Parlament sessions
-
పదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలిచ్చాం
న్యూఢిల్లీ: రైల్వేలో పదేళ్లలో 5 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అయినా నియామకాలపై ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయని ఆరోపించారు. రైల్వేలో రిక్రూట్మెంట్ జరగలేదని సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు రాజ్యసభలో సోమవారం ఆయన సమాధానమిచ్చారు. మొత్తం 12 లక్షల మంది ఉద్యోగుల్లో గత పదేళ్లలోనే 40 శాతం నియామకాలు జరిగాయని వెల్లడించారు. నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, ఇటీవల జరిగిన లోకో పైలట్ల పరీక్షకు 156 నగరాల్లోని 346 కేంద్రాల్లో 18.4 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. లెవల్ 1 నుంచి లెవల్ 6 నియామకాలకు 2.32 కోట్ల మంది అభ్యర్థులు హాజరయ్యారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా భర్తీ చేశామని తెలిపారు. రైల్వే, రక్షణ వంటి శాఖలపై రాజకీయాలు సరికాదన్నారు. మంత్రి స్పందన సరిగా లేదంటూ విపక్షాలు అభ్యంతరం వెలిబుచ్చాయి. నిరసన వాకౌట్ చేశాయి.అత్యాధునిక భద్రతా చర్యలు మహాకుంభ్ మేళా సందర్భంగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ సహా డేటా భద్రంగా ఉందని మంత్రి అన్నారు. దీనిపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరుపుతోందని, దాదాపు 300 మంది నుంచి వివరాలు సేకరిస్తున్నామని, వాస్తవాలు తెలుసుకుంటున్నామని వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు దేశ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే 60 స్టేషన్లను గుర్తించామని వైష్ణవ్ తెలిపారు. వీటన్నింటిలోనూ అత్యాధునిక సాంకేతికతతో కూడిన భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. నిలకడగా ఆర్థిక పరిస్థితి రైల్వే ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉందన్న మంత్రి.. కోవిడ్ మహమ్మారి సందర్భంగా ఎదురైన సవాళ్లను విజయవంతంగా అధిగమించిందని చెప్పారు. ప్యాసింజర్ రైళ్లు, కార్గో ట్రాఫిక్ రెండింటిలోనూ వృద్ధి నమోదైందన్నారు. 2023 –24 మధ్య సుమారు రూ 2,78,000 కోట్ల ఆదాయం వచి్చందన్నారు. సిబ్బంది వ్యయం, పెన్షన్ చెల్లింపులు, ఇంధన వ్యయాలు, ఫైనాన్సింగ్‌పై రైల్వే ఖర్చు చేసిందన్నారు. తన సొంత ఆదాయంతోనే వ్యయాన్ని భరిస్తోందని, ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపర్చేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కార్గో, సరుకు రవాణా ఆదాయంతో ప్రయాణికుల చార్జీల సబ్సిడీ చెల్లిస్తున్నామన్నారు. పొరుగు దేశాలతో పోలిస్తే మన రైల్వేలో అన్ని కేటగిరీల్లో టికెట్ చార్జీలు తక్కువగా ఉన్నాయని వివరించారు. మార్చి 31 నాటికి 1.6 బిలియన్ టన్నుల సరుకు రవాణాతో మన దేశం ప్రపంచంలోని మొదటి మూడు దేశాల్లో ఒకటిగా ఉంటుందన్నారు. 50 వేల కిలోమీటర్ల ట్రాక్‌ల నిర్మాణం, 12 వేల అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణం, 14 వేల వంతెనల పునరి్నర్మాణం మన రైల్వే సాధించిన విజయాలని మంత్రి వైష్ణవ్ పేర్కొన్నారు. ఎగుమతుల రంగంలో.. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వస్తువుల ఎగుమతులను రైల్వే ఎలా పెంచుతోందో వివరించారు ఆ్రస్టేలియాకు మెట్రో కోచ్‌లు ఎగుమతి చేస్తున్నామన్నారు. బ్రిటన్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, ఆ్రస్టేలియాలకు బోగీలు, ఫ్రాన్స్, మెక్సికో, రొమేనియా, స్పెయిన్, జర్మనీ, ఇటలీలకు ప్రొపల్షన్లు, మొజాంబిక్, బంగ్లాదేశ్, శ్రీలంకలకు ప్రయాణికుల బోగీలు ఎగుమతి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. మొజాంబిక్, సెనెగల్, శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్‌లకు లోకోమోటివ్లను ఎగుమతి చేస్తున్నామని, సమీప భవిష్యత్‌లో బీహార్‌లోని సరన్ జిల్లాలో ఉన్న మర్హోరా వద్ద తయారైన 100కు పైగా లోకోమోటివ్లను ఎగుమతి చేస్తామని తెలిపారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైన పశి్చమబెంగాల్, తమిళనాడు, కేరళలో నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఆయా రాష్ట్రాల సహకారాన్ని కోరారు. పేద, మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో రైల్వేలు విఫలమయ్యాయన్న ఆరోపణలు వైష్ణవ్ తోసిపుచ్చారు. -
ఈసీ తీరుపై... అన్నీ అనుమానాలే!
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా అవకతవకలు, నకిలీ ఓటర్ కార్డులు, ఓటర్ల సంఖ్యలో అనూహ్య పెరుగుదల, ఇష్టారాజ్యంగా ఓటర్ల తొలగింపు తదితర అంశాలను కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలన్నీ సోమవారం లోక్‌సభలో లేవనెత్తాయి. వీటిపై సందేహాలు, నానాటికీ దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆరోపణలు మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతనే ప్రశ్నార్థకంగా మార్చాయంటూ ఆందోళన వెలిబుచ్చాయి. పైగా వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం అరకొర స్పందన మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నాయి. కనుక ఈ మొత్తం అంశంపై లోక్‌సభలో పూర్తిస్థాయి చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇది ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో చేస్తున్న డిమాండని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ ఓటర్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుందా అని ప్రశ్నించారు. ‘‘కేంద్రం తయారు చేయదన్నది నిజమే. కానీ ఇవన్నీ మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అందుకే ఈ అంశంపై సవివరమైన చర్చకు మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని రాహుల్ బదులిచ్చారు. ‘‘ఓటర్ల జాబితాల విశ్వసనీయతను దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలన్నీ ప్రశ్నిస్తున్నాయి. మహారాష్ట్రతో సహా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతిపక్షాలు దీనిపై అనుమానాలు లేవనెత్తాయి’’ అని గుర్తు చేశారు. ఇది చాలా తీవ్రమైన అంశమంటూ సమాజ్‌వాదీ, ఆర్జేడీ, బిజూ జనతాదళ్, ఆప్ కూడా గొంతు కలిపాయి. దీన్ని పార్లమెంటు చర్చకు స్వీకరించాల్సిందేనని పట్టుబట్టాయి. తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతారాయ్ ఓటర్ల జాబితా అంశాన్ని జీరో అవర్‌లో లేవనెత్తారు. ‘‘ఓటర్ల ఫొటో గుర్తింపు కార్డు నంబర్లలో నకిలీల సమస్య దశాబ్దాలుగా ఉంది. కానీ పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన అనంతరమే కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై స్పందించింది. సమస్యను మూడు నెలల్లో పరిష్కరిస్తామని ప్రకటించింది’’ అంటూ దృష్టికి తెచ్చారు. అంటే ఇంతకాలంగా తప్పిదాలు జరుగుతూ వస్తున్నట్టే కదా అని ఆయన ప్రశ్నించారు. ‘‘బెంగాల్, హరియాణాల్లో నకిలీ ఓటరు కార్డులు దొరికాయి. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. దానిపై అందరూ ప్రశ్నలు లేవనెత్తారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలప్పుడూ ఇలాగే జరిగింది. ఇవన్నీ తీవ్రమైన లోటుపాట్లే. వచ్చే ఏడాది బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికలున్నందున ఆలోపే ఓటర్ల జాబితాలను పూర్తిగా సవరించాలి’’ అని డిమాండ్ చేశారు. ఈ తప్పిదాలపై దేశ ప్రజలకు ఈసీ బదులివ్వాల్సిందేనన్నారు. ఈ అంశంపై సమగ్ర చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నిరసనలతో హోరెత్తించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ పక్షపాతరహితంగా వ్యవహరించాలని సమాజ్‌వాదీ సభ్యుడు ధర్మేంద్రయాదవ్ అన్నారు. ‘‘మహారాష్ట్రలో నెలల వ్యవధిలోనే కొత్తగా లక్షలాది ఓటర్లు ఎలా పుట్టుకొచ్చారు? ఢిల్లీలోనూ అదే జరిగింది. 2022లో యూపీలోనూ ఇదే చేశారు’’ అని ఆరోపించారు.రాజ్యసభలోనూ... రాజ్యసభలో కూడా జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రయత్నించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అందుకు అనుమతివ్వలేదు. దీనితో పాటు డజనుకు పైగా అంశాలపై 267వ నిబంధన కింద చర్చకు డిమాండ్ చేస్తూ విపక్షాలు ఇచి్చన నోటీసులన్నింటినీ తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. ‘‘మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఆర్నెల్లలోనే ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇదెలా సాధ్యం? దీనిపై కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ఈసీ వద్ద సమాధానమే లేదు. ఓటింగ్ ప్రక్రియ కోసం ఉపయోగించిన ఫొటో ఓటర్ల జాబితాను ఎక్సెల్ ఫార్మాట్లో మాకు అందజేయాలని డిమాండ్ చేస్తే ఈసీ నేటికీ స్పందించనే లేదు. దేశవ్యాప్తంగా ఓటర్ల పేర్లను ఇష్టారాజ్యంగా తొలగించడం, డూప్లికేట్ ఈపీఐసీ నంబర్ల వంటి తీవ్ర తప్పిదాలు, లోటుపాట్లు ఇష్టారాజ్యాంగా చోటుచేసుకుంటున్నాయి. ఇవన్నీ ఎన్నికల ప్రక్రియ తాలూకు సమగ్రతనే సవాలు చేస్తున్నాయి. పైగా ఈ తప్పిదాలను స్వయంగా ఈసీయే అంగీకరించింది. కనుక వీటన్నింటిపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందే. అందుకు మోదీ సర్కారు అంగీకరించాల్సిందే’’ అంటూ అనంతరం ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తద్వారా ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్నేళ్లుగా ఘోరంగా విఫలమవుతోందని అంతకుముందు టీఎంసీ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ సభలో దుయ్యబట్టారు. ఇందుకు ఈసీపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘డూప్లికేట్ ఓటర్ కార్డుల అంశాన్ని సీఎం మమతే తొలిసారి లేవనెత్తారు. దీనిపై ఈసీ ఇచ్చిన వివరణ ఎన్నికల నిర్వహణ నిబంధనలకే విరుద్ధంగా ఉంది’’ అని ఆరోపించారు. అనుమానాలన్నింటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం, ఈసీపై ఉందని ఆప్ సభ్యుడు సంజయ్‌సింగ్ అన్నారు. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హరియాణా పౌరులకు విచ్చలవిడిగా ఓటరు కార్డులిచ్చారని ఆరోపించారు. తద్వారా ఎన్నికల ప్రక్రియనే ప్రహసనంగా ఈసీ మార్చేసిందని దుయ్యబట్టారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈసీ ప్రయత్నిస్తోందని ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝా ఆరోపించారు. ‘‘ఎన్నికల ప్రక్రియే పార్లమెంటు ఉనికికి ప్రాణం. ఎన్నికల అవకతవకలపై ఇక్కడ చర్చించేందుకు అవకాశమివ్వకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు’’ అన్నారు. -
Waqf Amendment Bill 2024: జేపీసీకి వక్ఫ్ (సవరణ) బిల్లు
న్యూఢిల్లీ: వక్ఫ్ చట్టం–1995లో పలు మార్పులు తీసుకురావడంతోపాటు చట్టం పేరును ‘యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫీషియెన్సీ, డెవలప్మెంట్ యాక్ట్–1995’గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వక్ఫ్(సవరణ) బిల్లు–2024ను పార్లమెంట్లో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా, అడ్డుకొనేందుకు ప్రయతి్నంచాయి. సమాజంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన ఈ క్రూరమైన బిల్లు వద్దే వద్దంటూ నినదించాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ సమాజాన్ని విచి్ఛన్నం చేసే ఈ బిల్లును ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బీజేపీ సహా అధికార ఎన్డీయే కూటమి పక్షాలు బిల్లుకు మద్దతు ప్రకటించాయి. చివరకు ప్రతిపక్షాల నిరసనతో ప్రభుత్వం దిగొచి్చంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు బిల్లును పంపిస్తున్నట్లు ప్రకటించింది. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే.. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు వక్ఫ్(సవరణ) బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై చర్చ ప్రారంభించారు. బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ నోటీసు ఇచ్చారు. దేశంలో మత స్వేచ్ఛను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని, సమాఖ్య వ్యవస్థపై దాడి చేస్తోందని మండిపడ్డారు. ప్రజల మధ్య చిచ్చు పెడుతూ విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, అయినప్పటికీ హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబి్ధకోసమే బిల్లును తీసుకొచ్చిందని విమర్శించారు. ఇప్పుడు ముస్లింలపై దాడి చేస్తున్నారని, తర్వాత క్రైస్తవులపై, జైన్‌లపై దాడి చేస్తారని ధ్వజమెత్తారు. అనంతరం విపక్ష సభ్యులు బిల్లుపై దుమ్మెత్తిపోశారు. డీఎంకే ఎంపీ కనిమొళి, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ బషీర్ బిల్లును వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పారు. ఎన్డీయేలోని కొన్ని పార్టీ సభ్యులు మాత్రం బిల్లుకు మద్దతు ప్రకటించారు. సభలో వాడీవేడిగా జరిగిన చర్చ తర్వాత మంత్రి కిరెణ్ రిజిజు స్పందించారు. బిల్లును జేపీసీ పరిశీలనకు పంపిస్తున్నట్లు తెలిపారు. జేపీసీ ఏర్పాటు కోసం త్వరలో అన్ని పారీ్టల నేతలో చర్చిస్తామని వివరించారు. ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్–1923ని రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును సైతం రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బీజేపీ రియల్ ఎస్టేట్ కంపెనీ ‘‘కరడుగట్టిన బీజేపీ మద్దతుదారులను సంతోషపర్చడానికి బిల్లును తీసుకొచ్చారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమిస్తారా? ఇతర మత సంస్థల విషయంలో ఇలాగే చేయగలరా? ఎన్నికల్లో లబ్ధి కోసం బిల్లు రూపొందించారు. బీజేపీ రియల్ ఎస్టేట్ కంపెనీలా పనిచేస్తోంది. ఆ పార్టీ పేరును భారతీయ జమీన్ పారీ్టగా మార్చుకోవాలి. వక్ఫ్ బోర్డుల భూములను కాజేయాలని చూస్తున్నారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వక్ఫ్ బోర్డు భూములు అమ్మబోమంటూ గ్యారంటీ ఇవ్వాలి. ముస్లింల హక్కులను దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోం. కచ్చితంగా అడ్డుకుంటాం’’ – అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ మైనారీ్టలను రక్షించుకోవడం బాధ్యత ‘‘బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం. ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం తగదు. బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోందో చూడండి. మైనారీ్టలను రక్షించుకోవడం మన నైతిక బాధ్యత. బిల్లు వెనుక ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం బయటపెట్టాలి. బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అందరితో చర్చించి పారదర్శకమైన బిల్లు రూపొందించాలి’’ – సుప్రియా సూలే, ఎన్సీపీ(శరద్ పవార్) పారదర్శకత కోసమే మద్దతు‘‘బిల్లుకు మద్దతిస్తున్నాం. వక్ఫ్ బోర్డుల నిర్వహణలో పారదర్శకతకు ఈ బిల్లు దోహదపడుతుంది. ముస్లిం వ్యతిరేక చర్య అనడంలో అర్థం లేదు. ఎవరికీ వ్యతిరేకం కాదు’’ –చిరాగ్ పాశ్వాన్, ఎల్జేపీ చీఫ్, కేంద్ర మంత్రి ముస్లింలను శత్రువులుగా చూస్తున్నారు ‘‘వక్ఫ్ చట్టంలో ఇష్టారాజ్యంగా సవరణలు చేయడాన్ని ఖండిస్తున్నాం. రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడి చేయడం దుర్మార్గం. ముస్లింలను శత్రువులుగా భావిస్తున్నారు. అందుకు ఈ బిల్లే నిదర్శనం. దర్గా, మసీదు, వక్ఫ్ ఆస్తులను స్వా«దీనం చేసుకోవాలనుకుంటున్నారా? ఈ బిల్లు ద్వారా దేశాన్ని ముక్కలు చేద్దామనుకుంటున్నారా? ఏకం చేద్దామనుకుంటున్నారా? బిల్లుకు వ్యతిరేకంగా ఇప్పటికే రూల్ 72 కింద నోటీసు ఇచ్చాం. ప్రభుత్వం తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలి’’ – అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. సభలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్ రెడ్డి తెలిపారు. ‘ముస్లిం వర్గాల్లో అనేక ఆందోళనలు ఉన్నాయి. కాబట్టి ఈ బిల్లు మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముస్లిం సమాజాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ లేవనెత్తిన ఆందోళనలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది’అని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ముస్లింలకు వ్యతిరేకం కాదు ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు. మతపరమైన విభజనలను ప్రోత్సహించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. పారదర్శకత కోసమే బిల్లు రూపొందించారు. ప్రతిపక్షాలు ఈ బిల్లును ఆలయాలతో పోలుస్తున్నాయి. అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పాలనలో వేలాది మంది సిక్కులను ఊచకోత కోశారు. ఇందిరా గాంధీ హత్యకు ఏ ట్యాక్సీ డ్రైవర్ కారణం? దీనిపై కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ సమాధానం చెప్పాలి. – రాజీవ్ రంజన్ సింగ్, జేడీ(యూ) సభ్యుడు, కేంద్ర మంత్రిరాజ్యసభలో వక్ఫ్ ఆస్తుల బిల్లు ఉపసంహరణ వక్ఫ్ ఆస్తుల(ఆక్రమణదార్ల తొలగింపు) బిల్లు–2014ను ప్రభుత్వం గురువారం రాజ్యసభ నుంచి ఉపసంహరించుకుంది. బిల్లు ఉపసంహరణకు మూజువాణి ఓటుతో సభ్యులు ఆమోదం తెలిపారు. వక్ఫ్ ఆస్తుల్లో ఎవరైనా అనధికారికంగా తిష్టవేస్తే వారిని అక్కడి నుంచి తొలగించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా 2014 ఫిబ్రవరి 18న అప్పటి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కె.రెహా్మన్ ఖాన్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 2014 మార్చి 5న బిల్లును పార్లమెంట్ స్థాయీ సంఘం పరిశీలనకు పంపించారు. అప్పటినుంచి బిల్లు పెండింగ్‌లో ఉంది.టీడీపీ మద్దతు లోక్‌సభలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు–2024కు టీడీపీ మద్దతు ప్రకటించింది. బిల్లును స్వాగతిస్తున్నామని టీడీపీ ఎంపీ హరీశ్ చెప్పారు. అన్ని మతాల వారు తమ మత కార్యక్రమాలకు భూములు, ఆస్తులను విరాళంగా ఇస్తుంటారని తెలిపారు. దాతల ప్రయోజనాలు కాపాడేలా సంస్కరణలు తీసుకొచ్చి ఆ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. -
Union Budget 2024: బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: 2024–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు సోమవారం లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. గత వారం బడ్జెట్‌పై చర్చ ముగిశాక తాజాగా పార్లమెంట్ దిగువసభ తన ఆమోదం తెలిపింది. దీంతోపాటు సభ ఆమోదించిన బడ్జెట్ పద్దుల మేరకు సంచిత నిధి నుంచి మొత్తాలను వినియోగించేందుకు అనుమతించే ద్రవ్య వినిమయ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. రైల్వే, విద్య, ఆరోగ్యం, మత్స్యరంగాలకు సంబంధించిన గ్రాంట్ల వినియోగానికి సంబంధిన బిల్లుకూ లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రతిపాదించిన పన్ను శ్లాబుల సంబంధ ఫైనాన్స్ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగనుంది. రాజ్యసభలో వ్యవసాయం, పునరుత్పాదక శక్తి, సహకార రంగం, గృహ పట్టణాభివృద్ధికి కేటాయింపులపై చర్చ జరగనుంది. ఫైనాన్స్ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినా మార్పులు సిఫార్సు చేయబోదు. కేవలం ఆ బిల్లులను తిరిగి లోక్‌సభకు పంపగలదు. ఫైనాన్స్ బిల్లు ఆమోదం పొందాక బడ్జెట్ తంతు మొత్తం ముగుస్తుంది. ఉద్యానవనాల కోసం రూ.18వేల కోట్లు రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా వచ్చే ఐదేళ్లలో ఎగుమతి కోసం ఉద్దేశించి 100 ఉద్యానవనాల క్లస్టర్ల ఏర్పాటు కోసం మొత్తంగా రూ.18,000 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సోమవారం రాజ్యసభలో చెప్పారు. వంటనూనెల దిగుమతి వ్యయం తగ్గించుకోవడంతోపాటు దేశీయంగా నూనెగింజల దిగుబడి పెంచేందుకు రూ.6,800 కోట్లను ఆయిల్‌సీడ్ మిషన్‌కు కేటాయిస్తున్నట్లు చౌహాన్ వెల్లడించారు. స్వాతంత్య్ర సిద్ధించాక సేద్యరంగం బాగు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందేమీలేదని వ్యాఖ్యానించారు. దీనిపై విపక్ష సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. దిగి్వజయ్‌సింగ్ వంటి కాంగ్రెస్ నేతలు మాట్లాడేందుకు ప్రయతి్నంచినా ఛైర్మన్ ధన్‌ఖడ్ అనుమతించలేదు. దీంతో విపక్ష సభ్యులు వాకౌట్‌చేశారు. -
Parliament Session: లోక్‌సభలో కులకలం
న్యూఢిల్లీ: మోదీ సర్కారుపై విపక్షనేత రాహుల్‌గాంధీ చేసిన ‘చక్రవ్యూహం’ వ్యాఖ్యల తాలూకు వేడి లోక్‌సభలో మంగళవారం కూడా కొనసాగింది. ప్రభుత్వం తరఫున మాట్లాడిన బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ వాటిని తీవ్రంగా ఖండించారు. రాహుల్ తన ప్రసంగం పొడవునా ఆరితేరిన వక్తనని నిరూపించుకునేందుకు పాకులాడారని ఎద్దేవా చేశారు. ‘‘అందుకోసం అంకుల్ శామ్ (కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా) నుంచి తెచ్చుకున్న అరువు జ్ఞానాన్ని ప్రదర్శించారు. రాహుల్ రియల్ పొలిటీషీయన్ కాదు. కేవలం వీడియోల కోసమే ప్రసంగాలిచ్చే రీల్ పొలిటీషియన్. బహుశా విపక్ష నేత (ఎల్ఓపీ) అంటే దు్రష్పచార సారథి (లీడర్ ఆఫ్ ప్రాపగాండా) అని అపార్థం చేసుకున్నట్టున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘కొందరు పేరుకు మాత్రమే హిందువులు. మహాభారతంపై వారికున్నది కూడా మిడిమిడి జ్ఞానమే’’ అంటూ రాహుల్‌ను ఠాకూర్ ఎద్దేవా చేశారు. ఆ క్రమంలో ‘తమది ఏ కులమో కూడా తెలియని వారు కులగణన కోరుతున్నారు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం రేగింది. అవి రాహుల్‌ను ఉద్దేశించినవేనంటూ విపక్ష సభ్యులంతా మండిపడ్డారు. ఒక వ్యక్తి కులం గురించి ఎలా మాట్లతాడతారంటూ సమాజ్‌వాదీ నేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ఠాకూర్ వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులంతా వెల్‌లోకి దూసుకెళ్లారు. దాంతో ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. తర్వాత రాహుల్ మాట్లాడు తూ ఠాకూర్ వ్యాఖ్యలు తనకు ఘోర అవమానమన్నారు. ‘‘దళితులు, వెనకబడ్డ వర్గాల హక్కుల కోసం ఎవరు పోరాడినా ఇలాంటి అవమానాలు భరించాల్సిందే. అందుకే నన్నెంత తిట్టినా, అవమానించినా పట్టించుకోను. క్షమాపణలూ కోరబోను. అర్జునుడు పక్షి కన్నుపైనే దృష్టి పెట్టినట్టు నా దృష్టినంతా కులగణనపైనే కేంద్రీకరించాను. పోరు ఆపబోను. విపక్ష ఇండియా కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశవ్యాప్తంగా కులగణన చేయించి తీరుతుంది’’ అని ప్రకటించారు. మీకో వైఖరే లేదు దళితులు, ఓబీసీల వెనకబాటుకు 1947 నుంచి దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెసే కారణమని ఠాకూర్ ఆరోపించారు. ఎన్ (నెహ్రూ), ఐజీ (ఇందిరాగాంధీ), ఆర్జీ1 (రాజీవ్‌గాం«దీ) అంటూ గాంధీ కుటుంబానికి చెందిన మాజీ ప్రధానులందరిపైనా విమర్శలు చేశారు. కాంగ్రెస్ దృష్టిలో ఓబీసీలు అంటే ఓన్లీ బ్రదర్–ఇన్–లా కమీషన్ అంటూ రాహుల్ బావ రాబర్ట్ వద్రాను ఉద్దేశించి ఆరోపణలు గుప్పించారు. ‘‘కులగణనపై కాంగ్రెస్‌కు ఓ వైఖరంటూ ఉందా? రాహుల్ కులగణన కావాలంటున్నారు. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ మాత్రం ఓబీసీలకు రిజర్వేషన్లను వ్యతిరేకించారు. బోఫోర్స్ మొదలుకుని కామన్వెల్త్ క్రీడలు, 2జీ, గడ్డి, యూరి యా, బొగ్గు, నేషనల్ హెరాల్డ్... ఇలా కాంగ్రెస్ హయాంలో జరిగిన కుంభకోణాలకు అంతే లేదు’’ అంటూ దుయ్యబట్టారు. -
Union Budget 2024-25: ఉపాధికి ఊతం.. ధరలకు కళ్లెం!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో వృద్ధి రేటు అంచనాలను ప్రభుత్వం అచితూచి నిర్ధేశించింది. స్థూలదేశీయోత్తత్తి (జీడీపీ) వృద్ధి 6.5–7 శాతం స్థాయిలో ఉండొచ్చని ఆర్థిక సర్వేలో లెక్కగట్టింది. ఉపాధి కల్పనను పెంచాల్సిన అవసరం ఉందని కూడా నొక్కిచెప్పింది. ధరాభారంతో అల్లాడుతున్న పేదలు, అల్పాదాయ వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీ లేదా కూపన్ల రూపంలో నిర్ధిష్టంగా ఆర్థిక తోడ్పాటు కల్పించాల్సిఇన అవసరం ఉందని కూడా సర్వే సూచించింది. దేశంలో తయారీ రంగానికి తోడ్పాటు అందించడంతో పాటు ఎగుమతులను పెంచాలంటే చైనా నుంచి ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెంచాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా, గతేడాది (2023–24) 8.2 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే, ఈ ఏడాది వృద్ధి రేటు అంచనాలు చాలా తక్కువగా ఉండటం విశేషం. ఆర్బీఐ నిర్దేశించిన 7.2 శాతం వృద్ధి రేటు అంచనాలతో పోలి్చనా సర్వేలో వృద్ధి అంచనా తగ్గింది. అనిశి్చత వర్షపాతం, ప్రైవేటు రంగంలో పెట్టుబడుల మందగమనం వంటివి వృద్ధి అంచనాల తగ్గుదలకు ప్రధాన కారణంగా సర్వే పేర్కొంది. ‘భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వృద్ధి బాటలో పయనిస్తోంది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ సవాళ్లన్నింటినీ దీటుగా ఎదుర్కొంటోంది’ అని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సర్వే ముందుమాటలో పేర్కొన్నారు. కాగా, నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడం ద్వారా మధ్యకాలం పాటు నిలకడగా 7% వృద్ధి రేటు కొనసాగవచ్చని సర్వే తేల్చిచెప్పింది.కార్మిక సంస్కరణలు వేగవంతం... కేంద్రంలో వరుసగా మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కారు 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రైవేటు పెట్టుబడులను పెంచడం, చిన్న–మధ్య తరహా వ్యాపారాలకు చేయూతనందించడం, సాగును లాభసాటిగా మార్చేలా వ్యవసాయ సంస్కరణలు, వాతావరణ మార్పుల సమస్యను ఎదుర్కొనేందుకు వనరుల సమీకరణ, ఆర్థిక అసమానాతలను తగ్గించడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని పూడ్చాలని కూడా సర్వే నొక్కిచెప్పింది. దేశంలో ఉద్యోగ కల్పనకు మరింత సానుకూల వాతావరణాన్ని సృష్టించాలంటే కార్మిక సంస్కరణల అమలును వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొంది. ‘దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అనుగుణంగా 2030 నాటికి వ్యవసాయేతర రంగంలో ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను కలి్పంచాల్సి ఉంటుంది’ అని సర్వే తెలిపింది. చైనా పెట్టుబడులు పెరగాలి... భారత్ ఎగుమతులు, దేశీ తయారీ రంగం మరింత పుంజుకోవాలంటే, చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరగాలని, లేదంటే చైనా సరఫరా వ్యవస్థతో భారత్ అనుసంధానం కావాల్సి ఉంటుందని సర్వే అభిప్రాయపడింది. మరోపక్క, చైనా నుంచి దేశంలోకి దిగుమతులు తగ్గాలని కూడా పేర్కొంది. ‘అమెరికా తదితర కీలక మార్కెట్లకు భారత్ ఎగుమతులు భారీగా పెరగాలంటే చైనా పెట్టుబడులపై మనం మరింత దృష్టి సారించాలి. తూర్పు ఆసియా దేశాలు గతంలో ఇదే విధంగా లబ్ధి పొందాయి’ అని సర్వే తెలిపింది. 2020లో గాల్వాన్‌లో చోటు చేసుకున్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా భారత్ టిక్‌టాక్, యూసీ బ్రౌజర్‌తో సహా 200 చైనా మొబైల్ యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా చైనా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం బీవైడీ భారీ పెట్టుబడి ప్రతిపాదనలను కూడా తిరస్కరించింది. 2000–2024 మధ్య భారత్ అందుకున్న మొత్తం ఎఫ్‌డీఐలలో చైనా కేవలం 0.37% (2.5 బిలియన్ డాలర్లు) వాటాతో 22 స్థానంలో ఉంది. కాగా, కీలక ఖనిజాల విషయంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సర్వే స్పష్టం చేసింది.పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీవడ్డీరేట్ల నిర్ణయంలో ఆహార ధరలను పక్కనబెట్టండి... ఆర్బీఐకి సర్వే సూచన వడ్డీ రేట్లను నిర్ణయించడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆహార ద్రవ్యోల్బణాన్ని చూడటం మానేయాలని ఆర్థిక సర్వే సూచించింది. అధిక ఆహార ధరలను ఎదుర్కోవటానికి పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీని ప్రభుత్వం అన్వేíÙంచాలని సర్వే పేర్కొంది. ‘‘భారతదేశ ద్రవ్యోల్బణ లక్ష్య ఫ్రేమ్‌వర్క్.. ఫుడ్ ఆరి్టకల్స్‌ను పక్కనబెట్టాలి. అధిక ఆహార ధరలు చాలా సందర్భాల్లో సరఫరాలకు సంబంధించిన సమస్యే తప్ప, డిమాండ్ ప్రేరితం కాదు’’ అని ఆర్థిక సర్వే పేర్కొంది. మధ్య, దీర్ఘకాలిక ద్రవ్యోల్బణం అవుట్‌లుక్ ధరల యంత్రాంగం పటిష్టత, మార్కెట్ అంశాలు, నిత్యావసారాల దేశీయ ఉత్పత్తి, దిగుమతులు వంటి అంశాలపై ఆధారపడుతుందని వివరించింది. అననుకూల వాతావరణం, తక్కువ రిజర్వాయర్ స్థాయిలు, పంట నష్టం వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేసి, గత రెండేళ్లలో ఆహార ధరలను పెంచడానికి దారితీసిందని కూడా సర్వే పేర్కొంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు–రెపో (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ఆర్బీఐ వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంపై ఆధారపడే సంగతి తెలిసిందే. ప్లస్ 2 లేదా మైనస్ 2తో ఇది 4 శాతంగా ఉండాలే చూడాలని ఆర్బీఐకి కేంద్రం నిర్ధేశిస్తోంది. ఈ సూచీలో ఫుడ్ ఆరి్టకల్స్ ఒక భాగం. రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం లక్ష్యాన్ని సాధించడంలో ఆహార ధరలు ఒడిదుడుకులు తీవ్ర అడ్డంకిగా మారుతున్నాయి. ఇదే అంశంపై ఆందోళన వ్యక్తంచేస్తూ ఆర్బీఐ 2023 ఫిబ్రవరి నుంచి యథాతథ వడ్డీరేట్ల వ్యవస్థను కొనసాగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. దీనిని పక్కనపెట్టి... రుణ రేట్లను తగ్గిస్తే ఆ నిర్ణయం వృద్ధికి దోహదపడుతుందన్నది సర్వే అభిప్రాయం. ప్రయివేట్ రంగ పెట్టుబడులు కీలకం ప్రయివేట్ రంగ ఫైనాన్సింగ్, కొత్త వర్గాల నుంచి వనరుల సమీకరణ దేశీయంగా నాణ్యమైన మౌలిక సదుపాయాల(ఇన్ఫ్రా) నిర్మాణానికి కీలకమని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పాలసీలు, సంస్థాగత మద్దతుతోపాటు.. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు సైతం ప్రధాన పాత్ర పోషించవలసి ఉంటుంది. మౌలిక రంగంలోని వివిధ విభాగాలకు పెట్టుబడులు సమకూర్చడంలో గణాంకాలు, మార్గదర్శకాలు తదితర నివేదికలు అత్యవసరం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కున్న డిమాండ్‌ను అంచనా వేయడం, ఉపవిభాగాల కల్పనలో సౌకర్యాల వినియోగం వంటి అంశాలకు ప్రస్తుత డేటాబేస్ సామర్థ్యం సరిపోదు. ఆర్థికపరమైన ఒత్తిడి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏకీకృత ప్రణాళికల నేపథ్యంలో ఆచరణసాధ్యమైన ప్రాజెక్టులను చేపట్టి పూర్తిచేయవలసి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం కీలకమవుతుంది.రైల్వేల సామర్థ్యం పెరగాలి.. సామర్థ్యాలను వేగంగా పెంచుకోవడం, కార్యకలాపాలను ఆధునీకరించుకోవడం, ఇంధన ఆదా తదితర అంశాలపై రైల్వేస్ ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎకనమిక్ సర్వే సూచించింది. ఇందుకు అనుగుణంగా సరకు రవాణా కోసం ప్రత్యేక కారిడార్లు, హై స్పీడ్ రైళ్లు, వందే భారత్.. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ .. ఆస్థా స్పెషల్ ట్రెయిన్స్ వంటి ఆధునిక ప్యాసింజర్ సరీ్వస్ రైళ్లు, అధిక సామర్థ్యం ఉండే రైల్వే కోచ్‌లు, లాస్ట్–మైల్ రైల్ లింకేజీలు మొదలైన వాటిపై ఇన్వెస్ట్ చేయాలని పేర్కొంది. లాజిస్టిక్స్ వ్యయాలను, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు రైల్వేస్ 3 ప్రధాన కారిడార్ల రూపకల్పనలో ఉందని వివరించింది. ట్రాఫిక్ సాంద్రత అధికంగా ఉండే కారిడార్లు, ఇంధన.. ఖనిజ.. సిమెంట్ కారిడార్లు, రైల్ సాగర్ (పోర్టు కనెక్టివిటీ) కారిడార్లు వీటిలో ఉన్నాయని పేర్కొంది.పర్యాటక రంగంలో అవకాశాలు అపారం..పర్యాటక రంగం కలి్పస్తున్న అవకాశాలను సొంతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే సూచించింది. కరోనా విపత్తు తర్వాత పర్యాటక రంగం వేగంగా కోలుకోవడాన్ని ప్రస్తావించింది. ‘2023లో 92 లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్‌ను సందర్శించారు. క్రితం ఏడాదితో పోల్చి చూస్తే 43.5 శాతం ఎక్కువ. భారత పర్యాటక రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచంలో 39వ ర్యాంక్ సొంతం చేసుకుంది. పర్యాటకం ద్వారా రూ. 2.3 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించింది. ఇది క్రితం ఏడాదితో పోలి్చతే 65.7% అధికం’అని సర్వే తెలిపింది. కృత్రిమ మేథ (ఏఐ) భారత సేవల ఎగుమతులపై ప్రభావం చూపిస్తుందన్న ‘క్యాపిటల్ ఎకనమిక్స్’ నివేదికను ప్రస్తావిస్తూ.. ఉపాధి కల్పన విషయంలో తక్కువ నైపుణ్యాలపై ఆధారపడిన పర్యాటకం ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తోందని పేర్కొంది. వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లు కీలకందేశీ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లు కీలకంగా మారుతున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. టెక్నాలజీ, ఇన్నొవేషన్, డిజిటైజేషన్ దన్నుతో మూలధన నిర్మాణం, పెట్టుబడుల విస్తరణలో క్యాపిటల్ మార్కెట్ల వాటా బలపడుతోంది. అంతేకాకుండా దేశీ స్టాక్ మార్కెట్లు ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక విపత్కర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ రిసు్కలు, వడ్డీ రేట్లుసహా కమోడిటీ ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలోనూ దేశీ క్యాపిటల్ మార్కెట్లు గతేడాది(2023–24) ఉత్తమ పనితీరు చూపిన వర్ధమాన మార్కెట్లలో ఒకటిగా నిలిచాయి. ఈ కాలంలో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇన్వెస్టర్లకు భారీ(25%కిపైగా) రిటర్నులు అందించాయి. ఇందుకు స్థూల ఆర్థిక పరిస్థితుల స్థిరత్వం, దేశీ ఇన్వెస్టర్ల బలిమి తోడ్పాటునిచి్చనట్లు సీతారామన్ పేర్కొన్నారు. 2024 మే నెలలో ఈక్విటీ మార్కెట్ల విలువ 5 ట్రిలియన్ డాలర్ల(రూ. 415 లక్షల కోట్లు)కు చేరింది. ప్రస్తుతం 9.5 కోట్లమంది రిటైల్ ఇన్వెస్టర్లు ప్రత్యక్షంగా 2,500 లిస్టెడ్ కంపెనీలలో 10% వాటాను కలిగి ఉన్నారు. గతేడాది ప్రైమరీ మార్కెట్ల ద్వారా రూ. 10.9 లక్షల కోట్ల మూలధన ఏర్పాటుకు సహకారమందింది.వ్యవసాయంలో సత్వర సంస్కరణలు వ్యవసాయ రంగంలో సంస్కరణలను వెంటనే చేపట్టాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. లేదంటే ఈ రంగంలో నెలకొన్న వ్యవస్థీకృత సమస్యలు దేశ వృద్ధికి అడ్డుపడతాయని విధానకర్తలను హెచ్చరించింది. తూర్పు ఆసియా దేశాలు, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలతో పోలి్చతే.. దేశ వ్యవసాయరంగం సామర్థ్యాలను ఇంకా పూర్తి స్థాయిలో వెలుగులోకి తేవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు వ్యవసాయరంగ సామర్థ్యాలను ఉపయోగించుకోవాలని సూచించింది. ఈ రంగంపై దేశవ్యాప్తంగా చర్చలు అవసరమని నాగేశ్వరన్ పిలుపునిచ్చారు. ‘‘దేశ వ్యవసాయ రంగం ప్రస్తుతం ఎలాంటి సంక్షోభంలో లేదు. కాకపోతే నిర్మాణాత్మక మార్పు అవసరం. ఎందుకంటే వాతావరణ మార్పులు, నీటి సమస్య రానున్న రోజుల్లో పెద్దవి కానున్నాయి’’అని సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుతం రైతులకు ఎరువులు, విద్యుత్, ఆదాయపన్ను, మద్దతు ధరల పరంగా సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ ప్రస్తుత విధానాలను తిరిగి సమీక్షించా లని అభిప్రాయపడింది. టెక్నాలజీ ఆధునికీకరణ, మార్కెటింగ్ మార్గాలను మెరుగుపరచడం, సాగులో ఆవిష్కరణలు, వ్యవసాయం–పరిశ్రమల మధ్య అనుసంధానత పెంపు దిశగా సంస్కరణలను సూచించింది. ఆర్థిక సర్వే హైలైట్స్..→ అసాధారణరీతిలో వరుసగా మూడోసారి ప్రజలు మోదీ 3.0 సర్కారుకు పట్టం కట్టడం దేశంలో రాజకీయపరమైన, విధానపరమైన స్థిరత్వాతనికి అద్దం పడుతోంది. → అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ దేశీయ వృద్ధి చోదకాలు 2023–24లో ఆర్థిక పురోగతికి దన్నుగా నిలిచాయి. → భౌగోళిక, రాజకీయ సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన, స్థిరమైన ప్రగతిని సాధిస్తోంది. → కరోనా మహమ్మారి తదనంతరం దేశీయ వ్యాపార, వాణిజ్య రంగం రికవరీ కోసం ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుంది. → వాణిజ్యం, పెట్టుబడులు, వాతావారణ మార్పుల వంటి ప్రపంచ సమస్యల విషయంలో వివిధ దేశాలతో ఒప్పందాలు క్లిష్టతరంగా మారాయి. → స్వల్పకాలానికి ద్రవ్యోల్బణం అంచనాలు తగ్గుముఖ ధరోణిలోనే ఉన్నప్పటికీ, పప్పుధాన్యాల కొరత , ధరల ఒత్తిడి నిలకడగా కొనసాగుతోంది. → సాధారణ వర్షపాతం, దిగుమతులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ధరలు శాంతించడంతో ఆర్బీఐ సానుకూల ద్రవ్యోల్బణం అంచనాలకు దన్నుగా నిలుస్తోంది. → అధిక ఆహార ధరలతో అల్లాడుతున్న పేదలు, అల్పాదాయ వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీలు, నిర్దిష్ట కొనుగోళ్లకు కూపన్ల రూపంలో కొంతకాలం పాటు ప్రయోజనాలను అందించాలి. → భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానంపై ప్రభావం చూపొచ్చు. → భారతదేశ ఆర్థిక సేవల రంగం పటిష్టమైన అవకాశాలున్నాయి. ఈ రంగంలో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా, దేశీయంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. → కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు పటిష్టంగా ఉండటంతో ప్రైవేటు పెట్టుబడులు మరింత పుంజుకోనున్నాయి. → పన్ను నిబంధలనను సరళతరం చేయడం, వ్యయ నియంత్రణ, డిజిటైజేషన్ వంటివి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను సాధించేందుకు దోహదం చేస్తున్నాయి. → భారత వృద్ధి పథానికి క్యాపిటల్ మార్కెట్లు కీలకంగా నిలుస్తున్నాయి. ప్రపంచ రాజకీయ, ఆర్థిక షాక్‌లకు మన మార్కెట్లు ఎదురొడ్డి నిలుస్తున్నాయి. → చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) జోరందుకోవడం వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థలు మెరుగుపరచడంలో, ఎగుమతులను పెంచుకోవడంలో భారత్‌కు దన్నుగా నిలుస్తుంది. → 2024లో దేశంలోకి వచి్చన రెమిటెన్సులు (ప్రవాసులు స్వదేశానికి పంపిన నిధులు) 3.4 శాతం వృద్ధితో 124 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ఈ మొత్తం 129 బిలియన్ డాలర్లను తాకనుంది.గ్రీన్ ఎనర్జీ @ రూ. 30 లక్షల కోట్ల పెట్టుబడులు దేశీయంగా 2024–2030 మధ్య కాలంలో పునరుత్పాదక ఇంధన (ఆర్ఈ) రంగంలో రూ. 30.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాగలవని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇందుకోసం స్థల సమీకరణ సమస్యలను పరిష్కరించుకోవడం, సానుకూల నిబంధనలతో నిధులను సమీకరించుకోవడం కీలకమని పేర్కొంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాలను సాధించే క్రమంలో వివిధ విభాగాలకు ఆర్థికంగా లబ్ధి చేకూరగలదని వివరించింది. మరోవైపు, ఉద్గారాల విషయంలో 2070 నాటికి తటస్థ స్థాయికి చేరుకోవాలంటే భారత్‌కు ఏటా సగటున 28 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని సర్వే తెలిపింది. నిధులను సమకూర్చుకోవడమనేది ఒక అసాధారణ సవాలు కాగలదని వివరించింది.14 శాతం ఐఫోన్ల తయారీ ఇక్కడే ఎల్రక్టానిక్స్ తయారీలో అంతర్జాతీయంగా భారత్ తన వాటాను పెంచుకుంటున్నట్టు ఆర్థిక సర్వే తెలిపింది. 2023–24లో స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ 14% ఐఫోన్లను భారత్‌లోనే అసెంబుల్ చేసినట్టు వెల్లడించింది. దేశ ఎలక్ట్రానిక్స్ తయారీ 2014 తర్వాత నుంచి గణనీయమైన వృద్ధిని చూస్తోందంటూ, 2021–22లో అంతర్జాతీయంగా మన వాటా 3.7%. దేశ జీడీపీలో 4% వాటాను ఆక్రమించింది. ఎల్రక్టానిక్స్ ఎగుమతుల్లో మొబైల్ ఫోన్ల విభాగం అధిక వృద్ధిని చూస్తోందని, అమెరికాకు మొబైల్ ఫోన్ల ఎగుమతులు 2022–23లో 2.2 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023–24లో 5.7 బిలియన్ డాలర్లకు దూసుకుపోయినట్టు వివరించింది. 2022–23లో దేశీయంగా ఎల్రక్టానిక్స్ తయారీ రూ.8.22 లక్షల కోట్లకు చేరితే, ఎగుమతులు రూ.1.9 లక్షల కోట్లకు పెరిగినట్టు తెలిపింది.ఏటా 78 లక్షల కొలువులు సృష్టించాలి.. కార్మిక శక్తి పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయేతర రంగాల్లో 2030 నాటికి ఏటా దాదాపు 78.5 లక్షల ఉద్యోగాలను కలి్పంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఈ విషయంలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొంది. ఆర్థిక వృద్ధి అనేది ఉద్యోగాల కల్పన కన్నా జీవనోపాధి కల్పించడంపై ఆధారపడి ఉంటుందని సర్వే వివరించింది. వ్యవసాయ రంగంలో కార్మిక శక్తి 2023లో 45.8 శాతం స్థాయి నుంచి 2047 నాటికి 25 శాతానికి తగ్గుతుందని తెలిపింది. ఇదంతా వ్యవసాయేతర రంగాల వైపు మళ్లు తుంది కాబట్టి ఆ మేరకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఏర్పడుతుందని సర్వే పేర్కొంది. పీఎల్ఐ స్కీములు, మిత్రా టెక్స్టైల్ స్కీము మొదలైనవి ఇందుకు కొంత తోడ్పడగలవని తెలిపింది. స్టాఫింగ్ కంపెనీల ద్వారా తాత్కాలిక సిబ్బంది నియామకాలు పెరుగుతున్నందున అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు దీన్నొక మాధ్యమంగా ఉపయోగించుకోవచ్చని వివరించింది. తయారీ రంగ శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి సాధన దిశగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు వ్యాపారసంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకాలను పునఃసమీక్షించాలని సూచించింది. వర్కర్ల తొలగింపునకు కాకుండా ఉద్యోగాల కల్పనకు కృత్రిమ మేథ(ఏఐ)రెని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై కార్పొరేట్లు మరింతగా దృష్టి పెట్టాలని ముందుమాటలో ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. వికసిత భారత్ వైపు పయనంవికసిత భారత్‌ను నిర్మించే దిశగా ముందుకు సాగుతున్నందున ప్రస్తుత పటిష్టతలతోపాటు మరింత పురోగతికి అవకాశాలు ఉన్న మార్గాలను సర్వే గుర్తించింది. ఆర్థిక సర్వే మన ఆర్థిక వ్యవస్థ ప్రబలమైన పటిష్టతలతను హైలైట్ చేస్తోంది. మా ప్రభుత్వం తీసుకువచి్చన వివిధ సంస్కరణల ఫలితాలను కూడా సుస్పష్టం చేస్తోంది. – ఎక్స్ పోస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అంచనాలు సుసాధ్యం7 శాతం వృద్ధి రేటు సాధన భారత్‌కు తేలికే. మేము నిరాశావాదులం కాదు. రుతుపవనాల పురోగతి సవాళ్లను కూడా మేము పరిగణనలోకి తీసుకుంటున్నాము. ఫైనాన్షియల్ రంగం అవుట్‌లుక్ పటిష్టంగా కనబడుతోందని, పొదుపులను ఫైనాన్షియల్ మార్కెట్లవైపునకు మళ్లించడాన్ని చూస్తే.. భారత్ కుటుంబాలు కష్టాల్లో లేవన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. – వి. అనంత నాగేశ్వరన్, సీఈఏ పార్లమెంట్లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నేపథ్యంలో బడ్జెట్ బృందంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సహాయమంత్రి పంకజ్ చౌదరి -
నేటి నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 12వ తేదీ వరకు 19 రోజులపాటు కొనసాగుతాయి. సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా, తొలి రోజు పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ నియోజకవర్గం నుంచి గెలిచిన శత్రుఘ్న సిన్హా లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024–25 సామాజిక, ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 6 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. జమ్మూకశీ్మర్ బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈసారి వాడీవేడిగానే చర్చలు 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓ వైపు సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు వివిధ కీలక అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. నీట్–యూజీ పేపర్ లీకేజీ, యూపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు, రైల్వే భద్రత, డిప్యూటీ స్పీకర్ పదవి, నిరుద్యోగం, అగి్నవీర్ పథకం, ఆర్థిక వ్యవస్థ, కేంద్ర దర్యాప్తు సంస్థల దురి్వనియోగం, మణిపూర్‌లో శాంతి భద్రతలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయానికొచ్చాయి. ప్రత్యేక హోదాపై గళం విప్పిన వైఎస్సార్సీపీ కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కేంద్ర మంత్రులు రాజ్నా«థ్ సింగ్, కిరణ్ రిజిజు, జేపీ నడ్డా నేతృత్వంలో నిర్వహించిన ఈ భేటీకి ఆర్జేడీ, జేడీయూ, బీజేడీ, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, శివసేన తదితర 44 పార్టీల సభాపక్ష నేతలు హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పారీ్టలు సహకరించాలని కేంద్ర మంత్రులు కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని వైఎస్సార్సీపీ రాజ్యసభాపక్ష నేత విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రతిపక్ష నేతలపై దమనకాండ సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జేడీ(యూ), ఒడిశాకు ప్రత్యేక హోదా కలి్పంచాలని బిజూ జనతాదళ్(బీజేడీ) సైతం తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాయి. నీట్–యూజీ పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్లో మాట్లాడేందుకు విపక్షాలకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ తరఫున హాజరైన గౌరవ్ గొగోయ్ కోరారు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేశారు. ఆరు బిల్లులివే.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆరు కొత్త బిల్లులు ప్రవేశపెట్టనుంది. 90 ఏళ్ల క్రితం నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో భారతీయ వాయుయాన్ విధేయక్–2024ను తీసుకొస్తోంది. విమానయాన రంగంలో సులభతర వాణిజ్యానికి పెద్దపీట వేయనున్నారు. అలాగే ఫైనాన్స్ బిల్లు, విపత్తు నిర్వహణ(సవరణ) బిల్లు, బాయిలర్స్ బిల్లు, కాఫీ(ప్రోత్సాహం, అభివృద్ధి) బిల్లు, రబ్బర్(ప్రోత్సాహం, అభివృద్ధి) బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. హోదాపై టీడీపీ మౌనమెందుకో?: జైరాం అఖిలపక్ష సమావేశంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీలో ఆంధ్రప్రదేశ్, బిహార్‌కు ప్రత్యేక హోదా కలి్పంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జేడీ(యూ) డిమాండ్ చేశాయి. విచిత్రంగా తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ అంశంపై మౌనం దాల్చింది’’ అని పేర్కొన్నారు. -
Mallikarjun Kharge: లీకేజీలు, ప్రమాదాలు, దాడులు... ఇదే మోదీ ‘పిక్చర్’!
న్యూఢిల్లీ: ‘‘పదేళ్ల తన పాలన కేవలం ట్రైలరేనని, అసలు సినిమా ముందుందని లోక్‌సభ ఎన్నికల ప్రచారం పొడవునా మోదీ పదేపదే చెప్పుకున్నారు. ఆయన సినిమా ఎలా ఉండనుందో ఈ నెల రోజుల పాలన చెప్పకనే చెప్పింది. పేపర్ లీకేజీలు, కశీ్మర్లో ఉగ్ర దాడులు, రైలు ప్రమాదాలు, దేశమంతటా టోల్ ట్యాక్సుల పెంపు, బ్రిడ్జిలు, విమానాశ్రయాల పై కప్పులు కూలడాలు, చివరికి మోదీ ఎంతో గొప్పగా చెప్పుకున్న అయోధ్య రామాలయంలో కూడా లీకేజీలు... ఇదే మోదీ చూపిస్తానని చెప్పిన సినిమా!’’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. గంటన్నర పాటు సాగిన ప్రసంగంలో మోదీ ప్రభుత్వాన్ని అంశాలవారీగా ఏకిపారేశారు. సామాన్యుల కష్టాలను పట్టించుకోకుండా మోదీ కేవలం ‘మన్ కీ బాత్’కు పరిమితమయ్యారంటూ చురకలు వేశారు. గతంలో ఏ ప్రధాని చేయని విధంగా ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలతో సమాజాన్ని విభజించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇటీవలి పేపర్ లీకేజీలతో 30 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడిందని ఖర్గే అన్నారు. మణిపూర్ హింసాకాండ వంటి దేశం ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావనకు కూడా నోచుకోలేదంటూ ఆక్షేపించారు. విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే క్రమంలో ఆరెస్సెస్‌పై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు, విమర్శలు చేశారు. ‘‘ఆరెస్సెస్ విధానం దేశానికి చాలా ప్రమాదకరం. వర్సిటీలతో పాటు అన్ని విద్యా సంస్థల్లో వీసీలు, ప్రొఫెసర్ల నియామకాలపై దాని ప్రభావం ఉంటోంది’’ అంటూ ఆక్షేపించారు. ఆ వ్యాఖ్యలను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఆరెస్సెస్ సభ్యుడు కావడమే నేరమన్నట్టుగా మీ మాటలున్నాయి. ఆ సంస్థలో ఎందరో మేధావులున్నారు. అది జాతి నిర్మాణానికి అవిశ్రాంతంగా పాటుపడుతోంది. అలాంటి సంస్థను నిందిస్తున్నారు మీరు’’ అన్నారు. మోదీపై, ఆరెస్సెస్‌పై ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.కూర్చుని మాట్లాడతా: ఖర్గే అలాగే కానీయండి: ధన్‌ఖడ్ విపక్ష సభ్యుల తీవ్ర విమర్శలు, అధికార పక్ష ప్రతి విమర్శలతో వేడెక్కిపోయిన రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే వ్యాఖ్యలు, చైర్మన్ స్పందన నవ్వులు పూయించాయి. గంటన్నర పాటు ప్రసంగించిన ఖర్గే, తనకు మోకాళ్ల నొప్పులున్నందున కూర్చుని మాట్లాడేందుకు అనుమతి కోరారు. ‘మీకెలా సౌకర్యంగా ఉంటే అలా చేయండి. ఇబ్బందేమీ లేదు’ అంటూ ధన్‌ఖడ్ బదులిచ్చారు. కానీ కూర్చుని చేసే ప్రసంగం నిలబడి చేసినంత ప్రభావవంతంగా ఉండదని ఖర్గే అనడంతో సభ్యులంతా గొల్లుమన్నారు. ఆ విషయంలో మీకు వీలైనంత సా యం చేస్తా లెమ్మని ధన్‌ఖడ్ బదులివ్వడంతో సోనియాతో సహా అంతా మరోసారి నవ్వుకున్నారు. మరో సందర్భంలో ‘‘నేను దక్షిణాదికి చెందిన వాడిని. కనుక ద్వివేది, త్రివేది, చతుర్వేది పదాలు నన్ను చాలా అయోమయపరుస్తాయి’’ అని ఖర్గే అనడంతో ‘కావాలంటే వాటిపై ఓ అరగంట పాటు ప్రత్యేక చర్చ చేపడదాం’ అని ధన్‌ఖడ్ బదులిచ్చారు. దాంతో సభంతా మరోసారి నవ్వులతో దద్దరిల్లిపోయింది. -
ప్రొటెం స్పీకర్‌పై రగడ
న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ తొలి సమావేశాలకు ముందే అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం వేడెక్కుతోంది. ప్రొటెం స్పీకర్ ఎంపిక తాజా వివాదానికి కారణమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడుసార్లు ఎంపీ అయిన భర్తృహరి మహతాబ్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. బీజేపీ పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కిందని ఆరోపించింది. తమ పార్టీ ఎంపీ కె.సురేశ్ అందరికంటే సీనియర్ అని, ఆయన ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారని.. సంప్రదాయం ప్రకారం నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ప్రొటెం స్పీకర్‌గా సురేశ్ ను నియమించాల్సిందని వాదిస్తోంది. దళితుడు కాబట్టే సురేశ్ ను బీజేపీ పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించింది. వాస్తవానికి 18వ లోక్‌సభలో కె.సురేశ్. వీరేంద్ర కుమార్‌లు ఇద్దరు ఎనిమిదేసి సార్లు ఎంపికైన, అందరికంటే సీనియర్ సభ్యులు. అయితే వీరేంద్ర కుమార్ కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో.. సురేశ్ ప్రొటెం స్పీకర్ కావాలి. కానీ బీజేపీ ఏడుసార్లు ఎంపీ అయిన మహతాబ్‌ను ఎంచుకుంది. ఆయనకు సహాయకారిగా ఉండేందుకు కె.సురేశ్, టీఆర్ బాలు (డీఎంకే), సుదీప్ బందోపాధ్యాయ్ (టీఎంసీ), రాధామోహన్ సింగ్, ఫగ్గన్‌సింగ్ కులస్తే (బీజేపీ)లతో ఛైర్ పర్సన్ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. బీజేపీ వైఖరికి నిరసనగా ఛైర్ పర్సన్ ప్యానెల్‌కు దూరంగా ఉండే అంశాన్ని విపక్షాలకు చెందిన కె.సురేశ్, టి.ఆర్.బాలు, సుదీప్ బందోపాధ్యాయ్‌లు పరిశీలిస్తున్నారని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. దళితుడు కాబట్టే సురేశ్ ను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయలేదనే వాదనను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కొట్టిపారేశారు. సురేష్ ఎనిమిదిసార్లు ఎంపిక అయినప్పటికీ.. ఆయన వరుసగా ఎన్నికైన ఎంపీ కాదని, 1998, 2004 లోక్‌సభల్లో ఆయన సభ్యుడు కాదని పేర్కొన్నారు. మరోవైపు మహతాబ్ ఏడుసార్లు వరుసగా ఎంపీగా గెలిచారని, అందుకే ఆయన్ను ప్రొటెం స్పీకర్‌గా ఎంచుకున్నామని వాదించారు. ప్రొటెం స్పీకర్ ఎంపికపై అబద్ధాలు చెబుతూ కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే గిరిజన మంత్రి కిరణ్ రిజిజును అవమానిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎదురుదాడికి దిగారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖను చూస్తున్న తొలి గిరిజన మంత్రిని అయినప్పటికీ కాంగ్రెస్ అబద్ధాలు, బెదిరింపులకు లొంగబోనని రిజిజు అన్నారు. ‘నిబంధనలను పాటిస్తానని, ప్రధాని నరేంద్ర మోదీ ఇచి్చన.. సబ్కా సాత్, సబ్కా వికాస్ నినాదాన్ని అనుసరిస్తారని రిజిజు పేర్కొన్నారు. సురేష్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం పార్లమెంటరీ సంప్రదాయాలను కాలరాసే ప్రయత్నమేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. బీజేపీని 240 సీట్లకే ప్రజలు పరిమితం చేసినా కాషాయపార్టీ ప్రజాస్వామ్యం, సంప్రదింపులు, పార్లమెంటరీ సంప్రదాయాలు, ప్రతిపక్షాలు అంటే ఏమిటనే దానిని అర్ధం చేసుకోవడం లేదని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. నిరంకుశ బీజేపీ విపక్ష అభ్యరి్థని ప్రొటెం స్పీకర్‌గా కూడా చూడాలనుకోవడం లేదన్నారు. అందుకే ఫిరాయింపుదారు భర్తృహరి మహతాబ్‌ను ఎంచుకుందన్నారు. మహతాబ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేడీ నుంచి బీజేపీలోకి మారి.. ఆ పార్టీ టికెట్‌పై కటక్ నుంచి గెలుపొందారు.అందరి దృష్టీ స్పీకర్ ఎన్నికపైనే...18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలసిందే. 24, 25 తేదీల్లో నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. అనంతరం 26న జరిగే స్పీకర్ ఎన్నికపై అందరి దృష్టీ నెలకొంది. -
330 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాం: అమిత్ షా
Updates: ►లోక్ సభ సమావేశాలు నిరవధిక వాయిదా ఢిల్లీ: రామమందిర ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు ఫలించిన రోజని తెలిపారు. ప్రజలు ఎలా జీవించాలో చేసి చూపించిన ఆదర్శ పురుషుడు రాముడని పేర్కొన్నారు. రాముడు ఒక మతానికే చెందిన దేవుడు కాదు అని తెలిపారు. #WATCH | Norwegian professional football manager and former player Ole Gunnar Solskjær arrives in Mumbai. pic.twitter.com/5hEj5QBg2a — ANI (@ANI) February 10, 2024 రాముడు లేని భారతదేశాన్ని ఊహించలేమని.. మోదీ ఆధ్వర్యంలో 330 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెరదించామని తెలిపారు. బీజేపీ, మోదీ ఏం హామీ ఇచ్చారో అది నెరవేర్చామని చెప్పారు. భారత సంస్కృతి రాముడితో ముడిపడి ఉందని అన్నారు. రామ మందిర నిర్మాణంలో అందరం ఐక్యమత్యంగా వ్యవహరించామని తెలిపారు. Union Home Minister Amit Shah while addressing Lok Sabha on the Ram Temple resolution, says, "22 January will be a historic day for the years to come...It was the day that fulfilled the hopes & aspirations of all Ram devotees..." pic.twitter.com/FYXVhAKVwV — ANI (@ANI) February 10, 2024 పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు నేడు చివరిరోజు. ఉభయ సభల్లో రామమందిరంపై కేంద్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో ఈ తీర్మానాన్ని బీజేపీ ఎంపీలు రూల్ 193 కిందకు తీసుకురానున్నారు. సత్యపాల్ సింగ్, ప్రతాప్ చంద్ర సారంగి, సంతోష్ పాండే రాజ్యసభలో, మోషన్ రూల్ 176 కింద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. Budget Session | Rajya Sabha will later commence a short-duration discussion on 'Shree Ram Mandir Ke Etihasic Nirman aur Pran Pratishta' (Historic construction of Shree Ram Temple and Pran Pratishta). BJP MPs Sudhanshu Trivedi and Rakesh Sinha are to raise the discussion on the… — ANI (@ANI) February 10, 2024 బీజేపీ ఎంపీలు కె. లక్ష్మణ్, సుధాన్షు త్రివేది, రాకేష్ సిన్హా రూల్ 193 ప్రకారం లోక్‌సభలో రామాలయం నిర్మాణంపై తీర్మాణం చేయనున్నారు. బీజేపీ ఎంపీలు సత్యపాల్ సింగ్ , శ్రీకాంత్ షిండే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టపై చర్చను లేవనెత్తనున్నారు. ఉభయసభలలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు. Budget Session | A short-duration discussion on White Paper on the Indian Economy is scheduled in the Rajya Sabha today. BJP legislators Sushil Kumar Modi and Prakash Javadekar will raise the discussion informing its impact on the lives of the people of the country. — ANI (@ANI) February 10, 2024 ఇదీ చదవండి: Ayodhya: శ్రీరామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య! -
కాంగ్రెస్ బ్లాక్ పేపర్.. దిష్టిచుక్కగా అభివర్ణించిన ప్రధాని మోదీ
ఢిల్లీ: కాంగ్రెస్ విడుదల చేసిన 'బ్లాక్ పేపర్'ను ప్రధాని మోదీ దిష్టిచుక్కగా అభివర్ణించారు. తమ ప్రభుత్వంపై చెడుచూపు పడకుండా చూస్తుందని అన్నారు. ప్రతిపక్షాల ఇటువంటి చర్యను కేంద్ర ప్రభుత్వం కూడా స్వాగతించిందని అన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే 'బ్లాక్ పేపర్' విడుదల చేసిన తర్వాత కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం నేడు 'శ్వేతపత్రం'ను విడుదల చేయనుంది. ఇందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ 'బ్లాక్ పేపర్'ను విడుదల చేసింది. కేంద్రం ఆర్థిక వ్యవస్థపై విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతుల కష్టాలు వంటి కేంద్రం వైఫల్యాలను 'బ్లాక్ పేపర్' లో పేర్కొన్నామని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ బ్లాక్ పేపర్ విడుదల చేసిన సందర్భంగా విలేకరుల సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ.. "ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్లాక్ పేపర్ విడుదల చేస్తున్నాం. ఎందుకంటే పార్లమెంట్లో మాట్లాడినప్పుడల్లా కేంద్రం విజయాల గురించే మాట్లాడుతారు. కానీ సొంత వైఫల్యాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఆ వైఫల్యాల్ని మాట్లాడటానికి కూడా మమ్మల్ని అనుమతించరు. దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్య.. కానీ కేంద్రం ఎప్పుడూ మాట్లాడలేదు.” అని మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇదీ చదవండి: మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోదీ ప్రసంశలు -
కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం : ఎంపీ విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పానలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని వైఎస్సార్సీపీ ఎంపీ శ్రీ వి. విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజాధనాన్ని సొంత ఏటీఏంగా పరిగణిస్తుందని ఎద్దేవా చేశారు. యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాల జాబితా ఎప్పటికీ అంతం కాదని తెలిపారు. యూపీఏ దశాబ్ద పాలనలో రూ.12 లక్షల కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. బుధవారం రాజ్యసభలో మధ్యంతర బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. సానుకూలమైన అంశాలతో మధ్యంతర బడ్జెట్... ఈ బడ్జెట్లో చాలా సానుకూల అంశాలు ఉన్నాయని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. గతేడాది కంటే ఆరు శాతం అధికంగా రూ.47.65 లక్షల కోట్లు ఖర్చు చేయాలని మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించిందని, రెవెన్యూ వసూళ్ళు రూ.30.8 లక్షల కోట్లుగా అంచనా వేయగా, గతేడాది కంటే వసూళ్ళు 12% ఎక్కువగా ఉందన్నారు. మొత్తంగా, ఇది దేశంలో అభివృద్ధి, వ్యయాలకు నిధులు సమకూరుస్తుందని తెలిపారు. ద్రవ్య లోటును 5.8% నుండి 5.1%కి తగ్గించాలని ప్రభుత్వ యోచన బాగుందని ఇది ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టంగా మార్చేందుకు తోడ్పడుతుందన్నారు. కొత్త పథకాల కోసం ఆర్థిక వ్యవహారాల శాఖకు మూలధన వ్యయంగా రూ.70,449 కోట్లు కేటాయించారని, ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధిని పెంచడానికి సహాయపడుతుందన్నారు. గత రెండు దశాబ్దాల్లో పదేళ్లు కాంగ్రెస్‌వల్ల నష్టపోయామని, తదనంతర పదేళ్లలో దేశం వృద్ధి చెందిందన్నారు. 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ దుష్పరిపాలన కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందనడానికి సాక్ష్యం గణాంకాలేనని అన్నారు. కాంగ్రేసతర పాలనలోనే ఆర్థిక వ్యవస్థ భేష్... కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారత్ ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, కాంగ్రేసేతర ప్రభుత్వాల పాలనలో భారత్ యూకే, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలను అధిగమించి ప్రపంచంలోనే అయిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. కాంగ్రెస్ దుష్పరిపాలన వల్లే దేశ ఆర్థికాభివృద్ధి వెనకంజ వేసినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. గడిచిన పదేళ్లలో జరిగిన అభివృద్ధిని అప్రతిష్టపాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆర్థికవేత్తలుగా మన్ననలు పొందిన వారు భారత్ ఐదు శాతం జీడీపీ సాధిస్తే గొప్ప అని చెప్పినప్పటికీ ఇప్పటికే ఏడు శాతాన్ని దాటిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్‌ను అధికారం నుంచి తరిమికొట్టినప్పుడే దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెంది బలమైన ఆర్థిక వ్యవస్థగా మారడం యాదృచ్ఛికం కాదన్నారు. 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి... కాంగ్రెసేతేర పాలనలో ఆదాయ అసమానతలు తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయన్నారు. కాంగ్రేసేతర పాలనలో సుమారు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు. దేశంలోని ప్రజల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పెద్ద శాపంగా ఉందనడానికి ఇవన్నీ సంకేతాలని, ప్రజల అభివృద్ధికి ఆటకంగా ఆ పార్టీ నిలిచిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడల్లా ద్రవ్యోల్బణం గరిష్టస్థాయికి చేరుకుందని, యూపీఏ–1లో 5.8శాతం, యూపీఏ–2లో 10.4 శాతంగా ఉండగా...ప్రస్తుత ప్రభుత్వంలో 4.8 శాతంగా ఉందన్నారు. యూపీఏ హయాంలో 2010–11లో అత్యధికంగా 12.2 శాతం ఉంటే కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు అత్యధికంగా 6.7 శాతంగా ద్రవ్యోల్బణం ఉందన్నారు. కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లోనూ అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైందని ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణంపై ఉపన్యాసాలు ఇచ్చే హక్కు కాంగ్రెస్‌కు లేదని శ్రీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో భోపోర్స్, 2జీ, కామన్వెల్త్, బొగ్గు, ఆదర్శ్, నేషనల్ హెరాల్డ్, డీఎల్ఎఫ్, దాణా కుంభకోణాలు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని శ్రీ విజయసాయి రెడ్డి తెలిపారు. చేసిన అవినీతి పనులు చాపకింద నీరుగా దాచడానికి యత్నించినప్పటికీ ప్రజధనాన్ని ఫణంగా పెట్టి కాంగ్రెస్ కుబేరులు జేబులు నింపుకున్న చరిత్రను దాయలేరన్నారు. కాంగ్రెస్ పాలనలో మౌలికసదుపాయాలపై నిర్లక్ష్యం... కాంగ్రెసేతర ప్రభుత్వ హయాంలో రహదారులు, జాతీయ రహదారుల వృద్ధి రేటు 5.3 శాతం నుంచి 8.25 శాతంగా పెరిగిందన్నారు. రహదారులపై రాబడి కూడా రూ.32వేల కోట్ల నుంచి రూ.1.12 లక్షల కోట్లకు, నిర్మాణ వేగం రోజుకి 12 కిలోమీటర్ల నుంచి 28 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. దేశానికి జీవనాడి అయిన రైల్వేల అభివృద్ధిని కాంగ్రెస్ విస్మరించిందన్నారు. యూపీఏ హయాంలో రైల్వేల అభివృద్ధికి రూ.46వేల కోట్లు పెట్టుబడులు పెడితే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని మూడు రెట్లు పెంచిందన్నారు. 2004–14 మధ్య 44 కొత్త విమానాశ్రయాలు నిర్మించగా పదేళ్ల ఎన్డీయే హయాంలో 74 విమానాశ్రయాలు నిర్మించిందన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశ వృద్ధి సామర్థ్యాన్ని స్తంభింపజేసి మౌలిక సదుపాయాల పరంగా వెనకబాటుతనానికి కారణమైందన్నారు. ప్రజల సొమ్ము దోచుకోవడమే కాకుండా వ్యాపారవేత్తల వాణిజ్యాన్ని కూడా కష్టతరం చేసిందన్నారు. 2014లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌లో భారతదేశం 142వ స్థానంలోఉంటే ప్రస్తుతం 63వ స్థానంలో ఉందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ కరప్షన్ అనే కాంగ్రెస్ యుగం తొలిగిపోవడంతో గడిచిన పదేళ్లుగా చిన్న, పెద్ద వ్యాపారాలకు బహుళ ప్రయోజనాలు సమకూరాయని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గడిచిన ఇరవై ఏళ్లు గమనిస్తే... 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ దేశ ప్రజలను మోసం చేసిన విషయం స్పష్టంగా అర్థమవుతుందని ఎంపీ శ్రీ విజయసాయి రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ దేశ ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చిందని ఆర్థిక నిరాశను పెంచిందన్నారు. తప్పుడు వాగ్ధానాలతో ఖజానాను కొల్లగొట్టి దేశ ఆర్థిక వ్యవస్థను తిరోగమనంలో నెట్టారన్నారు. కాంగ్రెస్ లేకుంటే దేశం ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశంగా మారి ఉండేదని అభిప్రాయపడ్డారు. దశాబ్దాలుగా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన కాంగ్రెస్ పాలనను ప్రజలు ఎప్పటికీ క్షమించరని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
నూతన క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
ఢిల్లీ: మూడు నూతన క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీంతో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులు చట్టంగా మారాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో మూడు క్రిమినల్ బిల్లులను పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన విషయం తెలిసిందే. అనంతరం ఈ బిల్లులను రాష్ట్రపతి అనుమతి కోసం పంపించారు. బ్రిటిష్ వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మూడు కీలక బిల్లులకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను లోక్‌సభ కూడా బుధవారం మూజు వాణి ఓటుతో ఆమోదించింది. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు, భారతీయ సాక్ష్య బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్–1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్–1898, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్–1872 స్థానంలో ఈ మూడు బిల్లులను తీసుకొచ్చారు. ‘ఈ బిల్లులు చట్ట రూపం దాల్చితే ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ మొదలుకొని తీర్పు వరకు అన్నీ ఆన్లైన్ అవుతాయి. దేశ విద్రోహ చట్టం రద్దయి పోయింది. రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించే చర్యలకు కొత్త చట్టం ప్రకారం శిక్షలుంటాయి’అని అమిత్ షా వివరించారు. దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టులు డిజిటైజ్ అవుతాయని చెప్పారు. వీటిల్లో చండీగఢ్ మొట్టమొదటగా డిజిటైజ్ అవుతుందన్నారు. బ్రిటిష్ పాలనలో గాంధీజీ, తిలక్, సావర్కర్ వంటి వారిని జైళ్లకు పంపిన నిబంధనలను తొలగించడం సంతోషాన్నిచ్చిందని మంత్రి చెప్పారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు సభలో లేనప్పటికీ మంత్రి ఆ పార్టీపై విమర్శలు చేశారు. ఇటాలియన్ అద్దాలు ధరించిన వారు భారత పార్లమెంట్ కొత్త క్రిమినల్ చట్టాలను రూపొందించడాన్ని సగర్వంగా భావించరంటూ కాంగ్రెస్ నేత సోనియానుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: Winter Parliament Session 2023: క్రిమినల్ చట్టాలకు ఆమోదం -
పార్లమెంట్ అలజడి ఘటన.. నిందితులకు మానసిక పరీక్షలు
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో నిందితులను మానసిక పరీక్షలు(సైకో ఎనాలసిస్) నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలతో పార్లమెంట్ అలజడి ఘటనకు పాల్పడటానికి నిందితుల అసలు ఉద్దేశం తెలుసుకునే అవకాశం ఉంటుంది. గురువారం ఒక నిందితున్ని ఫోరెన్సిక్ సైన్స్ లాబెరేటరీకి తీసుకెళ్లారు. ఒక్కొక్కర్ని ఈ పరీక్షలకు తీసుకెళ్లనున్నారు. సైకో ఎనాలసిస్ పరీక్షల్లో నిందితుల అలవాట్లు, నిత్య జీవణ శైలి, స్వభావం తదితరాలు తెలుసుకుంటారు. సైక్రియాట్రిస్ట్ ప్రశ్న-జవాబుల విధానంలోనే ఈ టెస్ట్ ఉంటుంది. ఇచ్చిన జవాబుల ఆధారంగా నిందితుల వెనక ఉన్న అసలు ఉద్దేశాలను వైద్యులు అంచనా వేస్తారు. ఈ పరీక్షలు దాదాపు మూడు గంటలపాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరుపుతారు. శ్రద్ధా వాకర్ మర్డర్ కేసు, షహ్బాద్ డైరీ మర్డర్ కేసుల్లో నిందితులపై పోలీసులు ఇలాంటి పరీక్షలను నిర్వహించారు. డిసెంబర్ 13న పార్లమెంట్‌లోకి నలుగురు ఆగంతకులు ప్రవేేశించారు. ఇద్దరు లోక్‌సభ లోపల గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో గ్యాస్ బాంబులను ప్రయోగించారు. దీంతో పార్లమెంట్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అంశంతో పార్లమెంట్ భద్రతా విధులను ఢిల్లీ పోలీసుల నుంచి కేంద్ర బలగాలకు బదిలీ చేశారు. ఇదీ చదవండి: పార్లమెంట్లో మరో ముగ్గురు ఎంపీల సస్పెండ్.. మొత్తం 146 మంది -
CEC Bill: ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
ఢిల్లీ: వివాదాస్పద ఈసీ బిల్లును లోక్‌సభ నేడు ఆమోదించింది. దీంతో చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును గురువారం పార్లమెంట్ ఆమోదించినట్లైంది. ఈ బిల్లును రాజ్యసభ ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదిస్తే బిల్లు చట్టంగా రూపొందుతుంది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)లోని ముగ్గురు సభ్యుల నియామకానికి సంబంధించిన విధివిధానాలను ఏర్పాటు చేయడం ఈ బిల్లు లక్ష్యం. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్యానెల్ ఎన్నికల కమిషన్‌ను ఎన్నుకోవాలనే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ బిల్లు విబేధిస్తుంది. ఎన్నికల సంఘాన్ని నియమించాల్సిన విధివిధానాలపై సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో ఓ తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ.. ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తుంది. జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. పార్లమెంట్ కొత్త బిల్లును ఆమోదించే వరకు ఈ విధివిధానాలను అనుసరించాలని స్పష్టం చేసింది. అయితే.. పార్లమెంట్ తీసుకువచ్చిన కొత్త బిల్లులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాత్రను పక్కన పెట్టేశారు. సీఈసీ, ఈసీ కమిషనర్ల నియామకంలో సుప్రీంకోర్టును దూరంగా ఉంచారు. ఈ బిల్లు ప్రకారం ఎన్నికల కమిషనర్లపై సుప్రీంకోర్టు సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా అర్హత ఉండదు. ఇదీ చదవండి: పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం -
పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సెక్యూరిటీ విధులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)కు అప్పగించింది. పార్లమెంట్ భద్రతలో ఢిల్లీ పోలీసుల స్థానంలో సీఐఎస్ఎఫ్ను కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై కొత్త, పాత పార్లమెంట్ భవనాల భద్రత సీఐఎస్ఎఫ్ పరిధిలోకి వస్తుంది. సీఐఎస్ఎఫ్ అనేది కేంద్ర సాయుధ పోలీసు దళంలో భాగంగా ఉంటుంది. ఇది ప్రస్తుతం ఢిల్లీలోని అనేక కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ భవనాలకు కాపలాగా ఉంటుంది. అణు, ఏరోస్పేస్ డొమైన్, విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రో ఇన్స్టాలేషన్లను కూడా కాపాడుతోంది. పార్లమెంటు భవన సముదాయాన్ని సర్వే చేయాలని అధికారులు ఇప్పటికే ఆదేశించారు. తద్వారా సీఐఎస్ఎఫ్ భద్రత, అగ్నిమాపక విభాగాన్ని సమగ్ర నమూనాలో మోహరించడం సాధ్యమవుతుందని వెల్లడించారు. డిసెంబర్ 13న పార్లమెంట్లో అలజడి జరిగిన విషయం తెలిసిందే. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా నలుగురు దుండగులు లోక్‌సభలోకి ప్రవేశించి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. దీనిపై ప్రతిపక్షాలు కొన్ని రోజులుగా నిరసన చేపడుతున్నాయి. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించాలని పట్టబట్టాయి. ఈ క్రమంలో దాదాపు 150 మంది ఎంపీలు ఉభయ సభల నుంచి సస్పెండ్ అయ్యారు. ఇదీ చదవండి: Winter Parliament Session 2023: మరో ఇద్దరు ఎంపీల సస్పెన్షన్ -
సస్పెన్షన్ల వేళ.. నితిన్ గడ్కరీని కలిసిన శశిథరూర్
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసుపై ఉభయ సభల్లో గత రెండు మూడు రోజులుగా గందరగోళం నెలకొంటోంది. దుండగుల చొరబాటుపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించాలని విపక్షాలు పట్టుబడటంతో సభకు ఈ రోజు కూడా అంతరాయం జరిగింది. నేడు లోక్‌సభలో 49 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి ధన్యవాదాలు తెలిపారు. కేరళలోని జాతీయ రహదారి-65ను పూర్తి చేసినందుకు గాను నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలుపుతున్న ఫొటోను ఎక్స్‌లో షేర్ చేశారు. 1/2 Took the opportunity, amid the LokSabha disruption, to thank @nitin_gadkari for his excellent cooperation in completing work on the NH66 from Kazhakuttam to Karode (which will one day offer a 4-lane link from Thiruvananthapuram to Kanyakumari).I initiated this project pic.twitter.com/UBETf7gM4o — Shashi Tharoor (@ShashiTharoor) December 19, 2023 'కాళకుటం నుంచి కరోడ్ వరకు ఎన్‌హెచ్-65ను పూర్తి చేసినందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధన్వవాదాలు. తిరువనంతపురం నుంచి కన్యాకుమారి వరకు నాలుగు లైన్ల రహదారికి భవిష్యత్‌లో ఇది అనుసంధానం అవుతుంది. ఈ రహదారి అభివృద్ధి పనులను నేనే ప్రారంభించాను. ఓవర్‌పాస్‌లు, ట్రాఫిక్ లైన్లు, మెరుగైన అనుసంధానం కోసం నియోజక వర్గం ప్రజల అభ్యర్థనల మేరకు కేంద్ర మంత్రిని కలిశాను. సాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.' అని శశిథరూర్ ట్వీట్ చేశారు. మంగళవారం సస్పెన్షన్ అయిన ఎంపీల్లో శశిథరూర్ కూడా ఒకరు. ఇదీ చదవండి: లోక్ సభలో నేడు 49 మంది ఎంపీలపై వేటు -
లోక్ సభలో నేడు 49 మంది ఎంపీలపై వేటు
ఢిల్లీ: పార్లమెంట్లో నేడు మరింత మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై గందరగోళం సృష్టించిన కారణంగా ఇవాళ ఒక్కరోజే లోక్‌సభ నుంచి 49 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై పార్లమెంట్లో నిన్న 78 మంది సస్పెండ్ అయ్యారు. ఈ సెషన్లో ఇప్పటివరకు మొత్తంగా 141 మంది ఎంపీలపై వేటు పడింది. More Opposition MPs in Lok Sabha including Supriya Sule, Manish Tewari, Shashi Tharoor, Md Faisal, Karti Chidambaram, Sudip Bandhopadhyay, Dimple Yadav and Danish Ali suspended for the remainder of the winter session of Parliament pic.twitter.com/nxcUVnlVEn — ANI (@ANI) December 19, 2023 సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన శశిథరూర్, మనీష్ తివారీ, కార్తీ చిదంబరం, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన డింపుల్ యాదవ్, ఎన్సీపీకి చెందిన ఫరూక్ అబ్దుల్లా, డీఎంకేకు చెందిన ఎస్ సెంథిల్‌కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సుశీల్ కుమార్ రింకు, సుదీప్ బంధోపాధ్యాయ ఉన్నారు. ఎంపీల సస్పెన్షన్ తీర్మానాన్ని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో నిన్న 33 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. రాజ్యసభలో 45 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై సభలో గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ తదితరులు ఉన్నారు. డిసెంబర్ 13న పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన జరిగింది. నలుగురు యువకులు పార్లమెంట్‌లోకి చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు యువకులు లోక్‌సభ లోపల గ్యాస్ బాంబులను ప్రయోగించగా.. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు పార్లమెంట్లో విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో 14 మంది సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇందులో ఒక రాజ్య సభ సభ్యుడు కాగా, 13 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఈ రోజు సస్పెండ్ అయిన ఎంపీలతో కలిపి మొత్తంగా పార్లమెంట్లో 141 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఇదీ చదవండి: Ram Mandir Ayodhya: రామాలయం థీమ్‌తో వజ్రాలహారం.. -
పార్లమెంట్లో మొత్తం 92 మంది ఎంపీల సస్పెన్షన్
ఢిల్లీ: పార్లమెంటులో అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంటు ఉభయ సభల్లో మొత్తంగా 92 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈరోజు లోక్‌సభలో 33 మంది ఎంపీలు, రాజ్యసభలో 45 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. గతవారం 14 మంది ఎంపీలు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై విపక్షాలు గందరగోళం సృష్టించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో నేడు 33 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం అంశంపై లోక్‌సభలో గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, దయానిధి మారన్, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ ఉన్నారు. ఈ రోజు సస్పెండ్ అయిన లోక్‌సభ ఎంపీల్లో 31 మందిని శీతాకాల సమావేశాలకు సస్పెండ్ చేయగా.. ముగ్గుర్ని ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేశారు. ఎంపీలు కే జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీక్ స్పీకర్ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ ఎంపీల సస్పెన్షన్ ప్రతిపాదనను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సభలో సమర్పించారు. వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించారు. Winter Session | A total of 33 Opposition MPs, including Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury, suspended from the Parliament today for the remainder of the Session. pic.twitter.com/zbUpeMaHmU — ANI (@ANI) December 18, 2023 సస్పెన్షన్‌పై అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. 'నాతో సహా 33 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. గతంలో సస్పెండ్ చేసిన మా ఎంపీలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండే చేశాం. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై సభలో హోం మంత్రి అమిత్ షా మాట్లాడాలని కోరాం.' అని చెప్పారు. #WATCH | On his suspension from the Lok Sabha, Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury says, "All leaders, including me, have been suspended. We have been demanding for days to reinstate our MPs who were suspended earlier and that the Home Minister come to the… pic.twitter.com/y19hCUY7iG — ANI (@ANI) December 18, 2023 డిసెంబర్ 13న పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన జరిగింది. నలుగురు యువకులు పార్లమెంట్‌లోకి చొరబడి గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు యువకులు లోక్‌సభ లోపల గ్యాస్ బాంబులను ప్రయోగించగా.. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు పార్లమెంట్లో విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో 14 మంది సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇందులో ఒక రాజ్య సభ సభ్యుడు కాగా, 13 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఈ రోజు సస్పెండ్ అయిన ఎంపీలతో కలిపి మొత్తంగా పార్లమెంట్లో 47 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఇదీ చదవండి: Covid 19 Cases: మళ్లీ కరోనా.. కొత్తగా 355 కేసులు.. ఐదుగురు మృతి! -
పార్లమెంట్లో అలజడి ఘటన దురదృష్టకరం: మోదీ
ఢిల్లీ: పార్లమెంటు అలజడి ఘటన అత్యంత దురదృష్టకరమని ప్రధాని మోదీ అన్నారు. ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రతను తక్కువ అంచనా వేయవద్దని మోదీ అన్నారు. "పార్లమెంట్లో జరిగిన ఘటన తీవ్రతను ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. అందుకే స్పీకర్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు" అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దర్యాప్తు సంస్థలు సమగ్రంగా విచారణ జరుపుతున్నాయి. "దీని వెనుక ఉన్న అంశాలు, ప్రణాళికలు ఏమిటో అర్థం చేసుకోవడం, పరిష్కారాన్ని కనుగొనడం కూడా అంతే ముఖ్యం. పరిష్కారాల కోసం అన్వేషించాలి. ప్రతి ఒక్కరూ అలాంటి విషయాలపై వివాదాలు లేదా ప్రతిఘటనలకు దూరంగా ఉండాలి" అని ప్రధాని మోదీ కోరారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా డిసెంబర్ 13న జీరో అవర్ సమయంలో ఇద్దరు యువకులు సాగర్ శర్మ, మనోరంజన్ పబ్లిక్ గ్యాలరీ నుండి లోక్‌సభ ఛాంబర్లోకి దూకారు. స్మోక్ క్యానిస్టర్లతో పసుపు పొగను విడుదల చేశారు. పార్లమెంట్ భవనంలో నినాదాలు చేశారు. అదే సమయంలో పార్లమెంట్ ఆవరణలో మరో ఇద్దరు అమోల్ షిండే, నీలం దేవి రంగు పొగను విడుదల చేశారు. ఈ కేసులో మొత్తంగా ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఏడు రోజుల కస్టడీలో ఉన్నారు. పోలీసుల వారిని దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన సూత్రధారి లలిత్ ఝా నిందితుల ఫోన్లను దహనం చేసిన ప్రదేశాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుల వెనక విదేశీ, ఉగ్రవాదులు హస్తం ఉందా?అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు -
లోక్‌సభలో అలజడి ఘటన: ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి ఫైర్
ఢిల్లీ: పార్లమెంట్ అలజడి ఘటనపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తప్పుబట్టారు. మహ్మద్ అలీ జిన్నా భావజాలంతో ఓవైసీ ప్రభావితమయ్యారని విమర్శించారు. జిన్నా ఆత్మ ఓవైసీలోకి చొరబడిందని వ్యగ్యాస్త్రాలు సంధించారు. అందుకే ఆయన ఓ వర్గం కోసమే పనిచేస్తారని అన్నారు. నేరస్థుల్లో కూడా మతకోణం చూడటానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. లోక్‌సభలో భద్రతా వైఫల్యం కేసుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. ఉగ్రవాదుల మతం, కులం, విశ్వాసాలతో పట్టింపులేదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మతపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే ఉగ్రవాదులను ఉగ్రవాదులుగానే గుర్తించామని తెలిపారు. పార్లమెంట్లో అలజడి కేసులో నిందితులు ముస్లింలు అయితే పరిస్థితి ఏంటని ప్రతిపక్షాలు అడగడంపై ఆయన ఆక్షేపించారు. ఉగ్రవాద అంశంలో ప్రతిపక్షాలు మత కోణాన్ని చూస్తున్నారు.. ఈ అంశంపై హోమంత్రి అమిత్ షా స్పందించాలని పట్టుబడుతున్నారు.. ఇలాంటి విషయాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పారిపోయేవారు కాదు అని గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. దృఢ సంకల్పంతో ప్రతిస్పందించే వ్యక్తి అని తెలిపారు. పార్లమెంటు చొరబాటుదారులు ముస్లింలైతే పరిస్థితి మరోలా ఉండేదని జేడీయూ, ఏఐఎంఐఎం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఇదీ చదవండి: అరాచకం సృష్టించడానికి కుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు -
అరాచకం సృష్టించడానికి కుట్ర.. వెలుగులోకి కీలక విషయాలు
ఢిల్లీ: లోక్‌సభలో అలజడి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనతో దేశంలో అరాచకం చెలరేపడమే నిందితుల అజెండా అని లలిత్ ఝ కస్టడీ పిటిషన్ లో పోలీసులు పేర్కొన్నారు. దేశంలో అలజడి సృష్టించి తద్వారా తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని నిందితులు భావించినట్లు వెల్లడించారు. ఈ దాడి వెనక నిందితులకు ఏమైనా విదేశీ, ఉగ్రవాద సంస్థల నుంచి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే అంశంపై దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేందుకు దేశంలో అరాచకం సృష్టించాలని భావించినట్లు కీలక సూత్రధారి లలిత్ ఝా వెల్లడించినట్లు కస్టడీ విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులు పాటియాలా కోర్టుకు తెలిపారు. లలిత్ ఝా తన ఫోన్‌ను ఢిల్లీ-జైపూర్ సరిహద్దులో విసిరివేసినట్లు అంగీకరించాడు. ఈ కుట్ర ప్రణాళికను అమలు చేయడానికి ముందు ఢిల్లీలో అనేకమార్లు కలిసినట్లు లలిత్ ఝా చెప్పాడు. ఇతర నిందితుల ఫోన్లను ధ్వంసం చేసినట్లు తెలిపాడని పోలీసులు వెల్లడించారు. ఈ చర్య వెనక విదేశీ ప్రమేయం ఉందని దర్యాప్తు బృందం అనుమానిస్తోంది. నిందితులకు ఏదైనా శత్రు దేశంతో లేదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయా అనే విషయాన్ని నిర్ధారించేందుకు విచారించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఝా తన ఫోన్‌ను విసిరిన, ఇతర నిందితుల ఫోన్లను కాల్చిన ప్రదేశాలను కనుగొనడానికి పోలీసులు రాజస్థాన్‌కు తీసుకెళ్లనున్నారు. లోక్‌సభ ఛాంబర్లోకి నిందితులు దూకిన ఘటనను రీక్రియేట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ అనుమతిని కోరే అవకాశం ఉంది. ఇదీ చదవండి: ‘పార్లమెంట్ భద్రత.. ప్రభుత్వ బాధ్యత కాదు’ -
ప్లాన్ A&B.. పార్లమెంట్‌పై దాడిలో సంచలన విషయాలు
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన సూత్రధారిగా పేరుగాంచిన లలిత్ ఝా కీలక విషయాలను పోలీసులకు తెలిపారు. ఈ వ్యవహారంలో వారు రెండు వ్యూహాలను పన్నినట్లు చెప్పాడు. ఒకవేళ ప్లాన్ ఏ విఫలమైతే ప్లాన్ బీని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పాడు. ప్లాన్ ఏ ప్రకారం నీలం, అమోల్ పార్లమెంట్‌లోకి ప్రవేశించకపోతే మరోవైపు నుంచి మహేశ్, కైలాష్ ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు లలిత్ చెప్పాడు. పొగ బాంబులను మండించి నినాదాలు చేయాలని సంకల్పించినట్లు పేర్కొన్నాడు. మహేష్, కైలాష్ గురుగ్రామ్‌లోని తాము నివాసం ఉన్న విశాల్ శర్మ(విక్కి) ఇంటికి చేరుకోవడంలో విఫలమైనందున అమోల్, నీలం ఎలాగైనా పని పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించాడు. పార్లమెంట్లో ఆరుగురు వ్యక్తులు బుధవారం గందరగోళం సృష్టించారు. పక్కా ప్రణాళికతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన నిందితులు గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు నిందితులు లోక్‌సభ లోపలికి ప్రవేశించి పసుపు రంగు గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో ఎంపీలంతా భయాందోళనకు గురయ్యారు. నిందితులను ఎంపీలే పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ కేసులో నలుగురు నిందితులను ఉపా(దేశ వ్యతిరేక కార్యకాలాపాల చట్టం) చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి జరిగిన రోజే మళ్లీ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. మనోరంజన్, సాగర్ శర్మ, నీలమ్, అమోల్ శిందె, విశాల్, లలిత్, మహేశ్ అనే ఏడుగురు దుండగులు ఈ ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో మనోరంజన్, సాగర్‌శర్మ లోక్‌సభలోకి చొరబడగా.. నీలమ్, అమోల్ శిందే పార్లమెంట్ భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీరికి బస ఏర్పాటు చేసిన విశాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహేష్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ ఐదుగురి మొబైల్ ఫోన్స్‌తో పరారైన లలిత్ ఝా ప్రస్తుతం లొంగిపోయాడు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి ఘటన: ప్రతిపక్షాల తీరుపై అమిత్ షా ఫైర్ -
పార్లమెంట్ అలజడి కేసు సూత్రధారి లలిత్ ఝా అరెస్టు
ఢిల్లీ: పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన కేసుమాస్టర్ మైండ్ లలిత్ ఝా అరెస్ట్ అయ్యాడు. తనంతట తానుగా వచ్చి ఢిల్లీ పోలీసులకు లొంగిపోయాడు. గురువారం రాత్రి లలిత్ ఝా మరో వ్యక్తితో కలిసి కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతన్ని పోలీసు ప్రత్యేక బృందాలకు అప్పగించినట్లు పేర్కొన్నారు. మనోరంజన్, సాగర్ శర్మ, నీలమ్, అమోల్ శిందె, విశాల్, లలిత్ అనే ఆరుగురు దుండగులు ఈ ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో మనోరంజన్, సాగర్‌శర్మ లోక్‌సభలోకి చొరబడగా.. నీలమ్, అమోల్ శిందే పార్లమెంట్ భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీరికి బస ఏర్పాటు చేసిన విశాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురి మొబైల్ ఫోన్స్‌తో పరారైన లలిత్ ఝా ప్రస్తుతం లొంగిపోయాడు. పార్లమెంట్లో నిందితులు బుధవారం గందరగోళం సృష్టించారు. పక్కా ప్రణాళికతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన నిందితులు గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు నిందితులు లోక్‌సభ లోపలికి ప్రవేశించి పసుపు రంగు గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో ఎంపీలంతా భయాందోళనకు గురయ్యారు. నిందితులను ఎంపీలే పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. ఈ కేసులో నలుగురు నిందితులను ఉపా(దేశ వ్యతిరేక కార్యకాలాపాల చట్టం) చట్టం కింద అరెస్టు చేశారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి జరిగిన రోజే మళ్లీ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదీ చదవండి: Parliament Attack: జాతికి జవాబు కావాలి! -
Parlament Updates: పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
అప్డేట్స్.. ► విపక్షాల నిరసనలు, ఆందోళనల నడుమ పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. తిరిగి ఉభయ సభలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ► పార్లమెంట్ భద్రత వైఫల్యానికి నిరసనగా విపక్ష పార్టీలు ఆందోళన నిర్వహించాయి. పార్లమెంట్లో ప్రశ్నిస్తున్న ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడంపై పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద విపక్ష పార్టీల ఎంపీలు ధర్నాకు దిగారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. #WATCH | Suspended MPs stage a protest in front of the Gandhi statue on Parliament premises, in Delhi A total of 14 MPs - 13 from Lok Sabha and 1 from Rajya Sabha - were suspended yesterday for the remainder of the winter session pic.twitter.com/kVEPhgt9Aq — ANI (@ANI) December 15, 2023 ► ఇండియా కూటమి ఎంపీలంతా ఒక్కటైనట్లు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ తెలిపారు. తామంతా రాజ్యాంగేతర విధానంతో సస్పెన్షన్‌కు గురైనట్లు ఆరోపించారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపడుతున్నట్లు పేర్కొన్న ఆయన.. ఆందోళనను కొనసాగిస్తామని అన్నారు. #WATCH | Delhi: On his suspension from the Lok Sabha, Congress MP Manickam Tagore says, "All the MPs of the INDIA alliance are united and we were all undemocratically suspended yesterday. We are having a silent protest in front of the Gandhi statue and we will continue the… pic.twitter.com/4naP7Oanh4 — ANI (@ANI) December 15, 2023 ►సస్పెండ్ అయిన ఎంపీలు పార్లమెంట్ మకర ద్వారం వద్ద నిరసన చేపట్టారు. వారిని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ కలిశారు. పార్లమెంట్ అలజడి అంశంలో మొత్తంగా 14 మంది ఎంపీలు సభ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. #WATCH | Delhi: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi meets the suspended MPs who are protesting at the Makara Dwar in Parliament A total of 14 MPs - 13 from Lok Sabha and 1 from Rajya Sabha - were suspended yesterday for the remainder of the winter session pic.twitter.com/9QtSZsUXTE — ANI (@ANI) December 15, 2023 ►పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహించాయి. దీంతో మధ్యాహ్నం 2 వరకు స్పీకర్ సభను వాయిదా వేశారు. Lok Sabha adjourned till 2pm amid sloganeering by Opposition MPs over the security breach incident. pic.twitter.com/4K6i635k3H — ANI (@ANI) December 15, 2023 ►పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. స్పీకర్ ఇచ్చిన భద్రతా నియమాలనే ప్రభుత్వం పాటించింది. ఈ అంశం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉంది. ఉన్నతస్థాయి కమిటీ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. #WATCH | On the Parliamentary security breach incident, Parliamentary Affairs Minister Pralhad Joshi says, "Whatever directions the Speaker has given, the government is following them in letter and spirit. The matter is also in the court, high-level investigation is going on.… pic.twitter.com/3mEso77Z65 — ANI (@ANI) December 15, 2023 ►కాంగ్రెస్ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ పార్లమెంట్‌కు హాజరయ్యారు. #WATCH | Delhi: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrives at the Parliament #WinterSession pic.twitter.com/dhooCFYaex — ANI (@ANI) December 15, 2023 ►ఇండియా కూటమికి చెందిన రాజ్యసభ ఎంపీలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు. సభలో నేడు అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించారు. #WATCH | Delhi: A meeting of Floor leaders of the INDIA alliance parties is underway at LoP in Rajya Sabha Mallikarjun Kharge's office in Parliament House to chalk out the strategy for the Floor of the House.#WinterSession pic.twitter.com/Jde3yVbY2G — ANI (@ANI) December 15, 2023 పార్లమెంట్లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై గురువారం ఉభయ సభలు అట్టుడికిపోయాయి. ప్రతిపక్ష సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బుధవారం జరిగిన అవాంఛనీయ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ, రాజ్యసభలో తీవ్ర అలజడి సృష్టించారు. వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని పట్టుబట్టారు. అరుపులు, కేకలతో లోక్‌సభ, రాజ్యసభ హోరెత్తిపోయాయి. తీవ్ర గందరగోళం నెలకొంది. ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేసినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లోక్‌సభ నుంచి 13 మంది విపక్ష ఎంపీలపై, రాజ్యసభలో ఒక ప్రతిపక్ష ఎంపీపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో మిగిలిన సెషన్ మొత్తం వారు సభకు హాజరు కాకూడదని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ స్పష్టం చేశారు. లోక్‌సభ గురువారం ఉద యం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రా రంభించారు. వెల్‌లోకి దూసుకొచ్చారు. వెనక్కి వెళ్లాలని స్పీకర్ పదేపదే కోరినా వారు వినిపించుకోలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ చెప్పారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్ష ఎంపీలు శాంతించలేదు. దీంతో సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్న ఐదుగురు విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయాలని కోరుతూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశాయి. ఈ రోజు మిగతా కార్యకలాపాలను పక్కనపెట్టి, కేవలం భద్రతా వైఫల్యంపైనే సభలో చర్చ చేపట్టాలని పలువురు ఎంపీలు గురువారం ఉదయం 28 నోటీసులు ఇచ్చారు. వీటిని తిరస్కరిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తేల్చిచెప్పారు. ఇదీ చదవండి: Parliament Attack: జాతికి జవాబు కావాలి! -
'తప్పుదోవ పట్టించారు..' నిందితుడు సాగర్ శర్మ తల్లి ఆవేదన
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనపై నిందితుడు సాగర్ శర్మ తల్లి స్పందించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. తన కుమారుడు అమాయకుడని, తప్పుదోవ పట్టించి, కుట్రలో ఇరుకించారని ఆరోపించారు. సాగర్ దేశ భక్తి గల వ్యక్తి అని చెప్పారు. 'స్నేహితున్ని కలవడానికి ఢిల్లీకి వెళుతున్నట్లు చెప్పాడు. రెండ్రోజుల్లో వస్తానని అన్నాడు. నా కొడుకుని ఎవరో కుట్రలో ఇరికించారు. ఆటో నడిపేవాడు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడే నా ఆధారం. ప్రతి రోజు దాదాపు రూ.500 వరకు సంపాదించేవాడు. చాలా అమాయకుడు. మంచి వ్యక్తిత్వం గలవాడు. దేశం పట్ల ఎప్పుడు భక్తిభావంతో ఉండేవాడు. ఇలాంటి పనులు ఎప్పుడు చేయడు. ఎవరో అతనికి ఇవన్నీ నూరిపోశారు. కుట్రలో ఇరికించారు.' అని సాగర్ తల్లి రాణి శర్మ అన్నారు. కేసులో నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని సాగర్ సోదరి మహి శర్మ కోరారు. తన సోదరున్ని ఈ కేసులో ఇరికించిన వారిని కఠినంగా శిక్షించాలి అని ప్రధాని మోదీకి విన్నవించారు.' నా సోదరుడు ఇంటర్ వరకు చదువుకున్నాడు. మంచి దేశ భక్తుడు. దేశ అభివృద్ధి గురించి మాట్లాడేవాడు. ఆగష్టు 15కు ఆటోపై మూడు రంగుల జెండా పెట్టుకునేవాడు' అని సాగర్ సోదరి మహి శర్మ తెలిపింది. Parliament intruder's mother and sister claim his innocence, says he is getting framed, appeals for fair probe Read @ANI Story | https://t.co/A0OYCYyaoa#Parliament #SecurityBreach #Intruders pic.twitter.com/veM1JR1iNv — ANI Digital (@ani_digital) December 14, 2023 అయితే.. నిందితులందరూ సోషల్ మీడియా పేజీ 'భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్'తో సంబంధం కలిగి ఉన్నారని పోలీసులు తెలిపారు. ఏడాదిన్నర క్రితం అందరూ మైసూరులో కలిశారు. సాగర్ జూలైలోనే లక్నో నుంచి వచ్చాడు.. కానీ పార్లమెంట్ హౌజ్ లోపలికి వెళ్లలేకపోయాడు. డిసెంబర్ 10 నుంచి నిందితులందరూ ఒక్కొక్కరిగా ఢిల్లీకి చేరుకున్నారు. ఇండియా గేట్ వద్ద గ్యాస్ క్యానిస్టర్లను పంచుకున్నారని పోలీసులు గుర్తించారు. లక్నోలోని మానక్నగర్ ప్రాంతంలో సాగర్ శర్మ నివాసం ఉంటున్నాడు. వామపక్ష భావాజాలంతో ఫేస్బుక్ పోస్టులు చేస్తుండేవాడని పోలీసులు గుర్తించారు. కోల్‌కతా, హర్యానా, రాజస్థాన్‌కు చెందిన చాలా మందితో సాగర్ శర్మకు సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా ఆయన ఫేస్బుక్ పేజీలో యాక్టివ్‌గా లేరని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా నుంచి లక్నోకు వలస వచ్చిన సాగర్ కుటుంబం.. ఇక్కడే గత 20 ఏళ్ల నుంచి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. తండ్రి, తల్లి, సోదరితో సాగర్ ఉంటున్నాడని పోలీసులు వెల్లడించారు. ఇదీ చదవండి: Parliament: గ్యాస్ క్యానిస్టర్లు అంటే ఏంటి? ఎక్కడైనా వాడొచ్చా? -
నిందితుల ఎంట్రీ పాస్‌లపై ఎంపీ ప్రతాప్ సింహ వివరణ
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనలో నిందితులు కర్ణాటక ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం నుంచి విజిటర్ పాస్‌లను పొందారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లాను ప్రతాప్ సింహ నేడు కలిశారు. నిందితులకు పాస్‌లను ఇవ్వడానికి గల కారణాన్ని ఆయన వివరించారు. పార్లమెంట్ విజిటర్ పాస్ కోసం నిందితుల్లో ఒకరి తండ్రి తన కార్యాలయానికి వచ్చారని స్పీకర్‌కు తెలిపారు. పాస్‌ల కోసం నిందితుడు సాగర్ శర్మ నిరంతరం తన పీఏకి టచ్‌లోనే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంతకు మించిన సమాచారం తన వద్ద లేదని స్పీకర్‌కు వివరించినట్లు సమాచారం. మనోరంజన్, సాగర్ శర్మ, నీలమ్, అమోల్ శిందె, విశాల్, లలిత్ అనే ఆరుగురు దుండగులు ఈ ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో మనోరంజన్, సాగర్‌శర్మ లోక్‌సభలోకి చొరబడగా.. నీలమ్, అమోల్ శిందే పార్లమెంట్ భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీరికి సహకరించిన విశాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా లలిత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పార్లమెంట్లో బుధవారం గందరగోళం నెలకొంది. పక్కా ప్రణాళికతో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన నిందితులు గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. ఇద్దరు నిందితులు లోక్‌సభ లోపలికి ప్రవేశించి పసుపు రంగు గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో ఎంపీలంతా భయాందోళనకు గురయ్యారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో అలజడి సృష్టించారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి జరిగిన రోజే మళ్లీ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదీ చదవండి: Parliament: గ్యాస్ క్యానిస్టర్లు అంటే ఏంటి? ఎక్కడైనా వాడొచ్చా? -
Parliament: గ్యాస్ క్యానిస్టర్లు అంటే ఏంటి? ఎక్కడైనా వాడొచ్చా?
ఢిల్లీ: లోక్‌సభ లోపలికి ఆగంతకులు ప్రవేశించి బుధవారం గందరగోళం సృష్టించారు. సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకి టియర్ గ్యాస్ వదిలారు. దీంతో ఎంపీలంతా భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిందితులను పట్టుకుని సిబ్బందికి అప్పగించారు. పార్లమెంట్‌పై దాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన వేళ ఈ ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. నిందితులు బూట్లలో గ్యాస్ క్యానిస్టర్లను దాచుకుని వెంట తెచ్చుకున్నారు. అసలు ఏంటి ఈ గ్యాస్ క్యానిస్టర్లు? ఎక్కడ ఉపయోగిస్తారు? Sansad breaking. Two people with tear gas canisters jumped into Lok Sabha well and opened it. House adjourned. #LokSabha pic.twitter.com/UrFZ7xE8pB — sansadflix (@sansadflix) December 13, 2023 గ్యాస్ క్యానిస్టర్ల అంటే..? గ్యాస్ క్యానిస్టర్లను స్మోక్ బాంబులు, పొగ డబ్బాలు అని కూడా పిలుస్తుంటారు. వీటిని బహిరంగంగా ఉపయోగించేందుకు చట్టబద్ధత ఉంది. సినిమాలు, ఫొటోషూట్లలో పొగ తెరలను సృష్టించడానికి, మిలిటరీ విభాగాల్లోనూ వీటిని ఉపయోగిస్తుంటారు. శత్రువుల కళ్లను పొగతో ఏమార్చడానికి వాడుతారు. క్రీడలలో ముఖ్యంగా ఫుట్‌బాల్‌లో అభిమానులు తమ క్లబ్‌ల రంగులను ప్రదర్శించడానికి పొగ డబ్బాలను ఉపయోగిస్తారు. గ్రనైడ్లతో కూడిన క్యానిస్టర్లను సైనిక ఆపరేషన్లలో వాడతారు. దట్టమైన పొగ తెరలను సృష్టించడం ద్వారా దళాల కదలికలు అస్పష్టంగా మారుతాయి. తద్వారా శత్రువుల కంటపడకుండా కీలక ఆపరేషన్లను కొనసాగించడంలో దోహదం చేస్తాయి. గగనతల దాడులు, భద్రతా దళాలు దిగడం, తరలింపు కేంద్రాలను లక్ష్యంగా చేసుకునేందుకు వీటిని ఉపయోగిస్తుంటారు. నిందితుల వివరాలు.. లోక్‌సభలో టియర్ గ్యాస్ ప్రయోగానికి సంబంధించి నిందితులను సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి కౌర్, లలిత్ ఝా, విక్కీ శర్మలుగా గుర్తించారు. కాగా, దర్యాప్తులో భాగంగా సాగర్ శర్మ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో కాగా.. మనో రంజన్ కర్ణాటకలోని మైసూర్. అమోల్ షిండే స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ కాగా.. నీలం దేవి కౌర్ స్వస్థలం హర్యాణాలోని హిస్సార్. ఈ కుట్ర వెనుక మరో కీలక సూత్రదారి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు చేపట్టారు. "Main conspirator someone else" in Parliament security breach: Police sources Read @ANI Story | https://t.co/A1Tn7NerpO#ParliamentSecurityBreach #India #Delhi pic.twitter.com/qSRwgdGVPB — ANI Digital (@ani_digital) December 14, 2023 ఇదీ చదవండి: Parliament Issue: నా కొడుకు చేసింది తప్పే.. ఉరి తీయండి -
‘మహువా మొయిత్రాపై వేటు.. అది విచారకరమైన రోజు’
ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యురాలు మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మొదటిసారి స్పందించారు. ‘అవినీతి, జాతీయ భద్రత సమస్య విషయంలో ఓ ఎంపీ బహిష్కరణకు గురికావటం తనకు బాధ కలిగిస్తుందని పేర్కొన్నారు. నిన్నటి రోజు(శుక్రవారం) సంతోషకరమైన రోజు కాదని, అదో విచారకరమైన రోజని తెలిపారు. అయితే మొయిత్రా తన లోక్‌సభ వెబ్సైట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను వ్యాపారవేత్త దర్శన్ హీరా నందానీకి ఇచ్చారని నిశికాంత్ దూబే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. #WATCH | BJP MP Nishikant Dubey on expulsion of TMC leader Mahua Moitra from Parliament "The expulsion of a parliamentarian for corruption and on the issue of national security gives me pain. Yesterday, it was not a happy day, but a sad day." pic.twitter.com/DZoZei5AqF — ANI (@ANI) December 9, 2023 ఆయన ఫిర్యాదుతోనే స్పీకర్ ఈ వ్యవహరాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయగా.. శుక్రవారం ఎథిక్స్ కమిటి నివేదిక ఆమెను దోషిగా తేల్చటంతో బహిష్కరణ గురయ్యారు. ఇక మొయిత్రాపై వేటుపడిన అనంతరం ఆమెపై ఫిర్యాదు చేసిన ఎంపీ నిశికాంత్ దూబే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారింది. -
మహువాపై వేటు
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యురాలు మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ప్రకటించారు. డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగిన కేసులో ఆమెను దోషిగా తేలుస్తూ లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ఇచి్చన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై విపక్షాలు అభ్యంతరాలు వెలిబుచ్చగా స్పీకర్ నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. తనపై వేటును మొయిత్రా తీవ్రంగా నిరసించారు. స్పీకర్ చర్య అనర్హులైన జడ్జిలతో కూడిన (కంగారూ) కోర్టు ఉరిశిక్ష తీర్పు వెలువరించినట్టుగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఆమె పశి్చమబెంగాల్‌లోని కృష్ణనగర్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాట్లాడే చాన్సివ్వని స్పీకర్ మొయిత్రా ఉదంతంపై విచారణ జరిపిన బీజేపీ ఎంపీ వినోద్‌కుమార్ సోంకర్ సారథ్యంలోని ఎథిక్స్ కమిటీ శుక్రవారం మధ్యాహ్నం లోక్‌సభకు నివేదిక సమరి్పంచింది. ఆమెను దోషిగా తేలి్చనట్టు పేర్కొంది. ‘‘మొయిత్రా అనైతిక ప్రవర్తనకు పాల్పడ్డారు. తన లోక్‌సభ పోర్టల్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను అనధికారిక వ్యక్తులకు ఇచ్చారు. తద్వారా దేశ భద్రతకు తీవ్ర విఘాతం కలిగించే పని చేశారు’’ అని తెలిపింది. అనంతరం మొయిత్రాను సభ నుంచి బహిష్కరించాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ తీర్మానం ప్రవేశపెట్టారు. ‘‘మొయిత్రా ప్రవర్తన ఒక ఎంపీ స్థాయికి తగ్గట్టుగా లేదని తేలింది. ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బు, కానుకలు తీసుకుని ప్రతిగా అతని ప్రయోజనాల కోసం ఇలాంటి పనులు చేయడం గర్హనీయం’’ అని అందులో పేర్కొన్నారు. మొయిత్రా సభ్యత్వ రద్దుకు కమిటీ చేసిన సిఫార్సును ఆమోదించాల్సిందిగా సభను మంత్రి కోరారు. తృణమూల్‌తో పాటు కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు ఇందుకు తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. మొయిత్రాకు తన వాదన విని్పంచే అవకాశమివ్వాలని డిమాండ్ చేశాయి. గత ఉదంతాలను ఉటంకిస్తూ అందుకు స్పీకర్ నిరాకరించారు. ‘‘2005లో నగదుకు ప్రశ్నల కుంభకోణానికి పాల్పడ్డ 10 మంది లోక్‌సభ సభ్యులను నాటి స్పీకర్ సోమనాథచటర్జీ సభ నుంచి బహిష్కరించారు. ఆ సందర్భంగా సదరు ఎంపీలకు తమ వాదన చెప్పుకునే అవకాశమివ్వలేదు. అంతేకాదు, ఈ ఉదంతంపై ఎథిక్స్ కమిటీ నివేదిక సభకు అందిన రోజే దాని సిఫార్సు మేరకు వారిపై అనర్హత వేటు వేయాలని సభను కోరుతూ నాటి లోక్‌సభ నేత ప్రణబ్ ముఖర్జీ తీర్మానం ప్రవేశపెట్టారు’’ అని గుర్తు చేశారు. అనంతరం నివేదిక, తీర్మానంపై కాసేపు వాడివేడి చర్చ జరిగింది. నివేదికను విశ్లేíÙంచేందుకు సభ్యులకు కనీసం మూడు నాలుగు రోజుల సమయమివ్వాలని సభ్యుడు అ«దీర్ రంజన్ చౌదరి (కాంగ్రెస్) కోరగా స్పీకర్ తిరస్కరించారు. ఒక సభ్యున్ని బహిష్కరించాలంటూ సిఫార్సు చేసే అధికారం ఎథిక్స్ కమిటీకి లేదని కాంగ్రెస్ సభ్యుడు మనీశ్ తివారీ వాదించారు. అనంతరం మూజువాణి ఓటుతో తీర్మానాన్ని సభ ఆమోదించింది. దీన్ని నిరసిస్తూ విపక్షాలు వాకౌట్ చేశాయి. అనంతరం మహువాతో కలిసి గాం«దీజీ విగ్రహం వద్ద నేతలు నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యానికి ఉరి: మమత డార్జిలింగ్: మొయిత్రాను బహిష్కరించడం ద్వారా ప్రజాస్వా మ్యాన్ని హత్య చేశారని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశి్చమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ చర్య పార్లమెంటుకే మచ్చ తెచి్చందన్నారు. ‘‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఇది దుర్దినం. ఎన్నికల్లో తమను ఓడించలేక బీజేపీ ఇలా కక్షసాధింపు రాజకీయాలకు దిగుతోంది’’ అని ఆరోపించారు. మొయిత్రాకు పార్టీ పూర్తిగా మద్దతుగా నిలుస్తుందన్నారు. ‘‘500 పేజీల నివేదిక సభ ముందు పెట్టి, కేవలం 30 నిమిషాల చర్చతో తీర్పు వెలువరించడమా? అంత తక్కువ సమయంలో సభ్యులు నిర్ణయానికి ఎలా రాగలరు?’’ అని మమత ప్రశ్నించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తథ్యమన్నారు. మొయిత్రాకు దన్నుగా నిలిచినందుకు ఇండియా కూటమికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌తో పాటు బీఎస్పీ, ఎస్పీ, సీపీఐ, పీడీపీ తదితర పారీ్టల నేతలు కూడా బహిష్కరణను తప్పుబట్టారు. ఏం జరిగింది? వ్యాపారవేత్త దర్శన్ హీరా నందానీ నుంచి మొయిత్రా భారీగా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకుని ఆయనకు లబ్ధి చేకూర్చేలా అదానీ సంస్థ తదితరాలపై లోక్‌సభలో ప్రశ్నలడిగారంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే గత అక్టోబర్‌లో తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేగాక మొయిత్రా తన లోక్‌సభ వెబ్సైట్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కూడా నందానీకి ఇచ్చారని దూబేతో పాటు ఆమె మాజీ సన్నిహితుడు జై అనంత్ దేహద్రాయ్ కూడా ఆరోపించారు. అది నిజమేనంటూ నందానీ ఎథిక్స్ కమిటీకి అఫిడవిట్ సమరి్పంచారు. దీనిపై మొయిత్రాను ఎథిక్స్ కమిటీ విచారణకు పిలిచింది. అసభ్యకరమైన ప్రశ్నలడిగారంటూ విచారణను ఆమె బాయ్‌కాట్ చేశారు. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ప్రశ్నలడిగేది నా పీఏనే! మొయిత్రా ఉదంతంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో జేడీ(యూ) సభ్యుడు గిరిధారీ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ‘‘నాకసలు కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియదు. అందుకే నేను ఒక్క లిఖిత ప్రశ్న కూడా స్వయంగా అడగలేదు. నా లోక్‌సభ పోర్టల్ లాగిన్‌ఐడీ, పాస్వర్డ్ నా పీఏ దగ్గరుంటాయి. నా తరఫున నా ప్రశ్నలన్నింటినీ అతనే అందులో అడుగుతాడు’’ అని చెప్పుకొచ్చారు! దాంతో అంతా అవాక్కయ్యారు. అలా ఇతరులతో ప్రశ్నలు తయారు చేయించకూడదంటూ ఎంపీని స్పీకర్ మందలించారు. ఏ ఆధారాలతో వేటు? తనకు వ్యతిరేకంగా ఏ ఆధారాలూ లేకపోయినా ఎథిక్స్ కమిటీ తప్పుడు సిఫార్సు చేసిందని మొయిత్రా ఆరోపించారు. విపక్షాలను లొంగదీసుకునేందుకు మోదీ సర్కారు చేతిలో ఆయుధంగా కమిటీ పని చేస్తోందని దుయ్యబట్టారు. ‘‘నాకు డబ్బు గానీ, కానుకలు గానీ ఇచి్చనట్టు ఒక్క ఆధారమన్నా ఉందా? పైగా, అసలు ఉనికిలోనే లేని నైతిక నియామవళిని ఉల్లంఘించానని తేల్చడం మరీ విడ్డూరం’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘ఎథిక్స్ కమిటీ నివేదిక నియమావళిలోని ప్రతి రూల్‌నూ ఉల్లంఘించింది. సభ ఆమోదించి ప్రోత్సహించిన రోజువారీ విధానాన్ని పాటించినందుకు నన్ను శిక్షిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించి చరిత్ర సృష్టించిన 17వ లోక్‌సభే 78 మంది మహిళా ఎంపీల్లో ఒకరినైన నన్ను ఫక్తు కక్షసాధింపు రాజకీయాల్లో భాగంగా వెంటాడి వేధించిన ఉదంతానికి కూడా వేదికైంది. బంగ్లాదేశ్ సరిహద్దులను ఆనుకున్న సుదూర లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ రాజకీయ నేపథ్యమూ లేని నావంటి తొలిసారి ఎంపీని అనుక్షణం వేధించింది’’ అంటూ ధ్వజమెత్తారు. విరుద్ధ వాంగ్మూలాలు ఫిర్యాదుదారుల్లో ఒకరు తన మాజీ సహచరుడని మొయిత్రా గుర్తు చేశారు. ‘‘అతడు తప్పుడు ఉద్దేశంతో నాపై బురదజల్లాడు. కేవలం ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులిచి్చన వాంగ్మూలాల ఆధారంగా నాపై వేటు వేశారు. వారి వాంగ్మూలాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నా పట్టించుకోలేదు. కనీసం వారిని విచారించను కూడా లేదు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ కూడా పిలిచి విచారించలేదు’’ అంటూ ఆక్షేపించారు. ‘‘నందానీ వ్యాపార ప్రయోజనాల కోసం అతని దగ్గర డబ్బులు, కానుకలు తీసుకుని సభలో ప్రశ్నలడిగానని ఎంపీ దూబే తన ఫిర్యాదులో ఆరోపించారు. నందానీ మాత్రం నేనే నా సొంత అజెండాను ముందుకు తీసుకెళ్లడానికి వీలైన ప్రశ్నలు లోక్‌సభ పోర్టల్‌లో అప్లోడ్ చేసేలా తనపై ఒత్తిడి తెచ్చానని సుమోటో అఫిడవిట్ దాఖలు చేశారు. వీటిలో ఏది నిజం?’’ అని ప్రశ్నించారు. లాగిన్ రూల్స్ ఉన్నాయా? లోక్‌సభ పోర్టల్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఇతరులకు ఇచ్చానన్న ఏకైక అభియోగంపైనే తనను బహిష్కరించారని మొయిత్రా గుర్తు చేశారు. కానీ ఈ విషయంలో ఎలాంటి నియమ నిబంధనలూ లేవని వాదించారు. 30 ఏళ్లైనా పోరాడతా: మొయిత్రా ఎథిక్స్ కమిటీ నివేదికను మొయిత్రా తూర్పారబట్టారు. నిబంధనలకు పాతరేస్తూ తనపై హడావుడిగా వేటు వేశారని ఆరోపించారు. స్పీకర్ నిర్ణయం అనంతరం విపక్ష ఇండియా కూటమి నేతలు సోనియాగాం«దీ, రాహుల్ గాంధీ తదితరులతో కలిసి పార్లమెంటు ఆవరణలో మొయిత్రా మీడియాతో మాట్లాడారు. ‘‘రేపు కచ్చితంగా సీబీఐని నా ఇంటిపైకి ఉసిగొల్పుతారు. మరో ఆర్నెల్ల పాటు నన్నిలాగే వేధిస్తారు. కానీ పారిశ్రామికవేత్త అదానీ అక్రమాల మాటేమిటి? ఆయన పాల్పడ్డ రూ.13 వేల కోట్ల బొగ్గు కుంభకోణంకేసి సీబీఐ, ఈడీ కన్నెత్తి కూడా చూడవెందుకు?’’ అని ప్రశ్నించారు. మోదీ సర్కారుకు అదానీ ఎంతటి ముఖ్యుడో తనపై వేటుతో మరోసారి నిరూపితమైందన్నారు. ‘‘లోక్‌సభ నుంచి బహిష్కరించి నా నోరు మూయించవచ్చని, పారిశ్రామికవేత్త అదానీ ఉదంతం నుంచి బయట పడొచ్చని భావిస్తే పొరపాటు. నాకిప్పుడు 49 ఏళ్లు. మరో 30 ఏళ్ల దాకా పార్లమెంటు లోపల, బయట మీపై పోరాడుతూనే ఉంటా’’ అని ప్రకటించారు. -
పీఓకే అంశంలో నెహ్రూది హిమాలయమంతటి తప్పిదం: అమిత్ షా
జమ్ము కశ్మీర్: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అంశంలో మాజీ ప్రధాని నెహ్రూపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. పీవోకే సమస్యకు నెహ్రూదే బాధ్యత అంటూ నిప్పులు చెరిగారు. పీవోకే విషయంలో నెహ్రూ చేసింది చిన్న తప్పు కాదు.. హిమాలయమంతటి తప్పిదమని ధ్వజమెత్తారు. దేశంలో చాలా భూభాగాన్ని నెహ్రూ వదిలివేశారని తప్పుబట్టారు. జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు-2023, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2023పై పార్లమెంట్లో అమిత్ షా ప్రసంగించారు. #WATCH | Union Home Minister Amit Shah says, "Two mistakes that happened due to the decision of (former PM) Pandit Jawaharlal Nehru due to which Kashmir had to suffer for many years. The first is to declare a ceasefire - when our army was winning, the ceasefire was imposed. If… pic.twitter.com/3TMm8fk5O1 — ANI (@ANI) December 6, 2023 మాజీ ప్రధాని నెహ్రూ రెండు భారీ తప్పులు చేశారని షా అన్నారు. మొదటిది కాల్పుల విరమణ చేయడం కాగా రెండోది.. మన అంతర్గత పీఓకే అంశాన్ని ఐరాసకు తీసుకువెళ్లి నెహ్రూ మరో తప్పిదం చేశారని అమిత్ షా చెప్పారు. అప్పట్లో కాల్పుల విరమణ మరో మూడు రోజులు చేయకుండా ఉంటే.. పీఓకే ఇప్పుడు జమ్ముకశ్మీర్‌లో భాగంగా ఉండేదని తెలిపారు. పీఓకే ఎప్పటికైనా భారత్‌దే అని షా పునరుద్ఘాటించారు. కాగా.. నెహ్రూ గురించి అమిత్ షా మాట్లాడుతుంటే.. సభ నుంచి కాంగ్రెస్ వాకౌంట్ చేసింది. ప్రస్తుతం పీఓకేకు 24 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తున్నట్లు షా పేర్కొన్నారు. గతంలో జమ్మూలో 37 సీట్లు ఉండగా, ఇప్పుడు 43 ఉన్నాయని స్పష్టం చేశారు. కశ్మీర్లో గతంలో 46 సీట్లు ఉండగా.. ప్రస్తుతం 47 స్థానాలు ఉన్నాయి. పీఓకేకు 24 సీట్లు కేటాయించామని అమిత్ షా స్పష్టం చేశారు. ఇదీ చదవండి: పీఓకేపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు -
పీవోకే మనదే: పార్లమెంట్లో అమిత్ షా ప్రకటన
జమ్ము కశ్మీర్: పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పీవోకే భారత్‌లో అంతర్భాగమేనని ప్రకటించారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో పీవోకేకు ప్రత్యేక స్థానాలు కూడా కేటాయించారు. పీవోకేకు 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు స్పష్టం చేశారు. #WATCH | Union Home Minister Amit Shah speaks on The Jammu and Kashmir Reservation (Amendment) Bill, 2023 & The Jammu and Kashmir Reorganisation Bill, 2023 He says, "A few people also tried to underestimate it...someone said that only the name is being changed. I would like to… pic.twitter.com/7W5KkHbxlP — ANI (@ANI) December 6, 2023 జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు-2023, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2023పై పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించారు. అన్యాయం జరిగిన వారికి న్యాయం చేకూర్చడానికి మాత్రమే ఈ బిల్లులను తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు. అణగారిని వారిని పైకి తీసుకురావడమే రాజ్యాంగ మూల సూత్రమని పేర్కొన్నారు. దేశంలో 1980 దశకంలో ఉగ్రవాదం తీవ్రంగా పెరిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో ఓ భాగాన్ని ఆక్రమించుకుని అక్కడి ప్రజలను నిరాశ్రయుల్ని చేశారని మండిపడ్డారు. కశ్మీరీ పండిట్లు తమ సొంత దేశంలో శరణార్ధులుగా బతికాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 46,631 కుటుంబాలు, 1,57,968 మంది తమ సొంత స్థలాలను వదిలి వచ్చారని తెలిపారు. ప్రస్తుత బిల్లులతో వారందరికి హక్కులు కల్పించబడతాయని చెప్పారు. #WATCH | Union Home Minister Amit Shah speaks on The Jammu and Kashmir Reservation (Amendment) Bill, 2023 & The Jammu and Kashmir Reorganisation Bill, 2023 He says, "There was an era of terrorism after the 1980s and it was horrifying. Those who lived on the land considering it… pic.twitter.com/j1O6JIcOIq — ANI (@ANI) December 6, 2023 "కశ్మీర్‌పై పాకిస్థాన్ 1947లో దాడి చేసింది. ఆ సమయంలో దాదాపు 31,789 కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. 1965, 1971 యుద్ధాల సమయంలో 10,065 కుటుంబాలు వలసబాట పట్టాయి. 1947, 1969, 1971 యుద్ధాల్లో మొత్తం 41,844 కుటుంబాలు శరణార్థులుగా తరలివచ్చాయి. ఈ బిల్లు ఆ ప్రజలకు హక్కులు కల్పించడానికి వచ్చిందే" అని అమిత్ షా అన్నారు. #WATCH | Union Home Minister Amit Shah speaks on The Jammu and Kashmir Reservation (Amendment) Bill, 2023 & The Jammu and Kashmir Reorganisation Bill, 2023 He says, "Pakistan attacked Kashmir in 1947 in which around 31,789 families were displaced...10,065 families were… pic.twitter.com/WerMOQreco — ANI (@ANI) December 6, 2023 -
Parliament Winter Sessions: ఉభయ సభలు వాయిదా
లైవ్ అప్డేట్స్.. ►పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా.. తిరిగి రేపు ఉదయం 11గం. ప్రారంభం ►పీవోకే అంశంతో అట్టుడికిపోయిన పార్లమెంట్. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌దేనని షా ప్రకటన. పీవోకే అంశంలో దేశ తొలి ప్రధాని నెహ్రూను నిందించిన కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా. ప్రతిపక్ష సభ్యుల వాకౌట్. ప్రధాని మోదీ అక్కడి ప్రజల బాధ అర్థం చేసుకున్నారని.. 70 ఏళ్లుగా దక్కని న్యాయం అందిస్తారని షా వ్యాఖ్యలు. బయటకు వచ్చాక.. అమిత్ షా ప్రసంగంపై విమర్శలు, సెటైర్లు సంధించిన విపక్ష సభ్యులు. #WATCH | On Union HM Amit Shah's remark on Pandit Nehru, Former J&K CM and National Conference (NC) President Farooq Abdullah says, "...At that time, the army was diverted to save Poonch and Rajouri. If it had not been done, Poonch and Rajouri would have also gone to… pic.twitter.com/tjqx537TRw — ANI (@ANI) December 6, 2023 ►కశ్మీర్ బిల్లులతో వారికి న్యాయం.. ‘‘70 ఏళ్లుగా అన్యాయానికి, అవమానాలకు గురైన వారికి న్యాయం చేసేందుకు ఈ బిల్లులను ప్రవేశపెడుతున్నాను. ఏ సమాజంలోనైనా వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావాలి. ఈ క్రమంలో వారి గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా చూడాలి. అదే భారత రాజ్యాంగం ప్రాథమిక ఉద్దేశం. ప్రస్తుతం చాలా మంది కశ్మీరీలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకొంటున్నారు. ఈ బిల్లుతో వారికి హక్కులు, ఉద్యోగాలు, విద్యావకాశాలు, రిజర్వేషన్ల సాయంతో ఎన్నికల్లో నిలబడే అవకాశాలు వస్తాయి’’ అని అమిత్‌షా వెల్లడించారు. ► దేశంలో 1980 దశకంలో ఉగ్రవాదం పెరిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో ఓ భాగాన్ని ఆక్రమించుకుని అక్కడి ప్రజలను నిరాశ్రయుల్ని చేశారని మండిపడ్డారు. కశ్మీరీ పండిట్లు తమ సొంత దేశంలో శరణార్ధులుగా బతికారని దుయ్యబట్టారు. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 46,631 కుటుంబాలు, 1,57,968 మంది తమ సొంత స్థలాలను వదిలి వచ్చారని తెలిపారు. ప్రస్తుత బిల్లులతో వారందరికి హక్కులు కల్పించబడతాయని చెప్పారు. #WATCH | Union Home Minister Amit Shah speaks on The Jammu and Kashmir Reservation (Amendment) Bill, 2023 & The Jammu and Kashmir Reorganisation Bill, 2023 He says, "There was an era of terrorism after the 1980s and it was horrifying. Those who lived on the land considering it… pic.twitter.com/j1O6JIcOIq — ANI (@ANI) December 6, 2023 ► పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే భారత్‌లో అంతర్భాగమేనని ప్రకటించారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో పీఓకేకు ప్రత్యేక స్థానాలు కూడా కేటాయించారు. పీఓకేకు 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు-2023, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2023పై పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించారు. అన్యాయం జరిగిన వారికి న్యాయం చేకూర్చడానికి మాత్రమే ఈ బిల్లులను తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు. #WATCH | Union Home Minister Amit Shah speaks on The Jammu and Kashmir Reservation (Amendment) Bill, 2023 & The Jammu and Kashmir Reorganisation Bill, 2023 Says, "The Bill that I have brought here pertains to bringing justice to and providing rights to those against whom… pic.twitter.com/DAl8zIv7Zi — ANI (@ANI) December 6, 2023 ► జమ్ముకశ్మీర్, లఢక్‌లో గణనీయ అభివృద్ధి జరిగిందని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. "J-K, Ladakh witnessed profound affirmative and progressive changes" : MoS Home Nityanand Rai to Rajya Sabha Read @ANI Story | https://t.co/biq4Bmyh7C#ParliamentSession #JammuKashmir #NityanandRai pic.twitter.com/dZEYFyMRl7 — ANI Digital (@ani_digital) December 6, 2023 ► మిచౌంగ్ తుఫాను నష్టాన్ని అంచనా వేయడానికి తమిళనాడుకు కేంద్ర బృందాన్ని పంపాలని డీఎంకే ఎంపీ టిఆర్ బాలు లోక్‌సభలో కోరారు. మిచౌంగ్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించడాన్ని పరిశీలించాలని విన్నవించారు. #WATCH | DMK MP TR Baalu in Lok Sabha calls upon the Centre to send to team to Tamil Nadu to assess flood damage due to the cyclone and consider declaring it a national calamity pic.twitter.com/pyCKYDCAyP — ANI (@ANI) December 6, 2023 ► డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ గోమూత్ర వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని పేర్కొంటూ.. ప్రజల మనోభావాలు దెబ్బతింటే ఉపసంహరించుకుంటాను అని తెలిపారు #WATCH | Winter Session of Parliament | DMK MP DNV Senthilkumar S expresses regret over his 'Gaumutra' remark and withdraws it. "The statement made by me yesterday inadvertently, if it had hurt the sentiments of the Members and sections of the people, I would like to withdraw… pic.twitter.com/S0cjyfb7HU — ANI (@ANI) December 6, 2023 ► డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ గోమూత్ర వ్యాఖ్యలపై సభలో గందరగోళం నెలకొంది. దీంతో లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. Lok Sabha adjourned till 12 noon amid ruckus in the House. pic.twitter.com/T8bjnXoDGe — ANI (@ANI) December 6, 2023 ►కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడి హత్యపై కేంద్ర మంత్రి కైలాష్ చౌధరి స్పందించారు. రాజస్థాన్‌లో రౌడీయిజానికి స్థానంలేదని చెప్పారు. దోషులకు కఠిన శిక్ష విధించాలని అన్నారు. #WATCH | On the murder of Sukhdev Singh Gogamedi, the national president of Rashtriya Rajput Karni Sena in Rajasthan, Union minister Kailash Choudhary says, "There is no place for goons in Rajasthan. Punishment should be given to those who indulge in criminal activities." pic.twitter.com/PayX03nd1b — ANI (@ANI) December 6, 2023 ► ఇండియా కూటమి భేటీ వాయిదా పడటంపై బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. జ్వరం కారణంగా తాను హాజరుకాలేకపోతున్నానని మాత్రమే చెప్పినట్లు పేర్కొన్నారు. మరో మీటింగ్ వెళ్తానని చెప్పారు. కూటమి ముందుకు వెళుతుందని తెలిపారు. #WATCH | On INDIA bloc meeting, Bihar CM & JD(U) leader Nitish Kumar says, "I want that work should progress. It was being said in the news that I was not going to attend the meeting. I was down with a fever. Is it possible that I will go not to the meeting? In the next meeting… pic.twitter.com/9Qj5eqCvvE — ANI (@ANI) December 6, 2023 ► పార్లమెంట్ సమావేశాలకు కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియాగాంధీ హాజరయ్యారు. పార్లమెంట్ భవనం వద్దకు చేరుకున్నారు. #WATCH | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrives at the Parliament for its winter session proceedings. pic.twitter.com/boMXxmOJWF — ANI (@ANI) December 6, 2023 ► ఉత్తరాది రాష్ట్రాలను డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ గోమూత్ర రాష్ట్రాలు అని అభివర్ణించడంపై బీజేపీ ఎంపీ సాధ్వీ నిరంజన్ జ్యోతి తప్పుబట్టారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ లేదని సెంథిల్ చేసిన వ్యాఖ్యలపై సాధ్వీ మండిపడ్డారు. కర్ణాటకలో ఎక్కువ ఎంపీలు బీజేపీకి చెందినవారేనని మర్చిపోవద్దని గుర్తుచేశారు. తెలంగాణలోనూ ముగ్గురు ఎంపీలు, ఇటీలవ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు విజయం సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. దేశాన్ని విభజించే వ్యాఖ్యలు చేయరాదని హితువు పలికారు. సెంథిల్ వ్యాఖ్యలపై సోనియాగాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. #WATCH | On the 'Gaumutra' remark (which has hence been expunged) by DMK MP DNV Senthilkumar in the Parliament yesterday, BJP MP Sadhvi Niranjan Jyoti says, "They have forgotten that there was BJP govt in Karnataka. Most number of MPs in Karnataka are from BJP. We have 3 MPs from… pic.twitter.com/y90x8dUQcT — ANI (@ANI) December 6, 2023 ►పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మూడవ రోజు ప్రారంభం అయ్యాయి. సమావేశాలకు హాజరు కావడానికి పార్లమెంట్ భవనం వద్దకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వచ్చారు. #WATCH | Union Home Minister Amit Shah and Defence Minister Rajnath Singh arrive in Parliament, on the third day of the winter session pic.twitter.com/N8g8V3jxl5 — ANI (@ANI) December 6, 2023 ► డిసెంబర్ 2 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 22 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజుల పాటు ఈ సెషన్ జరగనుండగా.. ఈ సెషన్లో మొత్తం 15 సమావేశాలు జరగనున్నాయి. ►అంతే కాకుండా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనేక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. శీతాకాల సమావేశాల్లో తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లు, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుతో సహా 7 కొత్త బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ►అంతేకాదు IPC, CRPC , క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ , ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ప్రతిపాదిత చట్టాలను కూడా ఈ సమావేశాలలో సమ్పర్పించనున్నారు. ఈ శీతాకాల సమావేశాల్లో ఇండియన్ జస్టిస్ కోడ్ బిల్లు-2023, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ బిల్లు-2023 , ఇండియన్ ఎవిడెన్స్ బిల్లు-2023తో సహా వివిధ బిల్లులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
అన్ని అంశాలపై చర్చకు సిద్ధం: ప్రహ్లాద్ జోషి
ఢిల్లీ: అన్ని అంశాలపై ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ఈ సెషన్ లో 21 బిల్లులు తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. జనవరిలో ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నారు. పార్లమెంట్ అఖిలపక్ష సమావేశం నేడు ముగిసింది. ఈ సమావేశానికి 23 పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ప్రహ్లాద్ జోషి మాట్లాడారు. పేదల కోసం అనేక అద్భుత పథకాలు తెచ్చాం.. అయిదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలపై చర్చ జరగాలని కోరుకుంటున్నామని ప్రహ్లాద్ జోషి తెలిపారు. పూర్తి స్థాయిలో జరగాల్సిన చివరి సెషన్.. స్వల్ప కాలిక చర్చకు వాతావరణం కల్పించాల్సిన బాధ్యత విపక్షాలదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నేడు(శనివారం) నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష భేటీ సమావేశాన్ని ఈ రోజు ఏర్పాటు చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి 22 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో రెండు జమ్మూకశ్మీర్, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు, ఐపీసీ స్థానంలో తెచ్చే మూడు నేర శిక్షాస్మృతి బిల్లులు ఉన్నాయి. వివాదాస్పద ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లును కూడా ప్రభుత్వం ఈ సమావేశంలో ప్రవేశపెట్టనుంది. #WATCH | Delhi: An all-party meeting is underway at the Parliament Library building, ahead of the winter session of Parliament. The winter session of Parliament, 2023 will begin from December 4 and continue till December 22. pic.twitter.com/PSwDtGFyPk — ANI (@ANI) December 2, 2023 శీతాకాల సమావేశాల్లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్యను 107 నుంచి 114కు పెంచే బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకు రానుంది. దీనివల్ల కశ్మీర్ నుంచి వలస వెళ్లినవారికి, శరణార్థులకు, ఎస్టీలకు చట్టసభలో ప్రాతినిథ్యం లభించనుంది. ఈ బిల్లులతోపాటు 2023-24కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్లపై సమావేశాల్లో చర్చ, ఓటింగ్ జరగనుంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఐపిసి , సీఆర్పీసీలను మారుస్తూ కొత్త బిల్లులను తీసుకురానున్నారు. మోడీ 2.0 ప్రభుత్వానికి ఇవి చివరి శీతాకాల సమావేశాలు గమనార్హం. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్ష నేతలు సిద్ధమవుతున్నారు. ఇదీ చదవండి: Rajasthan Exit Poll Analysis: కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు? ఓడితే బాధ్యులెవరు? -
PRS Legislative Research: నిర్ణీత సమయానికి మించి పనిచేసిన పార్లమెంట్
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సెషన్లో లోక్‌సభ, రాజ్యసభలు షెడ్యూల్ సమయానికి మించి పనిచేశాయి. 17వ లోక్‌సభ సెషన్లలో ఎటువంటి వాయిదాలు లేకుండా పూర్తి సమయంపాటు కార్యకలాపాలు కొనసాగించిన ఏకైక సెషన్ కూడా ఇదే. ఈ విషయాలను పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ తెలిపింది. గురువారంతో ముగిసిన ఈ ప్రత్యేక సెషన్లో 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్థానం, చంద్రయాన్–3 మిషన్ విజయవంతంపై చర్చ జరిగింది. ఒకే ఒక్క మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. స్పెషల్ సెషన్లో లోక్‌సభ షెడ్యూల్ సమయం 22 గంటల 45 నిమిషాలు కాగా ఎనిమిదిగంటల కంటే ఎక్కువగా మొత్తం 31 గంటలపాటు పనిచేయడం విశేషం. దీంతో, లోక్‌సభ 137 శాతం ఎక్కువ సమయం పనిచేసింది. అదే విధంగా, రాజ్యసభ షెడ్యూల్ సమయం 21 గంటల 45 నిమిషాలు కాగా, 27 గంటల 44 నిమిషాల సేపు కార్యకలాపాలు సాగాయి. దీంతో, రాజ్యసభ 128 శాతం ఎక్కువ సమయం పనిచేసినట్లయిందని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వివరించింది. -
Womens Reservation Bill 2023: సుస్థిర ప్రభుత్వం వల్లే మహిళా బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్రంలో పూర్తి మెజార్టీతో కూడిన బలమైన, సుస్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవడం వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బిల్లుకు రికార్డు స్థాయిలో మద్దతు లభించిందని, చిరకాలం నాటి కల సాకారమైందని అన్నారు. పూర్తి మెజార్టీతో కూడిన స్థిరమైన ప్రభుత్వం అధికారంలో ఉంటే గొప్ప నిర్ణయాలు తీసుకోవచ్చని ఈ పరిణామం నిరూపిస్తోందని తెలిపారు. బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పార్టీ మహిళా ఎంపీలు, నేతలు శుక్రవారం ఢిల్లీలో ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కలి్పంచడం అనేది సాధారణ చట్టం కాదని చెప్పారు. ఇది నవ భారతదేశంలో నూతన ప్రజాస్వామిక అంకితభావ తీర్మానమని స్పష్టం చేశారు. గతంలో మహిళా రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా అడ్డుకున్న ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు ఇప్పుడు తాము తీసుకొచి్చన బిల్లుకు మద్దతిచ్చాయని గుర్తుచేశారు. గత దశాబ్ద కాలంలో తమ ప్రభుత్వ హయాంలో మహిళా శక్తి పెరిగిందని, అందుకే బిల్లుకు అన్ని పార్టీల మద్దతు లభించిందని వివరించారు. గౌరవాన్ని పెంచితే తప్పేమిటి? మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం కంటే ముందే మహిళల అభివృద్ధి, సాధికారత కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమల్లోకి తీసుకొచ్చామని ప్రధాని మోదీ వెల్లడించారు. అన్ని స్థాయిల్లో మహిళల స్థితిగతులను మెరుగుపర్చడమే లక్ష్యంగా పని చేశామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యక్తుల రాజకీయ ప్రయోజనాలు అడ్డుపడకుండా చర్యలు చేపట్టామన్నారు. గతంలో ఈ బిల్లు విషయంలో అప్పటి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ఆక్షేపించారు. మహిళలను కించపర్చే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. మహిళా బిల్లుకు ‘నారీశక్తి వందన్’ అనే పేరుపెట్టడం పట్ల విపక్ష ఎంపీలు చేస్తున్న ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. మహిళామణుల గౌరవాన్ని పెంచితే తప్పేమిటని ప్రశ్నించారు. బిల్లును పార్లమెంట్లో ఆమోదించే అవకాశం తమ ప్రభుత్వానికి దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని మోదీ వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాల బీజేపీ ఆకాంక్ష నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. మహిళల్లో నూతన విశ్వాసం కొన్ని నిర్ణయాలకు దేశ భవిష్యత్తు మార్చే శక్తి ఉంటుందని, ప్రతిపాదిత మహిళా రిజర్వేషన్ చట్టం కూడా వాటిలో ఒకటని ప్రధానమంత్రి అన్నారు. ఈ చట్టం మహిళల్లో నూతన విశ్వాసాన్ని నింపుతుందని, దేశాన్ని బలోపేతం చేస్తుందని చెప్పారు. ఈ నెల 20, 21న కొత్త చరిత్ర నమోదైందని, దీని గురించి భవిష్యత్తు తరాలు చర్చించుకుంటాయని పేర్కొన్నారు. ‘మోదీ గ్యారంటీలు’ అమలవుతాయని చెప్పడానికి మహిళా బిల్లే ఒక నిదర్శనమని చెప్పారు. మహిళల సారథ్యంలో అభివృద్ధి అనే నూతన శకంలోకి అడుగుపెట్టబోతున్నామని ప్రకటించారు. భారత్‌ను చంద్రుడిపైకి చేర్చడంలో మహిళల పాత్ర కీలకమని ప్రశంసించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు బుజ్జగింపు రాజకీయాలు చేశాయని విమర్శించారు. మోదీ ప్రభుత్వం మహిళా సాధికారతే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. -
Womens Reservation Bill 2023: ఏకగ్రీవ ఆమోదానికి కలిసి రండి
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందేందుకు కలిసి రావాల్సిందిగా విపక్షాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బిల్లులో లోపాలేమన్నా ఉంటే తర్వాత సరిచేసుకుందామని సూచించారు. కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన జోక్యం చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. బిల్లు అమలులో ఆలస్యానికి సంబంధించి కాంగ్రెస్ సహా విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. మహిళలకు రిజర్వేషన్లు 2029 తర్వాత అమల్లోకి వస్తాయన్న సంకేతాలిచ్చారు. ఓబీసీలకు బీజేపీ పాలనలో అన్యాయం జరుగుతోందన్న విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చారు. వారికి తమ హయాంలోనే అన్నింటా అత్యధిక ప్రాతినిధ్యం దక్కిందని చెప్పారు. ‘రాబోయే ఎన్నికల తర్వాత కేంద్రంలో వచ్చే నూతన ప్రభుత్వం వెంటనే జన గణన, నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుంది. పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదానికి ఇది ఐదో ప్రయత్నం. ఇప్పుడు కాంగ్రెస్ లేవనెత్తిన అడ్డంకులను అధిగమించేందుకు వారి హయాంలో ఎందుకు ప్రయతి్నంచలేదు? అందుకే గత నాలుగు సార్లూ బిల్లును ఆమోదించలేని పార్లమెంటు తీరుతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అందుకే ఈసారైనా ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించుకుందాం‘ అని విపక్షాలను అమిత్ షా కోరారు. రాహుల్ పై విసుర్లు 90 మంది కేంద్ర కేబినెట్ కార్యదర్శుల్లో ముగ్గురు మాత్రమే ఓబీసీలు ఉన్నారన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను అమిత్ ఎద్దేవా చేశారు. ‘కార్యదర్శులు దేశాన్ని నడుపుతారన్నది నా సహచర ఎంపీ అవగాహన! కానీ నాకు తెలిసినంత వరకూ ప్రభుత్వమే దేశాన్ని నడుపుతుంది. విధాన నిర్ణయాలు చేసేది కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్‘ అన్నారు. ‘ఎవరో స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన చీటీలను సభలో చదవడం గొప్ప కాదు. ఓబీసీల అభ్యున్నతికి ప్రధాని మోదీ చిత్తశుద్ధితో కృషి చేశారు‘ అన్నారు. ‘బీజేపీ ఎంపీల్లో దాదాపు 29 శాతం మంది ఓబీసీలే. దేశవ్యాప్తంగా 27 శాతానికి పైగా బీజేపీ ఎమ్మెల్యేలు, 40 శాతానికి పైగా ఎమ్మెల్సీలు ఓబీసీలే’ అని అమిత్ అన్నారు. అప్పుడు కేంద్రాన్నే నిందిస్తారు! మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణం అమల్లోకి తేవాలన్న విపక్షాల డిమాండ్‌ను అమిత్ షా తోసిపుచ్చారు. ‘రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్, అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్ అధినేత) ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ లోక్‌సభా స్థానాలు ఒకవేళ మహిళలకు రిజర్వ్ అయితే రాజకీయాలు చేస్తోందంటూ అందుకు మళ్లీ మోదీ సర్కారునే నిందిస్తారు. అందుకే నియోజకవర్గాల పునరి్వభజనను సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ సారథ్యంలోని కమిషన్ పూర్తి పారదర్శకంగా చేపడుతుంది‘ అన్నారు. -
ప్రధాని మోదీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించాయి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ విభజన అంశంపై మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే.. ప్రధాని మోదీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగించాయని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ అవమానించడం ఇదే తొలిసారి కాదని అన్నారు. మోదీ...తెలంగాణ విరోధి! తెలంగాణ మీద పదే పదే ప్రధానికి అదే అక్కసు ఎందుకని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అమృతకాల సమావేశాలని పేరుపెట్టి.. విషం చిమ్మడం సంస్కారహీనమని అన్నారు. తెలంగాణ అంటేనే గిట్టనట్టు, పగబట్టినట్టు.. మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా? అని మోదీ వ్యాఖ్యలను ఆక్షేపించారు. తల్లిని చంపి బిడ్డను తీశారని అజ్ఞానం, అహంకారంతో ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారని దుయ్యబట్టారు. పోరాడి దేశాన్ని ఒప్పించి మెప్పించి.. సాధించుకున్న స్వరాష్ట్రం పట్ల ఎందుకంత చులకన భావం మీకని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొని మా ఆత్మగౌరవాన్ని గాయపర్చడం సబబు కాదని అన్నారు. మోదీ...తెలంగాణ విరోధి! తెలంగాణ మీద పదే..పదే అదే అక్కసు ఎందుకు ప్రధాని..? అమృతకాల సమావేశాలని పేరుపెట్టి విషం చిమ్మడం ఏం సంస్కారం ..? తెలంగాణ అంటేనే గిట్టనట్టు..పగబట్టినట్టు మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా..? తల్లిని చంపి బిడ్డను తీసారని అజ్ఞానం..అహంకారంతో ఇంకెన్నిసార్లు మా… https://t.co/3tNjBJSVOK — KTR (@KTRBRS) September 18, 2023 తెలంగాణపై ఎంత కోపమో.. అప్పర్ భద్ర, పోలవరం, కెన్‌బెత్వాకు జాతీయ హోదాఇచ్చి.. మధ్యలో తెలంగాణకు మొండిచేయి ఎందుకు? మేం చేసిన పాపమేందని కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బయ్యారంలో ఉక్కు ఫాక్టరీ ఉరేసి, గిరిజన వర్సిటీ పెట్టకుండా నానబెట్టి.. ఆదివాసులపై కక్ష సాధిస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌కు ఆర్బిట్రేషన్ సెంటర్ వస్తే ఓర్వలేరు. మీరు నిధులివ్వరు. సొంత ఆర్థిక వనరులు సమకూర్చుకుంటే ఆంక్షలు విధిస్తారని దుయ్యబట్టారు. కాజీపేట కోచ్ ఫాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయి దశాబ్దాల కలని కల్లలు చేసిన మీ దుర్మార్గాన్ని క్షమించగలమా? 157 మెడికల్ కాలేజీల్లో ఒక్కటి ఇవ్వకుండా గుండు సున్నా చేశారంటే.. మీకు తెలంగాణపై ఎంత కోపమో అని మంత్రి కేటీఆర్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తో ఊదరగొట్టే బీజేపీకి తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావని అన్నారు. డిపాజిట్లు కోల్పోవడంలో మళ్లీ సెంచరీ కొట్టడం పక్కా అని ఎద్దేవా చేశారు. మోదీ అలా అనలే: కిషన్ రెడ్డి ప్రధాని మోదీ ఎవర్నీ విమర్శించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పారు. సంతోష వాతావరణంలో బీజేపీ మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటును సామరస్యంగా చేయలేకపోయిందని మాత్రమే మోదీ అన్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ లో జరిగిన విషయాలను మాత్రమే మోదీ చెప్పారు.. విభజన బిల్లు సమయంలో పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు పెప్పర్ స్ప్రే చేశారు.. కారం, నీళ్ళు చల్లారు.. తలుపులు మూశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 'ట్విట్టర్ లేకుంటే బ్రతకను, అమెరికాలో ట్విట్టర్ నేర్చుకున్నట్లు, ట్విట్టర్ కోసమే బ్రతుకుతున్నట్లు మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. తెలంగాణ విమోచన దినానికి, సమైక్యతకు తేడా కేసీఆర్ కు అర్థం కావడం లేదు.. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు ప్రధాని మోదీ మాటలు అర్థం చేసుకునే పరిస్థితి లేదు' అని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి: బీఆర్ఎస్ Vs కాంగ్రెస్.. నేతల మధ్య పొలిటికల్ వార్ -
ఢిల్లీలో అఖిలపక్ష భేటీ
ఢిల్లీ: రేపు ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ముందు నేడు కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలో నేడు అల్ పార్టీ మీటింగ్ జరిగింది. అన్ని పార్టీల నేతలు, ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. YSRCP తరుపున విజయసాయిరెడ్డి హాజరయ్యారు. #WATCH | Delhi: All-party meeting underway at the Parliament library building, ahead of the special session of Parliament that will begin tomorrow pic.twitter.com/Sn66dXZ3yo — ANI (@ANI) September 17, 2023 పార్లమెంట్లో రేపు ప్రారంభం కానున్న ప్రత్యేక సమావేశాల్లో చర్చించాల్సిన అంశాల గురించి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. స్పెషల్ సెషన్ అజెండాపై చర్చించారు. సమావేశాలకు సహకరించాలని అన్ని పార్టీల నాయకుల్ని కోరారు. ఈ నెల 18న 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయాణం పై చర్చ జరగనుంది. రాజ్యసభలో రెండు, లోక్‌సభలో రెండు బిల్లుపై చర్చ జరగనున్నట్లు ఆయా బులిటెన్లు పేర్కొన్నాయి. రాజ్యసభలో.. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు, ది పోస్ట్ ఆఫీస్ బిల్లు, అలాగే లోక్‌సభలో అడ్వకేట్స్ యాక్ట్ సవరణ బిల్లు, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ బిల్లులపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: మాధవన్ పోస్టుకు ప్రధాని మోదీ స్పందన -
Manipur violence: మణిపూర్‌లో భరతమాత హత్య
సాక్షి, న్యూఢిల్లీ: అధికార బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మణిపూర్‌లో భరతమాతను బీజేపీ ప్రభుత్వం హత్య చేసిందని గర్జించారు. రాష్ట్రంలో హింసాకాండను అరికట్టడంలో, శాంతిని నెలకొల్పడంలో నరేంద్ర మోదీ సర్కారు దారుణంగా విఫలమైందని ఆరోపించారు. బీజేపీ నాయకులు ముమ్మాటికీ దేశద్రోహులేనని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో రెండోరోజు బుధవారం కూడా చర్చ కొనసాగింది. ఈ చర్చలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత సభలో ఆయన మాట్లాడడం ఇదే మొదటిసారి. దాదాపు 30 నిమిషాల పాటు ప్రసంగం సాగింది. బీజేపీపై, మోదీ సర్కారుపై దుమ్మెత్తి పోశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆ సమయంలో మోదీ సభలో లేరు. అలాగే తన ‘భారత్ జోడో యాత్ర’ అనుభవాలను రాహుల్ పంచుకున్నారు. ఒకవైపు ఆయన ప్రసంగం కొనసాగుతుండగా, మరోవైపు సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విపక్ష ఎంపీలు ‘ఇండియా.. ఇండియా’ అని నినాదాలు చేయగా, అధికార పక్ష సభ్యులు ‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. గౌతమ్ అదానీ గురించి మాట్లాడడానికి సభకు రాలేదని, భయపడకండి అని బీజేపీ సభ్యులకు చురక అంటిస్తూ రాహుల్ తన ప్రసంగం ప్రారంభించారు. సభలో ఆయన ఏం మాట్లాడారంటే... ప్రజల మద్దతుతోనే పాదయాత్ర దిగి్వజయం భారత్ జోడో యాత్ర ఇంకా పూర్తి కాలేదు. ఈ యాత్ర ప్రారంభించినప్పుడు ఎందుకు నడుస్తున్నారు? మీ లక్ష్యం ఏమిటి? అని చాలామంది అడిగారు. పాదయాత్ర చేయాలని ఎందుకు అనుకున్నానో తొలుత తెలియలేదు. నేను దేన్ని ప్రేమిస్తానో అర్థం చేసుకోవడానికి, దేనికోసం నేను మరణానికి కూడా సిద్ధమో గుర్తించడానికి, మోదీకి చెందిన జైలుకు వెళ్లడానికి యాత్ర చేస్తున్నట్లు క్రమంగా తెలుసుకున్నా. నేను నిత్యం 10 కిలోమీటర్లు పరుగెత్తేవాడిని. అలాంటిది పాదయాత్రలో రోజుకు 25 కిలోమీటర్లు నడవలేనా అనుకున్నా. అప్పట్లో నాలో అహంకారం ఉండేది. భారత్ జోడో యాత్ర ఆ అహంకారాన్ని మాయం చేసింది. యాత్ర మొదలైన తర్వాత రెండు మూడు రోజుల్లోనే నాకు ఒళ్లు నొప్పులు ప్రారంభమయ్యాయి. నాలో అహంకారం పూర్తిగా మాయమైంది. పాదయాత్రలో ప్రజలు నాకు అండగా నిలిచారు. వారి మద్దతుతోనే యాత్ర దిగి్వజయంగా కొనసాగించా. ప్రతిరోజూ ప్రజలు చెప్పింది విన్నాను. నా వద్దకు ఓ రైతు వచ్చాడు. అతడికి పంటల బీమా దక్కలేదని చెప్పాడు. అతడి ఆకలి బాధ నాకు అర్థమైంది. ఆ తర్వాత నా యాత్ర తీరు మారిపోయింది. అప్పటినుంచి చుట్టుపక్కల ప్రజల నినాదాలు నాకు వినిపించలేదు. బాధితుల ఆవేదనే వినిపించేది. భారత్ జోడో యాత్ర పూర్తి కాలేదు. తూర్పు నుంచి పశి్చమ భారతదేశం వరకూ పాదయాత్ర కొనసాగిస్తా. దేశంలో వేర్వేరు భాషలు ఉన్నాయని చెబుతుంటారు. ఇది నేల, ఇది బంగారం, ఇది వెండి అని అంటుంటారు. కానీ, సత్యం ఏమిటంటే ఈ దేశం ఓ గొంతుక. దాన్ని వినాలంటే మన మనసులోని అహంకారాన్ని, విద్వేషాన్ని విడనాడాలి. అప్పుడే దేశం గొంతుక మనకు వినిపిస్తుంది. ప్రజల గొంతుకను హత్య చేశారు భారత్ అంటేనే ఓ గొంతుక. భారత్ మన ప్రజల గొంతుక. అది ప్రజల హృదయ స్పందన. అలాంటి గొంతుకను మీరు(బీజేపీ ప్రభుత్వం) మణిపూర్‌లో హత్య చేశారు. అంటే భరతమాతను హత్య చేశారు. మణిపూర్ ప్రజలను హత్య చేయడం ద్వారా భారతదేశాన్ని హత్యచేశారు. అందుకే మీ ప్రధాని( మోదీ) మణిపూర్ వెళ్లడం లేదు. మీరు దేశభక్తులు కాదు, దేశ ద్రోహులు. మీరు భరతమాత రక్షకులు కాదు. భరతమాతను హత్య చేసిన హంతకులు. నా తల్లి ఈ సభలోనే ఉన్నారు. మరో తల్లి అయిన భరతమాత మణిపూర్‌లో హత్యకు గురైంది. మణిపూర్‌లో హింసను అరికట్టనంత వరకూ నా తల్లి హత్యకు గురవుతూనే ఉంటుంది. దేశాన్ని దహనం చేసే కుట్రలు సైన్యం ఒక్క రోజులో మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించగలదు. కానీ, కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని మణిపూర్‌లో మోహరించడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం మణిపూర్‌లో భారతదేశాన్ని హత్య చేయాలనుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల మాటలు వినడం లేదు. కేవలం ఇద్దరి మాటలే వింటున్నారు. రావణాసురుడు కేవలం మేఘనాథుడు, కుంభకర్ణుడి మాటలే విన్నాడు. అలాగే మోదీ కేవలం గౌతమ్ అదానీ, అమిత్ షా మాటలనే ఆలకిస్తున్నారు. రావణుడి అహంకారమే లంకను దహనం చేసింది. రావణుడి అహంకారమే అతడిని అంతం చేసింది. మీరు దేశం మొత్తం కిరోసిన్ చల్లుతున్నారు. మణిపూర్‌లో కిరోసిన్ చల్లి నిప్పు రగిలించారు. హరియాణాలోనూ ఇప్పుడు అదే చేస్తున్నారు. దేశాన్ని దహనం చేసేందుకు మీరు కుతంత్రాలు పన్నుతున్నారు. దేశమంతటా భరతమాతను అంతం చేస్తున్నారు’’ అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రసంగం అనంతరం ఆయన సభ నుంచి బయటకు వెళ్తూ ఇతర సభ్యుల వైపు చూస్తూ ‘ఫ్లైయింగ్ కిస్’ ఇచ్చారు. మణిపూర్ బాధితుల ఆవేదన విన్నా కొన్ని రోజుల క్రితం మణిపూర్ వెళ్లాను. అక్కడికి ప్రధాని ఇప్పటికీ వెళ్లలేదు. మోదీ దృష్టిలో మణిపూర్ లేదు. మణిపూర్ భారతదేశంలో ఒక భాగం కాదని అనుకుంటున్నారు. నేను ‘మణిపూర్’ అనే పదాన్ని వాడాను. కానీ, మణిపూర్ అనేదే లేదు. దానిని రెండుగా విభజించారు. బీజేపీ ప్రభుత్వం మణిపూర్‌ను విచి్ఛన్నం చేసింది. నేను మణిపూర్‌లో సహాయక శిబిరాలకు వెళ్లాను. అక్కడున్న మహిళలు, పిల్లలతో మాట్లాడాను. ఒక మహిళను ‘అక్క.. మీకు ఏమైంది?’ అని అడిగా. దానికి ఆమె ‘నాకు ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు. నా కళ్ల ముందే అతడిని కాలి్చచంపారు. రాత్రంతా నేను నా బిడ్డ మృతదేహం పక్కనే కూర్చున్నాను. ఆ తర్వాత భయపడి కట్టుబట్టలతో, చేతిలో ఓ ఫొటోతో నా ఇంటిని విడిచిపెట్టాను’ అని ఆమె నాతో చెప్పింది. మరో మహిళను ‘మీకు ఏమైంది?’ అని అడగ్గానే, ఆమెకు జరిగింది గుర్తుకు వచ్చి వణికిపోవడం మొదలుపెట్టింది. సొమ్మసిల్లి పడిపోయింది. మణిపూర్‌లో హిందూస్తాన్‌ను బీజేపీ హత్య చేసిందని చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలు. -
ఢిల్లీ బిల్లు నెగ్గింది
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ సీనియర్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై నియంత్రణ కోసం ఉద్దేశించిన ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023’ సోమవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ అనంతరం సభాపతి ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 131 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 102 మంది ఎంపీలు ఓటువేశారు. ఢిల్లీ బిల్లు గత వారమే లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎగువ సభ సైతం ఆమోద ముద్ర వేయడంతో ఇక రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 238. అధికార ఎన్డీయేతోపాటు ఈ బిల్లు విషయంలో ఆ కూటమికి అనుకూలంగా ఉన్న సభ్యుల సంఖ్య 131. వారంతా బిల్లుకు మద్దతు పలికారు. ఇక విపక్ష ‘ఇండియా’ కూటమితోపాటు ఇతర విపక్ష సభ్యుల సంఖ్య 104 ఉండగా, బిల్లుకు వ్యతిరకంగా 102 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో ముగ్గురు సభ్యులు ఎటూ తేల్చుకోలేదు. ఓటింగ్‌లో పాల్గొనలేదు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తారా?: విపక్షాలు ఢిల్లీ బిల్లును రాజ్యసభలో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై తొలుత సభలో చర్చను కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ ప్రారంభించారు. బిల్లు రాజ్యాంగవిరుద్ధమని, ప్రజాస్వామ్య వ్యతిరేకమని చెప్పారు. మనమంతా కచి్చతంగా వ్యతిరేకించాలని విపక్షాలకు పిలుపునిచ్చారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్న ఈ చర్య ఏదో ఒక రోజు మీ దాకా వస్తుంది అంటూ హెచ్చరించారు. సుప్రీంకోర్టు రాజ్యాంగం ధర్మాసనం ఇచి్చన రెండు తీర్పులకు వ్యతిరేకంగా బిల్లును తీసుకొచ్చారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ.. ఢిల్లీ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. అలాగే బిల్లుపై చర్చలో ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎండీకే, సమాజ్‌వాదీ పార్టీ, భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), ఆర్జేడీ, సీపీఎం, జేడీ(యూ), కేరళ కాంగ్రెస్(ఎం), సీపీఐ తదితర పారీ్టల సభ్యులు మాట్లాడారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను బలవంతంగా లాక్కోవడానికే బిల్లును తీసుకొచ్చారని దుయ్యబట్టారు. అధికారాలు లాక్కోవడానికి కాదు: అమిత్ షా బిల్లును తీసుకొచ్చింది కేవలం ఢిల్లీ ప్రజల హక్కులను కాపాడడం కోసమేనని, అంతేతప్ప ఆప్ ప్రభుత్వ అధికారాలను లాక్కోవడానికి కాదని అమిత్ షా తేలి్చచెప్పారు. ఢిల్లీ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చారు. ఇది పూర్తిగా చట్టబద్ధమేనని, సుప్రీంకోర్టు తీర్పును ఏ కోణంలోనూ ఉల్లంఘించడం లేదని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల కంటే ఢిల్లీ చాలా భిన్నమని తెలియజేశారు. పార్లమెంట్, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, సుప్రీంకోర్టు ఇక్కడే ఉన్నాయని, వివిధ దేశాల అధినేతలు ఢిల్లీని తరచుగా సందర్శిస్తుంటారని, అందుకే ఈ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసినట్లు పేర్కొన్నారు. పరిమిత అధికారాలున్న అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ అని అన్నారు. ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి దినం: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ‘దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి రోజు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు విషయంలో ఆప్‌నకు తోడుగా నిలిచిన రాజకీయ పార్టీలకు నా కృతజ్ఞతలు. ఢిల్లీలో నాలుగు పర్యాయాలు ఆప్ చేతిలో ఘోరంగా ఓటమిపాలైన బీజేపీ, దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకే ఈ బిల్లును తీసుకువచ్చింది. ఆప్ చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో బీజేపీ పోటీ పడలేకపోతోంది. నన్ను ముందుకు వెళ్లకుండా చేయడమే వారి ఏకైక లక్ష్యం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఒక్క సీటును కూడా ప్రజలు బీజేపీకి దక్కనివ్వరు. ఢిల్లీ వ్యవహారాల్లో ప్రధాని మోదీ జోక్యం ఎందుకు చేసుకుంటున్నారు? ’అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒక వీడియో విడుదల చేశారు. -
Parliament sessions 2023: పార్లమెంట్లో రచ్చరచ్చ
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో తక్షణమే చర్చ ప్రారంభించాలని, ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందేనని ప్రతిపక్షాలు పునరుద్ఘాటించాయి. సోమవారం ఉభయ సభల్లో ఆందోళనకు దిగాయి. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దీంతో లోక్‌సభ, రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడ్డాయి. సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు ఆమోదం లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన తర్వాత స్పీకర్ బిర్లా మాట్లాడారు. వెంటనే విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో లేచి నిల్చున్నారు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి ప్రకటన చేయాలని పట్టుబట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళన మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. విద్యా, ఆర్థిక శాఖలకు చెందిన ప్రశ్నలపై చర్చ మొదలైంది. ‘మీ స్థానాల్లోకి తిరిగి వెళ్లండి, సభకు సహకరించండి’ అని స్పీకర్ పదేపదే కోరినా విపక్ష సభ్యులు లెక్కచేయలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. లోక్‌సభ పునఃప్రారంభమైన తర్వాత సినిమాటోగ్రఫీ (సవరణ) బల్లు–2023ను ఆమోదించారు. ఈ బిల్లు రాజ్యసభలో గతంలోనే ఆమోదం పొందింది. పైరసీని అరికట్టడానికి ఈ బిల్లును తీసుకొచ్చినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ప్రతిపక్ష ఎంపీల ఆందోళన, నినాదాలు కొనసాగుతుండడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలో వాయిదాల పర్వం మణిపూర్ అంశంపై ‘267 నిబంధన’ కింద వెంటనే చర్చ చేపట్టాలని ఎగువసభలో ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి జోషి చెప్పారు. విపక్ష ఎంపీలు ప్రధాని సమాధానం చెప్పాలని పునరుద్ఘాటించారు. దీంతో సభను చైర్మన్ ధన్‌ఖడ్ పలుమార్లు వాయిదా వేశారు. తొలుత ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో మధ్యాహ్నం 2 గంటల దాకా, తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల దాకా, అనంతరం 3.30 గంటల వరకూ వాయిదా వేశారు. విపక్షాలు ఎంతకూ వెనక్కి తగ్గకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. మూడింట రెండొంతుల మెజార్టీ: పీయూష్ గోయల్ కేంద్రానికి లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజార్టీ ఉందని, ఈ విషయం అందరికీ తెలుసని కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ చెప్పారు. సంఖ్యలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయన్నారు. మెజార్టీని నిరూపించుకున్న తర్వాతే బిల్లులను ఆమోదించాలన్న నిబంధన ఏదీ లేదని పేర్కొన్నారు. అవిశ్వాసం తీర్మానంపై ఎప్పుడు చర్చ చేపట్టాలన్నది స్పీకర్ నిర్ణయిస్తారని వివరించారు. చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తేలి్చచెప్పారు. అలాగే మణిపూర్ అంశంపై పార్లమెంట్లో చర్చ జరిగే యూపీఏ ప్రభుత్వ హయాంనాటి నిర్వాకాలు బయటపడతాయన్న భయంతో కాంగ్రెస్ పార్టీ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని పీయూష్ గోయల్ మండిపడ్డారు. -
నేడు మణిపూర్‌కు ‘ఇండియా’
న్యూఢిల్లీ: మణిపూర్‌లో పర్యటించి, అక్కడి క్షేత్ర స్థాయి పరిస్థితులపై సమస్యలకు తగు పరిష్కారం చూపుతూ కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంట్‌కు నివేదిక అందజేస్తామని ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి నేతలు ప్రకటించారు. కూటమిలోని 16 పారీ్టలకు చెందిన 20 మంది ఎంపీలు ఈ నెల 29, 30వ తేదీల్లో మణిపూర్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ నుంచి ఆధిర్ రంజన్ ఛౌధురి, గౌరవ్ గొగోయ్, టీఎంసీ నేత సుష్మితా దేవ్, జేఎంఎంకు చెందిన మహువా మాజి, డీఎంకే కనిమొళి, ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్, ఆర్ఎల్డీ జయంత్ చౌధరి, ఆర్జేడీ మనోజ్ ఝా, ఆర్ఎస్పీ ఎన్కే ప్రేమచంద్రన్, వీసీకే నేత తిరుమావళన్. వీరితో పాటు జేడీ(యు) చీఫ్ రాజీవ్ రంజన్ సింగ్, జేడీ–యూకు చెందిన అనీల్ ప్రసాద్ హెగ్డే, సీపీఐ నుంచి సందేశ్ కుమార్, సీపీఎం నేత ఏఏ రహీం, ఎస్పీ నుంచి జావెద్ అలీఖాన్, ఐయూఎంఎల్ ఈటీ మహ్మద్ బషీర్, ఆప్ నేత సుశీల్ గుప్తా, శివసేన(యూటీ) అరి్వంద్ సావంత్, డీఎంకే నేత డి.రవి కుమార్, కాంగ్రెస్ నేతలు ఫులో దేవి నేతం, కె.సురేశ్ ఈ బృందంలో ఉన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తితో మణిపూర్ హింసపై దర్యాప్తు జరిపించాలని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మణిపూర్‌లో అంతా మంచిగానే ఉన్నట్లు చూపాలని కేంద్రం అనుకుంటోందని ఆరోపించారు. మహిళల గౌరవంతో ఆటలా? బీజేపీ అధికార దాహంతోమహిళల గౌరవంతో, దేశ ఆత్మగౌరవంతో ఆటలాడుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు ఫేస్బుక్లో వీడియో షేర్ చేశారు. మణిపూర్‌లో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నా కేంద్రం నోరు విప్పడం లేదని మండిపడ్డారు. మహిళా రెజ్లర్లపై బ్రిజ్‌భూషణ్ సింగ్ లైంగిక వేధింపులను ప్రస్తావిస్తూ, మహిళలను గౌరవించని దేశం పురోగమించదన్నారు. -
మన డేటా ఎంత భద్రం? కేంద్రం ముసాయిదా బిల్లులో ఏముంది ?
మనమున్న సైబర్ ప్రపంచంలో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పౌరుల వ్యక్తిగత గోప్యత ప్రశ్నార్థకంగా మారింది. ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకున్నా చాలు మన వ్యక్తిగత సమాచారం బజార్లో పడినట్టే. మెటా, ట్విట్టర్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు ఈ– కామర్స్ సైట్లు పౌరుల వ్యక్తిగత డేటాతో ఆటాడుకుంటున్నాయి. వీటి దూకుడుకు కళ్లెం వేయడానికే ఇప్పుడీ ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ‘‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ బిల్లు–2022’’ను (డీపీడీపీ) వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. ఈ డిజిటల్ ప్రపంచంలో పౌరుల వ్యక్తిగత సమాచారం గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. గత ఆరేళ్లుగా మేధోమథనం సాగించిన కేంద్రం ప్రభుత్వం ఎట్టకేలకు ముసాయిదా బిల్లును రూపొందించింది. గతేడాది నవంబర్‌లో ప్రజలు, సామాజిక సంస్థల అభిప్రాయం కోసం వెలువరించిన ముసాయిదా బిల్లులో అంశాలే ఇంచుమించుగా ఇందులో ఉన్నాయి. అయితే విదేశీ సంస్థలు సమాచార సేకరణలో కొన్ని ఆంక్షల్ని విధించారు. బిల్లులో ఏముందంటే ? డీపీడీపీ బిల్లును ఇంకా పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉండడంతో దీని వివరాలను కేంద్రం అత్యంత గోప్యంగా ఉంచింది. అయితే కొన్ని జాతీయ మీడియా కథనాల ప్రకారం నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన కొన్ని వివాదాస్పద అంశాలు అలాగే ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థలకు విస్తృతమైన మినహాయింపులు ఇవ్వడం, డేటా ప్రొటక్షన్ బోర్డు పాత్రను గణనీయంగా తగ్గించడం వంటివి ఉన్నట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఇక ప్రభుత్వాధికారులు, ఇతర నాయకులకు సంబంధించిన డేటా కూడా ఈ చట్టం కింద గోప్యంగా ఉంచడం వల్ల సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందనే ఆందోళనలున్నాయి. ఇంకా బిల్లులో ఉన్న అంశాలివే.. ► ఆన్లైన్ లేదంటే ఆఫ్‌లైన్ ద్వారా సమాచారం సేకరించి డిజిటలైజ్ చేసే పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని పూర్తిగా వారి సమ్మతితో సేకరించాలి. దానిని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత ఆ సంస్థలదే. తమ పని పూర్తి కాగానే ఆ సమాచారాన్ని తొలగించాలి. ► మన దేశంలో డిజిటల్ పర్సనల్ డేటాను సేకరించి ప్రాసెస్ చేయవచ్చు. అదే విదేశాల్లో వస్తు, సేవల వినియోగంలో మాత్రం డేటాను సేకరించే అవకాశం ఉంటుంది. ► వివిధ సామాజిక మాధ్యమాలు, ఈ కామర్స్ సంస్థలు, మొబైల్ యాప్స్ జవాబుదారీ తనం పెరిగేలా సేకరించిన సమాచారాన్ని ఎలా భద్రపరుస్తున్నారు, ఏ రకంగా సేకరిస్తున్నారు ? పౌరుల సమాచారాన్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నారు ? వంటి ప్రశ్నలకు ఆయా సంస్థలు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ► ఏదైనా సమాచారం చుట్టూ వివాదం చెలరేగితే కేంద్రం ఏర్పాటు చేయనున్న డేటా ప్రొటక్షన్ బోర్డు ఆఫ్ ఇండియా వాటిని పరిష్కరి స్తుంది. ఈ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను కేంద్రమే నియమిస్తుంది. ► పౌరుల వ్యక్తిగత సమాచారం ఉల్లంఘన జరిగితే సదరు కంపెనీలకు అత్యధికంగా రూ.250 కోట్ల జరిమానా విధించవచ్చు. ► ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు వేర్వేరు విధివిధానాలున్నాయి. జాతి భద్రతకు సంబంధించిన అంశాల్లో సమాచార సేకరణపై మినహాయింపులున్నాయి. ► పౌరులు తమ డేటాను వాడుకున్నారని భావిస్తే నష్టపరిహారం కోసం కోర్టుకి ఎక్కొచ్చు. చిన్నారుల వ్యక్తిగత డేటాను సేకరించాల్సి వచ్చిన ప్పుడు వారి లీగల్ గార్డియన్ అనుమతి తప్పనిసరిగా ఉంటుంది. ► ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో వాణిజ్య లావాదేవీల్లో అత్యంత కీలకం కానుంది. గతంలో ఏం జరిగింది? వ్యక్తిగత డేటా పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ కఠినమైన నిబంధనల్నీ విధిస్తూ ఉంటే మన ప్రభుత్వం 2018 నుంచి ఈ చట్టంపై కసరత్తు చేస్తోంది. వ్యక్తిగత డేటా పరిరక్షణ కోసం ఉద్దేశించిన శ్రీకృష్ణ కమిటీ 2018లో ఒక ముసాయిదా బిల్లు కేంద్రానికి సమర్పించింది. కానీ కేంద్రానికి, దిగ్గజ సామాజిక మాధ్యమ సంస్థలకి మధ్య ఒక అంగీకారం రాలేదు. చివరికి 2019లో ఒక ముసాయిదా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లులో సమగ్రత లోపించిందని స్వయంగా జస్టిస్ శ్రీకృష్ణ పేర్కొనడం కలకలం రేపింది. డేటా పరిరక్షణ బిల్లు నిబంధనల్ని అతిక్రమించే వారి జాబితా నుంచి ప్రభుత్వం తనని తాను మినహాయించుకోవడంతో దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆ బిల్లులో 81 సవరణలు చేయాలంటూ పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించడంతో గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును ఉపసంహరించుకుంది. విదేశాల్లో వ్యక్తిగత గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ప్రపంచంలోని 71% దేశాల్లో వ్యక్తిగత సమాచారం భద్రతపై కఠినమైన చట్టాలే ఉన్నాయి. వాణిజ్యం, అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సులో తీసుకున్న నిర్ణయానికనుగుణంగా 194 దేశాల్లోని 137 దేశాలు డేటా పరిరక్షణ కోసం చట్టాలు రూపొందించాయి. ► ఆఫ్రికా దేశాల్లో 54గాను 33 దేశాల్లో (61%) డేటా చట్టాలు అమల్లో ఉన్నాయి. ► ఆసియా దేశాల్లో ఇది ఇంకా తక్కువగా 57% మాత్రమే ఉంది. ► 60 దేశాలకు గాను 34 దేశాలు చట్టాలను రూపొందించాయి. ఇక వెనుకబడిన దేశాలు 46కి గాను 22 దేశాల్లో మాత్రమే చట్టాలున్నాయి. అంతర్జాతీయంగా ఈయూ మోడల్, యూఎస్ మోడల్ చట్టాలే అత్యధికంగా ప్రాచుర్యం పొందాయి. ఈయూ మోడల్లో వ్యక్తిగత సమాచార సేకరణ నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయి. పౌరుల డేటా బయటకు వచ్చిందంటే ఆయా సంస్థలకు భారీగా జరిమానాలు విధిస్తాయి. అత్యధిక దేశాలు ఈ మోడల్‌నే అనుసరిస్తున్నాయి. ఇక అమెరికా మోడల్లో డేటా భద్రతని వ్యక్తుల స్వేచ్ఛ పరిరక్షణగా చూస్తారు. ప్రభుత్వాలు కూడా వ్యక్తుల పర్సనల్ స్పేస్‌లోకి వెళ్లవు. వ్యక్తుల డేటా అవసరమైన ప్రతీ సారి వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. -సాక్షి, నేషనల్ డెస్క్ -
పార్లమెంట్లో ఆగని రగడ
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్లో దుమారం కొనసాగుతూనే ఉంది. అధికార, విపక్ష సభ్యుల నినాదాలు, కేకలతో ఉభయసభలు వరుసగా మూడో రోజు బుధవారం సైతం స్తంభించాయి. రాహుల్ క్షమాపణకు బీజేపీ సభ్యులు, అదానీ వ్యవహారంపై జేపీసీకి విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. దాంతో లోక్‌సభ, రాజ్యసభ మళ్లీ వాయిదా పడ్డాయి. ప్రజాస్వామ్యాన్ని అవమానించారు బుధవారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. అదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) డిమాండ్‌తో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలకు దిగారు. రాహుల్ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు సైతం నినాదాలు ప్రారంభించారు. వెల్‌లోంచి వెళ్లి సభ జరగనివ్వాలని స్పీకర్ ఓం బిర్లా కోరారు. కార్యకలాపాలకు అడ్డు తగులుతున్న విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను మంత్రి పీయూష్ గోయల్ కోరారు. పార్లమెంట్ సభ్యుడైన ఓ వ్యక్తి విదేశాలకు వెళ్లి ఇదే పార్లమెంట్‌ను దారుణంగా కించపర్చారని రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. సభ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడింది. వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా విపక్ష ఎంపీలు నినాదాలు కొనసాగించారు. సభ సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత సభ్యులందరిపైనా ఉందని సభాపతి స్థానంలో ఉన్న భర్తృహరి మెహతాబ్ చెప్పారు. సభలో ప్రభుత్వానికి సంబంధించిన పత్రాలకు తప్ప ప్లకార్డులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గందరగోళం కొనసాగుతుండగానే రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ఇంటర్–సర్వీసెస్(కమాండ్, కంట్రోల్, డిసిప్లిన్) బిల్లు–2023ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ సభకు వచ్చి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ మన దేశాన్ని అవమానించారంటూ ప్రవాస భారతీయుల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని వెల్లడించారు. భారత్ సార్వభౌమత్వ దేశమని, మన దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలంటూ ఇతర దేశాలను రాహుల్ కోరడం ఏమిటని ప్రహ్లాద్ జోషీ ఆక్షేపించారు. అనంతరం సభ గురువారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ గందరగోళం లోక్‌సభలో కనిపించిన దృశ్యాలే రాజ్యసభలోనూ పునరావృతమయ్యాయి. లండన్‌లో చేసిన వ్యాఖ్యల పట్ల రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అధికారపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీలు ఎదురుదాడికి దిగారు. అరుపులు కేకలతో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మళ్లీ ప్రారంభమైన తర్వాత ఇరుపక్షాల నడుమ వాగ్వాదం కొనసాగింది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రసంగించేందుకు ప్రయత్నించగా, బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. రాహుల్ క్షమాపణ చెప్పిన తర్వాతే కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడాలంటూ నినాదాలు చేశారు. సభ్యులంతా శాంతించాలని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పదేపదే కోరినా ఫలితం లేకుండాపోయింది. సభ ముందుకు సాగే అవకాశాలు లేకపోవడంతో మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాహుల్ క్షమాపణ ప్రసక్తే లేదు: ఖర్గే రాహుల్ వ్యాఖ్యలపై ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ నేతలపై గతంలో ప్రధాని మోదీ విదేశాల్లో చేసిన వ్యాఖ్యలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎదురుదాడికి దిగారు. ‘‘భారత్‌లో పుట్టినందుకు గతంలో మీరంతా సిగ్గుతో తలదించుకునేవారు. అదో పాపంగా భావించారు. జీవిస్తున్నారు అని ప్రధాని హోదాలో చైనాలో మోదీ అన్నారు. రాహుల్ మాటల్లో తప్పేంలేదు. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు’’ అని స్పష్టంచేశారు. ‘ భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రాన్ని అణగదొక్కుతున్నారు. నిజం మాట్లాడితే జైలు పంపుతున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని చంపడం కాదా?’’ అన్నారు. -
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దుమారం... దద్దరిల్లిన పార్లమెంట్
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల యూకేలో చేసిన వ్యాఖ్యల పట్ల సోమవారం పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. రాహుల్ వెంటనే క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు డిమాండ్ చేయగా, గౌతమ్ అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిందేనని కాంగ్రెస్ పునరుద్ఘాటించింది. ఇరు పక్షాల నడుమ వాగ్వాదాలతో ఉభయ సభలు స్తంభించాయి. నినాదాలు, అరుపులు కేకలతో హోరెత్తిపోయాయి. ఎలాంటి కార్యకలాపాలు జరక్కుండానే లోక్‌సభ, రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడ్డాయి. రాహుల్‌కు కొంతైనా సిగ్గుంటే.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం పునఃప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు లోక్‌సభలో సంతాపం ప్రకటించారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. భారత ప్రజాస్వామ్యంపై ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నారని, లండన్‌లో మన దేశ ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని దుయ్యబట్టారు. విదేశీ శక్తులే భారత్‌ను కాపాడాలంటూ రాహుల్ మాట్లాడడం ఏమిటని నిలదీశారు. రాహుల్ వ్యాఖ్యలను లోక్‌సభ మొత్తం ఖండించాలని, ఈ దిశగా చొరవ తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. రాహుల్‌ను సభకు రప్పించి, క్షమాపణ చెప్పించాలని అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి కొంతైనా సిగ్గుంటే సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉందని, రోజురోజుకూ బలోపేతం అవుతోందని వెల్లడించారు. సభ సజావుగా సాగేలా సభ్యులంతా సహకరించాలని సూచించారు. నినాదాలు ఆపాలని కోరారు. మన ప్రజాస్వామ్యంపై ప్రజలకు గొప్ప విశ్వాసం ఉందన్నారు. సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. రాజ్యసభలో అదే రగడ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై రాజ్యసభలోనూ అధికార, విపక్ష సభ్యుల మధ్య రగడ జరిగింది. ఎవరూ శాంతించకపోవడంతో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను రాజ్యసభ ఖండించాలని డిమాండ్ చేశారు. పీయూష్ గోయల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఖర్గే కోరారు. రాహుల్‌పై దేశద్రోహం కేసు పెట్టాలి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మీడియాతో మా ట్లాడారు. తుక్డే–తుక్డే గ్యాంగ్ తరహాలో మాట్లాడిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలన్నా రు. ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదు చేయా లని డిమాండ్ చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని రాహుల్ కించపర్చారని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఆక్షేపించారు. పార్లమెంట్‌కు రాహుల్ క్షమాపణ చెప్పాలన్నారు. -
అదానీ అంశంపై ప్రశ్నిస్తూనే ఉంటాం: ఖర్గే
న్యూఢిల్లీ: అదానీ అంశాన్ని పార్లమెంట్ లోపలా, బయటా లెవనెత్తుతూనే ఉంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఇది చాలా పెద్ద కుంభకోణమన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అదానీ అంశంతోపాటు తన, పార్టీ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించడం తదితర 10 ప్రశ్నలను ఆయన ప్రభుత్వానికి సంధించారు. ప్రజల డబ్బునకు సంబంధించిన అదానీ అంశం పెద్ద కుంభకోణమని ఖర్గే పేర్కొన్నారు. ‘దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది? ఆర్బీఐ, సెబీ, ఈడీ, సీబీఐ వంటి సంస్థలు తమ విధులను నిర్వర్తించకుండా ఎందుకు చేశారు? కుంభకోణాలెన్ని జరిగినా మౌనంగా ఉన్నారెందుకు?అని ఆయన అన్నారు. వీటిపై పార్లమెంట్ వెలుపల, లోపల ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. వీటిపై ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకుండా, నియంత మాదిరిగా వ్యవహరిస్తానంటే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని సాగనంపుతారని హెచ్చరించారు. రాజ్యసభలో ప్రశ్నలు మాత్రమే అడిగాను తప్ప ఎలాంటి అన్‌పార్లమెంటరీ మాటలు మాట్లాడలేదన్నారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ, రాజ్యసభ రికార్డుల నుంచి తన మాటలను తొలగించడంపై ఆయన.. ప్రజాస్వామ్యం పేరుతో ఏం జరుగుతోందో మీరే ఊహించుకోండని వ్యాఖ్యానించారు. తన మిత్రుడి కుంభకోణాల మకిలిని పోగొట్టేందుకు ప్రధాని మోదీ పార్లమెంట్‌ను వాషింగ్ మెషీన్‌లాగా వాడుకుంటున్నారని ఖర్గే ట్వీట్ చేశారు. -
ప్రజలే రక్షణ కవచం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో 140 కోట్ల మంది ప్రజల విశ్వాసాన్ని రక్షణ కవచంగా ధరిస్తున్నానని ఉద్ఘాటించారు. విమర్శకుల దూషణలు, అబద్ధాలు, ఆరోపణలు తననేమీ చేయలేవని తేల్చిచెప్పారు. ప్రజలు తన పట్ల చూపుతున్న విశ్వాసాన్ని ఎవరూ దెబ్బతీయలేరని అన్నారు. జీవితంలో ప్రతిక్షణం దేశం కోసమే పని చేస్తున్నానని చెప్పారు. స్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం వల్ల అంతర్జాతీయ సంస్థలకు భారత్‌పై నమ్మకం పెరిగిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ప్రధాని మోదీ 85 నిమిషాలపాటు ప్రసంగించారు. కోవిడ్–19 మహమ్మారి, సంఘర్షణల వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సంక్షోభం, అస్థిరత కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో భారత్ వైపు చూస్తోందని వివరించారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే.. తిట్లు, ఆరోపణలను జనం అంగీకరిస్తారా? ‘‘140 కోట్ల మంది భారతీయులు సాధించిన విజయాలను కొందరు(విపక్ష నేతలు) చూడలేకపోతున్నారు. భారత్ సాధించిన ప్రగతిని ఒప్పుకోవాలంటే వారికి కష్టంగా ఉంది. సంక్షోభ సమయంలో నేను అందించిన సాయం ఏమిటో ప్రజలకు తెలుసు. మీరు (ప్రతిపక్షాలు) నన్ను తిడుతున్న తిట్లు, నాపై చేస్తున్న ఆరోపణలను జనం అంగీకరిస్తారా? కేవలం పత్రికలు, టీవీల్లోని వార్తలను చూసి జనం నాపై నమ్మకం పెంచుకోలేదు. ప్రజాసేవ పట్ల చాలా ఏళ్లుగా నా అంకితభావాన్ని చూసి నన్ను విశ్వసిస్తున్నారు. నిర్మాణాత్మక విమర్శలు చేయాల్సింది పోయి పనికిమాలిన ఆరోపణలతో ప్రతిపక్షాలు గత తొమ్మిదేళ్ల కాలాన్ని వృథా చేశాయి. కొందరు వ్యక్తులు కేవలం వారి కుటుంబం కోసమే జీవిస్తున్నారు. 25 కోట్ల భారతీయ కుటుంబాల కోసం నేను జీవిస్తున్నా. 2030వ దశాబ్దం ‘భారతదేశ దశాబ్దం’ మీరు ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలను తప్పుపడుతున్నారు. ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తున్నారు. మీకు అనుకూలమైన తీర్పులు ఇవ్వకపోతే సుప్రీంకోర్టును ఆక్షేపిస్తున్నారు. దేశ ఆర్థికాభివృద్ధి సాధిస్తోందన్న మాట వినపడితే చాలు ఆర్బీఐపై నిప్పులు కక్కుతున్నారు. 2014 కంటే ముందున్న దశాబ్దం మనం ‘కోల్పోయిన దశాబ్దం’. కానీ, 2030వ దశాబ్దం ‘భారతదేశ దశాబ్దం’. మొబైల్ ఇంటర్నెట్ డేటా ఖర్చు గతంలో రూ.250 ఉండేది. ఇప్పుడు అది రూ.10కి దిగివచ్చింది. దేశంలో 70 ఏళ్లలో 70 ఎయిర్‌పోర్టులు నిర్మించారు. కానీ, గత తొమ్మిదేళ్లలోనే 70కిపైగా ఎయిర్‌పోర్టులు నిర్మించాం. ‘తయారీ కేంద్రం’గా భారత్ 2008లో దేశంలో జరిగిన ఉగ్రవాద దాడులను ఎవరూ మర్చిపోలేరు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే దమ్ము అప్పటి ప్రభుత్వానికి లేకుండాపోయింది. అందుకే రక్తపాతం జరిగింది, అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. యూపీఏ దుష్పరిపాలనకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. ముంబైలో ఉగ్రదాడి జరిగినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. 2జీ, బొగ్గు గనుల కేటాయింపు, కామన్వెల్త్ క్రీడల కుంభకోణాలు యూపీఏలో పాలనలోనే చోటుచేసుకున్నాయి. 2004–2014 దశాబ్దం కుంభకోణాలమయంగా మారింది. దేశవ్యాప్తంగా ఉగ్రదాడుల వల్ల ప్రజల్లో అభద్రత నెలకొంది. 2014 నుంచి ఎన్డీయే సర్కారు పాలనలో మన దేశంలో స్టార్టప్‌ల బూమ్ పెరిగింది. ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కొంటున్నాం. మౌలిక సదుపాయాల కల్పన వేగంగా సాగుతోంది. మన దేశం ఇప్పుడు ‘తయారీ కేంద్రం’గా ఎదుగుతోంది. ప్రపంచం తన భవిష్యత్తు, సౌభాగ్యాన్ని భారతదేశ అభివృద్ధిలో వెతుక్కుంటోంది. పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం’’ అని ప్రధాని మోదీ వివరించారు. ప్రధాని ప్రసంగం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్, వామపక్షాల సభ్యులతోపాటు కొందరు కాంగ్రెస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. దృష్టికోణాన్ని బట్టే చూస్తారు హిందీ వ్యంగ్య రచయిత కాకా హత్రాసీ, కవి దుష్యంత్ కుమార్ చెప్పిన ద్విపదలను మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ‘‘అటూ ఇటూ ఎందుకు చూస్తారు. ఎవరైనా ఏదైనా వారి దృష్టికోణాన్ని బట్టే సన్నివేశాన్ని చూస్తారు’’ అని ప్రతిపక్షాలను ఉద్దేశించి చెప్పారు. అలాగే ‘‘మీ పాదాల కింద భూమి లేదు. ఆశ్చర్యం ఏమిటంటే మీరు ఇప్పటికీ ఆ విషయం నమ్మడం లేదు’’ అని అన్నారు. -
చైనా సేనలను తరిమికొట్టాం
న్యూఢిల్లీ: భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా చేసిన ప్రయత్నాలను మన సైన్యం పూర్తిస్థాయిలో తిప్పికొట్టిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ‘‘అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో యాంగ్ట్సే ప్రాంతం వద్ద వాస్తవాధీన రేఖను దాటేందుకు, తద్వారా యథాతథ స్థితిని మార్చేందుకు డిసెంబర్ 9న చైనా సైన్యం ప్రయత్నించింది. వాటన్నింటినీ మన సైనికులు చాలా గట్టిగా తిప్పికొట్టారు. మన సైనిక కమాండర్లు సకాలంలో స్పందించడంతో చైనా సైన్యం తోక ముడిచింది’’ అని చెప్పారు. ఈ మేరకు మంగళవారం పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆయన వేర్వేరుగా ప్రకటన చేశారు. ‘‘ఈ ఘర్షణ ఇరు సైనికుల నడుమ భౌతిక పోరుకూ దారి తీసింది. మనవాళ్లు వీరోచితంగా పోరాడారు. మన భూభాగాల్లోకి చొచ్చుకొచ్చేందుకు చైనా సైన్యం చేసిన ప్రయత్నాలను వమ్ము చేసి వారిని తరిమికొట్టారు’’ అని వివరించారు. ‘‘ఈ ప్రయత్నంలో మనవైపు ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు. కొందరు సైనికులు స్వల్పంగా గాయపడ్డారు’’ అని స్పష్టం చేశారు. ‘‘ఈ ఘటన తర్వాత మన స్థానిక సైనిక కమాండర్, చైనా కమాండర్ మధ్య డిసెంబర్ 11న ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. దీనిపై మన ఆగ్రహాన్ని, అభ్యంతరాలను దౌత్య మార్గాల్లో కూడా చైనాకు తెలియజేశాం. ఇలాంటి దుందుడుకు చర్యలను పునరావృతం చేయొద్దని, సరిహద్దుల వెంబడి శాంతి, సామరస్యాలను కాపాడాలని గట్టిగా చెప్పాం’’ అని వెల్లడించారు. ‘‘మన భూభాగాన్ని ఆక్రమించేందుకు జరిగే ఎలాంటి ప్రయత్నాలనైనా పూర్తిగా తిప్పికొట్టేందుకు, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు సైన్యం నిత్యం సన్నద్ధంగా ఉంది. సభకు ఈ మేరకు హామీ ఇస్తున్నా’’ అని చెప్పారు. అంతకుముందు తాజా పరిస్థితిపై సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సమీక్ష జరిపారు. గల్వాన్ తరహా ఘర్షణ ► డిసెంబర్ 9 నాటి చైనా ఆక్రమణ యత్నం మరోసారి రెండేళ్లనాటి ‘గల్వాన్ లోయ’ ఉదంతాన్ని తలపించింది. విశ్వసనీయ సమాచారం మేరకు... చైనా సైనికులు అచ్చం అప్పటి మాదిరిగానే ఇనుప ముళ్లతో కూడిన లావుపాటి ఆయుధాలు, కర్రల వంటివాటితో దాడికి దిగారు. అప్పట్లాగే పరిస్థితి మరోసారి బాహాబాహీకి కూడా దారితీసింది. ► తవాంగ్ పరిసరాల్లో యాంగ్ట్సే వద్ద 17 వేల అడుగుల పై చిలుకు ఎత్తున్న మంచు శిఖరాలపై పట్టు కోసం చైనా ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే దాదాపు రెండేళ్ల అనంతరం మరోసారి మన భూభాగాల్లోకి సైలెంటుగా చొచ్చుకొచ్చేందుకు డిసెంబర్ 9న దొంగ ప్రయత్నం చేసింది. ► అయితే అక్కడ ఎటు చూసినా మన సైన్యం భారీగా మోహరించిన తీరుతో చైనా దళాలు అవాక్కైనట్టు సమాచారం. వాటి చొరబాటు యత్నాలను మనవాళ్లు దీటుగా అడ్డుకోవడమే గాక పూర్తిస్థాయిలో తరిమి కొట్టారు. ► ఆ ప్రాంతంలో భారత సైన్యపు మోహరింపులు హై రిజల్యూషన్ కెమెరాలతో తీసిన ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కన్పిస్తున్నాయి. ► 2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్ సమీపంలోని గల్వాన్ లోయ వద్ద చైనా, భారత దళాల మధ్య జరిగిన భీకర పోరు జరగడం తెలిసిందే. దానివల్ల ఇరుదేశాల సంబంధాలు బాగా క్షీణించాయి. ► అప్పటినుంచి తూర్పు ప్రాంతంలో వాస్తవా ధీన రేఖ వద్ద మోహరింపులను, యుద్ధ సన్నద్ధతను సైన్యం బాగా పెంచింది. నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. ► ఆ తర్వాత ఇరు దేశాల మధ్య చోటుచేసుకున్న పెద్ద ఘర్షణ ఇదే. ఈ దురాక్రమణ యత్నంలో చైనా వైపు చాలామంది సైనికులు గాయపడ్డట్టు సమాచారం. ► 2012 అక్టోబర్‌లో కూడా యాంగ్ట్సే ప్రాంతంలోనే భారత, చైనా సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ► కొంతకాలంగా ఈ ప్రాంతంలో చైనా డ్రోన్ల హడావుడి బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా రగడకు ముందే మన యుద్ధ విమానాలు తవాంగ్ పరిసరాల్లో గస్తీ కాయడం, డేగ కళ్లతో నిఘా వేయడం మొదలైంది. ► దాదాపు 3,500 కిలోమీటర్ల పొడవైన నియంత్రణ రేఖ పొడవునా పరిస్థితిపై, దళాల సన్నద్ధతపై త్రివిధ దళాధిపతులు సమీక్ష జరిపారు. భారత సైనికులు అడ్డుకున్నందుకే...తవాంగ్ రగడ: చైనా సైన్యం ‘గల్వాన్ లోయ’ చేదు అనుభవం నేపథ్యంలో తవాంగ్ రగడపై చైనా ప్రభుత్వ ఆచితూచి స్పందించగా సైన్యం మాత్రం తెంపరి వ్యాఖ్యలకు దిగింది! సరిహద్దుల వెంబడి పరిస్థితి నిలకడగా ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మంగళవారం వ్యాఖ్యానించారు. ‘‘భారత దళాలే అక్రమంగా ఎల్ఓసీ దాటాయి. చైనా వైపు డాంగ్జాంగ్ ప్రాంతంలో గస్తీ విధుల్లో ఉన్న మా సైనికులను అడ్డుకున్నాయి. అది డిసెంబర్ 9 రగడకు దారి తీసింది’’ అని చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) వెస్టర్న్ థియేటర్ కమాండ్ అధికార ప్రతినిధి కల్నల్ లోంగ్ షోహువా ఆరోపించారు. నిజాలు దాస్తున్న కేంద్రం రాజ్‌నాథ్‌ది అరకొర ప్రకటన: కాంగ్రెస్ ‘తవాంగ్’పై అట్టుడికిన ఉభయసభలు కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాల వాకౌట్ తవాంగ్ రగడ మంగళవారం పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. చైనాను నిలువరించడంలో కేంద్రం సమర్థంగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాలన్నీ దుయ్యబట్టాయి. ‘‘ఇది కచ్చితంగా దౌత్య వైఫల్యమే. సరిహద్దుల వద్ద పరిస్థితిపై తక్షణం సవివర చర్చకు ప్రభుత్వం సిద్ధపడాలి’’ అని డిమాండ్ చేశాయి. రాజ్‌నాథ్ ప్రకటనపై వివరణకు పట్టుబట్టాయి. ఇది సున్నితమైన అంశమంటూ వివరణ కోరేందుకు రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా అనుమతివ్వలేదు. అందుకు నిరసనగా కాంగ్రెస్, ఎస్పీ, జేఎంఎం, ఆర్జేడీ, శివసేన, సీపీఎం, సీపీఐ ఉభయ సభల నుంచీ వాకౌట్ చేశాయి. అనంతరం రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. చైనా సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్) గుర్తింపు రద్దు అంశాన్ని కావాలని మోదీ సర్కారు తెరపైకి తెస్తోందని ఆరోపించారు. ఉభయ సభల్లో వివరణ ఇవ్వకుండా పారిపోయిందని ఎద్దేవా చేశారు. చైనా దురాక్రమణ, ఉగ్రవాదం దేశ భద్రతకు, ప్రాదేశిక సమగ్రతకు పెను ముప్పుగా మారుతున్నా మౌన ప్రేక్షకునిగా చూస్తోందంటూ దుయ్యబట్టారు. మంత్రుల వెనక దాక్కుంటున్న మోదీ చైనా అంశంపై ప్రభుత్వ వ్యవహార శైలిని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. తవాంగ్ రగడపై రక్షణ మంత్రి అరకొర ప్రకటనతో సరిపెట్టారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. దీనిపై మోదీ ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతోందని పార్టీ నేతలు గౌరవ్ గొగొయ్, పవన్ ఖేరా ఆరోపించారు. ‘‘డిసెంబర్ 9న ఘర్షణ జరిగితే రక్షణ మంత్రి ప్రకటనకు ఇంత ఆలస్యమెందుకు? ప్రజల నుంచి ఏం దాస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. జాతీయ భద్రత అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా మోదీ తన మంత్రుల వెనక దాక్కుంటారని ఎద్దేవా చేశారు. పీఎం కేర్స్ నిధికి విరాళాలిచ్చిన చైనా కంపెనీల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అంగుళం కూడా వదలం: అమిత్ షా రాజీవ్ ఫౌండేషన్‌కు చైనా నిధులు దాని గుర్తింపు రద్దయినందుకే నిరసనలు కాంగ్రెస్‌కు హోం మంత్రి చురకలు మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం భారత భూభాగంలో ఎవరూ ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎలాంటి చొరబాట్లనూ అనుమతించబోమన్నారు. ‘లోక్‌సభలో కార్యకలాపాలను కాంగ్రెస్ పదేపదే అడ్డుకోవడానికి అసలు కారణం తవాంగ్ రగడ కాదు. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్)కు విదేశీ విరాళాల చట్టం (ఎఫ్సీఆర్ఏ) గుర్తింపును కేంద్రం రద్దు చేయడమే!’’ అంటూ చురకలంటించారు. ‘‘సమాజ సేవ కోసమంటూ నమోదు చేసుకున్న ఆర్జీఎఫ్కు ఇండో–చైనా సంబంధాల అభివృద్ధి సంబంధిత అధ్యయనం పేరిట చైనా ఎంబసీ నుంచి రూ.1.35 కోట్లు అందాయి. అందుకే దాని గుర్తింపు రద్దు చేయాల్సి వచ్చింది. విపక్షాల గొడవ వల్ల ప్రశ్నోత్తరాలు తుడిచిపెట్టుకుపోయాయి. లేదంటే ఈ విషయాన్ని సభలోనే చెప్పేవాన్ని. బహుశా ఆర్జీఎఫ్ తన అధ్యయనం ముగించే ఉంటుంది. ఇంతకూ, 1962 చైనా యుద్ధంలో ఎన్ని వేల హెక్టార్ల భారత భూ భాగాన్ని చైనా ఆక్రమించిందన్నది ఆ అధ్యయనంలో ఉందా?’’ అంటూ ఎద్దేవా చేశారు. చైనాపై మోదీ ప్రభుత్వం మెతక వైఖరి ప్రదర్శిస్తోందన్న కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు. నిజానికి విదేశీ నాయకులతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాధినేతలకు ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగానే ఐరాస భద్రతా మండలిలో స్థానం చేజారిందంటూ ప్రత్యారోపణ చేశారు. ‘‘భద్రతా మండలిలో భారత్ స్థానాన్ని కాంగ్రెస్‌కు చెందిన దేశ తొలి ప్రధాని నెహ్రూ ఎందుకు ‘త్యాగం’ చేశారు? కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్సింగ్ అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటిస్తే చైనా అభ్యంతరపెట్టింది. ఆ రాష్ట్ర సీఎం దోర్జీ ఖండూకు వీసా నిరాకరించింది. జమ్మూ కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ అక్కడి ప్రజలకు స్టేపుల్ వీసాలిచ్చింది. వీటన్నింటిపై కూడా ఆర్జీఎఫ్ అధ్యయనం చేసిందా?’’ అంటూ ఎద్దేవా చేశారు. సోనియాగాంధీ సారథ్యంలోని ఆర్జీఎఫ్కు ఉగ్రవాదులతో లింకుల ఆరోపణలపై నిషేధం ఎదుర్కొంటున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్ నుంచి కూడా రూ.50 లక్షలందాయని ఆరోపించారు. -
సభా పర్వం : రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
-
Parliament Monsoon Session: ప్రజల ఇక్కట్లు చూడండి
న్యూఢిల్లీ: ధరల పెరుగుదలపై రాజ్యసభలో ఎట్టకేలకు చర్చ మొదలయ్యింది. ధరాఘాతంతో జనం అష్టకష్టాలు పడుతున్నారని ప్రతిపక్షాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని విన్నవించాయి. నిత్యావసరాల ధరల అంశంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో బీజేపీ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. ధరల పెరుగుదల వల్ల ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని చెప్పారు. ధరలను అదుపుచేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ద్రవ్యోల్బణం ఇప్పుడు 7 శాతంగా ఉందని, గత యూపీఏ ప్రభుత్వ హయాంలో పెరిగినట్లుగా రెండంకెలకు చేరుకోలేదని అన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పంపిణీ వ్యవస్థలు దెబ్బతిన్నాయని, చమురు మంట కొనసాగుతోందని, తద్వారా ధరలు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. కేవలం మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఇప్పటికిప్పుడు నియంత్రణలోకి తీసుకురావడం ఏ దేశం చేతుల్లోనూ లేదని తేల్చిచెప్పారు. ప్రజలు విసుగెత్తిపోయారు ధరల అంశంపై చర్చను సీపీఎం సభ్యుడు ఎళమారమ్ కరీం ప్రారంభించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదని ఆక్షేపించారు. గత ఎనిమిదేళ్లుగా ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగం, జీఎస్టీ మోత, రూపాయి విలువ పతనం వంటివి పేదలను కుంగదీస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు డెరెక్ ఓ బ్రెయిన్ వాపోయారు. సమస్యలను ఇప్పటికైనా గుర్తించి, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో ప్రజలు పూర్తిగా విసుగెత్తిపోయారని కాంగ్రెస్ సభ్యుడు శక్తిసింహ్ గోహిల్ అన్నారు. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం ఎదుర్కొంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా చెప్పారు. ఆహార ఉత్పత్తి వ్యయం గత ఏడాది కాలంలో 21 శాతం పెరిగిందని వివరించారు. రైతుల ఆదాయం పెరగడం లేదన్నారు. గిరిజనుల సమస్యలను జేఎంఎం ఎంపీ మహువా రాజ్యసభలో ప్రస్తావించారు. ధరల మంట కారణంగా మహిళల కష్టాలు రెట్టింపు అయ్యాయని కాంగ్రెస్ ఎంపీ అశోక్‌రావు ఉద్ఘాటించారు. పన్నుల భారం పెరగలేదు: నిర్మల ధరల పెరుగుదలపై జరిగిన చర్చలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు చర్యలు ప్రారంభించామని వివరించారు. జీఎస్టీ వల్ల కుటుంబాలపై పన్నుల భారం పెరగలేదన్నారు. బియ్యం, గోధుమ పిండి, పెరుగు వంటి వాటిపై అన్ని రాష్ట్రాల అంగీకారంతోనే జీఎస్టీ విధించినట్లు గుర్తుచేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ధరలు అధికంగా ఉండేవని అన్నారు. అప్పట్లో కిలో ఉల్లిపాయల ధర రూ.100 మార్కును దాటిందని వెల్లడించారు. -
భారత్‌లో 3,291 విదేశీ కంపెనీలు
న్యూఢిల్లీ: దేశంలో నమోదైన 5,068 విదేశీ కంపెనీల్లో 2022 జూలై 27వ తేదీ నాటికి 3,291 కంపెనీలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సోమవారం వెల్లడించారు. క్రియాశీలంగాలేని విదేశీ కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అంశాన్ని పరిశీలించడం లేదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కంపెనీల చట్టం, 2013ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. దేశంలో పనిచేస్తున్న కంపెనీలు ఈ చట్టం కింద తప్పనిసరిగా నమోదుకావాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం పొందిన తర్వాత విదేశీ కంపెనీలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) ఢిల్లీలో నమోదవుతాయి. విదేశీ క్రియాశీల కంపెనీలు తప్పనిసరిగా చట్ట ప్రకారం స్టాట్యూటరీ ఫైలింగ్ జరుపుతాయి. వివిధ చట్ట పరమైన అంశాలకు అనుగుణంగా పనిచేస్తాయి. ఆయా అంశాలపై లోక్‌సభలో మంత్రి లిఖిత పూర్వక సమాధానం చెప్పారు. భారతదేశంలో 1,777 విదేశీ కంపెనీలు తమ వ్యాపార కార్యాలయాను మూసివేసినట్లు చెప్పారు. షెల్ కంపెనీల నిర్వచనం లేదు: కంపెనీల చట్టంలోని నిబంధనల ప్రకారం, రిజిస్టర్డ్ విదేశీ షెల్ కంపెనీలను నిర్వచించలేదని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘కంపెనీల చట్టంలోని సెక్షన్ 2(42)లోని నిబంధనలు విదేశీ కంపెనీలు నిర్వచనాన్ని ఇస్తున్నాయి. దీని ప్రకారం భారతదేశం వెలుపల ఒక కంపెనీ లేదా సంస్థ రిజిస్టరై, అది భారతదేశంలో స్వయంగా లేదా ఏజెంట్ ద్వారా, భౌతికంగా లేదా ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా ఏవైనా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుంది. ఇలాంటి కంపెనీని చట్టం విదేశీ కంపెనీగా పేర్కొంటోంది’’ అని సింగ్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసిన బ్రాంచ్ ఆఫీస్ అద్దె ఒప్పందం అమలు నిలిచిపోవడం, చెల్లుబాటు గడువు ముగియడం వంటి కారణాల వల్ల భారతదేశంలో ఒక విదేశీ కంపెనీ క్రియాశీలంగా లేదని పరిగణిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 119 కేసుల విచారణకు ఎస్‌ఎఫ్‌ఐఓకు ఆదేశాలు.. 2017–18 నుండి ఇప్పటి వరకు 119 కేసులను విచారించాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ)ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ కోరినట్లు మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపింది. 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి అలాగే 2022–23 జూన్ 30వ తేదీ వరకూ కార్పొరేట్ మోసానికి పాల్పడిన ఏ లిస్టెడ్ కంపెనీని గుర్తించలేదని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తెలియజేసినట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. -
సహారాలో భారీగా ఇరుక్కున్న ఇన్వెస్టర్లు.. మొత్తం లక్ష కోట్లు పైనే!
Sahara Group-Sebi ప్రయివేట్ రంగ సంస్థ సహారా ఇండియా గ్రూప్‌నకు చెందిన వివిధ సంస్థలు, పథకాలలో దాదాపు 13 కోట్లమంది ఇన్వెస్టర్లు ఇరుక్కున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ పార్లమెంటులో వెల్లడించారు. ఈ మొత్తం సొమ్ము రూ. 1.12 లక్షల కోట్లుగా తెలియజేశారు. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలు, జస్టిస్ బీఎన్ అగర్వాల్ సూచనలమేరకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. సొమ్మును తిరిగి చెల్లించేందుకు వీలుగా పలు ప్రకటనలు జారీ చేసింది. తద్వారా తమ సొమ్మును తిరిగి పొందేందుకు ఇన్వెస్టర్లకు వీలు కల్పించినట్లు మంత్రి రాతపూర్వక సమాధానంలో వివరించారు. తదుపరి 2021 అక్టోబర్‌లో సెబీ మధ్యంతర ఆదేశాల కోసం సుప్రీం కోర్టులో మరోసారి అప్లికేషన్‌ను దాఖలు చేసింది. ఇది ప్రస్తుతం కోర్టువద్ద పెండింగ్‌లో ఉన్నట్లు పంకజ్ తెలియజేశారు. సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో రూ. 47,245 కోట్లు, సహారా ఇండియన్ రియల్టీ కార్పొరేషన్లో రూ. 19,401 కోట్లు, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లో రూ. 6,381 కోట్లు చొప్పున పెట్టుబడులు ఇరుక్కున్నట్లు వెల్లడించారు. ఇదేవిధంగా హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో రూ. 12,958 కోట్లు, సహారాయన్ యూనివర్శల్ మల్టీపర్పస్ సొసైటీలో రూ. 18,000 కోట్లు, స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీలో రూ. 8,470 కోట్లు నిలిచిపోయినట్లు తెలియజేశారు. కాగా.. సహారా గ్రూప్ ‘సెబీ సహారా రిఫండ్’ ఖాతాలో అసలు రూ. 25,781 కోట్లకుగాను దాదాపు రూ. 15,507 కోట్లు డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు. చదవండి: టెక్కీలకు గడ్డుకాలం, వరస్ట్ ఇయర్‌గా 2022 -
ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల పెండింగ్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కుటుంబ న్యాయస్థానాల్లో 11.4 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండటంపై లోక్‌సభ సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు. ఈ కేసుల విచారణను త్వరితగతిన ముగించాలని పిలుపునిచ్చారు. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం లోక్‌సభలో ఫ్యామిలీ కోర్టుల సవరణ బిల్లు–2022ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో జనతాదళ్ (యు)కు చెందిన కౌశలేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఫ్యామిలీ కోర్టుల్లో పెండింగ్ కేసుల భారం ప్రస్తుతం 11.4 లక్షలకు పెరిగిందని, ఈ కేసుల పరిష్కారం వేగవంతం చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న 715 కుటుంబ న్యాయస్థానాల్లో పేరుకుపోయిన కేసుల పరిష్కారానికి తీసుకునే చర్యలను ప్రభుత్వం వెల్లడించాలని బిజూ జనతాదళ్‌కు చెందిన మహ్తాబ్ కోరారు. చర్చను ప్రారంభిస్తూ బీజేపీకి చెందిన సునితా దుగ్గల్.. కేసుల విచారణను వేగవంతం చేసేందుకు కుటుంబ న్యాయస్థానాల్లో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. కుటుంబం, వివాహ సంబంధ సమస్యల పరిష్కారానికి కేంద్రం 1984లో ఫ్యామిలీ కోర్టుల చట్టం ద్వారా ఈ న్యాయస్థానాలను ఏర్పాటు చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా 2008లో నాగాలాండ్‌లో రెండు, 2019లో హిమాచల్ ప్రదేశ్‌లో మూడు కుటుంబ న్యాయస్థానాలు ఏర్పాటయ్యాయి. గత ఏడాది హిమాచల్ హైకోర్టు విచారణ సందర్భంగా రాష్ట్రంలోని ఫ్యామిలీ కోర్టులకు అధికార పరిధి లేదనే అంశం తెరపైకి వచ్చింది. ఫ్యామిలీ కోర్టు చట్టాన్ని హిమాచల్‌కు పొడిగిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయనందునే ఇలాంటి పరిస్థితి వచ్చిందని హిమాచల్ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ పేర్కొంది. నాగాలాండ్‌లోని ఫ్యామిలీ కోర్టులు కూడా 2008 నుంచి ఎలాంటి చట్టపరమైన అధికారం లేకుండా పనిచేస్తున్నాయి. ఈ చట్టంలో తాజాగా చేపట్టిన సవరణల ద్వారా ప్రభుత్వం ఇటువంటి లోపాలను సవరించే ప్రయత్నం చేసింది. కుటుంబ న్యాయస్థానాల ఏర్పాటు, వాటి పరిధిపై సంబంధిత హైకోర్టులతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని తెలిపింది. -
రాజ్యసభ సభ్యులుగా 27 మంది ప్రమాణం
న్యూఢిల్లీ: రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన 57 మందిలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయెల్ సహా 27 మంది సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చాంబర్లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు రాజ్యాంగానికి విధేయులుగా ఉంటామంటూ వారితో ప్రమాణం చేయించారు. 10 రాష్ట్రాలకు చెందిన 27 మంది సభ్యులు తెలుగు తదితర 9 భాషల్లో ప్రమాణం చేశారు. కొత్తగా ఎన్నికైన 57 మందిలో నలుగురు ఇప్పటికే ప్రమాణం చేశారు. మిగతా వారు వర్షాకాల సమావేశాల మొదటి రోజు ప్రమాణం చేయనున్నారు. ఇంకా ప్రమాణం చేయని కొత్త సభ్యులు కూడా 18వ తేదీన జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చైర్మన్ వెంకయ్యనాయుడు అనంతరం స్పష్టతనిచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో విజేతల పేర్లను నోటిఫికేషన్లో ప్రకటించిన నాటి నుంచి వారిని సభ్యులుగానే పరిగణిస్తామన్నారు. సభా కార్యక్రమాలు, కమిటీల సమావేశాల్లో పాల్గొనేందుకు మాత్రం ప్రమాణం చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. తాజాగా ప్రమాణం చేసిన వారిలో కాంగ్రెస్‌కు చెందిన జైరాం రమేశ్, వివేక్ కె.తన్ఖా, ముకుల్ వాస్నిక్‌తోపాటు బీజేపీ నుంచి సురేంద్ర సింగ్ నాగర్, కె.లక్ష్మణ్, లక్ష్మీకాంత్ వాజ్‌పేయి తదితర 18 మంది ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేస్తున్న గోయల్ -
లోక్‌సభ టాప్ గేర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా సమస్యలపై చర్చలు మొదలుకుని బిల్లుల ఆమోదం తదితర అన్ని అంశాల్లోనూ ప్రస్తుత లోక్‌సభ చక్కని పనితీరు కనబరుస్తోంది. చర్చల నిడివి, వాటిలో పాల్గొన్న సభ్యుల సంఖ్యతో పాటు ఆమోదించిన బిల్లుల విషయంలోనూ 14, 15, 16వ సభలతో పోలిస్తే ప్రస్తుత 17వ లోక్‌సభ మెరుగ్గా రాణించింది. అన్నింటా ముందే... 17వ లోక్‌సభ 2019 మే 25న కొలువుదీరింది. జూన్ 17న తొలి సమావేశం జరిగింది. మూడేళ్లలో ఎనిమిదిసార్లు సమావేశమైంది. ఎన్నో అరుదైన రికార్డులు సాధించింది. ఏకంగా 995 గంటల పాటు కార్యకలాపాలు జరిపింది. అవి ఎన్నోసార్లు అర్ధరాత్రి దాకా కొనసాగాయి. ఆ లెక్కన 106 శాతం ఉత్పాదకత సాధించింది. ఇది 16వ లోక్ సభ కంటే 11 శాతం, 15వ సభ కంటే 35 శాతం ఎక్కువ! 15వ సభలో చర్చలకు తీసుకున్న సగటు సమయం 85 నిమిషాలు, పాల్గొన్న సభ్యుల సంఖ్య 921 కాగా ఈ సభలో సగటు సమయం 132 నిమిషాలకు పాల్గొన్న సభ్యుల సంఖ్య ఏకంగా 2,151కి పెరగడం విశేషం. రాష్ట్రపతి ప్రసంగంపై 14వ సభలో 266 మంది సభ్యులు మాట్లాడగా ఈసారి 518 మందికి పెరిగింది. సభ్యులు 377 రూల్ కింద 3,099, జీరో అవర్‌లో 4,648 అంశాలు ప్రస్తావించారు. టెక్నాలజీ వాడకంతో రూ.668.86 కోట్లు ఆదా చేసింది. స్టాండింగ్ కమిటీలు 419 సమావేశాలు జరిపి 4,263 సిఫార్సులు చేశాయి. 2,320 సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. కొత్తవారికి ప్రోత్సాహం మూడేళ్ల సభా కార్యకలాపాలు పూర్తి తృప్తినిచ్చాయి. చర్చలు గతంకన్నా మెరుగ్గా జరిగాయి. కొత్త సభ్యులకు ఎక్కువగా మాట్లాడే అవకాశాలిచ్చాం. ఎన్నోసార్లు సభా సమయాన్ని పొడిగించి ప్రత్యేక ప్రస్తావనల అంశాలకు చాన్సిచ్చాం. పార్లమెం ట్ కొత్త భవన నిర్మాణం చకచకా సాగుతోంది. ఈ ఏడాది శాతాకాల సమావేశాలు అందులోనే జరిపేలా చర్యలు తీసుకుంటున్నాం – స్పీకర్ ఓం బిర్లా -
క్రిమినల్ ప్రొసీజర్ బిల్లుపై అనుమానాలొద్దు
న్యూఢిల్లీ: క్రిమినల్ ప్రొసీజర్(గుర్తింపు)బిల్లులోని అంశాలతో పోలీసులు, దర్యాప్తు అధికారులు నేరగాళ్ల పనిపడతారని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ముసాయిదా చట్టంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన సోమవారం ప్రతిపక్ష నేతలకు సూచించారు. లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి ప్రతిపాదిత చట్టంతో డేటా దుర్వినియోగం అవుతుందన్న ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలపై స్పందించారు.‘ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతోంది. మనమూ అదే అనుసరిస్తున్నాం. గడిచిన రెండున్నరేళ్లుగా వాహనాల చోరీలు సహా పలు కేసులను పరిష్కరించేందుకు డేటా బేస్‌ను వాడుతున్నాం’అని తెలిపారు. అనంతరం బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. -
ఎన్నిసార్లు ఓడినా... మీ అహం తగ్గట్లేదు: నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: వరుసగా ఎన్ని ఎన్నికల్లో ఓడుతున్నా కాంగ్రెస్ పార్టీకి అహంకారం మాత్రం తగ్గడం లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఫైరయ్యారు. ‘‘ఇప్పటికీ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. చూస్తుంటే మరో వందేళ్ల దాకా అధికారంలోకి రావద్దని గట్టి పట్టుదలతో ఉన్నట్టుంది. గెలవాలన్న కాంక్షే వారిలో ఏ కోశానా కన్పించడం లేదు. అందుకే, తనకేదీ దక్కనప్పుడు అన్నింటినీ వీలైనంతగా పాడుచేద్దామనే స్థాయికి దిగజారింది’’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రతిదాన్నీ గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టకుందని, వేర్పాటువాదాన్ని పెంచి పోషిస్తోందని మండిపడ్డారు. బ్రిటిష్‌వాళ్లు పోయినా వారి విభజించి పాలించే సూత్రాన్ని స్వభావంగా మార్చుకుందని విమర్శించారు. అందుకే టుక్డే టుక్డే గ్యాంగులకు లీడర్‌గా మారిందన్నారు. సోమవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ఆయన, కాంగ్రెస్‌ను గంటన్నరకు పైగా తూర్పారబట్టారు. కరోనా సంక్షోభ సమయంలో ఆ పార్టీ అన్ని హద్దులనూ దాటేసి చెప్పరానన్ని పాపాలకు పాల్పడిందని ఆరోపించారు. ‘‘కరోనా తొలి వేవ్ సమయంలో అంతా ఇళ్లకు పరిమితమై లాక్డౌన్ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ ఉంటే కాంగ్రెస్ మాత్రం ముంబై రైల్వేస్టేషన్లో వీరంగం వేసింది. అమాయక కార్మికులకు ఉచితంగా టికెట్లు పంచి, భయపెట్టి సొంత రాష్ట్రాలకు పారిపోయేలా చేసింది. విభజించే మనస్తత్వం కాంగ్రెస్ డీఎన్ఏలోకి ఇంకిపోయింది. సమాజంలో వేర్పాటు బీజాలు నాటజూస్తోంది’’ అంటూ నిప్పులు చెరిగారు. గతవారం పార్లమెంటులో కాంగ్రెస్ మాట్లాడిన తీరు ప్రజలను రెచ్చగొట్టేదిగా ఉందంటూ ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీ ప్రసంగంపై దుమ్మెత్తిపోశారు. ‘‘ఉదయం లేచింది మొదలు నిత్యం మోదీ నామ జపమే కాంగ్రెస్‌కు పనిగా మారింది. నా పేరు తలవకుండా బతకలేకపోతోంది’’ అంటూ ఎద్దేవా చేశారు. గుడ్డి విమర్శలు సద్విమర్శ ప్రజాస్వామ్యానికి ఆభరణమని, కానీ కాంగ్రెస్ చేసే గుడ్డి విమర్శలు మాత్రం ప్రజాస్వామ్యానికి అవమానం తప్ప మరోటి కాదని ప్రధాని అన్నారు. ‘‘బీజేపీ ఏదైనా ఎన్నికల్లో ఓడితే దానిపై నెలలపాటు లోతుగా విశ్లేషించుకుంటుంది. కాంగ్రెస్‌కు మాత్రం ఆ అలవాటూ లేదు, అహంకారమూ తగ్గదు. దాని మనోగతం, మాటతీరు, చేసే తప్పుడు పనులు చూస్తుంటే మరో వందేళ్ల దాకా అధికారంలోకి రావద్దని అనుకుంటోందేమోనని కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది. వాళ్ల ఉద్దేశం అదే అయితే అందుకవసరమైన ఏర్పాట్లు చేసే ఉంచాను’’ అని చెణుకులు విసిరారు. ‘‘మేం దేశీయతకు పెద్దపీట వేస్తున్నాం. ఇది గాంధీ కలలను సాకారం చేయడం కాదా? దాన్నీ, మేం తెచ్చిన యోగా, ఫిట్ ఇండియా కార్యక్రమాలను కూడా కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది. 1971 నుంచీ పేదరిక నిర్మూలన నినాదాలతోనే ఆ పార్టీ ఎన్నికలు నెగ్గుతూ వచ్చింది. పేదరికమైతే పోలేదు గానీ జనం కాంగ్రెస్‌నే సాగనంపారు. చాలా రాష్ట్రాల్లోనైతే దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉంచారు. ఎన్నికలు ముఖ్యం కాదు. కావాల్సింది చిత్తశుద్ధి’’ అన్నారు. కరోనాపై మన పోరు ఆదర్శం కరోనా సంక్షోభాన్ని భారత్ ఎదుర్కొన్న తీరు ప్రపంచానికే ఆదర్శమని మోదీ అన్నారు. మున్ముందు ప్రపంచానికి మనం లీడర్‌గా ఎలా ఎదగాలో ఆలోచించుకోవడానికి ‘స్వాతంత్య్ర అమృతోత్సవాలు’ సరైన సందర్భమన్నారు. ‘‘కోవిడ్ అనంతరం ప్రపంచ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ అవకాశాన్ని భారత్ జారవిడుచుకోరాదు’’ అని సూచించారు. తర్వాత జనవరి 31న పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. మీకు అన్నిచోట్లా ఓటమే! 50 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీని దేశమంతటా ప్రజలు వరుసబెట్టి ఎందుకు తిరస్కరిస్తూ వస్తున్నారో ఆలోచించుకోవాలి. చాలా రాష్ట్రాల్లో మిమ్మల్ని దశాబ్దాలుగా ఓడిస్తూ వస్తున్నారు. తెలంగాణ ఇచ్చినా సరే, అక్కడా కాంగ్రెస్‌ను శాశ్వతంగా తుడిచిపెట్టేశారు’’ అన్నారు. తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌కు నివాళులు అర్పించేందుకు ఆ రాష్ట్ర ప్రజలంతా కదలివచ్చిన తీరు అభినందనీయమన్నారు. ఈ విషయంలో కూడా తమిళ సెంటిమెంట్లను గాయపరిచేలా ప్రవర్తించిన చరిత్ర కాంగ్రెస్‌దని విమర్శించారు. ‘‘లీడర్లు వస్తారు, పోతారు. దేశం మాత్రం శాశ్వతం. ఐక్యతా పునాదుల మీద నిలిచిన గొప్ప దేశం మనది. ఇకముందూ అలాగే నిలుస్తుంది’’ అని మోదీ హితవు చెప్పారు. విభజించే మనస్తత్వం వాళ్ల డీఎన్ఏలోనే ఇంకిపోయింది. సమాజంలో వేర్పాటు బీజాలు నాటుతూ తప్పుల మీద తప్పులకు పాల్పడుతోంది నిత్యం మోదీ నామ జపం చేయనిదే కాంగ్రెస్ బతకలేకపోతోంది. మరో వందేళ్ల దాకా అధికారం వద్దన్నదే వాళ్ల ఉద్దేశమైతే అందుకు తగ్గ ఏర్పాట్లు చేసే ఉంచా. -
మీ పాలనలో అంతరం మరింత పెరిగింది
న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ పాలనతో ఏకీకృత భారతం కాస్తా, సంపన్న భారతం, పేదరిక భారతంగా మారిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ రెండు అసమానత భారతాల మధ్య అంతరం తగ్గించే ప్రయత్నం చేయాలని కేంద్రానికి సూచించారు. మొత్తం దేశ సంపద కొద్ది మంది చేతుల్లోకి వెళ్లిపోయిందని, ఇకనైనా దేశ సంపదను ఆ కొద్దిమందికి పంచడం మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ఇండియా రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగం చెబుతోందని, అలాంటి దేశాన్ని కేంద్రమే పరిపాలించాలనుకోవడం దురదృష్టకరమని, ఈ ధోరణి దేశానికి పెను ముప్పు అని హెచ్చరించారు. 1947లో బ్రిటీష్‌వాళ్లు దేశాన్ని వదిలిపోవడంతోనే పోవడంతోనే అంతమైన రాచరిక వ్యవస్థ, బీజేపీ హయాంలో మళ్లీ పురుడుపోసుకుందని నిప్పులు చెరిగారు. దేశంలో ఉన్న భిన్న భాషలు, సంస్కృతులను అణచివేయొద్దని, ఇది ప్రజాస్వామ్యమే కానీ, రాచరికం కాదని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ పార్లమెంటులో తొలి ప్రసంగం చేశారు. ‘‘మా ముత్తాత 15ఏళ్లు జైలు పాలయ్యారు. మా నాన్నమ్మ 32 తూటాలకు బలయ్యింది. మా నాన్న ముక్కలు ముక్కలైపోయారు. అవన్నీ అనుభవించినవాడిగా చెబుతు న్నా... చాలా ప్రమాదకరమైన దానితో ఆడుకుంటున్నారు. అది ఆపేస్తే మంచిది. లేకపోతే కచ్చితంగా సమస్యను సృష్టించినవారవుతారు’’ అని హెచ్చరించారు. ప్రభుత్వం నిత్యం మేడిన్ ఇండియా అని మాట్లాడుతోందని, కానీ చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించకుండా అది సాధ్యం కాదని తెలిపారు. ఉద్యోగాలు కల్పించే శక్తి వాటికే ఉందన్నారు. బిహార్‌లో ఉద్యోగార్థుల ఆందోళన ప్రస్తుతం దేశంలో ఉన్న నిరుద్యోగానికి అద్దం పడుతోందన్నారు. న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, పెగసస్ వంటివాటిని ఉపయోగించుకుని రాష్ట్రాల గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారు రాజ్యసభలో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై దాడి చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. బీజేపీ అనుబంధ సంస్థలు ఉద్యమాలు చేస్తున్న రైతులను ఉగ్రవాదులుగా ముద్రవేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... ఏడాది కోట్ల ఉద్యోగాలిస్తామన్న ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయిందన్నారు. పెట్రోలియం ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సర్కారు చెబుతున్న మార్పు, సమానత్వం మాటల్లోనే తప్ప క్షేత్రస్థాయిలో లేదన్నారు. డీఎంకే ఎంపీ తిరుచీ శివ మాట్లాడుతూ.. అఖిల భారత సర్వీసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకపోవడాన్ని తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాస్తూ... కేంద్రం సమాఖ్య స్ఫూర్తిపై సర్జికల్ స్ట్రైక్ చేస్తోందని ణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ మండిపడ్డారు. అఖిల భారత సర్వీసు క్యాడర్ నిబంధనల్లో మార్పు ప్రతిపాదనలను, వందమంది మాజీ ఐఏఎస్‌లు, ఐఎఫ్స్లు, తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నా కేంద్రం నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తోందన్నారు. అభివృద్ధిని చూసే గెలిపిస్తున్నారు ఐదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి వల్లే జనం 2019లో స్పష్టమైన మెజారిటీతో గెలిపించారని ఉత్తరప్రదేశ్ బీజేపీ రాజ్యసభ సభ్యురాలు గీత అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మాన చర్చలో ఆమె రాజ్యసభలో బుధవారం మాట్లాడారు. ప్రభుత్వం తన సంక్షేమ పథకాలతో అట్టడుగు వర్గాలు, వెనుకబడిన తరగతుల ప్రజల ఆర్ధిక సమానత్వానికి కృషి చేస్తోందని తెలిపారు. కేంద్ర మంత్రివర్గంలో ఓబీసీ వర్గానికి చెందిన 27 మంది, ఎస్సీఎస్టీకి చెందిన వారు 20 మంది, మహిళలు 11 మంది ఉన్నారన్నారు. పెళ్లి వయసును 18 నుంచి 23కు పెంచుతూ ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తోందని తెలిపారు. బీజేపీ సభ్యుడు శ్వేత్మాలిక్ మాట్లాడుతూ...కాంగ్రెస్ నేతృత్వంలోని గత ప్రభుత్వాలు తమ అవినీతితో సామాన్యుని నడ్డి విరిచాయని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం అతి పెద్ద తప్పిదమన్నారు. మోదీ ప్రభుత్వం ఉగ్రవాద దాడులను సర్జికల్ స్ట్రైక్‌తో తిప్పికొట్టిందన్నారు. -
అట్టడుగు వర్గాలకే అధిక ప్రాధాన్యం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విధానాలు సమాజంలోని పేదలు, అట్టడుగు వర్గాలకు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు, గ్రామ సీమల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. మొత్తం రైతుల్లో 80 శాతం ఉన్న సన్నకారు రైతుల అభివృద్ధిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటం, రికార్డు స్థాయిలో పంటల సేకరణ, దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేయడానికి చేపట్టిన చర్యలు మన సమష్టి విజయాలని చెప్పారు. దీర్ఘకాలంలో సాధించాల్సిన లక్ష్యాలకు ఇవి చోదక శక్తిగా పని చేస్తాయని అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన సోమవారం ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన పలు ఘనతలను ప్రస్తావించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యేకంగా గుర్తుచేశారు. గోవా విముక్తి పోరాట యోధుల స్మారకం నిర్మాణం, అఫ్గానిస్తాన్ నుంచి గురుగ్రంథ సాహిబ్ స్వరూపాలను వెనక్కి తీసుకురావడం, భారత్‌లో రైతాంగం సాధికారత కోసం సర్కారు కృషి వంటి అంశాలు రాష్ట్రపతి ప్రసంగంలో చోటుచేసుకున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా 2020–21లో రక్షణ రంగం ఆధునీకరణకు 87 శాతం అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. 209 రకాల రక్షణ పరికరాలను దేశీయంగానే ఉత్పత్తి చేసుకోవాలని నిర్ణయించినట్లు గుర్తుచేశారు. దేశ భవిష్యత్తుకు రోడ్డుమ్యాప్ కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను దేశ భవిష్యత్తుకు రోడ్డుమ్యాప్గా భావించాలని రాష్ట్రపతి కోవింద్ ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు, సైంటిస్టులు నిరుపమాన సేవలందించారని కొనియాడారు. ఏడాది కంటే తక్కువ సమయంలోనే 150 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు ప్రజలకు అందజేయడం గొప్ప విషయమని చెప్పారు. దేశంలో 18 ఏళ్లు దాటిన వారిలో 90 శాతానికి పైగా ప్రజలు టీకా మొదటి డోసు, 70 శాతానికి పైగా ప్రజలు రెండు డోసులు తీసుకున్నారని తెలిపారు. 15–18 ఏళ్ల కేటగిరీకి కరోనా టీకా ఇస్తున్నట్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, వృద్ధులకు బూస్టర్ డోసు ఇచ్చే ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యిందని గుర్తుచేశారు. అతిపెద్ద ఆహార పంపిణీ పథకం కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సమయంలో దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ కింద పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేసిందని రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. 19 నెలల్లో 80 కోట్ల మంది లబ్ధి పొందారని, దీని కోసం ప్రభుత్వం రూ.2.60 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ పథకమని వివరించారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ‘పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ను తెరపైకి తెచ్చిందని తెలిపారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ నేత మనీష్ తివారీ పెదవి విరిచారు. చైనా, పాకిస్తాన్ వ్యవహారాన్ని రాష్ట్రపతి ప్రస్తావించలేదని, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరణ, నాగాలాండ్‌లో పౌరుల ఊచకోతపై ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. రాజ్యసభలో ఆర్థిక సర్వే ఆర్థిక సర్వే 2021–22 నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అంతకముందు తొలుత సభ ప్రారంభం కాగానే చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు సిట్టింగ్ ఎంపీ డాక్టర్ మహేంద్ర ప్రసాద్, మాజీ ఎంపీలు జయంత రాయ్, దేబేంద్రనాథ్ బర్మన్, ఎం.మోజెస్, గణేశ్వర్ కుసుమ్, కథక్ కళాకారుడు పండిట్ బిర్జూ మహారాజ్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. పార్లమెంట్ 255వ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుల జాబితాను సెక్రెటరీ జనరల్ రాజ్యసభకు సమర్పించారు. ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన అనంతరం సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. సభా హక్కుల ఉల్లంఘన... పెగాసస్ స్పైవేర్ సమస్యపై గత ఏడాది పార్లమెంట్లో ప్రకటన చేసిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌పై ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టాలని సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం సోమవారం నోటీసు సమర్పించారు. ఇటీవల న్యూయార్క్ టైమ్స్ రిపోర్టును ఆధారంగా నోటీసును సమర్పించినట్లు తెలిపారు. స త్యాన్ని దాచడానికి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ, పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందన్న ఆధారాలు బహిర్గతం అయ్యాయన్నారు. పెగాసస్‌పై ప్రత్యేక చర్చ అక్కర్లేదు పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై పార్లమెంట్లో ప్రత్యేక చర్చ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. ఈ అంశం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉందని వెల్లడించింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు కోరుకుంటే ఏ అంశాన్ని అయినా లేవనెత్తవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున పార్లమెంట్లో ప్రత్యేక చర్చ అక్కర్లేదన్నారు. -
క్రిప్టోకరెన్సీలపై ఆర్బీఐ బోర్డులో చర్చ
ముంబై: సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ, ప్రైవేటు క్రిప్టో కరెన్సీలపై ఆర్బీఐ సెంట్రల్ బోర్డు చర్చించింది. ఆర్బీఐ గవర్నర్ చైర్మన్‌గా ఉన్న రిజర్వ్‌బ్యాంకు సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల 592వ సమావేశం లక్నోలో జరిగినట్టు శుక్రవారం ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. సెంట్రల్ బ్యాంకు ప్రతిపాదిత డిజిటల్ కరెన్సీ (రూపాయి), ప్రైవేటు క్రిప్టో కరెన్సీలకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్టు తెలిపింది. ‘‘ప్రస్తుత దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, కొత్తగా వస్తున్న సవాళ్లు, దిద్దుబాటు చర్యలపైనా సమీక్షించింది. ఆర్బీఐ అర్ధ సంవత్సర నివేదిక, స్థానిక మండళ్ల నిర్వహణపై సమావేశం చర్చించింది’’ అని పేర్కొంది. అధికారిక డిజిటల్ కరెన్సీ, ప్రైవేటు క్రిప్టో కరెన్సీల నియంత్రణ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో తీసుకురానున్నట్టు కేంద్ర సర్కారు లోగడ ప్రకటించడం తెలిసిందే. కానీ, వచ్చే వారం ముగియనున్న ప్రస్తుత సమావేశాల్లో బిల్లును తీసుకువచ్చే అవకాశాల్లేవని విశ్వసనీయ వర్గాల సమాచారం. క్రిప్టో కరెన్సీలకు వ్యతిరేకంగా ఆర్బీఐ ఇప్పటికే ఆందోళనలను వ్యక్తం చేయడం తెలిసిందే. చదవండి: క్రిప్టోకరెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసిన ఐఎమ్ఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్..! -
Farm Laws: రద్దు’ ఇప్పుడే ఎందుకు?
Reason Behind Farm Law Repeal In Telugu: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి ఈ సమయాన్నే ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహం దాగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఆందోళనలు మొదలై ఈ నెల 26తో ఏడాది పూర్తవుతుంది. ఈలోగా తమ డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (40 రైతు సంఘాల సమాఖ్య) ప్రకటించింది. మరోవైపు ఈ నెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సాగు చట్టాలు, పెగాసస్ స్పైవేర్ అంశంపై అనునిత్యం పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికి వర్షాకాల సమావేశాలు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. మరో నాలుగు నెలల్లో ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకతను మరింతగా పెంచుకోవాలని ఏ రాజకీయ పార్టీ కూడా కోరుకోదు. డిసెంబర్ 23 దాకా పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయి. రైతుల నిరసనలు, నల్ల చట్టాల అంశమే నిత్యం వార్తల్లో ఉంటే.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో విపక్షాలూ ఎలాగూ దీన్ని అందిపుచ్చుకొని ప్రధానాస్త్రంగా చేసుకుంటాయి. వెరసి కాషాయ పార్టీపై ప్రజావ్యతిరేకత ప్రబలుతుంది. అందుకే బీజేపీ వ్యూహకర్తలు పట్టువిడుపులు ప్రదర్శించారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు సాగు చట్టాలు, పెట్రోధరల లాంటి అంశాలను హైలైట్ చేస్తూ పతాక శీర్షికలకు ఎక్కితే అది కచ్చితంగా ప్రజల్లో కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల ప్రతికూల సంకేతాలను పంపుతుంది. ఇది కాషాయ దళానికి అభిలషణీం కాదు. ఏడాది కాలంగా ఏమీ పట్టించుకోకున్నా ఇప్పుడిక ‘సమయం’ లేదు కాబట్టే సాగు చట్టాల ఉపసంహరణకు కేంద్రం మొగ్గుచూపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాల ప్రధానాస్త్రాలు మూడింటి విషయంలోనూ ఇప్పుడు కేంద్రం ప్రభుత్వానికి ‘దాటవేత’ ధోరణిని అధిగమించి ఎదురునిలిచి బదులిచ్చే వెసులుబాటు కలిగింది. ఎదురుదాడి ఇటీవల పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాల్లో తేడాకొట్టిన వెనువెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అన్నట్లుగా బీజేపీ, ఎన్డీయేపాలిత రాష్ట్రాలు సైతం పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ను తగ్గిస్తూ గంటల వ్యవధిలో పోటీలు పడి ప్రకటనలు విడుదల చేశాయి. ఇప్పుడిదే అంశాన్ని పట్టుకొని బీజేపీ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాల నోరునొక్కడానికి ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. మీ రాష్ట్రాల్లో వ్యాట్‌ను ఎందుకు తగ్గించట్లేదని ఎదురుదాడికి దిగుతుంది. ఇతర ఏ అంశాన్ని విపక్షాలు ప్రస్తావించినా బీజేపీ మాత్రం వ్యాట్ ఎందుకు తగ్గించలేదనే అంశాన్నే తెరపైకి తెస్తూ తప్పించకోజూస్తుంది. కేంద్రం వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటీని సెంట్రల్ పూల్ కింద తక్కువగా చూపుతూ సెస్‌ల రూపంలో అధికంగా పిండుకుంటోంది. అసలే రాష్ట్రాలకు ఆదాయ వనరులు తక్కువని, కోవిడ్–19 వ్యాప్తితో రాబడి మరింత దెబ్బతిందని, ఈ నేపథ్యంలో వ్యాట్ తగ్గింపు సాధ్యం కాదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఇతర విపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. వ్యాట్ తగ్గింపు అంశాన్ని ప్రతిరోజూ హైలైట్ చేయడం ద్వారా ఇతర అంశాలను మరుగున పడేయడానికి పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ తప్పకుండా ప్రయత్నం చేస్తుందనడంలో సందేహం లేదు. అంతిమంగా ప్రజా వ్యతిరేకతను వీలైనంత తగ్గించుకొని, విపక్షాలకు అస్త్రాలేవీ లేకుండా చేయాలని, తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆలస్యమైనా ఉపశమనం సదుద్దేశంతో రైతుల మేలుకోరి మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చినా కొందరినీ ఒప్పించలేక వీటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఈనెల 19న ప్రకటించారు. దేశానికి క్షమాçపణ చెప్పారు. ఉపసంహరణ æప్రక్రియను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే పూర్తి చేస్తామన్నారు. రైతు ఆందోళనల్లో కీలక భూమిక పోషిస్తున్న జాట్లు 136 స్థానాలున్న పశ్చిమ యూపీలో బీజేపీయేతర ఓటును ఏకతాటిపైకి చేర్చకుండా చూసుకోవాలంటే రైతు చట్టాలను రద్దు చేయాలి. పంజాబ్ జనాభాలో 21 నుంచి 25 శాతం జాట్ సిక్కులు ఉన్నారు. ఇతర సిక్కుల్లోనూ రైతులే అధికం. వీరి ఆగ్రహాన్ని చల్లార్చాలి. ఈ రెండింటినీ బీజేపీ ఆశించింది. ఇప్పుడిక కాంగ్రెస్, మిగతా విపక్షాలు రైతు ఎజెండాపై ఇదివరకటిలా మోదీ సర్కారుపై ముప్పేట దాడికి దిగలేవు. ‘కనీస మద్దతు ధర’ అంశం ఇకపై ఇరుపక్షాల నడుమ సంఘర్షణకు కేంద్ర బిందువు అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి ఊరట విపక్ష నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై పెగాసస్ స్పైవేర్‌తో (ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ తయారీ) నిఘా పెట్టారని, ఫోన్లను ట్యాప్ చేశారని, దీనిపై ప్రభుత్వం విస్పష్టమైన సమాధానం ఇవ్వాలని విపక్షాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను స్తంభింపజేశాయి. సీనియర్ జర్నలిస్టులు కొందరు సుప్రీంకోర్టుకు ఎక్కారు. చట్టవిరుద్ధంగా తామేమీ నిఘా పెట్టలేదని, దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి ఇంతకు మించి వివరాలను వెల్లడించలేమని మోదీ సర్కా రు సుప్రీంకోర్టులో వాదించింది. ఇందులోని నిజా నిజాలను నిగ్గుతేల్చడానికి మాజీ జడ్జి ఆర్.వి.రవీంద్రన్ నేతృత్వంలో ముగ్గురు సాంకేతిక నిపుణులతో కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. అంటే పెగాసస్‌పై కేంద్రానికి తాత్కాలిక ఊరట లభించినట్లే. విపక్షాలు దీన్ని లేవదీసినా అంశం కోర్టు పరిధిలో ఉందని, ఏమైనా ఉంటే సాంకేతిక కమిటీకి విన్నవించుకోవాలంటూ కేంద్రం చేతులు దులుపుకునే అవకాశం ఉంటుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
హెడ్మాస్టర్లలా ఉండాలనుకోవడం లేదు: బిర్లా
శ్రీనగర్: పార్లమెంట్ సభ్యులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చే సమయంలో సభా గౌరవాన్ని కాపాడాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. హద్దు మీరిన సభ్యులను స్కూల్ హెడ్మాస్టర్ల మాదిరిగా శిక్షించాలని తాము (ఉభయ సభల అధ్యక్షులు) అనుకోవడం లేదని తెలిపారు. పార్లమెంట్లో ఆటంకాలు, గందరగోళ పరిస్థితులను ఎలా నివారించాలనే దానిపై పార్టీలు కలిసి కూర్చుని చర్చించాలన్నారు. సభ్యులు సభ వెల్‌లోకి ప్రవేశించి, ప్లకార్డులు ప్రదర్శించకుండా కట్టడి చేసేందుకు అన్ని పార్టీలు చర్చించి, ఒక ప్రవర్తనా నియమావళిని రూపొందించాలన్నారు. ఇటీవల ముగిసిన వర్షాకాల సమావేశాల సమయంలో నిత్యం సభలో గందరగోళం కొనసాగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటికీ పార్లమెంట్ ఒక దిక్సూచిగా మారాలని అందరూ ఆశిస్తున్నారు. సభలో అంతరాయాలు, అదుపుతప్పిన పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచివికావు. మనం(ఎంపీలు) అందరం పార్లమెంట్ గౌరవాన్ని కాపాడాలి, ఇంకా ఇనుమడింపజేసేందుకు ప్రయత్నించాలి’అని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సభ్యులను కట్టడి చేసేందుకు నిబంధనలను మార్చాల్సిన అవసరం ఉందా అని అడిగిన ప్రశ్నకు ఆయన...ప్రస్తుతం ఉన్న నిబంధనలు కఠినమైనవే. పరిస్థితులు చేజారిపోతున్నట్లు భావిస్తే సభాధ్యక్షులు చర్యలు తీసుకోవాల్సి వస్తోంది’అని పేర్కొన్నారు. -
పార్లమెంట్లో ప్రతిపక్షాల రగడ
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాల మధ్యే లోక్‌సభలో బుధవారం రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదించారు. పెగసస్ స్పైవేర్, కొత్త వ్యవసాయ చట్టాలతోపాటు ఇతర అంశాలపై ప్రతిపక్ష సభ్యులు సభలో ఆందోళన కొనసాగించారు. శాంతించాలంటూ సభాపతి పదేపదే చేసిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా నినాదాలతో హోరెత్తించారు. దీంతో పలుమార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత ఇటీవల మరణించిన 8 మంది లోక్‌సభ మాజీ సభ్యులకు బుధవారం సభలో నివాళులర్పించారు. తర్వాత పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ ‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ బిల్లు–2021’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలియజేసింది. మధ్యాహ్నం 3.30 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత వ్యవసాయ మంత్రి తోమర్ ‘కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు(అమెండ్మెంట్) బిల్లు–2021’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే కొబ్బరి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తోమర్ చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందింది. కొబ్బరి బోర్డులో ఇకపై ఆరుగురు సభ్యులను నియమిస్తారు. నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎక్స్–అఫీషియో జాయింట్ సెక్రటరీని నియమిస్తారు. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎగువ సభలో.. పార్లమెంట్ ఎగువ సభలో ప్రతిపక్షాల ఆందోళనల పర్వం కొనసాగుతోంది. పెగసస్ నిఘా, కొత్త సాగు చట్టాలు, ధరల పెరుగుదలపై విపక్ష సభ్యుల వెల్‌లోకి దూసుకొచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజ్యసభలో ‘ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(అమెండ్మెంట్) బిల్లు–2021’ను ఆమోదించారు. అంతకు ముందు దీనిపై స్వల్పంగా చర్చ జరిగింది. ఈ బిల్లు లోక్‌సభలో జూలై 29న ఆమోదం పొందింది. రాజ్యసభలో బుధవారం లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ (అమెండ్మెంట్) బిల్లు–2021, డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్(అమెండ్మెంట్) బిల్లు–2021ను కూడా ఆమోదించారు. రాజ్యసభ వ్యవహారాలను కొందరు సభ్యులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరిస్తుండడాన్ని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తప్పుపట్టారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. ప్రతిపక్షాలు ఆందోళనను ఎంతకీ ఆపకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు. ఆరుగురు టీఎంసీ ఎంపీల సస్పెన్షన్ సభలో అనుచిత ప్రవర్తనకు గాను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య బుధవారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి(టీఎంసీ) చెందిన ఆరుగురు ఎంపీలను సభ నుంచి బహిష్కరించారు. తమను రోజంతా బహిష్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు రాజ్యసభ లాబీ ఎదుట ఆందోళనకు దిగారు. రాజ్యసభ చాంబర్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఘటనపై రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు నివేదిక అందజేస్తామని అధికారులు చెప్పారు. డోలా సేన్, మహమ్మద్ నదీముల్ హక్, అబీర్ రంజన్ బిశ్వాస్, శాంతా ఛెత్రీ, అర్పితా ఘోస్, మౌసమ్ నూర్‌ను రాజ్యసభ నుంచి రూల్ 255 కింద సస్పెండ్ చేసినట్లు పార్లమెంటరీ బులెటిన్‌లో పేర్కొన్నారు. సస్పెండ్‌కు నిరసనగా సమావేశాల్లో మిగిలిన రోజుల్లో సభకు హాజరు కాబోమని ఆ ఎంపీలు పేర్కొన్నారు. పార్లమెంట్లో ప్రతిష్టంభనకు కేంద్రమే కారణం 14 విపక్ష పార్టీల ఉమ్మడి ప్రకటన పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు కేంద్ర ప్రభుత్వమే కారణమని 14 ప్రతిపక్షాల నేతలు ఆరోపించారు. పెగసస్ స్పైవేర్, కొత్త వ్యవసాయ చట్టాలతోపాటు ఇతర కీలక అంశాలపై పార్లమెంట్లో చర్చించాలన్న తమ డిమాండ్‌ను ఆమోదించాలని అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని కేంద్రానికి హితవు పలికారు. ఈ మేరకు 14 విపక్ష పార్టీలకు చెందిన 18 మంది నేతలు బుధవారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్లో విపక్షాలు కలిసికట్టుగా వ్యవహరిస్తుండడంపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. విపక్షాల డిమాండ్‌ను అంగీకరించేందుకు సర్కారు అంగీకరించకపోవడం దారుణమన్నారు. పెగసస్ అనేది జాతి భద్రతకు సంబంధించిన అంశమని, దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి సమాధానం చెప్పాలని ఉద్ఘాటించారు. కొత్త సాగు చట్టాలతోపాటు రైతు సమస్యలపైనా చర్చించాలని చెప్పారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తోపాటు కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఐయూఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్ఎస్పీ, ఎల్జేడీ తదితర పార్టీల నాయకులు ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశారు. -
2031 తర్వాతే తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజన
-
పార్లమెంట్ ప్రతిష్టంభనతో రూ.133 కోట్లు వృథా
న్యూఢిల్లీ: వర్షాకాల సమావేశాలు ఆరంభమైనప్పటి నుంచి విపక్షాల నిరసనతో సభలు సాగని పరిస్థితి ఏర్పడింది. పెగసస్, రైతు చట్టాలపై తొలుత చర్చించాలని విపక్షాలు, అవి తప్ప మిగిలిన అంశాలపై చర్చకు రెడీ అంటూ ప్రభుత్వం భీష్మించుకు కూర్చున్నాయి. దీంతో ఇప్పటివరకు సుమారు 107 గంటలు జరగాల్సిన సమావేశాలు కేవలం 18 గంటలకే పరిమితమయ్యాయి. అంటే మొత్తం సభా సమయంలో 83 శాతం వృధాగా పోయింది. ఈ వృథా ఖరీదు రూ. 133 కోట్లని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జూలై 19న ఆరంభమైన ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగుతాయి. ఇప్పటివరకు రాజ్యసభలో కేవలం 21 శాతం సభా సమయమే ఆందోళనలు లేకుండా సాగగా, లోక్‌సభలో కేవలం 13 శాతం సభా సమయం మాత్రమే జరిగింది. గంటల లెక్కన చూస్తే లోక్‌సభ 54 గంటలకు గాను 7 గంటల పాటు, రాజ్యసభ 53 గంటలకుగాను 11 గంటల పాటు జరిగాయి. సభ సాగిన కొద్ది సమయంలో మూజువాణి ఓటుతో కొన్ని బిల్లులు ఆమోదం పొందాయి. ఉభయసభల్లో నిరసన కారణంగా జరిగిన వృ«థా వల్ల ప్రజాధనం దాదాపు 133 కోట్లు నిరుపయోగంగా పోయినట్లయింది. సభా ప్రతిష్ఠంభనకు మీరంటే మీరే కారణమని ప్రభుత్వం, ప్రతిపక్షాలు విమర్శించుకుంటూ మొత్తం మీద ప్రజాధనాన్ని వృథా చేశాయని రాజకీయ నిపుణులు వాపోతున్నారు. ఎందుకీ నిరసన?: పెగసస్ అనే స్పైవేర్‌తో ప్రభుత్వం పలువురి ఫోన్లను హ్యాక్ చేసిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం తరఫున ఐటీ మంత్రి సమాధానమిస్తూ పెగసస్ విషయం అసలు పట్టించుకోవాల్సిన అంశమే కాదని, హ్యాకింగ్ ఏమీ జరగలేదని విపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చింది. మరోవైపు కొన్ని విపక్షాలు రైతు చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ సభను అడ్డుకుంటున్నాయి. ఇప్పటికే వీటిపై చర్చించామని, కావాలంటే సభలో సమయానుకూలతను బట్టి చర్చిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ విపక్షాలు తగ్గకుండా వెల్‌లోకి వచ్చి సభలను అడ్డుకుంటున్నాయి. కేవలం కొందరికి నివాళులు అర్పించడం, ఒలింపిక్ విజేతకు శుభాకాంక్షలు తెలపడం వంటి కార్యకలాపాలు మినహా కీలకమైన కార్యకలాపాలేవీ ముందుకు సాగలేదు. విపక్షాల ధోరణిపై ఇటీవలే ప్రధాని విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. విపక్షాలు ఇంతే దీటుగా బదులిచ్చాయి. పెగసస్ అంశం అమెరికాలో బయటపడ్డ వాటర్‌గేట్ కుంభకోణంలాంటిదని దుయ్యబడుతున్నాయి. ఇలా ఇరుపక్షాలు మొండిపట్టు పట్టడంతో సభలు సాగకుండా వాయిదాలు పడుతున్నాయి. -
ఆందోళన ఆగలేదు.. సభ సాగలేదు
న్యూఢిల్లీ: పెగసస్, రైతు చట్టాలపై చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు దిగిరాకపోవడంతో శుక్రవారం కూడా పార్లమెంట్ ఎలాంటి చర్చలు జరగకుండా సోమవారానికి వాయిదా పడింది. లోక్‌సభ ఆరంభమైనప్పటి నుంచి విపక్ష సభ్యులు యథాత«థంగా నిరసనకు దిగారు. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగించాలని సభాపతి ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ప్రతిపక్షాల ఆందోళనపై సభలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అసహనం వ్యక్తం చేశారు. పెగసస్‌పై వివాదం అనవసర రగడని, ప్రజా సంబంధ విషయాలపై చర్చకు ప్రభుత్వం రెడీగా ఉందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఈ విషయమై ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వివరణ ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. కానీ విపక్షాలు తమకు మరింత వివరణ కావాలని పట్టుబట్టాయి. ప్రతిపక్షాల ప్రవర్తన దురదృష్టకరమని జోషి వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలు బిల్లులు చర్చలేకుండా ఆమోదం పొందాయని, ఇకనైనా విపక్షాలు కీలక అంశాలపై చర్చకు రావాలని విజ్ఞప్తి చేశారు. కానీ విపక్షాలు వినకపోవడంతో మధ్యాహ్నానికి సభ వాయిదా పడింది. తిరిగి సభ ఆరంభమవగానే ప్రభుత్వం రెండు బిల్లుల(కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ ఇన్ ఎన్సీఆర్ బిల్ 2021, జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ అమెండ్మెంట్ బిల్)ను సభలో ప్రవేశపెట్టింది. వీటిపై చర్చించాలని ప్రభుత్వం, సభాపతి విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. కానీ స్లోగన్లతో సభ సాగకపోవడంతో సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో సేమ్ సీన్ శుక్రవారం రాజ్యసభలో కూడా విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీంతో చర్చలు సాగకుండానే రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. సభారంభం కాగానే విపక్షాల నిరసనతో మధ్యాహ్నంలోపు రెండు మార్లు వాయిదా పడింది. పార్లమెంట్ మర్యాద, ప్రతిష్ట దెబ్బతింటున్నాయని విపక్షాల తీరుపై సభాపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడుతున్న మంత్రుల ముందు విజిళ్లు వేయడం, ప్లకార్డులు ప్రదర్శించడం మర్యాదకాదన్నారు. ప్రతిఒక్కరూ సభా మార్యాద పాటించాలని విజ్ఞప్తి చేశారు. కానీ విపక్ష సభ్యులు వినలేదు. అనంతరం ఆయన జీరో అవర్ ఆరంభించారు. కానీ విపక్షాలు సభను సాగనివ్వలేదు. తిరిగి మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కానీ తిరిగి ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చి స్లోగన్లతో సభను అడ్డుకున్నారు. దీంతో తిరిగి సభ మరలా వాయిదా పడింది. లంచ్ తర్వా త సభలో ప్రభుత్వం మూడు బిల్లులు ప్రవేశపెట్టింది. వీటిలో ఒక బిల్లును ప్రతిపక్ష ఆందోళన మధ్యనే మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. తదనంతరం సభ సోమావారానికి వాయిదా పడింది. -
సంక్షోభంపై కరెన్సీ ముద్రణ అస్త్రం యోచన లేదు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు కోవిడ్–19 మహమ్మారి విసిరిన సవాళ్లను అధిగమించేందుకు కరెన్సీ నోట్ల ముద్రణ ప్రణాళిక ఏదీ ప్రభుత్వం దృష్టిలో లేదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ మేరకు అడిగిన ఒక ప్రశ్నకు ఆమె సమాదానం ఇస్తూ, ‘‘నో సర్’’ అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనడానికి కరెన్సీ ముద్రణ జరపాలా, వద్దా అన్న అంశంపై ఆర్థికవేత్తల మధ్య తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అధిక శాతం మంది కరెన్సీ ముద్రణ సరికాదన్న అభిప్రాయంలో ఉన్నారు. మరికొన్ని అంశాలకు సంబంధించి లోక్‌సభలో ఆర్థిక మంత్రి లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధాలను పరిశీలిస్తే.. ► 2020–21లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3 శాతం క్షీణించింది. మహమ్మారి దీనికి ప్రధాన కారణం. తీవ్ర ప్రతికూలతలను కట్టడి చేయడానికి కేంద్రం పలు చర్యలు తీసుకుంది. ► ఎకానమీ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, మూలాలు పటిష్టంగా ఉన్నాయి. లాక్డౌన్ ఆంక్షలు తొలగడంతో తిరిగి రికవరీ క్రియాశీలమవుతోంది. స్వావలంభన్ (ఆత్మనిర్భర్) భారత్ చర్యలు వృద్ధి పురోగతికి దోహదపడుతున్నాయి. ► స్వావలంభన్ భారత్ (ఏఎన్‌బీ) కింద ప్రభుత్వం రూ.29.87 లక్షల కోట్ల విలువైన సమగ్ర, ప్రత్యేక ఆర్థిక ఉద్దీపనను ప్రకటించింది. ► వృద్ధి విస్తృతం, పటిష్టం కావడానికి 2021–22 బడ్జెట్లో కేంద్రం పలు చర్యలను ప్రకటించింది. మూలధన వ్యయాల్లో 34.5 శాతం పెంపు, ఆరోగ్య రంగంలో కేటాయింపులు 137 శాతం పెరుగుదల వంటివి ఇందులో ఉన్నాయి. ప్రజారోగ్యం, ఉపాధి కల్పన వంటి లక్ష్యాల సాధనకు 2021 జూన్‌లో కేంద్రం రూ.6.29 లక్షల కోట్ల సహాయక ప్యాకేజ్ ప్రకటించింది. ► జీడీపీ సర్దుబాటు చేయని స్థిర ధరల వద్ద (నామినల్) 2022 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 14.4 శాతం వృద్ధి నమోదువుతుందని 2021–22 బడ్జెట్ అంచనా. ఆర్బీఐ తాజా విశ్లేషణల ప్రకారం, వాస్తవిక జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతం. అర్బీఐ అంతక్రితం 10.5 శాతం వృద్ధి అంచనాలను 9.5 శాతానికి తగ్గించడానికి మహమ్మారి ప్రేరిత అంశాలే కారణం. ► వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ)కి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా రెపో ఆపరేషన్స్సహా పలు చర్యలను ఆర్బీఐ తీసుకుంటోంది. ముఖ్యంగా లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) తగిన లిక్విడిటీ అందుబాటులో ఉండడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ► పరారైన ఆర్థిక నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారి ఆస్తులను జప్తు చేసుకుని, బాకీలన్నీ రాబట్టడానికి కేంద్రం తగిన అన్ని చర్యలు తీసుకుంటుంది. ► బ్యాంకింగ్‌లో మొండిబకాయిల సమస్యను తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఇందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. లోక్‌సభలో దివాలా చట్ట సవరణ బిల్లు దివాల చట్ట సవరణ బిల్లును (ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్రప్సీ కోడ్– అమెండ్మెంట్ బిల్లు 2021) ఆర్థికమంత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రుణ ఒత్తిడిలో ఉన్న లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమలకు ప్రీ–ప్యాకేజ్డ్ రిజల్యూషన్ పక్రియ సౌలభ్యతను కల్పించడం ఈ సవరణ ప్రధాన ఉద్దేశం. ఏప్రిల్ 4న ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న సీతారామన్ ప్రవేశపెట్టారు. రుణ చెల్లింపుల వైఫల్య పరిమితి రూ.కోటికి లోబడి ప్రీ–ప్యాకేజ్డ్ రిజల్యూషన్ ప్రాసెస్‌ను ప్రారంభించడానికి ఈ సవరణ వీలు కల్పిస్తుంది. బిజినెస్ @ పార్లమెంటు క్యూ1 పన్ను వసూళ్లలో 86% వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (క్యూ1–ఏప్రిల్ నుంచి జూన్)లో నికర పన్ను వసూళ్లు 86 శాతం పెరిగినట్లు లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. ఇందులో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.2.46 లక్షల కోట్లయితే, పరోక్ష పన్నుల విషయంలో ఈ పరిమాణం రూ.3.11 లక్షల కోట్లని పేర్కొన్నారు. నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు (2020 ఇదే కాలంతో పోల్చి) 109 శాతంపైగా పెరిగి రూ.2,46,520 కోట్లకు పెరిగాయని తెలిపారు. నికర పరోక్ష పన్నుల విషయంలో పెరుగుదల 70 శాతం ఉందని వివరించారు. ఇన్ఫోసిస్‌కు ఇప్పటికి రూ.164.5 కోట్లు కొత్త ఆదాయపు పన్ను ఈ–ఫైలింగ్ పోర్టల్ అభివృద్ధికి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు కేంద్రం ఇప్పటికి రూ.164.5 కోట్లు చెల్లించిందని పంకజ్ చౌదరి మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2019 జనవరి నుంచి జూన్ 2021 మధ్య ఈ చెల్లింపులు జరిపినట్లు వివరించారు. ఆర్థికశాఖ సహాయమంత్రి పేర్కొన్న వివరాల ప్రకారం రూ.4,242 కోట్ల ఈ ప్రాజెక్టుకు కేంద్రం 2019 జనవరి 19న ఆమోదముద్ర వేసింది. నిర్వహణ, జీఎస్టీ, రెంట్, పోస్టేజ్‌సహా 8.5 సంవత్సరాల్లో ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూన్ 7న పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. అయితే కొన్ని సాంకేతిక లోపాలను పన్ను చెల్లింపుదారులు, వృతి నిపుణులు, సంబంధిత వ్యక్తులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల నిరంతర పరిష్కారానికి ఇన్ఫోసిస్ పనిచేస్తోంది. రూ.8.34 లక్షల కోట్లకు తగ్గిన ఎన్పీఏలు మొండిబకాయిల (ఎన్పీఏ) భారం 2021 మార్చి చివరికి రూ.61,180 కోట్లు తగ్గి రూ.8.34 లక్షల కోట్లకు దిగివచ్చినట్లు లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కే కరాద్ తెలిపారు. 2020 మార్చి ముగింపునకు ఎన్పీఏల భారం రూ.8.96 లక్షల కోట్లని వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు బ్యాంకింగ్ మొండిబకాయిలు తగ్గడానికి కారణమని వివరించారు. మరో ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ, 2018 మార్చి 31వ తేదీ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు రూ.8,95,601 కోట్లని వివరించారు. -
కోవిడ్ సంక్షోభం.. ఆర్థికమంత్రి గారు నోట్లు ముద్రిస్తారా?
న్యూఢిల్లీ: కోవిడ్ కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవడానికి కొత్తగా నోట్లు ముద్రించే ఆలోచన ఏదీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు. కోవిడ్ సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ త్వరగానే కోలుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. నో సార్ పార్లమెంటు సమావేశాల సందర్భంగా ... కోవిడ్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని, ఈ విపత్తును ఎదుర్కొనేందుకు నోట్లను ముద్రిస్తారా అంటూ ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ‘నో సార్’ అంటూ ఆర్థిక మంత్రి చట్టసభలో సమాధానం ఇచ్చారు. గాడిన పడుతోంది 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్థూల జాతీయోత్పత్తి జీడీపీ సుమారు 7.3 శాతం కుదించబడిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రాథమిక అంశాలు బలంగా ఉన్నాయని అందువల్ల ఇప్పుడప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని, ఈ ఏడాది చివరి నాటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు రూ,.30 వేల కోట్లతో ఆత్మనిర్బర్ భారత్ ప్యాకేజీని ప్రకటించామని వివరించారు. -
వచ్చేవారం పోలవరంపై చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు, పార్టీ ఫిరాయింపులపై పార్లమెంటు ఉభయసభల్లో చర్చను కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు నోటీసులు ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పి.వి.మిథున్‌రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వంగా గీత శుక్రవారం ఈమేరకు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం తాము ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా చర్చకు పట్టుపట్టుతూ తమ స్థానాల్లో నిలబడి నినాదాలు చేశారు. వివిధ పక్షాల ఆందోళనలతో ఉభయ సభలు పలుమార్లు వెంటవెంటనే వాయిదాపడ్డాయి. ఆయా అంశాలపై వచ్చేవారం చర్చకు అనుమతిస్తామని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ప్రహ్లాద్ జోషి హామీ ఇచ్చారని సభ అనంతరం మీడియా సమావేశంలో ఎంపీలు వెల్లడించారు. రాజ్యసభలో.. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం నిధుల విడుదలపై జరుగుతున్న జాప్యంపై చర్చకు అనుమతించాలంటూ రూల్ 267 కింద వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నోటీసు ఇచ్చారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూలును అనుసరించి పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్చకు అనుమతించాలని రూల్ 267 కింద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నోటీసు ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 90(1) ప్రకారం పోలవరం సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 2022 ఖరీఫ్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను జలశక్తిశాఖ సాంకేతిక కమిటీ ఆమోదించినా కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.1,917 కోట్లు ఇంకా రీయింబర్స్ చేయకపోవడం, ఇతరత్రా అంశాల వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతోంది’ అని పేర్కొంటూ శుక్రవారం సభ కార్యకలాపాలు రద్దుచేసి ఈ అంశంపై చర్చ చేపట్టాలని ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసులో పేర్కొన్నారు. ‘ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో ఉండాలి. ఎవరైనా చట్ట సభ్యుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ.. ఏ గుర్తుపై పోటీచేసి గెలిచారో ఆ పార్టీ అధినేతపై విమర్శలు చేయడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య సూత్రాలను అణగదొక్కడం వంటిదే. సదరు సభ్యుడు ఎన్నికల అనంతరం ప్రజాస్వామ్య సూత్రాలను దుర్వినియోగం చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సభాపతి లేదా చైర్మన్‌కు సదరు సభ్యుడిపై అనర్హత వేటు వేయాలని మెమొరాండం, పిటిషన్ ఇచ్చి కోరితే దానిపై నిర్ణయం తీసుకోవాలి. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో సభలో ఈ అంశంపై ఎలాంటి ఆలస్యం చేయకుండా చర్చించాలి’ అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తాను ఇచ్చిన నోటీసులో కోరారు. లోక్‌సభలో.. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై రూల్ 193 కింద స్వల్పకాలిక చర్చ కోరుతూ పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి నోటీసు ఇచ్చారు. అయితే శుక్రవారం ఉభయసభలు వివిధ పక్షాల ఆందోళనతో పలుమార్లు వాయిదాపడ్డాయి. కేంద్రప్రభుత్వం వ్యాపారసంస్థలా వ్యవహరించరాదు వైఎస్సార్సీపీ ఎంపీలు బోస్, గీత, సురేశ్, అనూరాధ, సత్యవతి, మాధవి పార్లమెంటు ఉభయసభల్లోను వచ్చే వారంలో పోలవరంపై చర్చ జరగనుందని వైఎస్సార్సీపీ ఎంపీలు తెలిపారు. పోలవరంపై చర్చకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అంగీకరించారని చెప్పారు. న్యూఢిల్లీలోని విజయ్‌చౌక్‌లో శుక్రవారం వైఎస్సార్సీపీ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, వంగా గీత, నందిగం సురేశ్, చింతా అనూరాధ, బి.వి.సత్యవతి, గొడ్డేటి మాధవి మీడియాతో మాట్లాడారు. పోలవరంపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపుతోందని సుభాష్‌చంద్రబోస్ విమర్శించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అన్న విషయం కేంద్రం మరిచినట్టు ఉందన్నారు. ‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, సవరించిన అంచనాల ప్రకారం నిధుల విడుదల్లో జరుగుతున్న జాప్యంపై ఇటు రాజ్యసభలోను, అటు లోక్సభలోను చర్చకు అనుమతి కోరుతూ నోటీసులు ఇచ్చాం. పోలవరంపై చర్చకు రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కూడా అంగీకరించారు. విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయస్థాయి హోదా ఉన్న ప్రాజెక్టు అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మర్చిపోతున్నట్టు ఉంది. పోలవరానికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని పెండింగ్‌లో పెట్టడం చాలా దురదృష్టకరమైన అంశం. తక్షణమే ప్రాజెక్టుకు సవరించిన అంచనా నిధులు విడుదల చేయాలి. సవరించిన అంచనా ప్రకారం రూ.55,656.87 కోట్లు విడుదల చేసే అంశం, రెండేళ్లకు పైగా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వం పూర్తిచేయాల్సిన పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం, ఇంప్లిమెంట్ ఏజెన్సీగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి అడుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ వచ్చినప్పుడల్లా కేంద్రం దృష్టికి నిధుల సమస్యను తీసుకెళుతున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. లోక్‌సభలో పార్టీ పక్షనేత మిథున్‌రెడ్డి, రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పలుసార్లు సంబంధిత మంత్రులను కలిసి వివరించినప్పటికీ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం చాలా దురదృష్టకరం. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలను ఆమోదించమని, టెక్నికల్ కమిటీ, సీడబ్ల్యూసీ, పీపీఏ ఆమోదం తెలిపి సంవత్సరాలు గడుస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ పోలవరంపై సవతితల్లి ప్రేమ చూపిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టిన దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా నిధులను కూడా కేంద్రం పెండింగ్‌లో పెట్టింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా విశాఖ నగరానికి, విశాఖపట్నం పరిసర గ్రామాలకు మంచినీరు సరఫరాకు సంబంధించిన పనులకు దాదాపు రూ.4 వేల కోట్ల నిధులు ఇవ్వం, కేవలం సాగునీటికే ఇస్తాం అని కేంద్రం అనడం తప్పు. ఈ విషయాన్ని పలుసార్లు ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి కూడా తీసుకెళ్లాం. ప్రభుత్వాలు అనేవి లాభాలతో నడిచే సంస్థలు కాదు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి సహాయ, సహకారం చేసే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఏదో వ్యాపారసంస్థల్లా చేయడం మంచిది కాదు. పోలవరం ప్రాజెక్టులో అతి ప్రధానమైనవి ల్యాండ్ అక్విజేషన్, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ. ఇవన్నీ ప్రాజెక్టును జాతికి అంకితం చేసే రోజుకి కేంద్రం క్లియర్ చెయ్యాలి. అప్పుడే పోలవరం ప్రాజెక్టును సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఖరీఫ్ 2022 కల్లా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. రైతుల ప్రయోజనార్థం ప్రాజెక్టు నుంచి వచ్చే ఖరీఫ్‌లో నీళ్లు ఇస్తామని మాట కూడా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అడ్మినిస్టేటివ్ ఆఫీసు పోలవరం ప్రాజెక్టుకు ఎక్కడో దూరంగా హైదరాబాద్‌లో ఉంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమహేంద్రవరంలో పెట్టాలని కేంద్రాన్ని కోరాం’ అని పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. పోలవరం నిర్వాసితులకు తక్షణం పునరావాసం కల్పించాలి ఎంపీ వంగా గీత మాట్లాడుతూ అనేక ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పోలవరానికి జీవం పోసి ఓ రూపాన్ని ఇచ్చారని చెప్పారు. విభజన చట్టంలో భాగంగా> పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అయినప్పటికీ నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరమన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 15–17 సార్లు కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తులు చేసినా పోలవరం నిధుల విడుదలపై జాప్యం చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి గిరిజనుల మీద ప్రేమ లేదన్నారు. పోలవరం నిర్వాసితులకు తక్షణమే పునరావాసం కల్పించాలని ఆమె డిమాండు చేశారు. తిరుపతి బహిరంగసభలో ప్రధాని మోదీ ఏపీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన పార్లమెంట్ సాక్షిగా ఒక ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ఇంతవరకు నెరవేరలేదని, పార్లమెంట్లో ఇచ్చిన హామీకే విలువ లేకపోతే ప్రజాస్వామ్యానికే విలువ లేనట్లని పేర్కొన్నారు. ఏపీ పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరికాదని, ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయకుండా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలు, రైతుల తరఫున రోజూ పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. -
త్వరలో ఢిల్లీకి మమతా.. సోనియా గాంధీని కలువనుందా?
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ త్వరలో ఢిల్లీ పర్యటించనున్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభ కానున్న నేపథ్యంలో మమతా హస్తిన పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తన పర్యటనలలో భాగంగా అపాంట్మెంట్ దొరికితే.. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్కొవింద్ను కలుస్తానని పేరొన్నారు. అదే విధంగా ఆమె కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీతో భేటీ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లలేదు. ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితి నియంత్రణలోకి వస్తోంది. పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి, పలువురు నేతలను కాలవనున్నాను’ అని మమతా బెనర్జీ గురువారం పేరొన్నారు. మమత ఢిల్లీ పర్యటన నేపథ్యంలో 2024లో బీజేపీని ఎదుర్కొవడానికి పలు ప్రతిపక్ష పార్టీలతో కూడిన సంకీర్ణ కూటమీలో ఆమె భాగస్వామ్యం కానున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మమతాబెనర్జీ జూలై 25న ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వార్షాకాల పార్లమెంట్ సమావేశాలు జూలై 19 నుంచి ఆగస్టు13 వరకు జరుగుతాయి. ఇటీవల బీజేపీ వ్యకతిరేక కూటమికి చెందిన పలు పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు ఎన్సీపీ నేత శరద్ పవర్ నివాసంలో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక, ఇటీవల ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. శరద్ పవార్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలలో వరుసగా భేటీ అవుతున్న నేపథ్యంలో మమత పర్యటనపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
ప్రత్యేక హోదా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: విజయసాయిరెడ్డి
సాక్షి, విజయవాడ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారని వైఎస్సార్సీసీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీలన్నింటినీ అమలు చేయాలని కోరతామని, ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ మొదట్నుంచీ పోరాడుతుందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. పోలవరం సవరించిన అంచనాల గురించి పార్లమెంట్లో ప్రస్తావిస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధుల అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు. తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్ట్‌లను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని, కేఆర్ఎంబీ పరిధిని కేంద్రం నోటిఫై చేయాలని కోరతామని పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని, తెలంగాణ నుంచి రూ.6,112 కోట్లు విద్యుత్ బకాయిలు రావాలన్నారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 12సార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. దిశ చట్టాన్ని ఆమోదించాలని కోరతాంమని, జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కోసం పీఎంఏవై కింద నిధులు ఇవ్వాలని కోరతామని తెలిపారు. ట్రైబల్ యూనివర్శిటీని నాన్‌ట్రైబల్ ఏరియాలో కేటాయించారని, దాన్ని సాలూరులో పెట్టాలని కోరతామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19 న ప్రారంభమై ఆగస్టు 13 తో ముగియనున్నాయి. -
కృష్ణ జలాల అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తుతాం : గొడ్డేటి మాధవి
-
జులై 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
-
పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిరవధికంగా వాయిదా వేసింది. ఈ సమావేశాల్లో భాగంగా బడ్జెట్, ద్రవ్యవినిమయ బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలిపాయి. ఇప్పటివరకు జరిగిన సమావేశాల్లో లోక్‌సభలో 18 బిల్లులు, రాజ్యసభలో 19 బిల్లులు ఆమోదం పొందాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్లమెంట్ సమావేశాల సమయాన్ని కుదించారు. ఏప్రిల్ 8వరకు జరగాల్సి ఉన్న పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. రెండు నెలలపాటు కొనసాగిన ఈ సమావేశాలు జనవరి29న ప్రారంభమయ్యాయి. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువులు ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను షెడ్యూల్ కంటే ముందుగానే ముగించాలని స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం కేంద్ర ప్రభుత్వం ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. చదవండి: ఖరారైన శరద్ పవార్ బెంగాల్ పర్యటన -
వ్యాక్సిన్ అందరికీ అక్కర్లేదు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
న్యూఢిల్లీ: దేశంలోగానీ, ప్రపంచంలోగానీ ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం లేదని అది సైంటిఫిక్ పద్ధతి కాదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. వైరస్ తన పంథాను మార్చుకుంటున్న కొద్దీ, దాన్ని బట్టి మన ప్రాధాన్యతలను మార్చుకోవాలని లోక్‌సభలో క్వశ్చన్ అవర్ సందర్భంగా చెప్పారు. ఈ క్రమంలోనే జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సలహా మేరకు ఆరోగ్య రంగం, ఫ్రంట్‌లైన్ వర్కర్ల రంగం, వృద్ధులు, 45 సంవత్సరాలు దాటి వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ అందిస్తున్నామని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవాలి.. కాంగ్రెస్ ఎంపీ రవీత్‌సింగ్ బిట్టు ప్రశ్నిస్తూ.. కోవిడ్ –19 వల్ల ప్రజల భయపడుతున్నారని, అది భవిష్యత్తులో వారికి హాని చేస్తుందా అని ప్రశ్నించారు.. దానికి హర్షవర్ధన్ సమాధానమిచ్చారు. పోలియో, చికెన్ పాక్స్ వంటి వ్యాధులపై మనం విజయం సాధించామని, అందుకు కారణం వ్యాక్సినేషన్ అని చెప్పారు. త్వరలోనే భారత్ నుంచి మరికొన్ని కోవిడ్ వ్యాక్సిన్లు వస్తాయని వాటితో పాటే ప్రీ–ట్రయల్స్, క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. అందరికీ రక్తం అందింది.. తలసేమియాపై పార్లమెంటులో లేవనెత్తిన ప్రశ్నకు హర్షవర్ధన్ సమాధానమిస్తూ.. తలసేమియా రోగులకు తరచుగా రక్తం ఎక్కించాల్సి ఉంటుందని అన్నారు. కరోనాతో దేశం అతలాకుతలమైన సమయంలో కూడా ఏ ఒక్క తలసేమియా రోగికి రక్తం అందని పరిస్థితి ఎదురుకాలేదని చెప్పారు. ఒక్క ఏడాదిలోనే.. ఏడాదిలోనే 75 వైద్య కళాశాలలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 30 వేల ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఇదంతా కోవిడ్ విజృంభించి సమయంలోనే జరిగిందన్నారు. ఆరేళ్లలో 24 వేల కొత్త పీజీ మెడికల్ సీట్లను సృష్టించినట్లు వెల్లడించారు. 39,726 కొత్త కరోనా కేసులు.. దేశంలో గత 24 గంటల్లో 39,726 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాదిలో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,15,14,331కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 154 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,59,370కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,10,83,679కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,71,282గా ఉంది. -
ఇక ‘తుక్కు’ రేగుతుంది..!
న్యూఢిల్లీ: కాలుష్యకారక పాత వాహనాల వినియోగాన్ని తగ్గించి, కొత్త వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పాత వాహనాలను తుక్కు కింద మార్చేందుకు ఇచ్చి, స్క్రాప్ సర్టిఫికెట్ తీసుకుంటే కొత్త కారుకు రిజిస్ట్రేషన్ ఫీజును మాఫీ చేయాలని భావిస్తోంది. అలాగే, వ్యక్తిగత వాహనాలకు 25 శాతం దాకా, వాణిజ్య వాహనాలకు 15 శాతం దాకా రోడ్ ట్యాక్స్‌లో రిబేటు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించనుంది. ఇక స్క్రాపింగ్ సర్టిఫికెట్ గల వాహనదారులకు కొత్త వాహనాలపై అయిదు శాతం మేర డిస్కౌంటు ఇచ్చేలా వాహనాల తయారీ సంస్థలకు కూడా సూచించనుంది. వాహనాల స్క్రాపేజీ విధానంపై కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం పార్లమెంటులో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ విధానంపై సంబంధిత వర్గాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు రాబోయే కొన్ని వారాల్లో ముసాయిదా నోటిఫికేషన్‌ను ప్రచురించనున్నట్లు ఆయన తెలిపారు. రిజిస్టర్డ్ తుక్కు కేంద్రాల్లో పాత, అన్‌ఫిట్ వాహనాలను స్క్రాప్ కింద ఇచ్చేసి, స్క్రాపింగ్ సర్టిఫికెట్ పొందే యజమానులకు ఈ స్కీమ్ కింద పలు ప్రోత్సాహకాలు లభిస్తాయని గడ్కరీ తెలిపారు. స్క్రాప్ కింద ఇచ్చేసే వాహనాల విలువ.. కొత్త వాహనాల ఎక్స్‌షోరూం రేటులో సుమారు 4–6% దాకా ఉండేలా స్క్రాపింగ్ సెంటర్ సర్టిఫికెట్ జారీ చేసే అవకాశం ఉంటుందన్నారు. దేశీ వాహన పరిశ్రమ టర్నోవరు ప్రస్తుతం రూ. 4.5 లక్షల కోట్ల స్థాయి నుంచి రూ. 10 లక్షల కోట్లకు పెరిగేందుకు స్క్రాపేజీ పాలసీ తోడ్పడగలదని మంత్రి తెలిపారు. అందరికీ ప్రయోజనకరం..: స్క్రాపేజీ విధానం అన్ని వర్గాలకూ ప్రయోజనకరంగా ఉండబోతోందని గడ్కరీ తెలిపారు. ఇంధన వినియోగ సామర్థ్యం మెరుగుపడేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు, కొత్త వాహనాల కొనుగోళ్లపై జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేందుకు కూడా ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. పాత, లోపభూయిష్టమైన వాహనాల సంఖ్యను తగ్గించడం ద్వారా కాలుష్య కారక వాయువుల విడుదలను నియంత్రించేందుకు, రహదారి.. వాహనాల భద్రతను మెరుగుపర్చేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుందన్నారు. ప్రాణాంతకంగా రోడ్డు ప్రమాదాలు.. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య కోవిడ్–19 మరణాల కన్నా ఎక్కువ ఉండటం ఆందోళనకరమని గడ్కరీ తెలిపారు. గతేడాది కోవిడ్–19తో 1.46 లక్షల మంది మరణించగా రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మృత్యువాత పడ్డారని ఆయన పేర్కొన్నారు. వీరిలో అత్యధిక శాతం 18–35 ఏళ్ల మధ్య వయస్సున్న వారేనని మంత్రి చెప్పారు. తుక్కు పాలసీ ప్రతిపాదనల్లో మరికొన్ని... ► వాహనాల ఫిట్నెస్ టెస్టులు, స్క్రాపింగ్ సెంటర్ల సంబంధ నిబంధనలు 2021 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. పదిహేనేళ్లు పైబడిన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల వాహనాలను తుక్కు కింద మారుస్తారు. ► 2023 ఏప్రిల్ 1 నుంచి భారీ వాణిజ్య వాహనాల ఫిట్నెస్ టెస్టింగ్‌ను తప్పనిసరి చేస్తారు. మిగతా వాహనాలకు దశలవారీగా 2024 జూన్ 1 నుంచి దీన్ని అమల్లోకి తెస్తారు. ► ఫిట్నెస్ టెస్టులో విఫలమైనా, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పునరుద్ధరణలో విఫలమైనా సదరు వాహనాల జీవితకాలం ముగిసినట్లుగా పరిగణిస్తారు. 15 ఏళ్ల తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందడంలో విఫలమైన వాణిజ్య వాహనాలను డీ–రిజిస్టర్ చేస్తారు. ఇలాంటి వాహనాల వినియోగాన్ని తగ్గించే దిశగా 15 ఏళ్ల పైబడిన కమర్షియల్ వాహనాల ఫిట్నెస్ టెస్టు, సర్టిఫికెట్ల ఫీజును భారీగా పెంచుతారు. ► ప్రైవేట్ వాహనాల విషయానికొస్తే .. 20 ఏళ్ల తర్వాత ఫిట్నెస్ టెస్టులో లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పునరుద్ధరణలో విఫలమైన పక్షంలో డీ–రిజిస్టర్ చేస్తారు. 15 ఏళ్ల నుంచే రీ–రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచుతారు. ► ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో రిజిస్టర్డ్ వాహనాల స్క్రాపింగ్ కేంద్రాల (ఆర్వీఎస్ఎఫ్) ఏర్పాటుకు కేంద్రం ప్రోత్సాహమిస్తుంది. స్క్రాపింగ్ కేంద్రం ఏర్పాటుకు మార్గదర్శకాల ముసాయిదా.. రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ కేంద్రం (ఆర్వీఎస్ఎఫ్) ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాల ముసాయిదాను కేంద్రం ప్రకటించింది. దీని ప్రకారం వచ్చే రెండేళ్లలో దేశ వ్యాప్తంగా 100 స్క్రాపింగ్ సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. ఆర్వీఎస్ఎఫ్ ఏర్పాటుకు రూ. లక్ష లేదా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రభుత్వాలు నిర్దేశించే మొత్తం ప్రాసెసింగ్ ఫీజుగా ఉంటుంది. ప్రతీ ఆర్వీఎస్ఎఫ్కు ముం దస్తు డిపాజిట్‌గా రూ.10 లక్షల బ్యాంక్ గ్యా రంటీ ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కో సం దరఖాస్తు చేసుకున్న 60 రోజులల్లోగా అనుమ తులపై నిర్ణయం తీసుకోవాలి. ఈ ముసా యిదా నిబంధనలపై సంబంధిత వర్గాలు 30 రోజుల్లోగా అభిప్రాయాలు తెలియజేయాలి. -
పెట్రో ధరల సెగలు పార్లమెంట్ ఉభయ సభలను తాకాయి
-
ఉభయ సభలకు పెట్రో సెగలు
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రో ధరల సెగలు పార్లమెంట్ ఉభయ సభలను తాకాయి. మలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమవగా.. పెట్రో ధరలపై కాంగ్రెస్ సభ్యుల ఆందోళనల కారణంగా కార్యక్రమాలకు అంతరాయం కలిగి ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఉదయం 9 గంటలకు రాజ్యసభ సమావేశం ప్రారంభమవగానే కాంగ్రెస్ సభ్యులు పెట్రోల్, డీజిల్ తదితర పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలపై చర్చించాలంటూ ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేత ఖర్గే ఇచ్చిన నోటీస్‌ను చైర్మన్ ప్రస్తావించారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు తరచుగా పెరుగుతున్నాయని ఈ అంశంపై చర్చించాలని ఖర్గే 267వ నిబంధన కింద నోటీసు ఇచ్చినట్టు ౖచైర్మన్ ప్రస్తావించారు. అయితే అప్రొప్రియేషన్ బిల్లుపై చర్చ జరిగిన సందర్భంలో దీనిపై చర్చించవచ్చని చెబుతూ చైర్మన్ ఈ నోటీసును తిరస్కరించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ ‘ఇది చాలా ముఖ్యమైన అంశం. ప్రభుత్వం ధరల పెరుగుదలపై ఏ సమాధానం ఇస్తుందోనని ఎదురుచూస్తున్నాం. దీనిపై చర్చించాలి’అని కోరారు. నిరసనలతో సభ నాలుగుసార్లు వాయిదాపడింది. చివరకు.. తిరిగి సభ ప్రారంభమయ్యాక సభాపతి స్థానంలో ఉన్న వందనా చవాన్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. సాయంత్రం 4 గంటలకు లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష కాంగ్రెస్ సభ్యులు పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. విపక్ష సభ్యులు తమ ఆందోళనను కొనసాగించడంతో సభను రాత్రి 7 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. 7 గంటలకు తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ విపక్ష సభ్యుల ఆందోళన కొనసాగింది. నినాదాలు హోరెత్తడంతో మంగళవారానికి వాయిదా వేశారు. కరోనా నేపథ్యంలో ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్‌సభ సమావేశాలు నిర్వహిస్తుండగా.. సభ్యుల కోరిక మేరకు సమావేశాలను పూర్వ రీతిలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించాలని రాజ్యసభ ౖచైర్మన్ వెంకయ్య, లోక్‌సభ సభాపతి బిర్లా నిర్ణయించారు. పార్లమెంటు సమావేశాల కుదింపు? ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తొలి విడత ఎన్నికల కంటే ముందే సమావేశాలను ముగించాలని తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల సభ్యుల విన్నపం మేరకు ఏప్రిల్ 8 వరకు కొనసాగాల్సిన సమావేశాలను ఈనెల 25వ తేదీ నాటికే కుదించనున్నట్టు తెలుస్తోంది. -
సరైన సమయంలో కశ్మీర్‌కు రాష్ట్ర హోదా
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు తగిన సమయం చూసి తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో హామీ ఇచ్చారు. కశ్మీర్‌ను దశాబ్దాల తరబడి పరిపాలించిన వారికంటే 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కేంద్రం ఆ ప్రాంతానికి ఎంతో చేసిందని చెప్పారు. జమ్మూకశ్మీర్ రీఆర్గనైజేషన్ (సవరణ) 2021 బిల్లుపై జరిగిన చర్చకు అమిత్ షా శనివారం లోక్‌సభలో సమాధానమిచ్చారు. జమ్మూకశ్మీర్‌కు మళ్లీ ఎప్పటికైనా రాష్ట్ర హోదా దక్కుతుందని పెట్టుకున్న ఆశలు ఈ బిల్లుతో అడియాసలుగా మారుతున్నాయని కొందరు సభ్యులు వ్యక్తం చేసిన ఆందోళనను ఆయన తోసిపుచ్చారు. అఖిల భారత సర్వీసు ఆఫీసర్స్ జమ్మూకశ్మీర్ కేడర్ని అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం యూనియన్ టెర్రిటరీలతో కలపడమే ఈ బిల్లు ఉద్దేశమని స్పష్టం చేశారు. కశ్మీర్ రాష్ట్ర హోదాకి ఈ బిల్లుకి ఎలాంటి సంబంధం లేదన్న అమిత్ షా సరైన సమయం చూసి తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత మూజువాణి ఓటుతో బిల్లుని సభ ఆమోదించింది. ఈ బిల్లు ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందింది. కశ్మీర్‌కే మొదట్నుంచి ప్రాధాన్యం జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370కి మద్దతు పలికి 70 ఏళ్లకు పైగా ఆ ప్రాంతాన్ని అలాగే ఉంచిన కాంగ్రెస్ ఇతర పార్టీలు, తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న ఈ బిల్లుపై ఎందుకు ఇన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారో అర్థం కావడం లేదని అమిత్ షా అన్నారు. 2014లో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి జమ్మూకశ్మీర్‌కి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తోందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైనా కశ్మీర్‌కి స్వేచ్ఛగా వెళ్లి రావచ్చునని చెప్పారు. కశ్మీర్ పౌరులెవరూ తమ భూములు కోల్పోరని హామీ ఇచ్చిన అమిత్ షా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి తగినన్ని భూములున్నాయని తెలిపారు. స్థానిక అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ పంచాయతీల బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. రాజులు, రాణుల పాలనకు ఎవరూ అంగీకరించరని ప్రజలే ప్రభువులుగా ఉండాలన్నదే ప్రజాభీష్టంగా ఉందని వివరించారు. 2022 నాటికి కశ్మీర్‌కు రైలు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ముగిసిన మొదటి విడత సమావేశాలు లోక్‌సభ మొదటి విడత బడ్జెట్ సమావేశాలు శనివారం ముగిశాయి. రెండో విడత సమావేశాలు తిరిగి మార్చి 8న ప్రారంభమై ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలు సాధారణంగా రెండు విడతలుగా జరుగుతాయి. మొదటి విడతలో పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడం, బడ్జెట్ ప్రవేశం పెట్టడం ఉంటాయి. రెండో విడతలో వివిధ శాఖలకు గ్రాంట్ల డిమాండ్లపై సంబంధిత స్టాండింగ్ కమిటీల పరిశీలన ఉంటుంది. ఫైనాన్స్ బిల్లు, సంబంధిత గ్రాంట్ల డిమాండ్ల ఆమోదం వంటివి ఉంటాయి. కాగా, మొదటి విడత బడ్జెట్ సమావేశాలు 100% ఫలప్రదంగా ముగిశాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. జనవరి 29వ తేదీన ప్రారంభమైన ఈ సమావేశాలు నిర్ణీత 50 గంటల్లో 49 గంటలపాటు సభ్యుల కార్యకలాపాలు కొనసాగాయన్నారు. 43 నిమిషాలపాటు మాత్రం అంతరాయం కలిగిందని చెప్పారు. ఈ సమావేశాల్లో సభ్యులు 13 ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారన్నారు. బడ్జెట్ సమావేశాలు ముఖ్య అంశాలపై చర్చ కోసం అర్ధరాత్రి వరకు కొనసాగిన సందర్భాలున్నాయన్నారు. 5 ట్రిబ్యునళ్ల రద్దుకు లోక్‌సభలో బిల్లు ప్రజలకు పెద్దగా అవసరం లేని ఐదు ట్రిబ్యునళ్లను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రద్దు ప్రతిపాదిత ట్రిబ్యునళ్లలో ఎయిర్పోర్ట్ అప్పిలేట్ ట్రిబ్యునల్, అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్స్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అప్పిలేట్ బోర్డు ఉన్నాయి. వీటి కోసం సినిమాటోగ్రాఫ్ చట్టం–1952, కస్టమ్స్ యాక్ట్–1962, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ యాక్టు–1994 తదితరాలను సవరించనుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ఆర్థిక మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ ట్రిబ్యునళ్లతో ప్రజలకు పెద్దగా ఉపయోగం లేదని మంత్రి అన్నారు. వీటితో ఆర్థిక భారంతోపాటు పరిష్కారంలో కాలయాపన కూడా అవుతోందని చెప్పారు. ప్రస్తుతం ఈ ట్రిబ్యునళ్ల వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులను కమర్షియల్ కోర్టులు/హైకోర్టులకు బదిలీ చేస్తామని తెలిపారు. -
బలగాల ఉపసంహరణపై చైనాతో డీల్
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతల తొలగింపు లక్ష్యంగా ఇరుదేశాల మధ్య కీలకమైన ఒప్పందం కుదిరిందని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం పార్లమెంటులో వెల్లడించారు. ఉద్రిక్తతలకు ప్రధాన కారణమైన పాంగాంగ్ సో సరస్సుకు ఇరువైపుల మోహరించిన బలగాలను రెండు దేశాలు వెనక్కు తీసుకునే విషయంలో ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ఒప్పందం మేరకు సరస్సుకు ఉత్తర, దక్షిణ తీరాల వద్ద మోహరించిన ఫ్రంట్‌లైన్ సైనికులు ‘దశలవారీగా, సమన్వయంతో, నిర్ధారించుకోదగిన విధానంలో’వెనక్కు వెళ్తారని పేర్కొన్నారు. దాదాపు గత 9 నెలలుగా రెండు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా చైనాతో కుదిరిన ఒప్పందం వివరాలను రాజ్‌నాథ్ సింగ్ రాజ్యసభకు వెల్లడించారు. తాజా ఒప్పందంతో గత సంవత్సరం మే 5 నాటి కన్నా ముందున్న స్థితికి సరిహద్దుల్లో పరిస్థితులు చేరుకుంటాయన్నారు. అన్ని ద్వైపాక్షిక నిబంధనలు, ఒప్పందాలను గౌరవిస్తూ, సాధ్యమైనంత తొందరగా ఉపసంహరణ జరగాలని ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయన్నారు. పాంగాంగ్ సొ సరస్సునకు ఇరువైపులా గత సంవత్సరం ఏప్రిల్ తరువాత నిర్మించిన అన్ని నిర్మాణాలను తొలగించేందుకు అంగీకారం కుదిరిందన్నారు. ఏ విషయాన్ని దాచి పెట్టలేదు ఆయా ప్రాంతాల్లో గస్తీ సహా అన్ని మిలటరీ కార్యకలాపాలపై తాత్కాలిక నిషేధం విధించినట్లు వెల్లడించారు. గస్తీ పునః ప్రారంభంపై ఇరుదేశాలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయన్నారు. చైనాతో చర్చల విషయంలో భారత్ ఏ విషయాన్ని దాచి పెట్టలేదని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. అలాగే, భారత భూభాగంలోని అంగుళం భూమిని కూడా ఎవరూ తీసుకోవడానికి అంగీకరించబోమన్నారు. తాజా ఒప్పందం ప్రకారం, చైనా తమ సైనిక బలగాలను పాంగాంగ్ సరస్సు ఉత్తర సరిహద్దు నుంచి తూర్పు దిశగా ‘ఫింగర్ 8’ వరకు వెనక్కు తీసుకుంటుందని రాజ్‌నాథ్ తెలిపారు. అలాగే, భారత దళాలు ‘ఫింగర్ 3’ సమీపంలోని శాశ్వత మిలటరీ కేంద్రం ధన్సింగ్ థాపా పోస్ట్ వరకే పరిమితమవుతాయన్నారు. ఈ ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి రావడం ప్రారంభమైందన్నారు. ఈ ఉపసంహరణ ముగిసిన 48 గంటల్లోపు రెండు దేశాల మిలటరీ కమాండర్ స్థాయిలో మరో విడత చర్చలు జరుగుతాయన్నారు. అప్పుడు, ఇతర అపరిష్కృత అంశాలపై చర్చిస్తారని వెల్లడించారు. ‘ప్రణాళికాబద్ధ విధానంతో చైనాతో క్రమం తప్పకుండా చర్చలు కొనసాగించిన కారణంగా, పాంగాంగ్ సరస్సుకు ఉత్తర, దక్షిణ తీరాల వెంట మోహరించి ఉన్న ఇరుదేశాల బలగాల ఉపసంహరణకు ఒప్పందం కుదిరింది’అని రాజ్‌నాథ్ రాజ్యసభలో ప్రకటించారు. పాంగాంగ్ సరస్సుకు ఉత్తర, దక్షిణ తీరాల వెంట చైనా, భారత్ దళాల ఉపసంహరణ ప్రారంభమైందని చైనా బుధవారమే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఈ సందర్భంగా రాజ్‌నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. సైనికులు చేసిన త్యాగాలను దేశం గుర్తుంచుకుంటుందన్నారు. పాంగాంగ్ సరస్సుకు ఉత్తరంగా ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకు చైనా తన బలగాలను ఉపసంహరించాలని ఆ దేశంతో జరిగిన 9 విడతల చర్చల్లోనూ భారత్ గట్టిగా వాదించింది. ప్రతిగా, సరస్సు దక్షిణ తీరం వెంట ఉన్న కొన్ని వ్యూహాత్మక ప్రాంతాల నుంచి భారత దళాలు వైదొలగాలని చైనా డిమాండ్ చేసింది. ముఖపరి, రెచిన్ లా, మగర్ హిల్ తదితర వ్యూహాత్మకంగా కీలకమైన పర్వత ప్రాంతాలను ఐదు నెలల క్రితం భారత దళాలు స్వాధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజా ఒప్పందం ప్రకారం.. ఫింగర్ 3 నుంచి ఫింగర్ 8 వరకు తాత్కాలికంగా ‘నో పెట్రోలింగ్ జోన్’గా మారుతుంది. ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 మధ్య చైనా పలు బంకర్లను నిర్మించింది. ఫింగర్ 4 ను దాటి ముందుకు వచ్చేందుకు ప్రయత్నించిన భారత దళాలను అడ్డుకుంది. చైనా దళాలు ఫింగర్ 8 వరకు వెళ్లేందుకు అంగీకరించడం గొప్ప విజయంగా భావించవచ్చని రక్షణ రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. రాజ్యసభలో మాట్లాడుతున్న రాజ్‌నాథ్ -
రైతులది పవిత్ర ఆందోళన: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతలంటే పార్లమెంటుకు, ప్రభుత్వానికి గౌరవం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వారు చేస్తున్న ఉద్యమం పవిత్రమైనదన్నారు. కొత్త సాగు చట్టాలు అమల్లోకి వచ్చినప్పటికీ.. గతంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ వ్యవస్థ కొనసాగుతుందని, ఇష్టమైనవారు ఆ సదుపాయాన్ని వాడుకోవచ్చు అని చెప్పారు. ప్రభుత్వంతో చర్చలకు రావాలని రైతులను మరోసారి కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చకు ప్రధాని బుధవారం సమాధానం ఇచ్చారు. రైతులు వాస్తవాన్ని గుర్తించకూడదనే దురాలోచనతో పార్లమెంటులో సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యులెవరూ చట్టాల్లో లోపాలున్నాయని చూపలేకపోయారని పేర్కొన్నారు. ప్రసంగాన్ని పలుమార్లు విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. ప్రధాని ప్రసంగం అనంతరం విపక్ష సభ్యులు పెట్టిన సవరణ తీర్మానాలను స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్‌కు పెట్టగా, వాటిని సభ తిరస్కరించింది. ఆ తరువాత, మూజువాణి ఓటుతో రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ ఆమోదించింది. కాంగ్రెస్ సభ్యులు సాగు చట్టాలను రద్దు చేయాలని నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. తర్వాత డీఎంకే, టీఎంసీ సభ్యులు వాకౌట్ చేశారు. మార్కెట్లు ఉంటాయి.. ఎమ్మెస్పీ ఉంటుంది కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తరువాత కూడా వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయన్న విషయాన్ని ప్రధాని తన ప్రసంగంలో గుర్తు చేశారు. ఏ ఒక్క మండీ మూతపడలేదని, వాటి ఆధునీకరణకు బడ్జెట్లో మరిన్ని నిధులను కేటాయించామని తెలిపారు. కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) విధానాన్ని నిలిపివేయలేదని, ఎమ్మెస్పీపై వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కొనసాగుతోందన్నారు. గతంలో వ్యవసాయ సంస్కరణలకు మద్దతుగా మాట్లాడిన విపక్ష పార్టీలు ఇప్పుడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్నాయన్నారు. లోక్‌సభ నుంచి వాకౌట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సాగు సంస్కరణలకు మద్దతుగా కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని గుర్తుచేశారు. ‘తాము చేయరు.. వేరే వారిని చేయనివ్వరు’అని అర్థమిచ్చే భోజ్‌పురి సామెతను ఈ సందర్భంగా ప్రధాని ఉదహరించారు. రైతు స్వయం సమృద్ధి సాధించాలని, తన ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ పొందాలని, ఆ దిశగా ముందుకు వెళ్తున్నామని ప్రధాని తెలిపారు. ‘ఒక కొత్త రకం ఆశ్చర్యకర వాదన తొలిసారి తెరపైకి వచ్చింది. మేం అడగలేదు కదా.. ఎందుకు ఈ చట్టాలను తీసుకువచ్చారు? అని ప్రశ్నిస్తున్నారు. వరకట్నం, ట్రిపుల్ తలాఖ్ తదితర దురాచారాలను నిషేధిస్తూ చట్టాలు చేయమని కూడా ఎవరూ అడగలేదు. అయినా, పురోగామి సమాజంలో అవసరమని భావించి, ఆ చట్టాలు చేశారు’అని వివరించారు. ఆధునిక సమాజం అభివృద్ధి చెందాలంటే మార్పు, సంస్కరణలు అత్యవసరమన్నారు. ఈ సందర్భంగా గతంలో తమిళనాడు ప్రభుత్వంలో ఉన్న ‘సీసీఏ’పోస్ట్ గురించి ప్రధాని వివరించారు. భారత్‌కు స్వాతంత్య్రం రాకముందు, నాటి యూకే ప్రధాని విన్స్టన్ చర్చిల్‌కు నాణ్యమైన సిగార్లను పంపించేందుకు అప్పట్లో సీసీఏ– చర్చిల్ సిగార్ అసిస్టెంట్ అనే ఒక ఉద్యోగాన్ని సృష్టించారని, ఆ పోస్ట్ చర్చిల్ 1945లో పదవి నుంచి దిగిపోయిన తరువాత, భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా కొనసాగిందని వెల్లడించారు. సదుద్దేశంతో చేసినప్పుడు ఫలితం కూడా మంచిగానే ఉంటుందన్న నమ్మకంతో తమ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందన్నారు. ‘కరోనాతో భారత్ కుప్పకూలుతుందని అంతా అంచనా వేశారు. కానీ, ఈ సంక్షోభం నుంచి విజయవంతంగా బయటపడగలమని మన ప్రజలు నిరూపించారు’అని అన్నారు. వారు హైజాక్ చేశారు రైతుల ఆందోళన పవిత్రమైనది. కానీ ఈ పవిత్రమైన ఉద్యమాన్ని కొందరు ఆందోళనజీవులు హైజాక్ చేసి, ఉగ్రవాదం వంటి తీవ్రమైన నేరాలు చేసి జైళ్లకు వెళ్లిన వారి ఫొటోలు పెడుతున్నారు. దీనివల్ల ఫలితం వస్తుందా? టోల్ ప్లాజాలను అడ్డుకోవడం, టెలీకాం టవర్లను ధ్వంసం చేయడం పవిత్ర ఆందోళన అవుతుందా?’అని మోదీ ప్రశ్నించారు. ‘ఆందోళనకారుల వల్ల కాదు ఈ తరహా ఆందోళనజీవుల వల్ల పవిత్రమైన ఉద్యమం తప్పుదారి పడ్తోంది. అందువల్ల ప్రజలు ఆందోళన కారులు, ఆందోళన జీవుల మధ్య తేడాను గ్రహించాలి’అన్నారు. భారత ప్రజల సంకల్ప శక్తిని రాష్ట్రపతి ప్రసంగం ప్రతిబించిందని ప్రధాని కొనియాడారు. రైతు సంక్షేమం మాటేది: కాంగ్రెస్ లోక్‌సభలో ప్రధాని చేసిన ప్రసంగంలో రైతుల ఆందోళనలకు పరిష్కారమేదీ లేదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. సాగు చట్టాలపై రైతు ఆందోళనలకు సంబంధించి ప్రధాని సం తృప్తికర సమాధానం ఇవ్వకపోవడం వల్లనే సభ నుంచి వాకౌట్ చేశామని కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. ‘దాదాపు 206 మంది రైతులు ప్రా ణాలు కోల్పోయారు. అయినా, ఆ విషయంపై ప్రధాని స్పందించలేదు. రైతు సంక్షేమంపై ముఖ్యమైన చర్యలేవైనా ప్రకటిస్తారనుకున్నాం. కానీ ఆ ఊసే లేదు’అని కాంగ్రెస్ సీనియర్ ఎం పీ ఆధిర్ రంజన్ చౌధురి విమర్శించారు. సాగు చట్టాలను రద్దు చేసి, పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరిపిన తరువాత కొత్త చట్టాలను రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై గురువారం రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. ఈ చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకమని, తక్షణమే వాటిని వెనక్కు తీసుకోవాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. రైతులతో చర్చల పేరుతో ఏకపాత్రాభినయం చేస్తున్నారని విమర్శించారు. విపక్ష సభ్యుల విమర్శలపై ప్రభుత్వం దీటుగా స్పందించింది. రైతుల సంక్షేమం కోసమే వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చామని, వారి ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. రైతులను శత్రువులుగా చూస్తున్నారని, వారి నిరసన కేంద్రాలను దుర్బేధ్య కోటలుగా మారుస్తున్నారని విపక్ష సభ్యులు విమర్శించగా, రైతుల సంక్షేమం కోసం తాము చేపట్టిన చర్యలను ప్రభుత్వం ఏకరువు పెట్టింది. రైతుల దేశభక్తిని ప్రశ్నించే హక్కు ప్రభుత్వానికి లేదని, ఆహార రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించడానికి వారే కారణమని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో గురువారం పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు దీపిందర్‌సింగ్ హూడా వ్యాఖ్యానించారు. విపక్షాల విమర్శలను కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మధ్యప్రదేశ్‌కు చెందిన నేత జ్యోతిరాదిత్య సింధియా తిప్పికొట్టారు. గత ఆరేళ్లలో ప్రభుత్వం రైతుల కోసం, వారి ఆదాయాన్ని పెంచడం కోసం అనేక కార్యక్రమాలను రూపొందించిందని వివరించారు. అంతకుముందు, జమ్మూకశ్మీర్ రీ ఆర్గనైజేషన్ బిల్లును హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. లక్ష కోట్ల అదనపు ఆదాయం రైతులకు అదనంగా లక్ష కోట్ల అదనపు ఆదాయం సమకూర్చే చర్యలు తీసుకుంటున్నామని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సభకు తెలిపారు. వ్యర్థాలను ఇంధనంగా మార్చడం ద్వారా అది సాధ్యం చేస్తామన్నారు. త్వరలోనే ఘాజీపూర్ వద్ద పోగుబడిన వ్యర్థాలను కూడా తరలించి, ఇంధనంగా మారుస్తామన్నారు. ‘గోబర్ ధన్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. పశువుల పేడ, వ్యవసాయ వర్థాలు, నగరాల్లోని చెత్త, అటవీ వ్యర్థాలు.. వీటన్నింటిని ఇంధనంగా మారుస్తాం. అలా సమకూర్చుకునే దాదాపు లక్షకోట్ల రూపాయలను రైతులకు అందజేస్తాం. తద్వారా రైతుల ఆదాయం పెంచుతాం’అని వివరించారు. లోక్‌సభ మళ్లీ వాయిదా లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ప్రత్యేకంగా సభలో చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు గురువారం సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దాంతో సభ పలుమార్లు వాయిదా పడింది. సభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కాగానే, సాగు చట్టాలను రద్దు చేయాలంటూ విపక్ష సభ్యులు నినాదాలుచేశారు. 5 గంటలకు సభ మళ్లీ సమావేశమైన తరువాత కూడా విపక్షాలు నిరసన, నినాదాలు కొనసాగించాయి. నిరసనల మధ్యనే న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆర్బిట్రేషన్ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆ తరువాత సభను స్పీకర్‌స్థానంలో ఉన్న మీనాక్షి లేఖ 6 గంటల వరకు వాయిదా వేశారు. -
ఆ చట్టాలను రద్దు చేయండి!
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలు, రైతుల ఉద్యమాన్ని చర్చలో ప్రస్తావించేందుకు అధికార, విపక్షాల మధ్య అంగీకారం కుదరడంతో.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది. చర్చలో సాగు చట్టాలు, రైతాంగ ఉద్యమం అంశాలను ప్రస్తావించేందుకు వీలుగా చర్చా సమయాన్ని మరో ఐదు గంటల పాటు పెంచేందుకు అధికారపక్షం అంగీకరించింది. దాంతో, ఆ చర్చ ముందుగా అనుకున్న 10 గంటల పాటు కాకుండా, మొత్తం 15 గంటల పాటు కొనసాగనుంది. ఇందుకు గానూ, బుధవారం ప్రశ్నోత్తరాల సమయాన్ని, అలాగే, గురువారం జీరో అవర్‌ను, ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించకూడదని నిర్ణయించారు. ఈ మేరకు, అధికార, విపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. దాంతో, బుధవారం చర్చ ప్రారంభమైంది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని ఈ సందర్భంగా విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా తీసుకోవద్దని, రైతులను శత్రువులుగా పరిగణించవద్దని సూచించారు. చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ స్వయంగా ప్రకటిస్తే బావుంటుందని రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ సూచించారు. ఆ సమయంలో ప్రధాని సభలోనే ఉండటం విశేషం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే కాకుండా, పలు సందర్భాల్లో రైతుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన విషయాన్ని ఆజాద్ గుర్తు చేశారు. రిపబ్లిక్ డే రోజు ఎర్రకోటపై జరిగిన ఘటనలను ఖండిస్తున్నామని, జాతీయ పతాకాన్ని అవమానించడం ఎవరూ సహించరని ఆయన స్పష్టం చేశారు. జనవరి 26న రైతుల ట్రాక్టర్ ర్యాలీ తరువాత అదృశ్యమైన రైతుల ఆచూకీని గుర్తించడం కోసం కమిటీని వేయాలని సూచించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ డిమాండ్ చేశారు. ఆ చట్టాలు ఆమోదం పొందిన తీరును విమర్శించారు. దానిపై స్పందించిన చైర్మన్ వెంకయ్యనాయుడు.. నిబంధనల ప్రకారమే అవి ఆమోదం పొందాయని స్పష్టం చేశారు. రైతులను శత్రువులుగా చూడొద్దని, వారి భయాందోళనలను గుర్తించి, ఆ చట్టాలను రద్దు చేయాలని చర్చలో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు రామ్‌గోపాల్ యాదవ్ కోరారు. ఉద్యమంలో రైతులు చనిపోతున్నా పట్టించుకోకుండా, నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతులు ఉద్యమిస్తే పెద్ద పెద్ద నేతలే గద్దె దిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ‘అధికారం నెత్తికెక్కకూడదు. రైతులతో చర్చించండి. ఇది ప్రజాస్వామ్యం. మన జనాభాలో వారే ఎక్కువ. చట్టాలను రద్దు చేస్తామని వారికి చెప్పండి’ అని యాదవ్ ప్రభుత్వానికి హితవు పలికారు. ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, పిల్లల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు నిరసన కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతాఏర్పాట్లపై స్పందిస్తూ.. ‘ఈ పార్లమెంటు వద్ద, పాకిస్తాన్, చైనా సరిహద్దుల వద్ద కూడా అంత భద్రత లేదు. వారేమైనా ఢిల్లీ మీద దాడికి వచ్చారా? వారేమైనా మన శత్రువులా?’ అని ప్రశ్నించారు. రైతులు దేశానికి అన్నం పెడ్తున్నారని, వారి పిల్లలు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ఉన్నారని గుర్తు చేశారు. వ్యవసాయ చట్టాలను హడావుడిగా ఆమోదించారని సీపీఎం సభ్యుడు ఎలమారం కరీమ్ విమర్శించారు. లోక్‌సభలో.. వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ప్రత్యేకంగా చర్చ జరపాలన్న విపక్షాల డిమాండ్‌పై బుధవారం లోక్‌సభ పలుమార్లు వాయిదా పడింది. సభ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కాగానే, కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్‌రంజన్ చౌధురి రైతు ఉద్యమ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పలువురు విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకువెళ్లారు. ప్రశ్నోత్తరాల సమయం జరగాలని, అందుకు సభ్యులు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా పలుమార్లు సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సభ్యులు పట్టించుకోకపోవడంతో, సభను సాయంత్రం 4.30కు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తరువాత కూడా సభ్యుల నిరసన కొనసాగడంతో, వరుసగా మూడుసార్లు సభను స్పీకర్ వాయిదా వేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చతో పాటు రైతు ఉద్యమం, సాగు చట్టాలపై ప్రత్యేకంగా చర్చ జరగాలని ఆధిర్ రంజన్ చౌధురి డిమాండ్ చేశారు. సభ్యుల నిరసనల మధ్యనే జీరో అవర్‌ను నిర్వహించేందుకు స్పీకర్ ప్రయత్నించారు. ‘దేశమంతా గమనిస్తోంది. నిరసనలు, నినాదాలతో సభ ప్రతిష్టను దిగజార్చవద్ద’ని పలుమార్లు ఆయన సభ్యులను కోరారు. వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపిన వారిలో శిరోమణి అకాలీదళ్ ఎంపీ, మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్‌తో పాటు డీఎంకే, కాంగ్రెస్, ఆప్ పార్టీల సభ్యులున్నారు. -
సభ సజావుగా సాగాలి: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సభ అర్థవంతంగా సజావుగా పని చేసేలా చూడాలని రాజ్యసభలో వివిధ పార్టీల నేతలను చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. సభ సజావుగా సాగడానికి సహకరిస్తామని ఆయా పార్టీల నేతలు తెలిపారు. రాజ్యసభలో వివిధ పార్టీల నాయకులతో చైర్మన్ వెంకయ్యనాయుడు ఆదివారం తన నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మొదటి విడత బడ్జెట్ సమావేశాలు ఈ నెల 15 వరకు నిర్వహించాల్సి ఉండగా సభ్యుల అభ్యర్థన మేరకు స్థాయీ సంఘాలు, మంత్రిత్వశాఖల విభాగాల గ్రాంట్లు, డిమాండ్లు పరిశీలించేందుకు వీలుగా 13న సమావేశం కొనసాగించి అదే రోజు నిరవధిక వాయిదా వేయాలని నిర్ణయించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, బడ్జెట్‌పై చర్చకు మరింత సమయం ఇవ్వాలని పలువురు నేతలు కోరారు. సభలో క్లుప్తంగా మాట్లాడే నేర్పును అందిపుచ్చుకోవాలని, దీనివల్ల సభ్యులకు మరింత సమయం లభిస్తుందని మంత్రులకు వెంకయ్యనాయుడు సూచించారు. సభలో చిన్నపార్టీల సభ్యులకు సమయం కేటాయించే అంశంపైనా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. సుమారు 20 పార్టీలకు చెందిన నేతలందరూ మాట్లాడడం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చని వెంకయ్య అన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు తదితరులు పాల్గొన్నారు. -
మెప్పించని ఆర్థిక సర్వే.. నష్టాల్లో మార్కెట్
ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2020–21 ఆర్థిక సర్వే ఇన్వెస్టర్లను మెప్పించకపోవడంతో మార్కెట్ శుక్రవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 589 పాయింట్లు పతనమై 46,286 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 183 పాయింట్లను కోల్పోయి 13,635 వద్ద నిలిచింది. సూచీలకిది ఆరోరోజూ నష్టాల ముగింపు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం, బలహీన అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బ్యాంకింగ్, రియల్టీ రంగ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అత్యధికంగా ఐటీ షేర్లు నష్టపోయాయి. ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 1263 పాయింట్ల రేంజ్లో కదలాడింది. నిఫ్టీ సైతం 150 పాయింట్లు పరిధిలో ట్రేడైంది. దేశీయ ఫండ్లు(డీఐఐ)లు రెండోరోజూ రూ.2,443 కోట్ల షేర్లను కొని నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్ఐఐలు రూ. 5933 కోట్ల భారీ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ‘‘ప్రభుత్వం ప్రకటించిన అంచనాల ప్రకారం భారత ఆర్థికవ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.7 శాతం క్షీణించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ కో?లుకునేందుకు దీర్ఘకాలం పడుతుందనే సంకేతాలతో ప్రపంచ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. మరోవైపు ఎఫ్ఐఐల పెట్టుబడుల ఉపసంహరణ ఉధృతంగా ఉంది. ఈ పరిణామాలతో బడ్జెట్‌కు ముందు మార్కెట్లో భారీ ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది.’’ అని జియోజిత్ ఫైనాన్స్ ఫైనాన్సియల్ సర్వీస్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. ఆరు రోజుల్లో రూ.11.57 లక్షల కోట్లు ఆవిరి..! మార్కెట్ ఆరురోజుల పతనంతో ఇన్వెసర్లు రూ.11.57 లక్షల కోట్లను నష్టపోయారు. ఫలితంగా ఇన్వెసర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ గరిష్టస్థాయి రూ.197.46 లక్షల కోట్ల నుంచి రూ. 186.12 లక్షల కోట్లకు దిగివచ్చింది. శుక్రవారం ఒక్కరోజే రూ. 2.01 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఇదే ఆరురోజుల్లో సెన్సెక్స్ 3,506 పాయింట్లు, నిఫ్టీ 1,010 పాయింట్లను కోల్పోయాయి. నిరాశపరిచిన ఐఆర్ఎఫ్సీ ఐపీఓ లిస్టింగ్..! గడిచిన వారంలో ఐపీఓను పూర్తిచేసుకున్న ఐఆర్ఎఫ్సీ షేర్లు లిస్టింగ్‌లో నిరాశపరిచాయి. ఇష్యూ ధర రూ.26 తో పోలిస్తే బీఎస్ఈలో 3.84 శాతం(రూపాయి)నష్టంతో రూ.25 వద్ద లిస్ట్ అయ్యాయి. ఇంట్రాడేలో మరింత అమ్మకాల ఒత్తిడికి లోనై 6.53 శాతం క్షీణించి రూ.24.30 కు చేరుకుంది. చివరికి 4.42 శాతం పతనమైన రూ.24.85 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ వ్యాల్యుయేషన్ రూ.32,475 కోట్లుగా నమోదైంది. దాదాపు రూ.4,633 పరిమాణం కలిగిన ఈ ఐపీఓకు 3.49 రెట్ల అధిక సబ్స్క్రిప్షన్ లభించిన సంగతి తెలిసిందే. -
8 మంది ఎంపీల సస్పెన్షన్
న్యూఢిల్లీ: రాజ్యసభలో సోమవారం కూడా గందరగోళం కొనసాగింది. వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం పలువురు విపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి, డెప్యూటీ చైర్మన్ హరివంశ్‌తో అనుచితంగా ప్రవర్తించడం తెల్సిందే. బిల్లులను సభాసంఘానికి పంపించాలన్న తీర్మానంపై డివిజన్ ఓటింగ్ నిర్వహించాలన్న తమ డిమాండ్‌ను తోసిపుచ్చడంతో ఆయన ముఖంపై రూల్ బుక్‌ను విసిరేయడం తెల్సిందే. సభామర్యాదలకు భంగం కలిగించిన 8 మంది విపక్ష సభ్యులను సోమవారం సస్పెండ్ చేశారు. ఈ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్ కొనసాగుతుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్, ఆప్ సభ్యులు సంజయ్ సింగ్, డోలాసేన్, కాంగ్రెస్ ఎంపీలు రాజీవ్ సత్వ, సయ్యద్ నాజిర్ హుస్సేన్, రిపున్ బోరా, సీపీఎం సభ్యులు కేకే రాగేశ్, ఎలమారమ్ కరీన్‌లను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు, హరివంశ్‌పై విపక్షపార్టీలు ఇచ్చిన అవిశ్వాస నోటీసును చైర్మన్ వెంకయ్య తోసిపుచ్చారు. జీరో అవర్ అనంతరం వెంకయ్య మాట్లాడుతూ.. ఆదివారం సభలో చోటు చేసుకున్న ఘటనలపై ఆవేదన చెందానన్నారు. ‘కొందరు సభ్యులు రాజ్యసభ సెక్రటరీ జనరల్ టేబుల్‌పైకి ఎక్కి, గట్టిగా అరుస్తూ, డాన్స్‌లు చేశారు. పేపర్లు చింపి, మైకులు విరగ్గొట్టి, డెప్యూటీ చైర్మన్ విధులకు ఆటంకం కలిగించారు. మార్షల్స్ అడ్డుకోకుంటే, డెప్యూటీ చైర్మన్‌పై దాడి కూడా జరిగేది. ఇదేనా పార్లమెంటరీ సంప్రదాయం? ఆత్మ విమర్శ చేసుకోండి’ అని ప్రతిపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీమీ స్థానాలకు వెళ్లండి. డివిజన్ ఓటింగ్ చేపడ్తామ’ని డెప్యూటీ చైర్మన్ చెప్పినా విపక్షసభ్యులు పట్టించుకోలేదన్నారు. వెంకయ్యనాయుడు ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తి, ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల సస్పెన్షన్‌పై సహచర ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వేటు పడిన సభ్యులు ఆ తరువాత బయటకు వెళ్లేందుకు నిరాకరిస్తూ, సభలోనే కూర్చుని నిరసన కొనసాగించారు. వారికి ఇతర విపక్ష సభ్యులు జతకలవడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన సభ.. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. విపక్ష సభ్యుల ధర్నా: తమపై విధించిన సస్పెన్షన్‌కు నిరసనగా ఆ 8 మంది సభ్యులు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిరవధిక ధర్నాకు దిగారు. నిరవధిక నిరసనకు వీలుగా దుప్పట్లు, దిండ్లు తెచ్చుకున్నారు. ఇతర విపక్ష ఎంపీలతో కలిసి గాంధీజీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. నినాదాలు, పాటలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. శివసేన, సీపీఐ, ఎస్పీ, జేడీఎస్ తదితర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వారికి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి ఈ సస్పెన్షన్ ఒక ఉదాహరణ అని టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ విమర్శించారు.వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో ప్రజా ఉద్యమం నిర్వహిస్తామని, రెండు కోట్లమంది రైతుల సంతకాలతో రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ బిల్లులకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 25న జరిగే దేశవ్యాప్త నిరసనలకు మద్దతు తెలుపుతూ సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఆర్ఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సభ్యులను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని కాం గ్రెస్ మండిపడింది. ఇది ప్రజాస్వామ్య భారత్ గొంతు నొక్కడమేనని రాహుల్ అన్నారు. ఆరోగ్య సిబ్బంది భద్రత బిల్లు: కరోనాపై పోరాడే ఆరోగ్య సిబ్బందిపై దాడులకు పాల్పడే వారికి ఐదేళ్ల జైలు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన ఎపిడెమిక్ డిసీజెస్(సవరణ)బిల్లును సోమవారం పార్లమెంట్ ఆమోదించింది. రాజ్యసభ ఇప్పటికే ఆమోదించిన ఈ బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. -
రాజ్యసభ రచ్చ.. వైరల్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణలు బిల్లులపై రాజ్యసభలో పెను దుమారమే చలరేగింది. ఆదివారం ఓటింగ్ సందర్భంగా విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. నిండు సభలోనే రచ్చ రచ్చ చేశారు. బల్లలపైకి ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిల్లు ముసాయిదా ప్రతులను చింపివేసి ఉప సభాపతిపైకి విసేరారు. ఇక విపక్ష సభ్యుల తీరుపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించిన 8 మంది సభ్యులను వారంపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. వీరిలో సంజయ్‌సింగ్ (ఆప్), డెరికో ఓబ్రెన్ (టీఎమ్సీ), డోలాసేన్ (టీఎమ్సీ), రాజీవ్ వాస్తవ్ (కాంగ్రెస్), రిపూన్ బోరా (కాంగ్రెస్) సయ్యద్ నజీర్ హుస్సేన్ (కాంగ్రెస్), కరీం (సీపీఎం), కేకే రాజేష్ ( సీపీఎం)లో ఉన్నారు. అయితే రాజ్యసభలో చెలరేగిన రభసకు సంబంధి ఓ వీడియో బయటకు వచ్చింది. దీనిలో విపక్ష సభ్యుల నిరసన, ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఇక విపక్షాల తీరుపై వీడియోను ఆధారంగా చేసుకుని అధికార బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. (రాజ్యసభ రగడ : విపక్ష ఎంపీల సస్పెన్షన్) -
రాజ్యసభ రగడ : విపక్ష ఎంపీల సస్పెన్షన్
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లులపై ఓటింగ్ సందర్భంగా పార్లమెంట్లో ఆదివారం చోటుచేసుకున్న గందోరగోళంపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ హక్కుల మర్యాదలకు భంగం కలిగించే విధంగా విపక్ష సభ్యులు వ్యవహరించారని మండిపడ్డారు. రాజ్యసభలో ఘర్షణ పూరితమైన వాతావరణాన్ని కల్పించి డిప్యూటీ చైర్మన్ విధులకు ఆటంకం కలిగించారని సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సభ నిబంధనలకు విరుద్ధంగా వ్యహరించారని గందరగోళానికి కారణమైన ఎంపీలపై చర్యలు తీసుకున్నారు. ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు విపక్ష ఎంపీలపై అధికార పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానానికి వెంకయ్యనాయుడు సోమవారం ఆమోదం తెలిపారు. సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో సంజయ్‌సింగ్ (ఆప్), డెరికో ఓబ్రెన్ (టీఎమ్సీ), డోలాసేన్ (టీఎమ్సీ), రాజీవ్ వాస్తవ్ (కాంగ్రెస్) , రిపూన్ బోరా (కాంగ్రెస్) సయ్యద్ నజీర్ హుస్సేన్ (కాంగ్రెస్) , కరీం (సీపీఎం), కేకే రాజేష్ ( సీపీఎం)లో ఉన్నారు. (సాగు బిల్లులకు పార్లమెంటు ఓకే) సభాసాంప్రదాయాలను సభ్యులు పాటించలేదని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు. వారం రోజుల పాటు ఈ తీర్మానం అమల్లో ఉండనుంది. మరోవైపు చైర్మన్ నిర్ణయంపై విపక్ష పార్టీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పెద్ద ఎత్తున నష్టం చేకూరుస్తున్న బిల్లులపై కనీసం మాట్లాడటానికి అవకాశం ఇవ్వనందునే తాము నిరసన వ్యక్తం చేశామని చెబుతున్నారు. ఆదివారం బిల్లులపై ఓటింగ్ సందర్భంగా సభలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా విపక్ష సభ్యులు ఉపసభాపతి స్థానం వద్దకు వెళ్లి రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ నినాదాలు చేశారు. టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్ ఆగ్రహంతో డిప్యూటీ చైర్మన్ స్థానం వద్దకు దూసుకువెళ్లారు. రూల్ బుక్‌ను ఆయన ముఖంపై విసిరేశారు. (పెద్దల సభలో పెను దుమారం) సభాపతి స్థానం వద్ద ఉన్న మైక్రోఫోన్‌ను లాగేసేందుకు ప్రయత్నించగా, మార్షల్స్ అడ్డుకున్నారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని తీర్మానాలను ప్రతిపాదించిన డీఎంకే సభ్యుడు తిరుచి శివ, టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్, సీపీఎం సభ్యుడు కేకే రాగేశ్.. తదితరులు బిల్లు పేపర్లను చింపి గాల్లోకి విసిరేశారు. దీంతో సభ్యుల తీరుపై పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపసభాపతిని అగౌరపరిచే విధంగా వ్యవహరించిన సభ్యులను సస్పెండ్ చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజ్యసభలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సోమవారం సభాకార్యక్రమాలు తిరిగి ప్రారంభం అయిన వెంటనే వెంకయ్య నాయుడు ఆమోదం తెలిపారు. డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం మరోవైపు డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్‌ను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు. 12 పార్టీలు కలిసి 50 మంది ఎంపీల సంతకాలతో అవిశ్వాస తీర్మానం నోటీస్‌ను ఇచ్చారు. డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఆమోదయోగ్యం కాదన్న చైర్మన్.. దానిని తిరస్కరించారు. -
అంతుపట్టని రహస్యం: కేసీఆర్ వ్యూహమేంటి?
సాక్షి, హైదరాబాద్ : ఎన్నో విమర్శలు, వివాదాల నడుమ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణ బిల్లులకు ఆమోదం లభించింది. స్పష్టమైన మెజార్టీ ఉన్నందున లోక్‌సభలో సునాయాసంగా నెగ్గిన బిల్లులు, రాజ్యసభలో మాత్రం పెను దుమారాన్నే సృష్టించాయి. బీజేపీ చిరకాల మిత్రపక్షం శిరోమణీ అకాలీదళ్ వైదొలగడంతో రాజుకున్న రగడ.. రాజ్యసభలో బిల్లు ప్రతులను చింపివేసే వరకు వెళ్లింది. విపక్షాల నిరసనలు, ఆందోళనల నడమనే పెద్దల సభలోనూ బిల్లులు ఆమోదం పొందాయని డిప్యూటీ చైర్మన్ ప్రకటించడంతో అధికార పక్షం హర్షం వ్యక్తం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ఆమోదించుకున్న వివాదాస్పద బిల్లులపై వివాదం ఇప్పడే ముగిసిపోలేదని దీనిపై పెద్ద ఎత్తున పోరును ముందుకు తీసుకుపోతామని కాంగ్రెస్ నేతృత్వంలోనే విపక్ష పార్టీలు ప్రకటించాయి. బిల్లు ఆమోదం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మలను దగ్ధం చేసిన ఘటనలు ఉత్తర భారతదేశంతో పాటు దక్షినాదినా కనిపించాయి. అయితే ఈ బిల్లుకు టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు వేయడం చర్చించాల్సిన అంశం. (సాగు బిల్లులకు పార్లమెంటు ఓకే) జాతీయ స్థాయిలో ఉద్యమం.. అయితే గత ఐదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు అనుకూలంగా మెలిగిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఓటువేయడం కొత్త చర్చకు దారితీస్తోంది. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బిల్లులు రైతులను కార్పొరేట్ వర్గాలు దోచుకునే విధంగా ఉన్నాయని, అది తేనెపూసిన కత్తి మాదిరిగా ఉందని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. గతంలో బీజేపీ ప్రభుత్వం ఏ బిల్లు పెట్టిన మద్దతు తెలిపిన టీఆర్ఎస్ తాజాగా తిరుగుబాటు చేయడం వెనుక రాజకీయ పరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ సైతం సాగుతోంది. వ్యవసాయ బిల్లులతో పాటు కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ బిల్లును కూడా కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రల హక్కులను కాలరాసే విధంగా ప్రధాని మోదీ నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీనిపై జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రుల అందరితో (బీజేపీయేతర) చర్చించాల్సిన అవసరం ఉందని ఇదివరకే స్పష్టం చేశారు. అంతేకాకుండా విద్యుత్ బిల్లులపై కేంద్రం వెనక్కి తగ్గకపోతే పెను ఉద్యమానికి సైతం తెరలేపుతామని హెచ్చరించారు. ఈ రెండు పరిణాలమాలతో పాటు బీజేపీ సర్కార్‌పై కేసీఆర్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అసలు జాతీయ రాజకీయాలపై టీఆర్ఎస్ వ్యూహమేంటదానిపై సర్వత్రా చర్చసాగుతోంది. (కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి) కేసీఆర్ రచించిన వ్యూహం.. రానున్న రెండు నెలల్లో తెలంగాణలో పలు ఎన్నికలు జరుగనున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ఈసీ రంగం సిద్ధం చేసింది. దానితో పాటు నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఓ మండలి స్థానానికి పోలింగ్ జరుగనుంది. ఈ స్థానానికి సీఎం కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత బరిలో ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా ఉన్న బీజేపీ నుంచి అసలైన పోటీ వచ్చే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల అభిప్రాయం. దీనిలో భాగంగానే బీజేపీ వ్యతిరేకంగా నడుచుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీనే ఎదురైయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇస్తే రైతు వ్యతిరేక సందేశం వెళ్లే అవకాశం ఉందని కేసీఆర్ ఊహించినట్లు తెలిసింది. మరోవైపు కీలకమైన ఎన్నికల ముందు బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు టీఆర్ఎస్ రచించిన వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పార్లమెంట్ బిల్లు ఆమోదం తరువాత రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రకటనలు చూస్తే ఇది నిజమనే భావన కలుగక మానదు. (ఉత్కంఠగా పోరులో విజయం ఎవరిదో..!) హరీష్, తలసాని ఆగ్రహం.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం, విద్యుత్ రంగంపై తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికే ప్రమాదకరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు దేశమంతా దుబ్బాక వైపు చూస్తున్నది. ఢిల్లీ దిమ్మతిరిగేలా తెలంగాణ ప్రజల మనోగతాన్ని దుబ్బాక ఓటర్లు దేశానికి తెలియజేయాలి’అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతాంగానికి అన్యాయం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ ఇతర పార్టీలతో కలిసి పోరాడుతుందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు, అలాగే విద్యుత్ సంస్కరణలతో రైతులకు నష్టం జరుగుతుందని, ఈ మేరకు పార్లమెంటులో పోరాడాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారని వివరించారు. దేశ సంస్కృతిని కార్పొరేట్‌కు అమ్మేశారు! దేశ వ్యవసాయ సంస్కృతిని కార్పొరేట్‌కు అమ్మేశారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు నిప్పులు చెరిగారు. ఆదివారం రాజ్యసభలో వ్యవసాయ బిల్లులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘మీరు వ్యవసాయ దేశాన్ని కార్పొరేట్ దేశంగా మార్చారు. మీరు తెచ్చింది కేవలం చారిత్రక బిల్లు కాదు.. విప్లవాత్మక బిల్లు..’అంటూ ఎద్దేవా చేశారు. రైతులు కార్పొరేట్ల వద్దకు వెళ్లి ధరను నిర్ధారించేంత సమఉజ్జీలు కాదని, ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నామన్నారు. బంగారు బాతు లాంటి వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం చంపాలనుకుంటోందని మండిపడ్డారు. కరోనా వల్ల దేశ జీడీపీ 23 శాతం మేర క్షీణించినప్పటికీ వ్యవసాయ రంగ వాటా మాత్రం తగ్గలేదని వివరించారు. రాజ్యాంగానికి, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఈ బిల్లుల రూపకల్పన జరిగిందన్నారు. ఇది రాష్ట్రాల హక్కులు కాలరాయడమేనని మండిపడ్డారు. రాజ్యాంగంపై నేరుగా జరిగిన దాడిగా అభివర్ణించారు. వ్యవసాయం, సంబంధిత అంశా లు ఎప్పుడూ రాష్ట్ర పరిధిలోనే ఉండాలని సూచించారు. దీనిపై రాష్ట్రాలతో సంప్రదించకపోవడాన్ని తప్పుపట్టారు. రాజకీయ పార్టీల, ప్రజాభిప్రాయం సేకరించలేదన్నారు. రైతులను ఈ బిల్లులు భూమి లేని వ్యవసాయ కూలీలుగా మార్చుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రైతులకు తీరని నష్టం జరుగుతుందని, అందువల్ల ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు కేశవరావు స్పష్టం చేశారు. డిప్యూటీ చైర్మన్‌కు ఆ అధికారం ఉండదు సభ అనంతరం విజయ్‌చౌక్ వద్ద ఎంపీలు నామా నాగేశ్వరరావు, సురేశ్‌రెడ్డి, బడుగు లింగయ్య, సంతోష్, పి.రాములు, రంజిత్‌రెడ్డి, దయాకర్, బీబీ పాటిల్‌తో కలసి కేకే విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను ఆమోదింపచేసేందుకు సభానియమాలను డిప్యూటీ చైర్మన్ తుంగలో తొక్కారని ఆరోపించారు. అందుకే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ 12 పార్టీలకు చెందిన 25 మంది ఎంపీల సంతకాలతో కూడిన నోటీసును రాజ్యసభ ఇన్చార్జి అధికారికి ఇచ్చినట్లు చెప్పారు. తీర్మానం పరిష్కారమయ్యేవరకు డిప్యూటీ చైర్మన్‌కు సభా కార్యకలాపాలు నిర్వహించే అధికారం ఉండదని కేశవరావు తెలిపారు. ‘వ్యవసాయంపై ప్రభుత్వం తెచ్చిన మూడు ఆర్డినెన్సులలో రెండింటిని రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు. వాటిపై చర్చ సజావుగానే జరిగినా ఓటింగ్‌కు వచ్చేసరికి డిప్యూటీ చైర్మన్ పక్షపాతపూరితంగా వ్యవహరించారు. బిల్లులు తిరస్కరించాలని రెండు చట్టబద్ధ తీర్మానాలు ప్రతిపాదించినా పట్టించుకోలేదు. సవరణలు సూచించినా ఖాతరు చేయలేదు. ఎవరి మాటా వినిపించుకోకుండా బిల్లులు ఆమోదం పొందాయని ప్రకటించారు. నా అరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా రాజ్యాంగాన్ని వెన్నుపోటు పొడవడం, నియమాలను చెత్తకుండీలో పడేయడం ఎప్పుడూ చూడలేదు’అని కేశవరావు అన్నారు. మరో ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రైతులు రోడ్లెక్కారు. కోట్ల మంది దేశప్రజలకు అన్నం పెట్టేౖ రెతులను మనం రక్షించుకోవాలి. లోక్‌సభలో సంఖ్యాబలంతో బిల్లులు ఆమోదించారు. రాజ్యసభలో ఓటింగ్ పెడితే ఓడిపోతామనే భయంతో మూజువాణి ఓటుతో ఆమోదింపచేసుకొని ప్రజాçస్వామ్యం గొంతునొక్కారు. బిల్లులు నిజంగా అంత బాగుంటే అందరినీ సమన్వయపరచడానికి ఎందుకు ప్రయత్నించలేదు? ఎవరితోనూ చర్చలు, సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా ఎందుకు ఆమోదింపచేసుకున్నారు? ఇది నిజంగా రైతుల పాలిట బ్లాక్ డే’అని అన్నారు. -
సాగు బిల్లులకు పార్లమెంటు ఓకే
న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల తీవ్ర ఆగ్రహావేశాల మధ్య మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రెండు వివాదాస్పద వ్యవసాయ బిల్లులు ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందాయి. ఈ బిల్లులు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇవి చట్టరూపం దాలుస్తాయి. ఈ బిల్లులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయని, రైతులకు ఇవి మరణ శాసనాలని పేర్కొంటూ కాంగ్రెస్ సహా పలువురు ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కోవిడ్–19 నిబంధనలను పట్టించుకోకుండా పోడియంను చుట్టుముట్టారు. నినాదాలతో సభను హోరెత్తించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్‌పై దాడి చేసినంత పని చేశారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడానికి ఉద్దేశించిన తీర్మానంపై ఓటింగ్ జరపాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోకపోవడంతో, ఆగ్రహంతో ఆయన ముఖంపైకి నిబంధనల పుస్తకాన్ని విసిరారు. మరికొన్ని అధికారిక పత్రాలను చించి, విసిరారు. ఆయన ముందున్న మైక్రోఫోన్‌ను లాగేసేందుకు విఫలయత్నం చేశా రు. ఈ గందరగోళం మధ్య సభ కొద్దిసేపు వాయి దా పడింది. ఆ తరువాత ‘వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య(ప్రోత్సాహం, సులభతరం)’ బిల్లు, రైతాంగ(రక్షణ, సాధికారత) ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పందం’ బిల్లులను మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. సభా సంఘానికి పంపించాలంటూ.. ఈ బిల్లుల ఆమోదం కోసం ముందుగా పేర్కొన్న సమయం కన్నా ఎక్కువ సేపు సభ జరిగింది. ఈ సమయంలో, బిల్లులను వ్యతిరేకిస్తూ పలు డిమాండ్లను, తీర్మానాలను ప్రతిపక్ష సభ్యులు సభ ముందుకు తీసుకువచ్చారు. చర్చపై వ్యవసాయ మంత్రి సమాధానాన్ని సోమవారానికి వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి కీలక బిల్లుల ఆమోదం ఏకగ్రీవంగా జరగాలన్నారు. ఉపసభాపతి స్థానం వద్దకు వెళ్లి రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ నినాదాలు చేశారు. విపక్షం తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతుండటంతో వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చర్చకు తానివ్వాల్సిన జవాబును కుదించుకుని, క్లుప్తంగా ముగించారు. క్షుణ్నంగా అధ్యయనం చేసేందుకు ఈ రెండు బిల్లులను సభా సంఘాలకు పంపాలన్న విపక్షం తీర్మానాన్ని మూజువాణి ఓటుతో సభ తిరస్కరించింది. అయితే, దీనిపై డివిజన్ ఓటింగ్ జరగాలని కాంగ్రెస్, టీఎంసీ, సీపీఎం, డీఎంకే సభ్యులు పట్టుబట్టారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే డివిజన్ ఓటింగ్ సాధ్యమవుతుందని పేర్కొంటూ, వారి డిమాండ్‌ను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ తోసిపుచ్చారు. దాంతో, టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్ ఆగ్రహంతో డిప్యూటీ చైర్మన్ స్థానం వద్దకు దూసుకువెళ్లారు. రూల్ బుక్‌ను ఆయన ముఖంపై విసిరేశారు. అక్కడే ఉన్న మార్షల్స్ అది డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్‌కు తగలకుండా జాగ్రత్తపడ్డారు. ఆయన వైపు దూసుకువచ్చిన మరో పుస్తకం కూడా తగలకుండా చూశారు. మరోవైపు, సభాపతి స్థానం వద్ద ఉన్న మైక్రోఫోన్‌ను లాగేసేందుకు ప్రయత్నించగా, మార్షల్స్ అడ్డుకున్నారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని తీర్మానాలను ప్రతిపాదించిన డీఎంకే సభ్యుడు తిరుచి శివ, టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్, సీపీఎం సభ్యుడు కేకే రాగేశ్.. తదితరులు బిల్లు పేపర్లను చింపి గాల్లోకి విసిరేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను డిప్యూటీ చైర్మన్ పావుగంట పాటు వాయిదా వేశారు. సభ మళ్లీ సమావేశమైన తరువాత.. విపక్ష సభ్యుల నినాదాల మధ్య ఈ బిల్లులను మూజువాణి ఓటింగ్‌కు పెట్టారు. తొలి బిల్లు ఆమోదం పొంది, విపక్ష తీర్మానాలు వీగిపోయిన సమయంలో ఇద్దరు విపక్ష సభ్యులు రాజ్యసభ ఆఫీసర్స్ టేబుల్స్‌పై ఎక్కేందుకు విఫలయత్నం చేశారు. ఆ తరువాత రెండో బిల్లు కూడా మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. విపక్ష తీర్మానాలు వీగిపోయాయి. ఈ బిల్లులకు జేడీయూ, వైఎస్సార్సీపీ మద్దతు తెలిపాయి. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, టీఆర్ఎస్, ఆప్.. తదితర విపక్ష పార్టీలతో పాటు ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ కూడా ఈ బిల్లులను వ్యతిరేకించింది. బిల్లులపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు ప్రభుత్వ ఉద్దేశాన్ని తప్పుబట్టారు. రైతులకు మరణ శాసనం వంటి ఈ బిల్లులను తాము ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించే ప్రయత్నం ఇదని ఆరోపించింది. ప్రతిపక్షం తీరు సిగ్గుచేటు: రాజ్‌నాథ్ రాజ్యసభలో రైతు బిల్లులపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు సిగ్గుచేట ని, పార్లమెంట్ చరిత్రలోనే మునుపెన్నడూ జరగలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. రైతు బిల్లులను సభ ఆమోదించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో సభ్యుల ఇలాంటి ప్రవర్తను, ఘటనలను ఊహించలేమన్నారు. సభాధ్యక్షుని నిర్ణయంతో ఏకీభవించని నేతలు ఆయనపై దాడికి ప్రయత్నించడం, హింసాత్మక చర్యలకు పూనుకో వడాన్ని అనుమతించబోమన్నారు. ఎంఎస్పీపై అనుమానాలొద్దు: ప్రభుత్వం విపక్షాలు ఆందోళన చెందుతున్నట్లుగా.. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) విధానాన్ని తొలగించే ఆలోచనేదీ ప్రభుత్వానికి లేదని నరేంద్రసింగ్ తోమర్ స్పష్టం చేశారు. ఎంఎస్పీ విధానం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. రైతులు తమ ఉత్పత్తులు ఎక్కడైనా తాము కోరుకున్న ధరకు అమ్ముకునే వీలు కల్పిస్తున్నామన్నారు. వ్యవసాయ మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ఎప్పట్లాగానే కొనసాగుతుందన్నారు. కాంట్రాక్ట్ వ్యవసాయంతో రైతులకు తమ ఉత్పత్తులను తమకు నచ్చిన ధరకు అమ్ముకునే వెసులుబాటు లభిస్తుందని వివరించారు. బిల్లులో తాము పేర్కొన్న అంశాలను కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ప్రతిపాదించిందని గుర్తు చేశారు. వ్యవసాయ మార్కెట్లలోనే కాకుండా, తమకు నచ్చిన ధరకు ఎక్కడైనా ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం ‘వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం, వాణిజ్య(ప్రోత్సాహ, సులభతరం)’ బిల్లు ద్వారా లభిస్తుందన్నారు. రైతులపై సెస్, చార్జీలు ఉండబోవన్నారు. అలాగే, రైతులు వ్యవసాయాధారిత సంస్థలు, కంపెనీలు, ఎగుమతిదారులతో తమ ఉత్పత్తులను ముందే కుదుర్చుకున్న ధరకు అమ్మేందుకు ఒప్పందంకుదుర్చుకునే వీలు ‘రైతాంగ(రక్షణ, సాధికారత) ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పందం’ బిల్లు కల్పిస్తుందని మంత్రి తోమర్ వివరించారు. ఉపసభాపతిపై అవిశ్వాసం! రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పై 12 విపక్ష పార్టీలు ఆదివారం అవిశ్వాస నోటీసును ఇచ్చాయి. వివాదాస్పద వ్యవసాయ బిల్లుల ఆమోదం విషయంలో ఆయన పక్షపాత ధోరణిలో, అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆరోపించాయి. బిల్లులను సభాసంఘానికి పంపించాలన్న తీర్మానాలపై డివిజన్ ఓటింగ్ జరగాలన్న డిమాండ్‌ను ఆయన పట్టించుకోలేదని విమర్శించాయి. అవిశ్వాస నోటీసు ఇచ్చిన పార్టీల్లో కాంగ్రెస్, టీఎంసీ, టీఆర్ఎస్, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, ఆర్జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్, డీఎంకే, ఆప్ ఉన్నాయి. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రభుత్వం పక్షాన నిలిచి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ విమర్శించారు. జేడీయూ నేత హరివంశ్ గతవారమే రాజ్యసభ ఉపసభాపతిగా రెండో సారి ఎన్నికయ్యారు. రాజ్యసభలో మెజారిటీ లేనందునే ప్రభుత్వం డివిజన్ ఓటింగ్‌కు అంగీకరించలేదని టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి దినమన్నారు. ఆ ఎంపీలపై ప్రివిలేజ్ మోషన్ రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా సభలో అనుచితంగా ప్రవర్తించిన పలువురు విపక్ష ఎంపీలపై సభాహక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక పార్టీకి చెందిన ఫ్లోర్ లీడర్ సహా ముగ్గురు, లేక నలుగురు ప్రతిపక్ష ఎంపీలపై సభాహక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం గట్టిగా భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బిల్లుల ఆమోదం సమయంలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆరోపిస్తూ విపక్షపార్టీలు ఆయనపై అవిశ్వాస నోటీసు ఇచ్చారు. ఆ తరువాత, వెంటనే కొందరు కేంద్ర మంత్రులు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు నివాసానికి వెళ్లి, సభలో జరిగిన ఘటనలపై చర్చించారు. విపక్ష సభ్యుల ప్రవర్తనను ఆయనకు వివరించారు. వ్యవసాయ బిల్లుల ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం రైతులకి మరణశాసనం లిఖించింది. భూమిలో బంగారు పంటలు పండించే రైతన్నల కంట్లో నుంచి రక్తం ప్రవహిస్తోంది. రైతులకి మరణశాసనంగా మారే వ్యవసాయ బిల్లుల్ని ఆమోదించిన తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటు – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. వారి బంగారు భవిష్యత్‌కు ఈ బిల్లులు బాటలు వేస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో దూరదృష్టితో ఈ బిల్లుల్ని తీసుకువచ్చారు. కనీస మద్దతు ధర, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు కొనసాగుతాయి – జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు ప్రజాస్వామ్యం అంటే ఏకాభిప్రాయం. కానీ అత్యధికుల అణచివేత కాదు. బిల్లును రాష్ట్రపతి వెనక్కి పంపించాలి – సుఖ్బీర్ సింగ్ బాదల్, శిరోమణి అకాలీదళ్ చీఫ్ వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకం, కార్పొ రేట్లకు అనుకూలం. రైతు ప్రయోజనాలను దెబ్బ తీస్తాయి. రాష్ట్రాల మధ్య వ్యాపారాన్ని మాత్రమే కాదు, రాష్ట్రాల పరిధిలో వ్యాపార లావాదేవీలను నియంత్రిస్తాయి. చరిత్ర ఎవరినీ క్షమించదు. – ఎంకే స్టాలిన్, డీఎంకే అధ్యక్షుడు రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందంటూ కేంద్రం పచ్చి అబద్ధాలు చెబుతోంది. 2028 సంవత్సరం వచ్చినా రైతుల ఆదాయం పెరగదు. ఈ బిల్లుల ఆమోదం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే. బిల్లుల్ని వెంటనే సెలక్ట్ కమిటీకి పంపాలి – డెరెక్ ఓబ్రీన్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ వ్యవసాయ బిల్లులతో రైతు ఆత్మహత్యలు ఇంక జరగవని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వగలదా? వీటిపై చర్చించడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశం జరపాలి – సంజయ్ రౌత్, శివసేన ఎంపీ స్వల్పకాలంలోనూ, దీర్ఘకాలంలోనూ ఈ బిల్లులు రైతులకు ఎలా మేలు చేస్తాయో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించి చెప్పాలి. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళలో ఈ బిల్లుల్ని అత్యవసరంగా ఆమోదించాల్సిన అవసరం ఏముంది ? – హెచ్డీ దేవెగౌడ, జేడీ (ఎస్) ఎంపీ వ్యవసాయ బిల్లులపై చర్చించకుండా హడావుడిగా ఆమోదించడమేంటి? రైతు బిడ్డలెవరూ ఇలాంటి బిల్లుల్ని రూపొందించరు. తిరిగి స్వగ్రామాలకు వెళితే అక్కడ యువత పార్లమెంటులో కూర్చొని రైతన్నలకు మరణశాసనం లిఖిస్తారా అని ప్రశ్నిస్తారు. – రామ్‌గోపాల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఢిల్లీలోని విజయ్‌చౌక్ వద్ద రైతులకు స్వీట్లు తినిపిస్తున్న కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ -
రైతులు, పేదల రుణాలపై వడ్డీ మాఫీ చేయాలి
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న రైతులు, పేదల రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన ‘ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్(రెండో సవరణ)బిల్లు–2020’కు రాజ్యసభ స్వల్ప చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. దేశంలో కోవిడ్ నేపథ్యంలో వాణిజ్య సంస్థల దివాళా ప్రక్రియను మార్చి 25వ తేదీ మొదలుకొని ఆరు నెలలపాటు నిలుపుదల చేసేందుకు వీలు కల్పిస్తూ ఇందులో సవరణలు చేశారు. ఇందుకు సంబంధించి జూన్‌లో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఇది అమల్లోకి రానుంది. బిల్లుపై చర్చ సందర్భంగా జరిగిన చర్చలో పలువురు ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. సీపీఎంకు చెందిన కేకే రాగేశ్ మాట్లాడుతూ..‘కోవిడ్ కారణంగా దెబ్బతిన్న వ్యాపారంగాన్ని, కార్పొరేట్లను గట్టెక్కించేందుకే ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇదే విషయాన్ని రైతులకు ఎందుకు వర్తింపజేయరు? రైతులూ దివాలా తీశారు. వారిని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? వారి రుణాలపై వడ్డీని ఎందుకు మాఫీ చేయదు?’ అని నిలదీశారు. పీఎం కేర్స్‌లో పారదర్శకత లేదు పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటును లోక్‌సభలో ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈ వ్యవహారంలో పారదర్శకత లోపించిందని ఆరోపించాయి. ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీకి చెందిన నేతలు పీఎం కేర్స్ ఏర్పాటుపై మండిపడ్డారు. ఈ నిధిని కాగ్ సమీక్ష పరిధికి వెలుపల ఉంచడమేంటని ప్రశ్నించారు. -
నాలుగుసార్లు లోక్‌సభ వాయిదా
న్యూఢిల్లీ: బీజేపీ నేతల వ్యాఖ్యలపై లోక్‌సభ శుక్రవారం నాలుగు పర్యాయాలు వాయిదాపడింది. ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లు–2020పై చర్చ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రధానమంత్రి నిధులను దుర్వినియోగం చేసిందంటూ, గాంధీ కుటుంబంపై చేసిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్షం నిరసనలకు దిగింది. పీఎం రిలీఫ్ çఫండ్‌ను ఇప్పటి వరకు రిజిస్టర్ చేయించనేలేదని ఠాకూర్ పేర్కొన్నారు. గాంధీ కుటుంబం దేశాన్ని నాశనం చేసిందని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. పలువురు సభ్యులు తమ స్థానాల నుంచి నిలుచుని మాట్లాడుతుండటంపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తీరు కొనసాగితే సస్పెండ్ చేస్తామని వారిని హెచ్చరించారు. అయినా నిరసనలు ఆపకపోవడంతో సభను రెండుసార్లు వాయిదా వేశారు. అనంతరం స్పీకర్ స్థానంలో ఉన్న రమాదేవి కూడా సభను రెండుసార్లు వాయిదా వేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ ఎంపీలకు కరోనా పరీక్షను తప్పనిసరి చేశారు. ప్రతి రోజు ఉదయం ఉభయ సభలకు చెందిన ఎంపీలు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు సభ్యుల వేతనాలను ఏడాది పాటు 30% తగ్గించేందుకు ఉద్దేశించిన బిల్లుకు శుక్రవారం పార్లమెంటు ఆమోదం తెలిపింది. కోవిడ్‌పై పోరుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన విపక్ష సభ్యులు, ఎంపీల్యాడ్స్ నిధులను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ బిల్లును లోక్‌సభ మంగళవారమే ఆమోదించగా, శుక్రవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. హర్సిమ్రత్ రాజీనామా ఆమోదం కేంద్ర మంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్ నేత హర్సిమ్రత్ కౌర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన రైతాంగానికి సంబంధించిన మూడు బిల్లులకు వ్యతిరేకంగా ఆమె గురువారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అలాగే, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖను అదనంగా అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
సమాచార లోపం సరికాదు
దేశం ఇంకా కరోనా వైరస్ మహమ్మారి గుప్పెటనుంచి బయటపడని వేళ... ఆర్థిక సంక్షోభం పర్యవ సానంగా కోట్లాదిమంది ఉపాధి అవకాశాలు అడుగంటుతున్న వేళ... 18 రోజుల పార్లమెంటు వర్షా కాల సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. పార్లమెంటు లోపలా, వెలుపలా కనబడుతున్న దృశ్యాలు గమనిస్తే ముందు జాగ్రత్త చర్యలు ఎంత పకడ్బందీగా అమలవుతున్నాయో అర్థమవు తుంది. పార్లమెంటు రెండు సమావేశాల మధ్య వ్యవధి ఆర్నెల్లు మించరాదన్న రాజ్యాంగ నిబంధన వుంది గనుక అది ముగుస్తున్న తరుణంలో పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది సభ్యులు గుమిగూడే పరిస్థితులు తలెత్తకుండా ఉభయ సభలూ చెరో పూట సమావేశమ య్యేలా ఏర్పాట్లు చేశారు. తక్కువ వ్యవధిని కారణంగా చూపి ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. అయితే సభ్యులడిగే ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు అందుబాటులో వుంటాయని ఉభయ సభల అధ్యక్షులూ ప్రకటించారు. కానీ తొలిరోజే వలస కార్మికుల మరణాలపై తమ వద్ద ఎలాంటి డేటా లేదని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ జవాబివ్వడం దిగ్భ్రాంతి కలిగి స్తుంది. అంతేకాదు... రాష్ట్రాలవారీగా ఎంతమంది వలస కార్మికులకు ఉచిత రేషన్ వగైరాలు అందాయో చెప్పలేమని తెలిపింది. కరోనా విపత్తుతో గత మార్చి 24 నుంచి దేశమంతా లాక్డౌన్ విధించారు. కొన్నాళ్లపాటు పౌరుల కదలికలను పూర్తిగా స్తంభింపజేస్తేనే కరోనా కట్టడి సాధ్యమని ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ దాన్ని అమల్లో పెట్టేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సక్రమంగా లేకపోవడంతో వలస జీవులు ఒక్కసారిగా కష్టాల్లో పడ్డారు. ఉపాధి పోయి, గూడు చెదిరి ఏం చేయాలో తోచక, ఎలా పొట్ట నింపుకోవాలో అర్థంకాక అయోమయంలో పడ్డారు. ఉన్నచోటే వుంటే దిక్కులేని చావు చస్తామన్న భయంతో స్వస్థలాలకు పోవడానికి నిర్ణయించుకున్నారు. లాక్డౌన్ వల్ల సమస్త కార్యకలాపాలూ స్తంభించిపోవడంతో వీరంతా నడకదారిని ఎంచుకోక తప్పలేదు. వీరిలో వలస కూలీలు, కార్మికులు, చిన్నా చితకా వ్యాపారులు వున్నారు. ఇలా మొత్తం కోటి నాలుగు లక్షల అరవై ఆరువేలమంది స్వస్థ లాలకు వెళ్లారని కార్మిక శాఖ చెబుతోంది. అధికంగా ఉత్తరప్రదేశ్‌కు 32.5 లక్షలమంది వలస కార్మి కులు తిరిగిరాగా, ఆ తర్వాత స్థానంలో బిహార్(15 లక్షలమంది), పశ్చిమబెంగాల్(13.38 లక్షల మంది) వున్నాయి. 63లక్షలమందికిపైగా వలస జీవుల్ని ప్రత్యేక రైళ్ల ద్వారా చేరేశారని కూడా ఆ శాఖ వివరించింది. అయితే లాక్డౌన్ మొదలైన నెల తర్వాత మాత్రమే ఈ ప్రత్యేక రైళ్లు నడిపారని మరిచిపోకూడదు. అనేకానేక కారణాలవల్ల ఈ సదుపాయాన్ని వినియోగించుకోలేనివారు కూడా నడవక తప్పలేదు. ఇలాంటివారంతా ఎన్నో యాతనలు పడ్డారు. కొందరు ఆకలిదప్పులకు తట్టుకో లేక మరణించారు. మరికొందరు రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకుని చనిపోయారు. గాయాలపాల య్యారు. కొన్ని సందర్భాల్లో వారు వెళ్లే దారిలో తారసపడిన వాహనాలెక్కి, అవి ప్రమాదాలపాలవ డంతో మరణించినవారున్నారు. మహారాష్ట్రలో రైల్వే ట్రాక్‌పై ఆదమరిచి నిద్రపోతూ 17మంది వలసకూలీలు చనిపోయారు. సుదూర ప్రాంతం నడిచిన కారణంగా ఒంట్లో సత్తువ కోల్పోయి మృత్యువాత పడిన ఉదంతాలున్నాయి. ఈ వలస జీవులకు పేరూ ఊరూ లేకపోవచ్చు. కానీ మహా నగరాల, పట్టణాల నిర్మాణం, వాటి మనుగడ వీరిపైనే ఆధారపడివుంటుంది. ఆకాశ హర్మ్యాల నిర్మాణంలో, రహదారుల నిర్మాణంలో, పారిశుద్ధ్యంలో, వ్యాపారాల్లో, ఫ్యాక్టరీల్లో, సంపన్నులు, మధ్యతరగతి వర్గాల ఇళ్లల్లో వీరు లేకపోతే అన్ని కార్యకలాపాలూ స్తంభించిపోతాయి. వలస కార్మి కుల శ్రమ విలువ జీడీపీలో పది శాతమని గణాంకాలు చెబుతున్నాయి. ఏ రిజిస్టర్లోనూ, రికార్డు ల్లోనూ చోటు దొరకని ఈ అభాగ్యులు సంక్షోభం ముంచుకొచ్చేసరికి ఎవరికీ కాకుండా పోయారు. బతికుండగానే ఎవరికీ కానివారు మరణించాక మాత్రం ఏం లెక్కలోకి వస్తారు? అందుకే ప్రభుత్వాల దగ్గర వారి మరణాల గురించిన లెక్కలు లేవనుకోవాలి. కనీసం ఆ వలసజీవుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం పనిచేసే సంస్థలనైనా ప్రభుత్వాలు సంప్రదించివుంటే ఏదో మేరకు గణాంకాలు లభ్యమయ్యేవి. అలా మరణించినవారిపై ఆధారపడిన కుటుంబాలకు సాయం అందిం చడం సాధ్యమయ్యేది. ఆ ప్రయత్నం చేస్తామని కూడా చెప్పకుండా తమ వద్ద డేటా లేదన్న సమా ధానం ఇవ్వడం కేంద్రానికి భావ్యం కాదు. రహదారి భద్రత గురించి పనిచేసే స్వచ్ఛంద సంస్థ సేవ్ లైఫ్ ఫౌండేషన్ లాక్డౌన్లో రోడ్డు ప్రమాదాల బారినపడి మరణించినవారి వివరాలు సేకరించింది. ఆ సంస్థ గణంకాల ప్రకారం 198మంది వలస జీవులు లాక్డౌన్ సమయంలో రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు. మార్చి 25–మే 31మధ్య దేశవ్యాప్తంగా 1,461 ప్రమాదాలు చోటుచేసుకోగా, అందులో 750మంది మరణించారని, మృతుల్లో 198మంది వలసజీవులని సంస్థ డేటా వెల్లడించింది. అయితే ఇది సమగ్రమైన నివేదికని చెప్పలేం. వనరుల రీత్యా స్వచ్ఛంద సంస్థలకు అనేక పరిమితులుం టాయి. కానీ ప్రభుత్వాలకేమైంది? వలసజీవులు పిల్లాపాపలతో స్వస్థలాలకు నడుచుకుంటూ పోవడం దేశ విభజన తర్వాత భారత్‌లో చోటుచేసుకున్న అతి పెద్ద ఉత్పాతమని సామాజిక రంగ నిపుణులు అభివర్ణించారు. ఎంతమంది వలస కార్మికులు, కూలీలు నడిచిపోయారో చెప్పలేకపో యినా, కనీసం ప్రమాదాల్లో చిక్కుకుని ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో లెక్కలు చెప్పలేని స్థితి వుండకూడదు. ఎందుకంటే చిన్నదో పెద్దదో ప్రతి ప్రమాదమూ సమీప పోలీస్‌స్టేషన్‌లో తప్పని సరిగా నమోదవుతుంది. అందులో చిక్కుకున్నవారు ఎటునుంచి ఎటుపోతున్నారో రికార్డవుతుంది. ఎందరు మరణించారో, గాయపడ్డారో వివరాలుంటాయి. కనీసం ఇప్పుడైనా ఆ డేటాను అన్ని రాష్ట్రాల నుంచి సేకరించి పార్లమెంటుకు సమర్పించడం, బాధిత కుటుంబాలకు పరిహారం అందిం చడం అవసరమని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. -
పార్లమెంట్లో గళమెత్తిన ‘రేసుగుర్రం విలన్’
న్యూఢిల్లీ : డ్రగ్స్ కేసుతో బాలీవుడ్‌కు ఉన్న సంబంధాలపై నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ( రేసుగుర్రం విలన్ మద్దాలి శివారెడ్డి) గళమెత్తారు. బాలీవుడ్లో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. దేశ యువతను నాశనం చేయటానికి కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. పొరుగుదేశాలు ఇందుకు సహకారం అందిస్తున్నాయన్నారు. సోమవారం నాటి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్, చైనాలనుంచి ప్రతి ఏటా మత్తు పదార్థాలు దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయని, నేపాల్, పంజాబ్ ద్వారా దేశంలోకి వస్తున్నాయని పేర్కొన్నారు. ( డ్రగ్స్ కేసు: రాగిణి ద్వివేదీ చీటింగ్ ) డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న కొంతమందిని అరెస్ట్ చేసి, ఎన్సీబీ మంచి పనిచేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని, కేసుతో సంబంధం ఉన్న మిగిలిన దోషులను వెంటనే పట్టుకుని శిక్షించాలని కోరారు. పొరుగు దేశాల కుట్రకు శుభం కార్డు వేయాలన్నారు. ( ‘ఏయ్.. నేను నిజంగానే ఎంపీ అయ్యాను’) -
వైఎస్సార్ సీపీ ఎంపీలతో సీఎం జగన్ మీటింగ్
సాక్షి, అమరావతి : వైఎస్సార్ సీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం కానున్నారు. సోమవారం ఉదయం 12.30 గంటలకి వారితో వర్చువల్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్ట్‌ల సాధనపై దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్లో చర్చకు తీసుకురావాలని సూచించనున్నారు. ( ‘ఆరోగ్య’ భరోసా ) అన్ని ఫార్మాట్ల అవకాశాలను పార్లమెంట్లో వినియోగించుకునేలా ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులతో పాటు పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల సాధన అజెండాగా నేటి సమావేశం జరగనుంది. ఇప్పటికే బీఏసీ సమావేశంలో ఏపీకి సంబంధించిన కరోనా నియంత్రణ చర్యలు, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ నిధుల వంటి అంశాలపై చర్చించాలని వైఎస్సార్ సీపీ లోక్ సభాపక్ష నేత మిథున్‌రెడ్డి స్పీకర్‌ను కోరారు. -
ఆ 3 ఆర్డినెన్స్‌లు వ్యవసాయానికి దండగే
న్యూఢిల్లీ : పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో రైతన్నలు నిరసన బాట పట్టారు. 14 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో గిట్టుబాటు ధరలకి సంబంధించిన మూడు ఆర్డినెన్స్‌లకు చట్టరూపం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉండడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆర్డినెన్స్‌లతో వ్యవసాయ రంగాన్ని మోదీ సర్కార్ కార్పోరేటీకరణ చేస్తోందని మండిపడుతున్నారు. అవి చట్టరూపం దాలిస్తే తాము అప్పుల ఊబిలో కూరుకుపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమావేశాల మొదటి రోజైన సోమవారం దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్‌లపై నిరసన గళాన్ని వినిపించాలని అఖిల భారత రైతు సమన్వయ కమిటీ జాతీయ కన్వీనర్ వీఎం సింగ్ పిలుపునిచ్చారు. ఏమిటీ ఆర్డినెన్స్‌లు? కేంద్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో నిత్యావసర సరుకుల(సవరణ) ఆర్డినెన్స్, రైతుల(సాధికారత, పరిరక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద ఆర్డినెన్స్, రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య(ప్రోత్సాహక, సులభతర) ఆర్డినెన్స్‌లను తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్‌లతో రైతులు పండించే పంటలకు ఎక్కువ ధర వస్తుందని, రైతులు తమ పంటల్ని దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా అమ్ముకునే వీలు ఉంటుందని కేంద్రం చెబుతోంది. కాంట్రాక్ట్ వ్యవసాయం చట్టబద్ధమవుతుందని, రైతులే పారిశ్రామికవేత్తలుగా మారవచ్చునని అంటోంది. అయితే రైతులు వీటిని వ్యతిరేకిస్తున్నారు. కనీస మద్దతు ధర నిర్ణయించకుండా వ్యవసాయ రంగంలో సంస్కరణలు సాధ్యం కాదని వీఎం సింగ్ చెప్పారు. కాంట్రాక్ట్ వ్యవసాయానికి చట్టబద్ధత అన్నది మన దేశంలో చెరుకు రైతుల విషయంలో ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోయిందని గుర్తు చేశారు. అసంఘటిత రంగంలో ఉండే రైతాంగానికి ఈ ఆర్డినెన్స్‌లు మేలు చేయవన్నారు. వ్యవసాయానికి మృత్యుఘంటికలు : కాంగ్రెస్ ఆర్డినెన్స్‌లపై పోరుబాట పట్టిన రైతన్నలకు కాంగ్రెస్ అండగా నిలిచింది. ఆ ఆర్డినెన్స్‌లు రైతు వ్యతిరేకమని ఆరోపించింది. కార్పోరేట్ రంగాన్ని మోదీ సర్కార్ పెంచి పోషిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ çసూర్జేవాలా ధ్వజమెత్తారు. -
పార్లమెంట్ సెషన్.. సిద్ధమవుతోన్న కాంగ్రెస్
న్యూఢిల్లీ: రానున్న పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో నేడు సోనియా గాంధీ అధ్యక్షతన వర్చువల్ సమావేశం జరిగింది. సెప్టెంబర్ 14న ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాల్సిన సమస్యల గురించి నేడు చర్చించారు. ఈ క్రమంలో కేంద్రం ప్రవేశపెట్టబోతున్న 11 ఆర్డినెన్స్‌లలో నాలుగింటిని పూర్తిగా తిరస్కరించాలని నిర్ణయించారు. అంతేకాక జీరో అవర్‌ను ఎక్కువ కాల పరిమితిని పెంచాలని డిమాండ్ చేయనున్నట్లు తెలిసింది. ఆగస్టు 24 వర్కింగ్ కమిటీ సమావేశం తరువాత తొలిసారిగా సోనియా, రాహుల్ గాంధీలను ఎదుర్కొన్న అసమ్మతివాదులు, నేటి నిర్ణయాలతో సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక గత ఐదు నెలల్లో సోనియా గాంధీ కరోనాతో సహా పలు సమస్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీకి ఏడు లేఖలు రాశారు. ఇక రాహుల్ గాంధీ కూడా కరోనా నియంత్రణ చర్యలు, ఆర్థిక మాంధ్యం, లద్ధాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతల గురించి ప్రతి రోజు కేంద్రాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. (చదవండి: కాంగ్రెస్‌కు ఇది కర్తవ్యమే!) నేడు సమావేశం అనంతరం రాహుల్ గాంధీ చైనా దురాక్రమణ, ఆర్థికమాంద్యం అంశాల గురించి ప్రస్తావిస్తూ.. మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశాల్లో మోదీ నిర్ణయాలు టైటానిక్ మాదిరిగానే దేశాన్ని ముంచుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక మీడియా, మోదీ ఈ సమస్యలను దాచే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. ప్రభుత్వం ఇయర్ ప్లగ్స్ ధరించిన వ్యక్తి మాదిరి ప్రవర్తిసుందన్నారు. ‘మోదీ తనకు రుచించని సమస్యలను వినదల్చుకోవడం లేదు. కానీ భవిష్యత్తులో ఇవి అకస్మాత్తుగా తెరపైకి వచ్చి.. దేశాన్ని కకావికలం చేస్తాయి. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మంచు కొండను తాకి విరిగిపోయిన టైటానిక్ మాదిరిగా తయారవుతుంది’ అన్నారు రాహుల్ గాంధీ. నేటి సమావేశానికి గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ప్రత్యేక ఆహ్వానితుడు మనీష్ తివారీ హాజరయ్యారు. నేటి సమావేశంతో వారు సంతోషంగా ఉన్నారని.. పార్టీ చర్చలు "సరైనవి", "పరిణతి చెందినవి" అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎంపీలకు కరోనా పరీక్షలు
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు 72 గంటల ముందే లోక్‌సభ సభ్యులందరూ కోవిడ్–19 పరీక్షలు చేయించుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కోరారు. వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 14 న ప్రారంభమై, అక్టోబర్ 1కి ముగియనున్నాయి. ఎంపీలతో పాటు, పార్లమెంటు ఆవరణలోనికి ప్రవేశించే వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు, మీడియా ప్రతినిధులు, లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్ సిబ్బంది అంతా సమావేశాల ప్రారంభానికి ముందే పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్ కోరారు. పార్లమెంటరీ సమావేశాల ఏర్పాట్లను ఖరారు చేయడానికి ఆరోగ్యమంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్, ఎయిమ్స్, డీఆర్డీఓ, ఢిల్లీ ప్రభుత్వ అధికారులతో లోక్‌సభ స్పీకర్ శుక్రవారం సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభ్యులెవ్వరినీ ముట్టుకోకుండా, జీరో టచ్ సెక్యూరిటీ చెక్ ఏర్పాట్లు చేస్తున్నామని స్పీకర్ తెలిపారు. సమావేశాలు జరుగుతున్నప్పుడు అవసరమైతే కోవిడ్ పరీక్షలు సైతం నిర్వహిస్తామని స్పీకర్ చెప్పారు. రెండు షిఫ్టులలో ఉదయం, సాయంత్రం వర్షాకాల సమావేశాలు జరగనున్నట్టు ఆయన వెల్లడించారు. పార్లమెంటు భవనానికి లోక్‌సభ స్పీకర్ సంరక్షకుడు కాగా, ఈ భవనానికి లోక్‌సభ సెక్రటేరియట్ నోడల్ అథారిటీగా వ్యవహరిస్తుంది. కనుక పార్లమెంటులో అన్ని ఏర్పాట్లు చేసే బాధ్యత లోక్‌సభ సెక్రటేరియట్ మీదనే ఉంటుంది. ప్రశ్నలడిగే అధికారాన్ని హరించవద్దు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల పార్లమెంటరీ సమావేశాల్లో ప్రశ్నలు అడిగే, ప్రజాసమస్యలను ప్రస్థావించే సభ్యుల అధికారాలను హరించరాదంటూ లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకి, కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌధరి లేఖ రాశారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని, జీరో అవర్లను కుదించటం, ప్రత్యేకించి కోవిడ్ సంక్షోభ కాలంలో మంచిది కాదని ఛౌదరి స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. రానున్న సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్నీ, జీరో అవర్ సమయాన్నీ కుదించే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోందనీ, సభ్యులు అడిగే ప్రశ్నల సంఖ్యను కూడా కుదించే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. జీరో అవర్‌లో, జాతీయ, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను సభ్యులు లేవనెత్తటం సహజంగా జరిగే ప్రక్రియ అని, ఆయన రాసిన లేఖలో తెలిపారు. ఎక్కువ ప్రశ్నలు అడగకుండా, ప్రశ్నోత్తరాల సమయాన్నీ, జీరో అవర్ సమయాన్నీ కుదించటం ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రయోజనాలకనుగుణంగా లేవని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు యథావిధిగా ప్రశ్నలడిగే అవకాశం కల్పించాలని స్పీకర్‌కి రాసిన లేఖలో కోరారు. -
ఏర్పాట్లు చేస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయనే విషయం ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కావలసిన ఏర్పాట్లను మాత్రం లోక్‌సభ స్పీకర్, నేను పర్యవేక్షిస్తున్నాం’ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘పార్లమెంట్ సమావేశాల నాటికి పరిస్థితి మెరుగు పడుతుందని ఆశిస్తున్నాం. సెప్టెంబర్‌లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. మహమ్మారి సమయంలో కూడా పార్లమెంటు సమావేశాలను విధిగా నిర్వహించాల్సిందే. ఏవైనా మార్పులు తేవాలనుకున్నా.. ఒకసారి సమావేశమై మార్పులు తేవొచ్చు. సమావేశాలు నిర్వహిస్తే కనీసం 3 వేల మంది సిబ్బంది పార్లమెంటు ప్రాంగణంలో ఉంటారు. అందువల్ల భౌతిక దూరం పాటించేందుకు అవసరమైన ఆంక్షలు అమలుచేయాల్సి వస్తుంది. వర్చువల్ సమావేశాలు నిర్వహించాలంటూ సలహాలు వస్తున్నాయి. వర్చువల్‌కి, నేరుగా మాట్లాడడానికి చాలా తేడా ఉంది..’అని వెంకయ్య అన్నారు. ఢిల్లీలోని తెలుగు పాత్రికేయులతో ఆయన ఆన్లైన్లో ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. కరోనా విషయంలో మీడియా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని, వార్తల్లో అతిశయోక్తులు వద్దని సూచించారు. -
వర్చువల్ పార్లమెంటే మేలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనల నేపథ్యంలో ‘వర్చువల్’విధానం మంచి ప్రత్యామ్నాయమని వారు భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ‘ప్రస్తుత పరిస్థితుల్లో రోజువారీ సమావేశాల నిర్వహణ కష్టతరం అయినందున, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని పార్లమెంట్ సమావేశాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. అయితే, చర్చల్లో గోప్యత పాటించాల్సిన అవసరం దృష్ట్యా ఈ అంశాన్ని పార్లమెంట్ ఉభయ సభల నిబంధనల కమిటీకి పంపాలి’అని వారు అభిప్రాయపడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో భౌతిక దూరం పాటిస్తూ లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలను రోజు విడిచి రోజు చేపట్టే అంశం కూడా ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చింది. అయితే, లాక్డౌన్ ఆంక్షల కారణంగా తాము రాలేమంటూ కొందరు ఎంపీలు సమాచారం ఇవ్వడం, కరోనా ముప్పు ఇప్పటికిప్పుడు తొలగిపోయే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వర్చువల్ పార్లమెంట్ విధానం మేలనే భావన వ్యక్తమయింది. ఇందుకు సంబంధించిన సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సాధారణంగా వర్షాకాల సమావేశాలు జూలై–ఆగస్ట్‌లో జరుగుతాయి. -
మరో 5 ఐఐఐటీలకు జాతీయ ప్రాధాన్య హోదా
న్యూఢిల్లీ: జాతీయ ప్రాధాన్య సంస్థ (ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్) హోదాను మరో ఐదు ఐఐఐటీలకు కల్పిస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఐదు ఐఐఐటీలను పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్) చట్టం–2017 కిందకు తీసుకొచ్చే ఉద్దేశంతో ఇండి యన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) చట్టం (సవరణ) బిల్లు–2020ను తీసు కొచ్చారు. ఇప్పటికే ఈ జాబితాలో 15 ఐఐఐటీలు ఉన్నాయి. సూరత్, భోపాల్, భాగల్పూర్, అగర్తలా, రాయ్‌చూర్‌లతో ఉన్న ఐఐఐటీలకు తాజాగా జాతీయ ప్రాధాన్య హోదా ఇచ్చారు. దీంతో ఈ సంస్థల్లో బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ డిగ్రీలను అందించే వెసులుబాటు కలుగుతుంది. ఐటీ రంగంలో నూతన పరిశోధనలు చేసేందుకు అవసరమైన విద్యార్థులు చేరే అవకాశం ఉంటుంది. ఇలాంటి విద్యాసంస్థల్లో 100 శాతం ప్లేస్మెంట్లు కల్పించిన రికార్డు ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పోక్రియాల్ లోక్‌సభలో పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో నాణ్యత పెరుగుతోందని, దేశం పరిశోధనలు, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. -
ఎన్పీఆర్పై అనుమానాలొద్దు: అమిత్ షా
న్యూఢిల్లీ: జాతీయ జనాభా పట్టిక(నేషనల్ పాపులేషన్ రిజిస్టర్–ఎన్పీఆర్)పై ఆందోళన అవసరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్పీఆర్ను అప్డేట్ చేసే కార్యక్రమంలో ఏ పౌరుడి వివరాలను ‘అనుమానాస్పద(డౌట్ఫుల్– డీ)’ కేటగిరీలో చేర్చబోమని తెలిపారు. అలాగే, తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే ఏ ధ్రువ పత్రాలను కూడా పౌరులు ఇవ్వాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. ఎన్పీఆర్ ప్రశ్నావళిలో తల్లిదండ్రుల నివాసానికి సంబంధించిన ప్రశ్నలపై తలెత్తిన అనుమానాలను నివృత్తి చేస్తూ.. పౌరులు తమ వద్ద లేని సమాచారాన్ని కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సీఏఏపై గానీ, ఎన్పీఆర్పై కానీ మైనారిటీలు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దన్నారు. ఎన్పీఆర్కు సంబంధించిన అనుమానాల నివృత్తికి విపక్ష నేతల బృందం తనను కలవొచ్చని సూచించారు. పౌరసత్వాన్ని రద్దు చేసే ఏ సెక్షన్ కూడా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)లో లేదని మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీ అల్లర్లపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చకు హోంమంత్రి సమాధానమిచ్చారు. కులం, మతం, రాజకీయ పార్టీలతో అనుబంధం.. వీటికి సంబంధం లేకుండా ఢిల్లీ అల్లర్ల దోషులను చట్టం ముందు నిలుపుతామని పునరుద్ఘాటించారు. పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంటు ఆమోదం పొందిన తరువాత కొందరు ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేసిన విద్వేష ప్రసంగాల కారణంగానే ఢిల్లీ హింసాకాండ చోటు చేసుకుందని షా పేర్కొన్నారు. ప్రభుత్వమే హింసాకాండకు పురిగొల్పిందన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికా అధ్యక్షుడు దేశంలో పర్యటిస్తున్న వేళ ఏ ప్రభుత్వమైనా అలా చేస్తుందా? అని ప్రశ్నించారు. ఢిల్లీ హింసాకాండ వెనుక పెద్ద కుట్ర ఉందని, విదేశీ నిధులను దీనికి ఉపయోగించారని ఆరోపించారు. అల్లర్లను అదుపు చేయడంలో పోలీసుల తీరును తప్పుబట్టిన ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ మురళీధర్‌ను బదిలీ చేయడంలో ఎలాంటి కుట్ర లేదని, ఆ బదిలీ అంతకుముందు, సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుల ఆధారంగానే జరిగిందని వివరణ ఇచ్చారు. ‘ఆ ఒక్క న్యాయమూర్తే న్యాయం చేస్తారని ఎందుకు అనుకుంటున్నారు? వేరే జడ్జి న్యాయం చేయరా?’ అని ప్రశ్నించారు. కాగా, అంతకుముందు విపక్ష సభ్యులు.. ఢిల్లీ అల్లర్లపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. కోవిడ్ కన్నా ప్రమాదకరమైన మత వైరస్(కమ్యూనల్ వైరస్)ను బీజేపీ వ్యాప్తి చేస్తోందని, దీని వల్ల ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్ సభ్యుడు కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. -
దోషులను వదలం!
న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల దోషులెవరినీ వదలబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అల్లర్లకు పాల్పడేవారికి ఒక గుణపాఠంలా తమ చర్యలుంటాయన్నారు. కులం, మతం, రాజకీయ పార్టీలతో అనుబంధం.. వీటినేమాత్రం పట్టించుకోమని, అల్లర్లలో పాలు పంచుకున్న ప్రతీ ఒక్కరికి సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఢిల్లీ అల్లర్లపై లోక్‌సభలో బుధవారం జరిగిన చర్చకు షా సమాధానమిచ్చారు. ఆ అల్లర్లు ముందుగానే ప్లాన్ చేసుకున్న కుట్ర అని ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోందన్నారు. ఈ ఢిల్లీ హింసాకాండకు సంబంధించి పోలీసులు 2,647 మందిని అదుపులోకి తీసుకున్నారని, దాదాపు 700 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారని, ఈ హింసకు ఉపయోగించిన 152 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని, ఆయుధాల చట్టం కింద 49 కేసులు నమోదు చేశారని అమిత్ షా వివరించారు. ఫేస్ ఐడెంటిఫికేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి సీసీ టీవీ ఫుటేజ్‌ను నిపుణులు విశ్లేషిస్తున్నారన్నారు. ఈ సాఫ్ట్వేర్ మతం ఆధారంగానో, దుస్తుల ఆధారంగానో వివక్ష చూపదని విపక్షంపై విసుర్లు విసిరారు. హోళీ సమయంలో మత కలహాలు జరగకుండా చూసేందుకే.. ఆ పండుగ తరువాత ఢిల్లీ అల్లర్లపై చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావించిందన్నారు. ‘ఢిల్లీ హింసాకాండలో మొత్తం 52 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. విపక్షం తరహాలో నేను వారిలో హిందువులెందరు? ముస్లింలు ఎందరు? అనే వివరాలను ఇవ్వదలచుకోలేదు. 526 మంది గాయపడ్డారు. 371 మంది భారతీయుల దుకాణాలు, 142 మంది ఇండియన్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి’ అని వివరించారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ పేరును ప్రస్తావించకుండా.. ‘ఫిబ్రవరి 24న ఒక విపక్ష నేత ఇది అటో ఇటో తేల్చుకునే యుద్ధం అని రెచ్చగొట్టేలా ప్రసంగించారు. ఇది విద్వేష ప్రసంగం కాదా?’ అని షా ప్రశ్నించారు. సీఏఏ వ్యతిరేక నిరసనల్లో ఎంఐఎం నేత వారిస్ పఠాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావించారు. సీఏఏను సమర్ధిస్తూ.. మతం ప్రాతిపదికన 25కి పైగా చట్టాలను రూపొందించారని, సీఏఏ ఏ మతంపైనా వివక్ష చూపదని పునరుద్ఘాటించారు. అమిత్ మాట్లాడుతుండగానే.. నిరసనగా కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు, చర్చలో పాల్గొన్న పలువురు విపక్ష సభ్యులు.. ఢిల్లీ అల్లర్లకు నైతిక బాధ్యత వహించి, మంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చర్చను కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధురి ప్రారంభించారు. ఢిల్లీలో హింసాకాండ ప్రజ్వరిల్లుతున్న సమయంలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు విందు ఇవ్వడంలో బిజీగా ఉన్నారని, ఇది రోమ్ నగరం తగలబడుతుంటే.. నీరో ఫిడేల్ వాయిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ‘ఈ హింసాకాండలో హిందువులు గెలిచారని కొందరు, ముస్లింలు గెలిచారని కొందరు చెబుతున్నారు. నిజానికి మానవత్వం ఓడిపోయింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ పోలీసుల తీరును విమర్శించినందువల్లనే ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ మురళీధర్‌ను బదిలీ చేశారని చౌధురి ఆరోపించారు. హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని టీఎంసీ ఎంపీ సౌగత రాయ్, ఆరెస్పీ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ కూడా డిమాండ్ చేశారు. ఈ హింసాకాండను కూడా కొందరు రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని బీజేపీ నేత మీనాక్షి లేఖి విమర్శించారు. ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్యను గుర్తు చేస్తూ.. ఆయన మృతదేహంపై 400 గాయాలు ఉన్నాయన్నారు. ఆప్ కౌన్సిలర్ ఇంట్లో భారీగా రాళ్లు, ఆయుధాలు లభించడాన్ని ఆమె ప్రస్తావిం చారు. చాలా ఇళ్లల్లో వడిసెల వంటి ఆయుధాలు లభించాయన్నారు. లేఖి ప్రసంగంలోని పలు ప్రస్తావనలను రికార్డుల నుంచి తొలగించాలని బీఎస్పీ ఎంపీ డానిశ్ డిమాండ్ చేశారు. దాంతో, చర్చలో మత ప్రస్తావన తీసుకురావద్దని స్పీకర్ ఓం బిర్లా ఆదేశిస్తూ.. మీనాక్షి లేఖి ప్రసంగంలోని పలు ప్రస్తావనలను రికార్డుల నుంచి తొలగించారు. హిందూత్వ విద్వేష సునామీ: ఓవైసీ ఢిల్లీ హింసాకాండకు పాల్పడినవారిని చట్టం ముందు నిలిపేందుకు నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. హిందూత్వ విద్వేషమనే సునామీ వచ్చిందన్నారు. దేశ ఆత్మని కాపాడాలని ఓవైసీ హిందువులను కోరారు. దాదాపు 1,100 మంది ముస్లింలను అక్రమంగా నిర్బంధించారన్నారు. ఓవైసీ చేసిన కొన్ని వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు తీవ్రంగా నిరసన తెలిపారు. కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, కిషన్ రెడ్డి కూడా తీవ్ర నిరసన తెలిపారు. ‘ఢిల్లీ అల్లర్లను మత కలహాలనడం హాస్యాస్పదం. ఇవి ముందే ప్లాన్ చేసుకున్న ఊచకోత’ అని ఓవైసీ వ్యాఖ్యానించారు. ‘ఫైజాన్ ముస్లిం అయినంత మాత్రాన ఆయన ప్రాణం విలువ అంకిత్ ప్రాణం విలువ కన్నా తక్కువ కాబోదు. మొత్తం హింసాకాండపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలి’ అని ఆయన కోరారు. అల్లర్ల సమయంలో ముస్లింలకు సాయం చేసిన సిక్కులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లో హిందువుల బస్తీలను ఎవరు ఖాళీ చేయిస్తున్నారు? సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో హిందువుల బస్తీలను ఎంఐఎం పార్టీ వారు ఖాళీ చేయిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ఓవైసీ ప్రసంగానికి కౌంటర్‌గా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పాత బస్తీలో అనేక చోట్ల దళితుల బస్తీలను ఎంఐఎం వారు ఖాళీ చేయించారని ఆరోపించారు. అంతేకాకుండా, వారిపై దాడులు కూడా చేయిస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో ఇవన్నీ చేస్తూ ఇక్కడ పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు. ఇది సరైన పద్దతి కాదని హితవు పలికారు. -
వారంలో మూడుగంటలే!
న్యూఢిల్లీ: బడ్జెట్ మలి విడత సమావేశాలు మొదలైన మొదటి వారంలో రాజ్యసభ మూడు గంటలు మాత్రమే సవ్యంగా సాగింది. ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలతోనే సమయమంతా గడిచిపోయింది. షెడ్యూల్ ప్రకారం సభ 28.30 గంటలపాటు జరగాల్సి ఉండగా 26 గంటలపాటు అంతరాయం కలిగిందని, కేవలం 2.42 గంటలపాటు మాత్రమే కార్యకలాపాలు సాగాయని రాజ్యసభ వర్గాలు తెలిపాయి. సమావేశాలు 9.50 శాతమే ఫలప్రదమ య్యాయని పేర్కొన్నాయి. దీంతోపాటు, ఫిబ్రవరి 12, మార్చి 1వ తేదీల మధ్య జరిగిన స్టాండింగ్ కమిటీల సమావేశాలకు సగం మంది ఎంపీలు మాత్రమే హాజరయ్యారని వెల్లడించాయి. -
కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
న్యూఢిల్లీ: బడ్జెట్ మలి దశ సమావేశాలు ముగిసేవరకు ఏడుగురు కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేస్తూ లోక్‌సభలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ టేబుల్ పై నుంచి కాగితాలను లాగేసి, విసిరేసిన అనుచిత చర్యకు పాల్పడినందుకు గానూ కాంగ్రెస్ సభ్యులైన గౌరవ్ గొగొయి, టీఎన్ ప్రతాపన్, దీన్ కురియకోస్, మనీకా ఠాగోర్, రాజ్‌మోహన్ ఉన్నిథన్, బెన్నీ బెహనన్, గుర్జీత్‌సింగ్ ఔజ్లాలను సస్పెండ్ చేస్తున్నట్లు ఒక తీర్మానాన్ని గురువారం లోక్‌సభ ఆమోదించింది. ఈ దుష్ప్రవర్తన సహించం పలు వాయిదాల అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభ సమావేశమైంది. అనంతరం ఏడుగురు కాంగ్రెస్ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ స్థానంలో ఉన్న మీనాక్షి లేఖి ప్రకటించారు. ‘ఖనిజ చట్టాలు(సవరణ) బిల్లు, 2020’ పై సభలో చర్చ జరుగుతున్న సమయంలో ఈ సభ్యులు స్పీకర్ పోడియం నుంచి సంబంధిత కాగితాలను లాగేసి, విసిరేశారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా’ అని ఆమె పేర్కొన్నారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్య ఆ తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఆ తరువాత, సభ శుక్రవారానికి వాయిదా వేశారు. ఎంపీని సస్పెండ్ చేయాలంటూ లోక్‌సభలో.: రాజస్తాన్‌కు చెందిన రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ ఎంపీ హనుమాన్ బెణివాల్ కాంగ్రెస్ చీఫ్ సోనియాపై అనుచిత వ్యాఖ్యాలు చేశారని, ఆయనను సస్పెండ్ చేయాలంటూ కాంగ్రెస్ సభ్యులు చేసిన ఆందోళనలతో సభ మూడు సార్లు వాయిదా పడింది. నాలుగో సారి సమావేశమైన తరువాత ..ఢిల్లీ అల్లర్ల అంశాన్ని కూడా లేవనెత్తుతూ.. వెల్‌లోకి వచ్చి ‘సస్పెండ్ ఎంపీ.. మోదీ సర్కార్ షేమ్ షేమ్’ అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంపై ఉన్న కాగితాలను గౌరవ్ గొగొయి తీసుకుని చించి, గాల్లోకి విసిరేయడం కనిపించింది. దాంతో, సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేస్తూ స్పీకర్ స్థానంలో ఉన్న రమాదేవి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, మూడు రౌండ్ల బుల్లెట్లతో పార్లమెంటు కాంప్లెక్సులో ప్రవేశించబోయిన ఘజియాబాద్‌కు చెందిన అక్తర్ ఖాన్ (44)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి లైసెన్సు కలిగిన ఆయుధం ఉండటంతో అనంతరం విడిచిపెట్టారు. జేబులో నుంచి బుల్లెట్లను తీయడం మరిచిపోయినట్లు అతడు తెలిపారు. -
ఢిల్లీ హింసపై చర్చ జరగాల్సిందే
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో గత వారం జరిగిన అల్లర్లపై పార్లమెంట్లో ప్రభుత్వం చర్చ చేపట్టే వరకు ఉభయసభల్లో కార్యకలాపాలు కొనసాగ నీయబోమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. దేశ రాజధానిలో గొడవలకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. లోక్‌సభ, రాజ్యసభల్లో మూడో రోజైన బుధవారం కూడా కార్యకలాపాలు స్తంభించాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఢిల్లీ హింసపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. హోలీ పండగ అనంతరం ఈ నెల 11వ తేదీన లోక్‌సభలో, 12న రాజ్యసభలో దీనిపై చర్చ చేపడతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. సంతృప్తి చెందని కాంగ్రెస్‌కు చెందిన 30 మంది సహా, ఇతర ప్రతిపక్ష సభ్యులు వెల్‌లో నిలబడి ‘హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి, ప్రధాని మోదీ బాధ్యత వహించాలి’అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ ఓం బిర్లా లేకపోవడంతో అధ్యక్షస్థానంలో ఉన్న కిరీట్ సోలంకి సభా కార్యక్రమాలను నడిపించారు. దీంతో సభ్యులు.. ‘స్పీకర్ ఎక్కడ?, మాకు న్యాయం కావాలి’అంటూ కేకలు చేశారు. ఈ ఆందోళనల నడుమనే ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన ‘వివాద్ సే విశ్వాస్’బిల్లును, ఐదు ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐటీలు)లకు జాతీయ ప్రాముఖ్య హోదా కల్పించే బిల్లులను ఆమోదించింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులడిగిన రెండు ప్రశ్నలకు బొగ్గు శాఖ మంత్రి కూడా అయిన జోషి బదులిచ్చారు. చంద్రయాన్–3 ప్రాజెక్టును 2021 ప్రథమార్ధంలో చేపట్టనున్నట్లు లోక్‌సభకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అనుకున్న దానికంటే కొద్దిగా ఆలస్యమవుతుందన్నారు. మానవసహిత గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా మైక్రోగ్రావిటీపై ఆరు పరీక్షలు జరుగుతాయని ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గందరగోళం కొనసాగడంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు, ఆతర్వాత రోజంతా వాయిదా పడింది. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘అల్లర్లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. హింసకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి. ఇదే మా డిమాండ్. చర్చ జరిపేదాకా ఉభయసభల లోపల, వెలుపల నిరసనలు కొనసాగిస్తాం’అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రతినిధి సయ్యద్ నజీర్ హుస్సేన్ మాట్లాడుతూ..‘అల్లర్లపై మాట్లాడేందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఏమాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. చర్చ సాగితే సభా కార్యకలాపాలను కొనసాగనిస్తాం. దీనిపై ప్రతిపక్షాలన్నీ ఒకే మాటపై ఉన్నాయి’ అని పేర్కొన్నారు. రాజ్యసభలోనూ అదే సీను ఢిల్లీ అల్లర్లపై వెంటనే చర్చ జరగాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్, టీఎంసీ, వామపక్షాలు, ఎస్పీ, బీఎస్పీ డిమాండ్ చేశాయి. హోలీ తర్వాత చర్చకు చేపట్టనున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటనను తిరస్కరించాయి. ఎజెండాను పక్కనబెట్టి ఢిల్లీ అల్లర్లపైనే చర్చించాలంటూ నిబంధన–267 కింద ప్రతిపక్షాలిచ్చిన నోటీసును చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. అయితే, ఏ అంశంపై, ఏ విధానం ప్రకారం చర్చ జరగాలనే విషయమై రాజ్యసభలో అధికార, ప్రతిపక్ష నేతలతో మాట్లాడతానని తెలిపారు. ప్రతిపక్షం నిరసనలు ఆగకపోవడంతో ఆయన.. ‘దేశంలో కోవిడ్ వ్యాప్తి సహా 16 అంశాలపై జీరో అవర్‌లో జరగాల్సిన చర్చను అడ్డుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నట్టుంది’ అని వ్యాఖ్యానిస్తూ తర్వాతి రోజుకు సభను వాయిదా వేశారు. హోలీ సందర్భంగా 9, 10వ తేదీల్లో పార్లమెంట్‌కు సెలవులు. -
నెట్టుకున్నారు.. తోసేసుకున్నారు!
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల మలి దశ తొలి రోజే లోక్‌సభ దద్ధరిల్లింది. ఢిల్లీ అల్లర్లపై అధికార, విపక్ష సభ్యులు ఆవేశంగా ఒకరినొకరు గట్టిగా తోసుకోవడంతో సభలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సభలో నెలకొన్న తోపులాటపై స్పీకర్ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సభను నిర్వహించలేనంటూ అశక్తత వ్యక్తం చేశారు. సభలో తమ మహిళా సభ్యులపై అనుచితంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల మలి దశ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే.. ఫిబ్రవరి 28వ తేదీన మరణించిన జేడీయూ ఎంపీ బైద్యనాథ్ ప్రసాద్‌కు నివాళి అర్పించి, అనంతరం ఆయనకు గౌరవ సూచకంగా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కాగానే గందరగోళం మొదలైంది. ఇటీవలి ఢిల్లీ అల్లర్ల అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడం ప్రారంభించారు. హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికార పక్ష సభ్యులు కూర్చున్న వైపు కూడా వెళ్లి అమిత్‌షా రాజీనామా డిమాండ్ ఉన్న నల్లని బ్యానర్‌ను ప్రదర్శించారు. ‘అల్లర్లకు కారణం వీరే. వీరే రెచ్చగొట్టారు. 1984లోనూ వీరు 3000 మందిని హతమార్చారు. వీరికి శాంతి నెలకొనడం ఇష్టం లేదు’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో విపక్ష సభ్యులు మరింత బిగ్గరగా.. ‘వి వాంట్ జస్టిస్’, ‘అమిత్ షా ముర్దాబాద్’ అని నినాదాలు చేయసాగారు. ఈ సమయంలో, కాంగ్రెస్ సభ్యులు నల్ల బ్యానర్‌తో అధికార పక్ష సభ్యుల వైపు వెళ్లారు. బీజేపీ సభ్యులు వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు చేతిలోని కాగితాలను చించి, విసిరేశారు. ఈ సమయంలో, ఇరు వర్గాల సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. గట్టిగా నెట్టివేసుకున్నారు. దీంతో సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. 3 గంటలకు సభ ప్రారంభమైన తరువాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. తమవైపు నుంచి వెల్‌లోకి వెళ్లనివ్వకుండా బీజేపీ సభ్యులు విపక్ష సభ్యులను అడ్డుకున్నారు. ఈ సమయంలో బీజేపీ మహిళా ఎంపీ ఒకరు తనపై దాడి చేశారని కాంగ్రెస్ ఎంపీ రమ్య హరిదాస్ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. గందరగోళం మధ్య సభ పదేపదే వాయిదాపడింది.దీంతో సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. కాగా, బీజేపీ మహిళా సభ్యులతో కాంగ్రెస్ ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారని, స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని మంత్రి స్మృతి ఇరానీ సభ వెలుపల మీడియాకు తెలిపారు. వాయిదా పడిన రాజ్యసభ ఢిల్లీ అల్లర్లపై రాజ్యసభలో దుమారం రేగింది. ఢిల్లీ తగులబడుతుంటే కేంద్రం నిద్ర పోతోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. హోం మంత్రి రాజీనామా చేయాలని కోరాయి. ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లింది. వెల్‌లోకి వచ్చి నిలబడిన సభ్యులను సీట్లలో కూర్చోవాల్సిందిగా అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పలు పర్యాయాలు కోరినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆయన సభను మధ్యాçహ్నానికి వాయిదావేశారు. ఆ తర్వాతా అదే తీరు కొనసాగడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను మంగళవారానికి వాయిదా వేశారు. గొడవ మధ్యనే తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్ సహా మూడు సంస్కృత వర్సిటీలను సెంట్రల్ వర్సిటీలుగా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రవేశపెట్టారు. గౌరవంగా వ్యవహరిద్దాం సభ్యులను సముదాయించేందుకు స్పీకర్ ఓం బిర్లా పలు సందర్భాల్లో విఫల యత్నం చేశారు. దేశ ప్రజలు చూస్తున్నారని, గౌరవ సభ్యులుగా హుందాగా వ్యవహరిద్దామని సభ్యులకు సూచించారు. సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందన్నారు. గందరగోళం మధ్యనే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(అమెండ్మెంట్) బిల్లు, మినరల్ లాస్ అమెండ్మెంట్ బిల్లులను ప్రవేశపెట్టారు. ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన ‘వివాద్ సే విశ్వాస్’ బిల్లుపై చర్చ జరిగింది. -
‘పెస్టిసైడ్స్’ నియంత్రణకు బిల్లు
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే పురుగు మందుల వ్యాపార నియంత్రణ బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది. పురుగుమందుల వ్యాపార క్రమబద్ధీకరణతో పాటు, నకిలీ పురుగుమందుల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించే ప్రతిపాదనను కూడా బిల్లులో చేర్చారు. ఈ ‘పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ బిల్–2020’ని బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ‘ప్రస్తుతం పురుగుమందుల వ్యాపారం ఇన్సెక్టిసైడ్ యాక్ట్ – 1968 నిబంధనల ప్రకారం జరుగుతోంది. ఆ నిబంధనలకు కాలం చెల్లింది. అందుకే కొత్త బిల్లును రూపొందించాం’ అని సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా, వారికి సురక్షితమైన, ప్రభావశీలమైన పురుగుమందులు అందించడం, నకిలీ పురుగుమందులను అరికట్టడం లక్ష్యంగా ఈ బిల్లు రూపొందిందన్నారు. ఆయా పురుగు మందులకు సంబంధించిన సమస్త సమాచారం డీలర్ల నుంచి రైతులకు అందేలా నిబంధనలు రూపొందించామన్నారు. అలాగే, సేంద్రియ పురుగుమందుల వాడకాన్ని ప్రోత్సహించే ప్రతిపాదనలను కూడా తాజా బిల్లులో చేర్చామన్నారు. నకిలీ రసాయన మందుల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఒక సెంట్రల్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పెస్టిసైడ్స్ కంపెనీల నుంచి వసూలు చేసిన జరిమానాకు, అవసరమైతే కొంత కలిపి కేంద్రం ఆ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. పురుగుమందుల ప్రచారాన్ని క్రమబద్ధీకరించే ప్రతిపాదన కూడా తాజా బిల్లులో ఉందన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే పురుగుమందుల తయారీ సంస్థలకు రూ. 25 వేల నుంచి రూ. 50 లక్షల వరకు జరిమానా విధించే ప్రతిపాదనను ఆ ముసాయిదా బిల్లులో చేర్చారు. నిబంధనలను అతిక్రమించేవారికి జైలు శిక్షను ఐదేళ్లవరకు పెంచే ప్రతిపాదనను తాజా బిల్లులో చేర్చారు. -
ఫిరాయింపులకు పరిష్కారం చూడండి
న్యూఢిల్లీ: ఎన్నికైన చట్ట సభల సభ్యులు సొంత పార్టీ నుంచి వేరే పార్టీకి ఫిరాయించే అనైతిక చర్యలను నిరోధించేలా ఒక పరిష్కారం చూపాలని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యసభలో గురువారం జీరోఅవర్ సందర్భంగా వెంకయ్యనాయుడు పై సూచన చేశారు. ‘దురదృష్టవశాత్తూ వారు అంటున్నారు ఇది ఫిరాయింపు(డిఫెక్షన్) కాదు.. అభిమానం(అఫెక్షన్) అని. వారు ఆ ఫిరాయింపును ఫర్ఫెక్షన్తో చేస్తున్నారు. దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద సమస్య ఇది’ అని ఫిరాయింపు నేతలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఈ అనైతిక చర్యకు ముగింపు పలికేందుకు అన్ని రాజకీయ పార్టీలు సూచనలు చేయాలని కోరారు. -
నిరసనలతో అరాచకం
న్యూఢిల్లీ: పార్లమెంటు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వీధుల్లో నిరసనలు, గృహదహనాలకు దిగితే చివరికి అది అరాచకత్వానికి దారి తీస్తుందని ప్రధాని మోదీ ఘాటుగా హెచ్చరించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) వ్యతిరేక నిరసనల్ని విపక్షాలే రెచ్చగొడుతూ లేనిపోని భయాందోళనలను సృష్టిస్తున్నాయన్నారు. సీఏఏపై విపక్షాల వైఖరిని పాకిస్తాన్‌తో పోల్చారు. కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో ముస్లింలపై పాక్ ఇదే విధంగా బురద జల్లిందన్నారు. బడ్జెట్ సమావేశాల తొలిరోజు పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం ఉభయ సభల్లోనూ జరిగిన చర్చకు మోదీ బదులిచ్చారు. లోక్‌సభలో గంటా 40 నిమిషాల సేపు మాట్లాడిన మోదీ సీఏఏ దేశ పౌరులపైనా, మైనార్టీల ప్రయోజనాలపైనా ఎలాంటి వ్యతిరేక ప్రభావాన్ని చూపించదని పునరుద్ఘాటించారు. రాజ్యసభలో ఎన్పీఆర్పై ఎక్కువగా మాట్లాడారు. ప్రధాని ప్రసంగం అనంతరం ఉభయ సభలు ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించాయి. ఎన్పీఆర్కి సవరణలు చేపడితేనే నిజమైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. జన గణన, జనాభా పట్టిక సర్వసాధారణంగా జరిగే పరిపాలనాపరమైన ప్రక్రియ అని, ఇప్పుడే దీనిపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందన్న విపక్షాల దాడిని మోదీ తిప్పి కొట్టారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను ముస్లింలుగా చూస్తే, తాము వారిని భారతీయులుగా చూస్తున్నామని చెప్పారు. చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాం దేశ ప్రజలు తమ అయిదేళ్ల పని తీరు చూశాక బీజేపీపై నమ్మకం ఉంచి అధికారాన్ని తిరిగి అప్పగించారన్నారు. అందుకే పాలనలో వేగవంతం, విస్తృతి పెంచడం , సమస్యల్ని పరిష్కరించడం, నిబద్ధతతో నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నామని మోదీ చెప్పారు. పాత విధానాలతో ముందుకు వెళితే ఆర్టికల్ 370 రద్దు అయ్యేది కాదని, ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్‌తో బాధల్లోనే ఉండేవారని అన్నారు. ఇంకా పాత ఆలోచనలే చేస్తే రామజన్మభూమి వివాదమూ పరిష్కారమయ్యేది కాదు, కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ సాకారమయ్యేది కాదు, భారత్, బంగ్లాదేశ్ మధ్య భూ ఒప్పందం కుదిరేది కాదని ప్రధాని చెప్పుకొచ్చారు. ఆర్థిక లోటును నియంత్రిస్తున్నాం ఆర్థిక లోటును నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ధరల పెరుగుదలను నియంత్రిస్తున్నామని మోదీ చెప్పారు. స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని తెలిపారు. మేకిన్ ఇండియాపై విదేశాలకు నమ్మకం కుదిరి ఎఫ్‌డీఐలు బాగా పెరిగాయన్నారు. ఎన్డీయే హయాంలో వ్యవసాయ బడ్జెట్‌ను అయిదు రెట్లు ఎక్కువ చేశామని రూ. 27 వేల కోట్లు ఉన్నదానిని ప్రస్తుతం రూ.1.5 లక్షల కోట్లు చేశామన్నారు. ఈశాన్యంలో అభివృద్ధి నిత్యం రక్తపాతం, హింసతో సతమతమయ్యే ఈశాన్య రాష్ట్రా ల్లో వివిధ రంగాల్లో అభివృద్ధికి బాటలు వేశామన్నారు. బోడో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా శాంతి స్థాపన జరుగుతోందని, పెట్టుబడులకు మార్గం సుగమం అయిందన్నారు. గాంధీ మాకు జీవితం ప్రధాని మోదీ లోక్‌సభ ఆవరణలోకి రాగానే బీజేపీ సభ్యులు జై శ్రీరామ్.. అంటూ నినాదాలు చేస్తే, దానికి కౌంటర్‌గా కాంగ్రెస్ సభ్యులు మహాత్మా గాంధీ జిందాబాద్ అంటూ నినదించారు. సభలో మోదీ ప్రసంగం మొదలు కాగానే కాంగ్రెస్ సభ్యులు మహాత్ముడిని కీర్తిస్తూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఇది ట్రయలర్ మాత్రమే అంటూ వ్యంగ్యబాణాలు విసిరారు. దీంతో మోదీ ఆయనకి చురకలంటించారు. ‘మీకు మహాత్మాగాంధీ ట్రయలర్ కావొచ్చు.. మాకు గాంధీయే జీవితం’ అంటూ బదులిచ్చారు. రాహుల్ ట్యూబ్‌లైట్ తన ప్రసంగానికి విపక్షాలు అడ్డు తగిలినప్పుడల్లా మోదీ వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రసంగం మధ్యలో రాహుల్ లేచి ఉద్యోగాల గురించి ప్రస్తావించగానే, తాను మాట్లాడటం మొదలు పెట్టిన 40 నిమిషాల తర్వాత స్పందించడంతో రాహుల్‌ని ట్యూబ్‌లైట్ అంటూ ఎదురు దాడికి దిగారు. ఆరు నెలల్లో యువత మోదీ వీపుని కర్రలతో వాయిస్తారంటూ రాహుల్ వ్యాఖ్యానించారని వచ్చిన వార్తల్ని ప్రధాని ప్రస్తావించారు. రాహుల్ పేరు చెప్పకుండా.. ‘ప్రతిపక్ష ఎంపీ ఒకరు యువత నా వీపుని విమానం మోత మోగిస్తామని అన్నారట. అందుకే మరింత సమయం సూర్యనమస్కారాలకు సమయం కేటాయిస్తా. అప్పుడు ఎలాంటి దూషణలనైనా ఎదుర్కొనే సామర్థ్యం వస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు. గీత గీసింది నెహ్రూయే సీఏఏని సమర్థించుకునే క్రమంలో తొలి ప్రధాని నెహ్రూ మాటల్ని ఉదహరించారు. దేశ విభజన తర్వాత సరిహద్దుల నుంచి మన దేశంలోకి వచ్చిన వారిని హిందూ శరణార్థులు, ముస్లిం వలసదారులుగా నెహ్రూయే విభజించి చూశారని మోదీ తెలిపారు. నాటి అస్సాం సీఎం గోపీనాథ్ బర్దోలియాకి నెహ్రూ రాసిన లేఖలో అంశాలను మోదీ ప్రస్తావించారు. పాక్ నుంచి భారత్‌కొచ్చిన వారిలో హిందూ శరణార్థులకు, ముస్లిం వలసదారులకు మధ్య తేడా చూపాలని, పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్) నుంచి వచ్చే మైనార్టీలను భారత్ కాపాడాలని లేఖలో ఉందన్నారు. అవసరమైతే హిందూ శరణార్థులకు పౌరసత్వం కల్పించేలా చట్టానికి సవరణలు చేద్దామని నెహ్రూ ఆ లేఖలో పేర్కొన్నారని మోదీ చెప్పారు. మరి అలా మాట్లాడిన నెహ్రూ మతవాదా? ఆయన హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారా అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు ‘నెహ్రూ నాటి పాక్ ప్రధాని లియాఖత్ అలీఖాన్ మధ్య కుదిరిన ఒప్పందంలో పౌరులందరినీ చేర్చకుండా, మైనార్టీల ప్రయోజనాలను ఇరుదేశాల్లో కాపాడాలని ఎందుకు అంగీకారానికి వచ్చారని నిలదీశారు. ఏపీ విభజనను ప్రజలు మర్చిపోరు పౌరసత్వ చట్టం సవరణలపైగానీ ఆర్టికల్ 370 రద్దు సమయంలో గానీ తమతో ఎలాంటి చర్చ జరపకుండానే ప్రభుత్వం ముందుకెళ్లిందంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు ప్రధాని స్పందిస్తూ.. ‘ఇది ఎంత మాత్రం నిజం కాదు. వీటిపై సవివరమైన చర్చ జరిగిన విషయం యావత్తు జాతికి తెలుసు. ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా సభ్యులు ఓటు వేశారు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 2014లో యూపీఏ హయాంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజనను ప్రస్తావించారు. ‘ప్రజలు అంత తేలిగ్గా ఏదీ మర్చిపోరు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనకు దారి తీసిన పరిస్థితులను ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతకు గుర్తు చేస్తున్నా. ఆ సమయంలో సభను దిగ్బంధంలో ఉంచారు. టీవీల్లో సభా కార్యకలాపాల ప్రసారాలు నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ విభజనను హడావుడిగా ప్రకటించారు’ అని తెలిపారు. నిరుద్యోగంపై మాట్లాడరా?: రాహుల్ దేశం ఎదుర్కొంటున్న అతి ప్రధానమైన నిరుద్యోగ సమస్య ప్రధాని మోదీకి కనిపించలేదా అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. నెహ్రూ, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంశాలను లేవనెత్తి మోదీయే ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ అయిదున్నరేళ్లు గడిచిపోతున్నా ఆ హామీ నెరవేర్చలేదని అన్నారు. వంద నిమిషాల సేపు మాట్లాడిన ప్రధానికి గత ఏడాది కోటి మంది యువత ఉద్యోగాలు కోల్పోతే దానిపై మాట్లాడడానికి సమయం దొరకలేదా అని రాహుల్ ప్రశ్నించారు. -
సీఏఏను గట్టిగా సమర్థించండి
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పార్లమెంట్లో విపక్షాలను సమర్థంగా ఎదుర్కోవాలని ఎన్డీయే పక్ష సభ్యులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. సీఏఏ విషయంలో ప్రభుత్వం తప్పేం చేయలేదని, చట్టాన్ని సమర్థిస్తూ గట్టిగా వాదనను విన్పించాలని సూచించారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎన్డీయే పక్షాలు శుక్రవారం సమావేశమయ్యాయి. సమావేశంలో మోదీ పేర్కొన్న అంశాలను పేరు చెప్పడానికి ఇష్టపడని బీజేపీ మిత్రపక్ష నేత ఒకరు వెల్లడించారు. ‘సీఏఏ ముస్లింలపై వివక్ష చూపుతుందన్న ప్రతిపక్షాల వాదనను గట్టిగా తిప్పికొట్టండి. ముస్లింలతో పాటు పౌరులంతా మనకు సమానమేనని స్పష్టం చేయండి’ అని ప్రధాని చెప్పారన్నారు. జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)కు సంబంధించిన ప్రశ్నావళి నుంచి కొన్ని ప్రశ్నలను తొలగించాలని సమావేశంలో మిత్రపక్షం జేడీయూ ప్రభుత్వాన్ని కోరింది. ఎన్పీఆర్ నుంచి తల్లిదండ్రుల వివరాలను కోరే ప్రశ్నలను తొలగించాలని కోరామని, దానికి హోంమంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారని జేడీయూ ఎంపీ లలన్ సింగ్ వెల్లడించారు. శిరోమణి అకాలీదళ్ కూడా తమ సూచనను సమర్ధించిందన్నారు. తల్లిదండ్రుల వివరాలకు సంబంధించిన ప్రశ్నలకు జవాబివ్వడం ఐచ్ఛికమేనని ఇప్పటికే కేంద్రమంత్రి జవదేకర్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. చర్చలు ఫలవంతమవుతాయని ఆశిస్తున్నా శనివారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు ఫలవంతమవుతాయని, సభ్యులు నాణ్యత కలిగిన చర్చను జరుపుతారని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ శుక్రవారం అన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇరు సభలూ ఆర్థిక సమస్యల గురించి, ప్రపంచ ఆర్థిక మందగమన నేపథ్యంలో భారత్ ఎలా ముందుకు సాగాలో వంటి వాటిపై విస్తృతంగా చర్చించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ దశాబ్దానికి గట్టి పునాదులు ఈ బడ్జెట్‌తోనే ప్రారంభమవ్వాలని చెప్పారు. ఈ సెషన్లో ఆర్థిక సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు చెప్పారు. దళితులు, మధ్యతరగతివారు, అణచివేతకు గురైన వారు, మహిళల సాధికారత కోసం ఈ దశాబ్దంలో కూడా తాము కష్టపడతామని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మొదటి విడత బడ్జెట్ సమావేశాలు శనివారం నుంచి ఫిబ్రవరి 11 వరకూ, రెండో దశ సమావేశాలు మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకూ జరగనున్న సంగతి తెలిసిందే. విపక్షాల చర్య అప్రజాస్వామికం: జీవీఎల్ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేసిన విపక్షాల చర్య అప్రజాస్వామికమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ, అక్కడి అభివృద్ధి కార్యక్రమాలు, 2022 నాటికి కొత్త భారత నిర్మాణానికి మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్రపతి వివరించారు. దీనిపై సభ్యులంతా హర్షద్వానాలతో స్వాగతించగా, కొందరు ప్రతిపక్ష నాయకులు నలుగురు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయాలని ప్రయత్నం చేశారు. ఇది అప్రజాస్వామికం. వారంతా క్షమాపణలు చెప్పాలి’ అంటూ డిమాండ్ చేశారు. -
సీఏఏ చరిత్రాత్మకం
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్ముని ఆశయ సాధనకు కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) చారిత్రకమైందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. నిరసనల పేరుతో కొందరు హింసకు పాల్పడటం దేశాన్ని, సమాజాన్ని బలహీనపరుస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన వివరించారు. రాష్ట్రపతి ప్రసంగానికి అధికార పక్షం నేతలు బల్లలు చరుస్తూ మద్దతు ప్రకటించగా ప్రతిపక్షం నిరసన ప్రకటించింది. సుమారు 70 నిమిషాల పాటు జరిగిన రాష్ట్రపతి కోవింద్ ప్రసంగం ఆయన మాటల్లోనే... బడ్జెట్ సమావేశం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను పార్లమెంటుకు తీసుకువస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నెరవేరిన గాంధీజీ ఆశయం.. సీఏఏకు వ్యతిరేకంగా దేశంలో నిరసనల పేరుతో హింస చెలరేగడం సరికాదు. సర్వమత సమానత్వం భారత్ చిరకాలంగా నమ్ముతున్న సూత్రం. దేశ విభజన సమయంలో ఈ నమ్మకంపై తీవ్రమైన దాడి జరిగింది. పాకిస్తాన్లో నివసించేందుకు ఇష్టపడని హిందువులు, సిక్కులు భారత్‌కు తిరిగి రావచ్చు. అలా వచ్చిన వారు ఇక్కడ సాధారణ జీవితం గడిపేలా చేయడం ప్రభుత్వ బాధ్యతని మహాత్మాగాంధీ ఎప్పుడో చెప్పారు. ఆయన ఆకాంక్షలను గౌరవించడం అందరి బాధ్యత. ఉభయసభలు ఆ బాధ్యతను నెరవేర్చడం సంతోషకరమైన విషయం. గాంధీజీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా సీఏఏ అమల్లోకి రావడం సంతోషకరం. పాకిస్తాన్లో జరుగుతున్న నాన్కానా సాహెబ్ గురుద్వారాపై దాడి వంటి ఘటనలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకు రావాల్సిన బాధ్యత మనపై ఉంది. అంతర్జాతీయ సమాజం కూడా ఇలాంటి ఘటనలను ఖండించడంతోపాటు తగిన చర్యలు తీసుకోవాలి. దేశీయ ఉత్పత్తులనే కొనండి... దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు రికార్డు స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. మెరుగైన భవిష్యత్తు కోసం ప్రజలు స్థానికంగా తయారైన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి. ఆర్థిక వ్యవస్థను ఐదు లక్షల డాలర్ల స్థాయికి తీసుకు వెళ్లేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రామజన్మభూమి అంశంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఉంచిన నమ్మకాన్ని బలపరిచేదిగా ఉంది. ఈ తీర్పుపై దేశ ప్రజలు స్పందించిన తీరు ప్రశంసార్హమైంది. దేశంలోని ఇతర ప్రాంతాలతో సమానమైన హక్కులు సాధించుకోవడం ద్వారా జమ్మూ కశ్మీర్, లడాఖ్ ప్రజలూ ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు ఓ చారిత్రక ఘట్టం. జాతి ప్రయోజనాల కోసం ప్రతి వ్యక్తి తన బాధ్యతలు గుర్తెరిగి నడుచుకునేలా చేయాలి. అందరం కలిసికట్టుగా ఈ దశాబ్దాన్ని తమ బాధ్యతలను నెరవేర్చేందుకు అంకితం చేద్దాం. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఎన్నో రికార్డులు సృష్టించింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం త్రివిధ దళాల మధ్య సమన్వయం సాధించేందుకు దోహదపడుతుంది. ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. మహిళల భద్రత కోసం 1,000 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మహిళలకు సంబంధించిన కేసుల సత్వర విచారణకు ఇవి దోహదపడతాయి. సభలో తొలిరోజు.. ► సమావేశానికి ముందుగా రాష్ట్రపతి కోవింద్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌కు తోడ్కొని వచ్చారు. ► మొదటి వరుసలో ప్రధాని మోదీతోపాటు మంత్రులు థావర్ చంద్ గహ్లోత్, ఎస్.జైశంకర్, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, తదితరులతోపాటు ప్రతిపక్షం నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రమే ఆసీనులయ్యారు. ► కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మొదటి వరసకు బదులుగా శశి థరూర్, మనీష్ తివారీ తదితరులతో కలిసి ఐదో వరుసలో కూర్చున్నారు. ► రాష్ట్రపతి ప్రసంగానికి ప్రతిపక్ష సభ్యులు తెలుపుతున్న నిరసనలను టీఎంసీ సభ్యుడు డెరెక్ ఒబ్రియాన్ తన సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ కనిపించారు. ► బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)కి చెందిన అతుల్ రాయ్ లోక్‌సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి నియోజకవర్గం నుంచి ఎన్నికైన రాయ్.. రేప్ కేసులో అరెస్టై జైలులో ఉన్నారు. కోర్టు పెరోల్ ఇవ్వడంతో ప్రమాణం చేశారు. -
ఆ మాటలతో.. దేశ ప్రయోజనాలకు విఘాతం
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనే దమ్ము లేకుండా పోయిందంటూ వ్యాపార దిగ్గజం రాహుల్ బజాజ్ చేసిన విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. తమ సొంత అభిప్రాయాలను అందరికీ ఆపాదించడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. ఇలాంటి విమర్శలు .. జాతి ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అమిత్ షాల సమక్షంలోనే రాహుల్ బజాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, ఎవరూ దేని గురించీ భయపడాల్సిన అవసరం లేదని, అలాంటి పరిస్థితులేమైనా ఉంటే చక్కదిద్దేందుకు కృషి చేస్తామని షా స్పందించారు. ఈ చర్చాగోష్టి క్లిప్పింగ్‌ను మైక్రోబ్లాగింగ్ సైటు ట్విట్టర్లో పోస్ట్ చేసిన నిర్మలా సీతారామన్.. అన్ని సమస్యలను ప్రభుత్వం పట్టించుకుంటోందని, పరిష్కరించే ప్రయత్నాలూ చేస్తోందని చెప్పడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. బజాజ్‌కు ‘బయోకాన్’ షా మద్దతు .. మరోవైపు, రాహుల్ బజాజ్‌కు మద్దతుగా మరో పారిశ్రామిక దిగ్గజం బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా స్పందించారు. కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వం అంటరానివాటిగా చూస్తోందని, ఎకానమీ గురించి ఏ విమర్శలనూ వినదల్చుకోవడం లేదంటూ ఆమె వ్యాఖ్యానించారు. అటు నిర్మలా సీతారామన్ ట్విట్టర్ పోస్ట్‌లపైనా షా స్పందించారు. కార్పొరేట్ సంస్థలు.. దేశానికి, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. ‘మేడమ్ మేం జాతి వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక శక్తులం కాము. ఎకానమీని ప్రబల శక్తిగా తీర్చిదిద్దేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు విజయ వంతం కావాలనే మేమూ కోరుకుంటున్నాం‘ అని ఆమె ట్వీట్ చేశారు. ఇక, ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం తీరుపై విమర్శలకు దిగాయి. ‘విమర్శించడమనేది జాతి ప్రయోజనాలకు ముప్పు అంటే.. ప్రభుత్వాన్ని పొగిడితేనే దేశ ప్రయోజనాలను కాపాడినట్లవుతుందా’ అంటూ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ ట్వీట్ చేశారు. 5 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు.. న్యూఢిల్లీ: కార్పొరేట్ ట్యాక్స్ రేటును తగ్గించడం వల్ల పన్ను వసూళ్లపై ప్రతికూల ప్రభావమేమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ దాకా స్థూలంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 5 శాతం పెరిగాయని ఆమె తెలిపారు. ట్యాక్సేషన్ చట్ట సవరణ బిల్లు 2019పై లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొన్న సందర్భంగా.. ప్రత్యక్ష పన్ను వసూళ్లేమీ తగ్గలేదని మంత్రి స్పష్టం చేశారు. సాధారణంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఆఖరు త్రైమాసికంలోనే అత్యధికంగా ఉంటాయని ఆమె చెప్పారు. -
పౌరసత్వ బిల్లులో కీలక మార్పులు
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లులో కొన్ని మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. గత లోక్‌సభ రద్దైన నేపథ్యంలో ఆ బిల్లుకు కూడా కాలం చెల్లిన విషయం తెలిసిందే. దాంతో, కొత్తగా కొన్ని కీలక మార్పులతో ఆ బిల్లును మళ్లీ సభ ముందుకు తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా, ‘అక్రమ వలసదారులు’ అనే పదానికి నిర్వచనాన్ని కూడా బిల్లులో చేర్చనున్నారని సోమవారం అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులకు తట్టుకోలేక భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లు, పార్శీలకు.. వారివద్ద సరైన పత్రాలు లేనప్పటికీ.. భారతీయ పౌరసత్వం కల్పించే దిశగా పౌరసత్వ చట్టం, 1955లో సవరణ చేపట్టేందుకు ఉద్దేశించిన బిల్లు అది. ఇది బీజేపీ ప్రచారాస్త్రాల్లో ఒకటి. -
‘బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి’
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదివారం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం ముగిసింది. ఈ భేటీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలు హాజరయ్యారు. సమావేశం అనంతరం వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు ప్రతిపక్షం ఆటంకాలు సృష్టిస్తోందని, పోలవరం రివర్స్ టెండరింగ్‌తో రూ.800 కోట్లు ఆదా చేసినట్లు అఖిలపక్ష నేతల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాలను టెక్నికల్ కమిటీ ఆమోదించాలని కోరినట్లు పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన అంశాలివే.. ఆంధ్రప్రదేశ్‌కు ఏడు మెడికల్ కాలేజీలను మంజూరు చేయాలి. బుందేల్‌ఖండ్ తరహాలో ఏపీలో వెనకబడిన జిల్లాలకు రూ. 700 కోట్ల ఇవ్వాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకరావాలి. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించాలని రామాయణపట్నంలో మేజర్ పోర్టు నిర్మించాలి విజయనగరం జిల్లా సాలూరులో గిరిజన వర్సిటీకి అనుమతినివ్వాలి గోదావరి-కృష్ణ అనుసంధాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రం చేపట్టాలి కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది ‘ఇక ఈ సమావేశంలో జైల్లో ఉన్న చిదంబరాన్ని పార్లమెంట్‌కు హాజరయ్యేలా అనుమతించాలని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ కోరారు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్రెడ్డిని అక్రమంగా నిర్బంధించిన సమయంలో పార్లమెంట్‌కు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరితే అనుమతించలేదు. చిదంబరానికి ఒక న్యాయం వైఎస్ జగన్‌కు మరొక న్యాయం ఉండకూడదు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటోంది. కేంద్రం జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. మా అధినేతపై తప్పుడు కేసులు పెట్టి 16 నెలల పాటు నిర్భంధించారు. కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది. చిన్న పార్టీలకు కూడా సభలో కనీసం పది నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించాలని కోరాము’అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
సభ సజావుగా జరగనివ్వండి
న్యూఢిల్లీ: సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సభ్యులకు పిలుపునిచ్చారు. శనివారం జరిగిన అఖిల పక్ష భేటీలో ఈ మేరకు ఆయన సభ్యులను కోరారు. ప్రధాని మోదీ ఈ భేటీలో పాల్గొన్నారు. సభలో చర్చ జరగాలని, చర్చ జరిగేందుకే సభ ఉన్నదన్న విషయాన్ని గుర్తు చేశారు. సభ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, అందుకే ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిందిగా సభ్యులను కోరారు. 17వ లోక్ సభ మొదటి సమావేశాల్లాగే ఈ సమావేశాలు కూడా ఫలప్రదం అవుతాయని పార్టీలన్నీ తనకు మాటిచ్చాయని చెప్పారు. భేటీ అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బంధోపాధ్యాయ్ మాట్లాడుతూ.. పశ్చిమబెంగాల్లో గవర్నర్ సమాంతర పాలన నడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగకూడదని అన్నారు. సభలో నిరుద్యోగం, ఆర్థిక స్థితి వంటి వాటిపై చర్చలు జరుగుతాయని చెప్పారు. ఉత్తర భారతంలో ఉన్న కాలుష్యం గురించి సభ మాట్లాడాలని బీఎస్పీ నేత కున్వార్ చెప్పారు. -
తగిన సమయం కేటాయించాలని కోరాం: మిథున్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : ఈ నెల 18 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలను లేవనెత్తేందుకు తగిన సమయం కేటాయించాల్సిందిగా కోరామని వైఎస్సార్ సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి తెలిపారు. శనివారం ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరు అయ్యారు. లోక్‌సభ సమావేశాలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా కోరారని మిథున్ రెడ్డి తెలిపారు. విభజన చట్టంలోని అంశాలు, పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు, కడప స్టీల్ ఫ్లాంట్, రామయపట్నం పోర్టు అంశాలను సభలో ప్రస్తావిస్తామన్నారు. కాగా అఖిలపక్ష సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సహా పలు పార్టీల నేతలు హాజరయ్యారు. -
పెళ్లిళ్లు అవుతున్నాయ్.. మాంద్యమెక్కడ?
న్యూఢిల్లీ: ‘విమానాశ్రయాలు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రజలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి’ అని కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్ అంగడీ అన్నారు. ఆర్థికమాంద్య పరిస్థితులు ఉన్నాయని అసత్యాలు ప్రచారం చేసి ప్రధాని మోదీ ప్రతిష్టను తగ్గించేందుకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ‘మూడేళ్లకు ఒకసారి ఆర్థిక వ్యవస్థ కొంత మందగించడం సహజమే. అది త్వరలోనే సర్దుకుంటుంది’ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌సహా ప్రతిపక్ష పార్టీలు ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని యోచిస్తున్నాయి. దీనిపై సురేశ్ అంగడీ మాట్లాడుతూ, ఆర్థిక మందగింపు సహజమేనని, త్వరలో పుంజుకుంటుందని, ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కారణం లేక, దీనిని ప్రస్తావిస్తున్నాయని ఎద్దేవా చేశారు. -
18 నుంచి డిసెంబర్ 13 వరకు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 13 వరకు జరగనున్నాయి. పార్లమెంటు ఉభయ సభల సెక్రటేరియట్లకు సోమవారం ఈ సమాచారాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ పంపించింది. గత రెండేళ్లుగా శీతాకాల సమావేశాలు నవంబర్ 21న ప్రారంభమై.. జనవరి మొదటివారం వరకు కొనసాగాయి. ఈ సమావేశాల్లో రెండు ఆర్డినెన్సులు, పలు కీలక బిల్లులు పార్లమెంటు ముందుకు రానున్నాయి. నూతన, దేశీ తయారీ సంస్థలకు కార్పొరేట్ పన్నును తగ్గిస్తూ జారీ అయిన ఆర్డినెన్స్, ఈ–సిగరెట్ల తయారీ, అమ్మకం, నిల్వను నిషేధిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌లకు చట్టరూపం ఇవ్వాల్సి ఉంది. ఆర్థిక వృద్ధిలో వైఫల్యం, కశ్మీర్లో స్థానికుల పరిస్థితి, ఎన్నార్సీ, పౌరసత్వ బిల్లు.. మొదలైన అంశాలపై విపక్ష సభ్యులు లేవనెత్తేవీలుంది. పార్లమెంటు సమావేశాలను మరో వారం పాటు పొడగించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో 28 బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందాయి. ఈ సమావేశాల్లోనే కార్మిక సంస్కరణలకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందే అవకాశముంది. -
2022కల్లా కొత్త పార్లమెంట్!
న్యూఢిల్లీ: 2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్తగా నిర్మించిన లేదా ఉన్న భవనాలకే ఆధునిక హంగులద్దిన పార్లమెంట్లో జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు గురువారం తెలిపాయి. రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్‌కు మధ్య ఉత్తర, దక్షిణ బ్లాకుల వద్ద 3 కిలోమీటర్ల విశాలమైన సెంట్రల్ విస్తాను ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించనున్నారు. దీని కోసం ప్రభుత్వం దేశ విదేశాల నుంచి డిజైన్, ఆర్కిటెక్ట్ సంస్థలను పిలిచింది. కొత్తగా నిర్మించనున్న ఈ భవనాలు కనీసం 150 నుంచి 200 ఏళ్లపాటు సేవలు అందించనున్నాయి. ఫ్లోటింగ్ ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)లోని నిర్దేశిత నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఇంకా నిర్ణయం తీసుకోలేదా ! ఇప్పుడున్న భవన సముదాయం 1927లో నిర్మితమైందని, ప్రస్తుతం కావాల్సిన అవసరాలను అది అందుకోలేకపోతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే కొత్త భవనం నిర్మించాలా లేక పాతదాన్నే పునర్నిర్మించాలా ? అనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. వివిధ మంత్రిత్వ శాఖల కింద ఉన్న ఆఫీసు కార్యాలయాలను నిర్వహించేందుకు ఏటా రూ. 1,000 కోట్లు ఖర్చువుతోంది. కొత్తవాటిని నిర్మించడం ద్వారా ఈ వ్యయాన్ని ఆదా చేయ వచ్చని ప్రభుత్వం భావిస్తోంది. -
ముసురుకున్న సందేహాలు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ను పునర్విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధతపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టికల్ –370ను రద్దు చేయడం జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సాంకేతికంగా సవరిస్తుందనే విమర్శలు ఎదురవుతున్నాయి. ఇవీ చిక్కులు ► ఆర్టికల్ 370 (3) ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులపై ‘రాజ్యాం గబద్ధమైన అసెంబ్లీ (కాన్‌స్టిట్యుయంట్ అసెంబ్లీ)’ సలహా తీసు కోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా దీన్ని ‘శాసనసభ (లెజిస్లేటివ్ అసెంబ్లీ)’గా సవరించారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో శాసనసభ లేనందున ఆ అధికారాలు గవర్నర్‌కు దఖలు పడ్డాయి. గవర్నర్ సూచనల మేరకే ఆర్టికల్ –370ను రద్దు చేశారు. అయితే, ఇది చెల్లదని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు ‘ముందు’ రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీ నుంచి ఏకాభ్రిపాయం సేకరించాలని ఆర్టికల్ 370 (3)పేర్కొంటోంది. ► శాసనసభ ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కూడుకున్నది కాగా గవర్నర్ కేంద్రం ప్రతినిధిగా నియమితులవుతారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల స్థానంలో గవర్నర్ సూచనల ఆధారంగా ఆర్టికల్ –370ను రద్దు చేయవచ్చా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ► మరోవైపు ఆర్టికల్ –370 తాత్కాలికం కాదని 2016లో ఎస్బీఐ వర్సెస్ సంతోష్ గుప్తా కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు పేర్కొంటున్నాయి. రాజ్యాంగ బద్ధమైన అసెంబ్లీ సూచనలు చేసే వరకు అది ‘పర్మినెంటే’ అని చెబుతోంది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ నుంచి అలాంటి సూచనలు ఏవీ రాలేదు. ► రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించడం, మార్చడం చెల్లదని పలు తీర్పుల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ –370 అందులో భాగమేనా? దాన్ని మార్చవచ్చా? ► ఆర్టికల్ –370 రద్దు భారత్‌లో జమ్మూకశ్మీర్ విలీనాన్ని సాంకేతికంగా సవరిస్తుంది. అంతర్జాతీయంగా అభ్యంతరం ► ఐరాస భద్రతా మండలి 47వ తీర్మానం ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా కశ్మీర్ ప్రజలకు స్వయం నిర్ణయాధికార హక్కు కల్పించింది. ఆర్టికల్ –370 రద్దు, స్వయం ప్రతిపత్తిని తొలగించడం ఐరాస భద్రతా మండలి తీర్మానం ఉల్లంఘనగా మారే అవకాశం ఉంది. -
వేతన కోడ్‌కు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వివిధ సంస్థల్లో పనిచేసే ప్రతి కార్మికుడికీ కనీస వేతనం అందించేందుకు వీలు కల్పించే వేతనాల కోడ్ –2019 బిల్లును రాజ్యసభ ఆమోదించింది. వేతనాలు, బోనస్‌లకు సంబం ధించిన వివిధ నిబంధనలు, సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. ఇది చట్ట రూపం దాల్చితే దేశ వ్యాప్తంగా ఉన్న 50 కోట్ల మంది కార్మికులకు లాభం కలుగుతుందని కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ సభలో తెలిపారు. సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 85 మంది, వ్యతిరేకంగా 8 మంది ఓటేశారు. కనీస వేతనాల చట్టం, వేతన చెల్లింపు చట్టం, బోనస్ చెల్లింపు చట్టం, సమాన ప్రతిఫలం చట్టం స్థానంలో ఇది అమల్లోకి రానుంది. ఈ బిల్లుకు లోక్‌సభ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదిం చిన 24 సవరణల్లో 17 సవరణలను ప్రభుత్వం ఆమోదించిందని మంత్రి గంగ్వార్ తెలిపారు. అయితే, కనీస జీవన పరిస్థితుల ఆధారంగా కనీస వేతనాలను నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాల నుంచి తీసుకోబోమన్నారు. కార్మిక సంఘాలు, యజమానులు, రాష్ట్ర ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించే త్రిసభ్య కమిటీలే కనీస వేతనాలను నిర్ణయిస్తాయన్నారు. అదేవిధంగా, వేతనాల విషయంలో స్త్రీ, పురుష, ట్రాన్స్‌జెండర్లంటూ వివక్ష ఉండబోదన్నారు. వేతన పరిమితితో పనిలేకుండా అన్ని రంగాల కార్మికులకూ కనీస వేతనం సకాలంలో అందేలా నిబంధనలు పొందుపరిచామన్నారు. ప్రస్తుతం ఉన్న వేర్వేరు కార్మిక చట్టాలు వేతనానికి 12 రకాలైన నిర్వచనాలిచ్చాయని, దీంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. తాజా బిల్లుతో ఇటువంటి సమస్యలుండవన్నారు. జూలై 30వ తేదీన ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది. -
‘ఉగ్ర’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: కీలకమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్ట సవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. ఇది చట్ట రూపం దాలిస్తే ఉగ్ర చర్యలతో సంబంధమున్న ఏ వ్యక్తిని అయినా సరే ఉగ్రవాదిగా ప్రకటించడంతోపాటు, అతని ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారాలను విస్తృతం చేసింది. ప్రభుత్వం శుక్రవారం రాజ్యసభలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం–1967 సవరిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు అనుకూలంగా 147 ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్, బీఎస్పీ బిల్లుకు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్‌పై అమిత్ షా విమర్శలు బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు చిదంబరం మాట్లాడుతూ.. చట్ట సవరణకు తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే, తాజా సవరణతో వ్యక్తి స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని, చట్టం దుర్వినియోగం అయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవరణలను కోర్టులు కొట్టేసే అవకాశముందున్నారు. డీఎంకేకు చెందిన రవికుమార్ మాట్లాడుతూ.. మూకదాడి కేసులు, పరువు హత్యల్లో నిందితులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించాలని కోరారు. దీనిపై హోం మంత్రి మాట్లాడుతూ.. ‘గతంలో అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఉగ్రవాదానికి మతం రంగు పులిమింది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్, మక్కా మసీదు పేలుడు ఘటనల్లో ఒక మతానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టింది. దీంతో అసలైన నిందితులు తప్పించు కోగలిగారు. ఈ చట్టాన్ని ఉపయోగించుకునే దేశంలో ఎమర్జెన్సీ విధించడం ద్వారా ప్రతిపక్ష నేతలను జైలుపాలు చేసి, మీడియాపై ఆంక్షలు విధించింది’ అని కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. విదేశాల్లో ఉగ్ర కేసులపైనా ఎన్ఐఏ దేశంతోపాటు విదేశాల్లో ఉగ్ర సంబంధ కేసులపైనా దర్యాప్తు చేపట్టే అధికారం ఎన్ఐఏకు ఇస్తూ కేంద్ర హోం శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం భారతీయులు, భారత్ ఆస్తులపై ఉగ్రదాడులు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, ఆయుధాల రవాణా, తయారీ, దొంగనోట్లకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు చేపట్టే అధికారం ఎన్ఐఏకు ఉంటుంది. ఇలాంటి కేసుల విచారణకు ఢిల్లీలో ప్రత్యేక కోర్టును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ చట్టం–1951 (సవరణ)బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. జలియన్ వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ కమిటీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ట్రస్టీగా ఉండేందుకు ఇకపై వీలుండదు. డ్యామ్ సేఫ్టీ బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకే.. చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చకు హోం మంత్రి అమిత్ షా సమాధానమిస్తూ.. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయడానికే చట్ట సవరణను చేపట్టామన్నారు. ఒక సంస్థను ఉగ్ర సంస్థగా ప్రకటిస్తే అందులోని వ్యక్తులు వేర్వేరు పేర్లతో ప్రమాదకర కార్యకలాపాలను కొనసాగించేందుకు ప్రస్తుత చట్టం వీలు కల్పిస్తోంది. ఇటువంటి వారి చర్యలపై నిఘా వేసేందుకు వీలు లేకుండా పోయింది. ఇలాంటి వ్యక్తులను అడ్డుకునేందుకే తాజాగా సవరణ చేపట్టాం’ అని వివరించారు. ‘ఈ చట్టంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగేందుకు వీలులేకుండా నిబంధనలున్నాయి. నాలుగు దశల్లో పరిశీలన జరిపిన మీదటే ఎవరైనా వ్యక్తులను ఉగ్ర వాదులుగా ప్రకటించేందుకు వీలుంటుంది’ అని తెలిపారు. -
బీజేపీలో కనిపిస్తున్న కొత్త జోష్
-
దివాలా బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: డిఫాల్టయిన సంస్థల ఆస్తుల వేలం ద్వారా వచ్చే నిధుల వినియోగంపై మరింత స్పష్టతనిచ్చేలా దివాలా స్మృతి సవరణల బిల్లు (2019)కి పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే దీనికి రాజ్యసభ ఆమోదం తెలపగా.. తాజాగా లోక్‌సభలో కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. స్మృతిలోని ఏడు సెక్షన్లలో సవరణలు ప్రతిపాదించారు. వీటి ప్రకారం డిఫాల్టయిన సంస్థ ఆస్తుల వేలం ద్వారా వచ్చిన నిధులపై రుణదాతల కమిటీకి పూర్తి అధికారాలు లభించనున్నాయి. ఐబీసీ పరిధిలోకి వచ్చిన కేసులను 330 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. రుణ పరిష్కార ప్రణాళికపై ఎన్నాళ్లలోగా నిర్ణయం తీసుకోవాలి, ఆర్థిక రుణదాతలను ఏ వర్గంగా పరిగణించాలి తదితర నిబంధనలపై ఈ సవరణలతో మరింత స్పష్టత వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) ప్రారంభమైన తర్వాత 330 రోజుల్లోగా కేసు పూర్తి కావాల్సి ఉంటుందని ఆమె వివరించారు. అలాగే రుణ పరిష్కార ప్రణాళిక ఒకసారి ఆమోదం పొందిన తర్వాత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ అధికారిక సంస్థలు కూడా దానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. గృహ కొనుగోలుదారులకు మరిన్ని హక్కులు తాజా సవరణలతో గృహ కొనుగోలుదారులకు మరిన్ని హక్కులు సంక్రమించగలవని నిర్మలా సీతారామన్ చెప్పారు. బిల్డర్ల ఆగడాలతో సతమతమవుతున్న కొనుగోలుదారులకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వివాదాస్పద జేపీ గ్రూప్ సంస్థల నుంచి గృహాలు కొనుగోలు చేసిన వారి సమస్యలు పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. మరోవైపు, దివాలా స్మృతి పనితీరు మిశ్రమంగా ఉందని చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యానించారు. కంపెనీల వేలం..ముఖ్యంగా రియల్టీ వంటి రంగాల సంస్థల విక్రయం వల్ల కష్టార్జితం పెట్టి ఇళ్లు కొనుక్కున్న కొనుగోలుదారులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. -
పోక్సో బిల్లుకు పార్లమెంటు ఓకే
న్యూఢిల్లీ: ‘లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ (పోక్సో) (సవరణ) బిల్లు–2019’ని పార్లమెంటు గురువారం ఆమోదించింది. చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి అత్యంత అరుదైన కేసుల్లో దోషులకు మరణ శిక్ష విధించేందుకు కూడా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. ఈ బిల్లును రాజ్యసభ గత నెల 29నే ఆమోదించగా, లోక్‌సభలో బిల్లు గురువారం పాసయ్యింది. మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఈ బిల్లును ఆమోదం కోసం ప్రవేశపెడుతూ చిన్నారులపై నేరాలను లింగభేదం లేకుండా ఒకేలా చూసేందుకు ఈ బిల్లును తెచ్చామని అన్నారు. ‘చిన్నారులతో నీలి చిత్రాలు’ (చైల్డ్ పోర్నోగ్రఫీ)కి ఈ బిల్లులో నిర్వచనం కూడా చేర్చి, మరిన్ని ఎక్కువ దుశ్చర్యలను నేరం కిందకు వచ్చేలా చేశారు. పార్టీలకు అతీతంగా అనేకమంది ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. దేశంలో 43 కోట్ల మంది చిన్నారులు ఉన్నారనీ, లింగభేదం లేకుండా వారందరికీ న్యాయపరంగా అదనపు భద్రతను ఈ బిల్లు కల్పిస్తుందని ఆమె తెలిపారు. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్లును లోక్‌సభ ఆమోదించింది. నపుంసకులుగా మార్చాలి: కిరణ్ ఖేర్ ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్ఎల్పీ సభ్యుడు హనుమాన్ బేనీవాల్ మాట్లాడుతూ పోక్సో చట్టం కింద దోషులుగా తేలిన వారిని బహిరంగంగా ఉరి తీయాలనీ, అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలనుకునే వారికి భయం కలుగుతుందని డిమాండ్ చేశారు. నేరస్తులకు ఉరిశిక్ష విధించడం సాధ్యం కాకపోతే వారిని నపుంసకులుగా మార్చేలా నిబంధనలు ఉండాలని బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ సూచించారు. -
‘మెడికల్’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: వివాదాస్పద నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లుకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. వైద్య విద్యకు సంబంధించి అతిపెద్ద సంస్కరణగా ప్రభుత్వం అభివర్ణిస్తున్న ఈ బిల్లులో.. అవినీతికి ఆలవాలంగా మారిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పొందుపర్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన తెలుపుతున్నారు. ఈ బిల్లును ‘ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956’కు ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చారు. అన్నాడీఎంకే వాకౌట్ చేయగా మూజువాణి ఓటుతో బిల్లును రాజ్యసభ ఆమోదించింది. లోక్‌సభలో ఇప్పటికే ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. తాజాగా రెండు సవరణలకు లోక్‌సభ ఆమోదం తెలపాల్సి ఉన్న నేపథ్యంలో మరోసారి ఈ బిల్లు లోక్‌సభకు వెళ్లనుంది. బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్.. ‘నకిలీ వైద్యులకు అడ్డుకట్ట వేసేలా ఈ బిల్లు ఉంది. తప్పుడు వైద్య విధానాలకు పాల్పడేవారికి సంవత్సరం జైలుశిక్షతో పాటు, రూ. 5 లక్షల జరిమానా విధించే ప్రతిపాదన బిల్లులో ఉంది. ఇప్పటివరకు అలాంటివారికి ఎంసీఐ నామమాత్రపు జరిమానా మాత్రమే విధించేది’ అని తెలిపారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చిన మూడేళ్లలో నెక్ట్స్(నేషనల్ ఎగ్జిట్ టెస్ట్)ను నిర్వహించడం ప్రారంభిస్తామన్నారు. ఎన్ఎంసీలో రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం లేదన్న ఎంపీల విమర్శలపై స్పందిస్తూ.. మొత్తం 25 మంది సభ్యుల్లో 11 మంది రాష్ట్రాల ప్రతినిధులేనన్నారు. నెక్ట్స్గ్ పరీక్షను మెడికల్ పీజీ ఎంట్రన్స్ పరీక్షగా, అలాగే విదేశాల్లో ఎంబీబీఎస్ చేసినవారికి స్క్రీనింగ్ పరీక్షగా పరిగణిస్తామన్నారు. కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్ల(సీహెచ్‌పీ) వ్యవస్థను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిందని, అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆ వ్యవస్థను అమలు చేస్తున్నాయని, భారత్ కూడా ఆ దిశగా వెళ్తోందని చెప్పారు. ఎన్‌ఎంసీలోని 25 మంది సభ్యుల్లో 21 మంది వైద్యులేనని, వారు సీహెచ్పీల అర్హతలను నిర్ణయిస్తారని హర్షవర్ధన్ వివరించారు. బిల్లును స్థాయీసంఘానికి పంపాలని తృణమూల్ కాంగ్రెస్ సహా పలు పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. వైద్య విద్య అభ్యసించని 3.5 లక్షలమంది నాన్ మెడికల్ సిబ్బందికి ఆధునిక వైద్యం అందించే వైద్యులుగా లైసెన్స్ ఇవ్వాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ వ్యతిరేకించారు. బిల్లులోని ముఖ్యాంశాలు ► ఇప్పటివరకు అమల్లో ఉన్న ఎంసీఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. వందమందికిపైగా సభ్యులు ఉండే ఇందులో 70 శాతం మందిని ఎన్నుకుంటారు. ఇక కొత్తగా వచ్చిన ఎన్ఎంసీలో 25 మందే సభ్యులుగా ఉంటారు. వారిలో అత్యధికుల్ని కేంద్రమే నామినేట్ చేస్తుంది. ► కేంద్రం నియమించిన ఏడుగురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీ ఎన్ఎంసీ చైర్ పర్సన్ పేరుని, తాత్కాలిక సభ్యుల పేర్లను సిఫారసు చేస్తుంది. ► కొత్త కమిషన్‌లో 8 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో నలుగురు వైద్య విద్యకు సంబంధించిన వివిధ బోర్డుల అధ్యక్షులు ఉంటారు. మరో ముగ్గురిని ఆరోగ్యం, ఫా ర్మా, హెచ్ఆర్డీ శాఖలే సిఫారసు చేస్తాయి. ► ఎంసీఐ సమావేశం కావాలంటే వందమందికిపైగా ఉన్న సభ్యుల్లో 15 మంది హాజరైతే సరిపోయేది. వారు తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు అయ్యేవి. జాతీయ వైద్య కమిషన్‌కు సంబంధించి 25 మందిలో 13 మంది హాజరైతేనే కీలక నిర్ణయాలు తీసుకోగలరు. ► ఎన్ఎంసీ సభ్యులందరూ విధిగా తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించాలి. ► ఎంసీఐ కాలపరిమితి అయిదేళ్లయితే ఎన్ఎంసీ కాలపరిమితి నాలుగేళ్లు. తాత్కాలిక సభ్యులు రెండేళ్లకి ఒకసారి మారతారు. ► కమిషన్ చైర్మన్‌ను, అందులో సభ్యుల్ని తొలగించే అధికారం పూర్తిగా కేంద్రానిదే. ► ఎంబీబీఎస్, మెడికల్ పీజీకి సంబంధించి అన్ని ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిట్లీ 50 శాతం సీట్లలో ఫీజుల నియంత్రణ కమిషన్ చేతుల్లోనే ఉంటుంది. ► వైద్య విద్యలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి, మెడికల్ ప్రాక్టీస్ అనుమతికి సంబంధించి ఎంబీబీఎస్ చివరి ఏడాది నిర్వహించే పరీక్షనే అర్హతగా పరిగణిస్తారు. దీనిని నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్ట్స్) పేరుతో నిర్వహిస్తారు. విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించిన విద్యార్థులు భారత్‌లో ప్రాక్టీస్ చేయాలంటే స్క్రీనింగ్ టెస్ట్‌కి హాజరుకావాలి. ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో వైద్యవిద్యనభ్యసించాలంటే ఇకపై నీట్‌తో పాటు గా నెక్ట్స్ పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది. ► దేశంలోని హోమియో, యునాని, ఆయుర్వేదం కోర్సులు చదివిన వారు కూడా ఒక బ్రిడ్జ్ కోర్సు ద్వారా అల్లోపతి వైద్యాన్ని చేయవచ్చు. -
‘జల వివాదాల’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: అంతర్ రాష్ట్ర జల వివాదాలను వేగంగా, ఓ క్రమపద్ధతిలో పరిష్కరించేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల (సవరణ) బిల్లు–2019 బిల్లును లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. బిల్లును కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రవేశపెడుతూ, వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదాలను పరిష్కరించడంలో ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునళ్లు విఫలమయ్యాయనీ, కాబట్టి పరిష్కార విధా నంలో మార్పు అవసరమన్నారు. ఓ కేసులో అయితే 33 ఏళ్లయినా వివాదాన్ని ట్రిబ్యునల్ పరిష్కరించలేకపోయిందని చెప్పారు. కోర్టులు లేదా ట్రిబ్యునళ్లు నీటిని సృష్టించలేవనీ, అందరూ జల సంరక్షణపై దృష్టిపెట్టాలని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలోని జనాభాలో 18 శాతం మంది ఇండియాలోనే ఉన్నారనీ, కానీ ప్రపంచంలోని మంచి నీళ్లలో 4 శాతమే మన దేశంలో ఉండటంతో ఇది తీవ్ర సమస్యగా మారనుందని మంత్రి చెప్పారు. సభలో చర్చ సందర్భంగా కావేరీ జల వివాదంపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సభ్యులు వాగ్వాదానికి దిగడంతో స్పీకర్ ఓం బిర్లా వారిని సముదాయించారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల సభ్యులు మాట్లాడుతూ, రాష్ట్రాలను సంప్రదించేలా ఈ బిల్లులో నిబంధనలు లేవనీ, ఇది సమాఖ్య వ్యవస్థపై దాడి అని అన్నారు. బిల్లులో ఏముంది?: అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం–1956ను సవరించేం దుకు కేంద్రం ఈ బిల్లును తెచ్చింది. వేర్వేరు ధర్మాసనాలతో ఒకే ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయడం, వివాదాలను పరిష్కరించేందుకు ఓ కాలపరిమితి విధించి, కచ్చితంగా ఆ సమయంలోపు సమస్య పరిష్కారమయ్యేలా చూడటం ఈ బిల్లు ప్రత్యేకతలు. సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి ట్రిబ్యునల్‌కు నేతృత్వం వహిస్తారు. అవసరమైనప్పుడు ధర్మాసనాలను ఏర్పాటు చేస్తా రు. వివాదం పరిష్కారమయ్యాక అవి రద్దవుతాయి. గరిష్టంగా రెండేళ్లలోపు వివాదాన్ని ట్రిబ్యునల్ పరిష్కరించాల్సి ఉంటుంది. -
క్షమాపణ చెప్పిన ఆజంఖాన్
న్యూఢిల్లీ: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ రమాదేవిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎంపీ ఆజంఖాన్ వెనక్కి తగ్గారు. సోమవారం ఆయన బీజేపీ ఎంపీ రమాదేవికి సభలో క్షమాపణలు చెప్పారు. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే అలవాటు తనకుందని ఈ సందర్భంగా ఒప్పుకున్నారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా.. రమాదేవికి క్షమాపణ చెప్పాలని ఎంపీ ఖాన్‌ను కోరారు. అందుకే వెంటనే ఖాన్ లేచి..‘పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నా. సభా మర్యాదలు నాకు తెలుసు. నా మాటల వల్ల ఎవరైనా నొచ్చుకుంటే, క్షమాపణ కోరుతున్నా’ అని అన్నారు. అయతే, ఆయన మాటలు తమకు వినిపించక అర్థం కాలేదని, మళ్లీ చెప్పాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు. ఖాన్ పక్కనే ఉన్న ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ లేచి, ఆయన క్షమాపణ చెప్పారని, అందుకు తానే హామీ’ అని తెలిపారు. అయితే, మళ్లీ క్షమాపణ చెప్పాలని ఖాన్‌ను స్పీకర్ కోరారు. దీంతో ఆయన.. రమాదేవి తనకు సోదరి లాంటి వారు. స్పీకర్ మాట కాదని నేనేమీ మాట్లాడలేను. నా మాటలతో ఎవరికైనా బాధ కలిగితే క్షంతవ్యుణ్ని’ అని అన్నారు. అనంతరం ఎంపీ రమాదేవి మాట్లాడుతూ.. ‘ఆజంఖాన్ వ్యాఖ్యలతో యావద్దేశం బాధపడింది. అలాంటి మాటలను వినేందుకు నేను ఈ సభకు రాలేదు’ అని ఆవేదనతో పేర్కొన్నారు. ఆజంఖాన్ సభలోను, వెలుపల కూడా గతంలో పలు మార్లు మహిళలపై అవమానకరంగా మాట్లాడారని, ఆయన పద్ధతులను మార్చుకోవాలని అన్నారు. గురువారం సభలో ట్రిపుల్తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆజంఖాన్ ఉన్న రమాదేవిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. -
ఎన్ఎంసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత వైద్య మండలి(ఎంసీఐ) స్థానంలో జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)ను ఏర్పాటు చేసే బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. దీనివల్ల వైద్య విద్యారంగంలో పారదర్శకత ఏర్పడుతుందనీ, అనవసరమైన తనిఖీల ప్రహసనం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో ఏకీకృత విధానాలను తీసుకురానున్నారు. ఇందులోభాగంగా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షను పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పరీక్షగా పరిగణిస్తారు. అలాగే విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి భారత్‌లో పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థుల కోసం ఓ స్క్రీనింగ్ టెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఈ స్క్రీనింగ్ పరీక్షకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్(నెక్టŠస్)గా నామకరణం చేశారు. ఎన్ఎంసీ చట్టం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాల్లో 50 శాతం సీట్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు అందుతాయని ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన మూడేళ్ల లో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్‌ను నిర్వహిస్తామన్నారు. పోంజి బిల్లుకు ఆమోదం: చిట్‌ఫండ్ పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టే ‘అనియంత్రిత డిపాజిట్ స్కీంల నిషేధ’ బిల్లును సోమవారం పార్లమెంట్ ఆమోదించింది. పేద డిపాజిటర్ల సొమ్ముకు రక్షణ కల్పించడం, వసూలు చేసిన డబ్బును తిరిగిచ్చేలా చూడటం ఈ బిల్లు ఉద్దేశం. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే చట్ట విరుద్ధంగా వసూళ్లకు పాల్పడిన వారికి జరిమానా, జైలుశిక్ష పడనున్నాయి. ఈ విషయమై ఆర్థికమంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ..‘ ‘చట్టంలోని లొసుగుల ఆధారంగా కొందరు వ్యక్తులు నిరుపేదలకు భారీవడ్డీ ఆశచూపి నగదును వసూలుచేస్తున్నారు. తాజా బిల్లులో పోంజి పథకంతో పాటు స్నేహితులు, పరిచయస్తులు, బంధువుల నుంచి వసూలు చేసే రియల్‌ఎస్టేల్ సంస్థలపైనా చర్యలు తీసుకునేలా నిబంధనలు చేర్చాం. సంబంధిత వ్యక్తులకు ఏడా ది నుంచి పదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.2 లక్షల నుంచి రూ.50 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు. పోంజి స్కీమ్‌లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 978 కేసులు నమోదు కాగా, వీటిలో 326 కేసులో పశ్చిమబెంగాల్లోనే నమోదయ్యాయి’ అని తెలిపారు. ఈ బిల్లును లోక్‌సభ జూలై 24న ఆమోదించింది. ‘ఉన్నావ్’ ప్రమాదంపై సభలో రగడ.. ఉన్నావ్ రేప్ బాధితురాలి కారును ఓ లారీ అనుమానాస్పద రీతిలో ఢీకొట్టడంపై ప్రతిపక్షాల ఆందోళనలతో రాజ్యసభ దద్దరిల్లింది. ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బాధితురాలిని చంపే ప్రయత్నం జరిగింద ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులు యాదవ్‌కు మద్దతుగా నినాదాలు చేయడంతో రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదాపడింది. -
ఆర్టీఐ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టానికి కేంద్రం తీసుకొచ్చిన సవరణల బిల్లును రాజ్యసభ గురువారం ఆమోదించింది. ‘సమాచార హక్కు (సవరణ) బిల్లు–2019’ని లోక్‌సభ సోమవారమే ఆమోదించగా, తాజాగా రాజ్యసభ కూడా ఆమోదించడంతో ఆ బిల్లు పార్లమెంటులో గట్టెక్కింది. అయితే ఈ బిల్లును క్షుణ్నంగా పరిశీలించేందుకు ఎంపిక కమిటీకి పంపాల్సిందేనని రాజ్యసభలో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు పట్టుబట్టడంతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరకు బిల్లును ఎంపిక కమిటీకి పంపాలా? వద్దా? అనే విషయంపై ఓటింగ్ నిర్వహించగా, ఆ ఓటింగ్ సమయంలో తమకు అనుకూలంగా ఓటు వేయాల్సిందిగా ఎంపీలను మంత్రులు, అధికార పార్టీ సభ్యులు భయపెట్టేందుకు ప్రయత్నించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేశ్, ఓటు రశీదులను తీసుకెళ్లి సభ్యుల చేత వాటిపై సంతకాలు చేయిస్తుండటం కనిపించడంతో ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రతిస్పందించాయి. విపక్ష సభ్యులు సీఎం రమేశ్‌తో గొడవకు దిగి, ఆయన చేతుల్లో నుంచి ఆ రశీదులను లాక్కునేందుకు కూడా ప్రయత్నించారు. అధికార పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లను ఎలా గెలిచిందో మనకు సభలోనే సాక్ష్యం కనిపిస్తోందని రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్ అన్నారు. సీఎం రమేశ్ చర్యను వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులంతా వెల్‌లోకి వచ్చి ఆందోళనలు చేస్తూ నిరసన తెలిపారు. సిబ్బంది, శిక్షణ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఆర్టీఐ చట్టంలో గతంలో ఉన్న లోటుపాట్లను తమ ప్రభుత్వం సరిచేస్తోందని చెప్పుకొచ్చారు. అయితే ఆజాద్ మాట్లాడుతూ ‘మీరు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు. మీ మీద మాకు నమ్మకం లేదు. కాబట్టి మేం బయటకు వెళ్లిపోతున్నాం’ అని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ మాట్లాడుతూ సమాచార కమిషనర్లు గతంలో ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా పలు తీర్పులు ఇచ్చినందున, ఇప్పుడు మోదీ సమాచార కమిషన్‌పై పగ తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌తోపాటు తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీ తదితర ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును, సభలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ బయటకు వెళ్లిపోయాయి. అనంతరం ఓట్లు లెక్కపెట్టగా, బిల్లును ఎంపిక కమిటీకి పంపవద్దని 117 ఓట్లు, పంపాలని 75 ఓట్లు వచ్చినట్లు తెలిసింది. దీంతో విపక్ష సభ్యులెవరూ సభలో లేకపోవడంతో సవరణ బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) సహా సమాచార కమిషనర్లందరి పదవీ కాలం, వేతనాలను కేంద్రమే నిర్ణయించేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. -
‘ట్రిపుల్ తలాక్’కు లోక్‌సభ ఓకే
న్యూఢిల్లీ: ముస్లిం మతస్తులు పాటిస్తున్న ట్రిపుల్ తలాక్ సంప్రదాయాన్ని శిక్షార్హం చేస్తూ రూపొందించిన బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదముద్ర వేసింది. ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో కేంద్రం ముస్లిం మహిళల(వివాహ హక్కుల రక్షణ) బిల్లు–2019ను తీసుకొచ్చింది. కాగా, ఈ బిల్లును ప్రతిపక్ష కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే ఇతర పార్టీలు వ్యతిరేకించాయి. ఈ బిల్లును పరిశీలించేందుకు వీలుగా స్థాయీ సంఘానికి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా, కేంద్రం అంగీకరించలేదు. ఈ సందర్భంగా ఇటు బీజేపీ, అటు విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టరాదన్న ప్రతిపక్షాల డివిజన్‌ను 302–82 తేడాతో లోక్‌సభ తిరస్కరించింది. అలాగే ట్రిపుల్ తలాక్ చెప్పే ముస్లిం పురుషులకు మూడేళ్లవరకూ జైలుశిక్ష విధించే సవరణకు లోక్‌సభ 302–78 మెజారిటీతో ఆమోదం తెలిపింది. ఈ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని బీజేపీ తమ ఎంపీలకు విప్ జారీచేసింది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై స్పందించేందుకు మహిళా ఎంపీలైన పూనమ్ మహాజన్, అపరజితా సేన్, మీనాక్షి లేఖీలను మోహరించింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన పలు సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. 16వ లోక్‌సభ ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించినప్పటికీ రాజ్యసభలో ఆమోదం పొందకపోవడం, ఆర్డినెన్స్ గడువు ముగిసిపోవడంతో కేంద్రం మరోసారి బిల్లును ప్రవేశపెట్టింది. మొహమ్మద్ ప్రవక్తే వ్యతిరేకించారు.. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చాక కూడా ట్రిపుల్ తలాక్ కేసులు నమోదయ్యాయని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘2017, జనవరి నుంచి ఇప్పటివరకూ 574 ట్రిపుల్ తలాక్ కేసులు నమోదుకాగా, ఆర్డినెన్స్ జారీచేశాక 101 కేసులు నమోదయ్యాయి. వరకట్న వేధింపుల నిరోధక చట్టం లేదా గృహహింస చట్టం కింద హిందువులు, ముస్లింలు జైలుకు వెళితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ట్రిపుల్ తలాక్ విషయంలోనే అభ్యంతరాలు ఎందుకు? ట్రిపుల్ తలాక్‌ను నియంత్రించేందుకే ఇందులో మూడేళ్ల జైలుశిక్షను చేర్చాం. ఈ ఆచారాన్ని మొహమ్మద్ ప్రవక్త కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లును ఆపేయాలన్న దురుద్దేశంతోనే స్థాయీ సంఘానికి పంపాలని ప్రతిపక్షాలు అంటున్నాయి. ట్రిపుల్ తలాక్‌పై 20 ఇస్లామిక్ దేశాల్లో నియంత్రణ ఉంది. భారత్‌లాంటి లౌకికవాద దేశంలో ఎందుకుండకూడదు?’ అని ప్రశ్నించారు. ఈ బిల్లును మహిళల ఆత్మగౌరవం, లింగ సమానత్వం కోసమే తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. ముస్లిం పురుషులే లక్ష్యం: కాంగ్రెస్ ట్రిపుల్ తలాక్‌కు జైలుశిక్ష పడేలా చట్టాన్ని తీసుకురావాలని సుప్రీంకోర్టు చెప్పలేదని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ తెలిపారు. ముస్లిం మహిళలతో పాటు భర్తలు వదిలేసిన హిందూ, పార్సీ మహిళలకు కూడా రక్షణ కల్పించాలని కోరారు. ముస్లింలతో పోల్చుకుంటే హిందువుల్లో విడాకుల కేసులు ఎక్కువని మరో కాంగ్రెస్ నేత మొహమ్మద్ జాఫ్రి చెప్పారు. ముస్లిం పురుషులను జైలుకు పంపించడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాక్ అన్నది అనాగరికమేననీ, అయితే కేంద్రం తెచ్చిన బిల్లుపై తాము సుముఖంగా లేమని సీపీఎం నేత ఏ.ఎం.షరీఫ్ అన్నారు. డిప్యూటీ స్పీకర్‌పై ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు వివాదాలకు కేరాఫ్‌గా మారిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత ఆజంఖాన్ గురువారం నోరు జారారు. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రమాదేవిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఆజంఖాన్ మాట్లాడుతుండగా, కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు. సహనం కోల్పోయిన ఆజంఖాన్ నఖ్వీవైపు చూస్తూ..‘మీరు అటూఇటూ కాని మాటలు మాట్లాడవద్దు’ అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రమాదేవి స్పందిస్తూ..‘మీరు కూడా అటూఇటూ చూడకుండా స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించి మాట్లాడండి’ అని కోరారు. వెంటనే ఆజంఖాన్ రమాదేవిని ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో సభలో గందరగోళం చెలరేగింది. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేయగా, ఆజంఖాన్ తిరస్కరించారు. రమాదేవి తనకు సోదరిలాంటివారనీ, తప్పుగా మాట్లాడుంటే రాజీనామా చేసేందుకైనా సిద్ధమన్నారు. ఆయన వ్యాఖ్యలను డెప్యూటీ స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. మరోవైపు ఆజంఖాన్‌కు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ మద్దతుగా నిలిచారు. ఆజంఖాన్ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ ఖండించింది. వివాహవ్యవస్థ నాశనమవుతుంది: ఒవైసీ కేంద్రం తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లును ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా తప్పుపట్టారు. ‘ఇస్లామ్‌లో 9 రకాల తలాక్ పద్ధతులు ఉన్నాయి. ఒకవేళ ఈ చట్టం ప్రకారం ముస్లిం భర్త జైలుకు వెళితే ఆయన భార్య పోషణను ఎవరు చూసుకోవాలి? మీరు(కేంద్ర ప్రభుత్వం) వివాహ వ్యవస్థనే నాశనం చేయాలనుకుంటున్నారు. ముస్లిం మహిళలను రోడ్డుపై పడేయాలనుకుంటున్నారు. ముస్లిం మహిళల హక్కులపై అంత ప్రేమున్న బీజేపీ ప్రభుత్వం 2013 ముజఫర్‌పూర్ అల్లర్లలో అత్యాచారాలకు గురైన ముస్లిం మహిళలకు ఎందుకు న్యాయం చేయట్లేదు. ఈ అకృత్యాలకు సంబంధించి ఇప్పటివరకూ దోషులకు శిక్షపడలేదు. జల్లికట్టును నిషేధిస్తూ చట్టాన్ని తెచ్చిన మీరు ముస్లింల మూకహత్యలను నిరోధిస్తూ చట్టం తీసుకురావడంలో మాత్రం విఫలమయ్యారు. మహిళల హక్కులపై నిజంగా బీజేపీకి అంత ప్రేముంటే ప్రత్యేక విమానంలో తమ మహిళా ఎంపీలను శబరిమలకు తీసుకెళ్లాలి’ అని ఒవైసీ చురకలు అంటించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రస్థానం ► 2016, ఫిబ్రవరి 5: ట్రిపుల్ తలాక్, నిఖా హలా ల, బహుభార్యత్వాల రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లలో కక్షిదారులకు సహకరించాల్సిందిగా సుప్రీం కోర్టు అప్పటి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గిని కోరింది. ► మార్చి 28: మహిళలకు సంబంధించి పెళ్లి, విడాకులు తదితర అంశాలపై అతున్నత స్థాయి కమిటీ నివేదికను సమర్పించాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ► అక్టోబర్ 7: ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. లైంగిక సమానత్వం, లౌకికవాదం ఆధారం గా ఈ ట్రిపుల్ తలాక్‌పై పరిశీలన జరపాలని కోరింది. ► 2017, ఫిబ్రవరి 16: ట్రిపుల్ తలాక్, నిఖా హలాల పిటిషన్లపై విచారణ జరపడానికి సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ► మార్చి 27: ట్రిపుల్ తలాక్ విషయం న్యాయస్థానం పరిధిలోకి రాదని, ఆ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోడానికి వీల్లేదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీం కోర్టుకు తెలిపింది. ► మే 18: ట్రిపుల్ తలాక్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వు చేసింది. ► ఆగస్టు 22: ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.ఐదుగురు న్యాయమూర్తుల్లో ముగ్గురు దీన్ని చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై చట్టం చేయాలని ధర్మాసనం కేంద్రానికి సూచించింది. ► డిసెంబర్: ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ రూపొందించిన ‘ముస్లిం మహిళల బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ► 2018, ఆగస్టు 9: కేంద్రం ట్రిపుల్ తలాక్ బిల్లుకు సవరణలు చేసింది. నిందితులకు బెయిలు పొందే అవకాశం కల్పిస్తూ ఈ సవరణలు చేశారు. ► ఆగస్టు 10: ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.అయితే, బిల్లు సభ ఆమోదం పొందలేదు. ► సెప్టెంబర్ 19: ట్రిపుల్ తలాక్‌పై రూపొందిం చిన ఆర్డినెన్సును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా, మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా ఈ ఆర్డినెన్సును రూపొందించారు. ► డిసెంబర్ 31: రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును మళ్లీ ప్రతిపక్షం అడ్డుకుంది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండు చేసింది. -
ట్రంప్‌తో భేటీలో కశ్మీర్ ప్రస్తావనే లేదు
న్యూఢిల్లీ: జపాన్‌లో జరిగిన జీ–20 సమావేశాల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ అయినప్పుడు కశ్మీర్ ప్రస్తావనే రాలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. కశ్మీర్ వివాదంపై భారత్, పాక్‌ల మధ్యలోకి మూడో దేశం మధ్యవర్తిత్వం కుదరదని ఆయన తెలిపారు. కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం చేయాల్సిందిగా మోదీ తనను కోరారంటూ సోమవారం ట్రంప్ చెప్పడంతో దేశంలో రాజకీయ దుమారం రేగడం తెలిసిందే. ఈ విషయంపై స్వయంగా మోదీనే సమాధానం చెప్పాలని ప్రతిపక్ష కాంగ్రెస్, డీఎంకే తదితర పార్టీలు డిమాండ్ చేస్తూ బుధవారం లోక్‌సభలో ఆందోళనలు చేపట్టాయి. దీంతో ఆ విషయంపై చర్చించేందుకు స్పీకర్ ఓం బిర్లా సమయం ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన అనంతరం, వారికి సమాధానం చెప్పేందుకు లోక్‌సభ ఉప నాయకుడు రాజ్‌నాథ్ సింగ్ లేచిన వెంటనే విపక్షం మళ్లీ ఆందోళనకు సిద్ధమైంది. మోదీనే వచ్చి రెండు సభల్లోనూ సమాధానం చెప్పాలంటూ సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం రాజ్‌నాథ్ మాట్లాడుతూ కశ్మీర్ దేశానికి గర్వకారణమనీ, ఈ విషయంలో మధ్యవర్తిత్వానికి అవకాశమే లేదని చెప్పారు. ట్రంప్‌తో భేటీలో మోదీ అస్సలు కశ్మీర్ గురించి మాట్లాడిందే లేదనీ, ఇక మధ్యవర్తిత్వం ప్రస్తావన ఎక్కడినుంచి వస్తుందని ఆయన ప్రశ్నించారు. -
‘ఉగ్ర’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉగ్రవాదులుగా నిర్ధారించేలా చట్టానికి సవరణలు చేసేందుకు ప్రభుత్వం తెచ్చిన బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. ఈ సవరణలపై ప్రతిపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేయగా, ప్రభుత్వ నిర్ణయాన్ని హోం మంత్రి అమిత్ షా గట్టిగా సమర్థించారు. ఉగ్రవాదుల కన్నా దర్యాప్తు సంస్థలు నాలుగడుగులు ముందుండాలంటే ఈ సవరణలు కచ్చితంగా అవసరమేనని ఆయన పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (సవరణ బిల్లు)–2019పై లోక్‌సభలో జరిగిన చర్చలో అమిత్ షా మాట్లాడారు. ఈ బిల్లుపై ఓటింగ్‌లో పాల్గొనకుండా ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులంతా బయటకు వెళ్లిపోవడంపై అమిత్ షా స్పందిస్తూ ‘మీ ఓటు బ్యాంకును కాపాడుకోడానికి మీరు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఓటింగ్‌కు దూరంగా వెళ్లిపోతున్నారు. దీనికి మేం ఏం చేయగలం?’ అన్నారు. సవరణ బిల్లుకు ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. ఈ చట్టంతో సమాఖ్య వ్యవస్థను నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం అనడంపై అమిత్ షా స్పందిస్తూ ‘సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని 1967లో నాటి ప్రధాని ఇందిర ప్రభుత్వమే తెచ్చింది. అంటే సమాఖ్య స్ఫూర్తి కాంగ్రెస్ వల్లే, ఆనాడే దెబ్బతిన్నది’ అంటూ ఎదురుదాడి చేశారు. ఈ చట్టానికి తెచ్చిన సవరణలను, చట్టాన్ని తాము దుర్వినియోగం చేయబోమనీ, కేవలం ఉగ్రవాదాన్ని వేళ్లతో సహా పెకలించేందుకే దీనిని ఉపయోగిస్తామని ఆయన తెలిపారు. అలాగే కొంతమంది వ్యక్తులు సిద్ధాంతాల పేరుతో పట్టణ మావోయిజాన్ని ప్రోత్సహిస్తున్నారనీ, అలాంటి వారిపై ప్రభుత్వం ఎంతమాత్రమూ దయ చూపదని అమిత్ షా స్పష్టం చేశారు. ఒవైసీ ఒత్తిడితో నాటకీయ పరిణామాలు సవరణ బిల్లును ఆమోదించడానికి ఓటింగ్ జరపాలంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పట్టుబట్టడంతో సభలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం తెచ్చిన సవరణలను వ్యతిరేకిస్తూ అప్పటికే వివిధ ప్రతిపక్ష పార్టీలు బయటకు వెళ్లిపోయాయి. ప్రతిపక్ష సభ్యుల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఇలాంటి సమయంలోనూ బిల్లును ఆమోదించడానికి ముందు ఓటింగ్ నిర్వహించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. దీంతో ఆయన అనవసరంగా సభా సమయాన్ని వృథా చేస్తున్నారంటూ ఇతర సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒవైసీ దూకుడుగా సమాధానమిస్తూ ‘ఓటింగ్ కోరడం నా హక్కు. అభ్యంతరం తెలపడానికి, అడ్డుకోవడానికి మీరెవరు?’ అని అన్నారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. 287 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేయగా, 8 మంది వ్యతిరేకించారు. ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలపై కూడా ఓటింగ్ నిర్వహించాలని ఒవైసీ పట్టుబట్టగా..నిబంధనలను ప్రస్తావిస్తూ సభ్యులను నిల్చోబెట్టి సమర్థిస్తున్న వారెంత మంది, వ్యతిరేకిస్తున్న వారెంత మంది అని స్పీకర్ లెక్కించారు. అనంతరం బిల్లు ఆమోదం పొందింది. అనంతరం ఒవైసీ మాట్లాడుతూ ‘నేను ప్రభుత్వం మొత్తాన్నీ నిల్చొనేలా చేశాను’ అని వ్యాఖ్యానించగా, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడేందుకు మేం సిద్ధమే. ఇప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిల్చున్నాం’ అని అన్నారు. సవరణ బిల్లులో ఏముంది? ‘ఉగ్రవాద, వినాశక కార్యకలాపాల నిరోధక చట్టం’ (టాడా), ‘ఉగ్రవాద నిరోధక చట్టం’ (పొటా)లకు మార్పులు చేస్తూ ఈ ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (సవరణ)’ బిల్లులను కేంద్రం తెచ్చింది. ఈ సవరణలు ఏం చెబుతున్నాయంటే.. ► ఉగ్రవాదానికి పాల్పడిన లేదా ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్న, ఉగ్రవాద హింసాకాండకు ఏర్పాట్లు చేసిన, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన, ఉగ్రవాదానికి ఇతరత్రా సహకారం అందించిన వ్యక్తులు, సంస్థలను ఈ చట్టం కింద ఉగ్రవాదులుగా లేదా ఉగ్రవాద సంస్థలుగా కేంద్రం ప్రకటించవచ్చు. ► ప్రస్తుత చట్టం ప్రకారం ఉగ్రవాద కేసులను దర్యాప్తు చేసే అధికారి.. నిందితుల ఆస్తులను జప్తు చేయాలంటే ముందుగా పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) అనుమతి తీసుకోవలసి ఉంది. తాజా సవరణల ప్రకారం.. కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారి దర్యాప్తు చేస్తున్న పక్షంలో ఆస్తుల జప్తుకోసం డీజీపీ అనుమతి కాకుండా, ఎన్ఐఏ డీజీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అదే కేసులను పోలీసులే దర్యాప్తు చేస్తుంటే డీజీపీ అనుమతి అవసరం. ► ప్రస్తుత చట్టం ప్రకారం ఉగ్రవాద కేసులను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ), అసిస్టెంట్ పోలీసు కమిషనర్ (ఏసీపీ), పై స్థాయి అధికారులు మాత్రమే దర్యాప్తు చేయాలి. తాజా సవరణల ప్రకారం ఎన్ఐఏలోని ఇన్స్పెక్టర్ లేదా ఆ పై స్థాయి అధికారులు కూడా దర్యాప్తు చేపట్టవచ్చు. ► ప్రస్తుత చట్టానికి అనుబంధంగా తొమ్మిది అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాల పరిధిలోకి వచ్చే కార్యకలాపాలను ఉగ్రవాద చర్యలుగా నిర్ణయిస్తున్నారు. ప్రస్తుత సవరణ కింద ఆ ఒప్పందాలతో పాటుమరో ఒప్పందాన్ని(ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ సప్రెషన్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ న్యూక్లియర్ టెర్రరిజం–2005) కూడా చేర్చారు. ఇక నుంచి ఈ పది ఒప్పందాల పరిధిలోకి వచ్చే కార్యకలాపాలను ఉగ్రవాద కార్యకలాపాలుగా పేర్కొంటారు. నేడు లోక్‌సభకు ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో గురువారం ఆమోదించాల్సిన బిల్లుల జాబితాలో వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును కూడా కేంద్రం చేర్చింది. ఆ సమయంలో కచ్చితంగా సభలో ఉండాలంటూ తమ ఎంపీలకు అధికార బీజేపీ ఇప్పటికే విప్ కూడా జారీ చేసింది. ఉన్నట్టుండి, ఏకకాలంలో ముమ్మారు తలాక్ చెప్పి భార్యలకు విడాకులిచ్చే ముస్లిం పురుషులను జైలుకు పంపేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ బిల్లును పరిశీలన కోసం పార్లమెంటరీ కమిటీకి పంపాల్సిందేనని పట్టుబడుతున్నాయి. దీంతో తనకున్న భారీ సంఖ్యబలంతో లోక్‌సభలో కేంద్రం ఈ బిల్లును ఆమోదింపజేసుకున్నా, రాజ్యసభలో మాత్రం ప్రభుత్వానికి తిప్పలు తప్పేలా లేవు. పార్లమెంటు సమాచారం ► ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ప్రసాద్ లోక్‌సభలో తెలిపారు. న్యాయ శాఖ పరిధిలోని టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వరంగ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే వీటిని తయారుచేస్తున్నాయని స్పష్టం చేశారు. ► పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగ్లా’గా మార్చేందుకు రాజ్యాంగానికి సవరణ చేసే ప్రతిపాదన ఏదీ లేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో చెప్పారు. రాష్ట్రాల పేర్లు మార్చాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని ఆయన అన్నారు. బంగ్లా పేరు బంగ్లాదేశ్‌కు దగ్గరగా ఉన్నందున, పేరు మార్చడాన్ని కేంద్రం తిరస్కరిస్తోందన్నారు. ► కశ్మీర్ యువత ఉగ్రవాదంవైపు వెళ్లడం 40 శాతం తగ్గిందని హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభలో వెల్లడించారు. సరిహద్దు చొరబాట్లు 43 శాతం, ఉగ్ర చర్యలు 28 శాతం తగ్గాయన్నారు. యూపీఏ –2లో పోలిస్తే మావోయిస్టుల దాడులు 43 శాతం తగ్గాయని వెల్లడించారు. ► మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, సంఘపరివార్ నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్‌ల మృతిపై ప్రత్యేక విచారణ జరిపే ఆలోచనేదీ లేదని మంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభలో తెలిపారు. ► భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న చైనా, నేపాల్, భూటాన్ సరిహద్దుల్లో కంచె నిర్మించే ప్రతిపాదనేమీ లేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో తెలిపారు. భద్రతా చర్యలు పక్కాగా తీసుకుంటుండడంతో సరిహద్దు చొరబాట్లు పూర్తిగా తగ్గిపోయాయన్నారు. ఇండో–పాక్ సరిహద్దులో 2069 కిలోమీటర్లకుగాను 2004 కిలోమీటర్ల కంచె పూర్తయిందన్నారు. ఇండో–బంగ్లా సరిహద్దులో 3326 కిలోమీటర్లకుగాను 2803 కిలోమీటర్ల కంచె పూర్తయిందని వెల్లడించారు. ► మూడేళ్లలో ఇస్రో వాణిజ్య విభాగం ద్వారా 239 శాటిలైట్లను ప్రయోగించి, రూ. 6,289 కోట్లు ఆర్జించినట్లు ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయమంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో తెలిపారు. ► భారత స్వతంత్ర సమరయోధుడు నేతాజీకి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని రష్యా వెల్లడించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ లోక్‌సభలో తెలిపారు. 2014 నుంచి ఈ విషయమై రష్యాను అడుగుతూనే ఉన్నామని ఆయన తెలిపారు. ► విదేశాల్లో ఉంటున్న భారతీయుల సమస్యలను తీర్చడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ లోక్‌సభలో తెలిపారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు 2015 ఫిబ్రవరి నుంచి 2019 జూలై 18 వరకు 50,605 సమస్యలను నమోదు చేసుకోగా 44,360 సమస్యలను (దాదాపు 90 శాతం) తీర్చామన్నారు. అందులో 36,805 సమస్యలు గల్ఫ్ దేశాల నుంచే వచ్చాయన్నారు. ఎమ్‌ఏడీఏడీ పోర్టల్ ద్వారా సమస్యలను నమోదు చేయవచ్చన్నారు. -
ఆర్టీఐ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీల తీవ్ర అభ్యంతరాల నడుమ సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం సవరణ బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)తోపాటు సమాచార కమిషనర్లందరి పదవీ కాలాన్ని, వేతనాన్ని నిర్ణయించే అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం సమాచార కమిషనర్లుగా నియమితులైన వ్యక్తులు ఐదేళ్ల కాలం పాటు లేదా వారికి 65 ఏళ్ల వయసు నిండే వరకు (ఏది ముందైతే అది) ఆ పదవిలో ఉంటున్నారు. అలాగే ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ)కు ఇస్తున్నంత వేతనమే సీఐసీకి, ఎన్నికల కమిషనర్లకు ఇస్తున్నంత వేతనమే సమాచార కమిషనర్లకు కూడా ఇస్తున్నారు. ఈ రెండు నిబంధనలను మార్చి, సీఐసీ సహా సమాచార కమిషనర్లందరి పదవీ కాలాన్ని, వేతనాన్ని నిర్ణయించే అధికారాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకునేలా సవరణ బిల్లు ఉంది. దీంతో సమాచార హక్కు చట్టాన్నే నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేసిందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. తాము చెప్పిన మాట వినని సమాచార కమిషనర్లను వెంటనే సాగనంపేందుకు, సమాచార కమిషన్‌ను కూడా తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు, దాని స్వతంత్రతను దెబ్బతీసేందుకే కేంద్రం ఈ సవరణ బిల్లును తీసుకొచ్చిందనీ, లేకపోతే ఇప్పుడు ఈ సవరణలతో పనేంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్షాల అభ్యంతరాల కారణంగా లోక్‌సభలో స్పీకర్ ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. 218 మంది సభ్యులు అనుకూలంగా, 79 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు. అనంతరం విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడంతో మూజు వాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. మోదీ విద్యార్హతలు చెప్పమన్నందుకేనా? బిల్లుపై చర్చను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీఐ వ్యవస్థను నీరుగార్చేందుకు కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఈ బిల్లును తెచ్చిందనీ, కేంద్రం దీనిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాక్షేత్రంలో ఎలాంటి చర్చా జరగకుండానే కేంద్రం ఈ బిల్లును తెచ్చిందనీ, ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హత వివరాలు చెప్పాల్సిందేనని గతంలో ఓ సమాచార కమిషనర్ పీఎంవోను ఆదేశించినందున, వారి అధికారాలకు కోత పెట్టేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారా అని శశిథరూర్ ప్రశ్నించారు. ప్రతిపక్ష డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎంలతోపాటు బిజూ జనతా దళ్ వంటి పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకించాయి. లోక్‌సభలో తనకున్న 303 మంది ఎంపీల బలాన్ని చూసుకుని ఆర్టీఐ స్ఫూర్తినే కేంద్రం చంపేస్తోందని కార్తీ చిదంబరం అన్నారు. ఆర్టీఐ వ్యవస్థ కోరలు పీకి, సమాచార కమినర్లను తమ ఇళ్లలో పని వాళ్లలా మార్చుకోవాలని కేంద్రం చూస్తోందని డీఎంకే ఎంపీ ఎ.రాజా వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఇతర సమాచారం.. ► భారత వైద్య మండలి (ఎంసీఐ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభలో ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రవేశపెట్టారు. ► అనేక బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుత పార్లమెంటు సమావేశాలను మరో వారం రోజులపాటు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మంగళవారం జరిగే బీఏసీ సమావేశంలో దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోనున్నారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం రానున్న శుక్రవారంతో పార్లమెంటు సమావేశాలు ముగియాల్సి ఉంది. బిల్లుపై కేంద్రం మాట.. స్వతంత్ర భారతంలో అత్యంత విజయవంతమైన చట్టాల్లో సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం ఒకటి. తమకు అవసరమైన సమాచారం కోసం ప్రభుత్వాధికారుల్ని ప్రశ్నించగలిగే అధికారాన్ని ఈ చట్టం సామాన్యులకు ఇస్తోంది. ప్రస్తుతం ఈ చట్టం కింద ఏడాదికి దాదాపు 60 లక్షల దరఖాస్తులు దాఖలవుతున్నాయి. అయితే తాజాగా కేంద్రం తెచ్చిన సవరణలతో ఆర్టీఐ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి పోయి, అది నిర్వీర్యం అవుతుందని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనికి కేంద్రం సమాధానం చెబుతూ విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా తామేమీ చేయడం లేదనీ, కేవలం ఆ చట్టంలోని కొన్ని లోటుపాట్లను మాత్రమే సరిచేస్తున్నామంటోంది. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్ధ కాగా, ఆర్టీఐ వ్యవస్థ శాసనం ద్వారా ఏర్పాటైంది. అయితే వేతనాలు మాత్రం ఎన్నికల కమిషనర్లు, సమాచార కమిషనర్లకు ఒకేలా ఉండటంతో దానిని తాము హేతుబద్ధీకరిస్తున్నామని అంటోంది. అలాగే ప్రస్తుతం కేంద్ర సీఐసీకి సుప్రీంకోర్టు జడ్జితో సమానమైన హోదా ఇస్తున్నప్పటికీ, సీఐసీ ఇచ్చిన తీర్పులను హైకోర్టులో సవాలు చేసే వీలు ఉండటం సమంజసంగా లేదనీ, ఇలాంటి లోటుపాట్లను సవరించడమే తాజా బిల్లు ఉద్దేశమని ప్రభుత్వం వివరిస్తోంది. -
భారత సంకల్పానికి నిదర్శనం
న్యూఢిల్లీ: చంద్రయాన్–2 ప్రయోగం మన శాస్త్రవేత్తల శక్తిసామర్థ్యాలను, శాస్త్రరంగంలో కొత్త లక్ష్యాలను సాధించాలన్న 130 కోట్ల మంది దేశ ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని ట్విట్టర్ ద్వారా ఈ ప్రయోగంలో పాలు పంచుకున్నవారందరికీ ఆడియో మెసేజ్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రయాన్–1 ప్రయోగంలో ఏర్పడిన అవాంతరాలను శాస్త్రవేత్తలు అధిగమించారు. ఈ ప్రయోగం ద్వారా వారి పట్టుదల, సంకల్పం మరోసారి రుజువయ్యాయి. ప్రతి భారతీయుడు ఎంతో గర్వపడుతున్నాడు’ అని పేర్కొన్నారు. ‘ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు కొత్త ఉత్సాహం వచ్చింది. చంద్రుని గురించిన మరెన్నో విషయాలు తెలిసే అవకాశాలున్నాయి..ఇప్పటి వరకు ఎవరూ చేపట్టని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువప్రాంతంపై అధ్యయనం జరగనుంది. ఘనమైన మన దేశ చరిత్రలో ఇది చాలా ప్రత్యేకమైన సమయం’ అని పేర్కొన్నారు. భారీ టీవీ స్క్రీన్‌పై చంద్రయాన్–2 ఉపగ్రహం ప్రయోగాన్ని తిలకిస్తున్నట్లు ఉన్న తన ఫొటోలను కూడా ప్రధాని జత చేశారు. ట్విట్టర్ ఆడియో సందేశంలో ప్రధాని.. ఇస్రో చైర్మన్ కె.శివన్‌తోపాటు శాస్త్రవేత్తల బృందానికి ప్రధాని అభినందనలు తెలిపారు. నైపుణ్యం, సామర్థ్యం, ఆత్మవిశ్వాసం కలిగిన మన శాస్త్రవేత్తలు ఎలాంటి సవాల్‌నైనా స్వీకరిస్తారనేందుకు ఇది గొప్ప ఉదాహరణ అని తెలిపారు. ‘సవాల్ ఎంత పెద్దదైతే, పట్టుదల కూడా అంతే ఉంటుంది. ప్రయోగం వారం ఆలస్యమైనా సరే, చంద్రయాన్–2 చంద్రుని చేరాలనే లక్ష్యం మాత్రం మారలేదు. ఈ ప్రయోగం ద్వారా చంద్రునిపైకి మొట్టమొదటి భారతీయ ఉపగ్రహం చేరనుంది. అలాగే, చంద్రునిపైకి చేరనున్న నాలుగో దేశం భారత్ కానుంది’ అని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలకు పార్లమెంట్ అభినందనలు చంద్రయాన్–2ను విజయవంతంగా ప్రయోగించడం ద్వారా దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభించిన ఇస్రో శాస్త్రవేత్తలను పార్లమెంట్ అభినందించింది. ఈ ప్రయోగం ద్వారా దేశ అంతరిక్ష ప్రయోగాల్లో భారత దేశం ఆధిక్యత మరోసారి రుజువైందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. ‘మన శాస్త్రవేత్తలు సాధించిన ఘనత దేశానికి గర్వకారణం. భారత శాస్త్రవేత్తలకు, ఇందుకు తోడ్పాటు అందించిన ప్రధాని మోదీకి అభినందనలు’ అని స్పీకర్ అన్నారు. దేశీయ పరిజ్ఞానంతో చంద్రయాన్–2 ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులంతా బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తంచేశారు. నెహ్రూను గుర్తు చేసుకోవాల్సిన సమయం: కాంగ్రెస్ చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ ఘనత తమ పాలనతోనే సాధ్యమైందని కాంగ్రెస్ అంటుండగా, భవిష్యత్తు నాయకత్వం కనిపించనప్పుడు గతాన్ని తవ్వుకోవడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని బీజేపీ తిప్పికొట్టింది. చంద్రయాన్–2పై కాంగ్రెస్ పార్టీ ..‘ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూను గుర్తు చేసుకోవాల్సిన మంచి సమయమిది. అంతరిక్ష పరిశోధనలకు గాను 1962లో ఆయన ఏర్పాటు చేసిన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనే సంస్థను ఆ తర్వాత ఇస్రోగా పేరు మార్చారు. అలాగే, ప్రధాని మన్మోహన్సింగ్ 2008లో చంద్రయాన్–2కు ఆమోదం తెలి పారు’ అని తెలిపింది. దీనిపై బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర మండిపడ్డారు. ‘ఇది నిజంగా దిగజారుడుతనం. ప్రతి ఒక్కరూ గర్వించాల్సిన ఈ క్షణాన్ని రాజకీయం చేయడం తగదు’ అని పేర్కొన్నారు. -
ఎన్‌హెచ్చార్సీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలో మానవ హక్కులను అనుక్షణం పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన మానవ హక్కుల పరిరక్షణ(సవరణ)బిల్లు –2019 బిల్లుకు సభ ఆమోదం లభించింది. ఈ సందర్భంగా హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ.. మానవ హక్కులను అనునిత్యం కాపాడేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నామన్నారు. జాతీయ, రాష్ట్రాల మానవ హక్కుల సంఘాలకు మరిన్ని పరిపాలన, ఆర్థిక అధికారాలను కల్పించినట్లు తెలిపారు. ఈ బిల్లులో ప్రభుత్వం కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. ఎన్‌హెచ్చార్సీ తోపాటు రాష్ట్ర మానవ హక్కుల సంఘాల చైర్పర్సన్, సభ్యుల పదవీ కాలం ప్రస్తుతమున్న ఐదేళ్లకు బదులు ఇకపై మూడేళ్లకే పరిమితం కానుంది. ఎన్‌హెచ్చార్సీ చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డు ప్రధాన న్యాయమూర్తినే నియమించాలనే నిబంధనను ప్రభుత్వం సడలించింది. ఇకపై సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జినీ నియమించవచ్చని ప్రతిపాదించింది. జాతీయ మైనారిటీల కమిషన్ నుంచి ఎన్‌హెచ్చార్సీ చైర్‌పర్సన్‌ను నియమించాలన్న ఏఐఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్‌కు మంత్రి స్పందిస్తూ.. ఓబీసీ జాబితాలో మైనారిటీలను చేర్చే నిబంధన ఈ బిల్లులో ఉందన్నారు. అధికార పార్టీ ఎంపీలను ఎన్‌హెచ్చార్సీలో ఎందుకు నియమించాలని అనుకుంటున్నారని ఒవైసీ ప్రశ్నించారు. ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలే మాట్లాడుతూ.. ఒక వైపు శాంతి కావాలంటూనే ఎన్‌హెచ్చార్సీ ఆదేశాలను సవాల్ చేసే పరిస్థితులున్నాయని, ఈ బిల్లుపై సభలో మరోసారి మరింత చర్చ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యం ఖూనీ కర్ణాటకలో చట్టసభ స్వతంత్రత ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని కాంగ్రెస్ శుక్రవారం లోక్‌సభలో ఆందోళనకు దిగింది. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం, అక్కడి పరిణామాలపై చర్చ జరగాలంటూ కాంగ్రెస్, డీఎంకే సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, న్యాయాన్ని కాపాడాలంటూ వారు నినాదాలు చేశారు. వారి డిమాండ్‌పై స్పీకర్ ఓం బిర్లా సానుకూలంగా స్పందించడంతో ఆందోళన విరమించారు. -
అక్రమ వలసదారులను పంపిస్తాం: అమిత్ షా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చట్టాలను అనుసరించి అక్రమ వలసదారులు భారత్‌లో ఎక్కడున్నా, వారిని పంపించివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టంచేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఎన్నార్సీలో పౌరుల వివరాలను నమోదు చేస్తున్నామ న్నారు.బుధవారం రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ నేత జావేద్ అడిగిన ప్రశ్నకు అమిత్ జవాబిచ్చారు. ప్రతి రాష్ట్రంలోనూ ఇదే పద్ధతి అమలు చేస్తామన్నారు. అక్రమ వలసదారులను పంపించేస్తామన్న బీజేపీ మేనిఫెస్టో హామీ కూడా తాము అధికారంలోకి రావడానికి ఓ కారణమన్నారు. ఎన్నార్సీ సేకరణకు అసోంలో సమయాన్ని పొడిగించాలంటూ 25 లక్షల మంది సంతకాలు చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి అందించారని హోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద్ రాయ్ అన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మరణిస్తే 5 లక్షలు
రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5 లక్షల నష్ట పరిహారం చెల్లించేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రమాదానికి కారణమైన వాహన యజమాని నుంచి బాధితులకు ఈ మొత్తాన్ని ఇప్పిస్తారు. ఈ బిల్లుకు గత లోక్‌సభలోనే ఆమోదం లభించినప్పటికీ రాజ్యసభలో ఆమోదం పొందక గడువు చెల్లిపోయింది. దీంతో మళ్లీ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు, ప్రమాదాల్లో గాయపడిన వారికి సాయం అందించే మంచి వ్యక్తులకు ఇబ్బందులు లేకుండా చూడటం తదితర కొత్త నిబంధనలను బిల్లులో కేంద్రం చేర్చింది. ఈ బిల్లు రాష్ట్రాల ప్రయోజనాలు, హక్కులకు భంగం కలిగిస్తోందని తృణమూల్ ఎంపీలు ఆరోపించారు. కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్చౌధురీ ఈ బిల్లులోని కొన్ని నిబంధనలను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. బిల్లులోని నిబంధనలను అమలు చేయాలో లేదో పూర్తిగా రాష్ట్రాల ఇష్టమనీ, అయితే మరిన్ని ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు అందరూ ఆమోదం తెలపాలని రవాణా మంత్రి గడ్కరీ కోరారు. -
ఎన్ఐఏకి కోరలు
న్యూఢిల్లీ: భారతీయులు లేదా భారత దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా విదేశాల్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపైనా విచారణ చేపట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అధికారాలిచ్చేందుకు ఉద్దేశించిన ఓ బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. విదేశాలకు సంబంధించిన కేసుల విచారణను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు పర్యవేక్షిస్తుంది. సైబర్ ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ నోట్లను వ్యాప్తిచేయటం, నిషేధిత ఆయుధాల తయారీ, వాటి అమ్మకం కేసులపై విచారించేందుకు కూడా ఎన్ఐఏకి ఈ బిల్లు అధికారం ఇస్తోంది. ఇలాంటి కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే అధికారం కూడా ఎన్ఐఏకు ఉంటుంది. 2008లో ముంబైలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించి 166 మందిని చంపేసిన అనంతరం, 2009లో ఉగ్రవాద కేసుల విచారణకు ప్రత్యేకంగా ఎన్ఐఏను ఏర్పాటు చేశారు. కొత్త సవాళ్లను పరిష్కరించేందుకు ఎన్ఐఏకు మరిన్ని అధికారాలు అవసరమని 2017 నుంచీ హోం శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ‘జాతీయ దర్యాప్తు సంస్థ (సవరణ) బిల్లు–2019’ని లోక్‌సభలో ప్రవేశపెట్టగా, అది ఆమోదం పొందింది. ఎన్ఐఏ చట్టాన్ని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయదని అమిత్ అన్నారు. తమ ప్రభుత్వ లక్ష్యం ఉగ్రవాదాన్ని అంతం చేయడమేననీ, దీనికి మతంతో సంబంధం లేదనీ, ఉగ్రవాదులు ఏ మతంలో ఉన్నా తాము వదిలిపెట్టబోమని ఆయన చెప్పారు. ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు పంపేలా పార్లమెంటు అంతా ఈ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని అమిత్ షా కోరారు. హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదనీ, ఇప్పుడు వారి తప్పులను తాము సరిచేస్తున్నామని అన్నారు. బిల్లుకు 278 మంది సభ్యులు మద్దతు తెలపగా, ఆరుగురు మాత్రమే వ్యతిరేకించారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ మాట్లాడుతూ ఓ కేసు విచారణ సందర్భంగా ఓ రాజకీయ నాయకుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను గతంలో బెదిరించాడని అన్నారు . ఆ మాటకు హైదరాబాద్ ఎంపీ ఒవైసీ అభ్యంతరం తెలుపుతూ ఆయన చెప్పిన దానికి ఆధారాలు చూపాలని కోరారు. దీంతో అమిత్ షా కలగజేసుకుంటూ ప్రతిపక్షం వాళ్లు మాట్లాడుతున్నప్పుడు అధికార పార్టీ వాళ్లు అడ్డు తగలడం లేదనీ, అలాగే అధికార పార్టీ వాళ్లు మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షం వాళ్లు కూడా ప్రశాంతంగా ఉండాలని ఒవైసీని ఉద్దేశించి అన్నారు. దీనికి ఒవైసీ స్పందిస్తూ, తనవైపు వేలు చూపించవద్దని అమిత్ షాకు చెప్పారు. తననెవరూ భయపెట్టలేరని ఆయన పేర్కొన్నారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ తానెవరినీ భయపెట్టడానికి ప్రయత్నించడం లేదనీ, ఒవైసీ మనసులో భయం ఉంటే తానేమీ చేయలేనని అన్నారు. ఈ మాటల అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. లోక్‌సభకు అద్దెగర్భం బిల్లు అద్దె గర్భం (సరోగసీ) విధానాన్ని వ్యాపారంగా వాడుకోకుండా చూసేందుకు పలు నిబంధనలతో కూడిన ‘అద్దె గర్భం (నియంత్రణ) బిల్లు–2019’ని కూడా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కూడా గతేడాది డిసెంబర్లోనే లోక్‌సభ ఆమోదించినప్పటికీ పార్లమెంటు దీనికి పచ్చజెండా ఊపకపోవడంతో గడువు చెల్లింది. దీంతో ఈ బిల్లును మళ్లీ కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం కనీసం ఐదేళ్ల క్రితం పెళ్లి అయ్యి, ఇంకా పిల్లలు పుట్టని దంపతులకు మాత్రమే అద్దె గర్భం ద్వారా బిడ్డను కనే అవకాశం కల్పిస్తారు. అలా పుట్టిన బిడ్డను వారు మళ్లీ ఏ కారణం చేతనైనా వదిలేయకూడదు. దంపతుల్లో భార్య వయసు 23 నుంచి 50 ఏళ్ల మధ్య, భర్త వయసు 26 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఒక మహిళ తన జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి దంపతులకు తన గర్భాన్ని అద్దెకివ్వవచ్చు. ఆమె కచ్చితంగా పిల్లలు లేని దంపతులకు దగ్గరి బంధువై ఉండాలి. ఆమెకు అప్పటికే పెళ్లి అయ్యి, పిల్లలు ఉండాలి. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇప్పటివరకు అద్దెగర్భం విధానానికి సంబంధించి ఇండియాలో చట్టం ఏదీ లేదు. దీంతో విదేశీయులు ఇక్కడకు వచ్చి, మన దేశంలోని మహిళల ద్వారా ఈ విధానంలో బిడ్డలను కంటూ ఆ మహిళకు సరైన పరిహారం ఇవ్వడం లేదు. అలాంటి మహిళలు ఇకపై దోపిడీకి గురవకుండా ఉండటం కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. -
‘వారికి పునరావాసం కల్పించే బాధ్యత రాష్ట్రానిదే’
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు పునరావాసం కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోమవారం రాజ్య సభలో స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ నిర్వాసితులకు పరిహారం, పునరావాసం సంబంధించిన సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ఇతర అధికారుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక యంత్రాంగాన్ని నెలకొల్పిందని తెలిపారు. గిరిజన నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటైనట్లు మంత్రి చెప్పారు. ‘నిర్వాసితుల కోసం 2014-2019 మధ్య నాటి ప్రభుత్వం హయాంలో చేపట్టిన సహయ, పునరావాస కార్యక్రమాలలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్న విషయం వాస్తవమేనా? ఈ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదా’ అంటూ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ వాటిపై తగిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్యాపదేశంగా చెప్పారు. ‘అనేక అవరోధాలు, అవాంతరాలను అధిగమించి ఈ దశకు చేరిన పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం 55 వేల కోట్లకు చేరింది. సవరించిన అంచనాల ప్రతిపాదనలను ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని విభాగాల ఆమోదం పొందడానికి సుమారు ఏడాది కాలం పట్టింది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రతిపాదనలను రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ కమిటీకి పంపించడానికి కారణం, ఆవశ్యకత ఏమిటి? ఈ కమిటీ తన ప్రతిపాదనలను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపించడానికి ఇంకెంత కాలం పడుతుంది’ అని మంత్రిని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీనికి మంత్రి జవాబిస్తూ..‘ ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏప్రిల్ 2014 నాటికి పోలవరం ప్రాజెక్ట్ కింద ఇరిగేషన్ అంశానికి అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించాలి. ఆ మేరకు ఇప్పటి వరకు 5000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ అంశం కింద ఖర్చయింది. మరో 7168 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం చెల్లించాలి. అయితే ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం పెరిగిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాలను సమర్పించింది. ఈ అంచనాలను ప్రాధమికంగా ఆమోదించిన పిమ్మట తదుపరి ఆమోదం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించడం జరిగింది. అంచనా వ్యయం పెంపుకు దారితీసిన కారణాలపై లోతుగా అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేసేందుకు రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. ఆ మేరకు తమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేయవలసి వచ్చింది’ అని మంత్రి వివరించారు. ఈ కమిటీ జూన్ 26న తొలిసారిగా సమావేశం అయింది. తదుపరి సమావేశాలు కూడా త్వరితగతిన నిర్వహించడానికి మావంతు కృషి చేస్తామని మంత్రి చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 2014కు ముందు చేసిన 5 వేల కోట్ల ఖర్చును కూడా ఆడిట్ చేసి బ్యాలెన్స్ షీట్లను సమర్పించవలసిందిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరిన మీదట ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయల ఖర్చుకు సంబంధించిన ఆడిట్ పూర్తి చేయడం జరిగింది. ఈ ఆడిట్ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు.ఇక రాష్ట్ర ప్రభుత్వం 2017-18 ధరల స్థాయికి అనుగుణంగా కేంద్ర జల సంఘానికి సమర్పించిన సవరించిన వ్యయ అంచనాల ప్రకారం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి రూ. 57 వేల కోట్లు కావాలని అడిగింది. ముంపుకు గురయ్యే భూములు, నష్టపరిహారం చెల్లించాల్సిన భూములు, మిగిలిన పనుల నిర్వహణకు నిర్ణయించి రేట్లు వంటి అంశాలపై జరిగిన సర్దుబాట్లతో సవరించిన అంచనా వ్యయం 55 వేల కోట్లకు తగ్గించినట్లు మంత్రి వివరించారు. -
ఈబీసీలకు 4,800 ఎంబీబీఎస్ సీట్లు
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనకబడిన వారి కోసం ఈ సంవత్సరం 4,800 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించినట్లు ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. శుక్రవారం లోక్‌సభ జీరో అవర్‌లో పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. గడిచిన రెండేళ్లలో మెడికల్ కాలేజీల్లో 24,698 గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు పెరిగాయన్నారు. 2019–20లోనే 10,565 గ్రాడ్యుయేట్, 2,153 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు పెరిగాయన్నారు. దేశంలో 75 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీలు, ఇన్స్టిట్యూట్లలో సీట్లు పెంచడానికి కేంద్రం చర్యలు తీసుకుందని చెప్పారు. ఎంబీబీఎస్ కోర్సుకు అనుమతి వచ్చిన మూడేళ్లలో పీజీ కోర్సును ప్రారంభించడం తప్పనిసరి చేశామన్నారు. జిల్లా ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్ర పథకం కింద కొత్త కాలేజీలు.. 2014 జనవరిలో ప్రారంభించిన కేంద్ర ప్రాయోజిత పథకం కింద 82 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద 60 శాతం నిధులను కేంద్రం, 40 శాతం నిధులను ఆయా రాష్ట్రాలు భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాల విషయానికొస్తే, 90 శాతం నిధులు కేంద్రం, 10 శాతం రాష్ట్రాలు సమకూర్చుతాయి. మొదటి దశలో 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 జిల్లా ఆస్పత్రులను గుర్తించి ఆమోదించామని హర్షవర్ధన్ తెలిపారు. ఒక్కో వైద్య కళాశాల స్థాపనకు రూ.189 కోట్లు ఖర్చు అవుతుందని, మొత్తం వైద్య కళాశాలల కోసం రూ.7,507 కోట్లను ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేశామని చెప్పారు. రెండో దశలో 8రాష్ట్రాల్లోని 24 కొత్త వైద్య కళాశాలల స్థాపనకు రూ.250 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి చెప్పారు. -
సభకు కర్ణాటక సెగ
న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల సూచనల మేరకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందంటూ పార్లమెంటులో ఈ అంశంపై మంగళవారం కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. ఆ పార్టీ సభ్యులు ఆందోళనను విరమించకపోవడం, వివిధ ఇతర అంశాలపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), సీపీఐ, సీపీఎం సభ్యులు కూడా ఆందోళన చేపట్టడంతో రాజ్యసభ మంగళవారం పూర్తిగా వాయిదా పడింది. ఉదయం రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య నేతృత్వంలో సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళనలు, నినాదాలు చేశారు. దీంతో సభను వెంకయ్య వాయిదా వేసి, మళ్లీ మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ కార్యకలాపాలను చేపట్టారు. ఆ సమయాన్ని ప్రశ్నోత్తరాలకు కేటాయించినప్పటికీ, సభ్యులు సభ మొదలవగానే వెల్‌లోకి వచ్చి నిరసనలకు దిగారు. దీంతో మధ్యాహ్నం రెండు గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు హరివంశ్ ప్రకటించారు. 2 గంటలకు సమావేశమైనప్పుడు పరిస్థితిలో మార్పు లేకపోవడంతో రాజ్యసభను బుధవారానికి వాయిదా వేశారు. కాగా, మంగళవారం ఉదయం సభా కార్యకలాపాలను ప్రారంభించిన అనంతరం వెంకయ్య మాట్లాడుతూ ముందే నిర్ణయించిన, సభలో ప్రస్తుతం చర్చించాల్సిన విషయాలను పక్కనబెట్టి కర్ణాటక అంశంపై చర్చించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ సభ్యుడు బీకే హరిప్రసాద్ నుంచి తనకు నోటీసు అందిందనీ, కానీ దీనికి ఒప్పుకోవడం లేదని తెలిపారు. లోక్‌సభలో నినాదాలు చేసిన రాహుల్ కర్ణాటక అంశంపై లోక్‌సభలోనూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేలను ‘వేటాడే’ చర్యలను బీజేపీ ఆపివేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ నుంచి ఆ పార్టీ ఎంపీలు బయటకు వెళ్లిపోయారు. అంతకుముందు సభలో కాంగ్రెస్‌పక్ష నాయకుడు అధిర్ రంజన్ మాట్లాడుతూ కర్ణాటకలో తమ ప్రభుత్వాన్ని కూల్చడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభలోనూ వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. చౌధరి మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ సభలోకి వచ్చారు. ‘నియంతృత్వం నశించాలి. వేటాడే రాజకీయాలను ఆపేయాలి’ అని నినాదాలు చేశారు. ఈడీ, సీబీఐల చేత కేసులు పెట్టిస్తామని బెదిరిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత బీజేపీయే రాజీనామాలు చేయిస్తోందని బీకే హరివంశ్ ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిర పరచడంలో తమ పాత్ర లేదని బీజేపీ చెప్పడం పెద్ద అబద్ధమన్నారు. -
ఒకేసారి 3 కీలక బిల్లులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి ఒకే రోజు మూడు కీలక బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం లభించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం –1967ను సవరిస్తూ తెచ్చిన బిల్లును, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ –2008ను సవరిస్తూ ప్రతిపాదించిన బిల్లును, అలాగే మానవ హక్కుల చట్టం –1993ను సవరిస్తూ ప్రతిపాదించిన బిల్లులను ఆయన సభలో ప్రవేశపెట్టారు. అయితే, ఇలా బిల్లులను ప్రవేశపెట్టడాన్ని విపక్ష సభ్యులు అధీర్ రంజన్ చౌదరి, శశిథరూర్, ఎన్.కె.ప్రేమచంద్రన్ తదితరులు వ్యతిరేకించారు. ముఖ్యంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం –1967ను సవరిస్తూ తెచ్చిన బిల్లును వ్యతిరేకించారు. సంస్థలుగా కాకుండా వ్యక్తులు గానూ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని నిర్బంధించేందుకు వీలుగా ఈ బిల్లును రూపొందించారు. అయితే ఈ బిల్లు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని, తీవ్రవాది అనే పేరుతో ఎవరినైనా నిర్బంధంలోకి తీసుకునే ప్రమాదం ఉందని విపక్ష సభ్యులు వ్యతిరేకించారు. మిగిలిన బిల్లులపైనా విభిన్న అంశాలను ప్రస్తావిస్తూ ఆయా సభ్యులు వ్యతిరేకించారు. అయితే మంత్రి కిషన్‌రెడ్డి ఆయా విమర్శలను దీటుగా తిప్పికొట్టారు. తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం సహించబోదని, సంస్థలను నిషేధించినా వాటి నుంచి విడిపోయి బయటకు వచ్చి వ్యక్తిగతంగా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, అందుకే ఈ చట్టం తేవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆధార్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం: ఆధార్‌ను స్వచ్చందంగా ధ్రువీకరణగా వాడుకునేందుకు వీలు కల్పించే ఆధార్ సవరణ బిల్లు–2019ను రాజ్యసభ ఆమోదించింది. గత వారం ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఫోన్ కనెక్షన్లు, బ్యాంకు అకౌంట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ ధ్రువీకరణకు ఆధార్ వివరాలను వాడుకునేందుకు తాజా ప్రతిపాదనల్లో ప్రభుత్వం వీలు కల్పించింది. -
వాహనాలకు ‘నైట్రోజన్’ టైర్లు
న్యూఢిల్లీ: టైర్ల నాణ్యతను పెంచేందుకు టైర్ల తయారీలో రబ్బర్‌తో సిలికాన్ కలపడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ విషయాన్ని ఓ ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభలో కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ చెప్పారు. సిలికాన్ కలసిన రబ్బర్ టైర్లలో సాధారణ గాలికి బదులు నైట్రోజన్ వాయువు నింపడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. దీంతో టైర్లు పేలే అవకాశాలు తగ్గుతాయని, ఆగ్రాలో రోడ్డుప్రమాదం వంటి ఘటనలు తగ్గుతాయని గడ్కరీ అన్నారు. నోయిడా–ఆగ్రా హైవేలో సోమవారం జరిగిన ప్రమాదం బాధాకరమన్నారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వేను యూపీ ప్రభుత్వమే నిర్మించిందని దాంతో కేంద్రానికి ఏ సంబంధం లేదని అన్నారు. పార్లమెంట్లో రోడ్డు భద్రత బిల్లు గత సంవత్సర కాలంగా పెండింగ్‌లో ఉందని దాన్ని ఆమోదించాలని సభ్యులను కోరారు. అది పాసైతే 30 శాతం బోగస్ లైసెన్స్‌లు రద్దవుతాయన్నారు. దేశంలో 25 లక్షల మంది అనుభవజ్ఞులైన డ్రైవర్ల అవసరం ఉందన్నారు. ప్రతి జిల్లాలోనూ ఓ లోక్‌సభ సభ్యుడు చైర్మన్‌గా ఓ కమిటి ప్రారంభిస్తామన్నారు. ఈ కమిటీ ద్వారా రోడ్డు భద్రతా సూచనలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. -
కశ్మీర్లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పాడిగించేం దుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ నెల 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ పొడిగింపు ప్రతిపాదనకు ఇటీవలే లోక్‌సభ అంగీకారం తెలిపింది. ఈ ఏడాది చివర్లో కశ్మీర్లో ఎన్నికలు జరపాలని భావిస్తున్నందున రాష్ట్రపతి పాలనను పొడిగించడం తప్ప తమకు మరో ప్రత్యామ్నాయం లేదని ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా రాజ్యసభకు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను ప్రభుత్వం ఆలస్యం చేస్తోందంటూ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు ఆయన బదులిస్తూ.. గతంలో ఎన్నడూ రంజాన్ మాసం (మే 7–జూన్4)లో రాష్ట్రంలో ఎన్నికలు జరపలేదన్నారు. అదేవిధంగా, జూన్ 30 నుంచి ఆగస్టు 15 వరకు అమర్నాథ్ యాత్ర సాగుతోం దని తెలిపారు. రాష్ట్రంలో 2018 డిసెంబర్ 20వ తేదీ నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా.. కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ప్రజలకు ఉద్యోగాలు, ప్రమోషన్లు, ప్రవేశాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును సభలో ప్రవేశపెట్టారు. 2030 కల్లా దేశంలోని ప్రజలందరికీ సురక్షిత నీటిని అందించాలన్న లక్ష్యాన్ని 2024 సంవత్సరానికి కుదించినట్లు జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ రాజ్యసభకు తెలిపారు. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి లోబడే ఈ చర్య తీసుకున్నామ న్నారు. నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న జిల్లాల్లో వృథా జలాన్ని శుద్ధిచేసి వాడుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. నీటి కొరతను నివారించే విషయంలో రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. -
ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% సీట్లు
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ప్రైవేట్, ప్రత్యేక కేటగిరీ పాఠశాలల్లో 25 శాతం సీట్లను బలహీన వర్గాల వారి పిల్లలకు కేటాయించాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. బాలలకు ఉచిత, నిర్బంధ విద్య చట్టం–2010 ప్రకారం..ప్రాథమికోన్నత స్థాయి విద్య 6–14 ఏళ్ల మధ్య పిల్లలందరి ప్రాథమిక హక్కని తెలిపింది. అదేవిధంగా బౌన్సర్ల నియమించుకుని బలవంతంగా రుణ వసూళ్లు చేపట్టే అధికారం ఏ బ్యాంకుకూ లేదని తెలిపింది. మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ సోమవారం లోక్‌సభలో మాట్లాడుతూ.. అన్ని ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, స్పెషల్ కేటగిరీ పాఠశాలల్లో ఒకటి, అంతకంటే తక్కువ తరగతులకు చేపట్టే ప్రవేశాల్లో ఆ తరగతిలోని కనీసం 25 శాతం సీట్లను బలహీన, వెనుకబడిన వర్గాల వారి పిల్లలకు ఇవ్వాలి. ఆ తరగతి పూర్తయ్యే వరకు వారికి ఉచితంగా విద్య అందించాలి’ అని ఆయన కోరారు. ‘ఆ చిన్నారుల కయ్యే ఖర్చును ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్రం నిర్ణయించిన ఫీజు ప్రకారం, లేదా వాస్తవంగా ఒక్కో చిన్నారి నుంచి వసూలు చేసే ఫీజు.. ఏది తక్కువైతే అందుకు సరిసమానమైన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది’ అని తెలిపారు. ప్రభుత్వం నుంచి భూమి, వసతి, పరికరాలను ఉచితంగా గానీ లేదా తక్కువ ధరకుగానీ పొంది 25 శాతం మంది చిన్నారులకు రిజర్వేషన్ ప్రకారం ఉచిత విద్య అందిస్తున్న పాఠశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదని తెలిపారు. బౌన్సర్లతో వసూళ్లు వద్దు: బలవంతంగా రుణాలను వసూలు చేసుకునేందుకు గాను ఏ బ్యాంక్‌కు కూడా బౌన్సర్లను నియమించుకునే అధికారం లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రకటించారు. ‘ఆమోదించిన మార్గదర్శకాల మేరకే రుణ వసూళ్లు చేపట్టాలి. రుణ గ్రహీతపై దౌర్జన్యం చేయడం, ఇబ్బందులు పెట్టడాన్ని ఆర్బీఐ నిషేధించింది. పోలీసుల ధ్రువీకరణ, అవసరమైన ఇతర అర్హతలు పొందిన తర్వాత మాత్రమే బ్యాంకులు రికవరీ ఏజెంట్లను నియమించుకునేందుకు ఆర్బీఐ వీలు కల్పించింది’ అని తెలిపారు. టీచర్స్ కోటా బిల్లుకు ఆమోదం కేంద్ర విద్యాసంస్థలు (టీచర్స్ కేడర్ బిల్లు–2019) బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. దేశవ్యాప్తంగా 41 సెంట్రల్ యూనివర్సిటీల్లో 8వేల పోస్టుల భర్తీకి అమలయ్యే రిజర్వేషన్ల విషయంలో డిపార్టుమెంట్‌ను యూనిట్‌ను కాకుండా యూనివర్సిటీని యూనిట్‌గా పరిగణించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల ప్రభుత్వం తెచ్చిన చట్టం కూడా అమలవుతుంది. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే ఆర్డినెన్స్ స్థానంలో అమలవుతుంది. -
మూక హత్య బాధాకరం
న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో ఇటీవల ఒక ముస్లిం యువకుడు మూక హత్యకు గురి కావడం తననెంతో బాధించిందని, దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రధాని మోదీ అన్నారు. జార్ఖండ్ అయినా, బెంగాల్ అయినా, కేరళ అయినా దేశంలో ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా అన్నింటినీ ఒకేలా చూడాలని, చట్టం తన పని తాను చేయాలని ఉద్ఘాటించారు. బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ జార్ఖండ్ ఘటనపై స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన జార్ఖండ్‌లో జరిగిన మూక హత్యపై మోదీ స్పందించడం లేదంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన బదులిస్తూ దేశంలో ప్రతి పౌరుడికీ భద్రత కల్పించడం తమ రాజ్యాంగ విధి అన్నారు.రాజ్యసభ సభ్యులు కొందరు జార్ఖండ్ మూక హత్యల కేంద్రమని అనడాన్ని ప్రస్తావిస్తూ ‘అలా ఒక రాష్ట్రాన్ని అవమానించడం సరైనదేనా అని ప్రధాని ప్రశ్నించారు. మోటారు సైకిలు దొంగిలించాడన్న ఆరోపణతో జార్ఖండ్‌లో ఇటీవల 24 ఏళ్ల ముస్లిం యువకుడిని కొందరు చావబాదడం, అతనిచేత బలవంతంగా జైశ్రీరాం నినాదాలు చేయించడం తెలిసిందే. బిహార్‌లో మెదడువాపు వ్యాధి లక్షణాలతో ఒకే నెలలో 130 మంది పిల్లలు చనిపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఎన్నో సంవత్సరాలయిన తర్వాత కూడా అలాంటి వ్యాధి ఇప్పటికీ ప్రజల్ని చంపుతుండటం ఏడు దశాబ్దాల పాలనలో ఘోర వైఫల్యమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ఓటమిని అంగీకరించలేకపోవడం, ఈవీఎంలను సందేహించడం ద్వారా ప్రజా తీర్పును కించపరచడం కాంగ్రెస్ అహంకారానికి నిదర్శనమన్నారు. 16వ లోక్‌సభ కాలం ముగియడానికి ముందు రాజ్యసభ ఆమోదం పొందని కారణంగా 22 బిల్లులు చెల్లకుండా పోయాయని మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకుడు సర్దార్‌వల్లభ్‌భాయ్ పటేల్ మొదటి ప్రధాని అయి ఉంటే కశ్మీర్ సమస్య తలెత్తేదేకాదని తమ పార్టీ నమ్మకమన్నారు. ధన్యవాద తీర్మానం ఆమోదం ప్రధాని ప్రసంగం తర్వాత సభ ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని లోక్‌సభ మంగళవారం ఆమోదించిన సంగతి తెలిసిందే.ఈ తీర్మానంపై ఉభయ సభల్లోనూ 13 గంటల పాటు చర్చ జరిగింది. వివిధ పార్టీలకు చెందిన 50 మంది చర్చలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఈ తీర్మానానికి 200 సవరణలు ప్రతిపాదించింది. అయితే, తర్వాత వాటిని ఉపసంహరించుకుంది. -
కాంగ్రెస్‌కు వారే కనిపిస్తారు
న్యూఢిల్లీ: గాంధీ–నెహ్రూ కుటుంబసభ్యులు మినహా మరెవరినీ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. దేశం కోసం పనిచేసిన ఇతర నేతలకు కనీసం గుర్తింపు కూడా ఆ నేతలు ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ముగింపు సందర్భంగా మంగళవారం ప్రధాని లోక్‌సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన.. ‘దేశంలో అత్యవసర పరిస్థితి విధించి దేశం ఆత్మను చంపేసింది. ముస్లిం మహిళలకు సాధికారిత కల్పించేందుకు వచ్చిన అవకాశాలను జార విడిచింది’అంటూ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధి చెందిన, బలమైన దేశంగా ఎదిగేందుకు పార్టీలకతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రప తి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. వారు మాత్రమేనా? రెండోసారి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ప్రధాని లోక్‌సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన.. తమ నేతల సేవలను గుర్తించడం లేదంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై స్పందించారు. ‘జాతి నిర్మాణానికి కృషి చేసిన కొద్దిమంది పేర్లను మాత్రమే కొందరు నేతలు ప్రస్తావిస్తున్నారు. ఇతరులను మరుగుపరచడమే వారి ఉద్దేశం. మేం అలా కాదు, దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామిగా ఉన్నారనే భావిస్తాం. వారు ఎన్నడైనా పీవీ నరసింహారావు చేపట్టిన మంచి కార్యక్రమాల గురించి లోక్‌సభలో ప్రస్తావించారా? మన్మోహన్ సింగ్ జీ ఘనతపై మాట్లాడారా?’ అని ప్రశ్నించారు. వాజపేయి అందించిన సేవలను యూపీఏ ప్రభుత్వం గుర్తించలేదన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వంటి నేతలను భారతరత్న పురస్కారంతో తాము గౌరవించామన్నారు. మీరు పైకి ఎదిగితేనే మాకు సంతోషం విమర్శలతో తమ పార్టీ స్థాయిని మోదీ ఏమాత్రం దిగజార్చలేరని అనంతరం కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ తిప్పికొట్టారు. దీనికి ప్రధాని స్పందిస్తూ..‘ఉన్నత స్థాయిలో ఉన్నట్లుగా మీరు ఎంతగా భావిస్తే కింద ఉన్నవారు అక్కడ తక్కువగా, అసహ్యంగా మీకు కనిపిస్తారు. మాకు అంత ఎత్తుకు ఎదగాలని లేదు. ప్రజలతో నేలపై ఉండటంలోనే మాకు ఆనందం’ అని అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ నేతలను జైలుకు పంపకుంటే నాకు శాపం తగులుతుంది. వారు కనీసం బెయిల్‌పైన బయట ఉన్నందుకు సంతోషపడండి’ అని సోనియా గాంధీ, రాహుల్ గా>ంధీలను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు.‘జైలులో ఫలానా ‘ఎ’ఎందుకు లేరు, ‘బి’ ఎందుకు లేరు అంటూ అడిగేవారికి నా సమాధానం ఒక్కటే. జైలుకు ఎవరిని పంపాలి, బెయిల్ ఎవరికి ఇవ్వాలనేది కోర్టులే చూసుకుంటాయి. ప్రజలను యథేచ్ఛగా అరెస్టులు చేయించిన ఎమర్జెన్సీ విధించిన నాటి ప్రభుత్వం కాదు మాది’ అని ప్రధాని అన్నారు. అభివృద్ధిని విస్మరించబోం ‘అభివృద్ధే మా ఎజెండా. దీనిని మేం విస్మరించబోం. ఆధునిక మౌలిక వసతులు, ప్రజా సంక్షేమం ద్వారానే ప్రతి పౌరుడి సాధికారిత సాధ్యం. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళతాం. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా దేశాన్ని మార్చడానికి కలిసి కృషిచేద్దాం’ అన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక తాము తీసుకున్న చర్యలు రైతులు, వ్యాపారులు, యువతతోపాటు ఇతర వర్గాల వారికి ఎంతో ప్రయోజనం కలిగిస్తాయన్నారు. ‘సోషలిస్ట్ నేత రాం మనోహర్ లోహియా చెప్పినట్లుగా దేశంలోని పేదలకు ముఖ్యంగా మహిళలకు (పానీ ఔర్ పాయిఖానా) నీరు, మరుగుదొడ్లు సమకూర్చడం మా లక్ష్యం’ అని అన్నారు. పేదల సంక్షేమం, ఆధునిక మౌలిక సదుపాయాలు కలిగిన సమ్మిళిత భారతం కోసం విభేదాలు మరిచి కలిసి పనిచేద్దామన్నారు. ఇది ఎమర్జెన్సీ ప్రకటించిన రోజు కాంగ్రెస్ హయాంలో 1975 జూన్ 25వ తేదీన విధించిన ఎమర్జెన్సీ దేశ ప్రజాస్వామ్యంపై మాయని మచ్చ అని ప్రధాని అన్నారు. ‘పత్రికల గొంతులు నొక్కి, న్యాయ వ్యవస్థను అగౌరవపరిచిన ఎమర్జెన్సీకి నేటితో 44 ఏళ్లు. అప్పటి చీకటి రోజులను మర్చిపోలేం. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి దేశం ఆత్మను చంపేసింది’ అని అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ముస్లింలను ఎదగనివ్వలేదు ముస్లిం మహిళలకు సాధికారిత కల్పించేందుకు వచ్చిన ఎన్నో అవకాశాలను కాంగ్రెస్ జార విడిచింది. ‘ముస్లింలను ఎదగనివ్వడం మా పార్టీ బాధ్యత కాదు. వారు బురదలోనే ఉండాలనుకుంటే అలాగే ఉండనివ్వండి’ అంటూ అప్పటి నేతలు అనేవారని రాజీవ్ గాంధీ హయాంలో మంత్రిగా పనిచేసిన మంత్రి ఒకరు ఇటీవల తనకు చెప్పారని మోదీ తెలిపారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సదరు నేత వ్యాఖ్యల వీడియోను యూట్యూబ్‌లో ఉంచుతామని మోదీ అన్నారు. ముస్లిం మహిళల అభివృద్ధి కోసం వచ్చిన మరో అవకాశాన్ని వదలకండంటూ త్వరలో ప్రవేశపెట్టబోయే ట్రిపుల్ తలాక్ బిల్లునుద్దేశించి అన్నారు.