జన్మభూమిని అడ్డుకున్నకమ్మకండ్రిగ వాసులు | Kammakandriga villagers protest janmabhoomi programmee | Sakshi
Sakshi News home page

జన్మభూమిని అడ్డుకున్నకమ్మకండ్రిగ వాసులు

Published Fri, Oct 10 2014 10:55 AM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

Kammakandriga villagers protest janmabhoomi programmee

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన జన్మభూమి కార్యక్రమానికి నిరసనల సెగ కొనసాగుతూనే ఉంది. తాజాగా చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగలో జన్మభూమి కార్యక్రమానికి వచ్చిన అధికారులను గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు.

 

గ్రామ సమీపంలోని కోళ్లఫారాల వల్ల వ్యాధులు ప్రబలుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తమ సమస్యలను అధికారులు పట్టించుకోవటం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించిన తర్వాతే తమ గ్రామంలోకి అడుగు పెట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement