ఒక విజయాన్ని అందుకోగానే హమ్మయ్యా..! అనుకుంటాం. ఏదో చాలా సాధించేశాం అన్నంతగా ఫోజులు కొడతాం. కానీ కొందరూ మాత్రం మహర్షి మూవీలో హీరో మహేష్ బాబు చెప్పినట్టుగా "సక్సెస్ అనేది గమ్యం కాదు, అదొక ప్రయాణం" అన్నట్లుగా విజయపరంపరతో దూసుకుపోతుంటారు. అబ్బా.. ! ఎన్ని విజయాలు అందుకున్నాడు..హీరో అంటే అలాంటి వాళ్లేనేమో అనే ఫీల్ కలుగుతుంటుంది మనకి. అలా వరుస విజయాలతో విస్మయానికి గురి చేస్తూ..ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు రాజస్థాన్‌కి చెందిన రోమన్ సైనీ. అతడి సక్సెస్ జర్నీ చూస్తే.. సాధించేయాలన్న పౌరుషం, కసి తన్నుకు రావాల్సిందే అన్నట్లుగా ఉంటుంది.
రాజస్థాన్‌లో కోట్‌పుట్లీలోని రైకరన్‌పురా గ్రామానికి చెందిన రోమన్ సైనీ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. తల్లి గృహిణి, తండ్రి ఇంజనీర్. మన రోమన్ సక్సెస్ జర్నీ 16 ఏళ్ల వయసులో ఎయిమ్స్‌లో అర్హత సాధించడంతో ప్రారంభమయ్యింది. అలా రోమన్ 21 ఏళ్లకి ఎంబీబీఎస్ పూర్తిచేసి, డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయినా ఏదో తెలియని వెలితి వెన్నాడుతూ ఉండేది.
అప్పుడే ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్‌కి ప్రిపేరయ్యాడు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. తొలి పోస్టింగ్ మధ్యప్రదేశ్ రావడంతో అక్కడ జిల్లా కలెక్టర్‌గా పనిచేయడం ప్రారంభించారు. అయినా రోమన్ తన లక్ష్యాన్ని సాధించిన అనుభూతి కలగలేదు. ఇంకా ఏదో తెలియని అసంతృప్తి మెదులుతూనే ఉంది. ఇక లాభం లేదనుకుని ఐఏఎస్ ఉద్యోగాన్ని కూడా వదిలేసి 2015లో గౌరవ్ ముంజాల్, హేమేష్ సింగ్‌లతో కలిసి సొంతంగా అన్ అకాడమీ అనే కోచింగ్ సెంటర్‌ని ప్రారంభించాడు.
ప్రారంభంలో ఇదొక యూట్యూబ్ ఛానెల్. క్రమంగా ఇది ఒక ఎడ్‌టెక్‌గా మారి.. సివిల్స్ స్టడీ మెటీరియల్‌కి ప్రసిద్ధిగాంచింది. అలా ఇది కాస్త అన్ అకాడమీ సార్టింగ్ హ్యాట్ టెక్నాలజీస్ కంపెనీగా మారింది. ప్రస్తుతం దీని విలు రూ. 2600 కోట్లు. యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి సరసమైన ధరల్లో నాణ్యమైన కోచింగ్‌ని అందించే స్టడీ సెంటర్‌గా పేరుతెచ్చుకుంది.
ఈ అకాడమీ నుంచి ఏటా వేలాది మంది విద్యార్థులు కోచింగ్ పొందుతున్నారు. రోమన్ అచంచలమైన కృషికి నిదర్శనంగా చాలా తక్కువ వ్యవధిలోనే మంచి కోచింగ్ సెంటర్‌గా పేరుతెచ్చుకుంది. అంతేగాదు ఈ అకాడమీతో రోమన్ ఆర్జించే జీతం తెలిస్తే విస్తుపోతారు. దగ్గర రూ. 88 లక్షల పైమాటే..!. ఇది కదా సక్సెస్‌కి సరైన నిర్వచనం..!.
(చదవండి: వామ్మో ఇదేం సంస్కృతి..! ‘డ్యూయల్ ఇన్‌కమ్ నో కిడ్స్’ అంటున్న యువత..)
Comments
Please login to add a commentAdd a comment