పోస్ట్.. లైక్.. షేర్.. కామెంట్!
హై‘టెక్’ ప్రచారం!
గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా బరిలో మిగిలిన అభ్యర్థుల జాబితా శుక్రవారం సాయంత్రం వెల్లడైంది. ఇక పోలింగ్ మార్చి 6వ తేదీ ఆదివారం జరగనుంది. అంతకు ఒకరోజు ముందే 4వ తేదీ సాయంత్రం ప్రచారం నిలిపివేయూల్సి ఉంటుంది. అంటే మధ్యలో సోమవారం నుంచి వచ్చే శుక్రవారం వరకు అంటే కచ్చితంగా ఐదు రోజుల సమయమే మిగులుతుంది. ఈ సమయంలో డివిజన్‌లోని ప్రతీ ఓటరును కలవడం అభ్యర్థులకు అసాధ్యమేనని చెప్పాలి. ఎందుకంటే 8వేల నుంచి 14వేల మంది వరకు ఓటర్లు ఉన్నారు. ఇంతమందిని తక్కువ సమయంలో కలుసుకోవడం సాధ్యం కాదని గుర్తించిన అభ్యర్థులు రకరకాల ఉపాయూలు ఆలోచిస్తున్నారు. ఇందులో నుంచి పుట్టుకొచ్చిందే హై‘టెక్’ ప్రచారం!
యువతపైనే దృష్టి
ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల ప్రచారంలో ఎప్పటికప్పుడు కొత్త విధానం అవలంబించడం మనం చూస్తూనే ఉంటాం. అరుుతే, ఓటర్ల ఇంటికి వెళ్తే ఉద్యోగస్తులు, గృహిణులను కలుసుకోవడం సాధ్యమవుతుంది. కానీ యువతరాన్ని పట్టుకోవాలంటే కొంత కష్టమే. దీనికి విరుగుడుగా వారి మార్గంలోకే వెళ్లి ప్రచారం చేసేం దుకు ‘గ్రేటర్’ అభ్యర్థులు సిద్ధమయ్యూరు. ఇందులో భాగంగా ఇప్పటి యువతరం ఎక్కువగా ఫాలో అయ్యే ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలను ఎంచుకుంటున్నారు. ఈ ప్రచారం ద్వారా అటు యువతరమే కాదు.. ఆండ్రారుుడ్ ఫోన్లు అందరి చేతుల్లో కనిపిస్తున్నందున మిగతా వర్గాల వారికి కూడా చేరువ కావొచ్చన్నది అభ్యర్థుల భావన.
అన్ని వర్గాలకు అనుగుణంగా...
జిల్లాలో నాలుగు లక్షల మందికి పైగా ఫేస్‌బుక్ యూజర్లు ఉన్నట్లు ఓ అంచనా. ఇందులో సగానికి పైగా నగర పరిధిలో ఉంటారని చెప్పొచ్చు. ఈ మేరకు ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాలు తరచుగా వాడే వారిని కలవడం వీలు కాని పక్షంలో ఆయూ మాధ్యమాల్లో పోస్టులు చేయడం ద్వారా ప్రచారం సులువవుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని సోషల్ నెట్‌వర్క్ సైట్లను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్ ద్వారా తమ ఫొటో, ఏ డివిజన్ నుంచి ఏ పార్టీ ద్వారా పోటీలో ఉన్నాం, తమను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి చేయనున్న కృషిని వివరిస్తూ అభ్యర్థులు పోస్టులు అప్‌డేట్ చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్
ఎన్నికల్లో పోటీలో నిలిచిన అభ్యర్థులు తమ పూర్తి వివరాలు, గ తంలో చేసిన సేవా కార్యక్రమాలు, ఉద్యమంలో పాల్గొన్న ఫొటోలు, తమ పార్టీ గురించి సైతం సోషల్ నెట్ వర్క్ సైట్లలో పొందుపరుస్తున్నారు. తమ బయోడేటా మొదలుకుని పార్టీ కార్యక్రమాల్లో తాను పాల్గొంటున్న ఫొటోలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేసుకుంటూ లైక్‌లు, షేరింగ్‌లు, కామెంట్ల కోసం ఎదురుచూస్తున్నారు. దీనికోసం తమ వర్గంలోని యువతను ప్రత్యేకంగా నియమించుకుంటుండడం విశేషం. సోషల్ మీడియాపై పెద్దగా అవగాహన లేని వారు సైతం తమ కుటుంబంలో ఉన్న యువతీయువకుల సహాయంతో అకౌంట్లు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ హై‘టెక్’ ప్రచారం అభ్యర్థులకు బాగానే ఉపయోగపడుతుందని చెప్పాలి.
అందరికి చేరువయ్యేందుకు...
ఇప్పటి యువతీ, యువకుల్లో ఫేస్‌బుక్ అకౌంట్లు లేని వారు ఉండరు. ప్రచారంలో భాగంగా మేం అందరి గృహాలకు వెళ్లినా యువత దొరకడం లేదు. దీంతో ఫేస్‌బుక్, వాట్సప్ ద్వారా ప్రచారం చేస్తున్నాం. ప్రచార సరళి, మమ్మల్ని గెలిపిస్తే చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నాం. ప్రచారానికి సమయం కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా చేసే ప్రచారం చేస్తున్నాం.