ఆర్టీసీ నష్టాలకు అధికారుల నిర్ణయాలే కారణం | rtc losses cause of officers decesions | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ నష్టాలకు అధికారుల నిర్ణయాలే కారణం

Published Wed, Sep 28 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

rtc losses cause of officers decesions

కర్నూలు(రాజ్‌విహార్‌): రోడ్డు రవాణా సంస్థ నష్టాలకు అధికారులు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలే కారణమని ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏవీ రెడ్డి ఆరోపించారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండురోజుల నిరసనలో భాగంగా మంగళవారం స్థానిక కొత్త బస్టాండ్‌లోని కర్నూలు–1, 2 డిపో గ్యారేజీల వద్ద కార్మికులు నల్లబ్యాడ్జీలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టాల పరిష్కారానికి క్షేత్ర స్థాయిలో అధ్యయనం జరగాల్సి ఉండగా అధికారులు కార్యాలయల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.  ఆ నిర్ణయాలను కార్మికులపై రుద్ది తీవ్ర పనిభారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కార్మికులపై పనిభారం పడుతోంది తప్ప సంస్థకు మాత్రం లాభాలు రావడం లేదన్నారు.

2015 ఉద్యోగుల లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ చెల్లించి 2016 జూలై నుంచి పెరిగిన డీఏను బకాయిలతోపాటు చెల్లించాలని కోరారు. సంస్థను నమ్ముకొని ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేయాలని కోరారు. మెడికల్‌ అన్‌ఫిట్‌ జాబితాలోని కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని, కారుణ్య నియామకాలు చేపట్టి మిగిలిన వారికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అద్దె బస్సులను రద్దు చేయాలని, ఇప్పటి వరకు అద్దె బస్సుల్లో సంస్థకు చెందిన కండక్టర్లను నియమించాలన్నారు. కార్యక్రమంలో రీజియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మజీద్, రీజినల్‌ కార్యదర్శి రాబర్ట్, నాయకులు ఎల్లన్న, 1, 2 డిపోల కార్యదర్శులు రమాంజనేయులు, ఆర్‌వీఎం రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement