`చంద్రబాబు అడ్రస్ బీజేపీ కార్యాలయంగా మారింది`
ఖమ్మం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు బలహీన పడ్డారంటూ ఘాటుగా విమర్శించారు. గురువారం ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన సీపీఐ సభలో నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు చంద్రబాబు అడ్రస్ బీజేపీ కార్యాలయంగా మారిందంటూ ఎద్దెవా చేశారు.
విభజన నిర్ణయంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని నారాయణ అన్నారు. దీంతో కాంగ్రెన్ నుంచి భారీగా వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీలకు దరఖాస్తులు వెళ్తున్నాయని నారాయణ చెప్పారు.