Affidavit Filed
-
కేటీఆర్ గురించి పోలీసులకు నేనేమీ చెప్పలేదు: పట్నం నరేందర్‌రెడ్డి
-
Phone-tapping case: అసలు కథ ఇంకా ఉంది!
సాక్షి, హైదరాబాద్: రెడ్ కార్నర్ నోటీసుల జారీ ప్రక్రియలో భాగంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావుపై పంజగుట్ట పోలీసులు ఇటీవల అరెస్టు వారెంట్ తీసుకున్నారు. దీనికోసం నాంపల్లి కోర్టులో అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ప్రభాకర్‌రావు ఓ అఫిడవిట్ వేశారు. అందులో ఉన్న అంశాలు ఆయన వాంగ్మూలంతో సమానం కావడం కొత్త ట్విస్ట్‌కు కారణ మైంది. తాను కేవలం కీలక పాత్రధారిని మాత్రమే అని, ట్యాపింగ్ వ్యవహారం మొత్తం అప్పటి డీజీపీలు, నిఘా విభాగాధిపతిగా ఉండే అదనపు డీజీపీ పర్యవేక్షణలో జరిగినట్లు తన వాంగ్మూలంలో ప్రభాకర్‌రావు పేర్కొనడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.ఆ అధికారులకూ నోటీసులు ఇస్తారా?అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ప్రభాకర్‌రావు అ«దీనంలోనే జరిగింది. ఇప్పటివరకు అరెస్టయిన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులు సైతం ఇదే విషయాన్ని తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేశారు. ఎస్ఐబీకి ఓఎస్డీ హోదాలో ప్రభాకర్‌రావే నేతృత్వం వహించినప్పటికీ... ఈ విభాగం కూడా ప్రధాన ఇంటెలిజెన్స్‌లో అంతర్భాగమే. దీనికి అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారులు బాస్‌లుగా ఉంటారు. మరోపక్క ఎస్ఐబీలో ప్రణీత్‌రావు వార్‌రూమ్‌గా వినియోగించిన రెండు గదులూ ఇంటెలిజెన్స్ చీఫ్ కోసం అధికారికంగా కేటా యించనవే. ఎలాంటి నిఘా ఉపకరణాలు ఖరీదు చేయాలన్నా కచి్చతంగా నిఘా విభా గాధిపతితో పాటు డీజీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇవన్నీ నిబంధనల్లో పొందుపరిచిన అంశాలే. అయితే ఇప్పటివరకు ఈ విషయాలను ఎవరూ తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేయలేదు. నాంపల్లి కోర్టులో ప్రభాకర్‌రావు తరఫున ఆయన న్యాయవాదులు దాఖలు చేసిన అఫిడవిట్‌తో మాత్రం డీజీపీ, అదనపు డీజీల వ్యవహారం ప్రస్తావనకు వచి్చంది. తాను పూర్తిగా వారి పర్యవేక్షణలోనే పని చేశానంటూ ప్రభాకర్‌రావు చెప్పడంతో పరోక్షంగా వారి పాత్రనూ ఆయన ఉటంకించినట్లు అయింది. న్యాయ స్థానంలో దాఖలైన అఫిడవిట్‌ను ప్రభాకర్‌రావు వాంగ్మూలంగా పరిగణించాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో ఇద్దరు మాజీ డీజీపీలు, నిఘా విభాగం మాజీ అదనపు డీజీకి నోటీసులు జారీ చేసి వాంగ్మూలం నమోదు చేయడం తప్పనిసరి కానుందని తెలుస్తోంది.ఆ మాజీ సీపీల నుంచి కూడా వాంగ్మూలం?మరోపక్క టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు నేరాంగీకార వాంగ్మూలం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్లుగా పని చేసిన సీనియర్ ఐపీఎస్‌ల నుంచి వాంగ్మూలం సేకరించడం తప్పనిసరిగా మారింది. ‘ఎన్నికల టాస్్క’లకు సంబం ధించి తనకు అప్పటి పోలీసు కమిషనర్ ద్వారానే ఆదేశాలు ఇప్పించాలని కోరానని, ప్రభాకర్‌రావు ఆ ప్రకారమే చేశారని రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్, నిఘా అనేది ఎస్ఐబీ అ«దీనంలో స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) చేసింది. అయితే టార్గెట్ చేసిన వారిని పట్టుకోవడం, నగదు స్వాధనం చేసుకోవడం, వసూళ్లకు పాల్పడటం ఫీల్డ్ ఆపరేషన్లు మాత్రం టాస్‌్కఫోర్స్ నిర్వర్తించింది. ఈ విభాగం పోలీసు కమిషనర్ అ«దీనంలో, ఆయన పర్యవేక్షణలో పని చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మాజీ పోలీసు కమిషనర్ల నుంచి వాంగ్మూలాలు తీసుకోవడమూ అనివార్యంగా మారనుంది.ఎన్నికల ఫలితాల తర్వాత అరెస్టులు? అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు పంజగుట్ట పోలీసుస్టేషన్లో నమోదైంది. అయితే దీన్ని దర్యాప్తు చేయడం కోసం అనధికారికంగా ఓ సిట్ ఏర్పాటైంది. ఇప్పటివరకు ఈ బృందం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లోని మొదటి అంతస్తు కేంద్రంగా పని చేసింది. అయితే తాజాగా దీన్ని జూబ్లీహిల్స్ ఠాణాకు తరలించారు. అక్కడ అధికారులు కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నోటీసుల జారీ, విచారణ, వాంగ్మూలాల నమోదుతో పాటు కొందరు పోలీసులు, ప్రైవేట్ వ్యక్తుల అరెస్టులు చోటు చేసుకుంటాయని సమాచారం. -
Enforcement Directorate (ED): ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ప్రచారం చేయడం అనేది ప్రాథమిక హక్కు లేదా రాజ్యాంగపరమైన హక్కు కాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. అలాగే అది చట్టపరమైన హక్కు కూడా కాదని తేల్చిచెప్పింది. ఎన్నికల్లో ప్రచారం చేయాలన్న కారణంతో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ అఫిడవిట్ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ నాయకులు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటూ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సందర్భాలు గతంలో ఉన్నాయని, ప్రచారం చేసుకోవడానికి వారికి కోర్టులు మధ్యంతర బెయిల్ ఇవ్వలేదని ఈడీ తన అఫిడవిట్లో ప్రస్తావించింది. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా కేవలం ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇచి్చన ఉదంతాలు కూడా లేవని స్పష్టం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని ఉద్ఘాటించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ప్రత్యేక మినహాయింపు ఇవ్వడం చట్ట ముందు అందరూ సమానమేనన్న నిబంధనను ఉల్లంఘించినట్లు అవుతుందని వెల్లడించింది. అదేకాకుండా ఇప్పుడు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇస్తే భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఇలాంటి వెసులుబాటు కోరే అవకాశం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచి్చంది. కేజ్రీవాల్‌పై అతి త్వరలో ఈడీ చార్జిషీట్ ఢిల్లీలో ఎక్సయిజ్ విధానంలో అవకతవక ల సంబంధ కేసులో ఈడీ అతి త్వరలో ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ఈ చార్జిషీట్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ఇతర నిందితుల పేర్లతో అదనంగా మరిన్ని వివరాలు, ఆస్తుల గురించి ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. మద్యం కుంభకోణంలో ఈడీ ఇప్పటిదాకా 18 మందిని అరెస్టు చేసింది. ఇప్పటికే ఆరు చార్జిషీట్లు దాఖలు చేసింది. మరో నాలుగైదు రోజుల్లో దాఖలు చేయబోయే చార్జిషీట్ ఏడోది కానుంది. -
కుందూరు రఘువీర్‌రెడ్డి ఆస్తులు రూ.32 కోట్లు
నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి తన పేరిట రూ.32,04,23,749 ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. అందులో ఆయన పేరున రూ.24,84,20,025 ఆస్తులు ఉండగా.. తన భార్య పేరున రూ.7,20,03,724 ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. రఘువీర్‌రెడ్డి వివిద బ్యాంకుల్లో రూ.17,41,50,500 అప్పు తీసుకున్నట్లు చూపగా.. భార్య పేరున రూ.25,29,000 అప్పులు ఉన్నట్లుగా చూపించారు. -
శశి థరూర్‌కు రూ. 55 కోట్ల ఆస్తులు
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ సీటును వరుసగా నాలుగోసారి కైవసం చేసుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ నేత శశి థరూర్ తనకు రూ.55 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ప్రకటించారు. ఇందులో చరాస్తుల విలువ రూ.49 కోట్లు కాగా, రూ.6.75 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.4.32 కోట్ల ఆదాయం వచి్చనట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. రెండు కార్లు ఉన్నట్లు చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో రూ.23 కోట్ల ఆస్తులు, 2019 ఎన్నికల అఫిడవిట్లో రూ.35 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు థరూర్ వెల్లడించారు. -
అంతా నిబంధనల మేరకే
న్యూఢిల్లీ: ఇద్దరు నూతన కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం నిబంధనల మేరకే జరిగిందని కేంద్రం పేర్కొంది. ఈ ప్రక్రియ హడావుడిగా జరిగిందన్న ఆరోపణలను తోసిపుచి్చంది. ఈసీల ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేకపోవడాన్ని సమరి్థంచుకుంది. ఎంపిక కమిటీలో న్యాయవ్యవస్థ ప్రాతినిధ్యమే ఈసీ స్వతంత్ర ప్రతిపత్తికి ప్రాతిపదిక కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ సుప్రీంకోర్టులో బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈసీల ఎంపిక కమిటీ నుంచి సీజేఐని మినహాయించడాన్ని సవాలు చేస్తూ కోర్టులో ఈ కేసులో తదుపరి విచారణ గురువారం జరగనుంది. -
ఆ వివరాలు ఆఫిడవిట్లో.. పొందుపర్చలేదని.. బీఆర్ఎస్ అభ్యర్ధిపై దుమారం!
సాక్షి, జోగులాంబ: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనలో దూమారం రేగింది. బీఆర్ఎస్ అభ్యర్ధి నామినేషన్‌పై ఇతర పార్టీల అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో, ఆఫిడవిట్లో ఫిల్డ్ అసిస్టెంట్‌గా పని చేసిన వివరాలు పొందుపర్చలేదని ఫిర్యాదు చేశారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠత కొనసాగింది. అలంపూర్ తహసీల్దార్ కార్యాలయంలోని అసెంబ్లీ ఎన్నికల బరిలో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల పరిశీలన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు హాజరయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్ధి విజయుడి నామినేషన్ పరిశీలన సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సంపత్ కుమార్, బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్, బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న కుమార్‌తోపాటు ఇతర అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్ధి విజయుడి నామినేషన్, ఆఫిడవిట్లో ఫిల్డ్ అసిస్టెంట్‌గా పని చేసిన వివరాలు, రాజీనామా చేసిన కాఫీని పొందపర్చలేదని ఎన్నికల నిబంధనల మేరకు తిరస్కరించాలని రిటర్నింగ్ అధికారిని కోరినట్లు తెలిపారు. కానీ బీఆర్ఎస్ అభ్యర్ధి నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి అమోదించినట్లు చెప్పారు. దీంతో అభ్యర్థులు కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లిఖీతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి బయటికి వెళ్లడానికి వాహనం వద్దకు రాగా వారు అడ్డుపడుతూ.. నామినేషన్‌ను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సాధరణ అబ్జర్వర్ వసంత్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులతో మాట్లాడారు. అభ్యర్థులు నామినేషన్ కేంద్రం వద్దనే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండటంతో ఉత్కంఠత కొనసాగింది. అనంతరం ఫిర్యాదు చేసిన అభ్యర్థులు బయటికి వచ్చి ప్లకార్డులను ప్రదర్శించారు. నామినేషన్ల పరిశీలనలో ఉత్కంఠత నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అలంపూర్ సీఐ రాజు, శాంతినగర్ సీఐ శివకుమార్ గౌడ్లు ఎస్ఐలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకోని పర్యవేక్షించారు. ఇవి కూడా చదవండి: నామినేషన్ల పరిశీలన పూర్తికాగా.. ఎన్నికల సామగ్రి వచ్చేసింది! -
అఫిడవిట్లో తప్పిదం! కానీ ఎన్నికల నిబంధనల మేరకు ఒకే..
సాక్షి, మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ అభ్యర్థి సింగపురం ఇందిర తన నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్లో తప్పిదం చోటుచేసుకుంది. ఇందిర తన అఫిడవిట్లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎదురుగా ఉన్న కాలంలో అప్లికేబుల్ బదులు నాట్ అప్లికేబుల్ అని పూరించారు. ఈ విషయమై సోమవారం ఆర్ఓ కార్యాలయంలో జరిగిన స్క్రూట్నీలో బీజేపీ అభ్యర్థి విజయరామారావుతో పాటు స్క్రూట్నీలో పాల్గొన్న ఇతర అభ్యర్థులు ఆర్‌ఓతో చర్చించారు. అయితే ఎన్నికల నిబంధనల మేరకు ఏ పార్టీ నుంచి బీ–ఫారం జతచేస్తారో దానినే పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల నియమావళి మేరకు ఆమె నామినేషన్‌ను ఆమోదించామని తెలిపారు. వినయ్‌భాస్కర్.. తప్పుడు అఫిడవిట్.. బీఆర్ఎస్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని బీజేపీ నాయకుడు, న్యాయవాది రావు అమరేందర్‌రెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల కేసులు విచారిస్తున్న ప్రత్యేక కోర్టు జరిమానా విఽధించిందని, ఈ జరిమానాను చెల్లించాడని, రూ.2 వేలకు పైగా జరిమానా చెల్లిస్తే ఎన్నికల్లో పోటీకి అనర్హుడవుతాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ తాను రూ.1,000 మాత్రమే జరిమానా చెల్లించినట్లు అఫిడివిట్లో చూపించారని ఫిర్యాదులో తెలిపారు. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన వినయ్‌భాస్కర్ నామినేషన్‌ను తిరస్కరించాలని ఫిర్యాదులో కోరారు. ఈసందర్భంగా రావు అమరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ పశ్చిమ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పారదర్శకంగా విధులు, బాధ్యతలు నిర్వహించడం లేదని ఆరోపించారు. రూ.3 వేలు జరిమానా విధించిన జడ్జిమెంట్ ప్రతిని, జరిమానా చెల్లించినట్లు ఆధారాలు అందించినా.. బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్‌పై చర్యలు తీసుకోకుండా ఆమోదించారని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇవి చదవండి: 'స్వతంత్ర అభ్యర్థుల' ఓట్లు.. మిగతా పార్టీలకు మేలు చేస్తాయా? నష్టం చేస్తాయా? -
కులగణన సర్వేపై నాలుక కరుచుకున్న కేంద్రం
పాట్నా: బీహార్‌లో ఇటీవల జరిగిన కులగణనకు వ్యతిరేకంగా సోమవారం కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో కులగణన చేసే అధికారం కేంద్రానికి మాత్రమే ఉంటుందని పేర్కొంది. కానీ అంతలోనే పొరపాటు జరిగిందని చెబుతూ అఫిడవిట్లో కేంద్రానికి తప్ప ఇతర సంస్థలకు కులగణన, సర్వే చేసే అధికారం లేదన్న మాటను తొలగించి మరోసారి అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో సవరణలపై బీహార్‌లోని రాజకీయ వర్గాల్లో అగ్గి రాజుకుంది. బీహార్ ప్రభుత్వం కులగణన చేయడం కేంద్రానికి ఇష్టం లేదని దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలన్న వారి కుటిలబుద్ధి మరోసారి బట్టబయలైందని చెబుతూ విమర్శలు చేశారు జేడీయు,ఆర్జేడీ నేతలు. ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా మాట్లాడుతూ.. ప్రజల హక్కులను హరించాలన్న బీజేపీ, సంఘ్ పరివార్ వక్రబుద్ధికి ఇది నిదర్శనమని, ఇది అనుకోకుండా జరిగింది కాదని ఉద్దేశ్యపూర్వకంగా చేసిందేనని.. ఇదే కొనసాగితే అగ్నిపర్వతం బద్దలవుతుంది జాగ్రత్తని హెచ్చరించారు. ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడుతూ బీజేపీ అసలు రంగు బయటపడింది. బీజేపీకి అసలు కులగణన చేయాలన్న ఉద్దేశ్యమే లేదని దీన్ని బట్టి అర్థమవుతోందని అన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జేడీయు నేత విజయ్ కుమార్ చౌదరి స్పందిస్తూ బీహార్ ప్రభుత్వం ఎప్పటినుంచో తాము చేస్తోంది కులగణన కాదని సర్వే అని చెబుతూనే ఉంది. అయినా కేంద్రం దీన్ని వివాదాస్పదం చేయడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనిపై బీహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ తాము కులగణనకి వ్యతిరేకమని ఏనాడూ చెప్పలేదని, మేము కోరుతుంది ఒక్కటేనని.. ఒకవేళ కులగణన పూర్తయితే ఆ వివరాలను 24 గంటల్లో ప్రకటించాలని మాత్రమే కోరుతున్నామన్నారు. చివరిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందిస్తూ.. మేము మొదటి నుంచీ సర్వే మాత్రమే చేస్తున్నామని చెబుతూనే ఉన్నాము. ఆయా కులాల్లో ఎంతమంది ఉన్నారన్నది మేము లెక్కపెట్టడం లేదు. వారి ఆర్థిక స్థితిగతులను మాత్రమే లెక్కపెడుతున్నామని.. దీనివలన అర్హులైనవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే అవకాశముంటుందని అన్నారు. ఈ సర్వేపై మొదట అభ్యంతరం వ్యక్తం చేసిన పాట్నా హైకోర్టు బీహార్ ప్రభుత్వం సర్వేలో సేకరించిన డేటా భద్రతపై హామీ ఇచ్చిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే తడవు బీహార్ ప్రభుత్వం కులగణనను పూర్తిచేసింది. ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్టులో కోట్లు విలువచేసే మాదకద్రవ్యాలు పట్టివేత -
బఫర్ జోన్లో ఎలా నిర్మిస్తారు?
