YS Jagan Mohan Reddy
-
వైఎస్ జగన్ పై ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తోంది
-
వైఎస్ జగన్ నిర్ణయం అద్భుతం: విజయేందర్ రెడ్డి
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సామాన్యుడికి అందుబాటులో సినిమా టికెట్ ధరలు ఉండాలని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం అద్భుతమని ఆ రోజే తాను చెప్పానని అన్నారు. థియేటర్స్, టిక్కెట్ రేట్ల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి సరైందేనని తెలిపారు.కానీ అప్పుడు సినీ ఇండస్ట్రీ అంతా భయపడిందని విజయేందర్ రెడ్డి గుర్తు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ఇపుడు తెలంగాణలో అమలు చెయ్యాలని అందరూ కోరుకుంటున్నారని విజయేందర్ వెల్లడించారు.అయితే ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. పుష్ప-2 సినిమా ఘటన తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్స్ రేట్ల పెంచుకునేందుకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైందేనంటూ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి కొనియాడారు. -
‘వైఎస్ జగన్ భద్రతపై ఎల్లోమీడియా విషపు రాతలు రాస్తోంది’
సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత గురించి ఎల్లోమీడియా విషపు రాతలు రాస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా.. ‘ఎల్లోమీడియా ఏపీలో ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టకరం. ఎస్ఆర్సీ కమిటీ సమీక్ష ప్రకారమే వీఐపీల భద్రతను కల్పిస్తారు. కానీ వైఎస్ జగన్ భద్రతకు అధికంగా వ్యయం చేస్తున్నట్టు రోత మీడియా రాసింది. ..సీఎంకి సంబంధించిన భద్రతని ఏ సీఎం కూడా నిర్ణయించుకోరు. ఇంటిలిజెన్స్, పోలీసు అధికారుల నిర్ణయం మేరకు తీసుకుంటారు. చంద్రబాబు కేవలం 120 మంది మాత్రమే భద్రత అంటూ కథలు రాస్తున్నారు. జగన్‌కు కల్పించిన భద్రత రికార్డులు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. సివిల్ పోలీసులు 18 మంది, ఆర్మడ్ 33 మంది,బెటాలియన్ 89 మంది మాత్రమే ఉన్నారు. బయటకు వెళ్లినప్పడు ఆక్టోపస్ 13 మంది ఉంటారు. మొత్తం 196 మంది వైఎస్ జగన్‌కు భద్రత ఉంటారు. ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇదే విధానం అమలు అవుతుంది. కార్యక్రమాలు, తిరిగే ప్రాంతాలను బట్డి అధికారుల నిర్ణయాలు ఉంటాయి. కానీ ఎల్లోమీడియా తప్పుడు వార్తలు రాస్తోంది...చంద్రబాబు బయటకు వచ్చినప్పుడు ట్రాఫిక్ ఆపటం లేదా?. చంద్రబాబు గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా మాకు ఇబ్బంది లేదు. కానీ మా గురించి తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదు. చంద్రబాబు తన మనమడికి కూడా 4+4 సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు?. ప్రభుత్వ ధనాన్ని ఎందుకు వినియోగిస్తున్నారు?. తప్పుడు కథనాలతో ప్రజల్లో అయోమయం సృష్టించవద్దు. చంద్రబాబు, వైఎస్ జగన్‌లకు ఎంత భద్రత ఉందో అధికారిక రికార్డులను బయట పెట్టాలి. ఆ రికార్డులు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు, ప్రభుత్వానికి వారధులుగా ఉండాల్సిన చంద్రబాబుకు తొత్తుగా ఎల్లో మీడియా వ్యవహరిస్తుంది’అని విమర్శలు గుప్పించారు. -
కడప జిల్లాలో YS జగన్ పర్యటన
-
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ఖరారు
గుంటూరు/YSR జిల్లా, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటించనున్నారు. రేపటి నుంచి నాలుగు రోజులపాటు సొంత నియోజవర్గంలో ఆయన పర్యటిస్తారని పార్టీ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి.వైఎస్ జగన్.. రేపు ఉదయం ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులతో ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం.. కడప నియోజకవర్గ నేతలతో సమావేశం అవుతారు. అది ముగిశాక సాయంత్ర సమయంలో పులివెందుల బయల్దేరుతారు. 25న సీఎస్ఐ చర్చి క్రిస్టమస్ వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు.సాయంత్రం తాతిరెడ్డిపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొంటారు.26వ తేదీన పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు27వ తేదీన స్థానికంగా ఓ వివాహ వేడుకకు హాజరవుతారు. అదే మధ్యాహ్నాం పర్యటన ముగించుకుని తిరుగుపయనం అవుతారు -
ఏపీలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందని ట్యాబ్ లు
-
కరెంట్ ఛార్జీల బాదుడుపై వైఎస్సార్సీపీ పోరుబాట
సాక్షి,తాడేపల్లి : కరెంటు ఛార్జీల బాదుడుపై వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్రం కార్యాలయంలో ‘విద్యుత్ చార్జీల బాదుడుపై వైఎస్సార్సీపీ పోరుబాట’ పేరుతో పోస్టర్‌ను ఆవిష్కరించారు. వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వైఎస్సార్సీపీ పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి తదితరులు ఆవిష్కరించారు. ఆ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనను ఎండగట్టారు.రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుది : మాజీ మంత్రి జోగి రమేష్ ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చాడు. దీనిలో భాగంగా తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీల పెంపుదల ఉండదు అని ప్రజలను నమ్మించాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారంను ప్రజలపై మోపుతున్నాడు. గతంలోనూ విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలను అనేక కష్టాలకు గురి చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. ఆనాడు విద్యుత్ చార్జీలతో నలిగిపోతున్న ప్రజలకు, రైతులకు అండగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పెద్ద ఎత్తున ఉద్యమించారు. చంద్రబాబు ఆ ఉద్యమాన్ని కర్కశంగా అణిచివేసేందుకు ఏకంగా రైతులపై పోలీసులతో కాల్పులు చేయించి, రక్తపాతానికి కారణమయ్యాడు. నేడు రాష్ట్రంలో మరోసారి చంద్రబాబు వల్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోయలేక ప్రజల నడ్డి విరుగుతోంది. ప్రజలకు అండగా వైఎస్సార్సీపీ ఈనెల 27న తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపడంతో పాటు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం.ప్రజలపై చంద్రబాదుడు : మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రజలపై చంద్రబాదుడు కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడమే కాదు, వారి కష్టాలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి, కొనేవారు లేక మద్దతుధర లభించక అల్లాడుతున్న రైతులకు అండగా వైయస్ జగన్ చేసిన ఆందోళనలతో ప్రభుత్వం కళ్ళు తెరిచింది. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున విద్యుత్ చార్జీలను పెంచడం, గతంలో వైయస్ జగన్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కు మంగళం పాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు సరైన గుణపాఠం నేర్పుతాం. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈనెల 27న విద్యుత్ కార్యాలయాల వద్ద జరిగే ఆందోళన కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరైన ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి.ప్రజలను నమ్మించిన చరిత్ర చంద్రబాబుది : మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నిలకు ముందు విద్యుత్ చార్జీల మోత ఉండదూ అని ప్రజలను నమ్మించిన చంద్రబాబు నేడు దానికి విరుద్దంగా కరెంట్ చార్జీలను పెంచాడు. చంద్రబాబు దిగివచ్చి, కరెంట్ చార్జీల భారంను ఉపసంహరించుకునే వరకు వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఉద్యమిస్తూనే ఉంటుంది. ప్రజల గళంగా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది. ప్రజల ఆవేదనకు అండగా నిలుస్తుంది. అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ సర్దుబాటు చార్జీల భారం కనీవినీ ఎరుగని రీతిలో.. మునుపెన్నడూ ఏ ప్రభుత్వంలో, ఏ సీఎం హయాంలోనూ లేని విధంగా ఆరు నెలల్లోనే ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ సర్దుబాటు చార్జీల భారం మోపిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అసలు చార్జీల వడ్డింపునకు సిద్ధమైంది. ప్రత్యక్షంగానో, కుదరకపోతే దొంగ దారిలో శ్లాబుల విధానంలోనే కరెంటు చార్జీలు పెంచడం ద్వారా ప్రజలపై మరికొన్ని వేల కోట్ల రూపాయల భారం వేసేలా విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల)తో కసరత్తు పూర్తి చేయించింది.ఈ మేరకు 2025–26 సంవత్సరానికి ఆదాయ అవసరాల నివేదిక (అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్)ను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి అందజేశాయి. దాని ప్రకారం వచ్చే ఏడాది (2025) ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమలులోకి రానున్నాయి. ప్రజలపై చార్జీల భారం వేయని వైఎస్ జగన్విద్యుత్ చార్జీల భారంతో ప్రజల నడ్డివిరిచే ప్రభుత్వాలను గతంలో చూశాం. కానీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో సామాన్యులకు ఎలాంటి విద్యుత్ చార్జీలు పెంచని ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. ఇదే కాకుండా, రైతులకు 9 గంటల పాటు వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్‌ను అందించింది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే.వివిధ వర్గాల పేదలకు సైతం ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను ఇచ్చింది వైఎస్ జగన్ హయాంలోనే. ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తూ.. రాష్ట్రంలోని దాదాపు 2 కోట్ల కుటుంబాలపై ఎలాంటి విద్యుత్ చార్జీల భారం లేకుండా టారిఫ్ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదించేలా నాటి పాలకులు చేశారు.2024–25 సంవత్సరానికి మూడు డిస్కంలకు ప్రభుత్వం నుండి అవసరమైన సబ్సిడీ రూ.13,589.18 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వమే భరించింది. తద్వారా విద్యుత్ చార్జీలను పెంచాల్సిన అవసరం లేకుండా చేసింది. -
కైకలూరులో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
జగన్ పని అయిపోలేదు.. కథ ఇప్పుడే మొదలైంది
-
Big Question: అతడే ఒక చరిత్ర
-
'లీడర్' అంటే జగన్
-
కోట్ల మంది గుండె చప్పుడు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకువచ్చిన ధీశాలి, విజనరీ అని పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆయన చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యుడిగా కోట్లాది ప్రజల గుండె చప్పుడుగా మారారని తెలిపారు. గెలుపు, ఓటములకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున తరలివచి్చన అభిమానుల కోలాహలంగా మధ్య జరిగిన ఈ వేడుకల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు పుత్తా ప్రతాప్ రెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముందుగా వైఎస్ జగన్‌కు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు జరిగాయి. అనంతరం భారీ కేక్‌ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. పేద మహిళలకు చీరలు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. గుంటూరు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వందలాది అభిమానులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర నేతలు, ప్రజలకు వైఎస్ జగన్ అందించిన సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని వివరించారు.తాడేపల్లిలో కొనసాగుతున్న బైక్ ర్యాలీ భారీ బైక్ ర్యాలీవైఎస్సార్సీపీ విద్యార్థి – యువజన – సోషల్ మీడియా విభాగాల కార్యకర్తలు శనివారం సాయంత్రం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జగనన్న.. ప్రజా సేవకా.. వర్థిల్లు వెయ్యేళ్లు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తాడేపల్లి పురవీధుల్లో ర్యాలీ చేశారు.మేలును గుర్తుచేసుకున్న ప్రజలుగత ఐదేళ్లలో సీఎంగా వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలను ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, ప్రజలు గుర్తుచేసుకున్నారు. ‘పేద ప్రజలకు సుపరిపాలన అందించిన ధీరుడు మా అన్న జగన్మోహనుడు.. పారిశ్రామిక ప్రగతిలో తనదైన ముద్ర వేశారు.. రాష్ట్రం ఎయిర్ కండీషన్ల తయారీ, గ్రీన్ ఎనర్జీ హబ్‌లకు వేదికైంది.. చదువుతోనే పేద బిడ్డల తల రాత మారుతుందని నమ్మిన ఏకైక నేత.. కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హులైన వారందరికీ ప్రతీ పథకం ఇంటి వద్దనే అందించాలని తపనపడే మా జగనన్నకు హార్థిక శుభాకాంక్షలు’ అని వివిధ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. -
ఊరూవాడా సంబరాలు
సాక్షి, అమరావతి: అభివృద్ధి, సంక్షేమ సారథి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకొన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 26 జిల్లాల్లో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో కేక్‌లు కట్ చేశారు. వీధులు, కూడళ్లలో వైఎస్ జగన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. యువత ర్యాలీలు చేశారు. పేదలు, అనాథలకు వస్త్ర దానాలు చేశారు. భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, ఆహారం పంపిణీ చేశారు. తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు, వైఎస్ జగన్ అభిమానులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్ యునెటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 14 దేశాల్లోనూ జగన్ జన్మదిన వేడుకలను అభిమానులు వైభవంగా నిర్వహించారు.⇒ శ్రీకాకుళం జిల్లా పొందూరులో శివాలయం, మెలియాపుట్టిలోని వేణుగోపాలస్వామి ఆలయం, పాతపట్నంలోని నీలమణి దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టెక్కలి నియోజకవర్గంలో పేద విద్యార్థులకు దుప్పట్లు పంపిణి చేసి, రక్త దాన శిబిరం నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాంలోని సన్ రైజ్ హాస్పిటల్ వద్ద పెద్ద సంఖ్యలో జగన్ అభిమానులు రక్తదానం చేశారు. విజయనగరం పైడితల్లి ఆలయంలో విశేష పూజలు చేశారు. భోగాపురం మండలం ఎ రావివలసలో 52 కిలోల కేక్ కట్ చేసి, అన్నదానం చేశారు.⇒ పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో అనాధాశ్రమంలో అన్నదానం చేశారు. కురుపాం నియోజకవర్గంలో పేద మహిళకు చీరలు పంపిణీ చేశారు. పాలకొండ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మోదకొండమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.⇒ అనకాపల్లి జిల్లా చోడవరం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో పలు చోట్ల అన్నదానం చేశారు. ఆసుపత్రులలో రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ సహా నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.⇒ తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి మండలం ఎర్నగూడెంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రాజమండ్రిలో రక్తదాన శిబిరంతో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్, దంత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా ఆస్పత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరిజిల్లా ఉండి నియోజకవర్గంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.⇒ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద 60 కిలోల కేక్ కట్ చేశారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో 500 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి, అన్నదానం చేశారు.⇒ గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేసి, అన్నదానం చేశారు.⇒ కర్నూలు జిల్లాలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ⇒ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీæ చేశారు.⇒ వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు. బద్వేల్ నియోజకవర్గంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కమలాపురంలోని అనాథ∙క్షేత్రాలయంలో అనాథ బాలల మధ్య కేక్ కట్ చేసి, వేడుకలు నిర్వహించారు. కడపలో జిల్లా పరిషత్ సర్కిల్ వద్ద పేదలకు అన్నదానం చేశారు. జమ్మలమడుగులో రక్తదాన శిబిరం నిర్వహించారు.హైదరాబాద్‌లో మెగా రక్తదాన శిబిరంసాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం వైఎస్ జగనన్న అభిమాన సంఘం కేపీహెచ్‌బీ కాలనీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రమ్య గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ నేతలు వై.శివరామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, వేంపల్లి సతీష్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, వై.ఈశ్వరప్రసాద్‌రెడ్డి, పోసింరెడ్డి సునీల్, ఎస్వీఎస్ రెడ్డి, శ్యామల తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. మెగా రక్తదాన శిబిరం నిర్వహించడంతో పాటు ఐదు వేల మందికి అన్నదానం చేశారు. చెవిరెడ్డి ఆధ్వర్యంలో భారీగా పేదలకు దుస్తుల పంపిణీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేలాది మంది మహిళలు, కార్యకర్తలకు దుస్తులు పంపిణీ చేశారు. వేలాదిగా తరలివచి్చన అభిమానులకు అన్నదానం చేశారు. ఒంగోలు వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదానం శిబిరంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రక్తదానం చేశారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సింగరాయకొండలో అన్నదానం చేశారు.చెన్నైలో ఘనంగా..సాక్షి, చెన్నై: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను చెన్నైలో శనివారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సేవాదళ్ తమిళనాడు అధ్యక్షుడు ఏకే జహీర్ హుస్సేన్ నేతృత్వంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పెరంబూరు, అంబత్తూరు, షొళింగనల్లూరు, తండలం తదితర ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని చోట్లా కేక్‌లు కట్ చేసి, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ జగన్ ఆయురారోగ్యాలను, విజయాలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పిల్లలకు బిర్యానీ పంపిణీ చేశారు. వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం చేశారు. షొళింగనల్లూరులో రక్తదాన శిబిరం నిర్వహించారు. చెన్నై శివారులోని తండలంలో బ్రహ్మాండ వేడుకగా బర్త్‌డే కార్యక్రమాన్ని సేవాదళ్ వర్గాలు నిర్వహించాయి. అధ్యక్షుడు జహీర్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి సూర్యారెడ్డి, అధికార ప్రతినిధులు సాయి సింహారెడ్డి, కీర్తి, నేతలు శరవణన్, శరత్‌కుమార్ రెడ్డి, భాను తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్దసంఖ్యలో మహిళలు, యువత, విద్యార్థులు తరలివచ్చారు. -
గత ఆర్థిక ఏడాదిలో పండ్ల ఉత్పత్తిలో ఏపీదే అగ్రస్థానం
సాక్షి, అమరావతి: రైతుకు వెన్నుదన్నుగా నిలిస్తే పంటల దిగుబడి ఎంతగా పెరుగుతుందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరూపించింది. ధాన్యం, వాణిజ్య పంటలతో పాటు ఉద్యాన పంటలకూ వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాధాన్యతనిచి్చ, అడుగడుగునా రైతుకు అండదండగా నిలిచింది. దీంతో రాష్ట్రంలో పంటల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. పండ్ల ఉత్పత్తిలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో తలసరి పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. వివిధ రాష్ట్రాలు, దేశంలో తలసరి పండ్లు, కూరగాయల ఉత్పత్తిపై నివేదికను విడుదల చేసింది. గత ఆరి్థక ఏడాదిలో దేశంలో మొత్తం తలసరి పండ్ల ఉత్పత్తి 80 కిలోలు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 333 కిలోలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే 2023–24లో ఆంధ్రప్రదేశ్ తలసరి కూరగాయల ఉత్పత్తి 119 కిలోలుందని తెలిపింది. గత దశాబ్ద కాలంలో దేశంలో తలసరి పండ్ల ఉత్పత్తి 7 కిలోలు, కూరగాయల ఉత్పత్తి 12 కిలోలు పెరిగినట్లు నివేదిక తెలిపింది. 2013–14లో దేశంలో తలసరి పండ్ల ఉత్పత్తి 73 కిలోలుండగా 2023–24లో 80 కిలోలకు, కూరగాయల ఉత్పత్తి 135 కిలోల నుంచి 147 కిలోలకు పెరిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో తలసరి పండ్లు, కూరగాయల ఉత్పత్తి గత దశాబ్ద కాలంలో గణనీయంగా తగ్గిందని నివేదిక తెలిపింది. దేశంలో మొత్తం ఒక వ్యక్తి సంవత్సరానికి పండ్లు, కూరగాయలు 146 కిలోలు తీసుకోవాలని సాధారణ సిపార్సు ఉందని నివేదిక తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఒక వ్యక్తికి సంవత్సరానికి పండ్లు, కూరయలు కలిపి 227 కిలోలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే పంట కోత అనంతరం, నిల్వ, గ్రేడింగ్, రవాణా, ప్యాకేజింగ్‌లో 30 నుంచి 35 శాతం తగ్గుతోందని, ఇది మొత్తం వినియోగంపై ప్రభావం చూపుతోందని నివేదిక తెలిపింది. -
సంకల్పంతో... సముద్రాన్నే వంచిన వీరుడి కథ..!
-
ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో జగన్ బర్త్ డే
-
వైఎస్ జగన్ కలిసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-
జనరంజక పాలనకు కేరాఫ్ వైఎస్ జగన్
-
పులివెందులలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
నగరిలో ఘనంగా జగన్ పుట్టినరోజు వేడుకలు
-
జిల్లాల వారీగా ఘనంగా YS జగన్ పుట్టినరోజు వేడుకలు
-
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్
-
వైఎస్ జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
-
కర్నూలులో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు