సాక్షి, హైదరాబాద్ : చిత్ర పరిశ్రమలోని పనిచేస్తున్న నటులు, మహిళలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారంటూ ఓ తెలుగు టీవీ ఛానెల్ ఎడిటర్‌పై టాలీవుడ్ ప్రతినిధులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీనటుడు పోసాని కృష్ణ మురళీతో శనివారం నిర్వహించిన ఓ లైవ్ డిబేట్‌లో టాలీవుడ్‌లో పని చేస్తున్న మహిళలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఫిర్యాదు చేస్తున్న సమయంలో టాలీవుడ్ నటీనటులు ఝాన్సీ, హేమ, శివాజీ రాజా, బెనర్జీ, ఉత్తేజ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment