-
డిప్యూటీ సీఎం బూడి హత్యకు కుట్ర
దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు ఇంటి వద్ద డ్రోన్ కెమెరాతో నలుగురు రెక్కీ నిర్వహించడం వివాదాస్పదమైంది. గ్రామస్తులు వారిని పట్టుకుని, తమ నేత బూడి ముత్యాలనాయుడుç ßæత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులకు అప్పగించారు. ముత్యాలనాయుడు ప్రత్యరి్థ, బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ జోక్యం చేసుకోవడంతో వివాదం ముదిరింది.రాత్రి వరకు హైడ్రామా నడిచింది. దేవరాపల్లి మండలం తారువలోని బూడి ఇంటి చుట్టూ శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో డ్రోన్‌తో రెక్కీ నిర్వహించారు. అరగంటకు పైగా ముత్యాలనాయుడు ఇంటి పరిసరాల్లో డ్రోన్ చక్కర్లు కొట్టడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు డ్రోన్ ఆపరేటర్లను ఆరా తీశారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ డి.నాగేంద్ర గ్రామానికి చేరుకుని డ్రోన్, బీజేపీ జెండా సహా హైదరాబాద్‌కు చెందిన డ్రోన్ ఆపరేటర్ చిలకల పాండురంగారావు, అసిస్టెంట్ ఆపరేటర్ పొట్టి సాయికృష్ణ, చొప్ప గంగాధర్, కొమర అప్పారావులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. తన హత్యకు కుట్ర పన్నారని, అనుమతులు లేకుండా తన ఇంటి చుట్టూ డ్రోన్‌తో రెక్కీ నిర్వహించారని ముత్యాలనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రమేష్ ఎదురుదాడి విషయం తన అనుచరుల ద్వారా తెలుసుకున్న సీఎం రమేష్ డ్రోన్ ఆపరేటర్లను తారువ గ్రామస్తులపై ఎదురు ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. సాయంత్రం 4 గంటల సమయంలో అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో దేవరాపల్లి పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన బూడి వర్గీయులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముత్యాలనాయుడు ఇంటి వద్దకు వెళ్లేందుకు సీఎం రమేష్ సిద్ధం కాగా.. పోలీసులు నిరాకరించారు. రౌడీమూకల మాదిరిగా పోలీసులను నెట్టుకుంటూ తన వెంట ఉన్న పచ్చ దండుతో రమేష్ తారువకు వెళ్లారు. ముత్యాలనాయుడి మరో ఇంటి వద్దకు (ఆ ఇంట్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముత్యాలనాయుడి కుమారుడు రవికుమార్ ఉంటున్నారు) వెళ్లగా.. రమేష్ వస్తున్న విషయం తెలుసుకుని ముత్యాలనాయుడు ఆ ఇంటి వద్ద తన అనుచరులతో బైఠాయించారు. ఈ ఇల్లు కూడా తన పేరిట ఉందని, ఎవరొస్తారో చూస్తానని హెచ్చరించారు. విషయం తెలుసుకుని అవాక్కయిన సీఎం రమేష్ తన అనుచరులతో కలిసి హనుమాన్ ఆలయం ముందు మెట్లపై కూర్చుండి పోయారు. తారువ గ్రామస్తులు, వైఎస్సార్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని తమ ఊళ్లో రౌడీ రాజకీయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోలీసులు వెళ్లిపోవాలని కోరడంతో సీఎం రమేష్ పోలీసు జీపు ఎక్కారు. దీంతో రమేష్ ఎక్కిన జీపునకు అడ్డంగా గ్రామస్తులు బైఠాయించారు. గూండాగిరీ చేసిన సీఎం రమేష్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో అరగంటకు పైగా సీఎం రమేష్ ఎక్కిన పోలీసు వాహనం నిలిచిపోయింది. ఆ వాహనాన్ని గ్రామస్తులు చుట్టముట్టడంతో సీఎం రమే‹Ù, అతని అనుచరవర్గం భయంతో వణికిపోయారు. పోలీసులు అతికష్టంపై రమేష్ ఎక్కిన వాహనాన్ని ముందుకు పంపించగా.. గ్రామస్తులు మాత్రం ఊరి పొలిమేర దాటే వరకు వెంబడించారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
కదిరి అర్బన్: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం జౌకల గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి వైఎస్సార్సీపీ కార్యకర్త నాగభూషణం (38) దారుణహత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులే ఈ పని చేసి ఉంటారని హతుడి సోదరి చంద్రమ్మ కదిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే నాగభూషణం అవివాహితుడు. శుక్రవారం కూడా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ప్రచారం ముగిశాక రాత్రి తన ఇంటిముందు నిద్రించాడు. గాఢనిద్రలో ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడిచేసి అతి దారుణంగా చంపేశారు. ఘటనాస్థలాన్ని కదిరి పట్టణ సీఐ పుల్లయ్య పరిశీలించారు. హతుడి కుటుంబసభ్యులు, గ్రామస్తులతో మాట్లాడారు. జిల్లా కేంద్రం నుంచి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తన తమ్ముడు నాగభూషణాన్ని గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు జయచంద్రనాయుడు, గోవర్దన్‌నాయుడు, జయరాంనాయుడు, జయరాం చంపి ఉంటారని అతడి అక్క చంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీళ్లంతా తనను గ్రామంలో ఉండనీయబోమని వీళ్లు బెదిరిస్తున్నట్లు హిందూపురంలో ఉన్న తనకు నాగభూషణం ఫోన్‌చేసి చెప్పినట్లు తెలిపారు. తాను వచ్చి మాట్లాడతానని సముదాయించానని, అంతలోపే కిరాతంగా చంపే«శారని విలపించారు. చంద్రమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాగభూషణం మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద వైఎస్సార్ïÙపీ సీఈసీ సభ్యుడు, కదిరి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు పూల శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. నాగభూషణం హంతకుల్ని పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హతుడి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆయన వెంట ఎంపీపీ అమరనాథ్‌రెడ్డి, జేఏసీ కన్వినర్ మధుసూదన్‌రెడ్డి ఉన్నారు. -
హార్సిలీహిల్స్ ఘాట్‌రోడ్డుపై తలకిందులైన కారు
బి.కొత్తకోట: ప్రకృతి అందాలు తిలకించి, చల్లటి వాతావరణం అనుభూతితో వెనుదిరిగిన ఓ కుటుంబ ఆనందం క్షణాల్లో ఆవిరైంది. ప్రయాణిస్తున్న కారు బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో లోయలోకి పడకుండా చేసిన ప్రయత్నాల్లో కారు తలకిందులై పడింది. అందులోని ముగ్గురు సురక్షితంగా బయటపడగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా.. బి.కొత్తకోటకు 18 కిలోమీటర్ల దూరంలోని కర్ణాటకలోని గౌనిపల్లెకు చెందిన శ్రీనివాసులురెడ్డి, రజిత భార్యాభర్తలు. వేసవి సెలవులు కావడంతో విహార యాత్రకు వెళ్లేందుకు వీరి కుమార్తె, కుమారుడు ఆరవ తరగతి చదువుతున్న గగన, ఒకటవ తరగతి చదువుతున్న సుజిత్రెడ్డిలతో కలిసి బుధవారం ఉదయం కారులో మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ వచ్చారు. కొండపై ప్రకృతి అందాలను తిలకించి చల్లటి వాతావరణంలో సేదతీరారు. కొన్ని గంటల తర్వాత తిరుగు ప్రయాణం అయ్యేందుకు వెనుదిరిగారు.కొండపై నుంచి కిందకు వస్తుండగా రేణిమాను మలుపు ముందున్న మలుపు వద్దకు రాగానే డ్రైవింగ్ చేస్తున్న శ్రీనివాసులురెడ్డి కారు బ్రేక్‌లు ఫెయిల్ అయినట్టు గుర్తించారు. ఎడమవైపు లోయలు ఉండటంతో ప్రమాదం జరిగే అవకాశాలు గుర్తించి కారును కుడివైపు తిప్పారు. అప్పటికే చేతి బ్రేక్‌ను వేసి కారును నిలిపే ప్రయత్నం చేశారు. అయినా సాధ్యం కాలేదు. దీంతో కారును కుడివైపునకు మళ్లించి కొండను ఢీకొని నిలిపేలా ప్రయత్నించారు. అయితే కొండబండను ఢీకొన్న కారు ఒక్కసారిగా రోడ్డుపై తలకిందులుగా పడిపోయింది. ఇంజిన్ నుంచి పొగలు రావడంతో అగ్నికి ఆహుతి అయ్యేలా ఉందని ఆందోళనకు గురైన శ్రీనివాసులురెడ్డి కారులోంచి బయటకు వచ్చేందుకు డోర్లు తెరచుకునే పరిస్థితి లేదని గుర్తించారు.దీంతో కుడికాలితో బలంగా తన్ని అద్దాలను పగులగొట్టారు. తర్వాత భార్య, పిల్లులు కారులోంచి బయటపడ్డారు. అద్దాలను తన్నడంతో శ్రీనివాసులురెడ్డి కుడి పాదానికి తీవ్ర గాయంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ ప్రమాద ఘటనను గుర్తించి స్థానికులు బాధితులకు సహాయక చర్యలు చేపట్టారు. పాదానికి అయిన గాయానికి బ్యాండేజి కట్టి కారులో బి.కొత్తకోట సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. కాగా ప్రమాద సమయంలో కారులోనే ఉన్న భార్య రజిత, పిల్లలు గగన, సుజిత్రెడ్డిలకు ఎలాంటి గాయాలు కాలేదు. అదృష్టవశాత్తు కారు ఎడమవైపు వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే కారు 30 అడుగులపైనుంచి కిందకు పడి ఉండేది. -
వివాహితపై అత్తింటివారి దాడి
మదనపల్లె: కాపురం చేసేందుకు అత్తారింటికి వచ్చిన భార్యపై భర్త, అత్తామామలు దాడిచేసి, విచక్షణారహితంగా కొట్టి గాయపరిచిన ఘటన బుధవారం సాయంత్రం మదనపల్లె మండలంలో జరిగింది. తట్టివారిపల్లె పంచాయతీ దేవతానగర్‌లో నివాసం ఉంటున్న రెడ్డెప్ప, రామలక్ష్మమ్మల కుమారుడు ఎం.నరసింహులు(34)కు సోమల మండలం పెద్ద ఉప్పరపల్లెకు చెందిన స్వప్న(28)తో వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా స్వప్న ఆరునెలలుగా పుట్టినింటిలోనే ఉంటోంది.ఈ క్రమంలో భర్త నరసింహులు, మౌనిక అనే వేరొక అమ్మాయిని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడని తెలియడంతో, కాపురం నిలబెట్టుకునే ఉద్దేశంతో తల్లి శకుంతల, అన్న మురళితో కలిసి బుధవారం భర్త నరసింహులు ఇంటికి వెళ్లింది. కోడలు స్వప్నను ఇంటిలోకి రానివ్వకుండా, గుమ్మంలోనే మామ రెడ్డెప్ప, అత్త రామలక్షుమ్మలు అడ్డుకున్నారు. ఇన్నాళ్లుకు మొగుడు గుర్తుకు వచ్చాడా... ఇంట్లోకి రానవసరం లేదంటూ బయటకు నెట్టేందుకు ప్రయతి్నంచారు. తన భర్త ఇంటిలోకి రావద్దని చెప్పడానికి మీరెవరని, స్వప్న మొండిగా లోనికి వెళ్లేందుకు ప్రయతి్నంచడంతో అత్తమామలు, కోడలిపై దాడికి పాల్పడ్డారు.కుమార్తెను అత్తామామలు విచక్షణారహితంగా కొడుతుండటంతో అడ్డుకునేందుకు వెళ్లిన తల్లి శకుంతలను సైతం వారు కాలితో తన్ని గెంటేయడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈలోపు అక్కడకు చేరుకున్న భర్త నరసింహులు చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చేందుకు నీకెంత ధైర్యమంటూ రోడ్డుమీద అందరూ చూస్తుండగానే, కాలితో తన్నుతూ, కొడుతూ వీరంగం సృష్టించాడు. భార్య, అత్తను తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించి, చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి వెళ్లారు. తల్లి శకుంతలకు కడుపునకు శస్త్రచికిత్స జరిగిన ప్రదేశంలో బలంగా కాలితో తన్నడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తాలూకా సీఐ ఎన్.శేఖర్ తెలిపారు. -
చెక్‌పోస్టులో భారీగా మద్యం పట్టివేత
తడ (తిరుపతి జిల్లా): ఎన్నికల వేళ భారీ ఎత్తున మద్యం పట్టుబడుతోంది. తాజాగా బీవీపాళెం చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద బుధవారం పెద్ద ఎత్తున మద్యం పట్టుకున్నారు. ఎస్ఈబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పుదుచ్చేరి నుంచి నెల్లూరు వైపు వెళుతున్న కేరళకు చెందిన మినీ లారీని తనిఖీ చేయగా మద్యం రవాణా బట్టబయలైంది. పట్టుకున్న లారీని బీవీపాళెం సరిహద్దు ఉమ్మడి తనిఖీ కేంద్రంలోని ఎస్ఈబీ కార్యాలయానికి తరలించి సరుకు లెక్కించారు. లారీలో మొత్తం 300 కేసుల (14,400 బాటిళ్లు) క్వార్టర్ బాటిళ్ల మద్యం ఉన్నట్టు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.7.42 లక్షలుగా ఉంటుందని తెలిపారు. దీంతోపాటు లారీ, కేరళకు చెందిన డ్రైవర్ మహ్మద్ ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ సరుకు పుదుచ్చేరిలోని బాలాజీ ఎంటర్ ప్రైజెస్, గ్లోబల్ బేవరేజెస్ పరిశ్రమ నుంచి వస్తున్న ‘ఆల్వేస్ సూపర్ స్ట్రాంగ్’ పేరుతో ఉన్న బ్రాందీ. దీనిని ఏప్రిల్ 30వ తేదీన తయారు చేసినట్టు సీల్ ఉంది. ఈ బ్రాండ్ నెల్లూరుకు చెందిన ఓ టీడీపీ మద్యం వ్యాపారిదిగా ఎస్ఈబీ సిబ్బంది గుర్తించారు. -
Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
పటమట(విజయవాడతూర్పు): తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి ఆత్మహత్య చేసుకున్న ఆర్థోపెడిక్ సర్జన్ ధారావత్ శ్రీనివాస్(40) ఘటన విజయవాడ నగరంలో మంగళవారం సంచలనం రేకెత్తించింది. చిరకాల స్వప్నమైన ఆస్పత్రిని ప్రారంభించిన అనతికాలంలోనే దాన్ని వదులుకోవాల్సి రావడంతో మనస్తాపానికి గురైన అతను తాను అల్లారుముద్దుగా సాకుతున్న ఇద్దరు పిల్లలు, తనతో జీవితాన్ని పంచుకున్న భార్యను, తనను పెంచి పెద్ద చేసిన తల్లిని హతమార్చి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణం విజయవాడ గురునానక్ నగర్లో జరిగింది. శ్రీనివాస్ అన్న దుర్గాప్రసాద్ పటమట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన విజయవా డ పోలీస్ కమిషనర్ రామకృష్ణ, డీసీపీ అదిరాజ్‌సింగ్ కేసు దర్యాప్తు చేపట్టారు.పోలీసుల కథనం మేరకు.. విజయవాడ గురునానక్ నగర్‌లోని మారుతీ కో– ఆపరేటివ్ కాలనీలో ప్లాట్ నంబరు 53లోని భవనంలో నివసించే ధారావత్ శ్రీనివాస్ గుంటూరులో వైద్య విద్య అభ్యసించారు. అనంతరం విజయవాడలో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రాక్టీస్ చేశారు. సొంత ఆస్పత్రి ప్రారంభించాలని కలలు కన్నారు. ఈ క్రమంలో తన సేవింగ్స్‌తోపాటు ఓ ప్రైవేటు బ్యాంక్ నుంచి లోను తీసుకుని ఇటీవల సూర్యారావుపేటలో శ్రీజ ఆర్థోపెడిక్ క్లినిక్ ప్రారంభించారు. పూర్తిస్థాయిలో యంత్రపరికరాలు ఏర్పాటు చేసేందుకు డాక్టర్ ధారవత్ శ్రీనివాస్ స్నేహితులైన నగరంలోని ఆస్పత్రుల్లో పనిచేసే ముగ్గురు వైద్యులు అప్పులు ఇచ్చారు. దీంతో అప్పులు రూ.3 కోట్లకు చేరాయి. బ్యాంకు రుణం, స్నేహితుల వద్ద చేసిన అప్పులతో ఆస్పత్రి నడుపు తున్నా అనుకున్నంత స్థాయిలో ఆదాయం రావడంలేదు. అదే సమయంలో తామిచ్చిన అప్పులు తీర్చాలని స్నేహితులు ఒత్తిడి చేశారు. అప్పు కింద ఆస్పత్రి లో 90 శాతం వాటాను వారు సొంతం చేసుకున్నారు.వారం క్రితమే దారుణానికి వ్యూహం తన ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు మరింతగా దిగజారడంతో తానే ప్రాణంగా జీవిస్తున్న తల్లి, భార్య, పిల్లలు అనాథలవుతారని డాక్టర్ శ్రీనివాస్ భావించారు. వారి ప్రాణాలు తీసి, ఆత్మహత్య చేసుకోవా లని భావించారు. ఏప్రిల్ 25వ తేదీన గురునానక్ నగర్‌లోని సూపర్ మార్కెట్‌కు వెళ్లి రెండు చాకులు కొన్నారు. మంగళవారం తెల్లవారుజామున నిద్రపోతున్న తల్లి రమణమ్మ (65), భార్య ఉషా (38), కూతురు శైలజ (11), శ్రీహాన్ (6) మెడపై కత్తితో గాట్లు పెట్టి హత్య చేశారు. ఉదయం 6.30 గంటల సమయంలో ఇంటిలో ఉన్న కొంత నగదు, నగలు, ఆస్తి తాలూక డాక్యుమెంట్లను ఓ బ్యాగులో సర్ది దానిని కారులో పెట్టారు. అనంతరం ఎదురింటి గేటుకు ఉన్న డబ్బాలో తన అన్న దుర్గాప్రసాద్‌కు రాసిన లెటరు, తన కారు తాళం చెవిని అందులో వేశారు. తిరిగి తన ఇంటికి వచ్చి వరండాలో ఉరివేసుకున్నారు.తన వాట్సాప్‌కు వాయిస్ మెసేజ్ ఆత్మహత్య చేసుకునే ముందు డాక్టర్ శ్రీనివాస్ తన వాట్సాప్ నంబరుకు వాయిస్ మెసేజ్ పెట్టుకున్నారు. తన పరిస్థితికి తానే కారణమని, తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసు కుంటున్నానని పేర్కొన్నారు. తాను లేకపోతే తన కుటుంబ సభ్యులు అనాథలు అవుతారన్న భయంతో వారిని కూడా హతమార్చుతున్నానని ఆ మెసేజ్‌లో వివరించారు. క్లూస్ టీంతో ఆధారాల సేకరణ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల మరణాలపై విచారణ చేపట్టిన పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ డాగ్‌స్కా్వడ్, క్లూస్ టీంను రప్పించారు. శ్రీనివాస్ హత్యకు వినియోగించిన చాకులు, దాని బిల్లు, సూపర్ మార్కెట్ సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు డాక్టర్ శ్రీనివాసే కుటుంబ సభ్యులను హత్యచేశాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.మోసాన్ని జీరి్ణంచుకోలేక..! ఆర్థోపెడిక్ సర్జన్‌గా విజయవంతంగా కొనసాగు తున్న శ్రీనివాస్‌కు సొంతగా ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్నది కల. ఆ మేరకు సూర్యారావుపేటలో శ్రీజ ఆర్థోపెడిక్ క్లినిక్‌ను ప్రారంభించారు. దాని నిర్వహణ కోసం స్నేహితులు అప్పులు ఇచ్చారు. ఆ అప్పులు తీర్చాలని ఒత్తిడిచేసి చివరకు ఆస్పత్రిలో 90 శాతం వాటా రాయించుకున్నారు. అనంతరం ఆస్పత్రిలోనే పనిచేయాలని శ్రీనివాస్‌ను ఒత్తిడిచేశారు. దీంతో మనస్తాపం చెంది శ్రీనివాస్ తల్లి, భార్య, పిల్లలను హత మార్చి ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ తండ్రి జమలయ్య నాయక్ విజయవాడ తూర్పు ఏసీపీగా పనిచేశారు. అతని అన్న నల్గొండ జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీనివాస్ అత్తింటి వారు కూడా ఆర్థికంగా స్థితి మంతులే. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల మరణానికి తీర్చలేనంత అప్పులు కారణం కాదని, తన స్నేహితులే మానసిక క్షోభకు గురిచేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. -
కదిరి టీడీపీ అభ్యర్థి కారులో రూ.2 కోట్ల నగదు
అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌కు చెందిన ఫార్చునర్ కారులో సుమారు రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు మంగళవారం అనంతపురం నుంచి కదిరికి తరలిస్తుండగా.. స్థానిక విద్యుత్ నగర్ సర్కిల్లో పోలీసులు పట్టుకున్నారు. కారు డ్రైవర్ ఆనంద్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. కారును సీజ్ చేశారు. అనంతపురం టూటౌన్ సీఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల విధుల్లో భాగంగా అనంతపురం టూటౌన్ పోలీసులు స్పెషల్ పార్టీ, మొబైల్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి మంగళవారం ఉదయం అనంతపురం విద్యుత్ నగర్ సర్కిల్లో వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఏపీ 39 ఆర్క్యూ 0999 ఫార్చునర్ వాహనాన్ని తనిఖీ చేశారు. మూడు బ్యాగుల్లో నగదు పట్టుబడింది. దాన్ని లెక్కించి రూ.1,99,97,500 ఉన్నట్టు నిర్ధారించారు. పంచనామా నిర్వహించి.. ఈ ప్రక్రియనంతా వీడియో రికార్డింగ్ చేశారు. రామ్‌నగర్ నుంచి తరలిస్తూ.. కందికుంట వెంకటప్రసాద్ కారు డ్రైవర్ సోమవారం రాత్రి బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తిని పికప్ చేసుకుని అనంతపురం రాజు రోడ్డులోని టీడీపీ నాయకుడికి చెందిన మాసినేని హోటల్లో దించినట్టు సమాచారం. రాత్రి అక్కడే బస చేసిన డ్రైవర్ మంగళవారం ఉదయం అనంతపురం రామ్‌నగర్‌లోని ఓ ఇంటి నుంచి మూడు బ్యాగుల్లో నగదు సమకూర్చుకున్నట్టు సమాచారం. అక్కడి నుంచి సప్తగిరి సర్కిల్, సూర్యానగర్ రోడ్డు మీదుగా నేరుగా కదిరికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. తనిఖీలు ఉంటాయనే ఉద్దేశంతో విద్యుత్ నగర్ సర్కిల్ మీదుగా వాహనాన్ని మళ్లించారు. కానీ.. పోలీసులు విద్యుత్ నగర్ సర్కిల్లోనూ వాహన తనిఖీలు చేపట్టడంతో నగదు పట్టుబడింది. కారు కందికుంట పేరుతోనే.. ఏపీ 39 ఆర్క్యూ 0999 నంబర్ గల ఫార్చునర్ కారు కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ పేరుతోనే రిజి్రస్టేషన్ అయింది. నగదు పట్టుబడిన విషయం తెలిసిన వెంటనే వెంకటప్రసాద్ నల్లచెరువు మండలంలో ఎన్నికల ప్రచారాన్ని అర్ధంతరంగా ముగించుకుని కదిరిలోని ఇంటికి వెళ్లిపోయారు. కదిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపు ఖాయమనే సంకేతాలు వస్తుండటంతో కందికుంట అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లకు నగదు ఎర వేయడానికి సిద్ధమయ్యారు. అనంతపురం, ఇతర ప్రాంతాల నుంచి డబ్బు తెప్పించుకుని కదిరిలో పంచేలా ప్రణాళిక రచించుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల తనిఖీల్లో సుమారు రూ.2 కోట్ల నగదు పట్టుబడింది. ఆదాయపు పన్ను అధికారుల విచారణ వెంకటప్రసాద్ వాహన డ్రైవర్ ఆనంద్‌కుమార్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎవరిచ్చారు? ఇందుకు సంబంధించిన పత్రాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. రూ.10 లక్షలకు పైగా నగదు తీసుకెళ్తూ పట్టుబడితే ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనంతపురం పోలీసులు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. డ్రైవర్ ఆనంద్‌కుమార్‌ను ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా విచారిస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదును తరలించడానికి గల కారణాలు ఏమిటి? బ్లాక్ మనీ కాకపోతే అందుకు తగిన ఆధారాలు ఇవ్వాలని సూచించారు. ఈ మొత్తం ఎవరి నుంచి తీసుకున్నారు? ఎందుకు ఇంత పెద్దమొత్తంలో నగదు ఇవ్వాల్సి వచ్చింది? తదితర కోణాల్లో ఆరా తీస్తున్నారు. -
విజయవాడలో విషాదం.. డాక్టర్ ఘాతుకం.. కుటుంబ సభ్యుల్ని చంపి తానూ..
ఎన్టీఆర్, సాక్షి: విజయవాడలోని విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని.. ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంగా గుర్తించారు పోలీసులు. మృతుల్లో డాక్టర్ శ్రీనివాస్, ఆయన తల్లి, భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ల మృతికి కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివిన శ్రీనివాస్.. ఏడాది క్రితం శ్రీజ అనే ఆస్పత్రిని విజయవాడలో ప్రారంభించాడు. అయితే ఆ ఆస్పత్రి సరిగా నడవటం లేదు. దీంతో ఆయన డిప్రెషలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఆస్పత్రిని రెండు నెలల కిందట మరొకరికి అప్పగించనట్లు తెలుస్తోంది.మంగళవారం ఉదయం గురునానక్ నగర్‌లోని ఇంట్లో శ్రీనివాస్ కుటుంబం విగత జీవిగా కనిపించింది. ఇంటి ఆవరణలో శ్రీనివాస్ మృతదేహాం కొయ్యకు వేలాడుతూ కనిపించింది. దీంతో.. కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందా? లేదంటే ఎవరైనా హత్య చేశారా?.. తాను ఆత్మహత్య చేసుకుని, అంతకు ముందు కుటుంబ సభ్యుల్ని శ్రీనివాస్ హత్య చేసి ఉంటాడా? అనే అనుమానాలు రేకెత్తాయి. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మృతులు డాక్టర్ శ్రీనివాస్ (40), ఉషారాణి (36), శైలజ (9), శ్రీహాన్(5), శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65)ఘటనా స్థలాన్ని సీపీ రామకృష్ణ పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తనిఖీలు జరిపాయి. అయితే.. తన కారు తాళం తన అన్నకు ఇవ్వాలంటూ ఎదురింటి వాళ్ల పోస్ట్ బాక్స్‌లో డాక్టర్ శ్రీనివాస్ పేరిట ఒక లెటర్ దొరికింది. దీంతో ఇది సూసైడ్ కేసు అయ్యి ఉంటుందని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. అర్ధరాత్రి టైంలో కుటుంబ సభ్యులను చంపి, తెల్లవారుజామున శ్రీనివాస్ తానూ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులు కారణంగా శ్రీనివాస్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్థారించుకున్నారు.శ్రీనివాస్ చాలా సౌమ్యుడు.. ఎవరితోనూ విబేధాలు లేవు. సంవత్సరం క్రితం శ్రీజ హాస్పిటల్ పేరుతో సొంతంగా హాస్పటల్ ఏర్పాటు చేశాడు. కొంతకాలం హస్పటల్ సక్రమంగా నిర్వహించాడు.తరువాత హాస్పటల్ నిర్వహణలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. హాస్పిటల్ నిర్వహణ కోసం ఎదురు పెట్టుబడి పెడుతున్నాడు. కేవలం ఆర్థిక ఇబ్బందులు వల్లే చనిపోయాడని భావిస్తున్నాం. తల్లిని, భార్యను, ఇద్దరి పిల్లలను హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నాం.:::సాక్షిటీవీతో డాక్టర్ శ్రీనివాస్ స్నేహితులు -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టినరోజు వేడుక
అనుబంధం తెగిపోయి.. ఆనందం ఆవిరి.. ఆ ఘోర ప్రమాదం.. ఆశలను చిదిమేసింది.. అనుబంధాలను చెరిపేసింది.. జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. ఆ కుటుంబాలకు ఆసరా లేకుండా మార్చింది.. చేయి పట్టుకుని నడిచే పిల్లలకు తండ్రి లేకుండా చేసింది.. కట్టుకున్నవాడిని భార్యకు దూరం చేసింది.. తోడుగా ఉంటాడనుకున్న కుటుంబానికి కుమారుడిని లేకుండా చేసింది. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు మిగిలిన వేదన ఇది.అమలాపురం రూరల్/ మామిడికుదురు: వారంతా స్నేహితులు... హ్యాపీ హ్యాపీగా సహచరుడి ముందస్తు పుట్టినరోజు వేడుకకు బయలు దేరారు.. జోకులు వేసుకుంటూ సరదాగా గడిపారు.. కేక్ కట్ చేసుకుని సందడి చేశారు.. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో దారి కాచిన మృత్యువు లారీ రూపంలో వారి ఆనందాన్ని ఆవిరి చేసింది.. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలోని వనువులమ్మ ఆలయం వద్ద 216 జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26) పుట్టినరోజు సోమవారం కావడంతో ముందస్తు వేడుకలు జరుపుకొనేందుకు స్నేహితులు నిర్ణయించుకున్నారు. మొత్తం ఎనిమిది మంది పుదుచ్చేరి ప్రాంతం యానాంకు నెల్లి నవీన్‌కుమార్ ఆటోలో ఆదివారం రాత్రి 8 గంటలకు బయలు దేరారు. యానాంలో విందు ముగిశాక అర్ధరాత్రి సమయంలో తిరుగు పయనమయ్యారు. భట్నవిల్లి వచ్చేసరికి కాకినాడ వైపు ఒడిశాకు చేపల లోడుతో వెళుతున్న లారీ వారి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన సాపే నవీన్ (22), అదే గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26), అదే మండలం పాశర్లపూడికి చెందిన నెల్లి నవీన్‌కుమార్ (27), పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్ (18) అక్కడికక్కడే చనిపోయారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి శివారు కొండాలమ్మ చింతకు చెందిన మల్లవరపు వినయ్‌బాబు (17), అదే గ్రామానికి చెందిన మార్లపూడి లోకేష్ (17), పెదపటా్ననికి చెందిన జాలెం శ్రీనివాసరెడ్డి (17), నగరం శివారు పితానివారి మెరక గ్రామానికి చెందిన మాదాసి ప్రశాంత్‌కుమార్ (17)లు తీవ్రంగా గాయపడి అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో జాలెం శ్రీనివాసరెడ్డి, మాదిసి ప్రశాంత్‌కుమార్‌ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. తరుక్కుపోయిన గుండెలుచేతికందివచ్చిన తమ పిల్లలు మృత్యవాత పడి విగత జీవులుగా పడి ఉండడం చూసి మృతుల తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపించారు. తన కుటుంబానికి దిక్కెవరంటూ జతిన్ భార్య ఆశాదేవి బంధువులను దీనంగా అడుగుతుంటే చూపురుల గుండెలు తరుక్కుపోయాయి. కువైట్‌లో ఉంటున్న తల్లులకు పిల్లల మృత్యు వార్త ఎలా చెప్పాలంటూ నవీన్, అజయ్ కుటుంబీకులు ఆందోళన చెందారు. ప్రమాద వార్త తెలియగానే మృతుల, క్షతగాత్రుల కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ కుటుంబాలన్నీ రొక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఆటో నడుపుకొంటూ, ఎల్రక్టీíÙయన్‌గా పనిచేస్తూ నవీన్‌కుమార్, జతిన్ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. మిగిలిన వారంతా డిగ్రీ, ఇంటరీ్మడియెట్ చదువుకుంటూ భవిష్యత్ కోసం బాటలు వేసుకుంటున్నారు. అమలాపురం రూరల్ సీఐ పి.వీరబాబు, రూరల్ ఎస్సై శేఖర్‌బాబు ప్రమాద స్థలిని తక్షణమే సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను తక్షణమే ఆస్పత్రికి తరలించి వేగంగా వైద్యం అందేలా సీఐ, ఎస్సైలు శ్రమించారు.పుట్టిన రోజునే పరలోకానికి.. నగరం గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26) ఎలక్ట్రీయన్‌గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. సోమవారం అతని పుట్టిన రోజు. పుట్టిన రోజు వేడుకకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కొత్త దుస్తులు కొనుక్కున్నాడు. సరదాగా స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు ఆదివారం రాత్రి అంతా కలసి బయటకు వెళ్లారు. ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చి తనువు చాలించాడు. జతిన్‌కు ఆరేళ్ల కిందట వివాహమైంది. అతనికి భార్య ఆశాదేవి, ఐదేళ్ల కుమార్తె ఆత్య, ఏడు నెలల కొడుకు ఉన్నారు. జతిన్ మృతితో భార్య ఆశాదేవి, తండ్రి వెంకటేష్, తల్లి దివ్య కన్నీరు మున్నీరవుతున్నారు. అభం, శుభం తెలియని పిల్లలకు నాన్న ఎక్కడంటే ఏం చెప్పాలంటూ వారు విలపిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో.. నగరం కోటమెరకకు చెందిన సాపే నవీన్ (22) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నా డు. తండ్రి శ్రీనివాసు రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి రత్న కుమారి కువైట్‌లో ఉంది. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో అతని కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచేసింది. నవీన్ అమ్మమ్మ బత్తుల మేరీరత్నం తన మనవడి వద్దే ఉంటూ అతడిని అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. చదువుకుని ఎంతో ప్రయోజకుడవుతాడని ఆశించిన నవీన్ దుర్మరణం చెందడాన్ని కుటుంబ సభ్యులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. కిరాయికి వెళ్లి.. మృత్యుఒడికి చేరి పాశర్లపూడి నెల్లివారిపేటకు చెందిన నెల్లి నవీన్‌కుమార్ (27) అవివాహితుడు. ఐదు నెలల కిందట కొత్త ఆటో కొనుక్కున్నాడు. తండ్రి ట్రక్కు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నవీన్‌కుమార్ తల్లి మంగాదేవి పదేళ్ల నుంచి మస్కట్‌లో ఉంటున్నారు. తండ్రి, కొడుకు ఆటో నడుపుతూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. స్నేహితుడి పుట్టినరోజు, ఆటో కిరాయికి వెళ్లిన నవీన్‌కుమార్ రోడ్డు ప్రమాదంలో మ్యత్యువాత పడడం స్థానికులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.సరదాగా వెళ్లి.. పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్ (18) ఇంటర్ పూర్తి చేశాడు. తండ్రి శ్రీనివాసరావు నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. అతను గల్ఫ్‌లో ఉంటున్నాడు. తల్లి కుమారి ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చారు. కొడుకును ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అందివచ్చిన కొడుకు స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లి ఇలా విగతజీవిగా మారతాడని కలలో కూడా ఊహించలేదని ఆమె విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. -
సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
కొవ్వూరు: వేగంగా వెళ్తున్న లారీ సడన్‌గా బ్రేక్ వేసి రోడ్డు పక్కకు వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ఐషర్ వ్యాన్ బలంగా ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. కాపవరం సమీపంలో నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ దిగువన శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. కొవ్వూరు రూరల్ ఎస్సై కె.సుధాకర్, పట్టణ సీఐ వి.జగదీశ్వరరావు కథనం ప్రకారం.. ఏలూరు నగరానికి చెందిన మేడం వినోద్ (32) సభలకు సౌండ్ సిస్టం ఏర్పాటు చేసే పనిచేస్తుంటాడు.వినోద్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. తన వృత్తిలో భాగంగా గుంటూరులో సభకు సౌండ్ సిస్టం అమర్చిన వినోద్ తిరిగి విశాఖపట్నం సమీపంలోని చోడవరంలో కార్యక్రమానికి సౌండ్ సిస్టంను తీసుకెళ్తున్నారు. ఈ సౌండ్ బాక్స్‌లను తీసుకుని ఏలూరుకు చెందిన మరో ఏడుగురితో చోడవరానికి ఐషర్ వ్యాన్‌లో బయలు దేరారు. ఈ నేపథ్యంలో కొవ్వూరు మండలం కాపవరం సమీపానికి వచ్చేసరికి హైవేపై ఫ్లైఓవర్ దిగువన జగ్గయ్యపేట నుంచి ఒడిశా రాష్ట్రానికి సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో పాటు, ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా రోడ్డు మార్జిన్లోకి వెళ్లింది.అప్పటికే వెనుక ఉన్న ఐషస్ వ్యాన్ అదుపు తప్పి వెనుక నుంచి లారీని ఢీకొంది. ఈ ఘటనతో మేడం వినోద్, అతని సహచరుడు దారబోయన ప్రభాకర్ (21) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వ్యాన్‌లో ఉన్న ఏలూరు పట్టణానికి చెందిన మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడు ప్రభాకర్‌కు ఇంకా వివాహం కాలేదు. అదే కారణం.. ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని చెబుతున్నారు. సడన్‌గా బ్రేక్ వేయడం, ఎటువంటి సిగ్నల్ ఇవ్వకపోవడం, రోడ్డు మార్జిన్లోకి లారీని ఒక్కసారిగా తిప్పేయడంతో వెనుక వస్తున్న వ్యాన్ అదుపుతప్పి ప్రమాదం జరిగిందని అంటున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో హైవేపై ట్రాఫిక్ స్తంభించింది. కొవ్వూరు రూరల్ ఎస్సై కె.సుధాకర్, పట్టణ సీఐ వి.జగదీశ్వరరావులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తీయించి ట్రాఫిక్‌ను క్రమబదీ్ధకరించారు. -
భారీగా టీడీపీ మద్యం పట్టివేత
గన్నవరం: కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని మెట్లపల్లి శివారుల్లో టీడీపీ నేతలు ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన గోవా మద్యం నిల్వలను ఆదివారం పోలీస్, ఎక్సైజ్, ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా మద్యం నిల్వచేసిన టీడీపీ నేతను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మెట్లపల్లి శివారులో గన్నవరం మాజీ సర్పంచి, టీడీపీ నేత గూడపాటి తులసీమోహన్ సోదరుడైన దుర్గాప్రసాద్‌కు చెందిన శ్రీనివాస గార్డెన్స్‌లో భారీగా మద్యం నిల్వచేసినట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వీరి ఆదేశాల మేరకు హనుమాన్‌జంక్షన్ సీఐ నరసింహమూర్తి, ఎక్సైజ్ స్క్వాడ్ ఎస్ఐ రామాంజనేయ, సెబ్ అధికారులు సంయుక్తంగా గార్డెన్స్‌లోని గెస్ట్‌హౌస్‌పై దాడిచేశారు. అక్కడ గోవా రాష్ట్రానికి చెందిన స్టీకర్స్‌తో మొత్తం 1,210 కేసుల్లో 58,032 క్వార్టర్ సీసాల మద్యం నిల్వల్ని గుర్తించి సీజ్ చేశారు. వీటివిలువ సుమారు రూ.75 లక్షలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. ఆత్కూరు ఎస్ఐ పైడిబాబు కేసు నమోదు చేశారు. అక్రమంగా మద్యం నిల్వచేసిన శ్రీనివాస గార్డెన్స్ యాజమాని, టీడీపీ నేత గూడపాటి దుర్గాప్రసాద్‌ను, వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీస్, ఎక్సైజ్ అధికారులు తెలిపారు. టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ, నేతల్లో ఆందోళన ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు ఈ మద్యం కొనుగోలు చేసి ఇక్కడ నిల్వ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి గూడ్స్ వాహనంలో ఇక్కడికి తీసుకొచ్చి న ఈ మద్యాన్ని ఇక్కడినుంచి గ్రామాలకు పంపేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది.మద్యం పట్టుబడ్డడంతో యార్లగడ్డతో పాటు ఆ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. అధికారులు దాడిచేసిన విషయం తెలుసుకున్న యార్లగడ్డ వర్గానికి చెందిన టీడీపీ నేతలు పొట్లూరి బసవరావు, జాస్తి శ్రీధర్‌బాబు, దొంతు చిన్నా, కేసరపల్లి ఎంపీటీసీ సభ్యుడు శొంఠి కిషోర్ గంటల వ్యవధిలోనే ఆ గ్రామానికి చేరుకున్నారు. -
దారుణం: ప్రియుడిపై మోజు.. భర్తను అంతమొందించిన భార్య!
సబ్బవరం: సాలాపువానిపాలెంలో ఓ యువకుడు శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ప్రియుడిపై మోజులో మరో ఇద్దరితో కలిసి కోడలే కడతేర్చిందని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఘటన మండలంలోని గోటివాడ శివారు సాలాపువానిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ పిన్నింటి రమణ శనివారం సాయంత్రం వెల్లడించిన వివరాల ప్రకారం... సాలాపు శ్రీనివాసరావు (32) దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం దువ్వాడ సమీపంలోని మంగళపాలెంకు చెందిన భాగ్యలక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఈ నేపథ్యంలో భాగ్యలక్ష్మికి అదే గ్రామానికి చెందిన గళ్ల రవి (26)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతోపాటు పెద్దలు వద్ద పంచాయతీ నిర్వహించడం... అనంతరం కలిసి జీవించడం జరిగేది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో సాలాపు శ్రీనివాసరావు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ఇంటికి వస్తుండగా... అదే గ్రామానికి చెందిన గళ్ల రవి (26), గరికిపాటి శ్రీహరి (22) కలిసి శ్రీనివాసరావును అడ్డుకుని మంచం కోడితో తలపై దాడి చేశారు. దీంతో పెద్దగా కేకలు వేయడంతో శ్రీనివాసరావు తండ్రి అప్పారావుతోపాటు గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని చూడగా... శ్రీనివాసరావు తీవ్ర గాయాలతో పడి వున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు సబ్బవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అయితే అప్పటికే మృతి చెందినట్ల వైద్యులు నిర్ధారించారు. కోడలు భాగ్యలక్ష్మితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి తమ కుమారుడు శ్రీనివాసరావును హత్య చేశారని మృతుని తండ్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. శ్రీనివాసరావు తలపై మంచం కోడితో దాడి చేసిన తర్వాత... సుమారు 150 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్యకు పాల్పడిన గళ్ల రవి (26), గరికిపాటి శ్రీహరిని(22) అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భార్య భాగ్యలక్ష్మిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమణ తెలిపారు. -
Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
విశాఖపట్నం : వారు ప్రయాణిస్తున్న కారు యమదూతలా మారింది.. టైరు రూపంలో యమపాశం విసిరింది.. జాతీయ రహదారిపై వెదుళ్లపాలెం వద్ద జరిగిన ఘోర ప్రమాదం రెప్పపాటులో ముగ్గురి ప్రాణాలు హరించింది. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. వివరాలివి. జీవీఎంసీ 91వ వార్డు గవరవీధి, ఎన్ఏడీ జంక్షన్, కూర్మనపాలెం ప్రాంతాలకు చెందిన నలుగురు కారులో శనివారం ఉదయం కాకినాడ బయలు దేరారు. శరగడం వెంకటలక్ష్మి (37) తన కొడుకు వికాస్, మేనమామ కొడుకు దాడి గగన్ (15)లతో కలిసి వ్యక్తిగత పనిమీద కారులో ప్రయాణమయ్యారు. వీరితో పాటు వికాస్ స్నేహితుడైన సుంకర మధుకర్(27) బయలుదేరాడు.పాయకరావుపేటలో వెంకటలక్ష్మి తల్లిని చూసి అక్కడ నుంచి కాకినాడ వెళ్లాలనుకున్నారు. కారు వెదుళ్లపాలెం జంక్షన్ వద్దకు చేరుకునే సరికి హఠాత్తుగా టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతల రూట్లోకి దూసుకుపోయింది. తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. ఈ ఘటనలో కారులో ఉన్న వెంకటలక్ష్మి, దాడి గగన్, సుంకర మధుకర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద తీవ్రతకు కారు టాప్ పైకి లేచిపోయింది. డోర్లు ఊడిపోయాయి. ప్రమాదంలో వికాస్ ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు నెలల్లో జర్మనీ వెళ్లాల్సి ఉండగా.... వికాస్ స్నేహితుడైన మధుకర్ విశాఖ స్టీల్‌ప్టాంట్‌లో మెకానికల్ విభాగంలో అప్రెంటీస్ చేస్తున్నట్టు తెలిసింది. తుని ప్రాంతానికి చెందిన అతడు ఎన్ఏడీ జంక్షన్లో ఉంటున్నాడు. అతడు రెండు నెలల్లో ఉన్నత చదువు, ఉద్యోగం కోసం జర్మనీ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించి అనంత లోకాలకు తీసుకెళ్లిపోయింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నక్కపల్లి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు దుర్మరణం పాలవడంతో విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు సంఘటన స్దలానికి చేరుకుని రోదించారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం కోసం నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ విజయ్‌కుమార్ తెలిపారు.గవరవీధిలో విషాదఛాయలు గోపాలపట్నం: వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో శరగడం వెంకటలక్ష్మి మృతి చెందగా ఆమె కుమారుడు వికాస్ గాయాలపాలవడంతో గవరవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గవరవీధిలో ఉంటున్న శరగడం నర్సింగరావు సప్లయర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో అతడి భార్య వెంకటలక్ష్మి మృతి చెందగా కుమారుడు వికాస్ గాయాలపాలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున ఇంటికి తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు. వెంకటలక్ష్మి ఎప్పుడు నవ్వుతూ నవి్వస్తూ అందరితో కలివిడిగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో మృతి చెందిన దాడి గగన్ది కూర్మన్నపాలెం కాగా.. శనివారం ఉదయం టోల్గేట్ వద్ద కారు ఎక్కాడు. -
ముందస్తు కుట్రతోనే సీఎం జగన్‌పై హత్యాయత్నం!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రాయి దాడి పక్కాప్లాన్, ముందస్తు కుట్రతో జరిగిందని మరోసారి తేటతెల్లమైంది. ఏ2 పోద్బలంతోనే సీఎం జగన్‌పై రాయితో దాడిచేసినట్లు ప్రధాన నిందితుడు (ఏ1) వేముల సతీష్‌కుమార్ పోలీసుల వద్ద అంగీకరించినట్లు సమాచారం. వివేకానంద స్కూల్ వద్ద కంటే ముందు డాబా కొట్ల కూడలిలోనే రాయి విసిరేందుకు మొదట ప్రయత్నించినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. న్యాయస్థానం ప్రత్యేక అనుమతితో విచారణ నిమిత్తం ఈ నెల 25వ తేదీన నిందితుడు సతీష్ ను పోలీసులు మూడురోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మూడు రోజులు సతీష్‌ను అతడి తండ్రి దుర్గారావు, అతడి న్యాయవాది సమక్షంలో సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. శనివారం కస్టడీ ముగిసిన వెంటనే నిందితుడిని పోలీసులు సబ్‌జైలులో అప్పగించారు. మూడురోజుల విచారణ, సీన్ రీ కన్స్ట్రక్షన్కు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సీల్డ్ కవర్లో న్యాయాధికారికి అందజేశారు. విచారణలో నిందితుడు పూర్తిగా సహకరించలేదని, అతడు ఇంకా ఏదో దాస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా నిందితుడిని విచారించాల్సి ఉందని భావిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మూడురోజుల విచారణలో దాడికి సంబంధించిన పలు కుట్రపూరిత అంశాలను సతీష్ పోలీసులకు వివరించినట్లు తెలిసింది. ఈ నెల 13వ తేదీన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సింగ్‌నగర్‌లోని వివేకానంద స్కూల్ వద్ద సీఎం జగన్‌పై హత్యాయత్నం వెనుక ఏ2తో పాటు, మరికొందరి కుట్ర ఉందని స్పష్టమవుతోంది. ఆ రోజు ఉదయం నిందితుడు వేముల సతీష్‌కుమార్ కూలిపనికి వెళ్లాడు. అదేరోజు సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సెంట్రల్ నియోజకవర్గంలో ఉండటంతో హత్యాయత్నానికి వారు కూలిపని చేస్తున్న ప్రదేశంలోనే స్కెచ్ వేశారు. ఆ రోజు సాయంత్రం వరకు ఎలా దాడిచేయాలి? ఎలా తప్పించుకోవాలి? దాడిచేస్తే ఎంత డబ్బు చెల్లిస్తారు? వంటి అంశాలను ఏ1తో కలిసి ఏ2 చర్చించాడు. ప్రధానంగా పోలీసులు ఏ2గా అనుమానిస్తున్న వ్యక్తి ప్రోద్బలంతోనే ఏ1 సతీష్ హత్యాయత్నానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వారు నివసించే వడ్డెర కాలనీ అరుగు మీద ఆ రోజు సాయంత్రం ఆరు నుంచి ఆరున్నర గంటల వరకు ఈ కుట్ర ఎలా అమలు చేయాలనే అంశంపై వారు చర్చించారు. అనంతరం సతీష్ తన ఇంటి నుంచి నడుచుకుంటూ సింగ్‌నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో సీఎం జగన్ బస్సుయాత్ర గవర్నమెంట్ ప్రెస్ కూడలి దాటి ఫ్లైఓవర్‌పై వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. మరో రెండు నిమిషాల్లో యాత్ర తాను నిలబడిన (డాబాకొట్లు) సెంటర్ వద్దకు చేరుకుంటుందని గ్రహించిన నిందితుడు సతీష్ వంతెన వద్దే ఓ కాంక్రీట్ రాయిని సేకరించాడు. ఆ సమయంలో సతీష్‌తో పాటు అతడి స్నేహితుడు ఉన్నాడు. బస్సుయాత్ర డాబాకొట్లు సెంటర్‌కు చేరుకోగానే అప్పుడే సీఎం జగన్‌పై రాయి విసేరేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ వద్దని, ఎవరైనా చూస్తే దొరికిపోతామని సతీష్‌ను అతడి స్నేహితుడు వారించి నిలువరించాడు. భయపడిన ఆ స్నేహితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బస్సుయాత్ర వివేకానంద స్కూల్ వద్దకు చేరడానికి ముందే సతీష్ వేగంగా స్కూల్, గంగానమ్మ గుడి మధ్యనున్న చీకటి ప్రాంతానికి చేరుకున్నాడు. ముందే సేకరించిన కాంక్రీట్ రాయితో ఆ ప్రదేశం నుంచే సీఎం జగన్‌పై దాడిచేశాడు. రాయి బలంగా విసరడంతో సీఎం జగన్‌తో పాటు ఆయన పక్కనే ఉన్న సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దాడిచేసిన వెంటనే తన ఇంటికెళ్లిన సతీష్ అక్కడే ఉన్న టీడీపీ నాయకులను కలిశాడు. తరువాత వారంతా అక్కడ టపాసులు కాల్చారు. ఈ విషయాలన్నీ పోలీసులు నిర్వహించిన సీన్ రీ కన్స్ట్రక్షన్లో నిర్ధారణ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు పోలీసు కస్టడీకి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సీఎం జగన్‌పై హత్యాయత్నం చేసిన కేసులో ప్రధాన నిందితుడు (ఎ1) వేముల సతీష్ కుమార్‌ను గురువారం నుంచి మూడు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్, మెట్రోపాలిటన్మేజిస్ట్రేట్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో సతీష్‌ను అతని తరపు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని ఆదేశించారు.దీంతో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్‌ను గురువారం ఉదయం 10 గంటలకు కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్‌ను ప్రతి రోజూ ఉదయం 10 ఉంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని, విచారించనున్నారు. విచారణ అనంతరం రోజూ సాయంత్రం ఐదు గంటలకు తిరిగి సబ్ జైలులో అప్పగించాల్సి ఉంటుంది. సీఎం జగన్‌ను హతమార్చేందుకే దాడి మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 13వ తేదీన విజయవాడ సింగ్‌నగర్‌కు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పదునైన కాంక్రీట్ రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సీఎం జగన్‌కు ఎడమ కంటి పైభాగంలో బలమైన గాయమైంది. పక్కనే ఉన్న విజయవాడ సెంట్రల్ వైఎస్సార్సీపీ అభ్యర్ధి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కూడా బలమైన గాయమైంది. వెలంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.అదే ప్రాంతానికి చెందిన వేముల సతీష్‌కుమార్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలడంతో అతన్ని అరెస్ట్ చేసి ఈ నెల 18న న్యాయస్థానంలో హాజరుపర్చారు. సతీష్‌కు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కొందరు టీడీపీ నాయకుల ప్రోద్బలంతో ఉద్దేశపూర్వకంగానే సీఎం జగన్‌ను హతమార్చేందుకే సతీష్ రాయితో దాడి చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. పాత్రధారులు, సూత్రధారుల గుర్తింపునకే..కొందరు టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే సీఎం జగన్‌పై తాను ముందస్తుగా సేకరించిన కాంక్రీట్ రాయితో దాడి చేశానని పోలీసుల ప్రాధమిక విచారణలో నిందితుడు సతీష్ అంగీకరించినట్లు సమాచారం. దీని అధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటన వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులెవరో సరిగా తేలక పోవడంతో ఈ కేసు అసంపూర్తిగానే ఉంది.కేసును మరింత సమగ్రంగా, లోతుగా దర్యాప్తు చేసి, వాస్తవాలను వెలికి తీయాల్సి ఉంది. మరికొన్ని సాంకేతిక ఆధారాలను సేకరించాల్సి ఉంది. ఇవే విషయాలను పేర్కొంటూ నిందితుడిని ఏడు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఈ నెల 22న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలను విన్న అనంతరం నిందితుడిని మూడు రోజులు పోలీస్ కస్టడికి ఇస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
ఓ లారీని ఓవర్టేక్ చేయబోయి మరో లారీని ఢీకొన్న కారు
కావలి: ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో రోడ్డు మార్జిన్లో ఆగి ఉన్న కంటైనర్ లారీని ఓ కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలంలో చోటుచేసుకుంది. కావలి రూరల్ సీఐ కె.శ్రీనివాసరావు కథనం మేరకు.. ఏలూరు వైఎస్సార్ నగర్‌కు చెందిన కుమార్ (45), జ్యోతి (38), సిరి అలియాస్ రాజీ (38) వన్‌గ్రామ్ గోల్డ్, ఇమిటేషన్ జ్యూవెలరీ వ్యాపారం చేస్తుంటారు.వస్తువుల కోసం చెన్నైకి కారులో వెళ్లారు. తిరిగి ఏలూరుకు బయలుదేరిన క్రమంలో బుధవారం తెల్లవారుజామున ముసునూరు టోల్‌ప్లాజా సమీపంలో ముందు వెళ్తున్న లారీని కారు ఓవర్టేక్ చేసే క్రమంలో రోడ్డు మార్జిన్లో ఆగి ఉన్న కంటైనర్ లారీని వేగంగా ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న కుమార్, జ్యోతి, సిరి అక్కడికక్కడే మృతిచెందగా.. డ్రైవర్ జిలానీ, కుమారి అనే మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు.స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్‌లో వారిని చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. కుమారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా కారులో నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచి్చంది. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. -
సీఎం జగన్‌పై దాడి: సతీష్‌కు మూడు రోజుల పోలీసు కస్టడీ విధింపు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ సందర్భంగా ఏ1గా ఉన్న సతీష్‌ను మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించ్చింది.ఈ నేపథ్యంలో సతీష్‌ను పోలీసులు మూడు రోజుల పాటు విచారించనున్నారు. కాగా, న్యాయవాది సమక్షంలో సతీష్‌ను విచారించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో, ఈనెల 25, 26, 27 తేదీల్లో సతీష్‌ను పోలీసులు విచారించనున్నారు. ఇక, సీఎం జగన్‌పై సతీష్ రాయితో దాడి చేసిన విషయం తెలిసిందే. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్‌పై సతీష్ హత్యాయత్నానికి తెగబడ్డాడు. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ పై భాగాన బలమైన గాయమైంది.రిమాండ్ రిపోర్టు ఇలా.. సీఎం జగన్‌పై దాడి కేసులో రిమాండ్ రిపోర్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి కోసం నిందితులు పక్కాగా స్కెచ్ గీసుకున్నారన్న విషయం తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో పాటు కాల్‌డేటా, సిసిటివి ఫుటేజ్‌లు అన్నీ పరిశీలించిన పోలీసులు.. నిందితులను గుర్తించారు. ఇందులో పొలిటికల్ కాన్స్పిరసీ (రాజకీయ కుట్ర) ఉందని వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి కదలికలు స్పాట్లో ఉన్నట్లు నిర్ధారించారు. తమకు వచ్చిన సమాచారంతో అన్ని ఆధారాలు సేకరించి నిందితుడ్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.17వ తేదీన A1నిందితుడిని రాజరాజేశ్వరిపేటలో అరెస్ట్ చేసి సెల్‌ఫోన్ సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఏ2 ప్రోద్బలంతో.. నిందితుడు సతీష్ కుట్ర చేసి దాడికి పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. సీఎంను చంపాలనే కుట్రతోనే సీఎం తల భాగంపై దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.కుట్ర ఎలా జరిగిందంటే?ముఖ్యమంత్రిపై దాడి చేయాలని ముందస్తు పథకం వేసుకున్నారు.ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు ఏ1 సతీష్‌ను ప్రేరేపించాడు.ఈ కేసులో ఏ2 ఆదేశాలతో సీఎం జగన్‌ను హత్య చేయడానికి సతీష్ సిద్ధమయ్యాడుసింగ్ నగర్ ప్రాంతంలో వివేకా నంద స్కూల్ దగ్గర నిందితుడు వెయిట్ చేశాడుసీఎం జగన్ వచ్చే వరకు ఎదురు చూశాడుదాడికి పదునుగా ఉన్న రాళ్లను ముందే సేకరించాడుప్యాంటు జేబులో రాళ్లను పెట్టుకుని నిందితుడు వచ్చాడునిందితుడి కాల్ డేటాలో కీలకమైన అంశాలు దొరికాయిసీసీటీవీ ఆధారంగా కేసుకు సంబంధించి చాలా విషయాలు లభించాయిప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం క్లియర్‌గా ఉందిఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది సాక్షులను విచారించాంసాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేశాం17వ తేదిన నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్టు చేసి సెల్ ఫోన్ సీజ్ చేశారు. -
సీఐపై దాడికి టీడీపీ నేతల యత్నం
గంగాధనెల్లూరు (చిత్తూరు జిల్లా): గంగాధరనెల్లూరు ఆర్వో కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న సీఐ శంకర్‌పై శ్రీరంగరాజపురం టీడీపీ మండల అధ్యక్షుడు జయశంకర్‌నాయుడు, మరికొందరు నేతలు తీవ్రంగా దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించారు. గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ నామినేషన్ దాఖలులో భాగంగా మంగళవారం ఆర్వో కార్యాలయంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ప్రవేశించేందుకు ప్రయత్నం చేశారు. ఆర్వో కార్యాలయం వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం విధుల్లో ఉన్న సీఐ శంకర్ అలా వెళ్లకూడదని అడ్డుకునే యత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన జయశంకర్‌నాయుడు ‘నన్నే అడ్డుకుంటావా.. వచ్చేది మా ప్రభుత్వం నీ అంతు చూస్తా నా..’ అంటూ సీఐపై బూతు పురాణంతో విరుచుకు పడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి దూషణకు దిగి సీఐ డౌన్‌డౌన్ అంటూ నినాదాలతో రోడ్డుపై బైఠాయించారు. తన్నుకున్న తమ్ముళ్లు.. ర్యాలీ కోసం 30 బస్సుల్లో జనాన్ని పోగుచేసి రూ.3 వందలు, మద్యం బాటిల్, బిర్యానీ ప్యాకెట్ పంపిణీ చేసినట్లు తెలిసింది. తీసుకొచ్చిన జనానికి మందుబాటిళ్ల పంపకాల్లో తేడా రావడంతో ఆర్వో కార్యాలయం ఎదుటే టీడీపీ కార్యకర్తలు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. కర్రలతో కొట్టుకున్నారు. అదేవిధంగా ఫొటోగ్రాఫర్లకు అనుమతి లేని రిటరి్నంగ్ కార్యాలయం ఆవరణంలో డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి తెలుగు తమ్ముళ్లు పైశాచిక ఆనందాన్ని పొందారు. -
టీడీపీ దాడిలో గాయపడిన వెంకటరెడ్డి కన్నుమూత
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ నాయకుడు, జేసీఎస్ కన్వినర్ మేకా వెంకటరెడ్డి కన్నుమూశారు. తొలుత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బ్రెయిన్ డెడ్ అయిందని మణిపాల్ వైద్యులు శుక్రవారం తెలిపారు. ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని పేర్కొన్నారు. వెంకటరెడ్డి కన్నుమూసినట్లు శుక్రవారం రాత్రి 10.30 గంటలకు ప్రకటించారు. ఈ వార్త తెలియడంతో వెంకటరెడ్డి భార్య సునీత, కుమార్తె, కుమారుడు, కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్దే కుప్పకూలారు. తమకు దిక్కెవరంటూ సునీత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ వర్గీయులను టీడీపీకి చెందినవారు దుర్భాషలాడటమేగాక ద్విచక్ర వాహనాలతో ఢీకొట్టిన విషయం తెలిసిందే. కిందపడిపోయి తలకు తీవ్రగాయమైన మేకా వెంకటరెడ్డి తొలుత బ్రెయిన్ డెడ్ అయ్యారు. చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. పార్టీ అండగా ఉంటుందన్న ఎంపీ ఆళ్ల అంతకుముందు చికిత్స పొందుతున్న మేకా వెంకటరెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి శుక్రవారం మణిపాల్ ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వెంకటరెడ్డికి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలపడంతో ఎంత ఖర్చయినా ఆయనకు వైద్యం చేయాలని ఎంపీ సూచించారు. వెంకటరెడ్డి భార్య సునీత, కుమారుడు హేమంత్, కుమార్తెలను పరామర్శించారు. ఆ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా జేసీఎస్ కో–ఆర్డినేటర్ ఈదులమూడి డేవిడ్‌రాజు, పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి, జేసీఎస్ నియోజకవర్గ కనీ్వనర్ మున్నంగి వివేకానందరెడ్డి, పార్టీ నాయకులు రాజారెడ్డి, భూపతి కిషోర్‌నాయుడు తదితరులు ఆస్పత్రికి వెళ్లారు. పోలీసుల అదుపులో నిందితులు కుంచనపల్లిలో గురువారం రాత్రి ఈ దాడులకు తెగబడిన నిందితులు టీడీపీ తాడేపల్లి పట్టణ కార్యాలయంలో తలదాచుకున్నట్లు తెలిసింది. వెంకటరెడ్డి చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద పరిస్థితిని గమనించేందుకు శుక్రవారం తెల్లవారుజామున మహానాడుకు చెందిన ఓ మాజీ రౌడీషీటర్ తన కొడుకైన రౌడీషీటర్‌ను, కొందరు యువకులను తీసుకుని వచ్చారు. ఇదే క్రమంలో వెంకటరెడ్డిని ఢీకొట్టిన ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చారు. ఆ వాహనంపైన వెనుక కూర్చున్న ప్రకాశం జిల్లా పొదిలి మండలం బచ్చలకుర్రపాడుకు చెందిన యువకుడు, ప్రస్తుతం మహానాడులో నివాసముంటున్న మాదల గురువర్ధన్‌ను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గుర్తుపట్టారు. ఆ వాహనాన్ని, గురువర్ధన్‌ను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. గురువర్ధన్‌ను, ద్విచక్ర వాహనాన్ని పట్టుకున్నారని తెలియడంతో దాడిలో పాల్గొన్న యువకుల తల్లిదండ్రులతో టీడీపీ నాయకులు పార్టీ కార్యాలయంలో మంతనాలు జరిపారు. పోలీసుల నుంచి ఒత్తిడి రావడంతో వెంకటరెడ్డిని ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన బొమ్మలబోయిన ఈశ్వర్‌ను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. తరువాత తమ అనుకూల మీడియాలో వైఎస్సార్సీపీకి, వెంకటరెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. వారు తమ కార్యకర్తలే కాదంటూనే.. ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతున్న వారిని వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారని, బైక్ బ్రేక్ ఫెయిలవడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రచారం చేయసాగారు. వెంకటరెడ్డిని వెనుక నుంచి బైక్‌తో ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. -
బెదిరించి, కవ్వించి.. వైఎస్సార్సీపీ కుటుంబంపై టీడీపీ దాడి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీలో చేరతారా లేక కుల, గ్రామ బహిష్కరణ చేయమంటారా అని బెదిరించినా, భయపెట్టినా లొంగలేదని ఒక కుటుంబంపై టీడీపీ వర్గీయులు దాడిచేసి ఐదుగురిని గాయపరిచారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం మిట్టపాలెం ఎస్సీ కాలనీలో గురువారం రాత్రి టీడీపీ వర్గీయులు ఈ దారుణానికి దిగారు. బాధితుల కథనం ప్రకారం వైజాగ్‌లో ఉద్యోగం చేసుకునే ఈ కాలనీ వాసి గడ్డం కిషోర్ ఇటీవల ఇంటికి వచ్చాడు. వీరి కుటుంబాన్ని టీడీపీలో చేరాలని అదే కాలనీకి చెందిన టీడీపీ నాయకుడు ఐనంపూడి రమేష్ 2019 నుంచి డిమాండ్ చేస్తున్నాడు. ఆయన భయపెట్టినా, బెదిరించినా కిషోర్ కుటుంబం వైఎస్సార్సీపీలోనే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో కిషోర్ తన ఇంటి గేటు వద్ద ఉండగా ఆ కాలనీకి చెందిన గడ్డం మధు అనే యువకుడు సిమెంటు రాయి తెచ్చి కిషోర్ ఇంటి తడికపైకి విసిరాడు. రాయి ఎందుకు విసిరావంటూ కిషోర్ కేకలు వేశాడు. తరువాత 11.40 గంటలకు టీడీపీ నాయకుడు ఐనంపూడి రమేష్ సుమారు 15 మందిని తీసుకొచ్చి కేకలు వేశాడు. బయటకు వచ్చిన కిషోర్ కుటుంబసభ్యులపై దాడిచేశారు. కిషోర్ భార్య హెమీమాను జుట్టు పట్టుకుని లాగటంతోపాటు ఆమె చేతివేలిని గడ్డం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కొరికి గాయపరిచాడు. కిషోర్ అక్క దాసరి ఎస్తేరమ్మ, తల్లి గడ్డం కొండమ్మ, బావ నాగరాజుపైన దాడిచేసి గాయపరిచారు. కిషోర్‌ను మురుగు కాలువలో పడేసి పొడవాటి వస్తువుతో కొట్టి గాయపరిచారు. ఆ ప్రాంతంలో వీధిలైట్లను కూడా ఆపేసి ఈ దాడికి దిగారు. ఈ దాడిని చిత్రీకరించేందుకు ప్రయత్నించిన కిషోర్ మేనకోడలు దాసరి ప్రవల్లిక సెల్‌ఫోన్ లాక్కుని ధ్వంసం చేశారు. బాధితులకు కొండపి ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. ఐనంపూడి రమేష్, గడ్డం వెంకటేశ్వర్లు, లక్కిపోగు సుధాకర్, ఐనంపూడి భాస్కర్, గడ్డం మధు, గడ్డం మరియమ్మ, గడ్డం నిర్మల, గడ్డం ఆకాష్, మరికొందరు తమపై దాడిచేసినట్లు కిషోర్ చెప్పారు. ఇరువర్గాలకు గాయాలయ్యాయని, రెండువర్గాలపై కేసులు నమోదు చేస్తామని ఎస్.ఐ. కృష్ణబాజిబాబు చెప్పారు. దాడికి గురైనవారి మీద కూడా కేసు పెడతామని ఎస్.ఐ. పోలీసులు చెప్పడంతో వైఎస్సార్సీపీ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పక్షపాత«ంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. -
రాజధాని కేసుల్లో..బాబుకు జైలే..
సాక్షి, అమరావతి: చట్టాల్ని ఏమార్చి పదుల కేసుల్లో స్టేలు తెచ్చుకొని.. సచ్చిలుడని విర్రవీగిన చంద్రబాబు అవినీతి పుట్ట పగిలింది. మేకవన్నె పులికి మారుపేరైన ఆయన అసలు రూపం కోర్టుల సాక్షిగా సాక్షాత్కారమైంది. ఎంతో నేర్పుగా చేసిన స్కిల్ స్కామ్.. అమరావతి అసైన్డ్ భూ దోపిడీ.. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం.. ఇలా అవినీతి దందాలతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. అవినీతి చేశాను.. అయితే నాకు చట్టాలు వర్తించవనే జిత్తులమారి తెలివితేటలతో సెక్షన్ 17–ఏను అడ్డం పెట్టుకొని తప్పించుకుందామన్న పన్నాగం బెడిసికొట్టింది. చంద్రబాబుపై కేసుల్లో నేరం నిరూపితమైతే రాజధాని కుంభకోణం కేసుల్లో యావజ్జీవ ఖైదు తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒక్కో కేసులో భారీ అవినీతి స్కిల్ స్కామ్: జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ పేరిట ఆ కంపెనీకే తెలియకుండా ప్రాజెక్ట్‌ను సృష్టించి స్కిల్ స్కామ్‌కు పాల్పడ్డారు. ఈ కేసులోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడంతోపాటు న్యాయస్థానం రిమాండ్ విధించగా.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజలపాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అసైన్డ్ భూదోపిడీ:అమరావతిలో ఏకంగా రూ.5 వేల కోట్ల భూదోపిడీకి పాల్పడ్డారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కామ్: అలైన్మెంట్లో అక్రమాల ద్వారా క్విడ్ ప్రోకోతో రూ.2,500 కోట్ల మేర అవినీతి.. అందుకోసం కేబినెట్ ఆమోదం లేకుండానే జీవోలు జారీ. నోట్ ఫైళ్లపై స్వయంగా చంద్రబాబే సంతకాలు చేసి అక్రమాల కథ నడిపించారు. అనంతరం నోట్ ఫైళ్లను గల్లంతు చేశారు. సీఐడీ ఆ అవినీతిని వెలికి తీయడంతో అతని బాగోతం బట్టబయలైంది. ఈ కుంభకోణాలన్నిటికీ సూత్రధారి చంద్రబాబే అని కీలక సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. 164 సీఆర్పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ కుంభకోణాల్లో చంద్రబాబు ప్రధాన కుట్రదారు, ప్రధాన లబ్ధిదారుడిగా ఉన్నారని డాక్యుమెంటరీ ఆధారాలు, కీలక సాక్షుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసుల నుంచి చంద్రబాబు తప్పించుకోవడం ఇక అసాధ్యమని న్యాయ నిపుణుల అభిప్రాయం. కేబినెట్‌కు తెలియకుండా చీకటి జీవోలు చంద్రబాబు అవినీతి విశ్వరూపాన్ని ఛేదించడం అంత తేలిక కాదు. కొన్ని సార్లు తప్పించుకోవచ్చు.. అన్నిసార్లూ తప్పించుకోలేరు.. చివరకు పక్కా ఆధారాలతో దొంగ దొరికాడు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సర్వం తానై కుంభకోణాలకు పాల్పడ్డారు. 2014 నుంచి 2019 వరకు బరితెగించి సాగించిన అన్ని కుంభకోణాల్లోనూ కర్త, కర్మ, క్రియ చంద్రబాబేనని సీఐడీ పూర్తి ఆధారాలతో నిగ్గు తేలి్చంది. కేబినెట్‌కు తెలియకుండా చీకటి జీవోలు జారీ చేసి ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టేశారు. ప్రభుత్వ నిధులు అస్మదీయులకు మళ్లించి.. షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా ఆ డబ్బును విదేశాలకు తరలించారు. అవి హవాలా మార్గంలో తన బంగ్లాకే చేరేలా పక్కా వ్యూహం అమలుచేశారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదు: సుప్రీంకోర్టు స్కిల్ స్కామ్‌లో సీఐడీ దర్యాప్తు చేసి చంద్రబాబును అరెస్ట్ చేశాక విజయవాడ ఏసీబీ న్యాయ స్థానంలో హాజరుపర్చింది. దాదాపు 10 గంటలు ఇరుపక్షాల వాదనల అనంతరం ఆయనకు న్యాయమూర్తిజ్యుడిíÙయల్ రిమాండ్ విధించారు. సీఐడీ అభియోగాలు, అందులో పేర్కొన్న సెక్షన్లతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ ఈ నిర్ణయం ప్రకటించారు. చంద్రబాబు 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరైంది. సెక్షన్ 17–ఏను వక్రీకరిస్తూ కేసుల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 17–ఏ వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సర్వం తానై.. కుట్రదారు, లబ్ధిదారుగా సర్వం తానై చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని సీఐడీ ఆధారాలతో నిగ్గు తేల్చింది. సిŠక్ల్, అసైన్డ్ భూములు, ఐఆర్ఆర్ అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ఏ1గా చేరుస్తూ కేసు నమోదు చేయడంతోపాటు న్యాయస్థానాల్లో చార్జిïÙట్లు దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఎ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసింది. ఇప్పటికే చంద్రబాబుకు 74 ఏళ్లు. నేరం నిరూపితమై శిక్షలు పడితే యావజ్జీవం తప్పదు. ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూముల కేసుల్లో లోకేశ్ నిందితుడిగా ఉన్నారు. నారాయణతోపాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు ఈ కేసుల్లో ఉన్నారు. వారంతా శిక్ష అనుభవించాల్సిందేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ అవినీతికి పాల్పడిన కేసుల్లో హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు 16 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడింది. తాజాగా తమిళనాడులో మంత్రిగా చేసిన సెంథిల్ బాలాజీ, మద్యం కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇప్పటికీ బెయిల్ రాకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. వేర్వేరుగా శిక్షలు అనుభవించాల్సిందే అత్యంత కీలకమైన సెక్షన్ 409 కింద నేరం నిరూపితమైతే యావజ్జీవం విధిస్తారు. అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద నేరం నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష.. ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. ఇతర సెక్షన్ల కేసుల్లో తీర్పులు వేర్వేరుగా వస్తాయి. నేరం నిరూపితమై శిక్ష పడితే చంద్రబాబు వేర్వేరుగా శిక్షలు అనుభవించాలి. -
సీఎం వైఎస్ జగన్‌పై దాడి: అది ముమ్మాటికీ హత్యాయత్నమే..
సాక్షి ప్రతినిధి, విజయవాడ : సీఎం వైఎస్ జగన్‌పై నిందితుడు విసిరిన పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయి కనుబొమపై కాకుండా ముఖ్యమంత్రి తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని పోలీసులు తమ దర్యాప్తు నివేదికలో తేల్చిచెప్పారు. ఈ విషయం నిర్ధారణ అయినందునే ఐపీసీ 307 కింద హత్యయత్నంగా కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొనడంతో అందుకు న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో నిందితుడు వేముల సతీశ్‌కుమార్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు అతనిని నెల్లూరు సబ్‌జైలుకు తరలించారు. అంతకుముందు.. ఈ కేసులో నిందితుడిని విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరిచినప్పుడు ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదనలు వాడివేడీగా సాగాయి. హత్యాయత్నం కేసును పక్కదారి పట్టించేందుకు నిందితుడి తరఫు న్యాయవాది ప్రయత్నించగా.. పోలీసుల తరఫున వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిశోర్ ఆ వాదనలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ చేసిన వీడియోల ఆధారంగా నిందితుడి తరఫు న్యాయవాది వాదించడం గమనార్హం. ముఖ్యమంత్రికి రాయిదెబ్బ తగలలేదని.. గజమాల ఇనుప వైర్ గీసుకుని గాయమైందని.. పైగా, ఈ దాడికి పాల్పడాలని నిందితుడు సతీశ్‌ను ఎవరూ ప్రేరేపించలేదని వాదించారు. కానీ, ఈ వాదనలను ఏపీపీ కిశోర్ తిప్పికొట్టారు. పోలీసుల రిమాండ్ నివేదికలో పేర్కొన్న అంశాలను ఉటంకిస్తూ పక్కా కుట్రతోనే సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సీఎం జగన్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌కు తగిలిన గాయాల తీవ్రతపై ప్రభుత్వాసుపత్రి అధికారులు ఇచ్చిన నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. నిందితుడు హత్యాయత్నానికి ఉపయోగించిన పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయి సీఎం జగన్ కనుబోమపై కాకుండా తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని నిర్ధారణ అయినందునే ఈ దుర్ఘటనను హత్యయత్నంగా కేసు నమోదు చేసినట్లు వివరించారు. కుట్రదారుల ప్రేరేపణతోనే.. గతంలో మధ్యప్రదేశ్‌కు చెందిన కేదర్‌యాదవ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఏపీపీ ఈ సందర్భంగా ఉదహరించారు. కొందరు కుట్రదారుల ప్రేరేపించడంతోనే నిందితుడు వేముల సతీశ్ సీఎం జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడైందన్నారు. నిందితుడు సతీష్ మైనర్ అని అతని తరఫు న్యాయవాది వాదనను ఏపీపీ కిశోర్ తప్పని నిరూపించారు. పోలీసులు ముందుగానే నిందితుడు సతీ‹Ùకు కార్పొరేషన్ జారీచేసిన జనన ధృవీకరణ పత్రాన్ని న్యాయస్థానానికి సమర్పించారు. దాని ఆధారంగా నిందితుడికి 19 ఏళ్లు ఉన్నట్లుగా తేలిపోయింది. దీంతో న్యాయస్థానం సతీశ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం.. భద్రతా కారణాల దృష్ట్యా అతనిని పోలీసులు నెల్లూరు సబ్‌జైలుకు తరలించారు. ఈ కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకుగాను నిందితుడు సతీశ్‌ను పోలీస్ కస్టడీకి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. -
బొండా బ్యాచ్ స్కెచ్.. సీఎం జగన్‌ను హత్య చేసేందుకే..
సాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హత్య చేయాలన్న పక్కా కుట్రతోనే ఆయనపై పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయితో దాడికి పాల్పడ్డారు. కుట్రదారులు పక్కా పన్నాగంతో నిందితుడు వేముల సతీశ్ కుమార్‌ను ప్రేరేపించి ముఖ్యమంత్రి జగన్‌పై దాడికి పాల్పడేలా పురిగొల్పారు. విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ యాత్ర సందర్భంగా వివేకానంద పాఠశాల వద్ద దాడికి పాల్పడి సీఎంను హతమార్చాలన్నది కుట్రదారుల పన్నాగం. ముఖ్యమంత్రి జగన్ తలపై సున్నిత భాగంలో పదునైన రాయితో బలంగా దాడి చేయడం ద్వారా హతమార్చాలన్నది ప్రణాళిక’ అని పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడలో జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. విజయవాడ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీశ్ కుమార్ ఈ హత్యాయత్నానికి పాల్పడినట్టు ఆధారాలతో సహా గుర్తించారు. సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు లో ప్రధాన నిందితుడైన వేముల సతీశ్ మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ నేత బొండా ఉమాతో సన్నిహితంగా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న దృశ్యాలు వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ కేసులో ఏ 2గా ఉన్న నిందితుడు కూడా బొండా ఉమాకు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. ముఖ్యమంత్రిని హత్య చేసేందుకు కుట్రదారుల పన్నిన పన్నాగాన్ని పోలీసులు ఆధారాలతో వెలికితీశారు. హత్యాయత్నానికి పాల్పడిన వేముల సతీష్‌ను ప్రధాన నిందితుడు (ఏ1)గా పేర్కొంటూ గురువారం విజయవాడ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. సీఎం జగన్‌పై హత్యాయత్నానికి సతీష్‌ను ప్రేరేపించిన మరో కీలక నిందితుడిని ఏ 2గా పేర్కొంటూ, ఈ కుట్ర కోణాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. కాగా, ఏ2 గా ఉన్న నిందితుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు ప్రధాన అనుచరుడు. సెంట్రల్ నియోజవర్గ టీడీపీ బీసీ సెల్లో కీలక నేత. అంతేగాక సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ సోషల్ మీడియా విభాగంలోనూ కీలక నేత కావడం గమనార్హం. రిమాండ్ నివేదికలోని ప్రధానాంశాలు ఇవీ.... గతంలోనూ నేర చరిత్ర.. ముఖ్యమంత్రి జగన్‌ను హత్య చేయాలని కుట్రదారులు పన్నాగం పన్నారు. ‘మేమంతా సిద్ధం’ యాత్రలో ఆయనపై దాడికి పాల్పడి హతమార్చాలన్నది వారి కుట్ర. ముఖ్యమంత్రి తలపై సున్నిత ప్రదేశంలో పదునైన రాయితో దాడి చేసి అంతం చేయాలని పథకం రూపొందించారు. అందుకు విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని వివేకానంద స్కూల్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ముఖ్యమంత్రిపై దాడి చేసేందుకు వేముల సతీష్ కుమార్‌ను ఎంపిక చేశారు. గతంలో నేర చరిత్ర కూడా ఉన్న అతడు ఏ2కి కీలక అనుచరుడు. ముఖ్యమంత్రిపై దాడి చేసి హత్య చేయాలని సతీష్‌ను ఏ2 ప్రేరేపించాడు. ముందే చేరుకుని మాటు వేసి.. కుట్రదారుల పన్నాగాన్ని వేముల సతీష్ అమలు చేశాడు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ యాత్ర ఈ నెల 13న విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌లోకి ప్రవేశించక ముందే అక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయిని సేకరించి జేబులో వేసుకుని వివేకానంద స్కూల్ వద్దకు చేరుకుని మరి కొంతమందితో కలసి మాటు వేశాడు. ఆ రోజు రాత్రి 8.04 గంటలకు సీఎం జగన్ తన వాహనంపై నిలబడి యాత్ర నిర్వహిస్తూ అక్కడికి చేరుకున్న సమయంలో వేముల సతీష్ తన ఫ్యాంట్ జేబులోని పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయిని తీసి సీఎం వైఎస్ జగన్‌పై బలంగా విసిరి దాడికి పాల్పడ్డాడు. అదృష్టవశాత్తూ ఆ సిమెంట్ కాంక్రీట్ రాయి ముఖ్యమంత్రి తలపై సున్నిత భాగంలో కాకుండా ఎడమ కన్ను పైభాగంలో తగలడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. తెరవెనుక కుట్రదారులపై దృష్టి ఈ కుట్ర కోణంపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. మరి కొందరు సాక్షులను విచారించడంతోపాటు సాంకేతికపరమైన డేటాను మరింత విశ్లేíÙంచాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే గుర్తించిన ఏ 2తోపాటు తెరవెనుక ఉన్న ప్రధాన కుట్రదారులపై పోలీసులు దృష్టి సారించారు. కుట్రదారులు ప్రేరేపించడంతోనే వేముల సతీశ్ ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు నిర్ధారించారు. అతడిని ప్రేరేపించిన ఏ2ని కూడా గుర్తించారు. ఏ2 పాత్రకి సంబంధించి మరింత సమాచారంతోపాటు అతడి వెనుక ఉన్న కీలక కుట్రదారుల హస్తాన్ని పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తులో దూకుడు పెంచారు. ఈ కేసులో త్వరలోనే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రానున్నట్లు స్పష్టమవుతోంది. కీలక వ్యక్తుల సహకారం లేకుండా ఈ కుట్రను ఇంత పకడ్బందీగా అమలు చేయడం సాధ్యం కాదని పోలీసులు పేర్కొంటున్నారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తులో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజీలు, సీఎం బస్సు చుట్టూ ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు, స్థానికులు తమ సెల్ఫోన్లో తీసిన వీడియోలు, కాల్ డేటా తదితర ఆధారాలను విశ్లేషించారు. ఆ ఆధారాలన్నీ హత్యాయత్నం కుట్రలో ఏ1 వేముల సతీష్, ఏ 2 పాత్రను నిర్ధారించాయి. మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ దర్యాప్తు బృందాలు ఈ నెల 17 సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాన నిందితుడు వేముల సతీష్‌ను విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని కేజీఎఫ్ అపార్ట్మెంట్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నాయి. ఈ కేసులో ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అతడి కదలికలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్న అనంతరం మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేశారు. నిందితుడి సెల్‌ఫోన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. సతీష్ ఇంట్లో సోదాలు జరిపి హత్యాయత్నానికి పాల్పడిన రోజు అతడు ధరించిన దుస్తులను స్వా«దీనం చేసుకున్నారు. అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా సతీష్‌ను అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి లాకప్‌లో ఉంచారు. నిందితుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతోపాటు సీఆర్పీసీ 50 కింద నోటీసులు కూడా జారీ చేశారు. -
‘మంగళగిరి’లో టీడీపీ దాష్టీకం
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో గురువారం రాత్రి టీడీపీ వర్గీయులు వీరంగం చేశారు. టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌కు, ఆయన అనుచరులకు ఓటమి భయం పట్టుకోవడంతో వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడులకు తెగబడ్డారు. నియోజకవర్గంలోని తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ వర్గీయులను దుర్భాషలాడటమేగాక ద్విచక్ర వాహనాలతో ఢీకొట్టారు. ఈ దాడిలో ముగ్గురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ నేత మేకా వెంకటరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక సీఎస్ఆర్ రోడ్లో ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను కొందరు దుండగులు అడ్డుకున్నారు. ఇక్కడ ప్రచారం చేయవద్దన్నారు. మద్యం మత్తులో ద్విచక్ర వాహనాలపై వచ్చినవారు.. ఇక్కడ లోకేశ్ గెలవాలంటూ కేకలు వేశారు. టీడీపీకి, లోకేశ్‌కు అనుకూలంగా, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ మేకా వెంకటరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ కృష్ణారెడ్డి తదితరుల చుట్టూ ద్విచక్ర వాహనాలను తిప్పారు. వీరిని పట్టించుకోకుండా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆ ప్రాంతంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. ఈ క్రమంలో ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి బూతులు తిడుతూ ఎన్నిసార్లు చెప్పాలిరా ప్రచారం చేయవద్దని అని అంటూ దురుసుగా ప్రవర్తించాడు. జేసీఎస్ కన్వీనర్ కృష్ణారెడ్డి కలగజేసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మనడంతో అతడిపై దాడిచేశారు. అంతలో మరో ఐదుగురు యువకులు ద్విచక్ర వాహనాలపై వచ్చారు. వారిలో ఒక యువకుడు మోటారు సైకిల్‌తో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను ఢీకొట్టాడు. ముగ్గురు వైఎస్సార్సీపీ నాయకులు, బూత్ కన్వీనర్లు రోడ్డుపై పడిపోయారు. కుంచనపల్లికి చెందిన బూత్ కన్వీనర్ మేకా వెంకటరెడ్డిని మరోసారి ద్విచక్రవాహనంతో ఢీకొట్టడంతో ఆయన కిందపడిపోయారు. తలకు తీవ్రంగా గాయమైంది. వచ్చిన ఆరుగురిలో ఇద్దరు యువకులు రోడ్డుపై రక్తపుగాయాలతో ఉన్న మేకా వెంకటరెడ్డిని కాళ్లతో తన్నారు. వెంకటరెడ్డిని కొడుతుంటే ఆపేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడిచేసి కొట్టి ద్విచక్ర వాహనాలపై పరారయ్యారు. ద్విచక్ర వాహనంపై పారిపోతున్న వారిలో ఒక యువకుడిని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పట్టుకున్నారు. అది గమనించిన టీడీపీ కార్యకర్తలు ద్విచక్రవాహనాలపై వెనక్కివచ్చి పట్టుకున్న వారిని ఢీకొట్టేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పట్టుబడిన వ్యక్తి విడిపించుకుని పరారయ్యాడు. తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్లిన వెంకటరెడ్డిని తాడేపల్లి పట్టణ పరిధిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్చారు. అతడికి వైద్యులు శస్త్రచికిత్స చేస్తున్నారు. ఈ విషయం తెలిసి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యులను అడిగి వెంకటరెడ్డి పరిస్థితి తెలుసుకున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటలు గడిస్తే తప్ప చెప్పలేమని వైద్యులు తెలిపారు. బయటి నుంచి దించారు ఓటమి భయంతో ఉన్న టీడీపీ నేతలు ఇప్పటికే బయట ప్రాంతాల నుంచి పలువురిని తీసుకొచ్చారు. కొందరు స్థానికులు, బయట నుంచి వచ్చినవారు కలిసి ఈ దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగులు వచ్చిన ద్విచక్ర వాహనాల్లో ఒకటి ఏపీ 39 ఎఫ్వై 2192 నంబరుతో ఉంది. ఇది విశాఖ అడ్రస్‌తో ఉందని తెలిసింది. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థి లోకేశ్ నియోజకవర్గంలో ప్రచారం చేసే సమయంలో వారి కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగించారని, ఎవరూ ఎక్కడా తగ్గవద్దు.. నేను చూసుకుంటానంటూ చెప్పారని గుర్తుచేశారు. లోకేశ్ అలా మాట్లాడబట్టే ఆ పార్టీ వారు ఇలా దాడులు చేస్తున్నారని చెప్పారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ‘పచ్చ’మూక హత్యాయత్నం
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ మూకలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశాయి. రెచ్చిపోయిన పచ్చమూకల దాడిలో నలుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఎమ్మెల్యే అభ్యర్థి వాహన డ్రైవర్ ఉన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ఎర్రనేల వీధిలో గురువారం రోడ్‌షోకి బయలుదేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య కాన్వాయ్కి ముందున్న ప్రచార వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని తాళాలు లాక్కున్నారు. తాళాలివ్వాలని వైఎస్సార్సీపీ కార్యకర్తలు కోరినా ససేమిరా అన్నారు. ‘తాళాలిచ్చేది లేదు. ఎవడికి చెప్పుకుంటారో చెప్పుకోండి..’ అంటూ టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అల్లుడు అవినాష్, వ్యాపార భాగస్వామి రాజగోపాల్ ఆ పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పారు. దీంతో రెండుపార్టీల కార్యకర్తల మధ్య తోపులాటతో ఉద్రిక్తత మొదలైంది. ప్రచారరథం తాళాలివ్వాలని కోరిన కళ్యాణదుర్గం మార్కెట్ యార్డు మాజీ చైర్పర్సన్ బిక్కి నాగలక్ష్మి భర్త బిక్కి హరి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు మంజునాథ్, అనిల్‌కుమార్‌లపై అవినాష్, రాజగోపాల్ దాడికి దిగారు. వీరితోపాటు అమిలినేని ప్రైవేట్ బౌన్సర్లు సుమారు 20 మంది మూకుమ్మడిగా దాడిచేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పిడిగుద్దులు గుద్దుతూ, ఎదపై కాళ్లతో తన్నుతూ, రాళ్లతో కొడుతూ మురుగు కాలువలోకి పడేశారు. పదేపదే గుండెలపై దాడిచేసి చంపేసేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య వ్యక్తిగత వాహన డ్రైవర్ శివపైనా దాడి చేశారు. అతడి గొంతు నులిమారు. వారి దాడిలో శివ చేతికి గాయాలయ్యాయి. అడ్డుకునేందుకు యత్నించిన స్థానిక వాల్మీకి వర్గానికి చెందిన మహిళలను అమిలినేని వర్గీయులు, కుటుంబసభ్యులు నానా దుర్భాషలాడారు. గొడవ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా అక్కడికెళ్లిన కళ్యాణదుర్గం పట్టణ సీఐ హరినాథ్‌పైనా టీడీపీ నాయకులు చిందులు వేశారు. ముఖ్యంగా బ్రహ్మసముద్రం మండల టీడీపీ కన్వినర్ పాలబండ్ల శ్రీరాములు నానా దుర్భాషలాడారు. సీఐని ఏకవచనంతో మాట్లాడుతూ దౌర్జన్యానికి దిగారు. విషమంగా వైఎస్సార్సీపీ కార్యకర్తల పరిస్థితి టీడీపీ మూకల దాడిలో గాయపడిన బిక్కి హరి, మంజునాథ్, అనిల్కుమార్లను కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో గురువారం సాయంత్రం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. టీడీపీ మూకలు పిడిగుద్దులు, రాళ్లతో ఎదపై దాడిచేయడంతో వారు శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారి కుటుంబసభ్యులు తెలిపారు. చికిత్స పొందుతున్న కార్యకర్తలను పలువురు నేతలు పరామర్శించి ధైర్యం చెప్పారు. కళ్యాణదుర్గంలో వైఎస్సార్సీపీకి వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక టీడీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య చెప్పారు. శాంతికాముకులైన వాల్మీకులపై దాడిచేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. వాల్మీకి కులానికి చెందిన వ్యక్తిననే చిన్నచూపుతోనే తనను బూతులు తిడుతూ, కులం పేరుతో దూషిస్తూ దాడిచేశారని బిక్కి హరి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి టీడీపీ నుంచి ప్రాణహాని ఉందని, తమకేదైనా జరిగితే టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుదే బాధ్యత అని బిక్కి నాగలక్ష్మి చెప్పారు. రెండు పార్టీల ఫిర్యాదులపై కేసులు నమోదు ఈ విషయమై రెండుపక్షాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘర్షణకు సంబంధించి రెండు పార్టీల ఫిర్యాదులపై కేసులు నమోదు చేస్తామని కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎర్రనేల వీధిలో ఎన్నికల ప్రచారం చేయడం, అదే ప్రాంతంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి రంగయ్య ఇల్లు, పార్టీ కార్యాలయం ఉన్నట్లు తెలిపారు. ముందస్తుగా ఎలాంటి గొడవలకు తావులేకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రెండు పార్టీల కార్యకర్తలు ఎదురుపడటంతో తోపులాట జరిగిందని తెలిపారు. వివాదం తీవ్రం కాకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.