సాక్షి నెట్‌వర్క్: విభజన భయంతో గుండెఆగి మరణిస్తున్న వారి సంఖ్య తగ్గడం లేదు. శనివారం ఒక్కరోజే ఆరుగురు మృత్యువాతపడ్డారు. సీమాంధ్ర ఉద్యోగులు వెళ్తున్న వాహనాలపై రాళ్లతో దాడులు చేయడం వంటి దశ్యాలను టీవీల్లో చూస్తూ ఉద్వేగానికి గురై వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలంలోని మారెళ్లమడకకు చెందిన బొజ్జా భాస్కర్‌రెడ్డి(48), అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన కల్లిటి శ్రీనివాసులు (49), శ్రీకాకుళం జిల్లా హిరమండలం పాడలి పంచాయతీకి చెందిన మీసాల తులసమ్మ(53), కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని పి.లింగాపురానికి చెందిన కురవపెద్దవెంకటస్వామి (45) గుండెపోటుతో మృతిచెందారు. ఇక రాష్ర్ట విభజన భయంతో తూర్పుగోదావరి జిల్లాకాకినాడ రూరల్ మండలం తూరంగిపేటకు చెందిన టైలర్ కొఠాని దుర్గారావు (38), అమలాపురం గండు వీధికి చెందిన రిటైర్డ్ ఏపీఎస్‌ఈబీ ఉద్యోగి గుర్రాల జయరాందాసు(59) గుండెఆగి మృతి చెందారు.