జంషెడ్‌పూర్: రంజీ ట్రోఫీ గ్రూప్-సి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటింగ్ వైఫల్యంతో పరాజయం చవిచూసింది. హరియాణా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్‌సలోనూ టాపార్డర్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో హైదరాబాద్‌కు ఓటమి ఎదురైంది. చివరి రోజు ఆటలో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ కొల్లా సుమంత్ (151 బంతుల్లో 55; 5 ఫోర్లు), సీవీ మిలింద్ (114 బంతుల్లో 66 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు. హరియాణా బౌలర్లు మోహిత్ శర్మ (5/26), సంజయ్ పాహల్ (3/49) ఆకట్టుకున్నారు.
రాణించిన మిలింద్
ఆదివారం 102/5 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ రెండో ఇన్నింగ్‌సలో 83.5 ఓవర్లలో 224 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆట మొదలైన కాసేపటికే హసన్ (0) మోహిత్ శర్మ బౌలింగ్‌లో డకౌటయ్యాడు. దీంతో 103 స్కోరు వద్ద ఆరో వికెట్ పడింది. ఈ దశలో సుమంత్‌కు జతకలిసిన మిలింద్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఇద్దరు ముందుగా క్రీజ్‌లో పాతుకుపోయేందుకే ప్రాధాన్యమిచ్చారు. తర్వాత జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మొదట సుమంత్, అనంతరం మిలింద్ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇద్దరు ఏడో వికెట్‌కు 83 పరుగులు జోడించాక... జట్టు స్కోరు186 పరుగుల వద్ద సుమంత్‌ను ఎల్బీగా పెవిలియన్‌కు పంపిన మోహిత్ హైదరాబాద్‌ను కోలుకోనివ్వలేదు. తర్వాతి బంతికి విశాల్ (0)ను ఔట్ చేసి హ్యాట్రిక్ అశలు పెంచుకున్నాడు. కానీ రవికిరణ్ ఆ అవకాశమ్విలేదు. అరుుతే మోహిత్ మరుసటి ఓవర్లో రవికిరణ్ పరుగులేమి చేయకుండానే నిష్ట్రమించాడు. సిరాజ్ (11)ను సంజయ్ పాహల్ ఔట్ చేయడంతో హైదరాబాద్ ఇన్నింగ్‌స ముగిసింది.
తొలి ఇన్నింగ్‌సలో 140 పరుగుల ఆధిక్యం పొందిన హరియాణా కేవలం 85 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోరుు ఛేదించింది. ఓపెనర్ నితిన్ సైని (59 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, మిగతా లాంఛనాన్ని చైతన్య బిష్ణోయ్ (20 నాటౌట్) పూర్తి చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో మెహదీ హసన్, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్‌సలో హైదరాబాద్ 191 పరుగులు చేయగా, హరియాణా 331 పరుగులు చేసింది.
హైదరాబాద్ పరాజయం
Published Mon, Oct 17 2016 10:34 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement
Advertisement