తెలంగాణ బంద్ విజయవంతం | Telangana bandh succeses | Sakshi
Sakshi News home page

తెలంగాణ బంద్ విజయవంతం

Published Sun, Jul 13 2014 4:21 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

తెలంగాణ  బంద్ విజయవంతం - Sakshi

తెలంగాణ బంద్ విజయవంతం

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాలలో ఆర్‌టీసీ బస్టాండ్‌ల ఎదుట బైఠాయించి ఆందోళనకారులు బస్సులను అడ్డుకున్నారు. జిల్లాలోని ఆరు డిపోల నుంచి 650 బస్సులు తిరగని కారణంగా ఆర్‌టీసీ రూ.40 లక్షల ఆదాయాన్ని కోల్పోయింది. జిల్లావ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు ని ర్వహించారు. పలుచోట్ల కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ, చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దిష్టిబొమ్మలను  దహనం చేశారు.
 
నిజామాబాద్ నగరంలో వామపక్షాల తో కలిసి టీఆర్‌ఎస్, కాంగ్రెస్, జేఏసీ నేతలు బంద్ లో పాల్గొన్నారు. వ్యాపారులు దుకాణాలను స్వ చ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ  ప్రధాన బస్టాండ్ ఎదుట వివిధ పార్టీల నాయకులు బైఠాయించి బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు బస్టాండ్ నుం చి  గాంధీచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.

 టీఆర్‌ఎస్ నాయకు లు బస్టాండ్ వద్ద బైఠాయించారు. వీరితో పాటు కాంగ్రెస్, వామపక్షాలు కూడా పాల్గొన్నాయి. టీ ఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి త దితరులు బస్టాండ్‌లో బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు బస్టాండ్, గాం ధీచౌక్, పూలాంగ్‌చౌరస్తా, ఎన్ టీఆర్ ఆర్ చౌరస్తా, రాజరాజేంద్రచౌరస్తా, కంఠేశ్వర్ ప్రాంతాలలో బం దోబస్తు ఏర్పాటు చేశారు.

ఆర్మూర్, నందిపేట్, మాక్లూర్ మండలాలలో బం ద్ విజయవంతమైంది. ఆర్మూర్ పట్టణంలో బైక్‌ల పై ర్యాలీలు నిర్వహించి వ్యాపార సముదాయాల ను మూసివేయించారు. రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. టీఆర్‌ఎస్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, సీపీఎం, పీడీఎస్‌యూ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. నందిపేట్ మండలంలో జేఏసీ కన్వీనర్ గంగాధర్, న్యూడెమోక్రసీ నాయకులు అబ్దు ల్, ఎంపీటీసీ సభ్యుడు బాల గంగయ్య ఆధ్వర్యం లో ధర్నా, రాస్తారోకో చేశారు. కేంద్ర ప్రభుత్వ ది ష్టిబొమ్మను దహనం చేసారు.

 మాక్లూర్ మండలంలోని మాదాపూర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు..
బోధన్‌లో సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. గోపాల్‌రెడ్డి, కార్యదర్శి మల్లేశ్, గంగాధరప్ప, సీపీఐ నియోజకవర్గం ఇన్‌చార్జి హ నుమంతరావు పాల్గొన్నారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, సీపీఐ(ఎంఎల్) చంద్రన్న వర్గం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. టీఆర్‌ఎస్, కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బోధన్‌లో ర్యాలీ నిర్వహించారు.

 మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య, మాజీ చైర్మన్ గౌసొద్దీన్, మాజీ ఎంపీపీ గిర్ధావర్ గంగాధర్, కుల సంఘాల జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్‌గౌడ్, కొండవెంకటి, కౌన్సిలర్లు శివరాజ్, నరేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాల్లో బంద్ సక్సెస్ అయ్యింది.

బాన్సువాడలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఎం నా యకులు బంద్‌లో పాల్గొన్నారు. వ్యాపార, వాణి జ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించా యి. బీర్కూరు, కోటగిరి, వర్నిలలో బంద్ విజయవంతం కాగా, పలుచోట్ల కేంద్ర ప్రభుత్వం, ప్రధా ని మోడీ, చంద్రబాబు, వెంకయ్యనాయుడు దిష్టిబొమ్మలను దహనం చేశారు.

జుక్కల్ నియోజకవర్గంలోని మహమ్మద్‌నగర్ గ్రా మంలో ధర్నా, రాస్తారోకోలు పెద్ద ఎత్తున నిర్వహించగా జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదర్ రాజు తదితరులు పాల్గొన్నారు. నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, జుక్కల్, బిచ్కుంద మండలాలలో బం ద్ ప్రశాంతంగా సాగింది. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.  కార్యక్రమంలో బిచ్కుంద జెడ్‌పీటీసీ సభ్యుడు సాయిరాం పాల్గొన్నారు.

కామారెడ్డి నియోజకవర్గంలో బంద్ విజయవంతమైంది. జేఏసీ కన్వీనర్ జి.జగన్నాథం, ప్రతినిధు లు తిర్మల్‌రెడ్డి, క్యాతం సిద్ధరాములు, న్యూడెమోక్రసీ నేత కట్ల భూమన్న, సీపీఎం నేత చంద్రశేఖర్,  కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్‌పీటీసీ సభ్యుడు మోహన్‌రెడ్డి, సీడీసీ చైర్మన్ అశోక్‌రెడ్డి, గూడెం శ్రీ నివాస్‌రెడ్డి తదితరులు బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మధ్యాహ్నం వరకు బస్సులు తిరగలేదు. బస్టాండ్ ఎదుట ఉద్యమకారులు బైఠాయిం చడంతో బస్సులు బయటకు వెళ్లలేదు. భిక్కనూరులో బంద్ విజయవంతం కాగా, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. మాచారెడ్డిలో ఎన్‌డీఏ దిష్టిబొమ్మ దహనం చేశారు. దోమకొండలో కాంగ్రెస్ టీఆర్‌ఎస్ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు రాస్తారోకోలు నిర్వహించారు.

డిచ్‌పల్లిలో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో  జెండాలు చేతబట్టి దుకాణాలు మూయించారు. సిరికొండ, జక్రాన్‌పల్లిలో టీజేఏసీ, టీఆర్‌ఎస్  మండల నా యకులు దుకాణాలు మూసివేయించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. ధర్పల్లిలో టీఆర్‌ఎస్ నాయకులు దుకాణాలు మూసివేయించారు. ఈ బంద్‌లో జడ్పీ వైస్ చైర్మన్ సుమనరెడ్డి, పార్టీ ఎంపీటీసీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి, లింగంపేట, తాడ్వాయి, గాంధారి మం డలాల్లో బంద్ జరిగింది. తాడ్వాయి మండలంలో టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్‌రాం రెడ్డి, శ్యాంరావు, లింగంపేట మండలంలో పార్టీ అధ్యక్షుడు మోహిద్, మాజీ ఎంపీపీ ముదాం సా యిలు, కమ్మరి వెంకటేశం, గాంధారిలో జడ్పీటీసీ సభ్యుడు తానాజీరావు, సర్పంచి సత్యం తదితరులు బంద్‌లో పాల్గోన్నారు.

బాల్కొండ, మోర్తాడ్, వేల్పూర్, కమ్మర్‌పల్లి, భీమ్‌గల్ మండలాల్లో బంద్‌లో స్థానిక టీఆర్‌ఎస్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా పలుచోట్ల రాస్తారోఖోలు నిర్వహించారు. బంద్ మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి బస్సులు ఎప్పటిలాగా తిరిగాయి. గురు పౌర్ణమి కావడంతో భక్తులు కొంత ఇబ్బందిని ఎదుర్కొ న్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement