Alliance Party
-
ప్రత్యేక హోదా.. చంద్రబాబు సైలెంట్..
-
మహా కూటమిలో ‘ముఖ్య’ విభేదాలు
ముఖ్యమంత్రి అభ్యర్థి, సీట్ల పంపకం అంశాల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో విభేదాలు కనిపిస్తున్నాయి. రానున్న మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ఎన్సీపీ, శివసేన–ఉద్ధవ్ గ్రూపు, కాంగ్రెస్ ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. వీటి మధ్య విస్తృత అవగాహన ఏమిటంటే, మొత్తం 288 స్థానాలకు గానూ తలా 95 స్థానాల్లో పోటీ చేయాలనేది! కానీ ఉద్ధవ్ పార్టీ 150 సీట్లలో వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఎంవీఏ ముఖ్యమంత్రి ముఖం ఉద్ధవ్ అని ఆయన గ్రూపు ప్రతినిధి వ్యాఖ్యానించడమూ, అలాంటి ముఖం ఏదీ లేదని శరద్ పవార్ అనడమూ, మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేను ముఖ్యమంత్రి ముఖంగా చెబుతూ పోస్టర్లు వెలియడమూ కూటమి మధ్య జరగనున్న ఘర్షణను సంకేతిస్తున్నాయి.ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సభ్యులు సాధించిన అధిక ఓట్ల శాతం, మహారాష్ట్రలో ప్రతిపక్షాల చేతిలో తుపాకి గుండులా పనిచేసింది. అది వారికి ఎంత విశ్వాసాన్ని కలిగించిందంటే, కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనే అంశం గురించి, రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పోటీ గురించి అనేక అంశాలపై పరస్పరం వివాదాలకు దిగుతూ కనిపిస్తున్నారు. ఎంఏవీ భాగస్వాములు ఇటీవల ముంబైలో మీడియా ముందు ఐక్యతా ముఖాన్ని ప్రదర్శించి ఉండవచ్చు; కానీ కొంతమంది నాయకులు ఇప్పుడు ముంబై వంటి ముఖ్య నగరాల్లోని కీలక నియోజకవర్గాలపై కూటమి అభ్యర్థుల మధ్య విభేదాలు ఎలా ఉన్నాయో వివరిస్తున్నారు.‘ముఖ్యమంత్రి ముఖం’ ఎవరు?విధాన్ భవన్లో ఈ మంగళవారం కూటమిలో పగుళ్లు స్పష్టంగా కనిపించాయి. అక్కడ ఉద్ధవ్ ఠాకరేకు చెందిన శివసేన పార్టీ, ఆకస్మికంగా పార్టీ కార్యదర్శి మిలింద్ నార్వేకర్‌ను జూలై 12 నాటి ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయమని కోరింది. అసెంబ్లీలో బలాబలాల ప్రకారం చూస్తే మహా వికాస్ అఘాడీకి కేవలం రెండు సీట్ల కోటా మాత్రమే ఉంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఈ కోటాలో ఒక సీటును ‘పీజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ (పీడబ్ల్యూపీ)కి ఇవ్వాలని అనుకున్నారు. అయితే, ఉద్ధవ్ 12వ తేదీన పోటీని అనివార్యం చేస్తూ తన సొంత అభ్యర్థి ఎంపికతో ముందుకు సాగారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కూడా పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లీ నియోజక వర్గంలో ఉద్ధవ్ తన పార్టీ పోటీ చేస్తుందని పట్టుబట్టారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన మల్లయోధుడు చంద్రహర్ పాటిల్‌కు ఉద్ధవ్ పార్టీ టిక్కెట్ ఇచ్చారు. కానీ అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ నేత విశాల్ పాటిల్ మంచి ఆధిక్యతతో గెలుపొందారు.రాష్ట్రంలోని 150కి పైగా నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితిని అంచనా వేయాలని ఉద్ధవ్ కోరినట్లు శివసేన–ఉద్ధవ్ గ్రూపు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ముంబయిలో జరిగిన కూటమి సమావేశంలో మహావికాస్ అఘాడిలోని ముూడు భాగస్వాములు ఒక్కొక్కటీ 95 స్థానాల్లో పోటీ చేస్తాయని విస్తృత అవగాహన ఉన్నప్పటికీ, శివసేన–ఉద్ధవ్ గ్రూపు 150 నియోజకవర్గాల్లో ఎందుకు సర్వే చేస్తోందని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. గత వారం శివసేన ఫైర్ బ్రాండ్ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రి పదవికి కూటమి తరపు అభ్యర్థిగా ఉంటారని ప్రకటించారు. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ వెంటనే, తమ కూటమిలో సీఎం అభ్యర్థిని ముందుగానే నిర్ణయించబోమని స్పష్టతనిచ్చారు. ‘‘మేము కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీల ఉమ్మడి బలంతో ఎన్నికల్లో పోరాడతాం. మా అందరికీ ఉమ్మడి బాధ్యత ఉంది. ప్రస్తుతానికి సీఎం ముఖం అంటూ ఏమీ లేదు’’ అని శరద్ పవార్ పుణెలో మీడియాతో అన్నారు. ఈ ‘సీఎం ఫేస్’ విషయంపై భిన్నాభిప్రాయాలు చాలా స్పష్టంగా కనిపించాయి. అయితే శరద్ పవార్ కూటమిలో విభేదాలు లేవని చెప్పడమే కాకుండా, ప్రతి విషయంపైనా కూటమి భాగస్వాముల మధ్య సమన్వయం ఉందని అన్నారు.ఎవరు ఎక్కడ?అలాగే కాంగ్రెస్ పార్టీ, శివసేన– ఉద్ధవ్ ఠాకరే గ్రూపు మధ్య కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) లేదా ఎంఎంఆర్ లోని నియోజకవర్గాలకు సంబంధించినవి. ముంబై ఎంఎంఆర్ ప్రాంతంలో తమ ఉనికిని నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా, ఉద్ధవ్ ఇప్పుడు తనకు గరిష్ఠంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ సీట్లు కావాలని పట్టుబట్టారు. ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. గతంలో పార్టీకి కంచుకోటగా ఉన్న నార్త్ సెంట్రల్, నార్త్ వెస్ట్‌లలో తమ స్థావరాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కూటమి భాగస్వాముల మధ్య విస్తృత అవగాహన ఏమిటంటే, శివసేన–ఉద్ధవ్ గ్రూప్ కొంకణ్, థానే, మరాఠ్వాడా ప్రాంతంలో గరిష్ఠ స్థానాలు తీసుకోవాలి; కాంగ్రెస్ పార్టీ విదర్భ ప్రాంతంలో గరిష్ఠ స్థానాలు తీసుకోవాలి; ఇకపోతే, శరద్ పవార్ ఎన్సీపీ పశ్చిమ మహారాష్ట్రపై దృష్టి పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలేకు చెందిన విదర్భ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. అలాగే పశ్చిమ మహారాష్ట్రలోని పుణె, సాంగ్లీ జిల్లాల్లో కూడా పార్టీ క్షేత్రస్థాయి కార్యాచరణను మొదలుపెట్టింది.లోక్‌సభ ఎన్నికల సమయంలో సాంగ్లీలో ఏమి జరిగిందో పునరావృతం కాకుండా పశ్చిమ మహారాష్ట్రలో కచ్చితమైన సీట్ల పంపకం గురించి తమ పార్టీ, శివసేన ఉద్ధవ్ ఠాకరే గ్రూపుతో తెర వెనుక కమ్యూనికేషన్ ను ప్రారంభించిందని శరద్ పవార్–ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలోని మూడు భాగస్వామ్య పార్టీలూ కెమెరా ముందు పరస్పరం వ్యతిరేక వ్యాఖ్యలకు దూరంగా ఉన్నప్పటికీ, సీట్ల పంపకాల చర్చల కోసం కూర్చున్నప్పుడు కొంత ఘర్షణ జరిగే అవకాశం ఉందని లోపలి వ్యక్తులు అంటున్నారు. కూటమి వర్గాల అభిప్రాయం ప్రకారం, ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన సాధారణ సూత్రం ఏమిటంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మెజారిటీని పొందినట్లయితే, అసెంబ్లీలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుందో ఆ పార్టీ ముఖ్యమంత్రి స్థానాన్ని ఆశిస్తుంది. విదర్భలో కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలేను తదుపరి ముఖ్యమంత్రిగా చిత్రీకరిస్తూ పోస్టర్లు వేశారు. కాబట్టి, ‘కాబోయే ముఖ్యమంత్రి ముఖం’ అనే సమస్య కూటమి భాగస్వాములలో కొన్ని చీలికలను, ఒత్తిడిని కలిగిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. రోహిత్ చందావర్కర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
Lok Sabha Election 2024: ఆమ్ ఆద్మీకి 10 గ్యారంటీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ‘కేజ్రీవాల్ కీ గ్యారంటీ’ పేరిట దేశ ప్రజలకు 10 హామీలు ఇచ్చారు. కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి రాగానే ఈ హామీలు అమలు చేస్తామని ప్రకటించారు. మోదీ కీ గ్యారంటీ కావాలో, కేజ్రీవాల్ కీ గ్యారంటీ కావాలో దేశ ప్రజలు తేల్చుకోవాలని చెప్పారు. కేజ్రీవాల్ కీ గ్యారంటీ అంటే ఒక బ్రాండ్ అని స్పష్టం చేశారు. ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తాను ఇచి్చన హమీలన్నీ దేశాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించినవేనని తెలిపారు. రానున్న ఐదేళ్ల కాలంలో ఈ పది హామీల అమలును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. తాను ఇస్తున్న పది హామీలపై ‘ఇండియా’ కూటమిలోని భాగస్వామ్యపక్షాలతో చర్చించలేదని అన్నారు. ఈ హామీలను నెరవేర్చేలా కూటమిలోని పారీ్టలను ఒప్పిస్తానని కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీ ప్రజలకు తాను గ్యారంటీలన్నీ అమలు చేశానని, మోదీ కీ గ్యారంటీ మాత్రం అమలు కాలేదని విమర్శించారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానంటూ మోదీ ఇచి్చన హామీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. హామీలు ఇవే...1. పేదలకు ఉచిత విద్యుత్ దేశవ్యాప్తంగా నిత్యం 24 గంటలపాటు కరెంటు సరఫరా చేస్తాం. ఎక్కడా కరెంటు కోతలు ఉండవు. దేశంలోని పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. 2. నాణ్యమైన విద్య ప్రతి గ్రామంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ అద్భుతమైన ప్రభుత్వ పాఠశాలలు నిర్మిస్తాం. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకూ నాణ్యమైన విద్య ఉచితంగా విద్య అందిస్తాం. 3. ఉచితంగా చికిత్స ప్రతి గ్రామంలో మొహల్లా క్లినిక్ నిర్మిస్తాం. ప్రతి జిల్లాలో అద్భుతమైన ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మిస్తాం. దేశంలోని ప్రతి వ్యక్తికీ మెరుగైన చికిత్స ఉచిత అందిస్తాం.4. చైనా ఆక్రమించిన భూమి స్వా«దీనం డ్రాగన్ దేశం చైనా ఆక్రమించిన మన దేశ భూమిని తిరిగి స్వా«దీనం చేసుకుంటాం. ఈ విషయంలో అవసరమైన చర్యలు చేపట్టేందుకు మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తాం. 5. అగి్నవీర్ యోజన నిలిపివేత అగి్నవీర్ పథకాన్ని నిలిపివేస్తాం. అన్నిరకాల సైనిక నియామకాలు పూర్వ విధానంలోనే జరుగుతాయి. ఇప్పటివరకు అగ్నివీర్ పథకంలో రిక్రూట్ అయిన అగి్నవీరులందరినీ పర్మినెంట్ చేస్తాం. 6. పంటలకు కనీస మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) ఖరారు చేస్తాం. రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తాం. 7. ఢిల్లీకి రాష్ట్ర హోదా ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తాం. 8. యువతకు ఉద్యోగాలు నిరుద్యోగాన్ని క్రమపద్ధతిలో తొలగించేలా చర్యలు తీసుకుంటాం. యువతకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కలి్పస్తాం.9. అవినీతి నుంచి విముక్తి నిజాయితీపరులను జైలుకు పంపించి, అవినీతిపరులను రక్షించే బలమైన వ్యవస్థను బీజేపీ సృష్టించింది. ఈ వ్యవస్థను రద్దు చేస్తాం. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల తరహాలో అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బీజేపీ వాషింగ్ మెషీన్‌ను ప్రజల సక్షమంలోనే బద్ధలు కొడతాం. 10. స్వేచ్ఛా వాణిజ్యం వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ను సరళతరం చేస్తాం. వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తాం. బీజేపీ కుట్ర విఫలం తాను అరెస్టయిన తర్వాత ఢిల్లీ, పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ కుట్ర పన్నిందని కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ కుట్ర విఫలమైందని చెప్పారు. తన అరెస్టు తర్వాత ఆప్ మరింత ఐక్యంగా మారిందని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల వ్యూహాలపై వారితో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ‘ఆప్’ను గెలిపిస్తే నేను జైలుకెళ్లను కేజ్రీవాల్ ఆదివారం ఢిల్లీలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తే తాను జైలుకు వెళ్లబోనని తెలిపారు. చీపురు గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రజల బాగు కోసం పనిచేసినందుకే తనను జైలుకు పంపించారని విమర్శించారు. ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం బీజేపీకి నచ్చలేదన్నారు. తాను మళ్లీ జైలుకు వెళితే ఢిల్లీలో అభివృద్ధి నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికే భగవంతుడు తనను జైలు నుంచి బయటకు రప్పించాడని ప్రజలు చెబుతున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యనించారు. -
‘ఇండియా’ కూటమి బహిరంగ సభ వాయిదా
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అక్టోబర్‌లో నిర్వహించ తలపెట్టిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ వాయిదా పడింది. మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ శనివారం ఈ విషయం ప్రకటించారు. బహిరంగ సభ ఎప్పుడు నిర్వహించాలన్నది ఇంకా నిర్ణయించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా చెప్పారు. భోపాల్‌లో ఉమ్మడిగా భారీ సభ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని ఇండియా కూటమి పక్షాలు ఇటీవలే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. -
ఇండియా కూటమి హిందూ వ్యతిరేకి
న్యూఢిల్లీ: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు ప్రతిపక్ష ఇండియా కూటమిపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ఇండియా కూటమి నేతల సమావేశం హిందూమతమే లక్ష్యంగా జరిగిందని ఆరోపించారు. అయితే, తాము అన్ని మతాలను, ప్రతి ఒక్కరి విశ్వాసాలను గౌరవిస్తామని, అదేసమయంలో ఇతరులకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుందని కాంగ్రెస్ పేర్కొంది. మనుషుల్ని సమానంగా చూడలేని మతం మతమే కాదని కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు. అటువంటి మతం రోగంతో సమానమన్నారు. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్ సింగ్ మాత్రం ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించారు. దేశంలోని కోట్లాదిమంది ఆచరించే సనాతనధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధం, అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన రాజకీయ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని కరణ్ సింగ్ అన్నారు. క్షమాపణ చెప్పాలి ఉదయనిధి వ్యాఖ్యలపై ఇండియా కూటమి నేతలు సోనియాగాంధీ, రాహుల్, అశోక్ గెహ్లాట్ తదితరులు మౌనంగా ఎందుకున్నారని బీజేపీ ప్రశ్నించింది. ఆ కూటమి హిందూ మతానికి వ్యతిరేకమని ఆరోపించింది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి,అనురాగ్ ఠాకూర్ ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించారు. ఇండియా కూటమి నేతలు క్షమాపణ చెప్పకుంటే దేశం వారిని క్షమించబోదన్నారు హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఉదయనిధిపై ముజఫర్‌పూర్‌కు చెందిన లాయర్ సుధీర్ కుమార్ ఓఝా కోర్టులో పిటిషన్ వేశారు. -
బెంగళూరులో ఇండియా 'కలిసి ఓడిస్తాం'!
బెంగళూరు: 26 విపక్ష పార్టీలు సమైక్యంగా 2024 లోక్‌సభ ఎన్నికల సమరనాదం చేశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఓడించడమే ఏకైక లక్ష్యంగా ఒక్క తాటిపైకి వచ్చాయి. ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్) పేరుతో కొత్త కూటమిగా ఆవిర్భవించాయి. సమైక్యతా ప్రయత్నాల్లో భాగంగా సోమవారం బెంగళూరులో మొదలైన విపక్షాల రెండు రోజుల భేటీ మంగళవారం సాయంత్రం ముగిసింది. కాంగ్రెస్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే తదితర 26 పార్టీల అధినేతలు, అగ్ర నేతలు పలు అంశాలపై నాలుగు గంటల పాటు కూలంకషంగా చర్చించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు సోనియా గాందీ, రాహుల్‌గాందీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం, బిహార్ సీఎం నితీశ్‌కుమార్, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్, ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కర్టీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితర దిగ్గజాలంతా భేటీలో పాల్గొన్నారు. విపక్ష కూటమికి ఇండియాగా నామకరణం చేశారు. కూటమి భాగస్వాముల మధ్య సమన్వయం, సహకారం తదితరాల సాధనకు 11 మంది సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. ముంబై భేటీలో కీలక నిర్ణయాలు: ఖర్గే ముంబైలో జరగబోయే విపక్షాల తర్వాతి భేటీలో కమిటీ కన్వీనర్ ఎంపికతో పాటు పలు ఇతర కీలక నిర్ణయాలుంటాయని ఖర్గే తెలిపారు. కూటమికి ఇండియాగా నామకరణం చేసినట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ సందర్భంగా వెల్లడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలసికట్టుగా పోరాడి ఘనవిజయం సాధించి తీరతామని ధీమా వెలిబుచ్చారు. విపక్షాలన్నా, తాజాగా పురుడు పోసుకున్న 26 విపక్షాల కూటమి అన్నా మోదీకి భయం పట్టుకుందని ఖర్గే ఎద్దేవా చేశారు. అయితే కూటమి సారథి ఎవరన్న ప్రశ్నకు మాత్రం ఖర్గే నేరుగా బదులివ్వలేదు. కాంగ్రెస్‌కు అధికారంపై గానీ, ప్రధాని పదవిపై గానీ ఆసక్తి లేదని చెప్పారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. అందుకే కూటమిలో పలు పక్షాల మధ్య భేదాభిప్రాయాలున్నా విస్తృత ప్రయోజనాల కోసం, దేశ శ్రేయస్సు కోసం వాటన్నింటినీ పక్కన పెట్టి ఒక్కతాటిపైకి వచ్చామని చెప్పుకొచ్చారు. భేటీ అనంతరం ఖర్గే సహా విపక్షాల నేతలంతా సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. సోమవారం భేటీలో పాల్గొనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో పాటు ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. రాహుల్ మా ఫేవరెట్ దీదీ ఆసక్తికర వ్యాఖ్యలు ఇండియా కూటమిని సవాలు చేసే దమ్ము బీజేపీకి ఉందా అని మీడియాతో మాట్లాడుతూ మమత నిలదీశారు. ‘‘మా మాతృభూమి అంటే మాకు ప్రాణం. మేం దేశభక్తులం. మేం రైతులం, దళితులం. మేం మా దేశం కోసం, ప్రపంచం కోసం పాటుపడేవాళ్లం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్న పని ఒక్కటే. ప్రభుత్వాలను కొనడం, అమ్మడం!’’ అంటూ విరుచుకుపడ్డారు. ‘‘ఇండియా నెగ్గుతుంది. మన దేశం నెగ్గుతుంది. బీజేపీ ఓడుతుంది’’ అని జోస్యం చెప్పారు. ‘‘నేటి సంయుక్త డిక్లరేషన్ ద్వారా పాలక ఎన్డీఏ కూటమిపై మా విపక్ష కూటమి 420 సెక్షన్ విధిస్తోంది’’ అని ప్రకటించారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 420 మోసానికి సంబంధించిన కేసులకు వర్తిస్తుంది. రాహుల్ గాంధీ తమ ఫేవరెట్ అంటూ దీదీ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్య చేశారు. మీడియా సమావేశంలో పాల్గొన్న నేతలందరినీ పలకరించే క్రమంలో ఆమె చేసిన ఈ కామెంట్ పలు రకాల చర్చలకు దారి తీసింది. ఎవరేమన్నారంటే... 1. ‘‘మేం మా కుటుంబాల ప్రయోజనాల కోసమే పోరాడుతున్నామని కొందరంటున్నారు. కానీ వాళ్లు తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేశమే మా కుటుంబం. ఆ కుటుంబం కోసమే మేం పోరాడుతున్నాం. మా పోరు ఒక వ్యక్తిపై కాదు. ఒక నియంతృత్వ పోకడపై. ఈ నియంతృత్వాన్ని చూసి దేశ ప్రజలు భయపడుతున్నారు. మై హూ నా (నేనున్నా) అని ఒక హిందీ సినిమా వచ్చింది. మేం కూడా హమ్ హై నా (మేమున్నాం) అని ప్రజలకు భరోసా ఇవ్వదలచాం’’ – మోదీపై ఉద్ధవ్ ఠాక్రే (శివసేన–యూబీటీ) విసుర్లు 2. ‘‘గత తొమ్మిదేళ్లలో దేశం కోసం ఎంతో చూసే గొప్ప అవకాశం ప్రధాని మోదీకి దక్కింది. కానీ ఏ రంగంలోనూ ఏమాత్రమూ అభివృద్ధి జరగలేదు’’ అరవింద్ కేజ్రీవాల్ 3. 2024లో నూతన భారత ఆవిర్భావం ‘‘దేశంలో నియంతృత్వం సాగుతోంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం సంక్షోభంలో పడ్డాయి. కానీ 2024లో సరికొత్త భారత్ ఆవిర్భవించడం ఖాయం. జూన్‌లో జరిగిన పట్నా భేటీలో 15 పార్టీలుగా ఉన్న విపక్ష కూటమి బలం బెంగళూరు భేటీ నాటికి 26 పార్టీలకు విస్తరించడం రాబోయే మార్పుకు ప్రబల సంకేతం. దేశాన్ని ఎవరు పాలించకూడదు అన్నదాని మీదే ప్రధానంగా మా చర్చలు జరుగుతున్నాయి. ఈ కూటమిపై దేశ ప్రజలకు ఎన్నో ఆశలున్నాయి. వాటిని నెరవేర్చి తీరతాం’’ – తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్ ‘ఇండియా’ కూటమిలోని 26 పార్టీలు... కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, జేడీ(యూ), సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్సీపీ (శరద్ పవార్), సీపీఎం, సీపీఐ, శివసేన (యూబీటీ), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆరెల్డీ, ఎండీఎంకే, కేఎండీకే, వీసీకే, ఆరెస్పీ, సీపీఐ–ఎంఎల్ (లిబరేషన్), ఫార్వర్డ్ బ్లాక్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి), అప్నాదళ్ (కమెరవాదీ), ఎంఎంకే లోక్‌సభలో బలాబలాలు ఎన్డీఏ కూటమి – 330పై చిలుకు ఎంపీలు 26 విపక్షల ‘ఇండియా’ కూటమి – 150 మంది ఎంపీలు (విపక్ష కూటమిలోని పార్టీలు ఢిల్లీలోనూ, మరో 10 రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్నాయి) దీదీ పెట్టిన పేరు! విపక్ష కూటమికి ఇండియా అన్న పేరు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సూచించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాని పూర్తి పేరు ఎలా ఉంటే బాగుంటుందని నేతలంతా లోతుగా చర్చించినట్టు చెబుతున్నారు. -
విపక్ష కూటమి తథ్యం: అఖిలేశ్
ఇండోర్: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని సమైక్యంగా ఎదుర్కొనేందుకు విపక్షాల కూటమి సాకారమవుతుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆశాభావం వెలిబుచ్చారు. ఇప్పటికే కేసీఆర్, మమతా బెనర్జీ, నితీశ్‌కుమార్ వంటి ముఖ్యమంత్రులు ఇందుకు ప్రయత్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ‘‘విపక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో వాటికి దన్నుగా నిలిచేందుకు కాంగ్రెస్ ముందుకు రావాలని శుక్రవారం పిలుపునిచ్చారు. తద్వారా విపక్ష కూటమి బలోపేతానికి ఊతమిచ్చినట్టు అవుతుందన్నారు. తప్పుడు ఎన్కౌంటర్లపై కోర్టులు తమంత తాము విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తమవారిని బూటకపు ఎన్కౌంటర్లలో హతమార్చారని భావిస్తున్న వాళ్లు ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. -
టీడీపీ పొత్తు ప్రస్తావనే లేదు: తరుణ్‌చుగ్
-
తెలంగాణలో ఉనికి కోల్పోయిన పార్టీతో పొత్తా?
ఢిల్లీ: తెలంగాణలో తెలుగు దేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోబోతోందని ఓ మీడియా వర్గం విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ తీవ్రంగా స్పందించారు. అసలు అలాంటి ఆలోచనే లేదని తేల్చేస్తూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారాయన. రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన కొన్ని రాజకీయ పార్టీలు బీజేపీ తెలంగాణపై అసత్య ప్రచారాలు చేస్తూ.. పొత్తు కోసం అర్రులు చాస్తున్నాయని పరోక్షంగానే టీడీపీపై ఆయన సెటైర్లు వేశారు. గురువారం జరిగిన ఓ అనధికార సమావేశంలో తాను పరోక్షంగా కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా.. చేసినట్లు ఓ సెక్షన్ మీడియా కథనాలు రాసిందని ఆయన ప్రకటనలో మండిపడ్డారు. పార్టీకి దురుద్దేశ్యాలు ఆపాదించే లక్ష్యంతోనే ఆ కథనం సృష్టించినట్లు అర్థమవుతోందని ఆయన తేల్చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)ను ఓడించేంత బలం బీజేపీకి ఉందని, రాష్ట్రంలో తమ పార్టీనే ప్రత్యామ్నాయమని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పొత్తు పుకార్లను సృష్టించొద్దంటూ సదరు వర్గ మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ భవన్ నుంచి ఈ ప్రకటన విడుదలైంది. -
గేరు మార్చిన కేజ్రీవాల్.. ఆ పార్టీతో దోస్తీకి గ్రీన్‌కార్డ్
ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల అనంతరం ఆప్.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఇటీవలి కాలంలో గుజరాత్, కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించి ఆప్‌కు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని ఓటర్లను కోరారు. ఈ క్రమంలోనే దక్షిణాదిపై కొంచెం ఫోకస్ పెంచారు. ఇందులో భాగంగానే ఆదివారం కేరళ వెళ్లిన కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. కేరళలో ఆమ్ ఆద్మీ పార్టీ.. ట్వంటీ20 పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టు తెలిపారు. కొచ్చీలో కేజ్రీవాల్.. ట్వంటీ20 పార్టీతో కలిసి పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కేరళలో తమ కూటమి అధికారంలోకి వస్తే ఢిల్లీ మోడల్ మాదిరిగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. మీకు(మలయాళీలకు) అభివృద్ధి, పాఠశాలలు, ఆసుపత్రులు కావాలంటే తమ కూటమిని గెలిచిపించాలని కోరారు. అల్లర్లు, అవినీతి కావాలంటే ఇతర రాజకీయ పార్టీల గెలుపించుకోవాలని సూచించారు. తాము గెలిస్తే కేరళలో కూడా ఢిల్లీలోలాగా 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తామని హామీ ఇచ్చారు. Today is a historic day for Kerala. Through a new political front - People's Welfare Alliance - Aam Aadmi Party and Twenty20 will work together for the welfare of Kerala and its people. — Arvind Kejriwal (@ArvindKejriwal) May 15, 2022 -
వైఎస్సార్సీపీకి పొత్తు అవసరమే లేదు: విజయసాయిరెడ్డి
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీకి ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి. ఓటమి భయంతో.. ఎవరికైతే ప్రజల మద్దతు లేదనుకుంటున్నారో.. వాళ్లే పొత్తుల కోసం చూస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారాయన. ‘‘చంద్రబాబుకు ఎన్నికలలో గెలుస్తామన్న నమ్మకం లేదు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. అసలు ప్రజల్లో ఆయన పట్ల విశ్వసనీయత లేదు. పైగా బాబుది దుర్మార్గపు ఆలోచన. ఎప్పుడూ ఇతరులపైనే ఆధారపడే తత్వం. పైగా వెన్నుపోటు పొడుస్తాడు’’ అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలు చేస్తున్న హత్యలు, అత్యాచారాలను.. ప్రభుత్వానికి అంటగడుతూ బురద జల్లుతున్నారంటూ మండిపడ్డారు. ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా వైఎస్సార్సీపీ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. మరో పాతికేళ్లపాటు వైఎస్సార్సీపీనే అధికారంలో ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో ఇంతకు ముందు సాధించిన సీట్లు, ఓట్లు కంటే ఎక్కువ సాధిస్తామని, వైఎస్ జగన్ సీఎంగా కొనసాగతారని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రం ఉవాచ: ఇంగ్లీషు మీడియం చదువులు చదివితే...మొద్దబ్బాయిలుగా మారతారు. జనం రియాక్షన్: అందరూ నీ కొడుకు పప్పులా అనుకున్నావా బాబూ? pic.twitter.com/ci9irTClAT — Vijayasai Reddy V (@VSReddy_MP) May 7, 2022 చదవండి: రాసిపెట్టుకోండి.. సింహం సింగిల్‌గానే వస్తుంది -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు దిమ్మతిరిగే షాక్
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు భారీ షాక్ తగిలింది. అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనే ముందుర.. తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ పార్టీ) అధికార కూటమికి ఊహించని ఝలక్ ఎదురైంది. మూడు మిత్రపక్ష పార్టీలు, అదీ వెన్నంటి ఉంటాయనుకున్న పార్టీలు ఇమ్రాన్ ఖాన్‌కు హ్యాండిస్తూ ప్రకటన చేయడంతో పీటీఐలో వణుకు మొదలైంది. పాక్ అధికార పీఠాన్ని కదిలిస్తున్న రాజకీయాల్లో కీలక పరిణామం మరొకటి చోటు చేసుకుంది. పీటీఐ ప్రధాన భాగస్వామ పార్టీలు ఎంక్యూఎం-పీ, పీఎంఎల్-క్యూ, బీఏపీ లు అధికార కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాయి. అంతేకాదు ప్రతిపక్షంలో చేరి ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి. నాలుగేళ్ల ఖాన్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత నేపథ్యంలో మిత్రపక్షాలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మిత్రపక్షాలతో ఇమ్రాన్ ఖాన్ (పాత చిత్రం) ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్‌ను గద్దెదించే ఉద్యమానికి ఆయా పార్టీలు సైతం బహిరంగ మద్దతును రేపో మాపో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అవిశ్వాసానికి ముందే సొంత పార్టీ సభ్యులు బయటకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే 24 మంది చట్టసభ్యులు అవిశ్వాసానికి మద్ధతు ప్రకటించి.. ఇమ్రాన్ ఖాన్‌కు షాక్ ఇచ్చారు. ఈలోపే మిత్రపక్షాల నుంచి ఊహించని దెబ్బ తగిలింది. వాస్తవానికి మిత్రపక్షాలు అవిశ్వాసంలో ఇమ్రాన్ ఖాన్‌కు అండగా ఉంటామని నిన్నటి దాకా(మంగళవారం) ప్రకటిస్తూ వస్తాయి కూడా. ఇదిలా ఉండగా.. పాక్ నేషనల్ అసెంబ్లీలో(పార్లమెంట్) ప్రతిపక్షాలు మార్చి 8వ తేదీనే అవిశ్వాసం నోటీసులు ఇచ్చాయి. అప్పటి నుంచి రాజకీయ సమీకరణాలన్నీ ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగానే మారుతున్నాయి. ఈ తరుణంలో ఖాన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నాడు. అధికారం నుంచి గద్దె దింపితే ప్రతిపక్షాలకు మరింత ప్రమాదమని తాజాగా ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించాడు కూడా. pak no confidence motion ముంగిట.. తన మద్దతు స్థావరాన్ని సమీకరించడానికి మార్చి 27 న రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ ర్యాలీకి పిలుపునిచ్చాడు. అయితే ఆ ర్యాలీతో ఇమ్రాన్ ఖాన్ బలమేంటో స్పష్టంగా తేలే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మొత్తం 342 సభ్యులున్న పాక్ National Assemblyలో అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కడానికి 172 ఓట్లు రావాల్సి ఉంటుంది ఇమ్రాన్ ఖాన్‌కి. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మాణం నెగ్గాలంటే 172 సీట్ల మెజార్టీ నిరూపించుకోవాలి. కాగా, దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు నాలుగు మిత్రపక్షాలతో కలిసి(155+ మిత్రపక్షాలు 20 సీట్లు) 175 సీట్లను ప్రభుత్వం కలిగి ఉంది. ఇప్పుడు మిత్రపక్షాల దూరంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ పతనం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: ఆర్మీకి లంచం ఇచ్చి పదవి కాపాడుకోలేను- ఇమ్రాన్ ఖాన్ -
ఎంఐఎంతో జట్టు కట్టం: శివ సేన ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో అధికార కూటమి ఎంవీఏ(మహా వికాస్ అగాధి)లోకి ఏఐఎంఐఎంకు ప్రవేశం ఉంటుందా? అనే ప్రశ్నకు శివసేన స్పందించింది. ఎట్టిపరిస్థితుల్లో ఎంఐఎంను ఎంవీఏ కూటమిలోకి రానివ్వమని, అలాంటి అవకాశాలు ఇంచు కూడా లేవని స్పష్టత ఇచ్చారు శివ సేన ఎంపీ(రాజ్యసభ) సంజయ్ రౌత్. ఎంఐఎం పొత్తు అంశంపై స్పందించే క్రమంలో రౌత్.. కాస్త కటువుగానే స్పందించారు. ఎంఐఎం పొత్తు పెట్టుకోవడం అంటే.. ఓ రోగాన్ని అంటగట్టుకోవడమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఔరంగజేబు సమాధి ముందు మోకరిల్లి నమస్కరించే పార్టీతో మేం(శివ సేన) ఎలా పొత్తు పెట్టుకోగలం. దాని గురించి ఆలోచనే వద్దు. దాని గురించి ఆలోచించడం కూడా ఒక రోగమంతో సమానమే. శివ సేన.. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శాలను అనుసరిస్తుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు సంజయ్ రౌత్. ఇక ఎంఐఎం పార్టీకి బీజేపీతో రహస్య ఒప్పందం ఉందని, యూపీ ఎన్నికల్లో అది మరోసారి బయటపడిందని అన్నారాయన. అలాంటి పార్టీకి దూరంగా ఉండడమే మంచిదని భావిస్తున్నట్లు చెప్పారు సంజయ్ రౌత్. ఇక ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ ప్రతిపాదనపై ప్రశ్నించగా.. సంజయ్ రౌత్ స్పందించారు. మహారాష్ట్రలో మూడు పార్టీల ప్రభుత్వం(సేన, కాంగ్రెస్, ఎన్సీపీ) ఉంది. నాలుగో పార్టీకి అవకాశమే లేదు. ఆయన(ఇంతియాజ్ జలీల్‌ను ఉద్దేశిస్తూ) ఒక ఎంపీ. అందుకే ఢిల్లీలో కలుసుకున్నాం. అంతేతప్ప.. దానర్థం కూటమిలోకి ఆహ్వానిస్తామని కాదు అని తెలిపారు రౌత్. అంతకు ముందు ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ నేతను కలిసినప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాను. అయితే ఇది శివసేనకు ఆమోదయోగ్యం కాదని మాకు తెలుసు. మేము ప్రతిపాదన ఇచ్చాము కాబట్టి ఏమి జరుగుతుందో చూద్దాం అని ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. పొత్తుల వ్యవహారంపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ స్పందించారు. పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుతున్నాయని.. కానీ, దేశ ప్రజలు ప్రధాని మోదీ వెంటనే ఉన్నారని, రాబోయే రోజుల్లో గెలుపు బీజేపీదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమిపై స్పందిస్తూ.. ఎంత మంది వచ్చినా ఒక్కటేనని, ఎన్నికల్లో ఓడినప్పుడల్లా ఈవీఎం ఆరోపణలు చేసేవాళ్లు.. ఇప్పుడు ఎంఐఎంను ‘బీజేపీ బీ టీం’ అంటున్నారని, అలాంటి ఆరోపణలపై స్పందించాల్సిన అవసరమే లేదని ఫడ్నవీస్ పేర్కొన్నారు. -
అమిత్ షాతో భేటీ పచ్చి అబద్ధం
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజకీయ సమీకరణాలు మార్చే వార్త ఒకటి గత రెండు రోజులుగా చక్కర్లు కొడుతోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో జత కట్టడమే కాదు.. ఆరు సీట్లు గెల్చుకుంది సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ SBSP. అయితే Suheldev Bharatiya Samaj Party అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారని, తిరిగి బీజేపీ భాగస్వామిగా చేరబోతున్నారంటూ కథనాలు వస్తుండడం ఊహాగానాలకు తెర తీసింది. సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్, అమిత్ షాతో భేటీ అయిన యూపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. షాతో పాటు పలువురు బీజేపీ నేతలతో హస్తినలో ప్రకాశ్.. వరుస భేటీలు జరిగినట్లు శుక్రవారం కథనాలు వెలువడ్డాయి. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలంటూ కొన్ని వైరల్ అయ్యాయి కూడా. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్‌భర్ తీవ్రంగా స్పందించారు. Those are old photos. Someone can repost the old photos and say whatever they want: Om Prakash Rajbhar, Suheldev Bharatiya Samaj Party chief on reports of him meeting Union HM Amit Shah pic.twitter.com/y6Gz0K0ZoP — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 19, 2022 ‘‘అమిత్ షాను కలిసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అది పుకారు మాత్రమే. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫొటోలు పాతవి. పాత ఫొటోలను పోస్ట్ చేసి.. వాళ్లకు ఇష్టమొచ్చినట్లు పుకార్లు పుట్టించేస్తున్నారు. ఎస్పీతోనే మా పొత్తు కొనసాగుతుంది. ఈ నెల 28న సంయుక్త కార్యచరణ కోసం భేటీ కాబోతున్నాం. స్థానిక ఎన్నికల్లోనూ ఎస్పీతో కలిసే పోటీ చేస్తాం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా మా పొత్తు కొనసాగుతుంది’’ అని ప్రకటించారాయన. पुरानी फ़ोटो लगाकर माहौल बनानें के चक्कर मे खबर ही फर्जी बन गयी.... कृपया अफवाहों पर सावधान रहें... — Arun Rajbhar (@ArunrajbharSbsp) March 19, 2022 ఇక ఈ పుకార్లను ఎస్బీఎస్పీ జాతీయ కార్యదర్శి అరవింద్ రాజ్‌భర్ కూడా ఖండించారు. ‘‘బీజేపీతో కలిసి ముందుకెళ్తున్నామనే వార్తలో నిజం లేదు. ఎస్పీతోనే మేం ఉంటాం. మరోవైపు పార్టీ ప్రతినిధి పీయూష్ మిశ్రా కూడా పుకార్లను ఖండిస్తూ ట్వీట్ చేశారు. सुहेलदेव भारतीय समाज पार्टी का भारतीय जनता पार्टी के साथ जाने की खबर निराधार है, पार्टी समाजवादी पार्टी के साथ थी,है और रहेगी ! — Piyush Mishra (@PMLUCKNOW) March 19, 2022 ఓం ప్రకాశ్ రాజ్‌భర్ నేతృత్వంలోని ఎస్బీఎస్పీ SBSP గతంలో బీజేపీతో పొత్తు కొనసాగించింది. 2017 యోగి ఆదిత్యానాథ్ అధికారంలోకి వచ్చాక.. కేబినెట్లో రాజ్‌భర్ కూడా చేరారు. అయితే.. వెనుకబడిన వర్గాలను బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ రెండేళ్ల తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేసి కూటమి నుంచి బయటకు వచ్చేశారు. -
అమిత్ షా సవాల్‌కి సై.. బీజేపీతో పొత్తుపై ‘మహా’ సీఎం సంచలన వ్యాఖ్యలు
ముంబై: ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సవాలును స్వీకరిస్తున్నట్లు శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే చెప్పారు. పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే జన్మదిన వేడుకల్లో ఆయన ఆదివారం పాల్గొన్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉండడం వల్ల శివసేనకు 25 సంవత్సరాలు వృధాగా పోయాయనే ఇప్పటికీ నమ్ముతున్నానన్నారు. మహారాష్ట్రకు బయటకూడా శివసేన కార్యకలాపాలను విస్తరిస్తామని, జాతీయస్థాయికి ఎదుగుతామని చెప్పారు. బీజేపీ ఎదుగుదలలో సేనలాంటి పలు ప్రాంతీయ పార్టీల సహకారం ఉందని, ఆసమయంలో చాలాచోట్ల బీజేపీకి కనీసం డిపాజిట్లు వచ్చేవికాదని గుర్తు చేశారు. హిందుత్వకు అధికారమివ్వాలనే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని, అంతేకానీ అధికారం కోసం తామెప్పుడూ హిందుత్వను వాడుకోలేదని ఉద్దవ్ చెప్పారు. బీజేపీ అనుకూలవాద హిందుత్వ చేస్తుందని ఆయన విమర్శించారు. రాజకీయ అధికారం కోసమే బీజేపీ కాశ్మీర్లో పీడీపీతో, బీహార్‌లో జేడీయూతో పొత్తు పెట్టుకుందన్నారు. సేన, అకాలీదళ్ లాంటి పాత మిత్రులు పోవడంతో ఎన్డీఏ పరిధి తగ్గిందన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో తమ పొత్తును ఆయన సమర్ధించుకున్నారు. బీజేపీ మిత్రపక్షాలను వాడుకొని వదిలేస్తుందన్నారు. తాము బీజేపీని వదిలేశాము కానీ హిందుత్వను కాదని చెప్పారు. ఎప్పటికైనా ఢిల్లీ గద్దెను చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీలు బీజేపీలాగా కాదని, వ్యవస్థలను గౌరవిస్తాయని చెప్పారు. బాల్ ధాకరే జన్మదినోత్సవం రోజునే శివసేన ఆవిర్భవించింది. దీంతో పార్టీ, పార్టీ వ్యవస్థాపకుడి జన్మదిన వేడుకలను కలిపిజరుపుతారు. పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలని శివసైనికులకు ఉద్దవ్ పిలుపునిచ్చారు. ఇటీవలే ఉద్దవ్ వెనుముక సర్జరీ చేయించుకున్నారు. తన ఆరోగ్యంపై బీజేపీ చేస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. -
యూపీలో ‘పొత్తు’ పొడుపులు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ‘పొత్తు’ రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ప్రధాన రాజకీయపక్షాలైన బీఎస్సీ, కాంగ్రెస్‌లతో పొత్తు ఉండదని, చిన్నపార్టీలతో జట్టుకడతామని ఇదివరకే ప్రకటించిన సమాజ్‌వాది పార్టీ అధ్యక్షడు అఖిలేష్ యాదవ్ ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే జయంత్ చౌదరి నేతృత్వంలో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ)తో ఒక అవగాహనకు వచ్చిన అఖిలేష్ గతంలో ఎన్డీయేతో ఉన్న సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఓం ప్రకాశ్ రాజ్‌భర్)నూ తమవైపునకు తిప్పేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా బుధవారం అఖిలేష్ లక్నోలో ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఎస్సీ– ఆప్ పొత్తుపై ఇప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితి ఉన్నప్పటికీ... భవిష్యత్తు పరిణామాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయని చెప్పవచ్చు. ఆప్‌కు యూపీలో పెద్దగా బలం లేనప్పటికీ... కేజ్రీవాల్ అండ లభిస్తే నైతికంగా బలం చేకూరినట్లవుతుందనేది పరిశీలకుల అంచనా. మరోవైపు అఖిలేష్ యాదవ్ బుధవారం అప్నాదళ్ (కె) నాయకురాలు కృష్ణ పటేల్‌తో భేటీ అయ్యారు. పొత్తుకు సంబంధించి ఒప్పందం కుదిరిందని ఆమె తెలిపారు. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో పొత్తులో భాగంగా అప్నాదళ్ (కె) 20–25 సీట్లను ఆశిస్తోంది. కృష్ణ పటేల్ కూతురు అనుప్రియా పటేల్‌కు చెందిన అప్నాదళ్(ఎస్) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగస్వామి. ఆ పార్టీకి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, అనుప్రియతో కలిపి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. సామాజికంగా వెనుకబడిన వర్గమైన ‘కుర్మీ’లకు ప్రధానంగా అప్నాదళ్ ప్రాతినిధ్యం వహిస్తోంది. తల్లి కృష్ణ పటేల్‌తో పొత్తుపెట్టుకొని... ఆమెకు సముచిత గౌరవమిస్తే కుర్మీ ఓట్లలో చీలిక తేవొచ్చనేది అఖిలేష్ ఎత్తుగడ. యూపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరి– మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
యూపీలో పొత్తులపై ఇప్పుడే చెప్పలేం: ప్రియాంక గాంధీ
లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తెలిపారు. అయితే, ఆ విషయంలో సానుకూలంగానే ఉన్నామని, తమ లక్ష్యం బీజేపీని ఓడించడమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మీరు ఉన్న సమయంలోనే పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రియాశీలంగా ఉంటారని, మీరు వెళ్లిన వెంటనే మళ్లీ పార్టీ స్తబ్దుగా మారుతుందని వ్యాఖ్యకు స్పందిస్తూ.. ‘నేను ఇక్కడ ఉన్నప్పుడు మీ(మీడియా) అటెన్షన్ ఉంటుంది. కనుక క్రియాశీలంగా ఉన్నట్లు మీకు కనిపిస్తుంది. నేను లేని సమయంలో మాపై మీ దృష్టి ఉండదు. కనుక స్తబ్దుగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ పార్టీ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి’ అని వివరించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి మీరేనా అన్న ప్రశ్నకు.. ఇప్పుడే చెప్పలేమని సమాధానమిచ్చారు. యూపీకి ప్రియాంక పొలిటికల్ టూరిస్ట్ అన్న బీజేపీ విమర్శలపై స్పందిస్తూ.. తనను, సోదరుడు రాహుల్‌ని సీరియస్ రాజకీయవేత్తలు కాదని ప్రచారం చేయడం బీజేపీ ఎజెండా అన్నారు. -
ఎస్పీ చీఫ్ అఖిలేశ్ కీలక ప్రకటన
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దీపావళీ పండగ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. 2022లో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అమలు చేయబోయే వ్యూహాన్ని వెల్లడించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడిన కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టి కూటమిగా ఏర్పాటు కాబోమని ఆయన స్పష్టం చేశారు. శనివారం దీపావళి పండగ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. కొన్ని రోజులుగా లక్నో, ఏటవాలో పార్టీ ప్రముఖలతో పలు భేటీలు జరిపాము. అన్ని ప్రాంతాలను బీజేపీ ప్రభుత్వం విస్మరించింది. బీజేపీ అభివృద్ధి పనులు కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితమైంది’ అన్నారు. రానున్న ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌తో ఎట్టి పరిస్థితుల్లో కూటమిగా ఏర్పడదని, కేవలం చిన్న పార్టీలతో మాత్రమే కూటమిగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయిని తెలిపారు. చదవండి: (అవసరమైతే బీజేపీకి ఓటు వేస్తాం: మాయావతి) ఈ విషయాన్ని పలు వేదికలపై తెలిపానని ఆయన గుర్తు చేశారు. మరో వైపు జస్వంత్‌నగర్ విషయంలో ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీతో సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు. అఖిలేశ్ యాదవ్ బాబాయ్ అయిన శివపాల్ యాదవ్ 2017 ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీగా అభ్యర్థిగా జస్వంత్‌నగర్ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన ఎస్పీ నుంచి బయటకు వచ్చి 2019లో సొంతంగా ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ నీ స్థాపించారు. ఇక ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి, 2022లో జరగనున్నాయి. -
ఓటుకు పొత్తు పోటు
ప్రస్తుతం ఎన్నికలంటే.. కుల సమీకరణలు.. పొత్తుల కుంపట్లు.. పొత్తులే ఎన్నికల్లో ఓట్లు రాలుస్తాయనేది పార్టీల నిశ్చితాభిప్రాయం. అయితే, ఈ పొత్తులు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయా? ఓట్లు కురిపిస్తాయా? అనేది దశాబ్దాలుగా ఎన్నికల విశ్లేషకులను వేధించే ప్రశ్న. ఈసారి కూడా పొత్తుల్లో భాగంగా సీట్ల సర్దుబాటు కుదుర్చుకున్న పార్టీల అభ్యర్థులకు ఆయా పార్టీల మద్దతుదారుల ఓట్లు ఎంత వరకు బదిలీ అవుతాయో చెప్పడం కష్టం. అన్ని పార్టీల కార్యకర్తలు, సానుభూతిపరులు తమ అభ్యర్థులు లేనిచోట్ల మిత్రపక్షాల అభ్యర్థులకు ఓట్లు ఒకే తీరున వేయరని గతానుభవాలు చెబుతున్నాయి. ఫలించని తొలి పొత్తు ఉత్తరప్రదేశ్‌లో 1996 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చేతులు కలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు పీవీ నరసింహారావు, బీఎస్పీ నేత కాన్షీరామ్ సమక్షంలో బీఎస్పీ 310, కాంగ్రెస్ 115 సీట్లకు పోటీచేయడానికి పొత్తు కుదిరింది. రెండు పార్టీలకు కలిపి వంద సీట్లే దక్కాయి. కారణం.. రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సరిగా జరగకపోవడమే. కాంగ్రెస్‌కు బీఎస్పీకి చెందిన దళితులు, బడుగువర్గాల ఓట్లు పడినా కానీ బీఎస్పీకి కాంగ్రెస్ మద్దతుదారులైన బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాల ఓట్లు బదిలీ కాలేదు. ‘కాంగ్రెస్‌కు తన ఓట్లను మిత్రపక్షాలకు బదిలీ చేసే శక్తి లేదు. ఇక నుంచి బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల ముందు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు’ అని కాన్షీరామ్ ప్రకటించారు. ఆయన మాట ప్రకారం మొన్నటి వరకూ నడుచుకున్న పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. యాదవులు, ఇతర బీసీల్లో పట్టున్న ఎస్పీ ఓట్లు దళితుల పార్టీగా ముద్రపడిన బీఎస్పీ అభ్యర్థులకు ఏ మేరకు పడతాయో చెప్పలేని స్థితి. ‘తన మిత్రపక్షాలకు ఓట్లను బదిలీ చేయగలనని ధైర్యంగా చెప్పుకోగల పార్టీ బీఎస్పీ ఒక్కటే. ఇతర పార్టీలు గరిష్ట స్థాయిలో తమ ఓట్లను బదిలీ చేయలేవు’ అని ఎన్నికల విశ్లేషకుడు యశ్వంత్ దేశ్‌ముఖ్ అభిప్రాయపడ్డారు. పొత్తులతో మొదటికే మోసం? తమిళనాడు, మహారాష్ట్ర, బిహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో పార్టీల మధ్య పొత్తులే ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయి. దేశంలో మిత్రపక్షాల మధ్య, అవసరం కొద్దీ శత్రుపక్షాల మధ్య పొత్తులు కుదురుతుంటాయి. భావ సారూప్యత, ఒకే రకమైన సామాజిక పునాదులున్న రాజకీయ పక్షాల మధ్య ఎన్నికల కలయికలు విజయవంతమై మంచి ఫలితాలనిస్తాయని గత ఎన్నికలు నిరూపించాయి. అయితే, ఇలాంటి పొత్తులు అరుదనే చెప్పాలి. పొత్తులు చాలా సందర్భాల్లో రాజకీయ పక్షాలకు ఇబ్బందికరమైన ఫలితాలనిస్తాయి. సీట్ల సర్దుబాటు వల్ల పోటీ చేయని ప్రాంతాల్లో కొన్ని పార్టీలు బలహీనమైన సందర్భాలున్నాయి. అలాగే, పొత్తుల వల్ల కొన్ని పార్టీలు లబ్ధి పొందడం, మరి కొన్ని నష్టపోవడం మామూలే. కొన్ని సందర్భాల్లో రెండు పార్టీల పొత్తులు జనానికి నచ్చకపోతే రెండింటినీ వారు ఎన్నికల్లో తిరస్కరించే ప్రమాదం ఉంటుంది. విడిగా పోటీచేస్తే పడే ఓట్లు కూడా పొత్తు కారణంగా ఇతర పక్షాలకు మళ్లిపోయే పరిస్థితి ఎదురవుతుంది. ఉత్తరప్రదేశ్ : ఎస్పీ–బీఎస్పీ పొత్తు కిరికిరి ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–బీఎస్పీ మధ్య కుదిరిన పొత్తు దేశంలోనే అత్యంత క్లిష్టమైనదిగా భావిస్తున్నారు. ఎస్పీవైపు మొగ్గు చూపే బీసీలు ఇప్పటికీ దళితులను శత్రువులుగానే చూస్తున్నందున బీఎస్పీకి ఎస్పీ ఓట్లు బదిలీ అవుతాయనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. అయితే, కిందటేడాది బీజేపీ కంచుకోటలైన గోరఖ్‌పూర్, ఫూల్పూర్లో బీఎస్పీతో పొత్తు ఎస్పీకి లాభించింది. పొత్తు ఫలించి రెండు సీట్లూ ఎస్పీ కైవసం చేసుకుంది. ఎస్పీ, బీఎస్పీ పొత్తుకు తొలి పరీక్ష ఎస్పీకి ఫలించింది. బీఎస్పీకి విధేయులైన ఓటర్ల మాదిరిగా ఎస్పీ మద్దతుదారులైన యాదవులు అంతే స్థాయిలో మాయావతి పార్టీకి ఓటేయకపోచ్చని, ఎస్పీ చీలికవర్గమైన ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీకి కొందరు యాదవులు మద్దతిచ్చే అవకాశముందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఎస్పీ స్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ తమ్ముడు శివపాల్‌సింగ్ యాదవ్ నాయకత్వాన ఈ కొత్త పార్టీ పోటీచేస్తోంది. ‘ఎస్పీ పోటీలో లేని అనేక చోట్ల యాదవులు శివపాల్ పార్టీ లేదా బీజేపీ వైపు మొగ్గు చూపవచ్చు కానీ, బీఎస్పీకి ఓటేయకపోవచ్చు’ అని పరిశీలకులు అంటున్నారు. కానీ, రెండు పార్టీలకు గతంలో వచ్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే ఎస్పీ–బీఎస్పీ పొత్తు మంచి ఫలితాలనివ్వాలి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ–కాంగ్రెస్ పొత్తు ఇలాంటిది కాదు. దీనివల్ల రెండు పార్టీలూ నష్టపోయాయి. ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలకు పడిన ఓట్లు కలిపితే 42.12 శాతం కాగా, బీజేపీకి 42.63 శాతం ఓట్ల పడ్డాయి. రెండు పార్టీలకు లభించిన ఓట్ల ఆధారంగానే అఖిలేశ్ యాదవ్, మాయావతి పార్టీలు ఇప్పుడు చేతులు కలిపాయి. బిహార్ : బిహార్‌లో హిట్.. తెలంగాణలో ఫట్ 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమిగా పోటీచేసి గెలుపొందాయి. ఆర్జేడీ, జేడీయూకి కలిపి 35.2 శాతం ఓట్లు దక్కగా, ప్రత్యర్థి పక్షమైన బీజేపీకి 24.4 శాతం ఓట్లే వచ్చాయి. ఇక్కడ చాలా ఏళ్లు శత్రుపక్షాలుగా ఉన్న ఆర్జేడీ, జేడీయూ మధ్య ఓట్ల బదిలీ పూర్తి స్థాయిలో జరిగింది. ‘ఇది జనం కోరుకున్న పొత్తు. అందుకే మంచి ఫలితాలొచ్చాయి. ఓట్ల బదిలీ సంపూర్ణంగా జరిగింది. కేవలం పార్టీల అగ్రనేతల మధ్య కుదిరే పొత్తు వల్ల ప్రయోజనం ఉండదు. ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటేనే పొత్తులు ఫలిస్తాయి’ అని ఆర్జేడీ నేత మనోజ్ ఝా తెలిపారు. కిందటి డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జన సమితితో కూడిన మహా కూటమి ఘోర పరాజయం పాలైంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌తో తెలంగాణ ఏర్పాటును సమర్థించని తెలుగుదేశం చేతులు కలపడాన్ని ప్రజలు అంగీకరించలేదు. పాలకపక్షమైన టీఆర్ఎస్ పాలనతో అసంతృప్తి చెందిన జనం సైతం టీడీపీ కూటమిలో ఉండటాన్ని సహించలేక పెద్దసంఖ్యలో పాలకపక్షానికే ఓటేశారు. టీడీపీతో పొత్తు వల్ల కాంగ్రెస్ బలపడకపోగా మరింత బలహీనమైంది. ఓటు బదిలీ సంగతి దేవుడెరుగు అసలు ప్రజలనే టీఆర్ఎస్ వైపు మళ్లేలా చేసింది ఈ పొత్తు. ఎక్కువ విధేయులైన మద్దతుదారులున్న పార్టీయే తన మిత్రపక్షానికి ఓట్లు బదిలీ చేయగలుగుతుందని సీఎస్డీఎస్ డైరెక్టర్ సంజయ్‌కుమార్ చెప్పారు. ‘ఓట్ల బదిలీకి ఓ లక్ష్యం ఉండాలి. తెలంగాణకు కట్టుబడిన పార్టీకే ఓటెయ్యాలనే లక్ష్యమే టీఆర్ఎస్ విజయానికి దారితీసింది’ అని ‘సీ ఓటర్’ సంస్థకు చెందిన దేశ్‌ముఖ్ అన్నారు. తమిళనాడు : ఫలించని డీఎంకే–కాంగ్రెస్ దోస్తీ తమిళనాడులో 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగింది. నాటి ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకుండా కేవలం 4.3 శాతం ఓట్లు సాధించింది. కానీ ప్రాంతీయ పక్షం డీఎంకేతో కలిసి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకుని పోటీచేసినా కాంగ్రెస్‌కు దక్కినవి ఆరు శాతం ఓట్లే. ఈ రెండు పార్టీలు సహజమైన రాజకీయ మిత్రపక్షాలు కాకపోవడంతో అటువంటి ఫలితాలొచ్చాయి. అందుకే ఈసారి కాబోయే ప్రధాని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అంటూ డీఎంకే నేత స్టాలిన్ ప్రకటించి మెరుగైన ఫలితాలు ఆశిస్తున్నారు. ఈ నినాదం కలిసి వస్తుందని ఆయన నమ్ముతున్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేతో పాటు పీఎంకే, ఎండీఎంకే వంటి చిన్న పార్టీలతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంది. అన్నాడీఎంకే ఓట్లు ఇతర పార్టీలకు బదిలీ అవుతాయి కానీ, చిన్న పార్టీల ఓట్లు పెద్ద పార్టీలకు పడవని చెన్నైకి చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయపడ్డారు. మరి తమిళనాడులో పరిస్థితి ఎలా ఉంటుందో ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. మహారాష్ట్ర : వింత మిత్రులు..బీజేపీ–శివసేన మహారాష్ట్ర పాలక సంకీర్ణ సర్కారులో జూనియర్ భాగస్వామి అయిన శివసేన గత నాలుగేళ్లలో అవకాశమొచ్చిన ప్రతిసారీ బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉంది. 2019 పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడగానే రెండు పార్టీలూ మళ్లీ పొత్తు కుదుర్చుకున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ దోస్తీ కొనసాగుతుందని ప్రకటించాయి. నరేంద్రమోదీని ప్రధానిని చేయడానికి శివసేన అభ్యర్థులకు బీజేపీ కార్యకర్తలు మద్దతు ఇస్తారని, కాంగ్రెస్‌ను నిలువరించడానికి బీజేపీకి శివసేన ఓట్లేయిస్తుందని ఎన్నికల నిపుణులు జోస్యం చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ తెచ్చుకునే అవకాశం లేనందున అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పొత్తులు పెట్టుకుంటోందని శివసేన నేత సంజయ్‌రౌత్ చెప్పారు. అయితే, ఈ పొత్తు మునుపటిలా అంత సజావుగా సాగదనీ, గత కొన్నేళ్లలో రెండు పక్షాల మధ్య మనస్పర్థలు తీవ్రమయ్యాయని, 2014లో మాదిరిగా రెండింటి మధ్య ఓట్ల బదిలీ పూర్తిగా జరగదని సీఎస్డీఎస్ డైరెక్టర్ సంజయ్ కుమార్ అభిప్రాయపడుతున్నారు. అస్సోం : కలవని మనసులు అస్సోంలో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాం తీయ పక్షమైన అస్సోం గణపరిషత్ (ఏజీపీ) తో కలిసి బీజేపీ పోటీచేసి గెలుపొందింది. ఇటీవల పౌరసత్వ సవరణ బిల్లుపై విభేదాల కారణంగా కాషాయ పక్షానికి ఏజీపీ దూరమైంది. మళ్లీ లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించగానే రెండు పార్టీలూ పొత్తు పెట్టుకున్నాయి. కానీ, రెండు పార్టీల కార్యకర్తల మధ్య సైద్ధాంతిక విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తు ఫలితాలివ్వకపోవచ్చని భావిస్తున్నారు. పౌరసత్వ సమస్య వంటి కీలకాంశంపై బహిరంగ విభేదాలు లేకుంటే బీజేపీ–ఏజీపీ పొత్తు పార్లమెంటు ఎన్నికల్లో సత్ఫలితాలివ్వడానికి అవకాశం ఉండేది. కానీ, మారిన రాజకీయ వాతావరణంలో రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేసే పరిస్థితులు లేవు. దాదాపు 24 ఏళ్ల పాటు బద్ధ శత్రువులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ నేతలు అఖిలేశ్ యాదవ్, మాయావతి 11 ప్రచార ర్యాలీల్లో కలిసి పాల్గొంటున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వారికి తెలుసు. అయినా, ఐదేళ్ల క్రితం మోదీ ప్రభంజనంలో రెండు పార్టీలూ కొట్టుకుపోయాయి. తమ ఉనికి కాపాడుకోవడానికి కుదుర్చుకున్న పొత్తు కాబట్టి ఇది ఫలిస్తుందని ఇద్దరూ నమ్ముతున్నారు. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికలు పొత్తు: ఆర్జేడీ– జేడీయూ– కాంగ్రెస్ ఫలితం: ఈ కూటమిదే విజయం (ఆర్జేడీ– 80, జేడీయూ– 71,కాంగ్రెస్– 27) కారణం: బీసీలు, మైనారిటీల నుంచి కూటమికి లభించిన సంపూర్ణ మద్దతు 2019 మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికలు పొత్తు: బీజేపీ– శివసేన ఏం జరుగుతుంది?: రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సాఫీగా, సంపూర్ణంగా జరిగే అవకాశం 2019 లోక్‌సభ ఎన్నికలు పొత్తు: బీజేపీ–ఏఐడీఎంకే–డీఎండీకే–పీఎంకే వర్సెస్ డీఎంకే–కాంగ్రెస్–ఇతర చిన్న పార్టీలు ఏం జరుగుతుంది?: కాంగ్రెస్ అధినేత రాహుల్ ప్రధాని అభ్యర్థి అని డీఎంకే నేత స్టాలిన్ ప్రకటించిన కారణంగా రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సజావుగా జరిగే అవకాశం 1996 యూపీ అసెంబ్లీ ఎన్నికలు పొత్తు: బీఎస్పీ – కాంగ్రెస్ ఫలితం: హంగ్ అసెంబ్లీ (బీఎస్పీ– 67, కాంగ్రెస్– 33) కారణం: బీఎస్పీకి కాంగ్రెస్ ఓట్లు బదిలీ కాలేదు 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికలు పొత్తు: ఎస్పీ – కాంగ్రెస్ ఫలితం: బీజేపీకి భారీ మెజారిటీ 224 నుంచి 47కు తగ్గిన ఎస్పీ సీట్లు 28 నుంచి 7కి తగ్గిన కాంగ్రెస్ బలం కారణం: రెండు పార్టీల కలయిక ఆచరణలో ఏ రకంగానూజరగలేదు -
ఆప్‌తో హస్తం పొత్తు?
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)తో పొత్తుపై ఇప్పటి వరకు సందిగ్ధంలో ఉన్న కాంగ్రెస్.. అంతర్గత సర్వే ఫలితాల తీరుతో వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఆప్‌తో పొత్తును వ్యతిరేకిస్తున్న ఆ పార్టీ సీనియర్ నేతలు మెత్తబడినట్లు సమాచారం. ఆప్‌తో జట్టుకట్టే విషయమై ఎటూ తేల్చుకోలేని కాంగ్రెస్ పార్టీ ఇటీవల శక్తి యాప్ ద్వారా కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఇందులో రాజధాని ఢిల్లీలో బీజేపీకి 35% ఓట్లు, ఆప్‌కు 28%, కాంగ్రెస్‌కు 22% ఓట్లు పడతాయని వెల్లడైంది. ఈ మేరకు రూపొందించిన నివేదికను ఢిల్లీ నేతలు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తోపాటు ఢిల్లీ పార్టీ అధ్యక్షురాలు షీలా దీక్షిత్‌కు అందజేశారు. ఢిల్లీలో ఆప్‌తో పొత్తు పెట్టుకుంటే మొత్తం 7 ఎంపీ సీట్లనూ కైవసం చేసుకునే చాన్సుందని వివరించారు. పొత్తు విషయంలో షీలా తన వ్యతిరేక వైఖరిని మార్చుకోనప్పటికీ, కాస్త వెనక్కి తగ్గారని పార్టీ వర్గాలు చెప్పాయి. కాంగ్రెస్ ఢిల్లీ విభాగం నేతలు కూడా ఆప్‌తో పొత్తుపై సానుకూలత వ్యక్తం చేశారు. దీంతో సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్ రంగంలోకి దిగి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సంప్రదింపులు ప్రారంభించారు. ఢిల్లీతోపాటు హరియాణాలోనూ ఆప్‌తో పొత్తు కుదిరేందుకు అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అంతిమంగా, రాహుల్ సానుకూల నిర్ణయం మరికొద్ది రోజుల్లోనే తీసుకుంటారని భావిస్తున్నారు. అనంతరం సీట్ల పంపిణీకి సంబంధించి రెండు పార్టీల నేతలతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలకు మే 12వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. -
పొత్తుల పొడగిట్టని జనం..
పొత్తులపై ప్రజల్లో విశ్వాసం పెద్దగా లేదు. ఎన్నికల్లో గెలుపు కోసం ఈ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న వారు వచ్చే ఎన్నికల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. ఇలాంటి వారిపట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడం సహజం. మోదీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న పార్టీలతో ప్రజలకు పెద్దగా సమస్యలేదు. ఎందుకంటే రాబోయే రెండు మూడేళ్ళలో తిరిగి ఆయా పార్టీలు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మారడం ఖాయమని వారు భావిస్తున్నారు. ఒకవేళ పొత్తులతో వారు గెలిచినప్పటికీ ప్రభుత్వాన్ని కొనసాగించగలరన్న విశ్వాసం ప్రజలకు కలగడం లేదు. అందుకే కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా ప్రాంతీయ పార్టీల పొత్తులు బీజేపీని నిరోధించగలిగినా మహాఘటబంధన్ వంటి భారీ పొత్తులు మాత్రం ప్రజలను అంతగా ఆకర్షించలేవు. వ్యతిరేక ప్రచారమే మోదీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. -
మరో రెండు రాష్ట్రాల్లో ఎస్పీ– బీఎస్పీ పొత్తు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటైన సమాజ్‌వాదీ పార్టీ–బహుజన్ సమాజ్ పార్టీ (ఎస్పీ–బీఎస్పీ)కూటమి మరో రెండు రాష్ట్రాల్లో పోటీ చేయనుంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యూపీతోపాటు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోనూ కలిసి బరిలోకి దిగాలని ఈ రెండు పార్టీలు నిర్ణయించాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ మేరకు సోమవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘2019 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాం. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్, టికమ్‌గర్హ్, ఖజరహోతో పాటు ఉత్తరాఖండ్‌లోని గధ్వాల్ స్థానాల నుంచి సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేయనుండగా మిగతా చోట్ల బీఎస్పీ తమ అభ్యర్థులను బరిలోకి దించుతుంది’ అని అందులో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో 29, ఉత్తరాఖండ్‌లో 5 ఎంపీ స్థానాలున్నాయి. బిహార్‌లో పొత్తుల్లేకుండానే బీఎస్పీ.. పట్నా: బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీకి దిగాలని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నిర్ణయించిందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, బిహార్ బిఎస్పీ ఇన్చార్జ్ లాల్జీ మేధ్కర్ సోమవారం వెల్లడించారు. బిహార్‌లో బీఎస్పీ టికెట్ ఆశావహులు, పార్టీ పథాధికారులతో గురువారం ఢిల్లీలో అధినేత్రి మాయవతితో సమావేశం ఉందని ఆయన తెలిపారు. ఎన్నికలకు సిద్ధం కావాల్సిందిగా ఆమె తమను ఇప్పటికే ఆదేశించారనీ, పూర్తి సూచనలు ఆమె గురువారం నాటి భేటీలో ఇచ్చే అవకాశం ఉందని మేధ్కర్ తెలిపారు. బిహార్‌లో ఇప్పటికే ఎన్డీయేతర పార్టీల మధ్య సఖ్యత లేదు. అటు కాంగ్రెస్‌ను, ఇటు ఆర్జేడీని కూడా వదిలేసి బీఎస్పీ ఒంటరిగా పోరుకు దిగాలనుకోవడం ఆ రెండు పార్టీలకూ దెబ్బేనని భావిస్తున్నారు. -
కమలనాథులకు తగ్గిపోనున్న ప్రత్యామ్నాయాలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు వైరి పక్షాలైన ఎస్పీ, బీఎస్పీలు రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం చేతులు కలపడంతో బీజేపీ ముందున్న ప్రత్యామ్నాయాలు తగ్గిపోయే అవకాశాలున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్ని ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీల మధ్య పోరుగా చిత్రీకరించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అందుకే విపక్షాలనన్నింటిని కలిపి మహాకూటమిగా అభివర్ణిస్తూ, ఎన్నికల్ని మోదీ పాలనపై రిఫరెండంగా ప్రచారం చేయాలనుకుంటోంది. అదే జరిగితే మోదీకి తిరుగుండదని, ప్రజాదరణలో మోదీని ఓడించడం కష్టమని కాషాయ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఎస్పీ–బీఎస్పీ కూటమితో బీజేపీకి కొత్త తలనొప్పులు తలెత్తే పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో సార్వత్రిక ఎన్నికలకు ఏదో ఒకే అంశాన్ని ప్రచారాస్త్రంగా ఎంచుకుని బరిలోకి దిగేవారు. కానీ ఇప్పుడు జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో ప్రాథమ్యాలు మారి పోయాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఎజెండా, ప్రచారాస్త్రంతో పోటీకి దిగడం జాతీయ పార్టీకి కత్తిమీద సాముగా మారింది. అసలే దక్షిణాదిలో బీజేపీ కేడర్ అంతంత మాత్రమే. ఎస్పీ–బీఎస్పీ బాటలోనే ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కూడా నడిస్తే బీజేపీ అవకాశాలు మరింత కుంచించుకుపోతాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్ని మోదీ పాలనకు రిఫరెండంగా భావించే పరిస్థితి కూడా ఉండదు. అప్పుడలా..ఇప్పుడిలా.. కాగితంపై చూస్తే ఎస్పీ–బీఎస్పీ కూటమికి బీసీలు, దళితులు, ముస్లింలు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో ఈ రెండు పార్టీ లు విడివిడిగా పోటీచేయడంతో ఓట్ల చీలికతో బీజేపీ లబ్ధి పొందిందన్నది కాదనలేని వాస్తవం. 1993 అసెంబ్లీ ఎన్నికల్లో జతకట్టిన ఎస్పీ–బీఎస్పీలు అప్పటికే బలోపేతమైన బీజేపీని ఓడించిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. ఇక 2014 లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఎస్పీ, బీఎస్పీల ఉమ్మడి ఓటు షేరు 42.1 శాతం కాగా, బీజేపీకి 42.6 శాతం ఓట్లు దక్కాయి. ప్రస్తుతం బీజేపీ ఓట్ల శాతం ఒకటో, రెండో పాయింట్లు పడిపోయి ఉంటుందని అంచనావేస్తున్నారు. తన ఓట్లను ఎస్పీకి బదిలీచేయగలనని గతేడా ది జరిగిన ఉపఎన్నికలో బీఎస్పీ నిరూపించింది. మాయావతి ప్రధాని అభ్యర్థిత్వానికి అఖిలేశ్ మద్దతుపలకడం, ఆమెను అవమానిస్తే తననూ అవమానించినట్లేనని పార్టీ కార్యకర్తలకు సూచించడం ద్వారా ఎస్పీ, బీఎస్పీ కార్యకర్తలు కలసి పనిచేసేలా ప్రోత్సహించారు. ‘వర్ణ’ రాజకీయాలే కీలకం: 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో అధిక సీట్లు గెలుచుకోవడమే బీజేపీకి మొదటి సవాల్. ఇందుకోసం ఆ పార్టీ వేర్వేరు వ్యూహాలు అనుసరించాల్సి ఉంటుంది. దళితులు, అధిక సంఖ్యాక ఓబీసీల్లో పార్టీ పట్ల ఉన్న వ్యతిరేక భావాన్ని ఎదుర్కోవడం ప్రధానమైంది. కానీ, యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక బీజేపీలోనే ఓబీసీ రాజకీయాలు చాపకింద నీరులా పెరిగిపోవడం అసలు సమస్యగా మారింది. అగ్రవర్ణాల్లో ఉన్న పార్టీ వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నంలో భాగంగా మోదీ నిరుపేదలకు 10 శాతం కోటా తీసుకువచ్చారు. అయోధ్యలో రామాలయాన్ని బీజేపీ నిర్మించనుందనే అంచనాలు హిందుత్వ ఓటర్లలో పెరిగిపోయాయి. కుంభమేళా సందర్భంగా జరిగే ధర్మ సంసద్‌లో హిందుత్వ వాదులు తమ గళాన్ని మరింత తీవ్రంగా వినిపించే అవకాశాలున్నాయి. అదే జరిగితే బీజేపీ వైఖరికి, హిందుత్వ అతివాదానికి మధ్య మోదీ సయోధ్య ఎలా కుదుర్చుతారో వేచి చూడాలి. తగ్గనున్న కాంగ్రెస్ స్థాయి ఎస్పీ, బీఎస్పీ కూటమి నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒకే నినాదం, ఒకే అజెండాతో ప్రజల ముందుకు వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. మాయావతి, అఖిలేశ్ కలిసి కాంగ్రెస్‌ను కూటమిలో చోటివ్వక పోవడం ద్వారా ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లయింది. మిగతా ప్రాంతీయ పార్టీల నేతలు కూడా ఇదే బాటను అనుసరిస్తూ కాంగ్రెస్‌ను పక్కనబెట్టడమో లేదా ఇష్టం లేకున్నా రాష్ట్ర స్థాయిలో పొత్తులు పెట్టుకోవడమో చేసేందుకు ఈ పరిణామం దోహదపడింది. అఖిలేశ్, మాయావతి కలయిక.. మోదీని ఓడించేందుకు కాంగ్రెస్ వంటి జాతీయ స్థాయి ప్రత్యామ్నాయం అక్కర్లేదు.. రాష్ట్ర స్థాయిలో ఏకమైతే చాలనే సందేశాన్ని మిగతా పార్టీలకు పంపింది. -
ఎస్పీ, బీఎస్పీ.. చెరో 38
లక్నో/న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు కూటమిగా బరిలోకి దిగాలని గతంలో బద్ధశత్రువులైన బీఎస్పీ, ఎస్పీ పార్టీలు శనివారం నిర్ణయించుకున్నారు. శనివారం లక్నోలో∙మీడియా సమావేశంలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్, బీఎస్పీ చీఫ్ మాయావతి ఈ విషయం ప్రకటించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీలు చెరో 38 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి ఉంచుతాయని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా సొంత నియోజకవర్గాలు అమేథీ, రాయ్‌బరేలీల్లో తమ అభ్యర్థులు బరిలో ఉండరని వీరు చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీలు పోటీ చేయగా మిగిలిన మరో రెండు సీట్లను చిన్న పార్టీలకు వదిలివేస్తున్నట్లు ప్రకటించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లలో బీజేపీ 71 సీట్లు, అప్నా దళ్ రెండు చోట్ల గెలిచాయి. ఎస్పీకి 5, కాంగ్రెస్‌కు 2 స్థానాలు దక్కగా బీఎస్పీ ఒక్కటీ కూడా గెలవలేదు. వారిద్దరికీ నిద్ర కరువే 1995లో తనపై ఎస్పీ కార్యకర్తలు చేసిన దాడిని మనసులో ఉంచుకోనని, జాతి ప్రయోజనాల కోసం, బీజేపీ విధానాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం అప్పట్లో జరిగిన ఆ ఘటనను పట్టించుకోనని మాయావతి స్పష్టం చేశారు. తమ కూటమి ఏర్పాటుతో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు ఇకపై నిద్ర కరవవుతుందన్నారు. ‘మాది సహజ కూటమి. మా బంధం లోక్‌సభ ఎన్నికల్లోనే కాదు యూపీ అసెంబ్లీ ఎన్నికల వరకూ కొనసాగుతుంది. ఇది రాజకీయ విప్లవం’ అని ప్రకటించారు. ‘ఈవీఎం దుర్వినియోగం, రామ మందిరం అంశం వంటివి లేకుంటే బీజేపీని ఓడిస్తాం’ అని తెలిపారు. అందుకే కాంగ్రెస్‌ను కలుపుకోలేదు కూటమిలో కాంగ్రెస్‌ను చేర్చుకోకపోవడంపై మాయావతి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పాలనలో దేశంలో పేదరికం, నిరుద్యోగం, అవినీతి విపరీతంగా పెరిగిపోయాయి. రక్షణ రంగ ఒప్పందాల్లో భారీ కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. గతంలో కాంగ్రెస్‌తో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న సమయంలో మాకు ఎలాంటి లాభం కలగలేదు. మా పార్టీ ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ అయ్యాయి. కానీ, ఆ పార్టీ ఓట్లు మా అభ్యర్థులకు పడలేదు. మళ్లీ కాంగ్రెస్‌తో పొత్తుతో మాకు ప్రయోజనం ఉండదు. కానీ, ఎస్పీ– బీఎస్పీ బంధంతో ఓట్ల బదిలీ పక్కాగా జరుగుతుంది’ అని వివరించారు. నాకూ అవమానమే: అఖిలేశ్ మాయావతి ప్రధానమంత్రి అభ్యర్థి అయితే మద్దతిస్తారా అన్న ప్రశ్నకు అఖిలేశ్ సూటిగా సమాధానం ఇవ్వకుండా ‘నేను ఎవరికి మద్దతిస్తానో మీకు తెలుసు’ అని అన్నారు. గతంలో యూపీ పలువురు ప్రధానమంత్రి అభ్యర్థులను దేశానికి అందించింది. మరోసారి అలాగే జరిగితే చాలా సంతోషం అని అన్నారు. మాయావతికి తగు గౌరవం ఇవ్వాలని ఈ సందర్భంగా తమ పార్టీ శ్రేణులకు అఖిలేశ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ‘మాయావతిని గౌరవిస్తే నన్ను గౌరవించినట్లే. ఆమెకు అవమానం నాకూ అవమానమే. బీజేపీ నేతలు కానీ మరెవరైనా కానీ ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడితే, అది నాకు వ్యతిరేకంగా మాట్లాడినట్లే భావించాలి’ అని అన్నారు. 1995లో మాయావతిపై జరిగిన ఎస్పీ కార్యకర్తల దాడిని దృష్టిలో ఉంచుకుని తమ శ్రేణులకు ఆయన ఈ వార్నింగ్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. ‘సహనంతో ఉండి బీఎస్పీ కార్యకర్తలతో సోదరభావంతో మెలగండి’ అని ఎస్పీ కార్యకర్తలను అఖిలేష్ కోరారు. ఈ కూటమి ఏర్పాటును తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులు స్వాగతించారు. 1995లో ఏం జరిగింది? 1993లో బీజేపీని నిలువరించేందుకు ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం చేతులు కలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి 167 సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టింది. నేతల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాల నేపథ్యంలో 1995లో ఓ సమావేశంలో పాల్గొన్న బీఎస్పీ నేత మాయావతిపై ఎస్పీ కార్యకర్తలు దాడి చేశారు. ఆమె కార్యాలయాన్ని ధ్వంసం చేసి, అసభ్యంగా ప్రవర్తించారు. ఆ సమయంలో బీజేపీ నేత ఒకరు ఆమెను కాపాడారు. అనంతర పరిణామాలతో బీజేపీతో చేతులు కలిపి బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఎస్పీతో మాయావతి సంబంధాలు తెంచుకున్నారు. రెండు దశాబ్దాల అనంతరం మళ్లీ ఎస్పీకి మాయావతి స్నేహ హస్తం చాశారు. మొత్తం స్థానాల్లో పోటీ చేస్తాం: రాహుల్ లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని అన్ని చోట్ల నుంచి అభ్యర్థులను బరిలో ఉంచుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తెలిపారు. ఎస్పీ, బీఎస్పీ కూటమిలో కాంగ్రెస్‌కు చోటు కల్పించకపోవడంపై దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన స్పందించారు. ‘ఎస్పీ, బీఎస్పీ పార్టీల నేతలపై నాకు ఎనలేని గౌరవం ఉంది. నచ్చిన విధంగా వ్యవహరించే స్వేచ్ఛ వారికుంది. ఆ రెండు పార్టీలు రాజకీయ నిర్ణయం తీసుకున్నాయి. యూపీలో పార్టీని బలోపేతం చేసుకోవడం మా బాధ్యత. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేయనున్నాం’ అని స్పష్టం చేశారు. ఈ కూటమి అస్తిత్వం కోసమే తప్ప, దేశం కోసమో, లేక ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కోసమో కాదని బీజేపీ విమర్శించింది. ఎస్పీ– బీఎస్పీ మైత్రిని అవినీతి– గూండాయిజం కూటమిగా యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఎద్దేవా చేశారు. -
ఉద్యమ ఆకాంక్షల మేరకే మేనిఫెస్టో: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. 2014లో ఉద్యమ పార్టీగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతుందని టీఆర్ఎస్ కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తే పూర్తి మెజార్టీ ఉండి కూడా నాలుగున్నరేళ్లకే కాడెత్తేసిందని ఎద్దేవా చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ముం దస్తు ఎన్నికలను తెరపైకి తెచ్చారన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు, హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. మిషన్ భగీరథ పథకంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, ప్రజ లపై అప్పుల భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల కోసమే చేపట్టిన మిషన్ భగీరథ వల్ల రోడ్లన్నీ గుంతలమయం చేశారని ధ్వజమెత్తారు. ఇంటింటికీ నీళ్లు ఇవ్వనిదే ఓట్లు అడగబోనన్న కేసీఆర్.. ఇప్పుడు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన ఆకాంక్షల కోసమే ప్రజాస్వామ్యబద్ధంగా కలిసి వచ్చే పక్షాలతో తాము ఎన్నికల కూటమి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.