Ayodhya
-
Ayodhya Ram Mandir: అయోధ్యలో కలశ పూజ
అయోధ్య: అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కోసం ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. పూజరులు నిర్వహిస్తున్న ప్రత్యేక క్రతువులు రెండో రోజుకు చేరాయి. బుధవారం కలశ పూజ చేపట్టారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా దంపతులు ‘యజమానులుగా’ సరయూ నది తీరంలో కలశ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కలశాలను సరయూ నదీ జలాలలో నింపి పూజలు చేశారు. రామ్‌లల్లా ప్రతిష్టాపన సందర్భంగా ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి ఈ కలశాలను తీసుకెళ్తారు. ప్రతిష్టాపన కంటే ముందు ఈ జలాలతో పూజలు చేస్తారు. మొత్తం 121 మంది ఆచార్యులు క్రతువుల్లో పాల్గొంటున్నారు. లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యుడిగా వ్యవహరిస్తున్నారు. గురువారం గణేశ్ అంబికా పూజ, వరుణ పూజ, మాత్రికా పూజ, వాస్తు పూజ నిర్వహిస్తారు. మంగళవారం ప్రారంభమైన ఈ క్రతువులు ఈ నెల 21వ తేదీ దాకా నిరంతరాయంగా కొనసాగుతాయని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. అయోధ్యకు చేరుకున్న ‘రామ్‌లల్లా’ భవ్య మందిరంలో ప్రతిష్టించబోయే రామ్‌లల్లా విగ్రహం బుధవారం అయోధ్యకు చేరుకుంది. భక్తుల జయజయ ధ్వానాల మధ్య వాహనంలో ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. గర్భాలయంలోని వేదికపైకి చేర్చారు. కళ్లకు గంతలు కట్టి ఉన్న ఈ విగ్రహం చిత్రాలను తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేయలేదు. ఈ నెల 22న ఇదే విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయబోతున్నారు. ప్రాణప్రతిష్ట తర్వాతే రామ్‌లల్లా చిత్రాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, రామ్‌లల్లా ప్రతీకాత్మక (సింబాలిక్) విగ్రహం బుధవారం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. 19 నుంచి ‘అఖండ్ పథ్’ అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్టాపన కోసం హిందువులతోపాటు ఇతర మతాల ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ మూడు రోజులపాటు ‘అఖండ్ పథ్’ నిర్వహించేందుకు సిక్కు మతస్థులు సిద్ధమవుతున్నారు. అయోధ్యలోని గురుద్వారా బ్రహ్మకుండ్ సాహిబ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. రామాలయ ప్రాణప్రతిష్ట సజావుగా జరగాలని ఆకాంక్షిస్తూ అఖండ్ పథ్ నిర్వహించనున్నట్లు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సిక్కులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు. అయోధ్య శ్రీరాముడితో సిక్కులకు చరిత్రాత్మక అనుబంధం ఉందని వివరించారు. 1510లో గురునానక్ అయోధ్యను దర్శించుకున్నారని గుర్తుచేశారు. 1858లో సిక్కు మత పెద్దలు అయోధ్య రామాలయంలో పూజలు చేశారని, గోడలపై రామ్ అని రాశారని చెప్పారు. సిక్కు మత ఆచారాలు, సంప్రదాయాల్లో అఖండ్ పథ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. పవిత్ర గురుగ్రంథ సాహిబ్‌ను నిరంతరాయంగా భక్తితో పఠించడమే అఖండ్ పథ్. ఇందుకు 48 గంటలకుపైగా సమయం పడుతుంది. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ సాహిబ్‌లో ‘రామ్’ అనే పదం 2,533 సార్లు ఉందని ఆర్పీ సింగ్ వెల్లడించారు. ప్రాణప్రతిష్టకు ‘ప్రధాన యజమాని’ ప్రధాని మోదీ అయోధ్య: రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ప్రధాన యజమాని’గా వ్యవహరిస్తారని ప్రధాన ఆచార్యుడు పండిత లక్ష్మీకాంత్ దీక్షిత్ చెప్పారు. మొదట రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రాను ప్రధాన యజమానిగా ఖరారు చేశారు. కానీ, ఈ విషయంలో మార్పు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గర్భాలయంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టతోపాటు కీలకమైన పూజలను ప్రధాన యజమాని తన చేతుల మీదుగా నిర్వహిస్తారు. అయోధ్యకు 200కుపైగా ఆస్థా ప్రత్యేక రైళ్లు అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత భక్తులు పోటెత్తనున్నారు. వారి సౌకర్యార్థం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు 2 వేల ఆస్థా ప్రత్యేక రైళ్లు నడిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. టయర్–1, టయర్–2 నగరాల నుంచి బయలుదేరి ఈ రైళ్లు అయోధ్య ధామ్ స్టేషన్‌కు చేరుకుంటాయి. ఈ నెల 22వ తేదీ నుంచి 100 రోజులపాటు ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇవి పరిమితమైన స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి. అయోధ్య ధామ్ స్టేషన్ నుంచి మళ్లీ గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఈ రైళ్లలో ప్రయాణానికి ఐఆర్సీటీసీ ద్వారా మాత్ర మే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా 20 వేల ఉద్యోగాలు అయోధ్య ఇక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారనుంది రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట తర్వాత అయోధ్యను ప్రతిఏటా కోట్లాది మంది దర్శించుకోనున్నారు. అదేస్థాయిలో ఇక్కడ ఉద్యోగ, ఉపాధి పెరగడం ఖాయం. ఆతిథ్యం, రవాణా, పర్యాటక రంగాల్లో కలిపి 20 వేల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగిందని సమాచారం. ప్రతిఏటా శ్రీరాముడికి ‘సూర్య తిలకం’ అయోధ్య రామ మందిరంలో ప్రతిఏటా చైత్ర మాసంలో శ్రీరామనవమి రోజు భక్తులు అపూర్వమైన దృశ్యాన్ని తిలకించవచ్చు. ఆ రోజు గర్భాలయంలో రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరిస్తాయి. సూర్య కిరణాలే తిలకంగా రామయ్యను అలంకరిస్తాయి. దీన్ని సూర్య తిలకంగా పిలుస్తారు. ఈ తిలకం వ్యవస్థను సీఎస్ఐఆర్–సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(సీబీఆర్ఐ) సైంటిస్టులు డిజైన్ చేశారు. ఇందుకోసం ఆలయంలో కటకాలు, అద్దాలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 6 నిమిషాల పాటు సూర్య తిలకాన్ని దర్శించుకోవచ్చు. రామ భక్తులపై మోసాల వల సైబర్ నేరగాళ్లు అయోధ్య రామమందిర ప్రారం¿ోత్సవాన్ని కూడా అక్రమ సంపాదనకు వాడుకుంటున్నారు. అయోధ్య నుంచి రామమందిర ప్రసాదం పంపిస్తామంటూ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అమెజాన్ వంటి ఆన్లైన్ మార్కెట్ సైట్లలో ఇలాంటి ప్రసాదం కనిపిస్తోంది. డెలివరీ చార్జీల కింద కేవలం రూ.51 ఆన్లైన్ ద్వారా చెల్లిస్తే చాలు ఈ నెల 22వ తేదీ నాటికి ఉచితంగా ప్రసాదం పంపిస్తామంటూ మరికొందరు నేరగాళ్లు వల విసురుతున్నారు. నిజానికి దీనికి, అయోధ్య రామమందిరానికి ఎలాంటి సంబంధం లేదు. అదంతా నకిలీ ప్రసాదమని అధికారులు అంటున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కొందరైతే డొనేషన్లు సేకరిస్తున్నామంటూ రామ్ జన్మభూమి ట్రస్టు పేరిట వాట్సాప్ ద్వారా క్యూఆర్ కోడ్ పంపుతున్నారు. వాటిని స్కాన్ చేస్తే బ్యాంకు ఖాతాల్లో నగదు గల్లంతవుతోంది. అలాగే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపనను ప్రత్యక్షంగా తిలకించడానికి వీఐపీ పాసులు అందజేస్తామంటూ ఉచ్చులోకి లాగుతున్నారు. ‘రామ్ జన్మభూమి గృహ్ సంపర్క్ అభియాన్–ఏపీకే’ పేరిట ఇలాంటి సందేశాలను ఫోన్ల ద్వారా పంపిస్తున్నారు. నగదు బదిలీ చేయించుకొని ఫోన్లు స్విచ్ఛాప్ చేస్తున్నారు. -
Rahul Gandi: హాజరవడం కష్టమే
చిఫొబొజౌ(నాగాలాండ్): అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ఠ క్రతువు ఎన్నికల రంగులద్దుకుని ‘నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్–బీజేపీ’ ఫంక్షన్‌గా ముస్తాబవుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం సాయంత్రం నాగాలాండ్‌లోకి అడుగుపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర మంగళవారం సైతం వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారుల నడుమ కొనసాగింది. యాత్రను ముందుండి నడిపిస్తున్న రాహుల్ గాంధీ మంగళవారం రాష్ట్ర రాజధాని కోహిమాలో కాంగ్రెస్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అందిన ఆహా్వనాన్ని తమ పార్టీ అగ్రనేతలు సున్నితంగా తిరస్కరించడాన్ని ఆయన గట్టిగా సమరి్థంచారు. ‘‘ మందిరం ప్రారం¿ోత్సవానికి కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’ కూటమి పారీ్టల నేతలు ఎవరు వెళ్లినా నేను మనసారా స్వాగతిస్తా. కానీ ఇప్పుడు ఆ కార్యక్రమం మొత్తం మోదీ, ఆర్ఎస్ఎస్ కేంద్రంగా తయారైంది. చక్కని వేడుకను ఆర్ఎస్ఎస్, బీజేపీలు రాజకీయ వేడుకగా మార్చేశాయి. అందుకే ఈ కార్యక్రమానికి వెళ్లొద్దని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియా గాం«దీ భావించి ఉంటారు. కాంగ్రెస్ పారీ్టకి అన్ని మతాలు, సంప్రదాయాలు సమానమే. 22న అయోధ్య జరిగే కార్యక్రమం.. రాజకీయ ఉత్సవంలా మారిందని స్వయంగా కొందరు హిందూ మత పెద్దలే బహిరంగంగా విమర్శించారు. ఇలా కొత్తరూపును సంతరించుకున్న ఈ కార్యక్రమానికి మేం వెళ్లడం కష్టం. అసాధ్యం కూడా’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘‘ఇండియా కూటమి బలంగా ఉంది, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ పారీ్టతో సీట్ల పంపకం విషయంలో నెలకొన్న విభేదాలు సమసి పోతాయి’’ అని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. -
Sculptor Arun Yogiraj: రామ్‌లల్లా విగ్రహం ఖరారు
మైసూర్: అయోధ్య రామమందిరంలో ప్రతిష్టించబోయే రామ్‌లల్లా విగ్రహాన్ని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఖరారు చేసింది. కర్ణాటక రాష్ట్రం మైసూర్‌కు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన ప్రతిమకు ఆ మహద్భాగ్యం దక్కనుంది. ఈ నెల 22న గర్భాలయంలో విగ్రహం ప్రాణపత్రిష్ట జరుపుకోనుంది. అయోధ్య ఆలయంలో ప్రతిష్టించడానికి మూడు విగ్రహాలను చెక్కించారు. వీటిలో అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పాన్ని ఎంపిక చేశారు. ఈ విగ్రహం ఐదేళ్ల బాలరాముడి రూపంలో ఉందని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ తెలిపారు. నిల్చున్న రూపంలోనే విగ్రహాన్ని తయారు చేయించామని చెప్పారు. రామ్‌లల్లా విగ్రహాన్ని ఈ నెల 18వ తేదీన గర్భాలయంలోని ఆసనంపైకి చేరుస్తామని వెల్లడించారు. బాలరాముడి విగ్రహాన్ని తయారు చేయడానికి ఎంతగానో శ్రమించారని, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అరుణ్ యోగిరాజ్ కుటుంబ సభ్యులు మంగళవారం చెప్పారు. రామ్‌లల్లా విగ్రహాన్ని చెక్కుతుండగా గాయం వల్ల ఆయనకు కంటి నొప్పి వచి్చందని అన్నారు. యోగిరాజ్ రూపొందించిన శిల్పాన్ని తీర్థ క్షేత్ర ట్రస్టు ఎంపిక చేయడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ మహాకార్యం కోసం దేవుడు తన భర్తను ఎన్నుకొని ఉండొచ్చని యోగిరాజ్ భార్య విజేత అన్నారు. ఇది తమకు మర్చిపోలేని రోజు అని యోగిరాజ్ సోదరుడు సూర్యప్రకాశ్ పేర్కొన్నారు. వార్త తెలిసిన తర్వాత తమకు చెప్పలేనంత ఆనందంగా ఉందని ఆయన తల్లి సరస్వతి అన్నారు. అరుణ్ యోగిరాజ్ గొప్ప శిల్పిగా ప్రఖ్యాతిగాంచారు. కేదార్‌నాథ్‌లో ప్రతిష్టించిన ఆది శంకరాచార్య, ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద నెలకొల్పిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను ఆయనే రూపొందించారు. -
Ayodhya Ram Mandir: గాయని చిత్రపై ట్రోలింగ్
తిరువనంతపురం: జాతీయ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత గాయని కేఎస్ చిత్ర ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభ ఉత్సవాన్ని స్వాగతిస్తూ ఒక వీడియోను రెండు రోజుల క్రితం ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేయడమే ఇందుకు కారణం. ఈ నెల 22న ఆలయ ప్రాణప్రతిష్ట సందర్భంగా ప్రజలంతా శ్రీరామ జయరామ జయ జయ రామ అనే రామమంత్రం జపించాలని, సాయంత్రం ఇళ్లల్లో ఐదు దీపాలు వెలిగించాలని చిత్ర పిలుపునిచ్చారు. ప్రజలందరికీ భగవంతుడి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. ‘లోకస్సమస్త సుఖినోభవంతు’ అంటూ తన సందేశాన్ని ముగించారు. అయితే, ఈ వీడియో సందేశంపై సోషల్ మీడియాలో పలువురు విమర్శలు చేస్తున్నారు. ఒక మతానికి మద్దతు ఇవ్వడం, దాన్ని ప్రచారం చేయడం, అయోధ్య రామమందిరానికి ప్రాచుర్యం కలి్పంచడం తప్పు అంటూ ఆక్షేపిస్తున్నారు. మరోవైపు చిత్రకు మద్దతు వెల్లువెత్తుతోంది. పారీ్టలకు అతీతంగా రాజకీయ నాయకులు, గాయనీ గాయకులు, రచయితలు, వివిధ వర్గాల ప్రజలు ఆమెకు అండగా నిలుస్తున్నారు. అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు చిత్రకు ఉందని తేలి్చచెప్పారు. ట్రోలింగ్ చేసేవారి పట్ల మండిపడుతున్నారు. చిత్రకు కేరళకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం నాయకులు మద్దతు ప్రకటించారు. చిత్ర ఇచి్చన సందేశాన్ని వివాదాస్పదం చేయొద్దని హితవు పలికారు. రాముడి పట్ల విశ్వాసం ఉన్నవారు ఆయనను పూజిస్తారని, అందులో తప్పేముందని చిత్రకు మద్దతుగా పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, సినీ నటి ఖుష్బూ సుందర్ సైతం చిత్రకు మద్దతు ప్రకటించారు. కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అసహనం పెరిగిపోతోందని ఆరోపించారు. -
Ayodhya Ram Mandir: అయోధ్యలో సంప్రదాయ క్రతువులు ఆరంభం
అయోధ్య: చారిత్రక నగరం అయోధ్యలోని భవ్య రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 22న జరిగే ఈ మహా వేడుకకు దేశ విదేశాల నుంచి వేలాది మంది విశిష్ట అతిథులు హాజరు కాబోతున్నారు. బాలరాముడి ప్రతిష్టాపనకు సంబంధించిన సంప్రదాయ క్రతువులు మంగళవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ట దాకా నిరంతరాయంగా కొనసాగుతాయని అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. శ్రీరామజన్మభూమి ఆలయం గర్భగుడి ద్వారం క్రతువులకు ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా, ఆయన భార్య ఉషా మిశ్రా ‘యజమానులుగా’ వ్యవహరిస్తున్నారు. ఆలయ ప్రారం¿ోత్సవం దాకా ప్రతినిత్యం వారే యజమానులుగా ఉంటారు. అయోధ్యలో అనుష్ఠానానికి శ్రీకారం చుట్టామని, ఆలయ ప్రాణప్రతిష్టకు దేవుళ్లందరి అనుగ్రహాన్ని అరి్థస్తూ మొత్తం 11 మంది పూజారులు క్రతువులు ప్రారంభించారని ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ తెలిపారు. ఆలయంలో ప్రాణప్రతిష్ట ముగిశాక ప్ర«దానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారు. అయోధ్యలోని గోడలపై చిత్రించిన రామాయణంలోని అపురూప ఘట్టాల దృశ్యాలు... ఆసక్తిగా తిలకిస్తున్న స్థానికులు ఈ కార్యక్రమానికి 8 వేల మంది అతిథులు హాజరవుతారని అంచనా. వీరిలో కొద్ది మందిని మాత్రమే గర్భాలయంలోకి అనుమతిస్తారు. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ ఆధ్వర్యంలో 121 మంది అచార్యులు ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రధాన ఆచార్యుడిగా కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ వ్యవహరించబోతున్నారు. అయోధ్యలో సోమవారం ప్రాయశి్చత్త, కర్మకుటీ పూజ నిర్వహించారు. 56 రకాల ఆగ్రా పేఠాలు ఆగ్రా పేఠ.. ఉత్తర భారతీయులకు చాలా ఇష్టమైన మిఠాయి. బూడిద గుమ్మడికాయ, చక్కెర పాకంతో ఈ పేఠాలు తయారు చేస్తారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ట జరుపుకోనున్న బాలరాముడికి ఆగ్రా పేఠాలను నివేదించబోతున్నారు. ఇందుకోసం ఏకంగా 56 రకాల పేఠాలను సిద్ధం చేశారు. ఇవి మంగళవారం అయోధ్యకు చేరుకున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆగ్రాకు చెందిన పంచీపేఠ అనే మిఠాయిల దుకాణం వీటిని తయారు చేసి పంపించింది. అలాగే అదనంగా 560 కిలోల పేఠాలను సైతం ఆగ్రా ట్రేడ్ బోర్డు ద్వారా పంపింది. వీటిని భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టే అవకాశం ఉంది. అలాగే రత్నాలు కూర్చిన పట్టు వ్రస్తాలు, వెండి పళ్లేలు, ఇతర పూజా సామగ్రి సైతం వేర్వేరు ప్రాంతాల నుంచి అయోధ్యకు చేరుకున్నాయి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 108 అడుగుల అగరు బత్తి వెలిగించారు గుజరాత్ నుంచి అయోధ్యకు పంపించిన 108 అడుగుల పొడవైన అగరు బత్తిని శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు మహంత్ నృత్యగోపాల్ దాస్ మంగళవారం వెలిగించారు. గుజరాత్ నుంచి తెచి్చన 108 అడుగుల అగరొత్తికి మొక్కుతున్న భక్తులు ఈ సందర్భంగా భక్తులు జైశ్రీరామ్ అంటూ జపించారు. దాదాపు 40 రోజుల దాకా ఈ అగరు బత్తి వెలుగుతూనే ఉంటుంది. 3,610 కిలోల బరువు, మూడున్నర అడుగుల వెడల్పు ఉన్న ఈ అగరు బత్తి సువాసన 50 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుందని తయారీదారులు చెప్పారు. భారీ అగరు బత్తిని ఆవు పేడ, నెయ్యి, సుగంధ తైలాలు, పూల రెక్కలు, ఔషధ మూలికలతో తయారు చేశారు. భారీ అగరొత్తిని వెలిగిస్తున్న మహంత్ నృత్య గోపాల్ దాస్ ప్రాణప్రతిష్టలో సంప్రదాయ సంగీత మధురిమలు రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట సందర్భంగా అయోధ్యలో భారతీయ సంప్రదాయ సంగీతం అతిథులను అలరించబోతోంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సంప్రదాయ సంగీత కళాకారులను రప్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మణిపూర్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఢిల్లీ, రాజస్తాన్, పశి్చమ బెంగాల్, జార్ఖండ్, తమిళనాడు, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల నుంచి నుంచి కళాకారులు రాబోతున్నారు. ఇప్పటికే వారిని తీర్థ క్షేత్ర ట్రస్టు ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటము వాయిద్యానికి స్థానం కల్పించారు. ఈ నెల 22న జరిగే అపూర్వ వేడుకలో కళాకారులు తమ సంగీత ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పఖవాజ్, తమిళనాడుకు చెందిన మృదంగం వంటి వాయిద్యాలు ప్రదర్శన ఉంటుంది. అయోధ్యలో రామమందిర ప్రారం¿ోత్సవంలో భిన్నరకాల వాయిద్యాలను ఒకేచోట తిలకించవచ్చు. భారతీయ సంప్రదాయ సంగీత మధురిమలను మనసారా ఆస్వాదించవచ్చు. ఇదిలా ఉండగా, ప్రాణప్రతిష్ట ముగిసిన తర్వాత ఈ నెల 23 నుంచి సామాన్య ప్రజలకు బాలరాముడి దర్శనభాగ్యం కలి్పస్తారు. ఈ నెల 26 తర్వాత ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ కార్యకర్తలు విడతలవారీగా దర్శించుకొనేలా షెడ్యూల్ రూపొందించారు. వారి దర్శనాలు ఫిబ్రవరి ఆఖరు దాకా కొనసాగుతాయి. అతిథుల కోసం బస ఏర్పాట్లు చేస్తున్నారు. సరయూ నదిలో సౌర విద్యుత్ పడవ అయోధ్య నగరాన్ని మోడల్ సోలార్ సిటీకి అభివృద్ధి చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సంకలి్పంచింది. ఇందులోభాగంగా సౌర విద్యుత్‌కు పెద్ద పీట వేయబోతోంది. అయోధ్యలో సరయూ నదిలో సౌరవిద్యుత్‌తో నడిచే పడవలను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి పడవను ఈ నెల 22న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించబోతున్నారు. ఇండియాలో ఇదే తొలి సౌరవిద్యుత్ పడవ కావడం గమనార్హం. అయోధ్య పర్యాటకులు సరయూ నదిలో ఇలాంటి పడవల్లో విహరించవచ్చు. నయా ఘాట్ నుంచి ఈ పడవలు రాకపోకలు సాగిస్తాయి. ఒక్కో బోట్లో ఒకేసారి 30 మంది ప్రయాణించవచ్చు. ఫైబర్గ్లాస్తో తయారు చేయడంతో తేలిగ్గా ఉంటాయి. శబ్దం రాదు. పూర్తిగా పర్యావరణ హితం. ఇది కూడా చదవండి: రామ మందిర ప్రతిష్టాపన.. ఆ మూడు రాష్ట్రాల్లో 'డ్రై డే' -
Ayodhya: 2,100 కిలోల గంట.. 108 అడుగుల అగరుబత్తి
న్యూఢిల్లీ: అయోధ్యలో నిర్మించిన భవ్యమందిరంలో కొలువుదీరబోతున్న బాల రాముడికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అరుదైన కానుకలు వెల్లువెత్తుతున్నాయి. 108 అడుగుల పొడవైన అగరుబత్తి, 2,100 కిలోల బరువైన గంట, 1,100 కిలోల బరువైన భారీ ప్రమిద, బంగారు పాదుకలు, 10 అడుగుల ఎత్తయిన తాళం, తాళంచెవి, ఒకేసారి ఎనిమిది దేశాల సమయాన్ని సూచించే గడియారం తదితర ప్రత్యేక కానుకలను అయోధ్య రాముడికి సమరి్పంచేందుకు భక్తులు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఈ నెల 22వ తేదీన రామ మందిరంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దేశ విదేశాల నుంచి బహుమతులు అందుతున్నాయి. సీతమ్మ పుట్టిన ఊరు జనక్‌పూర్ ప్రస్తుతం నేపాల్‌లో ఉంది. నేపాల్ నుంచి అయోధ్యకు వెండి చెప్పులు, బంగారు ఆభరణాల వంటి 3,000కుపైగా బహుమతులు వచ్చాయి. ఇక శ్రీలంకలోని అశోక్ వాటిక నుంచి తీసుకొచ్చిన ఒక అరుదైన రాయిని అక్కడి ప్రతినిధులు అయోధ్యలో అందజేశారు. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7,000 కిలోల ‘రామ్ హల్వా’ అయోధ్యలో ప్రాణప్రతిష్ట కోసం గుజరాత్ భక్తులు 44 అడుగుల పొడవైన ఇత్తడి జెండా స్తంభాన్ని పంపిస్తున్నారు. మహారాష్ట్రకు విష్ణు మనోహర్ అనే వంట మాస్టర్ 7,000 కిలోల ‘రామ్ హల్వా’ తయారు చేసి అయోధ్యలో భక్తులకు పంపిణీ చేస్తారు. శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ 200 కిలోల భారీ లడ్డూ తయారీలో నిమగ్నమైంది. అయోధ్యకు లక్ష లడ్డూలు పంపిస్తామని తిరుమతి తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించడం తెలిసిందే. సీతమ్మ కోసం సూరత్‌లో ప్రత్యేకంగా చీర తయారు చేస్తున్నారు. సూరత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి 2 కిలోల వెండి, 5,000 అమెరికన్ వజ్రాలతో కూడిన నెక్లెస్ రాముడికి బహూకరించబోతున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యాపురిలో నూతన రామాలయ వైభవమిదే.. -
ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ‘రామోత్సవం’
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామాలయంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు జరగనున్నాయి. అమెరికా, బ్రిటన్ సహా 50కిపైగా దేశాల్లో ‘రామోత్సవం’నిర్వహించనున్నారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న రామభక్తులు ఇప్పటికే కొన్ని దేశాల్లో శోభాయాత్రలకు కూడా శ్రీకారం చుట్టారు. విశ్వహిందూ పరిషత్ (విశ్వ విభాగం) ఆధ్వర్యంలో మరి కొన్ని దేశాల్లో భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. జనవరి 22న అమెరికాలో 300, జర్మనీలో 100, మారిషస్‌లో 100, కెనడా, ఆ్రస్టేలియాల్లో 30, బ్రిటన్‌లో 25 కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హిందువులు తక్కువగా ఉన్న ఐర్లాండ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో ఒక్కో కార్యక్రమం ఉంటుంది. ఇలా మొత్తం 50కి పైగా దేశాల్లో 500 పైగా ధారి్మక, వైదిక, సాంస్కృతిక పరమైన సామూహిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విశ్వహిందూ పరిషత్ వర్గాలు తెలిపాయి. -
అయోధ్యలో కళ్యాణ్ జువెల్లర్స్ స్టోర్
న్యూఢిల్లీ: ఆభరణాల విక్రయంలో ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్ 250వ షోరూమ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో మార్చిలోగా ప్రారంభించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. 2023–24 నాల్గవ త్రైమాసికంలో కొత్తగా భారత్‌లో 15 కళ్యాణ్ ఔట్లెట్లను ఏర్పాటు చేస్తోంది. మధ్యప్రాచ్య దేశాల్లో 2 కళ్యాణ్, 13 క్యాండీర్ స్టోర్లను తెరువనుంది. 2023 డిసెంబర్ 31 నాటికి సంస్థ ఖాతాలో మొత్తం 235 కేంద్రాలు ఉన్నాయి. అక్టోబర్–డిసెంబర్లో ప్రారంభించిన కంపెనీ యాజమాన్యంలోని కేంద్రాలను ఫ్రాంచైజీ ఓన్డ్ ఫ్రాంచైజీ ఆపరేటెడ్ (ఫోకో) విధానంలోకి మార్చనున్నట్టు కళ్యాణ్ జువెల్లర్స్ తెలిపింది. 2024–25లో కొత్తగా 80 ఔట్లెట్లు రానున్నాయి. ఇందుకు కావాల్సిన ఒప్పందాలు పూర్తి అయ్యాయి. ఎక్కువ దుకాణాలు ఫ్రాంచైజీ విధానంలో తెరుచుకోనున్నాయి. -
అయోధ్య ఎయిర్‌పోర్టుకు మహర్షి వాల్మికి పేరు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు–అయోధ్యధామ్’ అని పేరుపెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించాలని కూడా నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. రైల్వేలో ‘సున్నా కర్బన ఉద్గారాల’ లక్ష్యాన్ని సాధించడానికి అమెరికాతో ఒప్పందానికి అనుమతించింది. మారిషస్ భాగస్వామ్యంతో ఉమ్మడిగా బుల్లి ఉపగ్రహం అభివృద్ధికి అవగాహనా ఒప్పందానికి కూడా అంగీకరించింది. ‘పృథ్వీ విజ్ఞాన్’కు ఆమోదం ఎర్త్ సైన్సెస్ రంగంలో ఐదు వేర్వేరు పథకాల కింద పరిశోధనలకు, కేటాయించిన నిధుల వినియోగానికి ఉద్దేశించిన ‘పృథ్వీ విజ్ఞాన్’కు కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని అమలుకు రూ.4,797 కోట్లు కేటాయించింది. ఇది ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది. వాతావరణం, సముద్రం, క్రయోస్పియర్, పోలార్ సైన్స్, సీస్మాలజీ, జియోసైన్సెస్ వంటి అంశాలపై పరిశోధనలు చేయనున్నారు. పృథ్వీ విజ్ఞాన్ కింద రీసెర్చ్ ప్రాజెక్టులను విదేశీ సంస్థలకు అప్పగించడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గయానా నుంచి ముడి చమురు కొనుగోలుతో పాటు హైడ్రో కార్బన్ రంగంలో పరస్పర సహకారానికి ఒప్పందం కుదుర్చుకునేందుకూ అంగీకరించింది. గయానాలో ముడి చమురు అన్వేషణ, ఉత్పత్తిలో భారతీయ కంపెనీలకు సైతం భాగస్వామ్యం కలి్పస్తారు. ప్రపంచ దేశాలతో అయోధ్య అనుసంధానం: మోదీ అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలపడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దీన్ని వాల్మికి మహర్షికి దేశ ప్రజల తరపున ఘనమైన నివాళిగా అభివరి్ణంచారు. అయోధ్యను ప్రపంచ దేశాలతో అనుసంధానించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. -
రామాలయం అక్షతల పంపిణీ ప్రారంభం
అయోధ్య: అయోధ్యలోని భవ్య రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈనెల 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు జరిగే విగ్రహ ప్రతిష్టకు గాను నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సోమవారం నుంచి అక్షతల పంపిణీని ప్రారంభించినట్లు ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. బియ్యంతో పసుపు, నెయ్యి కలగలిపిన పవిత్ర అక్షతల పంపిణీ కార్యక్రమం మకర సంక్రాంతి వరకు, ఈ నెల 15 వరకు కొనసాగుతుందన్నారు. ప్రజలకు పంపిణీ చేసే అక్షతల ప్యాకెట్‌పై రామాలయం చిత్రంతోపాటు ఆలయ నిర్మాణం గురించిన వివరాలతో కూడిన కరపత్రం ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల ఆలయాల పరిధిలోని 5 కోట్ల కుటుంబాల ప్రజలకు అక్షతలు అందుతాయని చెప్పారు. -
రాముడే బీజేపీ ఎన్నికల అభ్యర్థి!: రౌత్
ముంబై: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవాన్ని బీజేపీ పూర్తిగా రాజకీయమయం చేస్తోందని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఆలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహా్వనంపై రౌత్ స్పందించారు. ‘‘ శ్రీరాముని పేరును బీజేపీ తన రాజకీయాలకు విపరీతంగా వాడేసుకుంది. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్నీ బీజేపీ ఎంతో రాజకీయ చేసింది. తమ ఎన్నికల అభ్యర్థి శ్రీరామచంద్రుడే అని బీజేపీ ప్రకటించడం ఒక్కటే మిగిలిపోయింది. జనవరి 22న జరిగేది బీజేపీ కార్యక్రమం. ఆ రోజు జరిగేది ఎలా చూసినా జాతీయ కార్యక్రమం కాబోదు. రాజకీయాలతో బీజేపీ రాముడిని కిడ్నాప్ చేసింది’’ అని వ్యాఖ్యానించారు. మరి శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే ఆ కార్యక్రమానికి వెళ్తారుగా అని మీడియా ప్రశ్నించగా ‘‘అవును. కానీ బీజేపీ ఆధ్వర్యంలో జరిగే తతంగం అంతా ముగిశాక అసలు కార్యక్రమంలో ఉద్ధవ్ పాల్గొంటారు’’ అని బదులిచ్చారు. -
పైలట్ నోట జై శ్రీరాం
న్యూఢిల్లీ: అయోధ్యలో శనివారం మొదలైన ఎయిర్‌పోర్ట్‌కు ఢిల్లీ నుంచి తొలి విమానం బయల్దేరి వెళ్లింది. ఇండిగో విమానయాన సంస్థ తమ తొలి ఢిల్లీ–అయోధ్య విమానాన్ని శనివారం మధ్యాహ్నం ప్రారంభించింది. ఈ విమానంలోకి అడుగుపెడుతున్న ప్రయాణికులకు పైలట్ అశుతోష్ శేఖర్ .. ‘జై శ్రీరామ్’ అంటూ స్వాగతం పలికారు. ‘అయోధ్యకు బయల్దేరుతున్న తొలి విమానానికి సారథ్యం వహించే బాధ్యతలు నాకు అప్పగించడం నిజంగా నా అదృష్టం. మీ ప్రయాణం సాఫీగా, ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్’ అని ఆయన విమానంలో అనౌన్స్ చేశారు. తమ తమ సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ప్రయాణ సమయంలో హనుమాన్ చాలీసాను పఠించారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. -
ఉజ్వల లబ్ధిదారు ఇంట్లో టీ తాగిన మోదీ
అయోధ్య: ‘ఉజ్వల పథకం’ 10 కోట్లవ లబ్దిదారు మీరా మంఝీతో మోదీ అన్న మాటలివి! అయోధ్య రైల్వేస్టేషన్ ప్రారంభించాక విమానాశ్రయానికి వెళ్తూ మార్గ మధ్యంలో లతా మంగేష్కర్ చౌక్ కూడలి సమీపంలో ఆయన హఠాత్తుగా ఆగారు. సమీప వీధిలోని మీరా ఇంటికెళ్లి వారందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. స్వయానా ప్రధాని తన ఇంటికి రావడంతో ఉబ్బి తబ్బిబ్బైన మీరా బహుశా ఆ కంగారులో ఆయనకు కలిపిచి్చన టీలో కాస్తంత చక్కెర ఎక్కువేశారు. ఆ చాయ్ తాగుతూ తీపి ఎక్కువైందని మోదీ సరదాగా స్పందించారు. ఉజ్వల పథకం 10 కోట్లవ లబ్ధిదారు కావడంతో ఆమె కుటుంబాన్ని కలిసేందుకు మోదీ ప్రత్యేకంగా వారింటికి వెళ్లారు. ‘‘ఉజ్వలతో ఉచితంగా గ్యాస్ కనెక్షన్ వచి్చంది. కేంద్ర గృహ నిర్మాణ పథకంతో ఉచితంగా ఇల్లూ వచి్చంది’’ అంటూ మీరా ఆనందం వెలిబుచ్చారు. ఆమె కుటుంబ యోగక్షేమాలను మోదీ అడిగి తెల్సుకున్నారు. మీరా కుమారుడికి ఆటోగ్రాఫ్ ఇచ్చి వందేమాతరం అని రాసిచ్చారు. అక్కడి చిన్నారులతో సెల్ఫీ దిగారు. ‘‘పాత ప్రభుత్వాలు ఐదు దశాబ్దాల్లో కేవలం 14 కోట్ల గ్యాస్ కనెక్షన్లిస్తే మేం పదేళ్లలో ఏకంగా 18 కోట్ల కనెక్షన్లు అందించాం. వాటిలో పది కోట్లు ఉచిత కనెక్షన్లే’’ అని మోదీ అన్నారు. -
జనవరి 22న... ఇంటింటా రామజ్యోతి
అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్టను దీపావళి పర్వదినంగా ప్రధాని మోదీ అభివరి్ణంచారు. ఆ సందర్భంగా జనవరి 22న ఇంటింటా శ్రీరామజ్యోతి వెలిగించాలని దేశ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆ రోజు కోసం ప్రపంచమంతా ఏళ్ల తరబడి ఎదురుచూసిందన్నారు. ఏళ్ల తరబడి గుడారంలో గడిపిన రామునికి ఎట్టకేలకు ‘పక్కా ఇల్లు’ సాకారమైందన్నారు. అయోధ్యలో ఆయన శనివారం పర్యటించారు. నూతన విమానాశ్రయంతోపాటు ఆధునీకరించిన రైల్వే జంక్షన్‌ను ప్రారంభించారు. రూ.15,700 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి, వారసత్వం రెండు పట్టాలుగా దేశం ప్రగతి పథంలో పరుగులు తీయాలని ఆకాంక్షించారు. జనవరి 22న అయోధ్యకు పోటెత్తొద్దని, ఎక్కడివారక్కడే రామాలయ ప్రారంభ వేడుకలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో ఉజ్వల్ పథక 10 కోట్లవ లబి్ధదారు ఇంట్లో మోదీ చాయ్ ఆస్వాదించారు. అయోధ్య: అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం దేశ ప్రజలందరికీ దీపావళి వంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జనవరి 22న దేశమంతటా ఇంటింటా శ్రీరామజ్యోతి వెలిగించాలని పిలుపునిచ్చారు. నిత్యం రామనామ స్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్న అయోధ్యలో ఆయన శనివారం పర్యటించారు. పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో రోజంతా బిజీబిజీగా గడిపారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించాక అక్కడ భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. జనవరి 22న భవ్య రామాలయ ప్రారంభాన్ని, శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమమంటే అందరికీ దీపావళి పండుగే. దీనికి గుర్తుగా ఆ రాత్రి ఇంటింటా శ్రీరామ జ్యోతిని వెలిగించండి. అయోధ్యలో రామ్‌లల్లా (బాల రాముడు) ఇంతకాలం తాత్కాలిక టెంట్ కింద గడపాల్సి వచ్చింది. ఇప్పుడు దేశంలోని నాలుగు కోట్ల మంది పేదలతో పాటు రామ్‌లల్లాకు కూడా పక్కా ఇల్లు వచ్చేసింది’’ అని అన్నారు. రామమందిర ప్రారంభోత్సవాన్ని చరిత్రాత్మక ఘట్టంగా మోదీ అభివరి్ణంచారు. ‘‘ఈ రోజు కోసం యావత్ ప్రపంచం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసింది. కనుక అయోధ్య వాసుల్లో ఇంతటి ఉత్సాహం సహజం. భరత గడ్డపై అణువణువునూ ప్రాణంగా ప్రేమిస్తా. ప్రతి భారతీయుడూ పుట్టిన నేలను ఆరాధిస్తాడు. నేనూ మీలో ఒకడినే’’ అన్నారు. వికాస్.. విరాసత్ అత్యంత స్వచ్ఛమైన నగరంగా అయోధ్యను తీర్చిదిద్దుదామంటూ ప్రతిజ్ఞ చేద్దామని మోదీ పిలుపునిచ్చారు. ‘‘ఇది అయోధ్యవాసుల బాధ్యత. జనవరి 14 నుంచి 22వ తేదీ దాక దేశంలోని అన్ని ఆలయాలు, ఆధ్యాత్మిక స్థలాల్లో స్వచ్ఛత కార్యాక్రమాలు చేపడదాం. దేశం కోసం కొత్త తీర్మానాలు, మనం కోసం కొత్త బాధ్యతలను తలకెతత్తుకుందాం. ఏ దేశమైనా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే వారసత్వాన్ని పరిరక్షించుకోవాల్సిందే. వికాస్ (అభివృద్ధి)తో పాటు విరాసత్ (వారసత్వం) కూడా ముఖ్యమే. అవి రెండూ పట్టాలుగా 21వ శతాబ్దంలో దేశాభివృద్ధిని పరుగులు పెట్టిద్దాం’’ అని పిలుపునిచ్చారు. ఆ రెండింటి ఉమ్మడి అభివృద్ధి బలమే భారత్‌ను ముందుకు నడుపుతుందన్నారు. సభలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. ఆకట్టుకున్న మెగా రోడ్ షో శనివారం ఉదయం 11 గంటలకు అయోధ్య ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాక మోదీ అక్కడి నుంచి రోడ్ షోలో పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్ దాకా దాదాపు 15 కిలోమీటర్ల పొడవునా రోడ్‌షో సాగింది. దారి పొడవునా ప్రధానికి అయోధ్యవాసులు, పలు రాష్ట్రాల నుంచి వచి్చన కళాకారులు ఘన స్వాగతం పలికారు. ఆయనపై పూలవర్షం కురిపించారు. రోడ్‌షో మధ్య మధ్యలో ఏర్పాటుచేసిన 40 కళావేదికల వద్ద పలు రాష్ట్రాల కళాకారులు నృత్య, కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ప్రయాగ్‌రాజ్ నుంచి వచి్చన కళాకారులు రాముని జీవితంతో ముడిపడి ఉన్న ‘దేధియా’ నృత్యంతో ఆకట్టుకున్నారు. అనంతరం మోదీ మార్గమధ్యంలో అతిపెద్ద వీణతో అలంకృతమైన లతా మంగేష్కర్ చౌక్ వద్ద కాసేపు గడిపారు. ఆ రోజు రాకండి ఆహా్వనితులు మినహా మిగతా వారు 22న అయోధ్యకు రావద్దని మోదీ విజ్ఞప్తి చేశారు. ‘‘రామాలయ ప్రాణప్రతిష్ఠ క్రతువును ప్రత్యక్షంగా తిలకించేందుకు జనవరి 22వ తేదీనే అయోధ్యకు పోటెత్తాలని అసంఖ్యాకులు భావిస్తున్నట్టు తెలిసింది. దయచేసి ఆ రోజున మాత్రం అయోధ్యకు రాకండి. చేతులు జోడించి వేడుకుంటున్నా. ఎందుకంటే అందరికీ అదే రోజున దర్శనభాగ్యం సాధ్యపడదు. ఆ రోజు చాలామంది విశిష్ట అతిథులు విచ్చేస్తున్నారు. కనుక యావత్ ప్రజానీకం జనవరి 23 నుంచి జీవితాంతం అయోధ్య రామున్ని దర్శించుకోవచ్చు’’ అని సూచించారు. వాలీ్మకి మహర్షి ఎయిర్పోర్ట్ ప్రారంభం అయోధ్యలో ఆధునిక హంగులతో సిద్దమైన విమానాశ్రయాన్ని మోదీ ప్రారంభించారు. రామాయణ కర్త పేరిట దీనికి మహర్షి వాలీ్మకి అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు. అయోధ్యకు 15 కిలోమీటర్ల దూరంలో అత్యాధునిక సౌకర్యాలతో రూ.1,450 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని శనివారం ఉదయం మోదీ లాంఛనంగా ప్రారంభించారు. వాలీ్మకి విరచిత రామాయణం మనకు గొప్ప జ్ఞానపథమని ఈ సందర్భంగా అన్నారు. ‘‘అది మనల్ని శ్రీరామ ప్రభువు చెంతకు చేరుస్తుంది. ఆధునిక భారత దేశంలో అయోధ్య ధామంలోని వాలీ్మకి విమానాశ్రయం మనల్ని దివ్య (మహోన్నత), భవ్య (అద్భుత), నవ్య (ఆధునిక) రామ మందిరానికి చేరుస్తుంది. అప్పట్లో ఇదే రోజున అండమాన్ దీవికి బ్రిటిష్ చెర నుంచి సుభాష్ చంద్రబోస్ విముక్తి కలి్పంచారు. అక్కడ జాతీయ జెండా ఎగరేశారు. మనలి్నది ఆజాదీ కీ అమృత్ కాల్లోకి తీసుకెళ్తుంది’’ అన్నారు. విమానాశ్రయ విశేషాలు.. ► అయోధ్య నగర చరిత్ర, విశిష్టత, ఆధ్యాతి్మక వాతావరణం ప్రతిబింబించేలా విమానాశ్రయ నిర్మాణం సాగింది. టెర్మినల్ భవనానికి శ్రీరామ మందిరాన్ని తలపించేలా తుదిరూపునిచ్చారు. ప్రధాన ద్వారంపై ఆలయ తోరణాల డిజైన్ వేశారు. రాముడి జీవితాన్ని కళ్లకు కట్టే కళాఖండాలు, చిత్రాలు, కుడ్యచిత్రాలకు విమానాశ్రయంలో చోటు కలి్పంచారు. ► బస్సు పార్కింగ్‌తోపాటు దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు కల్పించారు. ► ఎల్ఈడీ లైటింగ్, వాననీటి నిర్వహణ, సౌర విద్యుత్ ప్లాంట్, మురుగు శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. ► చుట్టూతా పరుచుకున్న పచ్చదనం నిర్వహణకు వాడిన నీటిని రీ సైకిల్ చేసి ఉపయోగించనున్నారు. ► విమానాశ్రయ నిర్మాణం కేవలం 20 నెలల్లో పూర్తయిందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్ కుమార్ చెప్పారు. ► ఈ ఎయిర్‌్రస్టిప్ గతంలో కేవలం 178 ఎకరాల్లో ఉండేది. దీన్ని రూ.350 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దారు. ఇందుకు యూపీ ప్రభుత్వం 821 ఎకరాలు కేటాయించింది. ► ఏటా 10,000 మంది ప్రయాణికుల రాకపోకలను వీలుగా విమానాశ్రయాన్ని విశాలంగా నిర్మించారు. టెరి్మనల్ భవనాన్ని 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కట్టారు. ► 2.2 కిలోమీటర్ల పొడవైన రన్‌వే ఉండటంతో ఎయిర్‌బస్–321 రకం విమానాల ల్యాండింగ్, టేకాఫ్ చాలా సులువు. రెండు లింక్ ‘టాక్సీ వే’లు ఉండటంతో ఒకేసారి ఎనిమిది విమానాలను పార్క్ చేసుకోవచ్చు. ► భవిష్యత్తులో విమానాశ్రయ రెండో దశ విస్తరణ మొదలవనుంది. టెర్మినల్‌ను 50 వేల చదరపు మీటర్లకు విస్తరిస్తారు. ► ఏటా ఏకంగా 60 లక్షల మంది రాకపోకలకు వీలుగా విస్తరణ ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ► రన్‌వేను 3.7 కిలోమీటర్లకు విస్తరించి అదనంగా 18 విమానాల పార్కింగ్‌కు చోటు కలి్పంచాలని భావిస్తున్నారు. అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వేస్టేషన్‌కు పచ్చజెండా అయోధ్య పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దాదాపు రూ.241 కోట్లతో పునరుద్ధరించిన అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అయోధ్య రైల్వేస్టేషన్ నుంచి రెండు అమృత్ భారత్ రైళ్లను, ఆరు వందే భారత్ రైలు సేవలను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘ మూడు కొత్త సేవలైన వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్‌ల ‘త్రిశక్తి’తో భారత రైల్వే నూతన అభివృద్ధి శకంలోకి దూసుకెళ్లగలదు’’ అని మోదీ వ్యాఖ్యానించారు. మూడంతస్తుల నూతన అయోధ్య రైల్వేస్టేషన్లో సరికొత్త సౌకర్యాలను కలి్పంచారు. లిఫ్ట్‌లు, కదిలే మెట్లు, ఫుడ్ ప్లాజాలు, వాణిజ్య, వ్యాపార సముదాయలు, పూజా సామగ్రి దుకాణాలు, చైల్డ్ కేర్, వెయిటింగ్ హాళ్లతో స్టేషన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారి సరి్టఫికెట్‌నూ ఈ రైల్వేస్టేషన్ సాధించింది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే అమృత్ భారత్ రైలుకు తొలి రోజు విశేష స్పందన లభించింది. బుకింగ్ ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే టికెట్లు మొత్తం అమ్ముడయ్యాయి. -
నేడు అయోధ్యకు మోదీ.. ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్ ప్రారంభం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు(శనివారం) ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో పర్యటించనున్నారు. రామమందిర శంకుస్థాపనకు ముందు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. నాలుగు గంటలపాటు అయోధ్యలో ఉండనున్నారు. మొత్తం రూ. 15 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలో అధికారులు భద్రతను పటిష్టం చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో అణువణువూ తనిఖీ చేస్తున్నారు. డ్రోన్లతో నిఘా పెంచారు. నగరాన్ని పూలతో అలంకరించారు. ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతూ పోస్టర్లు ఏర్పాటు చేశారు అయోధ్యలో రూ.1,450 కోట్లతో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మించారు.6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం సిద్ధమైంది. ఇక్కడి నుంచి ఒకేసారి 600 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు. ఈ విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యధామం’ అనే పేరు ఖరారు చేశారు. గతంలో ‘మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం’గా వ్యవహరించేవారు. అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్‌కు ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా నామకరణం చేశారు. శ్రీరాముడి స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ పలు కట్టడాలను సుందరంగా నిర్మించారు. శిఖరం, విల్లు బాణం వంటివి శ్రీరాముడిని గుర్తుకు తెస్తున్నాయి. నాలుగు ఎత్తయిన గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ స్టేషన్ విస్తరించి ఉంది. ఈ స్టేషన్‌ను రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్, ఎకనామిక్ సరీ్వస్ లిమిటెడ్(రైట్స్) అభివృద్ధి చేసింది. మరోవైపు అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. రాష్ట్రంలో రూ.15,700 కోట్ల కంటే విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.. వీటిలో అయోధ్య, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి సుమారు రూ.11,100 కోట్లు ఖర్చు చేస్తుండగా..ఉత్తరప్రదేశ్ అంతటా ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన రూ.4,600 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. -
అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు మహర్షి వాల్మికి పేరు!
న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పట్టణంలో ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించనున్నారు. నూతన విమానాశ్రయం సహా రూ.11,100 కోట్లకుపైగా విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు ‘మహర్షి వాల్మికీ అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్’గా నామకరణం చేసే వీలుంది. సంబంధిత వివరాలను ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఏటా 10 లక్షల మంది విమానప్రయాణికుల రాకపోకలకు అనువుగా రూ.1,450 కోట్లతో నిర్మించిన నూతన ఎయిర్పోర్ట్, పూర్తయిన అయోధ్య ధామ్ జంక్షన్ తొలి దఫా, అయోధ్య రైల్వేస్టేషన్, రోడ్లు, పౌర వసతుల ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. ఉత్తరప్రదేశ్‌లో రూ.2,300 కోట్ల విలువైన మూడు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. కొత్తగా రెండు అమృత్ భారత్, ఆరు కొత్త వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. సువిశాలంగా కొత్తగా నిర్మించిన అయోధ్య, రామపథ్, బక్తిపథ్, ధర్మపథ్, శ్రీరామజన్మభూమి పథ్ రోడ్లను ప్రారంభిస్తారు. అధునాతన సదుపాయాలతోపాటు తక్కువ విద్యుత్‌ను వినియోగించుకునేలా పర్యావరణహిత నిర్మాణం, వాననీటి సంరక్షణ, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి ప్లాంట్, సౌరవిద్యుత్ ప్లాంట్‌వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ను ఫై స్టార్ గ్రీన్ రేటింగ్ వచ్చేలా నిర్మించారు. -
నేడు అయోధ్యకు శ్రీరామ పాదుకలు
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామాలయం గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం దగ్గర పడింది. ఈలోపు శ్రీరామ పాదుకా యాత్రలో భాగంగా దేశ వ్యాప్తంగా రాముడు నడిచిన మార్గాలమీదుగా పూజలందుకుంటూ శ్రీరామ పాదుకలు మంగళవారం అయోధ్యకు చేరుకోనున్నాయి. 9 కిలోల బరువున్న ఈ పాదుకల కోసం 8 కిలోల వెండి వాడారు. కిలో బంగారంతో పాదుకలకు తాపడం చేశారు. హైదరాబాద్‌కు చెందిన అయోధ్య భాగ్యనగర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చల్లా శ్రీనివాస శాస్త్రి ఈ పాదుకలను తయారు చేయించారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ఈ పాదుకలను ఆలయంలో ప్రతిష్టించనున్నారు. -
Ram Mandir Trust: అయోధ్యకు రాకండి!
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22న అయోధ్యకు పోటెత్తొద్దని ఆలయ నిర్వాహకులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఆ రోజు అయోధ్యలో ఊహించనంతటి రద్దీ ఉంటుంది. కనుక ఎలాగైనా కార్యక్రమాన్ని కళ్లారా చూడాలని అయోధ్య దాకా రాకండి. మీరున్న చోటే ఆలయాల్లో పూజలు చేయండి’’ అని భవ్య రామమందిరం ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ విజ్ఞప్తి చేశారు. జనవరి 16వ తేదీ నుంచే వైదిక కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పారు. 80 వేల మంది భక్తులకు బస, భోజన వసతి కలి్పంచేలా అయోధ్యలో ’టెంట్ సిటీ’ని నిర్మిస్తున్నారు. ఆలయ పూజారుల్లో తిరుపతి పూర్వ విద్యార్థి అయోధ్య రామాలయ పూజారిగా ఎంపికైన మోహిత్ పాండే తిరుపతిలో గతంలో వేద విద్య అభ్యసించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయంలో ఎంఏ (ఆచార్య) పట్టా సాధించారు. లక్నోలోని సీతాపూర్‌కు చెందిన మోహిత్ గాజియాబాద్‌లోని దుధేశ్వర్ వేద్ విద్యాపీఠ్‌లో ఏడేళ్ల సామవేదం అభ్యసించారు. తర్వాత వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో వేద విద్యాభ్యాసం కొనసాగించారు. -
Indo-Islamic Cultural Foundation: అయోధ్యలో మసీదు నిర్మాణం.. మేలో ప్రారంభం
లక్నో: రామజన్మభూమి– బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యలో ప్రతిపాదిత మసీదు నిర్మాణ పనులు వచ్చే ఏడాది మేలో ప్రారంభం కానున్నాయి. అయోధ్యలోని ధన్నిపూర్‌లో మసీదు నిర్మాణ బాధ్యతలను ఇండో–ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ తీసుకుంది. మసీదు నిర్మాణానికి అవసరమై నిధుల సేకరణకు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి వివిధ రాష్ట్రాలకు ఇన్చార్జుల నియామకాలు చేపట్టాలని ట్రస్ట్ యోచిస్తోంది. ఫిబ్రవరిలో మసీదు తుది డిజైన్‌ను ఖరారు చేసి అధికారుల ఆమోదానికి పంపుతామని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డ్ చైర్మన్, ఇండో–ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ చీఫ్ ట్రస్టీ జుఫర్ ఫరూకీ తెలిపారు. ‘15 వేల చదరపు అడుగులకు బదులు 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మసీదు నిర్మాణం జరగనుంది. జవాబుదారీతనం, పారదర్శకత పాటిస్తూ నిధులు సేకరిస్తాం. ప్రభుత్వమిచ్చే భూమిలో మసీదుతో పాటు ఆస్పత్రి, లైబ్రరీ, కమ్యూనిటీ కిచెన్, మ్యూజియంలను కూడా నిర్మిస్తాం. నిర్మాణ పనుల కోసం ముంబైకి చెందిన సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం. నిధుల లభ్యతపైనే నిర్మాణ పనుల వేగం ఆధారపడి ఉంటుంది’’ అని ట్రస్ట్ సెక్రటరీ అథార్ హుస్సేన్ చెప్పారు. మధ్యప్రాచ్య మసీదుల శైలిలో రూపొందిన తొలి డిజైన్ తిరస్కరణకు గురవడం కూడా ఆలస్యానికి ఒక కారణమన్నారు. ప్రతిపాదిత మసీదు, ఇతర భవనాల డిజైన్‌ను మసీదు కమిటీ 2021లో అయోధ్య డెవలప్మెంట్ అథారిటీకి సమర్పించగా ఈ ఏడాది మార్చిలో అనుమతులు లభించాయి. కేంద్రం అయోధ్యలో ఐదెకరాలను యూపీ సున్ని సెంట్రల్ వక్ఫ్‌బోర్డ్‌కు అందజేయగా, బోర్డ్ మసీదు నిర్మాణ బాధ్యతలను ఇండో–ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్‌కు అప్పగించింది. -
Indian Railways: అయోధ్యకు 1,000 రైళ్లు..
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారం¿ోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత జనవరి 23వ తేదీ నుంచి భక్తులకు దర్శనభాగ్యం కలి్పంచనున్నారు. ఈ నేపథ్యంలో దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు అయోధ్య పట్టణానికి పోటెత్తనున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన భక్తులు రైలు మార్గంలో అయోధ్యకు చేరేందుకు వీలుగా రైల్వే సరీ్వసులను భారీగా పెంచాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని రామాలయం ప్రారంభం అయిన రోజు నుంచి తొలి 100 రోజుల పాటు అయోధ్యకు వేయికిపైగా రైళ్లను నడిపాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రైల్వే శాఖ వర్గాలు తాజాగా వెల్లడించాయి. 19వ తేదీ నుంచే మొదలు! మందిర ప్రారం¿ోత్సవానికి కొన్ని రోజుల ముందు నుంచే ఈ అదనపు రైల్వే సరీ్వసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జనవరి 19వ నుంచి ఈ అదనపు రైళ్లను నడపాలని రైల్వే శాఖ అధికారులు భావిస్తున్నారు. 100 రోజుల పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, నాగ్‌పుర్, లక్నో, జమ్మూ, పుణె, కోల్‌కతా సహా దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల నుంచి అయోధ్యకు రైళ్లు నడపనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వీటితోపాటు కొన్ని రైళ్లను ప్రత్యేకంగా భక్తుల కోసం రిజర్వ్‌చేసి నడపనున్నారు. ప్రతిరోజూ ఈ రైళ్లలో ప్రయాణించే భక్తులకు ఆహారం అందించేందుకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. ఈ రైళ్లలో ప్రయాణించాలనుకునే వారికోసం ఈనెల 23 నుంచి రిజర్వేషన్ టికెట్ బుకింగ్‌కు అవకాశం కలి్పంచనున్నారు. అయితే దీనిపై రైల్వే శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అయోధ్యలోని రైల్వేస్టేషన్లో ఆధునికీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రోజుకు 50,000 మంది ప్రయాణికులు వచి్చనా ఎలాంటి ఇబ్బందులు పడకుండా సకల సదుపాయాలు అందుబాటులో ఉండేలా రైల్వేస్టేషన్‌ను నవీకరిస్తున్నారు. జనవరి 15వ తేదీ కల్లా స్టేషన్ పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత రామ్ లల్లా ప్రతిష్టాపన క్రతువు మొదలుపెట్టి దాదాపు పది రోజుల పాటు ’ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆలయ నిర్వహణ సంస్థ ప్రత్యేకంగా ఆహా్వనించడం తెల్సిందే. మోదీతోపాటు 4,000 మంది సాధువులు, వేలాది మంది ప్రముఖులు ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. -
అయోధ్య రామాలయ పూజారుల పోస్టులకు 3,000 దరఖాస్తులు
అయోధ్య(యూపీ): అయోధ్యలో నిర్మాణం తుది దశకు చేరుకున్న రామమందిరంలో పూజారుల నియామక క్రతువు కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి 3,000 దరఖాస్తులు అందినట్లు రామ మందిర్ తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఉన్నతాధికారి సోమవారం చెప్పారు. వీరిలో 20 మందిని మాత్రమే ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. -
22 లక్షల దీపాల వెలుగుల్లో అయోధ్య
లక్నో/అయోధ్య: అయోధ్యలోని సరయూ నదీ తీరం వెలుగులతో నిండిపోయింది. శనివారం అత్యంత వైభవంగా 22 లక్షల దీపాలతో జరిగిన దీపోత్సవం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే చోట ఒకేసారి అత్యధిక సంఖ్యలో దీపాలను వెలిగించిన ఘటనగా స్వీయ గిన్నిస్ రికార్డునే బద్దలు కొట్టింది. సరయూ నది ఒడ్డున 51 ఘాట్లలో 25 వేల మంది వలంటీర్లు 22.23 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు డ్రోన్ల సాయంతో దీపాలను లెక్కించి, ప్రపంచ రికార్డుగా ధ్రువీకరించడంతో నగరం ‘జై శ్రీరామ్’ నినాదాలతో మారుమోగింది. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ మేరకు సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు సర్టిఫికెట్‌ను అందజేశారు. గతేడాది ఈ వేడుకలో 15.76 లక్షల ప్రమిదలు వెలిగించడం తొలిసారి గిన్నిస్ రికార్డులకెక్కింది. 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయోధ్యలో ఏటా దీపోత్సవం జరుగుతోంది. శనివారం సీఎం ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, కేబినెట్ మంత్రులు కూడా దీపాలు వెలిగించి, సరయూ నది ఒడ్డున పూజలు చేశారు. దీపోత్సవం 100 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. -
అయోధ్యలో ‘ఆదిత్య’ మంత్రివర్గ సమావేశం
అయోధ్య: రాష్ట్ర రాజధాని లక్నోలో కాకుండా అయోధ్యలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేశారు. అయోధ్యలో కేబినెట్ భేటీ జరగడం ఇదే తొలిసారి. అత్యంత అరుదైన సందర్భాల్లోనే ఇలా రాష్ట్ర రాజధానికి బదులు వేరే చోట కేబినెట్ సమావేశమవుతుంది. అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారం¿ోత్సవానికి అంగరంగ వైభవంగా సంసిద్ధమవుతున్న వేళ అదే పట్టణంలో సీఎం మంత్రివర్గాన్ని సమావేశపరచడం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
అయోధ్యలో అక్షత పూజ
అయోధ్య: అయోధ్యలో శ్రీరామ మందిరంలో ప్రతిష్టాపన పూజలు ఆదివారం సంప్రదాయం ప్రకారం అక్షత పూజతో మొదలయ్యాయి. ఆలయంలోని రామదర్బార్, శ్రీరాముని ఆస్థానంలో పసుపు, దేశవాళీ నెయ్యి కలిపిన 100 క్వింటాళ్ల బియ్యంతో అక్షత పూజ నిర్వహిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. దేశంలోని 45 ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిన విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ)కు చెందిన 90 మంది ముఖ్యులకు 5 కిలోల మేర అక్షతలను పంపిణీ చేస్తారు. వీరు వీటిని జిల్లాలు, బ్లాకులు, తహసీల్లు, గ్రామాల ప్రతినిధులకు అందజేస్తారని ట్రస్ట్ కార్యదర్శి చంపత్‌రాయ్ చెప్పారు. మిగతా అక్షతలను ఆలయంలోని శ్రీరాముని విగ్రహం ఎదురుగా కలశంలో ఉంచుతారు. వీరు ఈ అక్షతలను వీరు వచ్చే జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టాపన జరిగేలోగా దేశవ్యాప్తంగా ప్రజలకు పంపిణీ చేయనున్నారని ట్రస్ట్ తెలిపింది. -
బీఆర్ఎస్లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, 14 ఏళ్ల వనవాసం వీడి మళ్లీ గులాబీ గూటికి బాలకృష్ణారెడ్డి రావటం ఆనందంగా ఉందన్నారు. ఇవాళ కొన్ని గద్దలు, తోడేళ్లు ఒక్కటై తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నాయని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘‘ఆనాడు రాష్ట్రం వద్దన్న వాళ్లు ఇప్పుడు తెలంగాణపై ప్రేమ చూపిస్తున్నారు. మొన్న రేవంత్ రెడ్డి అమరుల స్థూపం వద్దకు వచ్చి పైసలు పంచను ప్రమాణం చేయాలని కేసీఆర్‌ను రమ్మని చెప్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఆనాడు తెలంగాణ బలి దేవత సోనియా గాంధీ అని అనలేదా?. పైసల కట్టెలతో దొరికిన దొంగ రేవంత్. తెలంగాణ అస్తిత్వంపై మరోసారి దాడి జరుగుతుంది’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘కేసీఆర్ లేకపోతే టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడిది?. రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి ఆ పదవులు ఎక్కడివి?. తొమ్మిదిన్నరేళ్లలో సంక్షేమం ఒక వైపు అభివృద్ది మరోవైపు. అజ్ఞానులు, అహంకారంతో మాట్లాడుతున్నారు. మేము ఎవరికి బీ టీమ్ కాదు. పార్లమెంట్లో కన్నుకొట్టి, కౌగిలించుకొని ఇక్కడేమో మనల్ని అంటున్నారు. సోనియా గాంధీని బలి దేవత అని, రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు ముద్దపప్పు నిప్పు అయ్యింది, బలి దేవత కాళి దేవత అయ్యిందా?’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. చదవండి: ప్రసంగాల్లో సామెతలు.. ఉపన్యాసాల్లో నుడి‘కారాలు’!