Alagiri
-
అళగిరికి పదవీ గండం తప్పదా?
సాక్షి, చైన్నె: తమిళనాడు కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు ఎవరో అనే చర్చ పార్టీలో బయలుదేరింది. ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో ప్రస్తుత అధ్యక్షుడు కేఎస్ అళగిరిని తప్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో పదవిని చేజిక్కించుకునేందుకు రేసులో ఐదుగురు నేతలు ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా అళగిరి ఐదేళ్ల పాటు కొనసాగారు. కాంగ్రెస్‌లో మూడేళ్లకు ఒకసారి అధ్యక్ష మార్పు జరిగేది. అయితే, అళగిరి పనితీరును మెచ్చి ఆయన్ను అదనంగా మరో రెండేళ్లు కొనసాగించారు. డీఎంకేతో సఖ్యతగా ఉంటూ వచ్చిన అళగిరి ఒక లోక్‌సభ, ఒక అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక, నగర పాలక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషిచేశారు. ఈ పరిస్థితులలో తమిళనాడుతో పాటు నాలుగు రాష్ట్రాలలో దీర్ఘకాలంగా అధ్యక్షుడిగా ఉన్న వారిని చార్చేందుకు అధిష్టానం నిర్ణయించడం గమనార్హం. ఢిల్లీకి అళగిరి.. కొత్త అధ్యక్షుడి ఎంపిక కసరత్తులను ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ప్రారంభించినట్టు సమాచారం. దీంతో ఆ పదవిని దక్కించుకునేందుకు నలుగురు ఎంపీలు, ఒక మాజీ ఎంపీ ప్రయత్నాలు చేపట్టి ఉండడం గమనార్హం. ఇందులో ఎంపీలు చెల్లకుమార్, జ్యోతిమణి, తిరునావుక్కరసర్ ఉన్నట్టు తెలిసింది. అలాగే, మాజీ ఎంపీ విశ్వనాథన్ సైతం ప్రయత్నాల్లో ఉండడం గమనార్హం. తిరునావుక్కరసర్ గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. రాహుల్‌గాంధీ మద్దతు కలిగిన ఎంపీ జ్యోతిమణి సైతం అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేసినా డీఎంకేతో సన్నిహితంగా మెలిగే నేతై ఉండాలన్న సలహాను కాంగ్రెస్ సీనియర్లు అఽధిష్టానానికి సూచించే పనిలోపడ్డారు. అళగిరి హుటాహుటినా ఢిల్లీకి ఆది వారం సాయంత్రం బయలుదేరి వెళ్లడంతో ఆయనకు మరో అవకాశం దక్కేనా లేదా కొత్త వారికి పదవి కట్టబెట్టేనా అన్నది వేచిచూడాల్సిందే. -
Tamil Nadu: ‘ఆ ఏడుగురి విడుదలకు వ్యతిరేకం’
సాక్షి ప్రతినిధి, చెన్నై : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురికి క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రపతికి లేఖ రాయడం తమకు ఎంత మాత్రం ఆ మోదం కాదని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు కేఎస్ అళగిరి తెలిపారు. నేరస్తులకు శిక్ష వేయడం న్యాయస్థానాల పరిధిలోని వ్యవహారమని, ఇందులో రాజకీయ జోక్యం, వత్తిళ్లు తగదని పేర్కొన్నారు. జైళ్లలో ఏడుగురే కాదు.. వందమందికి పైగా తమిళులు ఉన్నారని వ్యాఖ్యానించారు. 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న రాజీవ్‌గాంధీ హంతకులను విడుదల చేయాలని కోరుతూ 2018లో రాష్ట్ర మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రపతికి ఈనెల 20వ తేదీన లేఖ రాసిన విషయం తెలిసిందే. రాజీవ్‌గాంధీ 30వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం చెన్నై సైదాపేటలోని ఆయన నిలువెత్తు విగ్రహానికి టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి తదితర కాంగ్రెస్ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతికి రాసిన లేఖపై స్పందించారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే 21వ శతాబ్దాన్ని పురస్కరించుకుని అనేక పథకాలు అమలుచేశారని తెలిపారు. అవి యువతకు ఎంతో ఉపకరించాయన్నారు. సమాచార వ్యవస్థ సైతం కొంతపుంతలు తొక్కిందని పేర్కొన్నారు. నేడు ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయంటే రాజీవ్‌గాంధీ తీసుకున్న నిర్ణయాలే కారణమని వివరించారు. పారిశ్రామిక రంగాన్ని సైతం పరుగులు పెట్టించి తమిళుల అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. అలాంటి నేతను హత్య చేసిన ఏడుగురు తమిళ ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతికి లేఖ రాయడం తమకు సమ్మతం కాదన్నారు. రాష్ట్రంలోని జైళ్లలో వంద మందికి పైగా తమిళ ఖైదీలు 20 ఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. తమిళులు అనే భావనతో ఏడుగురిని మాత్రమే విడుదల చేయాలని కోరడం సబబుకాదన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏడుగురు తమిళుల విడుదల అంశాన్ని డీఎంకే తన మేనిపెస్టోలో పొందుపరిచిందని, ఆ విషయౖమై డీఎంకేను కాంగ్రెస్ ఎలాంటి వత్తిడి చేయలేదని ఆయన వివరించారు. చదవండి: రాజీవ్ హత్య కేసులో దోషులను విడుదల చేయండి: సీఎం స్టాలిన్ -
త్వరలో అమెరికాకు తలైవా?
సాక్షి, చెన్నై : రాజకీయ పార్టీ ఏర్పాటు లేదని ప్రకటించిన తలైవా రజనీకాంత్ వైద్య చికిత్సల నిమిత్తం అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదిగో రాజకీయం, ఇదిగో పార్టీ అంటూ ఊరిస్తూ వచ్చిన రజనీకాంత్ ఎట్టకేలకు గత ఏడాది చివర్లో వెనక్కి తగ్గారు. ఆరోగ్య సమస్యల దృష్ట్యా, పార్టీ ఏర్పాటు లేదన్న ప్రకటనను చేశారు. అభిమానులకు ఇది నిరాశే అయినా, తలైవా ఆరోగ్యం తమకు ముఖ్యం అని ప్రకటించిన వాళ్లు ఎక్కువే. అదే సమయంలో తలైవా మద్దతు తమ కంటే తమకు దక్కుతుందన్న ఆశాభావంతో రోజుకో ప్రకటనలు చేసే పార్టీల వాళ్లు పెరిగారు. రజనీని కలుస్తామని, మద్దతు కోరుతామని వ్యాఖ్యలు చేసే వాళ్లూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, రాజకీయ మద్దతు, భేటీల వ్యవహారాలను దాటవేయడానికి సిద్ధమైనట్టు సమాచారు. ఇందులో భాగంగా అమెరికా పయనానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వైద్యపరమైన చికిత్సలు, మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు కొంతకాలం అమెరికాలో ఉండేందుకు రజనీ నిర్ణయించినట్టు, కుటుంబసభ్యులు ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. మార్చి నెలాఖరు వరకు విదేశాల్లో ఉండి, ఎన్నికల సమయంలో ఇక్కడకు వచ్చేందుకు తగ్గట్టుగా పర్యటన ఏర్పాట్లు సాగుతున్నట్టు తెలిసింది. అళగిరి నిర్ణయం ఎమిటో.. డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి ఆదివారం రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేయబోతున్నారు. రజనీకాంత్ పార్టీ ఏర్పాటు చేసిన పక్షంలో ఆయనతో కలిసి నడవడం లేదా, కొత్త పార్టీ ఏర్పాటు ద్వారా జత కట్టడం దిశగా అళగిరి వ్యూహాలు ఉన్నట్టు ఇది వరకు సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. రాజకీయ పార్టీ లేదని రజనీ ప్రకటనతో తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు అళగిరి సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆది వారం మదురైలో మద్దతుదారులతో భేటీకానున్నారు. పది వేల మంది మద్దతు నేతలు తరలి వస్తారన్న ఆశాభావంతో ఏర్పాట్లు జరిగాయి. వీరి అభిప్రాయాలు, సూచనల మేరకు అళగిరి రాజకీయ ప్రకటన ఉండబోతున్నది. డీఎంకేను చీల్చే రీతిలో కలైంజర్ డీఎంకేను ఏర్పాటు చేస్తారా లేదా, మరేదేని కీలక నిర్ణయాన్ని అళగిరి తీసుకుంటారా అనే ఎదురుచూపులు పెరిగాయి. -
డీఎంకేకి షాక్.. అమిత్ షా- అళగిరిల భేటీ?!
చెన్నై: వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలన్ని దూకుడు పెంచాయి. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణాదిన పాగా వేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాట తన వ్యూహాలను సైలెంట్‌గా అమలు చేస్తోంది. ఈ క్రమంలో డీఎంకేకు చెక్ పెట్లేందుకు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు అళగిరికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వాటికి బలం చేకూర్చేలా అళగిరి విశ్వాసపాత్రుడు కేపీ రామలింగం నేడు తమిళనాడు బీజేపీ చీఫ్ ఎల్ మురగన్‌ని కలిశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భవంగా చెన్నైలో ఆయనతో భేటీ అయ్యేందుకు సమయం ఇవ్వాల్సిందిగా కోరారు. కొత్త పార్టీ స్థాపించే ఆలోచనలో ఉన్న అళగిరి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలుపుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఏడాది విరామం తర్వాత రాష్ట్రానికి వస్తోన్న అమిత్ షా తమిళనాట పార్టీని బలోపేతం చేసే నిర్ణయాల గురించి క్యాడర్‌తో చర్చించనున్నట్లు సమాచారం. ఇక ఇదే పర్యటనలో భాగంగా అమిత్ షా, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో భేటీ అవుతారని తెలిసింది. వచ్చే సంవత్సరం ఏప్రిల్-మేలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీ పోటీ చేస్తారా లేదా అనే గందరగోళం తలెత్తిన నేపథ్యంలో రజనీ-అమిత్ షాల భేటీ ప్రాధాన్యత సంతరించుకోనుంది. అలానే అమిత్ షా-అళగిరిల భేటీ కూడా ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ చీఫ్ ఎల్ మురగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అమిత్ షా రజనీకాంత్‌ని కలవరని నేను చెప్పలేను’ అంటూ పరోక్షంగా రజనీ-షాల మీటింగ్ గురించి హింట్ ఇచ్చారు. అంతేకాక ‘అళగిరి బీజేపీలో చేరబోతున్నారనే దాని గురించి తమకు అధికారిక సమాచారం లేదని.. ఒకవేళ ఆయన బీజేపీలో చేరాలనుకుంటే ఆహ్వానిస్తామని’ తెలిపారు. (డీఎంకేతో పొత్తు.. కమల్ క్లారిటీ) కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం: అళగిరి బీజేపీలో చేరబోతున్నారనే వార్తల్ని అళగిరి ఖండిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎల్ మురగన్ చేసిన వ్యాఖ్యలు విన్నాను. కానీ ఇప్పుడే నేను ఏ నిర్ణయం తీసుకోలేదు. నా మద్దతుదారులతో చర్చించిన తర్వాత నా రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటాను. 2021 ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహాలు రచించలేదు. అవన్ని పుకార్లు’ అంటూ కొట్టి పారేశారు. ‘పార్టీ వ్యతిరేక’ కార్యకలాపాల ఆరోపణలతో అళగిరిని 2016 లో డీఎంకే నుంచి బహిష్కరించారు. కరుణానిధి మరణం తరువాత స్టాలిన్ పార్టీ అధ్యక్షుడయ్యాడు. అనంతరం అళగిరిపై వేటు వేశారు. 2018 లో కరుణానిధి మరణించిన వారం తరువాత, అళగిరి తన సోదరుడికి డీఎంకే కార్యకర్తలు తనతో ఉన్నారని బహిరంగంగా సవాలు చేశారు. -
కొత్త పార్టీ స్థాపన దిశగా అళగిరి
సాక్షి, చెన్నై: కలైంజర్ డీఎంకే పేరుతో కొత్త పార్టీ స్థాపనకు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి కసరత్తు చేస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ నెల 20న మద్దతుదారులతో భేటీ కానుండడం ప్రాధాన్యతకు దారి తీసింది. డీఎంకే నుంచి తన పెద్దకుమారుడు అళగిరిని కరుణానిధి గతంలో బహిష్కరించిన విష యం తెలిసిందే. కరుణానిధి మరణం తదుపరి డీఎంకేలో చేరడానికి అళగిరి ప్రయత్నాలు చేసినా స్టాలిన్ ఆసక్తి చూపలేదు. చదవండి: బిహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి డీఎంకే అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినానంతరం 2021 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా స్టాలిన్ ముందుకెళుతున్నారు. అదే సమయంలో పార్టీలోకి తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను తీసుకురావడం, ప్రాధాన్యత ఇవ్వడంతో డీఎంకే సీనియర్లలో కొందరు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో అళగిరి కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరగడం డీఎంకేలో చర్చకు దారి తీసింది. మద్దతుదారులతో భేటీ రాజకీయాలకు అళగిరి దూరంగా ఉంటున్నా తన మాటలతో వార్తల్లో నిలుస్తున్నారు. నటుడు రజనీకాంత్ పార్టీ పెడితే ఆయన వెంట నడిచేందుకు అళగిరి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం కూడా సాగింది. అయితే రజనీ పార్టీపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 20న మదురైలోని దయ కల్యాణ మండపంలో తన మద్దతుదారులతో భేటీ కానుండడం ప్రాధాన్యను సంతరించుకుంది. చదవండి: కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా గుర్తించడం లేదు.. దక్షిణ తమిళనాడులో అళగిరికి మద్దతు గణం అధికంగా ఉండడం, ప్రస్తుత డీఎంకేలో అసంతృప్తితో ఉన్న నేతలకు రహస్యంగా పిలుపు వెళ్లడం వెరసి అళగిరి ఏ ప్రకటన చేస్తారో అన్న ఆసక్తి నెలకొంది. అయితే కలైంజర్ డీఎంకే ఏర్పాటుకు గతంలో తమ నేత సిద్ధంగా ఉన్నట్టుగా మద్దతుదారులు ప్రకటించిన నేపథ్యంలో అదే నినాదాన్ని అందుకుని డీఎంకేలో చీలిక దిశగా అళగిరి వ్యూహాలు ఉండవచ్చన్న చర్చ ఊపందుకుంది. మద్దతుదారుల అభిప్రాయం మేరకు కొత్త పార్టీనా లేదా బీజేపీతో జతకట్టడమా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది. -
అదిష్టానం పిలుపుతో ఢిల్లీకి పరుగు
సాక్షి, చెన్నై: స్థానిక ఎన్నికల నేపథ్యంలో డీఎంకేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వర్గాలు వ్యతిరేకించిన తీరు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేఎస్ అళగిరిని ఇరకాటంలో పెట్టింది. అదే సమయంలో డీఎంకేను ఉద్దేశించి ఆయన సైతం చేసిన వ్యాఖ్యలు కూటమికి ఎసరుపెట్టే పరిస్థితులకు దారి తీశాయి. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో కేఎస్ దేశ రాజధాని ఢిల్లీకి పరుగులు తీశారు. తమ నేత సోనియాగాందీతో కేఎస్ భేటీ సాగింది. ఈ సమయంలో కేఎస్ సోనియా క్లాస్ పీకినట్టు సంకేతాలు వెలువడ్డాయి. జిల్లా, యూనియన్ పంచాయతీల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ వర్గాలు అనేక చోట్ల డీఎంకేకు షాక్ ఇచ్చే దిశగా ముందుకు సాగిన విషయం తెలిసిందే. దీంతో తమకు అవకాశాలు ఉన్నా, చివరకు ఆయా జిల్లా, యూనియన్ పదవుల్ని డీఎంకే కోల్పోవాల్సిన పరిస్థితి. (నా పరిస్థితి బాగోలేదు.. ఇలాగైతే దిగిపోతా: సీఎం) అదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి విడుదల చేసిన ఓ ప్రకటన వివాదానికి దారి తీసింది. కూటమి ధర్మాన్ని డీఎంకే ధిక్కరించినట్టుగా పరోక్షంగా ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌పై కేఎస్ ఎదురుదాడి వ్యాఖ్యల తూటాలు పేల్చడం చర్చకు దారి తీసింది. ఇక, రాష్ట్రంలో కాంగ్రెస్‌తో డీఎంకే కటీఫ్ తథ్యం అన్న చర్చ జోరందుకుంది. ఇందుకు తగ్గట్టుగానే ఈనెల 21న కార్యదర్శులతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు స్టాలిన్ సిద్ధమయ్యారు. అదే సమయంలో సోమవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి పక్ష పార్టీల సమావేశాన్ని సైతం డీఎంకే బహిష్కరించడం చర్చకు దారి తీసింది. ఈ సమయంలో డీఎంకే సీనియర్ నేత, ఎంపీ టీఆర్ బాలు చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ అధిష్టానం ఇరకాటంలో పడ్డట్టు అయింది. (అశాంతి సృష్టిస్తున్నారు: మోదీ) ఢిల్లీకి పరుగు.. కేఎస్ అళగిరి చేసిన వ్యాఖ్యలను తమ పార్టీ వర్గాలు తీవ్రంగానే పరిగణించి ఉన్నాయని టీఆర్ బాలు చేసిన వ్యాఖ్యలతో ఇక కూటమి అన్నది కొనసాగేనా అన్న చర్చ జోరందుకుంది. జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ డీఎంకే పాత్ర కీలంగా ఉన్న నేపథ్యంలో ఈ వివాదం కాంగ్రెస్ పెద్దల్ని ఇరకాటంలో పడేసింది. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో కేఎస్ ఆగమేఘాలపై పరుగులు తీశారు. ఉదయాన్నే పార్టీ నేత సోనియాగాంధీ ఇంటికి వెళ్లారు. గంటన్నరకు పైగా సోనియాతో భేటీ సాగడం రాజకీయంగా ప్రాధాన్యతకు దారి తీసింది. అయితే, అళగిరి తన తరఫు వివరణను సోనియాగాందీకి ఇచ్చుకున్నా, డీఎంకేతో వైర్యం మంచి కాదని క్లాస్ పీకినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాగిన వ్యవహారాలను సోనియా తీవ్రంగా పరిగణించి, డీఎంకే నిర్ణయాలకు తగ్గట్టుగా ముందుకు సాగాలని హితబోధ చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ భేటీ అనంతరం వెలుపలకు వచ్చిన కేఎస్ మీడియాతో మాట్లాడుతూ అనేక ప్రశ్నకు దాట వేత ధోరణి అనుసరించారు. డీఎంకే – కాంగ్రెస్‌ల బంధం గట్టిదని , తమ కూటమిలో ఎలాంటి వివాదాలు, చీలికలకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు, వివాదాలు తప్పవని, తన తరఫున ఉన్న వివరణను సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లినట్టు ముగించారు. కాగా, టీఆర్ బాలును మీడియా కదిలించగా, కేఎస్ ప్రకటన డీఎంకే వర్గాల్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసిన మాట వాస్తవమేనని, కార్యదర్శులతో స్టాలిన్ భేటీ కానున్నారని ముగించడం గమనార్హం. -
అది రజనీకి మాత్రమే సాధ్యం..
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత కరుణానిధి కుమారుడు అళగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాయకత్వ లోటు ఉందని, ప్రజలను ఆదుకునేందుకు ఓ నాయకుడు కావాలని అన్నారు. అది సూపర్ స్టార్ రజనీకాంత్‌తో మాత్రమే సాధ్యమని ఆళగిరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడూతూ.. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ విపక్ష నేతగా విఫలమయ్యారని విమర్శించారు. అలాగే ప్రజల సమస్యలపై అన్నాడీఎంకే ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాజకీయ సంక్షోభం దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని, ఈ దశలోనే రజనీకాంత్ లాంటి వ్యక్తి రాష్ట్రాన్ని ముందుండు నడిపించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ సామర్థ్యం ఆయనకు మాత్రమే ఉందన్నారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యాకలపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అళగిరిని డీఎంకే నుంచి కరుణానిధి బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే కరణానిధి మరణాంతరం తిరిగి డీఎంకే పగ్గాలు చేపట్టాలని తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అప్పటికే రాజకీయంగా నిలదొక్కుకున్న స్టాలిన్ ఆళగిరిని పార్టీ నీడ కూడా తాకనీయలేదు. అయితే అళగిరి బీజేపీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో బుధవారం భేటీ అయిన ఆయన.. రజనీ గురించి ఈ విధంగా వ్యాఖ్యానించారు. కాగా రజనీ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తారని గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కానీ అవేవీ నిజం కాలేదు. -
అళగిరి వారసుడి ఆస్తులు అటాచ్...!
సాక్షి, చెన్నై : డిఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి తనయుడు దురై దయానిధి మీద ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురి పెట్టింది. గ్రానైట్ స్కాం కేసులో దురై దయానిధిని టార్గెట్ చేస్తూ, ఆయనకు సంబంధించిన రూ. 40.34 కోట్లు విలువ కల్గిన చర, స్థిర ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. ఈకేసు విచారణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈడీ నిర్ణయించడం అళగిరికి పెద్ద షాక్కే. మదురై జిల్లా మేలూరు కేంద్రంగా సాగుతూ వచ్చిన గ్రానైట్ అక్రమ రవాణాను డీఎంకే ప్రభుత్వ హయంలోనే ఆ జిల్లా కలెక్టర్‌గా ఉన్న సహాయం వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. గ్రానైట్ మాఫియా రూపంలో ప్రభుత్వానికి పదహారు వేల కోట్ల మేరకు నష్టం వాటిళ్లినట్టు ఆధారాలతో సహా బయట పెట్టారు. ఇందుకు ఆయనకు లభించిన ప్రతి ఫలం బదిలీ వేటు. ఈ స్కాంలో ఎందరో పెద్దలు ఉన్నారంటూ చిట్టాను సైతం సహాయం విప్పినా పట్టించుకున్న పాలకులు కరువే. ఈ సమయంలో డిఎంకే కాంగ్రెస్‌ల మధ్య కేంద్రంలో ఉన్న బంధం బెడిసి కొట్టడం ట్విస్టులకు దారి తీసింది. డిఎంకే కుటుంబాన్ని గురి పెట్టి స్పెక్ట్రమ్ స్కాం, అక్రమ బిఎస్ఎన్ఎల్ కనెక్షన్లు అంటూ కేసుల మోత మోగింది. అలాగే, అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న ఎంకే అళగిరి అండదండాలతో ఆయన వారసుడు దురై దయానిధి మదురైలో యదేచ్చగా గ్రానైట్ తవ్వేసుకుంటూ సొమ్ము చేసుకున్నట్టుగా గుర్తించిన ఈడీ ఓ కేసును నమోదు చేసింది. తొలి నాళ్లలలో నత్తనడకన ఈ కేసు సాగినా, ఆ తదుపరి కనుమురుగైంది. అదే సమయంలో రాష్ట్రంలో అధికారం మార్పు జరగడంతో ఎట్టకేలకు ఐఎఎస్ సహాయ నిజాయితీని మద్రాసు హైకోర్టు గుర్తించింది. రాష్ట్రంలో సాగుతున్న గ్రానైట్, ఖనిజన సంపదల అక్రమ రవాణాపై సమగ్ర విచారణకు ఆయన నేతృత్వంలో ఓ కమిటీని రంగంలోకి దించింది. ఈ కమిటీ సమగ్ర నివేదికను హైకోర్టుకు సైతం సమర్పించి ఉన్నది. అలాగే, గ్రానైట్ అక్రమార్జనలో ఉన్న పెద్దలు, ఏ మేరకు తవ్వకాలు సాగాయి, అనేక గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు ఏ మేరకు కనుమరుగు అయ్యాయో అన్న వివరాలను ఆ నివేదికలో పొందు పరిచి ఉన్నారు. ఈ నివేదిక కోర్టుకు చేరి రెండేళ్లు అవుతున్నది. ఈ నేపథ్యంలో అళగిరి వారసుడు దురై దయానిధి మీద దాఖలైన కేసు ఫైల్ దుమ్ము దుళి పే పనిలో ఈడీ నిమగ్నం కావడం ఆస్తుల అటాచ్..... ఆరేళ్ల క్రితం నమోదైన కేసు ఫైల్‌ను దుమ్మదులిపే పనిలో పడ్డ ఈడీ వర్గాలు దురై దయానిధిని టార్గెట్ చేశారు. గ్రానైట్ అక్రమార్జన ద్వారా ప్రభుత్వానికి పంగనామాలు పెట్టిన దురై దయానిధి ఆస్తుల్ని అటాచ్ చేయడం గమనార్హం. తండ్రి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో దయానిధి ఆగడాలకు మదురైలో హద్దే లేదన్న ప్రచారం మరీ ఎక్కువే. అందుకే కాబోలు ప్రస్తుతం ఎప్పుడో నమోదైన కేసు మీద ఈడి ఇప్పుడు దృష్టి పెట్టి విచారణ వేగవంతానికి సిద్ధమైనట్టుంది. ఒలంపస్ గ్రానైట్స్ పేరుతో సాగిన వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఈడీ, ప్రస్తుతం కేసు విచారణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధం అయింది. త్వరలో ఈకేసు కోర్టు విచారణకు రానున్న దృష్ట్యా అంతలోపు తమ కొరడాను ఝుళిపించే పనిలో నిమగ్నమైంది. బుధవారం దురై దయానిధి ఆస్తుల అటాచ్ ఉత్వర్వులకు సంబంధించిన ప్రకటన ఢిల్లీలో వెలువడింది. ఆయనకు సంబంధించిన రూ. 40 కోట్ల చర, స్థిర ఆస్తులను అటాచ్ చేయడం గమనార్హం. ఇది కాస్త ఎంకే అళగిరికి షాక్కే. ప్రస్తుతం డిఎంకే బహిష్కృత నేతగా రాజకీయలకు దూరంగా ఉంటూ వస్తున్న అళగిరి కుటుంబానికి వ్యతిరేకంగా ప్రస్తుతం పరిణామాలు బయలు దేరడంతో ఆయన మద్దతు దారుల్లో ఉత్కంఠ నెలకొని ఉన్నది. ఈ పరిణామాలు మున్ముందు తమ నేతను ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెడుతాయో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా అళగిరి
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పలు నియామకాలు చేపట్టారు. కేఎస్ అళగిరిని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా, హెచ్ వసంత కుమార్, కె జయకుమార్, ఎంకే విష్ణు ప్రసాద్, మౌర్య జయకుమార్‌లను కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించారు. ప్రస్తుత తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావక్కరసర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ, ఇన్నాళ్లూ ఆ పదవిలో ఉన్నందుకు ఆయనను రాహుల్ అభినందించారు. మరియం బీబీ, మియాని దాల్బోత్‌లను వరుసగా అండమాన్, నికోబార్ దీవులు, మేఘాలయల మహిళా కాంగ్రెస్‌లకు కార్యనిర్వాహక అధ్యక్షురాళ్లుగా రాహుల్ నియమించారు. లక్షద్వీప్‌కు ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు. ఢిల్లీ, గుజరాత్, త్రిపుర, పశ్చిమ బెంగాల్, చండీగఢ్‌ల ఏఐసీసీ ఎస్సీ విభాగంలోనూ కొందరిని రాహుల్ గాంధీ నియమించారు. -
అళగిరి బల ప్రదర్శన
సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు, డీఎంకే బహిష్కృత నాయకుడు అళగిరి బుధవారం తన మద్దతుదారులు, అభిమానులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. అళగిరి బల ప్రదర్శనగా పేర్కొంటున్న ఈ యాత్ర చెన్నైలో వాలాజా రోడ్ జంక్షన్ నుంచి మెరీనా బీచ్‌లోని కరుణానిధి సమాధి వరకు 1.5 కి.మీ. దూరం సాగింది. నలుపు రంగు చొక్కా, ధోవతి ధరించిన అళగిరి ఓపెన్ టాప్ వ్యానులో నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తుండగా, కరుణానిధి చిత్ర పటాల్ని చేతబట్టి, నల్ల చొక్కాలు, నెత్తిన పసుపు వర్ణం టోపీ ధరించి మద్దతుదారులు ర్యాలీలో ముందుకు సాగారు. అళగిరి కుమారుడు దురాయ్ దయానిధి, కూతురు కాయల్విజి, సన్నిహితులు మదురై మాజీ డిప్యూటీ మేయర్ పీఎం మణ్నన్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. డీఎంకే పార్టీ నుంచి ప్రముఖ నాయకులెవరూ ర్యాలీలో పాల్గొనలేదు. యాత్ర ముగిశాక అళగిరి కరుణానిధి సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ యాత్ర వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, తన తండ్రికి నివాళులర్పించేందుకే ర్యాలీ చేపట్టినట్లు అళగిరి తెలిపారు. ధైర్యముంటే, యాత్రలో పాల్గొని తనకు మద్దతుతెలిపిన నాయకులు, కార్యకర్తలందరిపై వేటువేయాలని డీఎంకేకు సవాలు విసిరారు. -
రసపట్టులో అన్నదమ్ముల సవాల్
పార్టీపై స్టాలిన్ పట్టుకు తిరుగులేదనీ, పార్టీ నాయకత్వంలో అళగిరిని ఆయన వేలుపెట్టనివ్వరనే విషయం పరిశీలకులందరికీ అర్థమైంది. మళ్లీ డీఎంకేలో చేర్చుకోవాలని డిమాండ్ చేసిన అళగిరి విషయంలో కరుకుగానే వ్యవహరించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. స్టాలిన్ పార్టీ మనిషిగానే వ్యవహరిస్తూ, కుటుంబ సంబంధాల ప్రభావం పార్టీపై పడకుండా చూడాలనేది వారి ఆకాంక్ష. సెప్టెంబర్ ఐదున తన మెరీనా యాత్రలో లక్ష మంది తన వెంట నడుస్తారని అళగిరి చెబుతున్నారు. అంత మంది జనం ఆయన వెంట రాకపోవచ్చుగాని, అళగిరి ర్యాలీ విజయవంతమైనట్టు కనిపించేలా చేయడానికి డీఎంకే వ్యతిరే పార్టీలు తమ వంతు పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. చెన్నైలోని మెరీనాలో తన తండ్రి ఎం.కరుణానిధి సమాధి వద్దకు ఆయన రెండో కొడుకు డీఎంకే మాజీ నేత ఎంకే అళగిరి నేడు (బుధవారం) ఊరేగింపుగా వెళుతున్నారు. 1980ల్లో తన ఇద్దరు కొడుకుల మధ్య వైరంతో విసిగిపోయిన కరుణానిధి పార్టీ దక్షిణాది వ్యవహారాలు చూసుకో మని అళగిరిని మదురైకు పంపించారు. ఉత్తర తమిళ నాడులో పార్టీ పనిని చెన్నై నుంచి నడపాలని స్టాలిన్‌కు అప్పగించారు. స్టాలిన్ కార్యక్షేత్రంలోనే ఆయనకు అన్న సవాలు విసురుతున్నారు. కుటుంబ పోరు ఇక బహిరంగమే. తోబుట్టువుల మధ్య ఈ యుద్ధంలో అళగిరే బలహీనుడు. ఆగస్టు చివరి వారం స్టాలిన్ తండ్రికి వారసునిగా డీఎంకే అధ్యక్ష పదవి చేపట్టారు. కరుణ ఈ పదవిలో 49 ఏళ్లున్నారు. 2014లో డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన అళ గిరి ప్రస్తుతం పార్టీ సభ్యుడు కూడా కాకపోవడంతో తమ్ముడిని అడ్డుకోలేకపోయారు. ప్రతి జిల్లాలో అన్ని పదవుల్లో్ల తన మనుషులను నియమిస్తూ గత నాలు గేళ్లలో పార్టీపై స్టాలిన్ పూర్తి పట్టు సాధించారు. ఈ నాలుగేళ్లలో అళగిరి రాజకీయాల్లో చురుకుగా లేరు. తమ్మునితో పోరు సలపకుండా వెనుదిరగడం ఆయ నకు ఇష్టం లేదు. మళ్లీ డీఎంకేలో చేరాలనుకున్న ఆయనకు కుటుంబ సభ్యుల మద్దతు లభించలేదు. దీంతో ఇక బాహాటంగానే స్టాలిన్‌తో తలపడాలను కుని, తన తండ్రికి నిజమైన, విధేయులైన కార్యకర్త లంతా నాతోపాటే ఉన్నారని చెప్పారు. పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడైన స్టాలిన్ కార్యసాధకుడు కాదని, పార్టీని ఎన్నికల్లో గెలిపించే సత్తా ఆయనకు లేదని అళగిరి చెప్పారు. స్టాలిన్‌కు ఎక్కడ నొప్పి పుడు తుందో అక్కడే అళగిరి గురిచూసి కొడుతున్నారు. కరుణానిధి బతికుండగానే 2014 లోక్‌సభ, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోనే డీఎంకే పోటీచేసింది. డీఎంకేకు ఒక్క లోక్‌సభ సీటూ దక్క లేదు. రెండేళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయలలితను గద్దె దింపలేకపోయింది. అందుకే, 2019 పార్లమెంటు ఎన్నికలు స్టాలిన్‌కు అగ్నిపరీక్ష వంటివి. మూడోసారి ఎన్నికల్లో డీఎంకేను గెలిపించ లేకపోతే స్టాలిన్‌కు ప్రమాదం ముంచుకొస్తుంది. అళగిరి పార్టీని చీల్చలేక పోయినా, స్టాలిన్‌ను ఇబ్బం దిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అన్న పేరెత్తని స్టాలిన్! అళగిరి విమర్శలకు స్టాలిన్ స్వయంగా స్పందించ లేదు. పార్టీ నేతలతోనే జవాబు చెప్పించారు. పార్టీపై స్టాలిన్ పట్టుకు తిరుగులేదనీ, పార్టీ నాయకత్వంలో అళగిరిని ఆయన వేలుపెట్టనివ్వరనే విషయం డీఎంకే వ్యవహారాలు గమనిస్తున్నవారందరికీ అర్థమైంది. మళ్లీ డీఎంకేలో చేర్చుకోవాలని డిమాండ్ చేసిన అళగిరి విషయంలో కరుకుగానే వ్యవహరించాలని పార్టీ నేతలు కోరారు. స్టాలిన్ పార్టీ మనిషి గానే వ్యవహరిస్తూ, కుటుంబ సంబంధాల ప్రభావం పార్టీపై పడకుండా చూడాలనేది వారి ఆకాంక్ష. సెప్టెంబర్ ఐదున తన మెరీనా యాత్రలో లక్ష మంది తన వెంట నడుస్తారని అళగిరి చెబుతున్నారు. అంత మంది జనం ఆయన వెంట రాక పోవచ్చుగాని, అళగిరి ర్యాలీ విజయవంతమైనట్టు కనిపించేలా చేయడానికి డీఎంకే వ్యతిరేక పార్టీలు తమ వంతు పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. జయలలిత మరణించాక ఏఐఏడీఎంకేలో వచ్చిన చీలిక, బల హీన నాయకత్వంలో పార్టీ నడవడాన్ని తమకు అను కూలంగా మార్చుకోవడానికి డీఎంకే ప్రయత్నిస్తున్నట్టే, డీఎంకేను నడిపే కరుణానిధి కుటుంబంలోని కీచులాటలను వాడుకోవడానికి కూడా అనేక శక్తులు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతానికి డీఎంకే నేతలు, కార్యకర్తలను చెప్పుకోదగ్గ సంఖ్యలో అళగిరి తనవైపుకు తిప్పుకోలేరు.. రెండేళ్ల క్రితం స్టాలిన్ అడ్డపంచె వదిలి ప్యాంటు, రంగు చొక్కా బదులు తెల్ల షర్టు వేసుకునేలా సలహాదారుల బృందం ఆయనను ఒప్పించింది. ఇలా ‘గెటప్’ మార్చితే తమిళనాడు యువతను వారిలా కనిపిస్తూ ఆకట్టుకోవవచ్చనేది ఈ సలహాబృందం అభిప్రాయం. కొత్త రూపంలోని స్టాలిన్ మీడియా తీసిన ఫొటోల్లో ఆసక్తికరంగానే కనిపించారుగాని ఎన్నికల్లో మాత్రం డీఎంకే గెలిచేస్థాయిలో ఓట్లు పడలేదు. కనీసం కరుణానిధి, జయలలిత లేని తమిళ రాజకీయక్షేత్రంలోనైనా ఎన్నికల్లో కొత్త అంశాలు జోడించి విజయానికి బాటలు వేయాలనే వత్తిడి స్టాలిన్‌పై పెరుగుతోంది. రెండేళ్లకు పైగా అధికారంలో ఉన్న పాలకపక్షమైన ఏఐడీఎంకేపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిపైనే పార్టీ గెలుపునకు పూర్తిగా ఆధారపడితే స్టాలిన్‌కు విజయం గ్యారంటీ అని చెప్పడం కష్టం. తన తండ్రి సీఎంగా అందించిన డీఎంకే పరిపాలన నాణ్యత తన నాయకత్వంలో బాగా మెరుగవుతుందని, సుపరిపాలనకు తన పార్టీ మంచి నమూనాగా నిలుస్తుందని స్టాలిన్ సరికొత్త ఇమేజ్‌తో ప్రజలను నమ్మించగలిగితేనే పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుంది. గతంలో మాదిరిగా పాలక పక్షంపై జనంలో పేరుకుపోయే వ్యతిరేకత ఈసారి డీఎంకే అధికారంలోకి రావడానికి తోడ్పడకపోవచ్చు. తమిళనాడులో 1984, 2016లో మినహా ప్రజలు అధికారంలో ఉన్న ద్రవిడ పార్టీలను ఓడించారు. డీఎంకే, ఏఐఏడీఎంకేలో ఈ రెండు సందర్భాల్లో తప్ప ప్రతిసారి ఒకదాని తర్వాత ఒకటి ఫోర్ట్ సెయింట్ జార్జిలో (తమిళ అధికారపీఠం ఉండే ప్రాంతం) అధికారం చేపట్టాయి. కరుడుగట్టిన ఏఐఏ డీఎంకే కార్యకర్తకు సీఎం పళనిస్వామి– ఓపీఎస్ నేతృత్వంలోని అసలు ఏఐఏడీఎంకేనుగాని, శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్ నాయకత్వంలోని చీలికవర్గమైన కొత్త పార్టీని(అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం)గాని ఎంచుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ఏఐఏడీఎంకేలోని అసంతృప్తి జ్వాలలపైనే తమిళ నాడు ప్రభుత్వ పగ్గాలు చేపట్టడానికి స్టాలిన్ పూర్తిగా ఆధారపడలేరనేది వాస్తవం. ఖాయంగా అధికారం లోకి రావాలంటే కొత్త సీసాలో పాత సారా పోసి చూపించకుండా, తమిళనాడు ప్రగతికి కొత్త విజన్ ఏమిటో స్టాలిన్ ప్రజలకు చెప్పగలగాలి. కొత్త పార్టీ పెట్టినా పెద్దగా లాభం ఉండదు! అళగిరి కొత్తగా పార్టీ పెట్టినా ఎన్నికల ఫలితాలపై చెప్పుకోదగ్గ ప్రభావం చూపించే అవకాశం లేదు. ఎన్నికల్లో దక్షిణ తమిళనాడులో ఓట్లు చీల్చి డీఎంకేను ఓడించగలిగితే అళగిరికి అంతకన్నా ఆనందించే విషయం ఉండదు. ఈ లక్ష్య సాధనకు స్టాలిన్ రాజ కీయ ప్రత్యర్థులతో కలిసి పనిచేయడానికి కూడా ఆయన సిద్ధమే. ప్రస్తుతానికి ఏ రాజకీయ సంస్థతో అనుబంధం లేకుండా కనిపిస్తున్నాగాని కరుణానిధికి ప్రత్యామ్నాయ వారసునిగా అళగిరి తాను జనం ముందు కనిపించేలా ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత తనను తప్పనిసరిగా డీఎంకేలోకి తమ్ముడు స్టాలిన్ తీసుకునే పరిస్థితిని అళగిరి ఈలోగా సృష్టించగలగాలి. అంటే ఎన్నికల్లో తన వల్ల డీఎంకే దెబ్బతినేలా చూడాలి. రాజకీయంగా తన ఉనికి చాటాలనే ఆతృత ఆయనలో కనిపిస్తోంది. తన కొడుకులు, మనవళ్లకు డీఎంకేలో రాజకీయ, ఆర్థిక వారసత్వం, వాటా దక్కించుకోవాలనేది కూడా అళ గిరి కోరిక. భారీగా డబ్బున్న డీఎంకే నిర్వహణలోని ట్రస్టుల్లో అళగిరి కుటుంబసభ్యులెవరికీ సభ్యత్వం లేదు. ఆయనలో అసలు అసంతృప్తికి ఇదో ప్రధాన కారణం. అందుకే ఆయన కొంత తగ్గివచ్చి తమ్ముడికి కొత్త ప్రతిపాదన చేశారు. తనను డీఎంకేలోకి మళ్లీ తీసుకుంటే స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధమేనని ఇటీవల ప్రకటించారు. కరుణానిధి గోపా లపురం ఇంట్లో డీఎంకే ప్రథమ కుటుంబానికి సంబంధించి మరో కథ ప్రచారంలో ఉంది. కరు ణానిధి కన్నుమూసిన కొన్ని రోజులకే డీఎంకేలోకి తనను మళ్లీ చేర్చుకోవడానికి తన కుటుంబసభ్యుల ద్వారా అళగిరి ఒత్తిడి తెచ్చారట. తమ కుటుంబాన్ని ఐక్యంగా ఉంచే బాధ్యత తనపై ఉందని చెప్పుకునే ఆయన సోదరి సెల్వికూడా తన వంతు ప్రయత్నం చేశారు. తన సోదరులిద్దరూ కలిసి ఉండేలా చూడ డానికి అమె గట్టి కృషి చేశారు. కాని, అళగిరిని మళ్లీ పార్టీలోకి రానిచ్చే ప్రసక్తి లేదని స్టాలిన్ తేల్చి చెప్పారు. ఆయనకు ఈ విషయంలో సవతి చెల్లెలు కనిమొళి, దగ్గర బంధువులైన మారన్ సోదరులు బాసటగా నిలబడ్డారు. తన తండ్రి మంచి ఆరో గ్యంతో ఉన్నప్పుడే మళ్లీ పార్టీలో చేరడానికి తాను గట్టి ప్రయత్నాలు చేయాల్సిందనీ, కాని ఆ పని చేయలేదని మదురైలోని తన మద్దతుదారులతో మాట్లాడుతూ అళగిరి తన బాధ వెళ్లబోసుకుంటు న్నారని తెలుస్తోంది. తన తండ్రి నిర్ణయం మార్చా ల్సిన అవసరం కనిపించడం లేదని స్టాలిన్ అంటు న్నారు. సోషల్ మీడియా అత్యంత చురుకుగా పని చేస్తున్న ఈ రోజుల్లో అళగిరి తరహా దురుసు రాజ కీయాల వల్ల పార్టీకి చేటేగాని లాభం ఉండదని భావి స్తున్నారు. డీఎంకే అగ్రనాయకత్వం కూడా అళగిరి మళ్లీ పార్టీలోకి రావాలని కోరుకోవడం లేదు. 2001లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినం దుకు అళగిరిని సస్పెండ్ చేశారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీకి వ్యతిరేకంగా పని చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. తనకు పలుకుబడి ఉన్న మదురై చుట్టుపక్కల ప్రాంతాల్లో డీఎంకే అభ్య ర్థుల ఓటమికి ఆయన పనిచేశారనే ఆరోపణలు న్నాయి. అళగిరి దెబ్బతో పరాజయం పాలైనవారిలో డీఎంకే సీనియర్ నేత పీటీఆర్ పళనిరాజన్ కూడా ఉన్నారు. ఆయన 1996–2001 మధ్య తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. మదురై పశ్చిమ స్థానంలో ఆయన కేవలం 708 ఓట్ల తేడాతో ఓడి పోయారు. అళగిరి 17 ఏళ్ల క్రితంలా ఇప్పుడు లేకున్నా డీఎంకేను దెబ్బదీయడానికి ఆయనకున్న శక్తియుక్తులను ఎవరూ తక్కువగా అంచనావేయడం లేదు. అళగిరి పొరపాటు చేశారా? అంటే అవుననే చెప్పాలి. తన తండ్రి మరణించాక ఆయన కొంత కాలం వేచి చూడాల్సింది. వారంలోపే దూకుడుగా మాట్లాడారు. ఎన్నికల్లో స్టాలిన్ బోల్తాపడే వరకూ ఆగి తర్వాతే అళగిరి విమర్శిస్తే బావుండేది. తొంద రపడి తన బలహీనత బయటపెట్టుకున్నారు. బుధ వారం ర్యాలీకి తెలిసిన నేతలు, జనం తగినంత మంది హాజరుకాకపోతే అళగిరి రాజకీయ జీవితం ముగిసినట్టేననుకోవచ్చు. టీఎస్ సుధీర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు ఈ–మెయిల్ : tssmedia10@gmail.com -
డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్!
-
డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్!
సాక్షి, చెన్నై : డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ ఏకగ్రీవ ఎంపిక దాదాపు ఖరారైంది. మంగళవారం జరగనున్న పార్టీ సర్వసభ్య సమావేశంలో డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ స్టాలిన్ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. కోశాధికారి పదవికి సీనియర్ నేత దురై మురుగన్ ఎన్నిక కూడా ఏకగ్రీవం కానుంది. ఆదివారం ఉదయాన్నే పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ఆశీస్సులు తీసుకున్న స్టాలిన్ మెరీనా తీరం చేరుకున్నారు. అక్కడ దివంగత అన్నాదురై సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం కరుణానిధి సమాధి వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి ఆశీస్సులు అందుకున్నారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకుని తల్లి దయాళు అమ్మాల్ ఆశీర్వాదం పొందారు. తదుపరి అభిమానుల నినాదాల నడుమ తేనంపేటలోని డీఎంకే కార్యాలయం అన్నా అరివాళయానికి వెళ్లారు. పార్టీ నిర్వాహక కార్యదర్శి, ఎన్నికల అధికారి ఆర్ఎస్ భారతికి స్టాలిన్ నామినేషన్‌ను సమర్పించారు. స్టాలిన్ నామినేషన్‌ను ఆమోదిస్తూ జిల్లాల కార్యదర్శులు ప్రతిపాదన చేశారు. ఆయా జిల్లాలల నుంచి స్టాలిన్‌కు మద్దతుగా రెండు వందలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీ కోశాధికారి పదవికి దురై మురుగన్ నామినేషన్ వేశారు. ఆయనకు మద్దతుగా సైతం పలు నామినేషన్లు దాఖలయ్యాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు సాగిన నామినేషన్ల ప్రక్రియలో అ«ధ్యక్ష పదవికి స్టాలిన్, కోశాధికారి పదవికి దురై మురుగన్‌లకు మద్దతుగానే అన్ని నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆ ఇద్దరు ఎంపిక ఏకగ్రీవమైంది. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా: అళగిరి! తమిళనాట ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తే పోటీ చేస్తానని కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి అన్నారు. తన బలాన్ని చాటేందుకు సెప్టెంబరు 5న చెన్నైలో శాంతి ర్యాలీని నిర్వహించాలని ఆయన నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీ విజయవంతం లక్ష్యంగా, తన మద్దతుదారుల్ని ఏకంచేస్తూ గత మూడు రోజులుగా మదురైలో అళగిరి బిజీగా ఉన్నారు. -
రజనీకాంత్ పార్టీలోకి అళగిరి?
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత కరుణానిధి మరణాంతరం ఆ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చీనీయాంశమైంది. నిజమైన డీఎంకే కార్యకర్తలు తన వెంటే ఉన్నారని, డీఎంకేకి తానే అసలైన నాయకుడినని ఇటీవల అళగిరి సంచలన వ్యాఖ్యలకు తెరలేపిన విషయం తెలిసిందే. దీంతో డీఎంకేలో ఎంకే స్టాలిన్, అళగిరి మధ్య వారసత్వం పోరు జరుగుతోందన్న విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలన వార్త వినిపిస్తోంది. డీఎంకేలో నేతలంతా తనకు వ్యతిరేకంగా ఉన్నారని భావిస్తోన్న అళగిరి.. రజనీకాంత్‌కు చెందిన పార్టీలో చేరబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. కరుణానిధి మృతి అనంతరం చెన్నైలోని కావేరి ఆసుపత్రికి వచ్చిన రజనీకాంత్.. అళగిరి, స్టాలిన్‌లతో కూడిన రెండు పోటోలను డీఎంకే సోమవారం విడుదల చేసింది. దానిలో రజనీకాంత్ అళగిరితో ఎంతో సన్నిహితంగా మాట్లాడుతుండగా, మరో ఫోటోలో స్టాలిన్‌తో మాట్లాడడం మాత్రం ఎంతో ఇబ్బందికరంగా ఫీలయినట్లు తెలుస్తోంది. కాగా రజనీకాంత్ పార్టీ ప్రారంభించిప్పుడు కరుణానిధిని కలిసి ఆశీస్సులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్, అళగిరి మధ్య స్నేహం కుదిరిందని, డీఎంకేలో తనకు ప్రాధాన్యత లేనందున రజనీకాంత్‌తో కలిసి వెళ్తారనే వార్తలు తమిళనాట వినిపిస్తున్నాయి. ఇదిలా వుండగా నేడు జరగనున్న డీఎంకే కార్యవర్గ సమావేశంలో పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న స్టాలిన్నే పార్టీ అధ్యక్షుడుగా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే అళగిరి మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది. -
డీఎంకేలో ఆధిపత్యం కోసం అన్నదమ్ముల పోరు
-
డీఎంకేలో మళ్లీ అన్నదమ్ముల పోరు
సాక్షి, చెన్నై: పార్టీకి నమ్మకస్తులైన కార్యకర్తలంతా తనతోనే ఉన్నారనీ, తనను తిరిగి పార్టీలోకి తీసుకోకపోతే డీఎంకే తన గొయ్యిని తానే తవ్వుకున్నట్లేనని కరుణానిధి పెద్ద కొడుకు, బహిష్కృత పార్టీ నేత అళగిరి సోమవారం వ్యాఖ్యానించారు. పార్టీపై ఆధిపత్యం విషయంలో కరుణానిధి మరో కొడుకు స్టాలిన్, అళగిరిల మధ్య గొడవల నేపథ్యంలో 2014లో అళగిరిని, ఆయన మద్దతుదారులను కరుణానిధి పార్టీ నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం స్టాలిన్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుకాగా, కరుణ మరణంతో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలుచేపట్టే వీలుంది. సోమవారం చెన్నైలో కరుణ సమాధి వద్ద నివాళులర్పించాక అళగిరి మీడియాతో మాట్లాడారు. తాను డీఎంకేలోకి తిరిగి రాకుండా స్టాలిన్ అడ్డుకుంటున్నారన్నారు. ‘కరుణ నిజమైన అభిమానులు, మద్దతుదారులంతా నా పక్షానే ఉన్నారు. సమయమే సమాధానం చెబుతుంది’ అని అన్నారు. దక్షిణ తమిళనాడులో అళగిరికి మంచి పట్టు ఉంది. డీఎంకేలోని అనేక మంది నేతలు సూపర్‌స్టార్ రజినీకాంత్‌తోనూ సంప్రదింపుల్లో ఉన్నారని ఆరోపించారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోతే ఇక పార్టీ నాశనమైనట్లే. అప్పుడు కరుణానిధి ఆత్మ వారిని శిక్షిస్తుంది. ఊరికే వదిలిపెట్టదు’ అని అన్నారు. ఆయన మా పార్టీ మనిషి కాదు ‘అళగిరి మా పార్టీ మనిషి కాదు. ఆయన ఆరోపణలకు సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు’ అని ఎమ్మెల్యే అన్బళగన్ అన్నారు. డీఎంకేలో అందరూ ఐక్యంగానే ఉన్నారనీ, స్టాలిన్ వెన్నంటే ఉంటామన్నారు. డీఎంకే సీనియర్ నేత దురై మురుగన్ సైతం ఇదే తరహాలో స్పందించారు. -
అసలైన డీఎంకే నాదే: అళగిరి
మదురై: తమిళనాడు ప్రధాన ప్రతిపక్షంలో ముసలం పుట్టింది. అసలైన డీఎంకే కేడర్ అంతా తనతోనే ఉన్నారని ఆ పార్టీ అధినేత కరుణానిధి కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అళగిరి ప్రకటించుకున్నారు. తన సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌ను ‘నాన్‌వర్కింగ్ ప్రెసిడెంట్’ అంటూ పరోక్షంగా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత ఏడు జిల్లాల్లో స్టాలిన్ పార్టీ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన నేపథ్యంలో అళగిరి ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. గురువారం మదురైలో జరిగిన పార్టీ నేత ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు. ‘ప్రస్తుతం పార్టీలో వివిధ స్థానాల్లో ఉన్న వారంతా పదవుల కోసమే తప్ప పనిచేసే వారు కాదు. అసలైన కేడర్ అంతా నా వెంటే ఉంది. పార్టీ అధ్యక్షుడు కరుణానిధిని మాత్రమే మా నాయకుడు’ అని అన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ 2014 లోక్‌సభకు ఎన్నికలకు ముందు అధ్యక్షుడు కరుణానిధి ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. అయినప్పటికీ దక్షిణ జిల్లాల్లోని పార్టీ క్యాడర్లో ఆయనకు మంచి పట్టుంది. -
స్టాలిన్‌కు పార్టీ పగ్గాలు, కింగ్ మేకర్ ఎంట్రీ!
చెన్నై : తమిళనాట రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. జయలలిత మరణంతో ఓ వైపు అన్నాడీఎంకేలో కుర్చీ కోసం కుమ్ములాటలు జరుగుతుంటే...మరోవైపు ప్రతిపక్ష పార్టీ డీఎంకేలోనూ వారసత్వ పోరు మళ్లీ తెరపైకి వస్తోంది. ఈ నెల 4వ తేదీన (బుధవారం) డీఎంకే సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా స్టాలిన్‌ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కరుణానిధి పెద్దకుమారుడు అళగిరి కూడా కీలక పదవి ఇస్తే తిరిగి పార్టీలోకి వస్తానంటూ సంకేతాలు ఇస్తున్నారు. డీఎంకే దక్షిణాది కింగ్‌మేకర్‌గా ఒకప్పుడు అళగిరి చక్రం తిప్పిన విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఆయన్ని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించేందుకు కుటుంబీకులు కరుణపై ఒత్తిడి కూడా వచ్చింది. దీంతో అళగిరి మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. మరోవైపు కనిమొళికి కూడా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కరుణానిధి పాల్గొంటారా? లేదా అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. కాగా ఈ సమావేశం గతంలోనే జరగాల్సి ఉండగా, ఆయన అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దాంతో ఈ భేటీ వాయిదా పడింది. కాగా ఈ సమావేశంలో కరుణానిధి పాల్గొంటారని పార్టీ సీనియర్ నేత అన్బళగన్ తెలిపారు. సర్వసభ్య సమావేశంలో స్టాలిన్‌కు ముఖ్య బాధ్యతలు అప్పగించేవిధంగా తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో డీఎంకే సర్వసభ్య సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
అన్నయ్యకు అనుమతి!
► కరుణతో అళగిరి ► గంట పాటు గోపాలపురంలో.. పెద్దకుమారుడు, డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరికి పార్టీ అధినేత, తండ్రి కరుణానిధిని కలిసేందుకు గోపాలపురంలో అనుమతి లభించింది. గంట పాటు ఆ ఇంట్లో ఉన్న అళగిరి ఉత్సాహంగా వెలుపలకు రావడంతో మీడియా చుట్టుముట్టింది. తలైవర్ నల్లా ఇరుక్కురార్(నాయకుడు బాగున్నారు) అంటూ ఆనందకర వ్యాఖ్యలతో ముందుకు సాగడం విశేషం. సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత ఎం. కరుణానిధి వారసులు ఎంకే అళగిరి, ఎంకే స్టాలిన్ల మధ్య సాగుతున్న సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పరిణామాలు అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించే వరకు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. పార్టీ బహిష్కరణతో కొన్నాళ్లు మదురైకు, మరికొన్నాళ్లు విదేశాలకు పరిమితమైన అళగిరి, రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో వ్యక్తిగా ఉండే వారు. గతంలో పలుమార్లు అధినేత, తండ్రి కరుణానిధితో భేటీకి తీవ్రంగా ప్రయత్నించినా, ఆయనకు అనుమతి దక్కలేదని చెప్పవచ్చు. చివరకు గోపాలపురం ఇంటికి రావడం, తల్లి దయాళుఅమ్మాల్తో మాట్లాడడం, తిరిగి వెళ్లడం జరుగుతూ వచ్చింది. అరుుతే, ఇటీవల మాత్రం కొన్ని నిమిషాల పాటు కరుణానిధితో భేటీ అయ్యే అవకాశం అళగిరికి వచ్చింది. అరుుతే, ఆ భేటీ గురించి ఎలాంటి వ్యాఖ్యలు సంధిం చకుండా, మౌనంగానే గోపాలపురం నుంచి ఆయన వెళ్లి పోయారు. ఈనేపథ్యంలో కొద్ది రోజులుగా కరుణానిధి అలర్జీ కారణంగా ఇంట్లోనే ఉంటూ, చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన్ను చూడడానికి ఎవ్వరికీ అనుమతి ఇవ్వడం లేదు.అరుుతే, శుక్రవారం ఉదయం అళగిరి గోపాలపురంలో ప్రత్యక్షంకావడం గమనార్హం. అన్నయ్యకు అనుమతి : ఎప్పుడొచ్చినా, ఒకింత ఆగ్రహంతో గోపాలపురం మెట్లు ఎక్కే అళగిరి, ఈ సారి ఆనందంగా ఇంట్లోకి దూసుకెళ్లడం గమనార్హం. పదకొండు గంటల సమయంలో తన సతీమణి గాంధీతో కలిసి గోపాలపురం చేరుకున్న ఆయన గంట సేపు అక్కడే ఉండడం విశేషం. అర గంట పాటు కరుణానిధితో అళగిరి భేటీ సాగినట్టు, తదుపరి తల్లి, సోదరి సెల్విలతో మాట్లాడి అళగిరి ఆ ఇంట్లో నుంచి ఆనందంగా బయటకు రావడం గమనార్హం. మీడియా చుట్టుముట్టడంతో ఆనందంగా వ్యాఖ్యల్ని వళ్లిస్తూ...తలైవర్ నల్లా ఇరుక్కురార్...నల్లా ఇరుక్కురార్ అంటూ ముందుకు సాగారు. మదురై తిరుప్పరగుండ్రం ఉప ఎన్నికల ప్రస్తావనను మీడియా తీసుకురాగా, నో కామెంట్ అన్నట్టు మౌనంగా కదిలారు. కాగా, తమ నాయకుడు గోపాలపురం నుంచి ఉత్సాహంగా బయటకు రావడంతో అళగిరి వర్గీయుల్లో ఆనందమే. ఇక, స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో తనతో పాటు చదువుకున్న మిత్రులతో అళగిరి భేటీ అయ్యారు. శని లేదా, ఆదివారం అళగిరి మళ్లీ విదేశాలకు పయనం అయ్యే అవకాశాలు ఉన్నట్టు ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. -
తలైవర్ బాగున్నారు...: అళగిరి
చెన్నై : డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన కుమారుడు, బహిష్కత డీఎంకే నేత అళగిరి తెలిపారు. గోపాలపురంలోని నివాసంలో కరుణానిధిని శుక్రవారం అళగిరి కలిశారు. తండ్రిని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తలైవర్ బాగున్నారని, ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్లు చెప్పారు. కాగా కరుణానిధి ఇటీవలి అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. అలర్జీ కావడంతో ఆయన అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు విశ్రాంతి సూచించారు. అప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్న కరుణానిధి సందర్శకులను కలవడం లేదు. కాగా తన రాజకీయ వారసుడు స్టాలిన్ అని డీఎంకే అధినేత కరుణానిధి ఇటీవల ఓ తమిళ వారపత్రికకు ఇంటర్వ్యూలో వెల్లడించారు. కరుణానిధి తర్వాత డీఎంకే ఆధిపత్యం కోసం అళగిరి, స్టాలిన్ మధ్య చాలాకాలంగా పోరు జరిగిన విషయం విదితమే. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో 2014లో డీఎంకే నుంచి అళగిరిని పార్టీ చీఫ్ కరుణానిధి బహిష్కరించారు. -
మంతనాలు
తండ్రి కరుణతో అళగిరి భేటీ తల్లిదండ్రుల పరామర్శకేనని సమాధానం పార్టీ పునఃప్రవేశమని ప్రచారం చెన్నై, సాక్షి ప్రతినిధి: డీఎంకే అధిష్టానంతో ఏర్పడిన విభేదాల కారణంగా పార్టీ నుంచి బహిష్కృతుడైన కరుణానిధి తనయుడు అళగిరి మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారాడు. తన తండ్రి కరుణానిధిని గురువారం కలుసుకోవడం ద్వారా ఎన్నికల వేళ అళగిరి ఏమి కిరి కిరికి సిద్ధమైనాడనే చర్చకు తెరలేపాడు.తన ఇద్దరు కుమారులు అళగిరి, స్టాలిన్ల మధ్య సాగుతున్న ఆధిపత్యపోరులో డీఎంకే అధినేత కరుణానిధి నలిగిపోతున్నారు. కరుణ తదనంతరం పార్టీ పగ్గాలు ఎవరికనే అంశం కరుణ కుటుంబంలో రాజకీయ చిచ్చును రగిల్చింది. పెద్ద కుమారుడైనందున తానే వారసుడినని అళగిరి, అంటిపెట్టుకుని చురుకైన రాజకీయాలు నడుపుతున్నందున తనకే పార్టీ పగ్గాలు అప్పగించాలని స్టాలిన్ పట్టుదలతో ఉన్నారు. పార్టీ దక్షిణ తమిళనాడు బాధ్యతలు నిర్వర్తిస్తున్న అళగిరి మధురైలో ఉండగా, పార్టీ కోశాధికారిగా చెన్నైలోనే నివాసం ఉంటున్న స్టాలిన్‌కు సహజంగానే కరుణానిధితో సాన్నిహిత్యం ఎక్కువ. కరుణానిధిని కలిసేందుకు వచ్చే డీఎంకే నేతలోపాటు కాంగ్రెస్ సహా ఇతర పార్టీల అతిరథమహారథులతో సైతం స్టాలిన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. కరుణానిధితో సమానంగా పరిచయాలు స్టాలిన్ వారసత్వానికి కలిసొచ్చే అంశంగా మారింది. అలాగే స్టాలిన్ స్థాయిలో సమన్వయం, సంయమనం పాటించే స్వభావం అళగిరిలో లేదు. నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయని నమ్ముతున్న కరుణానిధి పెద్ద, చిన్న కుమారులనే బేరీజు తావివ్వకుండా స్టాలిన్నే చేరదీయడం ప్రారంభించారు. ఈ పరిణామంతో పార్టీ కేడర్ దాదాపుగా స్టాలిన్ వెనుకే నడవడం ప్రారంభించింది. స్టాలిన్ ఆధిపత్యాన్ని సహించలేని అళగిరి తండ్రి కరుణతోనే కయ్యానికి కాలుదువ్వాడు. తననే వారసుడిగా ప్రకటింపజేయాలని తల్లి చేత సిఫారసు చేయించుకున్నాడు. వారసత్వ ప్రకటనలో కరుణ మౌనం అళగిరిలో అసహనాన్ని పెంచింది. పార్టీపట్ల క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరిస్తూ అదుపు తప్పినట్లుగా ప్రవర్తిస్తున్న తీరును భరించలేని కరుణానిధి రెండేళ్ల క్రితం అళగిరిపై వేటువేశారు. పార్టీ నుండి బహిష్కరించారు. ఆ తరవాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల సమయంలో డీఎంకేకు ఒక్కసీటు కూడా రాదని బహిరంగ ప్రకటనలు చేశాడు. పార్టీ అన్నా, తండ్రి కరుణానిధి అన్నా గౌరవమేనని మరో ప్రకటన చేయడం ద్వారా స్టాలిన్ అంటే మాత్రం గిట్టదని పరోక్షంగా చెప్పాడు. తండ్రిని కలిసేందుకు అళగిరి అనేక ప్రయత్నాలు చేయగా కరుణానిధి నిరాకరించారు. మళ్లీ తెరపైకి: డీఎంకే ప్రతిష్టను భ్రష్టుపట్టించడమే ధ్యేయంగా ప్రకటనలు సాగిస్తున్న అళగిరి అసెంబ్లీ ఎన్నిక ల నేపథ్యంలో అకస్మాత్తుగా కరుణానిధిని కలుసుకోవడం అందరినీ సంభ్రమాశ్చ్యర్యాలకు గురిచేసింది. గురువారం ఉదయం 11 గంటలకు గోపాలపురంలోని ఇంటికి వెళ్లి కరుణానిధిని కలుసుకున్నారు. కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఎన్నికలపైనా, సీట్ల సర్దుబాటు గురించి ఇద్దరూ మాట్లాడుకున్నట్లు ప్రచారం జరిగింది. బయటనే వేచిఉన్న మీడియా ప్రతినిధులు మళ్లీ డీఎంకేలో చేరుతున్నారా అని ప్రశ్నించగా, పెద్దాయన క్షేమ సమాచారం విచారించేందుకు మాత్రమే వచ్చానని బదులిచ్చాడు. అళగిరి మళ్లీ డీఎంకేలో చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో కరుణానిధితో భేటీ కావడం అన్నిపార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై పార్టీ అధికార ప్రతినిధి ఇళంగోవన్‌ను ప్రశ్నించగా, ఈ విషయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని సమాధానాన్ని దాటవేశారు. అళగిరి సోదరుడైన స్టాలిన్‌ను ప్రశ్నించగా, తన తల్లిదండ్రులను కలిసేందుకు వచ్చి వెళ్లాడు ఇందులో రాజకీయం ఏముంటుందని వ్యాఖ్యానించారు. గతంలో నిరాకరించిన కరుణానిధి నేడు అళగిరిని కలిసేందుకు అనుమతించడంతో ఎవరెన్ని రకాలుగా దాటవేసినా వారిద్దిరి భేటీ రాజకీయంతో కూడుకున్నదేనని విశ్వస్తున్నారు. -
డీఎంకేలోకి మళ్లీ అళగిరి?
కుటుంబీకుల ఒత్తిడి కరుణ అంగీకరించినట్టు సమాచారం కొత్త ఏడాదిలో కింగ్ మేకర్ రీ ఎంట్రీ అవకాశం చెన్నై : డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరికి మళ్లీ రీ ఎంట్రీకి మార్గం సుగమం అవుతున్నట్టుంది. ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా, ఆయన్ను మళ్లీ ఆహ్వానించేందుకు కుటుంబీకులు అధినేత ఎం కరుణానిధి మీద ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. దీంతో కొత్త ఏడాదిలో ఈ కింగ్ మేకర్ మళ్లీ రీ ఎంట్రీ కాబోతున్నట్టు డీఎంకేలో చర్చ సాగుతున్నది. డీఎంకే దక్షిణాది కింగ్‌మేకర్‌గా ఒకప్పుడు ఎంకే అళగిరి చక్రం తిప్పిన విషయం తెలిసిందే. యూపీఏ హ యాంలో ఎంపీగా, కేంద్ర కేబినెట్ లో మంత్రిగా వ్యవహరించినా తన దృష్టిని అంతా రాష్ట్రం మీదే అళగిరి కేంద్రీకరించే వారు. ప్రధానంగా దక్షిణ తమిళనాడులోని పార్టీ వర్గాలు తన చేతి నుం చి జారీ పోకుండా జాగ్రత్తలు పడ్డారు. అయితే, తన కోటలో ఆయన సోదరుడు, డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ క్రమంగా పాగా వేయడం మొదలెట్టడంతో అళగిరి బహిరంగ యుద్దానికి ది గారు. అన్నదమ్ముళ్ల మధ్య ఏళ్ల తరబడి చాప కింద నీరులా సాగుతూ వచ్చిన వారసత్వ సమరం ఈ పరిణామాలతో డీఎంకేలో పెను కలకలాన్ని సృష్టించిం దని చెప్పవచ్చు. అళగిరి తీరుపై తీవ్ర ఆగ్రహానికి లోనైన కరుణానిధి పార్టీ నుంచి బహిష్కరించారు. డీఎంకే బహిష్కృత నేతగా ముద్ర పడ్డ ఎంకే అళగిరి తదుపరి తన వేగాన్ని పెంచి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలెట్టారు. ఈ ప్రభావం లోక్ సభ ఎన్నికల్లో డిఎంకేను చావు దెబ్బ తీసిందని చెప్పవచ్చు. తదుపరి పరిణామాలతో వెనక్కి తగ్గిన అళగిరి కుటుంబంతో సన్నిహితంగా మెలిగేందుకు యత్నిం చారు. పలు మార్లు తన తండ్రి, అధినేత కరుణానిధి కలిసేందుకు యత్నించినా అనుమతి దక్కలేదు. చివరకు మౌనంగా ఉండటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చిన అళగిరి గత కొంత కాలంగా మీడియాకు దూరంగానే ఉం టూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసెం బ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న డీఎంకే , అళగిరి సేవల్ని మళ్లీ వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. తమతో దోస్తికి ప్రధాన పార్టీలు కలిసి రాని దృష్ట్యా, ఒక వేళ కాంగ్రెస్ వస్తేకలుపుకోవడం లేదా , ఒంటరిగా నైనా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు అధినేత కరుణానిధి వ్యూహ రచనలు చేసి ఉన్నారని చెప్పవచ్చు. ఈ సమయంలో అళగిరి వెన్నం టి ఉంటే, దక్షిణ తమిళనాడులో కొంత మేరకు లాభం చేకూరుతుందన్న ఆశాభావాన్ని పలువురు కరుణానిధి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఇదే విషయాన్ని కుటుంబీకులు సైతం కరుణానిధి దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తెచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కుటుంబీకులు ఒత్తిడి, తాజా పరిణామా ల్ని పరిగణలోకి తీసుకున్న కరుణానిధి అళగిరిని ఆహ్వానించేందుకు అంగీకా రం తెలిపినట్టు సమాచారం. దళపతి స్టాలిన్‌తో అంగీకరించినట్టు, చివరకు కరుఔ తుది నిర్ణయానికే కట్టుబడుతాననని తేల్చినట్టు సమాచారం. కరుణ తీసుకునే ఏ నిర్ణయాని కైనా కట్టుబడే మనస్తత్వం స్టాలిన్దని చెప్పవచ్చు. -
అళగిరి కొత్త అడుగు
చెన్నై : డీఎంకేలో మరో మారు ప్రకంపన సృష్టించే విధంగా బహిష్కృత నేత అళగిరి అడుగులు వేస్తున్నారు. రెండు నెలల్లో సరికొత్త నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్టు స్వయంగా అళగిరి వెళ్లడించడం డీఎంకేలో చర్చనీయాంశంగా మారింది. గోపాల పురంలో తనకు అనుమతి కరువు కావడంపై అళగిరి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. డీఎంకే నుంచి అధినేత ఎం కరుణానిధి తనయుడు అళగిరిని బహిష్కరించిన విషయం తెలిసిందే. మళ్లీ తనను అక్కున చేర్చుకుంటారన్న ఆశ అళగిరిలో ఉన్నా, అందుకు తగ్గ సమయం మాత్రం రావడం లేదు. అయితే, రాను రాను ఆ ఆశలు అళగిరిలో సన్నగిల్లుతున్నట్టున్నాయి. కొంత కాలంగా వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉన్న అళగిరి మళ్లీ తన విమర్శలు, ఆరోపణాస్త్రాల్ని సంధించే పనిలో పడ్డారు. ప్రధానంగా స్టాలిన్‌కు వ్యతిరేకంగా మళ్లీ విరుచుకు పడే పనిలో పడ్డారు. హాంకాంగ్‌కు వెళ్లే సమయంలో గత వారం స్టాలిన్‌పై తీవ్రంగా స్పందించిన అళగిరి అక్కడి నుంచి మంగళవారం చెన్నై చేరుకోగానే సంచనల వ్యాఖ్య చేసి మదురైకు చెక్కేశారు. అనుమతి కరువు : పార్టీ నుంచి బహిష్కరించినా యథా ప్రకారం తరచూ చెన్నైకు వచ్చినప్పుడల్లా గోపాల పురంకు అళగిరి వెళ్తూ వచ్చారు. అయితే, ఆయనకు అధినేత, తండ్రి కరుణానిధి ప్రసన్నం మాత్రం దక్కడం లేదని చెప్పవచ్చు. దీంతో తన తల్లి దయాళు అమ్మాల్‌తో మాట్లాడటం, తన ఆవేదనను వెల్గక్కడం మదురైకు వెళ్లి పోవడం చేస్తూ వచ్చారు. అయితే, విదేశాల నుంచి చెన్నైకు వచ్చిన అళగిరి తనకు ఏదైనా శుభవార్త దక్కుతుందని ఎదురు చూసి భంగ పడక తప్పలేదు. తన తల్లి దయాళు అమ్మాల్‌ను కలుసుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. కరుణానిధి అనుమతి కూడా దక్కక పోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనట్టున్నారు. మదురై వెళ్తూ చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో కొత్త అడుగు వేయబోతున్నట్టు ప్రకటించి విమానం ఎక్కేయడం గమనార్హం. రెండు నెలల్లో : అళగిరి విమానాశ్రయానికి రావడంతో మీడియా ఆయన్ను చుట్టుముట్టింది. తన తల్లిదండ్రుల్ని కలిసేందుకు వచ్చానని, వీలు పడక పోవడంతో తిరిగీ వెళ్తున్నట్టు పేర్కొన్నారు. స్టాలిన్‌ను ఉద్దేశించి చాలా వ్యాఖ్యలు చేశానని, అందులో ఎలాంటి మార్పులేదన్నారు. డీఎంకే అంటే కరుణానిధి, కరుణానిధి అంటే డిఎంకే మాత్రమేనని స్పష్టం చేశారు. ఆయన స్థానంలో మరొకర్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. రెండు నెలల్లో కొత్త నిర్ణయం, ప్రకటన వెలువరిస్తానని అంత వరకు వేచి ఉండంటూ, భద్రతా సిబ్బంది సాయంతో మీడియాను దాటుకుంటూ మదురైకు చెక్కేశారు. అయితే, రెండు నెలల్లో అళగిరి ఏ నిర్ణయం వెల్లడించబోతున్నారు. ఆయన చేయబోయే ప్రకటన ఏమిటీ..? ఎలాంటి ప్రకటన వెలువడుతుందోనన్న చర్చ డీఎంకేలో బయలు దేరి ఉన్నది. అదే సమయంలో స్టాలిన్ వ్యతిరేక శక్తులు మళ్లీ అళగిరి పక్షాన చేరి, పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా వ్యవహరిస్తారా.? అన్న ప్రశ్న బయలు దేరింది. ఇందుకు ఉదాహరణగా లోక్ సభ ఎన్నికల సమయంలో అళగిరి వ్యవహరించిన తీరు ఓ నిదర్శనం. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అళగిరి రెండు నెలల తర్వాత ప్రకటన ఎలా ఉంటుందోనన్నది వేచి చూడాల్సిందే. -
అన్నయ్య కోసం!
పెద్దన్నయ్య అళగిరిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించాలని తండ్రి కరుణానిధిపై ఒత్తిడి తెచ్చేపనిలో గారాల పట్టి కనిమొళి నిమగ్నమయ్యారు. ఈ విషయంపై ఆమె గంటకు పైగా తన తండ్రితో భేటీ అయినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. దక్షిణ తమిళనాడులో పార్టీ బలపడాలంటే అన్నయ్య ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాల్సిం దేనని ఆమె ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఇప్పుడు డీఎంకేలో దీనిపైనే చర్చసాగుతున్నట్టు తెలుస్తోంది. చెన్నై : డీఎంకేలో అన్నదమ్ములు అళగిరి, స్టాలిన్ మధ్య సాగుతున్న సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిస్థితుల్ని చక్కదిద్దే పనిలోపడ్డ అధినేత కరుణానిధి మళ్లీ అళగిరిని పార్టీలోకి ఆహ్వానించే విధంగా ప్రయత్నాల్లో బిజీ అయ్యారు. అళగిరితో సాగిన రాయబారాలు బెడిసికొట్టడంతో ఆయన్ను మళ్లీ ఆహ్వానించాలా? అన్న సందిగ్దతలో డీఎంకే శ్రేణులు పడ్డాయి. ఇందుకు అద్దంపట్టే రీతిలో రెండు రోజుల క్రితం అళగిరి డీఎంకే అధిష్టానంపై విరుచుకుపడ్డారు. స్టాలిన్‌పై విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు అళగిరికి, పార్టీకి మధ్య మరింత ఆగాదాన్ని సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. పార్టీలోకి అళగిరిని మళ్లీ ఆహ్వానించబోమన్న స్పష్టమైన హామీని కరుణానిధి నుంచి స్టాలిన్ తీసుకున్నట్టుగా, అందుకే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి తరపున సీఎం అభ్యర్థి కరుణానిధి ఉంటారన్న వ్యాఖ్యను స్టాలిన్ చేసినట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. అళగిరిని పార్టీలోకి ఆహ్వానిస్తే, ఎక్కడ స్టాలిన్ అలక వహిస్తాడోనన్న ఆందోళనలోపడ్డ కరుణానిధి ఆ ప్రయత్నాల్ని విరమించుకునేందుకు సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెద్దన్నయ్యకు అండగా నిలబడేందుకు కరుణ గారాల పట్టి కనిమొళి సిద్ధమైనట్టు ఉన్నారు. కరుణానిధిని బుజ్జగిం చేందుకు అన్నయ్య తరపున రాయబారం సాగించేందుకు రెడీ అయ్యారన్న ప్రచారం డీఎంకేలో సాగుతోంది. ‘కని’ రాయబారం ఎప్పుడూ కనిమొళి ఇంటిమెట్లు ఎక్కని అళగిరి పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత తొలిసారిగా అడుగు పెట్టారని చెప్పవచ్చు. తన ఆవేదనను అంతా చెల్లెమ్మ వద్ద అళగిరి ఇటీవల వెళ్లగక్కారు. మదురైకు వెళ్లిన సందర్భంలో అన్నయ్యన్ను కనిమొళి ఓదార్చిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో అళగిరి ఎక్కడ శాశ్వతంగా పార్టీకి దూరమవుతారోనన్న ఆందోళనలో పడ్డ కనిమొళి, మళ్లీ ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతల్ని తన భుజాన వేసుకుని ఉన్నారన్న ప్రచారం డీఎంకేలో జోరందుకుంది. కరుణానిధితో ఈ విషయంగా గంటకు పైగా కనిమొళి భేటీ అయినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. దక్షిణ తమిళనాడులో పార్టీ బలపడాలంటే అన్నయ్యను పార్టీలోకి ఆహ్వానించాల్సిందేనని ఆమె ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అన్నయ్య మళ్లీ పార్టీలోకి రాక కోసం కొన్ని పార్టీలు సైతం ఎదురు చూస్తున్నాయన్న విషయాన్ని కరుణ దృష్టికి తీసుకెళ్లినట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. కరుణానిధి సీఎం అన్న ప్రకటనను స్వయంగా చిన్నన్నయ్య స్టాలిన్ చేయబట్టే, అదే రోజు ఎండీఎంకే నేత వైగో మిత్రులతో కూటమికి రెడీ అన్న సంకేతాన్ని పంపించారన్న విషయాన్ని గుర్తెరగాలని ఆమె సూచించినట్టుగా ప్రచారం సాగుతోంది. ఎండీఎంకే నేతలతో పాటు దక్షిణ తమిళనాడులో బలంగా ఉన్న నాడార్లు, ఉత్తర తమిళనాడులో బలంగా ఉన్న వన్నియర్లు, సెంట్రల్ తమిళనాడులోని ముత్తయ్యార్ సామాజిక వర్గాల నాయకులు డీఎంకే వైపు చూస్తున్నారన్న విషయాన్ని వివరించి ఉన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ఆ వర్గాలకు న్యాయం చేకూర్చే రీతిలో నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పెద్దన్నయ్యను మళ్లీ ఆహ్వానించాలని కరుణానిధిపై కనిమొళి ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. తనకు కనిమొళి గారాల పట్టి కావడంతో అళగిరిమీద ఉన్న కోపాన్ని కరుణానిధి దిగమింగి, ఎన్నికలు సమీపించనీ.. చూద్దామన్న హామీని ఆమెకు ఇచ్చినట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. -
అళగిరి రివర్స్ గేర్
పార్టీలోకి మళ్లీ ఆహ్వానించేందుకు ఓ వైపు కసరత్తులు జరుగుతుంటే, మరో వైపు రివర్స్ గేర్ వేస్తూ అధిష్టానంపై అళగిరి సంచలన వ్యాఖ్యలు చేయడం డీఎంకేలో మళ్లీ చర్చకు తెర లేపింది. డీఎంకేతో సామరస్యం ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఏ అర్హతలున్నాయని నాయకత్వానికి స్టాలిన్ పాకులాడుతున్నారని విమర్శలు గుప్పించారు. కరుణానిధిని కలిసేప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సాక్షి, చెన్నై:డీఎంకేలో సాగుతున్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, లోక్‌సభ ఎన్నికలు నేర్పిన గుణపాఠంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోపు పార్టీలో సమూల మార్పుల లక్ష్యంగా అధినేత కరుణానిధి కుస్తీలు పడుతున్నారు. పార్టీలో సాగుతున్న వివాదాలకు ముగింపు పలికే విధంగా కొరడా ఝుళిపించే పనిలో పడ్డారు. ఇందులో ప్రధాన అంశంగా ఉన్న అళగిరి ఎపిసోడ్‌కు శుభం కార్డు వేయడానికి పావులు కదుపుతున్నారు. బహిష్కరణకు గురైన పెద్దకుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అళగిరిని మళ్లీ పార్టీలోకి రప్పించే విధంగా రాయబారాలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా అధిష్టానం ముందు అళగిరి కొన్ని డిమాండ్లు ఉంచారు. అలాగే, సోదరుడు, పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దన్న సూచనను దూతలు అళగిరి ముందు ఉంచారు. అన్నీ సజావుగా సాగుతున్న సమయంలో అళగిరి సంచలన వ్యాఖ్యలు చేయడం డీఎంకే వర్గాల్ని విస్మయంలో పడేశాయి. స్టాలిన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఈ వ్యాఖ్యల వెనుక తన డిమాండ్లకు డీఎంకే అధిష్టానం దిగి రాలేదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఏ అర్హతలున్నాయ్...: బుధవారం అళగిరి మీడియాతో మాట్లాడారు. మీడియా సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, అటు అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తూనే, ఇటు స్టాలిన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డీఎంకేలో కరుణానిధిని తప్ప మరెవ్వరినీ అధి నాయకుడిగా ఏ కార్యకర్త అంగీకరించడని పేర్కొన్నారు. ఏ అర్హతలున్నాయని స్టాలిన్ నాయకత్వం కోసం వెంపర్లాడుతున్నాడో అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు. కరుణానిధి నాయకత్వంలో డీఎంకే 2016లో అధికార పగ్గాలు చేపట్టడం ఖాయం అన్న విషయాన్ని ప్రతి నాయకుడు, కార్యకర్త చెబుతూ వస్తున్నారని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని మళ్లీ పార్టీ సమావేశంలో స్టాలిన్ గుర్తు చేశారేగానీ, కొత్తగా ఆయన చెప్పిందేమీ లేదని మండిపడ్డారు. ఎలాంటి అర్హతలు లేని స్టాలిన్ నాయకత్వాన్ని పార్టీలో ఏ ఒక్కరూ అంగీకరించే ప్రసక్తే లేదని శివాలెత్తారు. తాను మాత్రం డీఎంకేతో ఎట్టి పరిస్థితుల్లో సామరస్యానికి వెళ్లదలచుకోలేదని స్పష్టం చే శారు. తన డిమాండ్లను డీఎంకే అధిష్టానం ముందు ఉంచానని, వాటిని నెరవేర్చాల్సింది వాళ్లే అంటూ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సామరస్యం ప్రసక్తే లేదని, ఎవరొచ్చినా, తన నిర్ణయం ఇదేనని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కరుణానిధిని కూడా కలిసేది లేదని స్పష్టం చేశారు. డీఎంకే సంస్థాగత ఎన్నికలన్నీ బోగస్‌గా తేల్చారు. నిజమైన కార్యకర్తలకు పదవులు దక్కలేదని, కొత్తగా వచ్చిన వాళ్లకు, ధన బలం ఉన్న వాళ్లకే సంస్థాగత ఎన్నికల్లో పదవులు దక్కాయని ఆరోపించారు. పార్టీలో నిజమైన సేవకులకు చోటు లేదని, నిజాయితీగా వ్యవహరిస్తే, క్రమ శిక్షణవేటు వేస్తున్నారని మండి పడ్డారు. తన కోసం నిలబడిన వారు ఎందరో డీఎంకే బాధితులుగా మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. అళగిరి తాజా వ్యాఖ్యలతో డీఎంకేలో మళ్లీ ప్రకంపన బయలు దేరినట్టే. ప్రక్షాళన వేళ మరో శిరోభారం నెత్తికెక్కడంతో అధినేత కరుణానిధి ఎలా వ్యవహరించనున్నారో వేచి చూడాల్సిందే.