ధోని కంటే సచిన్ మూడు రెట్లు ఎక్కువ
ధోని కంటే సచిన్ మూడు రెట్లు ఎక్కువ
Published Thu, Oct 31 2013 3:27 PM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM
భారత దేశంలో అతి సంపన్న క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అని ఓ పరిశోధన సంస్థ వెల్త్ ఎక్స్ ప్రకటించింది. సచిన్ టెండూల్కర్ సంపద 160 మిలియన్ డాలర్లుగా వెల్త్ ఎక్స్ లెక్క కట్టింది. వెల్త్ ఎక్స్ ప్రకటించిన వివరాల ప్రకారం ప్రస్తుత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కంటే సచిన్ టెండూల్కర్ ఆస్తి మూడు రెట్లు, యువరాజ్ సింగ్ కంటే ఐదు రెట్లు, రాహుల్ ద్రావిడ్ కంటే 8 రెట్లు, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే 10 రెట్లు ఎక్కువ అని వెల్లడించింది.
భారత క్రికెట్ ఆటగాళ్లలో సచిన్ 160 మిలియన్లతో అగ్రస్థానంలో ఉండగా, ధోని 50 మిలియన్లతో 2వ స్థానం, యువరాజ్ 30 మిలియన్లతో 3వ స్థానం, రాహుల్ ద్రావిడ్ 20 మిలియన్లతో 4వ స్థానం, కోహ్లి 15 మిలియన్లతో 5వ స్థానంలో ఉన్నారు.
నవంబర్ లో జరిగే వెస్టిండీస్ సిరీస్ లో తన 200వ టెస్ట్ ఆడనున్న సచిన్ .. ఆతర్వాత క్రికెట్ గుడ్ బై చెప్పనున్నారు. బుధవారం హర్యానాతో జరిగిన రంజీ ట్రోఫి మ్యాచ్ లో సచిన్ ముంబై జట్టును ఒంటి చెత్తో గెలిపించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement