ఇండోర్: టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే అరుదైన ఘనత సాధించాడు. టెస్టు ఫార్మాట్‌లో నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకుని అరుదైన జాబితాలో చేరిపోయాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో రహానే 4వేల పరుగుల మార్కును చేరాడు. ఫలితంగా ఈ ఫీట్ సాధించిన 16వ భారత క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. రహానే 104 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు వేల పరుగుల మార్కును చేరడంతో టీమిండియా మాజీ ఆటగాళ్లు సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌ల సరసన నిలిచాడు. గంగూలీ, లక్ష్మణ్‌లు తమ కెరీర్‌లో 104వ ఇన్నింగ్స్‌లోనే నాలుగు వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నారు. ఇక బంగ్లాదేశ్‌పై ఇది రహానేకు మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం.
బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లో రోహిత్(6), విరాట్ కోహ్లి(0)లు విఫలం కాగా, మయాంక్ అగర్వాల్ సెంచరీతో మెరిశాడు. ఇక చతేశ్వర్ పుజారా(54) హాఫ్ సెంచరీ సాధించి పెవిలియన్ చేరాడు. అటు తర్వాత రహానే అర్థ శతకం సాధించడంతో భారత్ ఆధిక్యంలో నిలిచింది. మయాంక్-రహానేల జోడి 150కు పైగా పరుగులు సాధించడంతో భారత్ పైచేయి సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment