ఓఎన్జీసీ లాభాలు జంప్..బోనస్, డివిడెండ్
న్యూఢిల్లీ: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) గురువారం రెండవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. రెండవ జులై -సెప్టెంబర్ త్రైమాసికం నికర లాభాల్లో 6 శాతం పెరుగుదలతో 4,974.92 కోట్లను ఆర్జించింది.గత ఏడాది రూ. 4,681 కోట్ల కంటే ఇది 6.2 శాతం ఎక్కువ ని కంపెనీబీఎస్ ఈ ఫైలింగ్ లో తెలిపింది. నికర అమ్మకాలు 10 .3 శాతం క్షీణించి రూ. 18287 కోట్లుగా రిపోర్ట్ చేసింది. గత ఏడాది ఇది రూ. 20396 కోట్లుగా ఉంది.
అయితే ఇంధన సబ్సిడీ వివరాలను సంస్థ ప్రకటించలేదు. అన్వేషణ ఖర్చులు రూ. 547 కోట్లుగా నమోదు చేసింది. దీంతోపాటుగా ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ, మూలధనం పెంపు యోచనలో భాగంగా 2:1 (ప్రతి రెండు షేర్లకు ఒకటి ) రేషియోలో బోనస్ , షేరుకు రూ.4.5 లమధ్యంతర డివిడెండ్ ను ప్రకటించింది. ఈ మేరకు బోర్డు ఆమోదం తెలిపినట్టు ప్రకటించింది దీని ప్రకారం పది రూపాయల ముఖ విలువ గల షేర్ రెండు గా స్ప్లిట్ కానుంది. కాగా త్రైమాసిక ఫలితాల తర్వాత ఒఎన్ జీసీ షేర్ స్వల్పంగా నష్టపోయింది.