చెన్నై: సినిమా షూటింగ్‌లో ఎన్నో అనుభవాలు, సంఘటనలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని భయంకరమైనవి ఉంటాయి.. కొన్ని ఆహ్లాదకరమైనవి కావచ్చు... భయంతో కూడిన అలాంటి అనుభవాన్ని గురు ఉచ్చత్తుల ఇరుక్కారు చిత్ర యూనిట్ చవిచూసిందట. దీని గురించి చిత్ర దర్శకుడు పి.దండపాణి వివరిస్తూ గురు ఉచ్చత్తుల ఇరుక్కారు చిత్ర క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్‌ను కేరళలోని దట్టమైన అటవీ ప్రాంతంలో చిత్రీకరించామని తెలిపారు. ఆ ప్రాంతంలోని ప్రధాన రోడ్డుకు మూడు కిలోమీటర్ల దూరంలో గల చెరువులో చిత్రీకరించాలని నిర్ణయించామన్నారు.
లొకేషన్ సెలెక్ట్ చేసినప్పుడు అందులో నీళ్లు ఉన్నాయని, షూటింగ్‌కు వెళ్లినప్పుడు చెరువులో నీళ్లు లేకపోవడంతో 70 ట్యాంకర్ల నీటితో చెరువును నింపామని చెప్పారు. అనంతరం షూటింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా ఒక ఏనుగు వచ్చిందన్నారు. దీంతో యూనిట్ అంతా భయంతో వణికిపోయామన్నారు. అయితే వచ్చిన ఏనుగు చెరువులో దిగి దాహం తీర్చుకుని తిన్నగా అడవిలోకి వెళ్లిపోవడంతో తాము ఊపిరి పీల్చుకున్నామన్నారు. గురుజీవా హీరోగా నటిస్తున్న ఇందులో పైసా చిత్రం ఫేమ్ ఆరా హీరోయిన్‌గా నటిస్తోందన్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో పాండిరాజన్, ఎంఎస్.భాస్కర్, ఇమాన్ అన్నాచ్చి, శ్రీరంజని, మనో, నమో నారాయణ నటిస్తున్నారని తెలిపారు. బెస్ట్ మూవీ పతాకంపై ఎం.ధనషణ్ము యగమణి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.
క్లైమాక్స్ షూటింగ్... సడన్‌గా ఏనుగు ఎంట్రీ !
Published Sat, Aug 12 2017 7:34 PM | Last Updated on Sat, Aug 11 2018 8:29 PM
Advertisement
Advertisement