మృతి చెందిన నారాయణమ్మ, ఆదిమ్మ, మారెప్ప, వెంకటనర్సప్ప, ఇన్‌సెట్టో ప్రమాదానికి గురైన వాహనం
సాక్షి, ఒంగోలు : ప్రకాశం జిల్లాలో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరోలు మండలం నల్లగుంట్ల వద్ద ఓ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. 10 మందికి గాయాలయ్యాయి. వివరాలు.. కర్ణాటకలోని చికమంగుళూరు జిల్లా సరిలి మండలానికి చెందిన 45 మంది భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు బుధవారం లారీలో బయల్దేరారు. కొమరోలు మండలం తంబళ్లపల్లి క్రాస్ వద్దకు వచ్చేసరికి లారీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో తీవ్ర గాయాలపాలైన నారాయణమ్మ, ఆదిమ్మ, మారెప్ప, వెంకటనర్సప్ప ఘటనాస్థలిలోనే మృతిచెందారు. గాయాలపాలైన çసుమారు 10 మందిని వెంటనే గిద్దలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మార్కాపురం డీఎస్పీ, గిద్దలూరు సీఐ, ఎస్‌ఐలు ఘటనాస్థలికి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment