చేర్యాలలో ‘పొన్నాల’ రోడ్ షో | Ponnala road show | Sakshi
Sakshi News home page

చేర్యాలలో ‘పొన్నాల’ రోడ్ షో

Published Fri, Apr 18 2014 3:06 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

చేర్యాలలో ‘పొన్నాల’ రోడ్ షో - Sakshi

చేర్యాలలో ‘పొన్నాల’ రోడ్ షో

చేర్యాల, న్యూస్‌లైన్:  టీపీసీసీ చీఫ్, జనగామ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య మం డలకేంద్రంలో గురువారం ప్రచారం నిర్వహించారు. హెలికాప్టర్‌లో చేర్యాలకు వచ్చి న ఆయనకు ఎమ్మెల్సీ నాగపూరి రాజలిం గం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పొన్నాల వైశాలి, మాజీ ఎమ్మెల్యె గొర్ల సిద్దయ్య, మాజీ ఆప్కో చైర్మన్ మండల శ్రీరాములు, మొగుళ్ల రాజిరెడ్డి, బక్క నాగరాజు, పుల్ల భాస్కర్, కొమ్ము రవి, ఉడుముల భాస్కర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ రవీందర్‌రెడ్డి స్వాగతం పలికారు.

అనంత రం మార్కెట్ యార్డు నుంచి నేరుగా బహిరంగ సభకు వరకు వాహనంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నినాదాలతో సభ వరకు పాదయాత్ర చేశారు. చేర్యాల సినిమా టాకీసు నుంచి అంగడి బజారు వరకు పలువురు ఓటర్లతో పొన్నాల లక్ష్మ య్య వినూత్న రీతిలో ఓట్లు అభ్యర్థించా డు. చేర్యాల రోడ్ షోలో వాహనంలో నుంచి అభివాదం చేస్తూ కరాచాలనం చే శారు. చేర్యాలలోని రైతులతో మాట్లాడి పత్తి అమ్ముతూ, హోటల్ దగ్గర ఉన్న ఓటర్లను చాయ్ పోస్తూ, చెరుకు రసం అమ్ముతున్న ఒక మహిళ వద్దకు వెళ్లి చెరుకు రసం తాగుతూ ప్రచారం చేశారు.
 
చేర్యాలలోని అంగడి బజారు వద్ద ఉన్న బహిరంగ సభకు చేరుకున్న పొన్నా ల సభకు వచ్చిన జనంలో కొంత సేపు కూర్చొని అందరిని ఆశ్చర్య పరిచారు. అనంతరం బహిరంగ సభలో మధు ప్రియ పాటలు జనాన్ని ఆకట్టుకోగా పొన్నాల లక్ష్మయ్య ఆమె పాటకు కోరస్ ఇచ్చాడు. చేర్యాల బహిరంగ సభలో టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకులు మాట్లాడుతుండగా వీరన్నపేట గ్రామస్తులు ఆందోళన చేశారు.

చేర్యాలకు టీపీసీసీ అధ్యక్షుడిగా తొలిసారి రావడంతో యువకులు, కార్యకర్తలు పూలు చల్లుతూ పొన్నాలకు జేజేలు పలికా రు. కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్ ఆడెపు చంద్రయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు ముస్త్యాల కిష్టయ్య, భరణం నర్సయ్య, నాగమల్ల భిక్షపతి, కొమ్ము నర్సింగరావు, హరికాంత్‌రెడ్డి, కట్కూరు శ్రీనివాస్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, తాడెం రంజి త, తాడెం క్రిష్ణమూర్తి, కాటం మల్లేశం, పిన్న మల్లేశం, జిల్లా రాజేశం, బుడిగె గురువయ్య పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement