సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో కోతల నుంచి పరిశ్రమలకు కాస్త ఉపశమనం లభించింది. అక్కడక్కడా వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. దీంతో విద్యుత్ డిమాండ్ తగ్గింది. ప్రస్తుతం రాష్ర్టంలోని పరిశ్రమలకు వారంలో ఒక రోజు 24 గంటల పాటు అమలు చేస్తున్న విద్యుత్ కోతలను 12 గంటలకు తగ్గించారు. ఈ మేరకు సీపీడీసీఎల్ సీఎండీ రిజ్వీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తగ్గిన విద్యుత్ కోతల వేళలు గురువారం (8వ తేదీ) నుంచి అమల్లోకి రానున్నాయని పేర్కొన్నారు.
అనంతపురంలో మంగళవారం, కర్నూలు జిల్లాలో ఆదివారం, మహబూబ్‌నగర్‌లో శనివారం, నల్లగొండలో శుక్రవారం, మెదక్ (బొల్లారం) పారిశ్రామికవాడలో మంగళవారం, బొల్లారం మినహా జిల్లాలోని మిగిలిన పారిశ్రామిక వాడల్లో గురువారం, రంగారెడ్డి (సౌత్)-బుధవారం, రంగారెడ్డి (నార్త్)- సోమవారం, రంగారెడ్డి (తూర్పు)- బుధవారం, హైదరాబాద్ జిల్లాలో సోమవారం ఈ విద్యుత్ కోతలు అమల్లో ఉండనున్నాయి. ఆయా రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ కోతలు అమల్లో ఉంటాయి.
కోతల నుంచి పరిశ్రమలకు ఉపశమనం
Published Thu, May 8 2014 4:21 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement
Advertisement