రుణమాఫీ హామీ అమలులో ప్రభుత్వం విఫలం
రుణమాఫీ హామీ అమలులో ప్రభుత్వం విఫలం
Published Wed, Jul 27 2016 12:15 AM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM
వరంగల్ : రుణమాఫీ హామీ నెరవేర్చడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ నాయకులు ఆరోపించారు. రైతులకు ఏకకాలంగా రుణమాఫీ చేయాలని, బ్యాంకులు కొత్త రుణాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల ఎదుట టీడీ పీ శ్రేణులు మంగళవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఇందులో భాగంగా హన్మకొండ బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కాళోజీ జంక్షన్‌లోని డీసీసీ బ్యాంకు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బ్యాంకు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతక్క మాట్లాడుతూ అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పి గద్దెనెక్కిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం వాయిదా పద్ధతిలో మాఫీ చేయడం వల్ల రైతులకు ప్రయోజనం లే దన్నారు. రుణాలు రీషెడ్యూల్ కాక, బీమా ప్రీమియం చెల్లించక పంటబీమాకు నోచుకోలేదన్నారు. విడతల వారీగా ఇస్తున్న మాఫీ రుణా ల వడ్డీకి సరిపోవడం లేదన్నారు. ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా రైతులను ఆదుకునే చర్యలు ప్రభుత్వం చేపట్టలేదని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేషం అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, జెడ్పీ వైస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, గట్టు ప్రసాద్‌బాబు, బొట్ల శ్రీ నివాస్, అశోక్‌కుమార్, గన్నోజు శ్రీనివాస్, ఇం దిర , సంతోస్‌నాయక్, సారంగం, రహీం, బాల రాజు, వెంకటకృష్ణ, సాంబయ్య పాల్గొన్నారు.
Advertisement