతం వాటాతో తయారీ రంగం మొదటి స్థానంలో నిలిచింది. తరువాత విద్యా రంగం 22 శాతంతో ఉంది. సమీక్షా కాలంలో తయారీ రంగంలో అత్యధికంగా 124 లక్షల మంది కార్మికులు ఉన్నారు. విద్యా రంగం 69.26 లక్షల మందిని కలిగిఉంది. ► వాటి తర్వాత ఐటీ/బీపీఓలు (34.57 లక్షలు), ఆరోగ్యం (32.86 లక్షలు), వాణిజ్యం (16.81 లక్షలు), రవాణా (13.20 లక్షలు), ఆర్థిక సేవలు (8.85 లక్షలు), వసతి/రెస్టారెంట్లు (8.11 లక్షలు), నిర్మాణ (6.19 లక్షలు) రంగాలు ఉన్నాయి. ► దాదాపు అన్ని (99.4 శాతం) విభాగాలు వేర్వేరు చట్టాల క్రింద నమోదయ్యాయి. ► మొత్తంమీద, దాదాపు 23.55 శాతం యూనిట్లు తమ కార్మికులకు ఉద్యోగ శిక్షణను అందించాయి. తొమ్మిది రంగాల్లో ఆరోగ్య విభాగంలోని 34.87 శాతం యూనిట్లు ఉద్యోగ శిక్షణను అందించగా, ఐటీ/బీపీఓల వాటా ఈ విషయంలో 31.1 శాతంగా ఉంది. ► కార్మిక మంత్రిత్వశాఖ నియంత్రణలో లేబర్ బ్యూరోతో ఈ సర్వే జరిగింది. వ్యవసాయేతర సంస్థల్లోని మొత్తం ఉపాధిలో ఎక్కువ భాగం ఈ తొమ్మిది ఎంపిక చేసిన రంగాలదే కావడం గమనార్హం. వ్యవస్థీకృత, అసంఘటిత విభాగాలలో ఉద్యోగాలు, నియామకాలకు సంబంధించి ఈ సర్వే నిర్వహణ జరుగుతుంది. -
విజయ కీర్తి
విజయసోపానాలు అధిరోహించడానికి ఏం చేయాలా?! అని సుదీర్ఘ ఆలోచనలు చేయనక్కర్లేదు అనిపిస్తుంది కీర్తి ప్రియను కలిశాక. తెలంగాణలోని సూర్యాపేట వాసి అయిన కీర్తిప్రియ కోల్‌కతాలోని ఐఐఎమ్ నుంచి ఎంబీయే పూర్తి చేసింది. తల్లి తన కోసం పంపే ఎండు కూరగాయల ముక్కలు రోజువారి వంటను ఎంత సులువు చేస్తాయో చూసింది. తన కళ్లముందు వ్యవసాయ పంట వృథా అవడం చూసి తట్టుకోలేకపోయింది. ఫలితంగా తల్లి తన కోసం చేసిన పని నుంచి తీసుకున్న ఆలోచనతో ఓ ఆహార పరిశ్రమనే నెలకొల్పింది. స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలనూ కల్పిస్తోంది. తన వ్యాపారంలో తల్లి విజయలక్ష్మిని కూడా భాగస్వామిని చేసిన కీర్తి విజయం గురించి ఆమె మాటల్లోనే.. ‘‘ఈ రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్‌కు ముందు చదువు, ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉన్నప్పుడు మా అమ్మ నాకు వంట ఈజీగా అవడం కోసం ఎండబెట్టిన కూరగాయల ముక్కలను ప్యాక్ చేసి, నాకు పంపేది. వాటిలో టొమాటోలు, బెండ, క్యాబేజీ, గోంగూర, బచ్చలికూర, మామిడికాయ... ఇలా రకరకాల ఎండు కూరగాయల ముక్కలు ఉండేవి. వీటితో వంట చేసుకోవడం నాకు చాలా ఈజీ అయ్యేది. ఈ సాధారణ ఆలోచన నాకు తెలియకుండానే నా మనసులో అలాగే ఉండిపోయింది. వృథాను అరికట్టవచ్చు సూర్యాపేటలోని తొండా గ్రామం మాది. ఒకసారి రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక, ఆ పంటను పొలంలోనే వదిలేశారు. ఇది చూసి చాలా బాధేసింది. చదువు తర్వాత సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాలన్న ఆలోచనకు నా బాధ నుంచే ఓ పరిష్కారం కనుక్కోవచ్చు అనిపించింది. అమ్మ తయారు చేసే ఎండు కూరగాయల కాన్సెప్ట్నే నా బిజినెస్‌కు సరైన ఆలోచన అనుకున్నాను. ఆ విధంగా వ్యవసాయదారుల పంట వృథా కాకుండా కాపాడవచ్చు అనిపించింది. ఈ ఆలోచనను ఇంట్లోవాళ్లతో పంచుకున్నాను. అంతే, రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్ సిద్ధమైపోయింది. కుటుంబ మద్దతు మా నాన్న పోలీస్ విభాగంలో వర్క్ చేస్తారు. అమ్మ గృహిణి. ముగ్గురు అమ్మాయిల్లో నేను రెండవదాన్ని. నా ఆలోచనకు ఇంట్లో అందరూ పూర్తి మద్దతు ఇచ్చారు. దీనికి ముందు చేసిన స్టార్టప్స్, టీమ్ వర్క్ .. గురించి అమ్మానాన్నలకు తెలుసు కాబట్టి ప్రోత్సహిస్తూనే ఉంటారు. కాకపోతే అమ్మాయిని కాబట్టి ఊళ్లో కొంచెం వింతగా చూస్తుంటారు. వృద్ధిలోకి తీసుకు వస్తూ.. సాధారణంగా తెలంగాణలో ఎక్కువగా పత్తి పంట వేస్తుంటారు. మా చుట్టుపక్కల రైతులతో మాట్లాడి, క్రాప్ పంటలపై దృష్టి పెట్టేలా చేశాను. రసాయనాలు వాడకుండా కూరగాయల సాగు గురించి చర్చించాను. అలా సేకరించిన కూరగాయలను మెషిన్స్ ద్వారా శుభ్రం చేసి, డీ హైడ్రేట్ చేస్తాం. వీటిలో ఆకుకూరలు, కాకర, బెండ, క్యాబేజీ.. వంటివి ఉన్నాయి. వీటితోపాటు పండ్లను కూడా ఎండబెడతాం. రకరకాల పొడులు తయారు చేస్తాం. మూడేళ్ల క్రితం ఈ తరహా బిజినెస్ ప్లానింగ్ మొదలైంది. మొదట్లో నాలుగు లక్షల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభించిన ఈ పరిశ్రమ ఇప్పుడు రెండున్నర కోట్లకు చేరింది. వ్యాపారానికి అనువుగా మెల్లమెల్లగా మెషినరీని పెంచుకుంటూ, వెళుతున్నాం. మార్కెట్‌ను బట్టి యూనిట్ విస్తరణ కూడా ఉంటోంది. రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్‌తో ఈ ఐడియాను అభివృద్ధి చేస్తున్నాం. వీటితో పాటు సూప్ మిక్స్‌లు, జ్యూస్ మిక్స్‌లు, కూరల్లో వేసే పొడులు మా తయారీలో ఉన్నాయి. ఏ పని చేయాలన్నా ముందు దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. దీంతోపాటు తమ మీద తమకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మనకు ఓ ఆలోచన వచ్చినప్పుడు, దానిని అమలులో పెట్టేటప్పుడు చాలామంది కిందకు లాగాలని చూస్తుంటారు. కానీ, మనకు దూరదృష్టి ఉండి, క్లారిటీగా పనులు చేసుకుంటూ వెళితే తిరుగుండదు. మన ఆలోచనని అమలులో పెట్టేటప్పుడు కూడా మార్కెట్‌కు తగినట్టు మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి’’ అని వివరిస్తుంది కీర్తిప్రియ. – నిర్మలారెడ్డి -
Work From Home: అమ్మాయిలూ.. అవకాశాలివిగో!
మహమ్మారి పుణ్యమాని మహిళలను కొత్త అవకాశాలు ఊరిస్తున్నాయి. పెట్టుబడి లేకుండా ఇంటి పట్టున ఉంటూనే సంపాదించే మార్గాలూ పుట్టుకొచ్చాయి. విదేశీ గడ్డపైనే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు.. అదే విదేశీ సంస్థకు ఇంటి నుంచే పని చేసే పరిస్థితులొచ్చాయి. కావాల్సిందల్లా నైపుణ్యం పెంచుకుని, అవకాశాన్ని అందిపుచ్చువడమే. మార్కెట్‌కు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకున్న మహిళల కోసం కంపెనీలు క్యూ కడు తున్నాయి. అడిగినంత వేతనం.. ఇచ్చేందుకూ దిగ్గజ సంస్థలు వెనుకాడడం లేదు. వ్యాపార, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై నిపుణుల అభిప్రాయాలతో సాక్షి బిజినెస్ బ్యూరో ప్రత్యేక కథనం.. వ్యాపారం ఆకర్షణీయం.. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేసే రోజులు పోయాయి. మహిళలకు వ్యాపారం అనుకూల, ఆకర్షణీయ కెరీర్‌గా మారిపోయింది. వ్యాపారంలో వైఫల్యాలనూ అంగీకరిస్తున్నారు. టెక్నాలజీ సాయంతో చిన్నగా ప్రారంభించి అంతర్జాతీయ స్థాయికి ఎదగొచ్చు అని నిరూపిస్తున్నారు. డబ్బులు సంపాదించడమేగాక వందలాది మందికి ఉపాధి అవకాశాలనూ సృష్టిస్తున్నారు. బిజినెస్‌లోకి రావాలంటే డబ్బు ఒక్కటే ప్రధానం కాదు. అంకిత భావం, సరైన మార్గదర్శి ఉండాలి. వ్యాపారం పేరుతో గతంలో ఇబ్బడిముబ్బడిగా రుణాలు తీసుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా అవసరం మేరకే లోన్ తీసుకుంటున్నారు. దీంతో బ్యాంకులూ రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నాయి. –దీప్తి రావుల, సీఈవో, వీ–హబ్ ప్రత్యేక నైపుణ్యంతో.. కోవిడ్ రాకతో ఆటోమేషన్, డిజిటల్ పరివర్తన దిశగా కంపెనీలు సాగుతున్నాయి. ఇదే మహిళలకు కొత్త అవకాశాలను అందిస్తోంది. విదేశాలకు వెళ్లకుండానే ఎంఎన్సీల్లో జాబ్ సంపాదించి ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేక నైపుణ్యం ఉన్న మహిళల కోసం కంపెనీలు ప్రపంచం నలుమూలలా వెతుకుతున్నాయి. ఐటీతోపాటు ఫార్మా, బయాలాజిక్స్లోనూ ఇదే పరిస్థితి. అన్ని రంగాల్లోనూ కంపెనీలు సామర్థ్యం పెంచుకునే దిశగా అడుగులేస్తున్నాయి. ఒక రోల్లో కొరత ఉందంటే చాలు అభ్యర్థులకు కాసులు కురిపిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో రూ.5 లక్షల వేతనం ఉంటే.. కొత్త సంస్థ రూ.50 లక్షలు చెల్లించేందుకూ వెనుకాడడం లేదు. అమ్మాయిలకు స్థిరత్వం, నిబద్ధత ఉంటుందన్న భావన కంపెనీల్లో పెరిగింది. వీరికి అత్యంత కీలక విభాగాలనూ అప్పగిస్తున్నారు. – జయశ్రీ పవని, హెడ్, స్ట్రాటజిక్ రిక్రూట్మెంట్, స్ట్రయిక్ ఇట్–రైట్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ పెట్టుబడి లేకుండానే.. టెక్నాలజీని ఊతంగా చేసుకుని ఉపాధికి కొత్త మార్గాలను వెతుక్కుని మహిళలు సక్సెస్ అవుతున్నారు. పెట్టుబడి లేకుండానే ఇంటి నుంచే సంపాదిస్తున్నారు. వ్యాపారం చేయాలన్న తపన పల్లెల్లోని మహిళలకూ విస్తరించింది. సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటే అంతలా ఆదాయం గడిస్తున్నారు. రాష్ట్రాలే కాదు విదేశీ గడ్డపైనా వ్యాపారాలను విస్తరిస్తున్నారు. ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకుని డిజిటల్ మార్కెటింగ్, ఈవెంట్స్, యూట్యూబ్ బ్లాగ్స్, ట్యూషన్స్, డ్యాన్స్, మ్యూజిక్, న్యాయ సలహాలు, క్రాఫ్టŠస్, స్ట్రెస్ మేనేజ్మెంట్, మోటివేషనల్ క్లాసెస్ వంటివి ఉపాధిగా ఎంచుకుంటున్నారు. బ్యూటీ, ఫ్యాషన్ స్టైలిస్ట్‌గా, ఫిట్నెస్ శిక్షకులుగా కెరీర్ మలుచుకుంటున్నారు. ఇంటి వంటకాలను స్విగ్గీ, జొమాటో ద్వారా విక్రయిస్తున్నారు. ఉద్యోగం చేస్తూనే అదనపు సంపాదనపై దృష్టిపెడుతున్నారు. – లత చౌదరి బొట్ల, ఫౌండర్, నారీసేన. ఉద్యోగం మానేసినా.. అప్లికేషన్, ప్రాజెక్ట్ రూపకల్పన, అమలుకు ఐటీ కంపెనీలు విభిన్న సాంకేతికలను (టెక్ స్టాక్) ఉపయోగిస్తాయి. అభ్యర్థిలో టెక్నికల్ స్కిల్స్ ఏ మేరకు ఉన్నాయన్నదే ప్రధానం. కమ్యూనికేషన్ స్కిల్స్ అదనపు అర్హత మాత్రమే. కొత్త కోర్సులను నేర్చుకుని నూతన వర్షన్స్‌కు తగ్గట్టుగా అభ్యర్థులు అప్‌గ్రేడ్ అవ్వాలి. ఇలాంటి ఉద్యోగులకు ఒక్కొక్కరి చేతుల్లో మూడుకుపైగా ఆఫర్ లెటర్లు ఉంటున్నాయి. ఎక్కడ అధిక వేతనం ఆఫర్ చేస్తే అక్కడే చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు తమ ఉద్యోగులు చేజారకుండా ప్రమోషన్‌తో వేతనం పెంచుతున్నాయి. మధ్యలో ఉద్యోగం మానేసినా నైపుణ్యం ఉన్న అభ్యర్థులను మళ్లీ చేర్చుకుంటున్నాయి. – రేచల్ స్టెల్లా రాజ్, టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ -
రాష్ట్రానికి మరో ఎక్స్‌ప్రెస్ హైవే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే రానుంది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా చెన్నై–సూరత్ కారిడార్‌కు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) ఇటీవల ఆమోదం తెలిపింది. దేశంలో తూర్పు, పశ్చిమ పోర్టులను అనుసంధానించే ఈ 1,461 కి.మీ. కారిడార్‌లో 320 కి.మీ. ఏపీలో నిర్మించనున్నారు. మొత్తం రూ. 50 వేల కోట్ల అంచనాతో ఆమోదించిన ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి రాచబాట పడనుంది. మరోవైపు చెన్నై–విశాఖపట్నం, ముంబై–ఢిల్లీ కారిడార్లతో కూడా దీనిని అనుసంధానించాలని ప్రణాళిక రూపొందించడం రాష్ట్రానికి మరింత ఉపయుక్తంగా మారనుంది. తూర్పు, పశ్చిమాలను అనుసంధానిస్తూ.. దేశంలో తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య సరుకు రవాణాలో వ్యయ, ప్రయాసలను తగ్గించేందుకు చెన్నై–సూరత్ కారిడార్‌ను నిర్మించనున్నారు. ప్రస్తుతం చెన్నై నుంచి సూరత్‌కు నెల్లూరు, హైదరాబాద్, షోలాపూర్, పుణెల మీదుగా వెళ్లాల్సి ఉంది. అలాగే రాయలసీమ నుంచి చిత్రదుర్గ, దావణగెరె, బెల్గాం, కొల్హాపూర్, పుణెల మీదుగా ప్రయాణించాల్సి ఉంది. ఈ రెండు మార్గాలు ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినవి. కొత్త ప్రాజెక్టుతో చెన్నై నుంచి మన రాష్ట్రంలోని తిరుపతి, కడప, కర్నూలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్, కర్ణాటకలో కోస్గి, రాయచూర్, మహారాష్ట్రలోని షోలాపూర్, నాసిక్ మీదుగా గుజరాత్‌లోని సూరత్ వరకు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కానుంది. దాంతో దక్షిణాది నుంచి సూరత్‌కు 350 కి.మీ. దూరం తగ్గడంతోపాటు 6 గంటల ప్రయాణ సమయం కలసి వస్తుంది. ఈ 1,461 కి.మీ. కారిడార్‌లో తమిళనాడులో 156 కి.మీ., ఏపీలో 320 కి.మీ., తెలంగాణలో 65 కి.మీ., కర్ణాటకలో 176 కి.మీ, మహారాష్ట్రలో 483 కి.మీ., మిగిలినది గుజరాత్లో నిర్మించనున్నారు. అందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించడం కోసం ఎన్హెచ్ఏఐ టెండర్లు పిలిచింది. డీపీఆర్ ఖరారయ్యాక ప్రాజెక్టును చేపట్టి రెండేళ్లలో పూర్తి చేయాలన్నది ఎన్హెచ్ఏఐ లక్ష్యం. రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి ఊతం.. చెన్నై–సూరత్ కారిడార్ మన రాష్ట్రంలోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధికి ఎంతగానో దోహదపడనుంది. తిరుపతి, శ్రీకాళహస్తి, నెల్లూరు, కడప, కర్నూలు, దొనకొండ ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఆ ప్రాంతాల్లో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తోంది. చెన్నై–సూరత్ కారిడార్ నిర్మాణం పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతమివ్వనుంది. పశ్చిమాసియా దేశాల నుంచి భారత్‌కు సూరత్ పోర్ట్ ముఖద్వారంగా ఉంది. కాబట్టి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పారిశ్రామిక ఉత్పత్తులను పశ్చిమాసియా దేశాలకు ఎగుమతి చేసేందుకు ఈ కారిడార్ ద్వారా నేరుగా సూరత్ పోర్టుకు తరలించవచ్చు. ఇక దేశంలో వస్త్ర పరిశ్రమకు సూరత్ కేంద్రంగా ఉంది. మన రాష్ట్రంలో నగరి, వెంకటగిరి, ధర్మవరం, చీరాల, మంగళగిరి ప్రాంతాల్లోని చేనేత ఉత్పత్తులను సూరత్ మార్కెట్‌కు తరలించేందుకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. మన రాష్ట్రంలోని కృష్ణపట్నం పోర్టుతోపాటు కొత్తగా నిర్మించనున్న బందరు, రామాయపట్నం పోర్టులను సూరత్ పోర్టుతో అనుసంధానానికి సాధ్యపడుతుంది. ఇక చెన్నై–సూరత్ కారిడార్ దిగువన చెన్నై– విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్‌తోనూ ఎగువన ముంబై–ఢిల్లీ కారిడార్‌తోను అనుసంధానించనున్నారు. తద్వారా అతి పెద్ద పారిశ్రామిక కారిడార్ రూపొందనుంది. దీంతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరిగి ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటున్నారు. -
3.6 కోట్ల మంది.. యువతకు ఉద్యోగాల్లేవు
సాక్షి, హైదరాబాద్: దేశ యువత త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతోంది. 2021లో 18–29 ఏళ్ల మధ్య వయస్సులోని 3.6 కోట్లమంది యువజనులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకక నిరుద్యోగం కోరల్లో చిక్కుకున్నారు. కోట్లాది మంది చాలా తక్కువ జీతాలు, వేతనాలతో కూడిన ఉద్యోగాలతో సర్దుబాటు చేసుకున్నారు. కాగా భారత్‌లో గత డిసెంబర్లో నిరుద్యోగిత శాతం 7.91గా నమోదైనట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు వెల్లడించాయి. 2017–18లో ఇది 4.7 శాతంగా, 2018–19లో 6.3 శాతంగా ఉన్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని దాదాపు 140 కోట్ల జనాభాలో ఐదో వంతు కంటే ఎక్కువగా ఉన్న యువతరం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని సీఎంఐఈ పేర్కొంది. కోవిడ్‌తో మరింత పెరిగిన నిరుద్యోగిత కోవిడ్ మహమ్మారి కాలంలో.. గత రెండేళ్లుగా ఎదురైన విపత్కర పరిస్థితులు, వివిధ రకాల కంపెనీలు, ఉత్పాదకసంస్థల మూత, వ్యాపారాలు దెబ్బతినడంతో యువతరం క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది. కెరీర్ ప్రారంభంలోనే దీర్ఘకాలం పాటు నిరుద్యోగులుగా గడపాల్సి వచ్చింది. దీని ప్రభావం దీర్ఘకాలం పాటు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి కరోనా వైరస్ వ్యాప్తి కంటే ముందునుంచే యువతలో నిరుద్యోగిత శాతం ఎక్కువగానే ఉండగా, మహమ్మారి కారణంగా అది మరింత తీవ్రరూపం దాల్చిందని ఆర్థికవేత్తలు వెల్లడించారు. 30 లక్షల మంది మహిళల ఉపాధికీ కోత కోవిడ్ ఫస్ట్, సెకండ్‌వేవ్‌లలో లాక్డౌన్లు, ఆంక్షలు, నిబంధనలు ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపించడంతో పాటు యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తీవ్రమైన కోతకు ఆస్కారమేర్పడిందని చెబుతున్నారు. అంతకుముందు ఏడాదితో పోల్చితే.. 2020–21లో 45 లక్షల మంది పురుషులు, 30 లక్షల మంది మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినట్టుగా సెంటర్ ఫర్ ఎకనమిక్ డేటా అనాలిసిస్, సీఎంఐఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితిపై ఆర్థికరంగ విశ్లేషకులు డి.పాపారావు, హెచ్ఆర్ నిపుణురాలు డాక్టర్ డి.అపర్ణారెడ్డి తమ అభిప్రాయాలు ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆరు నెలల్లో మామూలు స్థితికి చేరుకోవచ్చు అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఈ–కామర్స్ ఇండస్ట్రీ, ఆతిథ్య, హోటల్, పర్యాటకం, తదితర అనుబంధ పరిశ్రమలు బాగా దెబ్బతినడం నిరుద్యోగిత శాతం పెరగడానికి ప్రధాన కారణం. కరోనా కాలంలో వివిధ రకాల పరిశ్రమలు దెబ్బతినడం, మూతపడడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ పరిస్థితి దీర్ఘకాలికంగా ఉండకపోవచ్చు. వచ్చే ఆరునెలల్లో మామూలు స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుత సాంకేతిక అవసరాలకు తగ్గట్టుగా తగిన నైపుణ్యాలు ఉన్న వారికి డిమాండ్ బాగానే ఉంటోంది. అయితే ఈ స్కిల్స్ ఉన్నవారు మన దగ్గర 5 నుంచి 10 శాతం లోపే ఉంటారు. –డాక్టర్ డి.అపర్ణా రెడ్డి, హెచ్ఆర్ నిపుణురాలు ఉద్యోగ, ఉపాధి రహిత వృద్ధి జరుగుతోంది నిరుద్యోగం పెరుగుదల అనేది ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామం. ఉత్పత్తి, సర్వీసు రంగాల్లో యాంత్రీకరణ, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతుల్లో నియామకాల పెరుగుదలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం ఉత్పత్తి రంగం లేకుండా బతికే స్థితికి చేరుకుంటున్నాం. ఉత్పత్తి లేకపోతే ఉద్యోగాలుండవు. దేశంలో తయారీ పరిశ్రమ (మాన్యుఫాక్చరింగ్ ఇండస్ట్రీ)లు వస్తున్నా ఉద్యోగాలు పెరగడం లేదు. ఆటోమేషన్ దీనికి ప్రధాన కారణం. అలాగే కార్ల కంపెనీలు వస్తున్నా పెయింట్లు వేయడం మొదలు, అసెంబ్లింగ్ తదితర ఉత్పత్తి శ్రమను రోబోలే నిర్వహిస్తున్నాయి. మనుషులతో అవసరం లేకుండా యంత్రాలే చేసేస్తున్నాయి. ఇలా మూడు, నాలుగేళ్లుగా ఉపాధి రహిత అభివృద్ధి ఉండింది. తాజాగా ఉద్యోగ రహిత వృద్ధి అనేది వచ్చింది. ఉన్న ఉద్యోగాలు పోయే దశ ఇది. మరోవైపు ఉద్యోగాలు లేక కొనుగోలు శక్తి తగ్గి ఆర్థికరంగం కుచించుకుపోతుంది. ఈ పరిస్థితుల్లో పట్టణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు, నామమాత్రం చదువుకున్న వారి కోసం పట్టణ ఉపాధి పథకాలు తీసుకురావాలి. లేనిపక్షంలో నిరుద్యోగ విస్ఫోటనం సంభవించే ప్రమాదం పొంచి ఉంది. – డి. పాపారావు, ఆర్థికరంగ విశ్లేషకుడు -
ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులే.. ఉపాధిలో మేటి
సాక్షి, అమరావతి: యువతకు ఉద్యోగాల కల్పనలో ఇంజనీరింగ్, మేనేజ్మెంటు కోర్సులే ముఖ్యభూమిక పోషిస్తున్నాయి. ఈ రెండు కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్ధుల్లోనే ఎక్కువమందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఇండియా స్కిల్ రిపోర్టు–2021 ఈ విషయాలను వెల్లడించింది. బీఈ, బీటెక్, ఎంబీఏ కోర్సులు చేసిన వారితో పోలిస్తే బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంసీఏ, పాలిటెక్నిక్ కోర్సులు చదివిన వారికి తక్కువగానే అవకాశాలు లభించాయి. విచిత్రమేమంటే బీకాం, బీఎస్సీల కన్నా 2021లో బీఏ విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యాయి. దేశవ్యాప్తంగా యువత నుంచి నిపుణులు సేకరించిన అభిప్రాయాలు, వాటిని విశ్లేషించి రూపొందించిన నివేదికలోని ముఖ్యాంశాలు ఏమిటంటే.. మహిళలకు పెరిగిన అవకాశాలు ఉద్యోగ, ఉపాధికి యోగ్యమైన ప్రతిభ పురుషుల కన్నా స్త్రీలలో అధికంగా ఉండడంతో వారికే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ► ఉద్యోగావకాశాల్లో పురుషులు 38.91 శాతం మంది ఉండగా మహిళలు 41.25 శాతంగా ఉండడం విశేషం. కాలేజీల్లో చేరుతున్న మహిళల శాతం కూడా పెరగడంతో అదే సంఖ్యలో ఉద్యోగాల శాతంలోనూ వారి పెరుగుదల ఉంది. ► కరోనా సమయంలో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లు ఎక్కువ ఉపాధి, ఉద్యోగాల కల్పనతో ముందు వరసలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో నిలవడం విశేషం. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో మెట్రో స్థాయి నగరాలు లేనప్పటికీ 5వ స్థానంలో నిలబడడం అన్నది చిన్న విషయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ► వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అనుకున్న మేర పరిశ్రమలు, ఇతర సంస్థలు రాలేదు. అయినప్పటికీ ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఏపీ మెరుగైన ఫలితాలనే సాధించింది. సాఫ్ట్వేర్, ఐటీ సంస్థలు ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాయి. రానున్న కాలంలో ఈ సంస్థలు మహిళలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే అవకాశముంది. ► ఐటీ, ఇంటర్నెట్ ఆధారిత ఉద్యోగాల్లో పురుషులతో సమానంగా మహిళలు పోటీపడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ► అలాగే, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఫార్మా, హెల్త్ కేర్ రంగాల్లోనూ అవకాశాలు దక్కుతున్నాయి. ► మహిళలకు అత్యధికంగా 2015లో 30% మేర అవకాశాలు లభించగా మళ్లీ 2021లోనే అంతకన్నా అత్యధికంగా 41.25% ఉండడం విశేషం. ► ఇక పురుషుల్లో ఐటీతో పాటు ఆటోమోటివ్‌లో 79 శాతం, లాజిస్టిక్‌లో 75 శాతం, కోల్ అండ్ ఎనర్జీ రంగంలో 72 శాతం అవకాశాలు దక్కించుకోగలిగారు. కరోనాతో యువతలో తగ్గిన నైపుణ్యం కరోనా కారణంగా నైపుణ్యాల పరంగా చూస్తే యువతలో ఆ సామర్థ్యాలు 45.9 శాతం మేర తగ్గింది. 18–21 ఏళ్లలోపున్న యువతలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు తక్కువగా ఉంటున్నాయి. ఇటువంటి యువత 40 శాతం కన్నా ఎక్కువగా ఉన్నారు. అలాగే, కరోనావల్ల ఉద్యోగాల కల్పన 2018తో పోలిస్తే 1.48 శాతం మేర మందగించినా నైపుణ్యాలు, శిక్షణ వంటి కార్యక్రమాల ద్వారా తమకు కావలసిన మానవ వనరులను సంస్థలు సమకూర్చుకుంటున్నాయి. ఉద్యోగాల కల్పన 2018లో 47.38 శాతం మేర ఉంటే 2021 నాటికి 45.9 శాతానికి తగ్గింది. ఇంటర్న్‌షిప్‌తోనే అవకాశాలు ఎంతోకాలంగా కొనసాగుతున్న సంప్రదాయ కోర్సులతో పారిశ్రామిక అవసరాలకు తగ్గ నైపుణ్యాలు విద్యార్థుల్లో ఉండడంలేదు. దీనికి కరోనా కూడా తోడైంది. ఈ నేపథ్యంలో.. విద్యార్థుల్లో తగిన నైపుణ్యాలు, సామర్థ్యాలను నెలకొల్పేందుకు ఆయా కాలేజీలు కోర్సుల్లో భాగంగానే ఇంటర్న్‌షిప్‌ను అమలుచేస్తున్నాయి. ఫలితంగా విద్యార్థులు కోర్సు పూర్తిచేసే సమయానికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోగలుగుతున్నారు. ఏపీలో గతంలో ఈ ఇంటర్న్‌షిప్ లేకపోవడంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని డిగ్రీ కోర్సులను నాలుగేళ్ల హానర్స్ కోర్సులుగా మార్పు చేయడంతోపాటు నైపుణ్యాల కోసం ఒక ఏడాది ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయించారు. దీంతో ఇంటర్న్‌షిప్‌తో డిగ్రీలు పూర్తిచేసిన వారిలో 85.92 శాతం మందికి అవకాశాలు దక్కుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఐటీలో ఇంకా నైపుణ్యాల కొరత నైపుణ్యాల విషయానికొస్తే ఐటీ రంగంలో చాలా అంతరం ఉంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు భారీ పెట్టుబడులతో ముందుకొస్తున్న తరుణంలో అందుకు తగ్గట్లుగా యువతను నైపుణ్యాలతో తీర్చిదిద్దేలా విద్యారంగంలో మార్పులు రావలసి ఉంటుందని నివేదిక అభిప్రాయపడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, బిగ్‌డేటా, రోబోటిక్స్, ఆటోమేటెడ్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటాసైన్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంశాల్లో నైపుణ్యం ఉన్న వారికి భారీ డిమాండ్ ఉంది. బయోటెక్నాలజీ, ఫార్మా, హెల్త్‌కేర్, ఎనర్జీ, లాజిస్టిక్ రంగాల్లోనూ అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఐటీ పరిశ్రమ పురోగమిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌తోపాటు హార్డ్‌వేర్ ఇంజనీర్లకూ డిమాండ్ పెరగనుందని అంచనా వేసింది. ఐటీ రంగంలో 48.27%, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 47.35%, కంప్యూటర్ సైన్స్‌లో 38.34 శాతం మందికి రానున్న కాలంలో అవకాశాలు దక్కనున్నాయని పేర్కొంది. -
దేశానికి స్టార్టప్‌లే వెన్నెముక
న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారంగా భారత్ నుంచి భారత్ కోసం ఆవిష్కరణలు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్టార్టప్‌లకు పిలుపునిచ్చారు. స్టార్టప్‌ల ప్రతినిధులతో శనివారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. ‘‘మన స్టార్టఫ్‌లు ఆట (పోటీ) నిబంధనలను మార్చేస్తున్నాయి. భారత్‌కు స్టార్టప్‌లు వెన్నెకముగా నిలుస్తాయన్న నమ్మకం ఉంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. భారత్‌లో 60,000 స్టార్టప్‌లు, 42 యూనికార్న్‌లు ఉన్నట్టు చెప్పారు. ‘‘ప్రభుత్వం మూడింటిపై దృష్టి సారించి పనిచేస్తోంది. ప్రభుత్వ చట్రం నుంచి, అధికారిక అడ్డుగోడల నుంచి వ్యవస్థాపకత, ఆవిష్కరణలకు విముక్తి కల్పించడం. ఆవిష్కరణలకు ప్రోత్సహించేందుకు సంస్థాగత యంత్రాగాన్ని ఏర్పాటు చేయడం. యువ ఆవిష్కర్తలు, యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మద్దతుగా నిలవడం’’ అని ప్రధాని వివరించారు. ఎంతో పురోగతి.. 2013–14లో కేవలం 4,000 పేటెంట్లు భారత సంస్థలకు మంజూరు అయితే, గతేడాది 28,000 పెటెంట్లు మంజూరైన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. 2013–14లో 70,000 ట్రేడ్‌మార్క్‌లు సంఖ్య వృద్ధి చెందినట్టు చెప్పారు. అలాగే 2013–14లో 4,000 కాపీరైట్లు మంజూరు అయితే, 2021–22 మంజూరైనవి 16,000గా ఉన్నట్టు తెలిపారు. అంతర్జాతీయ ఆవిష్కరణల సూచీలో భారత్ స్థానం 2015లో 81 ఉంటే, అది ఇప్పుడు 46కు మెరుగుపడినట్టు పేర్కొన్నారు. స్టార్టప్‌లు ప్రదర్శన.. 150కుపైగా స్టార్టప్‌లు ఆరు రకాల గ్రూపులుగా ఏర్పడి ఈ సందర్భంగా ఆరు రకాల థీమ్‌లపై ప్రదర్శన ఇచ్చాయి. సాగు రంగంలో విస్తృతమైన డేటా సమీకరణకు యంత్రాంగం, భారత్‌ను వ్యవసాయానికి ప్రాధాన్య కేంద్రంగా మార్చడం, టెక్నాలజీ సాయంతో హెల్త్‌కేర్‌కు మద్దతునివ్వడం, మానసిక ఆరోగ్య సమస్యకు పరిష్కారం, వర్చువల్ టూర్స్ ద్వారా రవాణా, పర్యాటకానికి ప్రోత్సాహాన్నివ్వడం, ఎడ్యుటెక్, ఉపాధి అవకాశాల గుర్తింపు, ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాలను ఈ కామర్స్‌తో అనుసంధానించడంపై స్టార్టప్‌లు తమ ఆలోచనలను ప్రధానితో పంచుకున్నాయి. ఉపాధి అవకాశాలకు వేదిక స్టార్టప్‌లు ఆవిష్కరణలు తీసుకురావడే కాదు భారీ ఉపాధి అవకాశాలకు వేదికగా నిలుస్తాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశంలో కింది స్థాయి వరకు స్టార్టప్ సంస్కృతి ఫరిడవిల్లేందుకు వీలుగా ఏటా జనవరి 16న ‘నేషనల్ స్టార్టప్ డే’గా జరుపుకోనున్నట్టు ప్రకటించారు. స్టార్టప్‌లకు 2022 ఎన్నో అవకాశాలు, మార్గాలను తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి ఆవిష్కరణలు, టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందని ప్రకటించారు. స్టార్టప్‌లకు ప్రోత్సాహాన్నిస్తుంది.. నేషనల్ స్టార్టప్ డే అన్నది దేశ జీడీపీ వృద్ధిలో స్టార్టప్‌ల పాత్రను గుర్తించడమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని, యువ నిపుణులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా అడుగులు వేసేందుకు ప్రోత్సాహంగా నిలుస్తుందని బోలోలైవ్ (షార్ట్ వీడియోల ప్లాట్‌ఫామ్) వ్యవస్థాపకుడు, సీఈవో వరుణ్ సక్సేనా పేర్కొన్నారు. -
ఆశలపల్లకీలో 2022
పారదర్శకత, సమాన అవకాశాలు ఉన్న ఏ రంగమైనా సక్సెస్ అవుతుంది. రియల్టీ పరిశ్రమకూ ఇదే వర్తిస్తుంది. గతేడాది ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వెంటాడితే.. హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌ను మాత్రం యూడీఎస్ భూతం మింగేసింది. అనధికారిక విక్రయాలతో ఆరోగ్యకరమైన మార్కెట్ దెబ్బతిన్నది. సిండికేట్‌గా మారిన కొందరు డెవలపర్లు.. నగర రియల్టీ మార్కెట్‌ను ప్రతికూలంలోకి నెట్టేశారు. ప్రభుత్వంతో పాటూ డెవలపర్ల సంఘాలు, స్టేక్ హోల్డర్లు, నిపుణులు ఒక్క తాటిపైకొస్తేనే హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి నూతన సంవత్సరం! సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఐటీ, ఫార్మాలతో పాటూ బ్యాంకింగ్, సర్వీసెస్ రంగాలన్నీ బాగున్నాయి. కరోనా కాలంలోనూ ఆయా పరిశ్రమ లలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. స్థిరౖ మెన ఆదాయ వృద్ధి నమోదవుతుంది. మరోవైపు ఇతర నగరాల కంటే హైదరాబాద్‌లో జీవన వ్యయం తక్కువ. అందుబాటు ధరలు, కాస్మోపాలిటన్ సిటీ, ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలతో వ్యక్తిగత ఇన్వెస్టర్లతో పాటు గ్లోబల్ కంపెనీలు హైదరా బాద్ వైపు ఆసక్తిగా ఉన్నాయి. ఇలాంటి శుభ పరిణామంలో సిండికేట్ డెవలపర్లు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తున్నారు. రాష్ట్రంలో ల్యాండ్ టైటిల్ దొరుకుతుందనే విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి తెలిపారు. లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ మార్కె ట్ను సృష్టిస్తేనే హైదరాబాద్ రియల్టీ మార్కెట్ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని అభిప్రాయపడ్డారు. 2022 రియల్టీ మార్కెట్‌కు గృహ రుణ వడ్డీ రేట్లు కీలకం కానుందని.. ప్రస్తుతం ఉన్న 6.5 శాతం ఇంట్రెస్ రేటే కొనసాగితే ఈ ఏడాది మార్కెట్‌ను ఎవరూ ఆపలేరని వివరించారు. 2 లక్షల యూనిట్ల వరకు అవసరం.. అర్బన్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టిసారించింది. ఓఆర్ఆర్తో జిల్లా కేంద్రాలకు, మెట్రో రైల్‌తో ప్రధాన నగరంలో కనెక్టివిటీ పెరిగింది. సిటీలో పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గింది. దీంతో అందుబాటు ధరలు ఉండే శివారు ప్రాంతాలలో సైతం గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆఫీస్‌లు పునఃప్రారంభం కావటంతో ఇప్పటికే ఉన్న కంపెనీలతో పాటూ కొత్తవి విస్తరణ చేపట్టాయి. దీంతో ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ పెరిగింది. ఇది రానున్న రోజుల్లో గృహాల డిమాండ్‌ను ఏర్పరుస్తుందని ఎస్ఎంఆర్ బిల్డర్స్ సీఎండీ రాంరెడ్డి అభిప్రాయపడ్డారు. సాధారణంగా హైదరాబాద్‌లో ఏటా 30–40 వేల గృహాలు డెలివరీ అవుతుంటాయి. మరో 70–75 వేల యూనిట్లు వివిధ దశలో నిర్మాణంలో ఉంటాయి. అయితే ఈ ఏడాది అదనంగా 1.5 – 2 లక్షల యూనిట్ల అవసరం ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం నగరంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న యూనిట్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపారు. దీంతో నాణ్యమైన నిర్మాణం, పెద్ద సైజు యూనిట్లకు డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ హైదరాబాద్‌తో పాటూ షాద్‌నగర్, శంకర్పల్లి, చేవెళ్ల, ఆదిభట్ల, నాగార్జున్ సాగర్ రోడ్, శ్రీశైలం జాతీయ రహదారి మార్గంలో డిమాండ్ కొనసాగుతుందని వివరించారు. మేడ్చల్, శామీర్‌పేట మార్గంలో ప్రక్క జిల్లాల పెట్టుబడిదారులు చేపట్టే విక్రయాలే ఉంటాయని తెలిపారు. యాదాద్రిని చూపించి వరంగల్ రహదారి మార్కెట్‌ను పాడుచేశారని పేర్కొన్నారు. సగం ధర అంటే అనుమానించండి.. కరోనా తర్వాత నుంచి నైపుణ్య కార్మికుల కొరత ఏర్పడింది. స్టీల్, సిమెంట్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు, లేబర్ చార్జీలు రెట్టింపయ్యాయి. దీంతో నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.300–400 వరకు పెరిగింది. రెగ్యులర్ డెవలపరే నిర్మాణాన్ని పూర్తి చేయడమే సాహసంగా మారిన తరుణంలో.. మార్కెట్ రేటు కంటే 40–50 శాతం తక్కువ ధరకు విక్రయిస్తున్నారంటే ఆ డెవలపర్‌ను అనుమానించాల్సిందే. నిర్మాణ అనుమతులు లేకుండా, రెరాలో నమోదు చేయకుండానే విక్రయిస్తున్నారంటే ప్రాజెక్ట్‌ను ఎలా పూర్తి చేయగలుగుతారనేది కొనుగోలుదారులే విశ్లేషించుకోవాలి. ►నిర్మాణ సంస్థలు ఒకరిని మించి మరొకరు ఆకాశహర్మ్యాలు అని ఆర్భాట ప్రచారానికి వెళ్లకూడదు. అంత ఎత్తులో ప్రాజెక్ట్‌ను చేపట్టే ఆర్థిక స్థోమత, సాంకేతికత, సామర్థ్యం ఉన్నాయా అనేది విశ్లేషించుకోవాలి. అంతే తప్ప పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు తొందరపాటు గురైతే తనతో పాటూ కొనుగోలుదారులూ నిండా మునిగిపోతారని ఆర్క్ గ్రూప్ సీఎండీ గుమ్మి రాంరెడ్డి తెలిపారు. నిర్మాణ అనుమతులు వచ్చాక ప్రాజెక్ట్‌లను లాంచింగ్, విక్రయాలు చేయాలి. దీంతో డెవలపర్, కస్టమర్, బ్యాంకర్, ప్రభుత్వం అందరూ హ్యాపీగానే ఉంటారు. బిల్డర్ ప్రొఫైల్‌ను పరిశీలించకుండా, తక్కువ ధరని తొందరపడి కొనొద్దు. ఒమిక్రాన్ ప్రభావం ఉంటుందా? కరోనా తర్వాత ఇంటి అవసరం పెరిగింది. సొంతిల్లు ఉంటే బాగుంటుందనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో చాలా మంది గృహాల కోసం ఎంక్వైరీలు చేస్తున్నారు. ఇంటి ఎంపికలోనూ మార్పులు వచ్చాయి. వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ విధానం, ఆన్లైన్ క్లాస్‌ల నేపథ్యంలో ఇంట్లో ప్రత్యేకంగా గది ఉండాలని కోరుకుంటున్నారు. ప్రశాంత వాతావరణం, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రాజెక్ట్‌లు, పెద్ద సైజు గృహాలను ఎంపిక చేస్తున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉంటుందే కానీ తీవ్రత పెద్దగా ఉండదని ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావటంతో నమ్మకం ఏర్పడింది కాబట్టి ఒమిక్రాన్ ప్రభావం మానసికంగా ఉంటుందే తప్ప రియల్టీ మార్కెట్‌పై పెద్దగా భౌతిక ప్రభావం చూపించకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అగ్రిమెంట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దు 100, 200 గజాలను కూడా డెవలప్మెంట్ అగ్రిమెంట్ల కింద రిజిస్ట్రేషన్ చేయకూడదని క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి సూచించారు. వేరే దేశంలోని వ్యాపారస్తులు తక్కువ ధరకు వస్తువులను మన దేశానికి ఎగుమతి చేసి విక్రయిస్తుంటే యాంటీ డంప్ డ్యూటీ ఎలాగైతే చెల్లిస్తారో.. అలాగే యూడీఎస్, ప్రీలాంచ్ డెవలపర్ల నుంచి కూడా అధిక పన్నులు వసూలు చేయాలని అభిప్రాయపడ్డారు. యూడీఎస్, ప్రీలాంచ్ డెవలపర్లను కూడా రెరా పరిధిలోకి తీసుకురావాలని కోరారు. -
ఆంధ్రప్రదేశ్ టూరిజం.. ‘స్టార్’డమ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యాటక రంగం ‘స్టార్’ స్టేటస్ సంతరించుకుంటోంది. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో సుమారు రూ.2,600 కోట్లతో పది ప్రపంచ స్థాయి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. ఆతిథ్య రంగంలో దిగ్గజ సంస్థలైన ఒబెరాయ్, హయత్, తాజ్ గ్రూప్ ఇందులో పాలు పంచుకుంటున్నాయి. తద్వారా దాదాపు 48 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో మెగా టూరిజం ప్రాజెక్టులో భాగంగా అంతర్జాతీయ హోటళ్లు అందుబాటులోకి రానున్నాయి. నూతన టూరిజం పాలసీ 2020–2025 ప్రకారం పెట్టుబడిదారులకు ప్రభుత్వం పలు రాయితీలను కల్పిస్తోంది. సంబంధిత ప్రాజెక్టులకు భూ కేటాయింపులు చేసి సిద్ధంగా ఉన్నవి వెంటనే నిర్మాణ సంస్థలకు అప్పగించేలా ప్రభుత్వం ఇటీవల వేర్వేరు ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఒబెరాయ్.. ఐదు ప్రదేశాల్లో ఒబెరాయ్ హోటళ్ల గ్రూప్ రాష్ట్రంలోని ఐదు ప్రదేశాల్లో రూ.1,350 కోట్లతో 7–స్టార్ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మించనుంది. అన్నవరం, పిచ్చుకలంక, పేరూరు, గండికోట, హార్సిలీహిల్స్ ప్రాంతాల్లో రిసార్ట్స్ (ఇండిపెండెంట్ విల్లా), కన్వెన్షన్ సెంటర్లను అభివృద్ధి చేయనుంది. హార్సిలీ హిల్స్‌లో సింగిల్ ఫేజ్‌లో నిర్మాణం పూర్తి కానుంది. లగ్జరీ సూట్లు, ఓపెన్ లాన్లు, పార్టీ ఏరియా, ఫైన్–డైనింగ్ రెస్టారెంట్లు, 24 గంటలు అందుబాటులో అంతర్జాతీయ రుచులతో కాఫీ షాప్‌లు, కాన్ఫరెన్స్, బాంకెట్ హాల్, బార్, ఈత కొలను, ఫిట్నెస్ సెంటర్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్పా ఇతర సౌకర్యాలు వీటిలో అందుబాటులో ఉంటాయి. పెనుకొండలో ఆధ్యాత్మిక కేంద్రం ఇస్కాన్ చారిటీస్ (బెంగళూరు) ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పెనుకొండ జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద రూ.వంద కోట్లతో 69.75 ఎకరాల విస్తీర్ణంలో ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 288 గదులతో యాత్రి నివాస్ (అతిథి గదులు), 2 వేల సీట్ల సామర్థ్యంతో యాంపీ థియేటర్, కృష్ణలీలల థీమ్ పార్క్, 1,000 సీట్ల సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్, 108 పడకలతో ధర్మశాల డార్మిటరీలు అందుబాటులోకి రానున్నాయి. మ్యూజియం, ఆయుర్వేద వెల్నెస్ సెంటర్, సంస్కృతి భవన్, హెరిటేజ్ క్రాఫ్ట్ సెంటర్, ఐకానిక్ టవర్, చిన్నారులకు వినోద కేంద్రం, 600 కార్లకు పార్కింగ్ సదుపాయం, ప్రసాదం, ఫుడ్ కోర్టులు నిర్మించనున్నారు. దీని ద్వారా సుమారు పది వేల మందికి ఉపాధి లభించనుంది. పెనుకొండలో మూడేళ్ల భవన నిర్మాణ వ్యవధితో పాటు 33 ఏళ్ల లీజుకు అనుమతించారు. నాలుగు చోట్ల ఫైవ్ స్టార్ హోటళ్లు హయత్, తాజ్ గ్రూప్‌ల భాగస్వామ్యంతో నాలుగు ప్రాంతాల్లో ఐదు నక్షత్రాల హోటళ్లను నిర్మించనున్నారు. హయత్ సంస్థ విశాఖపట్నం శిల్పారామం పరిసరాల్లో రూ.200 కోట్లతో మూడు ఎకరాల్లో 200 గదులు, 1,500 సిట్టింగ్ సామర్థ్యంతో ఐదు నక్షత్రాల హోటల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంతో 5 వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. తిరుపతిలోని శిల్పారామం ప్రాంతంలో రూ.204 కోట్లతో 2.66 ఎకరాల్లో 225 గదులు, 1,500 సిట్టింగ్ సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేయనుంది. ఇక్కడ 5,100 మందికి ఉద్యోగవకాశాలు లభిస్తాయి. విజయవాడలో రూ.92.61 కోట్లతో 81 గదులు, రెండు బాంకెట్ హాల్స్‌తో నాలుగు నక్షత్రాల హోటల్ రానుంది. ఇక తాజ్ వరుణ్ గ్రూప్ విశాఖపట్నంలో రూ.722 కోట్లతో 260 గదుల ఐదు నక్షత్రాల హోటల్, 90 సర్వీస్ అపార్ట్మెంట్స్, 12,750 చదరపు అడుగుల్లో కన్వెన్షన్ సెంటర్, 2,500 సీటింగ్ సామర్థ్యంతో టెక్నాలజీ స్పేస్‌ను నిర్మిస్తుంది. ఇందులో ఐదు రెస్టారెంట్లు, షాపులు, గేమింగ్ జోన్, రూఫ్ టాప్ హెలిప్యాడ్, ఒలింపిక్ లెంగ్త్ స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్ అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ 15 వేల ఉద్యోగవకాశాలు దక్కనున్నాయి. రాయితీలు ఇలా.. పీపీపీ కింద అభివృద్ధి చేసే స్థలాల లీజు అద్దెను మార్కెట్ విలువలో ఒక శాతంగా నిర్ణయించారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి ఐదు శాతం అద్దె పెంచనున్నారు. భూ బదలాయింపు చార్జీలను మినహాయించారు. స్టాంపు డ్యూటీ మొత్తాన్ని, ఐదేళ్ల పాటు వంద శాతం ఎస్జీఎస్టీని పూర్తిగా రీయింబర్స్ చేసుకునే అవకాశం కల్పించారు. ఒబెరాయ్ సంస్థ ప్రాజెక్టులకు నాలుగేళ్ల నిర్మాణ కాలంతో పాటు 90 ఏళ్ల లీజును నిర్ణయించారు. ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఏడు నక్షత్రాల హోటళ్లు, లగ్జరీ విల్లాల విద్యుత్ వినియోగంలో యూనిట్‌కు రూ.2 చొప్పున, ఐదు నక్షత్రాల హోటళ్లు, సర్వీసు ఆపార్ట్‌మెంట్స్, కన్వెన్షన్ సెంటర్ల ప్రాజెక్టులకు యూనిట్‌కు రూపాయి చొప్పున ఐదేళ్ల పాటు రీయింబర్స్మెంట్ కల్పిస్తారు. ఆయా ప్రాజెక్టుల విలువను బట్టి ఏటా గరిష్ట వినియోగంపై పరిమితి విధించారు. పెట్టుబడిదారులకు సులభంగా.. సీఎం వైఎస్ జగన్ దూరదృష్టితో రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. పాత పాలసీ కంటే మెరుగ్గా పెట్టుబడిదారులకు రాయితీలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇండస్ట్రీ స్టేటస్ కల్పించాం. అందుకే అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. మెగా టూరిజం ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు చేపడతాం. పెట్టుబడిదారులకు ఎక్కడా సమస్య లేకుండా నిర్మాణాలకు అవసరమైన స్థలాలను కేటాయిస్తున్నాం. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి -
వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దీనిద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగంలో పరిశ్రమల ద్వారానే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకెళ్లేందుకు వీలవుతుందని ఉపరాష్ట్రపతి అన్నారు. రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్‌పీవోల) వంటివి చిన్న, మధ్యతరగతి రైతులకు ఎంతగానో ఉపయుక్తం అవుతాయన్నారు. వీటి నిర్మాణానికివ్యవసాయ విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని వెంకయ్యనాయుడు సూచించారు. ఆదివారం బిహార్ చంపారన్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. చిన్న, మధ్యతరగతి రైతులు తమకున్న పరిమిత వనరులతో అద్భుతాలు సాధించడం వెనుక దేశ వ్యవసాయ రంగం గొప్పదనం దాగుందని, అందుకే వివిధ మార్గాల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా వారికి మద్దతుగా నిలవాలన్నారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ఆహారభద్రతను సుస్థిరం చేయాలన్నారు. -
Vidya: చిన్న ఉద్యోగం ఎందుకు చేయాలి.. నేనే ఉద్యోగం ఇస్తాను..
ఎం.ఎస్.సి డిజిటల్ సొసైటీ కోర్స్‌లో గోల్డ్ మెడలిస్ట్ ఆమె. కాని ఆమె ఫ్రెండ్స్ అందరికీ క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు వచ్చాయి. ఆమెకు రాలేదు. ‘మీరు చూడగలిగితే బాగుండు’ అన్నారు అంతా. విద్యా పుట్టుకతో అంధురాలు. కాని అందరూ నిరాకరిస్తున్నా మేథమెటిక్స్‌లో గొప్ప ప్రావీణ్యం సంపాదించింది. ‘నాకు ఉద్యోగం ఇవ్వడం కాదు.. నాలాంటి వారికి నేనే ఉద్యోగాలు కల్పిస్తాను’ అని స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉపాధి చూపిస్తోంది విద్య. ఆమె ఎదుర్కొన్న అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. ఆమె సాధిస్తున్న గెలుపులు కూడా. ‘ప్రపంచంలోని అంధుల జనాభాలో మూడొంతుల మంది భారతదేశంలో ఉన్నారు. వారిలో 70 శాతం మంది పల్లెల నుంచే ఉన్నారు. మన దేశంలో అంధ బాల బాలికల్లో 68 శాతమే చదువుకోవడానికి వెళుతున్నారు. వీరిలో మళ్లీ మేథ్స్, సైన్స్ వంటివి తీసుకోవడానికి స్కూల్స్ అంగీకరించవు. సాధారణ కోర్సులే వీళ్లు చదవాలి. ఏం? ఎందుకు వీళ్లు మేథ్స్ చదవకూడదు?’ అంటుంది విద్య. బెంగళూరుకు చెందిన ఈ పాతికేళ్ల అమ్మాయి ఎం.ఎస్.సిలో గోల్డ్ మెడల్ సాధించి ఇప్పుడు ‘విజన్ ఎంపవర్’ అనే సంస్థ స్థాపించి దేశంలోని అంధ విద్యార్థినీ విద్యార్థులకు మేథ్స్, సైన్స్ చదవడంలో మెటీరియల్ తయారు చేస్తోంది. వారి కోసం ట్యూషన్లు, క్లాసులు ఏర్పాటు చేస్తుంది. వారికై పని చేసే అంధ టీచర్లనే సిద్ధం చేస్తోంది. ఒకప్పుడు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు విద్యకు. కాని ఇప్పుడు విద్యే తన సంస్థ ద్వారా అంధ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రిమెచ్యూర్ రెటినోపతి విద్య బెంగళూరు సమీపంలోని పల్లెటూరిలో పుట్టింది. సాధారణ జననమే. కాని పుట్టాక మూడు నెలలు ఇంక్యుబేటర్‌లో పెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రిమెచ్యూర్ రెటినోపతి వల్ల ఆమె రెండు కళ్లకూ చూపు పోయింది. ప్రపంచ సాక్షరతా దినోత్సవం రోజు పుట్టడం వల్ల, ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ ‘పాపకు ఎలాగూ కళ్లు రావు. కాని బాగా చదివిస్తే తన కాళ్ల మీద తాను నిలబడుతుంది’ అని సలహా ఇవ్వడం వల్ల తల్లిదండ్రులు ‘విద్య’ అని పేరు పెట్టారు. ‘సాధారణంగా మన దేశంలో జరిగే తప్పేమిటంటే అంధ పిల్లలకు భవిష్యత్తు ఉండదని వారిని బడికి పంపరు పల్లెటూళ్లలో. నా అదృష్టం నా తల్లిదండ్రులు నన్ను బెంగళూరులోని ఒక మిషనరీ స్కూల్లో 7 ఏళ్ల వయసులో వేశారు. అక్కడే నేను 7 వ క్లాస్ వరకూ స్పెషల్ స్టూడెంట్‌గా చదువుకున్నాను. కాని అసలు సమస్య నా 8 వ తరగతి నుంచి అందరిలాగే మామూలు బడిలో చదువుకునే సమయంలో మొదలైంది‘ అంటుంది విద్య. లెక్కల పిచ్చి విద్యకు చిన్నప్పటి నుంచి లెక్కల పిచ్చి. ఇంట్లో చేటలో తల్లి బియ్యం పోసిస్తే ప్రతి గింజను లెక్క పెట్టేది. బియ్యం ఏమిటి... ఆవాలు పోసిచ్చినా ప్రతి ఆవాల గింజను లెక్క పెట్టేది. తల్లిదండ్రులు ఆమె లెక్కల ఇష్టాన్ని గమనించారు. కాని హైస్కూల్లో లెక్కలు చదవడం ఆమెకు కష్టమైంది. క్లాసులన్నీ బోర్డు మీద రాతలతో ఉంటాయి. మేథమెటికల్ సింబల్స్ ఉంటాయి. డయాగ్రామ్స్ ఉంటాయి. వీటిని చూడకుండా అర్థం చేసుకోవడం అసాధ్యం. కాని విద్య పట్టుదలగా వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించేంది. ‘నేను చేయాల్సింది మరిన్ని గంటలు కష్టపడటమే అని అర్థం చేసుకున్నాను. ఉదయం నాలుగున్నరకు లేచి చదివేదాన్ని’ అంటుంది విద్య. డిగ్రీలో మేథ్స్, కంప్యూటర్ సైన్స్ తీసుకుని కంప్యూటర్లో ఆడియో మెటీరియల్ ద్వారా వీలైనంత చదువుకుంటూ పాస్ అయ్యింది. ఆ తర్వాత బెంగళూరులో ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటిలో ఎంఎస్సీ డిజిటల్ సొసైటీ కోర్సును టాపర్‌గా పాసైంది. ‘నా చదువుంతా నా ప్రయోగమే. నేను గణితాన్ని అర్థం చేసుకోవడానికి పడిన తపన, కష్టమే నా చదువు. ట్రిపుల్ ఐటి నుంచి మేథమేటిక్స్ ఆధారిత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి స్టూడెంట్‌ని నేనే’ అంటుంది విద్య. అందరి కోసం విద్యకు ఉద్యోగం ఇవ్వడానికి కంపెనీలు నిరాకరించాయి ఆమె అంధత్వం వల్ల. చాలా కంపెనీలు దయతలిచి కాల్‌సెంటర్ ఆపరేటర్ ఉద్యోగాన్ని ఆఫర్ చేశాయి. ఇంత మేధ పెట్టుకుని చిన్న ఉద్యోగం ఎందుకు చేయాలి అనుకుంది విద్య. అసలు అంధులు అన్ని విధాలా మేథ్స్, కంప్యూటర్స్ చదివి పెద్ద ఉద్యోగాలు చేసేలా వారిని తయారు చేస్తాను అని ఉద్యోగప్రయత్నాలు మాని తానే ఉద్యోగాలు చూపే ‘విజన్ ఎంపవర్’ అనే సంస్థను బెంగళూరులో స్థాపించింది. నాలుగేళ్లుగా ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంధ విద్యార్థులకు బాసటగా నిలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతానికి కర్నాటకలోని అంధ విద్యార్థులను ప్రపంచ అంధ విద్యార్థులతో, విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తోంది. విద్య చేస్తున్న ఈ పనిని సమాజం గుర్తిస్తోంది. ఆమెను పిలిచి స్ఫూర్తివంతమైన ప్రసంగాలను వింటోంది. ‘అప్పుడే ఏమైంది. ఇది మొదలు మాత్రమే. చేయాల్సింది చాలా ఉంది’ అంటోంది విద్య. చాలా కంపెనీలు దయతలిచి కాల్‌సెంటర్ ఆపరేటర్ ఉద్యోగాన్ని ఆఫర్ చేశాయి. ఇంత మేధ పెట్టుకుని చిన్న ఉద్యోగం ఎందుకు చేయాలి అనుకుంది విద్య. అసలు అంధులు అన్ని విధాలా మేథ్స్, కంప్యూటర్స్ చదివి పెద్ద ఉద్యోగాలు చేసేలా వారిని తయారు చేస్తాను అని ఉద్యోగ ప్రయత్నాలు మాని తానే ఉద్యోగాలు చూపే సంస్థను స్థాపించింది. -
మెరుగుపడుతున్న ఉపాధి అవకాశాలు!
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి ప్రభావిత సవాళ్ల తర్వాత దేశంలో క్రమంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) అమలు చేస్తున్న సామాజిక భద్రతా పథకంలో ఈ ఏడాది ఆగస్టులో స్థూలంగా 13.22 లక్షల మంది కొత్త సభ్యులు చేరారని తాజా గణాంకాలు వివరించయి. అయితే జూలైతో పోల్చితే (13.33 లక్షల మంది) ఈ సంఖ్య కొంచెం తక్కువ కావడం గమనార్హం. దేశంలో సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలకు సంబంధించి సోమవారం జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ)వెలువరించిన అధికారిక గణాంకాలు ఈ విషయాన్ని తెలిపాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► ఈఎస్ఐసీలో ఏప్రిల్‌లో 10.74 లక్షలు, మేలో 8.88 లక్షలు, జూన్‌లో 10.62 లక్షలు, జూలైలో 13.33 లక్షల మంది కొత్తగా చేరారు. ► సెకండ్ వేవ్ నేపథ్యంలో విధించిన ఆంక్షల సడలింపు సానుకూల ప్రభావం తాజా గణాంకాల్లో కనిపిస్తోంది. స్థిరరీతిన క్రమంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ► 2018–19లో కొత్త సబ్స్క్రైబర్ల సంఖ్య 1.49 కోట్లు. 2019–20లో ఈ సంఖ్య 1.51 కోట్లకు చేరింది. 2020–21లో కరోనా ప్రభావంతో 1.15 కోట్లకు పడిపోయింది. ► ఈఎస్ఐసీలో 2017 సెప్టెంబర్ నుంచి 2021 మధ్య 5.56 కోట్ల కొత్త చందాదారులు చేరారు. ► ఈఎస్ఐసీ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ద్వారా నిర్వహించబడుతున్న వివిధ సామాజిక భద్రతా పథకాల కొత్త చందాదారుల పేరోల్ డేటా ఆధారంగా ఎన్ఎస్ఓ నివేదికలు రూపొందిస్తుంది. 2017 సెప్టెంబర్ నుంచీ ప్రారంభమైన కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ 2018 ఏప్రిల్ నుంచి ఈ గణాంకాలను ఎన్ఎస్ఓ విడుదల చేస్తోంది. ఈపీఎఫ్ఓకు సంబంధించి ఇలా... ఇదిలావుండగా నివేదిక ప్రకారం, రిటైర్మెంట్ ఫండ్ సంస్థ– ఈపీఎఫ్ఓలో నికర కొత్త నమోదులు ఆగస్టులో 14.80 లక్షలు. జూలై 2021లో ఈ సంఖ్య 13.15 లక్షలు. 2017 సెప్టెంబర్ నుంచి 2021 ఆగస్టు మధ్య స్థూలంగా కొత్త చందాదారుల సంఖ్య 4.61 కోట్లు. -
సేవల రంగంలో పెరిగిన ఉపాధి కల్పన
న్యూఢిల్లీ: సేవల రంగం 2021 సెప్టెంబర్‌లో (2020 సెప్టెంబర్‌తో పోల్చి) మంచి ఉపాధి అవకాశాలను కల్పించింది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడం 10 నెలల తర్వాత ఇదే తొలిసారని ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ సర్వే పేర్కొంది. అయితే సూచీ మాత్రం ఆగస్టులో 56.7 వద్ద (18 నెలల గరిష్టం) ఉంటే, సెప్టెంబర్‌లో 55.2కు తగ్గింది. ఈ ఇండెక్స్ 50 పైన ఉంటే వృద్ధి ధోరణిగా పరిగణిస్తారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా లెక్కగడతారు. సెప్టెంబర్‌లో ఇండెక్స్ తగ్గినా, దీర్ఘకాలంలో చూస్తే సగటు పటిష్టంగా ఉందని ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లిమా పేర్కొన్నారు. ఆమె తెలిపిన అంశాల్లో ముఖ్యాంశాలు... ►సర్వే ప్రకారం, డిమాండ్ బాగుంది. ►డిమాండ్ పటిష్ట రికవరీ ధోరణి ప్రయోజనాలను భారత్ కంపెనీలు పొందుతున్నాయి. ►రికవరీ ఉన్నా, బిజినెస్ విశ్వాసం మాత్రం ఇంకా బలహీనంగానే ఉంది. మూడవవేవ్ భయాలతో పాటు ద్రవ్యోల్బణం తీవ్రత అంచనాలూ దీనికి కారణం. సర్వీస్ ప్రొవైడర్లలో సానుకూల సెంటిమెంట్ తక్కువగా ఉంది. ►భారత్ సేవల విషయంలో అంతర్జాతీయ డిమాండ్ కూడా బలహీనంగానే ఉంది. ట్రావెల్ ఆంక్షలు దీనికి ప్రధాన కారణం. ►తాజా ఎగుమతులకు సంబంధించి వ్యాపార క్రియాశీలత వరుసగా 9వ నెలలోనూ క్షీణించింది. సేవలు–తయారీ కలిపినా మందగమనం సేవలు, తయారీ రంగం కలిపిన కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ కూడా సెప్టెంబర్‌లో మందమనంలోనే ఉంది. ఆగస్టులో ఈ సూచీ 55.4 వద్ద ఉంటే, సెప్టెంబర్‌లో స్వల్పంగా 55.3కు తగ్గింది. ధరల విషయానికి వస్తే, ఇంధనం, మెటీరియల్, రిటైల్, రవాణా ధరలు పెరగడం ప్రతికూలాంశాలు. భారత్ పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 70 శాతం వాటా కలిగిన ఒక్క తయారీ రంగం కార్యకలాపాలు చూస్తే, ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 53.7గా నమోదయ్యింది. ఆగస్టులో ఇది 52.3 వద్ద ఉంది. కోవిడ్–19 సెకండ్ వేవ్ నేపథ్యంలో విధించిన ఆంక్షలను క్రమంగా సడలించడం తయారీ రంగానికి ఊతం ఇస్తోంది. అయితే ముడి పదార్ధాల ధరలు ఐదు నెలల గరిష్టానికి చేరాయి. పెరిగిన ఇంధన, రవాణా ధరలు దీనికి కారణం. ముడి పదార్థాల ధరలు పెరిగినప్పటికీ, ఉత్పత్తి ధరల పెరుగుదల్లో మాత్రం అంత వేగం లేకపోవడం గమనార్హం. వృద్ధికి ఊతం అందించే క్రమంలో అక్టోబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య జరిగే ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశాల సందర్భంగా ఆర్బీఐ పరపతి విధాన కమిటీ రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు అంచనావేస్తున్నాయి. -
కొత్త కోర్సులు.. రూ.లక్షల్లో జీతాలు
సాక్షి, అమరావతి: నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రపంచ పారిశ్రామిక రూపురేఖలను వేగంగా మార్చేస్తోంది. 2000 సంవత్సరం నుంచి మొదలైన ఇండస్ట్రీ–4 టెక్నాలజీ విప్లవంతో ఈ రంగంలో సరికొత్త ఉపాధి అవకాశాలు వచ్చి చేరుతున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, వర్చువల్ రియాల్టీ, బ్లాక్‌చైన్, ఫుల్‌స్టాక్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇలా అనేక కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావడం వల్ల పరిశ్రమల రూపురేఖలే మారిపోతున్నాయి. కానీ.. ఈ తరహా సాంకేతికను అందిపుచ్చుకున్న నిపుణులు అందుబాటులో లేకపోవడంతో ఆ పరిశ్రమ నిపుణుల కొరత ఎదుర్కొంటోంది. భారీగా ఉద్యోగాలు వచ్చే రెండేళ్లలో ఇండస్ట్రీ–4 టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా 13.30 కోట్ల ఉద్యోగాలు వస్తాయని వరల్డ్ ఎకనామిక్ ఫోర్ అంచనా వేసిందంటే ఈ కోర్సులకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి వివిధ కంపెనీలు ఆకర్షణీయమైన జీతాలతో ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. బ్లాక్ చైన్, ఐవోటీ, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి ఇండియాలోనే రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ప్రారంభ వేతనం లభిస్తోంది. అదే ఫుల్‌స్టాక్ వంటి అప్లికేషన్ డెవలప్మెంట్ కోర్సులను నేర్చుకుంటే అమెరికా వంటి దేశాల్లో ప్రారంభ వేతనం రూ.50 లక్షలపైనే ఉంటోంది. వివిధ సంస్థలతో ఒప్పందాలు లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఇండస్ట్రీ–4 టెక్నాలజీలో అవకాశాలను రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ టెక్నాలజీలకు సంబంధించిన కోర్సులను అందించే విధంగా వివిధ సంస్థలతో ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ (అపిటా) ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఆర్ అండ్ వీఆర్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవిధంగా బ్లాక్‌బక్ ఇంజనీరింగ్ లిమిటెడ్, ఏ–ప్లస్ అసోసియేట్స్, ట్వంటీ ఫస్ట్ సెంచురీ సాఫ్ట్వేర్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఐవోటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,సైబర్ సెక్యూరిటీ, వర్చువల్ రియాల్టీ, బ్లాక్‌చైన్, ఫుల్‌స్టాక్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీల్లో నేరుగా శిక్షణ ఇచ్చి అనంతరం ఉపాధి కల్పించే విధంగా ఐబీఎం, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి సంస్థలతో చర్చలు జరుపుతోంది. అపిటా కాకుండా ఉడేమీ కోర్సెరా, ఐబీ హబ్స్, నెక్స్ట్ వేవ్ వంటి సంస్థలు ఆన్లైన్ ద్వారా ఈ కోర్సులను అందిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రూ.20 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ఇండస్ట్రీ–4 టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) ఇండస్ట్రీ–4 సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీని ఏర్పాటు చేస్తోంది. సుమారు రూ.20 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే ఇండస్ట్రీ–4 టెక్నాలజీకి విశాఖ వేదికగా మారనుంది. ఈ కోర్సులకు అధిక డిమాండ్ ఇండస్ట్రీ–4 టెక్నాలజీ కోర్సులకు అధిక డిమాండ్ ఉంది. ఇంటర్మీడియెట్ పూర్తికాగానే ఈ కోర్సులు చేస్తే డిగ్రీ కాగానే క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా రూ.లక్షల్లో జీతాలతో ఉద్యోగాల్లో చేరొచ్చు. రానున్న రెండేళ్లలో సైబర్ సెక్యూరిటీలో 30 లక్షలు, ఐవోటీలో 1.50 కోట్ల ఉద్యోగాలు వస్తాయని అంచనా. బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉద్యోగాల డిమాండ్ 517 శాతం పెరుగుతుందని అంచనా. ఇంజనీరింగ్‌తో పాటు ఈ కోర్సులను పూర్తి చేయడం ద్వారా మంచి ఉపాధి లభిస్తుంది. – రాహుల్ అత్తులూరి, సీఈవో, నెక్ట్స్ వేవ్ అపిటా ద్వారా శిక్షణ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న ఇండస్ట్రీ–4 టెక్నాలజీ కోర్సులను ఇంజనీరింగ్ విద్యార్థులకు అందుబాటులోకి తెస్తున్నాం. ఇంజనీరింగ్ చేస్తూనే ఈ కోర్సులను పూర్తి చేసేలా వివిధ సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఆర్ అండ్ వీఆర్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చాం. త్వరలో బ్లాక్‌చైన్ టెక్నాలజీని కూడా తెస్తున్నాం. – అనిల్‌కుమార్ తెంటు, సీఈవో, అపిటా -
వేస్ట్ సిరామిక్స్కు దశ ‘దిశ’
పగిలిపోయిన సింక్‌ను ఏం చేస్తాం.. పనికిరాదంటూ పక్కన పడేస్తాం. ఇలాగే, విరిగిన సిరామిక్ వస్తువులను, ఇతర శానిటరీ వ్యర్థాలు దేశమంతటా చాలా చోట్ల పడేసే ఉంటాయి. వాటిని తిరిగి ఉపయోగించి, వాడుకలోకి తీసుకువస్తే హస్తకళాభివృద్ధి జరుగుతుందని, పర్యావరణానికి అనర్థం తప్పుతుందని ఆలోచించి, అందుకు ఓ దిశను కనుక్కోవాలని, దేశీయ కⶠకు దశ కల్పించాలనుకుంది దిశారీ మాథుర్. జైపూర్ బ్లూ పాటరీ ఆర్ట్ నుంచి ప్రేరణ పొందిన దిశారీ సిరామిక్ వ్యర్థాలలో కొత్త అర్థాలను వెతుకుతూ ‘న్యూ బ్లూ పాటరీ’ పేరు తో ఆర్ట్‌లో ఓ వినూత్న ప్రక్రియను కొనసాగిస్తోంది. మట్టిని ఉపయోగిం^è కుండా చేసే టెక్నిక్స్ లో జైపూర్ బ్లూ పాటరీ ఒకటి. సంప్రదాయ అచ్చులను ఉపయోగించి అనేక సిరామిక్ వస్తువులను తయారు చేస్తారు. ఈ అందమైన హస్తకళను నేర్చుకున్న దిశారీ పనికిరాని సింకులు, టాయిలెట్, శానిటరీ వ్యర్థాలపై దృష్టి సారించింది. వాటిని ఉపయోగించి తిరిగి అందమైన కళాకృతులు తీసుకురావడానికి మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెటీరియల్ రీసెర్చి విభాగంతో కలిసి పనిచేసింది. ‘నా ఈ ప్రయత్నాల ద్వారా చేతివృత్తుల వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు రావాలనుకుంటున్నాను’ అంటారు దిశారీ. ఇన్నోవేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పేపర్‌పై వాస్తవిక ఆలోచనలను రూపుకట్టవచ్చని చిత్రకారిణిగా కళా రంగంలోకి ప్రవేశించిన దిశారీ జార్జియాలోని సవన్నా కాలేజీ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్‌లో ఇంటీరియర్ డిజైనర్‌గా డిగ్రీ పొందింది. అంతర్జాతీయంగా పేరొందిన దేశీ, విదేశీ ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ సంస్థలలో పనిచేసింది. మహమ్మారి సమయంలో లండన్‌లోని రాయల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ ఇంపీరియల్ కాలేజీ నుండి ఇన్నోవేషన్ డిజైన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. సంభాషణలతో కొత్త భవిష్యత్తు ‘ప్రపంచ హస్తకళలో భారతదేశం అతిపెద్దది. కానీ, ప్రపంచ హస్తకళల మార్కెట్ వాటాలో మనదేశ వాటా 2 శాతం మాత్రమే. దీనిని పెంచడానికి జైపూర్ బ్లూ పాటరీ హస్తకళలను అభివృద్ధి చేయడంలో కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాను’ అంటూ వివరించే దిశారీ న్యూ బ్లూ పాటరీ పేరుతో శానిటరీ వ్యర్థాల నుంచి సృష్టించే కళాకృతులకు మంచి డిమాండ్ ఉంది. వీటి నిర్మాణానికి బయోడిగ్రేడబుల్, సిరామిక్ వ్యర్థాలను ఉపయోగిస్తుంది. ‘నేను జైపూర్ బ్లూ పాటరీ క్రాఫ్ట్‌ను పూర్తిగా అధ్యయనం చేశాను. 300 మంది నవతరం చేతివృత్తుల వారు ఈ రోజుకూ ఈ కళను చాలా ఇష్టంగా నేర్చుకుంటున్నారు. హస్తకళలు జీవ నోపాధికి ప్రధానమైనవి. చేతివృత్తుల వారితో చేసిన సంభాషణలు కొత్త హస్తకళా భవిష్యత్తు కోసం, కొత్త రూపకల్పన విధానాన్ని తీసుకువచ్చేలా నన్ను ప్రేరేపించాయి’ అంటారీ యంగ్ ఇన్నోవేటర్. సిరామిక్ వ్యర్థాల నుంచి ఇంటి అలంకరణ వస్తువులే కాదు, కొత్తగా సిరామిక్ ఫర్నీచర్ కాన్సెప్ట్‌ను కూడా తీసుకువచ్చారు దిశారీ. ఇది ప్రపంచ మార్కెట్లో మన దేశీయ హస్తకళా నైపుణ్యాన్ని మరింత విస్తృతం చేస్తుందని ధీమాను వ్యక్తం చేస్తారామె. నేడు మనం నేర్చుకున్న విద్య ముందు తరాలకు మరింత మెరుగైన జీవనవిధానాన్ని అందించేలా ఉండాలని చెప్పే దిశారి ప్రతి పని, కళ ద్వారా భవిష్యత్తు పట్ల తన ప్రేమను తెలియజేస్తుంది. -
మేలో కోటిన్నర మంది ఉపాధికి గండి
సాక్షి, అమరావతి: సెకండ్ వేవ్‌తో ఒక్క మే నెలలోనే కోటిన్నర మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా లాక్డౌన్/కర్ఫ్యూ పరిస్థితులు కొనసాగుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి తాజా నివేదిక వెల్లడించింది. ఆర్థిక కార్యకలాపాలు మందగించడంతో దేశంలో నిరుద్యోగిత రికార్డు స్థాయికి చేరుతుండటంతో పాటు, అసంఘటిత రంగంలో ఉన్న వారి ఆదాయంలో కోత పడింది. దేశంలో అసంఘటిత రంగంలో ఉన్న 1.75 లక్షల కుటుంబాలను సీఎంఐఈ సర్వే చేసి ఈ నివేదికను వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న ఏప్రిల్, మే నెలల్లో దేశంలో ఉపాధి అవకాశాలు బాగా దెబ్బతిన్నాయి. ఏప్రిల్‌లో అసంఘటిత రంగంలో 39.08 కోట్ల మందికి ఉపాధి లభించగా, మేలో 37.55 కోట్ల మందికే ఉపాధి దక్కింది. ఉద్యోగిత 3.90 శాతం తగ్గడంతో కోటిన్నర మంది ఉపాధి కోల్పోయారు. జనవరి ఆఖరు నుంచి పట్టణాల్లో పెరుగుతూ వస్తున్న నిరుద్యోగిత.. మే 31 నాటికి రికార్డుస్థాయిలో 18 శాతానికి చేరుకుంది. -
ఇంటింటికీ రేషన్ తరహాలోనే..
సాక్షి, అమరావతి: ఇంటింటికీ రేషన్ బియ్యం, ఇతర సరుకుల పంపిణీ కార్యక్రమం ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన విధానంలోనే.. వివిధ కార్పొరేషన్ల సంక్షేమ పథకాల అమలుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిరుద్యోగ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఐడీసీ)ను తిరిగి క్రియాశీలకం చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సందర్భంలో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే బియ్యం పంపిణీ కార్యక్రమం అమలు బాధ్యతను సైతం ఏపీఐడీసీకే అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ జీవో జారీ చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా 1960లో ఏపీఐడీసీ ఏర్పాటైంది. ఆ తర్వా త సంస్థ నామమాత్రంగా తయారైంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు 60 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుని వాటాగా నిరుద్యోగులకు వాహనాలను సమకూర్చి ఇంటింటికీ బియ్యం పంపిణీ కార్యక్రమం బాధ్యతలను వారికి అప్పగించిన విషయం తెలిసింది. ఈ తరహాలోనే ఇతర ప్రభుత్వ పథకాల అమలులో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు చేపట్టే బాధ్యతను ఏపీఐడీసీకే ప్రభుత్వం అప్పగించింది. సంబంధిత శాఖలు, ఏపీఐడీసీ కలిపి ఎప్పటికప్పుడు వేర్వేరుగా విధివిధానాలు ఖరారు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే సమయంలో కొత్తగా సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటులోనూ నిరుద్యోగ యువతకు తగిన తోడ్పాటు అందించే బాధ్యతను ప్రభుత్వం ఏపీఐడీసీకి అప్పగించింది. -
‘వేవ్’లో కొట్టుకుపోతున్న ఉపాధి
సాక్షి, అమరావతి: దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కరోనా సెకండ్ వేవ్ భారీగా గండికొడుతోంది. లక్షలాది మంది తమ ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయారు. ఒక్క ఏప్రిల్‌లోనే 70.35 లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోయారని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానవిు(సీఎంఐఈ) నివేదిక వెల్లడించింది. దీంతో ఏప్రిల్‌లో దేశంలో నిరుద్యోగిత 8 శాతానికి చేరుకుంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్/కర్ఫ్యూ నిబంధనలతో ఏప్రిల్‌లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడంతో ఈ పరిస్థితి తలెత్తిందని సీఎంఐఈ నివేదిక పేర్కొంది. ఆ నివేదికలోని ప్రధానాంశాలు.. ► దేశంలో ఉపాధి కార్యకలాపాల్లో కార్మికుల భాగస్వామ్యం ఏప్రిల్‌లో 39.98శాతానికి తగ్గిపోయింది. గతేడాది లాక్డౌన్ ఎత్తేశాక దేశంలో కార్మికుల భాగస్వామ్యం ఇంత ఎక్కువగా తగ్గడం ఇదే తొలిసారి. ► ఈ ఏడాది మార్చిలో 6.80 శాతంగా ఉన్న నిరుద్యోగిత ఏప్రిల్‌లో 8 శాతానికి పెరిగింది. ► ఏప్రిల్‌లో దేశంలో 70.35 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ► వీరిలో ఏకంగా 60లక్షల మంది వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నవారే కావడం గమనార్హం. ఆయా రంగాల్లో మార్చిలో 12 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించగా, ఏప్రిల్‌లో 11.40 కోట్ల మందికే ఉపాధి అవకాశాలు లభించాయి. ► వ్యాపార రంగంలో రోజువారి కూలీలు 20 వేల మంది ఉపాధి కోల్పోయారు. ► ఉద్యోగులు 3.40 లక్షల మంది తమ జాబ్‌లను కోల్పోయారు. మొత్తంమీద కరోనాతో ఏడాది కాలంగా 1.26 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు. 2020 మార్చిలో దేశంలో 8.59 కోట్ల మంది ఉద్యోగులుండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 7.33 కోట్లమందే ఉన్నారు. ఉద్యోగాలు కోల్పోయినవారిలో పట్టణ ప్రాంతాలకు చెందినవారు 68 శాతం, గ్రామీణ ప్రాంతాలవారు 32 శాతం మంది ఉన్నారు. -
వణికిస్తున్న నిరుద్యోగ భూతం!
సాక్షి, హైదరాబాద్: దేశంలో నిరుద్యోగం క్రమక్రమంగా పెరుగుతోంది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి మరింత పెరుగుతున్న ఈ తరుణంలో ఇది మరింత ఆందోళనకు దారితీస్తోంది. పట్టణాల్లోని సంప్రదాయ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కోత, వ్యవసాయరంగంలో ఉపాధి శాచురేషన్ పాయింట్‌కు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా నిరుద్యోగ శాతం పెరుగుదలకు కారణమవుతోంది. జూలైలో 7.43 శాతమున్న నిరుద్యోగ శాతం కాస్తా ఆగస్టు చివరినాటికి మొత్తంగా 8.35 శాతానికి చేరింది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ భూ తం మరింత ఎక్కువగా భయపెడుతోంది. ఇటు పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో కొంత తక్కువగానే నిరుద్యోగమున్నా అక్కడా మెల్లమెల్లగా పెరుగుతోంది. ప్రస్తుతం ఆగస్టులో పట్టణ ప్రాంతాల్లో 9.83 శాతం, గ్రామాల్లో 7.65 శాతం నిరుద్యోగం రికార్డయింది. అదే జూలై నెలలో పట్టణాల్లో 9.15 శాతంగా, గ్రామాల్లో 6.66 శాతంగా ఉంది. మరీ ముఖ్యంగా నగరాల్లో ప్రతీ పది మందిలో ఒకరికి ఉద్యోగం, ఉపాధి అవకాశాలు దొరకడం లేదని తెలుస్తోంది. ఈనెలా అంతేనా..? ఇక ఈ నెల (సెప్టెంబర్) లోనూ వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగ శాతం ఇదే విధంగా కొనసాగడంతో పాటు ఆగస్టుతో పోల్చితే స్వల్పంగా పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అదీగాకుండా కరోనా వైరస్ దేశంలోకి అడుగుపెట్టడానికి ముందు జనవరిలో 7.76 శాతం, ఫిబ్రవరిలో 7.22 శాతమున్న నిరుద్యోగం కంటే ఇప్పుడు ఎక్కువగా ఉండటం, అది క్రమక్రమంగా పెరుగుతుండటం మరింత ఆందోళనకు కారణమవుతోంది. కేంద్రం కఠినమైన లాక్డౌన్ నిబంధనల తర్వాత ఆగస్టు నెలలో వివిధ వాణిజ్య, వ్యాపార ఇతర ఆర్థిక కార్యకలాపాలకు అనుమతినిచ్చినా కూడా నిరుద్యోగ శాతం తగ్గకపోవడం ఆందోళనకరమేనని పలువురు ఆర్థికవేత్తలు సైతం అంగీకరిస్తున్నారు. దేశంలోని నెలవారీ నిరుద్యోగ శాతానికి సంబంధించిన వివరాలను సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా అధ్యయనంలో వెల్లడించింది. కోవిడ్ పరిస్థితుల్లో తలెత్తిన ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాల కారణంగా వివిధ రాష్ట్రాల్లోని సంప్రదాయ, వ్యవస్థీకృత రంగాల్లో (ఫార్మల్ సెక్టార్) ఉద్యోగ, ఉపాధి తగ్గిపోవడమే దీనికి కారణమని భావిస్తున్నారు. హరియాణాలో అత్యధికంగా 33.5 శాతం నిరుద్యోగం నమోదు కాగా, కర్ణాటకలో అత్యల్పంగా 0.5 శాతమే రికార్డయింది. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 5.8 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 7 శాతం నిరుద్యోగమున్నట్టుగా సీఎంఐఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్కువ శాతం నిరుద్యోగమున్న రాష్ట్రాలు.. ► హరియాణా–33.5 శాతం ► త్రిపుర–27.9 శాతం ► రాజస్తాన్–17.5 శాతం ► గోవా–16.2 శాతం ► హిమాచల్‌ప్రదేశ్–15.8 శాతం ► పశ్చిమబెంగాల్–14.9 శాతం ► ఉత్తరాఖండ్–14.3 శాతం ► ఢిల్లీ–13.8 శాతం ► బిహార్–13.4 శాతం ► సిక్కిం–12.5 శాతం తక్కువ శాతం నిరుద్యోగమున్న రాష్ట్రాలు.. ► కర్ణాటక–0.5 శాతం ► ఒడిశా–1.4 శాతం ► గుజరాత్–1.9 శాతం ► తమిళనాడు–2.6 శాతం ► మధ్యప్రదేశ్–4.7 శాతం ► అస్సాం–5.5 శాతం ► తెలంగాణ–5.8 శాతం ► యూపీ–5.8 శాతం ► మహారాష్ట్ర–6.2 శాతం ► ఆంధ్రప్రదేశ్–7.0 శాతం -
‘అన్‌లాక్’తో ఇ–కామర్స్ టేకాఫ్
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ప్రభుత్వం క్రమంగా సడలిస్తూ అన్‌లాక్ చేస్తున్న నేపథ్యంలో ఇ–కామర్స్ వ్యాపారం పుంజుకుంటోంది. షాపింగ్ కోసం బైటికెళ్లడాన్ని తగ్గించుకుంటూ ఆన్లైన్ మాధ్యమానికి వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తుండటం ఇందుకు తోడ్పడుతోంది. ఇక, పెరుగుతున్న వ్యాపారంతో పాటు ఇ–కామర్స్ విభాగంలో కొత్తగా మరింత మందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దేశంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత ఇ–కామర్స్ వ్యాపారం దాదాపు 80 శాతం పెరిగింది. దాదాపు 10 కోట్లమంది క్రియాశీలంగా ఉండే వినియోగదారులతో ఇ–కామర్స్ రంగం అంతకంతకూ వృద్ధి చెందుతోందని నివేదిక పేర్కొంది. లాక్డౌన్ ముందటి పరిస్థితి కంటే కూడా ప్రస్తుతం ఇ–కామర్స్ వ్యాపారం ఎక్కువగా ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అన్ని రకాల వస్తువులను విక్రయించే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఇ–కామర్స్ సంస్థలే కాదు... కిరాణా సరుకులు, వ్యాయామ పరికరాలు వంటి ప్రత్యేక కేటగిరీ వస్తువులను విక్రయించే సంస్థల వ్యాపారం కూడా జోరందుకుంది. ఐఏఎంఏఐ నివేదిక ప్రకారం దేశంలో ఇ–కామర్స్ వ్యాపారం ఇలా ఉంది... లాక్డౌన్ రోజుల్లో 80 శాతం వ్యాపారం డౌన్ దేశంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలులో ఉన్న ఏప్రిల్, మేలో ప్రభుత్వం కేవలం నిత్యావసర వస్తువుల విక్రయానికే అనుమతించింది. దాంతో ఇ–కామర్స్ వ్యాపారం దాదాపు 80 శాతం తగ్గిపోయింది. మార్చి చివరి వారం నుంచి జూన్ మొదటివారం వరకూ దేశీయంగా ఇ–కామర్స్ సంస్థలు దాదాపు రూ.7,520 కోట్ల వ్యాపారాన్ని కోల్పోయారని అంచనా. ఉపాధికీ ఊతం.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇతర రంగాల్లో ఉద్యోగాల్లో కోత విధిస్తుంటే ఇ–కామర్స్ రంగం కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా వినియోగదారులకు సకాలంలో సరఫరా చేసేందుకు ఇ–కామర్స్ సంస్థలు కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. అమెజాన్ ఇండియా తమ పంపిణీ వ్యవస్థలో కొత్తగా 50వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అటు బిగ్ బాస్కెట్ ఇటీవల కొత్తగా 12వేలమంది సిబ్బందిని నియమించుకుంది. గ్రోఫర్స్ సంస్థ ఇప్పటికే కొత్తగా 2,500 మందిని రిక్రూట్ చేసుకోగా ...మరో 5వేలమంది ఉద్యోగులను త్వరలో తీసుకుంటామని చెప్పింది. అటు ఇ–కామ్ ఎక్స్‌ప్రెస్ సంస్థ ఇటీవల కొత్తగా 7,500 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. అన్‌లాక్‌తో జోరందుకున్న వ్యాపారం మే మూడో వారం నుంచి లాక్డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తున్న ప్రభుత్వం జూన్ నుంచి మరింత వెసులుబాటు కల్పించడం ఇ–కామర్స్ సంస్థలకు అనుకూలంగా మారింది. ఇ–కామర్స్ సంస్థలు దేశంలోని దాదాపు 19వేల పిన్‌కోడ్ ప్రాంతాల్లో ప్రస్తుతం సరుకులు అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో రోజుకు 30లక్షల వరకు షిప్మెంట్లను డెలివరీ చేస్తున్నాయి. మరికొంతకాలం పాటు వినియోగదారులు షాపింగ్ కోసం ఎక్కువగా బయటకు వెళ్లే పరిస్థితి లేనందున రాబోయే రెండు నెలల్లో ఈ వ్యాపారం మరింత పెరుగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సంస్థలవారీగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఉత్పత్తుల విషయం చూస్తే.. అమెజాన్ ఇండియా పోర్టల్‌లో ప్రధానంగా ఉద్యోగుల ‘వర్క్ ఫ్రం హోం’, విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు సంబంధించిన వస్తువుల విక్రయం విపరీతంగా పెరిగింది. మొత్తం మీద అమెజాన్ వ్యాపారం 50 శాతం పెరిగింది. ఇక, మరో దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వ్యాపారం 90 శాతం ఎగిసింది. ఈ పోర్టల్ ద్వారా వ్యాయామ పరికరాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, గృహ అలంకరణ వస్తువుల విక్రయాలు గణనీయంగా ఉంటున్నాయి. -
మే నెలలో 61 శాతం పడిపోయిన నియామకాలు
ముంబై: దేశంలో ఉపాధి అవకాశాలను కరోనా దెబ్బతీసింది. ముఖ్యంగా మే నెలలో లాక్డౌన్ కారణంగా నియామకాలు 61 శాతం పడిపోయాయి. ఏప్రిల్ తర్వాత మే నెలలోనూ ఇదే పరిస్థితులు కొనసాగాయి. 2019 మే నెలలో 2,346 నియామకాలు చోటు చేసుకోగా.. ఈ ఏడాది మే నెలలో 910 నియామకాలు నమోదయినట్టు నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ తెలిపింది. నౌకరీ డాట్ కామ్ పోర్టల్‌లో ఉద్యోగ నోటిఫికేషన్ల నమోదు ఆధారంగా ఈ సంస్థ నెలవారీగా నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ గణాంకాలను విడుదల చేస్తుంటుంది. మే నెలలో హోటల్ రంగంలో 91%, రెస్టారెంట్ రంగంలో 87%, ఆటో, ఆటో విడిభాగాల రంగంలో 76%, బీఎఫ్ఎస్ఐ విభాగంలో 70% మేర నూతన నియామకాల్లో క్షీణత కనిపించింది. కోల్‌కతా నగరంలో 68 శాతం, ఢిల్లీలో 67 శాతం, ముంబైలో 67 శాతం మేర నూతన ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. ప్రారంభ స్థాయి ఉద్యోగ అవకాశాల్లో 66 శాతం తగ్గుదల నమోదైంది. దేశ ఉద్యోగ మార్కెట్లో నిరాశావహ పరిస్థితులు నెలకొన్నాయని.. వచ్చే మూడు నెలల కాలంలో (జూలై–ఆగస్ట్ త్రైమాసికంలో) మరింత మంది ఉద్యోగులను నియమించుకునే విషయంలో 5 శాతం కంపెనీలే సానుకూలంగా ఉన్నట్టు మ్యాన్‌పవర్ గ్రూపు ఎంప్లాయింట్‌మెంట్ అవుట్‌లుక్ సర్వే స్పష్టం చేసింది. -
లాక్‌డౌన్‌లోనూ ఉపాధికి భరోసా
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు అమాంతంగా పెరుగుతోంది. కానీ ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు మెరుగైన రీతిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. జాతీయ నిరుద్యోగిత రేటు కంటే ఆ రాష్ట్రాల్లో నిరుద్యోగిత రేటు తక్కువగా ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. మే చివరి వారంలో దేశంలో నిరుద్యోగ సమస్యపై సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఇటీవల నివేదిక విడుదల చేసింది. ప్రధానమైన 20 రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్యపై విశ్లేషించింది. 59.20 శాతం నిరుద్యోగిత రేటుతో జార్ఖండ్ మొదటి స్థానంలో ఉండగా, 9.60 శాతం నిరుద్యోగిత రేటుతో ఒడిశా చివరి స్థానంలో ఉంది. సీఎంఐఈ నివేదికలోని ప్రధాన అంశాలు... ► దేశం మొత్తం మీద ఫిబ్రవరిలో నిరుద్యోగిత రేటు 7.40 శాతం ఉండగా, మే చివరి వారానికి 24.30 శాతానికి పెరిగింది. ► ఏపీ, ఒడిశా, రాజస్తాన్, మహారాష్ట్ర, అసోం, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్లో నిరుద్యోగిత రేటు 20% కంటే తక్కువగా ఉంది. ► హరియాణ, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో నిరుద్యోగిత రేటు 20 శాతం నుంచి 40 శాతం మధ్యలో ఉంది. ► లాక్డౌన్ వల్ల జార్ఖండ్, బిహార్, ఢిల్లీలలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ప్రబలింది. జార్ఖండ్‌లో 59.20 శాతం, బిహార్‌లో 46.2 శాతం, ఢిల్లీలో 44.90 శాతం నిరుద్యోగిత రేటు నమోదు అయ్యింది. ► ఏపీలో పేదలకు ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి పనులు కల్పించింది. ఉపాధి పనుల కల్పనలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. -
ఉపాధికి లాక్డౌన్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న సుదీర్ఘ లాక్డౌన్ ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగానే కనిపిస్తోంది. కోవిడ్ మహమ్మారి ఉధృతి, వైరస్ విస్తరణ ఒకవైపు రోజురోజుకూ పెరుగుతుండగా, గత 68 రోజులుగా కొనసాగిన లాక్డౌన్ వల్ల తీవ్రంగా ప్రభావితమైన వాటిలో ఉద్యోగ, ఉపాధి రంగాలు ముందువరుసలో నిలుస్తున్నాయి. వలస, అసంఘటిత కార్మికులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా వివిధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న పేదలు, కూలీలు, ఇతర వర్గాలకు చెందిన చిరుద్యోగులు, ఇతరుల ఉపాధి అవకాశాలపై కోలుకోలేని దెబ్బ పడిందనే విషయం పలు అధ్యయనాలు, పరిశీలనలో వెల్లడైంది. తాజాగా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నివేదికలో అనేక విషయాలు ప్రస్తుత వాస్తవ పరిస్థితులను కళ్లెదుట నిలబెడుతున్నాయి. మే 24తో ముగిసిన వారాంతం నాటికి దేశ నిరుద్యోగ శాతం 24.3 శాతానికి చేరుకున్నట్టుగా ఇందులో వెల్లడైంది. లాక్డౌన్ విధింపునకు ముందు మార్చి చివరినాటికి 8.8 శాతమున్న నిరుద్యోగం, రెండునెలలకు పైగా లాక్డౌన్ కారణంగా అమాంతం మూడురెట్లు పెరిగిపోయింది. మే నెలలో కొంత వృద్ధి.. ఇదే సమయంలో దేశంలోని ‘ఎంప్లాయిమెంట్ రేట్’ ఏప్రిల్‌లో ఉన్న 27 శాతం నుంచి మేలో 29 శాతానికి పెరిగినట్టు సీఎంఐఈ తెలిపింది. ఏప్రిల్‌లో 12.2 కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోగా, ఎంప్లాయిమెంట్ రేట్లో 2 శాతం వృద్ధి కారణంగా దాదాపు రెండుకోట్ల మందికి ఉపాధి లభించడంతో ఉపాధి కల్పనలో మంచి పురోగతి సాధించినట్టుగానే భావించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ కారణంగా ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారి సంఖ్య మేలో 10.2 కోట్ల మందికి చేరుకోగా, ఒక నెలలో 2 కోట్ల మందికి ఉపాధి లభించడం కొంత సానుకూల పరిణామమే అని తెలిపింది. అయితే దానికి ఐదింతలుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారి సంఖ్య (10.2 కోట్లు) ఉండడం సవాళ్లతో కూడుకున్నదేనని ఈ నివేదిక అభిప్రాయ పడింది. సాధారణ పరిస్థితుల్లో సీఎంఐఈ విభిన్నరూపాలు, పద్ధతుల్లో నెలకు 1.17 లక్షల మందిని స్వయంగా కలుసుకుని ఇంటర్వ్యూల ద్వారా నిరుద్యోగం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై సర్వేలు నిర్వహిస్తుంటుంది. లాక్డౌన్ విధించాక మాత్రం 12 వేల మందిని ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేయడంతో పాటు ఇతరుల నుంచి ఫోన్ సర్వే ద్వారా అభిప్రాయాలను సేకరిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతుండడంతో పాటు లాక్డౌన్ కారణంగా ఏర్పడిన అనిశ్చితి, ప్రస్తుతముంటున్న ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు కొరవడి సొంత ప్రాంతాలకు వెళ్లే వలస కార్మికుల సంఖ్య భారీగా పెరిగినట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌లో తీవ్ర ప్రభావం... లాక్డౌన్ కొనసాగింపు, తదితర కారణాలతో ఏప్రిల్‌లో నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగినట్టుగా సీఎంఐఈ అంచనా వేసింది. లాక్‌డౌన్‌కు ముందే నిరుద్యోగశాతం కొంచెం కొంచెంగా పెరుగుతున్నా, ప్రపంచస్థాయి సరళితో పోల్చి చూస్తే భారత్‌లో ఏప్రిల్ నెలలో ఇది ఒక్కసారిగా పెరిగినట్టు తన అధ్యయనంలో ఈ సంస్థ నిర్ధారించింది. జనవరిలో 3.6 శాతమున్న నిరుద్యోగం, ఏప్రిల్ నాటికి 14.7 శాతానికి పెరిగినట్టుగా జేఎన్‌యూ ప్రొఫెసర్ బిశ్వజిత్‌ధర్ తెలిపారు. వలస కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లడం వల్ల పరిశ్రమలకు నష్టం వాటిల్లడంతో పాటు గ్రామాల్లో వ్యవసాయ పనులకు పోటీ పెరిగి ఉపాధి తగ్గే అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. 2030 ఏళ్ల వారే ఎక్కువ... లాక్డౌన్ కారణంగా ఒక్క ఏప్రిల్ నెలలోనే 20–30 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 2.7 కోట్ల మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయినట్టుగా ఇటీవల వెల్లడించిన నివేదికలో సీఎంఐఈ స్పష్టం చేసింది. కన్జూ్జమర్ పిరమిడ్స్ హౌస్‌హోల్డ్స్ సర్వేలో 20–24 ఏళ్ల మధ్యనున్న యువకులే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారిలో 11 శాతమున్నట్టు, 2019–20లో మొత్తం ఉద్యోగాల్లో ఉన్న వారిలో ఈ యువకులే 8.5 శాతం ఉన్నట్టుగా వెల్లడైంది. 2019– 20లో 3.42 కోట్ల మంది యువతీ యువకులు పనిచేస్తుండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో వారి సంఖ్య 2.09 కోట్లుగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది. వీరితో పాటు 25–29 ఏళ్ల మధ్యలోనున్న 1.4 కోట్ల మంది అదనంగా ఉద్యోగాలు కోల్పోయినట్టుగా స్పష్టమైంది. ఇరవయ్యవ పడిలో ఉన్న 2.7 కోట్ల మంది యువకులు ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఏర్పడే ప్రభావం సుదీర్ఘకాలం ఉంటుందని సీఎంఐఈ తెలిపింది. ఏప్రిల్‌లో 30వ పడిలో ఉన్న పురుషులు, స్త్రీలు 3.3 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోగా, వారిలో 86 శాతం మంది పురుషులే ఉన్నట్టుగా సర్వే వెల్లడించింది. ఆరేళ్లు వెనక్కి! కరోనా ప్రభావంతో గత నెలలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు తక్కువ ఆదాయం వచ్చింది. గత నెల 6న లాక్డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో దాదాపు 20 రోజుల పాటు జరిగిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియతో రూ.207 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. గతంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రాబడులను నెలలవారీగా పరిశీలిస్తే ఆరేళ్ల వెనక్కి ఆదాయం వెళ్లిపోయిందని అర్థమవుతోంది. 2014 అక్టోబర్‌లో రూ.179.93 కోట్ల ఆదాయం లభించింది. ఆ తర్వాత ఇంత తక్కువ ఆదాయం రావడం ఈ ఏడాది మేలోనే కావడం గమనార్హం. మొత్తం కలిపి రూ.220 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రెండు నెలలు గడిచిపోగా, స్టాంపుల శాఖకు ఇప్పటివరకు రూ.220 కోట్ల ఆదాయమే వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమల్లో ఉండటంలో ఏప్రిల్‌లో రూ.12 కోట్ల ఆదాయమే వచ్చింది. సాధారణంగా ప్రతి నెలలో రూ.500 కోట్లకుపైగా ఆదాయం వస్తుండగా, ఏప్రిల్‌లో రూ.12 కోట్లకే పరిమితమైంది. రిజిస్ట్రేషన్ లావాదేవీలు కూడా అత్యల్పంగా జరిగాయి. ప్రతి నెలలో లక్షన్నర వరకు రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరుగుతుండగా, ఏప్రిల్‌లో 4,595 లావాదేవీలు మాత్రమే జరిగాయి. ఇక, మేలో జరిగిన 75,129 లావాదేవీలకు గాను రూ.207.73 కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు 20 రోజులు మాత్రమే రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు జరగ్గా సగటున రోజుకు రూ.10 కోట్ల మేర వచ్చింది. సాధారణ పరిస్థితుల్లో రోజుకు రూ.20 కోట్ల వరకు ఆదాయం వచ్చేదని, ఇప్పుడు అందులో సగం వరకు ఆదాయం వచ్చిందని, లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా ఈ మేర ఆదాయం రావడం మంచి పరిణామమేనని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. జూన్ లో పరిస్థితిలో కొంత మార్పు వస్తుందని, జూలై చివరి నాటికి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశముందని అంచనా వేస్తున్నారు. -
ఉపాధికి ఎసరు!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి, సుదీర్ఘ లాక్డౌన్ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు లేబర్ మార్కెట్‌పై తీవ్రస్థాయిలో పడింది. లాక్డౌన్ సందర్భంగా వివిధ వర్గాల జీవనోపాధి ఊ హించని స్థాయిలో చిన్నాభిన్నమైనట్టు అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ తాజా సర్వేలో వెల్లడైంది. ఈ ప్రభావం నుంచి చాలా నెమ్మదిగా కోలుకోవడంతో పాటు ఈ ప్రక్రియ బాధాకరంగా ఉంటుం దని అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతం తీవ్రంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో తక్షణ సహాయ కార్యక్రమాలు లేవంది. లాక్డౌన్ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ అనియత, (ఇన్ఫార్మల్ సెక్టార్) తది తర రంగాల్లోని మూడింట రెండొంతుల మంది (67%) ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయినట్లు ఇందులో వెల్లడైంది. ఇది నగర, పట్టణ ప్రాంతాల్లో 80%గా, గ్రామీణ ప్రాంతాల్లో 57%గా ఉందని తేలింది. పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి లేదా ఇతర రూపాల్లో పనిచేస్తున్న ప్రతీ పది మందిలో 8 మంది (80%), గ్రామీణ ప్రాంతాల్లో పది మం దిలో ఆరుగురు (57%) తమ ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయినట్లు ఈ పరిశీలనలో వెల్లడైంది. సర్వే చేశారిలా..: ఏప్రిల్ 13 నుంచి మే 9 వరకు బెంగళూరు అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ‘సెంటర్ ఫర్ సస్టెయినబుల్ ఎంప్లాయిమెంట్’ఆధ్వర్యంలో పది పౌర సేవా, సా మాజిక సంస్థలతో కలసి బిహార్, ఢిల్లీ, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర (పుణే), ఒడిశా, రాజస్తాన్. పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 4 వేల మంది పై సర్వే నిర్వహించింది. ఆగాఖాన్ రూరల్ సపోర్ట్ ప్రోగ్రా మ్, సెంటర్ ఫర్ అడ్వకసీ అండ్ రీసెర్చీ, గౌరి మీడియా ట్ర స్ట్, పశ్చిమ్ బంగా ఖేత్ మజ్దూర్ సంఘ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్, ప్రధాన్, సమాలోచన, సృజన్, వా గ్దారా సంస్థలు సర్వేలో పాలుపంచుకున్నాయి. 2020 ఫిబ్రవరిలో స్వయం ఉపాధి, తదితర రంగాల్లోని వారు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం, ఉపాధి, వాటి ద్వారా సంపాదించే ఆదాయంతో, లాక్డౌన్ విధించాక ఉపాధి లేదా ఉద్యోగం, దాని ద్వారా పొందే ఆదాయంతో పోల్చి చూసినపుడు ఆయా అంశాలు ఈ సర్వేలో వెల్లడైనట్టు అజీమ్ ప్రేమ్‌జీ వర్సిటీ తెలిపింది. వివిధ రంగాలకు చెందిన వారిపై ఈ అధ్యయనం నిర్వహించారు. సర్వేలో వెల్లడైన కీలక అంశాలు.. ► వ్యవసాయేతర స్వయం ఉపాధి కార్మికులు ఇంకా ఉపాధిని పొందుతున్నా వారు సగటున వారం రోజులకు సంపాదించే ఆదాయం రూ.2,240 నుంచి రూ.218కు (90 శాతం తగ్గుదల) తగ్గింది. ► క్యాజువల్ కార్మికులు ఇంకా ఉపాధి పొందుతున్నా, వారి సగటు వారం ఆదాయం ఫిబ్రవరిలో రూ.940 నుంచి లాక్డౌన్లో రూ.495 (దాదాపు సగానికి) పడిపోయింది. ► నెలవారీ వేతనం పొందే కార్మికుల్లో 51 శాతం మందికి వేతనంలో తగ్గుదల లేదా అసలు జీతం లభించకపోవడమో జరిగింది. ► 45 శాతం కుటుంబాలు తమకు వారానికి సరిపడా నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు అవసరమైన నగదు అందుబాటులో లేదని వెల్లడించాయి. ► 74 శాతం కుటుంబాలు గతంలో కంటే తక్కువ ఆహారం తీసుకుంటున్నాయి. ఈ సందర్భంగా చేసిన సూచనలు.. ► వచ్చే 6 నెలల పాటు ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత విస్తరించి, ఇచ్చే రేషన్‌ను పెంచడంతో పాటు రేషన్‌కార్డులతో సంబంధం లేకుండా ప్రభావిత పేద వర్గాలందరికీ సహాయం అందేలా చూడాలి. ► ఒక్కో కుటుంబానికి నెలకు రూ.7 వేల చొప్పున (రెండు నెలల పాటు) వారి ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాలి. ► ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచేందుకు పెద్దమొత్తంలో నగదు బదిలీలు చేయాలి. ► జాతీయ ఉపాధి హామీ పనులను (మనుషుల మధ్య దూరం పాటిస్తూ) వెంటనే పెంచాలి . ► జాతీయ ఉపాధి హామీ పథకం విస్తరణలో భాగంగా పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలి. యూనివర్సల్ బేసిక్ సర్వీసెస్‌లో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరముంది. -
విదేశాలకు వెళ్లే విద్యార్థులకు నాలుగేళ్ల డిగ్రీ హానర్స్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యకు దీటుగా సాధారణ డిగ్రీ కాలేజీల్లోనూ మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విద్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్న ఉన్నత విద్యా మండలి డిగ్రీలో బీఎస్సీ డాటా సైన్స్, బీకాం అనలిటిక్స్ కోర్సును ప్రవేశ పెట్టేందుకు ఇదివరకే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే విదేశాల్లో ఉద్యోగ, ఉపాధికి వెళ్లేవారికోసం, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి కోసం బీటెక్ తరహాలోనే నాలుగేళ్ల డిగ్రీ హానర్స్ కోర్సులను ప్రవేశ పెట్టాలని నిర్ణయానికి వచ్చింది. బీఎస్సీ డాటా సైన్స్ హానర్స్ (నాలుగేళ్ల కోర్సు), బీకాం అనలిటిక్స్ హానర్స్ (నాలుగేళ్ల కోర్సు) డిగ్రీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలకు బీటెక్ తరహాలో నాలుగేళ్ల డిగ్రీ చదివి ఉండాలన్న నిబంధన నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని యూనివర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో ఈ కోర్సులు అనుమతి పొందిలేవు. ఈ నేపథ్యంలో ఈ కోర్సులకు సిలబస్‌ను రూపొందించి, యూనివర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో ఆమోదం తీసుకుని ప్రవేశ పెట్టేలా కసరత్తు చేస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ఆర్.రామచంద్రం నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఈనెల 14వ తేదీన కమిటీ సమావేశం జరగనుందని, అందులో సిలబస్, ఇతరత్రా విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ సిలబస్‌కు సంబంధించి, డిగ్రీ కాలేజీల్లో ఈ సిలబస్‌ను బోధించే అధ్యాపకులకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు టీసీఎస్ ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 21వ తేదీన టీసీఎస్‌తో తాము ఒప్పందం చేసుకోబోతున్నట్లు వివరించారు. ఈ కోర్సులను రాష్ట్రంలోని 50 వరకున్న అటానమస్ కాలేజీలతోపాటు, పలు ప్రభుత్వ కాలేజీలు, నాణ్యత ప్రమాణాలు పాటించే ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశ పెట్టేందుకు అనుమతిస్తామని వెల్లడించారు. ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. విద్యార్థులు మూడేళ్ల డిగ్రీ లేదా నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీలో తాము కోరుకున్న కోర్సును చదువుకునే వెసులుబాటు కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
ఉజ్వల భవితకు చిరునామా ‘సిపెట్’
సాక్షి, అమరావతి బ్యూరో: ప్లాస్టిక్.. దైనందిన జీవితంలో విడదీయలేని విధంగా పెనవేసుకుపోయిన పదార్థం. లోహయుగంలో ఇనుము మనిషి జీవనాన్ని నిర్దేశిస్తే, ఆధునిక యుగంలో ప్లాస్టిక్ మానవ మనుగడకు చుక్కానిలా మారింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఈ రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతమవుతున్నాయి. ప్లాస్టిక్ రంగంలో ఏటా 18 శాతం వృద్ధి రేటు నమోదవుతుండటమే దీనికి నిదర్శనం. ఈ రంగంలోని విస్తృత ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతకు శిక్షణ ఇవ్వడానికి విజయవాడ సమీపంలోని గన్నవరంలో ఉన్న ‘సిపెట్’ (సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ) సంస్థ కృషి చేస్తోంది. పదో తరగతి విద్యార్హత తోనే ఇందులో ప్రవేశం పొందవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ‘సిపెట్’ క్యాంపస్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ల్యాబ్, టూల్స్ విభాగం, 24 గంటలూ అందుబాటులో ఉండే అత్యాధునిక లైబ్రరీ ఉన్నాయి. నిష్ణాతులైన అధ్యాపకులతో ఇక్కడ శిక్షణ ఇస్తారు. దేశ విదేశాలకు చెందిన సంస్థలు క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తున్నాయి. నాణ్యమైన మానవ వనరులు అందించడానికే.. ‘సిపెట్’ సంస్థను 2015లో విజయవాడలో ప్రారంభించారు. ఈ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్, కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పటైంది. ‘ఐఎస్ఓ 9001: 2008 క్యూఎంఎస్ సర్టిఫైడ్, ఎన్ఏబీఎల్ అండ్ ఎన్ఏబీసీబీ’ గుర్తింపు పొందింది. ఇటీవల విజయవాడ శివారు గన్నవరంలోని అధునాతన భవనంలోకి దీన్ని మార్చారు. ప్లాస్టిక్ సంబంధిత పరిశ్రమలకు నాణ్యమైన మానవ వనరులను అందించటమే సిపెట్ లక్ష్యం. దీనికి సంబంధించి రానున్న నాలుగేళ్లలో దాదాపు 25 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు సిపెట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఐఎస్ఐ సర్టిఫికెట్‌కు సీపెట్ నివేదిక కీలకం సిపెట్‌లో అత్యాధునిక వసతులతో టూల్ సెక్షన్ ఉంది. ఆర్ఎండీ మౌల్డ్ విభాగంలో ప్రత్యేకంగా డిఫెన్స్, ఈసీఐఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ఉపయోగించే టూల్స్‌ని డిజైన్ చేస్తారు. ఎస్ఎస్ఐ విభాగం సూక్ష్మ, స్థూల, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతోపాటు భారీ పరిశ్రమలకు సాంకేతిక సహాయం అందిస్తుంది. ఇక్కడ ఐఎస్ఓ నెం. 17025/ఆర్/ఐఇసీ ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన ల్యాబ్ ఉంది. పరిశ్రమల ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్కు దక్కాలంటే ఈ ల్యాబ్‌లో పరీక్షలు జరిపి సిపెట్ ఇచ్చే నివేదికే కీలకం. ప్లాస్టిక్ పైపులను పరీక్షించే జర్మనీకి చెందిన ఐపీటీ 100 బార్ కెపాసిటీ అత్యాధునిక సాంకేతిక పరికరం ఇక్కడ ఉంది. ఇది ఒకేసారి 60 పైపులను పరీక్షించి ప్లాస్టిక్‌లో నాణ్యతను నిర్ధారిస్తుంది. ప్రముఖ దేవస్థానాల్లో అందించే లడ్డూ కవర్లకు సిపెట్ పరీక్షలు నిర్వహించి నివేదికలు అందజేస్తుంది. దేశవ్యాప్తంగా 24 సీపెట్ కేంద్రాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నారు. విజయవాడలోనూ ప్లాస్టిక్ ప్రాసెసింగ్, ఇంజక్షన్ మౌల్డింగ్, ఎక్స్ట్రాషన్, టూల్ రూమ్ అండ్ డిజైనింగ్ విభాగాల్లో వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల తరఫున యువతకు శిక్షణ ఇస్తున్నారు. విదేశాల్లోనూ ఉపాధి.. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులను దేశ, విదేశీ పరిశ్రమలు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసుకుంటాయి. ప్లాస్టిక్ రంగంలో పెట్టుబడులు పెట్టే ఔత్సాహికులు సైతం శిక్షణ పొంది సొంత పరిశ్రమలను స్థాపించుకోవచ్చు. పీపీటీ కోర్సు చేసిన విద్యార్థులకు విదేశాల్లో కనీస వేతనం రూ. 90 వేల వరకు లభిస్తుంది. డీపీఎంటీ చేసినవారికి రూ. 50 వేల వరకు జీతం లభిస్తుంది. పదో తరగతి అర్హత కలిగిన అభ్యర్థి సైతం ఆపరేటర్‌గా కనీసం రూ. 40 వేలు సంపాదించొచ్చు. ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు పుష్కలం సిపెట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ టెస్టింగ్ చదువుతున్నాను. ఈ కోర్సుకు మంచి భవిష్యత్ ఉంది. గల్ఫ్ దేశాలతో పాటు చైనా, జపాన్, దుబాయ్, సౌత్ కొరియాలలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. – వికాసింగ్, ఉత్తరప్రదేశ్ మౌల్డ్ శిక్షణతో అచ్చులు తయారీ నేను డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ కోర్సు చేస్తున్నాను. పదో తరగతి తరువాత సాంకేతిక రంగం బాగుంటుందని చేరాను. కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ ద్వారా మిషన్‌కు డిజైన్‌ను పంపిస్తాము. క్యాడ్ క్యాప్ సాప్ట్వేర్ ద్వారా ఏ పార్టు కావాలంటే ఆ పార్టు డిజైన్ చేయటం వీలవుతుంది. మిషన్ ద్వారా అచ్చులను తయారు చేసే ప్రక్రియ ఇది. మార్కెట్లో ఈ కోర్సు చేసిన వారికి మంచి డిమాండ్ ఉంది. – బాలం హరీష్, వీర వాసరం, పశ్చిమగోదావరి బోధన బాగుంది. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ కోర్సులో చేరాను. ఇక్కడ మాకు అర్థమయ్యే విధంగా అధ్యాపకులు భోధన చేస్తున్నారు. ల్యాబ్, లైబ్రరీలు బాగున్నాయి. ఉద్యోగాలు సాధనకు ఈ కోర్సు ఎంతో ఉపయోగపడుతుంది. – పినిశెట్టి గగన్సాయిరాజ్, విశాఖపట్నం ప్రతి ఒక్కరికీ ఉద్యోగం సిపెట్‌లో లాంగ్‌టర్మ్ కోర్సులు విద్యార్థుల జీవితాలకు బాటలు వేస్తున్నాయి. పీజీ కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఉపాధి కచ్చితంగా లభిస్తోంది. రూ. 12–24 వేల జీతాలు చదువుల కాలంలోనే అందుకుంటున్నారు. అనంతరం ఎంఎన్సీ కంపెనీలు వారికి రెగ్యులర్ ఉద్యోగాలు ఇస్తున్నాయి. క్వాలిటీ ప్లాస్టిక్‌ను రూపొందించటం, స్కిల్, టెక్నికల్, అకడమిక్, రీసెర్చి విద్యను అందించటం లక్ష్యం. ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకునే పారిశ్రామిక వేత్తలకు సిపెట్ పూర్తి సహకారం అందిస్తుంది. – కిరణ్‌కుమార్, డైరెక్టర్ అండ్ హెడ్, సిపెట్ -
పర్యాటక రంగం.. 50 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: పర్యాటక రంగం 2022 నాటికి 50 బిలియన్ డాలర్ల (రూ.3.55 లక్షల కోట్లు) ఆదాయ లక్ష్యాన్ని సాధించాలని నీతి ఆయోగ్ అమితాబ్ కాంత్ సూచించారు. ఈ రంగానికి వృద్ధి అవకాశాలు, ఉపాధి కల్పన అవకాశాలు అపారంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సీఐఐ 15వ వార్షిక పర్యాటక సదస్సు ఢిల్లీలో గురువారం జరిగింది. దీనికి కాంత్ హాజరై మాట్లాడారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ ఉపాధి అవకాశాలు కల్పించే సామర్థ్యం పర్యాటకానికి ఉందన్నారు. ‘‘2018లో భారత పర్యాటక రంగం 28.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీన్ని 2022 నాటికి 50 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లే లక్ష్యాన్ని పెట్టుకోవాలి’’అని ఆయన పేర్కొన్నారు. -
ఆ 3 రంగాలే కీలకం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భవిష్యత్తులో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పారిశ్రామిక పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. తెలంగాణ పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్, ఇతర ప్రభుత్వ పాలసీల మూలంగా గత ఐదేళ్లలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలివచ్చాయన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. టీఎస్ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 11,569 కంపెనీలకు అనుమతులు ఇవ్వగా, ఇందులో 80 శాతం కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయన్నారు. తద్వారా సుమారు 13 లక్షల మందికి ఉపాధి లభించిందని కేటీఆర్ వెల్లడించారు. ఆ మూడు రంగాలకు ప్రాధాన్యత రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమకు ఉన్న అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని టెక్స్టైల్ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేటీఆర్ వెల్లడించారు. దేశంలోనే అతిపెద్దదైన వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కులో కొరియా దిగ్గజ కంపెనీ యంగ్వాన్ భారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నదన్నా రు. మరోవైపు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో కూడా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయని, ఇటీవల బెంగళూరులో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం ప్రతినిధులతో నిర్వహించిన భేటీ తరహాలో వివిధ నగరాల్లో మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. వన్‌ప్లస్, స్కైవర్త్ తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ముందుకు వచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టు పనుల పూర్తి, వ్యవసాయ రంగానికి ప్రభుత్వ ప్రాధాన్యత తదితరాల నేపథ్యంలో వ్యవసాయ దిగుబడులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రైతులకు భరోసా దక్కడంతో పాటు, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ అన్నారు. పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక వ్యూహం టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు తెచ్చేందుకు ఆయా రంగాలకు చెందిన కంపెనీలతో ప్రత్యేకంగా చర్చిస్తామని కేటీఆర్ వెల్ల డించారు.ఈ మూడు రంగాల్లో పెట్టుబడులతో దేశం లోకి కొత్తగా వచ్చే అంతర్జాతీయ కంపెనీలు, తమ కార్యకలాపాల విస్తరణకు సిద్ధంగా ఉన్న దేశీయ కంపెనీలు లక్ష్యంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక వ్యూహం అమలు చేయా లని అధికారులకు సూచించారు. ఈ 3 రంగాల పరిశ్రమల కోసం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ల్యాండ్ బ్యాంక్, ఇండస్ట్రియల్ పార్కుల సమగ్ర సమాచారాన్ని పెట్టుబడులతో వచ్చే వారి కోసం సిద్ధం చేయాలన్నారు. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు సృష్టించడం లక్ష్యంగా పనిచేయడంతో పాటు, రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న కంపెనీలకు ‘టాస్క్’తరహా సంస్థలతో శిక్షణ ఇవ్వాలని కేటీఆర్ ఆదేశించారు. సమావేశంలో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి, వివిధ విభాగాల డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పెద్దల హర్షాతిరేకాలు...
కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం పట్ల అటు ప్రభుత్వ వర్గాలు నుంచి ఇటు పారిశ్రామిక వర్గాల వరకూ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యాపారాలను తిరిగి గాడిలో పడేందుకు, మరింత ఉపాధి అవకాశాల కల్పనకు, అంతర్జాతీయంగా మందగమనంలోనూ భారత్‌ను తయారీ కేంద్రంగా చేసేందుకు, ఆర్థిక వృద్ధికి ఈ నిర్ణయం సాయపడుతుందని అభిప్రాయడుతున్నాయి. పెట్టుబడులు పెరుగుతాయి అద్భుతమైన నిర్ణయాలను ప్రకటించింది. ఈ నిర్ణయాలు దీర్ఘకాలంగా నిదానించిన ఆర్థిక వృద్ధికి తగిన ప్రేరణనిస్తాయి. మినహాయింపులు కూడా కలిపి చూస్తే మన పన్ను రేటు అమెరికా, దక్షిణాసియా దేశాలకు దీటుగా, పోటీనిచ్చేదిగా ఉంటుంది. మినహాయింపులను కూడా వినియోగించుకుంటే పన్ను రేటు చాలా తక్కువగా 15 శాతమే ఉంటుంది. పెట్టుబడులకు ప్రభుత్వ నిర్ణయాలు ప్రోత్సాహాన్నిస్తాయి. రూ.1.45 లక్షల కోట్లు నేరుగా కంపెనీల ఖజానాకు వెళతాయి. వాటిని తిరిగి పెట్టుబడులకు వినియోగించడం వల్ల వృద్ధికి ఊతం లభిస్తుంది. – పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య మంత్రి కార్పొకు ప్రేరణ ప్రభుత్వ నిర్ణయాలు కార్పొరేట్ రంగానికి తాజా శక్తి, ప్రేరణనిస్తాయి. – ధర్మేంద్ర ప్రదాన్, పెట్రోలియం మంత్రి చరిత్రాత్మక సంస్కరణ ఈ చరిత్రాత్మక సంస్కరణలు భారత్‌లో తయారీకి బలమైన ఊతమిస్తాయి. – స్మృతి ఇరానీ. మహిళా, శిశుఅభివృద్ధి మంత్రి ఇన్వెస్టర్లకు ఉత్సాహం... ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక రంగం అధిక వృద్ధి పథంలోకి అడుగుపెడుతుంది. – రాజీవ్ కుమార్, నీతిఆయోగ్ వైస్ చైర్మన్ సాహసోపేత నిర్ణయం కార్పొరేట్ పన్ను తగ్గింపును సాహసోపేత నిర్ణయం. ఇది ఆర్థి క వ్యవస్థకు ఎంతో సా నుకూలం. ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాల ను కచ్చితంగా స్వాగ తించాల్సిందే. మనదగ్గరున్న ప్రతికూలతల్లో అధిక కార్పొరేట్ పన్ను రేట్లు కూడా ఒకటి. ఈ రోజు గణనీయంగా తగ్గించడం వల్ల థాయిలాండ్, ఫిలి ప్పీన్స్ వంటి వర్ధమాన దేశాలకు దగ్గరగా మన దేశాన్ని తీసుకెళుతుంది. దీనికితోడు సరళతర వడ్డీరేట్ల విధానం దేశాభి వృద్ధికి దోహదపడే అంశం. వృద్ధి లక్ష్యంగా ప్రభుత్వంతో ఆర్బీఐ కలిసి పనిచేస్తుంది. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ ఆర్థిక రంగానికి ఊతం ఆర్థిక రంగానికి ఊపునిస్తుంది. తయారీకి, మౌలిక సదుపాయాలకు గొప్ప ప్రేరణనిస్తుంది. ఈ అడుగు రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ (జీడీపీ వృద్ధి) వృద్ధి తిరిగి 8–9 శాతానికి చేరుకునేందుకు సాయపడుతుందని బలంగా నమ్ముతున్నాం. భారత్‌లో వేలాది ఉ ద్యోగాల కల్పనకు, 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ మార్క్నుకుచే రుకునే ప్రయాణం ఎంతో ఆశాజనకంగా ఉంది. – అనిల్ అగర్వాల్, వేదాంత రీసోర్సెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పోటీకి సై... కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల అమెరికా వంటి తక్కువ పన్ను రేటున్న దేశాలతో పోటీ పడేందుకు భారత కంపెనీలకు వీలు కల్పిస్తుంది. ఆర్థిక వృద్ధికి, చట్టబద్ధమైన పన్నులను చెల్లించే కంపెనీలకు మద్దతుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సంకేతమిస్తోంది. – ఉదయ్ కోటక్, కోటక్ మహీంద్రా బ్యాంకు సీఈవో వృద్ధికి దోహదం వృద్ధి తిరిగి కోలుకునేందుకు, పెట్టుబడుల పునరుద్ధరణకు ఇదో గొప్ప అడుగు. సాహసోపేతమైన, అవసరమైన ఈ చర్యను తీసుకున్నందుకు ఆర్థిక మంత్రికి నా హ్యాట్సాఫ్. – కిరణ్ మజుందార్ షా, బయోకాన్ చైర్పర్సన్ తిరుగులేని సంస్కరణ... కార్పొరేట్ పన్నును గణనీయంగా తగ్గించడం అన్నది గడిచిన 28 ఏళ్లలోనే తిరుగులేని సంస్కరణ. కార్పొరేట్ కంపెనీల లాభాలకు తోడ్పడుతుంది. ఉత్పత్తుల ధరలు తగ్గేందుకు వీలు కల్పిస్తుంది. నూతన తయారీ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహాన్నిస్తుంది. భారత్‌లో తయారీని పెంచుతుంది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ అపూర్వం, సాహసోపేతం ఎంతో కాలంగా ఉన్న డిమాండ్. దీన్ని నెరవేర్చడం అపూర్వమైనది, సాహసోపేతమైనది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ప్రేరణనిస్తుంది. తయారీని ప్రోత్సహిస్తుంది. ఆర్థిక రంగంలో ఉత్సాహాన్ని పెంచుతుంది. – విక్రమ్ కిర్లోస్కర్, సీఐఐ ప్రెసిడెంట్ -
పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే..
సాక్షి, అమరావతి: ఇక నుంచి రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో 75 శాతం ఉద్యోగాలను ప్రభుత్వం స్థానికులకే ఇవ్వనుంది. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీలు కూడా వచ్చే మూడేళ్లలో 75 శాతం ఉద్యోగాలను కూడా స్థానికులకే ఇచ్చేలా చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు సోమవారం శాసనసభలో కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పరిశ్రమలను, ఫ్యాక్టరీలను నెలకొల్పడం ద్వారా రాష్ట్ర యువతకు ఉపాధిని కల్పించాలని నిర్ణయించింది. మరింత సులువుగా వ్యాపారం చేసుకోవడానికి వీలుగా సరళతర విధానాలను రూపొందించనుందని బిల్లులో స్పష్టం చేసింది. విద్యుత్, గనులు, మౌలిక రంగాలు, పోర్టులు ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీవోనోపాధిని కోల్పోయేవారికి అండగా..: పరిశ్రమల స్థాపనకు ప్రైవేట్ వ్యవసాయ భూముల డిమాండ్ పెరిగిపోతోందని, పరిశ్రమలకు భూములిచ్చినవారు తమ భూమితోపాటు జీవనోపాధిని, ఆదాయాన్ని కోల్పోతున్నారని బిల్లులో ప్రభుత్వం స్పష్టం చేసింది. వీరికి ఆ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలనే డిమాండ్ ఉందని పేర్కొంది. అయితే.. పారిశ్రామికవేత్తలు చిన్న చిన్న ఉద్యోగాలకే స్థానికులను పరిమితం చేస్తున్నారని తెలిపింది. దీనివల్ల తక్కువ ఆదాయంతో స్థానిక యువతలో అసంతృప్తి పెరిగిపోతోందని వివరించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో కనీసం 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని చట్టం చేసేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలిపింది. స్థానికత అంటే.. ఏపీతోపాటు జిల్లా, జోన్‌గా పేర్కొంది. స్థానికంగా తగిన అర్హతలు ఉన్నవారు లేకపోతే పరిశ్రమలు, ఫ్యాక్టరీలు.. ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని, తగిన శిక్షణ ఇచ్చి మూడేళ్లలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, పీపీపీ విధానంలోని జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల్లో మూడేళ్లలోగా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనల నుంచి మినహాయింపు కోరాలంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం మూడు వారాల్లోగా తగిన విచారణ చేసి నిర్ణయం తీసుకుంటుంది. 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇస్తున్నారా? లేదా? అనే అంశాన్ని నోడల్ ఏజెన్సీ ఎప్పటికప్పుడు రికార్డులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తుంది. 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇస్తున్నవారిపై ఎటువంటి న్యాయస్థానాలకు వెళ్లరాదనే నిబంధన విధించారు. -
ప్రజా వారధి..హోదా సారథి
సాక్షి, పెడన(కృష్ణా) : ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు భవితకు బంగారు బాటలు పడతాయనేది జగమెరిగిన సత్యం. ప్రత్యేక హోదాయే ఆంధ్రాకు కావాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఢంకా పధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేస్తూనే ఉన్నారు. టీడీపీ మాత్రం ప్రత్యేక హోదా అంటూనే యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా వద్దని ప్రత్యేక ప్యాకేజీయే ముద్దని పేర్కొంటూ మళ్లీ యూటర్న్ తీసుకుని బీజేపీతో తెగతెంపులు చేసుకుని మొసలికన్నీరు కారుస్తూ ప్రత్యేక హోదా అంటూ రాగం అందుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఓటరు పేర్కొవడం గమనార్హం. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి పరిశ్రమలు రావడమే కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని అంటున్నారు. చంద్రబాబు వల్లే రాలేదు చంద్రబాబు నాయుడు ప్యాకేజీకి తీసుకోవడంతోనే ప్రత్యేక హోదా రాకుండా పోయింది. హోదా వస్తే రాష్ట్రానికి మహర్దశ పట్టేది. హోదాను తన ఓటుకు నోటు కేసు కోసం ఫణంగా పెట్టిన చంద్రబాబును రాష్ట్ర యువత తగిన బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. మొదటి నుంచి హోదా కోసం మడమ తిప్పకుండా పోరాడుతుంది ఒక్క జగన్మోహనరెడ్డి మాత్రమే. హోదా సంజీవనా అంటూ హేళనగా మాట్లాడిన చంద్రబాబు ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి మళ్లీ హోదా రాగం తీయడం చంద్రబాబు నీచ సంసంస్కృతికి నిదర్శనం. హోదా కోసం అలుపెరగని పోరాడుతున్న జగన్‌ను రానున్న ఎన్నికలలో గెలిపించి హోదా సాధించుకుంటాం. – పోతన సుధాకర్, గూడూరు. నమ్మక ద్రోహి చంద్రబాబు గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలను అన్ని రకాలుగా నమ్మించి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఇచ్చిన ఏ హామీ పూర్తిగా నెరవేర్చలేదు. హోదా వద్దు దాని వల్ల ఏం లాభం అన్న వ్యక్తి మళ్లీ హోదా కావాలంటే ప్రజలు ఆయనను ఎలా నమ్ముతారు. గతంలో వ్యవసాయం దండగ అన్నాడు. ఇప్పుడు వ్యవసాయం రంగం అభివృద్ధిలో ఉంది అంటున్నాడు. అలాగే హోదా విషయంలోనూ చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంభించి ప్రజలను తప్పుదారి పట్టించాడు. హోదా అడిగిన వారిపై అక్రమ కేసులు పెట్టించి జైళ్లలో పెట్టించాడు. ప్రజా సంకల్పయాత్రతో ప్రజలు వాస్తవాలను గుర్తించారు కాబట్టి జగనన్నతో కలసి నడిచేందుకు సిద్ధపడి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. –మాదాసు నాగేశ్వరరావు, విశ్రాంత ఉద్యోగి, పెందురు జగన్‌తోనే హోదా సాధ్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్. జగన్మోహనరెడ్డి హోదా కోసం ప్రజలను చైతన్యం చేసేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర టీడీపీ ప్రభుత్వానికి ఒక గుణపాఠం. ఈ యాత్రలో జగన్‌కు లభించిన ఆదరణ చూసి చంద్రబాబు యూటర్న్ తీసుకుని దీక్షలు చేశారు. రాష్ట్రానికి నష్టం జరిగిన తర్వాత చంద్రబాబు దీక్షలు చేస్తే ఎవరు ఆదరిస్తారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. రాష్ట్రంలో ఇబ్బడి, ముబ్బడిగా అప్పులు చేశారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రజలను రక, రకాల తాయిలాలతో ఊదరగొడితే జనం నమ్మి పట్టం కడతారనుకోవడం బ్రమే. ప్రజా సంకల్ప యాత్రలో లభించిన ప్రజాబిమానం జగన్మోహన్రెడ్డిని సీఎం చేస్తుందని సర్వేలు చెబుతున్నాయి. –సీహెచ్. రాధాకృష్ణ, మాజీ సర్పంచ్, సాతులూరు -
60 వేల మందికి నైపుణ్య శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై) పథకాన్ని కేంద్రప్రభుత్వం మరింత విస్తృతం చేసింది. ఇప్పటివరకు అంశాలవారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి నిపుణులను తయారు చేస్తుండగా తాజాగా ఆసక్తితో కూడిన వృత్తి నైపుణ్యం దిశగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అధికసంఖ్యలో యువతకు నైపుణ్యాన్ని పెంపొందించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు రాష్ట్రాలవారీగా లక్ష్యాలను నిర్దేశించింది. ఇందులో భాగంగా మన రాష్ట్రానికి 60 వేలమంది యువతకు ప్రాధాన్యత, ఆవశ్యకత ఉన్న రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని సూచించింది. ఈ మేరకు కార్మిక, ఉపాధి కల్పన శాఖ చర్యలు మొదలుపెట్టింది. 2020 నాటికి రాష్ట్రానికి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. జిల్లాలకు లక్ష్య నిర్దేశాలు కేంద్రం రాష్ట్రాలకు లక్ష్యాలను నిర్దేశించగా వాటి సాధనకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలవారీ లక్ష్యాలను నిర్దేశించింది. ఈ క్రమంలో యువత, అక్షరాస్యత, నిరుద్యోగం తదితర అంశాలను పరిగణిస్తూ ఉపాధి కల్పన శాఖ 33 జిల్లాలకు లక్ష్యాలను ఖరారు చేసింది. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారులకు సమాచారం అందించింది. జిల్లా స్థాయిలో పీఎంకేవీవై అమలు కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, నోడల్ అధికారిగా జిల్లా ఉపాధి కల్పన అధికారి వ్యవహరిస్తారు. పీఎంకేవీవై కింద దాదాపు 275 రకాల వృత్తులకు సంబంధించి శిక్షణలు ఇస్తున్నారు. ఇందులో 200 గంటల నుంచి 1,200 గంటల వరకు కార్మిక నిబంధనల మేరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. నైపుణ్యాభివృద్ధిశిక్షణ కార్యాక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 127 ట్రైనింగ్ పార్ట్నర్లను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి శిక్షణ, తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నిబంధనల మేరకు నిధులు విడుదల చేస్తుంది. ఈ ట్రైనింగ్ పార్ట్నర్లు నిరుద్యోగులను ఎంపిక చేసేందుకు జిల్లాలు, డివిజన్ స్థాయిలో కౌశల్ మేళాలు ఏర్పాటు చేస్తారు. అదేతరహాలో రోజ్‌గార్ మేళాలు నిర్వహించి ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడం, నైపుణ్యాన్ని మెరుగుపర్చడం లాంటి కార్యక్రమాలు చేపడతారు. అనంతరం శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందిస్తారు. ప్రాధాన్యత రంగాలు, ఉపాధి మెరుగ్గా ఉండే కంపెనీల్లో ఈ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా ఉపాధి కల్పన శాఖ చర్యలు తీసుకుంటుంది. -
‘వలస’ ఓట్లను వదలొద్దు
సాక్షి, హైదరాబాద్: సొంత రాష్ట్రంలో ఉండకపోయి నా ఎన్నికల సమయాల్లో వచ్చి ఓటుహక్కు వినియోగించుకునే వారిపై కాంగ్రెస్‌పార్టీ దృష్టి పెట్టింది. ఉన్న ఓటర్లతోపాటు వలసఓటర్లను ఆకర్షించేలా ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థులకు సూచనలు చేసింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డ వలస కార్మికులను ఓటింగ్ కోసం రప్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వెళ్లి పట్టణాల్లో నివసిస్తున్న ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తీసుకొచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చింది. రాష్ట్రంలోని సరిహద్దు నియోజకవర్గాల నుం చి కర్ణాటక, మహారాష్ట్రలోని చక్కెర కర్మాగారాలకు కార్మికులు వలస వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 50 వేల గిరిజనుల జనాభాలో 35 వేల మంది వలస వెళ్లినవారే. జహీరాబాద్, జుక్కల్, బోధన్, నారాయణపేట్, ఆదిలాబాద్, బోథ్, అలంపూర్, గద్వాల, మక్తల్, అచ్చంపేట, కల్వకుర్తి, కోదాడ, ఆదిలాబాద్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల నుంచి పొరుగు రాష్ట్రాలకు ఉపాధి అవకాశాల కోసం వెళ్లినవారు పెద్దసంఖ్యలో ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో హోరాహోరీ పోటీ నెలకొనడంతో ఏ పార్టీ అయినా, 5 వేల ఓట్లకు తక్కువ మెజార్టీతోనే గట్టెక్కే అవకాశాలుంటాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. రాష్ట్ర ఎన్నికలను పర్యవేక్షిస్తున్న కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని బృందం పోల్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టి, వలస కార్మికులను పోలింగ్ కేంద్రాలకు రప్పించేలా అభ్యర్థులకు మార్గదర్శనం చేసింది. దీంతోపాటే ఉత్తర తెలంగాణలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గల్ఫ్ కార్మికుల కుటుంబాల ఓట్లు పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసేలా ఉండటంతో, వారి ఓట్లను రాబట్టుకునేలా చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. -
కంపెనీలకు 'భాగ్య'నగరం!
సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంలో దూసుకుపోతున్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు మరిన్ని అంతర్జాతీయ సంస్థలు క్యూ కట్టాయి. కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు, దేశంలో ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న సంస్థలను విస్తరించేందుకు మరో 10 కంపెనీలు భాగ్యనగర బాట పట్టాయి. ఈ జాబితాలో ఎక్కువగా ఐటీ/ఐటీ ఆధారిత సేవల కంపెనీలు ఉన్నాయి. అమెరికాకు చెందిన ష్యూర్, మైక్రాన్ టెక్నాలజీ, ఎఫ్5 నెట్వర్క్స్, మ్యాథ్‌వర్క్స్, క్లీన్ హార్బర్స్, కాండ్యూయెంట్, లెగాతో హెల్త్ టెక్నాలజీస్, త్రైవ్ డిజిటల్, బాంబార్డియర్ వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అలాగే చైనాకు చెందిన థండర్ సాఫ్ట్వేర్ టెక్ సంస్థ గత సోమవారం లాంఛనంగా కార్యకలాపాలు ప్రారంభించింది. నగరంలో ఐటీ కంపెనీల కార్యకలాపాలు, విస్తరణకు అనుకూలంగా ఉండటం, సాంకేతిక నిపుణులు, మౌలిక వసతులు అందుబాటులో ఉండటంతోపాటు నూతన ఐటీ పాలసీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం ఉత్తమ ర్యాంకు సాధించడం ఈ కంపెనీలు హైదరాబాద్‌పై ఆసక్తి చూపడానికి ప్రధాన కారణమని ఐటీరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పలు అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన చిన్న కంపెనీలు సైతం ఇక్కడ కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు ప్రభుత్వ వర్గాలను సంప్రదిస్తున్నాయని పేర్కొన్నాయి. ఆయా కంపెనీలు కార్యకలాపాలు సాగించేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఐటీశాఖ అధికారులు తెలిపారు. 3 ఏళ్లలో మారిన సీన్... భారత్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలను నెలకొల్పాలనుకునే కంపెనీలు మూడేళ్ల క్రితం వరకు బెంగళూ రునే ఎంపిక చేసుకునేవి. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో హైదరాబాద్‌లో కంపెనీలు ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచే కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఐటీశాఖ వర్గాలు తెలిపాయి. గత మూడేళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోందని పేర్కొన్నాయి. ప్రధానంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐటీ, హార్డ్‌వేర్ పాలసీలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం ఉత్తమ ర్యాంకు సాధించడం వంటి అంశాలు పలు బహుళజాతి కంపెనీలు హైదరాబాద్‌ను తమ గమ్యస్థానంగా ఎంచుకోవడానికి కారణమని పేర్కొన్నాయి. ఉపాధి, నిర్మాణ రంగానికి ఊతం... ఒక్కో నూతన అంతర్జాతీయ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,000 నుంచి 3,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలున్నట్లు ఐటీశాఖ అంచనా వేస్తోంది. అలాగే ఆయా కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో సుమారు 50 వేల నుంచి 3 లక్షల చదరపు అడుగుల మేర వాణిజ్య స్థలాలను లీజు ప్రాతిపదికన తీసుకోవడంతో నిర్మాణ రంగానికి సైతం ఊతమిచ్చినట్లు అయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్ ఐటీ కంపెనీల్లో ఉపాధి ఇలా... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం హైదరాబాద్‌లో సుమారు 100 చిన్న, పెద్ద ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఆయా కంపెనీల్లో కొత్తగా 50 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించినట్లు ఐటీశాఖ వర్గాలు తెలిపాయి. టీఎస్ ఐపాస్ రాకతో గత రెండేళ్లుగా బుద్వేల్ తదితర ప్రాంతాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు సుమారు 30 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయన్నారు. భాగ్యనగరంలో ఇప్పటికే సుమారు 647 బహుళజాతి, దేశీయ దిగ్గజ సంస్థలకు చెందిన ఐటీ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆయా కంపెనీల్లో సుమారు 5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. భాగ్యనగర బాటపట్టిన కంపెనీలివే.. 1. ష్యూర్ 2. మైక్రాన్ టెక్నాలజీ 3. ఎఫ్5 నెట్వర్క్స్ 4. మ్యాథ్‌వర్క్స్ 5. క్లీన్ హార్బర్స్ 6. కాండ్యూయెంట్ 7. లెగాతో హెల్త్ టెక్నాలజీస్ 8. త్రైవ్ డిజిటల్ 9. బాంబార్డియర్ 10. థండర్ సాఫ్ట్వేర్ టెక్ -
వృత్తి నైపుణ్యానికే తొలి ప్రాధాన్యత: జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ యువతకు వృత్తి నైపుణ్యం తో కూడిన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది బడ్జెట్లో వృత్తి నైపుణ్యానికే తొలి ప్రాధాన్యత ఇచ్చామని, ఇందులో భాగంగా శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణకు సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌తో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి వెల్లడించారు. ఎంఎస్ఎంఈ ద్వారా నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో తొలిదశ వెయ్యి మందికి శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధికి మూడెకరాల భూ పంపిణీ, ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, కొత్తగా గురుకుల పాఠశాలలు, స్వయం ఉపాధి యూనిట్లకు రాయితీలు తదితర కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. -
మెతుకు లేక.. బతుకు వలస
ఉన్న ప్రాంతంలో మెతుకు పుట్టదు.. ఎంత పనిచేసినా బతుకు మారదు. పేరుకు ఉద్యానవనం. కానీ పచ్చదనం కోల్పోయి చాలాకాలమవుతోంది. ఉద్దానం బిడ్డలు ఇప్పుడు బతుకు వెతుక్కుంటూ వేరే దేశాలకు వెళ్తున్నారు. కేవలం కూలి పనుల కోసం కుటుంబాలను వదిలి సరిహద్దులు దాటుతున్నారు. అంతదూరం వెళ్తున్నా వారి జీవితాలు మారడం లేదు. బ్రోకర్ల చేతిలో మోసపోవడం.. ప్రమాదాల్లో చిక్కుకోవడం వంటి సంఘటనలు వారి కుటుంబ సభ్యులను కలవర పెడుతున్నాయి. టెక్కలి డివిజన్ పరిధిలో ఉద్దానం ప్రాంతంగా పిలిచే ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో పారిశ్రామిక ప్రగతి పడకేసింది. దీంతో చదువుకొని.. నిరుద్యోగులుగా ఉన్న యువకులు తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధి కోసం వలస వెళుతూ , అక్కడ భద్రత లేని ఉద్యోగాల్లో చేరి అవస్థలు పాలవుతున్న సంఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. అయినా సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శ్రీకాకుళం / కంచిలి: ఉద్దానం ప్రాంతంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో చాలామంది నిరుద్యోగులు, యువకులు దూర ప్రాంతాలకు సైతం వెళ్లేందుకు వెనుకాడడం లేదు. ఈ అవకాశాన్నే కొంతమంది బ్రోకర్లు క్యాష్ చేసుకుంటున్నారు. గ్రామాల్లో తిరుగుతూ యువకుల్ని ఆకర్షిస్తూ గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ ఆశలు చూపి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక్కడి యువత ఏదో విధంగా బయట దేశానికి వెళ్లి.. నాలుగు రూపాయలు సంపాదించాలని ఆశిస్తున్నారు. అయితే అలాంటి ప్రయాణాలు సక్రమంగా సాగడం లేదు. ఇక్కడి నుంచి పంపే బ్రోకర్లు సరైన పద్ధతిలో పంపించకపోవడం, టూరిస్టు వీసాలతో అక్కడికి పంపిన తర్వాత పట్టించుకోకపోవడంతో దేశంకాని దేశంలో ఉద్దానం వాసులు అవస్థలు పడిన సందర్భాలు కోకొల్లలుగా ఇటీవల వెలుగు చూశాయి. ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగి ఉపాధి అవకాశాలు కల్పించినట్లయితే ఉద్దానం యువతకు ఈ దుస్థితి ఏర్పడేది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ ఏడాదిలో జరిగిన సంఘటనలను ఒకసారి పరిశీలిస్తే.. టెక్కలి డివిజన్ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన యువకులు సౌదీ అరేబియాలో ఇటీవల చిక్కుకున్నారు. అక్కడి నుంచి బాధితులు నేరుగా ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. అక్కడ వారు పడుతున్న అగచాట్లకు సంబంధించిన ఫొటోలు పంపించారు. ఒడిశా రాష్ట్రం గంజాం, జయంతిపురం గ్రామాల పరిధిలో గల యువకులతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పది మంది బాధితులు గల్ఫ్‌లో చిక్కుకున్నారు. గత ఏడాది డిసెంబర్లో ఒడిశాలోని బరంపురం, ఇచ్ఛాపురం, టెక్కలిలో గల ఏజెంట్ల ద్వారా పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లారు. అప్పట్లో చిక్కుకున్న వారిలో శ్రీకాకుళానికి చెందిన కిలుగు రామారావు రెడ్డి (ఇచ్ఛాపురం మున్సిపాలిటీ బెల్లుపడ కాలనీ), దుంప బైరాగి (ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి), దూపాన ప్రకాష్ రెడ్డి (కంచిలి మండలం అంపురం), కల్లేపల్లి కార్తీక్ (సోంపేట మండలం తాళపధ్ర), రాజాం రామారావు (పూండి, తోటపల్లి), గొరకల హేమారావు( పూండి ముల్లారిపురం), బయా పెంటయ్య (బావనపాడు)తో పాటు ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన మద్ది బృహస్పతి(ఒడిశా గుడ్డిపద్ర), కోళ హరికృష్ణ (ఒడిశా బొరివాడ), గణేష్ పాత్రో జంకల, శిలవలస గోపాల్, పూదరి శ్రీనివాస్, నీలమ్ రాజకుమార్, గలిపెల్లి మధు, సౌదా బత్తుల ఉమామహేశ్వరావు, ఉమాశంకర్ సాహూ, సిలవలస వాసుదేవ్, సుధామ చంద్ర సాహూ, పెదిని తారేసు, పందిరి విజయ్‌కుమార్, లోచన బెహరా, ముడిలి ప్రహ్లాద్, సిలివలస గోపాల్, దకుయా గోవింద్‌లు ఇబ్బందులు పడ్డారు. ఏజెంట్ల మాయలో... విదేశా>ల్లో ఉద్యోగం...చేతి నిండా సొమ్ము...ఐదేళ్లు పాటు విదేశాల్లో ఉంటే కోటీశ్వరులవుతారంటూ నిరుద్యోగ యువకులకు గాలం వేసే ఏజెంట్లు జిల్లాలో కోకొల్లాలు. ముఖ్యంగా ఇచ్ఛాపురం నుంచి బరంపురం వెళ్లే రహదారుల్లో పుట్టగొడుగుల్లా ఇనిస్టిట్యూట్లు వెలిశాయి. కేవలం నిరుద్యోగులకు వల విసిరి వారి వద్ద భారీగా నగదు దోచుకోవడం అలవాటు పడ్డారు. ఇచ్ఛాపురం పురపట్టణంలోనే ఐదు, కంచిలి మండలంలో రెండు ఇనిస్టిట్యూట్లున్నాయి. సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో పలు గ్రామాల్లో బ్రోకర్లు కూడా ఉండి నిరుద్యోగులకు ఎరవేస్తున్నారు. నామమాత్రం శిక్షణతో.. బ్రోకర్లు ఏర్పాటు చేస్తున్న ఇనిస్టిట్యూట్‌లో వెల్డింగ్, ఫిట్టర్ వంటి శిక్షణలు తూతూ మంత్రంగా ఇస్తూ విదేశాలకు పంపించాలంటే సుమారు 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలోని రత్తకన్నకు చెందిన అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ ప్రతినిధి ఉద్యోగాలిప్పిస్తానంటూ ఎంతో మంది అమాయక యువకుల నుంచి డబ్బులు వసూలు చేసి, వారికి ఉద్యోగాలిప్పించకపోవడంతో వారు పోలీసులను కూడా ఆశ్రయించారు. ఇటీవల పలాస పట్టణానికి చెందిన ఒక బ్రోకర్ 30 మంది నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున సొమ్ములు వసూలు చేసిన వైనం బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మందస మండలంలో కూడా ఇటువంటి సమస్య బయటపడింది. ఇలా ఉద్దానం ప్రాంతంలో చాలామంది విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని బ్రోకర్ల అవతారమెత్తి నిరుద్యోగులతో ఆడుకుంటున్నారు. అయినా నిరుద్యోగులు కూడా ఇవేమీ పట్టించుకోకుండా వేలాది రూపాయలు చెల్లించి విదేశీ ఉద్యోగాలపై ఆశతో బ్రోకర్ల చేతిలో డబ్బులు పెడుతూ మోసం పోవడం.. లేదా విదేశాలు వెళ్లి అక్కడ అవస్థలు పడడం జరుగుతున్నాయి. ఉద్దానం ప్రాంతం నుంచి ఏడాదికి సగటున 2వేల మంది వరకు యువకులు విదేశాలకు వలస వెళుతున్నారు. అంతేకాకుండా నిర్మాణ పనులు చేసి పొట్టనింపుకోవడానికి మన దేశంలోని తమళనాడు, బెంగళూరు, గుజరాత్, ముంబాయి తదితర రాష్ట్రాలకు వలస వెళ్లినవారు కూడా ఈ ప్రాంతానికి చెందిన వేలాది మంది ఉన్నారు. నిర్మాణ రంగంలో ఉన్న వారు పనులు చేసే క్రమంలో ప్రమాదాలబారిన పడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకొన్న సంఘటనలు కూడా ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలంటూ తీసుకెళ్లే బ్రోకర్లు, వివిధ కంపెనీలు ఇక్కడ చెప్పేదొక ఉద్యోగం అయితే .. అక్కడ బాత్రూంలు, లెట్రిన్లు శుభ్రపరిచే పనులను కూడా అప్పగించే సందర్భాలు ఉనాయి. ఆ పనిలో కూడా భద్రత లేకపోవడంతో తమ దుస్థితిని తెలియజేస్తూ అక్కడ ఇబ్బందులు పడేవాళ్లు మనసు చంపుకొని ఆ ఫొటోలను ఇక్కడికి పంపి, కాపాడమని వేడుకున్న సందర్భాలు కూడా ఇటీవల వెలుగు చూశాయి. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు గానీ.. సర్కార్ గాని పట్టించుకోకపోవడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేకహోదాతోనే పారిశ్రామికాభివృద్ధి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ వలసల రాష్ట్రం. అందులో శ్రీకాకుళం జిల్లా వలసల్లో ప్రథమస్థానంలో ఉంది. ఉద్దానం పరిస్థితి అయితే మరింత ఘోరం. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తేనే పారిశ్రామిక ప్రగతి జరిగి, ఉన్న ప్రాంతంలోనే పరిశ్రమలు ఏర్పాటు జరిగి యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆయన వస్తే పరిశ్రమలు వస్తాయని ఆశించిన యువత తీవ్రమైన మోసానికి గురైంది. నిరుద్యోగులు దగాపడ్డారు. –డాక్టర్. సీదిరి అప్పలరాజు, వైఎస్సార్సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త వెనుకబాటు తనంతోనే వలసలు ఉద్దానం ప్రాంతంలో ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక వెనుకబాటులో ఉంది. పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడం, పంటలు కూడా పూర్తిస్థాయిలో పండకపోవడంతో ఇక్కడి యువకులుతోపాటు అన్ని వయస్సుల వారు వలసలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, ఉద్యోగాలు కల్పిస్తారని ఆశించిన యువతకు నిరాశే మిగిలింది. – పిరియా సాయిరాజ్, వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త వలస బతుకులు దుర్భరం స్థానికంగా ఉద్యోగావకాశాలు లేక కుటుంబాలను ఇక్కడ విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నార. తీరా అక్కడ పరిస్థితులు దుర్భరంగా ఉంటున్నాయి. నేను కూడా కుటుంబాలను పోషించాలంటే ఏదో ఒకటి చెయ్యాలనే తలంపుతో ఇతర ప్రాంతానికి వెళ్లాను. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో తిరిగి వచ్చేసి, ఇక్కడ ఆటో నడుపుకొని జీవిస్తున్నాను. –నారద భీమారెడ్డి, నరసన్నముకుందాపురం గ్రామం, కంచిలి మండలం ఉద్యోగాల్లేక అల్లాడుతున్నాం రాష్ట్రంలో ఎటువంటి ఉద్యోగాల కల్పన చేపట్టకపోవడంతో డిగ్రీలు, పీజీలు చేసి అల్లాడుతున్నాం. మా లాంటి ఎంతో మంది యువకులు చదువుకున్నవారు సైతం స్థానికంగా ఉద్యోగాలు లేకపోవడంతో అప్పులు చేసి మరీ విదేశాలకు వెళుతున్నాం. అక్కడ ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. –తరిపిల మురళి, పోస్టు గ్రాడ్యుయేట్, గోకర్ణపురం, కంచిలి మండలం -
రానున్న ఏడాది ఆర్థికంగా పురోగతి ఉండదు!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని ఓ వైపు ప్రభుత్వం చెబుతుంటే... మరోవైపు రానున్న ఏడాది కాలంలో తమ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని భావించడం లేదంటూ నగరాల్లో అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. జూన్ నెలకు సంబంధించి ఆర్బీఐ నిర్వహించిన వినియోగదారుల విశ్వాస సూచీలో ఈ విషయాలు తెలిశాయి. తమ ఆదాయం, ఉపాధి అవకాశాలు, సాధారణ ఆర్థిక పరిస్థితులు తదుపరి 12 నెలల కాలంలో పురోగతి చెందుతాయని అనుకోవడం లేదంటూ సర్వేలో పాల్గొన్న వారిలో సగానికి పైగా చెప్పడం గమనార్హం. కేవలం 48.2 శాతం మందే ఆర్థిక పరిస్థితులు బాగుంటాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. నాలు గు నెలల కాలంలో ఇంత తక్కువ ఆశాభావం వ్యక్తం కావడం ఇదే. కాకపోతే మే నెలతో పోలిస్తే జూన్‌లో మొత్తం మీద వినియోగదారుల విశ్వాసం కాస్తంత ఇనుమడించింది. ఇక సర్వేలో పాల్గొన్న వారిలో 27.7 శాతం మంది అయితే ఆర్థిక పరిస్థితులు మరింత క్షీణిస్తాయని అభిప్రాయం తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో సర్వే కోసం అభిప్రాయాలు తీసుకున్నారు. ►49.8 శాతం మంది రానున్న సంవత్సర కాలంలో ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ►49.1 శాతం మంది ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ►25.3 శాతం మంది గడిచిన ఏడాదిలో తమ ఆదాయం పెరిగిందన్నారు. ►33.5శాతం మంది ఉపాధి అవకాశాలు గత ఏడాదిలో మెరుగుపడ్డాయనగా, 40 శాతం మంది క్షీణించినట్టు చెప్పారు. ►34.6 శాతం మంది గత ఏడాదిలో సాధారణ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినట్టు తెలుపగా, దారుణంగా మారినట్టు 42 శాతం చెప్పారు. -
ఇక పాలి‘టెక్’లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు 198 ఉంటే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు 14 మాత్రమే ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల్లో లక్షకు పైగా సీట్లు ఉంటే ప్రభుత్వ కాలేజీల్లో 3 వేల సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలు అవసరమని సాంకేతిక విద్యా శాఖ భావిస్తోంది. తగిన మౌలిక సదుపాయాలు, భవనాలు కలిగిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజనీరింగ్ కాలేజీలుగా అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తోంది. ఆ దిశగా ప్రభుత్వంతో చర్చించి, తగిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ బుధవారం వెల్లడించారు. ప్రభుత్వ స్థాయిలో దీనిపై చర్చ జరిగాకే నిర్ణయాలు ఉంటాయని ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యం లోని ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టడం ద్వారా మరింత మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవచ్చని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు ఏయే పాలిటెక్నిక్ కాలేజీలు అనువుగా ఉంటాయన్న అంశంపై అధికారులతో చర్చించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ఉపాధి అవకాశాలు పెంచేలా.. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగు పరచడంతోపాటు విద్యావకాశాలను పెంపొందించేందుకు సాంకేతిక విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 2018–19లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం నుంచే ఇంటర్న్‌షిప్‌ను అమలు చేసేందుకు నిర్ణయించింది. పరిశ్రమలతో అనుసంధానం చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాల నుంచి విద్యార్థులకు ఆఫర్లు వచ్చేలా చేయడంతోపా టు ఇంటర్న్‌షిప్ ద్వారా పరిశ్రమల్లో ఎక్కువ కాలం పని చేస్తే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచవచ్చన్న ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు పాలిటెక్నిక్ కోర్సుల్లో ఆరు నెలలకుపైగా ఇంటర్న్‌షిప్‌ను అమలు చేయనుంది. మొదటి సంవత్సరం అయ్యాక వేసవి సెలవుల్లో 6 నుంచి 8 వారాలు, ద్వితీయ సంవత్సరం పూర్తయ్యాక వేసవి సెలవుల్లో 6 నుంచి 8 వారాలు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసింది. ఫైనల్ ఇయర్ విద్యార్థులు చివరి సెమిస్టర్ మొత్తం (దాదాపు 110 రోజులు) ఇంటర్న్‌షిప్ చేసేలా చర్యలు చేపట్టింది. చివరి సెమిస్టర్ ఇంటర్న్‌షిప్‌ను ఆప్షనల్‌గా అమలు చేయాలని నిర్ణయించింది. పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్.. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయ్యాక ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరాలనుకునే వారు (ఈసెట్ రాసి ల్యాటరల్ ఎంట్రీ ద్వారా) కాలేజీలో చదువుకుంటూనే ప్రాజెక్టు వర్క్ చేసేలా ఆప్షన్ ఇచ్చింది. పాలిటెక్నిక్ తర్వాత ఉపాధి అవకాశాలు వెతుక్కునే విద్యార్థులు చివరి సెమిస్టర్ మొత్తం పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తద్వారా విద్యార్థులకు ఆయా కంపెనీల్లో ఉపాధి లభించే అవకాశం ఉంటుందని నవీన్ మిట్టల్ వెల్లడించారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం, తృతీయ సంవత్సరం చదివే విద్యార్థుల నుంచి ఇంటర్న్‌షిప్ చేసే అంశంపై ముందుగానే ఆప్షన్ తీసుకోవాలని కాలేజీలను ఆదేశించారు. మరోవైపు కొత్త సిలబస్ ప్రకారం ఇంజనీరింగ్‌లోనూ ఇంటర్న్‌షిప్‌ను అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. డిగ్రీలోనూ ఇంటర్న్‌షిప్.. డిగ్రీలోనూ ఇంటర్న్‌షిప్ తెచ్చినట్లు నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. దీన్ని అన్ని కాలేజీలు అమలు చేయడం లేదని, విద్యార్థులకు ఆప్షన్‌గా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎంపిక చేసిన కోర్సుల్లో ఇంట ర్న్షిప్ను తప్పనిసరి చేసే అవకాశం ఉందని చెప్పా రు. ప్రస్తుతం డిగ్రీ ప్రథమ, ద్వితీయ ఏడాదిలో 2 క్రెడిట్ల చొప్పున ఇంటర్న్‌షిప్ చేసే వారికి 4 క్రెడిట్లు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. -
రెడీ.. వన్.. టూ.. త్రీ..
పిజ్జాల డెలివరీలు.. పెళ్లిళ్లలో 360 డిగ్రీల్లో ఫోటోలు, వీడియోలు..సెల్ఫీ వీడియోలు, ఫొటోలు తీసుకునేందుకు.. పుష్కరాలు వంటి ఉత్సవాల్లో భద్రతను పరిశీలించేందుకు.. డ్రోన్లు అన్న పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేవి ఇవే. కానీ భవిష్యత్తులో అదీ ఇదీ అని కాకుండా దాదాపు అన్ని రంగాల్లోనూ తమదైన ముద్ర వేసేందుకు డ్రోన్లు సిద్ధమవుతున్నాయి! మన దేశంలో ఇప్పటివరకూ సైన్యం, భద్రతా రంగాల్లో డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తుండగా.. ఇకపై పరిస్థితి మారిపోనుంది.సాధారణ ప్రజలు కూడా డ్రోన్లను వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పిస్తుండటమే దీనికి కారణం. ఇంతకీ డ్రోన్లతో మనకు ప్రయోజనమెంత, వాటి వినియోగంపై ఆంక్షలేమిటి, డ్రోన్లతో భవిష్యత్తు ఏమిటో తెలుసా? విమానాశ్రయాన్ని మూసేసి..! కొద్దినెలల క్రితం మైసూరు విమానాశ్రయం ఓ రెండు గంటలపాటు మూతపడింది. విమానాల రాకపోకలపై ఆంక్షలు పెట్టేశారు. ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా. విమానయాన శాఖ, కొన్ని స్టార్టప్ కంపెనీలు డ్రోన్లను పరీక్షించాయి. బెంగళూరుకు చెందిన స్కైలార్క్ ఇంజనీర్లు భద్రతా రంగంలో డ్రోన్లను మరింత సమర్థంగా ఎలా వాడవచ్చు, వేర్వేరు రంగాల్లో డ్రోన్ల వినియోగంతో వచ్చే లాభాలేమిటి అన్న అంశాలను ప్రభుత్వ ఉన్నతాధికారులకు ప్రత్యక్షంగా చూపారు. డ్రోన్లతో భారత్ ఆర్థికంగా బలోపేతం అవుతుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, సామాజికంగా మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పెను మార్పులకు డ్రోన్లు ఉపయోగపడతాయని అంచనా. ఇప్పటికే 40 వేలకుపైగా డ్రోన్లు ప్రైవేటు వ్యక్తులు వినియోగించడంపై ఆంక్షలు ఉన్నా.. మన దేశంలో ఇప్పటికే 40 వేలకుపైగా డ్రోన్లు ఉన్నట్టు అంచనా. 2022 నాటికి ప్రపంచం మొత్తమ్మీద డ్రోన్ల వాడకం రెట్టింపు అవుతుందని, వాటి మార్కెట్ 10 వేల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్క యూరప్‌లోనే లక్షా 50 వేల కొత్త ఉద్యోగాల కల్పనకు డ్రోన్లు కారణమవుతాయని అంచనా. డ్రోన్లు నడిపేందుకు ప్రత్యేక నైపుణ్యం ఉన్న వారు అవసరమవుతారు. అలాగే అనవసరమైన డ్రోన్లను కూల్చేసేందుకు నిపుణుల అవసరం ఉంటుంది. ఆయా రంగాల్లోని అవసరాలకు తగ్గట్టుగా కొత్త కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. డ్రోన్లతో వ్యవ’సాయం’ మట్టి నాణ్యతని పరీక్షించి, సాగు చేసుకోదగ్గ పంటలపై సూచనలు ఇవ్వడం మొదలుకొని... దిగుబడులను అంచనా వేయడం వరకు డ్రోన్లు వ్యవసాయానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. పంట పొలాల్లోని ప్రతి మొక్క, చెట్లను ఫొటోలు తీసి.. విశ్లేషించి వాటి ఆరోగ్యం ఎలా ఉందో గుర్తించవచ్చు. పొలంలోని ఏభాగంలో పోషకాల కొరత ఉందో.. ఎక్కడ ఎక్కువైందో తెలుసుకోవచ్చు. ఎరువులు, కీటకనాశినులను సమర్థంగా, తక్కువ సమయంలో పొలమంతా చల్లేందుకు డ్రోన్లను వాడుకోవచ్చు. ఇక విత్తనాలు నాటే డ్రోన్లు కూడా వస్తున్నాయి. చైనా, జపాన్ వంటి దేశాలు వ్యవసాయ రంగంలో డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నాయి. మనదేశంలో పంజా బ్, కర్ణాటక తదితర రాష్ట్రాల రైతులు డ్రోన్లను వినియోగించడం మొదలుపెట్టారు. ఇక డ్రోన్ల సహాయంతో క్లౌడ్ సీడింగ్ చేయడం ద్వారా కరువు ప్రాంతాల్లో వర్షాలు కురిపించడం, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ చర్యలు, అభయారణ్యాల్లో వేటగాళ్ల నుంచి జంతువుల సంరక్షణకు డ్రోన్లను విస్తృతంగా వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. డ్రోన్లపైనా నిఘా పెడతాయి డ్రోన్లు ఉగ్రవాదుల చేతుల్లో పడితే అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించవచ్చన్న భయం ఇన్నాళ్లూ వెంటాడేది. ఇప్పుడు అలాంటి ఆందోళనలు లేవు. శత్రు డ్రోన్లకు అడ్డుకట్టే వేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇలా పక్కదారిపట్టే డ్రోన్ల ఆచూకీ కనిపెట్టడానికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఇఎల్) శక్తిమంతమైన రాడర్లు, జామర్లను రూపొందించింది. విమానాశ్రయాలు, పార్లమెంటు, సరిహద్దు ప్రాంతాలు, సైనిక శిబిరాలు వంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం వల్ల డ్రోన్లతో ఎవరైనా దాడికి దిగుతారన్న భయం ఉండ దు. ప్రస్తుతం 3 కిలోమీటర్ల పరిధిలో ఉండే డ్రోన్లను మాత్రమే ఈ టెక్నాలజీ ద్వారా పసిగట్టవచ్చు. ఈ పరిధిని పెంచడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. అవయవ రవాణాతో ప్రాణదానం అవయవాలను దానం చేస్తే ఒక ప్రాణాన్ని నిలపవచ్చన్న అవగాహన ఈ మధ్య కాలంలో అందరిలోనూ పెరుగుతోంది. కానీ అవయవాలను సకాలంలో అవసరమైన చోటికి సరఫరా చేయడం సవాల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ఒక ఊరి నుంచి మరో ఊరికి రవాణా, ట్రాఫిక్ జామ్‌లు వంటి ఇబ్బందులు లేకుండా అవయవాలను సరఫరా చేయడానికి డ్రోన్లు ఉపయోగపడతాయి. గుండె, కాలేయం వంటి అవయవాలను డ్రోన్ల సాయంతో తరలించడానికి అవసరమయ్యే తక్కువ బరువున్న సరికొత్త బాక్స్‌ను శాస్త్రవేత్తలు ఇప్పటికే రూపొందించారు. ఇక మీదట ఈ అంబులెన్స్ డ్రోన్లు మనుషుల ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడతాయి. హింసాత్మక ఘటనలకు చెక్! జాతరలు, ఉత్సవాలు, సభలు సమావేశాల సమయాల్లో భద్రతా ఏర్పాట్ల కోసం డ్రోన్లను వినియోగించడం ఇప్పటికే మొదలైంది. అంతేకాదు అలాంటి కార్యక్రమాల్లో ఎవరైనా హింసకు పాల్పడే అవకాశాలుంటే.. ముందుగానే గుర్తించి, హెచ్చరికలు జారీ చేసేలా డ్రోన్లను అభివృద్ధి చేస్తున్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ రకమైన డ్రోన్లు రెండు కెమెరాల సాయంతో వీడియోలు తీయడమే కాకుండా.. ఐదు రకాల ముఖ కవళికలు, చర్యల ఆధారంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని గుర్తిస్తాయి. తన్నడం, పిడిగుద్దులు, పొడవడం, కాల్చడం వంటి చర్యలను కూడా ఇవి గుర్తించగలవు. తద్వారా సమస్య పెద్దది కాకముందే అధికారులు రంగంలోకి దిగేందుకు వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వరంగల్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (బెంగళూరు) శాస్త్రవేత్తలు వీటిని వచ్చే నెలలో పరీక్షించనున్నారు. శత్రు స్థావరాలపై కిల్లర్ డ్రోన్ల నిఘా వందేళ్ల క్రితం మిలటరీ అవసరాల కోసమే తయారు చేసిన డ్రోన్లు.. ఇప్పుడు చాలా శక్తిమంతంగా తయారయ్యాయి. ప్రస్తుతం భారత సైన్యం దగ్గర 200కి పైగా డ్రోన్లు ఉన్నాయి. కొన్ని డ్రోన్లను సరిహద్దుల్లో గస్తీ కోసం వినియోగిస్తుండగా.. శత్రుస్థావరాలపై నిఘా పెట్టే విదేశీ రాడార్లను పసిగట్టే కిల్లర్ డ్రోన్లను ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేశారు. ఇక రూ. 2,650 కోట్ల వ్యయంతో డీఆర్డీవో సొంతంగా డ్రోన్ల తయారీ ప్రాజెక్టును కూడా ప్రారంభించింది. యుద్ధభూమిలో వినియోగిం చడానికి మరో 400 డ్రోన్ల అవసరముందని రక్షణ శాఖ అంచనా వేస్తోంది? -
ఉపాధికి ఊతమిచ్చేలా కోర్సుల రీడిజైన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా వివిధ కోర్సుల్లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, దీని లో భాగంగా తాము కోర్సులను రీడిజైన్ చేస్తున్నామని ఉస్మానియా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లా డారు. వివిధ సర్వేల ప్రకారం దేశంలో ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 20% మందికి, నాన్ ఇంజనీరింగ్ విద్యా ర్థుల్లో 10% మందికే ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని, యూజీ, పీజీ, పీహెచ్డీ చేసిన వారికీ ఉపాధి లభించట్లేదని చెప్పారు. మార్కెట్ అవసరాల మేరకు వివిధ కోర్సుల్లో సిలబస్ మార్పులు చేస్తున్నామని, దీని కనుగుణంగా వర్సిటీ కోర్సుల్లో సంస్కరణలు తెస్తున్నా మన్నారు. వర్సిటీ పాలన విషయంలో పలు మార్పుల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇంజనీరింగ్ కోర్సుల సిలబస్‌లో అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) మార్పు లు చేసిందని, తమ పరిధిలోని కాలేజీల్లో వాటి అమలుకు చర్యలు చేపట్టామన్నారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో కొత్త కరిక్యులమ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇంజనీరింగ్‌లో ఎంటెక్ మైనింగ్, పీజీ డిప్లొమా ఇన్ జెనెటిక్స్ను ఈ విద్యా సంవత్సరంలో అందుబాటులోకి తెస్తున్నామన్నారు. విదేశీ విద్యార్థుల ఆకర్షణలో రెండో స్థానం విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో పూణే వర్సిటీ మొదటి స్థానంలో ఉంటే... ఓయూ రెండో స్థానంలో ఉందని రామచంద్రం తెలిపారు. ప్రస్తుతం ఓయూలో 3,630 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారని, వారి కోసం ప్రత్యేక సెక్షన్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని, అందుకు నిధులు అవసరమని అన్నారు. -
‘న్యాక్’ సర్టిఫికెట్‌కు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: భవన నిర్మాణ రంగంలోని పలు అంశాల్లో యువతకు శిక్షణనిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తెలంగాణ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(ఎన్ఏసీ) మరో ఘనత సాధించింది. న్యాక్‌లో శిక్షణ పొందినవారికి అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలు మెరుగుకాబోతున్నాయి. ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన నేషనల్ ఓపెన్ కాలేజ్ నెట్వర్క్(ఎన్వోసీఎం), ఢిల్లీకి చెందిన ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌తో కలసి త్రైపాక్షిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, న్యాక్ డైరెక్టర్ జనరల్ భిక్షపతి ఆ సంస్థల ప్రతినిధులతో కలసి సంతకాలు చేశారు. ప్రస్తుతం న్యాక్ జారీ చేస్తున్న సర్టిఫికెట్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు లేదు. ఇక్కడ అత్యంత మెరుగైన శిక్షణ ఇస్తున్నట్టు తెలిసినా కొన్ని అంతర్జాతీయ కంపెనీలు, విదేశీ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తటపటాయిస్తున్నాయి. సర్టిఫికెట్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉంటే వారిని నేరుగా ఎంపిక చేసుకునే అవకాశముంటుంది. దీన్ని గుర్తించిన న్యాక్ డీజీ భిక్షపతి ఈ ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల యూకే సంస్థ హైదరాబాద్‌లోని న్యాక్ క్యాంపస్‌ను పరిశీలించి అక్కడి మౌలిక వసతులు, శిక్షణ తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీకి చెందిన సంస్థతో కలిసి న్యాక్‌తో త్రైపాక్షిక భాగస్వామ్యం ఏర్పాటుకు సమ్మతి తెలిపింది. దీంతో ఇక నుంచి న్యాక్‌లో శిక్షణ పొందిన వారికి ఏ దేశంలోనైనా ఉద్యోగాలు పొందేందుకు మార్గం సులభమవుతుందని న్యాక్ డీజీ భిక్షపతి ‘సాక్షి’తో చెప్పారు. -
2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు భారత్ ఆర్థిక వ్యవస్థ!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ విలువ 2030 నాటికి 6.5–7 ట్రిలియన్ డాలర్ల (6.5–7 లక్షల కోట్ల డాలర్లు) శ్రేణికి చేరే అవకాశం ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) చైర్మన్ వివేక్ దేబ్రాయ్ గురువారం పేర్కొన్నారు. 2035–40 నాటికి ఈ విలువ 10 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని కూడా ఆయన విశ్లేషించారు. ప్రస్తుతం భారత్ ఆర్థిక వ్యవస్థ విలువ దాదాపు 2.1 ట్రిలియన్ డాలర్లు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఏడవది. ఇక తలసరి ఆదాయం సైతం 2030 నాటికి 4,000 డాలర్లకు (ప్రసుతం 1,709 డాలర్లు)చేరే అవకాశం ఉందని స్కోచ్ సదస్సులో పాల్గొన్న వివేక్ దేబ్రాయ్ అన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ తన పాత్రను గణనీయంగా మెరుగుపరచుకోనుందని ఆయన ఈ సదస్సులో పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే, చాలా మంది ఇతరుల కోసం ఉపాధి అవకాశాలను సైతం సృష్టిస్తున్నారు.’’ అని వివేక్ దేబ్రాయ్ పేర్కొన్నారు. దేశంలో భూ యాజమాన్యానికి సంబంధించిన వ్యవస్థ మరింత మెరుగుపడాల్సి ఉందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో పది అతిపెద్ద ఎకానమీలు -
చేనేతకు చేయూత
భూదాన్‌పోచంపల్లి/ చౌటుప్పల్: చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలను పెంచడానికి తన వంతు కృషి చేస్తానని పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్, మిస్ ఏషియా ఇంటర్నేషనల్ రష్మిఠాకూర్ చెప్పా రు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలోని పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును సందర్శించారు.మగ్గాలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ... పోచంపల్లి ఇక్కత్ వస్త్రా లకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉన్నప్పటికీ తగిన మార్కెటింగ్ లేక అవకాశాలను అందుకోలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. ఈ నెల 18న కేరళలో జరిగే దక్షిణ భారత ఫ్యాషన్ షోలో పోచంపల్లి గౌను ధరించి జడ్జిగా పాల్గొనబోతున్నానని, అలాగే ఓ హాలివుడ్ సినిమాలో సైతం పోచంపల్లి వస్త్రాలను ప్రమోట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. -
ఉత్తరాంద్ర అభివృద్దిపై చర్చ జరపాలి
-
నిరుద్యోగులకు బంపర్ చాన్స్
ఉద్యోగం సంపాదించాలంటే ఎంత కష్టమో డిగ్రీలు పూర్తిచేసి రెండుమూడేళ్లు తిరిగినవాళ్లకు తెలుస్తుంది. రకరకాల పోర్టళ్లలో రెజ్యూమ్ అప్లోడ్ చేసి నెలలు గడిచినా ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాక నిరాశ చెందేవాళ్లు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి మంచి అవకాశం కల్పిస్తోంది. గతంలో అంటే, సుమారు రెండు మూడు దశాబ్దాల క్రితం అయితే ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిలో పేర్లు నమోదుచేసుకునేవాళ్లు. అప్పుడు వాళ్ల అర్హతలకు తగిన అవకాశాలుంటే ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చేది. ఇప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి కూడా తన రూపం మార్చుకుంది. తాజాగా ఏపీ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి డాట్ కామ్ అనే వెబ్సైట్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఇందులో ఉంటుంది. ఇందులో ఒకసారి రిజిస్టర్ చేసుకుని, తమ రెజ్యూమ్‌ను అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అభ్యర్థి అర్హతలను బట్టి ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. అలాగే ఆయా జిల్లాలు, మండలాల వారీగా ఉండే ఉద్యోగాల సమాచారం కూడా తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం, నోటిఫికేషన్లు, ప్రభుత్వోద్యోగాల సమాచారం అంతా ఈ సైట్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో రిజిస్టర్ చేసుకోడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని సేవలు పూర్తి ఉచితం. అలాగే రిక్రూటర్లు కూడా.. ఈ సైట్లో తమ సంస్థలో ఉన్న ఖాళీల గురించి పోస్ట్ చేస్తే, దానికి తగిన అర్హతలు, నైపుణ్యాలున్న అభ్యర్థులు వాటికి దరఖాస్తు చేస్తారు. పూర్తి వివరాలకు www.apemploymentexchange.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. -
ఉపాధే లక్ష్యంగా వర్సిటీ విద్య
► ఉన్నత విద్యాశాఖ కసరత్తు ► సీబీసీఎస్ అమలయ్యేలా చర్యలు సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ డిగ్రీలతో ఉపాధి అవకాశాలు కరువవడంతో యూనివర్సిటీలు నిర్వహిస్తున్న కోర్సుల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది. ఈ దిశగా రాష్ట్రంలోని యూనివర్సిటీలను సమాయత్తం చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంను (సీబీసీఎస్) ప్రవేశ పెట్టిన ఉన్నత విద్యాశాఖ ఇకపై దాన్ని పక్కాగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకోనుంది. అలాగే సంప్రదాయ కోర్సులు చదివే విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. డిగ్రీ కోర్సుల సిలబస్‌ను పూర్తిగా మార్చడంతోపాటు సీబీసీఎస్‌ను కచ్చితంగా అమలు చేసేలా యూనివర్సిటీలు కార్యాచరణ రూపొందించుకోవాలని ఉన్నత విద్యా మండలి ఆదేశించింది. సంప్రదాయ డిగ్రీలు చేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని స్పష్టం చేసింది. పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫైర్ సర్వీసెస్, కంప్యూటర్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, డాటా ఎంట్రీ తదితర సబ్జెక్టులను కూడా అందుబాటులోకి తేవాలని స్పష్టం చేసింది. ప్రమాణాలు, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా.. దేశంలో 20 విద్యా సంస్థలను వరల్డ్ క్లాస్ సంస్థలుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో.. ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీల పోటీని తట్టుకొని రాష్ట్ర యూనివర్సిటీలు నిలదొక్కుకునేలా చర్యలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ మల్లేశ్, ప్రొఫెసర్ వెంకటాచలం తెలిపారు. అన్నింటిని ప్రపంచస్థాయి విద్యాసంస్థలుగా తీర్చిదిద్దకపోయినా, ఆ స్థాయి లక్ష్యాలతో వర్సిటీల్లో పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఎం.ఫిల్, పీహెచ్డీ ప్రవేశాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక మైనింగ్ యూనివర్సిటీని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగానే ప్రారంభం నుంచే తీర్చిదిద్దుతున్నుట్లు తెలిపారు. తీరు మార్చుకుంటే ఉస్మానియా, జేఎన్టీయూహెచ్ వంటి వర్సిటీలను ఆ స్థాయిలో అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కొత్తగూడెం వర్సిటీ కొత్తగూడెం మైనింగ్ యూనివర్సిటీ ప్రపంచస్థాయి విద్యాసంస్థగా మార్చేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఐదు ప్రభుత్వ రంగ సంస్థలను, మూడు ఐఐటీల నిఫుణులను భాగస్వాములను చేసి, కోర్సుల డిజైన్, అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఒక కమిటీ ని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తమ నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనుంది. ఎన్ఎండీసీ, సింగరేణి, కోల్ ఇండియా, జెన్కో, రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లను భాగస్వాములను చేయడంతోపాటు వాటి అవసరాలకు అనుగుణంగా కోర్సులను డిజైన్ చేస్తోంది. అలాగే కాన్పూర్, ఖరగ్‌పూర్, ధన్‌బాద్ మైనింగ్ వర్సిటీ ప్రొఫెసర్లకు భాగస్వామ్యం కల్పించింది. నియామకాలు కూడా జాతీయ స్థాయిలో చేపట్టే విధానాన్ని రూపొందిస్తోంది. -
కొత్త రంగాలతోనే ఉపాధి
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న యాంత్రీకరణ వల్ల ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయని.. ఈ నేపథ్యంలో కొత్త రంగాలపై దృష్టి సారించి నిరుద్యోగ సమస్యను అధిగమించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) పాలసీకి అనుబంధంగా సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలిసిస్, డేటా సెంటర్స్, ఓపెన్ డేటాపై 4 సెక్టొరల్ పాలసీలను కేటీఆర్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా రంగాలకు చెందిన నిపుణులు, సంస్థల నుంచి సూచనలు స్వీకరించి కొత్త పాలసీలు రూపొందించామన్నారు. అనేక ఐటీ కంపెనీలు నూతన సాంకేతికతను హైదరాబాద్‌కు పరిచయం చేస్తూ.. రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని ఐటీలో ప్రపంచ స్థాయిలో నిలబెట్టాయన్నారు. 5 ఐటీ దిగ్గజ కంపెనీలకుగానూ 4 కంపెనీలు గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ 24 నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయని చెప్పారు. అనేక పెద్ద కంపెనీలు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాయని, ప్రస్తుతం ఆవిష్కరించిన పాలసీలను ఐటీ రంగం అభివృద్ధికి సోపానాలుగా వినియోగించుకోవాలని సూచించారు. డేటా సెంటర్ల ఏర్పాటు నేపథ్యంలో కంప్యూటర్ సర్వర్ల తయారీ ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. సైబర్ సెక్యూరిటీ సవాలుగా మారిందని.. దీనిని ఎదుర్కొంటూ ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఓపెన్ డేటా పాలసీ ద్వారా మిలియన్ల కొద్దీ పేజీల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు వీలవుతుందన్నారు. ఐటీ అనుబంధ పాలసీల ద్వారా రాష్ట్రంలో లక్షలాది కొత్త ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్ వెల్లడించారు. ఐటీ రంగానికి అనుబంధంగా పది సెక్టొరల్ పాలసీలకుగానూ.. ఇప్పటి వరకు ఎనిమిది పాలసీలను రూపొందించినట్లు ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. తొలి విడతలో ఆవిష్కరించిన 4 సెక్టొరల్ పాలసీల ద్వారా 29 సంస్థలు.. రాష్ట్ర ప్రభుత్వంతో ఉపాధి కల్పన దిశగా ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. 250 మంది ప్రైవేటు భాగస్వాములతో సంప్రదింపులు జరిపి సెక్టొరల్ పాలసీలు రూపొందించామని.. పాలసీలు ఆచరణలోకి వస్తే అద్భుత ఫలితాలు వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్సార్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఫైజాన్ ముస్తాఫా, జెఎన్టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య, ఐటీ సంస్థల ప్రతినిధులు బీవీఆర్ మోహన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కేఎస్విశ్వనాథ్, ఆనంద్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. పలు ఒప్పందాలపై సంతకాలు సెక్టొరల్ పాలసీల ఆవిష్కరణ సందర్భం గా రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ మేరకు కేటీఆర్ సమక్షంలో జయేశ్ రంజన్ ఆయా సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. సిస్కో, ఫాక్ట్లీ, డీఎస్‌సీఐ, కంట్రో ల్ ఎస్, ఎస్సీఎస్సీ, నాస్కామ్, క్రాప్ డేటా టెక్నాలజీస్ తదితర సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్న జాబితాలో ఉన్నాయి. సిటీ డిజిటల్ ప్లాట్‌ఫాంలు, వీడియో ఆధారిత తరగతి గదులు, హైదరాబాద్‌కు చెందిన చారిత్రక కట్టడాల డిజిటలైజేషన్, జాయింట్ సైబర్ సెక్యూరిటీ చార్టర్ అభివృద్ధి, డేటా సెంటర్ల ఏర్పాటు, సైబర్ సెక్యూరిటీ రెస్పాన్స్ సెంటర్, మాల్వేర్ రీసెర్చ్ సెంటర్, క్రిప్టోగ్రఫీలపై ఆయా సంస్థలు రాష్ట్రంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సైబర్ సెక్యూరిటీ పాలసీ.. రక్తపాత రహిత యుద్ధాలుగా పరిగణిస్తున్న సైబర్ వార్స్ ప్రపంచానికి వెలకట్టలేని నష్టాన్ని కలిగిస్తున్నాయి. తెలంగాణలోని పెద్ద కంపెనీలూ సైబర్ దాడులకు గురవుతున్నా.. ఎదుర్కొనేందుకు శిక్షణ, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఉంది. ఈ నేపథ్యంలో అవసరమైన మానవ వనరులను తయారు చేయడంతో పాటు.. సైబర్ దాడులను ఎదుర్కొనేలా సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించాల్సి ఉంది. ఈ పాలసీ ద్వారా సైబర్ సెక్యూరిటీపై అవగాహన, సైబర్ నేరాల నిరోధానికి అవసరమైన సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తులు తయారు చేసే స్టార్టప్‌లను ప్రోత్సహిస్తుంది. సైబర్ సెక్యూరిటీపై జరిగే పరిశోధనలను సంస్థలు, రాష్ట్రాలు పరస్పరం మార్పిడి చేసుకునేలా చూస్తారు. ఐటీ అనుబంధ పాలసీల ప్రత్యేకతలివే.. త్వరలో మరో రెండు అనుబంధ పాలసీల ఆవిష్కరణ రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఐటీ రంగానికి మరింత ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో ‘ఐటీ పాలసీ’ని ఆవిష్కరించింది. ఐటీ రంగానికున్న విస్తృతిని దృష్టిలో పెట్టుకుని ఒక్కో అనుబంధ రంగానికి ఒక్కో సెక్టొరల్ పాలసీ రూపొందిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌లో 4 ఐటీ అనుబంధ పాలసీలను ఆవిష్కరించగా.. గురువారం మరో నాలుగు పాలసీలను విడుదల చేసింది. ఐఓటీ, స్మార్ట్ టెక్నాలజీస్, ఈ-వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించిన మరో రెండు అనుబంధ పాలసీలను త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా విడుదల చేసిన 4 పాలసీల్లోని ప్రత్యేకతలు ఇవీ.. - సాక్షి, హైదరాబాద్ ఓపెన్ డేటా పాలసీ.. ప్రభుత్వ పాలనలో పారదర్శకత లక్ష్యంగా రూపొందించిన ఈ పాలసీ ద్వారా ప్రజలు, విధాన నిర్ణేతలు, సమాచార వినియోగదారులు, స్టార్టప్‌లు, ప్రైవేటు సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ విభాగాల వారీగా డేటా నిర్వహణకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది. పాలసీ విడుదలైన ఆరు నెలల్లోగా ఆచరణకు అవసరమైన మార్గదర్శకాలను ఐటీ విభాగం రూపొందిస్తుంది. పాలసీ అమలు తీరును పర్యవేక్షించేందుకు వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారు. డేటా సెంటర్స్ పాలసీ.. భౌగోళికంగా రాష్ట్రానికున్న అనుకూలతల దృష్ట్యా హైదరాబాద్‌లో డేటా సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ఈ పాలసీ దోహదం చేస్తుంది. డేటా సెంటర్స్ క్యాంపస్‌లో ప్రైవేటు సంస్థలు తమ డేటా సెంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. మౌలిక సౌకర్యాలను క్యాంపస్‌లో ప్రభుత్వం కల్పిస్తుంది. నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో పాటు క్యాంపస్‌లో ఏర్పాటయ్యే డేటా సెంటర్లకు కనీసం 10 శాతం వ్యాపారానికి ప్రభుత్వం హామీ ఇస్తోంది. ప్రభుత్వం సొంతంగా స్టార్టప్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తుంది. డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి ప్రత్యేక రాయితీలిస్తుంది. డేటా అనెలిటిక్స్ పాలసీ.. సాంకేతికత ద్వారా ప్రజల ముంగిట్లోకి పాలన తీసుకెళ్లేందుకు ఈ విధానం దోహదం చేయనుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లోని టెక్నాలజీ బిజినెస్ సెంటర్లో డేటా అనలిటికల్ పార్కును ఏర్పాటు చేస్తారు. సమాచార విశ్లేషకులు, పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు డేటా సెంటర్‌తో సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ డేటా అనలిటికల్ సెంటర్లను విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది. డేటా అనలిస్టులు, డేటా సైంటిస్టులు, డేటా మైనిం గ్ నిపుణులు తదితరులకు శిక్షణ ఇచ్చేం దుకు టాస్క్ ద్వారా.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామాల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ సమాచారాన్ని ఈ కేంద్రాల ద్వారా అందుబాటులోకి తెస్తారు. టీ హబ్‌కు అనుబంధంగా డేటా అనలిటిక్స్ స్టార్టప్‌ల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తారు. -
జర్నలిజం కోర్సుతో ఉపాధి అవకాశాలు
కేయూ క్యాంపస్ : జర్నలి జం కోర్సు పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఈ మేరకు సమాజంలో జరిగే విషయాలపై అవగాహన, భాషపై పట్టు సాధిస్తే భవి ష్యత్‌లో వృత్తిలో రాణించవచ్చని కేయూ దూరవిద్యా కేంద్రం జర్నలిజం విభా గం విభాగాధిపతి డాక్టర్ సంగాని మల్లేశ్వర్ అన్నారు. దూరవిద్యా కేంద్రంలోని జర్నలిజం విద్యార్థుల ఫీల్డ్ విజిట్‌ను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాగా, ఫీల్డ్‌విజిట్‌లో భాగంగా విద్యార్థులు ఆకాశవాణి వరంగల్ కేంద్రంను సందర్శించగా పనితీరు, రేడియో కేంద్రాల్లో ఉద్యోగావకాశాల వివరాలను ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టర్ చల్లా జైపాల్‌రెడ్డి, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ సూర్యప్రకాశ్, ప్రోగ్రాం అనౌన్సర్ డాక్టర్ వి.వీరాచారి, గాదె మోహన్ తెలిపారు. జర్నలిజం విభాగం అధ్యాపకులు కె.నర్సిం హారాములు, డి.రామాచారి, సుంకరనేని నర్సయ్య, డి.శ్రీకాంత్, పులి శరత్, వం గాల సుధాకర్, పి.పద్మ పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో మొదటి ఐకియా స్టోర్
భారత్‌లో తొలిస్టోర్‌కు శంకుస్థాపన 2017 చివరికల్లా ప్రారంభం 2,000 మందికి ఉపాధి అవకాశాలు ఐకియా ఇండియా సీఈఓ జువెన్సియో హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగ దిగ్గజం, స్వీడన్‌కు చెందిన ఐకియా భారత్‌లో తొలి స్టోర్‌కు గురువారం శంకుస్థాపన చేసింది. హైదరాబాద్ హైటెక్‌సిటీ సమీపంలో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2017 చివరినాటికి ప్రారంభం కానున్న ఈ ఔట్‌లెట్‌కు రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 15 ఎకరాల స్థలాన్ని కంపెనీ కొనుగోలు చేసింది. ప్రత్యక్షంగా 500, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ తెలిపింది. సుమారు 7,500 హోం ఫర్నిషింగ్ ఉత్పత్తులను ఈ స్టోర్‌లో విక్రయిస్తారు. పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలం, ఉద్యోగుల పిల్లల కోసం డే కేర్ సెంటర్, 1,000 మంది కూర్చునే వీలున్న రెస్టారెంట్‌ను కూడా దీన్లో భాగంగా ఏర్పాటు చేస్తారు. రెస్టారెంట్లో స్వీడిష్, ఇండియన్ వంటకాలను ఆఫర్ చేస్తారు. భారత్‌లోనూ ఆన్లైన్లో.. ఔట్లెట్ ఏర్పాటుకు ఐకియా ఇప్పటికే ముంబైలో కూడా స్థలాన్ని సమకూర్చుకుంది. ఢిల్లీ ఎన్సీఆర్, బెంగ ళూరులోనూ స్టోర్లు ఏర్పాటు చేస్తోంది. ఈ మూడు 2018 కల్లా పూర్తవుతాయని ఐకియా ఇండియా సీఈవో జువెన్సియో మాజూ మీడియాకు తెలిపారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 9 నగరాల్లో 25 ఔట్లెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు కంపెనీ రూ.10,500 కోట్ల దాకా వెచ్చించనుంది. ప్రస్తుతం భారత్ నుంచి కంపెనీ రూ.2,250 కోట్ల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. 2020 నాటికి ఇది రెండింతలు అవుతుందని భావిస్తోంది. ఈ-కామర్స్ సేవల్ని భారత్‌లో పరిచయం చేయనుంది కూడా. నాలుగైదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సంస్థ ఆదాయంలో ఈ-కామర్స్ నుంచి 10 శాతం సమకూరుతుందని అంచనా వేస్తోంది. 2015 చివరినాటికి ఇది 3 శాతమే ఉంది. కంపెనీ కార్యకలాపాలు సాగిస్తున్న 28 దేశాలకుగాను సగం మార్కెట్లలో ఈ-కామర్స్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. జీఎస్టీతో ఊతం.. జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలపడం ద్వారా ప్రపంచవ్యాప్త ఇన్వెస్టర్లకు అతిపెద్ద సానుకూల సందేశం ఇచ్చినట్లయిందని మాజూ వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లకు జీఎస్టీ ధైర్యాన్నిస్తుందని, దీంతో నిధులు కూడా వస్తాయని చెప్పారాయన. వ్యాపారానికి, ప్రజలకు దీనివల్ల ప్రయోజనమేన ని, ఉత్పత్తులు తక్కువ ధరకు దొరుకుతాయని చెప్పారు. -
ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవాలి
డ్వామా పీడీ హరిత ఇబ్రహీంపట్నం : ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలని డ్వామా పీడీ హరిత అన్నారు. ముకునూర్ గ్రామంలో లైఫ్ ప్రాజెక్ట్ కింద ఉపాధి హామీలో పనిచేస్తున్న యువ రైతులకు ఆరు రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ కేంద్రాన్ని ఆదివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమకున్న వనరులతోనే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలన్నారు. వర్మీకంపోస్టు ఎరువులను తయారు చేసుకునే పద్ధతులను నేర్చుకోవాలన్నారు. రసాయనిక ఎరువులను తగ్గించడం వలన నాణ్యమైన పంట చేతికందడంతోపాటు ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. ఆధునిక వ్యవసాయాన్ని సాగుచేసుకునే పద్ధతులను మెరుగుపరిచేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదం చేస్తుందన్నారు. అనంతరం ఆమె పొల్కంపల్లి, నాగ¯ŒSపల్లి రోడ్ల కిరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. నాటిన మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో లైఫ్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ శ్యామల, సర్పంచ్ లక్ష్మమ్మ, ఉపాధి హామీ ఏపీడీ తిరుపతయ్య, టీఏలు బాబురావు, రవి పాల్గొన్నారు. -
విడుదలైన ఖైదీలకు ఉపాధి అవకాశాలు
* ప్రణాళిక సిద్ధం చేసిన జైళ్ల శాఖ * పలు ప్రైవేటు కంపెనీలతో అవగాహనా ఒప్పందం * వచ్చే 15 ఏళ్లలో 10 వేల ఉద్యోగాల కల్పన లక్ష్యం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జైళ్ల శాఖ పూచీకత్తుగా విడుదలైన ఖైదీలకు ఆ శాఖ భాగస్వామ్యంతో పనిచేసే ప్రైవేటు కంపెనీలలోనూ 25 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు. శనివారం చంచల్గూడలోని జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 91 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. వచ్చే 15 ఏళ్లలో పదివేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. జైళ్ల శాఖ వస్తువులకు భారీ డిమాండ్.. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో తయారయ్యే వస్తూత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటోంది. నాణ్యతతో కూడిన వస్తువులు కావడంతో విద్యాశాఖ తమ ఫర్నిచర్ కోసం భారీగా ఆర్డర్లు ఇచ్చింది. రాష్ట్రంలోని పలు జైళ్లల్లో ఖైదీలకు పెట్రోల్ బంకుల నిర్వహణ, నేచురల్ స్పా, కుట్లు, అల్లికలు, ఫర్నిచర్, స్టీల్ సామగ్రి తయారీలో శిక్షణనిచ్చి మూడుషిప్టుల్లో పనిచేయిస్తున్నారు. పెట్రోల్‌బంకుల లాభాల బాట పట్టడంతో కొత్తగా మరో మూడు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. గతేడాది జైళ్లశాఖ వివిధ మార్గాల ద్వారా రూ.4.42 కోట్ల లాభాలను ఆర్జించింది. నెలకు రూ. 8 వేలు ఇస్తున్నారు: మనోజ్‌కుమార్ సోని, విడుదలైన ఖైదీ పదేళ్లలో ఇప్పటి వరకు 16 సార్లు జైలుకు వెళ్లాను. చాలాసార్లు చేయని నేరానికి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఖైదీ అనే ముద్ర పడటంతో ఎక్కడా ఉపాధి లభించలేదు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోనే నాలుగు కేసులు నమోదు చేశారు. ఇన్ఫార్మర్గా మారాలని లేకపోతే పీడీయాక్టు పెడతామంటూ పోలీసులు బెదిరిస్తున్నారు. ఈ విషయాన్ని జైలు అధికారులకు చెబితే వారే ఉద్యోగం కల్పించారు. ప్రస్తుతం నెలకు రూ.ఎనిమిది వేలు ఇస్తున్నారు. -
యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ
సాక్షి, హైదరాబాద్: యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ముందడుగు వేస్తున్నాయి. దేశంలో చాలా పరిశ్రమలు నైపుణ్యం కలిగిన కార్మికులు లభించక సతమతమవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధికోసం శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా మోడల్ కెరీర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాయి. వీటి నిర్వహణకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో శిక్షణ కేంద్రాలను నెలకొల్పాలని రాష్ట్ర కార్మికశాఖ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా కార్మికశాఖ ఆధ్వర్యంలోని ఉపాధి కల్పన విభాగం కసరత్తు చేస్తోంది. సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి నివేదికలు పంపించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో మూడు సెంటర్లకు పచ్చజెండా ఊపింది. హైదరాబాద్‌లోని మల్లేపల్లి శిక్షణ కేంద్రంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ, వరంగల్‌లో ఏర్పాటు చేసిన సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటి నిర్వహణ ఖర్చుల కోసం రూ.30 కోట్లు మంజూరు చేసింది. త్వరలో మరో మూడు సెంటర్లకు అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. వాటిని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్‌లలో ఏర్పాటు చేయాలని ఉపాధి కల్పనశాఖ యోచిస్తోంది. నిరంతరాయంగా శిక్షణ తరగతులు.. ఈ సెంటర్లలో యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణతోపాటు ఎలాంటి చదువులతో మెరుగైన ఉపాధి లభిస్తుందో వివరిస్తారు. ఈ ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. కాగా, జిల్లాల్లో ఉపాధి కల్పన కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందినే ఈ సెంటర్లలో వినియోగించుకోవాలని భావిస్తున్నారు. -
చేనేత ఉత్పత్తులకు ఆన్లైన్ ట్రేడింగ్
అమెజాన్ ద్వారా ఆన్లైన్ విక్రయాలను ప్రారంభించిన మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చేనేత ఉత్పత్తులకు ఆన్లైన్ ట్రేడింగ్ సదుపాయం కల్పించడం ద్వారా కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అంతర్జాతీయ ఆన్లైన్ విక్రయ సంస్థ అమెజాన్ ద్వారా ‘టెస్కో’ ఉత్పత్తుల విక్రయాలను ఆప్కోహౌస్లో శుక్రవారం ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పోచంపల్లి, నారాయణ్‌పేట్, గద్వాల్ తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులు తయా రుచేసిన ఉత్పత్తులను ఆన్లైన్లో ప్రదర్శించడం వలన మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతాయన్నారు. దళారుల ప్రమేయం తగ్గడం ద్వారా, రాష్ట్రంలోని 1.20లక్షల మంది కార్మికుల ఉత్పత్తులకు మంచి డిమాండూ వస్తుందన్నారు. టెస్కో ఉత్పత్తుల కోసం ‘షాప్.తెలంగాణఫ్యాబ్రిక్స్.కాం’ వెబ్సైట్ సందర్శిం చవచ్చన్నారు. హస్తకళల విక్రయాల కోసం ఇటీవల ప్రారంభించిన ఆన్‌లైన్‌ట్రేడింగ్ సత్ఫలితాలనిస్తుంద న్నారు. ఆధునిక ఉత్పత్తులు తయారు చేసేలా చేనేత కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. హ్యాండ్లూమ్స్ విభాగం డెరైక్టర్ ప్రీతీమీనా, జాయింట్ ఎండీ సైదా, టెస్కో జీఎం యాదగరి పాల్గొన్నారు. -
4 జిల్లాల్లో ‘నై’పుణ్య శిక్షణ!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ శాఖల పరిధుల్లోని శిక్షణ, నైపుణ్య కార్యక్రమాలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీల్లోని నిరుద్యోగులతోపాటు ఆయా రంగాల్లో శిక్షణను ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమాల ఉద్దేశం. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ(కార్పొరేషన్) నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల తీరు అధ్వానంగా ఉంది. మరో 25 రోజుల్లో ప్రస్తుత ఆర్థికసంవత్సరం ముగియనుండగా, స్కిల్‌డెవలప్‌మెంట్ కింద రాష్ట్ర రాజధానిలో కనీసం ఒక్కరికి కూడా శిక్షణ ఇవ్వకపోవడం గమనార్హం. హైదరాబాద్‌తోపాటు మెదక్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కరికి కూడా నైపుణ్యాల మెరుగుదల కింద శిక్షణ ఇవ్వలేదు. ఈ ఏడాది హైదరాబాద్‌లో 505, మిగతా 9 జిల్లాల్లో 500 చొప్పున అంటే 5,005 మందికి శిక్షణను అందించాలని ఎస్సీ కార్పొరేషన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకు రూ.10 కోట్లను కేటాయించారు. ఫిబ్రవరి ఆఖరుకల్లా మొత్తం 1,072 మందికి రూ.2.10 కోట్లే ఖర్చు చేశారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 500 మందికిగాను 380 మందికి, కరీంనగర్లో 224, నిజామాబాద్‌లో 220, నల్లగొండలో 102, మహబూబ్‌నగర్‌లో 86, ఖమ్మంలో 60 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చారు. ఎస్టీలకూ అంతంతే: షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక కార్పొరేషన్(ట్రైకార్) ద్వారా భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరు (ఆదిలాబాద్) ఐటీడీఏల పరిధిలో 7 వేల మందికి శిక్షణ ఇచ్చి ఆయా సంస్థల్లో వారిని నియమించేలా నిర్ణయించారు. అయితే 997 మందికి శిక్షణనిచ్చి, వారిలో 700 మందికి ప్లేస్మెంట్ ఇచ్చారు. నేరుగా ప్లేస్మెంట్ ద్వారా 1,194 మందికి అవకాశం కల్పించినట్లు ఎస్టీ కార్పొరేషన్ గ ణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్వయం ఉపాధి కింద మూడు ఐటీడీఏలను కలుపుకుని 4,483 మందికి శిక్షణను ఇవ్వగా, ఇంకా 169 మంది శిక్షణను కొనసాగిస్తున్నారు. ఈ 3 ఐటీడీఏల్లోని యూత్ ట్రైనింగ్ సెంటర్ల(వైటీసీ) ద్వారా స్వయం ఉపాధి, శిక్షణ ఇస్తున్నారు. వైటీసీల ద్వారా భద్రాచలంలో మొత్తం 2,967 మందికి, ఏటూరునాగారంలో 2135 మందికి, ఉట్నూరులో అత్యధికంగా 6,672 మందికి ఆయా రంగాల్లో శిక్షణ ఇచ్చినట్లు పేర్కొంది. -
బాల్య వివాహానికి అడ్డుకట్ట!
ఎర్రబొట్టు కార్యక్రమాన్ని నిలిపివేసిన సూపర్వైజర్, సర్పంచ్ పెళ్లి చేయమని హామీ ఇచ్చిన అమ్మారుు తల్లిదండ్రులు కెరమెరి : మరో నెల తర్వాత వివాహం.. అందుకు ఆ కుటుంబంలో సందడి నెలకొంది. పెళ్లికి ముందు నిర్వహించే కార్యక్రమం ఎర్రబొట్టును ఆదివారం ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రమీల, మోడీ గ్రామ పంచాయతీ సర్పంచ్ పెందూర్ జలపతి అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మోడి పంచాయతీ పరిధి కొలాంఝరి గ్రామానికి చెందిన టేకం భీంరావు, కన్నిబాయి దంపతుల కూతురు సోంబాయి(14)తో ముర్కిలొంక గ్రామానికి చెందిన ఆత్రం రాజు(18)కు నెల తర్వాత వివాహం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఎర్రబొట్టు కార్యక్రమం నిర్వహిస్తున్నారని అందుకున్న సమాచారంతో సూపర్వైజర్ ప్రమీల, సర్పంచ్ జలపతి ఆ గ్రామానికి వెళ్లారు. ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అబ్బాయి, అమ్మాయిల వయసు చాలా తక్కువగా ఉందని, ఇది చట్టవిరుద్దమని తెలిపారు. అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సారాల వయసు ఉండాలని, అప్పుడే వివాహానికి అర్హులని పేర్కొన్నారు.ను అతిక్రమించి పెళ్లి జరిపిస్తే రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు, రూ.2 లక్షల జరిమానా విధించనున్నట్లు చెప్పారు. అలాగే చిన్నతనంలో పెళ్లి చేస్తే భవిష్యత్తులో జరిగే అనర్థాలను వివరించారు. దీంతో వయసు నిండాకే వివాహం చేస్తామని అమ్మాయి తల్లిదండ్రులు హామి ఇచ్చారు. అమ్మాయిల చదువు కోసం చాలా చేస్తుందని పాపను చదివిస్తే సమాజంగురించి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ,ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. దీంతో ఎర్రబొట్టు కార్యాక్రమానికి వచ్చిన బంధువులతో పాటు కుటుంభ సభ్యులు ప్రమీలమాటలకు ఏకీభవించి కార్యక్రమాన్ని నిలిపివేశారు. -
యూఏఈలో ఉపాధికి సర్కార్ బాటలు
రాయికల్: గల్ఫ్, ఆఫ్రికా దేశాల్లో తెలంగాణ యువత ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ఇప్పటికే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు చెందిన 3 లక్షల మంది కార్మికులు యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఉపాధి పొందుతున్నారు. ఇందులో వేలాది మంది కార్మికులు నకిలీ ఏజెంట్ల మాటలు నమ్మి అక్కడకు వెళ్లి నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక ముందు ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా.. ఏజెంట్ల ప్రమేయం లేకుండా, యువతకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (టామ్‌కామ్) పేరిట కేంద్ర ప్రభుత్వం నుంచి లెసైన్స్ పొందిన రాష్ట్ర ప్రభుత్వం... రాష్ట్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 19న తెలంగాణ డిప్యూటీ సీఎం మహబూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితలు దుబాయ్ వెళ్తున్నారు. ఈ నెల 20న దుబాయ్‌లోని భారత కాన్సులేట్‌లో పలు యూఏఈ కంపెనీల అధికారులతో నియామకాలకు సంబంధించి పలు ఒప్పందాలు కుదురుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విజన్-2022లో భాగంగా 500 మిలియన్ల యువతకు స్కిల్ ట్రెయినింగ్, డెవలప్మెంట్లో శిక్షణ ఇవ్వనుంది. ఇలా శిక్షణ తీసుకున్న యువతకు తెలంగాణ ప్రభుత్వం టామ్‌కామ్ యూఏఈలోని పలు కంపెనీలకు సిఫార్సు చేయనున్నారు. ఇందులో తమ నైపుణ్యాలకు అనుగుణంగా ఉన్న వారిని ఆయా కంపెనీలు ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఏజెంట్ల బెదడ కూడా తప్పుతుంది. -
అభివృద్ధి జరగాలంటే పోరాటాలుండాల్సిందే
రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం మెదక్ టౌన్: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పోరాటాలు జరగాల్సిందేనని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ‘తెలంగాణ పునర్నిర్మాణం - ఉపాధ్యాయుల పాత్ర’ అనే అంశంపై ఆదివారం మెదక్ పట్టణంలోని క్రిస్టల్ గార్డెన్స్‌లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి జరగాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వివక్షకు, దోపిడీకి గురికావడం వల్లే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. ప్రజాసంఘాల వేదికగానే ఉద్యమం జరిగిందని, తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ప్రజా సంఘాల ఐక్యత అవసరమని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతను తెలిపే సదస్సులను టీచర్లు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా, వైద్య, వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజలకు కనీస వసతులు అందేలా అందరూ కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు చిన్న పరిశ్రమలు పెద్దఎత్తున రావాల్సిన అవసరం ఉందన్నారు. సదస్సులో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కొండల్‌రెడ్డి, మనోహర్ రాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతిరెడ్డి, కార్యదర్శి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కారుణ్య నియామకాలకు గ్రీన్‌సిగ్నల్
* ఒక బాధిత కుటుంబం గోడు విని చలించిన సీఎం కేసీఆర్ * పెద్ద దిక్కును కోల్పోయినవారి పరిస్థితి దయనీయం * వారిని ఏళ్ల తరబడి తిప్పుకోవడం సరికాదు * పరిహారం, ఉద్యోగం, ఇంటి స్థలం.. ఏది వర్తిస్తే అది అందజేయండి * వెంటనే జాబితాలు సిద్ధం చేయండి * అర్హులైన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: కారుణ్య నియామకాల విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని, బాధిత కుటుంబాల్లోని అర్హులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కొన్నేళ్ల కింద వరంగల్ జిల్లాలో జరిగిన నక్సల్స్ దాడి ఘటనలో ఒక కానిస్టేబుల్ సోదరుడు మరణించాడు. అప్పటి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని మాటిచ్చినా... ఇప్పటికీ కనీసం పరిహారం కూడా అందలేదు. దిక్కూమొక్కూ లేని ఆ కుటుంబం ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలసి తమ గోడు వెళ్లబోసుకుంది. దీనిపై స్పందించిన సీఎం... బాధిత కుటుంబానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏమేం వర్తిస్తాయో అవన్నీ వెంటనే అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి బాధిత కుటుంబాలు ఉన్నాయనే అంశం చర్చకు వచ్చింది. దానిపై స్పందించిన సీఎం.. అలాంటి వారందరికీ వెంటనే సాయం చేయాల్సిందిగా సూచించారు. ‘‘పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి ఇవ్వాల్సిన లబ్ధి ఏమైనా ఉంటే.. ఎప్పుడైనా ఇవ్వక తప్పదు. అలాంటప్పుడు మీనమేషాలు లెక్కించడమెందుకు..? పరిహారం, ఉద్యోగ అవకాశం, ఇంటి స్థలం.. వారికేది వర్తిస్తే అది వెంటనే అందజేసి ఆ కుటుంబానికి అండగా ఉండాలి. వారిని ఏళ్ల తరబడి తిప్పుకొంటే ప్రయోజనమేంటి?..’’ అని సీఎం కేసీఆర్ సీఎంవో అధికారులతో పేర్కొన్నారు. వెంటనే జిల్లాల వారీగా, శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల జాబితాను తెప్పించాలని ఆదేశించారు. వెంటనే వాటిని ఎక్కడెక్కడ భర్తీ చేసే వీలుందో కసరత్తు చేయాలని సూచించారు. బాధిత కుటుంబీకుల్లో అర్హులైన వారికి వీలైనంత తొందరగా పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. దీంతో పాటు అసాంఘిక శక్తుల దాడుల్లో చనిపోయినవారి కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయం, పరిహారం వంటి అంశాలు పెండింగ్‌లో పెట్టకుండా చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. 1,500 మంది ఎదురుచూపులు మావోయిస్టులు, ఉగ్రవాదుల దాడుల్లో చని పోయిన వారి కుటుంబాలు, విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలు ప్రతి జిల్లాలో ఉన్నాయి. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబాలను ఆదుకునేందుకు.. ఆ కుటుంబంలో అర్హతలున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే కారుణ్య నియామక విధానం అమల్లో ఉంది. కానీ ఏ శాఖలో ఉద్యోగి చనిపోయినా.. అదే శాఖలో ఉద్యోగం ఇవ్వాలని, రోస్టర్ పాయింట్ ప్రకారం ఖాళీ ఉంటేనే ఉద్యోగావకాశం కల్పించాలనే నిబంధనలు ప్రతిబంధకంగా మారాయి. దీంతో ప్రతి జిల్లాలో కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్నవారి సంఖ్య వందల్లోకి చేరింది. ఖాళీలు, స్పష్టమైన నిబంధనలు లేకపోవడం వంటి కారణాలతో.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాల పరిధిలో దాదాపు 1,500 మందికిపైగా కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్నట్లు అంచనా. కారుణ్య నియామకాలపై ముఖ్యమంత్రి స్పందించిన తీరు బాధిత కుటుంబాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. -
కళాశాల నుంచి ఉద్యోగానికి!
సాక్షి, హైదరాబాద్: మొక్కుబడిగా సాగుతున్న ఐటీఐ కాలేజీలను బలోపేతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం యువతను పరిశ్రమలకు అవసరమైన రీతిలో తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఐటీఐ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొం దిస్తోంది. అందుకనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇప్పించి, సంబంధిత కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు మొదటి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పది కాలేజీలను ఎంపిక చేసి నైపుణ్య తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకవసరమయ్యే యంత్ర సామగ్రి, సౌకర్యాల కోసం ప్రైవేటు కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విడతల వారీగా మొత్తం 60 కాలేజీల్లో ఇదే విధానాన్ని తేవాలని భావిస్తోంది. కాలేజీలకు పరిశ్రమల తోడ్పాటు ప్రభుత్వ సూచన మేరకు ఐటీఐ కాలేజీల్లో యంత్ర సామగ్రిని అందించేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయి. మారుతీ సుజుకీ, హ్యుండాయ్, ఫోర్డు కంపెనీలు పలు కాలేజీలతో ఎంవోయూ కుదుర్చుకొని డబ్బులు అందజేశాయి. మారుతీ సుజుకీ 3 కాలేజీలతో ఒప్పందం చేసుకొని రూ.36 లక్షలు ఇచ్చింది. అలాగే హ్యుండాయ్ కంపెనీ రెండు కాలేజీలు, ఫోర్డు ఒక కాలేజీతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. శిక్షణ అనంతరం తమ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చాయి. -
కొలువు లేదని తనువు చాలిస్తున్నారు!
♦ రాష్ట్రంలో ఏటా 4 వేల మంది పురుగు మందు తాగి ఆత్మహత్య ♦ బాధితుల్లో 34 శాతం మంది 30 ఏళ్లలోపు వారే ♦ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లోనే అధికం ♦ ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక విలవిల సాక్షి, హైదరాబాద్: కష్టపడి చదివిన డిగ్రీలు, మాస్టర్ డిగ్రీలు ఎందుకూ కొరగానివవుతున్నాయి. పీహెచ్‌డీలు సైతం పనికిమాలిన పత్రాలుగా మారిపోతున్నాయి. వయసు మీరిపోతున్నా ఉద్యోగం రాకపోవడం, కుటుంబ భారం, అసమర్థులుగా మిగిలిపోతున్నామన్న బాధ, పేదరికం... వెరసి రాష్ట్రంలో పురుగు మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కటంటే ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల కాకపోవడం, ప్రైవేట్ రంగంలోనూ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండటంతో పేదింట విషాద ఛాయలు నెలకొంటున్నాయి. వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు, ఎమర్జెన్సీ మొబైల్ అంబులెన్స్‌లు... తదితరాల నుంచి సేకరించిన సమాచారం మేరకు గతేడాది ఏపీలోని 13 జిల్లాల్లో 4 వేల మంది పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో ఊహించుకోవచ్చు. ప్రభుత్వ రంగంలో కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉన్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలనూ తొలగిస్తుండడంతో యువలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. బతకడానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది బలవన్మరణానికి పాల్పడ్డవారిలో పురుషులు 70 శాతం, మహిళలు 30 శాతం ఉన్నారు. తెల్లరేషన్ కార్డుదారులే ఎక్కువ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువతలో ఎక్కువ శాతం మంది తెల్లరేషన్ కార్డుదారులే కావడం గమనార్హం. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల నుంచే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు వివిధ ప్రభుత్వాసుపత్రులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో వెల్లడైంది. నెల్లూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఆసక్తిరకమైన అంశం ఏమిటంటే మృతుల్లో ఎక్కువ మంది వెనుకబడిన కులాలకు చెందినవారే ఉంటున్నారు. రాష్ట్రంలో ప్రతినెలా కనీసం 350 నుంచి 400 మంది పురుగు మందు తాగి తనువు చాలిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రభుత్వ ఆసుత్రులకు వచ్చే ఎమర్జెన్సీ కేసుల్లో 0.5 నుంచి 0.7 శాతం కేసులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన వారే ఉన్నారు. విచిత్రమేమంటే ఇలాంటి వారిలో గ్రామీణ ప్రాంతాలవారు 65 శాతం, పట్టణ ప్రాంతాల వారు 29 శాతం, గిరిజన ప్రాంతాల వారు 6 శాతం ఉంటున్నారు. ఇలాంటి ఘటనలు ప్రభుత్వాసుపత్రుల్లో 79 శాతం, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 12 శాతం నమోదవుతున్నాయి. -
అభివృద్ధితో కరువు నివారణ
* పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని అనువైన స్థలం ‘అనంత’ * పారిశ్రామిక రంగ అభివృద్ధి ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం * పెనుకొండలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు * త్వరలో సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటు * రైతుకోసం చంద్రన్న ముగింపు కార్యక్రమంలో సీఎం అనంతపురం ఎడ్యుకేషన్ : వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధితోనే కరువును శాశ్వతంగా నివారించి ‘అనంత’ను ప్రగతి పథంలో నడుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ‘రైతు కోసం చంద్రన్న’ ముగింపు కార్యక్రమం, బెల్ పరిశ్రమ శంకుస్థాపన కోసం బుధవారం జిల్లాకు విచ్చేసిన ఆయన రెండు సభల్లో ప్రసంగించారు. మొదట రైతు కోసం చంద్రన్న సభలో పాల్గొన్న ఆయన తర్వాత గోరంట్ల మండలం పాలసముద్రంలో రక్షణశాఖ కేంద్రమంత్రి మనోహర్ పారికర్‌తో కలిసి బెల్కంపెనీకి శంకుస్థాపన చేశారు. సోమందేపల్లిలోని బహిరంగసభలో మాట్లాడారు. ‘పట్టిసీమను 6నెలల 20 రోజుల్లో పూర్తి చేసి గోదావరి జలాలను కృష్ణా బ్యారేజ్‌లో కలిపాం. కృష్ణాబ్యారేజ్కు విడుదల చేయాల్సిన నీటిని శ్రీశైలంలో పొదుపుచేసి తర్వాత రాయలసీమకు మళ్లిస్తాం. హంద్రీ-నీవా ద్వారా మడకశిర, మదనపల్లి, పుంగనూరుకు నీరు అందిస్తాం. ఇక్కడ హార్టికల్చర్ అభివృద్ధి చెందుతోంది. రైతులకు 90శాతం సబ్సిడీతో డ్రిప్, స్ప్రింక్లర్లు మంజూరు చేస్తాం. 2014కు సంబంధించి రూ.559.68కోట్లు ఇన్‌పుట్‌సబ్సిడీని జిల్లాకు మంజూరు చేశాం. వ్యవసాయంలో నష్టపోయి ఏ రైతూ ఆత్మహత్యకు తెగించకూడదు. వ్యవసాయాన్ని లాభసాటి చేస్తాం. ‘అనంత’ నుంచి అమరావతికి ఆరులైన్ల రహదారి నిర్మిస్తాం. ‘అనంత’లో సెంట్రల్ యూనివర్శిటీ: ‘అనంత’లో త్వరలోనే సెంట్రల్ యూనివర్శిటీని నిర్మిస్తాం. అలాగే పెనుకొండ పరిధిలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తాం. పెనుకొండ కొండపైకి రోడ్డు నిర్మిస్తాం. కొండపై నరసింహస్వామి దేవాలయంలో మంచినీటికి రూ.70లక్షలు, విద్యుత్తుకు రూ.30లక్షలు మంజూరు చేస్తాం. బెంగళూరు ఏయిర్పోర్టు దగ్గరగా ఉండటంతో పారిశ్రామికరంగ అభివృద్ధికి అత్యంత అనువైన ప్రాంతం అనంతపురం. జిల్లాపై నాకు ప్రత్యేక అభిమానం ఉంది. జిల్లా అభివృద్ధికి అన్ని విధాల చర్యలు తీసుకుంటాం’ అని ముఖ్యమంత్రి అన్నారు. వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సమర్థంగా రుణమాఫీ చేశామన్నారు. దీనిపై ప్రతిపక్షాలు ఏ వేదికపైనైనా చర్చించేందుకు తాము సిద్ధమన్నారు. మరో మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత మాట్లాడుతూ రైతులకు ఎలాంటి కష్టమొచ్చినా చంద్రబాబు ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎంపీ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి పరి తపిస్తున్నారన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం ‘చంద్రన్న అనంత విజయాలు’ కరపత్రాలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ నిమ్మల కిష్టప్ప, ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, హనుమంతరాయచౌదరి, ఈరన్న, జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, గుండుమల తిప్పేస్వామి, మెట్టు గోవిందరెడ్డి, శమంతకమణి, జెడ్పీ చైర్మన్ చమన్, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి టీ. విజయ్‌కుమార్, కమిషనర్ మధుసూదన్‌రావు, డెరైక్టర్ ధనుంజయరెడ్డి, కలెక్టర్ కోన శశిధర్, జేసీ లక్ష్మీకాంతం, మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్, టీడీపీ ప్రచార కార్యదర్శి బీవీ వెంకట్రాముడు పాల్గొన్నారు. -
పరిశ్రమల స్థాపనతో ఉపాధి అవకాశాలు
మంత్రి పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తి టౌన్/అర్బన్ : కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో వివిధ పరిశ్రమల స్థాపనతో యువతకు ఉపాధి అవకాశాలు పెంపొదిస్తామని సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. జేసీ లక్ష్మికాంతం, ఆర్డీఓ రాజశేఖర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ రంజిత్,శ్రే యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ప్రతినిధులు అభిషేక్, రామరాజు, ఆర్ఆర్ సౌరశక్తి డెరైక్టర్ వేద్ ఆలపాటి, వ్యాల్యూథాట్ ఐటీ కంపెనీ సీఈఓ మహేష్ నంద్యాల,పండిట్ వ్యూ సాప్ట్వేర్ కంపెనీ ప్రెసిడెంట్ తాళంకి శ్రీధర్‌లతో కలిసి కప్పలబండ గ్రామంలో ప్రభుత్వ భూమిని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో కంపెనీత ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ 400 ఎకరాల్లో విమానాల విడిభాగాల త యారీ, విమానాలకు ఇంధన రీఫిల్లింగ్, విమానాల మరమ్మతులు తదితర సంస్థలను స్థాపించేందుకు ఆసక్తి చూపుతోందన్నారు. ఆర్ఆర్ సౌరశక్తి సంస్థ 10 ఎకరాల్లో రూ. 600 కోట్ల పెట్టుబడితో సౌరశక్తి పలకల తయారీ సంస్థను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తోందన్నారు. వాల్యూథాట్ ఐటీ కంపెనీ ఇప్పటికే అనంతపురం జిల్లాలో తన కార్యకలాపాలను ప్రారంభించిందని, ఈ సంస్ధ ద్వారా 200 మందికి ఉపాధి అ వకాశాలు లభించనున్నాయన్నారు. తహసీల్దార్ సత్యనారాయణ, చైర్మన్ సీసీ గంగన్న, వైస్ చైర్మన్ కడియాలరాము, దేశం నాయకులు ఆదినారాయణరెడ్డి, కడియాల సుధాకర్, రామాంజినేయులు పాల్గొన్నారు. -
అంధకారంలో అంబేడ్కర్ వర్సిటీ విద్యార్థులు
విడుదల కాని వార్షిక, ప్రవేశ పరీక్షల ఫలితాలు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలకు దూరంగా ఆంధ్రా విద్యార్థులు గుంతకల్లు టౌన్ : రాష్ట్ర విభజన ప్రభావం రాష్ట్రంలో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు శాపంగా మారింది. వార్షిక, ప్రవేశ పరీక్షలు జరిగి మూడు నెలలు గడిచినా నేటికీ ఫలితాలు విడుదల చేయకపోవడంతో ఉన్నత చదువులు, ఉద్యోగాల అన్వేషణకు వెళ్లలేక విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గుంతకల్లు యస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కాలేజితోపాటు అనంతపురం-2, హిందూపురం, ఉరవకొండ, రాయదుర్గం, కదిరి, తాడిపత్రి, ధర్మవరం ప్రాంతాల్లో అంబేడ్కర్ వర్సిటీ స్టడీసెంటర్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత అటు తెలంగాణ , ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదర లేదు. ఏప్రిల్ 12న ప్రవేశపరీక్షను ఇరు రాష్ట్రాల్లోనూ నిర్వహించింది. బీఏ, బీకాం,బీయస్సీ కోర్సుల్లో చేరేందుకు జిల్లాలో మొత్తం 927 మంది విద్యార్థులు ప్రవేశపరీక్ష రాశారు. తెలంగాణా రాష్ట్రంలో ఈ ఫలితాలను విడుదలయ్యాయి. ఆంధ్రా విద్యార్థుల ఫలితాలను మాత్రం విడుదల చేయలేదు. దీంతో అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. మేలో ఇరు రాష్ట్రాల్లోనూ ఫస్ట్, సెకండ్, థర్ట్ ఇయర్ల విద్యార్థులకు విశ్వవిద్యాలయం వార్షిక పరీక్షలు నిర్వహించింది. జిల్లాలో రెగ్యులర్, సప్లిమెంటరీ కలిపి సుమారు 6 వేల మందికి పైగా పరీక్షలు రాశారు. మన రాష్ట్రంలో సెకండ్, థర్డ్ ఇయర్ల విద్యార్థుల ఫలితాలను విడుదల చేసినప్పటికీ మార్కుల జాబితాలను స్టడీ సెంటర్లకు పంపలేదు. అవసరమైన వారు నేరుగా యూనివర్సిటీ వచ్చి తీసుకె ళ్లాలని యూనివర్సిటీ అధికారులు హుకూం జారీ చేసినట్లు స్టడీ సెంటర్ సిబ్బంది చెబుతున్నారు. పైగా ఏపీ స్టడీ సెంటర్లల్లో పరీక్షలు రాసిన విద్యార్థుల వివరాలను కూడా అధికారిక యూనివర్సిటీ వెబ్సైట్లో నుంచి తొలగించారు. దీంతో ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అన్వేషించే అభ్యర్థుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. -
భారత్-శ్రీలంక అనుసంధానం
రూ. 22,000 కోట్లతో ప్రాజెక్టు... ♦ రహదారులు, నౌకా రంగాల్లో 50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ♦ రూ. 6 లక్షల కోట్ల ప్రాజెక్టులకు వ్యూహ రచన ♦ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటన న్యూఢిల్లీ : రహదారులు, నౌకా రంగాల్లో ప్రభుత్వం 50 లక్షల ఉద్యోగాలను సృష్టించడానికి కట్టుబడి ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. ఈ కీలక రంగాల్లో భారీగా రూ.6 లక్షల కోట్ల ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వివరించారు. ఇందులో భారత్-శ్రీలంకలను కలుపుతూ రూ.20,000 కోట్ల ప్రాజెక్టును చేపట్టడానికి కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి నిధులను అందించడానికి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ సంసిద్ధతను వ్యక్తం చేసిందని వెల్లడించారు. హైవేలు- పరికరాలకు సంబంధించి ఇక్కడ గురువారం జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న ఐదేళ్లలో రహదారుల రంగంలో రూ.5 లక్షల కోట్ల ప్రాజెక్టులను, నౌకా రంగంలో లక్ష కోట్ల ప్రాజెక్టులను చేపట్టాలని తాము నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు దేశంలో 50 లక్షల మంది యువతికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని వివరించారు. గత ఏడాది నుంచి హైవేలు, షిప్పింగ్ రంగాలు పురోగతి దిశగా అడుగులు వేస్తున్నాయని అన్నారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికే రూ. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు. భారత్- శ్రీలంక అనుసంధాన ప్రాజెక్టుపై... ఇతర దేశాలతో రవాణా సదుపాయాలను పెంపొందించుకోడానికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్‌లతో ఈ దిశలో ముందడుగు వేసిన ప్రభుత్వం, శ్రీలంకతోనూ రవాణా సదుపాయాలను మెరుగుపరచుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రామేశ్వరం నుంచి శ్రీలంకకు 22 కిలోమీటర్ల మేర క్యారిడార్ ఏర్పాటు ప్రణాళిక సిద్ధమవుతోందని వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడ ‘ఫెర్రీ’ సేవల ఏర్పాట్లు ఉన్నాయని పేర్కొంటూ, సాధ్యమైనంత త్వరగా ప్రతిపాదిత ప్రాజెక్టును పూర్తి చేయాలన్నది కేంద్రం ప్రణాళిక అని వివరించారు. వంతెనకి అలాగే నీటి అంతర్భాగ సొరంగం కలయికగా ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఉంటుందని వివరించారు. నౌకా రవాణాకు ఎటువంటి విఘాతం కలగకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని తెలిపారు. నిధుల సమస్య కాదు..: ఫైనాన్సింగ్ అనేది రహదారుల మంత్రిత్వశాఖలో అసలు సమస్యే కాదని గడ్కారీ అన్నారు. 112 ప్రాజెక్టులను పూర్తిచేసి, విదేశీ బీమా, పెన్షన్ ఫండ్స్‌లకు అమ్మడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు దీనికితోడు 0.50 శాతం వడ్డీకి రెండు, మూడు లక్షల కోట్ల రూపాయల నిధులు ఇవ్వడానికి పలు విదేశీ ఫండ్లు సిద్ధంగా ఉన్నట్లు సైతం ఆయన తెలిపారు. మంత్రిత్వశాఖకు రూ. 42,000 కోట్ల బడ్జెటరీ కేటాయింపులు ఉన్నాయని పేర్కొంటూ, పన్ను మినహాయింపు బాండ్ల ద్వారా రూ.70,000 కోట్లు సమీకరణకు సైతం మంత్రిత్వశాఖకు వీలుందని వివరించారు. అలాగే వార్షిక టోల్ వసూళ్లు రూ.7,000 నుంచి రూ.8,000 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. తద్వారా 15 ఏళ్ల ఆదాయం రూ.1,20,000 కోట్లని అన్నారు. హైవేస్ ఎక్విప్మెంట్ తయారీపై ఇలా... ఈ విభాగం అభివృద్ధిని మంత్రి ప్రస్తావిస్తూ, వినూత్న ఆవిష్కరణలు, టెక్నాలజీ మేళవింపు ఇందుకు దోహదపడతాయని తెలిపారు. ఆయా అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షకు, తగిన సిఫారసుల అమలుకు ఎనిమిది రోజుల్లో ఒక మండలిని తన మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నదీ జల రవాణాపై బిల్లు... దేశ వ్యాప్తంగా 101 నదులను ‘జల మార్గాలుగా’ మార్చడానికి ఉద్ధే శించిన బిల్లును రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు గడ్కారీ చెప్పారు. దేశాభివృద్ధిలో ఇదొక కీలక అంశమన్నారు. మయన్మార్, థాయ్తోనూ త్వరలో ఒప్పందాలు... బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్‌లతో రవాణా సదుపాయాల మెరుగుకు చేసుకున్న ఒప్పందం తరహాలోనే ఈ ఏడాది చివరకు మయన్మార్, థాయ్‌లాండ్‌లతో కూడా భారత్ కీలక మోటార్ ఒప్పందం చేసుకోనున్నట్లు వెల్లడించారు. మోటార్ వెహికల్ ఒప్పందం (ఎంవీఏ) కింద బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ మధ్య జరుగుతున్న 8 బిలియన్ డాలర్ల రోడ్డు అనుసంధాన ప్రాజెక్టు రానున్న రెండేళ్లలో పూర్తవుతుందని గడ్కారీ వివరించారు. -
సేవానిరతి... చదువుకు హారతి
- విద్యార్థుల సేవలో వైశ్య హాస్టల్ - వృత్తి విద్య, ఉపాధి అవకాశాలు కల్పన - వందలాది మందికి విద్యా దానం సాక్షి, సిటీబ్యూరో: పేదరికం... ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ... చదువుకు దూరమవుతున్న చిన్నారులకు అండగా నిలుస్తోంది కాచిగూడలోని వైశ్య హాస్టల్ ట్రస్ట్ బోర్డు. చదువుతో పాటు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తనవంతు తోడ్పాటునందిస్తోంది. బోర్డు ఆధ్వర్యంలోని షాపింగ్ క్లాంపెక్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్యార్థుల చదువులకు వెచ్చిస్తూ... వారి బంగారు భవితకు బాటలు వేస్తోంది. ఇంటర్ నుంచి పీజీ వరకు... వైశ్య హాస్టల్లో ఇంటర్ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. ఒక్క వైశ్య విద్యార్థులకే కాకుండా 50 శాతం ఇతరులకూ అవకాశం కల్పిస్తున్నారు. విశాలమైన భోజన శాల, అన్ని వసతులతో కూడిన చక్కటి ఆడిటోరియం, టీవీ హాలు, మినీ మీటింగ్ హాలు, గ్రంథాలయం, జిమ్, టీటీ హాల్, మినీ డైనింగ్ హాలు, రీడింగ్ రూము వంటి సౌకర్యాలు హాస్టల్లో ఉన్నాయి. ఇక్కడ ఉంటూ విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు దేశ, విదేశాలలో వివిధ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారు. విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు 1965 నుంచి జంట నగరాలలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్ షిప్‌లతో పాటు, స్కూల్ ఫీజులు చెల్లిస్తున్నారు. వాసవి బుక్ బ్యాంక్ నెలకొల్పి అన్ని తరగతుల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, అవసరమైన కిట్లు పంపిణీ చేస్తున్నారు. నర్సింగ్ కోర్సు, డిప్లమో ఇన్ అప్తోమెట్రీ కోర్సుల విద్యార్థులకు పూర్తి ఫీజులను చెల్లిస్తున్నారు. 2013 నుంచి విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చదువు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సహకరిస్తున్నారు. విద్యార్థినులకూ హాస్టల్ వసతి కల్పించారు. వైశ్య హాస్టల్ ట్రస్టు బోర్డు సభ్యులందరం కలిసి ఏ పనికైనా సమైక్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు నడుస్తున్నామని చైర్మన్ కొట్రికె భాస్కర్ గుప్త తెలిపారు. ఏడున్నర దశాబ్దాలుగా... సుమారు ఏడున్నర దశాబ్దాలుగా ఈ బోర్డు విద్యా రంగంలో సేవలందిస్తోంది. 1939 జులై 5న ఫీల్ఖానాలోని అద్దె భవనంలో ఏడుగురు విద్యార్థులతో... ఉప్పల గౌరీశంకర్ అనే వ్యక్తి ‘వైశ్య హాస్టల్’ను ప్రారంభించారు. 1950లో కార్యనిర్వహణ కమిటీ భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా కె.ఎన్.గుప్త ఆధ్వర్యంలో దాతల నుంచి విరాళాలు సేకరించి 1951లో కాచిగూడ చౌరస్తాలో సుమారు 8 వేల చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. 1963 ఆగస్టు 20న 13 మందితో వైశ్య హాస్టల్ ట్రస్టు బోర్డు ఏర్పాటైంది. 1982లో 14 గదులతో సొంత భవనాన్ని నిర్మించి.. హాస్టల్‌ను అక్కడికి తరలించారు. ప్రస్తుతం 270 గదులతో 800 మందివిద్యార్థులతో ఆహ్లాదకరవాతావరణంలో హాస్టల్ పని చేస్తోంది. -
భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం
గల్ఫ్ వెళ్లే బాధ తప్పిస్తాం ఎంపీ కవిత హామీ బాల్కొండ : నియోజకవర్గంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బుధవారం ఆమె వన్నెల్(బి)లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన ఉపాధి అవకాశాలు లేక చాలా మంది గల్ఫ్ బాట పడుతున్నారన్నారు. అక్కడా సరైన అవకాశాలు లేక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎడారి దేశా ల్లో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏడాదిలో 72 మంది మృతదేహాలను ప్రభుత్వం స్వదేశానికి తెప్పించిందన్నారు. నిరుద్యోగులు ఎడారి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఉపాధి అవకాశా లు కల్పిస్తామన్నారు. బాల్కొండలో పరిశ్రమ ఏర్పాటు చేసి ఐదు వేల మందికి ఉపాధి చూపుతామన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో సరైన వివరాలు అందించని వారికే జీవన భృతి అందడం లేదన్నారు. జిల్లాలో 1,500 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి 500 మంది టీచర్లను సర్దుబాటు చేసిన తర్వాత ఉద్యోగ భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. త్వరలో పసుపుపార్కు పనులు.. వేల్పూర్ : వేల్పూర్ క్రాస్‌రోడ్డు వద్ద త్వరలో పసుపు పార్కు పనులు ప్రారంభమవుతాయని ఎంపీ కవిత తెలిపారు. బుధవారం ఆమె అంక్సాపూర్ నుంచి వన్నెల్(బి) వరకు రూ. 4 కోట్లతో నిర్మించే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అంక్సాపూర్‌లో మాట్లాడారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పసుపు పార్కు మంజూరు చేయించానన్నారు. మామిడిపల్లి నుంచి నిజామాబాద్ వరకు ైరె ల్వేలైన్ నిర్మాణానికి బడ్జెట్లో రూ. 140 కోట్లు మంజూరు చేయించానని, పనులకు ఇటీవల శంకుస్థాపన జరిగిందని పేర్కొన్నారు. జిల్లా లో పసుపుబోర్డు ఏర్పాటుకు కృషి చేస్తున్నానన్నారు. లక్ష మందికిపైగా బీడీ కార్మికులకు ఇప్పటికే జీవనభృతి అందుతోందని ఎంపీ తెలిపారు. అర్హులందరికీ జీవనభృతి అందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ఆర్డీవో యాదిరెడ్డి, ఎంపీపీ రజిత బాల్‌రాజ్, జడ్పీటీసీ సభ్యురాలు విమల హన్మంత్‌రావు, అంక్సాపూర్ సర్పంచ్ లక్ష్మి, ఉపసర్పంచ్ పెద్ద ఇస్తారి, ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మి, నాయకులు దేగాం రాములు, మహీపాల్, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నవ్యాంధ్ర నిర్మాణానికి పునరంకితమవుదాం
నవనిర్మాణ దీక్షలో ఆర్థిక మంత్రి యనమల సాక్షి, విశాఖపట్నం : నవ్యాంధ్ర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ర్ట విభజన చేయడంతోపాటు విభజన చట్టంలో కూడా ఏపీకి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడమే కాకుండా తీరని రెవెన్యూలోటుతో పాటు భారీ అప్పులను అంటగట్టారన్నారు. రాష్ట్రానికి ఎంతో అన్యాయం చేసినప్పటికీ మొక్కవోని దీక్షతో అందరం సమష్టిగా శ్రమించి నవ్యాంధ్ర నిర్మించుకుందామన్నారు. విభజన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా మంగళవారం స్థానిక గవర్నర్ బంగ్లా నుంచి ఏయూ వరకు నవ నిర్మాణ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏయూ కాన్వొకేషన్ హాలులో జరిగిన సమావేశంలో సభికులతో నవ్యాంధ్ర నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఏ వర్గానికి లోటు రానీయకుండా చేస్తున్నామన్నారు. అర్హులందరికీ రెండు లక్షల పింఛన్ల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించి పేదరికాన్ని పారదోలేందుకు పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. హైదరాబాద్ నుంచి అమరావతికి రాజధానిని త్వరలో తరలిస్తామన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోయే తమకు పవిత్ర గ్రంథమని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే బెల్టుషాపులు రద్దు చేశామని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచామని, రైతు రుణమాఫీ చేశామని, రేపటి నుంచి డ్వాక్రా రుణమాఫీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వాదేశాల మేరకు నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ యువరాజ్ చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు, పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్, ఎస్పీ కోయ ప్రవీణ్, డీఐజీ రవిచంద్ర, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, ఈపీడీసీఎల్ సీఎండీ ముత్యాలరాజు, వుడా వీసీ బాబూరావు నాయుడు, జేసీలు జె.నివాస్, డీవీ రెడ్డి, డీఆర్వో కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ప్రపంచ మార్కెట్టే లక్ష్యం కాకూడదు
‘మేక్ ఇన్ ఇండియా’పై రాజన్ అభిప్రాయం శ్రీనగర్: కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంపై తన అభిప్రాయాన్ని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ మార్కెట్ మాత్రమే లక్ష్యం కాకూడదని అన్నారు. కశ్మీర్లో రెండు రోజుల పర్యటన జరుపుతున్న రాజన్, ఇక్కడ ఒక బిజినెస్ స్కూల్లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ తయారీ పరిశ్రమకు భారత్ కేంద్రం కావాలని, పెరుగుతున్న జనాభాకు తద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలని ప్రధాన లక్ష్యంగా గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్రమోదీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంపై రాజన్ తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే... ⇒ భారత్‌లో తయారీ రంగం పురోభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఎంతో విలువైనది అనడంలో సందేహం లేదు. అయితే ప్రపంచ మార్కెట్ మాత్రమే ఈ కార్యక్రమానికి లక్ష్యం కాకూడదు. ⇒ ప్రపంచ మార్కెట్లో సత్తా చాటడానికి మనం తగిన ప్రయత్నం చేయాల్సిందే. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రపంచ ఆర్థికాభివృద్ధి మందగమనంలో ఉంది. భారీ డిమాండ్ లేదు. ఈ అంశాలన్నింటినీ భారత్ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ మార్కెట్ మాత్రమే లక్ష్యంగా ఉంటే కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. ⇒ తయారీ, సేవల రంగం వృద్ధికి మౌలిక అలాగే నియంత్రణాపరమైన తగిన వాతావరణాన్ని దేశం లో ఏర్పాటు చేయాలి. ఆయా అంశాలూ ఉపాధి అవకాశాలు పెరగడానికి దోహదపడతాయి. ⇒ ఎవరికోసం ఉత్పత్తి జరుగుతోందన్న అంశాన్ని మనం నిర్ణయించుకోకూడదు. ఇక్కడ ప్రధానంగా మనం తయారీ రంగం వృద్ధికి అవసరమైన మౌలిక పరిస్థితులు రూపకల్పన, వ్యాపారాలు తేలిగ్గా చేసుకునేలా నియమ నిబంధనల్లో సవరణలు, సుశిక్షుతులైన మానవ వనరుల అభివృద్ధి కీలకం. -
బీడు భూములకు మహర్దశ
ఖమ్మం మయూరిసెంటర్: జిల్లాలోని బీడు భూములకు మహర్దశ రానుంది. ప్రతి వర్షం చుక్క సాగుకు ఉపయోగకరంగా మరల్చడం, అడుగంటి పోతున్న భూగర్భజలాలు పెంపుకోసం ఇటు సాగునీటి వనరుల పెంపు, అటు కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో చేపడుతున్న వాటర్ షెడ్ పనుల కోసం జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ పనుల కింద రూ. 23 కోట్లు మంజూరు అయినట్లు ఉపాధి హామీ పథకం జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు విడుదలైన రూ.23.37 కోట్లతో జిల్లాలోని ములకలపల్లి మండలంలోని పొగళ్లపల్లి గ్రామంలో రూ.705 లక్షలతో, చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో 578.61 లక్షలతో, పాల్వంచలోని పాయకారి యానంబైలులో 634.64 లక్షలతో, కొత్తగూడెం మండలంలోని చుంచుపల్లి గ్రామంలో 419.72 లక్షలతో ఆయా ఏజెన్సీల ఆధ్వర్యంలో పనులు చేపడుతామని అధికారులు వెల్లడించారు. ఏరియా గుర్తింపుకు ప్రమాణాలు.. కోట్లాది రూపాయల ఖర్చుతో చేపట్టే వాటర్ షెడ్ పనులకు రైతులకు, కూలీలకు ఉపయోగపడటంతోపాటు పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాలు పెంచేలా ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసం ల్యాండ్‌రెవెన్యూ న్యూఢిల్లీ సంచాలకులు వాటర్‌షెడ్ ఏరియాను గుర్తించేందుకు 13 ప్రమాణికాలను సూచించారు. ఇందులో వాటర్ షెడ్ పనులు చేపట్టే ప్రాంతంలో పేదరిక జనాభా శాతం,ఎస్సీ,ఎస్టీ జనాభాశాతం, సరాసరి దినసరి కూలిశాతం, చిన్న, సన్న కారు రైతుల శాతం, భూగర్భ జలాలస్థితి, తేమ సూచిక, వర్షాధారపు భూమి విస్తీర్ణం. తాగునీటి పరిస్థితి, కొరత, బంజర భూములు/క్షీణతకు గురైన భూములు, భూమి ఉత్పాదక శక్తి, వాటర్ షెడ్ పథకం అమలు చేస్తున భూములకు దూరం, సమమైన భూములలో వివిధ గ్రామాలు/ మైక్రో వాటర్‌షెడ్ సమూహాలు, గుట్టలలో ఉన్న వివిధ గ్రామాల సమూహం. మొదలగు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అదేవిధంగా సగటున 1000-5000 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన కొన్ని గ్రామాల సముదాయం ఒక్క ప్రాజెక్టుగా చేపడుతారని జిల్లా వాటర్ షెడ్ నిర్వాహకాధికారి విజయ్‌చందర్ తెలిపారు. ఎంపిక చేసిన ప్రాజెక్టును 4నుండి 7 సంవత్సరాల కాలవ్యవధిలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. నిరుపేదలకు జీవనోపాధి... వాటర్‌షెడ్ పథకంలో ప్రాజెక్టు నిధుల నుంచి 9 శాతం బడ్జెట్ కేటాయించారు. ఇందులో 5 శాతం నిధులు సెర్ఫ్ కమిషనర్ ఆధ్వర్యంలో ఖర్చు చేస్తారు. మిగిలిన 4 శాతం నిధులు డ్వామా పరిధిలో వాటర్‌షెడ్ పథకంలోని గ్రామాల్లో ఉన్న గ్రామ సమాఖ్యల ద్వారా వ్యవసాయ ఆధారిత జీవనోపాధి, వ్యవసాయేతర జీవనోపాధికి సమకూరుస్తారు. ఈ నిధులను డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ ద్వారా ఖర్చు చేస్తారు. అదేవిధంగా వాటర్‌షెడ్ పథకంలో సహజ వనరుల యాజమాన్యానికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చి 56 శాతం నిధులు కేటాయించారు. క్షీణిస్తున్న సహజ వనరులైన భూమి, నీరు, పచ్చదనం, పశు సంపద, మానవ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు. భూమిని ఎత్తు నుంచి పల్లపు ప్రాంతం మొత్తాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ఉపాధి హామీ పథకం సమన్వయంతో అధిక మొత్తంలో నిధులు వెచ్చించి పనులు చేపట్టేందుకు కార్యక్రమం రూపొందించారు. దీనికింద చెక్‌డ్యామ్ లు, చెక్ వాల్స్, రాతి కట్టడాలు, ఫారంపాండ్, నాడెప్ కంపోస్ట్ ఎరువు గుంత, నీటి నిల్వ కందకాలు, చిన్న ఊట కుంట, ఊటగుంత, రోడ్డు ఇరువైపులా మొక్కల పెంపకం, గట్లపై మొక్కల పెంపకం, పండ్ల తోటల పెంపకం తదితర పనులు చేపడుతున్నారు. -
ఢిల్లీని ప్రపంచంలోని ఐదు అగ్రనగరాల్లో ఒకటిగా నిలుపుతాం
♦ ప్రయివేట్ రంగ సంస్థలకు సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి ♦ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ♦ యమునా నదిని శుభ్రం చేయడంలో సహకరించాలి సాక్షి, న్యూఢిల్లీ : రానున్న ఐదేళ్లలో ఢిల్లీని ప్రపంచంలోని ఐదు అగ్రనగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. నగరాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పాటునందించాలని ప్రైవేటు రంగ సంస్థలను కోరారు. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేటు రంగం ఉపాధిని ృసష్టిస్తుందని, అందువల్ల తమ ప్రభుత్వం ఢిల్లీలో వాణిజ్యాన్ని ప్రోత్సహించాలనుకుంటోందని చెప్పారు. జనతా దర్బార్‌లో తనను కలవడానికి వచ్చేవారిలో అత్యధికులు ఉద్యోగమిప్పించాలని కోరేవారేనని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కలిపించడంలో చేయూతనివ్వాలని కోరారు. ఐదేళ్లలో ఢిల్లీని ప్రపంచంలోని ఐదు అగ్రనగరాల్లో ఒకటిగా చూడాలనుకుంటున్నానని అన్నారు. ఆ లక్ష్యాన్ని తమ ప్రభుత్వం సాధిస్తుందన్న నమ్మకముందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. నీటిని రీసైకిల్ చేయడంపై సలహాలివ్వండి ఇప్పటి వరకు నీటి సమస్యను అధిగమించేందుకు పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోందని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. ఆ విధంగా కాకుండా ఢిల్లీయే దీనికి స్వయంగా పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉందన్నారు. నీటిని రీసైకిల్ చేయడానికి తగిన సలహాలిస్తే స్వీకరిస్తామని ఆయన వాణిజ్య వేత్తలను ఆహ్వానించారు. యమునా నది నీటి మట్టం వర్షాకాలంలో పెరుగుతోందని, ఆ నీటిని ఆదా చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నీరు వృథాగా పోకుండా నిల్వ చేయడానికి తగిన మార్గాలు అన్వేషించాలని చెప్పారు. కాలుష్య కాసారంగా మారిన యమునా నదిని శుభ్రం చేయడానికి సాయపడాలని ప్రయివేటు రంగాన్ని కోరారు. ఘనరూప వ్యర్థాల మేనేజ్మెంట్పై దృష్టిపెట్టాల్సిన అవసరముందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. నగరాన్ని శుభ్రం చేయడం కోసం యంత్రాలను వాడాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. దీని కోసం నిధులను తాము వికేంద్రీకరించనున్నట్లు తెలిపారు. తద్వారా కాలనీ స్థాయి సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చన్నారు. దేశాన్ని మార్చడానికి రాజకీయాల్లోకి వచ్చా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో విబేధాల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ఆయన నిరాకరించారు. పాలన గురించి మాత్రమే మాట్లాడుతానని చెప్పారు. తాను దేశాన్ని మార్చడానికి రాజకీయాలలోకి వచ్చానని తెలిపారు. కానీ, ఢిల్లీ సమస్యలను పరిష్కరించడానికే చాలా సమయంపడుతోందని, మిగతా విషయాలకు సమయం లేదని పేర్కొన్నారు. టీఆర్పీ రేట్లు పెంచుకోవడానికే టీవీ చానెళ్లు ఈ అంశాల గురించి మాట్లాడుతుంటాయని, తాను దృష్టి పెట్టాల్సిన విషయాలు వేరే ఉన్నాయని ఆయన చెప్పారు. -
యువతకు ఉపాధే లక్ష్యం
తూప్రాన్: పారిశ్రామిక ప్రగతితో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అందువల్లే తమ ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. గురువారం ఆయన తూప్రాన్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో గల శాంతాబయోటెక్స్ కంపెనీ రూ.460 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఇన్సులిన్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతా బయోటెక్స్ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి జిల్లాలో ఇన్సులిన్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇన్సులిన్ తయారీ కేంద్రం ఏర్పాటుతో 500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. పరిశ్రమ పూర్తిస్థాయిలో విస్తరణ జరిగితే మరో రెండువేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇలాంటి పరిశ్రమలు నాలుగు ఏర్పడితే వజ్రాల తెలంగాణ నిర్మిస్తామన్నారు. సనోఫి కంపెనీ ప్రాంక్ఫర్ట్ తర్వాత రెండవ ఇన్సులిన్ తయారీ కేంద్రాన్ని ముప్పిరెడ్డిపల్లిలో ప్రారంభించనుండటం ఆనందంగా ఉందన్నారు. మధుమేహరోగులకు అవసరైమన ఇన్సులిన్‌ను వీలైనంత త్వరగా మార్కెట్లోకి తెచ్చేందుకు శాంత బయోటెక్స్ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి ఇతర కంపెనీ ప్రతినిధులకు నడుంబిగించాలన్నారు. ప్రస్తుతం మార్కెట్లో రూ.850 ఉన్న ఇన్సులిన్‌ను వరప్రసాద్‌రెడ్డి రూ.150కే అందుబాటులోకి తేవడం వారి సేవా దృక్ఫథానికి నిదర్శనమన్నారు. శాంతాబయోటెక్స్ ఇన్సులిన్ పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన సహాయం అందించాలని వేదికపై ఉన్న జిల్లా మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలకు సీఎం సూచించారు. ఇన్సులిన్ తయారీ కేంద్రం ఏర్పాటుకు పూనుకున్న శాంతా బయోటెక్స్ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం శాంతా బయోటె క్స్ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, మధుమేహ రోగులకు చౌకధరకు ఇన్సులిన్ అందుబాటులోకి తీసుకురావాలన్న సదుద్దేశంతో ఇన్సుమన్ క్యాట్రిజ్ ఇన్సులిన్ తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తమ సంస్థకు లాభనష్టాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, సామాజిక సేవా దృక్పథంతో చౌకధరకు ఇన్సులిన్లు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. తమ పరిశ్రమకు అవసరమైన చేయూత ఇవ్వాలని సీఎంను కోరారు. సనోఫి పరిశ్రమతో కలిసి మరో వెయ్యికోట్ల పెట్టుబడితో పరిశ్రమను విస్తరించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. హెలీప్యాడ్ వద్ద సీఎంకు సాదర స్వాగతం భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, సీఎం పేషీ ప్రత్యేకాధికారి స్మితాసభర్వాల్తో కలిసి హైదరాబాద్ నుంచి ెహ లీకాఫ్టర్లో ముప్పిరెడ్డిపల్లికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు ఉప సభాపతి పద్మదేవేందర్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణరావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎస్పీ సుమతిలు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. సీఎం పర్యటన సాగిందిలా... హెలీప్యాడ్ నుంచి ప్రత్యేక వాహనంలో శాంతాబయెటెక్స్ పరిశ్రమకు 11.48కు చేరుకున్న సీఎం కేసీఆర్, అక్కడ కార్యాలయంలో కంపెనీ ప్రతినిధులతో సుమారు 20 నిమిషాల పాటు చర్చించారు. అనంతరం పరిశ్రమలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం శాంతా బయోటెక్స్ ఇన్సులిన్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జ్యోతిప్రజ్వలనతో సభను ప్రారంభించారు. ఆ తర్వాత 12.53 నిమిషాలకు ప్రసంగాన్ని ప్రారంభించిన కేసీఆర్... మధ్యాహ్నం 1.17 నిమిషాలకు కొనసాగించారు. అంతకుముందు పరిశ్రమ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. అలాగే ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మంత్రి హరీష్‌రావు, డీప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి లు కూడా మొక్కలు నాటారు. అక్కడే భోజనం చేసిన సీఎం అనంతరం తన వాహనం వద్దకు వస్తున్న క్రమంలో ముప్పిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ సమస్యలను వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొందరు సీఎంతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. టీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు ముఖ్యమంత్రి భోజనం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గుడారంలోకి టీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి మడుపు భూంరెడ్డి వెళుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే అటుగా వచ్చిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ ఆయన్ను సముదాయించి లోనికి తీసుకువెళ్లారు. పరిశ్రమ వద్ద భారీ సంఖ్యలో ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యకమంలో పరిశ్రమ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ శైలేష్, క్లార్డ్, సీఈఓ హరీష్, ఎమ్మెల్యే బాబూమోహన్, జేసీ శరత్, ‘గడా’ అధికారి హన్మంతరావు, సిద్దిపేట ఆర్టీఓ ముత్యంరెడ్డి, స్థానిక తహశీల్దార్ స్వామి, ఎంపీడీఓ కరుణాశీల, ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్, జెడ్పీటీసీ సుమన, పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు సంజీవ్, మంజుల, శివ్వమ్మ, రఘునాథ్‌రావు, శ్రీశైలం యాదవ్, శేఖర్‌గౌడ్, శ్రీశైలం గౌడ్, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూనిర్వాసితుల ఆందోళన ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశ్రమలో ఉన్న సమయంలో కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి, జీడీపల్లి, కూచారం గ్రామాలకు చెందిన సుమారు 20 మంది భూనిర్వాసితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. -
అంతర్జాతీయంగా ఎదగాలి..
క్రియాశీలకంగా వ్యవహరించాలి.. * సైబర్ నేరాలు అరికట్టడంపై దృష్టి పెట్టాలి * ‘జ్ఞాన సంగం’లో బ్యాంకులకు ప్రధాని సూచన పుణె: బ్యాంకులు నింపాదిగా పనిచేసే విధానాన్ని మానుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సామాన్యులకు సహాయం అందించడంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని, అంతర్జాతీయంగా టాప్ స్థాయికి ఎదగాలని శనివారం పేర్కొన్నారు. బ్యాంకులు వృత్తి నిపుణుల సారథ్యంలో ఎదగాలని, వాటి కార్యకలాపాల్లో రాజకీయ జోక్యానికి తాను వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. అయితే, ప్రజాప్రయోజనాలు ఇమిడి ఉన్న సందర్భాల్లో ఇలాంటి జోక్యాన్ని తాను సమర్థిస్తానని ప్రధాని చెప్పారు. శనివారం జ్ఞాన సంగం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాంకులు సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు. దేశ ఎకానమీ వృద్ధికి బ్యాంకింగ్ వ్యవస్థ ప్రగతే నిదర్శనంగా నిలుస్తుందని ఆయన చెప్పారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద బ్యాంకులు ఏటా ఒక్కో రంగాన్ని ఎంచుకుని, దాని ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని మోదీ తెలిపారు. అధిక స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించగలిగే సంస్థలకు రుణాల మంజూరీలో ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌ను విజయవంతం చేసే దిశగా కనీసం 20,000-25,000 మంది ఔత్సాహిక స్వచ్ఛత వ్యాపారవేత్తలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ రంగ సంస్థలు తోడ్పాటు అందించాలన్నారు. ఆర్థికాంశాలపై అవగాహన పెంచే కార్యక్రమాలను చేపట్టాలని మోదీ సూచించారు. సంస్కరణలకు కట్టుబడి ఉన్నాం: జైట్లీ ప్రభుత్వ రంగ బ్యాంకులను పటిష్టం చేసేందుకు సాహసోపేత సంస్కరణలు ప్రవేశపెట్టడానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రిస్కులు తీసుకోక తప్పదు కనుక.. ఆ ప్రయత్నాల్లో ఏవైనా తప్పులు దొర్లినా, ప్రభుత్వం బాసటగా నిల్చేందుకు సిద్ధం అన్నారు. మొండి బకాయిల సమస్య పరిష్కారానికి కావాల్సిన తోడ్పాటు అందించేలా నిబంధనలు సవరించడాన్నీ పరిశీలిస్తామని చెప్పారు. ఇక, సరైన వేల్యుయేషన్లు వచ్చినప్పుడే పీఎస్బీల్లో వాటాల విక్రయం చేపడతామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. మరోవైపు, విలీనాలకు సంబంధించి ప్రభుత్వం కాకుండా బ్యాంకులే స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంలో ఒత్తిడి తేబోదని స్పష్టం చేశారు. ఏడాదిలో మొండి బకాయిలు తగ్గాలి: రాజన్ ఎకానమీని మళ్లీ అధిక వృద్ధి బాట పట్టించాలంటే.. ఏడాది వ్యవధిలోగా బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిల (ఎన్పీఏ) సమస్యను చక్కబెట్టాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ఎన్పీఏలుగా మారే అవకాశాలున్న రుణాలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు, వృద్ధికి అవసరమయ్యే వనరులను సమీకరించుకోవడంలో భాగంగా ఇంటింటా ఉండే పొదుపు మొత్తాలను పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంపై దృష్టి సారించాలని రాజన్ చెప్పారు. బ్యాంకర్లు వాణిజ్యపరమైన నిర్ణయాలు విషయాల్లో కొన్నిసార్లు పొరపాట్లు జరగొచ్చని, అయితే వీటి వెనుక దురుద్దేశం లేనిపక్షంలో.. వారికి ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు. -
సిరిసిల్ల టూ చెన్నై..
మరమగ్గాలపై చీరలు, పంచెల ఉత్పత్తి.. సంక్షోభ సిరిసిల్లకు ఉపాధి.. సిరిసిల్ల: వస్త్రోత్పత్తి ఖిల్లా సిరిసిల్ల చీరలకు కొత్త ఆఫర్లు వస్తున్నాయి. కాలం చెల్లిన మగ్గాలపై కాటన్ (ముతక రకం) వస్త్రమే కాకుండా మార్కెట్లో అమ్ముడుపోయే చీరలు, పంచెల ఉత్పత్తులకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు ముందు చీరలకు మంచి గిరాకీ ఉంటుండగా.. ఈ ఏడాది తమిళనాడు ప్రభుత్వం భారీగా పంచెలు, చీరలకు ఆర్డర్ ఇవ్వడంతో సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. పండుగ శోభ.. తమిళనాడులో ఏటా సంక్రాంతి (పొంగల్)కి పేదలకు వస్త్రాలను అందజేస్తారు. మహిళలకు చీరలు, పురుషులకు పంచెలు అందిస్తారు. ఈ నేపథ్యంలో మూడు లక్షల చీరలు, మరో మూడు లక్షల పంచెలకు కొత్తగా తమిళనాడు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. దీంతో సిరిసిల్ల నేతకార్మికులకు ఉపాధి మెరుగైంది. పండుగకు కొద్ది రోజులే గడువు ఉండడంతో మరమగ్గాలపై వేగంగా చీరలు, ధోవతులు, పంచెలను ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడులో 1.72కోట్ల పంచెలు, మరో 1.73కోట్ల చీరలు అవసరం ఉండడంతో అక్కడ ఆ మేరకు ఒకేసారి ఉత్పత్తి సాధ్యం కాకపోవడంతో అక్కడి ఏజెంట్ల దృష్టి సిరిసిల్లపై పడింది. దీంతో ఇక్కడ భారీగా ఆర్డర్లు ఇస్తూ.. చీరలు, పంచెలు ఉత్పత్తి చేయిస్తున్నారు. పాలిస్టర్, కాటన్ నూలు కలిసిన దారంతో మెత్తగా చీరలు, పంచెలను నేస్తున్నారు. సిరిసిల్లలో రెండు వేల మరమగ్గాలపై చీరలు, పంచెలు ఉత్పత్తి అవుతున్నాయి. ఒక్కో మగ్గం నిత్యం వంద మీటర్లు ఉత్పత్తి చేస్తుండగా, రోజుకు రెండు లక్షల మీటర్ల వస్త్రం ఉత్పత్తి అవుతుంది. పక్షం రోజుల్లో తమిళనాడుకు అవసరమైన చీరలు, పంచెలను ఉత్పత్తి చేసే శక్తి సిరిసిల్ల నేతన్నలకు ఉంది. రాష్ట్రంలోనే అగ్రగామి... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సిరిసిల్ల మరమగ్గాలు అగ్రగామిగా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 78 వేల మరమగ్గాలుండగా.. ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మరమగ్గాలున్నాయి. ఇందులో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్, 7 వేల మరమగ్గాలపై కాటన్(ముతర) రకం వస్త్రం ఉత్పత్తి అవుతుంది. నిత్యం ఐదు లక్షల మీటర్ల వస్త్రం సిరిసిల్లలో ఉత్పత్తి అవుతుండగా.. ఈ మేరకు మార్కెట్లో వినియోగం లేక ధర లభించడం లేదు. మరోవైపు షోలాపూర్, బీవండి, ఇచ్చంఖరేంజ్ లాంటి ప్రాంతాల నుంచి సిరిసిల్ల కంటే నాణ్యమైన వస్త్రం పోటీకి రావడంతో మన వస్త్రానికి డిమాండ్ తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సిరిసిల్ల నేతన్నలు ఆర్థిక ఇబ్బందులు, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఉన్న మరమగ్గాలపై కాటన్ చీరలు, తువ్వాళ్లు, ధోవతులు, కర్చిఫ్లు, లుంగీలను ఉత్పత్తి చేస్తున్నారు. రంగు రంగుల చీరలు... సిరిసిల్లలో ఉత్పత్తవుతున్న చీరలకు మంచి డిమాండ్ ఉంది. ఆ చీరలపై అనువైన రంగుల్లో ప్రింటింగ్ చేసి ఆధునిక హంగులను సమకూర్చే అవకాశం ఉంది. సిరిసిల్ల వస్త్రాన్ని ప్రాసెసింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. పాలిస్టర్ వస్త్రంను ఉత్పత్తి చేస్తే మీటర్‌కు రూ.1.45 పైసలు లభిస్తుండగా, అదే చీర ఉత్పత్తి చేస్తే మీటర్‌కు రూ.4.50 చెల్లిస్తున్నారు. ఒకే పనికి కొద్ది నైపుణ్యం జోడిస్తే మూడింతల కూలి దొరుకుతుంది. సిరిసిల్లలో తక్కువ ధరకే వస్త్రం ఉత్పత్తవుతుండగా, తమిళనాడు వ్యాపారులు భారీ ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా మార్చుకుంటూ వెళ్తే ఏడాది పొడవునా నేతన్నలకు ఉపాధి లభించనుంది. పండుగ ముందు గిరాకీ సిరిసిల్లలో ఉత్పత్తి అయ్యే చీరలకు పండుగ ముందు ఎప్పుడూ గిరాకీ ఉంటుం ది. ఈ సారి కొత్తగా ఆర్డర్లు వచ్చిన విషయం మాకు తెలియదు. కానీ మంచిగనే గుడ్డ అమ్ముడు పోతుంది. పని చేసుకుంటే రోజుకు 350 వరకు కూలీ గిట్టుబాటు అవుతుంది. - సబ్బని నర్సయ్య, ఆసామి పని బాగానే ఉంది మరమగ్గాలపై చీరలు ఉత్పత్తి చేస్తాను. పని బాగానే ఉంది. మీటర్‌కు మూడున్నర ఇస్తారు. వారానికి పద్నాలుగు వందలు వస్తాయి. 12 గంటలు పని చేస్తే నెలకు ఐదువేల వరకు సంపాదించవచ్చు. కాటన్ పాలిస్టర్ కంటే కొద్దిగా పని ఎక్కువగా ఉంటుంది. - కొంక విజయ్‌కుమార్, రాజీవ్‌నగర్ -
యువశక్తి.. తగ్గిన ఆసక్తి
⇒ ప్రభుత్వ ఆదరణలేదు...రుణాలు రావు ⇒ నిర్వీర్యమైన రాజీవ్ యువశక్తి పథకం ⇒ సీఎంఈవైగా పేరుమార్చినా నిధులివ్వని వైనం కర్నూలు(జిల్లా పరిషత్): రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఈ ఏడాది ఒక్క యూనిట్‌ను ప్రారంభించకుండా యువత భవితతో ఆటలాడుకుంటోంది. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు వారి గురించి ఆలోచించడం మానేసింది. రాజీవ్ యువశక్తి పథకం కింద ప్రభుత్వం కేవలం జిల్లాలో ఆరు నుంచి 7 యూనిట్లకు సరిపోయే మొత్తానికి మాత్రమే నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. సీఎంఈవైగా పేరు మార్చినా యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌యువశక్తి పథకం పేరును సీఎంఈవై (ముఖ్యమంత్రి యువజన సాధికారత పథకం)గా మారుస్తూ సెప్టెంబర్ 25న ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీవో జారీ అయి రెండు నెలలు పూర్తయినా సీఎంఈవై నియమ నిబంధనలు విడుదల చేయలేదు. ఈ పథకం కింద ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రాష్ట్రం మొత్తానికి రూ.1.26కోట్లను మాత్రమే కేటాయించింది. ఈ లెక్కన రాష్ట్రం మొత్తానికి 126 యూనిట్లు రాగా, మన జిల్లాలో 7 నుంచి 8 యూనిట్లు ఏర్పాటు చేసేందుకు మాత్రమే ఈ నిధులు సరిపోతాయి. రాష్ట్రం మొత్తానికి ఎస్టీ వర్గాలకు రూ.5కోట్లతో 500 యూనిట్లు కేటాయించినా అందుకు సంబంధించిన గైడ్‌లైన్స్ విడుదల చేయలేదు. ప్రతిపాదనలు బుట్టదాఖలు సేవా రంగంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు రూ.2లక్షల సబ్సిడీతో రూ.5లక్షల రుణాన్ని వంద యూనిట్లను, వ్యాపార సంబంధంగా రూ.2లక్షల యూనిట్ కాస్ట్‌తో 200 యూనిట్లను, చిన్న యూనిట్లకు రూ.1లక్షతో 600 యూనిట్లను జిల్లాకు కేటాయించాలని గతంలో అధికారులు చేసిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. జాడలేని యువజనోత్సవాలు గతేడాది నియోజకవర్గ, జిల్లా స్థాయి యువజనోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిఆంచారు. కానీ ఈ సారి నియోజకవర్గ స్థాయి పోటీలకు స్వస్తి పలికి కేవలం జిల్లా స్థాయిలో నిర్వహించాలని రూ.30వేలను ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. గూడూరు మండలం జులేకల్ గ్రామానికి చెందిన శ్రీరాములు 2010లో బీఎస్సీ పూర్తి చేశాడు. ఉద్యోగాల కోసం రెండేళ్ల పాటు వెతికినా లాభం లేకపోయింది. ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థిక స్థోమత లేక, కుటుంబ సమస్యలు వెంటాడటంతో ఏదైనా వ్యాపారం చేద్దామని భావించాడు. రెండేళ్లుగా ప్రభుత్వం సబ్సిడీల ద్వారా అందించే రుణాల కోసం ఎదురుచూడసాగాడు. గతేడాది మళ్లీ దరఖాస్తు చేసినా ఫలితం లేదు. ఈ ఏడాది ఇప్పటిదాకా రుణాల ఊసేలేకుండా పోయింది. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు చెందిన రాము స్థానికంగా ఆడియో దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. అతను తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు గతేడాది రాజీవ్ యువశక్తి పథకం ద్వారా రుణానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటిదాకా రాకపోవడంతో మళ్లీ ఈ ఏడాది దరఖాస్తు చేసుకోవాలనుకున్నారు. ఈ సారి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులూ ఇవ్వడం లేదని తెలుసుకుని అప్పులు చేసి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. -
ఎమ్మెల్యే నిధులతో అభివృద్ధి చేస్తా..
మీకు తోడుంటా. మీ కష్టాల్లో పాలుపంచుకుంటా. ఎమ్మెల్యే ప్రత్యేక నిధులతో మీ కాలనీలను అభివృద్ధి చేస్తా. తాగునీటి సమస్యను పరిష్కరిస్తా. పైలట్ ప్రాజెక్టు పూర్తి చేయించి గోదావరి నుంచి తాగునీరు సక్రమంగా అందేలా చూస్తా. అంతర్గత రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం కోసం నిధులు కేటాయించేలా చూస్తా. అధికారులతో మాట్లాడి పింఛన్లు అందేలా కృషి చేస్తా. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ ప్రాంతానికి అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. త్వరలో పవర్ ప్రాజెక్టు ఏర్పాటవుతుంది. ఐటీఐ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పారిశుధ్య పనులపై పంచాయతీ అధికారులతో మాట్లాడుతా. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాలను శుభ్రంగా తీర్చిదిద్దుతా. - పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే అక్కడికి వెళ్లాలంటే దుర్గంధం.. రోడ్లమీదే మురుగు నీరు.. వీధుల వెంట ముక్కుమూసుకొని నడక సాగించాలి.. రాత్రైందంటే దోమల స్వైరవిహారం..అక్కడ ఉండే వారు నిత్యం రోగాలతో అల్లాడుతున్న వైనం..ఇంతేనా.., తాగునీరు, పక్కాఇళ్లు, పింఛన్లు, ఉపాధి...ఇలా ఎన్నో సమస్యలు ఆ కాలనీలను వేధిస్తున్నాయి. నిత్యం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మణుగూరు మండలం సమితిసింగారం పంచాయతీలోని వెంకటపతినగర్, అరుంధతీ నగర్, బీసీ కాలనీ, బుడిగజంగాల కాలనీలను పినపాక ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పాయం వెంకటేశ్వర్లు ఆదివారం సందర్శించారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తోడుంటానని హామీ ఇచ్చారు. పాయం వెంకటేశ్వర్లు : అమ్మా బాగున్నారా? మీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మీ సమస్యలేంటో చెప్పండమ్మా? చిరిగిరి సబ్బుమ్మ : వెంకటపతినగర్‌లో ఎంతో కాలంగా ఉంటున్నానయ్యా. నాకు వృద్ధాప్య పింఛన్ రావడం లేదయ్యా. పాయం: పోషయ్య బాగున్నారా? మీ వాడలో ఉన్న సమస్యలేంటి? పోషయ్య : బాగానే ఉన్నాము సారు..మా వాడలో అంతర్గతరోడ్లు లేక ఇబ్బంది పడతున్నాం. తాగునీరు లేదు సారు. నల్లాలు వారానికి ఓసారి కూడా రావట్లేదయ్యా. పాయం: ఏమ్మా బాగున్నావా? మీ కాలనీలో ఏమైనా ఇబ్బందులున్నాయా? పచ్చిపులుసు అన్నపూర్ణ : మా వాడలో సరైన రోడ్లు లేవయ్యా. ఇండ్ల మధ్యనే మురికి నీరు ఉంటోంది. దోమలు విపరీతంగా ఉన్నాయయ్యా. పిల్లపెద్దలకు రోగాలొస్తన్నాయ్. లెట్రిన్గదుల్లేక ఆడోళ్లం ఇబ్బంది పడతాన్నం. మా పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని ఉపాధిలేక ఖాళీగా ఉంటుండ్రు. వారికి ఉపాధి చూపించడయ్యా. పాయం: ఏం తాతా బాగున్నావా? పింఛన్ వస్తుందా? గంగయ్య: రావడం లేదయ్యా. ఆఫీసుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేద య్యా. మీరైనా పింఛన్ ఇప్పించడయ్యా. పాయం: ఏమి బాబూ? నీ సమస్య ఏమిటీ? దాసరి పెంటయ్య: మాకు పక్కా ఇళ్లు లేక గుడిసెలు వేసుకొని ఉంటున్నామండి. సైడ్‌కాల్వలు సక్రమంగా లేవు. పక్కా ఇళ్లు ఇప్పించండి. పాయం : దుకాణం ఎట్ల నడుస్తుందమ్మా? మీ ప్రాంత సమస్యలు చెప్పండమ్మా? దుకాణం కోసం అవసరమైతే ఐటీడీఏ లోన్ తీసుకోమ్మా.. కారం సీత: దుకాణం బాగనే నడస్తందయ్యా. మాకు ఇందిరమ్మ ఇల్లు బిల్లులు పూర్తి రాలేదయ్యా. మరుగుదొడ్ల బిల్లులు ఇవ్వడం లేదు. సంతోషమయ్యా అవసరమైనప్పుడు ఐటీడీఏ లోన్ తీసుకుంటనయ్యా. పాయం: బాగున్నారామ్మా మన బీసీ కాలనీలో ఏమైనా సమస్యలున్నాయా? వీరమ్మ: గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప ఇప్పటి వరకు ఎవరూ రోడ్డు వేయలేదు సారు. సైడు కాల్వలు లేక రోడ్డుమీద మురికి నీరు నిల్వ ఉంటోంది సారు. సైడ్‌కాల్వలు, రోడ్లు వేయించండి సారు. పాయం: మీ ప్రాంతానికి అధికారులు వచ్చి ఎప్పుడైనా మీ సమస్యలు అడిగారామ్మా? భద్రమ్మ : మా బాధలు పట్టించుకునేటోరు ఎవరు లేరయ్యా. అధికారులు అప్పుడప్పుడు వచ్చినా పరిష్కారం చూపడం లేదు సారు. ఇట్ల వచ్చి అట్ల పోతున్నరు. మరుగుదొడ్ల బిల్లులు రాలేదు. సైడుకాల్వలో నీరు నిల్వ ఉంటాంది. దోమలు విపరీతంగా ఉన్నాయి. పాయం: ఏమిటమ్మా బాధపడుతున్నావు.. ఏమైంది? పెంటమ్మ: అయ్యా నాకు ముసలోళ్ల పింఛన్ రావట్లేదయ్యా. రెండునెలలు అయిందయ్యా. వస్తదో రాదో తెల్వడం లేదయ్యా. ఎన్నిసార్లో సార్ల చుట్టూ తిరిగినా..ఎవరూ పట్టించుకోలేదయ్యా. పాయం: బాబూ నీ సమస్య ఏమిటి? చిన్నారావు: నాకు వికలాంగుల పింఛన్ రావడం లేదు. దరఖాస్తు పెట్టినాను. నెలరోజుల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతాన్న. ఎవరూ పట్టించుకోవడం లేదు. పాయం: ఏం చిన్న నీ ప్రాబ్లమ్ ఏమిటి? ఆంజనేయులు: సర్ నేను ఐటీఐ పూర్తి చేశాను. ఎక్కడా ఉపాధిలేక నిరుద్యోగిగా తిరుగుతున్నా. మాకు ఉపాధి మార్గం చూపండి సారు. పాయం: ఏంటమ్మా..ఏమి చదువుతున్నావ్? ఏమైనా సమస్యలున్నాయా? జరిపెటి చిన్నారి : సారు నే ను మణుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నా. మాకు ఇప్పటివరకు స్కాలర్షిప్లు రావడంలేదు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇవ్వట్లేదు. పాయం: ఏమ్మా అందరూ బాగున్నారా? పిల్లలు మంచిగున్నరా? సువార్త, గంగ, రాణి: పిల్లలు బాగనే ఉన్నరన్న. బంగారుతల్లి పథకం మా పిల్లలకు ఇవ్వడంలేదన్న. జర వచ్చేలాగా చూడండి. పాయం: బాగున్నావా ఆనందరావు? అరుంధతీనగర్ సమస్యలు ఏమిటి? చెన్నం ఆనందరావు: సారు బాగున్నాను. మా ప్రాంతంలో తాగునీటి సమస్య బాగా ఉంది. అంతర్గత రోడ్లు లేవు. వీధి లైట్లు లేవు. మా ప్రాంతానికి రోడ్లు వేయిస్తామన్నారు..సంతోషంగా ఉంది. వృద్ధుల పింఛన్ల విషయంలో అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. పాయం: అమ్మా నీ సమస్య ఏమిటి? చిలక శిరోమణి: అరుంధతీ నగర్లో ఎంతోకాలంగా ఉంటున్నానయ్యా. వృద్ధాప్య పింఛన్ రావడం లేదు. ఆఫీసులచుట్టూ తిరుగుతన్నా. ఏదైనా ఆధారం చూపండయ్యా. -
యువశక్తి నిర్వీర్యం
‘ఇనుప నరాలు, ఉక్కు కండరాలు కలిగిన 100 మంది యువకులను అప్పగిస్తే ఈ దేశగతినే మార్చేస్తా’ స్వామి వివేకానందుడు అన్న మాటలు ఇవి.. ప్రభుత్వాలు చేయూత ఇవ్వకపోవడంతో అటువంటి యువశక్తి నిర్వీర్యమైపోతోంది. సాక్షి కడప :ప్రతి యేడాది నిరుద్యోగ యువతీయువకులకు సబ్సిడీపై రుణాలను అందించి స్వయం ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. మేలో సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిపోయాయి. యువతకు పెద్దపీట వేసి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని మేనిఫెస్టోలో ఊదరగొట్టిన బాబు.. అధికారంలోకి వచ్చాక అన్నింటినీ విస్మరించారు. నిరుద్యోగభృతి, ఇంటింటికి ఉద్యోగంతో పాటు మరెన్నో చేస్తామన్నా.. ఇంతవరకూ ఏవీ అమలుకు నోచుకోకపోవడంతో జిల్లాలోని యువత నిరుత్సాహంతో ఉంది. ఈ యేడాదికి లేనట్టే.. 2014-15 యేడాదికి సంబంధించి యువశక్తి యూనిట్లు దాదాపు లేనట్లేనని తెలుస్తోంది. 2014 జూన్ నాటి నుంచి టీడీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినా.. యువత ఉపాధికి తీసుకున్న ప్రత్యేక చర్యలు ఏమీ లేవు. 2014 మార్చి నాటి నుంచి 2015 మార్చి వరకు యేడాదిగా పరిగణిస్తారు. ఇప్పటికే దాదాపు పుణ్యకాలం కాస్తా గడిచిపోవడంతో ఈ యేడాది రుణాలు మంజూరు కావడం అనుమానమేనని భావిస్తున్నారు. పేరుమారినా.. కనిపించని మార్పు.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నేతల పేర్లపై ఉన్న పథకాలపై దృష్టి సారించింది. అవే పథకాలను కొనసాగిస్తూ పేర్లను మాత్రం మార్చుకుంటూ ముందుకు సాగుతోంది. పలు పథకాలకు ఎన్టీఆర్ భరోసా, సుజల స్రవంతి, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేర్లుగా మార్పు చేసింది. అదే విధంగా రాజీవ్ యువశక్తి పథకాన్ని తిరిగి సీఎంఈవై పథకంగా పేరుమార్చారు. పేరు మార్చి దాదాపు మూడు నెలలయినా ఇంత వరకు నిరుద్యోగులకు అవసరమైన రుణాలు, సబ్సీడీల విషయంలో ప్రభుత్వం ఏ మాత్రం ఆసక్తి కనబరచడం లేదు. 2014-15కు 380 యూనిట్లు అవసరం.. 2014-15 సంవత్సరానికి సంబంధించి నిరుద్యోగులకు 380 యూనిట్లు అవసరమని.. ఇందుకు రూ. 3.80 కోట్లు కావాలని స్టెప్ కార్యాలయం ప్రతిపాదనలు పంపించింది. ఈ మేరకు ఆర్థిక సహాయం అందించడానికి బ్యాంకర్ల కమిటీ కూడా ఆమోదం తెలిపింది. అయితే యువశక్తి రుణాలపై ప్రభుత్వం తాత్సారం చేస్తోందే తప్ప మంజూరుకు ఉత్తర్వులు ఇవ్వలేదు. 2013-14కు సంబంధించి రాజీవ్ యువశక్తి పథకం కింద 296 యూనిట్లకు రూ. 2.96 కోట్లు ఖర్చుచేశారు. వైఎస్ఆర్ జిల్లా రాష్ట్రస్థాయిలో పలుమార్లు మొదటిస్థానంలో నిలిచింది. యువకులకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు పలు కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచి ప్రత్యేక గుర్తింపు పొందింది. అలాంటి జిల్లాలో స్వయం ఉపాధి పొందడానికి అవకాశాలు లేక యువశక్తి నీరసించి పోతోంది. స్టెప్ సీఈఓ మమత ఏమంటున్నారంటే.. ఈ యేడాదికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. సబ్సిడీ విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాకు కేటాయింపులు వస్తే నిరుద్యోగులకు యూనిట్లను మంజూరు చేసి ఉపాధికి పెద్దపీట వేస్తాం. -
సీఎస్ఆర్తో ఉపాధి అవకాశాలు లభించాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలు (సీఎస్ఆర్) ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగావకాశాలు కల్పించేలా ఉండాలని అమరరాజా బ్యాటరీస్ మాజీ సీఎఫ్‌వో సి. మురళీకృష్ణ చెప్పారు. సీఎస్ఆర్, కార్పొరేట్ గవర్నెన్స్ ఒక దాని వెంట మరొకటి ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాపార, పరిశ్రమల సమాఖ్య ఫ్యాప్సీ, బోంబే చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ సంయుక్తంగా కంపెనీల చట్టం 2013పై నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మురళీకృష్ణ ఈ విషయాలు చెప్పారు. మరోవైపు, కంపెనీల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఉద్దేశించిన కొత్త కంపెనీల చట్టం.. దేశీయంగా కార్పొరేట్ రంగం వృద్ధికి తోడ్పడగలదని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ కుమార్ రుంగ్టా తెలిపారు. కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలను మెరుగుపర్చడంలో తోడ్పడేందుకు ఫ్యాప్సీ అంతర్గతంగా సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. -
జాబ్ ఇంటర్వ్యూలో నెగ్గే ‘విలువలు’
ఉద్యోగంలో ఉన్నతంగా రాణించాలంటే తగిన అర్హతలు, నైపుణ్యాలు, పరిజ్ఞానం, అనుభవం ఉండగానే సరిపోదు.. అభ్యర్థిలో తగిన విలువలు తప్పనిసరిగా ఉండాలి. నీతి నిజాయతీ, క్రమశిక్షణ, మంచి ప్రవర్తన, నడవడిక చాలా అవసరం. మనుషుల్లో రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. వ్యక్తిత్వంలో లోపాలు ఉంటే మనిషి దెబ్బతింటాడు. ఉద్యోగుల్లో లోపాలు ఉంటే సంస్థ నష్టపోతుంది. కంపెనీ విజయవంతం కావాలంటే నిపుణులైన సిబ్బంది మాత్రమే కాదు, వారిలో నైతిక విలువలూ ఉండాల్సిందే. అందుకే యాజమాన్యాలు తమ సిబ్బందిలో విలువలు కచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాయి. మౌఖిక పరీక్షలో వీటిని కూడా పరిశీలిస్తున్నాయి. రిక్రూటర్లు, హైరింగ్ మేనేజర్లు విలువల ఆధారిత(వాల్యూ బేస్డ్) ఇంటర్వ్యూలపై మొగ్గుచూపుతున్నారు. భిన్న కోణాల్లో ప్రశ్నలు సంధిస్తూ అభ్యర్థుల మనస్తత్వాలను చదువుతున్నారు. వారు తమ సంస్థ సంస్కృతిలో పూర్తిలో ఒదిగిపోవాలని(కల్చరల్ ఫిట్) 100 శాతం ఆశిస్తున్నారు. స్వార్థం.. నిస్వార్థం ఉత్తమమైన అభ్యర్థులను ఎంపిక చేసుకొనే విషయంలో రిక్రూటర్లు ప్రస్తుతం మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అవి.. బాధ్యతలను నిర్వర్తించడానికి అవసరమైన నైపుణ్యాలు, అభ్యర్థులు పాటించే విలువలు, వారిలోని ప్రధాన బలాలు. కల్చరల్ ఫిట్‌కు అమిత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉద్యోగుల్లో ఉండకూడని లక్షణం.. స్వార్థం. అందరూ కలిసి ఒక జట్టుగా పనిచేస్తేనే లక్ష్యం నెరవేరుతుంది. ఎవరికి వారే అన్నట్లుగా ఉంటే.. సంస్థ ప్రగతి మందగిస్తుంది. రిక్రూటర్లు అభ్యర్థుల నుంచి నిస్వార్థాన్ని కోరుకుంటున్నారు. ఒక బృందాన్ని ఉత్తేజపరిచి, ముందుండి నడిపించే సామర్థ్యం వారిలో ఉండాలని ఆశిస్తున్నారు. ఇందుకోసం.. మీకు టీమ్‌ను అప్పగిస్తే ఎలా పని చేయిస్తారు? అందులో మీరు ఎలాంటి పాత్ర పోషిస్తారు? బృందం సాధించిన విజయాన్ని ఎవరికి ఆపాదిస్తారు? ఒకవేళ విఫలమైతే దానికి మీరు బాధ్యత వహిస్తారా? లేక ఇతరులపైకి తోసేస్తారా?.. ఈ తరహా అంశాలను ఇంటర్వ్యూలో పరిశీలిస్తున్నారు. నీతి నిజాయతీని పరీక్షించే ప్రశ్నలేస్తున్నారు. ప్రలోభాలకు లొంగని గుణం ఉందా? లేదా? అని తెలుసుకుంటున్నారు. సంస్థ రహస్యాలను కాపాడతారా? లేక సొంత ప్రయోజనాల కోసం బహిర్గతం చేస్తారా? అనేది గుర్తించడానికి లోతుగా ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిత్వం ముఖ్యం విలువల ఆధారిత ఇంటర్వ్యూలో నెగ్గాలంటే అభ్యర్థుల సమాధానాలు నిజాయతీగా ఉండాలి. డొంక తిరుగుడు లేకుండా సూటిగా బదులివ్వాలి. ఉన్నవి లేనివి కల్పించి చెబితే రిక్రూటర్‌కు సులువుగా దొరికిపోతారు. మీ నిజాయతీని ఇతరులు శంకించే పరిస్థితి తెచ్చుకోవద్దు. కొన్ని సందర్భాల్లో స్కిల్స్ లేకపోయినా మంచి వ్యక్తిత్వం ఉంటే ఉద్యోగావకాశాలు దక్కుతాయి. మంచి ప్రవర్తన ఉన్న అభ్యర్థులు దొరికితే చాలు.. నైపుణ్యాలను తర్వాత కూడా నేర్పించుకోవచ్చు అని కంపెనీలు భావిస్తున్నాయి. సంస్థ పట్ల పూర్తి అంకితభావంతో, నిబద్ధతతో పనిచేస్తాననే నమ్మకం రిక్రూటర్లలో కలిగించగలిగితే అభ్యర్థికి కొలువు ఖాయమైనట్లే. -
నేర నియంత్రణకు.. క్రిమినాలజిస్ట్
దేశంలో జనాభా పోటెత్తుతోంది. నేరాలు కూడా అదేస్థాయిలో పెరిగిపోతున్నాయి. మరోవైపు తీవ్రవాదం పంజా విసురుతోంది. ఉగ్రవాదం ఉరుముతోంది. వీట న్నింటితో ప్రజా జీవనం అస్తవ్యస్తమవుతోంది. అంతిమం గా దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో నేర నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవస రం ఏర్పడింది. అందుకే క్రిమినాలజిస్ట్లకు డిమాండ్ పెరిగింది. దీన్ని కెరీర్‌గా మార్చుకుంటే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఆకర్షణీయమైన ఆదాయం మెండుగా ఉంటాయి. సవాళ్లతో కూడిన ఉత్సాహభరితమైన కెరీర్‌ను ఇష్టపడేవారికి ఇది సరిగ్గా సరిపోతుంది. బ్యాంకులు, కార్పొరేట్ సంస్థల్లో కొలువులు క్రిమినాలజిస్ట్‌లు సమాజంలో నేరాలకు గల కారణాలు, నేరస్తుల స్వభావం, నేరాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పోలీసు, న్యాయ వ్యవస్థ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల్లో పనిచేసే సిబ్బందికి శిక్షణ, సెమినార్ల ద్వారా అవగాహన కల్పించాలి. క్రిమినాలజీ కోర్సులను పూర్తిచేసినవారు యూనివర్సిటీ/కాలేజీల్లో లీగల్ స్టడీస్, లా అండ్ సోషియాలజీ, క్రిమినాలజీ ఫ్యాకల్టీగా పనిచేయొచ్చు. నేడు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల కంపెనీలు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు నిపుణులైన క్రిమినాలజిస్ట్‌ల కొరత ను ఎదుర్కొంటున్నాయి. పర్యావరణ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘన వంటి వాటిపై విచారణ జరిపే సంస్థల్లో వీరికి అధిక డిమాండ్ ఉంది. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, పరిశోధనా సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. క్రిమినాలజీలో కార్పొరేట్ క్రైమ్, ఎన్విరాన్మెంటల్ క్రైమ్ వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఆర్థిక నేరాలను అరికట్టేందుకు బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు కూడా క్రిమినాలజిస్ట్లను నియమించుకుంటున్నాయి. కార్పొరేట్ రంగంలో చేరితే అధిక వేతనాలు అందుకోవచ్చు. కావాల్సిన నైపుణ్యాలు: క్రిమినాలజిస్ట్కు విశ్లేషణాత్మక దృక్పథం అవసరం. ప్రతి విషయాన్ని తర్కబద్ధంగా ఆలోచించగలగాలి. డేటా కలెక్షన్, అనాలిసిస్‌పై మంచి పరిజ్ఞానం ఉండాలి. సైకాలజీ, సోషియాలజీపై అవగాహన పెంచుకోవాలి. కష్టపడి పనిచేసే గుణం ఉండాలి. ఒత్తిళ్లు, సవాళ్లను తట్టుకొని పనిచేసే నేర్పు చాలా ముఖ్యం. అర్హతలు: మన దేశంలో వివిధ విద్యాసంస్థలు క్రిమినాలజీలో అండర్గ్రాడ్యుయేట్(బీఏ/బీఎస్సీ), పోస్టుగ్రాడ్యుయేట్(ఎంఏ/ఎంఎస్సీ) కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైనవారు అండర్గ్రాడ్యుయేట్ కోర్సులో చేరొచ్చు. ఇందులో ఉత్తీర్ణత సాధించి, పోస్టుగ్రాడ్యుయేషన్‌లో చేరేందుకు అవకాశం ఉంటుంది. వేతనాలు: క్రిమినాలజిస్ట్‌లు తమ హోదాలను బట్టి వేతనాలు అందుకోవచ్చు. ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు పొందొచ్చు. ఆ తర్వాత పనితీరు, అనుభవం, పదోన్నతుల ద్వారా వేతనంలో పెరుగుదల ఉంటుంది. కోర్సులను అందిస్తున్న సంస్థలు: లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్(ఎన్‌ఐసీఎఫ్‌ఎస్)-న్యూఢిల్లీ వెబ్సైట్: http://nicfs.nic.in/ ఆంధ్రా యూనివర్సిటీ వెబ్సైట్: www.andhrauniversity.edu.in బెనారస్ హిందూ యూనివర్సిటీ వెబ్సైట్: www.bhu.ac.in లక్నో యూనివర్సిటీ వెబ్సైట్: www.lkouniv.ac.in యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వెబ్సైట్: www.unom.ac.in -
హెచ్ఎండీఏకు షాక్!
- అధికారాల కుదింపుపై సర్కార్ దృష్టి - కొత్త పరిశ్రమలకు ఇకపై నేరుగా అనుమతులు - సింగిల్ విండ్ విధానంపై ప్రభుత్వం కసరత్తు సాక్షి, సిటీబ్యూరో: అక్రమాల పుట్టగా అపకీర్తిని మూటగట్టుకున్న మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) అధికారాలకు కోత విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అక్రమార్కుల చర్యల వల్ల నగర శివార్లలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాకుండా పోతున్నాయని పసిగట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల హెచ్ఎండీఏ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్‌పై బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కొత్త పరిశ్రమలను ప్రోత్సహించాలని, త్వరితగతిన అనుమతులిచ్చే విధానాన్ని అమల్లోకి తేవాలని ఆయన యోచిస్తున్నారు. వారం, పది రోజుల్లో అనుమతులిచ్చే విధానాన్ని అమల్లోకి తేవాలని ఇప్పటికే సీఎం అధికారులను ఆదేశించారు. కొత్త పరిశ్రమలకు సంబంధించి భూ వినియోగం, బిల్డింగ్ ప్లాన్లు, రోడ్లు తదితరాలకు అనుమతులిచ్చే అధికారాన్ని హెచ్ఎండీఏ నుంచి తప్పించి... పరిశ్రమల శాఖకు కట్టబెట్టాలని ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు వినికిడి. హెచ్ఎండీఏ అధికారాల కుదింపులో సాంకేతిక ఇబ్బందులు, సాధ్యాసాధ్యాలపై ఉన్నత స్థాయిలో అధ్యయనం సాగుతున్నట్లు తెలుస్తోంది. కొత్త వాటికి పరిశ్రమల శాఖ అనుమతులిస్తుంది గనుక భవనాల ప్లాన్లు, భూ వినియోగం వంటి వాటికీ ఆ శాఖే అనుమతులిస్తే కాలం, ఖర్చు కలిసి వస్తుందని అధికారుల యోచన. సమస్యలు ఎదురైన అక్కడే పరిష్కరించుకొనే అవకాశం ఉంటుందని వారి అభిప్రాయం. సింగిల్ విండో విధానం హెచ్ఎండీఏలో ఏ అనుమతి కావాలన్నా చేయి తడపనిదే ఫైల్ కదలదన్న విషయం బహిరంగ రహస్యమే. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు సింగిల్ విండో విధానం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అనుమతులిచ్చేందుకు నిర్దిష్ట గడువు నిర్దేశించి, పక్కాగా అమలుకు కసరత్తు చేస్తోంది. కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశ్రమల శాఖలోనే పరిశీలించి, అన్నీ సక్రమంగా ఉంటే సత్వరం అనుమతులు ఇవ్వాలనుకుంటోంది. దీని వల్ల పరిశ్రమల స్థాపన వేగవంతమై, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అధికారులు చెబుతున్నారు. సాధ్యమేనా? హెచ్ఎండీఏ అధికారాలను కుదింపు అనుకున్నంత సులభం కాదన్న వాదన వినిపిస్తోంది. ‘హెచ్ఎండీఏ యాక్టు’ను సవరించకుండా అధికారాల కుదింపు, బదలాయింపు సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. నగరం, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా హెచ్ఎండీఏ అనుమతి తప్పనిసరి చేస్తూ గతంలో చట్టం చేశారు. పరిశ్రమల జోన్లోనే కొత్త వాటికి అనుమతిచ్చేలా నిబంధన పెట్టారు. ఆ అధికారం పరిశ్రమల శాఖకు ఇచ్చినా... భూ వినియోగానికి ఆ ఫైల్ విధిగా హెచ్ఎండీఏకు వెళ్లాల్సిందే. లేదంటే ఎవరి ఇష్టమొచ్చిన చోట వారు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కాలుష్యం పెరిగి, ప్రజా జీవనమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రభుత్వం తలుచుకొంటే చట్టాన్ని సవరించి అధికారాలను కుదించడం పెద్ద సమస్య కాదన్న మరో వాదన కూడా ఉంది. ఏం జరుగుతుందన్నది వేచి చూడాలి. -
రూ.70 కోట్లతో ఎలక్ట్రానిక్ క్లస్టర్
సాక్షి, అనంతపురం: జిల్లాలో ప్రగతి పరుగులందుకోనుంది. వెనకుబడిన అనంతపురం జిల్లాలో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు పారిశ్రామికీకరణే మార్గం అని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కల్పించే ప్రత్యేక రాయితీతో సాఫ్ట్వేర్ పారిశ్రామికుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలూ సానుకూల ఫలితాలు అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పెట్టుబడులను ఆహ్వానించడం వల్ల పలువురు పారిశ్రామిక వేత్తలు జిల్లాకు తరలివస్తున్నారు. ప్రధానంగా చిలమత్తూరు మండలానికి మంచి రోజులు రాబోతున్నాయి. రూ.70 కోట్లతో ఎసినా రాఘమయూరి ఎలక్ట్రానిక్స్ పార్కు ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో చిలమత్తూరులో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నారు. క్లస్టర్ పరిధిలో దేశ, విదేశాలకు చెందిన ఆరు సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉత్పత్తుల నెలకొల్పే యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు గురువారం రాష్ర్ట ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎల్సినా రాఘమయూరి ఎలక్ట్రానిక్ పార్కు ప్రైవేటు లిమిటెడ్ ఎండా కె.జే.రెడ్డి, సీఈఓ భాస్కర్‌రెడ్డి, జేసీ ఎస్.సత్యనారాయణలు చిలమత్తూరులో పర్యటించారు. ఈ మేరకు ఎసినా రాఘమయూరి ఎలక్ట్రానిక్స్ పార్కు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అభివృద్ధి చేస్తున్న పనులను పరిశీలించారు. క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేజే రెడ్డికి మంత్రి హామీనిచ్చారు. ఫలితంగా మరికొన్ని కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు. సంస్థ ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో భూగర్భ జలాలను పరిశీలించగా, జలాలు సమృద్ధిగా ఉన్నట్లు గుర్తించారు. వ్యవస్థాపరమైన నిర్మాణాలు చేపట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు అప్పగించనున్నట్లు సంస్థ ఎండీ కేజీరెడ్డి తెలిపారు. క్లస్టర్ పరిధిలో ఉన్న హిందూపురం, పుట్టపర్తి, పెనుకొండ ప్రాంతాలలో విద్యావంతులైన యువతీ, యువకులు అందుబాటులో ఉన్నారని, దాదాపు పది వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు. ఎలక్ట్రానిక్ క్లష్టర్ సమీపంలోనే ఇంకుబేషన్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా అనువైన భూమి ఉందని జేసీ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. -
విడాకుల గురించి తర్వాత మాట్లాడతా
సాక్షి ముంబై: రాష్ట్రంలో రెండు కూటములు విచ్ఛిన్నం కావడంపై రాజ్‌ఠాక్రే తనదైన శైలిలో స్పందించారు. శివసేన-బీజేపీ, కాంగ్రెస్-ఎమ్మెన్నెస్‌ల పేర్లు ఎత్తకుండానే ప్రత్యర్థి పార్టీలకు చురకలంటించారు. అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ముఖ్యమంత్రి పదవి తమకు దక్కాలంటే తమకు దక్కాలని ఆశపడుతున్నాయని, ఆ ఆశతోనే విడాకులు తీసుకున్నాయని, ఈ విడాకుల గురించి తర్వాత మాట్లాడతానన్నారు. ముందుగా రాష్ట్రాభివృద్ధిపై పార్టీలు దృష్టిపెట్టాలని హితవు పలికారు. బ్లూప్రింట్ విడుదల.. ఎట్టకేలకు ఎమ్మెన్నెస్ బ్లూప్రింట్ విడుదల చేసింది. శివసేన నుంచి వైదొలగి ఎమ్మెన్నెస్‌ను స్థాపించిన కొత్తలోనే ఎమ్మెన్నెస్ అధ్యక్షులు రాజ్ ఠాక్రే రాష్ట్రం కోసం బ్లూప్రింట్ రూపొందించనున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పటిదాకా ఆ బ్లూప్రింట్ ఏమిటో? అందులో ఎటువంటి విషయాలు ఉన్నాయో వెల్లడించలేదు. కాగా బుధవారం దసరా నవరాత్రులను పురస్కరించుకొని మాటుంగాలోని షణ్ముకానంద్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ బ్లూప్రింట్‌ను విడుదల చేశారు. మహారాష్ట్ర అభివృద్ధితోపాటు ప్రజల సంక్షేమం కోసం అనేక మంది మద్దతుతో ఈ బ్లూప్రింట్‌ను రూపొందించినట్టు చెప్పారు. ప్రపంచంలో మహారాష్ట్రను ఒక ఉన్నత స్థాన ంలో నిలిపేలా లక్ష్యాలుండాలన్నారు. ఇందుకోసం ఏమి చేయవచ్చు...? ఎమి చేయాలి..? తదితర విషయాలను పొందుపర్చామని చెప్పారు. గత 65 ఏళ్ల నుంచి చెప్పిన మాటలే చెప్పడం, ఇచ్చిన హామీలనే ఇవ్వడం రాజకీయ పార్టీలకు అలవాటైందని, ఇతర దేశాలతో పోల్చుకుంటే మనం ఎందుకు వెనుకబడుతున్నామో అర్థమవుతోందని, అభివృద్ధి గురించి ఆలోంచకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రాజ్ పేర్కొన్నారు. చేయాలన్న తపన, అవినీతి నిర్మూలన చేసినట్టయితే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయవచ్చునని చెప్పారు. బ్లూ ప్రింట్ విడుదలలో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. ఎమ్మెన్నెస్ తొలి జాబితా విడుదల సాక్షి ముంబై: రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 153 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. గత ఎన్నికల్లో విజయం సాధించిన 13 మంది ఎమ్మెల్యేలతోపాటు రెండో స్థానంలో నిలిచినవారందరికీ దాదాపుగా అవకాశం కల్పించింది. ఎమ్మెన్నెస్ కార్యదర్శి, అసెంబ్లీ గ్రూప్ లీడర్ బాలా నాందగావ్కర్ , ప్రవీణ్ దరేకర్, మంగేష్ సాంగలే, శిశిర్ షిండే, ప్రకాష్ భోయిర్ తదితరులున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ టిక్కెట్‌పై విజయం సాధించిన ఘాట్కోపర్ ఎమ్మెల్యే రామ్ కదం ఇటీవలే బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో దిలీప్ లాండేను బరిలోకి దింపనున్నట్టు ఎమ్మెన్నెస్ ప్రకటించింది. ఆయనతోపాటు రాజేంద్ర శిరోడ్కర్, శాలిని ఠాక్రే, రైస్ లష్కరియా, శిల్పా సర్పోద్దార్, సుధాకర్ చవాన్, పరుశురామ్ ఉపర్కర్ తదితరుల పేర్లు ముందు నుంచి ఊహించినట్టుగానే జాబితాలో ఉన్నాయి. -
పర్యాటక ఆతిథ్య రంగంలో నిథమ్ పాత్ర భేష్
రాయదుర్గం: పర్యాటక ఆతిథ్య రంగంలో విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంలో డాక్టర్ వైఎస్సార్ నిథమ్ ముఖ్య భూమిక పోషిస్తోందని నిథమ్ స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ ప్రిన్సిపల్ సుధాకుమార్ పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని డాక్టర్ వైఎస్సార్ నిథమ్‌లో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ, పర్యాటక దినోత్సవాన్ని పురష్కరించుకొని రెండు రోజులపాటు నిర్వహించిన పోటీలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుధాకుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర పర్యాటక శాఖల సహకారంతో వైఎస్సార్ నిథమ్ పలు కోర్సులను నిర్వహించడమే కాకుండా స్వయం ఉపాధి పొందేందుకు అన్ని వర్గాల వారికి నిరంతరం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. నిథమ్‌ను సందర్శంచిన విదేశీ ప్రతినిధులు... గచ్చిబౌలిలోని డాక్టర్ వైఎస్సార్ నిథమ్‌లో ఇరాన్, ఇరాక్, మయన్మార్, భూటాన్, ఆఫ్రికా దేశాలకు చెందిన పర్యాటక శాఖ ప్రతినిధులు నిథమ్‌ను సందర్శించారు. నిథమ్‌లో నిర్వహిస్తోన్న కోర్సుల, శిక్షణ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నిథమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మిసెల్లి జె ఫ్రాన్సిస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
27న మెగా జాబ్ ఫెయిర్
విజయనగర్‌కాలనీ: నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేం దుకు కృషిచేస్తున్నామని ఉపాధి శిక్షణశాఖ అదనపు సంచాలకులు, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) అధికారి పి.ధర్మరాజు తెలిపారు. నగరంలోని 38 సంస్థల అభ్యర్ధన మేరకు 3159 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నెల 27న మెహిదీపట్నంలో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఉపాధి శిక్షణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్ ఫెయిర్ మెహిదీపట్నం పుల్లారెడ్డి కళాశాలలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. బుధవారం విజయనగర్‌కాలనీలోని టామ్‌కామ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన జాబ్‌ఫెయిర్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జాబ్‌ఫెయిర్‌లో ప్రముఖ కంపెనీలు నిస్సాన్ కంపెనీ-చెన్నై, వరుణ్ మోటార్స్, వసంత టూల్స్ ఆండ్ క్రాఫ్ట్స్, హర్ష టయోటా, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఇన్బిస్కో, ెహ టిరోల్యాబ్స్, వెరిబ్యాటిం, సిప్రాల్యాబ్స్, గ్రీన్‌పార్క్ హోటల్, ఏజీస్, ఈమౌకా, ఎంఎస్ఎన్ ల్యాబ్ తదితర కంపెనీలు పాల్గొంటాయి. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి రీజియన్ ఆర్ఈవో టామ్‌కామ్ జనరల్ మేనేజర్ కె.భవానీ, రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం అధికారి ఆర్.జగన్నాథం, ఉపాధి అధికారులు ఎ.పరమేశ్వర్ రెడ్డి, ఎస్. సుబ్బారామయ్య తదితరులు పాల్గొన్నారు. -
చైతన్యం నింపిన యువ మైత్రి
30 కళాశాలల నుంచి 1,500 మంది విద్యార్థులు హాజరు భవితను నిర్దేశించిన ప్రొఫెసర్ల ప్రసంగాలు మీ భవితకు మీరే నిర్దేశకులు.. మీ మనసే మీ ఆయుధం.. ఆశల పల్లకీలో ఊరేగుతూనే అవకాశాలు అందిపుచ్చుకోవాలి.. లక్ష్యం ఎంత కఠినంగా ఉన్నా.. గమ్యం ఎంత సుదూరంగా ఉన్నా.. అనుకున్న చోటికి, అనుకున్న సమయూనికి చేరుకోవాలి... అంటూ పలువురు ప్రొఫెసర్లు చేసిన ప్రసంగాలు విద్యార్థుల్లో చైతన్యం నింపారుు. ఈ-సిటీ సౌజన్యంతో ‘సాక్షి’ మీడియా, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో సిద్ధార్థ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన ‘యువమైత్రి’ వర్క్‌షాప్‌నకు విశేష స్పందన వచ్చింది. నిపుణుల ఇచ్చిన పలు సూచనలు సలహాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడ్డాయి. విజయవాడ : పోటీ ప్రపంచంలో.. విద్యార్థులు ఉన్నత ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవటం కోసం నిర్వహించిన ‘యువమైత్రి’ వర్క్‌షాపు విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపింది. ఈ-సిటీ సౌజన్యంతో ‘సాక్షి’ మీడియా, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో వక్తల ప్రసంగాలు విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేశాయి. సిద్ధార్థ ఆడిటోరియంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిద్ధార్థ అకాడమి అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు తొలుత జ్యోతి వెలిగించి వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో గెలుపోటములు సహజమని, ఓటమి చెందినవారు కుంగిపోకుండా మళ్లీమళ్లీ ప్రయత్నిస్తే విజయం సాధిస్తారన్నారు. విద్యార్థులు మానవీయ విలువలను తెలుసుకోవాలని సూచించారు. వర్క్‌షాపులో నిపుణులు చెప్పిన అంశాలను ఆకలింపు చేసుకోవాలన్నారు. కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షుడు చంటిరాజు క్లబ్ చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. న్యూ జనరేషన్స్ మంత్ను పురస్కరించుకుని రోటరాక్ట్ క్లబ్ విభాగం ఆధ్వర్యంలో యువత కోసం నెలరోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. వర్క్‌షాపునకు హాజరైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ-సిటీ వారు లక్కీడ్రా నిర్వహించారు. ఈ డ్రాలో సిద్ధార్థ మహిళా కళాశాలకు చెందిన జి.భవానీ, ఆంధ్రా లయోలా కాలేజీకి చెందిన బి.శ్రీను బహుమతులు గెలుచుకున్నారు. సోమవారం బంపర్ డ్రా నిర్వహించి విజేతకు భారీ బహుమతి ఇస్తారు. మూడున్నర గంటల పాటు ఈ వర్క్‌షాపు జరిగింది. వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ పి.పద్మ, డాక్టర్ జీఎన్‌కే దుర్గ, ప్రొఫెసర్ వి.విశ్వనాథమ్, రోటరీ క్లబ్ యూత్ సర్వీసెస్ డెరైక్టర్లు కె.నారాయణ, సీహెచ్ నారాయణ, డాక్టర్ కె.పట్టాభి రామయ్య, రోటరాక్ట్ క్లబ్ అధ్యక్షుడు సత్య, సభ్యులు సీహెచ్ సాయిరామ్, కేఎన్ఎస్ ప్రసాద్, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ ఎన్ఆర్కే ప్రసాద్, ‘సాక్షి’ ఈవెంట్ మేనేజర్ జె.ప్రవీణ్‌కుమార్, పానావిజన్ సీఈవో జనార్థనమూర్తి తదితరులు పాల్గొన్నారు. భావ ప్రకటన ముఖ్యం.. ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యం. భావ వ్యక్తీకరణ ఒక్కొక్కరిదీ ఒక్కోలా ఉంటుంది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ తక్కువగా మాట్లాడితే.. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడి విద్యార్థులతో చాలాసేపు మాట్లాడారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని భావాన్ని వ్యక్తం చేయాలి. మాట్లాడిన సందర్భం, వ్యక్తులను బట్టి వాటి ప్రభావం ఉంటుంది. ఎవరు, ఏ సందర్భంలో మాట్లాడారు అనేది ముఖ్యం. ఇంటర్వ్యూలకు వెళ్లేవారు రెజ్యూమ్‌లో తప్పులు లేకుండా చూసుకోవాలి. నిజాయితీగా వ్యవహరించాలి. బృంద చర్చల్లో తప్పకుండా పాల్గొని సొంత అభిస్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేయాలి. ఆంగ్లంపై పట్టు సాధించేందుకు కృషి చేయాలి. - డాక్టర్ పి.పద్మ, సైకాలజిస్ట్ లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధన చేయండి సానుకూల దృక్పథంతో ఆలోచించటం అలవరుచుకోవాలి. బలం, బలహీనతలు, అవకాశాలు, అనుసరించే విధానాన్ని తెలుసుకుని ముందుకుసాగాలి. మన లక్ష్యం ఏమిటి? ఎంత సమయం కావాలి? వాస్తవంగా ఉన్న పరిస్థితులను అంచనా వేసుకుని కృషి చేయాలి. సెల్ఫ్ మోటివేషన్ చాలా ముఖ్యం. సృజనాత్మకంగా ఆలోచించే వారు విజయం సాధిస్తారు. వ్యక్తిగత, సామాజిక, దేశీయంగా ఉన్న విలువలను కాపాడుకోవాలి. విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్ లేకపోవటం వల్లే ఉపాధి దొరకట్లేదు. - డాక్టర్ జీఎల్‌కే దుర్గ మనసును నియంత్రిస్తే విజయం మీదే.. మనసును నియంత్రించుకుంటే విజయం తప్పక వరిస్తుంది. మన సంస్కృతీ సంప్రదాయాల్లో మనసును నియంత్రించే విధానాలు ఉన్నాయి. తర్కబద్దంగా ఆలోచిస్తే సమస్యలను అధిగమించవచ్చు. విద్యార్థి దశలో ఉన్న సామర్థ్యాలతోనే మంచి సిటిజన్‌గా మారతారు. జీవితం గురించి అవగాహన కలగాలంటే 20 క్యారెక్టర్లు, 29 క్యాలిటీలు, 16 స్కిల్స్ అవసరం. విలువలు లేని సమాజంలో భద్రత ఉండదు. ఆలోచించలేని వారు ప్రశ్నించలేరు. సంస్కారం నేర్పించే వ్యవస్థ రావాల్సి ఉంది. - వి.విశ్వనాథం, ప్రొఫెసర్ నేటి కార్యక్రమం.. ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువమైత్రి వర్క్‌షాపు ఆదివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సిద్ధార్థ ఆడిటోరియంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ‘లైఫ్‌స్కిల్స్’ అంశంపై ప్రొఫెసర్ ఆర్య వర్థన్, ‘మెంటల్ డెవలెప్మెంట్’పై ప్రొఫెసర్ కేఎల్ దేవదాస్,‘మ్యూమన్ ఎక్స్‌లెన్స్’పై డాక్టర్ ఎంసీ దాస్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులెవరైనా పాల్గొనవచ్చు. -
భవితకు భరోసా!
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్లకు మహర్దశ రానుంది. ఇక్కడ ఏర్పాటుకానున్న టీసీఎస్, ఇబ్రహీంపట్నం సమీపంలో నెలకొల్పనున్న వైట్‌గోల్డ్ స్పిన్నింగ్ మిల్స్ కంపెనీలతో గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి. ఆయా కంపెనీల్లో ఉద్యోగాల కోసం స్థానిక యువతీ యువకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాజధాని హైదరాబాద్ నగరానికి అతి సమీపంలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో యువత కొంత కాలంగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోంది. చేతిలో డిగ్రీ, పీజీ పట్టాలున్నా అవి దేనికీ పనికి రాకుండాపోతున్నాయి. ఇప్పటికే టాటా లాంటి కంపెనీలు ఈ ప్రాంతంలో ఉన్నా స్థానికులకు మాత్రం ఉద్యోగాలు అందని ద్రాక్షలా మారింది. పేరుకే ఈ ప్రాంతంలో వందలాది ఇంజినీరింగ్, పీజీ కళాశాలలున్నా.. ‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా ఆయా కళాశాలల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు దక్కడంలేదు. ఒకవేళ దొరికినా కేవలం వాచ్మెన్, సెక్యూరిటీ గార్డ్స్, స్వీపర్ పోస్టులే స్థానికులకు పరిమితమయ్యాయి. మరికొందరు డిగ్రీలు చేతబుచ్చుకుని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇప్పటికే పలు కోచింగ్ సెంటర్లలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ నగరానికి అన్ని దిక్కులా ఎన్నో పరిశ్రమలు వెలిశాయి. కానీ నాగార్జునసాగర్ రహదారి పరిధిలోని పట్నం నియోజకవర్గంలో మాత్రం ఏ ఒక్క పరిశ్రమ కూడా లేదు. ఇప్పుడిప్పుడే పలు కంపెనీలు ఈ ప్రాంతం వైపు దృష్టి సారిస్తున్నాయి. టీసీఎస్‌లో 28 వేల మందికి అవకాశాలు.. మండలంలోని ఆదిబట్ల సమీపంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)పై నిరుద్యోగ యువత గంపెడాశలు పెట్టుకుంది. ఇప్పటికే 28 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టీసీఎస్ సీఈఓ చంద్రశేఖరన్ ప్రకటించారు. దీంతో స్థానిక యువతలో ఆశలు నెలకొన్నాయి. కాగా.. టీసీఎస్ బహుళజాతి సంస్థ కావటంతో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పేరిట కళాశాలలోనే విద్యార్థులను ఎంపిక చేసుకుంటారని, స్థానికులకు అవకాశా లు తథ్యమని కొందరు భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఎన్నో ఇంజనీరింగు కళాశాలలు ఉండటంతో చాలామంది విద్యార్థులకు ఉపాధి లభించి నిరుద్యోగ సమస్య కొంతవరకు తీరుతుందని పలువురు ఆశిస్తున్నారు. వైట్గోల్డ్లో పదివేల ఉద్యోగాలు.. ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ పరిధిలోని సుమారు 200 ఎకరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్న వైట్‌గోల్డ్ ఇంటెగ్రేటెడ్ స్పింటెక్స్ పార్క్ స్పిన్నింగ్ మిల్స్ నిర్మాణానికి గత ఏడాది అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో స్థానిక మహిళలకు అధిక శాతం అవకాశం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇది కూడా నిర్మాణ దశలో ఉండటంతో భవిష్యత్తులో మహిళలకు ఉద్యోగావకాశాలు దక్కుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వైట్ గోల్డ్‌లో దాదాపు పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నారు. త్వరలోనే ఐటీఐఆర్.. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో త్వరలోనే ఐటీఐఆర్ సంస్థ కూడా ఏర్పా టు కాబోతున్నట్లు సమాచారం. ఇందు కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపినట్లు తెలిసింది. ఐటీఐఆర్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందిగా ప్రభుత్వం సంస్థ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఐటీఐ ఆర్ ఏర్పాటు సాకారమైతే ఈ ప్రాంతం మరింత పురోభివృద్ధి దిశగా పయనిస్తుందని, పెద్ద సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి దొరికే అవకాశాలున్నాయి. -
కొలువు వేటకు మార్గాలివి..!
విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కోరుకున్న ఉద్యోగంలో చేరిపోవడం అనుకున్నంత సులభం కాదు. మార్కెట్లో ఉద్యోగావకాశాలు విస్తృతమవుతున్నప్పటికీ పోటీ కూడా అంతేస్థాయిలో పెరిగిపోతోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కోరుకున్న ఉద్యోగం పొందాలంటే అలుపెరుగక శ్రమించాల్సిందే. జాబ్ సెర్చ్‌కు ఊహించినదానికంటే ఎక్కువ కాలమే పడుతుంది. అయినా నిరాశ చెందకుండా ప్రయత్నాలను కొనసాగించాలి. అభ్యర్థులు అందుకు ముందుగానే మానసికంగా సిద్ధపడాలి. కొలువు వేటలో మునిగినవారు కొన్ని మెలకువలను పాటిస్తే సులువుగా విజయం సాధించొచ్చు. ఉద్యోగస్థుడిగా కెరీర్‌ను ప్రారంభించొచ్చు. సన్నద్ధత: పోటీ తీవ్రంగా ఉంటుందనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. కాబట్టి కార్యాచరణ, సన్నద్ధత(ప్రిపరేషన్) కూడా అదేస్థాయిలో ఉండాలి. మీ బలాలు, బలహీనతలను అంచనా వేసుకోండి. మీకు ఏ రంగంలో ఆసక్తి ఉంది? ఎందులో రాణిస్తారు? అనే విషయం తెలుసుకోండి. మీ అంచనాలను బట్టి మీరు పనిచేయాలనుకుంటున్న సంస్థల జాబితాను తయారు చేసుకోండి. ఆయా సంస్థల వ్యాపార కార్యకలాపాలు, అందులో బాధ్యతల గురించి పరిశోధించండి. తదనుగుణంగా ఇంటర్వ్యూకు సన్నద్ధమవ్వాలి. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. ఆకట్టుకొనే కవర్ లెటర్: ఇంటర్వ్యూకు సిద్ధమైన తర్వాత మీ వివరాలతో కూడిన మంచి కవర్ లెటర్‌ను రూపొందించుకోవాలి. దీన్ని దరఖాస్తుతోపాటు పంపించాల్సి ఉంటుంది. రిక్రూటర్ మొదట కవర్ లెటర్‌నే చూస్తారు. ఇది వారిని ఆకట్టుకుంటే సగం పని పూర్తయినట్లే. మీ అర్హతలు, అనుభవం వంటి వాటిని ఇందులో క్లుప్తంగా ప్రస్తావించండి. ఉద్యోగానికి మీరు నూటికి నూరు శాతం తగిన అభ్యర్థి అనే విషయం ఈ లెటర్ ద్వారా రిక్రూటర్‌కు తెలియాలి. డైనమిక్ రెజ్యూమె: మిమ్మల్ని మీరు ఒక ఉత్పత్తి(ప్రొడక్ట్)గా భావించుకోండి. మిమ్మల్ని మార్కెట్ చేసేది.. రెజ్యూమె. మీ అనుభవాలు, అర్హతలు, సాధించిన విజయాలు, బలాలను ఇందులో పొందుపర్చండి. దరఖాస్తు చేస్తున్న ఉద్యోగానికి అవసరమైన అంశాలను వరుస క్రమంలో వివరించండి. రిక్రూటర్లు అభ్యర్థుల రెజ్యూమెలను చదవడానికి ఎక్కువ సమయం వెచ్చించలేరు. కనుక ఇది తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారం ఇచ్చేలా ఉండాలి. ఇంటర్వ్యూ నైపుణ్యాలు: ప్రిపరేషన్, కవర్ లెటర్, రెజ్యూమె.. ఈ మూడూ అభ్యర్థిని ఇంటర్వ్యూ గదిలోకి తీసుకెళ్లడం వరకు మాత్రమే పనిచేస్తాయి. ఉద్యోగం సాధించగలరా? లేదా? అనేది ఇంటర్వ్యూలోనే తెలిసిపోతుంది. మౌఖిక పరీక్షలో రిక్రూటర్‌ను మెప్పిస్తేనే విజయం సాధ్యమవుతుంది. ప్రొఫెషనల్‌గా కనిపించే వస్త్రధారణ, బాడీ లాంగ్వేజ్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగిస్తూ ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూను ఎదుర్కొంటే ఉద్యోగం దక్కించుకోవడం సులువే. ఫాలో-అప్ మౌఖిక పరీక్ష పూర్తయిన తర్వాత కూడా వీలును బట్టి కంపెనీతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలి. ఇంటర్వ్యూ స్టేటస్‌ను తెలుసుకోవడానికి సంస్థకు ఈ-మెయిళ్లు పంపాలి. అవసరమైతే ఫోన్ చేస్తుండాలి. దీనివల్ల ఉద్యోగంపై మీలో నిజంగా ఆసక్తి ఉందనే విషయాన్ని రిక్రూటర్ గుర్తిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో మంచి కొలువు కావాలంటే అభ్యర్థుల్లో ఓపిక, సహనం ఉండాలి. అంకితభావంతో పనిచేయాలి. -
యువత ఉపాధికి.. కొత్తబాట
►భారీస్థాయిలో ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయం ►రూరల్ లైవ్లీహుడ్ మిషన్‌గా డీఆర్డీఏ ► నిర్వహణపై కేంద్రం ప్రత్యేక దృష్టి ►శాశ్వత లక్ష్యంగా పనిచేయనున్న మిషన్ ►యువతకు మరింత రాయితీ.. పాలమూరు : దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలైన పల్లె లిప్పుడు కరువు కాటేయడంతో విలవిల్లాడిపోతున్నాయి. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాల్లోని యువకులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక అవస్థలు పడుతున్నారు. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు పొట్ట చేతపట్టుకొని వలసబాట పట్టడంతో.. ఊర్లన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. సాయంత్రమైతే గ్రామాల్లో పెద్దలు రచ్చబండ వద్ద, యువకులు మరోచోట సమావేశమై ఆ రోజు విశేషా లను చెప్పుకొని ఆనందపడే పరిస్థితులు ఇప్పుడెక్కడా కనబడటం లేదు. బతుకుదెరువుకోసం గ్రామాలను విడిచి పట్టణాలకు వలసవెళ్లే వారి సంఖ్య పెరగడంతో పల్లెలు మూగబోతున్నాయి. 2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 41లక్షలు. అందులో సగభాగం యువతే.. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత తగిన ఉద్యోగావకాశాల్లేక నిస్తేజంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో..గ్రామీణ యువతకు శాశ్వత ఉపాధి అవ కాశాలు కల్పించేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)ను రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కొత్తరూపు తీసుకువచ్చి గ్రామీణాభివృద్ధికి కొత్తబాట వేసేందుకు కా ర్యాచరణ చేపట్టారు. ఈమేరకు సర్కారు కసరత్తు మొదలు పెట్టిం ది. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులపై దృష్టి సారించగా.. ఇకపై గ్రామీణ ప్రాంతా ల్లో శాశ్వత ఉపాధి కల్పన దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల గ్రా మీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించి ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే పలురాష్ట్రాల్లో ఈ మిషన్ ద్వారా వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అధికమొత్తంలో నిధులు గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఉపాధిని కల్పించి నిరుద్యోగాన్ని రూపుమాపడమే లక్ష్యంగా ఈ మిషన్ పనిచేస్తుంది. ఎస్జీఎస్వై కింద జిల్లాలో నిరుద్యోగ యువతకిస్తున్న రుణాలపై ఏటా 4కోట్ల రూపాయల వరకు రాయితీని భరిస్తున్నారు. అయితే కొత్తగా చేపట్టే గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఆర్ఎల్ఎం) ద్వారా కొత్త కార్యక్రమాలు చేపట్టనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలిపేశారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన నిధులను కూడా సర్కారు వెనక్కు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో అందుబాటులో ఉన్న నిధులను సర్కారు ఖాతాలో జమచేశారు. అయితే ఆర్ఎల్ఎం ద్వారా శాశ్వత ఉపాధి ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. అంటే అరకొరగా కాకుండా ఉపాధి యూనిట్‌ను నెలకొల్పేందుకు అవసరమయ్యేలా అధిక మొత్తంలో రుణ సదుపాయాన్ని కల్పించడంతో పాటు పెద్దఎత్తున రాయితీలు ఇవ్వనున్నారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా కేంద్రం స్వర్ణజయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన (ఎస్జీఎస్వై)ను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా బ్యాంకు ద్వారా రాయితీ రుణాలిస్తున్నారు. అయితే ఈ రాయితీ రుణాలు అరకొరగా ఉండడంతో ఆశించిన స్థాయిలో పురోగతి ఉండడం లేదు. ఈ నేపథ్యంలో భారీస్థాయిలో రుణాలిచ్చి ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా చేపట్టే ఆర్ఎల్ఎమ్ ద్వారా ఈ మేరకు చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. నిర్వహణలో మార్పు: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రా మీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టులు కొనసాగుతుండగా.. ప్రపంచ బ్యాంకు నిధులతో ఐకేపీ ద్వారా పలు కార్యక్రమాలు నడుస్తున్నా యి. ఈ రెండు కూడా ఒకే విభాగంలో ఉన్నప్పటికీ ఖాతాల నిర్వహణ తదితర అంశాలన్నీ వేర్వేరుగా సాగుతున్నాయి. అయితే తాజాగా చేపట్టే ఆర్ఎల్ఎం ఖాతాలను, ఐకేపీ ఖాతాలను ఇకపై ఒక్కరికే అప్పగించనున్నారు. దీంతో ఈ నిర్వహణ ప్రక్రియ వేగవంతం కానుంది. అంతే కాకుం డా ఉద్యోగుల విషయంలోనూ కీలకమైన మార్పులుంటాయని అధికారులు చెబుతున్నారు. -
మాట్లాడడం నేర్పించే.. స్పీచ్ థెరపిస్ట్
విద్య నేటి కంటెంట్ జనరల్ స్టడీస్: ఎకానమీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్: జనరల్ అవేర్నెస్ పేజీలను www.sakshieducation.com నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.. మనిషికి ప్రకృతి ప్రసాదించిన విలువైన వరం.. మాట. మాట్లాడడం ద్వారా మన భావాలను ఇతరులకు తెలియజేయొచ్చు. నేటి ఆధునిక సమాజంలో మాట శక్తివంతమైన సాధనంగా మారింది. తమ బుజ్జాయికి వయసు పెరుగుతున్నా మాటలు రాకపోతే తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. కొందరు ఎంత వయసొచ్చినా మాట్లాడలేరు. ఇంకొందరికి మాటలు వస్తాయిగానీ, అర్థమయ్యేలా స్పష్టంగా మాట్లాడలేరు. నోరు తిరగకపోవడం, నత్తి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అందరిలాగే వీరి నోటినుంచి మాటలు రప్పించే నిపుణులే.. స్పీచ్ థెరపిస్ట్‌లు. ప్రస్తుతం డిమాండ్ పెరుగుతున్న కెరీర్.. స్పీచ్ థెరపీ. స్వయం ఉపాధి అవకాశాలు స్పీచ్ థెరపీ కోర్సులను పూర్తిచేసినవారికి ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. స్పెషల్ స్కూల్స్, ఓల్డేజ్ హోమ్‌లు, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లలో కొలువులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉంటే స్వయంగా స్పీచ్ థెరపీ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. నగరాలతోపాటు పట్టణాల్లోనూ ఈ సెంటర్లకు ఆదరణ లభిస్తోంది. స్పీచ్ థెరపీలో తగిన అనుభవం ఉంటే అధిక ఆదాయం ఆర్జించడానికి ఆస్కారం ఉంది. లక్షణాలు: స్పీచ్ థెరపిస్ట్‌లు అన్ని వయసుల రోగులకు ట్రీట్మెంట్, కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రంగంలో పేరు తెచ్చుకోవాలంటే శాస్త్రీయ దృక్పథం, ప్రభావవంతమైన ఇంటర్‌పర్సనల్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇది సేవా రంగం కాబట్టి రోగులతో వ్యవహరించేందుకు ఓర్పు, సహనం అవసరం. అర్హతలు: మనదేశంలో హియరింగ్ అండ్ స్పీచ్ థెరపీ, లాంగ్వేజ్ పాథాలజీపై వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌ను పూర్తిచేసిన తర్వాత వీటిలో చేరొచ్చు. వేతనాలు: స్పీచ్ థెరపిస్ట్ ప్రారంభంలో నెలకు రూ.20 వేల వేతనం అందుకోవచ్చు. తర్వాత అనుభవం, పనితీరును బట్టి వేతనంలో పెరుగుదల ఉంటుంది. ఈ రంగంలో ప్రొఫెషనల్స్‌కు నెలకు రూ.లక్షకుపైగానే అందుతుంది. స్పీచ్ థెరపీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: www.osmania.ac.in ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ వెబ్సైట్: www.aiishmysore.in/en/index.html ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ వెబ్సైట్: www.aiims.edu దేశవిదేశాల్లో అవకాశాలు శ్రీ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సేవ చేయాలని, వైవిధ్యమైన కెరీర్‌ను ఎంపికచేసుకోవాలని భావించేవారికి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులన్నీ ప్రత్యేకమే. స్పీచ్, ఆడియాలజీలో గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్, డిప్లొమా చేసేందుకు వీలుంది. ఆడియాలజిస్టు, స్పీచ్ పాథాలజిస్టులకు దేశవిదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. కొందరికి పుట్టుకతో మాటలు రాకపోతే స్పీచ్, ఆడియో థెరపీ ద్వారా సరిచేయవచ్చు. భావాల్ని వ్యక్తీకరించేందుకు వారిని సమాయత్తం చేయడమే ముఖ్యోద్దేశం. ఉద్యోగ విషయానికొస్తే ప్లేస్‌మెంట్స్ గ్యారంటీ. ఉన్నత చదువులతో కెరీర్లో ఉన్నత స్థాయికి చేరొచ్చు. -డాక్టర్ పి.హనుమంతరావు, చైర్మన్, స్వీకార్-ఉపకార్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సెన్సైస్ -
తిరుపతి మణిహారంలో ఐటీ హబ్ !
నిర్ణయించిన రాష్ర్ట మంత్రి వర్గం వెయ్యి ఎకరాలను గుర్తించాలని కలెక్టర్ జైన్‌ను ఆదేశించిన ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి మణిహారంలో మరో కలికితురాయి చేరనుందా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతోంది మంత్రివర్గ నిర్ణయం. ఐటీ హబ్‌ను తిరుపతిలో ఏర్పాటుచేయాలని శుక్రవారం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందుకు వెయ్యి ఎకరాల భూమిని సేకరించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఐటీ హబ్ ఏర్పాటైతే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు పేరుతో టీడీపీ నేతలకు రియల్‘భూమ్’ ఇచ్చేలా చేసిన ప్రచారం తరహాలోనే ఐటీ హబ్ ఏర్పాటు ప్రకటన ఉంటుందా? వాస్తవంగా ఐటీ హబ్‌ను ఏర్పాటుచేస్తారా? అన్న అంశంపై నిపుణులు సం దేహాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సీఎం చంద్రబాబు సారథ్యంలో మంత్రివర్గం శుక్రవారం సమావేశమైంది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల్లో తిరుపతిలో ఐటీ హబ్‌ను ఏర్పాటుచేయాలన్నది ఒకటి. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఐటీ హబ్‌ను ఏర్పాటుచేయడానికి వెయ్యి ఎకరాల భూమిని గుర్తించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఐటీ హబ్ ఏర్పాటుకు రూ.350 కోట్ల వరకూ ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఐటీ హబ్ ద్వారా రాష్ట్రంలో ఈ-సేవలను విస్తృతం చేయడానికి పెద్దపీట వేస్తామని ప్రకటించింది. కానీ.. మంత్రివర్గ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఎందుకం టే.. జాతీయ విద్యాసంస్థల ఏర్పాటులో ప్రభు త్వం రోజుకో విధానం.. పూటకో మాట మాట్లా డుతోంది. విభజన నేపథ్యంలో రాష్ట్రంలో 11 జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటుచేసేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులోనే కేం ద్రం అంగీకరించింది. కేంద్రం మంజూరు చేసే 11 సంస్థల్లో తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ యూనివర్సిటీలను నెలకొల్పుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జూన్ 18న ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ వర్సిటీలను నెలకొల్పాలని తీర్మానించారు. ఆ సంస్థల ఏర్పాటుకు వెయ్యి ఎకరాల భూమిని గుర్తించాలని కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఏర్పేడు-శ్రీకాళహస్తి మండలాలు, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో విద్యా సంస్థల ఏర్పాటుకు భూములను కలెక్టర్ సిద్ధార్థజైన్ గుర్తించారు. ఆ భూములను రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకష్ణారెడ్డిలు కలెక్టర్ సిద్ధార్థజైన్‌తో కలిసి జూలై 17న పరిశీలించారు. మంత్రి నారాయణ విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ వర్సిటీలను ఏర్పాటుచేసి.. ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ వర్సిటీల తరగతులను కూడా ప్రారంభిస్తామని ప్రగల్భాలు పలికారు. తిరుపతిలో పర్యటించి పది రోజులు కూడా పూర్తికాక ముందే మంత్రి నారాయణ మాట మార్చారు. సెంట్రల్ యూనివర్సిటీనీ తూర్పుగోదావరిజిల్లాలో ఏర్పాటుచేస్తున్నట్లు జూలై 26న మంత్రి నారాయణ హైదరాబాద్‌లో ప్రకటించారు. ఆ యూనివర్సిటీ ఏర్పాటుకు భూమిని కూడా గుర్తించాలని తూర్పుగోదావరిజిల్లా కలెక్టర్‌ను మంత్రి నారాయణ ఆదేశించారు. ఇటీవల ఐఐఎస్ఈఆర్ను మంత్రి నారాయణ తన సొంత జిల్లా నెల్లూరుకు తరలించేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఐఐఎస్ఈఆర్కు అంతరిక్ష పరిశోధన కేంద్రానికి అవినాభావ సంబంధం ఉంటుందనే సాకును చూపుతున్నారు. శ్రీహరికోటలో షార్ ఉన్న నేపథ్యంలో ఐఐఎస్ఈఆర్ను కూడా అక్కడే ఏర్పాటుచేస్తే అధికంగా ప్రయోజనం ఉంటుందని మంత్రి నారాయణ చెబుతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఐఐఎస్ఈఆర్ కూడా తిరుపతి నుంచి చేజారిపోయినట్లే..! ఇక మిగిలింది ఒక్క ఐఐటీనే. కనీసం ఐఐటీనైనా తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తారా అంటే స్పష్టమైన సమాధానం చెప్పేందుకు ఏ ఒక్క అధికారీ సాహసించడం లేదు. తిరుపతిని ఎడ్యుకేషనల్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ప్రకటనలు మీద ప్రకటనలు గుప్పించి.. టీడీపీ నేతల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రభుత్వం ఊతమిచ్చందనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఐటీ హబ్ ఏర్పాటుపై కూడా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఆ కోవలోకే వస్తుందా..? లేదా అన్నది తేలాలంటే కొంత కాలం ఆగక తప్పుదు. -
కొండంత ఆశ
► భూగర్భ గనుల ప్రారంభానికి సీఎం చర్యలు ► సర్వే చేసిన అధికారులు ► 20 వేల మందికి ఉపాధి అవకాశాలు ► బెల్లంపల్లికి పూర్వవైభవం బెల్లంపల్లి : సింగరేణిలో భూగర్భగనులపై ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు భూగర్భగనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యానికి సూచించడంతో బెల్లంపల్లి ఏరియాలో సర్వే చేసిన భూగర్భగనులకు మోక్షం లభిస్తుందనే ఆశ కార్మికుల్లో వ్యక్తమవుతోంది. 1927 సంవత్సరంలో తాండూర్ కోల్‌మైన్స్ పేరిట ఈ ప్రాంతంలో బొగ్గు గనుల తవ్వకాలు ప్రారంభమయ్యాయి. మార్గన్స్‌ఫిట్, సౌత్‌క్రాస్‌కట్, శాంతిఖని, బోయపల్లి, ఎంవీకే-1, 2, 3, 5, 6, గోలేటీ-1, 1ఎ గనులతో బెల్లంపల్లి వేలాది మంది కార్మికులతో రెండున్నర దశాబ్దాల క్రితం కళకళలాడింది. ఆ తర్వాత కొందరు సింగరేణి అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, కొన్ని గనుల భూగర్భ భౌగోళిక పరిస్థితులు, సాంకేతిక సమస్యలతో ఒక్కొక్కటిగా గనుల మూసివేతకు పాల్పడ్డారు. మార్గన్స్‌ఫిట్, సౌత్‌క్రాస్‌కట్, బోయపల్లి, ఎంవీకే-1,2,3,5,6 గనులను మూసివేసి ఇక్కడ పనిచేస్తున్న వేలాది మంది కార్మికులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. బెల్లంపల్లిలో 7 మెగావాట్స్తో నిర్మించిన పవర్‌హౌస్‌ను అర్ధంతరంగా మూసివేసి ప్రైవేట్ సంస్థకు విక్రయించారు. వర్క్‌షాప్, స్టోర్, ఆటోగ్యారేజ్, రెస్య్కూస్టేషన్ తదితర విభాగాలను ఇతర ప్రాంతాలకు తరలించడంతో బెల్లంపల్లి ఏరియా క్రమంగా మనుగడను కోల్పోయింది. ప్రస్తుతం ఏరియా పరిధిలోని గోలేటీ, డోర్లి, కైరిగూడ ప్రాంతాల్లో మూడు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు, ఒక భూగర్భ గని మాత్రమే పని చేస్తున్నాయి. ఏరియా వ్యాప్తంగా సుమారు 2,400 మంది కార్మికులు సింగరేణిలో విధులు నిర్వహిస్తున్నారు. బెల్లంపల్లి ఏరియా పరిధిలోని శాంతిఖని గనిని మందమర్రి ఏరియాలోకి విలీనం చేశారు. ఈ క్రమంలో కొత్తగా భూగర్భ గనులకు శ్రీకారం చుట్టాలని సీఎం ఆదేశించడంతో బెల్లంపల్లి ఏరియాలో సర్వే చేసిన భూగర్భ గనులు ప్రారంభమవుతాయనే కొండంత ఆశ కార్మికుల్లో వ్యక్తమవుతోంది. సర్వే చేసిన భూగర్భ గనులు బెల్లంపల్లి ఏరియా పరిధిలో ఐదు భూగర్భ గనుల కోసం కొన్నేళ్ల క్రితం సర్వే జరిగింది. సింగరేణికి చెందిన ఎక్స్‌ప్లోరేషన్ విభాగం అధికారులు ఈ మేరకు అన్వేషణ చేసి భూగర్భంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. తాండూర్ మండలం మాదారం పరిధిలోని ఎంవీకే-1, 2 గనుల మధ్య సుమారు 20 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు కనుగొన్నారు. ఇక్కడ సుమా రు 300 మీటర్ల పరిధిలో బొగ్గు నిల్వలు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ భూగర్భ గని జీవిత కాలం సుమారు 25 నుంచి 30 ఏళ్లుగా సర్వేలో వెల్లడైంది. బెల్లంపల్లి శివారులో బెల్లంపల్లి షాఫ్ట్‌బ్లాక్-1,2,3లను గుర్తించారు. ఆయా బ్లాక్‌లలో సుమారు 450 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. 300 నుంచి 350 మీటర్ల లోతులో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు భూగర్భ గనుల కోసం ప్రాజెక్టు రిపోర్టును తయారు చేశారు. ఆయా బ్లాక్‌ల జీవిత కాలం సుమారు 50 నుంచి 60 ఏళ్ల వరకు ఉంటుందని సూత్రప్రాయంగా నిర్ధారించారు. నెన్నెల మండలం శ్రావణ్పల్లిలో సుమారు 200 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. ఇక్కడ సుమారు 250 నుంచి 300 మీటర్ల లోతులో బొగ్గు నిల్వలు ఉన్నట్లు సర్వే అధికారులు తేల్చారు. ఈ గని జీవిత కాలం సుమారు 30 నుంచి 40 ఏళ్లుగా ఉంటుందని అంచనా వేశారు. ఇందుకు సంబంధించి ప్రాజెక్టు రిపోర్టులు కూడా సింగరేణి యాజమాన్యం సిద్ధం చేసింది. ఆ రకంగా బెల్లంపల్లి ప్రాంతంలో ఐదు భూగర్భ గనులు ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి. వేలాది మందికి ఉపాధి భూగర్భ గనులు ప్రారంభించడం వల్ల బెల్లంపల్లికి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. కార్మికుల పిల్లలు ప్రధానంగా వారసత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడిగా ఎదురు చూస్తున్నారు. భూగర్భ గనులను ప్రారంభించడం వల్ల వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఒక్కో భూగర్భ గనిని ప్రారంభిస్తే సగటున 3 వేల నుంచి 4 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆ తీరుగా ఐదు గనులను ప్రారంభించడం వల్ల సుమారు 20 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. తద్వారా బెల్లంపల్లి పారిశ్రామికంగా వృద్ధిలోకి వస్తుందని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఈ ఏడాదిలోపు రెండు, మూడు భూగర్భ బొగ్గు గనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించడంతో బెల్లంపల్లి ప్రాంతంలో భూగర్భ గని ప్రారంభమవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి సింగరేణి అధికారులు కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ప్చ్.. ఉపయోగం లేదు
- కేంద్ర బడ్జెట్‌పై పెదవి విరుపులు - పేద, మధ్యతరగతి వర్గాలను పట్టించుకోలేదని విమర్శలు - పోలవరం ప్రాజెక్ట్ ఊసెత్తని ప్రభుత్వం ఏలూరు : కేంద్ర బడ్జెట్ పేద, మధ్యతరగతి వర్గాలకు మేలు చేకూర్చకపోగా.. వారిపై పెనుభారం మోపేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సామాన్యుల బడ్జెట్ అంటూ కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా ఆ వర్గాలకు పెద్దగా ఒనగూరే ప్రయోజనాలు లేవని నిపు ణులు స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయోత్పత్తుల ధరల స్థిరీకరణకు కేవలం రూ.500 కోట్లు మాత్ర మే కేటాయించటంపై రైతులు పెదవి విరుస్తున్నారు. స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై వడ్డీ తగ్గించటం వల్ల పెద్దగా ఉపయోగం లేదంటున్నారు. కాకినాడలో హార్డ్‌వేర్ హబ్ ఏర్పాటు వల్ల మన జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఉండొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘పోలవరం’ ప్రస్తావన లేదు కేంద్ర బడ్జెట్లో జిల్లాకు కనీస ప్రయోజనాలైనా కలిగే అవకాశం లేకుండాపోరుుందని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నారుు. జాతీయ హోదా పొందిన బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టుకు కేటాయింపులు లేకపోవడం విమర్శలకు తావి స్తోంది. ఉభయగోదావరి రైతుల కలల ప్రాజెక్టుగా ఉన్న దీనికి కేంద్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయిందన్న వాదన వినవస్తోంది. జిల్లా నుంచి ఓ రాజ్యసభ సభ్యురాలు, ఇద్దరు ఎంపీలున్నా ఈ ప్రాజెక్టుకు అదనపు నిధుల కేటాయించే దిశగా కృషి చేయకపోవడం రైతన్నలను నిరాశ పర్చిం ది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న ఎన్నికల హామీని నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగుల పెదవి విరుపు ఆదాయ పన్ను పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు మాత్రమే పెంచటంపై ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. రూ.5 లక్షలు చేస్తేనే ఉపయోగం ఉంటుందని వారు చెబుతున్నారు. దీనిపై కేంద్రం పునఃపరిశీలన చేయాలని వారు కోరుతున్నారు. సిగరెట్లపై ఎక్సైజ్ సుంకాన్ని 71 శాతానికి పెంచటంతో వాటి ధరలకు రెక్కలొచ్చారుు. సామాన్యుల బడ్జెట్ వాస్తవాలకు దగ్గరగా ఆలోచించి సామాన్యులకు అనుగుణంగా ఈ బడ్జెట్ రూపొందించారు. ఉద్యోగుల ప్రయోజనాలకు పెద్దపీట వేశారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి రూ.50 వేల కోట్ల కేటాయింపు, స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై వడ్డీ తగ్గింపు, వ్యవసాయోత్పత్తుల ధరల స్థిరీకరణకు రూ.500 కోట్ల నిధి ఏర్పాటుతో రైతులకు న్యాయం జరుగుతుంది. ఐఐటీ, ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుతో రాష్ట్రానికి ఎంతో మేలు. -భూపతిరాజు శ్రీనివాస వర్మ, అధ్యక్షుడు, బీజేపీ జిల్లా శాఖ సామాన్యులకు ఊరట బడ్జెట్ సామాన్యులకు ఊరట నిచ్చింది. బ్రాండెడ్ వస్త్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు అందరికీ అందుబాటులోకి రానున్నాయి. ఎవరిపైనా కొత్త భారాలు లేవు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల ప్రస్తావన లేకపోవడం బాధాకరం. ఆదాయ పన్ను పరిమితిని రూ.2.50 లక్షలకు మాత్రమే పెంచటం సమంజసంగా లేదు. దీన్ని రూ.5 లక్షలు చేస్తే బాగుండేది. -నేరెళ్ల రాజేంద్ర, అధ్యక్షుడు, ఏలూరు మర్చంట్ ఛాంబర్ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు పదేళ్లుగా చిన్నాభిన్నమైన దేశ ఆర్థిక వ్యవస్థకు బీజేపీ బడ్జెట్‌తో జవసత్వాలు రానున్నాయి. వస్తు తయారీ, మౌలిక సౌకర్యాల రంగాల్లో రూ.2 లక్షల 50వేల కోట్ల పెట్టుబడులు పెట్టడం అంటే పరోక్షంగా పేదలకు ఉపాధి అవకాశాలు చూపించటమే. వివిధ రంగాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా ఆయా రంగాలను మరింత బలోపేతం చేసే కృషి కన్పించింది. -అంబికా కృష్ణ, అధ్యక్షుడు, టీడీపీ వాణిజ్య సెల్ పేదలకు ఒరిగిందేమీ లేదు కేంద్ర బడ్జెట్లో పేదలకు ఒరిగే అంశాలేవీ లేవు. అంతా సంపన్న వర్గాలకు మేలు చేసేదిలా ఉంది. టీవీలు, ఎల్సీడీలు, సెల్‌ఫోన్ ధరలు తగ్గిస్తే పేదలకు, సామాన్యులకు లాభం లేదు. పేదల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయింపుల్లేవు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం వల్ల గ్రామీణ పేదలు ఉపాధి కోల్పోతారు. -డేగా ప్రభాకర్,కార్యదర్శి, సీపీఐ జిల్లా శాఖ -
రాజకీయ రాణులు
* 50 శాతం రిజర్వేషన్‌తో శాసించే స్థాయికి * యలమంచిలి, నర్సీపట్నం మున్సిపల్ పీఠాలు వారివే * 39 ఎంపీపీ స్థానాల్లో 21 మంది మహిళలు * 39 జెడ్పీటీసీల్లో 20.. విశాఖ రూరల్: నిన్న మొన్నటి వరకు మహిళలు వంటింటి కుందేళ్లన్న అపవాదు ఉండేది. కానీ ఇప్పుడు ఆ మహిళలే నిర్ణయాత్మక శక్తులుగా ముద్ర వేసుకుంటున్నారు. రాజకీయాల్లో కీలకభూమిక పోషిస్తున్నారు. స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్‌తో శాసించే స్థాయికి ఎదిగారు. ఇటీవలే జరిగిన స్థానిక ఎన్నికలే ఇందుకు నిదర్శనం. జిల్లా పరిషత్ నుంచి మున్సిపాలిటీల వరకు అన్ని పీఠాలను మహిళా నేతలే అధిరోహించారు. స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. దీంతో మునుపెన్నడూలేని విధంగా మున్సిపాలిటీల్లోనే కాకుండా పరిషత్ ఎన్నికల్లో సైతం సగం స్థానాలు మహిళలకే దక్కాయి. ప్రాతినిథ్యంలోనే కాకుండా ఓటర్ల విషయంలో కూడా మహిళలే అధికంగా ఉండడం విశే షం. సర్పంచ్ల నుంచి జిల్లా పరిషత్ వరకు అన్నింటిలోను 50 శాతం మహిళలే ఉన్నారు. ఎన్నికల ప్రచార విషయంలో కూడా పురుషులకు దీటుగా మహిళలు దూసుకుపోయారు. రాజకీయాల్లో రాణించడానికి ఎన్నికలప్పుడు ఎండ, వానలను లెక్కచేయకుండా రాత్రి పగలు కష్టపడ్డారు. జిల్లాలో నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లో సగం వార్డు సభ్యులతో పాటు రెండు చైర్పర్సన్ పీఠాలపై మహిళలే కూర్చున్నారు. నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ అనిత, యలమంచిలి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా పిల్లా రమాకుమారి ఎన్నికయ్యారు. అలాగే జిల్లాలో ఉన్న 39 జెడ్పీటీసీల్లో 20, 656 ఎంపీటీసీల్లో 328 స్థానాల్లో మహిళలు గెలుపొందారు. 39 ఎంపీపీ స్థానాల్లో 21 మహిళలకు దక్కాయి. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠం కూడా లాలం భవానిని వరించింది. మహిళల రాజ్యం : జిల్లాలో స్థానిక సంఖ్యలో మహిళల రాజ్యం ప్రారంభమైంది. మహిళల పాలనలోనే జిల్లా నడవనుంది. వీరిలో మెజార్టీ శాతం విద్యాధికులే కావడం గమనార్హం. కొంత మంది ఉన్నత ఉద్యోగావకాశాలు, అయిదంకెల జీతాలను వదులుకొని మరీ స్థానిక రాజకీయాల్లో చక్రం తిప్పారు. వీరిలో చాలా మందికి రాజకీయంగా విశేష అనుభవం లేకపోయినప్పటికీ.. ఇప్పటికే కొలువు తీరిన స్థానాల్లో తమదైన ముద్ర వేసుకోడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. రాజకీయ చతురత తెలియకపోయినా.. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. అయిదేళ్లలో వీరు జిల్లాను ఏ విధంగా ముందుకు నడిపిస్తారో వేచి చూడాలి. -
విద్యార్థికి మార్గదర్శి.. కెరీర్ కౌన్సెలర్
అప్‌కమింగ్ కెరీర్: గ్రాడ్యుయేషన్ పూర్తయ్యింది.. తర్వాత ఉన్నత విద్యనభ్యసించాలా? లేక ఏదైనా కొలువు కోసం ప్రయత్నించాలా? ఫలానా కోర్సు చదివితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయా? నచ్చిన కోర్సు చదవాలంటే ఏ కాలేజీలో చేరాలి? ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కోర్సుకు ఎక్కువ డిమాండ్ ఉంది? ఉన్నత విద్యకు స్వదేశమా? విదేశమా? ఏది మేలు? ఏ దేశంలో నాణ్యమైన విద్య లభిస్తుంది?... ఇలా ఒక విద్యార్థి మదిలో లెక్కలేనన్ని సందేహాలు. వీటికి సరైన సమాధానాలు చెప్పి, బంగారు భవిష్యత్తుకు మార్గం చూపే ఒక గురువు కావాలి. అతడే.. కెరీర్ కౌన్సెలర్. మనదేశంలో ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్న ప్రొఫెషన్.. కెరీర్ కౌన్సెలర్. విద్యార్థులు తమ శక్తిసామర్థ్యాలకు తగిన స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోలేక అనిశ్చిత స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కెరీర్ పరంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపించి, భవిష్యత్తువైపు విజయవంతంగా అడుగులేసేందుకు సలహాలు, సూచనలు ఇచ్చే కెరీర్ కౌన్సెలర్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. మనుషుల మనస్తత్వాలను చదవాలి: కెరీర్ కౌన్సెలర్‌గా వృత్తిలో రాణించాలంటే మానసిక శాస్త్రం(సైకాలజీ)పై గట్టి పట్టు ఉండాలి. మనుషుల మనస్తత్వాలను చదవగలగాలి, వారి ప్రవర్తనను, శక్తిసామర్థ్యాలను సరిగ్గా అంచనా వేయగలగాలి. అప్పుడే వారికి సరైన సలహాలు ఇచ్చేందుకు వీలుంటుంది. కౌన్సెలర్లకు మంచి పరిశీలనా, పరిశోధనా నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి. కౌన్సెలర్లకు భారీ డిమాండ్: మన దేశంలో కౌన్సెలింగ్‌పై ఆసక్తి ఉన్న కొందరు దీన్ని పార్టటైమ్ ప్రొఫెషన్‌గా మాత్రమే ఎంచుకుంటున్నారు. నిజానికి భారత్‌లో కెరీర్ కౌన్సెలర్ల అవసరం ఎంతో ఉంది. డిమాండ్‌కు సరిపడా కౌన్సెలర్లు అందుబాటులో లేరు. ఇది కెరీర్ కాదు.. బాధ్యత! ‘‘కెరీర్ కౌన్సెలింగ్ స్కూల్, కాలేజీ స్థాయిల్లో ఉంటుంది. విద్యార్థుల మనసు చదివి వారి ఇష్టాయిష్టాలను, నైపుణ్యం, దృక్పథం తదితర వ్యక్తిగత సామర్థ్యాలను అంచనా వేయగలగాలి. రాబోయే 5-10 ఏళ్లలో జాబ్‌మార్కెట్ ఎలా ఉంటుందనేది అంచనావేయగలగటం ముఖ్యం. కెరీర్ కౌన్సిలర్‌కు ఓర్పు, మనస్తత్వాలను అంచనా వేయగలగటమే అర్హతలు. సోషల్‌వర్క్, సైకాలజీ, హెచ్.ఆర్ కోర్సులు చేసిన వారికి ఇది కెరీర్‌గా సరిపోతుంది. స్కూల్స్, ప్రముఖ కాలేజీల్లో కె రీర్ కౌన్సెలర్స్గా అవకాశాలున్నాయి. సొంతగా సంస్థను ఏర్పాటుచేసి విద్యార్థులకు దిశానిర్ధేశం చేయటం ద్వారా ఉద్యోగ సంతృప్తి లభిస్తుంది. దీన్ని కెరీర్‌గా కాకుండా బాధ్యతగా స్వీకరించాలి’’ -మురళీధరన్, సీఈవో సీ అండ్ కే మేనేజ్మెంట్ లిమిటెడ్, హైదరాబాద్ వేతనాలు: ప్రారంభంలో జూనియర్ కౌన్సెలర్‌కు నెలకు రూ.15 వేల నుంచి వేతనం ప్రారంభమవుతుంది. సీనియర్ కౌన్సెలర్ తన అనుభవాన్ని బట్టి దాదాపు రూ.2.5 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. కెరీర్ కౌన్సెలింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఎన్సీఈఆర్టీ-న్యూఢిల్లీ, అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూరు వెబ్సైట్: http://www.ncert.nic.in/ యూనివర్సిటీ ఆఫ్ ముంబై వెబ్సైట్: http://www.mu.ac.in/ పంజాబ్ యూనివర్సిటీ-చండీగఢ్ వెబ్సైట్: http://puchd.ac.in/ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్-ముంబై వెబ్సైట్: http://www.tiss.edu/ అర్హతలు: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చదవాలి. తర్వాత పీజీ డిప్లొమా ఇన్ గెడైన్స్ అండ్ కౌన్సెలింగ్ కోర్సులో చేరొచ్చు. కెరీర్ కౌన్సెలర్లకు సైకాలజీ బ్యాక్‌గ్రౌండ్ ఉండడం వృత్తిలో ఎదిగేందుకు ఉపయోగపడుతుంది. కావాల్సిన లక్షణాలు: విద్యార్థులకు మార్గదర్శకుడిగా వ్యవహరించాలనే బలమైన ఆసక్తి మాటలతో ఇతరులను ప్రభావితం చేసే నైపుణ్యం స్వతంత్రంగా లేదా ఇతరులతో కలిసి బృందంగా పని చేసే నేర్పు కౌన్సెలర్‌గా కొత్త విషయాలు నేర్చుకుంటూ ప్రతిభకు ఎప్పటికప్పుడు సాన పెట్టుకునే అలవాటు. -
గళం విప్పరేం..!
ఉత్తరాంధ్రలో అప్రాధాన్య విద్యా సంస్థలు వందల్లో సీట్లు, అరకొర ఉపాధి అవకాశాలు విద్యాశాఖ మంత్రి ఉన్నా ప్రయోజనం సున్న ఏయూక్యాంపస్ : దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయం మరో పర్యాయం తేటతెల్లమవుతోంది. ఉత్తరాంధ్రకు కేంద్ర విద్యాసంస్థల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోంది. అప్రాధాన్యమైన వాటిని ఉత్తరాంధ్రకు కేటాయిస్తున్నారు. ఎక్కువ మందికి అవకాశాలు, ఉపాధిని అందించే ప్రధానమైన విద్యాసంస్థలను రాయలసీమకు తరలించుకుపోవడానికి నేతలు సిద్ధమయ్యారు. ఉత్తరాంధ్రకు చెందిన రాజకీయ నేతలు నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తుండంతో వారి పని ఇంకా సులభమవుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఫలానా విద్యా సంస్థలు కావాలని ఏ ఒక్క అధినేత నోరు విప్పి అడగటం లేదు. విద్యాశాఖ మంత్రి ఈ ప్రాంతం వ్యక్తి అయినప్పటికీ ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యా యం జరుగుతోంది. విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతం లో పలు కేంద్రీయ విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. వీటిలో ప్రస్తు తం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఉత్తరాం ధ్రలో ఒక ఐఐఎం, పెట్రో వర్సిటీ, గిరిజన వర్సి టీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎయిమ్స్, నిట్, వ్యవసాయ వర్సిటీ వంటివి కృష్ణా-గుంటూరు జిల్లాలకు తరలించుకు పోతున్నారు. తిరుపతి ప్రాంతంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఐఐటీలను ఏర్పాటుచేయడానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయనే వాదనలు బలప డుతున్నాయి. ప్పటికే రాజధాని విశాఖలో ఏర్పాటుచేయరని స్పష్టమైన సంకేతాలను నేతలు పంపుతున్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన విధంగానే రాజధాని చుట్టూనే ప్రధాన విద్యాకేంద్రాలను ఏర్పాటుచేయడానికి సిద్ధమవుతున్నారు. అభివృద్ధికి తోడ్పడేనా... ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏర్పాటుచేయనున్న కేంద్రీయ విద్యాసంస్థల పరిధి పరిమితంగా ఉంటుంది. వీటిలో ఒక్కో సంస్థలో రెండు నుంచి నాలుగు కోర్సులను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ విద్యనభ్యసించే విద్యార్థుల సంఖ్య సైతం రెండు నుంచి నాలుగు వందల మధ్య ఉంటుంది. వీటిలో పనిచేసే బోధనా సిబ్బంది సంఖ్య వంద నుంచి మూడు వందలలోపు, బోధనేతర సిబ్బంది వంద వరకు ఉంటారు. ఐఐఎంలో వంద నుంచి రెండు వందల మంది విద్యార్థులు ఉండే అవకాశం ఉంటుంది. పెట్రో వర్సిటీలో రెండు యూజీ, మరో రెండు పీజీ కోర్సులను నిర్వహించే అవకాశం ఉంటుంది. వీటిలో గరిష్టంలో 120 నుంచి 240 వరకు ప్రవేశాలు కల్పిస్తారు. గిరిజన వర్సిటీలో కేవలం కొన్ని ప్రత్యేక కోర్సులను నిర్వహించి, పరిమితంగా ఉంటుంది. కేంద్రీయ హోదా ఉన్నప్పటికీ చిన్నపాటి విద్యా సంస్థలను ఉత్తరాంధ్రకు కేటాయించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వందలాది ఎకరాల ప్రభుత్వ స్థలాలను ఈ సంస్థలకు కేటాయించినా ఈ ప్రాంతానికి జరిగే లబ్ధిమాత్రం స్వల్పంగానే ఉంటుంది. కేవలం కొద్ది మందికి ఉపాధి కల్పించి, పరిమితంగా పనిచేసే ఈ సంస్థలు ఎంతవరకు ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎయిమ్స్, ఐఐటీల మాటేమిటి.. విద్య, వైద్య రంగాలకు విశాఖ కేంద్రంగా నిలుస్తుందని నేతలు చెబుతున్న మాటలు నీటి మూటలుగా మారిపోతున్నాయి. జాతీయ స్థాయిలో వైద్య విద్యాసంస్థగా నిలిచే ఎయిమ్స్ తరహా వైద్య విద్యాసంస్థ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థలను విశాఖలో ఎందుకు కేటాయించడం లేదనేది ప్రశ్నగా మారింది. అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే వ్యవస్థ అన్ని వసతులు ఉన్న కాస్మోపాలిటన్ సిటీగా పేరుగాంచిన విశాఖ ఈ విద్యా సంస్థల స్థాపనకు అన్ని విధాలా అనుకూలం అన్నది నిర్విదాంశం. ఈ దిశగా స్థానిక నేతలు కనీసం నోరుమెదపక పోవడం గమనార్హం. స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా విశాఖ అభివృద్ధికి ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉంది. కనీసం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్నయినా కేంద్రీయ విశ్వవిద్యాలయంగా మార్పుచేసే దిశగా పనిచేయాలి. -
జర్నలిజంతో ఉపాధి అవకాశాలు
కేయూ క్యాంపస్ : జర్నలిజం కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని కాకతీయ యూని వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి తెలిపారు. కేయూలో రెగ్యులర్ ఎంసీజే ప్రవేశపెట్టిన తర్వాత మొదటి బ్యాచ్ కోర్సు ఇటీవల పూర్తయింది. ఈ సందర్భంగా దూరవిద్యా కేంద్రంలోని సెమినార్‌హాల్‌లో శుక్రవారం విద్యార్థులకు ఏర్పాటుచేసిన ఫేర్వెల్ సమావేశంలో రామస్వామి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. జర్నలిజం విద్యార్థులు గ్రామీ ణ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.రాజారాం మాట్లాడుతూ ఉత్తమ జర్నలిస్టులుగా ఎదగాలంటే నిరంతర అధ్యయనం, నిశిత పరిశీలన, ప్రశ్నించేతత్వం అవసరమని తెలిపారు. సమావేశంలో కేయూ జర్నలిజం విభాగం కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ సంగని మల్లేశ్వర్, అధ్యాపకులు ఎ.సంపత్‌కుమార్, భూక్యా దేవేందర్, కె.నర్సింహరాములు పాల్గొన్నారు. -
మేనేజ్మెంట్ కోర్సులతో ఉజ్వల భవిష్యత్తు
సాగునీరు లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదు సామాజిక అడవులతో భూగర్భజలాల పెంపు చలసాని శ్రీనివాస్ కురబలకోట: మంచి అవకాశాలు పొందడానికి మేనేజ్మెంట్ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర మేధావుల, విద్యావంతుల వేదిక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన కురబలకోట మండలంలోని విశ్వం ప్రాంగణంలో ఉన్న విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్ కళాశాల (ఎస్విటీఎం)లో ఎంబీఏ విద్యార్థులకు అతిథి ఉపన్యాసమిచ్చారు. ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో మేనేజ్‌మెంట్‌ది కీలకపాత్రగా మారిందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు పొందడానికి నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. సమయస్ఫూర్తి, విభిన్న ఆలోచనలు, సృజనాత్మకత తప్పనిసరి అన్నారు. వ్యక్తిత్వం మనిషికి ఆభరణం లాంటిదన్నారు. విశిష్ట వ్యక్తిత్వంతో మనిషి మహనీయుడు కావచ్చన్నారు. ఎంబీఏ అంటే నేడు క్రేజీ పెరుగుతోందన్నారు. కష్టించేతత్వం, మారుతున్న పరిణామాలను అంచనా వేయడం, కంపెనీల వర్తమాన పరిస్థితులను పసిగట్టగలగాలని చెప్పారు. దీనికి తోడు ఎప్పటికప్పుడు ఓర్పు, ఆపై నేర్పుతో ముందుకు సాగాలన్నారు. పర్యాటక కారిడార్‌లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. వారసత్వ సంపద గొప్పది మనకు ఎంతో గొప్ప వారసత్వ సంపద ఉందని, వివిధ రంగాల్లో తెలుగువారు సత్తా చాటారని చలసాని శ్రీనివాస్ అన్నారు. ఇది తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. విశ్వేశ్వరయ్య గొప్ప ఇంజినీరుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొం దారన్నారు. చదువు సంధ్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలపై విద్యార్థులు దృష్టి సారిం చాలన్నారు. ఇకపోతే రాష్ర్ట విభజన అప్రజాస్వామికంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక రాయలసీమ కోరితే నష్టపోయేది సీమ వాసులేనన్నది గుర్తుంచుకోవాలన్నారు. సాగునీరు లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిరాశను కల్గిస్తోందన్నారు. రూ. 17 వేల కోట్ల లోటు బడ్జెట్ లో ఉందన్నారు. రాయలసీమకు పోలవరం వరప్రసాదిని అన్నారు. హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల కు నికర జలాలను కేటాయించాలన్నారు. విద్యు త్ పంపిణీలో కూడా సీమాంధ్రకు అన్యాయం జరుగుతోందన్నారు. సీమ ప్రాంతంలో సామాజి క అడవుల పెంపకం భూగర్భ జలాలకు దోహదపడుతుందని ఆయన అన్నారు. మదనపల్లె ఏరి యా అభివృద్ది సంస్థ సలహాదారు దేవరబురుజు శేఖర్‌రెడ్డి, ఎంబీఏ విభాగాధిపతి నూర్మహమ్మ ద్ తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ చేసేద్దాం
- డిగ్రీ కోర్సులపై యువత ఆసక్తి - ఏటేటా పెరుగుతున్న ప్రవేశాలు - ప్రతిభ ఉంటే ఉద్యోగావకాశాలు పుష్కలం పెరుగుతున్న అడ్మిషన్లు.. జిల్లా వ్యాప్తంగా గత మూడు సంవత్సరాలు పరిశీలిస్తే.. డిగ్రీ కోర్సుల్లో చేరుతున్న వారి సంఖ్య ఏటా పెరిగింది. జిల్లాలో ప్రస్తుతం 112 డిగ్రీ కళాశాలలు ఉన్నారు. మరో 20 కళాశాలలు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అన్ని కళాశాలల్లోనూ ఏటా ప్రవేశాలు పెరుగుతున్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 30 వేల నుంచి 40 మంది విద్యార్థులు డిగ్రీ పట్టా పుచ్చుకుని ఉపాధి సమాజంలోకి అడుగుపెడుతున్నారు. గతంలో ఇంజినీరింగ్ విద్యపై మక్కువ పెంచుకున్నవారు ప్రస్తుతం డిగ్రీల వైపు మళ్లుతుండడంతో పట్టభద్రుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మరోవైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న యువత డిగ్రీ పూర్తిచేయూలని నిర్ణరుుంచుకుంటున్నారు. పరిశ్రమల రంగంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల కన్నా...చదువుకున్న వారే ఎక్కువగా అవసరమని భావిస్తున్న చాలామంది డిగ్రీ బాటపడుతున్నారు. మూడేళ్లలో బోలెడు అవకాశాలు ఇంజినీరింగ్ నాలుగేళ్లు చదవాలి. డిగ్రీ అరుుతే కేవలం మూడు సంవత్సరాలు అరుుతే సరిపోతుంది. ఆ తర్వాత ఏదైన ఉద్యోగంలో చేరవచ్చనే అభిప్రాయం విద్యార్థుల్లో ఎక్కువగా ఉంది. బీఏ, బీఎస్సీ, బీకాంలు పూర్తికాగానే ఎల్ఎల్బీ, బీఈడీ వంటి డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉంటున్నారు. న్యాయవాద వృత్తిపై ఆసక్తిగలవారు ఎల్ఎల్బీ, విద్యారంగంపై మక్కువ ఉన్నవారు బీఈడీ కోర్సుల్లో చేరుతున్నారు.3 సెమిస్టర్ల బెంగ లేదు ఇంజినీరింగ్ విద్యకు అరుుతే సెమిస్టర్‌కు ఓసారి పరీక్షలుంటారుు. దీంతో చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నట్లు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక విద్యలో ఎప్పుడు చదువు, మార్కులు తప్ప వేరే ద్యాస ఉండదు. ఇతర విషయాలు ఆలోచించడానికి తీరిక ఉండదు. అదే డిగ్రీలో అయితే ఏడాదికోసారి పరీక్షలుంటారుు. ఇటు చదువుతూనే అటు ఎన్నో పోటీ పరీక్షలకు హాజరుకావచ్చు. కోర్సు పూర్తరునవెంటనే కంప్యూటర్స్, బ్యాంకింగ్, గ్రూప్స్ వంటి ఎన్నో పోటీ పరిక్షలకు సిద్ధమయ్యే అవకాశం ఉంటుందని విద్యార్థులు భావిస్తున్నారు. డిగ్రీ చేసినవారే అవసరం.. ఇప్పుడు సీన్ రివర్స్ అరుుంది. గతంలో కేవలం ఇంజినీరింగ్ కళాశాలల్లో మాత్రమే క్యాంపస్ రిక్రూట్మెంట్లు ఉండేవి. ఇప్పుడు చాలా సాప్ట్వేర్ కంపెనీలు కేవలం డిగ్రీ అర్హతగా ఉద్యోగాలు అందిస్తున్నాయి. ఇంజినీరింగ్ విద్యలో అయితే ఇంటర్వూల్లో ప్రత్యేక స్కిల్స్‌కి మాత్రమే ప్రాధాన్యమిస్తారు. ఇంజినీరింగ్ వారికి కనీస వేతనం దాదాపు 15 వేల నుంచి 25 వేల రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ డిగ్రీ విద్యార్థులను ఎంపిక చేసుకుంటే రూ. 8 వేల నుంచి రూ. 10 వేలు ఇచ్చినా సంతోషంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులో ఎవరికైనా కంపెనీలవారీగా ప్రత్యేక శిక్షణ ఇస్తే కానీ పనిచేయలేరు. అలాంటప్పుడు ఇంజినీరింగ్ విద్యార్థుల కంటే డిగ్రీ విద్యార్థులే మేలని సాప్ట్వేర్ కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నారుు. పట్టా చేతిలో ఉంటే పుట్టెడు మార్గాలు ఏదైనా ఒక డిగ్రీ చేతిలో ఉంటే చాలు.. ఉద్యోగాల వేటలో పడొచ్చు. బీఈడీ చేస్తే ఉపాధ్యాయ వృత్తిలో రాణించవచ్చు. ఎల్ఎల్బీ చేసి న్యాయవాదిగా స్థిరపడొచ్చు. పీజీ చేస్తే అధ్యాపకుడిగా..బ్యాంకింగ్, రైల్వే, నావీ, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ వంటి రంగాల్లో విభిన్న ఉద్యోగాలు ముందుంటాయి. ఎంపికకు అవకాశం ఉన్న చదువు కావడంతో ఒక రంగంలో కాకపోయిన మరో రంగంలో స్థిరపడొచ్చు అన్న భావన విద్యార్థుల్లో పెరిగింది. స్కాలర్షిప్ సమస్య ఎస్టీ, ఎస్టీ, బీసీ తదితర విద్యార్థులకు నేరుగా వారివారి బ్యాంకు ఖాతాలోకి స్కాలర్షిప్ డబ్బులు వచ్చేవిధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఒక్కో విద్యార్థికి దాదాపు రూ. మూడు వేలవరకు వస్తారుు. ఇంజినీరింగ్ విద్యను ఎంచుకున్నట్లరుుతే కోర్సు చేయడానికే లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. స్కాలర్షిప్లు, రాయితీలు కొంతవరకే వస్తాయి. ఫీజు రీయింబర్స్మెంట్ ఇలా.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో విద్యార్థుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఫీజు రీరుుంబర్స్‌మెంట్ పథకం పేద విద్యార్థుల పాలిట వరంగా మారింది. ప్రస్తుతం ఎందరో పేద విద్యార్థులు విద్యావంతులయ్యేట్లు చేసింది. మూడేళ్ల డిగ్రీకి అన్ని ఖర్చులు కలుపుకున్నా.. రూ. 10 వేలకు మించదు. డిగ్రీ విద్యలోనూ పెనుమార్పులు డిగ్రీ విద్యలోనూ పెనుమార్పులు వచ్చారుు. కేవలం చదవు చెప్పి డిగ్రీ ఇప్పించడమే కాకుండా ఇంజినీరింగ్ తరహాలో ప్రముఖ కంపెనీలను ఉద్యోగాల నిమిత్తం డిగ్రీ కళాశాలల్లోకి ఆహ్వానిస్తున్నాం. విద్యార్థులకు కళాశాలలోనే ఉన్నత ఉద్యోగాలు సాధించేలా చేస్తున్నాం. దీనికోసం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా ఏర్పాటుచేశాం. బోధనతో పాటు విజ్ఞాన సమాచారం అందుబాటులో ఉంచి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. -నాగమల్ల మహేశ్, వికాస్ డిగ్రీ కళాశాల డెరైక్టర్ -
డీఎడ్ సీట్ల కోసం బేరసారాలు
ఉపాధ్యాయ వృత్తి చేపట్టేందుకు మొదటి మెట్టు ఛాత్రోపాధ్యాయ విద్య. గౌరవమైన వృత్తికావడం, ఉద్యోగావకాశా లు ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో సీట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. డీఎడ్ చేసిన వారితోనే ఎస్జీటీ పోస్టులు భర్తీ చేస్తుండడంతో ఆ కోర్సుకు ఆసక్తి పెరిగింది. విద్యార్థుల అవసరాన్ని కళాశాలల యాజమాన్యాలు సొమ్ము చేసుకునేందుకు అప్పుడే సీట్ల బేరం మొదలెట్టాయి. సీటుకు రూ.రెండు లక్షలకు తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారుు. శాతవాహన యూనివర్సిటీ : ఉపాధ్యాయ నియామకాలకు డీఎడ్, బీఎడ్, బీపీఈడీ, టీపీటీ, హెచ్‌పీటీ చేసినవారు అర్హులు. సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు గతంలో బీఈడీ, డీఈడీ చేసిన వారికి అర్హత ఉండగా.. గత డీఎస్సీ నుంచి ఆ అవకాశం తొలగిం చారు. కేవలం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎ డ్) చదివిన వారే ఎస్జీటీ పోస్టులకు అర్హులని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అప్పటినుంచి డీఎడ్ కోర్సుకు భారీగా డిమాండ్ పెరిగింది. కళాశాలలు తక్కువగా ఉండడం, ప్రాథమికోన్నత స్థాయి వరకు బోధించే ఎస్టీటీల నియామకాలే ఎక్కువగా ఉంటుండడంతో ఈ కోర్సు చేస్తే ఉద్యోగం గ్యారెంటీ అనే పరిస్థితి ఏర్పడింది. డీఎడ్‌కు ఇంటర్మీడియెట్ అర్హత కాగా, చాలామంది ఆసక్తి చూపుతున్నారు. జూన్ 15న ప్రవేశపరీక్ష ఉండగా... పరీక్షకు ముందే తమ దగ్గర ఉన్న 20 శాతం మేనేజ్మెంట్ కోటా సీట్లను యాజమాన్యాలు బేరానికి పెట్టాయి. అభ్యర్థుల ఫోన్ నంబర్లు సంపాదించిన కళాశాలల పీఆర్వో లు ఫోన్ చేస్తూ గాలం వేస్తున్నారు. పరీక్ష రాసి ర్యాంకులు వ చ్చేలోగానే యాజమాన్య కోటా సీట్లు నిండిపోతాయని, ముందుగానే సీటు రిజర్వ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. కొన్ని కళాశాలలు ఫీజు చెల్లించి ఫైనల్ పరీక్షలు రాస్తే చాలు... మిగతాదంతా తామే చూసుకుంటామని బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నాయి. ఇందుకు కొంత అదనపు సొమ్ము ఇస్తే చాలని చెబుతున్నాయి. కాసుల పంట జిల్లాలో ఒక గవర్నమెంట్ కళాశాల(ఎల్ఎండీలోని డైట్), 20 ప్రైవేట్ కళాశాలలు ఈ కోర్సు అందిస్తున్నాయి. కళాశాల కు 100 సీట్ల చొప్పున మొత్తం రెండు వేల సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ కళాశాల పోను ప్రైవేట్ కళాశాలల్లో 80 శాతం కన్వీనర్ కోటా, 20 శాతం మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చే స్తారు. అంటే 400 సీట్లు మేనేజ్మెంట్ కోటాలో అందుబాటులో ఉన్నాయి. డైట్‌సెట్ ఎంట్రెన్స్ రాయకున్నా మేనేజ్మెంట్ కోటాలో సీటు పొందవచ్చు. కోర్సు డిమాండ్ దృష్ట్యా కళాశాలల యాజమాన్యాలు సీట్ల ఖరీదు పెంచి కాసులపంట పండించుకుంటున్నాయి. కన్వీనర్ కోటా సీటు అయితే ఫీజు ఏడాదికి రూ.12,500 ఉంటుంది. దీంతో కళాశాలలకు పె ద్దగా రాబడి ఏమీ ఉండదు. రాబడి అంతా యాజమాన్యకో టా సీట్లనుంచే. దీంతో ఈ కోటాలో ఒక్కో సీటు రూ.2 లక్షల కుపైనే పలుకుతోందని సమాచారం. ఇది సరిపోదన్నట్టు 20 శాతం మేనేజ్మెంట్ కోటా సీట్లు సరిపోవని, 50 శాతం భర్తీ కి అవకాశం ఇవ్వాలని యాజమాన్యాలు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాయి. తెరపైకి నాలుగేళ్ల ప్రతిపాదన డీఎడ్ కోర్సు గతంలో ఒకే సంవత్సరం ఉండేది. ప్రమాణా లు పెంచేందుకని పదేళ్ల క్రితం రెండేళ్ల కోర్సుగా చేశారు. ఒక ఏడాది క్లాసులు, మరో ఏడాది పాఠశాలలకు వెళ్లి బోధిం చడం ఉంటాయి. మారుతున్న ప్రమాణాలకు అనుగుణంగా బోధనా విధానం మరింత మెరుగుపరిచేందుకు డీఈడీ కోర్సును నాలుగేళ్లు, బీఈడీని రెండేళ్ల కోర్సుగా చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను డీఎడ్ కళాశాలల యాజమాన్యాలు ధనార్జనకు అవకాశంగా మలుచుకుంటున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి డీఎడ్ కోర్సు నాలుగేళ్లవుతుందని, ఈ ఏడాదే చివరి అవకాశమంటూ విద్యార్థుల నుంచి భారీగా దండుకునే ప్లాన్ వేస్తున్నాయి. ఒకప్పుడు పటిష్టంగా ఉన్న డీఎడ్ కోర్సు ప్రైవేట్ కళాశాలల్లో ప్రస్తుతం ప్రమాణాలు తగ్గడానికి ప్రభుత్వ పర్యవేక్షణ లోపమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరగతులకు విద్యార్థులు వస్తున్నారా? కళాశాలల్లో ల్యాబ్, లైబ్రరీలాంటి సౌకర్యాలు ఉంటున్నాయా? అధ్యాపకులు ఉంటున్నారా? అనే విషయమై అధికారులు పర్యవేక్షణ చేయడం లేదనే విమర్శలున్నాయి. ఏటా కళాశాలల గుర్తింపు రెన్యూవల్ చేసుకునే సమయంలోనూ.. ఎంతో కొంత ముట్టజెప్పి తనిఖీలు లేకుండానే కళాశాలలు తమ పని కానిచ్చేసుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి కళాశాల్లో ఎంపిక పారదర్శకంగా జరిగేలా, అన్ని వసతులతో మెరుగైన బోధన అందించేలా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు. -
హోం సైన్స్‌తో ఉపాధి అవకాశాలు
‘సాక్షి’ కెరీర్ ఫెయిర్‌కు అనూహ్య స్పందన శ్రీనగర్‌కాలనీ, న్యూస్‌లైన్: ఇంటర్మీడియట్ తర్వాత మెడిసిన్, ఇంజినీరింగ్ కోర్సులే కాకుండా, త్వరగా ఉపాధిని, ఉద్యోగాన్ని అందించే విభిన్న కోర్సులు అందుబాటులో ఉన్నాయని, వాటిని ఎంచుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని సైఫాబాద్‌లోని హోం సైన్స్ కెరీర్స్ కాలేజ్ ప్రొఫెసర్ ఎస్.ఎల్. కామేశ్వరి తెలిపారు. బంజారాహిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలుమ్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా టెన్త్, ఇంటర్ తర్వాత విద్యార్థులకు పలు రకాల కోర్సులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సాక్షి కెరీర్ ఫెయిర్‌కు ఆదివారం అనూహ్య స్పందన లభించింది. ఫెయిర్‌లో భాగంగా జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథులుగా ప్రొఫెసర్ ఎస్.ఎల్. కామేశ్వరి, వైఎస్సార్ నిథిమ్ డెరైక్టర్ నారాయణరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొ. కామేశ్వరి మాట్లాడుతూ.. హోం సైన్స్ ద్వారా అనేక ఉపాధి అవకాశాలు పొందవచ్చునని, జీవితంలో త్వరగా స్థిరపడవచ్చని సూచించారు. హోం సైన్స్‌లో ఉన్న పలు రకాల కోర్సులను వివరించారు. అనంతరం నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత హోటల్, టూరిజం రంగంలో మంచి అవకాశాలున్నాయని, దీనికి సంబంధించిన కోర్సులు చేయడం ఉత్తమమని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న వాటిపై అవగాహన విద్యార్థులకు పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులకు ఆ దిశగా సాక్షి మీడియా కెరీర్ ఫెయిర్‌ను నిర్వహించటం అభినందనీయమన్నారు. సమావేశానికి హాజరైన పలువురు విద్యార్థుల అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఫెయిర్ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏ రంగం ఎంచుకోవాలో.. కెరీర్లో ఉన్నత శిఖరాలు అందుకోవాలంటే ఎలాంటి విద్యను అభ్యసించాలో తెలియదు. ఇక్కడికొచ్చాక యానిమేషన్, ఫ్యాషన్ రంగాల్లో ఉన్న అవకాశాలు, ఇంటర్ తర్వాత ఏ కోర్సులు కెరీర్‌కి దోహదపడతాయో అర్థమయ్యింది. - ఫాతిమా, ఇంటర్ సాక్షికి అభినందనలు.. ఇంటర్ తర్వాత ఏ కోర్సుల్లో చేరితే బాగుంటుందా తెలియక తికమకపడ్డా. ఇక్కడకు వచ్చిన పలువురు విద్యావంతుల ద్వారా కెరీర్లో స్థిరపడటానికి ఏ కోర్సులో చేరాలో తెలుసుకున్నా. ఇలాంటి కార్యక్రమం ద్వారా కెరీర్‌పై అవగాహన కల్పించినందుకు సాక్షికి అభినందనలు. - శివాని, ఇంటర్ -
చదువులకీ..ఆర్ధిక ఆసరా
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతోంది. దీంతో పాటే ఏటా విద్యా వ్యయం బాగా పెరిగిపోతోంది. నర్సరీ ఫీజులే లక్షలను తాకుతుంటే... ఇక ఉన్నత విద్య అయితే చెప్పలేని స్థాయికి చేరుకున్నాయి. గత పదేళ్లలో దేశీయ విద్యావ్యయం రెండు రెట్లు పెరిగినట్లు తాజాగా ఒక సర్వే పేర్కొంది. ప్రస్తుతం ఇంజనీరింగ్, మెడికల్, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి కోర్సులకు ఏడు లక్షల నుంచి 15 లక్షల వరకు ఖర్చవుతుంటే, ఎంబీఏకు కాలేజీని బట్టి రూ. 5 నుంచి 10 లక్షల వరకు అవుతోంది. ఇక విదేశీ విద్య అయితే దీనికి నాలుగు రెట్లు ఎక్కువే. ఇలా ఉన్నత విద్య సామాన్యునికి అందుబాటులో లేకపోవడంతో.. వీరంతా విద్యారుణాలను ఆశ్రయించాల్సి వస్తోంది. విద్యారుణాలు పొందడంపై అవగాహన పెంచేదే ఈ వారం ప్రాఫిట్ ముఖ్య కథనం. గడచిన ఐదేళ్ల నుంచి ఆర్థిక వృద్ధిరేటు మందగించి ఉపాధి అవకాశాలు తగ్గడంతో విద్యారుణాల్లో మొండి బకాయిలు (ఎన్పీఏలు) పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ ఏడాది విద్యారుణాల మంజూరులో కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అధిక మార్కులు వచ్చి, ఉపాధి హామీ ఉన్న కోర్సులకే మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నాయి. రుణం మంజూరు అనేది మీకొచ్చిన మార్కులు, ఎంచుకున్న కోర్సు, మీరు ఎంపిక చేసుకున్న కాలేజీ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అర్హత పరీక్షలో 65 శాతం మించి మార్కులు పొందిన వారికి రుణం చాలా సులభంగా లభిస్తోంది. అంతేకాకుండా బ్యాంకు గుర్తించిన విద్యా సంస్థలో చేరేవారికే రుణాలను ఇస్తున్నాయి. అదే మేనేజ్మెంట్ కోటాలో సీటు వస్తే తీసుకునే రుణ మొత్తంపైన 150 శాతం వరకు ష్యూరిటీని బ్యాంకులు అడుగుతున్నాయి. ఏయే కోర్సులకు రుణాలను ఇస్తున్నాయి, బ్యాంకులు గుర్తించిన విద్యాసంస్థల వివరాలు వంటి సమాచారాన్ని బ్యాంకులు అందుబాటులో ఉంచాయి. ఆయా బ్యాంకుల వెబ్సైట్లు సందర్శించడం లేదా బ్రాంచ్‌కు వెళ్లడం ద్వారా ఈ సమాచారం పొందవచ్చు. కానీ ప్రభుత్వ నిబంధనలు ఏం చెపుతున్నాయంటే.. 16 నుంచి 35 సంవత్సరాల లోపువారు ఉన్నత చదువుల కోసం రూ.4లక్షల లోపు మొత్తానికి ఎటువంటి సెక్యూరిటీ లేకుండానే విద్యారుణాలను పొందవచ్చు. నాలుగు లక్షలు దాటి రూ.7.5 లక్షల లోపు రుణాలకు థర్డ్ పార్టీ సెక్యూరిటీ చూపించాలి. అంతకుమించిన రుణాలకు పూర్తి ష్యూరిటీ చూపించాలి. అదే విదేశీ రుణాల విషయానికి వస్తే రుణమొత్తంతో సంబంధం లేకుండానే ష్యూరిటీ ఇవ్వాలి. ఉపాధి ఉంటేనే.. ఇంటర్మీడియెట్ తర్వాత చదివే అన్ని ఉపాధి హామీ కోర్సులకు బ్యాంకులు రుణాలను అందిస్తాయి. యూజీసీ, ఏఐసీటీఈ, ఐసీఎంఆర్, ప్రభుత్వ గుర్తింపు ఉన్న డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, వృత్తి విద్యా కోర్సులు, ఐసీడబ్ల్యూఏ, సీఏ వంటి కోర్సులకు, ఉపాధి హామీ ఉన్న డిప్లొమా కోర్సులు, నర్సింగ్, పారా మెడికల్ వంటి కోర్సులకు, ఐఐఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు కూడా ఇస్తున్నాయి. ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చేసేవారే ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నట్లు బ్యాంకింగ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు బ్యాంకులతో పాటు కొన్ని ప్రైవేటు సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించాయి. హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన క్రెడిలా, దీవాన్ హౌసింగ్‌కు చెందిన అవాన్స్ వంటి సంస్థలు ఉపాధి హామీ ఉన్న సంగీతం, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి కోర్సులకు కూడా రుణాలను ఇస్తున్నాయి. రుణ లెక్కింపు ఇలా.... కాలేజీ/స్కూల్/హాస్టల్‌కు చెల్లించే ఫీజులు, ఎగ్జామినేషన్స్/ లైబ్రరీ/లేబొరేటరీ ఫీజులు, పుస్తకాలు/యూనిఫాం/ఇతర పరికరాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బ్యాంకులు రుణమొత్తాన్ని నిర్ణయిస్తాయి. విదేశీ విద్యకైతే ప్రయాణ వ్యయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. చేసే కోర్సుకు కంప్యూటర్ కొనుగోలు తప్పనిసరి అయితే ఆ వ్యయాన్ని కూడా లెక్కిస్తారు. వీటితో పాటు స్టడీ స్టూర్లు, ప్రాజెక్టు వర్కులు, ద్విచక్ర వాహనం కొనుగోలుకు కూడా రుణం లభిస్తుంది. దేశంలోని కోర్సులకు ఏడు నుంచి పది లక్షల వరకు, అదే విదేశీ విద్యకు గరిష్టంగా 20 లక్షల వరకు రుణాలను అందించడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. అయితే ఈ రుణం మీ చేతికి రాదు. మీరు అడ్మిషన్ పొందిన కాలేజీ పేరు మీద చెక్‌లను బ్యాంకులు జారీ చేస్తాయి. ఎడ్యుకేషన్ లోన్ మంజూరు కావడానికి అత్యంత ముఖ్యమైనది ఆ కోర్సులో చేరినట్లుగా అడ్మిషన్‌కు సంబంధించిన కాగితాలు. ఇవి ఇస్తే కానీ లోన్ ప్రాసెస్ మొదలు కాదు. దీంతో పాటు తాజాగా ఉత్తీర్ణత సాధించిన సర్టిఫికెట్, నివాస ధ్రువపత్రం, గుర్తింపు కార్డు, వయసు ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలతో పాటు పాస్‌పోర్ట్ ఫొటోలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీ రుణానికి గ్యారంటీ అవసరమైతే వాటికి సంబంధించిన పత్రాలు కూడా అందచేయాలి. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం వడ్డీ ఎంత? ఎడ్యుకేషన్ లోన్స్‌పై వడ్డీ అనేది రుణ మొత్తం, కాలపరిమితి, కోర్సు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వడ్డీరేటు బ్యాంకుల బేస్ రేటు కంటే రెండు, మూడు శాతం అధికంగా ఉంటుంది. టాప్ 100 లోపు ర్యాంకులు వచ్చిన వారికి, మహిళలకు ఒక శాతం నుంచి అర శాతం వరకు వడ్డీరేట్లలో డిస్కౌంట్‌ను బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో 50వ ర్యాంకు లోపు వచ్చిన వారికి, జాతీయ స్థాయిలో 100లోపు ర్యాంకులు వచ్చిన వారికి డిస్కౌంటు లభిస్తోంది. కొన్ని బ్యాంకులు వివిధ విద్యాసంస్థలతో ప్రత్యేకంగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అటువంటి సంస్థల్లో చేరితే వడ్డీరేట్లలో మరికొంత డిస్కౌంట్ లభిస్తుంది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం నాలుగు లక్షల లోపు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒక శాతం వడ్డీ రాయితీని అదనంగా అందిస్తోంది. మిగిలిన రుణాల మాదిరిగా ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకున్న మరుసటి నెల నుంచే చెల్లించాల్సిన అవసరం లేదు. కోర్సు పూర్తి అయిన తర్వాత కూడా తగినంత సమయం ఉంటుంది. ఇందుకోసం చాలా బ్యాంకులు అనుసరిస్తున్న విధానం- చదువు పూర్తయిన తర్వాత కనీసం ఒక సంవత్సరం లేదా ఉద్యోగం పొందిన ఆరు నెలల తర్వాత ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పటి నుంచి రుణం చెల్లించడం మొదలు పెట్టాలి. కోర్సు చేస్తున్న కాలంలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వడ్డీ చెల్లిస్తే భారం కొంత మేర తగ్గుతుంది. అలా కాకుండా కోర్సు పూర్తయిన తర్వాతనే వడ్డీ కూడా చెల్లిస్తానంటే వడ్డీని అసలుకి కలిపి ఈఎంఐని లెక్కిస్తారు. ఈ రుణాన్ని గరిష్టంగా ఎనిమిది సంవత్సరాల్లో చెల్లించడానికి బ్యాంకులు అనుమతిస్తున్నాయి. -
డ్రైవింగ్ నేర్చుకుందాం..!
- డ్రైవింగ్‌పై యువత, విద్యార్థుల ఆసక్తి - శిక్షణ సంస్థలకు పెరిగిన డిమాండ్ శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: డ్రైవింగ్ నేర్చుకునేందుకు యువతీయువకులు, ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. డ్రైవింగ్‌తో ఉపాధి అవకాశాలు కూడా లభిస్తుండడంతో యువత మొగ్గుచూపుతున్నారు. డ్రైవిం గ్ను హుందాతనంగా భావించేవారు కూడా వేల సంఖ్యలోనే ఉన్నారు. దేశ ప్రథమపౌరుడు నుంచి మండలస్థారుు అధికారి వరకు అందరూ డ్రైవర్ పక్కన లేదా డ్రైవర్ వెనకాలా సీటులో కూర్చోవల్సిందే. దీన్ని డ్రైవర్లు ఎంతో గౌరవంగా భావిస్తుంటారు. ఇదంతా ఒకెత్తయితే... నేటి పోటీ ప్రపంచ యుగంలో ఉద్యోగ సాధనకు పోటీపడుతున్నారు. చిన్న వయసులోనే ఐదంకెల జీతమిచ్చే ఉద్యోగాలు చేస్తున్నవారు జిల్లాలో క్రమేపి పెరుగుతున్నారు. వీరందరూ నాలుగు చక్రాలవాహనాలు కొనుగోలు చేయడం, డ్రైవర్లకు డిమాండ్ ఉండడంతో ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన వారు కార్‌డ్రైవింగ్ నేర్చుకునేందుకు సై అంటున్నారు. డ్రైవింగ్ స్కూ ళ్లకు పరుగులు తీస్తున్నారు. యువకులు ఆసక్తికి తగ్గట్టుగానే పట్టణంలో డ్రైవింగ్ శిక్షణ సంస్థలు కూడా అదే స్థారులో వెలశారు. ప్రస్తుతం ఒక్క శ్రీకాకుళం పట్టణంలోనే దాదా పు 8 డ్రైవింగ్ శిక్షణ సంస్థలు ఉన్నాయి. ఈ వేసవిలో ప్రత్యేక ఆఫర్ల పేరిట తక్కువ ఫీజులతో శిక్షణ అంది స్తున్నారు. ఆన్‌లైన్‌ద్వారా ముందుగా లెసైన్స్‌కోసం తమ పేర్లునమోదు చేసుకున్న అనంత రం శిక్షణ పొందడం మొదలు పెడుతున్నారు. శిక్షణ అందించే సంస్థలు... సాయి డ్రైవింగ్ స్కూల్, బలగ మెట్టు, సెల్: 9494200111. శ్రీరామచంద్ర డ్రైవింగ్ స్కూల్, బలగ జంక్షన్, 9848950678, శిరిడీసాయి డ్రైవింగ్ స్కూల్, అరసవల్లిరోడ్, సెల్: 9949861551, వీటితోపాటు పట్టణంలో మరికొన్ని డ్రైవింగ్ స్కూళ్లు ఉన్నాయి. ఫీజులు ఇలా... డ్రైవింగ్‌లో నెల నుంచి మూడు నెలల కాలవ్యవధిలో శిక్షణ ఇస్తున్నారు. డ్రైవింగ్‌లోని మెలకువులను నేర్పుతారు. మరీ భయస్తులకైతే మరో నెలరోజుల పాటు అదనంగా శిక్షణ ఇస్తున్నారు. వీరికి ప్రవేశ రుసుంగా * వెయ్యి తీసుకుంటున్నారు. డిమాండ్, వ్యక్తులను బట్టి నెలకు * 5 వందల నుంచి 15 వందల వరకు వసూలు చేస్తున్నారు. -
విభజన ఫలితం.. శాఖల విలీనం!
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజన యువతకు, పలు శాఖల ఉద్యోగుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దూరం కానున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు తగ్గిపోతాయి. కొత్త రాష్ట్రంలో ఆర్థిక లోటు కారణంగా జీతాలు సకాలంలో అందుతాయో లేదో తెలియని పరిస్థితి ఉంది. పలు ప్రభుత్వ శాఖలు, వాటి అనుబంధ శాఖలు సంబంధిత మాతృ శాఖల్లో విలీనం కానున్నాయి. ఇప్పటికిప్పుడు వీటిపై నిర్ణయాలు, జీవోలు వెలువడకపోయినా జూన్ రెండో తేదీ తర్వాత 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. అన్ని స్థాయిలో రాష్ట్రా న్ని పునర్మిర్మించాల్సి ఉంటుంది. అప్పుడు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బం దులు, అవసరాలు, పొదుపు, పరిపాలన సౌలభ్యం దృష్ట్యా అనేక కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి ఉంది. కొత్త రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే వీటిని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే జీవో నెం.67 ద్వారా రెవెన్యూ శాఖలో ఔట్ సోర్సింగ్ సిబ్బందికి మంగళం పాడారు. భూసేకరణ యూ నిట్‌లలో ఉద్యోగుల సంఖ్యనుకుదించారు. వైద్య, ఆరోగ్య శాఖ, విద్య, సంక్షేమం, తదితర శాఖలోలనూ ఉద్యోగుల కుదింపు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు నిర్ణయాలు త్వరలోనే అమలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శాఖల విలీనం వల్ల ఉన్నతాధికార పోస్టులు, సిబ్బంది సంఖ్య కూడా తగ్గిపోతాయి. పదోన్నతులు తగ్గి.. సర్వీసు, సీనియారిటీ సమస్యలు పెరుగుతాయి. ఉన్న ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు, శాఖల విలీనం, పోస్టుల కుదింపు నిర్ణయాల వల్ల ఉన్న రెగ్యులర్ సిబ్బందిని ఖాళీల్లో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉండవు.. కొత్త నియామకాలూ ఉండవు. దాంతో నిరుద్యోగులకు అవకాశాలు తగ్గిపోతాయి. పలు శాఖల్లో సమీప భవిష్యత్తులో జరిగే మార్పు చేర్పులు ఇలా ఉండొచ్చు. ఖజానా శాఖలో.. పే అండ్ అకౌంట్స్, వర్క్స్ విభాగాలు విలీనమవుతా యి. గణాంక శాఖ కూడా ఖజానాకు అనుబంధంగా ఉండాల్సి వస్తుంది. ఈ శాఖలకు ఒకే ఉన్నతాధికారి ఉంటా రు. దీంతో వివిధ క్యాడర్ల ఉద్యోగులకు పదోన్నతులు నిలిచిపోవడమే కాకుం డా కొంతమంది రివర్షన్ పొందవచ్చు. సంక్షేమ శాఖలో.. బీసీ, ఎస్సీ కార్పొరేషన్లు, వికలాంగుల సంక్షేమ శాఖ, నెడ్‌క్యాప్, తదితర విభాగాలు విలీనం కాన్నాయి. ఫలితంగా సంక్షేమ పథకాలు కుంటుపడతాయి. పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఐసీడీఎస్ తదితర విభాగాలు ఒక గూటి కి చేరనున్నాయి. ఇప్పటికే డీఆర్డీఏలో పలు విభాగాలు ఉన్నాయి. డ్వామా ద్వారా నీటి యాజమాన్య కార్యక్రమాలతో పాటు ఉపాధిహామీ, ఇందిర జలప్రభ, వంటి పథకాలు నిర్వహిస్తున్నారు. పని భారం ఎక్కువగా ఉంది. ఇవన్నీ విలీన మైతే ఒత్తిడి మరింత పెరుగుతుంది. జిల్లా పరిషత్‌లో.. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం, తదితర శాఖలు విలీనం కానున్నాయి. వ్యవసాయ శాఖలో.. హార్టికల్చర్, ఆత్మ, సెరికల్చర్, విత్తనాభివృద్ది, మార్కెటింగ్ తదితర శాఖలు, పరిశోధన కేంద్రాలు విలీనమయ్యే అవకాశం ఉంది. విద్యా శాఖలో.. ప్రాథమిక విద్యకు ఊతమిస్తున్న రాజీవ్ విద్యా మిషన్, మాధ్యమిక విద్యకు వసతులు సమకూర్చుతున్న ఆర్ఎంఎస్ఎ తదితర విభాగాలు చేరనున్నాయి. వెద్య ఆరోగ్య శాఖలో.. 104. 108, ఏపీ వైద్య విధాన పరిషత్, క్షయ, కుష్ఠు నియంత్రణ విభాగాలు కలిసిపోయే అవకాశం ఉంది. -
సామాజిక శాస్త్రాలకూ ఉన్నత అవకాశాలు
ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్: ఇంజినీరింగ్‌తో సమానంగా సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేసిన వారికి అమెరికాలో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని హైదరాబాద్‌లోని ఆమెరికన్ కాన్సులేట్ పబ్లిక్ ఎఫైర్స్ అధికారి ఏప్రిల్ వెల్స్ అన్నారు. బుధవారం ఉదయం ఆమె ఏయూను సందర్శించి వర్సిటీ వీసీ జి.ఎస్.ఎన్.రాజుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏయూ అందించే కోర్సుల వివరాలను ఆమె తెలుసుకున్నారు. విభిన్న శాస్త్రాలలో అత్యధికంగా యూజీ, పీజీ కోర్సులను నిర్వహించడాన్ని అభినందించారు. సార్క్ అధ్యయన కేంద్రం ద్వారా జరుగుతున్న సమకాలీన అంశాల పరిశోధనలపై ఆరా తీశారు. ఏయూ విద్యార్థులకు అమెరికా వీసా పొందే విధానంపై త్వరలో అవగాహన కార్యక్రమం చేపడతామన్నారు. తద్వారా విద్యార్థులను సిద్దం చేయడానికి వీలవుతుందన్నారు. సామాజిక శాస్త్రాల్లో ఉన్నత విద్య పరిశోధనలు జరిపే భారతీయ విద్యార్థులకు అమెరికాలో అందించే స్కాలర్షిప్లు తదితర అంశాలను వివరించారు. ఇంజినీరింగ్‌తో సమానంగా సామాజిక శాస్త్రాలను సైతం బలోపేతం చేసే చర్యలు చేపడుతున్నామని వీసీ రాజు చెప్పారు. అమెరికన్ కాన్సులేట్‌తో కలసి విద్యార్థులకు అవసరమైన కార్యక్రమాలను అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ కల్చరల్ ఎఫైర్స్ అడ్వైజర్ సలీల్ కదీర్, ఏయూ రెక్టార్ ఆచార్య ఇ.ఎ.నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య కె.రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
సాగుతోనే సమగ్రాభివృద్ధి
వ్యవసాయానికి ప్రోత్సాహాన్నిచ్చి లాభసాటిగా చేయగల విధానాలను పాలకులు అనుసరిస్తేనే పారిశ్రామిక వస్తువులకు దేశీయ డిమాండు పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వృద్ధి పుంజుకుంటుంది. ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ 2011 నుంచి క్రమంగా దిగజారిపోతోంది. ఆ ఏడాదిలోనూ, గత ఏడాదిలోనూ రూపాయి విలువ తీవ్రంగా పతనమైంది. గ్రామీణ ఉత్పత్తి సూచీలు కూడా అధోముఖంగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం తీవ్ర సమస్యగా ఉంది. నిన్నమొన్నటి వరకూ విదేశీ వాణిజ్యలోటు ఆందోళన కలిగించింది. అన్నిటికంటే ముఖ్యంగా స్థూల జాతీయోత్పత్తి అతి వేగంగా దిగజారి 4.7 శాతం వద్ద కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో సహజంగానే నిరుద్యోగ సమస్య మరింత తీవ్రతరమైంది. స్థూలంగా చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థ స్టాగ్‌ఫ్లేషన్‌లోకి (ధరలు పెరిగిపోతుండగా ఉత్పత్తి స్తం భించి ఉండే పరిస్థితి)దిగజారింది. ఇందుకు కారణమేమిటి? మూలాలు ఎక్కడున్నాయి? గత కొన్ని దశాబ్దాల కాలంలో నేటి ఆర్థిక రంగ దుస్థితికి పునాదులు పడ్డాయి. ఏ దేశ ఆర్థిక రంగంలోనైనా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం మూడూ కీలకమైనవి. ఈ మూడు రంగాల నడుమ సమతూకం లోపించడమే నేటి మన ఆర్థిక దుస్థితికి ప్రధాన కారణం. సమతూకం లోపించడమే సమస్య సాధారణంగా ఏ దేశమైనా తన అభివృద్ధి క్రమంలో తొలుత పారిశ్రామిక, వ్యవసాయ రంగాల ఎదుగుదలపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. మన కళ్ల ముందే చైనా, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా దేశాలు ఆ విధంగానే వృద్ధి చెందాయి. చైనా పారిశ్రామిక ఉత్పత్తి రంగంలో అద్భుత ప్రగతిని సైతం సాధించగలిగింది. కానీ మన దేశం ఆర్థిక రంగం ‘ఎదుగుదల’ అందుకు భిన్నంగా సాగింది. వ్యవసాయ ఆధార దేశంగా ఉన్న స్థితి నుంచి ఒకే గంతులో మనం సేవా రంగంపై ఆధారపడే స్థితికి చేరలేం. అందుకోసం ప్రయత్నించడమే గాక పారిశ్రామిక వస్తు ఉత్పత్తి రంగాన్ని నిర్లక్ష్యం చేశాం. నేడు మన స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో పారిశ్రామిక రంగం వాటా 14 నుంచి 15 శాతం మాత్రమే. సేవా రంగం వాటా 55 శాతం పైగానే ఉంది. వ్యవసాయ రంగంపై పాలకుల తీవ్ర నిర్లక్ష్యం కారణంగా జీడీపీలో ఆ రంగం వాటా 14 శాతంగానే ఉంది. కాగా 55 నుంచి 60 శాతం ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నారు. ఆర్థిక వ్యవస్థలోని ఈ అసమతూకమే అన్ని సమస్యలకు మూలం. 2008 సెప్టెంబర్‌లో బద్దలైన ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో ఈ సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. ఈ సంక్షోభంతో సంపన్న దేశాల ప్రజల కొనుగోలు శక్తి దిగజారింది. దీంతో విదేశీ ఎగుమతులు, కాంట్రాక్టులపై ఎక్కువగా ఆధారపడ్డ మన సేవా రంగం స్థితిగతులు దిగజారాయి. ఫలితంగా గత పది నెలలుగా సేవారంగ ఉత్పత్తి కుంచించుకుపోతోంది. ఆ రంగంలోని కార్యకలాపాల సూచీ 2014లో 48.5కు పడిపోయింది. ప్రధాన రంగంగా మారిన సేవారంగ పతనానికి అది సంకేతం. సేవా రంగంలోని కీలకమైనదైన ఐటీ రంగం 2012-13 కాలంలో సుమారు 66,000 మందికి ఉపాధిని కల్పించింది. అది 2013-14లో 33,000కు పడిపోయింది. ఈ రంగంలో సాంకేతిక పురోభివృద్ధి మందగించిపోవడంతో విదేశీ కాంట్రాక్టులు తగ్గాయి. పైగా ఈ రంగంలో ఆటోమేషన్ పెరిగి గతంలో ముగ్గురు ఉద్యోగులు చేయగల పనిని ఒక్కరే చేయగలుగుతున్నారు. పారిశ్రామిక క్షీణత పారిశ్రామిక, వస్తు ఉత్పత్తి రంగం గత రెండు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైంది. అంతర్జాతీయ పోటీ తీవ్రంగా ఉన్న ఈ రంగంలో గత ఏడాది 0.9 శాతంగా ఉంది. నేడు 0.2 శాతానికి దిగజారింది. మొత్తం దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో దిగుమతుల వాటా 15 శాతం మాత్రమే. మన సరుకులను దిగుమతి చేసుకునే ధనిక దేశాలలోని క్షీణ ఆర్థిక స్థితి వల్ల కూడా మన ఎగుమతులకు అవకాశాలు సన్నగిల్లాయి. పైగా పాలకుల విధానాలవల్ల మన ప్రజల కొనుగోలు శక్తి విపరీతంగా పడిపోయింది. దీంతో పారిశ్రామిక వస్తువులకు దేశంలో సైతం గిరాకీ చాలా వరకు తగ్గిపోయింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పడు పారిశ్రామిక రంగ పురోగతికి పెద్ద పీట వేస్తామంటున్నారు. అందులో భాగంగా ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ వంటి ప్రయత్నాలు మొదలెట్టారు. చైనాలో వేతనాలు పెరగడం వల్ల సంపన్న దేశాల పరిశ్రమలు అక్కడి నుంచి మన దేశానికి తరలి వస్తాయని ఆశ. వేతనాల పెరుగుదల వల్ల చైనాలో ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోతాయని మనవాళ్ల అంచనా. మన దేశంలో వేతనాలు చైనా కంటే బాగా తక్కువగా ఉండటమే మన ఆశలకు పునాది. అయితే చైనా నుంచి ధనిక దేశాలకు దిగుమతులు తగ్గుముఖం పట్టడానికి పెరిగిన ఉత్పత్తి వ్యయాలు మాత్రమే కారణం కాదు. ధనిక దేశాల ప్రజల కొనుగోలు స్థితి దిగజారి ఉండటమే అందుకు ప్రధాన కారణం. అలాగే చైనా కోల్పోయే మార్కెట్ మనకే దక్కుతుందనుకోవ డం పొరపాటు. వియత్నాం, బంగ్లాదేశ్, మెక్సికో వంటి పలు అల్ప వేతన దేశాల నుంచి మనకు గట్టి పోటీ తప్పదు. దశాబ్దాల నిర్లక్ష్యాన్ని మరచి హఠాత్తుగా మన దేశం పెద్ద పారిశ్రామిక దేశంగా ఎదుగుతుందనుకోవడం భ్రమ. సగానికి పైగా దేశ జనాభాకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం నేడు దయనీయంగా ఉంది. వ్యవసాయం చేయడం ఇక తమ వల్ల కాదనే స్థితికి చేరిన రైతాంగం సంఖ్య 42 శాతానికి పైగా ఉండగా నేడది 75 శాతానికి పెరిగింది. గత రెండు దశాబ్దాల కాలంలో అప్పులపాలై, దివాలా తీసి లక్షల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా 2018-19 నాటికి మన దేశ జీడీపీలో చెప్పుకోదగిన వృద్ధిని సాధించలేమని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా. ఎంత భారీగా ఆర్థిక సంస్కరణలను అమలు జరిపినా మన వృద్ధి రేటు 7-8 శాతం స్థాయిని ఇప్పట్లో మించలేదని అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ ‘మూడీస్’ అంచనా. కాబట్టి సంస్కరణలను ప్రవేశపెట్టడం వల్ల మన ఆర్థిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు లేవనేది స్పష్టం. పాలకులు మారడమే కాదు, విధానాలలో కూడా సహేతుకమైన మార్పులు రావడం తప్పనిసరి. ప్రధానంగా విదేశీ డిమాండుపై ఆధారపడిన సేవా రంగం గానీ, దేశీయ డిమాండుపై ఆధారపడిన పారిశ్రామిక రంగంగానీ ఆదుకోలేవు. అత్యధిక ప్రజల కొనుగోలు శక్తిని పెంచి, దేశీయ డిమాండును పెంచగల వ్యవసాయ రంగంలో మాత్రమే మన ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కానీ అది తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. 1985 నాటికి మన జీడీపీలో సుమారు 1.4 శాతాన్ని మాత్రమే మన ప్రభుత్వాలు వ్యవసాయ రంగంపై ఖర్చు పెడుతున్నాయి. 2010 నాటికి ఈ వ్యయం 0.60 శాతానికి తగ్గిపోయింది. వ్యవసాయ రంగంపై చైనా నేడు ఏటా జీడీపీలో 5 శాతం మేరకు ఖర్చు చేస్తోంది. ఈ ఒక్క గణాంకమే మన వ్యవసాయ రంగాన్ని ఆవహించిన దుస్థితిని సూచించగలదు. వ్యవసాయంపై కేంద్రీకరణే పరిష్కారం అందుచేత వ్యవసాయానికి ప్రోత్సాహాన్నిచ్చి లాభసాటిగా చేయగల విధానాలను పాలకులు అనుసరిస్తేనే దేశీయ డిమాండు పెరుగుతుంది. వ్యవసాయదారుల ఆదాయాలు పెరిగి, వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. దేశంలోని సగానికి పైగా ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయాధార పారిశ్రామిక ఉత్పత్తులకు మంచి గిరాకీ ఏర్పడుతుంది. ఇది పట్టణాల్లో కూడా ఆర్థిక పునరుజ్జీవనాన్ని పెంపొందింపజేస్తుంది. నిరుద్యోగ సమస్య గణనీయంగా తగ్గుతుంది. దేశీయంగా డిమాండు కుంచించుకుపోయిన పరిస్థితికి పరిష్కారం లభిస్తుంది. మన ఆర్థిక సమస్యలకు ఇదే ఏకైక పరిష్కారం. అందుకోసం వ్యవసాయరంగంపై వెచ్చిస్తున్న మొత్తాలు పెరగాలి. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వంటి ఉత్పదకాలపై సబ్సిడీలను అందించాలి. సాగుకు అవసరమైన నీటి పారుదల సదుపాయాలను భారీగా విస్తరించాలి. వ్యవసాయ రంగానికి నిరంతరం ఉచితంగా లేదా చౌకగా విద్యుత్తును అందించాలి. విధానపరమైన ఈ మౌలిక మార్పు మాత్రమే సమస్యల విషవలయంలో చిక్కుకున్న ఆర్థిక రంగాన్ని గట్టెక్కించగలదు. అలాంటి విధాన ప్రత్యమ్నాయాన్ని అనుసరించని ఏ ప్రభుత్వమైనా దేశ ప్రజల సమస్యలను పరిష్కరించలేదనడం నిస్సందేహం. (వ్యాసకర్త ఆర్థిక విశ్లేషకులు) డి. పాపారావు -
తెలంగాణను అభివృద్ధి చేయాలి
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రాన్ని స్పెషల్ కేటగిరీ కింద ప్రకటించి వ్యవసాయం, పరిశ్రమలు, యువతకు ఉపాధి.. ఇలా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలని స్టూడెంట్ ఫర్ లిబర్టీ సౌత్ ఇండియా అధ్యక్షుడు జి.వెంకటేష్ అన్నారు. ఈ మేరకు ఆదివారం నగరంలో నిర్వహించిన స్టూడెంట్ ఫర్ లిబర్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. తెలంగాణలో యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే అమరవీరుల త్యాగఫలం, రాష్ట్ర ఏర్పాటుకు అర్థం ఉండదన్నారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 1991లో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల ప్రపంచంలోనే దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. పీవీ సంస్కరణల స్ఫూర్తితోనే గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా లాంటి రాష్ట్రాలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయని వివరించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా పాలకవర్గాలు కృషి చేయాలన్నారు. -
బంగారు తెలంగాణే లక్ష్యం
కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్నది నా ప్రధాన లక్ష్యం. దీనిలో భాగంగా ఎమ్మెల్యేగా గెలిచిన మూడు, నాలుగు నెలల్లో తొలి ప్రాధాన్యత కింద జిల్లాలో పెండింగ్‌లో ఉన్న తాగు, సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తా. నియోజకవర్గంలో తొలి విడత శాటిలైట్ టౌన్షిప్ పేరుతో ఐదు వేల ఇళ్ల నిర్మాణం చేపడతా.జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీతో పాటు దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తా . నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా.. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఐటీ పార్కు ఏర్పాటు, ప్రభుత్వ భూములు సేకరించి పేదలకు పంపిణీ చేస్తా. మేజర్ గ్రామపంచాయతీల్లో ప్రభుత్వ భూములు సేకరించి శాటిలైట్ టౌన్ షిప్‌లు ఏర్పాటు చేయిస్తా. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి ప్రత్యేక రాష్ట్రంలో సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలు నాకు ఉన్నాయి. కానీ సీఎం పదవి కంటే కూడా ఈ ప్రాంత ప్రజల బాగోగులు చూసుకోవడం ముఖ్యం. టీ కాంగ్రెస్ మేనిఫెస్టోల్లో పేర్కొన్న అంశాలను అమలు చేసేందుకు కృషి చేస్తా. రైతులకు రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయిస్తా. బీసీలు, ముస్లింలు, మైనార్టీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటుకు కృషి, హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారిపై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయిస్తా. వృద్ధులకు, వికలాంగులకు పింఛన్‌ను రూ.వెయ్యికి పెంచేందుకు పాటుపడతా. రైతులకు 9 గంటల పాటు నిరంతరాయం గా విద్యుత్ సరఫరా చేయిస్తా. స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తా. -
‘తెలంగాణ’తో ఉద్యోగావకాశాలు
సాక్షి, ముంబై: ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్ గౌడ్ అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆజాద్‌మైదాన్‌లో ముంబై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఐదోరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడ దీక్షలో పాల్గొన్న తెలంగాణవాదులను సుధాకర్ గౌడ్ కలిశారు. అక్కడ చేపడుతున్న ధర్నా, దీక్షలో పాల్గొన్న వారితో కొంతసేపు ముచ్చటించారు. అనంతరం మట్లాడుతూ ముంబై నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత మన తెలంగాణ ప్రజ లకే దక్కిందని కొనియాడారు. తెలంగాణలో ఉద్యో గావకాశాలు లేకపోవడంవల్ల వలసలు పెరిగాయ ని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అవి తగ్గిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. చిన్న రాష్ట్రాలతో దేశం అభివృద్ధి చెందుతుందని, అప్పట్లో భార త రాజ్యాంగకర్త డాక్టర్ అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. అంతకుముందు దీక్ష ప్రాంగణానికి చేరుకున్న సుధాకర్‌కు తెలంగాణవాదులు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ పాటల తో హోరెత్తించారు. కార్యక్రమం లో బోరివలికి చెందిన గంగాపుత్ర సంఘం అధ్యక్షుడు తోకల రాములు, కె.శంకర్, తెలంగాణ ఐక్య ప్రజాఫ్రంట్ నాయకులు అక్కనపెల్లి శ్రీనివాస్, నాగిల్ల వెంకన్న, తెలంగాణ బెస్త సంఘం అధ్యక్షు డు ఎన్.మల్లేశ్ బెస్త, ఆర్.లక్ష్మణ్ బెస్త పాల్గొన్నారు.