సాక్షి, హైదరాబాద్: నగ రంలోని రామ్మమ్మ కుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎలాంటి నిర్మా ణం చేపట్టడం లేదంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీని హైకోర్టు ఆదేశించింది. చట్టబద్ధమైన సంస్థ అయిన లేక్ ప్రొటెక్షన్ కమిటీ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర అసహ నం వ్యక్తం చేసింది. నగరంలోని చెరువులు, కుంటలు ఇతర నీటి వనరుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణకు నోటిఫికేషన్ జారీ చేయాలని, దీన్ని తదుపరి విచారణ రోజున కోర్టుకు అందజేయాలని స్పష్టం చేసింది. అలాగే హెచ్ఎండీఏ పరిధిలో ఎన్ని కుంటలు, చెరువులకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఫిక్స్ చేశారు.. ఇంకా ఎన్ని చేయా లి.. పూర్తి వివరాలతో రెండు వారాల్లోగా నివేదిక అందజేయాలని చెప్పింది. రామ్మమ్మ కుంట బఫర్ జోన్ పరిధిలోని 4 ఎకరాల స్థలంలో టూరిజం పేరిట నిర్మిస్తున్న భవనానికి అక్రమంగా ఆడిటోరియం, అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నా పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపై తీవ్రంగా మండిపడింది. తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది. స్టేటస్ కో ఆదేశాలను ఎత్తివేయాలని కోరిన ప్రభుత్వం రామ్మమ్మ కుంట బఫర్ జోన్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం భవనం నిర్మించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం జూన్‌లో స్టేటస్ కో విధించింది.మళ్లీ ఈ పిటిషన్ గురువారం సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం ముందు విచారణకొచ్చింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే భవన నిర్మాణం దాదాపు పూర్తయిందని, భవనాన్ని పెంచడానికి అన్ని అనుమతులున్నందున స్టేటస్ కో ఆదేశాలను ఎత్తివేయాలని కోరారు. అక్కడ విద్యనభ్య సిస్తున్న విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలన్నారు. రామ్మమ్మ కుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ మ్యాప్‌ను పరిశీలించిన ధర్మాసనం.. భవనంలో ఎక్కువ భాగం బఫర్ జోన్లో లేదని, కొద్దిభాగం మాత్రమే ఉందంది. స్టేటస్ కో ఆదేశాలను సవరిస్తూ బఫర్ జోన్లోకి రాకుండా భవన నిర్మాణం చేసుకోవచ్చని చెప్పింది. -
ఉక్రెయిన్ విద్యార్థులకు దేశీయంగా సీట్లు కల్పించలేం
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు దేశీయ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించలేమని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఉక్రెయిన్ కళాశాలల అనుమతితో మరో దేశంలో వైద్య విద్య పూర్తి చేయడానికి అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు విచారించింది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులను దేశీయ కళాశాలల్లో ప్రవేశం కల్పించడం చట్టపరంగా సాధ్యం కాదని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. ‘నీట్లో తక్కువ మార్కులు రావడంతోనే వారంతా ఉక్రెయిన్ వెళ్లారు. నీట్లో తక్కువ మెరిట్ ఉన్న వీరికి ఇక్కడ ప్రవేశాలు కల్పిస్తే ఆయా కాలేజీల్లో సీట్లు పొందలేకపోయిన అభ్యర్థుల నుంచి పిటిషన్లు వెల్లువెత్తే ప్రమాదముంది. ఉక్రెయిన్ యుద్ధంతో కోర్స్ పూర్తి చేయలేని విద్యార్థుల కోసం సెప్టెంబరు ఆరున నేషనల్ మెడికల్ కమిషన్ జారీ చేసిన పబ్లిక్ నోటీస్‌తో మాకు అభ్యంతరం లేదు. అయితే ఆ నోటీసు వీరికి ఇక్కడి కాలేజీల్లో బ్యాక్ డోర్ ఎంట్రీగా భావించరాదు’ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘తిరిగొచ్చిన విద్యార్థుల్ని దేశీయ మెడికల్ కాలేజీలకు బదిలీ చేస్తే దేశంలో వైద్య విద్య ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది’ అని కేంద్రం పేర్కొంది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్ కింద ఏయే దేశాల్లోని యూనివర్సిటీల్లో వైద్య విద్య పూర్తి చేయొచ్చో తెలిపే జాబితాను గురువారం నేషనల్ మెడికల్ కమిషన్ విడుదల చేసింది. అమెరికా, ఇటలీ, స్పెయిన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, లిథువేనియా, పోలండ్, స్వీడన్, ఈజిప్టు, ఇజ్రాయెల్, గ్రీస్, ఇరాన్, చెక్ రిపబ్లిక్, జార్జియా, కజకిస్తాన్, స్లోవేకియా, హంగేరీ, ఉజ్బెకిస్తాన్, బెలారస్, లాత్వియాల్లో వైద్య విద్య పూర్తి చేయొచ్చని తెలిపింది. ఇదీ చదవండి: సర్వం అధినాయకత్వం కనుసన్నల్లోనే! -
AP: ఫ్రీ బీస్ కేసులో అఫిడవిట్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ
సాక్షి, ఢిల్లీ: ఫ్రీ బీస్ కేసులో సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ అఫిడవిట్ దాఖలు చేసింది. సంక్షేమ పథకాలపై సుప్రీంకోర్టులో ఇంటెర్వీన్ పిటిషన్ దాఖలైంది. వైఎస్సార్సీపీ తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. చదవండి: ఉచిత హామీలంటే ఏంటో తెలియాలి.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు కాగా, ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఓటర్లకు ఉచిత హామీలు చేయకుండా నిరోధించాలని కోరుతూ లాయర్ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. ఉచితాల హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను తాము అడ్డుకోలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యతని.. ప్రజాధనాన్ని సరైన పద్ధతిలో వెచ్చించడమే ఇక్కడ ప్రధాన అంశమని పేర్కొంది. ఉచిత తాయిలం అంటే ఏంటో అర్థాన్ని వివరించాల్సిన అవసరం ఉందని, దీనిపై మరింత చర్చ జరగాలని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. శనివారం (ఆగస్టు 20)లోగా తమ సూచనలు దాఖలు చేయాలని రాజకీయ పార్టీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
ఉచిత పథకాలపై నిర్ణయం ఓటర్లదే
న్యూఢిల్లీ: ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలు సంబంధిత పార్టీకి చెందిన విధానపరమైన నిర్ణయాలేనని ఎన్నికల సంఘం(ఈసీ) తెలి యజేసింది. ఆయా పథకాల అమలు సాధ్యాసాధ్యాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల పట్ల వాటి ప్రభావంపై సంబంధిత రాష్ట్ర ఓటర్లే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ సమర్పించిం ది. ఎన్నికల్లో గెలిచిన పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు తీసుకొనే నిర్ణయాలు, రాష్ట్రాల విధానాలను తాము నియంత్రించలేమని స్పష్టం చేసింది. చట్టంలో మార్పులు చేయకుండా అలా చేయలేమని ఉద్ఘాటించింది. రాజకీయ పార్టీల నిర్ణయాలు, విధానాల్లో జోక్యం చేసుకుంటే చట్టాన్ని అతిక్రమించినట్లే అవుతుందని వెల్లడించింది. రాజకీయ పార్టీలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలంటూ 2016 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వానికి 47 ప్రతిపాదనలు చేశామని ఎన్నికల సంఘం వివరించింది. పార్టీల రిజిస్ట్రేషన్, డీ–రిజిస్ట్రేషన్‌ను క్రమబద్ధం చేసేందుకు వీలుగా అవసరమైన ఉత్తర్వులు ఇవ్వాలంటూ కేంద్ర న్యాయ శాఖకు సిఫార్సు చేశామని తెలిపింది. ఓటర్లను మభ్యపెట్టేలా ఉచిత పథకాలను ప్రకటించే పార్టీల గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ అశ్వినీకుమార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఎన్నికల సంఘం అఫిడవిట్‌ను దాఖలు చేసింది. -
ఐసీఎంఆర్ మార్గదర్శకాలు: నిర్ధారిత మరణాలకే ధ్రువపత్రం
సాక్షి, న్యూఢిల్లీ: నిర్ధారణ పరీక్షల్లో కరోనాగా తేలి, మరణానికి అదే కారణమైనపుడు మాత్రమే కోవిడ్–19 మరణ ధ్రువపత్రాలు జారీచేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలిపింది. కోవిడ్ మరణ ధ్రువపత్రాలు జారీ చేయడానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు రూపొందించాయి. కోవిడ్ మృతుల మరణానికి గల కారణాలతో వైద్య ధువ్రపత్రాలు కుటుంబసభ్యులు, బంధువులకు జారీ చేయాలని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. జూన్ 30న కోవిడ్ మృతుల మరణ ధ్రువీకరణ పత్రాల జారీపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. మార్గదర్శకాల రూపకల్పనలో ఆలస్యంపై పదిరోజుల కిందట సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 3న మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశామని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫిర్యాదుల పరిష్కారానికి కూడా మార్గదర్శకాల్లో ఓ విధానాన్ని కేంద్రం పొందుపరిచింది. అఫిడవిట్లో పేర్కొన్న ప్రధానాంశాలు: ► ఆర్టీపీసీఆర్ పరీక్ష, మాలిక్యులర్ టెస్ట్, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ద్వారా కోవిడ్–19 నిర్ధారణ కావడం లేదా కోవిడ్ సోకినట్లు ఆసుపత్రిలో వైద్యులు ధ్రువీకరిస్తేనే... కోవిడ్–19 కేసుగాపరిగణిస్తారు. ► కరోనా ఉన్నప్పటికీ విష ప్రయోగం, ఆత్మహత్య, హత్య, ప్రమాద మృతి తదితర వాటిని కోవిడ్–19 మరణంగా గుర్తించరు. ► ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం కరోనాతో మృతి చెందిన వారిలో 95 శాతం మంది సోకిన 25 రోజుల్లోపే మరణించారు. అయినప్పటికీ కరోనా సోకిన తర్వాత 30 రోజుల్లో మృతి చెందిన వారిని కూడా కోవిడ్–19 మృతులుగా గుర్తించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ► మార్గదర్శకాల పరిధి, ఎంసీసీడీలోకి రాకుండా కోవిడ్–19తో మృతి చెందిన వారి ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లాస్థాయిలో రాష్ట్రాలు/ కేంద్ర పాలితప్రాంతాలు కమిటీని ఏర్పాటు చేయాలి. ► జిల్లా స్థాయి కమిటీలో జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, అదనపు వైద్యాధికారి లేదా వైద్య కళాశాల మెడిసిన్ హెడ్, విషయ నిపుణుడు ఉండాలి. ► జిల్లా స్థాయి కమిటీ ముందు మృతుడి కుటుంబసభ్యుడు/ బంధువులు వినతి పత్రం ఇవ్వాలి. ► ఫిర్యాదు వినతి మేరకు వాస్తవాలన్నీ పరిశీలించి కమిటీ తగిన ధ్రువపత్రం ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. ► ఆయా ఫిర్యాదులు 30 రోజుల్లో పరిష్కరించాలి. -
దాచడానికి ఏమీ లేదు
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్ వ్యవహారంలో దాచేయడానికి ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దీనిపై అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించడానికి, అనుమానాలను నివృత్తి చేయడానికి తటస్థులైన ప్రఖ్యాత నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక ఉద్యమకారులు, జర్నలిస్టుల ఫోన్లపై కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్ స్పైవేర్‌తో నిఘా పెట్టిందని, ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ సీనియర్ జర్నలిస్టులు ఎన్.రామ్, శశి కుమార్‌తోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పెగసస్‌పై కేంద్ర ప్రభుత్వం క్లుప్తంగా అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే, సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించలేమని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్లపై మంగళవారం కూడా విచారణ కొనసాగిస్తామని వెల్లడించింది. పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. కేంద్రం లేదా కేంద్ర ప్రభుత్వం సంస్థలు అసలు పెగసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తున్నాయో లేదో స్పష్టం చేయాలని, ఈ మేరకు న్యాయస్థానంలో అఫిడవిట్ సమర్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. పెగసస్ అనేది దేశ భద్రతతో ముడిపడిన సున్నితమైన అంశమని పేర్కొన్నారు. దీన్ని సంచలనాత్మకంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తప్పుపట్టారు. అత్యున్నత సాంకేతికతకు సంబంధించిన ఈ అంశాన్ని పరిశీలించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. కేవలం ఓ వెబ్ పోర్టల్‌లో ప్రచురించిన వార్తల ఆధారంగానే పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారని, వాస్తవానికి పెగసస్‌పై తప్పుడు కథనాలు సృష్టించారని తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సొంత లాభం కోసం తప్పుడు ప్రచారం: కేవలం ఊహాగానాలు, అనుమానాలు, బలమైన సాక్ష్యాధారాలు లేని మీడియా కథనాలను, అసంపూర్ణ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని పెగసస్ స్పైవేర్‌పై కొందరు స్వతంత్ర దర్యాప్తును కోరుతున్నారని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది. పెగసస్‌పై వస్తున్న ఆరోపణలకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్లో ఇప్పటికే సమాధానం ఇచ్చారని గుర్తుచేసింది. కొందరు సొంత ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని విమర్శించింది. అనుమానాలను నివృత్తి చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. పెగసస్‌పై మీడియాలో వస్తున్న వార్తలు నిజమే అయితే ఇది తీవ్రమైన అంశమేనని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ స్పైవేర్‌తో భారత ప్రభుత్వం దేశంలో 300కు పైగా ఫోన్లపై నిఘా పెట్టిందని, రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక ఉద్యమకారులు, జర్నలిస్టులపై కేంద్రం లక్ష్యంగా చేసుకుందంటూ ఇంటర్నేషనల్ మీడియా కన్సార్టియం బాంబు పేల్చింది. దీంతో ఈ అంశం దేశాన్ని కుదిపేసింది. పెగసస్‌పై సమాధానం చెప్పాలంటూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రతిపక్షాలు స్తంభింపజేసిన విషయం తెల్సిందే. -
ఇంటింటికీ టీకాలు సాధ్యం కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొంది. ఇంటింటికీ (డోర్–టు–డోర్) టీకాలు వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బాంబే హైకోర్టులో దాఖలైన పిటిషన్‌కు కౌంటరు దాఖలు చేస్తూ... ఆ విధంగా చేయలేకపోవడానికి ఐదు కారణాలున్నాయంటూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కరోనా వ్యాక్సినేషన్ నిమిత్తం జాతీయ నిపుణుల బృందం దేశంలో టీకా డ్రైవ్ అంశాలకు మార్గనిర్దేశం చేస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అఫిడవిట్లో పేర్కొంది. 1. టీకా వేశాక ప్రతికూల సంఘటనలు ఎదురైతే తక్షణ వైద్య సదుపాయాలు అందించడంలో ఆలస్యం కావొచ్చు. 2. వ్యాక్సినేషన్ తర్వాత తీసుకున్న వ్యక్తికి 30 నిమిషాలు పరిశీలించడంలో అందరికీ సాధ్యం కాకపోవచ్చు. 3. పదేపదే వ్యాక్సిన్ భద్రత పరిచే పెట్టెను తెరవడం, ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల వ్యాక్సిన్ పాడయ్యే అవకాశం ఉంది. తద్వారా వ్యాక్సిన్ సామర్థ్యం తగ్గడం తోపాటు దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాం. వ్యాక్సిన్‌పై నమ్మకం కూడా తగ్గే అవకాశం ఉంది. 4. ఒక లబ్ధి దారుడు నుంచి మరో లబ్ధిదారుడిని చేరుకొనే క్రమంలో వ్యాక్సిన్ వృథా అయ్యే అవకాశం ఉంది. 5. డోర్ టు డోర్ వల్ల కరోనా ప్రొటోకాల్స్ పాటించే అవకాశం ఉండదు. -
ఏపీ: హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఎస్ఈసీ
సాక్షి, అమరావతి: హైకోర్టులో ఎస్ఈసీ అఫిడవిట్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారమే ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్ఈసీ నీలం సాహ్ని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుపుతున్నామన్నారు. గత ఏడాది కరోనా కారణంగా ఎన్నికలు నిలిచిపోయాయని.. నిలిచిపోయిన ఎన్నికలను యథావిధిగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది నోటిఫికేషన్ ప్రకారంగా ఎన్నికల నిర్ణయం తీసుకున్నామని వివరించారు. రిట్ అప్పీల్‌ను డిస్మిస్ చేసి ఎన్నికలు సజావుగా జరిగేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును ఎస్ఈసీ కోరారు. చదవండి: ఆటంకాలు లేవని తేలాకే నోటిఫికేషన్ జెండా ఎత్తేసిన చంద్రబాబు -
ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు సాధ్యం కాదు..
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికలపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేయాల్సి ఉన్నందున స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని అడిషనల్ అఫిడవిట్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ నిర్ణయం తీసుకోగా, ఆ సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయనున్నామని.. పోలీసులు, సిబ్బందిని కేటాయించలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని ఎస్ఈసీ పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహించొద్దని హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎస్ఈసీ నిర్ణయం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని, కరోనా సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వ కర్తవ్యమని కూడా ఏపీ ప్రభుత్వం.. హైకోర్టుకు వాదనలు వినిపించింది. గతంలో కరోనా అంటూ ఎన్నికలు వాయిదా వేసి.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామనడంపై పిటిషన్లో ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం విధితమే. -
ఆయన హయాంలో ఓ వ్యూహమంటూ లేదు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్, ఉద్వాసనకు గురైన మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీల మధ్య న్యాయ పోరు కొనసాగుతోంది. తాజాగా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాపై మిస్త్రీ మరిన్ని ఆరోపణలు చేశారు. టాటా హయాంలో పెట్టుబడులకంటూ ఓ వ్యూహమంటూ ఉండేది కాదని మిస్త్రీ పేర్కొన్నారు. టెలికం టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్, ఇతరత్రా వ్యాపారాలకు సంబంధించి తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో దేశీ కార్పొరేట్ చరిత్రలోనే ఎన్నడూ చూడనంత స్థాయిలో గ్రూప్ విలువ నాశనమైందని మిస్త్రీ ఆరోపించారు. 2012 డిసెంబర్లో టాటా సన్స్ చైర్మన్ హోదా నుంచి వైదొలిగినప్పట్నుంచీ రతన్ టాటాపై పెట్టిన వ్యయాలన్నీ ఆయన కంపెనీకి తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. టాటా గ్రూప్ అఫిడవిట్లకు ప్రతిగా మిస్త్రీ కుటుంబ సంస్థలు ఈ మేరకు సుప్రీం కోర్టుకు అఫిడవిట్లు దాఖలు చేశాయి. 2016 అక్టోబర్ 24న మిస్త్రీని చైర్మన్‌గా టాటా సన్స్ తొలగించడం, అటుపైన సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత అది చెల్లదంటూ నేషనల్ కంపెనీ లా అప్పి లేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఉత్తర్వులివ్వడం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ టాటా గ్రూప్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపైనే మే 29న విచారణ ప్రారంభించిన సుప్రీం కోర్టు నాలుగు వారాల్లోగా తమ వాదనలు తెలియజేయాలంటూ ఇరు వర్గాలను ఆదేశించింది. మిస్త్రీ పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల కంపెనీకి నష్టాలు వాటిల్లాయని, అందుకే ఆయన్ను తొలగించాల్సి వచ్చిందని టాటా గ్రూప్ పేర్కొనడాన్ని మిస్త్రీ తప్పు పట్టారు. -
నిమ్మగడ్డ తొలగింపుపై హైకోర్టులో తుది అఫిడవిట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు కారణాలపై ప్రభుత్వం తుది అఫిడవిట్‌ను హైకోర్టులో శుక్రవారం సమర్పించింది. ఇప్పటికే ప్రభుత్వం ప్రిలిమినరీ కౌంటర్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా, అఫిడవిట్లో ఏపీ ప్రభుత్వం కీలక అంశాలు పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికల సంఘ సంస్కరణల్లో భాగంగా కొత్త కమిషర్‌ను నియమించామని తెలిపింది. రిటైర్డ్ జడ్జిని ఎస్ఈసీగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని గుర్తు చేసింది. (నిమ్మగడ్డ లేఖ విషయంలో సంచలన నిజాలు) మిగిలిన రాష్ట్రాల్లో ఎస్ఈసీల కాలపరిమితి వివరాలను కూడా ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. 2014లో రాష్ట్రవ్యాప్తంగా 221 హింసాత్మక ఘటనలు జరగ్గా.. 2020లో 88 ఘటనలు జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఎస్ఈసీగా బాధ్యాయుత పదవిలో ఉన్న రమేష్‌కుమార్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారని ప్రభుత్వం తెలిపింది. పోలీసులు, పరిపాలనా యంత్రాంగంపై నిమ్మగడ్డ ఆరోపణలు అవాస్తవమని చెప్పింది. తనను కావాలనే ఎస్ఈసీ పదవి నుంచి తప్పించారని.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వేసిన పిటిషన్ అవాస్తవమని ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. (రమేష్ కుమార్ పిటిషన్‌పై కీలక వాదనలు) -
కార్తీక్ పేరుతో మావోలతో కార్యకలాపాలు..
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ చింతకింద కాశింకు నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కాశింను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని, కాశింపై పోలీసులు పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు గజ్వేల్ సహాయ పోలీస్ కమిషనర్ పి.నారాయణ కౌంటర్ దాఖలు చేశారు. రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసే నిషేధిత మావోయిస్టు పార్టీ భావజాలం వ్యాప్తి కోసమే కాశిం ప్రొఫెసర్, జర్నలిస్ట్ అనే ముసుగులు వేసుకున్నారని పేర్కొన్నారు. ప్రొఫెసర్‌గా ఉంటూ విద్యార్థుల్లో మావోయిస్టు పార్టీ భావజాలాన్ని నూరిపోసి ఆ పార్టీలో చేర్చేందుకు ప్రయత్నాలు చేశారని తెలిపారు. బలమైన ఆధారాలు ఉన్నందునే పోలీసులు కాశింను అరెస్టు చేశామని, అంతా చట్ట ప్రకారమే జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఉంటాయని తెలిపారు. పలువురు నేతలను పొట్టనబెట్టుకున్న నేర చరిత్ర కూడా మావోయిస్టు పార్టీకి ఉందని, అందుకే ప్రభుత్వం సీపీఎం (మావోయిస్టు) పార్టీని గతంలోనే నిషేధించిందని వివరించారు. అలాంటి పార్టీతో కాశింకు సంబంధాలు ఉన్నాయని గతంలో పట్టుబడిన మావోయిస్టులు చెప్పారని తెలిపారు. మావోయిస్టులకు సహకారం అందించడమే కాకుండా తెర ముందు ఆ పార్టీ భావజాలాన్ని వినిపించే సంస్థల్లో కాశిం ప్రముఖుడని పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దారుణాలకు పాల్పడే మావోయిస్టులతో కాశింకు సంబంధాలు ఉన్నట్లుగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నందునే చట్ట ప్రకారం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కాశింపై పోలీసులు నమోదు చేసిన కేసు చట్టబద్ధమేనని.. గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన రిట్‌ను కొట్టేయాలని కోరారు. కార్తీక్ పేరుతో మావోలతో కార్యకలాపాలు.. ‘కాశిం గళాన్ని అణచివేయడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక గొంతుకల్ని నొక్కేయడం లేదు. మావోయిస్టుల పేరుతో చందాలు వసూలు చేశారు. 2016లో ఉన్న కేసులు అరెస్టు చేయకపోవడం వల్లే పరారీలో ఉన్నట్లు పేర్కొన్నాం. కాశిం ఇంట్లో సోదాలు ఆయన భార్య స్నేహలత సమక్షంలోనే చేశాం. సోదాల సమయంలో వీడియో చిత్రీకరణ కూడా చేశాం. స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్, కంప్యూటర్ వంటి వాటిని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించాం. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వల్ల ఆ పరీక్షల్లో ఏమీ తేలలేదు. కాశింపై మొత్తం నాలుగు కేసులు ఉన్నాయి. మరో రెండు కేసుల్లో నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. మావోయిస్టుల పేరుతో చేస్తున్న కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎవరూ సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అన్ని సాక్ష్యాధారాలను సేకరించాకే కాశింను అరెస్టు చేశాం. అండర్ గ్రౌండ్లో ఉన్న మావోయిస్టులతో కార్తీక్ అనే పేరుతో కాశిం సంప్రదిస్తున్నారు. 2018లో శ్యాంసుందర్‌రెడ్డి అనే మావోయిస్టు ఇచ్చిన వాంగ్మూలంలో ద్వారా కాశిం గురించి మరిన్ని వివరాలు తెలిశాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి కూతురే కాశిం భార్య స్నేహలత. ఆమె కూడా అదే కేసులో నిందితురాలు. అత్యాధునిక ఆయుధాలతో 150 మంది తీవ్రవాదులు రహస్యంగా ఉన్నారు. వారందరి భావజాలాన్ని కాశిం ప్రొఫెసర్ ముసుగులో వ్యాప్తి చేస్తున్నారు’అని పోలీసులు కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నారు. -
ఐదేళ్లలో పెరిగిన కేజ్రీవాల్ ఆస్తులు..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనకు మొత్తం రూ 3.4 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. 2015లో కేజ్రీవాల్ ఆస్తులు రూ 2.1 కోట్లుగా కాగా ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఆస్తులు రూ 1.3 కోట్లు వృద్ధి చెందాయి. న్యూఢిల్లీ స్ధానానికి కేజ్రీవాల్ నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్లో తెలిపిన వివరాల ప్రకారం ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ పేరిట ఉన్న నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లు 2015లో రూ 15 లక్షల నుంచి 2020కి రూ 57 లక్షలకు పెరిగాయి. సునీతా కేజ్రీవాల్‌కు రూ 32 లక్షల విలువైన నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లు వాలంటరీ రిటైర్మెంట్ ప్రయోజనాల కింద రాగా, మిగిలిన మొత్తం ఆమె సేవింగ్స్‌గా చూపారు. ఇక కేజ్రీవాల్ పేరిట 2015లో చూపిన నగదు, ఫిక్స్డ్ డిపాజిట్ల విలువ 2015లో రూ 2.2 లక్షల నుంచి 2020కి రూ 9.6 లక్షలకు పెరిగాయి. గత ఐదేళ్లలో కేజ్రీవాల్ స్ధిరాస్తులు రూ 92 లక్షల నుంచి రూ 1.7 కోట్లకు పెరిగాయి. 2015లో ఆయనకు ఉన్న ఆస్తుల విలువ పెరగడం వల్లే ఇది సాధ్యమైందని ఆప్ నేతలు చెబుతున్నారు. చదవండి : 6 గంటలు కేజ్రీ వెయిటింగ్ -
ఫడ్నవీస్‌కు కోర్టు నోటీసులు
నాగ్‌పూర్: మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్‌కు స్థానిక న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్లో ఫడ్నవీస్ తనపై ఉన్న క్రిమినల్ కేసులను పేర్కొనలేదంటూ దాఖలైన ఫిర్యాదుపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు గురువారం ఆయనకు నోటీసులు అందజేశారు. నాగ్‌పూర్ ఎమ్మెల్యే అయిన ఫడ్నవీస్‌పై 1996, 1998లలో ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఎన్నికల అఫిడవిట్లో ఈ రెండు కేసులను వెల్లడించనందున ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ నాగ్‌పూర్‌కు చెందిన న్యాయవాది సతీశ్ ఊకె కేసు వేశారు. దీనిపై స్థానిక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. దీనిపై సతీశ్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అత్యున్నత న్యాయస్థానం మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో స్థానిక న్యాయస్థానం జారీ చేసిన నోటీసులను గురువారం పోలీసులు ఆయన నివాసంలో అందజేశారు. -
ఆర్టీసీ సమ్మె: డిమాండ్లు పరిష్కరించం.. చర్చలు జరపం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను జేఏసీ నేతలు తాత్కాలికంగా పక్కన పెట్టినా.. తిరిగి ఏ క్షణమైనా ఆ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చే అవకాశ ఉందని ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ అనుమానం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెపై శనివారం హైకోర్టుకు సునీల్ శర్మ ఫైనల్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు తమ సొంత ఉనికి కోసం సమ్మె చేస్తున్నారని, అలాంటి సమ్మెను అక్రమమైనదిగా ప్రకటించాలని అఫిడవిట్లో కోరారు. ఆర్టీసీ అర్థిక పరిస్థితి బాగాలేనందున కార్మికులకు ఆర్థికపరమైన డిమాండ్లు నెరవేర్చలేమని తేల్చిచెప్పారు. ఇక కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని కోర్టుకు తెలిపిన సునీల్ శర్మ, మరోసారి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపలేమని స్పష్టం చేశారు. సమ్మె కారణంగా ఇప్పటివరకు ఆర్టీసీ కార్పొరేషన్ 44 శాతం నష్టపోయిందని కోర్టుకు తెలిపారు. కొంతమంది యూనియన్ నేతలు తమ స్వార్థం కోసం మొత్తం టీఎస్ ఆర్టీసీనే నష్టాల్లోకి నెడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కష్టాల్లో నెట్టేందుకు యూనియన్ నేతలు పనికట్టుకున్నారని దుయ్యబట్టారు. పరిస్థితి చేయి దాటిపోతోందని, ఇప్పటికైనా సమ్మెను ఇల్లీగల్‌గా ప్రకటించాలని మరోసారి కోరుతున్నట్లు అఫిడవిట్లో సునీల్ శర్మ పేర్కొన్నారు. ఇక ప్రభుత్వంపై కుట్ర పూరితంగా వ్యవహరించేందుకే జేఏసీ నేతలు ప్రతిపక్షాలతో చేతులు కలిపారని ఆరోపించారు. ఈ నెల 18న హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ జరగనున్న నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ అఫిడవిట్ దాఖలు చేశారు. కాగా, సమస్య పరిష్కారానికి హైకోర్టు సూచించిన తిసభ్య కమిటీని ప్రభుత్వం తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీ ఎండీ తాజాగా దాఖలు చేసిన ఫైనల్ అఫిడవిట్‌పై కోర్టు ఎలా స్పందిస్తుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. మరోవైపు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. -
ఆదిత్య ఠాక్రే ఆస్తులివే..
ముంబై : శివసేన యూత్ ప్రెసిడెంట్ ఆదిత్య ఠాక్రేకు రూ 16 కోట్ల విలువైన ఆస్తులున్నట్టు అఫిడవిట్లో పొందుపరిచారు. ఆదిత్య చరాస్తుల విలవ రూ 11.38 కోట్లు కాగా, రూ 4.67 కోట్ల విలువైన స్థిరాస్తులున్నాయి. ఆదిత్య ప్రస్తుతం రూ 6.5 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారు కలిగిఉన్నారు. ఆయనపై ఎలాంటి క్రిమనల్ కేసులు నమోదు కాలేదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబైలోని వొర్లి నుంచి బరిలో దిగిన సందర్భంలో ఆదిత్య తన నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన సందర్భంగా పొందుపరిచిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు పేర్కొన్నారు. 29 ఏళ్ల ఆదిత్య ఠాక్రే శివసేన దిగ్గజ నేత దివంగత బాల్‌ఠాక్రే మనవడు కాగా, ఎన్నికల్లో పోటీ చేస్తున్నతొలి ఠాక్రే కుటుంబ సభ్యుడు కావడం గమనార్హం. ఇక ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆదిత్య ఠాక్రే వద్ద రూ 13,344 నగదు ఉండగా, వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద డిపాజిట్ల రూపంలో రూ 10.36 కోట్ల నగదు నిల్వలున్నాయి. రూ 20.39 లక్షలను బాండ్లు, డిబెంచర్లు, మ్యూచ్‌వల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులుగా పెట్టారు. ఆయనకు రూ 64.65 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఇతర విలువైన వస్తువులున్నాయి.