Politics
-
తప్పుడు కేసులకు బెదరను: చెవిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: కూటమి సర్కార్ కక్ష సాధింపులకు దిగుతోందని.. ఒక బాధ్యతగా చేసిన పనిని తప్పుగా సృష్టిస్తారా? అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసులు పెట్టో, బెదిరించో పరిపాలన చేయాలంటే సాధ్యం కాదన్నారు.‘‘ఎన్ని కేసులు పెట్టినా భయపడను.. ప్రజల్లోనే ఉంటా. ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు.. ప్రజలు గమనిస్తూ ఉంటారు. నేను నూటికి నూరు శాతం ఒక బిడ్డకు అన్యాయం జరిగిందంటే వెళ్లా.. ఆ బిడ్డను పరామర్శిస్తే తప్పేంటి?’’ అంటూ చెవిరెడ్డి ప్రశ్నించారు.‘‘నామీద 11 సెక్షన్లతో కేసు పెట్టారు. ఫోక్సో కేసు కూడా నమోదు చేశారు. వైఎస్ జగన్ వెంట నడుస్తున్న వారికి భయాందోళన కల్పించాలని కుట్ర పన్నారు. బాలిక మీద దారుణం జరిగిందని ఆమె తండ్రే నాతో చెప్పారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న నేను బాధ్యతతో ఆ బాధితురాలికి అండగా నిలిచా. ఆమెని తిరుపతి తరలించి మెరుగైన వైద్యం అందించేలా సహకరించా....72 కిలోమీటర్లు వెళ్లి బాధితురాలికి అండగా నిలవటం నేను చేసిన తప్పా?. బాధ్యతగా ఉండటం తప్పుగా సృష్టిస్తారా?. భయపెట్టో, కేసులు పెట్టో పాలన చేయాలంటే సాధ్యం అవుతుందా?. బాధితురాలి తండ్రి అన్యాయం జరిగిందని చెప్తేనే నేను వెళ్లాను. నేను ఎక్కడకూ వెళ్లను, పారిపోను. నా ఫోన్ స్విచ్చాప్ చేయను. నేను అందుబాటులోనే ఉన్నా. ఆ దుర్మార్గులకు శిక్ష పడాలని తండ్రి డిమాండ్ చేశారు. ఒక బిడ్డకు అన్యాయం జరిగిందంటేనే నేను వెళ్లాను..ఆ బిడ్డ గురించి నేను ఎక్కడా నోరు తెరిచి మాట్లాడలేదు. ఒక్కమాట కూడా ఎక్కడా మాట్లాడలేదు. తీవ్రవాదుల మీద పెట్టినట్టు నామీద కేసు పెట్టారు. ఆ తండ్రిని పోలీసులు రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్లారు. నాగార్జున రెడ్డి వ్యక్తి ఆ తండ్రిని తీసుకుని తిరుపతి వెళ్లాడు. కూతురి దగ్గరకు తండ్రిని చేర్చాడు. అతనిమీద కూడా ఆ తండ్రితోనే కేసు పెట్టించారు. పరామర్శకు వెళ్తే పోక్సో కేసులు పెట్టవచ్చని చూపిస్తున్నారు. ఏ శిక్ష వేసినా నేను సిద్ధమే’’ అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. -
వలంటీర్లపై బాబు, పవన్ మాటలు ఏమయ్యాయి?: నారాయణ స్వామి
సాక్షి, చిత్తూరు: ఏపీలో వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చి.. ఇంకా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని కామెంట్స్ చేశారు. చంద్రబాబు సంపద సృష్టి ఏమైందని ప్రశ్నించారు.మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ..‘రాజ్యాంగం ఆమోదించిన రోజు అయినప్పటికీ ఈరోజున పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు. చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చి మోసం చేస్తూనే ఉన్నాడు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేశాడు. నవరత్నాలు పేరుతో హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్ జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకువస్తే చంద్రబాబు వాటిని తుంగలోకి తొక్కాడు. ప్రతీ పేదవాడు ఉన్నత విద్యావంతుడు కావాలని, ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించిన వ్యక్తి వైఎస్ జగన్.స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కోటీశ్వరుల బిడ్డలు, డబ్బున్న వారికే ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉండేది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ పేదవారికి ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకువచ్చారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తున్నారు. వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఏమయ్యాయి?. కేంద్రప్రభుత్వ సంస్థ సెకీ అనే సోలార్ ఎనర్జీకి సంబంధించి యూనిట్ రూ.2.49లపై చెల్లించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపితే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ ఒప్పందాలు రూ.5.98 జరిగితే ఆరోజు ఎల్లో మీడియా ప్రశ్నించలేదు.చంద్రబాబు నాయుడు ఏం చెబితే అదే వింటున్నారు జిల్లాల ఎస్పీలు. తప్పుడు కేసులు పెట్టీ వైఎస్సార్సీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు.. మంత్రులు, టీడీపీ కార్యకర్తలకు బెల్ట్ షాపుల ద్వారా సంపద సృష్టిస్తున్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్‌ను ఏమీ చేయలేరు’ అంటూ కామెంట్స్ చేశారు. -
రఘురామ.. ఫ్లెక్సీ చింపి అంబేద్కర్‌ను అవమానిస్తారా?: తానేటి వనిత
సాక్షి, ఏలూరు: ఏపీలో కూటమి సర్కార్ వచ్చిన నాటి నుంచి అంబేద్కర్‌కు అవమానమే జరుగుతోందన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. కూటమి నేతలు అంబేద్కర్‌కు ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదన్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అంబేద్కర్ ఫ్లెక్సీ చింపేసి అవమానించారని మండిపడ్డారు.మాజీ హోంమంత్రి తానేటి వనిత తాజాగా aమీడియాతో మాట్లాడుతూ.. గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమలలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడం బాధాకరం. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని తప్పకుండా శిక్షించాలి. కూటమి నేతలు అంబేద్కర్‌కు గౌరవం ఇవ్వడం లేదు. ఎమ్మెల్యే రఘురామ అంబేద్కర్ ఫ్లెక్సీ చించేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు కోరితే న్యాయం జరగలేదు. విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ జగన్ నిర్మిస్తే.. ప్రభుత్వం మారిన తర్వాత ఆయన పేరును తొలగించారు. అంబేద్కర్‌పై రాజకీయాలా?.అంబేద్కర్ విగ్రహం వద్ద లైట్లన్నీ ఆపేసి.. శిలాఫలకాలు పగలగొట్టారు. ఇప్పటి వరకూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్.. విగ్రహం వద్దకు వెళ్లి చూసింది లేదు. శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై కనీసం చర్యలు తీసుకోలేదు. ఇలాంటి అవమానకర ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా రిపీట్ కాకూడదని కోరుతున్నాను. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కేసులు పెట్టాలి.. వారికి శిక్ష పడాలని కోరుతున్నాం.సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కాలని చూస్తున్నారు. ఎక్కడా లేని విధంగా కొత్త చట్టాలు తీసుకువచ్చి వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు, దారుణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలి. అంతేకానీ.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను, సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బంది పెట్టేందుకే పోలీసులను ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి నేతలకు అధికారం ఇచ్చింది.. ప్రజలకు మేలు చేయడానికి.. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి కాదు. ఢిల్లీలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచినా వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. -
ఉదయ్‌పూర్‌లో ఫ్యామిలీ డ్రామా.. ఆ వీలునామాలో అసలేముంది?
జైపూర్: మొఘలులుపై పోరాడిన మహారాణా ప్రతాప్ వారసులు ఆస్తుల కోసం, అధికారం కోసం వీధిన పడ్డారు. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్ కోట వద్ద కొత్త మహారాజు పట్టాభిషేకం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మేవాడ్ 77వ మహారాజుగా పట్టాభిషిక్తుడైన విశ్వరాజ్ సింగ్, ఆయన అనుచరులను ప్యాలెస్‌లోకి అడుగుపెట్టకుండా రాజ కుటుంబంలోని సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగి.. పలువురు గాయపడ్డారు.ఏంటి ఈ మహరాణా ప్రతాప్ వారసుల గొడవమహారాణా ప్రతాప్ ప్రసిద్ధ రాజపుత్ర యోధుడు. రాజస్థాన్‌లోని మేవార్ రాజు. భారతదేశ స్వాంతంత్య్ర ఉద్యమంలో మహారాణా భూపాల్ సింగ్ మేవార్ రాజు. ఈయన 1955లో శ్రీ ఎక్లింగ్జీ ( Shri Eklingji Trust) ట్రస్ట్‌ను స్థాపించారు. ఆ ట్రస్ట్ బాధ్యతల్ని ఆయన వారసులు కొనసాగిస్తూ వచ్చారు. అయితే క్రమేపీ ఈ ట్రస్ట్ వ్యవహారాలు పాలన విషయంలో కుటుంబసభ్యుల మధ్య పొరపచ్చాలు వచ్చాయి.75వ మహారాణా విశ్వరాజ్ సింగ్ తాత భగవత్ సింగ్‌కు ఇద్దరు కుమారులు. వారిలో ఒకరు మహేంద్ర సింగ్ కాగా మరొకరు అరవింద్ సింగ్. తన మరణానికి ముందు ట్రస్ట్ నిర్వాహక బాధ్యతల నుంచి తన పెద్ద కుమారుడు మహేంద్ర సింగ్‌ను తప్పించి తన చిన్న కుమారుడు అరవింద్ సింగ్‌కు అప్పగించారు భగవంత్ సింగ్.వీలునామాలో ఉంది ఇదే..తండ్రి నిర్ణయంతో కలత చెందిన మహేంద్ర సింగ్ కోర్టును ఆశ్రయించారు. మే 15, 1984 నాటి తన చివరి వీలునామాలో భగవత్ సింగ్ తన పెద్ద కుమారుడు మహేంద్ర సింగ్‌ను కుటుంబం నుంచి వెలివేస్తున్నట్లు పేర్కొన్నారు. తన చిన్న కుమారుడే ట్రస్ట్ కార్యనిర్వహకుడిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. అదే ఏడాది నవంబర్‌లో తండ్రి భగవత్ సింగ్ మరణించడంతో ట్రస్ట్ ఛైర్మన్‌గా అరవింద్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. అయితే..ఈ ఏడాదిలో మహేంద్ర సింగ్ మరణానంతరం.. ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ మేవాడ్ 77వ మహారాజుగా సోమవారం పట్టాభిషేకం చేశారు. చిత్తోర్‌గఢ్ కోటలో సోమవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం, సంప్రదాయం ప్రకారం కులదైవం ఏకలింగనాథ్ ఆలయం, ఉదయ్‌పుర్‌లోని సిటీ ప్యాలెస్‌ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంటుంది.అయితే, ఈ పట్టాభిషేకంపై ఆగ్రహంగా ఉన్న అరవింద్ సింగ్ మేవార్ .. తన కుమారుడు లక్షయ్ రాజ్ సింగ్ మేవార్ తమ బలగాన్ని ఉపయోగించి విశ్వరాజ్ సింగ్ మేవాడ్‌ను రాజభవనంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఈక్రమంలో విశ్వరాజ్ మద్దతుదారులు రాళ్లదాడికి దిగారు. లక్షయ్ రాజ్ సింగ్ మేవార్ అనుచరులు సైతం ప్రతి దాడులకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపై పోలీసుల ఎంట్రీతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. -
ఈవీఎంలపై కట్టలు తెంచుకున్న జనాగ్రహం.. కరెక్టేనా?
ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(EVM)ల పనితీరుపై రాజకీయ వర్గాల్లోనే కాదు.. జనాల్లోనూ చాలా అనుమానాలే ఉన్నాయి. ఊహించని రీతిలో వెలువడే ఫలితాలే.. ఆ అనుమానాల్ని బలపరుస్తుంటాయి. అలాంటప్పుడే గో బ్యాక్ టూ బ్యాలెట్ పేపర్ అనే వాయిస్ వినిపిస్తుంటుంది. అయితే లోపాల సంగతిని పక్కనపెట్టి.. అవకతవకలకు ఆస్కారం లేదంటూ ఎన్నిక సంఘం, కేంద్రం వాటి వినియోగాన్ని సమర్థిస్తుంటాయి. తాజాగా.. ఇవాళ సుప్రీం కోర్టు సైతం బ్యాలెట్ పేపర్లను వెనక్కి తేలేమంటూ తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే..మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంలపై ప్రజాగ్రహం వెల్లువెత్తిందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాఢి ఘోర పరాభవం చవిచూసింది. కాంగ్రెస్ పార్టీ 101 స్థానాల్లో పోటీ చేసి.. కేవలం 16 స్థానాల్లో గెలిచింది. ఓడినవాళ్లలో.. దూలే రూరల్ నుంచి పోటీ చేసిన కునాల్ పాటిల్ కూడా ఉన్నారు. ఆయన బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర పాటిల్ చేతిలో ఓటమి చెందారు. అయితే..కాంగ్రెస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. నియోజకవర్గంలోని అవధాన్ గ్రామంలో జనం ఈవీఎంలకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌కు పట్టు ఉన్న ఈ గ్రామంలో.. కునాల్‌కు జీరో ఓట్లు వచ్చాయని, అందుకే ఈవీఎంలకు వ్యతిరేకంగా వాళ్లు నిరసన తెలుపుతున్నారనేది ఆ వీడియో సారాంశం. అయితే..ఈ వీడియో ఆధారంగా కాంగ్రెస్ నేతలంతా ఎన్నికల సంఘాన్ని ట్యాగ్ చేస్తూ.. ఈవీఎంల పని తీరుపై ప్రశ్నలు సంధిస్తున్నారు. వీళ్లలో యూపీ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ పాన్ఖురి పాథక్ కూడా ఉన్నారు. గ్రామంలోని 70 శాతం జనాభా కునాల్‌కు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈవీఎంలను బీజేపీ తప్పుడుగా ఉపయోగించుకుంటోందని పేర్కొన్నారు. కానీ..In Maharashtra people are out on the streets protesting against EVM manipulation... Will any Godi Media channel dare to show this ?NO. https://t.co/yTtAyoqav0— Pankhuri Pathak पंखुड़ी पाठक پنکھڑی (@pankhuripathak) November 25, 2024ఎన్నికల సంఘం ఆ ఆరోపణలన్నింటిని తోసిపుచ్చింది. అవధాన్లో కునాల్ పాటిల్‌కు 1,057 ఓట్లు పోలయ్యాయని ధూలే జిల్లా ఎన్నికల కార్యాలయం ప్రకటించింది. అలాగే.. రాఘవేంద్ర పాటిల్‌కు ఇక్కడ 1,741 ఓట్లు వచ్చాయని పేర్కొంది. దీంతో.. ఆ వీడియో ఫేక్ అనేది స్పష్టమైంది.నవంబర్ 20వ తేదీన మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరగ్గా.. నవంబర్ 23వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ధూలే రూరల్ నియోజకవర్గంలో రాఘవేంద్ర పాటిల్‌కు 1,70,398 ఓట్లు, కునాల్ పాటిల్‌కు 1,04,078 ఓట్లు పడ్డాయి. -
తెలుగు తమ్ముళ్ల మధ్య రచ్చకెక్కిన ‘అక్రమ మైనింగ్’ పంచాయతీ
సాక్షి, ఏలూరు జిల్లా: నూజివీడులో తెలుగు తమ్ముళ్ల అక్రమ మైనింగ్ పంచాయతీ రచ్చకెక్కింది. కూటమి అధికారంలోకి వచ్చాక తోటపల్లిలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ సాగుతుండగా.. చర్యలు తీసుకోవాలంటూ ఏలూరు జిల్లా కలెక్టర్‌కు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు స్వయంగా ఫిర్యాదు చేశారు. దీంతో ముద్దరబోయిన తీరుపై నూజివీడు మండలం రావిచర్ల టీడీపీ నేతలు మండిపడుతున్నారు.ముద్దరబోయిన కలెక్టర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు అన్నారు. రావిచర్లలో అక్రమ మైనింగ్ జరిగితే ఏ చర్యలైనా తీసుకోండని అధిష్టానాన్ని కోరుతున్నాం. సొంత పార్టీలోని నేతలపైనే బురద చల్లడం బాధాకరం. అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ముద్దరబోయిన చర్యలున్నాయి. తక్షణం ముద్దరబోయినను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి’’ అని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. -
కేటీఆర్.. కాంగ్రెస్ ముందు నీ అనుభవమెంత?: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కల్పవృక్షం లాంటిది. కేటీఆర్, హరీష్ రావు కోతల రాయుళ్లు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అలాగే, కాంగ్రెస్ వ్యూహాల ముందు కేటీఆర్ ఆలోచన, అనుభవం ఎంత? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇవ్వడం వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టి మీ(బీఆర్ఎస్) నెత్తి మీద పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకలిస్తామని అంటారా?. అధికారంలో ఉన్నా.. లేకున్నా కాంగ్రెస్ నేతలందరూ గంభీరంగానే ఉంటారు. కేటీఆర్, హరీష్ రావు కోతలు కోసే కోతల రాయులు. కాంగ్రెస్ పార్టీ కల్పవృక్షం లాంటిది. కాంగ్రెస్ పార్టీ లాంటి మర్రి చెట్టును కేటీఆర్ పీకేస్తా అనడం సాధ్యమా?.కేటీఆర్ వయసు ఎంత? కాంగ్రెస్ వయసు ఎంత?. కాంగ్రెస్ వ్యూహాల ముందు కేటీఆర్ ఆలోచన, అనుభవం ఎంత?. కాంగ్రెస్ పార్టీ వయసులో కేటీఆర్ వయసు పావు వంతు. రాజకీయం కోసం నిందలు వేయడాన్ని కూడా మేం తప్పు పట్టడం లేదు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లేదా టీడీపీ ప్రభుత్వం ఏర్పడేది. రాష్ట్రం రావడం వల్లే కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. మా పాలనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు.బీఆర్ఎస్ పార్టీ ఇంకో ఇరవై ఏళ్తు ప్రతిపక్షంగా కొనసాగాలి. కాంగ్రెస్ వ్యూహాలు అంతుచిక్కవు. మా వ్యూహాలు ఎవరికి అర్థం కావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బ్యూరోక్రాట్స్ సంతోషంగా నిద్రపోయే రోజులు వచ్చాయి. అధికారులను మానసికంగా కుంగదీసి కలెక్టర్లను మోకాళ్లపై కూర్చోపెట్టిన ఘనత బీఆర్ఎస్ నాయకులది. ఈ భూమి మీద మనుషులు ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దేశంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు కాంగ్రెస్ అధికారంలోకి రావాలి.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాయి’ అని కామెంట్స్ చేశారు. -
ఆది Vs జేసీ.. ముదిరిన వివాదం.. ఎస్పీకి ప్రభాకర్‌రెడ్డి ఘాటు లేఖ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆదినారాయణరెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డిల మధ్య వివాదం ముదిరింది. ఈ క్రమంలో కడప ఎస్పీకి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటు లేఖ రాశారు. ‘‘ఆర్టీపీపీలో ఫ్లైయాష్ తీసుకెళ్లేందుకు మా వాహనాలను ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు భూపేష్‌రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. అయినా మేం సంయమనం పాటించాం..వాళ్లు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. అందుకే వైఎస్సార్ జిల్లా నుంచి వచ్చే సిమెంట్, ఇసుక వాహనాలను మేమూ అడ్డుకున్నాం.’’ అంటూ లేఖలో పేర్కొన్నారు.‘‘మీరు కోరిన మీదట వాటిని నడవడానికి అనుమతించాం. మా వాహనాలను అడ్డుకోకూడదని మేం కోరాం.. అయినా పరిస్థితి మారలేదు. రేపు మేం ఆర్టీపీపీకి వాహనాలను పంపుతున్నాం.. వాళ్లు ఆపితే మేం అంత ఈజీగా తీసుకోం. ఇటీవల వారు అదానీ సంస్థపై కూడా ఎటాక్ చేశారు. మేం అలాంటి వాళ్లం కాదు. రేపు మా వాహనాలను అడ్డుకుంటే మాత్రం వారి వేధింపులను సహించేది లేదు. తప్పకుండా సరైన సమాధానం చెప్తాం’’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు.ఇదీ చదవండి: కొత్త దుష్ట సంస్కృతికి తెరలేపిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి! -
రాజ్యాంగ దినోత్సవం.. ఏపీలో మానవ హక్కుల హననంపై ఆగ్రహం
గుంటూరు, సాక్షి: రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కి నివాళులర్పించారు. రాజ్యాంగానికి విరుద్దంగా ఏపీలో జరుగుతున్న రాజ్యాంగ వ్యతిరేక దాడులు, దౌర్జన్యాలపై గళమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి జరుగుతున్న రాజ్యాంగ హననంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీలో ఇవాళ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ప్రాంతాల వారీగా ఆ వేడుకల్లో ఎవరెవరు ఏం మాట్లాడారంటే..విజయవాడరాజ్యాంగం ప్రతి పౌరుడు కి భద్రత, హక్కులు, స్వేచ్ఛ కల్పించిందికూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉందివైయస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధం చేస్తుందికూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతిలోకి తీసుకొని వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుందిసోషల్ మీడియాను నియంత్రించే విధంగా కొత్త చట్టాలు తేవటం దారుణంనల్ల చట్టాలు తేవడంలో కూటమి ప్రభుత్వం ముందుందిఆంధ్ర రాష్ట్రంలో వినూత్నమైన పరిపాలన జరుగుతుందిప్రజల యొక్క హక్కులు హరించబడుతున్నాయిపెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందివైయస్ జగన్మోహన్ రెడ్డి పై దుష్ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిందిరాజ్యాంగం అమలు చేయడంలో కుటుంబ ప్రభుత్వం విఫలమైందివిజయవాడ నడిబొడ్డున డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అధికారులు ఎందుకు నివాళులర్పించలేదు..?ప్రభుత్వం, అధికారులు వివక్షత చూపిస్తున్నారుసింగ్ నగర్‌లోని తన కార్యాలయంలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డివిశాఖపట్నంరాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాలేదు.లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందిరాష్ట్రంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారు..విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని వైయస్ జగన్ ఏర్పాటు చేశారు..రైల్వే భవనాల నిర్మాణానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం 52 ఎకరాలను కేటాయించింది.కేకే లైన్ తో కూడిన రైల్వే జోన్ ఇవ్వాలి..వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదానీతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు.కేంద్ర ప్రభుత్వ సంస్థ సేకితో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.ఆదానీ సంస్థతో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం.ప్రధాని మోడీ ప్రారంభిస్తారనే గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఒప్పందం వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జరిగింది.ప్లాంట్ కు సంబంధించిన భూ కేటాయింపులు మా ప్రభుత్వ హయాంలోనే జరిగాయి:::మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తూర్పుగోదావరిరాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు, దోపిడీ, అక్రమ ఇసుక రవాణా,మద్యం అక్రమ అమ్మకాలు ఎక్కువయ్యాయి.త్వరలోనే తగిన మూల్యం చెల్లించే రోజు వస్తుంది:::కొవ్వూరులో రాజ్యాంగం 75వ ఆమోద దినోత్సవ సందర్భంగా కొవ్వూరు బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన కొవ్వూరు వైఎస్సార్‌షీపీ కన్వీనర్ తలారి వెంకట్రావుకాకినాడరాష్ట్రంలో గత ఆరు నెలలుగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా పాలన జరుగుతోంది.ప్రత్యార్ధులను అణివేసే దోరణీ చాల నిరంకుశంగా జరుగుతోందితునిలో 17 మందిపై అక్రమ కేసులు పెట్టారుసోషల్ మీడియాలో పోస్ట్ ను లైక్ చేసిన వారిపై నాన్ బెయిల్ కేసులు పెట్టారు.పసుపు చొక్కాలేసుకుని ఉద్యోగాలు చెయ్యోద్దని పోలీసులను కోరుతున్నానుగత 10 ఏళ్ళ కాలంలో వైఎస్ఆర్ సిపి ఒక పర్సంటేజ్ పోస్టులు పెడితే..టిడిపి,జనసేన 99 % అసభ్య పదజాలాలతో పోస్టులు పెట్టారు.తునిలో మామ అల్లుళ్ళ పాలన సాగుతోంది.అల్లుడు గల్లా పెట్టె దగ్గర కూర్చుంటే..మాయ యనమల అమాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. తునిలో ఘనంగా భారత రాజ్యంగ ఆమోద దినోత్సవం వేడుకల్లో.. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా.ఏలూరు75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జెట్టి గురునాథం, ఇతరులు.కృష్ణాపెడన మండలం బల్లిపర్రు అంబేద్కర్ సెంటర్లో 75 వ భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పాల రాము, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలుఏలూరు75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా కొయ్యలగూడెం లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు,పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులు.కృష్ణాకానూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో 75వ భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పెనమలూరు నియోజకవర్గం సమన్వయకర్త దేవభక్తిని చక్రవర్తి.ఎన్టీఆర్తిరువూరు పట్టణంలోని బోసు బొమ్మ సెంటర్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 75వ "భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నాయకులు,కార్యకర్తలు.విజయనగరంభారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన రాజాం వైఎస్సార్సీపి ఇంచార్జ్ డాక్టర్ తలే రాజేష్.పార్వతీపురం మన్యం మాజీ ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలువైఎస్సార్కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషగుంటూరుప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు..భారత రాజ్యాంగం రూపకల్పనకు కమిటీ చైర్మన్ గా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వ్యవహరించారు..ప్రపంచ దేశాలలోని అన్ని రాజ్యాంగంలో పరిశీలించి భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది..చిన్నచిన్న అమెండ్మెంట్స్ మినహా నేటికీ చెక్కుచెదరని విధంగా భారత రాజ్యాంగం ఉంది..న్యాయ వ్యవస్థ అయినా, రాజకీయ వ్యవస్థ అయినా, మీడియా వ్యవస్థ అయినా భారత రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయాలి..కాని ఇవాళ రాష్ట్రంలో రాజ్యాంగేతర శక్తులు తయారయ్యాయి..వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్రంలో రాజ్యాంగ వ్యతిరేక అరాచక, కక్ష సాధింపు పాలన సాగుతుంది..రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను పక్కనపెట్టి కక్ష సాధింపు చర్యలకే పరిమితమైంది..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు కాలేదు.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందిఈ ఐదు సంవత్సరాలు మంత్రి నారా లోకేష్ తీసుకువచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరిగే విధంగా ఉంది..మంత్రి నారా లోకేష్ ఎవరిని జైల్లో పెట్టమంటే వారిని పోలీసులు బలవంతంగా అక్రమ కేసులతో అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు..ఒక్కో వ్యక్తిమీద 10, 20, 30 కేసుల వరకు పెడుతున్నారు..బ్రిటిష్ పాలనలో స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వారి మీద కూడా ఇన్ని కేసులు పెట్టి ఉండరు..రానున్న రోజుల్లో నారా లోకేష్ దోషిగా నిలబడాల్సి వస్తుంది:::ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం కర్నూలుభారతదేశం గర్వించదగ్గ మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ఇవాళ కూటమి పాలనలో రాజ్యాంగం ఉల్లంఘనకు గురవుతుందిరాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదుచంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.నిరంకుశ పాలన రాష్ట్రంలో కొనసాగుతుంది.గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగింది.ఇంటి వద్దకే సంక్షేమ పాలనతో పాటు సంక్షేమ పథకాలు అందించారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి వ్యాఖ్య.. కార్యక్రమంలో పాల్గొన్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, మేయర్ బి వై రామయ్యప్రకాశంఈ రోజు సంక్షేమ పథకాలు లేవు, రాజ్యాంగానికి విరుద్ధంగా చంద్రబాబు పాలనఒంగోలు వైస్సార్సీపీ ఇంచార్జీ చుండూరి రవిబాబు, కార్యక్రమంలో పాల్గొన్న సిటీ పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, సీనియర్ నాయకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, కుప్పం ప్రసాద్ మరియు కార్యకర్తలు నంద్యాలఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందిప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో బ్యాలెట్ పేపర్లతోటే ఎన్నికలుజరుగుతున్నాయిమన దేశము మన రాష్ట్రం కూడా బ్యాలెట్ వైపు ఎందుకు వెళ్ళకూడదూ, అందరూ ఆలోచించాలిఆత్మకూరు పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.సంబంధం లేని కేసులను రాజకీయ నాయకులు కంటగడుతూ పబ్బం గడుపుకుంటున్నారు.రాష్ట్రంలో అమలు అవుతున్న పోలీసులు కూడా రెండు బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారుప్రతి ఒక్క పేద కుటుంబానికి నిత్యవసరమైన సరుకులు కూరగాయలు , నూనె , కందిపప్పు ప్రతి ఒక్కటి రేట్లు విపరీతంగా పెంచేశారుమా ప్రభుత్వంలో నిత్యవసర సరుకులను రేట్లు పెంచామని అబద్ధపు పుకార్లు చేసుకుంటూ రోడ్లెక్కిన ఘనత టిడిపి నాయకులకు చెల్లుతుందిరైతులకు గిట్టుబాటు ధరలు లేకపోతే ప్రభుత్వం నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఘనత మా పార్టీ అధ్యక్షడు జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుంది.మీడియా చేతిలో ఉంది కదా అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.మా పైన పెట్టిన పోస్టింగులు కూడా మేము పోలీసులకు అందజేస్తాం వాటిపై కూడా చర్యలు తీసుకోవాలి.కేవలం తెలుగుదేశం పార్టీ వారు మా పైన పెట్టిన కేసులు మాత్రమే విచారిస్తారా మా వైఎస్సార్సీపీ నాయకులు పెట్టిన కేసులను విచారించరాకాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అధికారులు కూడా గమనించుకోవాలి మేం అందజేసిన ఫిర్యాదులపై నిజ నిజాలు విచారించి చర్యలు తీసుకోవాలి.పోలీసులు ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన విధంగా ఉండకూడదు:::నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డినెల్లూరు జిల్లాగత ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పాటుపడిందని వెల్లడి..స్వరాజ్ మైదానంలో అప్పటి సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు..అంబేద్కర్ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలని ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి జగన్.రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏపీలో పాలన కొనసాగుతుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్..కాకాణి నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు. పాల్గొన్న ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపల్నాడునరసరావుపేటలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. -
తుమ్మితే ఊడిపోయేది రేవంత్ పదవి: కేటీఆర్ సెటైర్లు
సాక్షి, రాజన్న సిరిసిల్ల: తుమ్మితే ఊడిపోయేది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అని సెటైరికల్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ కొడంగల్ వెళ్తే అక్కడి ప్రజలు ఉరికించి కొట్టే వాళ్లు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.సిరిసిల్లలో ఈ నెల 29న నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమ నిర్వహణపై బీఆర్ఎస్ శ్రేణులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఆర్ఎస్ బ్రదర్స్ లాగా రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌పై చర్చ నడుస్తోంది. జిల్లా కలెక్టర్‌ను పార్టీ మారమని సలహాలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వీళ్లు ఏమీ చేయలేరు. తుమ్మితే ఊడిపోయేది రేవంత్ రెడ్డి పదవి. ఎక్కడికి వెళ్ళినా రేవంత్ రెడ్డి.. కేసీఆర్ మీద తిట్ల దండకం తప్ప చేస్తున్నదేమీలేదు. దేవుళ్ల మీద ఒట్లు, కేసీఆర్ మీద తిట్లు, పథకాలకు తూట్లు.. ఇవే రేవంత్ రెడ్డి నినాదాలు.కొడంగల్‌కు వెళితే రేవంత్ రెడ్డిని ఉరికించి కొట్టేవాళ్ళు అక్కడి ప్రజలు. రాష్ట్రం నుండి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిస్తే కేంద్రం నుండి 8 రూపాయలు తెచ్చారా?. ఒక్కసారి తప్పు చేస్తే ఐదేళ్లు ఏళ్లు శిక్షనా అని ఒక ఆటోడ్రైవర్ నాతో అంటున్నాడు. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ ఉంటే వేములవాడలో యారాన్ డిపో ఏర్పాటు చేస్తున్నారు. బోడిగుండుకు దెబ్బ తాకితే మోకాలుకు మందు రాస్తున్నాడు.కేసీఆర్ దీక్షతో పార్లమెంట్ దిగివచ్చి డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. కేసీఆర్ అనే మొక్కను మొలవకుండా చేస్తా అంటుండు చిట్టినాయుడు. ఊడలమర్రి చెట్టులా వ్యాపించి వృక్షంలా మన కార్యకర్తలు ఉన్నారు.బండి సంజయ్, రేవంత్ రెడ్డిల భరతం పట్టాలి. లోక్‌సభ ఎన్నికల్లో బండి సంజయ్ మీద డమ్మీ క్యాండిడేట్‌ను పెట్టి సంజయ్ గెలిచేలా చిట్టి నాయుడు చేశాడు’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. -
మంత్రి నారాయణ కనుసన్నల్లోనే దాడి: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: టీడీపీ నేతల చేతిలో గాయపడిన వైఎస్సార్సీపీ యువజన విభాగం నేత సాకేష్ని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. అనంతరం కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ, మంత్రి నారాయణ కనుసన్నల్లోనే సాకేష్‌పై దాడి జరిగిందని.. న్యాయం జరగకపోతే పోరాటం చేస్తామన్నారు.తీవ్రంగా దాడి చేస్తే.. పోలీసులు చిన్న కేసు పెట్టి వదిలేశారేని.. కొడవలూరు సీఐ కేసును నీరు గార్చారని ఆయన మండిపడ్డారు. సీఐ సురేంద్ర బాబుపై ప్రైవేట్ కేసు వేస్తాం.. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడి చేసిన వారిని వదిలిపెట్టం. వైఎస్సార్సీపీ శ్రేణులకు అండగా ఉంటాం.. మితిమీరి వ్యవహరిస్తున్న వారిపై భవిష్యత్తులో చర్యలు ఉంటాయి’’ అంటూ కాకాణి హెచ్చరించారు.ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, నాలుగు రోజులు క్రితం సాకేష్ పై గండవరంలో టీడీపీ నేతలు దాడి చేశారని.. అక్రమ కేసులు పెడితే న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. మరణాయుధాలతో దాడి చేశారు.. సాకేష్కు పార్టీ తరపున అండగా ఉంటాం.. ఆరు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. -
ఈవీఎంలు వద్దు.. మాకు బ్యాలెట్ పేపర్లే కావాలి: ఖర్గే కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత్‌లో ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ పేపర్లే తాము కోరుకుంటున్నట్లు అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో నిర్వహించిన ‘సంవిధాన్ రక్షక్ అభియాన్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్యాలెట్ పేపర్‌కు తిరిగి వచ్చేందుకు భారత్ జోడో యాత్ర తరహాలో ప్రచారం చేయాలని ఖర్గే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఖర్గే మాట్లాడుతూ.. దేశంలో ఐక్యత కావాలంటే విద్వేషాలను విస్తరించడం మానుకోవాలని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొందరు రాజ్యాంగాన్ని పొగిడి, దానికి నమస్కరించి భక్తిని ప్రదర్శిస్తుంటారని, లోపల మాత్రం రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారన్నారు. ఈ యాత్రలో ఆయనతో పాటు సమాజంలోని అన్నివర్గాల ప్రజలు కదిలివచ్చారని తెలిపారు.VIDEO | "Some people praise the Constitution, but only superficially; inside, they are undermining it. To protect the Constitution, Rahul Gandhi ji launched the Bharat Jodo Yatra, and to save democracy, all minorities came forward, which is why we were able to stop PM Modi.… pic.twitter.com/qrQfMQJKb8— Press Trust of India (@PTI_News) November 26, 2024మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 230 స్థానాలను కైవసం చేసుకొని అధికారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల నిర్వహణలో బీజేపీ అవకతవకలకు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈవీఎంలను హ్యాక్ చేశారని ఆరోపించాయి. -
షిండే హ్యాపీయేనా? శివసేన ఏమంటోంది?
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోబోతున్నారు? అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. ఢిల్లీ పెద్దల దౌత్యంతో.. ఏక్నాథ్ షిండే బెట్టు వీడారనే సంకేతాలు మాత్రం అందుతున్నాయి. దీంతో దేవేంద్ర ఫడ్నవిస్‌కు లైన్ క్లియర్ అయ్యాయనే విశ్లేషణలు నడుస్తున్నాయి. మరి సీఎం పదవి వదులుకునే విషయంలో షిండే నిజంగానే హ్యాపీగా ఉన్నారా?. శివసేన అందుకు ఒప్పుకుంటోందా?.. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలిచి మూడు రోజులవుతుంది. కానీ ఇంతవరకు సీఎం ఎవరనేది బీజేపీ, దాని మిత్రపక్షాలు ఎటూ తేల్చలేకపోతున్నాయి. ఈ తరుణంలో 14వ రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం నేటితో ముగియగా, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన పదవికి రాజీనామా గవర్నర్‌కు సమర్పించారు. ఆపద్ధర్మ సీఎంగా ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఆయనే కొనసాగుతారు. ఇక.. ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలని బీజేపీ నాయకత్వం చర్చలు జరుపుతున్న తరుణంలో.. సీఎం సీటు ఎవరికి అనే దానిపై బలనిరూపణ చేయాలంటూ షిండే వర్గం కొత్త డిమాండ్‌ను తెర మీదకు తెచ్చింది. అయితే ఆ వాదన అసంబద్ధమని తన వర్గీయులను షిండే వారించినట్లు సమాచారం. ‘‘మహాయుతి కూటమి గొప్ప విజయం తర్వాత రాష్ట్రంలో మరోసారి మా ప్రభుత్వం ఏర్పడనుంది. మహాకూటమిగా కలిసి ఎన్నికల్లో కలిసి పోటీ చేశాం.నేటికీ కలిసి ఉన్నాం. నాపై ప్రేమతో.. అందరూ కలిసి ముంబైకి రావాలి’’ అని తాజాగా ఈ ఉదయం ట్వీట్లో ఆయన విజ్ఞప్తి కూడా చేశారు. ఈలోపు..महायुतीच्या प्रचंड विजयानंतर राज्यात पुन्हा एकदा आपले सरकार स्थापन होणार आहे. महायुती म्हणून आपण एकत्रित निवडणूक लढवली आणि आजही एकत्रच आहोत. माझ्यावरील प्रेमापोटी काही मंडळींनी सर्वांना एकत्र जमण्याचे, मुंबईत येण्याचे आवाहन केले आहे. तुमच्या या प्रेमासाठी मी अत्यंत मनापासून ऋणी…— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) November 25, 2024మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కొనసాగుతున్న చర్చలు మంగళవారం రాత్రి లేదంటే బుధవారం ఉదయానికల్లా ఓ కొలిక్కి రావొచ్చని శివసేన నాయకుడు సంజయ్ శిర్సత్ తెలిపారు. సీఎంగా ఎవరు బాధ్యతలు చేపట్టాలనే దానిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ అగ్రనేతలతో ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు చర్చిస్తున్నారని. ఇవాళో, రేపో కచ్చితంగా తుది నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అయితే.. ఇదే శిర్సత్.. షిండేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని నిన్నటిదాకా మీడియా ముందు హడావిడి చేశారు.మహా ల్లో ప్రజాదరణ ఉన్న నేత ఏక్నాథ్ షిండే అని, ఆయన నాయకత్వంలో శివసేన అసెంబ్లీ ఎన్నికల్లో రెండో అతిపెద్ద కూటమి పార్టీగా అవతరించిందని, కాబట్టి ఏక్నాథ్ షిండే సీఎం అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు.. బీహార్ ఫార్ములా డిమాండ్ లేవనెత్తిన శివసేన నరేష్ కూడా.. ఇప్పుడు షిండే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించడం గమనార్హం. ఈ లిస్ట్‌లో ఇవాళ షిండే వర్గీయులు చాలామందే చేరారు. దీంతో.. శివసేనలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడే అవకాశం లేదనే విషయం స్పష్టమవుతోంది. షిండే వెనక్కి తగ్గాలి : కేంద్రమంత్రిమహరాష్ట్ర సీఎం ఎవరు? అనే అంశంపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే స్పందించారు. ‘‘మహారాష్ట్ర వివాదం త్వరలో ముగియాలి. దేవేంద్ర ఫడ్నవిస్‌ను సీఎంను చేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. ఆ నిర్ణయంపై ఏక్నాథ్ షిండే అసంతృప్తిలో ఉన్నారు. ఆ అసంతృప్తిని పోగొట్టాలి. అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుంది కాబట్టి బీజేపీ అందుకు ఒప్పుకోదు. గతంలో దేవేంద్ర ఫడ్నవీస్లాగా ఏకనాథ్ షిండే కూడా రెండు అడుగులు వెనక్కి వేయాలి. లేదంటే ఫడ్నవీస్ నాలుగు అడుగులు వెనక్కి వేసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో పని చేయాలి. లేదా ప్రధాని మోదీ, అమిత్‌షాలు జోక్యం చేసుకోవాలి. ఏక్నాథ్ షిండేతో పాటు ఆయన 57 మంది ఎమ్మెల్యేలు..త్వరగా రాజీ కుదుర్చుకుని మంత్రివర్గాన్ని విస్తరించాలి’’ అని అన్నారు.ఒక పార్టీ మద్దతుంటే చాలుమహరాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ 132 మంది ఎమ్మెల్యేలు, శివసేన 57, ఎన్సీపీ 41 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దీంతో 288 మంది సభ్యుల అసెంబ్లీలో 145 మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోవడానికి బీజేపీ మహాయతి కూటమిలోని రెండు మిత్రపక్షాలలో ఒక మిత్ర పక్షం మద్దతుంటే సరిపోతుంది. -
కేసీఆర్ మళ్లీ సీఎం అవ్వడం ఖాయం: జగదీష్ రెడ్డి
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో రాక్షస పాలన నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ అంటేనే ప్రజలు భయపడుతున్నారని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు.నల్లగొండలో మంగళవారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్ కిషోర్, కంచర్ల హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది. కాంగ్రెస్ అంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకే ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీలను నెరవేర్చడం లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్ళీ సీఎం అవ్వడం ఖాయం. ఈనెల 29న దీక్షా దివాస్‌ను అందరూ ఘనంగా జరుపుకోవాలి. కేసీఆర్ ఎన్నో పథకాలను తెచ్చారు. ప్రజలకు మంచి పాలన అందించారు. ఎంతో సంక్షేమం అందించారు. ప్రత్యేక తెలంగాణ కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని తెచ్చిన మహానుభావుడు కేసీఆర్’ అని చెప్పుకొచ్చారు. -
రాష్ట్రపతి ముర్మును అవమానించిన రాహుల్.. బీజేపీ ఆరోపణలు
న్యూఢిల్లీ: రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అగౌరవపరిచారని బీజేపీ ఆరోపించింది. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ముర్ముకు శుభాకాంక్షలు చెప్పకుండా ఆమెను అవమానపరిచారని ఆరోపించింది. జాతీయ గీతం సమయంలో కూడా రాహుల్ పరధ్యానంలో ఉన్నారని మండిపడింది. ఈమేరకు సోషల్ మీడియాలో వరుస వీడియోలను షేర్ చేసింది.పాత పార్లమెంట్ భవనంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా స్మారక నాణెం, స్టాంపులను రాష్ట్రపతి విడుదల చేశారు. అనంతరం స్టేజీపై ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. राहुल गांधी को इतना घमंड है कि राष्ट्रपति जी का अभिवादन तक नहीं किया। सिर्फ इसलिए क्योंकि वो जनजातीय समाज से आती हैं, महिला हैं और राहुल गांधी कांग्रेस के राजकुमार? कैसी घटिया मानसिकता है ये? pic.twitter.com/shtP5s2dxs— Amit Malviya (@amitmalviya) November 26, 2024అయితే అక్కడే ఉన్న రాహుల్ గాంధీ మాత్రం రాష్ట్రపతి ముర్ముకు శుభాకాంక్షలు చెప్పకుండా వేదికపై నుంచి వెళ్లిపోయాడని ఎక్స్ వేదికగా బీజేపీ నేత అమిత్ మాల్వీయ విమర్శించారు. జాతీయ గీతం ప్లే అవుతున్న సమయంలో అందరూ ముందుకు చూస్తే.. రాహుల్ మాత్రం పక్కకు, కిందకు చూస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రపతి, ఇతర నాయకులు నిలబడి ఉండగానే గాంధీ కూర్చోవడానికి ప్రయత్నించారని విమర్శించారుCongress always disrespects President Smt Droupadi Murmu ji, because she is the first Tribal woman to occupy the highest office of the land. Rahul Gandhi and family despise SC, ST and OBCs. It shows. pic.twitter.com/CR3v8pAioL— Amit Malviya (@amitmalviya) November 26, 2024‘రాహుల్ గాంధీ తన దృష్టిని 50 సెకన్లు కూడా కేంద్రీకరించలేరు. కానీ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిపై పూర్తిగా అసహ్యకరమైన వ్యాఖ్య చేసే ధైర్యం అతనికి ఉంది. జాతీయ గీతం ముగియగానే, వేదికపై ఉన్న రాహుల్ గాంధీ దిగిపోవడానికి ప్రయత్నిచారు. రాహుల్ ద్రౌపది ముర్మును ఎప్పుడూ అగౌరపరుస్తుంటారు. ఎందుకంటే ఆమె దేశ అత్యున్నత పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళ కాబట్టి. రాహుల్, గాంధీ కుటుంబం.. ఎస్సీ, ఎస్టీ,ఓబీలపై ప్రేమలేదు’ అని విమర్శలు గుప్పించారు.Rahul Gandhi can’t hold his attention for even 50 seconds and he had the audacity to make an absolutely distasteful comment on the President of United States. pic.twitter.com/TAesrKmrmS— Amit Malviya (@amitmalviya) November 26, 2024 అయితే ఈ వీడియోలపై పలువురు స్పందిస్తూ.. రాష్ట్రపతి పట్ల రాహుల్ అహంకారం ప్రదర్శించారని, మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి తరువాత రాహుల్ నిరాశలో కూరుకుపోయారని, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. అయితే బీజేపీ ఆరోపణలపై రాహుల్ గాంధీ కానీ, ఇతర కాంగ్రెస్ నేతలు కానీ స్పందించలేదు. -
కాంగ్రెస్ గ్యారెంటీలపై సొంత ఎమ్మెల్యే నుంచే వ్యతిరేకత!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు.. సొంత ప్రభుత్వాన్నే ఇరకాటంలో పడేశారు. ఎన్నికల హామీల్లో కొన్నింటిని రద్దు చేయాలంటూ సదరు ఎమ్మెల్యే చేసిన బహిరంగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలను కర్ణాటక కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించింది. ఆ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు.విజయనగర ఎమ్మెల్యే హెచఆర్ గవియప్ప.. తాజాగా ఓ పబ్లిక్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఎన్నికల హామీల వల్ల జనాలకు ఇళ్ల సదుపాయం కల్పించలేకపోతున్నామని, కాబట్టి వాటిలో కొన్నింటిని రద్దుచేయాలని సీఎం సిద్ధరామయ్యను పబ్లిక్‌గా కోరారాయన.ఉచిత పథకాల వల్ల ఇళ్ల నిర్మాణ పథకం సజావుగా ముందుకు సాగడం లేదు. ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రిగారికి విజ్ఞప్తి చేసేది ఒక్కటే. రెండు నుంచి 3 గ్యారెంటీ స్కీంలను తీసేయాలని కోరుతున్నా. అవి లేకపోయినా పెద్దగా ఫర్వాలేదు. తద్వారా కొందరికైనా ఇళ్లను నిర్మించి ఇవ్వగలం. ఇక నిర్ణయం సీఎంకే వదిలేస్తున్నా. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటా అని అన్నారు.ಗ್ಯಾರಂಟಿ ಯೋಜನೆಗಳಿಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಶಾಸಕರಿಂದಲೇ ವಿರೋಧ - ಒಂದೆರಡು ಗ್ಯಾರಂಟಿ ಸ್ಕೀಂ ತೆಗೆಯುವಂತೆ ಸಿಎಂಗೆ ಮನವಿ ಮಾಡ್ತೀವಿ ಎಂದ ಶಾಸಕ ಗವಿಯಪ್ಪ#CongressGuarantee #Congress #Gaviyappa #Bellary pic.twitter.com/3fsw27C1HD— soumya Sanatani (Modi Ka Parivar) (@NaikSoumya_) November 26, 2024అయితే .. ఎమ్మెల్యే వాదనను డీకే శివకుమార్ కొట్టిపారేశారు. ఎన్నికల హామీల అమలులో వెనకడుగు వేయబోయేది లేదని స్పష్టం చేశారాయన. ఆయన ఇలా చేయాల్సింది కాదు. ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేస్తాం. ఎలాంటి పథకాన్ని ఆపే ప్రసక్తే లేదు. మేం కర్ణాటక ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. దానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడిన సహించేది లేదు అని శివకుమార్ పేర్కొన్నారు.గవియప్ప సొంత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో తన నియోజకవర్గానికి నిధుల విషయంలో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ ఆరోపించారాయన. అయితే.. ఆ ఆరోపణలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సిరాజ్ షేక్ ఖండించారు. అంతేకాదు.. ఆరెస్సెస్‌తో ఉన్న అనుబంధమే గవియప్పతో అలా మాట్లాడిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. -
రాజ్యాంగంలో సావర్కర్ స్వరం ఉందా?: రాహుల్ గాంధీ
సాక్షి, ఢిల్లీ: రాజ్యాంగం అనేది కేవలం ఒక పుస్తకం కాదు. అది వేల సంవత్సరాల భారతదేశ ఆలోచనల సమాహారమని చెప్పుకొచ్చారు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఇదే సమయంలో తెలంగాణలో కులగణన చరిత్రాత్మక అడుగు అని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ సంవిదాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ..‘రాజ్యాంగం అనేది కేవలం ఒక పుస్తకం కాదు. అది వేల సంవత్సరాల భారతదేశ ఆలోచనల సమాహారం. సత్యం, అహింసలతో ముడిపడి ఉంది. రాజ్యాంగంలో సావర్కర్ జీ స్వరం ఉందా? అని ప్రశ్నించారు. హింసకు గురిచేయాలి, మనుషులను చంపాలి, అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడపాలి అని ఎక్కడైనా రాసిందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.#WATCH | Delhi: At the Constitution Day program at Talkatora Stadium, Lok Sabha LoP & Congress MP Rahul Gandhi says, "Does it (Constitution) have Savarkar ji's voice? Is it written somewhere in it that violence should be used, people should be killed or that the govt should be… https://t.co/tYELczHI6E pic.twitter.com/vIaY4TRBXY— ANI (@ANI) November 26, 2024ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ మాట్లాడుతూ..‘తెలంగాణలో కులగణన చరిత్రాత్మక అడుగు. అక్కడ కుల గణన మొదలు పెట్టాం. కుల గణనలో అడిగే ప్రశ్నలు ఒక గదిలో కూర్చొని 15 మంది రూపొందించలేదు. కులగణనలో అడిగే ప్రశ్నలు తెలంగాణ ప్రజలే డిజైన్ చేశారు. ఇది ప్రజా ప్రక్రియ. భవిష్యత్‌లో కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కుల గణన చేస్తాం.బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏం చేసినా సరే కుల గణన ద్వారా రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితి ఎత్తివేస్తాం. కుల గణన అనేది నేను పార్లమెంట్లో రాజ్యాంగంపై చేసిన హామీ. కుల గణనను పాస్ చేసి చూపిస్తా. అందరికీ సమాన హక్కు కోసం పోరాడుతున్నాం. కుల గణన ద్వారా ప్రజా సమాచారం తెలుస్తుంది. దీని ద్వారా పాలసీలు నిర్ణయించబడతాయి. ఐదు ఆరు శాతం ఉన్న వారు దేశాన్ని కంట్రోల్ చేస్తున్నారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కులగణన జరుగుతోంది. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం. అందుకే కులగణన సర్వే చేపట్టాం. దేశవ్యాప్తంగా కుల గణన అనేది కాంగ్రెస్ ఆధ్వర్యంలో సాధించే సామాజిక న్యాయం. ఇది మూడో ఉద్యమం. దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయం వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం మొదటి దశ సాధిస్తే... రాజీవ్ గాంధీ హయాంలో 18 ఏళ్లకే ఓటు హక్కు.. మండల్ కమిషన్ నివేదిక వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం 2.0 పూర్తయింది. ఇప్పుడు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీల ఆధ్వర్యంలో కుల గణనకు సామాజిక న్యాయం 3.0 ప్రారంభమైంది. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ మహా యుద్ధం ప్రకటించారు. ఆయన బాటలో నడుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సామాజిక, ఆర్థిక, కుల సర్వే మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో సర్వే 92 శాతం పూర్తయింది.పదేళ్లుగా దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, రాజ్యాంగ రక్షణకు రాహుల్ గాంధీ దేశ వ్యాప్త ఉద్యమం చేపట్టారు. రాహుల్ చేపపట్టిన ఉద్యమంలో ప్రజలు భాగస్వాములైనందునే మోదీ 400 వందల సీట్లు అడిగితే ప్రజలు కేవలం 240 సీట్లకు పరిమితం చేశారు. దేశవ్యాప్తంగా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ప్రజలు ఓడిస్తున్నారు.. ఇందుకు వయనాడ్, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలిస్తే, జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి గెలిచింది. రాజ్యాంగ రక్షణ ఉద్యమం కేవలం రాహుల్ గాంధీకి పరిమితమైన అంశంగా అనుకోవద్దు. మనమంతా అందులో భాగస్వాములు కావాలి. ప్రస్తుత పోరాటం రాజ్యాంగ రక్షకులు.. రాజ్యాంగ శత్రువుల మధ్యనే ఉందని గుర్తుంచుకోవాలి. మహాత్మా గాంధీ పరివార్ రాజ్యంగ రక్షణకు పూనుకుంటే.. మోదీజీ పరివార్ అంటే సంఘ్ పరివార్ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని విమర్శించారు.ఇక, అంతకుముందు వయనాడ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని కలిసి సీఎం రేవంత్, భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. -
‘నియంత పాలనకు..చంద్రబాబు సర్కారుకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయ్’
సాక్షి,తాడేపల్లి : సాక్షి,తాడేపల్లి : నియంతలు,నీరోల పాలనకు చంద్రబాబు పాలనకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో టీజేఆర్ సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కును మన రాజ్యాంగం కల్పించిందిపాలకులు రాచరికపు పోకడలు పోవటానికి వీల్లేదుకానీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారా?ప్రజల ప్రాథమిక హక్కులన్నిటినీ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారుఅలాంటి చంద్రబాబుకు రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపకునే హక్కు లేదురెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే చంద్రబాబుకు పాలనకు అనర్హుడుచెప్పినట్టు కేసులు పెట్టించకపోతే మంత్రి పదవిలో నుండి దిగిపోవాలని మంత్రి అనితని పవన్ కళ్యాణ్ అన్నారుఇదేనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే తీరు?నియంతలు, నీరోల పాలనకు చంద్రబాబు సర్కారుకు దగ్గరి పోలికలు ఉన్నాయిదళిత నేత నందిగం సురేష్ ను అన్యాయంగా జైలుపాల్జేశారుదళిత నాయకత్వాన్ని చంపేసే కుట్ర చంద్రబాబు చేస్తున్నారువైఎస్ జగన్ దళితులకు అందించిన సంక్షేమాన్ని నిలిపేసిన చంద్రబాబుకు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదుచిన్నారులపై అత్యాచారాలు చేసి చంపేస్తుంటే చంద్రబాబు దోషులను ఎందుకు అరెస్టు చేయనీయటం లేదు?జగన్‌పై నిత్యం విషం చిమ్మటానికే చంద్రబాబు పని చేస్తున్నారుచంద్రబాబు గెలుపులో ఏదో తేడా ఉందని అందరికీ అర్థం అవుతోందిఈవిఎంలలో తేడా వలనే గెలిచారని ప్రజలు అంటున్నారుభారీ సీట్లతో గెలిచిన కూటమి ప్రభుత్వానికి సోషల్ మీడియా కార్యకర్తలను చూస్తే భయమెందుకు?ఇలాంటి నాయకులను రీకాల్ చేసే పరిస్థితులు రావాలిఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, ఇతర అనేక కార్యక్రమాలను ఆపేసిన చంద్రబాబుకు రాజ్యాంగాన్ని అమలు చేసే హక్కు లేదుఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబుకు రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు లేదుఅభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయిఇక్కడ ఈవీఎంలతో ఎందుకు జరుపుతున్నారు?రాజ్యాంగ పరిరక్షణకు అందరం నడుము బిగించాల్సిన సమయం వచ్చింది కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోము’ అని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. -
నల్ల చట్టాలు తేవడంలో కూటమి సర్కార్ ముందుంది: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: ఏపీలో సోషల్ మీడియాను నియంత్రించే విధంగా కొత్త చట్టాలు తేవడం దారుణమన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. నల్ల చట్టాలు తేవడంలో కూటమి ప్రభుత్వం ముందు వరుసలో ఉందంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడలోని సింగ్ నగర్లో పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘రాజ్యాంగం ప్రతీ పౌరుడికి భద్రత, హక్కులు, స్వేచ్ఛ కల్పించింది. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి కూడా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బయటకు వచ్చినప్పుడు భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకుంటోంది.కూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తోంది. సోషల్ మీడియాను నియంత్రించే విధంగా కొత్త చట్టాలు తేవటం దారుణం. నల్ల చట్టాలు తేవడంలో కూటమి ప్రభుత్వం ముందుంది. ఆంధ్ర రాష్ట్రంలో వినూత్నమైన పరిపాలన జరుగుతోంది. ప్రజల హక్కులు హరించబడుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచింది. రాజ్యాంగం అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం వద్ద అధికారులు ఎందుకు నివాళులర్పించలేదు?. ప్రభుత్వం, అధికారులు వివక్షత చూపిస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: AP: సోషల్ మీడియా కార్యకర్తలపై పెరిగిన వేధింపులు -
ఆ ప్రశ్న అడగాల్సింది చంద్రబాబును: పవన్ కల్యాణ్
న్యూఢిల్లీ: కూటమి ప్రభుత్వంపై, రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయనకు రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై పవన్‌కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది.దానికి ఆయన స్పందిస్తూ..నేనేం లా అండ్ ఆర్డర్, హోం శాఖ చూడడం లేదు. నా శాఖ గురించి ఏదైనా అడిగితే చెప్పగలను. అయినా మీరు ఈ ప్రశ్న అడగాల్సింది.. సీఎం చంద్రబాబును, హోం మంత్రి అనితను. అయినప్పటికీ మీరు చెప్పినవన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తా అని అన్నారు.అలాగే.. దర్శకుడు రాం గోపాల్ వర్మ తప్పించుకుని తిరుగుతున్నారని, చంద్రబాబును ఇబ్బంది పెట్టినప్పుడు ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు.. ఇప్పుడు ఎందుకు తటపటాయిస్తున్నారు? అని పవన్ వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రంలో ఏం జరిగినా.. కూటమి ప్రభుత్వం తరఫున సమిష్టిగా బాధ్యత వహిస్తాం అని చెప్పారు.గతంలో పవన్ కల్యాణ్.. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో హోం మంత్రి అనితను నిందిస్తూ.. తాను హోం మంత్రి పదవి చేపడితే పరిస్థితి మరోలా ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చారు.ఇదీ చదవండి: వర్చువల్ విచారణకు వర్మ సిద్దపడ్డారు కదా! -
‘వైఎస్సార్సీపీ ఒప్పందం చేసుకుందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం’
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని విమర్శించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. లోకేష్ రాసిన రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని మండిపడ్డారు. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ జగన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రైల్వే భవనాల నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 52 ఎకరాలను కేటాయించిందన్నారు.‘కేకే లైన్‌తో కూడిన రైల్వే జోన్ ఇవ్వాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదానీతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సేకీతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆదానీ సంస్థతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. ప్రధాని మోదీ ప్రారంభిస్తారనే గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఒప్పందం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. ప్లాంట్‌కు సంబంధించిన భూ కేటాయింపులు మా ప్రభుత్వ హయాంలోనే జరిగాయి’ అని తెలిపారు. -
హాయ్ చెప్తే..అంత డ్రామా చేస్తారా: మంత్రి పొంగులేటి ఫైర్
సాక్షి,హైదరాబాద్: తాను వ్యాపారవేత్త అదానీతో హైదరాబాద్‌లోని ఓ హోటల్లో భేటీ అయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు.ఈ విషయమై పొంగులేటి మంగళవారం(నవంబర్26) ‘సాక్షి’ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.‘అదానీ నేను హైదరాబాద్‌లోని ఒక హోటల్లో లిఫ్ట్ దగ్గర కలిశాం. పాత పరిచయంతో అదానీకి హాయ్ చెపితే దానికి ఇంత డ్రామా చేస్తారా? అదానీతో పదేండ్లు అంటకాగింది బీఆర్ఎస్ పార్టీ. గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అదానీతో చాలా ఒప్పందాలు చేసుకుంది. అదానీకి బీఆర్ఎస్ ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేయాలా వద్దా క్లియర్‌గా చెప్పండి.మనసులో ఏదో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంపై అదానీ మార్క్ వేస్తారా?మా నాన్న తర్వాత మీ నాన్ననే ఎక్కువగా నమ్మాను.ఐదేళ్లు తడిబట్టతో నా గొంతు కోశారు’అని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: సీఎం రేవంత్‌కు కేటీఆర్ గట్టి కౌంటర్ -
సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: రాహుల్ గాంధీ మొట్టికాయలు వేయడం వల్లే సీఎం రేవంత్ అదానీ ఇచ్చిన వంద కోట్లు తిరస్కరించాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. మంగళవారం(నవంబర్ 26) కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.‘కొసరు మాత్రమే తిరిగిస్తే సరిపోదు. 12,400కోట్లు ఒప్పందాల సంగతేంటి?రాహుల్,రేవంత్‌రెడ్డిలలో ఎవరు పిచ్చోళ్ళో వాళ్లే తేల్చుకోవాలి.ఇకపై అనుముల రేవంత్ రెడ్డి కాదు..అబద్దాల రేవంత్ రెడ్డి. మైక్రోసాఫ్ట్ డేటా ప్రాజెక్టును అదానీ డేటా సెంటర్ అని రేవంత్ అనడం హాస్యాస్పదం.తనకంటే చిన్నవాడిని కాబట్టి తిట్టినా పడతాను. కానీ కేసీఆర్‌ను అనడానికి రేవంత్‌కు ఎంత ధైర్యం?ఈడీ కేసు కోసం రేవంత్,అతని మంత్రుల లెక్క మేం అదానీ కాళ్ళు పట్టుకోలేదు.బ్యాగులు మోసిన గజ దొంగ రేవంత్‌రెడ్డి.చిట్టినాయుడికి చిప్ దొబ్బిందని నిన్నటి రేవంత్ కామెంట్స్ చూస్తే అర్థమవుతోంది.నేను సైకో అయితే..సీఎం రేవంత్ సన్నాసినా? శాడిస్టా? ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఢిల్లీ నుంచి 8 రూపాయలు కూడా తీసుకురాలేదు.28సార్లు ఢిల్లీ వెళ్ళి..రేవంత్ 28 రూపాయలు కూడా తీసుకురాలేదు.అదానీ జాతీయ రహదారులు,రక్షణ శాఖ పనులు చేస్తే మాకేం సంబంధం?రేవంత్‌లో సబ్జెక్టు,సరుకు ఉండదు. ఎవరైనా చెప్తే వినడు. దావోస్‌లో నేను అదానీని బరాబర్ కలిసిన. మీ మాదిరి కోహినూరులో కాళ్ళు పట్టుకోలేదు. కేసీఆర్ హాయాంలో అదానీని ఎప్పుడు ప్రోత్సహించలేదు.అదానీకి రేవంత్ రెడ్ కార్పెట్ వేస్తే..మేం రెడ్ సిగ్నల్ చూపించాం.మాజీ సర్పంచ్ సాయిరెడ్డిది సీఎం రేవంత్ సోదరులు చేసిన హత్యే. ఏడాదిగా అదానీ,అల్లుడు, అన్న,బావమరిదికి అమృతం పంచటం కోసమే రేవంత్ పనిచేస్తున్నాడు.రేవంత్‌రెడ్డి అసహనం,నిరాశ, నిస్పృహలో ఉన్నారు.ముఖ్యమంత్రి అయ్యాక కూడా రేవంత్‌కు కేసీఆర్,మా మీద ఫ్రస్టేషన్ ఎందుకు?కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 48 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు.వాంకిడి గురుకుల విద్యార్థి శైలజది ప్రభుత్వం చేసిన హత్యే.తల్లిదండ్రుల మాదిరి చూసుకోవాల్సిన ప్రభుత్వమే విద్యార్థులను చంపేస్తోంది.గురుకుల విద్యార్థుల హత్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం’అని కేటీఆర్ హెచ్చరించారు.ఇదీ చదవండి: అదానీ నిధులు వద్దన్నాం: సీఎం రేవంత్